కడప కల్చరల్: అరాచక పాలన జరుగుతున్న సమయంలో దేవుడు తన కుమారుడు, కరుణామయుడైన ఏసుక్రీస్తును ఈ లోకానికి పంపాడని, ఆయన లోకంలోని పాపుల రక్షణకై తన జీవితాన్ని అర్పించారని క్రైస్తవ గురువులు అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మంగళవారం అర్దరాత్రి క్యాథడ్రల్ చర్చిలో క్రీస్తు ఉదయించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులు క్రీస్తు జననం గురించి మానవాళికి మహోపకారిగా మారిన విధానం గురించి బైబిల్ సూక్తులను ఉదహరిస్తూ ప్రసంగించారు. అనంతరం క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోయర్ బృందాలు స్తుతి గీతాలు ఆలపించాయి. తొలుత చర్చిలో ఏర్పాటు చేసిన పశువుల పాకలో ఫాదర్లు, సంఘ పెద్దలతో కలిసి గురువులు బాలయేసును ఉంచి ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో విశ్వాసులు ప్రార్థనలకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment