Dr B R Ambedkar Konaseema
-
కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి
అయినవిల్లి: కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. మంగళవారం నేదునూరు గ్రామంలో కృషివల కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ఆయన సందర్శించారు. అక్కడి ఉత్పత్తులు, ఇతర వివరాలను కార్య నిర్వహణాధికారిని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో ఐదు కేజీల క్వాయర్ బ్రిక్స్ తయారీ, ఫైబర్ సేకరణ, వర్మీ కంపోస్ట్, హైటెక్ నర్సరీ యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. కొబ్బరికాయల డొక్కల నుంచి పీచు, పొట్టు తయారీ వంటి విధానాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీకి జైక పరిశ్రమ నుంచి రావాల్సిన నిధులను త్వరలో విడుదల చేయించేందుకు కృషి చేస్తానన్నారు. ఉత్పత్తిదారుల సంఘాలు సమష్టిగా ఇటువంటి యూనిట్లను ఏర్పాటు చేసి, మరింత పురోగతి సాధించాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం అమలు చేస్తున్న స్ఫూర్తి పథకం ద్వారా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో కొబ్బరి ముడి సరకుతో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమ నెలకొల్పినట్టు జిల్లా ఉద్యాన అధికారి బీబీ రమణ కలెక్టర్‌కు వివరించారు. ఈ పెట్టుబడి వ్యయంలో 90 శాతం రాయితీని జిల్లా పరిశ్రమల కేంద్రం అందించిందన్నారు. దుబాయ్ వంటి ప్రాంతాల్లో మొక్కల పెంపకానికి మట్టికి బదులుగా కొబ్బరి పొట్టుతో తయారు చేసిన ఇటుకలను వినియోగిస్తారన్నారు. ఈ ఇటుకల ఎగుమతికి మంచి డిమాండ్ ఉందన్నారు. జియో టెక్స్టైల్ మ్యాట్లను రోడ్ల నిర్మాణంలో లేయర్ల మధ్య పటిష్టతకు వినియోగిస్తారన్నారు, కొబ్బరి తాళ్లు, బొమ్మల తయారీకి స్థానికంగా ముడి సరకు లభ్యమవుతుందన్నారు. ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ గణపతి వీరరాఘవులు, పరిశ్రమల కేంద్రం ప్రతినిధి మాధవి, సర్పంచ్ గుమ్మడి ప్రసాద్, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ మహేష్‌కుమార్ -
విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.34,67 లక్షలు
అయినవిల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి హుండీ ఆదాయాన్ని ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం లెక్కించారు. మొత్తం 67 రోజులకు స్వామివారి హుండీ ఆదాయం రూ.34,67,500 లభించినట్టు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. అలాగే 409 గ్రాముల వెండి, 12 వీదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయన్నారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మహా కుంభమేళాకు ఆర్టీసీ సర్వీసుఅమలాపురం రూరల్: భక్తులు మహా కుంభమేళా యాత్రకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసును అమలాపురం డిపో నుంచి నడుపుతున్నట్టు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి మంగళవారం తెలిపారు. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 2 గంటలకు ఈ బస్సు బయలుదేరుతుందన్నారు. ఎనిమిది రోజుల పాటు భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ద గయ, అరసవిల్లి, శ్రీకూర్మంలో పర్యటించవచ్చన్నారు. త్రివేణి సంగమంలో స్నానం, విశ్వనాథ దర్శనం, పిండ ప్రదానం చేయవచ్చని వివరించారు. ప్రయాగరాజ్, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బస ఉంటుందన్నారు. ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ.10,800 ఉంటుందన్నారు. సరికొత్త సూపర్ లగ్జరీ వీడియో కోచ్ ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు 99592 25576, 73829 09620, 99088 36444 నంబర్లలో సంప్రదించాలని కోరారు. నేడు జాబ్ మేళాఅమలాపురం రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో పని చేసేందుకు ఇదే కార్యాలయంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి ఆధికారి ఈ.వసంతలక్ష్మి మంగళవారం ఇక్కడ తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత ఉన్న నిరుద్యోగ యువత తమ బయోడేటా, ధ్రువపత్రాలతో బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయానికి హాజరుకావాలని చెప్పారు. ముత్తూట్ ఫైనాన్స్‌లో ప్రొఫెషనరీ అధికారులు, సీఆర్ఓ, ఇంటెన్షిప్ ట్రైనింగ్ కోసం 45 మంది అవసరం ఉందన్నారు. అమలాపురం, రాజోలు, కాకినాడ, కొత్తపేట, ముక్తేశ్వరం, రావులపాలెం, పి.గన్నవరం, రామచంద్రపురంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. శ్రీరామ్ ఫైనాన్స్‌లో ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ అధికారులు 46, సేల్స్ మేనేజర్లు 10 ఖాళీలున్నాయని తెలిపారు. విద్యార్హతలు టెన్త్ లేదా ఏదైనా డిగ్రీ ఉండాలని, వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలన్నారు. టీంలీజులో బ్రాంచ్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు 49 ఉన్నాయని, 35 ఏళ్లలోపు, టెన్త్ నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలన్నారు. అమలాపురం, రాజోలు, రాజమహేంద్రవరం, కాకినాడ, తుని, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరంలో పనిచేయాలన్నారు. కిమ్స్‌లో ఆయు భరోసా మార్కెటింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 15 ఖాళీలున్నాయని తెలిపారు. వయస్సు 35 ఏళ్లలోపు, ఏదైనా డిగ్రీ ఉండాలని చెప్పారు. కోనసీమ జిల్లాలో పని చేయాలన్నారు. -
రహదారి భద్రతపై బాధ్యత అవసరం
అమలాపురం రూరల్: సోషల్ మీడియాలో విద్యార్థులు ఎంత అవగాహనతో ఉంటున్నారో.. రహదారి భద్రతపై అంతే బాధ్యతగా ఉండాలని ఎంపీ గంటి హరీష్‌మాథుర్ బాలయోగి అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాకే వాహనాలు నడపాలని, హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదని చెప్పారు. విద్యార్థులకు లైసెన్స్‌ల కోసం ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు అధికారులతో మాట్లాడతానన్నారు. డీటీఓ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా విద్యార్థులు వాహనం నడిపితే వారి తల్లిదండ్రులు శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ఎంవీఐ ఓ.రవికుమార్, కళాశాల చైర్మన్ బోనం కృష్ణసతీష్, ప్రిన్సిపాల్ జీఎంవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
No Headline
కాంప్లెక్స్ కొత్త ధర పాతఽ ధర ఎరువుల రకం (రూ.ల్లో) (రూ.ల్లో) 10–26–26 1470 1700 14–35–14 1700 1800 19–19–19 1350 1700 20–20–0–13 1250 1300 డీఏపీ 1350 1350 (రూ.150 అదనం) కాంప్లెక్స్ ఎరువుల పెరుగుదల ఇలా.. (రూ.ల్లో) రకం 2019 2021 2024 2025 10–26–26 1175 1375 1470 1720 20–20–0–13 950 1175 1200 1300 14–35–14 1250 1450 1700 1800 19–19–19 950 1175 1350 1700 -
No Headline
ఆలమూరు: బహిరంగ మార్కెట్లో ఈ ఏడాది రబీ సీజన్లో ఒక్కొక్క కాంప్లెక్స్ ఎరువు బస్తా రూ.50 నుంచి రూ.230 వరకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం డీఏపీకి అందిస్తున్న భారీ రాయితీని వచ్చే ఖరీఫ్ సీజన్లో ఉపసంహరించుకునే పరిస్థితి ఉందనే సమాచారం రైతులను తీవ్రంగా కలవరపరుస్తోంది. రాయితీపై అందిస్తున్న యూరియా కానీ, డీఏపీ బస్తా కావాలంటే.. జింక్ బస్తా తప్పక కొనాల్సిందేనంటూ వ్యాపారులు మెలిక పెడుతుండటంతో రైతులు ఏమీ పాలుపోని పరిస్థితి జిల్లావ్యాప్తంగా నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీ సీజన్‌కు 1.89 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా, పెరిగిన ఎరువుల రూపంలో జిల్లాలో వరి సాగు చేస్తున్న 1.04 లక్షల మంది రైతులకు రూ.12.40 కోట్ల మేర అదనపు భారం పడనుంది. 64,529 మెట్రిక్ టన్నులు అవసరం రబీ సీజన్లో సాగు చేస్తున్న 1.89 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని బట్టి వరి పంటకు 64,529 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. వ్యవసాయ శాఖ ప్రస్తుతం కేవలం 55,501 మెట్రిక్ టన్నుల ఎరువులను మాత్రమే అందుబాటులో ఉంచింది. దీంతో వ్యాపారులు, డీలర్లు కుమ్మకై ్క ఎరువులకు కృత్రిమ కొరతను సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా రబీ సీజన్లో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో, రైతులు ఖరీఫ్ సీజన్ కంటే రబీలోనే ఎక్కువగా ఎరువుల వాడుతుండటం ఆనవాయితీగా వస్తోంది. ఎకరాకు నాలుగు బస్తాల వరకు రెండు, మూడు రకాల కాంప్లెక్స్ ఎరువులు, రెండు బస్తాల యూరియా, అర బస్తా వరకు జింక్, పొటాష్ వినియోగిస్తుంటారు. 90 శాతం నాట్లు పూర్తి జిల్లాలో దాదాపు 90 శాతం మేర వెదజల్లు విధానంతో పాటు, వరినాట్లు పూర్తయ్యాయి. రబీ సీజన్ వరిసాగులో ఈ ఏడాది 60 శాతం మేర ఎంటీయూ 1121(బొండాలు) రకం సాగు చేస్తుండగా, మిగిలిన విస్తీర్ణంలో పీఆర్ 126, ఎంటీయూ 1153, ఎంటీయూ 1156 రకాలను సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 166 సొసైటీలతో పాటు, కొన్ని ఎరువులు, పురుగు మందుల దుకాణాల ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. రైతుల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి, అధిక ధరలకు విక్రయాలను జరుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెనుభారంగా ధరలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి ఇబ్బడిముబ్బడిగా పెంచిన ఎరువుల ధరలు రైతులకు పెనుభారంగా మారాయి. ఈ రబీ సీజన్లో డీఏపీ, యూరియా ధరల్లో మార్పులు లేనప్పటికీ, ప్రభుత్వ నియంత్రణ అంతగా లేకపోవడంతో.. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు, అలాగే కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేయడంతో, ఒక్కొక్క కాంప్లెక్స్ ఎరువుకు రూ.50 నుంచి రూ.230 వరకూ రైతుకు అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం రబీలో ఎక్కువగా వినియోగించే 10:26:26 కాంప్లెక్స్ ఎరువు బస్తా (50 కేజీలు) రూ.230 పెరగ్గా, 14:35:14 బస్తా రూ.100, అలాగే 20:20:013 బస్తా రూ. 50 వరకు పెరిగాయి. ఎకరాకు రూ.650 వరకు రైతులపై భారం పడుతోంది. జిల్లాలోని 1.89 లక్షల ఎకరాలకు రైతులపై రూ.12.40 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. అన్నదాతకు ‘కూటమి’ కష్టాలు రైతన్నలు దేశానికే వెన్నెముక అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ప్రజాప్రతినిధులు.. వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వర్షాలు, వరదలు, ప్రతికూల వాతావరణం, చివరిలో దళారుల దోపిడీతో ఈసారి ఖరీఫ్ పంట రైతులకు కలిసి రాలేదు. చాలామంది రైతులకు పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి ఎదురైంది. మరోవైపు కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు సాయం కొరవడింది. రైతులకు భరోసా పేరు మార్చి.. అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కొక్క రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్‌లో ప్రకటించినట్టుగా ఇప్పటి వరకూ సాయం అందించలేదు. తొలకరి పంట నష్టపోయిన రైతులకు కనీసం బీమా పరిహారం చెల్లింపునూ ప్రభుత్వం నిలిపివేసింది. అంతేకాకుండా ఈ రబీ సీజన్ నుంచి ఎకరాకు రూ.615 చొప్పున జిల్లా రైతాంగంపై రూ.12.19 కోట్ల బీమా ప్రీమియం భారాన్ని మోపింది. దీంతో పంట పెట్టుబడులు పెట్టేందుకు రైతుల వద్ద డబ్బు లేక, రబీ సాగులో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎరువుల ధరలు పెరగడం రైతులను మరింతగా కుంగదీస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న డీఏపీతో పాటు, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో లేకుండా పోయాయి. సొసైటీలు, డీలర్లు తరచూ వ్యవసాయ శాఖపై ఎరువులు కావాలంటూ ఒత్తిడి తెస్తున్నా కంపెనీలు సహకరించడం లేదని తెలుస్తోంది. -
ఎరువు.. దరువు
● భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ● బస్తాకు రూ.50 నుంచి రూ.230 వరకు పెంపు ● రైతులపై రూ.12.40 కోట్ల అదనపు భారం ● రబీ సీజన్లో 1.89 లక్షల ఎకరాల్లో రబీ సాగు ● కృత్రిమ కొరతను సృష్టించి రేటు పెంచేసిన వ్యాపారులు ● ఇప్పటివరకూ అన్నదాత సుఖీభవ అందని వైనం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతన్నల అవస్థలు అధికారంలోకి వస్తే అండగా ఉంటామని రైతన్నలకు ఇచ్చిన హామీపై కూటమి ప్రభుత్వం ముఖం చాటేసింది. అధికారం చేపట్టిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు రూ.20 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్న హామీని సైతం అటకెక్కించింది. దీంతో ఖరీఫ్ సాగు అంతగా కలిసిరాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఎరువుల ధరలు రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. ఎరువుల ధరలు పెరుగుతున్నంత వేగంగా ధాన్యం ధరలు పెరగకపోవడంతో వ్యవసాయం దండగలా ఉందంటూ రైతులు నిట్టూరుస్తున్నారు. -
ఈ నెలలో బలవన్మరణాలివిగో..
రాజమహేంద్రవరం రూరల్: కుటుంబ కలహాలు.. ఆర్థిక సమస్యలు.. ఇంట్లో వాళ్లు మందలించారని.. భార్య కాపురానికి రాలేదని.. పరీక్షల్లో తప్పామని.. ఉన్నత విద్యలో బ్యాక్‌లాగ్స్ ఉండిపోయాయని.. ప్రేమ విఫలమైందని.. స్నేహితులు వంచించారని.. అనారోగ్య సమస్యలు.. వ్యసనాలకు బానిసలవడం.. ఇలా వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య జిల్లాలో ఇటీవల పెరుగుతోంది. చిన్నచిన్న విషయాలకే విభేదాలు.. గొడవలు.. ఉద్వేగం.. కుంగుబాటుతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సమస్యకు పరిష్కారం వెతుక్కునే సామర్థ్యం లేక, పరిష్కారానికి కొంత సమయం ఎదురు చూసే ధైర్యం లేక అర్ధాంతరంగానే తనువు చాలిస్తూ.. కన్నవారిని, నమ్ముకున్న వారిని పుట్టెడు దుఃఖంలోకి నెడుతున్నారు. ఈ విధంగా ఈ నెలలో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ పది మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరి కొంత మంది ఆత్మహత్యా యత్నానికి పాల్పడి, త్రుటిలో ప్రాణాలతో బయట పడ్డారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో అధిక శాతం మంది 40 ఏళ్ల వయస్సు లోపే వారే ఉంటున్నారు. కానీ, 50 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో కూడా ఈ ధోరణి అధికంగా ఉంటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీరిక లేని జీవితాలు గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. ఒకరి బాధను మరొకరు పంచుకునేవారు. పెద్దలు క్షణాల్లో సమస్యను పరిష్కరించి, మేమున్నామని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. నేటి పరుగుల ప్రపంచంలో కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోలేనంతగా ఆలోచనా విధానాలు మారిపోతున్నాయి. ఫలితంగా చిన్నచిన్న సమస్యలకే చాలా మంది ఆత్మస్థైరాన్ని కోల్పోతున్నారు. కుటుంబ సమస్యలు తలెత్తిన సమయంలో బాధలు మరొకరితో పంచుకోలేక వారిలో వారే కుంగిపోతూ ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. అవగాహన లేక.. సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశమే చాలా సందర్భాల్లో బలవన్మరణాలకు దారి తీస్తోంది. జీవితం, సమస్యలపై సరైన అవగాహన లేకపోవడం కూడా కారణమే. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారు సమస్యను తప్పించుకోవాలని చూస్తున్నారే తప్ప.. బతికి ఉన్నవారిని సరికొత్త సమస్యల్లోకి నెట్టేస్తున్నామన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి అధ్వానంగా మారుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తారు. అలాగే, పెద్దలు బలవన్మరణాలకు పాల్పడితే.. వారిపై ఆధారపడిన భార్యాపిల్లలను ఓదార్చడం ఎవ్వరి తరమూ కాదు. అందువలన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పోరాడి పరిష్కరించుకోవాలే తప్ప తప్పించుకునేందుకు ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎదుర్కోవచ్చు ఆత్మహత్యలు గతంలోనూ ఉండేవి. ఆత్మహత్య చేసుకున్నారంటే పరువు పోతుందని బయటకు తెలియనిచ్చేవారు కాదు. పోలీసులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. ప్రస్తుతం మీడియా అవేర్నెస్ పెరిగిపోవడంతో విషయం బయటకు తెలుస్తోంది. చాలా మంది జన్యుపరంగా, పరిస్థితుల ప్రభావం వలన ఆత్మహత్యలకు పాల్పడుతూంటారు. ఆత్మహత్య భావన ఉన్నవారిని ఒంటరిగా ఉంచకూడదు. వీలైనంత వరకూ ఇంట్లో వారందరి మధ్య మెలిగేలా చూసి ధైర్యం నింపాలి. జీవితంపై ప్రతికూల భావాలను వ్యక్తీకరించినప్పుడు కుటుంబ సభ్యులు తేలికగా తీసుకోకుండా వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. – డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు, రాజమహేంద్రవరం ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాల్సిందే..ఫ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు కొన్ని అసాధారణ లక్షణాలు కలిగి ఉంటారు. ఫ ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఫ సకాలంలో ఆహారం తీసుకోరు. ఫ అతిగా నిద్ర పోతారు. ఫ రాత్రి వేళల్లో నిద్ర పోకుండా ఎక్కువగా ఆలోచిస్తూంటారు. ఫ కొన్నిసార్లు అసలు దేనికీ స్పందించరు. ఫ బతికి ఉండటం వ్యర్థమని.. చనిపోవాలనుకుంటున్నానని ముందుగానే పరోక్షంగా సంకేతాలిస్తూంటారు. ఫ ఇలాంటి వాటిని ప్రారంభంలోనే కుటుంబ సభ్యులు గుర్తించాలి. వారితో ప్రేమగా మాట్లాడి సమస్య తెలుసుకుని పరిష్కారానికి తోడ్పాటునివ్వాలి. దీంతో పాటు మానసిక వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తే ప్రయోజనం ఉంటుంది. ఫ పెరుగుతున్న ఆత్మహత్యలు ఫ అర్ధాంతంగా ముగుస్తున్న జీవితాలు ఫ జిల్లాలో ఈ నెలలో 10 మంది బలవన్మరణాలు ఫ మానసిక దృఢత్వం అవసరమంటున్న నిపుణులు ఫ గోకవరం: భర్త వేధింపులు తాళలేక గండేపల్లి అనూష (24) ఆత్మహత్య. ఫ రాజమహేంద్రవరం: భార్య చనిపోయిందనే వేదనతో అన్నపూర్ణపేట రైల్వే గేటు సమీపాన రైలు కింద పడి కేకే రాజు అనే వ్యక్తి మృతి. ఫ హౌసింగ్ బోర్డు కాలనీ: భార్యతో విడిపోయి, విడాకులు కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో మనస్తాపంతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజ్‌కుమార్ (38) ఉరి. ఫ పెరవలి మండలం ఖండవల్లి: భార్య కాపుకానికి రాలేదనే మనస్తాపంతో పురుగు మంది తాగి పల్లేటి రవి (24) ఆత్మహత్య. ఫ హౌసింగ్ బోర్డు కాలనీ: పాడిశెట్టి దుర్గాంబిక (30) కోపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య. ఫ ఉండ్రాజవరం మండలం పాలంగి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక వీఆర్వో యార్లగడ్డ నాగ గంగరాజు (41) ఆత్మహత్య. ఫ నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆత్కూరి సాయి మణిదీప్ (21) బ్యాక్‌లాగ్స్ ఉన్నాయనే బెంగతో హాస్టల్ గదిలో పురుగు మందు తాగి ఆత్మహత్య. తల్లిదండ్రులకు పుత్రశోకం. ఫ రాజమహేంద్రవరం: ఆర్థిక ఇబ్బందులు తాళలేక సాలా బాల పరమేశ్వరి (35) ఆత్మహత్య. ఇదివరకే భర్త చనిపోవడంతో దయనీయంగా మారిన ఇద్దరు పిల్లల పరిస్థితి. ఫ మద్యానికి బానిసై.. మానసిక పరిస్థితి సరిగా లేక మర్రి రాజా రంజిత్ కుమార్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్య. ఫ హుకుంపేట డి–బ్లాకు: మద్యానికి బానిసై నేదునూరి సంతోష్ కుమార్ (25) ఆత్మహత్య. ఆధారం కోల్పోయిన భార్య, ఇద్దరు పిల్లలు. -
బ్రహ్మణ పురోహిత క్రికెట్ విజేత కాకినాడ రుద్రాస్
అమలాపురం రూరల్: కోనసీమలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్లో కాకినాడ రుద్రాస్ జట్టు విజేతగా నిలిచింది. రన్నర్స్‌గా కొవ్వూరు గాయత్రి ఎలెవెన్స్ విజయం సాధించింది. కిమ్స్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆర్గనైజింగ్ కమిటీ కర్ర బాబి, ఉపద్రష్ట విజయ్, గంటి కోట సాయి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ పది రోజుల పాటు కొనసాగింది. మంగళవారం జరిగిన ఫైనల్లో కొవ్వూరు గాయత్రి ఎలెవెన్స్పై కాకినాడ రుద్రాస్ విజయం సాధించింది. రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు కె.బుచ్చిరాంప్రసాద్, రాష్ట్ర పురోహిత గౌరవాధ్యక్షుడు పొదిలి నారాయణమూర్తి, అధ్యక్షుడు రాణి శ్రీనివాస్, రాష్ట్ర పురోహిత సమాఖ్య ప్రధాన కార్యదర్శి సుదర్శన్ దుర్గాబాబు, బ్రహ్మణ సంఘం రాష్ట్ర ప్రతినిధులు ఏవీ రమణ, ఎం.నరసింహమూర్తి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు విజేతలకు బహుమతులు అందించారు. -
మెలిక పెడుతున్నారు
జిల్లాలో అనేక చోట్ల సొసైటీలు, డీలర్లు కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుపై మెలిక పెడుతున్నారు. ప్రభుత్వం భారీ స్థాయిలో రాయితీని అందించే యూరియా కానీ, డీఏపీ కానీ కావాలంటే జింక్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులపై తీవ్ర భారం పడుతోంది. దీనిపై వ్యవసాయ శాఖ సత్వరమే స్పందించి, రైతులకు ఉపశమనం కలిగించాలి. – అడపా పెదబాబు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, సంధిపూడి, ఆలమూరు మండలం అందుబాటులో ఎరువులు జిల్లాలో అన్ని కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఉత్పత్తి కంపెనీల నుంచి ఎరువుల సరఫరాలో కొంత మేర జాప్యం జరిగింది. గత రెండు రోజులుగా కంపెనీల నుంచి దశలవారీగా డీఏపీ ఎరువులు సొసైటీలకు చేరుతున్నాయి. కాంప్లెక్స్ ఎరువులను అధిక ధరకు విక్రయించినా, మెలికలు పెట్టి ఇతర ఎరువులు కొనాలని ఒత్తిడి తెచ్చినా సత్వరమే సమీప వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. – ఓలేటి బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికారి -
ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?: జక్కంపూడి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే, చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పేదలకు ఇంటి కోసం సెంటు స్థలం కూడా కేటాయించిన పాపాన పోలేదని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వ హయాంలో 72 వేల ఎకరాలు సేకరించి, వాటిలో 17 వేల కాలనీల్లో పూర్తి మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందు కోసం ఏకంగా రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. తమ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి సంపద సృష్టిస్తే, దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా ఆక్షేపించారు.చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు: నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందన్న ముని శాపం ఉండటం వల్లనేమో చంద్రబాబు ఏనాడూ నిజాలు చెప్పడు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోందని ఊరూరా తిరిగి తప్పుడు ప్రచారం చేశాడు. రాష్ట్రం అప్పులపై కూటమి నాయకులంతా కలిసిమెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తాను అధికారంలోకి వస్తే 40 ఏళ్ల అనుభవంతో సంపద సృష్టించి రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు నమ్మబలికాడు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుని.. తీరా అధికారంలోకి వచ్చాక బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనేలా పాలన సాగిస్తున్నాడు. అసలే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే, కొత్తగా రకరకాల పన్నుల రూపంలో ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఇప్పటికే కరెంట్ బిల్లుల రూపంలో ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపాడు.నాడు అప్పులపై దుష్ప్రచారం:ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రం అప్పులు రూ. 14 లక్షల కోట్లని ప్రచారం చేసి, తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు రూ.4.6 లక్షల కోట్లని కూటమి ప్రభుత్వమే ప్రకటించింది. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లని చెబుతూనే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలిచ్చారు. ఈ రోజు వాస్తవ అప్పులు రూ. 4.6 లక్షల కోట్లే అని తెలిసినా హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. గత వైఎస్ జగన్ పాలనలో తీవ్రమైన కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాల అమల్లో సాకులు చెప్పి తప్పించుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం వాగ్ధానాలను అమలు చేయలేక చేతులెత్తేశారు.ఇదేనా విజనరీనని చెప్పుకునే చంద్రబాబు అనుభవం?. తాజాగా ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు 50 శాతం పెంచబోతున్నట్టు ప్రకటించారు. ఆదాయార్జనే ధ్యేయంగా ప్రజల నడ్డి విరచడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎంత వీలైతే అంత దోచుకోవడానికి వ్యూహరచనలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పిన విజనరీ ఏడు నెలల్లోనే ఒక్క పథకం కూడా అమలు చేయకుండానే చేతులెత్తేశాడు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల చంద్రబాబు దావోస్ వెళ్లినా పారిశ్రామికవేత్తులు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అందుకే ఒక్క రూపాయి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు.సెంటు స్థలం కూడా ఇవ్వని బాబు:సుదీర్ఘకాలం సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదవారికి ఇంటి కోసం సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఆయన మాత్రం హైదరాబాద్‌లో ఇంద్ర భవనం నిర్మించుకుని విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. దివంగత వైఎస్సార్ హయాంలో పేదవారికి ఇళ్ల పంపిణీ జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఏకంగా 31 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు ప్రభుత్వం తరఫున ఇంటి నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ భూములతోపాటు రైతుల నుంచి భూములు సేకరించడం జరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు మా పథకానికి పేర్లు మార్చి తానే చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు.ఇంటి పట్టాల కోసం 71,811 ఎకరాలు సేకరణరూ.11,343 వేల కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దాని విలువ రూ. 31,832 కోట్లు.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే 71,811 ఎకరాల భూమి విలువ కనీసం రూ.75 వేల కోట్లకుపైనే ఉంటుంది. దీంతో పాటు ఇళ్ల స్థలాలకు మౌలిక వసతుల కల్పనకు రూ. 32,909 కోట్లు వెచ్చించడం జరిగింది.ఇళ్ల పట్టాలు పొందిన వారిలో 22 లక్షల మందికి రూ. 1.80 లక్షల చొప్పున హౌసింగ్ శాంక్షన్ ఇచ్చాం. దీంతోపాటు అదనంగా డబ్బులు అవసరం అనుకుంటే పూర్తిగా సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం. ఇందుకోసం రూ. 57,375 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా రూ. 1.27 లక్షల కోట్లు పేదల ఇళ్ల నిర్మాణం కోసం గత జగన్ ప్రభుత్వ ఖర్చు చేయడం జరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలతో ఊర్లకు ఊర్లే రూపుదిద్దుకున్నాయి. దాదాపు 17వేలకుపైగా కాలనీలు ఏర్పడ్డాయి. ఆయా కాలనీల్లో అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ గ్రావెల్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, కరెంట్ పోల్స్ వంటి మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉచితంగా ఎలక్ట్రిక్ మీటర్లు కూడా బిగించాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సబ్ స్టేషన్లతో పాటు అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేశాం.ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా అందంగా తీర్చిదిద్దాం. ఇంటి పట్టాను కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి వారి గౌరవాన్ని మరింత పెంచాం. పేదలకు మంచి చేయాలని ఇంత గొప్పగా ఆలోచిస్తే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. అమరావతి రాజధానిలో పట్టాలు పంపిణీ చేస్తే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని కోర్టుకెళ్లిన దిక్కుమాలిన ఆలోచన చేసిన ఘనుడు చంద్రబాబు అని జక్కంపూడి రాజా గుర్తు చేశారు. -
గణతంత్ర వేడుకల్లో ముక్కామల కళాకారులు
– మూడో ఏడాది కూడా పాల్గొన్న నాగబాబు బృంద సభ్యులుఅంబాజీపేట: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన 76వ గణతంత్ర వేడుకల్లో మూడో ఏడాది కూడా ముక్కామలకు చెందిన నాగబాబు బృందం కళాకారులు పాల్గొన్నారు. 2025 గణతంత్ర వేడుకలలో ఆంధ్రప్రదేశ్ శకటంగా పర్యావరణ హితం కల్గించే ఏటి కొప్పాక బొమ్మలను ప్రదర్శించారు. ఈ బొమ్మలలో విఘ్నాలను తొలగించే వినాయకుడు, కలియుగ ప్రత్యక్ష్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి బొమ్మలతో పాటు ఇతర బొమ్మలు ఉన్నాయి. శకటానికి ఇరువైపులా మండలంలోని ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు బృందంలోని 16 మంది సభ్యులు భరత నాట్యం ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. కాగా నాగబాబు బృందం సభ్యులు 2023లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాదశ రుద్ర ప్రభల నమూనా శకటంతో గరగ నృత్యాలు చేసి అందరినీ అలరించారు. 2024 గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శించిన అక్షరాస్యతా శకటానికి ఇరువైపులా విద్యార్థుల మాదిరిగా నాగబాబు బృందం సభ్యులు పాల్గొన్నారు. దీంతో నాగబాబు బృందం సభ్యులు హ్యాట్రిక్ సాధించారు. ఈ సందర్భంగా పలువురు నాగబాబును, అతని బృంద సభ్యులను అభినందించారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ హత్య దారుణం
ఈరన్న కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి అమలాపురం టౌన్: కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామ ఫీల్ట్ అసిస్టెంట్ కురమ ఈరన్నను హత్య చేయడం దారుణమని జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా ఫీల్ట్ అసిస్టెంట్ సంఘం నాయకుడు కాశీ శ్రీరామ్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశం ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యను తీవ్రంగా ఖండించింది. ఈరన్న కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై సమావేశం చర్చించింది. ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు అరికట్టాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, కార్యదర్శి నూకల బలరామ్ ఫీల్డ్ అసిస్టెంట్ నాయకులతో సమస్యలపై చర్చించారు. సంఘ ప్రతినిధులు డి.శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాస్, మద్దా రమేష్ ప్రసంగించారు. -
‘భారత రాజ్యాంగం’ పుస్తకావిష్కరణ
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన కవి, అంబేడ్కరీయులు, బుద్దిస్ట్ సవేర ‘భారత రాజ్యాంగం’ పేరుతో రచించిన పుస్తకాన్ని స్థానిక వెంకట కృష్ణాపురంలో ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది డీబీ లోక్ తదితరులు సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సుబ్బారావు ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల నకులరాజు అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో డీబీ లోక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అనేక విషయాలు పాఠకులందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో కవి సవేర సరళంగా రచించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముంగండ ఆశీర్వాదం, సరెళ్ల రామచంద్రరావు, పొలమూరి వెంకటేశ్వరరావు, ముత్తాబత్తుల ఆనందరావు, కొల్లు ఉదయకుమార్‌లు పుస్తకాన్ని సమీక్షించారు. -
ఉల్లంఘనులపై చర్య తీసుకోండి
ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న కపిలేశ్వరపురం ర్యాంపు నిర్వహకులు నిబంధనలు పాటించడం లేదని, నిషేధిత యంత్రాలను వినియోగించి నది ఒడ్డున ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదు అందింది. అరిగెల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదులో ఇక్కడ పలు అక్రమాలు జరుగుతున్నాయని తెలిపాడు. ర్యాంపుల నుంచి ట్రాక్టర్లు, ట్రాలీల నుంచి ఇసుక స్టాక్ పాయింట్‌కు తరలించాల్సి ఉండగా, నేరుగా ర్యాంపుల నుంచి ఇసుక తరలిస్తున్నారన్నారు. సరైన బిల్లులు లేదా రికార్డులు లేకుండా పగటిపూట దాదాపు 150 లారీలు, రాత్రి వేళల్లో 100 లారీల ఇసుక రవాణా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లారీ పరిణామాన్ని బట్టి రూ.ఆరు వేల నుంచి రూ.18 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలకు సంబంధించి జియో కోట్స్ ఫొటోలను, వీడియోలను సాక్ష్యాలుగా అందించిన ఆయన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. -
పెరటిహిట్టు!
