కడప కోటిరెడ్డిసర్కిల్: పౌర్ణమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 11న ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రయాణికుల భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సర్వీసులను పవిత్ర క్షేత్రానికి వెళ్లేవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. భక్తులు తమ టిక్కెట్లనుముందుగా రిజర్వు చేసుకోవాలన్నారు.
● కడప డిపోకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటగలకు సూపర్ లగ్జరీ సర్వీసు బయలుదేరి రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా అరుణాచలం వెళుతుందన్నారు. ఇందులో టిక్కెట్ ధరను రూ. 1072గా ఉంటుందన్నారు.
● బద్వేలు డిపోకు సంబంధించి అల్ట్రాడీలక్స్ సర్వీసు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి పెంచలకోన, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం మీదుగా వెళుతుందన్నారు. ఇందులో చార్జీగా రూ. 1176లు.
● మైదుకూరు డిపోకు సంబందించి సాయంత్రం 6 గంటలకు సూపర్ లగ్జరీ సర్వీసు పోరుమామిళ్లలో బయలుదేరి కడప, కాణిపాకం గోల్డెన్ టెంపుల్ మీదుగా వెళుతుందన్నారు. ధర రూ. 1209లు.
● ప్రొద్దుటూరు డిపోకు సంబంధించి సాయంత్రం 6 గంటలకు సూపర్‌లగ్జరీ సర్వీసు బయలుదేరి మైదుకూరు,కడప మీదుగా అరుణాచలం వెళుతుందన్నారు. ఇందులో ఛార్జిగా రూ. 1273లు.
● పులివెందుల డిపోకు సంబంధించి ఉదయం 7 గంటలకు అల్ట్రా డీలక్స్ సర్వీసు రాయచోటి పీలేరు మీదుగా అరుణాచలం వెళుతుందన్నారు. ఇందులో టిక్కెట్ ధర రూ. 1183గా నిర్ణయించారన్నారు.
● జమ్మలమడుగు డిపో నుంచి ఉదయం 7.00 గంటలకు సూపర్‌లగ్జరీ బస్సు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా వెళుతుందన్నారు. ఇందులో ఛార్జీగా రూ. 1568 ఉందని వివరించారు.
● జిల్లాలోని ఆరు డిపోల నుంచి బస్సుల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment