Hanamkonda
-
కుంభాభిషేకానికి వేళాయె..
కాళేశ్వరం: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహా ఘట్టం రానే వచ్చింది. 42ఏళ్ల అనంతరం మహాకుంభాభిషేకం నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్రంలోనే మొదటిసారి కాళేశ్వరం దేవస్థానంలో నిర్వహించడానికి రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆలయంతో పాటు గోదావరి నది వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నేటి (శుక్రవారం) నుంచి 9వ తేదీ (ఆదివారం) వరకు కాళేశ్వరం దేవస్థానంలో శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతితీర్థస్వామి వారి ఆశీస్సులతో తుని తపోవనం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానందసరస్వతితో మహాకుంభాభిషేకం నిర్వహణ చేయనున్నారు. ముఖ్యంగా శతచండి, మహారుద్ర సహిత సహస్ర ఘటాభిషేకం, కుంభాభిషేక మహోత్సవాన్ని ఆసిఫాబాద్ జిల్లా అచ్చలాపురం దుద్దిళ్ల మనోహరశర్మ ఆధ్వర్యంలో శిష్య బృందం 50మంది రుత్వికులతో నిర్వహిస్తారు. 1,180 కలశాలతో పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడు రోజులు ఆధ్యాత్మిక శోభ.. కాళేశ్వరంలో మూడు రోజుల పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. 42ఏళ్ల తరువాత నిర్వహిస్తుండడంతో తిలకించడానికి భక్తులు తరలిరానుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో కాళేశ్వరంతో పాటు ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మికశోభతో వెలుగొందనున్నాయి. ఉచితంగా పులిహోర ప్రసాదం, అన్నదానం కార్యక్రమం చేస్తారు. ఇప్పటికే గోపురాలు, ఆలయాలకు పరంజాలతో మెట్ల మార్గాలు పూర్తిచేశారు. ఒక్కో గోపురం, ఆలయాల వద్ద 10నుంచి 12మంది వరకు సామర్థ్యంతో నిర్మాణం చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించడానికి సుమారు 50వేలకుపైగా భక్తజనం రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం 10.42గంటలకు ముహూర్తం.. ఆదివారం (9న) 10.42గంటలకు ముహూర్తం ప్రకారం శ్రీశ్రీశ్రీ సచ్చిదానందసరస్వతితో ప్రధాన ఆలయంపై గోపురం వద్ద ఆయన మహాకుంభాభిషేకం పూజ, ఇతర రుత్వికులు మిగతా గోపురాలు, ఆలయాల వద్ద సంప్రోక్షణ చేస్తారు. కుంభాభిషేకం పూజ వీక్షణకు నాలుగు ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. మహాకుంభాభిషేకం తరువాత భక్తుల ను దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కానీ వ చ్చే భక్తజనం రద్దీతో గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని అధికారులు పేర్కొంటున్నారు.నేటినుంచి 9వ తేదీ వరకు మహాకుంభాభిషేక పూజలు 9న సచ్చిదానంద సరస్వతితో నిర్వహణ అచ్చలాపురం రుత్వికులతో 1,180 కలశాలకు పూజ నిర్వహణ భక్తులకు అన్నదానం, ఉచిత ప్రసాదానికి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసిన దేవాదాయశాఖ అధికారులు మూడు రోజులు కాళేశ్వరంలో ఆధ్యాత్మిక సందడి -
ట్రాఫిక్ సీఐ సీతారెడ్డిపై కేసు నమోదు
వరంగల్ లీగల్: న్యాయవాదుల పోరాటానికి ఫలి తంగా ఎట్టకేలకు హనుమకొండ ట్రాఫిక్ సీఐ సీతా రెడ్డిపై హనుమకొండ పీఎస్‌లో కేసు నమోదు అ య్యింది. ఇటీవల కేయూ కూడలిలో న్యాయవాది శివపై చెయ్యి చేసుకున్న విషయం తెలిసిందే. ఈఘటనపై న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసనలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యా ప్తంగా పోరాటాలు చేస్తామని అన్ని జిల్లాల్లోని న్యా యవాద సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈవిషయాలతో ఇరు వర్గాల మధ్య రాజీ కుదుర్చాలని ప్రయత్నాలు చేసినా న్యాయవాదులు అంగీకరించలేదు. దీంతో బుధవారం రాత్రి సీఐతో పాటు మరి కొంత మంది పోలీసులపై దాడి, బెదిరించిన నేరాల కింద కేసు నమోదు చేశారు. అయినా న్యా యవాదులు విధుల బహిష్కరించారు. సదరు సీఐ ని సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. వరంగల్, హ నుమకొండ జిల్లాల న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో సీఐని సస్పెండ్ చేయడంతో పాటు భవిష్యత్‌లో ఏ ఒక్క న్యాయవాదిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో సంఘాల అధ్యక్షులు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, బడే రమేశ్, ముదసిర్ అహ్మద్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
డిమాండ్ల సాధనకు అవసరమైతే మెరుపు సమ్మె
హన్మకొండ: డిమాండ్ల సాధనకు అవసరమైతే మెరుపు సమ్మె చేపడుతామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కిశోర్ రావు, క న్వీనర్ వజీర్ అన్నారు. విద్యుత్ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ చేపట్టిన యాత్ర గురువారం హనుమకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా హనుమమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ జీవితమంతా విద్యుత్ సంస్థలకు సేవ చేయడంలోనే గడిచిపోతోందని, అయినా తమకు కల్పించాల్సిన హక్కులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్హతను బట్టి ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ వరంగల్ జిల్లా కన్వీనర్ కందికొండ వెంకటేశ్వర్లు, నాయకులు బండారి ఐలయ్య, వెన్నమల్ల నరేందర్ సదానందం, చంద్రారెడ్డి, రఘునాథ రెడ్డి, ఓదెలు, కోటి, సురేశ్ రెడ్డి, శ్రీనాథ్, రాజేందర్, జయచందర్ శ్రీకాంత్ సృజన, కల్యాణి, ఇందిర, తదితరులు పాల్గొన్నారు. -
సీయూఈటీ ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
విద్యారణ్యపురి: కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్ష ద్వారా దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు, మరికొన్ని స్టేట్ యూనివర్సిటీల్లోనూ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చని నిట్ వరంగల్ ప్రొఫెసర్ కాశీనాఽథ్ తెలిపారు. గురువారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంఽధించి ప్రధానంగా సీయూఈటీ పరీక్ష విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేడీసీ కెమిస్ట్రీ విభాగం అధిపతి వాసం శ్రీనివాస్ మాట్లాడుతూ సీయూఈటీ, పీజీసెట్ కోసం కేడీసీలోని కెమిస్ట్రీ విభాగంలో త్వరలోనే 40 రోజులు ఉచిత కోచింగ్ ఇవ్వబో తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనాఽథ్, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్యాంప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ విజయలక్ష్మి, ఎడమ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్సంధ్యారాణి, డాక్టర్ వీరన్న, డాక్టర్ ప్రసూన పాల్గొన్నారు. -
ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ: నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల్లోపు పిల్ల లు 2,36,488 మంది ఉన్నారని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో భోజనం అనంతరం వారికి మాత్రలు వేయాలని పేర్కొన్నారు. ఒకవేళ ఆ రోజు ఏదైనా కారణాలతో ఇవ్వలేకపోతే ఈ నెల 17న మాత్రలు ఇప్పించాలని సూచించారు. డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య, జెడ్పీ సీఈఓ విద్యాలత, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాంరెడ్డి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, మెప్మా డీఎంసీ రజితారాణి పాల్గొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే భూములకు పరిహారం చెల్లింపు గ్రీన్‌ఫీల్డ్ హైవే భూములకు పరిహారం చెల్లించనున్నట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు, పరకాల, దామెర, శాయంపేట మండలాల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లింపు, క్షేత్రస్థాయి పరిస్థితులను తహసీల్దార్లు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలన్నారు. సమస్యలు తలెత్తకుండా, సంబంధిత రైతులతో తహసీల్దార్లు మాట్లాడి పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, నేషనల్ హైవే అధికారులు, తహసీల్దార్లు జగన్మోహన్రెడ్డి, జ్యోతి, వరలక్ష్మీదేవి, విజయలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
పోలీస్ సైరన్ సైలెంట్!
వరంగల్ క్రైం: హత్యలు, చైన్‌స్నాచింగ్‌లతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హనుమకొండ సబ్ డివిజన్ సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీఐజీ కార్యాలయానికి కూత వేటు దూరంలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ హత్య జరి గింది. హనుమకొండ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో కూరగాయలకు వెళ్లి వస్తుండగా ఓ మహి ళ మెడలో నుంచి దొంగలు చైన్‌స్నాచింగ్‌కు పాల్ప డ్డారు. దొంగలు, అక్రమార్కులకు పోలీసులు అంటే భయం లేకుండా పోతోంది. పట్టపగలు హత్యలు, దొంగతనాలను కట్టడి చేయకుండా పోలీసులు ఏం చేస్తున్నారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం పోలీసింగ్ ఫర్ఫెక్ట్గా ఉంది.. బ్లూకోల్ట్స్ సిబ్బంది నిత్యం ప్రజల మధ్య విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు.. గల్లీల్లో పెట్రోలింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దొంగలు రెచ్చిపోయి పట్టపగలే దర్జాగా చోరీలకు పాల్ప డుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. జనవరి నుంచి ఐదు చైన్‌స్నాచింగ్‌లు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నగరంలో జనవరి నుంచి దొంగలు ఐదు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2 చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. పట్టపగలే చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దొంగలు ఒక పక్క పోలీసులకు సవాల్ విసురుతూ మరో పక్క ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. నగరంలో మహిళలు ఒంటరిగా రోడ్లపైకి వెళ్లడానికి జంకుతున్నారు. కంటిమీద కునుకు కరువు.. కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న హత్యలు, దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాలా మంది పోలీసు అధికారులు మాత్రం భూముల పంచాయితీలు చేసి అక్రమంగా లక్షల రూపాయలు పోగుచేసుకుంటున్నారని ఆరో పణలు వస్తున్నాయి. కొన్ని పోలీస్స్టేషన్లలో భూపంచాయితీలకు తప్ప మరే సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లో రెండు హత్యలు జరిగాయి. ఒకటి వెస్ట్‌జోన్, మరొకటి సెంట్రల్ జోన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. నెల రోజుల్లో పగటి పూట 7, రాత్రి పూట 21 దొంగతనాలు జరిగాయి. దీనిని బట్టి పోలీసుల పెట్రోలింగ్, అధికారుల పర్యవేక్షణ తీరు ఎలా ఉందో అర్థం అవుతోంది. హత్యలు, దొంగతనాలు వరుసగా జరుగుతున్నా ఉన్నతాధికారులకు పట్టింపు లేకపోవడం గమనార్హం. వరుస పరిణామాలను గమనిస్తే పోలీస్ సైరన్ సైలెంట్ అయ్యిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా దొరికి విద్యార్థులు మత్తుకు బానిసవుతున్నా పోలీసుల చర్యలు అంతంత మాత్రమే ఉండడం గమనార్హం. పోలీస్ శాఖను గాడిలో పెట్టాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం కమిషనరేట్ ప్రజలకు శాపంగా మారింది. కమిషనరేట్ పరిధిలో పట్టుతప్పుతున్న పాలన నగరంలో వరుస చైన్‌స్నాచింగ్‌లు.. పట్టపగలే హత్యలు పోలీస్స్టేషన్లలో భూముల పంచాయితీలకే మొదటి ప్రాధాన్యం సాయంత్రం ఉండని అధికారులు.. ప్రజలకు తప్పని ఇబ్బందులు కొలువు ఎక్కడైనా.. ఉండేది హనుమకొండలోనే! కమిషనరేట్‌లోని మూడు డివిజన్ల పరిధిలో కొలువు ఎక్కడ చేసినా పోలీసు అధికారులు నివాసం ఉండేది మాత్రం హనుమకొండలోనే. గ్రామీణ ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో సాయంత్రం ఆరు గంటలు దాటితే ఎస్హెచ్ఓలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు స్థానికంగా ఉండడం లేదు. ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఉండకపోవడంతో అదేబాటలో సబ్ ఇన్స్పెక్టర్లు, కిందిస్థాయి సిబ్బంది అప్ అండ్ డౌన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారులు ఎవరు కూడా ఉండకపోవడంతో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రాత్రి పూట జరిగే సంఘటనలతో పోలీస్ స్టేషన్లకు వెళ్లినా లాభం లేకుండా పోతోంది. ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో పరిపాలన పట్టుతప్పుతోంది. ఫలితంగా పోలీసులంటే అక్రమార్కులు, దొంగలకు భయం పోయింది. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుని పెట్రోలింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. -
బుచ్చమ్మకు అండగా యంత్రాంగం
వరంగల్: వృద్ధురాలు బుచ్చమ్మకు అధికార యంత్రాగం అండగా నిలిచింది. ‘ఆఖరి మజిలీలో ఆకలి కేకలు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పందించారు. ఆమెకు న్యాయం చేయాలని డీడబ్ల్యూఓ బి.రాజమణిని ఆదేశించారు. వెంటనే డీడబ్ల్యూఓ, వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ అనిరుధ్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, డీటీ దినకర్ రామన్నపేటలోని వృద్ధురాలి చిన్నకొడుకు సోమేశ్వర్, కోడలు సరిత ఇంటికి వెళ్లారు. కాశిబుగ్గలో రోడ్డుపై ఉన్న బుచ్చమ్మ అప్పటికే స్థానికుల సాయంతో ఆటోలో వారి ఇంటికి వెళ్లింది. అధి కారులు ఆమెతో మాట్లాడారు. లార్డ్ ఓల్డ్ఏజ్ హోంకు తీసుకెళ్లాలని తాము భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆమె పోషణ చూసుకుంటామని చిన్న కొడుకు, చిన్న కోడలు చెప్పారు. పెద్ద కొడుకుని కూడా పిలిచి మాట్లాడి బాధ్యత తీసుకోవాలని చెప్పాలని అధికారులను కోరారు. ఇద్దరు కొడుకులు, కూతురిని పిలిపించి మాట్లాడేంత వరకు పోషణ బాధ్యత మాదే అని, లేనిచో చట్టపరమైన చర్యలకు బాధ్యులమని చిన్నకొడుకు, చిన్న కోడలు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చినట్లు అనిరుధ్ తెలిపారు. బుచ్చమ్మను పర్యవేక్షించాలని అంగన్వాడీ సిబ్బందిని డీడబ్ల్యూఓ ఆదేశించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన డీడబ్ల్యూఓ, అధికారులు బాధ్యత తీసుకుంటామని చిన్నకొడుకు, చిన్న కోడలు లిఖితపూర్వక హామీ ‘సాక్షి’ కథనానికి స్పందన -
బడుగు, బలహీన వర్గాలకు నవశకం
హన్మకొండ చౌరస్తా: బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నవశకాన్ని ప్రారంభించిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. బీసీ కులగణనకు చట్టబద్ధత, ఎస్సీ వర్గీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని డీసీసీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హాజరై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయిని మాట్లాడుతూ ఫిబ్రవరి 4 రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని సువర్ణ దినమని, కాంగ్రెస్ తప్పితే ఇంకెవరు కూడా సామాజిక న్యాయం చేయలేరని స్పష్టం చేశారు. డీసీసీ వరంగల్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, ఆర్టీఏ సభ్యుడు పల్లకొండ సతీశ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరళ, నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
గురువారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సర్వసతి (అంతర్వాహిని)త్రివేణి సంగమం2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని గోదావరి తీరంలో ప్రధాన స్నానఘట్టాలకు దూరంగా వీఐపీ ఘాట్ నిర్మించారు. ఈ పదేళ్లలో ఇక్కడ ఈ ఘాట్ తప్ప మరో సౌకర్యం లేదు. సరస్వతి పుష్కరాల సందర్భంగా వీఐపీ ఘాట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. ● ప్రస్తుతం ఉన్న స్నానఘట్టాల పక్కన కొత్తగా 150 మీటర్ల పొడవుతో కొత్త స్నానఘట్టాలు నిర్మించనున్నారు. ● ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన టాయిలెట్స్, వాష్‌రూమ్స్ అందుబాటులోకి తేనున్నారు. దీంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్స్ నిర్మించనున్నారు. ● వీఐపీల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్లాట్, ఆ వాహనాలు సులువుగా రాకపోకలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న సీసీ రోడ్డు విస్తరణ, మట్టి రోడ్డు స్థానంలో కొత్తగా రోడ్డు నిర్మించనున్నారు. ● ఇక్కడే బస చేయాలనుకునే వారి కోసం టెంట్‌సిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ● అద్దె ప్రాతిపదికన గుడారాలు బుక్ చేసుకుని త్రివేణి సంగమ ప్రదేశం దగ్గర భక్తులు బస చేయవచ్చు. ● ముఖ్యంగా వెదురు గుడారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.పశ్చిమ ఘాట్సరస్వతి నది పుష్కరాలను పురస్కరించుకుని ముక్కంటి కొలువైన కాళేశ్వరం సరికొత్తగా ముస్తాబు కానుంది. మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించింది. వీటితో ఏయే పనులు చేయాలో జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. దేవాదాయ ధర్మాదాయశాఖ ద్వారా నిర్దేశించి, కలెక్టర్ రాహుల్‌శర్మ నియమించిన కన్సల్టింగ్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ జీఎస్వీ సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలోని ‘క్షేత్ర’సంస్థ మాస్టర్‌ప్లాన్ తయారుచేసింది. పుష్కరాల ఏర్పాట్లపై ‘సాక్షి’ ముందస్తుగా అందిస్తున్న ప్రత్యేక కథనం.. – భూపాలపల్లి గోదావరి నదినదిలోనుంచి నిర్మించే రోడ్డుటెంట్ సిటీతూర్పు ఘాట్పశ్చిమ ఘాట్‌కు వెళ్లే దారికాళేశ్వరం ఆలయంట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల పార్కింగ్ కోసం మూడు స్థలాలను ఎంపిక చేశారు. కాటారం–మహదేవపూర్ నుంచి వచ్చే భక్తుల కోసం కాళేశ్వరం దగ్గరలోని ఇప్పలబోరు సమీపంలో 3.29 ఎకరాలు, ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో 5.07 ఎకరాలు, మహారాష్ట్రలోని సిరొంచ నుంచి వచ్చే వాహనాలకు కన్నెపల్లి సమీపంలో 2.12 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయనున్నారు. తూర్పు ఘాట్‌కు వెళ్లే దారికాటారం టు కాళేశ్వరం దారి..గుండం చెరువుపార్కింగ్హిందూ పురాణాల్లో సరస్వతి నదిని అంతర్వాహినిగా పేర్కొంటారు. ఉత్తరాది ప్రజలు ప్రయాగ్‌రాజ్ దగ్గర గంగ, యమునా నదులు కలిసే చోట సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని నమ్ముతారు. మన దగ్గర దక్షిణ గంగగా పేర్కొనే గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానమైన కాళేశ్వరంలో సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని భక్తుల నమ్మకం. స్థల పురాణం ప్రకారం కాళేశ్వరం ఆలయంలో శివుడికి అభిషేకం చేసిన జలం ప్రత్యేక మార్గం గుండా ప్రవహించి ప్రాణహిత–గోదావరి సంగమ ప్రదేశం దగ్గర కలుస్తుందని, ఈ ప్రవాహం అంతర్వాహినిగా ఉండటం వల్ల సరస్వతి నదిగా పేర్కొంటారు. దీంతో దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు కాళేశ్వరానికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పోలీస్ కమిషనర్ ఆఫీస్హరిత హోటల్భక్తులకు తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.విశ్రాంతి తీసుకోవడానికి, పిండాలు సమర్పించడానికి వీలుగా స్నానఘట్టాల దిగువన వెదురుతో చలువ పందిళ్లు, ప్రధాన ఆలయం నుంచి స్నానఘట్టాల వరకు ఉన్న రోడ్డును రద్దీకి తగ్గట్టుగా విస్తరించనున్నారు. కాళేశ్వరంలో చూడదగిన ప్రదేశాలు ఏమిటి, ఎలా వెళ్లాలి అనే వివరాలు తెలిపేలా ప్రధాన కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మహదేవపూర్ టు కాళేశ్వరం దారిన్యూస్రీల్150 మీటర్ల మేర కొత్తగా స్నానఘట్టాలు..త్రివేణి సంగమం వరకు ప్రత్యేక దారి.. పుష్కరాలను పురస్కరించుకుని మూడు నదులు కలిసే సంగమ ప్రదేశం దగ్గర భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం ప్రధాన ఘాట్‌తోపాటు వీఐపీ ఘాట్ నుంచి త్రివేణి సంగమం వరకు భక్తులు చేరుకునేలా ఇసుక బస్తాలతో 30 మీటర్ల వెడల్పుతో ప్రత్యేక దారిని, ఆ దారిపై పందిరిని ఏర్పాటు చేయనున్నారు. ఈ దారులకు ఇరువైపులా భక్తులు స్నానాలు చేయొచ్చు. లేదంటే సంగమం వరకు చేరుకుని స్నానాలు చేసేవిధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఎక్కువ లోతు ఉన్న ప్రదేశాలకు భక్తులు వెళ్లకుండా బారికేడ్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. షిఫ్ట్‌నకు 12 మంది తగ్గకుండా మొత్తం 25 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. సకల సౌకర్యాలు -
వరంగల్ మీదుగా కుంభమేళాకు రైళ్లు