బంగారు ఆభరణాల స్వాధీనం నిందితుడి అరెస్టు కోటనందూరు: దొంగిలించిన 100 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్టు తుని రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై టి.రామకృష్ణతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 24న కోటనందూరు మండలం బిళ్లనందూరుకు చెందిన మాతిరెడ్డి గంగయ్యమ్మ ఇంటికి తాళం వేసి ఉపాధి పనులకు వెళ్లింది. గంగయ్యమ్మ ఎదురింటి వ్యక్తి బొత్స వీరబాబు (34) తాళం పగులగొట్టి పడకగది బీరువాలో ఉన్న 35.30 గ్రాముల నల్లపూసల గొలుసు, 22.5 గ్రాముల పుస్తెలతాడు, 23.2 గ్రాముల చైను, 12.5 గ్రాముల చెవిదిద్దులు, 5.5 గ్రాముల బంగారు ముక్కలను అపహరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు వీరబాబు ఆదివారం టీజే నగరం బస్టాండు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఎస్సై రామకృష్ణ, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా టీజే నగరం వర్మీకంపోస్టు కేంద్రం వద్ద రహదారి కింద ఉన్న కల్వర్టులో ఆభరణాలను దాచినట్లు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
గణతంత్ర వేడుకల్లో ముక్కామల కళాకారులు
– మూడో ఏడాది కూడా పాల్గొన్న నాగబాబు బృంద సభ్యులుఅంబాజీపేట: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన 76వ గణతంత్ర వేడుకల్లో మూడో ఏడాది కూడా ముక్కామలకు చెందిన నాగబాబు బృందం కళాకారులు పాల్గొన్నారు. 2025 గణతంత్ర వేడుకలలో ఆంధ్రప్రదేశ్ శకటంగా పర్యావరణ హితం కల్గించే ఏటి కొప్పాక బొమ్మలను ప్రదర్శించారు. ఈ బొమ్మలలో విఘ్నాలను తొలగించే వినాయకుడు, కలియుగ ప్రత్యక్ష్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి బొమ్మలతో పాటు ఇతర బొమ్మలు ఉన్నాయి. శకటానికి ఇరువైపులా మండలంలోని ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు బృందంలోని 16 మంది సభ్యులు భరత నాట్యం ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. కాగా నాగబాబు బృందం సభ్యులు 2023లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాదశ రుద్ర ప్రభల నమూనా శకటంతో గరగ నృత్యాలు చేసి అందరినీ అలరించారు. 2024 గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శించిన అక్షరాస్యతా శకటానికి ఇరువైపులా విద్యార్థుల మాదిరిగా నాగబాబు బృందం సభ్యులు పాల్గొన్నారు. దీంతో నాగబాబు బృందం సభ్యులు హ్యాట్రిక్ సాధించారు. ఈ సందర్భంగా పలువురు నాగబాబును, అతని బృంద సభ్యులను అభినందించారు. -
కొట్లాట కేసులో నిందితుడి అరెస్టు
కోటనందూరు: ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన కొట్లాట కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ సోమవారం తెలిపారు. ఈ నెల 24న మండలంలోని బిళ్లనందూరు గ్రామానికి చెందిన మిరియాల నాగు తన తమ్ముడు మిరియాల నానాజీపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నానాజీని కుటుంబ సభ్యులు తుని ఏరియా ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నానాజీ కోమాలోకి వెళ్లాడు. సోమవారం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నానాజీ కుటుంబ సభ్యులను ఎస్సై పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం బిళ్లనందూరులో మధ్యవర్తుల సమక్షంలో నిందితుడు నాగును అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అమలాపురం నడిబొడ్డున రెండు చోరీలు
● పట్టణ సీఐ కార్యాలయం ఎదుటే ఘటన ● రూ.1.30 లక్షల నగదు దోచుకున్న దొంగలు అమలాపురం టౌన్: స్థానిక గడియారం స్తంభం సెంటరులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణ సీఐ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పత్రికా కార్యాలయం, చాందిసి క్లినిక్‌లో ఈ వరస చోరీలు జరిగాయి. పత్రిక కార్యాలయం తలుపు తాళాలు, క్లినిక్ ఇనుప షట్టర్ల తాళాలు పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. పత్రిక కార్యాలయంలో డ్రాయర్ తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.85 వేల నగదు, క్లినిక్‌లో డాక్టర్ ఎంకే రాయ్‌కు చెందిన రూ.45 వేల నగదు, ఓ ఏటీఎం కార్డును దొంగలు తస్కరించారు. తెల్లారే సరికి విజయవాడకు చోరీకి పాల్పడిన వారు ప్రొఫెషనల్స్‌గా పోలీసులు భావిస్తున్నారు. తెల్లారే సరికి వారు విజయవాడకు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇక్కడ క్లినిక్‌లో చోరీ చేసిన డాక్టర్ ఏటీఎం కార్డును విజయవాడలో ఉపయోగించి నగదు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇక్కడ డాక్టర్ ఫోన్‌కు డబ్బు డ్రా అయినట్లు కాకుండా డబ్బుల కోసం రాంగ్ పిన్ నొక్కినట్టు మెసేజ్ వచ్చింది. దీనిని బట్టే చోరీకి పాల్పడ్డ దొంగలు తెల్లారే సరికి విజయవాడ చేరుకున్నట్లు బాధితులతోపాటు పోలీసులు కూడా భావించారు. పట్టణ సీఐ పి.వీరబాబుతోపాటు సిబ్బంది సోమవారం ఉదయమే చోరీలు జరిగిన చోటకు చేరుకున్నారు. క్లూస్ టీమ్ సభ్యులు చోరీలు జరిగిన చోట్ల నుంచి దొంగల వేలి ముద్రలను సేకరించారు. -
పూలు విలవిలలాడేనని..
● సగానికి పైగా తగ్గిన ధరలు ● మరోవైపు గణనీయంగా దిగుబడి ● రేటు లేక తోటల్లోనే వదిలేస్తున్న రైతులు ● ఉపాధి దొరకక కూలీలు, మహిళలకు ఇబ్బందులు పెరవలి: కొద్ది రోజులుగా మార్కెట్లో పూల ధరలు పడిపోవటంతో రైతులు విలవిలలాడుతున్నారు. మరోవైపు పూలకోత కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో కడియపులంక తరువాత చెప్పుకోదగిన కాకరపర్రు పూల మార్కెట్టు నేడు పూలు కొనేవారు లేక కళావిహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శుభ ముహూర్తాలు, పండగలు లేకపోవటంతో పూల వినియోగం తక్కువగా ఉందని, అందువల్లనే ధరలు తగ్గాయని చెబుతున్నారు. ప్రస్తుతం దిగుబడి ఉన్నా తగినంత ధర లేక రైతులు.. ఉపాధి దొరకక కూలీలు.. అమ్మకాలు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, నిత్యం కళకళలాడుతూ కనిపించే కాకరపర్రు పూల మార్కెట్టు నేడు వెలవెలబోతోంది. దిగులు పెంచిన దిగుబడి జిల్లావ్యాప్తంగా 4,897 ఎకరాల్లో రైతులు పూల సాగు చేస్తున్నారు. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. కొద్ది రోజులుగా వాతావరణం చల్లగా, అనుకూలంగా ఉండటంతో పూల దిగుబడి గణనీయంగా పెరిగింది. సాధారణంగా ఎకరానికి, కోతకు సుమారు 300 కేజీల బంతిపూల దిగుబడి వస్తూంటుంది. అటువంటిది ప్రస్తుతం 400 కేజీల వరకూ వస్తోంది. అలాగే, చామంతి పూలు కూడా సాధారణంగా 100 కేజీల లోపు వస్తూంటుంది. ప్రస్తుతం ఇది 125 నుంచి 150 కేజీల వరకూ వస్తోంది. ఈవిధంగా దిగుబడి పెరిగిన తరుణంలో రైతులు, వ్యాపారులు ఆనందంగా ఉండాలి. కానీ, సరిగ్గా ఇదే సమయంలో సంక్రాంతితో పండగలన్నీ ముగిసిపోవడం.. శుభముహూర్తాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్ద మొత్తంలో పూలు కొనేవారే లేకుండా పోయారు. నిత్య పూజలు, ఇతర చిన్న చిన్న అవసరాలకు తప్ప చాలా మంది పూలు కొనడం లేదు. దీంతో వాటి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మామూలుగా వారానికి రెండు కోతలు కోయాల్సి ఉండగా.. నేడు ధర లేకపోవడంతో ఒక్క కోతతోనే సరిపెడుతున్నామని రైతులు చెబుతున్నారు. కోత కోయిస్తే కనీసం కూలి ఖర్చులు కూడా రావడం లేదని, కోత కోసి నష్టపోయేకంటే కోయకుండా వదలివేయడమే మేలని పలువురు రైతులు భావిస్తున్నారు. ధరలు పడిపోయాయిలా.. ఇరవై రోజుల క్రితం కిలో చామంతి, జాజుల ధర రూ.300 పలికింది. నేడు పూల నాణ్యతను బట్టి కిలో రూ.60 నుంచి రూ.120కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా వ్యాపారుల వద్ద రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉండిపోతున్న పరిస్థితి. అప్పటికీ అమ్ముడుపోకపోతే పూలు పాడైపోవడంతో గత్యంతరం లేక వాటిని నాలుగో రోజున రోడ్ల పక్కన పారబోస్తున్నామని వ్యాపారులు వాపోతున్నారు. పూల మాలలు అల్లించడం, గ్రేడింగ్ వంటి పనులు చేయిద్దామన్నా కనీస కూలి ఖర్చులు కూడా రావడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. కూలి ఖర్చులు కూడా రాక.. ధరలు తగ్గటంతో రైతులు కోతలు కోయించకుండా పూలను చేలల్లో వదిలేస్తున్నారు. గతంలో ప్రతి రోజూ పది మంది కూలీలతో పూల కోతలు కోయించే రైతులు నేడు వారానికి ఒక్కసారి మాత్రమే కోత కోయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎకరా బంతి పూల తోటలో ఒక్క కోతకు 10 మంది కూలీలు అవసరమవుతారు. వీరికి రోజుకు రూ.350 కూలి ఇవ్వాలి. మార్కెట్లో కిలో పూల ధర రూ.40 పలుకుతోంది. ఒక విడతకు సుమారు 100 కిలోలు కోయిస్తే కూలీలకు రూ.3,500, కాఫీ, టిఫిన్లు, సంచులు, రవాణా కలిపి రూ.1,000 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 100 కిలోల బంతిపూలకు రూ.4 వేల రాబడి వస్తే.. ఖర్చు రూ.4,500 అవుతోంది. ఇతర పూల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంటోంది. దీంతో, చేతి ఖర్చు అదనంగా పడుతూండటంతో కోత కోయించకుండా వదిలేస్తున్నామని రైతులు వాపోతున్నారు. పూల కోత కోసే కూలీలకు ప్రస్తుతం వారానికి ఒక్క రోజు మాత్రమే పని లభిస్తోంది. పూల ధరలు పడిపోయాయిలా.. (కిలోకు రూ.లలో) పూల రకం 20 రోజుల క్రితం ప్రస్తుతం బంతి 80.00–120.00 40.00 చామంతి 300.00 60.00–80.00 జాజులు 350.00 150.00 కనకంబరాలు 1,000.00 500.00 మల్లెలు 1,000.00 500.00 గులాబీలు 350.00 150.00 -
ఇంటి ముందు భార్య బైఠాయింపు
ఆలమూరు: తన భర్తతోనే జీవనం సాగిస్తానని, తనను ఇంట్లోకి ఆహ్వానించకుంటే ఇంటి ముందు నుంచి కదిలేది లేదంటూ భార్య ఆలమూరు మండలంలోని పినపళ్లలో నిరసన తెలిపింది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న ఇల్లూరి రవికుమార్‌కు 2022 మే 21న వివాహమైంది. ఏడాది దాటాక భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో రవికుమార్ తన భార్య సత్యవతిని మండపేట మండలంలోని ఏడిదలో పుట్టింటికి పంపేశాడు. అప్పటి నుంచి పలుమార్లు పెద్దల ద్వారా రవికుమార్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో భార్య సత్యవతి సోమవారం తన భర్త ఇంటి బయట బంధువులతో కలిసి బైఠాయించింది. ఇంట్లోకి రమ్మనే వరకూ ఇంటి ముంగిటనే ఉంటానని తెలిపింది. దీనిపై స్థానికులు స్థానిక మహిళ సంరక్షణ కార్యదర్శి కె.సత్యనారాయణమ్మకు ఫిర్యాదు చేయగా ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆలమూరు ఎస్సై ఎం.అశోక్‌కు ఆమె సమాచారం అందించారు. కౌన్సెలింగ్ ఇస్తాం : రెండేళ్ల నుంచి విడిపోయి ఉంటున్న భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి వారి సమస్యను పరిష్కరిస్తామని ఎస్సై అశోక్ తెలిపారు. నిరసన వీడి పోలీసు స్టేషన్‌కు రావాలని బాధిత మహిళ సత్యవతికి, కుటుంబ సభ్యులకు ఫోన్లో వివరించారు. భర్త రవికుమార్ స్పందించకుంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం స్థానికుల సాయంతో బాధిత కుటుంబాన్ని మహిళా సంరక్షణ కార్యదర్శి సత్యనారాయణమ్మ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
గడువులోగా అర్జీల పరిష్కారం
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో అందే ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన అర్జీదారుల సమస్యలను విని అందుబాటులో ఉన్న సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి డీఆర్ఓ రాజకుమారి, డీఆర్డీఏ పీడీ ఎ.శివశంకర్ ప్రసాద్, డ్వామా పీడీ మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్.త్రినాథరావు కృష్ణమూర్తి 212 అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విపత్తుల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల సమన్వయంతో జియో కోఆర్డినేటర్లతో మ్యాపులను రూపొందించాలని ఆదేశించారు. రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, విద్యాసంస్థలు, వాటర్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, సైక్లోన్ పునరావాస కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్ప్ఫార్మర్లు సబ్ స్టేషన్లు తదితర అంశాలపై మ్యాపులను చిత్రీకరించాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం అంతర్వేది లక్ష్మినరసింహస్వామి వారి ఆలయం వద్ద స్వామివారి తిరుకల్యాణోత్సవాలకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు, వికాస జిల్లా మేనేజర్ జి. రమేష్ పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 34 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 34 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో ఎస్పీ అక్కడ నుంచే ఫోన్లలో మాట్లాడి పరిష్కార మార్గాలపై ఆదేశాలు ఇచ్చారు. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి సమస్యపై తీసుకున్న పరిష్కార చర్యలను ఎస్పీ కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎస్పీ బాధితులతో చర్చించి పరిష్కార మార్గాలపై మాట్లాడారు. -
ఆగని దోఫ్రీడీ
సాక్షి, అమలాపురం: ‘తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత... దోచుకున్నవారికి దోచుకున్నంత’ అన్నట్టుగా ఉంది కూటమి పాలనలో ఉచిత ఇసుక పాలసీ. పగలు, రాత్రి అనే తేడా లేదు.. అధికార ర్యాంపు.. అనధిరార ర్యాంపు అనే భేదం లేదు, ఎక్కడైనా వసూళ్ల దందా పెద్ద ఎత్తున నడుస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ర్యాంపుల్లో కూడా అడ్డగోలు దోపిడీ సాగిపోతోంది. దీనివల్ల వినియోగదారులకు ఉచిత ఇసుక కాస్తా కొనలేనంత భారంగా మారింది. కోనసీమ జిల్లాలో అధికారికంగా ప్రకటించిన ర్యాంపులు మొత్తం 15. జిల్లాస్థాయి శాండ్ కమిటీ కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో తొలి దశలో అంకంపాలెం, నార్కెడిమిల్లి, పొడగట్లపల్లి–1, పొడగట్లపల్లి–2, పులిదిండి, వద్దిపర్రు –1, వద్దిపర్రు–2, ఆలమూరు, ఆత్రేయపురం, కపిలేశ్వరపురం, తాతపూడి, ఊబలంక కలిపి మొత్తం 12 ర్యాంపులు అనుమతించగా, రెండోదశలో గోపాలపురం, అంకంపాలెం–2, పొడగట్లపల్లి–3, మూడు ర్యాంపులున్నాయి. వీటిలో మిథులా కంపెనీ టెండర్ దక్కించుకున్న పొడగట్లపల్లి–2, ఆలమూరు రీచ్‌లలో ఇప్పటి వరకు ఎటువంటి తవ్వకాలు జరగడం లేదు. యథేచ్ఛగా నిబంధనలకు పాతర వీటిలో రెండు రీచ్‌లు మినహా మిగిలిన పదమూడు రీచ్‌లు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాయి. రెండు మాత్రం మండపేట నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఈ రెండు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి చెందిన నేతల హవా కొనసాగుతోంది. ర్యాంపులు దక్కించుకున్నవారితో స్థానిక నాయకులు చేతులు కలిపారు. వారి కనుసన్నలలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమిలో ఉన్న జనసేన సైతం తమకు వాటా కావాలని పట్టుబట్టడంతో వారికి రెండు, మూడు లారీలు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ర్యాంపులే ఉన్నా నిబంధనలకు విరుద్ధం జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. ర్యాంపుల్లో యంత్రాలతో తవ్వకాలు, గట్ల చెంతన నిల్వ చేయకుండా నేరుగా ర్యాంపుల నుంచే రవాణా చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఆత్రేయపురంలో చెలరేగిపోతున్న మాఫియా ఆత్రేయపురంలో అధికాార ర్యాంపు వద్ద టీడీపీ అనుకూల ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. పగటిపూట కొన్ని ర్యాంపులలో సక్రమంగా, రాత్రి వేళ అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం, నార్కెడిమిల్లి, పులిదిండి, వద్ధిపర్రు, ఆత్రేయపురం గ్రామాల్లో ఉన్న ఎనిమిది రీచ్‌లలోనూ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఈ రాంపుల్లో కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులతో వాటాలు పంచుకుంటున్నారు. వీరికి కీలకనేత అండదండలు ఉండడంతో అధికార యంత్రాంగం చేష్టలుడి చూస్తోంది. ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాలకు పెద్దపెద్ద బాటలు వేసి తవ్వకాలు చేస్తున్నారు. ర్యాంపుల వద్ద నుంచే రోజూ వందలాది లారీల ఇసుక తరలిపోతోంది. స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక కన్నా రెట్టింపు సంఖ్యలో ర్యాంపుల నుంచి నేరుగా ఇసుక తరలిపోతోంది. ఇలా తరలిస్తున్న ఇసుకకే అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఉచిత ఇసుక అయినా పగటిపూట లారీకి రూ.వెయ్యి చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. రాత్రులు అంకంపాలెం, వద్దిపర్రు నుంచి అక్రమ తవ్వకాలు చేస్తూ లారీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు, డిమాండ్‌ను బట్టి రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు. మిగిలిన ర్యాంపులు ఊబలంక, పొడగట్లపల్లి రాంపుల్లో పగటి పూట మాత్రమే తవ్వకాలు నిర్వహిస్తున్నారు. కాని ఇక్కడ కూడా లారీకి అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. నియోజకవర్గంలో కీలక మద్యం వ్యాపారులే ఇక్కడ ఇసుక దందా కూడా చేస్తుండడం గమనార్హం. వీరి అక్రమ రవాణాకు డెల్టాలో కీలకమైన లొల్ల లాకులు సైతం దెబ్బతింటున్నాయి. రావులపాలెం మండలం పొడగట్లపల్లి ర్యాంపు వద్ద స్టాక్ పాయింట్ నుంచి ఇసుక ఎగుమతిజట్టు కార్మికులు ఆందోళన చేసినా పట్టని అధికారులు మండపేట పరిధిలో మందపల్లి, కపిలేశ్వరపురంలో యంత్రాలతో లోడింగ్ చేస్తున్నారు. రాత్రి సమయంలోనూ తవ్వకాలు జరుపుతున్నారు. దానితో ఆగ్రహం చెందిన జట్టు కార్మికులు ఈనెల 7న ర్యాంపు వద్ద వాహనాలను నిలుపుదల చేసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తమకు పని లేదని పంపివేసి యంత్రాలతో లోడింగ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అటు మైనింగ్ అధికారులు గాని, ఇటు రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కాని అడ్డుకున్న దాఖలాలు లేవు. అధికార పార్టీ కీలక నేతల అండదండలు ఉండడం, తిలాపాపం తలాపిడికెడు అన్నట్టుగా కింద నుంచి పై వరకు ప్రతి ఒక్కరికీ ఈ దందాలో సొమ్ము అందుతుండడంతో కిక్కురుమనకుండా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోనసీమ జిల్లాలో అధికార రీచ్‌లు 15 నిబంధనలకు విరుద్ధంగా ర్యాంపుల్లో తవ్వకాలు పగటి పూట సక్రమం... రాత్రి వేళల్లో అక్రమం లారీకి అదనంగా రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు వసూళ్లు వినియోగదారులపై అదనపు భారం ఆత్రేయపురంలో చెలరేగిపోతున్న మాఫియా -
హుండీల ద్వారా స్వామికి రూ.39,02,348 ఆదాయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా స్వామికి భక్తుల నుంచి మొత్తం రూ.39,02,348 ఆదాయం వచ్చింది. డిసెంబర్ 6 నుంచి జనవరి 27వ తేదీ వరకూ 53 రోజులకు గాను పై ఆదాయం సమకూరింది. ఎండోమెంట్స్ అమలాపురం తనిఖీదారు జె.రామ లింగేశ్వరరావు పర్యవేక్షణలో లెక్కింపు చేశారు. కాగా మొత్తం ఆదాయంలో మెయిన్ హుండీల ద్వారా రూ.38,29,465, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.16,780, అన్నదానం హుండీల ద్వారా రూ.56,103 ఆదాయం వచ్చినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. సర్పంచ్ కొండా జాన్‌బాబు, ఎంపీటీసీ బైరా నాగరాజు పాల్గొన్నారు. రేపు స్పార్స్ అవుట్‌రీచ్ కార్యక్రమం కాకినాడ సిటీ: మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువులు, మాజీ సైనిక సంఘాల ప్రతినిధులకు బుధవారం స్పార్స్ అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఆ రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఈ కార్యక్రమం రాజమహేంద్రవరం రివర్ బేలో జరుగుతుంది. అలహాబాద్‌కు చెందిన సీడీఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి మాజీ సైనికులు, వితంతువులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఆక్నూ పీడీసీఎంఏ ఉపాధ్యక్షునిగా నాయుడు అమలాపురం టౌన్: రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం (అక్నూ)లో ఆ విశ్వ విద్యాలయం అనుబంధ ప్రైవేటు డిగ్రీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (పీడీసీఎంఏ) సాధారణ సమావేశంలో అమలాపురం పట్టణానికి చెందిన ఆకుల బాపన్నాయుడు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. స్థానిక విద్యానిధి డిగ్రీ కళాశాల డైరెక్టర్ అయిన నాయుడు పీడీసీఎంఏ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల ఆక్నూ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నాయుడు పేర్కొన్నారు. ఆక్వా చెరువులపై సర్వే అమలాపురం రూరల్: తీర ప్రాంత ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లో ఎంత మేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నది జీయో కోఆర్డినేటర్ల మ్యాపులతో సహా బృందాలు సర్వే చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మత్స్య అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి ఆక్వా చెరువుల అనుమతుల అంశాలపై సమీక్షించారు. వారంలో సర్వే పూర్తి చేయాలన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జేసీ నిషాంతి కమిటీ సభ్యులకు సూచించారు. సోమవారం ఇంటర్మీడియెట్ బోర్డు ఎగ్జామినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు, ఒకేషనల్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్్స్లో నిర్వహిస్తారన్నారు. ఒక సెషన్ ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు మరొకటి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జనరల్ ప్రాక్టికల్ కోసం 60 కేంద్రాలు, వోకేషనల్ ప్రాక్టికల్ కోసం 41 కేంద్రాలు కేటాయించి నట్లు తెలిపారు. వేతనాలు చెల్లించాలని యానిమేటర్ల ధర్నా అమలాపురం రూరల్: గత ఎనిమిది నెలలుగా బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ వెలుగు యానిమేటర్ల యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వెలుగు యానిమేటర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎ.జ్యోతి, సీఐటీయూ కోశాధికారి కృష్ణవేణి మాట్లాడుతూ 8 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉంటే యానిమేటర్ల కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వినతి పత్రాన్ని డీఆర్ఓ రాజకుమారికి అందజేశారు. లక్ష్మి, సుబ్బలక్ష్మి, వేణు, విజయ పాల్గొన్నారు. -
పెరటిహిట్టు!
బంగారు ఆభరణాల స్వాధీనం నిందితుడి అరెస్టు కోటనందూరు: దొంగిలించిన 100 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్టు తుని రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై టి.రామకృష్ణతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 24న కోటనందూరు మండలం బిళ్లనందూరుకు చెందిన మాతిరెడ్డి గంగయ్యమ్మ ఇంటికి తాళం వేసి ఉపాధి పనులకు వెళ్లింది. గంగయ్యమ్మ ఎదురింటి వ్యక్తి బొత్స వీరబాబు (34) తాళం పగులగొట్టి పడకగది బీరువాలో ఉన్న 35.30 గ్రాముల నల్లపూసల గొలుసు, 22.5 గ్రాముల పుస్తెలతాడు, 23.2 గ్రాముల చైను, 12.5 గ్రాముల చెవిదిద్దులు, 5.5 గ్రాముల బంగారు ముక్కలను అపహరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు వీరబాబు ఆదివారం టీజే నగరం బస్టాండు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఎస్సై రామకృష్ణ, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా టీజే నగరం వర్మీకంపోస్టు కేంద్రం వద్ద రహదారి కింద ఉన్న కల్వర్టులో ఆభరణాలను దాచినట్లు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
చొల్లంగి తీర్థం చూసొద్దాం రండి!
ఫ రేపు జరిగే తీర్థానికి భారీ ఏర్పాట్లు ఫ తరలి రానున్న వేలాది మంది భక్తులు కరప: పురాణ ప్రసిద్ధి గాంచిన చొల్లంగి అమావాస్య తీర్థం బుధవారం కరప మండలం ఉప్పలంక శివారు మొండి వద్ద సముద్ర తీరాన జరగనుంది. చొల్లంగి తీర్థం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రాముఖ్యథ సంతరించుకుంది. వేలాదిగా భక్తులు తరలివచ్చి సముద్రస్నానం చేయడం ఆనవాయితీ. దేవదాయ, పోలీసు శాఖలతో పాటు, ఉప్పలంక గ్రామ పంచాయతీ సంయుక్తంగా తీర్థం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా పుష్యమాసంలో అమావాస్య రోజున తీర్థం జరుగుతుంది. తుల్యభాగ నదీపాయ సముద్రతీరంలో కలిసే ప్రదేశమే సాగర సంగమం అంటారు. చంద్రుడు శాపవిమోచనం పొందడానికి తనభార్య రోహిణితో కలసి ఈ సాగర సంగమం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో శివుడు ప్రత్యక్షమై మోక్షం కలిగించినట్టు పురాణగాథలు తెలుపుతున్నాయి. చొల్లంగి వద్ద సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే రాజ రాజేశ్వరీదేవి సమేత సోమేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. మొండివద్ద సముద్రతీరాన 109 సంవత్సరాల క్రితం మల్లాడి సత్యలింగం నాయకర్ సంగమేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో బాలాత్రిపురసుందరి సమేత సంగమేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి పక్కనే సీతారాముల ఆలయం, ఆంజనేయస్వామి, కాలభైరవస్వామి వార్ల ఆలయాలు కూడా ఉంటాయి. తర్వాత పక్కనే ఉన్న చొల్లంగిలో చంద్రుడు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరస్వామివారి శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాకినాడ జిల్లానుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి సముద్రస్నానం చేసి సంగమేశ్వరస్వామి, భైరవస్వామి, సోమేశ్వరస్వామివార్లను దర్శించుకుంటారు. ట్రాఫిక్ మళ్లింపు చొల్లంగి తీర్థం రోజున ఎంఎస్ఎన్ చార్టీస్ నుంచి మొండివద్ద స్నానాల రేవు వరకు ఉండే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల సూచన మేరకు ట్రాఫిక్‌ను ఒక రోజు(మంగళవారం అర్ధరాత్రి నుంచి) మళ్లించినట్టు కరప ఎస్ఐ సునీత తెలిపారు. యానాం వైపు నుంచి తాళ్లరేవు మీదుగా వచ్చే వాహనాలు పటవల వద్ద నుంచి జి.వేమవరం, గొర్రిపూడి, పెనుగుదురు గ్రామాల మీదుగా కాకినాడకు చేరుకుంటాయన్నారు. కాకినాడ నుంచి తాళ్లరేవు, యానాంవైపు వెళ్లే వాహనాలు కాకినాడ, తూరంగి, నడకుదురు, గురజనాపల్లి గ్రామాల మీదుగా యానాం రోడ్డుకు చేరుకుని వెళతాయన్నారు. స్నానాల రేవు వద్ద, ఆలయం వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవదాయ, పోలీసుశాఖల అధికారులతో కలసి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఉప్పలంక సర్పంచ్ బొమ్మిడి నయోమి, గ్రామకార్యదర్శి ఎం.భవానీ తెలిపారు. స్నానాలరేవు వద్ద గజ ఈతగాళ్లను ఉంచినట్టు, దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్టు ఎంఎస్ఎన్ చార్టీస్ ఏసీ కె.విజయలక్ష్మి తెలిపారు. మొండివద్ద చొల్లంగి తీర్థం రోజున ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు కరప పీహెచ్సీ డాక్టర్ యాంజలిన్ తెలిపారు. సప్తసాగర యాత్ర చొల్లంగి అమావాస్య మరుసటి రోజు నుంచి సప్త సాగర యాత్ర ప్రారంభమవుతుంది. చొల్లంగి, కోరంగి, తీర్థాల మొండి, రామేశ్వరం, బ్రహ్మసమాఖ్యం, నాసంగితిప్ప, అంతర్వేదిలలో సముద్రస్నానం చేస్తే సప్త సాగర యాత్ర పూర్తవుతుంది. సప్త సాగర యాత్ర తర్వాత అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి తీర్థం జరుగుతుంది. చంద్రునికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు నందేశ్వరునికి కూడా వరమివ్వడం వల్లనే చొల్లంగి అమావాస్య రోజున అప్పన్నెద్దులను తీసుకొచ్చి సముద్రస్నానం చేయిస్తారు. గ్రామాల్లోని వీరభద్రుడు గద్దెల నుంచి ప్రభలను తీసుకొచ్చి చొల్లంగి తీర్థం రోజున సముద్రస్నానం చేసి, సంగమేశ్వరస్వామి, భైరవస్వామి, సోమేశ్వరస్వామివార్లను దర్శించుకుంటారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యాన కరప ఎస్ఐ టి.సునీత పోలీసు సిబ్బందితో కలసి బందోబస్తు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.