అధికారం వైపే తహసీల్దారు మొగ్గు
కాశినాయన : రేషన్ డీలర్ల నియామకాల్లో అధికార పార్టీ నాయకుల హవా కొనసాగుతోంది. పారదర్శకంగా నిర్వహించాల్సిన తహసీల్దారు కూడా అధికారం వైపే మొగ్గు చూపారని దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలల కిందట మండలంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తాళలేక నయానో.. భయానో 14 మంది రేషన్ డీలర్లతో అధికారులు రాజీనామా చేయించారు. కొత్త డీలర్లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి.. ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. 14 డీలర్‌షిప్‌లకు గానూ 31 దరఖాస్తులు రాగా, తహసీల్దారు తన చేతివాటం ఉపయోగించి 17 మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిదారుల దరఖాస్తులను చెల్లవంటూ పరిశీలనలో తిరస్కరించారు. 11న బద్వేలు ఆర్డీఓ కార్యాలయంలో డీలర్‌షిప్ దరఖాస్తుదారులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హాల్ టిక్కెట్లు ఇవ్వాలని దరఖాస్తుదారులు శుక్రవారం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లగా, మీ దరఖాస్తుల్లో తప్పులు ఉండడంతో తిరస్కరించామని తహసీల్దారు వెంకటసుబ్బయ్య తెలిపినట్లు దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దారు వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఆర్డీఓ చంద్రమోహన్ వివరణ కోరగా తహసీల్దారుతో మాట్లాడి చెబుతానని, విచారణలో దరఖాస్తులను తిరస్కరించినట్లు ఆర్డీఓ తెలిపారు.
రేషన్ డీలర్ల ఎంపికలో
తహసీల్దారు చేతివాటం
వైఎస్సార్‌సీపీ సానుభూతిదారులంటూ దరఖాస్తుల తిరస్కరణ
Comments
Please login to add a commentAdd a comment