కాజీపేట రూరల్: వరంగల్ మీదుగా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 8, 16వ తేదీల్లో మచిలీపట్నం–దానాపూర్ (07113) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్‌కు 23:55 గంటలకు, అదేవిధంగా ఫిబ్రవరి 10, 18వ తేదీల్లో దానాపూర్–మచిలీపట్నం (07114) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు 3:00 గంటలకు వరంగల్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు అప్‌అండ్‌డౌన్ రూట్లో గుడివాడ, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపరియా, జబల్పూర్, కట్నీ, సంత, మణిక్పూర్, ప్రయాగ్‌రాజ్, చోకి, మిర్జాపూర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, ఆరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆర్చరీ పోటీల్లో హసీబాకు కాంస్య పతకంవరంగల్ స్పోర్ట్స్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరుగుతున్న 38వ జాతీయస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఆర్చరీ పోటీల్లో వరంగల్ ఆరెపల్లికి చెందిన మన్సురా హసీబా కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. చికిత, మానస, నయన, శ్రేష్టరెడ్డి, హసీబాతో కూడిన తెలంగాణ జట్టు ఢిల్లీతో పోటీపడి 228–231 తేడాతో గెలుపొందింది. వరంగల్‌లోని పద్మావతి కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మన్సురా హసీబా ప్రస్తుతం దేశాయిపేటలోని ఏవీఆర్ ఆర్చరీ అకాడమీలో కోచ్ ఆకుల రాజు వద్ద శిక్షణ పొందుతోంది. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం కాజీపేట అర్బన్ : ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీవీ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీలోపు www. tgbcstudycircle.cgg.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 0870–2571192 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఆరోగ్య కేంద్రం పనులు పూర్తిచేయాలిఎంజీఎం: ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. హసన్‌పర్తి మండలం నాగారంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం పనులు, సిద్ధాపూర్ అంగన్వాడీ సెంటర్లలో వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీ లించారు. డాక్టర్ సన్నీ, డాక్టర్ సుష్మిత, మెడికల్ ఆఫీసర్ భార్గవ్, విజయరెడ్డి, ఫిజియోథెరపిస్టులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. శభాష్ కానిస్టేబుల్ అలీ వరంగల్ క్రైం: ఇతర రాష్ట్రాల్లో చోరీలకు పాల్ప డుతున్న ముఠాల సమాచారాన్ని అందిస్తూ నిందితులను పట్టుకోవడంలో అధికారులకు సహకరిస్తున్న క్రైం విభాగం కానిస్టేబుల్ మీర్ మహ్మద్ అలీని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. ఇటీవల మీర్ మహ్మద్ అలీకి తిరువనంతపురం, కొచ్చి, వికారాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంస పత్రాలు పంపించారు. ఆ పత్రాలను సీపీ అంబర్ కిషోర్ ఝా బుధవారం కమిషనరేట్‌లో అలీకి అందజేశారు. మీర్ మహ్మద్‌అలీ జాతీ యస్థాయి క్రైం విభాగానికి అనుబంధంగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడు. నేర పరిశోధనకు అవసరమైన సలహాలు అందిస్తున్నాడు. ఇటీవల కొచ్చి ప్రాంతంలో దృష్టి మరల్చి బంగారు షాపుల్లో దొంగతనం చేసేవారి మహారాష్ట్ర మహిళా ముఠాగా గుర్తించి కొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తిరువనంతపురం, వికారాబాద్‌లో జరిగిన దొంగతనాల్లో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
ఈసారి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు కాళేశ్వరం గోదావరిలో త్రివేణి సంగమం
● అంతర్వాహినిగా కలిసే సరస్వతి నది ● మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు ● వీఐపీ ఘాట్ దగ్గర శాశ్వత ప్రాతిపదికన పనులు ● ఈసారి ప్రత్యేక ఆకర్షణగా జాయ్‌రైడ్, టెంట్‌సిటీ, కల్చరల్ ఫెస్టివల్స్ ● క్షేత్ర సంస్థ ఆధ్వర్యంలో సిద్ధమైన మాస్టర్‌ప్లాన్ పార్కింగ్హెలిపాడ్సిరొంచ టు కాళేశ్వరం దారి.. -
బడ్జెట్‌కు రూపకల్పన చేయాలి
గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్: సమగ్ర సమాచారంతో బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆయా విభాగాలు వాస్తవ సమాచారం అందజేసి బడ్జెట్ రూపకల్పనకు సహకరించాలని, ఆదాయ వ్యయ అంచనాలతో రూపొందించాలని సూచించారు. అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు అన్ని విభాగాల నుంచి సమాచారాన్ని సేకరించాలని పేర్కొన్నారు. ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహణకు అనుమతి కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాయాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున బడ్జెట్ సమావేశం నిర్వహణకు ఈసీ అనుమతికి లేఖ రాయాలని పేర్కొన్నారు. అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్నరాణి, రాజేశ్వర్, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి ఎంహెచ్ఓ రాజేశ్ పాల్గొన్నారు. ఈసేవ కేంద్రం తనిఖీ కాశిబుగ్గ సర్కిల్‌కు చెందిన పోచమ్మమైదాన్‌లోని ఈసేవ కేంద్రాన్ని గ్రేటర్ కమిషనర్ తనిఖీ చేశారు. -
దళిత బంధు నిధులు విడుదల చేయాలి
హన్మకొండ: పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలలోపు రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్, రా ష్ట్ర కన్వీనర్ చిట్టిమల్ల సమ్మయ్య, రాష్ట్ర కోఆర్డినేటర్ మడికొండ రమేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వా రు మాట్లాడారు. రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికై న వారికి కేటాయించిన నిధులు జిల్లా కలెక్టర్ల అకౌంట్లో ఉన్నాయని, ఈ ని ధులు వెంటనే విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయ కులు దర్శనాల సంజీవ, డివిటి బాలనర్సు, కొలు గూరి సురేశ్, ఊట్ల శ్రీనివాస్, పులి రామయ్య, రమే శ్, ఎనగందుల మొగిలి, ఆకాశ్, భిక్షపతి, శంకర్, సైదులు, లక్ష్మయ్య, రాజు, సుమన్ పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం సులువు
● మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల వరంగల్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ డం వల్ల వ్యవసాయంలో సులువుగా పనులు చే యొచ్చని వరంగల్ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.నిర్మల అన్నారు. మార్కెట్లోని మన అగ్రిటెక్‌లో మంగళవారం డ్రోన్ స్ప్రేయర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ.. సాంకేతిక పరిజ్ఞానంతో మానవ లోకం ఎంతో ముందడుగు వేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించిన ప్రముఖ దక్ష కంపెనీ రూపొందించిన డ్రోన్ స్ప్రేయర్లను రైతులకు మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేశ్ అందుబాటులోకి తేవ డం అభినందనీయమన్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు డ్రోన్ వినియోగంపై రైతులకు అవగా హన కల్పించారు. మన అగ్రిటెక్ ఎండీ రమేశ్ మా ట్లాడుతూ.. డ్రోన్ 10 లీటర్ల నీటి సామర్థ్యంతో ఎకరా కేవలం 5–7నిమిషాల వ్యవధితో పిచికారీ చే స్తుందని, ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే 3ఎకరాల వర కు పనిచేస్తుందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెంకట్రావు, నూతనకల్ పీఏసీఎస్ చెర్మన్ జ యసుధ, అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
ప్రేమపేరుతో బాలికపై లైంగికదాడి
ఖిలా వరంగల్: బాలికను ప్రేమపేరుతో ఓ యువకుడు లైంగికంగా లోబర్చుకున్నాడు. చివరికి ఆమె గర్భవతి కావడంతో విషయం వె లుగులోకి వచ్చింది. ఈ ఘటన మంగళవారం వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకా రం.. వరంగల్ రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన బాలిక (16) ఇంటర్మీడియట్ చదువుతోంది. కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆదిల్ (20), బాలిక మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త రెండేళ్లుగా ప్రేమగా మారింది. కొద్ది నెలలుగా ప్రేమ, పెళ్లి పేరుతో ఆ బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్ప డ్డాడు. దీంతో బాలికకు అనారోగ్య సమస్యలు తల్తెత్తడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా గర్భవతి అని తేలింది. ఈవిషయంపై తల్లిదండ్రులు బాలికను నిలదీయడంతో విషయం చెప్పింది. మంగళవారం మిల్స్‌కాలనీ పీఎస్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించగా గర్భవతని తెలిసింది. ప్రేమ, పెళ్లి పేరుతో లైంగికదాడికి పాల్పడి బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. పోలీసుల అదుపులో యువకుడు.. ప్రేమ,పెళ్లి పేరుతో బాలికకు లైంగికంగా దగ్గరై గర్భవతిని చేసిన యువకుడిని మంగళవారం సాయంత్రమే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ● గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి.. ● తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు -
జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
భక్తులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి మేడారం మినీ జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీని బట్టి హనుమకొండ నుంచి రోజూ 24 గంటల పాటు ప్రత్యేక బస్సులు నడుపుతాం. భక్తులను క్షేమంగా చేరవేయడమే లక్ష్యం. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఆర్థికంగా నష్టపోవద్దు. ప్రమాదాలకు గురి కావొద్దు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించి వనదేవతలను దర్శించుకోవాలి. వివరాలకు ఆర్టీసీ హనుమకొండ బస్ స్టేషన్ ఎంక్వైరీ 9959226056 నంబర్లో సంప్రదించాలి. – డి.విజయ భాను, ఆర్టీసీ ఆర్ఎం, వరంగల్ హన్మకొండ/ఎస్ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జరగనున్న మినీ జాతరకు టీజీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు అధికారులు ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బస్సులు నడపనున్నారు. ఎనిమిది రోజులు.. 200 బస్సులు.. 400 ట్రిప్పులు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులు పంపేందుకు సమాయత్తమయ్యారు. ఈ నెల 9 నుంచి ఉదయం 6 గంటల నుంచి హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి మేడారానికి బస్సులు నడపనున్నారు. 9న 15 బస్సులు, 10న 10, 11న 10, 12న 20, 13న 25, 14న 50, 15న 20, 16న 50 బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వీటితో పాటు అవసరమైతే అదనపు బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం అమలు చేయనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హనుమకొండ, మేడారం బస్ స్టేషన్లలో రోజూ డిపో మేనేజర్‌తో పాటు ఇద్దరు కంట్రోలర్లు ప్రత్యేక బస్సుల ఆపరేషన్ పర్యవేక్షిస్తారు. ఎనిమిది రోజులు.. 200 బస్సులు.. 400 ట్రిప్పులు ఈ నెల 9 నుంచి 16 వరకు.. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం -
పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి
● కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రతాప్‌రెడ్డి కేయూ క్యాంపస్: అధ్యాపకులు పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ.. అకడమిక్ పరంగా ముందుకెళ్లాలని కాకతీయ యూ నివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి సూచించారు. కేయూ సెనెట్హాల్లో మంగళవారం అన్నివిభాగాలు, యూనివర్సిటీ కళాశాలల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల, ప్రొఫెసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎస్ఎఫ్సీ కోర్సులను రెగ్యులర్‌గా మార్చేలా ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. కే హబ్‌లోని పరిశోధన కేంద్రాలకు రూ.15 కోట్లు మంజూరైన నేపథ్యంలో పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నా రు. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.31 కోట్ల బడ్జెట్ ఉత్తర్వులు వచ్చాయన్నారు. అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు పీఆర్సీ ఏరియర్స్‌ను మార్చి వరకు బకాయిలు లేకుండా చెల్లిస్తామన్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడారు. లెర్నింగ్ నిరంతర ప్రక్రియ.. లెర్నింగ్ నిరంతర ప్రక్రియ అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. రెండు వారాలుగా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్సెల్ టూ పవర్ బీఐఫర్ ఎన్సీసీ జవాన్ల శిక్షణ కార్యక్రమం మంగళవారం కంప్యూటర్ సైన్స్ విభాగంలో ముగిసింది. ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శిక్షణ పొందిన జవాన్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ రామచంద్రం, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి రమ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ మంజుల, డాక్టర్ రమేశ్, నీలిమ, సలోని ఫాతిమా, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ సురేశ్‌లాల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పృథ్వీరాజ్, ఎన్సీసీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ రవిసునారే, తదితరులు పాల్గొన్నారు. -
గడ్డి విత్తనాల ఉత్పత్తిపై అవగాహన
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూరు డెయిరీ ప్రాంగణంలో గడ్డి విత్తనాల ఉత్పత్తిపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో న్యూఢిల్లీ వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ జట్, డాక్టర్ భూపేంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గడ్డి విత్తనాల పెంపకం, ఉత్పత్తి, క్షేత్రప్రదేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన గడ్డి ఉత్పత్తిలో అధిక పోషకాలు లభిస్తాయన్నారు. దీని ద్వారా గేదెల్లో పాల ఉత్పత్తి అధికంగా పెరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో డెయిరీ జనరల్ మేనేజర్ మారుపాటి భాస్కర్‌రెడ్డి, సునీల్‌కుమార్, కీర్తి, వినోద్, దీప, తదితర రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యారంగానికి తక్కువ నిధులు
● ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతికేయూ క్యాంపస్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటా యించారని, మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేదని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కళాశాలలోని ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన చర్చలో ఆమె ముఖ్య అతిథిగా పా ల్గొని మాట్లాడారు. వేతన జీవులకు సంవత్సరానికి రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం ఊరటనిచ్చే అంశమని తెలిపారు. ఎకనామిక్స్ విభాగం ఇన్చార్జ్ అధిపతి డాక్టర్ శ్రీధర్‌కుమార్‌లోథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్‌తో సామాన్యులు ఏమీ లాభంలేదని తెలిపారు. ఉద్యోగ రంగాలకు కేటాయింపులు లేవన్నారు. బీసీ జాక్ చైర్మన్ డాక్టర్ తిరునహరిశేషు మా ట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ రమేశ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మినీ జాతరకు వేళాయె..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర(మండమెలిగె పండుగ)కు వేళయింది. నేటి( బుధవారం) నుంచి పూజ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమ్మక్క పూజారులు ఉదయం సమ్మక్క గుడికి చేరుకుని అమ్మవారి వస్త్రాలు, పూజ సామగ్రిని శుద్ధి చేస్తారు. గుడిని శుద్ధి చేసిన తర్వాత సిద్ధబోయిన ముణిందర్ ఇంటి నుంచి పూజారులు, ఆడపడుచులు డోలివాయిద్యాలతో పసుపు, కుంకుమ తీసుకుని సమ్మక్క గుడికి వెళ్తారు. గుడిలో అప్పటికే పూజారి కొక్కెర కృష్ణయ్య అలికి సిద్ధంగా ఉంచిన అమ్మవారి శక్తిపీఠంపై ఆడపడుచులు ముగ్గులు వేసి అలంకరిస్తారు. అనంతరం అడవి నుంచి తీసుకొచ్చిన ఎట్టిగడ్డిని సమ్మక్క గుడి భవనం ఈశాన్యం మూలన పెడతారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో.. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని సారలమ్మ పూజారులు, ఆడపడుచులు కలిసి శుద్ధి చేస్తారు. అమ్మవారి గుడిలో, ఆవరణలో ముగ్గులు వేస్తారు. సారలమ్మ వస్త్రాలు, పూజ సామగ్రిని ప్రధాన పూజారి సారయ్య శుద్ధి చేస్తారు. సారలమ్మ వడ్డె కుండలను పసుపు, కుంకుమతో ఆడపడుచులు అలంకరిస్తారు. అనంతరం గుడిలో పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. మండమెలిగె పండుగకు వారానికి ముందు గుడిమెలిగె పండుగను నిర్వహిస్తారు. ఈనెల 12వ తేదీన (బుధవారం) మేడారం, కన్నెపల్లిలో మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. గుడిమెలిగె పండుగతో పూజ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. జాతరకు ఏర్పాట్లు సిద్ధం.. మినీ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అధికారురులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. జాతరలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క.. అధికారులను ఇప్పటికే పలుమార్లు ఆదేశించారు. దీంతో కలెక్టర్ దివాకరటీఎస్ జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించారు. జాతర సమీపిస్తుడడంతో అధికారులు మిగిలిన పనులన్నీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే, ఎస్పీ శబరీశ్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్‌శాఖ పకడ్బందీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. నేడు మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో గుడి మెలిగె పండుగ వనదేవతల జాతరకు ఏర్పాట్లు సిద్ధం -
క్యాన్సర్.. పదం మాత్రమే
● చికిత్సతో నయం చేయొచ్చు ● ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి ● నేను క్యాన్సర్‌ను ఓడించా.. సినీ నటి గౌతమినయీంనగర్: క్యాన్సర్.. ఒక పదం మాత్రమేనని, చికిత్స ద్వారా నయం చేయొచ్చని సినీ నటి, క్యాన్సర్ విజేత గౌతమి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రతిమ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రం వరకు రెండు వేల మంది విద్యార్థులతో క్యాన్సర్ వాకథాన్ నిర్వహించారు. ఇందులో సినీ నటి, క్యాన్సర్ విజేత గౌతమి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, డాక్టర్ హరిణి పాల్గొన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో నటి గౌతమి మాట్లాడతూ.. క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించానన్నారు. తనలాగే క్యాన్సర్ బాధితులు విజయం సాధించొన్నారు. క్యాన్సర్ అనే భయం వదిలేయాలని.. అది ఒక పదం మాత్రమే అన్నారు. ప్రభుత్వం క్యాన్సర్ బాధితులకు పౌష్టికాహారం అందించాలని కోరారు. వరంగల్ ఎంపీ కడియం డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే నయమవుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ క్యాన్సర్‌పై అవగాహన ఉండాలన్నారు. మద్య, ధూమపానం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి క్యాన్సర్ రాకుండా చూసుకోవాలన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్ డాక్టర్ హరిణి మాట్లాడుతూ క్యాన్సర్ ఇకపై మరణశిక్ష కాదని, ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స చేయడంతో ప్రాణాలను కాపాడొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ రమేశ్, డైరెక్టర్లు డాక్టర్.ప్రతీక్, డాక్టర్.రాహుల్, డాక్టర్.అవినాష్, తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లో మౌలిక వసతులేవి?
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్.. ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఇక్కడికి రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ పంట సరుకుల విక్రయానికి వస్తారు. తమ పంట ఉత్పత్తుల విక్రయాలకు రైతులు.. కొనుగోలు చేసేందుకు వందలాది మంది వ్యాపారులు.. కాంటాలు వేసేందుకు దడవాయిలు, హమాలీలు, కార్మికులు.. ఇలా మొత్తం సుమారు రెండు వేల నుంచి ఐదు వేల మంది వరకు నిత్యం మార్కెట్‌కు వస్తుంటారు. ఈ క్రమంలో ఇంతటి ప్రాధాన్యం కలిగిన మార్కెట్లో మౌలిక వసతులు లేవంటూ మంగళవారం అడ్తి వ్యాపారులు, ఖరీదుదారులు మార్కెట్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ ధర్నాతో కాంటాలు నిలిచిపోయాయి. దీంతో మిర్చి కొనుగోళ్లు నిలిచాయి. సోమవారం అడ్తివ్యాపారి కడారి సదానందం మార్కెట్లోని ఓ హోటల్ వద్ద టీ తాగుతూ గుండెపోటుతో మృతి చెందాడు. అతడి మృతికి సంతాపం వ్యక్తం చేసిన అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ యార్డులలో క్లీనింగ్ లేకపోవడం, రవాణా వాహనాలు, మిర్చి ఘాటుతో గుమస్తాలు, దడువాయిలు, రైతులు, హమాలీ కార్మికులు, వ్యాపారులు అనారోగ్యంతో చనిపోతున్నారన్నారు. అత్యవసర సమయాల్లో బాధితులకు చికిత్స చేయడానికి 24 గంటలు మార్కెట్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్నారు. అలాగే, మార్కెట్లో వైఫై లేక పీఓఎస్ యంత్రాలు సరిగా పనిచేయడంలేదన్నా రు. ఫలితంగా కాంటాలు ఆలస్యం కావడం, చోరీ లు చోటు చేసుకుంటున్నాయన్నారు. దీంతో మార్కెట్లో మౌలిక సదుపాయాలు సమకూర్చాలని అఽధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు లిఖితపూర్వకంగా విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల ఘటనాస్థలికి చేరుకుని మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన అనంతరం మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం కాంటాలు జరగడంతో యథావిధిగా మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. కార్యక్రమంలో చాంబర్ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మడూరి వేదప్రకాశ్, సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్, కోశాధికారి అల్లే సంపత్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వసతుల కల్పనపై జేడీఎం సమీక్ష.. మార్కెట్లో మౌలిక వసతులపై వ్యాపారులు ధర్నా నిర్వహించడంతో మార్కెట్ పర్సన్ ఇన్చార్జ్, జేడీఎం శ్రీనివాస్ అధికారులతో సమావేశమయ్యారు. ఉన్నతాధికారుల అనుమతితో మార్కెట్లో వసతులు కల్పిస్తామని చాంబర్‌కు లేఖ రాసినట్లు తెలిపా రు. సమీక్షలో మార్కెట్ కార్యదర్శి పి.నిర్మల, ఏనుమాముల ఇన్స్పెక్టర్ రాఘవేందర్, గ్రేడ్ 2 కార్యదర్శులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.సౌకర్యాలు కల్పించాలిమార్కెట్లో ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాం. విశ్రాంతి భవనంలో వసతులు సమకూర్చాలి. మూత్రశాలలు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే, మార్కెట్లోని మెడికల్ సెంటర్లో వైద్య సౌకర్యాలు కల్పించాలి. –పసునూటి మల్లయ్య, రైతు, ఇల్లంతకుంట మండలం, కరీంనగర్ తాగునీటి సౌకర్యం మెరుగుపర్చాలిమార్కెట్లో యార్డు చుట్టూ నల్లాలు ఉన్నా నీళ్లు సరిగా రావడం లేదు. లోపలకు వెళ్తే ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తాగునీటి సౌకర్యం మెరుగుపర్చాలి. కార్మికులు అస్వస్థతకు గురైతే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి. అంబులెన్స్ ఉంటే వ్యాపారి బతికేవాడు. –అప్సర్ హమాలీ కార్మికుడు మార్కెట్లో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలినిత్యం వేలాది మంది రైతులు, వ్యాపారులు, కార్మికులు ఉండే మార్కెట్లో వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీ(బస్తీ దవాఖాన)ఏర్పాటు చేయాలి. గుండెపోటుకు గురైన వ్యాపారిని సకాలంలో 108లో ఆస్పత్రికి తరలిస్తే బతికేవాడు. –డి.కరుణాకర్, గుమస్తాల సంఘం నాయకుడు వైఫై, పీఓఎస్ మిషన్లు లేక ఇబ్బందులు మొక్కుబడిగా వైద్యసేవలు వసతులు కల్పించాలని అడ్తి వ్యాపారులు, ఖరీదుదారుల ధర్నా రెండు గంటల పాటు నిలిచిన కాంటాలు, క్రయ,విక్రయాలు అధికారుల హామీతో ధర్నా విరమణ.. కొనసాగిన మిర్చి కొనుగోళ్లుపీఓఎస్ మిషన్లు సమకూర్చాలిమార్కెట్లో 120 మంది దడవాయిలం ఉన్నాం. ప్రస్తుతం 40 పీఓఎస్ మిషన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 80 మిషన్లు వస్తున్నాయని రెండేళ్లుగా అంటున్నారే తప్పా రావడం లేదు. కార్యదర్శి 10 మిషన్లు వచ్చాయని చెప్పారు. వాటిలో యాప్ ఇన్స్టాల్ చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. –సోలరవి, దడవాయి యూనియన్ సెక్రటరీ -
పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు
కాజీపేట రూరల్: కాజీపేటకు చెందిన ముగ్గు రు పవర్‌లిఫ్టర్లు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ బెంచిప్రెస్ ఛాంపియన్షిప్–25 పోటీలో గోల్డ్‌మెడల్స్ సాధించారు. కాజీపేట కడిపికొండ రాంనగర్‌కు చెందిన ఎండి.జాఫర్ 59 కిలోల విభాగంలో ప్రథమ స్థానం, కాజీపేట సోమిడికి చెందిన దామెరుప్పుల మొగిళి 54 కిలోల విభాగంలో ప్రథమ స్థానం, కడిపికొండ రాంనగర్‌కు చెందిన కుక్కల ఉమాసాయి 105 కిలోల కేటగిరీలో ఐదో స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. వీరిలో పవర్ లిఫ్టర్ జాఫర్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. మే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొననున్నట్లు జాఫర్ తెలిపారు. కాగా.. ఈ ముగ్గురిని మంగళవారం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీస్‌స్టేషన్‌లో కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ,నేషనల్ ప్లేయర్ ఎం. సంజీవరావు సత్కరించారు. పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: ఈనెల 20 నుంచి పీజీ కోర్సు ల మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య తెలిపా రు. కేయూలోని పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సుల (రెగ్యులర్,ఎక్స్,ఇంప్రూవ్మెంట్) మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిట్ నూతన రిజిస్ట్రార్‌గా సుశీల్‌కుమార్ మెహతాకాజీపేట అర్బన్: నిట్ వరంగల్ నూత న రిజిస్ట్రార్‌గా సుశీల్‌కుమార్ మెహతా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్వీ.ఉమామహేశ్ నుంచి సుశీల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని మార్యదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నూతన రిజిస్ట్రార్‌ను ఆయన అభినందించారు. 7 నుంచి వరంగల్ జిల్లాస్థాయి యువజన క్రీడోత్సవాలు వరంగల్: ఓసిటీ క్రీడా మైదానంలో ఈనెల 7, 8 తేదీల్లో వరంగల్ జిల్లాస్థాయి యువజన క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్రం వరంగల్ జిల్లా అధికారి చింతల అన్వేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాలుకా స్థాయిలో నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన క్రీడాపోటీల విజేతలు క్రీడల్లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. 15 నుంచి 20 ఏళ్లలోపు వారికి వాలీబాల్, రన్నింగ్, షటిల్ సింగిల్స్, యువతులకు కబడ్డీ, షటిల్ సింగిల్స్, రన్నింగ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 99080 69469/95024 49469 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
కలెక్టర్ ఆదేశాల్ని ఖాతరు చేయని డీఈఓ?
కాళోజీ సెంటర్: వరంగల్ డీఈఓ కార్యాలయంలో ఫారన్ డిప్యుటేషన్‌పై విధులు కొనసాగిస్తున్న ఆర్.రాజగోపాల్‌రెడ్డి డిప్యుటేషన్ రద్దు చేసి వెంటనే విధులనుంచి విడుదల చేయాలని, అదేవిధంగా డీఐఈటీ మనోజ్‌ను హనుమకొండ డీఈఓ కార్యాలయానికి పంపాలని కలెక్టర్ సత్యశారద ఈ నెల 1న డీఈఓను ఆదేశిస్తూ మెమో జారీ చేశారు. ఈవిషయంపై ఇప్పటి వరకు డీఈఓ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విద్యాశాఖ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కలెక్టర్ మెమోను ఖాతరు చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. విద్యాశాఖ కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు, డీఈఓ వ్యవహారశైలిపై పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జనవరి 28న కలెక్టర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డీఈఓ కార్యాలయంలో సుదీర్ఘంగా ఉంటున్న ఆర్.రాజగోపాల్‌రెడ్డి డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మసాగర్ మండలం మల్లికుదుర్ల ఎంపీపీఎస్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉన్న ఆర్.రాజగోపాల్‌రెడ్డిని జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లాకు కేటాయించారని, సందర్భం(2)ను అనుసరించి ఏ ఉద్యోగి అయినా గరిష్టంగా మూడేళ్లు లేదా ప్రజా ప్రయోజనాల రీత్యా ఐదేళ్లు సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫారిన్ డిప్యుటేషన్ (విదేశీ ప్రతినిధి)లో కొనసాగవచ్చని వివరించారు. కానీ, ఎస్జీటీగా పాఠశాలలో విద్యార్థులకు బోధించాల్సిన రాజగోపాల్‌రెడ్డి నిబంధలకు విరుద్ధంగా పదేళ్లుగా వరంగల్ డీఈఓ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారని తెలిపారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించి డిప్యుటేషన్‌ను రద్దు చేసేలా డీఈఓను ఆదేశించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్.. వెంటనే కార్యాలయ సిబ్బందితోపాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి అసలు ఏం జరిగిందని తెలుసుకున్నట్లు సమాచారం. ‘రాజగోపాల్ ఎవరు.. ఎక్కడ డ్యూటీ చేయాలి.. ఎంతకాలం నుంచి డిప్యుటేషన్లో పని చేస్తున్నారు?’ అని అడిగి తెలుసుకొని వెంటనే ఆయనకు మంచి స్కూల్ కేటాయించి పంపాలని డీఈఓను ఆదేశిస్తూ ఈనెల 1న మెమో జారీ చేశారు. కాగా, దీన్ని డీఈఓ జ్ఞానేశ్వర్ అమలు చేయడం లేదని, కలెక్టర్ ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలుపుతున్నారు. ఈవిషయమై డీఈఓ జ్ఞానేశ్వర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. పదేళ్లుగా డిప్యుటేషన్లో ఉన్న వ్యక్తిని రిలీవ్ చేయాలని కలెక్టర్ మెమో డీఈఓ అమలు చేయడం లేదంటున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు -
ఎక్కువ పనిదినాలు కల్పిస్తాం
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ● ఘనంగా ఈజీఎస్ ఆవిర్భావ దినోత్సవం హసన్‌పర్తి: ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పిస్తామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హసన్‌పర్తిలోని సంస్కృతీ విహార్‌లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కమ్యూనిటీ పరంగా ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. ఉపాధి పనులు కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే కార్యక్రమం తక్కువ సమయంలో పూర్తి చేయడాన్ని అభినందించారు. ఈసందర్భంగా తమకు మూడు నెలల నుంచి వేతనాలు అందట్లేదని, వెంటనే విడుదల చేయించాలని సిబ్బంది కలెక్టర్‌ను కోరారు. విశిష్ట సేవలు అందించిన హసన్‌పర్తి ఎంపీడీఓ కర్ణాకర్‌రెడ్డిని కలెక్టర్ సత్కరించి సర్టిఫికెట్ అందించారు.డీఆర్డీఓ మేన శ్రీను అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ విజయలక్ష్మి, జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలు తదితరులు పాల్గొన్నారు.