అట్లూరు : సోమశిల రిజర్వాయర్ వెనుక జలాలతో ముంపునకు గురికానున్న చింతువాండ్లపల్లి, ఆకుతోటపల్లి గ్రామాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధితిసింగ్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ శ్రీనివాస్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72 టీఎంసీలు నీరు నిల్వ ఉండటంతో.. పూర్తి స్థాయి నిల్వ చేస్తే ఎంత మేర గ్రామాలలోకి నీరు చేరుతుందని ఇంజినీరింగ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాలలోని ముంపు జలాల ద్వారా ఎదురయ్యే సమస్యలను గ్రామాల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు త్వరితగతిన తమకు నష్ట పరిహారం అందించి పూర్తిస్థాయి నీరు నిల్వ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్, సోమశిల ఎస్‌ఈ బి.వి.రమణారెడ్డి, స్థానిక తహసీల్దారు సుబ్బలక్షుమ్మ, ఈఈ ఎం.వి. రమణారెడ్డి, డీఈ శ్రీనివాస్‌కుమార్, ఏఈలు శివప్రసాద్, యశ్వంత్, ఆర్‌ఐ రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment