జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్‌లో జిల్లా అద్భుత విజయం
కడప ఎడ్యుకేషన్ : కర్నూలు నగరం బాలాజీనగర్‌లోని భాష్యం స్కూల్‌లో జరిగిన జాతీయ స్థాయి ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్‌లో వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన చెస్ క్రీడాకారులు అద్భుత విజయం సాధించారు. ఈ పోటీలో 23 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో డి. అష్రఫ్ సుభాని మొదటి బహుమతిగా రూ. 10,000 నగదు బహుమతిని గెలుచుకున్నారు. అలాగే టి. శ్రీకాంత్ 8వ స్థానం సాధించి రూ. 1,500 నగదు బహుమతి పొందారు. దీంతోపాటు సీనియర్స్ కేటగిరీలో అనీస్ దర్బారి మొదటి స్థానంలో నిలిచి రూ. 1,000 నగదు బహుమతి గెలుచుకున్నారు.
విభాగాల వారీగా బహుమతులు పొందినవారు..
జాతీయస్థాయి చెస్ టోర్నమెంట్‌లో విభాగాల వారీగా పలువురు బహుమతులు సాధించారు. ఇందులో అండర్ –9 బాలికల విభాగంలో 2వ స్థానంలో లాస్యప్రియ, 3వ స్థానంలో అమీనా, అండర్ –11 విభాగంలో 2వ స్థానంలో దీపికా, అండర్ 15 విభాగంలో 2వ స్థానంలో తెజోవయీ అలాగే అండర్ –7 బాలుర విభాగంలో 2వ స్థానంలో భార్గవ్, అండర్ –13 విభాగం 4వ స్థానంలో అనురాగ్, 5వ స్థానంలో ప్రేమదీప్ నిలిచారు. వీరి విజయం జిల్లాకు గర్వకారణమని జిల్లా చెస్ సంఘం సెక్రటరీ అనీస్ దర్బారీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment