● కమిషనర్ మనోజ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: దేవునికడప రతోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని నగరపాలక కమిషనర్ మనోజ్‌రెడ్డి ఆదేశించారు. గురువారం మార్నింగ్ విజిట్‌లో భాగంగా ఆయన రామరాజుపల్లె, దేవునికడప, రాయల్‌హాల్, పాత బస్టాండ్ ప్రాంతాలను పరిశీలించారు. రామరాజుపల్లె అహ్మదీయ నగర్ ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డు, డ్రైనేజీ కాలువ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిల్వ ఉన్న నీటిని గల్ఫర్ మిషన్‌తో తొలగించాలన్నారు. దేవునికడప రథోత్సవం సందర్భంగా ప్యాచ్ వర్క్, పార్ట్ హోల్స్ మరమ్మతులు చేయాలన్నారు. లక్ష్మి వెంకటేశ్వరస్వామి పుష్కరిణి వద్ద డ్రైనేజీ నీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాతబస్టాండ్, రాయల్‌హాల్, ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని చెత్త పాయింట్లను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. పాత బస్టాండులోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి భోజనం నాణ్యతపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈఈ నారాయణ స్వామి, డిఈఈ రాజేష్, ఎంహెచ్‌ఓ డా. చంద్రశేఖర్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment