రక్షకుడు ఉదయించాడు
రక్షకుడు ఉదయించాడు.. ప్రపంచ మానవాళి అశాంతితో బాధపడుతున్న వేళ.. శాంతి సమాధానాలిచ్చేందుకు ఆయన అరుదెంచాడు.. పాపులను కరుణించే రక్షకుడిగా పశువుల పాకలో జన్మించాడు.. ప్రేమ, శాంతి, కరుణలను ఇంటింటా కాంతి దీపాలుగా వెలిగించాడు.. ఆ త్యాగమూర్తి రాకను లోకం పరవశంతో స్వాగతిస్తోంది.. నేడు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లా అంతా పండుగ వాతావరణం నెలకొంది.
కడప కల్చరల్: మెత్తగా కురుస్తున్న మంచు...ఆహ్లాదకరమైన వాతావరణం...మంద్రంగా చర్చి గంటల శబ్దాలు. ఏసయ్య రాకడను తెలుపుతూ ఇంటింటా వెలుగుతున్న క్రిస్మస్ స్టార్లు....పిల్లలకు క్రిస్మస్ తాతలు బహుమతులు ఇస్తున్న దృశ్యాలు...మనసంతా క్రీస్తుపై నిలిపి విశ్వాసులు చేస్తున్న ప్రార్థనలు..నోరూరించే కేకులు... వెరసి విశ్వాసుల్లో ఆనందం. మనసు నిండా ఉత్సాహం. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం అర్థరాత్రి నుంచే పలు చర్చిల్లో ప్రార్థనలు మొదలయ్యాయి.
తళుక్కుమన్న కాంతులు..
క్రిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు క్రైస్తవ లోకం సిద్ధమైంది. దాదాపు పదిరోజుల ముందు నుంచే పండుగ హడావుడి ప్రారంభమైంది. చర్చిలను నూతన రంగులతో అందంగా రూపుదిద్దారు. క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటూ రంగురంగుల కాంతులు చిమ్మే క్రిస్మస్ స్టార్లను వెలిగించా రు. కడప నగరంలోని కాంగ్రిగేషనల్ టౌన్‌చర్చి, మరియాపురంలోని కేథడ్రల్ చర్చి, సీఎస్‌ఐ సెంట్రల్ చర్చి, రైల్వేస్టేషన్ వద్దగల ఆరోగ్యమాత చర్చి, సంధ్య సర్కిల్‌లోని డాన్‌బాస్కో చర్చి, క్రై స్ట్ చర్చిలతోపాటు జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వే లు, కలసపాడు, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల్లోని చర్చిలన్నీ క్రిస్మస్ పండుగ నిర్వహణకు సిద్ధమయ్యాయి.
కడపలో జరిగిన ర్యాలీలో శాంటాక్లాజ్ వేషధారి
నేడు క్రిస్మస్ పర్వదినం
చర్చిల్లో మొదలైన ప్రార్థనలు
Comments
Please login to add a commentAdd a comment