19 నుంచి విజయమ్మ ఆమరణదీక్ష | Vijayamma to go on indefinite hunger strike from August 19 | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 14 2013 6:11 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 19 నుంచి విజయవాడలోఆమరణ దీక్ష చేపట్టనున్నారు. న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని ఆమె దీక్ష చేయనున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శిస్తోంది. విభజనకు కాంగ్రెస్ అనుసరించే విధానాలకు నిరసనగా ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ అబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్రం ఓ తండ్రిలా వ్యవహరించి రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయమని వైఎస్ఆర్ సిపి కోరుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement