Hanamkonda
-
తడి, పొడిచెత్తను వేరు చేయాలి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలని నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని బయోగ్యాస్ ప్లాంట్‌ను మంగళవారం మేయర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కాలనీల్లో తిరుగుతున్న స్వచ్ఛ ఆటోలకు చెత్తను అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. తడి చెత్తతో తయారైన కంపోస్టు ఎరువును ఉద్యాన శాఖ ద్వారా మొక్కల పెంపకానికి ఉపయోగించాలని సూచించారు. కార్పొరేషన్లో బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసిన గ్యాస్ నుంచి వచ్చే విద్యుత్‌ను ప్రతిరోజూ 2 గంటలపాటు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. పొడిచెత్తను నగరంలోని డీఆర్సీసీ కేంద్రాలకు, అక్కడ నుంచి దేశంలోని వివిధ రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగర ప్రజలు ముందుండాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. -
ఫిర్యాదుల పెట్టెలతో సమస్యల పరిష్కారం
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: జిల్లాలోని 75 ప్రభుత్వ సంక్షేమ శాఖల గురుకులాలు, వసతి గృహాల్లోని డార్మెటరీల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతున్నాయని వరంగల్ కలెక్టర్ సత్యశారద.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొని మాట్లాడుతూ.. వసతి గృహాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య, మెనూ ప్రకారం పోషకాహారం, మౌలిక వసతులు కల్పిస్తున్నారని, గురుకులాల సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. దీంతో సీఎస్ శాంతికుమారి అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు వెలవెల..
హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవన్నపేట శివారులో ఈ నెల 14న ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రూ.8.06 లక్షల విలువైన 310 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఓ లారీ, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్లు లీజుదారుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లికి చెందిన కేశబోయిన మొగిలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 15న రూ.82,500 విలువ చేసే 33 క్వింటాళ్లు, 16న కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.32,500 విలువైన 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. బత్తుల దుర్గమ్మ, గంట సారయ్య, తూర్పాటి కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్డులు 11,05,543 -
మండల స్థాయి స్టాక్ పాయింట్లు
మొత్తం రేషన్ దుకాణాలు 2,364ప్రతినెల రేషన్ బియ్యం పంపిణీ 33,153.976మెట్రిక్ టన్నులుమొత్తం యూనిట్లు (కుటుంబ సభ్యులు) 32,55,776..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో 1,024 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 560 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రోజుకు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం వయా హుజూరాబాద్, కాళేశ్వరం ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలుతున్నాయి. మామూలు తనిఖీల్లోనే ఇంత పెద్దమొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయంటే ‘రేషన్’ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్, హనుమకొండ, పరకాల, జనగామ, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి సాగుతున్న రేషన్ బియ్యం దందా ఎల్లలు దాటుతోంది. వరంగల్ ఈ దందా వెనుక కొందరు రైస్‌మిల్లర్లే కీలకం కాగా.. భీమదేవరపల్లి మండలానికి చెందిన ఒకరు హసన్పర్తికి మకాం మార్చి ‘మేనేజ్’ చేస్తూ ‘కోటి’కి పడగెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతడికి సంబంధించిన రేషన్ బియ్యం వందల క్వింటాళ్లు పోలీసులకు దొరుకుతున్నా.. ఎఫ్ఐఆర్ నమోదైనా.. ఆ సమయంలో ‘పరారీ’లోనే ఉంటాడు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత తాపీగా పోలీసులకు చిక్కే ఆ వ్యక్తికి అన్ని వర్గాల మద్దతు ఉందన్న చర్చ ఉంది. 18కమిషనరేట్ పరిధిలో ప్రధాన కేంద్రాలు.. -
నాలా నిర్మాణానికి సహకరించండి
వరంగల్ అర్బన్: నాలా నిర్మాణానికి సహకరిస్తే కాలనీవాసులకు న్యాయం చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. వరంగల్ 42 వ డివిజన్లోని తెలంగాణ కాలనీని టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక ప్రజల సౌకర్యార్థం నాలా నిర్మాణానికి భూ యజమానులు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, ఇన్చార్జ్ సీపీ రవీంద్రరాడేకర్, ఈఈ శ్రీనివాస్, టీపీఎస్ అనిల్, ఏఈ మోజామిల్ తదితరులు పాల్గొన్నారు. -
హనుమకొండ డీవీఏహెచ్‌ఓ ఎవరు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి (డీవీఏహెచ్‌ఓ)గా కొత్తగా ఎవరిని నియమించనున్నారు? అన్న అంశం ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు డీవీఏహెచ్‌ఓగా ఉన్న వెంకటనారాయణ పదవీ విరమణకు కొద్ది నెలలే గడువున్నా.. సొంత జిల్లా ఖమ్మం జిల్లాకు మంగళవారం బదిలీ అయ్యారు. వెటర్నరీ, పశుసంవర్థకశాఖలో సంయుక్త సంచాలకులుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబసాచి ఘోష్ బదిలీ చేశారు. అందులో భాగంగా సిద్దిపేటకు అశోక్‌కుమార్, మంచిర్యాలకు కృష్ణ, కరీంనగర్‌కు సుధాకర్, నల్లగొండకు రమేష్‌ను నియమించిన ప్రధాన కార్యదర్శి ఘోష్.. హనుమకొండ డీవీఏహెచ్‌ఓ నుంచి ఏడీగా పదో న్నతి పొందిన వెంకటనారా యణను ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని రకా లుగా అనుకూలం.. హాట్కేక్లాంటి హనుమకొండ డీవీఏహెచ్‌ఓ పోస్టు కోసం పలువురు లాబీయింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ స్థాయిలో పావులు ప్రధానంగా ఈ సీటుపై ఐదుగురు కన్నేయగా, పదో న్నతులు, ఫారిన్ సర్వీస్‌ల పేరిట సుమారు మూడు నెలల నుంచి కాచుకు కూర్చున్న సదరు వ్యక్తులు ఇప్పటికే వివిధ రూపాల్లో సమీప ప్రాంతాలు, కార్యాలయాల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జిల్లా వెటర్నరీ, పశుసంవర్థకశాఖ అధికారులుగా పదోన్నతులు కలిగిన కొందరు ఫారిన్ సర్వీస్‌ల పేరిట డిప్యుటేషన్ పొందారు. ఐదారు నెలల్లో పదవీ విరమణ పొందే హనుమకొండ ‘బాస్’ సీటుకు కొందరు స్కెచ్ వేయగా.. వివిధ రూపాల్లో హనుమకొండ, వరంగల్, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో పనిచేస్తున్న మరికొందరు ఇప్పటికే హైదరాబాద్ స్థాయిలో పావులు కదుపుతున్నారన్న ప్రచారం ఉంది. హనుమకొండ డీవీఏహెచ్‌ఓ పోస్టు కోసం ముందస్తు వ్యూహాంతో పావులు కదపడం.. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఎడాపెడా సాగిన ‘డిప్యుటేషన్’ల దందాపై ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనాలు కలకలం రేపాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపించి షోకాజ్‌లు జారీ చేయడంతో కొంత సద్దుమణిగినా.. ఆ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తులు హనుమకొండ డీవీఏహెచ్‌ఓ పోస్టు కోసం పైరవీలు చేస్తున్న విష యం ఆ శాఖలో మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. సొంత జిల్లా ఖమ్మానికి వెంకటనారాయణ బదిలీ డీవీఏహెచ్‌ఓ కోసం పోటాపోటీగా ప్రయత్నాలు, పైరవీలు హనుమకొండ సీటుపై ఐదుగురి కన్ను ఇప్పటికే డిప్యుటేషన్లపై ఉన్న కొందరు పశుసంవర్థకశాఖలో హాట్‌టాపిక్ -
పురాతన కట్టడాలను కాపాడుకోవాలి
హన్మకొండ కల్చరల్ : పురాతన దేవాలయాలు, కట్టడాలను కాపాడుకుంటే చరిత్రకు ఆధారాలుగా నిలుస్తాయని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సౌమ్యమిశ్రా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆమెను ఆలయమర్యాదలతో స్వాగతించారు. స్వామివారికి బిల్వార్చన, పూజలు చేసిన అనంతరం ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ అధికారులు, డీసీపీ దేవేందర్‌రెడ్డి, హనుమకొండ సీఐ సతీశ్ పాల్గొన్నారు. -
తడి, పొడిచెత్తను వేరు చేయాలి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలని నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని బయోగ్యాస్ ప్లాంట్‌ను మంగళవారం మేయర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కాలనీల్లో తిరుగుతున్న స్వచ్ఛ ఆటోలకు చెత్తను అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. తడి చెత్తతో తయారైన కంపోస్టు ఎరువును ఉద్యాన శాఖ ద్వారా మొక్కల పెంపకానికి ఉపయోగించాలని సూచించారు. కార్పొరేషన్లో బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసిన గ్యాస్ నుంచి వచ్చే విద్యుత్‌ను ప్రతిరోజూ 2 గంటలపాటు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. పొడిచెత్తను నగరంలోని డీఆర్సీసీ కేంద్రాలకు, అక్కడ నుంచి దేశంలోని వివిధ రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగర ప్రజలు ముందుండాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. -
టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బరి లో నిలిచిన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి అభ్యర్థించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో తొలుత ప్రిన్సి పాల్ జ్యోతిని కలిశారు. అనంతరం పలువురు అధ్యాపకులతో మాట్లాడారు. తనను టీచర్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో గళమెత్తుతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన వెంట యూనియన్ బాధ్యులు డాక్టర్ కుందూరు సుధాకర్, ఎస్కే మీరుద్దీన్, రవీందర్‌రెడ్డి ఉన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించాలి : డీఈఓవిద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించాలని డీఈఓ వాసంతి కోరారు. గత సంవత్సరం 968 పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దృష్టి లోపం ఉన్న 137 పాఠశాలల్లోని 2,357 మంది విద్యార్థులకు ఈనెల 17 నుంచి 28 వరకు వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, ఇతర ఉపకరణాలు అందజేస్తారని తెలిపారు. ప్రతి మండలంలో ఎంపికచేసిన విద్యార్థులు కంటి పరీక్షలకు వెళ్లేవిధంగా మండల విద్యాశాఖాధికారులు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. అదనపు సమాచారం కోసం సమగ్రశిక్ష సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి ఫోన్‌నంబర్ 9603672289ను సంప్రదించాలని డీఈఓ కోరారు. ఉపాధ్యాయుల గొంతు వినిపిస్తా.. నయీంనగర్: ఉపాధ్యాయుల గొంతుకనై వారి సమస్యలు పరిష్కరిస్తానని, తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. ఆరేళ్లుగా ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యల సాధనకు కృషి చేశానన్నారు. ప్రభుత్వ విద్యారంగం, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను రక్షించడానికి పాటుపడుతానన్నారు. 20 నుంచి దూరవిద్య సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ మంగళవారం తెలిపారు. ఈనెల 20, 22, 24, 27, మార్చి 1తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఎంఏ జర్నలిజం,హెచ్ఆర్ఎం పరీక్షలు కేయూ దూరవిద్య ఎంఏ జర్నలిజం, ఎంఏ హెచ్ఆర్ఎం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల ఈనెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. -
పూడికతీత పనులు వేగవంతం చేయండి
నయీంనగర్/హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం భద్రకాళి చెరువు పూడకతీత పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. పూడికమట్టిని వాహనాల్లో తరలించడానికి అంతర్గత రోడ్డు నిర్మించాలని సూచించారు. పనులు జరుగుతున్న చోట రాత్రి సమయంలో విద్యుత్ బల్బులు ఏర్పాటుచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. మట్టి తరలించే వాహనాల నమోదు కోసం చెక్‌పోస్ట్ ఏర్పాటుచేసి రెవెన్యూ, పోలీస్, సాగునీటి పారుదల, మున్సిపల్ శాఖల సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణ, తనిఖీ ఉండేవిధంగా చూడాలని పేర్కొన్నారు. పూడికమట్టి కావాలనుకునే వారు క్యూబిక్ మీటరుకు రూ.72 చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, మున్సిపల్, కుడా, సాగునీటిపారుదల శాఖల అధికారులు ఉన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం హన్మకొండ అర్బన్: వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ప్రత్యేకంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తాగునీటి సరఫరా, రబీపంటలకు సాగు నీరు, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్‌కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు తాగునీటి సమస్య లేదని, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేతిపంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలో డివిజన్లకు ధర్మసాగర్ తాగునీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 24 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, రానున్న రోజుల్లో అదనంగా మరో 21 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి భద్రకాళి చెరువు పరిశీలన -
సాక్షిప్రతినిధి, వరంగల్
●● పలు పట్టణ, జిల్లా కేంద్రాలు అడ్డాగా బియ్యం దందా సాగుతోంది. ఇటీవల రేషన్ బియ్యం అ క్రమ రవాణాకు హసన్‌పర్తి, హనుమకొండ, పరకాల, నర్సంపేట ప్రధాన కేంద్రాలుగా మారాయి. ● తరచూ పీడీఎస్ బియ్యం పట్టుబడుతున్నా హనుమకొండ, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు సంబంధించిన బియ్యం పరకాల కేంద్రంగా మార్పిడి, రవాణా ఆగడం లేదు. ఈ బియ్యం దందా వెనుక గతంలో హనుమకొండలో గుట్కా, బెల్లం దందాతో సంబంధం ఉన్న ఒకరు బ్యాచ్‌తో ‘శివ’మెత్తుతున్నట్లు ఇటీవల నమోదైన కేసుల ద్వారా స్పష్టమవుతోంది. ● గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, చెన్నారావుపేట తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తున్న రేషన్ బియ్యం నర్సంపేట కేంద్రంగా పాలిష్ చేసి సంచుల మార్పిడి, అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి తరలిస్తున్న బియ్యంపై ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గతంలో కేసులు నమోదు అయ్యాయి. ఆ సమయంలో రేషన్ బియ్యం మాఫియా, ఇతరుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగ్గా.. అప్పటి ఓ ప్రతినిధి జోక్యంతో సద్దుమణిగినట్లు తెలిసింది. ● ఈ దందాలో రూ. లక్షలు గడిస్తున్న బియ్యం వ్యాపారులు మాఫియా డాన్లుగా మారుతున్నారు. రేషన్ బియ్యం వ్యాపారులపై పీడీ యాక్టు పెడతామని బెదిరించినా.. 6ఏ కేసులు పెట్టినా ఫలితం ఉండటం లేదు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యానికి పాలిష్ పెట్టి దారి మళ్లించి రూ.లక్షలు గడిస్తున్నారు. మార్కెట్లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.35 నుంచి రూ.45 పైగా ధర ఉండడంతో అక్రమార్కులకు ఉచిత బియ్యం పథకం వరంలా మారింది. ● పీడీఎస్ దందాపై ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల్లో కట్టడి చేస్తున్నామని, ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తమ బృందాలు తనిఖీలు ఉధృతం చేశాయని పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. పీడీఎస్ బియ్యం దందా చేసే వారిపై ఇకపై మరింత తీవ్రంగా వ్యవహరిస్తామని పోలీసులు కూడా ప్రకటించారు. వరంగల్ -
24 కిలోల గంజాయి స్వాధీనం
వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లో హరప్రసాద్ సాహూ అనే వ్యక్తి వద్ద సుమారు రూ.6లక్షల విలువైన 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసినట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కోదల గ్రామానికి చెందిన హరప్రసాద్ సాహూ సోమవారం గంజాయితో వరంగల్ రైల్వేస్టేషన్లో దిగి క్రయవిక్రయదారుల కోసం వేచి ఉన్నాడు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో అతడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ షుకూర్ తెలిపారు. డోర్నకల్‌లో 19.68 కేజీలు.. డోర్నకల్ : డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ క్రాస్ వద్ద సోమవారం పోలీసులు ఎండు గంజాయి పట్టుకున్నారు. ఎస్సై గడ్డం ఉమ కథనం ప్రకారం.. ఉయ్యాలవాడ క్రాస్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా 19.68 కేజీల ఎండు గంజాయి లభించింది. దీంతో ఒడిశాకు చెందిన సమర భూమియా, సీసీఎల్, మహదేవ్ మండల, ఉమేశ్ మండలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.4,92,000 ఉంటుందని ఎస్సై తెలిపారు. -
నిబంధనలు పాటిస్తేనే నిర్మాణ అనుమతులు
వరంగల్ అర్బన్ : భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. నూతన భవన నిర్మాణాలకు అనుమతుల మంజూరు.. పెద్ద భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ కోసం ఆమె సోమవారం నగర పరిధి సుబేదారి ప్రాంతంలోని పోస్టల్‌కాలనీ, ప్రకాశ్‌రెడ్డిపేట, లోటస్కాలనీ, కాజీపేట ప్రాంతాల్లో పర్యటించి ఫిర్యాదులను, మ్యాపులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టీఎస్–బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో సూచించిన ధ్రువీకరణ పత్రాలు నమోదు చేసి నిబంధనలు పాటిస్తే చట్టానికి లోబడి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. కమిషనర్ వెంట ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఉన్నారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
పర్యాటకులకు గుడ్‌న్యూస్..
హన్మకొండ : పర్యాటకులను ప్రోత్సహించేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఒక్క రోజు పర్యాటక ప్రాంతాల సందర్శన టూర్‌ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ఈ టూర్ ప్యాకేజీ రూపొందించారు. మినీ ఏసీ బస్సులో పర్యాటకులను తీసుకెళ్లేలా టూర్ ప్యాకేజీ తీసుకొచ్చారు. ఈ నెల 20 ఉదయం 8 నుంచి రాత్రి 7.45 గంటల వరకు సాగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ నుంచి ఈ పర్యాటక ప్రాంతాల సందర్శన ప్రారంభమవుతుంది. ముందు వేయిస్తంభాల దేవాలయానికి చేరుకుంటారు. 9 గంటలకు వేయి స్తంభాల దేవాలయం నుంచి భద్రకాళి దేవస్థానానికి, ఇక్కడి నుంచి రామప్పకు చేరుకుంటుంది. రామప్పలో మధ్యాహ్న భోజన అనంతరం లక్నవరం నుంచి నేరుగా సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. తేనీరు తీసుకున్న తర్వాత ఖిలావరంగల్‌కు చేరుకుని సౌండ్ లైటింగ్ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు, ఖిలావరంగల్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి రాత్రి 7.45 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. వివరాల కోసం 9010007261 ఫోన్ నంబర్లో సంప్రదించాలని పర్యాటకాభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో కోరింది. సంస్థ వెబ్ సైట్లోనూ వివరాలు పొందుపరిచినట్లు తెలిపింది. చార్జీలు పెద్దలకు రూ.980, పిల్లలకు రూ.790గా నిర్ణయించారు. ఒక్క రోజు పర్యాటక ప్రాంతాల సందర్శన టూర్ ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ -
రామప్ప శిల్పాకళా సంపద అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పాకళా సంపద అద్భుతమని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా, ఆలయ ఆర్చకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించిన సమయంలో రామప్ప ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ప్రస్తుతం రామప్ప ఆలయాన్ని మళ్లీ సందర్శించినట్లు వెల్లడించారు. ఆమె వెంట ఓఎస్డీ మహేశ్ భగవత్ గీతె, ములుగు డీఎస్పీ రవీందర్, జైళ్ల శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా -
నేడు అగ్రిహబ్ రీజినల్ సెంటర్ ప్రారంభం
హన్మకొండ: వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చే సిన అగ్రిహబ్ రీజినల్ సెంటర్‌ను మంగళవారం ప్రారంభించనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ఎ.జానయ్య ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయంలో స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడానికి ఈ అగ్రిహబ్‌ను ఇక్కడ స్థాపించినట్లు వివరించారు. వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత చెన్నారావుపేట: అక్రమంగా నిల్వ చేసి వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం మండలంలోని పాత మగ్దుంపురం గ్రామంలోని ననుమాస పవన్‌కుమార్ ఇంటిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఇందులో వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యంకాగా స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు పేర్కొన్నారు. నిల్వ చేసిన రేషన్ బియ్యం విలువ సుమారు రూ. 2 లక్షల 50 వేలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ బాబులాల్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
తహసీల్దార్ గారూ.. ఏది నిజం?
సాక్షి, వరంగల్: జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘అన్న, తమ్ముడు.. ఓ తహసీల్దార్’ కథనంపై వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ సాక్షి పత్రికకు ఇచ్చిన ‘రిజైండర్’ మరెన్నో అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి వరంగల్ మండలం కొత్తపేటలోని సర్వే నంబర్ 73లో ఒక ఎకరం భూమి మహమ్మద్ అఫ్జల్ నుంచి 1998 జనవరి 9న సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశానని మోకాపై వ్యవసాయం సాగు చేసుకుంటున్న అంకేశ్వరపు కొమురయ్య వాదిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన సాదాబైనామా అప్లికేషన్ నంబర్ టీటీఆర్వోఎస్ 022003406759 పరిష్కరించాలంటూ 23614 ఆఫ్ 2024 రిట్ పిటిషన్ ప్రకారం అంకేశ్వరపు కొమురయ్యది సర్వే నంబర్ 73/ఏ/3 అని అందులో ఒక ఎకరం ఒక గుంట భూమి అని.. అది రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా భూమి అని.. సింపుల్ సేల్ డీడ్ ద్వారా ఎండీ ఖాజా పాషా దగ్గర కొనుగోలు చేశాడని సాక్షికి ఇచ్చిన రిజైండర్‌లో తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. దీంతో అసలు ఈ విచారణ సజావుగా సాగిందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం 73/ఏ/3లోని ఒక ఎకరం ఒక గుంట ధరణిలో అంకేశ్వరపు ఎల్ల స్వామి పేరున ఉన్నట్టు నిర్ధారించిన తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ఎండీ ఖాజా పాషాదని పేర్కొనడమే ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ఇప్పుడు ఇదే అంశం కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు సవాల్‌గా మారిందనే చర్చ కలెక్టరేట్ వర్గాల్లో వినబడుతోంది. నిజం తేల్చాలని బాధితుల వేడుకోలు వరంగల్ మండలం కొత్తపేటలోని 73/ఏ/3లోని ఒక ఎకరం ఒక గుంట భూమి ధరణిలో అంకేశ్వరపు ఎల్లస్వామి పేరున ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమిని మహమ్మద్ ఖాజాపాషా నుంచి అంకేశ్వరపు కొమురయ్య కొనుగోలు చేశారని తహసీల్దార్ ఇక్బాల్ సాక్షితో పేర్కొన్నారు. ఇది లోతుగా పరిశీలిస్తే ధరణిలో అంకేశ్వరపు ఎల్లస్వామి పేరున పట్టా ఉండడం నిజమే. కానీ ఆ భూమిని మహమ్మద్ అఫ్జల్ సోదరుడైన మహమ్మద్ జాఫర్ హుస్సేన్ ద్వారా డాక్యుమెంట్ నంబర్ 2780/2007తో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ద్వారా అంకేశ్వరపు ఎల్ల స్వామి పేరు మీదకు మారింది. మహమ్మద్ ఖాజాపాషా నుంచి అంకేశ్వరపు కొమురయ్య కొనుగోలు చేశారని తహసీల్దార్ చెబుతుంటే.. ఎండీ జాఫర్ హుస్సేన్ నుంచి అంకేశ్వరపు ఎల్లస్వామి కొనుగోలు చేసినట్టుగా రెవెన్యూ రికార్డులు చెబుతుండడం గమనార్హం. మరీ ఇందులో ఏది నిజమనేది ఉన్నతాధికారులు తేల్చాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటికై నా తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తన పట్టా 73/ఏ/3 క్రయ విక్రయాలు జరగకుండా కోర్టు కేసు ఉందని అప్డేట్ చేసినదాన్ని తొలగించాలని అంకేశ్వరపు ఎల్లస్వామి రెవెన్యూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. అలాగే తన అన్న కొమురయ్య భూమి కొన్న సమయంలో బై సర్వే నంబర్లు లేవని, రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే ఇది తెలుస్తుందని చెబుతున్నాడు. సర్వే నంబర్ 73లో 12.6ఎకరాల భూమి ఉండేదని వివరించారు.కలెక్టర్‌కు సవాల్‌గా మారిన కొత్తపేట సర్వే నంబర్ 73 భూ వివాదం ఒకే సర్వే నంబర్లో వింత సమాధానాలతో విచారణపై మరిన్ని అనుమానాలు క్షేత్రస్థాయిలో విచారణచేస్తేనే బాధితులకు సరైన న్యాయం -
విన్నపాలకు స్పందనేది..?
వరంగల్ అర్బన్: ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. ప్లీజ్ మేడం.. క్షేత్ర స్థాయిలో సందర్శించి తమ బాధలు తెలుసుకోవాలని పలు కాలనీలకు చెందిన ప్రజలు గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను వేడుకున్నారు. బల్దియా కౌన్సిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వరంగల్ గ్రేటర్ గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వినతులను కమిషనర్ స్వీకరించారు. నగర పరిధిలోని పలు కాలనీల్లో కనీస వసతులు లేవని, ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై మొత్తం 76 అర్జీలు అందాయి. అందులో టౌన్ ప్లానింగ్‌కు 31, ఇంజినీరింగ్ విభాగానికి 22, తాగునీటి సరఫరా 10, ప్రజారోగ్యానికి 7, పన్నుల సెక్షన్ 4, ఉద్యానవన విభాగానికి 2 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, హెచ్ఓలు రమేశ్, లకా్ష్మ్రెడ్డి, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని ఇలా.. ● వడ్డేపల్లి విజయ్‌పాల్ కాలనీలో డ్రెయినేజీలు వ్యర్థాలతో నిండి పోయాయని శ్యామల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ● 43వ డివిజన్ గణేష్‌నగర్‌లో నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఓయో రూమ్‌ను రద్దు చేయాలని సంక్షేమ సంస్థ ప్రతినిధులు వేడుకున్నారు. ● కేయూసీ రోడ్డులోని 3 – 14 – 542/2 వద్ద ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ కారణంగా ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతు చేయాలని కూచన సురేష్ కోరారు. ● మడికొండ వెస్ట్‌సిటీలో 400 కుటుంబాలు నివా సముంటున్నాయని, అక్కడ కనీసం సౌకర్యాలు కల్పించాలని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ● 11వ డివిజన్ కాపువాడ రాణా సిద్ధిఖీ ఆస్పత్రి లైన్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ సౌకర్యాల కల్పించాలని కాలనీ ప్రతినిధులు విన్నవించారు. ● హనుమకొండ దీన్‌దయాళ్ కాలనీ ‘కుడా’ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్గత డ్రెయినేజీలు పూర్తి చేయాలని ఎమ్మార్పీఎస్ నేత మంద కుమార్ మాదిగ ఫిర్యాదు చేశారు. ● నక్కలగుట్ట సునీత రెసిడెన్సీ అపార్టుమెంట్ సెల్లార్లో అక్రమంగా నిర్మించిన 4 షెట్టర్లను తొలగించాలని స్థానికులు దరఖాస్తు చేశారు. ● 64వ డివిజన్ మడికొండలో 30 ఫీట్ట రోడ్డును 7 ఫీట్ల మేర ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● హంటర్ రోడ్డు ట్యాంక్ బండ్ వద్ద టిఫిన్ సెంటర్లు, ఇతర షాపుల కారణంగా వాహనాల రద్దీ పెరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదు చేశారు. ● కాశిబుగ్గ సాయిగణేష్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పరిష్కారం కాని సమస్యలు గ్రేటర్ గ్రీవెన్స్‌లో ప్రజల అసహనం దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
స్వాగత తోరణాల పనులు పూర్తి చేయాలి
వరంగల్ అర్బన్ : నగర పరిధి ప్రధాన రహదారుల్లో చేపట్టిన స్వాగత తోరణాల పనులను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. నర్సంపేట రహదారి ధర్మారం వద్ద, ఖమ్మం రోడ్డు పున్నేలు వద్ద నిర్మిస్తున్న స్వాగత తోరణాల అభివృద్ధి పనులను ఆమె సోమవారం సందర్శించారు. వాటిని పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య● వనమాల కనపర్తిలో ఘటన ఐనవోలు: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వనమాల కనపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గట్టు రాజేశ్(41) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు. కాగా, చిట్టీలు ఎత్తుకోవడంతోపాటు కొంతమంది వద్ద సుమారు రూ.8లక్షల వరకు అప్పులు చేశాడు. అదే విధంగా భార్య సునీత బంగారం సుమారు 7 తులాల వరకు బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందాడు. ఇటీవల అనారోగ్యానికి గురై ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పులు ఎలా తీర్చాలని తరచూ బాధ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో ఒక్కడే నిద్రించాడు. సోమవారం ఉదయం భార్య సునీత కొత్త ఇంటికి వెళ్లి చూడగా ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య, సంజన ఉన్నారు. -
ఆన్లైన్.. ఆగమాగం!
ట్రైన్ పాస్‌లు, పీటీఓలు, లీవ్‌లు ఆన్లైన్లో మంజూరు ● వినియోగించుకోలేకపోతున్న 70 శాతం మంది రైల్వే కార్మికులు ● ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉంచాలని విన్నపం ● రైల్వే నాయకులు పట్టించుకోవాలని మొరకాజీపేట రూరల్: ఎన్నో ఏళ్లు ఎందరో త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న రైల్వే కార్మికుల హక్కులు పూర్తి స్థాయిలో కార్మికులు అందుకోలేకపోతున్నారు. ఇప్పటికే రైల్వే కార్మికుల హక్కులు చాలా వరకు కనుమరుగవ్వగా.. కొన్నింటి కోసం ఇప్పటికీ కార్మికులు, నాయకులు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో కొంత కాలంగా రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల కనీస హక్కులను ఆన్లైన్ చేయడంతో వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నామని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా స్మార్ట్‌ఫోన్ ఆపరేట్ చేయడం తెలియని 70 శాతం మంది రైల్వే కార్మికులు ఆన్లైన్లో తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలో తెలియక ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. రైల్వే కార్మికులకు తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణించేందుకు సంవత్సరానికి మూడు ఉచిత ప్రివిలేజ్ ట్రైన్ పాస్‌లు ఇచ్చేది. అత్యవసర పరిస్థితులున్నప్పుడు, సెలవుల కోసం అర్జీ పెట్టుకుంటే సెలవులు ఇస్తారు. అదేవిధంగా క్యాజువల్ లీవ్ (సీఎల్) మంజూరు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (పీటీఓ) మంజూరు ఇవన్నీ... రైల్వే ఆన్లైన్ చేయడం వల్ల చాలా వరకు రైల్వే కార్మికులు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ సిస్టంలో అప్లయ్, ఆప్‌లోడ్, ఓటీపీ, ఫార్వర్డ్, డౌన్లోడ్ విధానం తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రివిలేజ్ పాస్ తీసుకునే విధానం తెలియక కొందరు కొంత కాలం నుంచి ట్రైన్పాస్లు తీసుకోవడం లేదని కార్మికులు చెబుతున్నారు ఆన్లైన్లో ట్రైన్ పాస్ ద్వారా ఒక సారి ప్రయాణం చేస్తే మరొకసారి ప్రయాణం చేసే అవకాశం లేకుండా పోయిందని, గతంలో సంవత్సరానికి మూడు ప్రివిలేజ్ ట్రైన్ పాస్‌లు ఇచ్చేవారని, ఈ పాస్‌లపై ఎన్నిసార్లు అయిన ప్రయాణించే అవకాశం ఉండేదని అంటున్నారు. ముఖ్యంగా కింది స్థాయి గ్రూప్ డి, నాలుగో తరగతి రైల్వే కార్మికులు గ్యాంగ్మెన్లు, గ్యాంగ్ ఉమెన్లు, గేట్మెన్లు, కీ మెన్లు, అటెండర్లు, డీజిల్‌షెడ్, ఎలక్ట్రిక్లోషెడ్, ట్రైన్లైటింగ్, సిఅండ్‌డబ్ల్యూ స్టాప్, టీటీ మిషన్ స్టాప్ తదితర కార్మికులు ఆన్లైన్లో తమ హక్కులను పొందలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. రిటైర్డ్ రైల్వే వారికి ఇస్తున్న మాదిరిగానే సర్వీస్‌లో ఉన్న వారికి కూడా మ్యాన్యుల్గా ఇస్తే ఇబ్బంది ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా రైల్వే ట్రేడ్ యూనియన్ల నాయకులు రైల్వే కార్మికుల కనీస హక్కులను ఆన్లైన్లో కాకుండా పాత పద్ధతిలో అమలు చేసేలా రైల్వే బోర్డు, జీఎం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ పాస్‌లు ఎత్తివేయాలి.. కార్మికులు తమ ఇంటిల్లిపాదితో కలిసి ఉచిత ట్రైన్పాస్తో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల ఆ అవకాశం లేకుండాపోయింది. అత్యవసర సెలవులకు సీఎల్ కార్డు చూపిస్తే లీవ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సిస్టం లేదు. రైల్వే కార్మికుల ఇబ్బందులు గుర్తించి అధికారులు ఆన్లైన్ సిస్టం ఎత్తివేసి మ్యాన్యువల్ అమలు చేస్తే బాగుంటుంది. – దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్●ఆన్లైన్ చేసినవి ఇవే..ఆన్లైన్ తెలియక.. -
ముగిసిన చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాలబాలికల ఓపెన్ టు ఆల్ చదరంగం పోటీలు సోమవా రం ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో విజేతగా అల్లాడి శ్రీవాత్సవ్, తర్వాతి స్థానా ల్లో మ్యాకల శ్రీకాంత్, తుర్క రాజు, రవీంద్రనాథ్ , తిరుపతిచారి, ఆద్య, సుదీప నిలిచారు. విజేతలకు నిర్వాహకుడు పి. కన్నా సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బి టర్లు శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్, రజనీకాంత్, శ్రీకాంత్, రవీందర్ పాల్గొన్నారు. చోరీకి యత్నించిన కేసులో వ్యక్తికి ఏడాది జైలు చిన్నగూడూరు: మండలంలోని ఉగ్గంపల్లి శివారు దేవోజీతండాలో ఓ ఇంట్లో చోరీకి యత్నించిన కేసులో నిందితుడికి తొర్రూరు మేజిస్ట్రేట్ మట్ట సరిత ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్సై ఝాన్సీ తెలిపారు. నల్లగొండ జిల్లా గుర్రంపాడు మండలం తేనెపల్లికి చెందిన శివర్ల కోటేశ్ 2023లో దేవోజీతండాకు చెందిన ధర్మసోత్ భూపాల్ నాయక్ ఇంటిలో చోరీకి యత్నించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కోటేశ్పై కేసు నమోదు చేశారు. సోమవారం కేసు విచారణ అనంతరం తొర్రూరు మేజిస్ట్రేట్ మట్ట సరిత.. నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించారు. కాగా, నిందితుడికి శిక్షపడేలా విధులు నిర్వర్తించిన కోర్టు పీసీ మధును తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, మరి పెడ సీఐ రాజ్‌కుమార్, చిన్నగూడూరు ఎస్సై ఝాన్సీ అభినందించారు. రూ.38,720 విలువైన గుట్కాలు స్వాధీనంఖిలా వరంగల్: అక్రమంగా గుట్కాలు విక్రయిస్తున్న కిరాణా వ్యాపారిపై కేసు నమోదు చేసి రూ. 38,720ల విలువైన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్‌కుమార్ తెలిపారు. వరంగల్ 36వ డివిజన్ చింతల్‌కు చెందిన కిరాణా షాపు నిర్వాహకుడు చిదిరాల సుమన్ అక్రమంగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సోమవారం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్‌కుమార్ ఆధ్వర్యంలో షాపుపై దాడి చేశారు. ఇందులో రూ. 38,720 విలువైన గుట్కాప్యాకెట్లు లభించగా స్వాధీనం చేసుకుని సుమన్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్‌కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా ‘స్వయంవర్’ దశాబ్ది ఉత్సవాలు
హన్మకొండ : హనుమకొండ నక్కలగుట్టలోని ‘ది స్వయంవర్’లో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరి గాయి. ది స్వయంవర్ స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం 11వ ఆవిర్భావ వే డుకలు నిర్వహించారు. ప్రముఖ వస్త్రవ్యాపారి కాసం నమఃశివాయ జ్యోతి వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రథమంగా ఎత్నిక్‌వేర్ స్టోర్ ది స్వయంవర్ను స్థాపించామని చెప్పారు. ఈ స్టోర్ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు 47 నగరాల్లో 85 బ్రాంచ్‌లుగా విస్తరించినట్లు పేర్కొన్నారు. వివాహాది శు భాకార్యాలకు, పిల్లలకు, యువకులకు, పెద్దలకు అందుబాటులో కలెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. అందుబాటు ధరల్లో షేర్వాణి, ఇండో వెస్ట్రన్, జోద్‌పురి బ్లాజర్స్, సెమీ ఇండో వెస్ట్రన్ కుర్తా, పైజామా, మో దీ సెట్, పట్టు పంచె, పగిడి, పెర్ఫ్యూమ్స్, దుపట్టా, లెనిన్ కుర్తాలు, షర్ట్లు తమ ప్రత్యేకత అని వి వరించారు. డైరెక్టర్లు కాసం మల్లి కార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పీఎన్.మూర్తి, పుల్లూరు అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
జాతీయవాద రచనలకు కేంద్రబిందువు సదాశివరావు
● ప్రముఖ రచయిత వరిగొండ కాంతారావు హన్మకొండ కల్చరల్ : జాతీయవాద రచనలకు కేంద్రబిందువుగా స్వర్గీయ భండారు సదాశివరావు అని ప్రముఖ రచయిత వరిగొండ కాంతారావు అన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ పూర్వ అధ్యక్షుడు భండారు సదాశివరావు స్మారకగా ఆదివారం హంటర్‌రోడ్‌లోని శ్రీవ్యాస ఆవాసంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ భండారు ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘హిందువుగా జీవించు–హిందువునని గర్వించు’ అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. భండారు సదాశివరావు రచనలు ‘అగ్నిమూర్తులపై’ న్రముఖ రచయిత ఐత చంద్రయ్య, ‘పృథ్వీసూక్తం’పై వరిగొండ కాంతారావు ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీవ్యాస ప్రతిష్టాన్ సంఘం ప్రధాన బూర రాయచందర్, జాతీయ సాహిత్య పరిషత్ హనుమకొండ శాఖ ప్రధాన కార్యదర్శి తాడిచెర్ల రవి, ప్రముఖ వైద్యులు డాక్టర్ బీఎస్ శివసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
సీనియార్టీ తేల్చడంలో జాప్యమెందుకు?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో తెలు గు విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏటూరి జ్యోతి ఈఏడాది జనవరి 9న మృతి చెందిన విషయం వి ధితమే. అయితే ఆ విభాగంలో రెగ్యులర్ ప్రొఫెస ర్లు లేరు. నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస ర్లు మామిడి లింగయ్య, మంథిని శంకర్, చిర్రరాజు , కర్రె సదాశివ్ ఉన్నారు. ఆ నలుగురిలో సీనియార్టీ ప్రాతిపదికన ఒకరిని విభాగం అధిపతిగా, మరొకరిని బోర్డు ఆఫ్‌స్టడీస్ చైర్మన్‌గా నియమించాల్సింటుంది. అయితే ఆ నలుగురు కూడా ఆ పదవులు ఆశిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీరిలో ఎవరిని విభాగం అధిపతిగా, బోర్డు ఆఫ్‌స్టడీస్ చైర్మన్‌గా నియమించడానికి సీనియార్టీ తేల్చాలని వీసీ ఓ కమిటీని నియమించాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది జనవరి నెలాఖరులో అ ప్పటి రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి ఈ కమిటీని నియమి స్తూ వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కమిటీని నియమించి రెండు వారాలు గడిచినా ఇప్పటివరకూ రిపోర్టు ఇవ్వలేదు. దీంతో ఈ కమిటీని నియమించింది కాలయాపనకేనా? ఇంకెప్పుడు సీనియార్టీని తేలుస్తారని ఆ నలు గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నా రు. జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటీని యూ నివర్సిటీలో చర్చ సాగుతోంది. అయితే కమిటీ మాత్రం ఆరోపణలు పట్టించుకోదని, తాము ఆ నలుగురిలో సీనియార్టీని మాత్రమే పరిశీలించి త్వరలోనే రిపోర్టు అందజేస్తామని కమిటీలో ఉన్న ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 17న కమిటీ సమావేశమై సీనియార్టీని తేల్చి రిపోర్టు ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఆ నలుగురిలో ఎవరు విభాగం అధిపతి, బీఓఎస్‌గా నియామకం అవుతారనే అంశం యూనివర్సిటీలో ఆసక్తికరంగా మారింది. కమిటీని నియమించి రెండువారాలు ఇంకా సమర్పించని నివేదిక తెలుగు అధిపతి, బీఓఎస్ నియామకమెప్పుడు? నేడు కమిటీ సమావేశమయ్యే అవకాశం! -
అర్ధశతాబ్దపు అపూర్వ కలయిక..
కురవి: ఆ విద్యార్థులు అర్ధ శతాబ్దం తరువాత కలు సుకున్నారు. 54 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఒకచోట కలిసి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. అనంతరం జ్ఞాపకాలను నెమరువేసుకుని రోజంతా ఉల్లాసం, ఉత్సాహంగా గడిపారు. ఈ అపురూప ఘట్టానికి మండలంలోని బలపాల జెడ్పీ హైస్కూ ల్ వేదికై ంది. పాఠశాలకు చెందిన 1971–1972 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కలియ తిరిగారు. తరగతి గదులను పరిశీలిస్తూ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నారు. అనంతరం తమతో చదువుకుని చనిపోయిన స్నేహితులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కిలారి అశోక్‌బాబు, చింతలమోహన్‌రావు, చిక్కా వెంకటేశ్వర్లు, తాటికొండ మల్లారెడ్డి, రావూరి విమల, దార నర్సింహరావు, రావూరి రమేశ్, ఈడిగిరాల ఐలయ్య, బొల్ల వసంత, గరక వెంకటేశ్వర్లు, కె.పద్మ , నామా సైదులు, రావూరి ప్రభాకర్‌రావు, అంబటి వెంకటనారాయణ పాల్గొన్నారు. 54 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు -
తగ్గని భక్తుల జోరు
జాతర ముగిసినా..ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ మినీజాతర ముగిసినా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్న వాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి పుట్ట వెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. ముందస్తు అంచనాతో అధికారుల ఏర్పాట్లు.. మినీ జాతర అనంతరం ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి వస్తారని ముందస్తు అంచనాతో జిల్లా అధికారులు, పోలీస్ శాఖ తరఫున ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ రవీందర్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. శనివారం రాత్రి నుంచి ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తుల ప్రైవేట్ వాహనాలను పార్కింగ్ స్థలాల్లోకి మళ్లించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. పస్రా సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి.. సిబ్బందిని సమన్వయ చేస్తూ బందోబస్తు నిర్వహించారు. సరైన సమయంలో బస్సులు లేక భక్తుల ఇబ్బందులు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు సరైన సమయంలో ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్‌లోనే పడిగాపులు కాశారు. తీరా ఒక్క బస్సు రాగానే ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఈ సమయంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.సమన్వయంతో జాతర విజయవంతంజిల్లా అధికారులు, పోలీస్ శాఖ, పూజారుల సమన్వయంతో మినీ జాతర విజయవంతమైందని మేడారం జాతర కమిటీ చైర్మన్ ఆరెం లచ్చుపటేల్ అన్నారు. ఈమేరకు ఆదివారం పూజారులతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీజాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంత్రి సీతక్క, జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేసి జాతర విజయవంతానికి కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా జాతర విజయవంతానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, పూజారులకు కృతజ్ఞతలు తెలిపారు.19న తిరుగువారం పూజలు ఈనెల 19న (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మినీజాతర (మండమెలిగె) పండుగ ముగిసిన అనంతరం మరోసారి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు తిరుగువారం పండుగ చేయడం ఆనవాయితీ. తిరుగు వారం పండుగ రోజున మేడారం, కన్నెపల్లిలో పూజారులు, ఆదివాసీ కుటుంబాలు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మేడారానికి తరలివచ్చిన వేలాది మంది ట్రాఫిక్ నియంత్రణకు కట్టదిట్ట చర్యలు 19న తిరుగువారం పండుగ -
జ్వరంతో విద్యార్థి మృతి
● ఆశ్రమ పాఠశాల వార్డెన్, హెచ్ఎం నిర్లక్ష్యమే కారణం: బంధువులు ● హాస్టల్ ఎదుట బంధువుల ఆందోళన వాజేడు: జ్వరంతో బాధపడుతూ వాజేడు మండల పరిధి పేరూరు బాలుర ఆశ్రమ హాస్టల్ విద్యార్థి సోయం వినీత్(13) శనివారం రాత్రి మృతి చెందాడు. పేరూరు గ్రామానికి చెందిన వినీత్ ఊళ్లోని ఆశ్రమ హాస్టల్లో ఉంటూ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వినీత్‌కు మూడు రోజులక్రితం జ్వరం వచ్చింది. హాస్టల్లో ఒక మాత్ర ఇవ్వగా జ్వరం తగ్గింది. దీంతో ఇంటికి వచ్చాడు. ఇంటి వద్ద నీరసంగా ఉండడంతో అతడి మేన మామ ధర్మవరంలో ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించాడు. ఆర్ఎంపీ.. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో కారులో శుక్రవారం సాయంత్రం వినీత్‌ను ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేస్తుండగానే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు వినీత్ మృతి చెందడానికి హాస్టల్ వార్డెన్, పాఠశాల హెచ్ఎం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. జ్వరమొస్తే కుటుంబ సభ్యులకు తెలపకుండా మాత్ర వేసి పంపించడం ఏంటని ప్రశ్నించారు? అనంతరం బంధువులు, ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర నాయకుడు కొర్స నర్సిమూర్తి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకుడు ఉయిక శంకర్‌తో కలిసి ఆశ్రమ పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. విద్యార్థి మృతికి కారణమైన వార్డెన్ శ్రీను, హెచ్ఎం నాగరాజుపై చర్యలు తీసుకోవాలని, వినీత్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నినదించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగింది. వినీత్ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు బాలుడి తల్లి శైల కుమారికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వార్డెన్, హెచ్ఎం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సర్వేను సద్వినియోగం చేసుకోవాలి అదనపు కలెక్టర్ సంధ్యారాణి వరంగల్: కులగణన సర్వేను ప్ర జలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి కోరారు. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్, కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయం, కరీమాబాద్ మీసేవ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆదివారం తనిఖీ చేశారు. ఆ యా కేంద్రాల్లో రీసర్వేలో నమోదు వివరాల తీరు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనవు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28 వరకు సర్వే నిర్వహిస్తారని, ఇప్పటివరకు నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం తిరిగి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. వరంగల్‌లోని పోచమ్మమైదాన్ ఈసేవ కేంద్రం, కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ కేంద్రం, కరీమాబాద్ మీసేవ కేంద్రం, నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పాలన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతీరోజు ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–21111 1111 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా https://seeepcsurvey.cgg.gov.in నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి ప్రజాపాలన కేంద్రాల్లో అందించొచ్చన్నారు. ప్రజలు సర్వేకు సహకరించి పూర్తి వివరాలను ఇ వ్వాలని కోరారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, బల్దియా రెవెన్యూ అధికారి షా జాదీబేగం, పర్యవేక్షకులు హబీబుద్దీన్, ఆర్ఐ సోహైల్ పాల్గొన్నారు. -
చెస్‌తో మేధస్సు పెంపు
వరంగల్ స్పోర్ట్స్: చదరంగంతో మేధస్సు పెరుగుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జి ల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలను ఆది వారం ఎమ్మెల్యే నాయిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. మానసికంగా ధైర్యంగా ఉన్నప్పుడే జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొంటామన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 170 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు నాలుగు రౌండ్లు ముగియగా అందులో అల్లాడి శ్రీవాట్సన్, రజనీకాంత్, కొమురవెల్లి, వివేక్, ఆధ్య, రవీంద్రనాథ్ ముందంజలో ఉన్నారని తెలిపారు. టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, ఆర్బిటర్లు పాల్గొన్నారు.● ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ● జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభం -
అమెరికా అమ్మాయి.. నీరుకుళ్ల అబ్బాయి
హన్మకొండ చౌరస్తా: అమెరికా దేశంలోని టొరంటోకు చెందిన జెస్సికా, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన సతీష్ వివాహం ఆదివారం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ సమీప ఏఆర్ఆర్ గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ వివాహానికి అమ్మాయి తల్లి, సోదరి మరో ఇద్దరు బంధువులు, వరుడి తరఫు బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన సతీష్‌కు 2021 సంవత్సరం కరోనా సమయంలో నిర్వహించిన పలు సామాజిక కార్యక్రమాల్లో జెస్సికా పరిచయం అయింది. అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరి మనసులను అర్థం చేసుకున్న ఇరువురి తల్లిదండ్రులు వేదమంత్రా ల సాక్షిగా వివాహతంతు జరిపించి ఒక్కటి చే శారు. ఈ వివాహ వేడుకను చూసిన బంధువులు, స్నేహితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
ప్రజాప్రభుత్వంలో సోషల్ మీడియా పాత్ర కీలకం
హన్మకొండ చౌరస్తా: పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి సోషల్ మీడియా కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేశారని, ప్రజాప్రభుత్వ ఏర్పాటులో సోషల్ మీడియా పాత్ర కీలకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జ్ నేహాల్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని డీసీసీ భవన్లో ‘సోషల్ మీడియా వారియర్స్– కాఫీ విత్ ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్‌మీడియా విశేష కృషి చేసిందన్నారు. పదేళ్లలో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన కార్యకర్తల పై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్‌మీడియా వారియర్స్ శ్రమను గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో తొలిసారి ‘కాఫీవిత్ ఎమ్మెల్యే కార్యక్రమం’ చేపట్టడం అభినందనీయమన్నారు. సమావేశంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, డాక్టర్ నాయి ని గోదావిష్ణువర్ధన్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షరాలు బంక సరళ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి రమేశ్, నాయకులు తిరుపతిరెడ్డి, జీవన్‌రెడ్డి, హుస్సేన్, లక్ష్మి, భరత్, చందు, రమేశ్ పాల్గొన్నారు.● ‘కాఫీ విత్ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో నాయిని -
టీఆర్‌ల జారీలో ‘విజిలెన్స్’ విచారణ!
వరంగల్: సీసీఐ పత్తి కొనుగోలు చేసేందుకు టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్)ల జారీలో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించిన మార్కెటింగ్‌శాఖ రాష్ట్రంలోని ఏడుగురు మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన విషయం విధితమే. వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతోనే కార్యదర్శులు టీఆర్‌లు జారీ చేసినట్లు గుర్తించిన మార్కెటింగ్ శాఖ మొత్తం ఈ వ్యవహారంపై నిజనిజాలను నిర్ధారించేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్కు అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విచారణలో టీఆర్‌ల జారీలో ప్రమేయం ఉన్న వ్యవసాయ అధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు మరికొంత మంది మార్కెట్ కార్యదర్శుల వ్యవహారం బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏఓల ఇష్టారాజ్యం.. రైతుల నుంచి పత్తిని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేసేందుకు టీఆర్‌ల కోసం ధ్రువీకరణ పత్రాల జారీలో కొంత మంది వ్యవసాయ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహారించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పత్రాలు క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మాత్రమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి జారీ చేయాలని వ్యవసాయ శాఖ నుంచి స్పష్టంగా నిబంధన ఉంది. అయినప్పటికీ కొంత మంది ఏఓలు అడ్డగోలుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓ జిల్లాలో ఏకంగా ధ్రువీకరణ పుస్తకాన్ని ప్రింట్ చేయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు చేసే 80 మార్కెట్ కమిటీల్లో టీఆర్‌ల జారీపై మార్కెటింగ్ శాఖ అధికారులు విచారణ చేపట్టగా నిబంధనల పట్టించుకోకుండా సుమారు 46 వేలకు పైగా టీఆర్‌లు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు. 20 మార్కెట్ కమిటీల్లో ఈ వ్యవహారం జరిగినట్లు గుర్తించినప్పటికీ ఫిర్యాదు వచ్చిన మార్కెట్ కమిటీ కార్యదర్శులను మొదటి విడతగా సస్పెండ్ చేశారు. రెండో విడత మరికొంత మందిపై వేటు పడే అవకాశలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విచారణలో వ్యవసాయ అధికారుల ప్రమేయం బహిర్గతమైతే వారిపై చర్యలు తప్పవన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఏడుగురిపై వేటు, త్వరలో మరికొందరిపై.. వ్యవసాయశాఖ ప్రమేయంపై ఆరా ఉమ్మడి జిల్లాలో మరికొందరిపై వేటుకు మల్లగుల్లాలు -
26న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం
● భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకుడు శేషు హన్మకొండ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 26న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకుడు శేషు తెలిపారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోట ల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓరుగల్లు వైభవాన్ని, శివతత్వాన్ని చాటేలా ఆధ్యాత్మిక నిలయమైన ఓరుగల్లు గడ్డ మీద ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ప్రతి సంవత్సరం మాదిరిగానే మహా శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఓరుగల్లు ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాకేశ్‌రెడ్డితోపాటు గేయ రచయిత వెన్నెల శ్రీనాథ్, శాసీ్త్రయ నృత్య కళాకారిణి చిరంజీవి హిమాన్సీ కాట్రగడ్డ, ఇండస్ ఫౌండేషన్ మహా శివరాత్రి కార్యక్రమ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
మెరుగైన సేవలతో వైద్య ఖర్చులు తగ్గించొచ్చు
ఎంజీఎం/దామెర: ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రజలకు మెరుగ్గా అందించడం వల్ల వారిపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ అన్నా రు. ఆదివారం ఆయన దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ల్యాబ్, ఫార్మసీ, వ్యాక్సిన్ స్టోర్, ఆయుష్, ఎన్సీడీ, ఇతర విభాగాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం రవీంద్రనాయక్ మాట్లాడు తూ ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివిధ ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించడం, పీహెచ్సీ సేవలు అందించడం ద్వారా వారు ఉన్నత స్థాయి వైద్య సేవలకు వెళ్లకుండా కాపాడవచ్చన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లోని 12 రకాల వైద్య సేవలు సక్రమంగా అందించాలని చెప్పారు. టీబీ, లెప్రసీ, ఎన్సీడీ కార్యక్రమాల్లో గుర్తించిన వారికి తగిన చికిత్సతో పాటు ఫాలోఆప్ సేవలు ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, పీఓడీటీటీ డాక్టర్ కె.లలితాదేవి, ప్రో గ్రాం అధికారులు డాక్టర్ హిమబిందు, డాక్టర్ ఇస్తేదార్ అహ్మద్, డాక్టర్ మంజుల, వైద్యాధికారి డాక్టర్ మహేంద్ర, డాక్టర్ ప్రమోద్‌కుమార్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, సీహెచ్ఎన్ లీల, సూపర్వైజర్లు శ్రీకాంత్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ -
టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించాలి
కేయూ క్యాంపస్: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ది పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ క్రీడామైదానంలో మార్నింగ్ వాకర్స్, అధ్యాపకులను కలిసిన ఆయన.. తనను గెలిపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. శాసనమండలిలో గళమెత్తి పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి కృషిచేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, బాధ్యులు దేవిరెడ్డి, కొండారెడ్డి, డాక్టర్ కుందూరు సుధాకర్, మహేందర్‌రెడ్డి, విజయ్‌పాల్ పాల్గొన్నారు. మార్నింగ్ వాకర్స్‌ను కోరిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి -
నేడు, రేపు యువజన క్రీడోత్సవాలు
వరంగల్ స్పోర్ట్స్: నెహ్రూయువ కేంద్రం ఆధ్వర్యాన ఈనెల 17, 18వ తేదీల్లో సుబేదారిలోని ఆర్ట్స్ కాలే జీ మైదానంలో వరంగల్ జిల్లా స్థాయి యువజన క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌వైకే జిల్లా అధికా రి చింతల అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తా లూకా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలు పొందిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొనేందు కు అర్హులుగా పేర్కొన్నారు. యువకులకు వాలీ బాల్, అథ్లెటిక్స్, షటిల్‌బ్యాడ్మింటన్, యువతులకు కబడ్డీ, షటిల్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈపోటీల్లో పాల్గొనే క్రీ డాకారుల వయస్సు 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు 93908 31502 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
నీటి శుద్ధి.. అవినీతి బుద్ధి!
వరంగల్ అర్బన్: నీటి శుద్ధి పేరిట ప్రజాధనం పక్కదారి పడుతోంది. తెరవెనుక రహస్య ఒప్పందాల మేరకు లక్షల సొమ్ము చేతులు మారుతోంది. బల్దియా పాలకవర్గం అధికారుల గూడుపుఠాణితో ప్రజాధనం నీళ్లలా ఖర్చవుతోంది. ఏ పార్టీ అధికా రంలో ఉన్నా.. ఒకే ఒక్క కాంట్రాక్టర్‌ది ఆడింది ఆట.. పాడింది పాటగా నడుస్తోంది. ఉన్నతాధికారుల్ని మచ్చిక చేసుకోవడంలో, వారికీ వాటాలు పంచడంలో అతడిది అందెవేసిన చెయ్యి అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యవేక్షణ కరువు.. ఆలమ్, క్లోరిన్, సిలిండర్లు, బ్లీచింగ్ పౌడర్ సరఫరా సమయంలో ఎంత వచ్చిందో పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. నీటి శుద్ధికి ఆలమ్ ఉపయోగించా ల్సి ఉంటుంది. కానీ.. ఇక్కడ సిబ్బంది ఇష్టారాజ్యంగా కలుపుతున్నారు. ఏమోతాదులో కలపాలో కార్మికులకు తెలియక, పరీక్షలు చేయకపోవడంతో నల్లాల్లో నీరు కలుషితమవుతున్నదని ప్రజల్లో అపనమ్మకం ఉంది. అందుకే తాగడానికి మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేస్తూ.. వ్యక్తిగత అవసరాలకు నల్లా నీటిని వినియోగిస్తు న్నారు. అయితే మాకెందుకులే.. మాకొచ్చే సొమ్ము వస్తుంది కాదా.. అన్నట్లుగా ఇంజినీర్లు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. బల్దియా ఏడాదికి నీటి శుద్ధి కోసం రూ.2.50 కోట్లు వెచ్చిస్తోంది. అంతే కాకుండా.. ప్రజారోగ్యం విభాగంలో బ్లీచింగ్ ఫౌడర్ కోసం రూ. 80 లక్షల సొమ్ము ఖర్చు చేస్తోంది. ఈ రసాయనాలు సరఫరా చేసేది ఒకే వ్యక్తి కావడం గమనార్హం. రెండు, మూడు ఏళ్లుగా కాదు.. ఏళ్ల తరబడి అతడికి అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపకల్పన చేస్తున్నారు. ఆయనకున్న లైసెన్స్‌లు, డీలర్ షిప్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కాంట్రాక్టు దక్కేలా ఇంజనీరింగ్ విభాగంలోని డీబీ సెక్షన్ ఇంజనీర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. కాంట్రాక్టు విధానం వెనుక పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఉత్తుత్తి పరీక్షలే! నీటి శుద్ధికి సంబంధించిన ప్రయోగశాలల జాడే నగరంలో కనిపించడం లేదు. వాస్తవానికి అన్ని చోట్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీటి పరీక్షలు నిర్వహించిన అనంతరం నల్లాలకు నీటి సరఫరా చేయాలి. కానీ.. దీనిపై ఇంజినీరింగ్ సిబ్బంది పెద్దగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ఫలితంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కలుషిత, బురద, దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోంది. ఆనీరు తాగలేక ఇతర అవసరాలకు తీర్చుకుంటున్నారు. అపనమ్మకంతో తాగునీటి కోసం మినరల్ వాటర్ క్యాన్ల ద్వారా, ఇతర ప్లాంట్ల ద్వారా కొనుగోలుకు నగర ప్రజానీకం రూ.కోట్లు వెచ్చిస్తోంది. నీటి శుద్ధి పేరిట సాగుతున్న అవినీతి దందాపై మేయర్, కమిషనర్, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు ఉన్నాయి. తనిఖీ చేస్తాం.. నీటి శుద్ధి కోసం కొనుగోలు చేసే ఆలమ్, క్లోరిన్, బ్లీచింగ్ పౌడర్ సరఫరా, వినియోగా న్ని ఎప్పుటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. ఏమైనా తేడాలొస్తే చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్ చంద్ర, బల్దియా ఎస్ఈఫిల్టరింగ్ పేరిట రూ.కోట్ల మేత 20 ఏళ్లుగా బల్దియాను శాసిస్తున్న బడా కాంట్రాక్టర్ ఆతడికి అనుకూలంగానే టెండర్ నిబంధనలు ఆలమ్, క్లోరిన్ సరఫరాలో అక్రమాలు కొనేదానికి..వచ్చేదానికి వ్యత్యాసంవ్యత్యాసం! నగరంలోని దేశాయిపేట ప్రతాపరుద్ర, కేయూ రూద్రమాంబ, వడ్డేపల్లి, ధర్మసాగర్ రిజర్వాయ ర్ వద్ద తాగునీటి శుద్ధి చేసే ఫిల్టర్బెడ్లు ఉన్నా యి. ధర్మసాగర్ నుంచి వచ్చిన రా వాటర్ ఆయా ఫిల్టర్బెడ్ల ద్వారా శుద్ధీకరణ జరుగుతోంది. అందుకోసం వినియోగించే ఆలమ్, క్లోరిన్ మోతాదునిబంధనలు పాటించిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. వీటి పేరుతో రూ.కోట్ల సొమ్ము పక్కదారి పడుతోంది. లక్షల కేజీలు కొంటున్నట్లుగా చెబుతున్నా.. బయట మార్కెట్‌కు, కాంట్రాక్టర్‌కు సరాఫరా చేసే ధరకు కేజీకి రూ.10 నుంచి రూ. 20 వరకు తేడా ఉంటోంది. -
‘సంకటహర’ పూజలు
హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సంకటహరచతుర్థి పూజలు ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన వేదపండితులు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషే కం, సాయంత్రం 7 గంటలకు ఉత్తిష్టగణపతికి జల, క్షీర, పంచామృతం, నవరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు. ఇష్టమైన గరికతో షోఢశోపచార పూజలు చేశారు. 21 నుంచి మూడేళ్ల ‘లా’ మొదటి సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణా ధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిమ్ ఇక్బాల్ తెలిపారు. ఈనెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నా రు. అలాగే ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు ఐదవ సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 22, 25, మార్చి 1, 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు మరో అవకాశంవిద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ సైన్స్, ఒకేషన ల్ కోర్సుల విద్యార్థులకు ఈనెల 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలకు వివిధ కారణాలతో హాజరుకాని విద్యార్థులకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాలలో ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని, ఇప్పటివరకు పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా సంబంధి త కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సహకరించాలని కోరారు. ముగిసిన ‘ఇన్నోథాన్–2.0’ కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న ‘ఇన్నోథాన్–2.0’ కార్యక్రమం ఆదివా రం ముగిసింది. నిట్ వరంగల్, హిటాచీ ఎనర్జీ సంయుక్తంగా నిర్వహించిన 30 గంటల ఎనర్జీ ఇన్నోవేషన్ ఇన్నోథాన్లో వివిధ కళాశాలల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొని నూత న ఆవిష్కరణలకు పోటీపడ్డారు. ముగింపులో భాగంగా నిర్వాహకులు విజేతలకు బహుమతులు, నగదు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ వేణువినోద్ తదితరులు పాల్గొన్నారు. నిట్‌లో ‘చిగురు–24’ వేడుకలుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్, యూత్ ఫర్ సేవా, యూత్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యాన వరంగల్ నిట్‌లో ‘చిగురు–24’ వేడుకలు ఆదివారం జరిగాయి. నగరానికి చెందిన 12 ప్రభుత్వ పాఠశాలల నుంచి 1,200 మంది విద్యార్థులు పాల్గొని కళలు, క్రీడలు, సాహిత్య రంగాల్లో 15 రకాల పోటీల్లో ప్రతిభ చాటారు. ఇందులో విద్యార్థులు రూపొందించిన అయోధ్య రామమందిర నమూనా విశేషంగా ఆకట్టుకుంది. నేడు గ్రేటర్ గ్రీవెన్స్వరంగల్: వరంగల్ మహా నగరపాలక సంస్థ కౌన్సిల్హాల్లో గ్రేటర్ గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. నగర పరిధి ప్రజలు తమ సమస్యలపై విజ్ఞప్తులను కార్యాలయంలో అందజేయాలని సూచించారు. నేడు వరంగల్ ప్రజావాణివరంగల్ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకట నలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై వినతులను కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
సేవలు మరింత చేరువ
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు అత్యుత్త మ సేవలందించడంలో టీజీ ఎన్పీడీసీఎల్ పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. అందులో భాగంగా విద్యుత్ సర్వీసుల మంజూరు ను మరింత సులభతరం చేసింది. వినియోగదారు లకు కొత్త సర్వీసుల మంజూరులో డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే ఇప్పటి వరకు తిరస్కరిస్తూ వచ్చా రు. ఇకపై ఏదైనా కారణంచేత దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంటే దాన్ని తిరస్కరించకుండా మంజూరుకు అవసరమైన ప్రక్రియను పూర్తి స్థాయిలో అందించేలా విద్యుత్ శాఖ మరో అవకా శం కల్పించింది. దరఖాస్తు చేసినప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందో తెలి యక దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరిగే వారు. ట్రాకింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చాక కార్యాలయం చుట్టూ తిరిగాల్సిన అవసరమే లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగదారుడు సులభంగా తన అప్లికేషన్ నంబర్‌తో టీజీ ఎన్పీడీసీఎల్ వెబ్సైట్ నుంచి లేదా టీజీ ఎన్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా వివిధ దశల్లో ఉన్న అప్లికేష న్ స్థితిని తెలుసుకోగలుగుతారు. అయినప్పటికీ సంతృప్తి చెందకపోతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అందుబాటులోకి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టం విద్యుత్ వినియోగదారులకు తప్పిన తిప్పలు -
ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ
హన్మకొండ: ‘ప్రజాసమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది.. గెలుస్తాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో విలేకరులతో, సత్యం కన్వెన్షన్‌లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నదని, పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని చెప్పా రు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో అసంతృప్తిని మూటగట్టుకుంటే.. కాంగ్రెస్ ఏడాది కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అన్నారు. గ్యారంటీలు, హామీల అమలులో.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులందరినీ మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకుని శాసన మండలి ఉద్దేశాలను దెబ్బతీశారని అన్నారు. నల్ల గొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి పులి సరోత్తంరెడ్డి, మెదక్–కరీంనగర్–నిజా మాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య, పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, అందరూ విజ యం సాధించి తీరుతారని పేర్కొన్నారు. సరోత్తంరెడ్డికి ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగా హన ఉందని, అన్ని సంఘాలు అభిమానించే వ్యక్తి ఆయన అని చెప్పారు. జేఏసీలోని సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని తెలిపా రు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు, ఆర్.పి.జయంత్‌లాల్, డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, చాడా శ్రీనివాస్‌రెడ్డి, చాడా సరిత, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలి : ఎమ్మెల్యే నాయిని ఇదిలా ఉండగా.. వరంగల్ మహానగర అభివృద్ధి కి కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు వేద బాంక్వెట్ హాల్ వద్ద ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర నుంచి వరంగల్ మహానగరానికి వివిధ పథకాల కింద రావాల్సిన నిధులను విడుదల చేయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేంద్ర పురావస్తు శాఖలో ఉన్న వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కిషన్‌రెడ్డి నిధుల విడుదలకు సహకరిస్తానని తెలిపారు. పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్‌రావు, ఈవీ శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ హనుమకొండ జిల్లా అధ్యక్షు డు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి -
సదుపాయాలను వినియోగించుకోండి
వరంగల్ లీగల్: నిత్యం కోర్టుకు వచ్చే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వసతులను సద్వినియోగం చేసుకో వాలని హైకోర్టు న్యాయమూర్తి, వరంగల్, హనుమ కొండ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్య అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ లిఫ్ట్, న్యాయవాదుల కారు పార్కింగ్ షెడ్లను జస్టిస్ భట్టాచార్య వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మల గీతాంబ, సీహెచ్.రమేశ్‌బాబు, రెండు జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, కార్యదర్శి లడే రమేశ్, బార్ కౌన్సిల్ సభ్యుడు సిరికొండ సంజీవరావు, న్యాయవాద సంఘం ప్రతినిధులు, న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ మౌసమీ భట్టాచార్య -
మురికివాడలు లేని నగరమే ధ్యేయం
హన్మకొండ చౌరస్తా: వరంగల్‌ను మురికివాడలు లేకుండా సుందర నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డ, యాదవనగర్, జ్యోతిబసునగర్ కాలనీల్లో ఆదివా రం పర్యటించిన ఆయన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతర్గతరోడ్లు, సైడ్ డ్రెయినేజీల నిర్మాణం, తాగునీరు తదితర పనులన్నింటినీ దశల వారీగా పూర్తి చేస్తామని చెప్పారు. నాయకులు రాజేందర్, కుమార్‌యాదవ్, శ్రీధర్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
వరంగల్ ఏకశిలా కాలేజీలో కీచక లెక్చరర్!
సాక్షి, వరంగల్: నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.యాజమాన్యానికి సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం.. రమేష్‌ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేటి నుంచి ‘సమగ్ర సర్వే’ దరఖాస్తుల స్వీకరణ
● 28 వరకు సమాచారమివ్వాలి ● గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్: సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను ప్రజాపాలన కేంద్రాల్లో అందించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేలో ఇప్పటివరకు నమోదు చేసుకోని ప్రజలు వివరాలివ్వాలని సూచించారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, ఆసక్తి లేకపోవడం తదితర కారణాల వల్ల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన ఇంటింటి సర్వే హౌస్లిస్ట్లో ఉండి సర్వే చేయని కుటుంబాలకు ఫిబ్రవరి 16 నుంచి 28 ఫిబ్రవరి వరకు మరో అవకాశమివ్వాలని, ప్రభుత్వం నిర్ణయించిందని అందుకోసం టోల్’ఫ్రీ నంబర్ 040–21111111 లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమాచారం అందించాలని కోరారు. ఆన్లైన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకుని సంతకం చేసి ప్రజాపాలన కేంద్రంలో అందించేందుకు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారమైనా దరఖాస్తులు చేసుకోవచ్చు.. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ జీడబ్ల్యూఎంసీ పరిధి ఈ–సేవా కేంద్రాల్లో సమగ్ర కుటుంబ సర్వే కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ తెలిపారు. కాజీపేట సర్కిల్ పరిధిలో ఐదు ప్రజాపాలన సేవా కేంద్రాలైన కాజీపేట సర్కిల్ ఆఫీస్, సుబేదారి వాటర్ ట్యాంక్ ఆఫీస్, నక్కలగుట్ట వార్డు ఆఫీస్, అశోక థియేటర్ ఎదురుగా ఈసేవ కేంద్రం, నయీమ్‌నగర్ ఈసేవ కేంద్రాల్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. -
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
గీసుకొండ: లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ బి. సాంబశివరావు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం జరిగిన పీసీపీ ఎన్డీటీ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు విధిగా ప్రతీ నెల 5వ తేదీన ఫాం ఎఫ్ నివేదికలను తమ కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో రేడియాలజిస్టు లేదా గైనకాలజిస్టు మారితే ఆ వివరాలను అందించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, మోహన్‌సింగ్, మాతాశిశు సంరక్షణ అధికారి అర్చన, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మండల పరశురాములు, డీపీహెచ్ఎన్ ఓ.జ్ఞానసుందరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సేవాలాల్ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య హన్మకొండ: సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని శనివారం హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, ప్రొఫెసర్ వీరన్ననాయక్, హనుమకొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీస ర్ రమేశ్‌రాథోడ్, సేవాలాల్ జయంతి ఉత్సవ కమి టీ బాధ్యులు నవీన్‌నాయక్, జైసింగ్ రాథోడ్, పోరిక ఈశ్వర్‌సింగ్, చిన్నబాబు, ధరావత్ రాంచంద్రనాయక్, ఉదయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి, అడవు ల సంరక్షణ, అన్ని సామాజిక వర్గాల సమానత్వం కోసం సంత్ సేవాలాల్ కృషి చేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. వరంగల్ వెస్ట్, పరకాల నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసుకుని సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. బోగ్ బండారో, పూ జా కార్యక్రమాల్లో కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు భావుసింగ్, శ్రీపాల్‌రెడ్డి, గిరిజన నాయకులు, బంజారా మహిళలు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
గజ్జల లాగు, పసుపుపచ్చ చొక్కా ధరించిన వ్యక్తిఎల్లమ్మ గవ్వల బుట్టకొత్తకొండ ఈరన్న.. కొమురెల్లి మల్లన్న.. ఎములాడ రాజన్న.. ఓదెల, ఐనవోలు మల్లికార్జున స్వామి.. ఇలా దేవాలయాలు, జాతరలు ఏవైనా శివసత్తులు, పోతరాజులుంటేనే భక్తజన సందోహం. చిన్నపట్నం, పెద్దపట్నం, అమ్మవారి బోనాలు.. పూజా కార్యక్రమాల్లో పరవశించిన శివసత్తుల శిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఈరకోల ఆటలు.. మేకపోతులు, కోడిపుంజులను గావుపట్టే పూనకాలు భక్తులను మైమరిపిస్తాయి. ఆయా ఉత్సవాలకు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువుల తయారీ, సరఫరా కేంద్రం హనుమకొండ జిల్లా నడికూడలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర.. ప్రాంతాల్లోని పేరున్న దేవాలయాల్లో శివసత్తులు, పోతరాజులు, భక్తులకు సుమారు 60 ఏళ్లుగా గజ్జెల లాగులు మొదలు ఈరకోలలు, పట్నాల గొంగడి, ఢమరుకం, శూలం.. వరకు ప్రతి ఒక్కటీ నడికూడ నుంచే సరఫరా అవుతున్నాయి. ఇరవై కుటుంబాలు సుమారు 200 మంది నిరంతరం శ్రమిస్తూ ఉపాధి పొందుతుండగా.. ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉమ్మడి వరంగల్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నడికూడకు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు. సామగ్రికి ప్రసిద్ధి.. తెలంగాణ జానపద సంస్కృతిలో నిర్వహించే పూజల్లో భాగంగా ధరించే గజ్జెల లాగుల తయారీకి నడికూడ గ్రామం ప్రసిద్ధి. కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతరలో, పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న జాతరల్లో ఈ గజ్జెల లాగులు, పసుపుపచ్చని అంగీలు ధరిస్తారు. వేములవాడ, కొండగట్టు, శ్రీశైలం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ తదితర తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చి సామగ్రిని తీసుకెళ్తారు. గజ్జల లాగులకు బ్రాండ్‌గా నడికూడ గ్రామం నిలుస్తోంది. వీటిని ధరించే వారు ఎంత నిష్టగా ఉంటారో.. తయారు చేసేవారూ అంతే నిష్టతో ఉంటారు. సెట్టు రూ.13 వేల వరకు.. శివసత్తులు, పోతరాజులు, భక్తులు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువులు 10–12 రకాలను ఒక సెట్టుగా విక్రయిస్తారు. అవసరాలను బట్టి విడివిడిగా కూడా అమ్ముతారు. ఒక సెట్టులో ఎల్లమ్మ గవ్వలు, ఈరకోల, ఢమరుకం, వల, ప్రతిమలు, కాళ్ల గజ్జలు, తౌతులు, శూలం, గొంగళి, కుల్ల(గవ్వల టోపీ), నిలువు ప్యాంట్లు ఉంటాయి. నాణ్యతను బట్టి ఈసెట్టును రూ.6 వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత ఆకర్షణీయంగా మెషిన్ ఎంబ్రాయిడరీతో గజ్జెల లాగుల తయారీ వస్త్రాలపై దేవతల నమూనాలను కూడా వేస్తున్నారు. పూజకు కావాల్సిన ప్రతీ సామగ్రి ఇక్కడ లభిస్తుండడంతో జాతరల సీజన్లో వివిధ ప్రాంతాల భక్తులు నడికూడ బాట పడుతున్నారు. ముహూర్తం చూసి కొనుగోళ్లు.. జాతరల సీజన్లో పట్నాలు, బోనాల మొక్కులు చెల్లించేవారు వారం రోజుల పాటు నిష్టగా ఉంటారు. ఒక్కపూట భోజనం.. ఉపవాస దీక్షలను పాటిస్తారు. ఇదే సమయంలో పట్నాలు, బోనాలు చెల్లించేవారు.. ప్రత్యేక దుస్తులు, వస్తువులను కూడా దైవసమానంగా భావిస్తారు. అందుకే వీటిని కొనేటప్పుడు మంచి ముహూర్తం చూసి కొంటారని దుస్తుల తయారీదారులు చెబుతున్నారు. మల్లన్న బుట్టన్యూస్రీల్ పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా.. వీటి తయారీని నమ్ముకున్న 200 మంది 60 ఏళ్లుగా ఉపాధి పొందుతూ..భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం.. గజ్జెల లాగులు కొనడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం. వర్క్ కూడా చాలా బాగా ఉంటుంది. – రావుల సుమలత, నడికూడ -
వేసవిలో విద్యుత్ సమస్యలుండవు..
వేసవిలో వినియోగదారులకు విద్యుత్ సమస్యలు ఉండకుండా అన్ని విధాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. ఈసారి ఫిబ్రవరి నుంచి విద్యుత్ సరఫరా డిమాండ్, విద్యుత్ వినియోగం పెరిగింది. ఈక్రమంలో ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకుని పనులు పూర్తి చేయించడం కలిసి వచ్చింది. – కె.వెంకటరమణ, ఎస్ఈ, హనుమకొండ సర్కిల్ ఈనెలాఖరు వరకు మిగతా పనులు పూర్తి వేసవిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రూపొందించుకున్న ప్రణాళికలో భాగంగా మిగిలిఉన్న పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం. అవసరమైన చోట కొత్త ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నాం. వేసవిలోనూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్‌ను అందించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. – పి.మధుసూదన్‌రావు, ఎస్ఈ, వరంగల్ సర్కిల్ -
నిట్‌లో ‘క్యూరా–25’ వేడుకలు షురూ
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లోని రామన్ సెమినార్ హాల్లో రెండు రోజులపాటు జరిగే 14వ నేషనల్ లెవల్ మేనేజ్మెంట్ ఫెస్టివల్ ‘క్యూరా–25’ వేడుకలను శనివారం టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి కర్నాటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ స్కూల్ విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకునే నూతన ఆవిష్కరణలకు వేదికగా ‘క్యూరా–25’ నిలవాలని అన్నారు. ప్రపంచం భారతదేశాన్ని వ్యాపార కేంద్రంగా చూస్తోందని, ఇందుకు తగ్గట్టుగా బిజినెస్ స్కూల్ విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా 120 మంది బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొంటారని, ఏడు రకాల పోటీలు నిర్వహించనున్నట్లు క్యూరా స్టూడెంట్ కోఆర్డినేటర్ శర్ధిల్ తెలిపారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు వేణువినోద్, సునీత, మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాక హన్మకొండ: నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈనెల 16న హనుమకొండ పర్యటనకు వస్తున్నట్లు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి తెలిపారు. కిషన్‌రెడ్డి ఆదివారం ఉదయం 10.30 గంటలకు హనుమకొండకు చేరుకుని హంటర్ రోడ్‌లోని వేద ఫంక్షన్ హాల్లో జరిగే విలేకరుల సమావేశంలో పాల్గొంటారని, 11.30 గంటలకు సత్యం కన్వెన్షన్ హాల్లో జరిగే మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలి కేయూ క్యాంపస్: ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. టీపీఎస్సీ ద్వారా గత ఏడాది డిసెంబర్లో 10 మందిని కేయూకు కేటాయించగా ఎనిమిది మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికాగా.. ఆరుగురికి వివిధ సెక్షన్లలో పోస్టింగ్‌లు ఇవ్వగా వారు విధుల్లో చేరారు. వారితో శనివారం అకడమిక్ కమిటీహాల్లో నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడారు. ఉద్యోగ విధుల నిర్వహణలో క్రమశిక్షణ, విధేయత అవసరమని, సర్వీస్ రూల్స్‌పై పట్టుసాఽధించాలని చెప్పారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీహెచ్.ప్రణయకుమార్, డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికతో చదివితే అత్యుత్తమ ఫలితాలు విద్యారణ్యపురి/హన్మకొండ: విద్యార్థులు ప్రణాళికతో చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని వడుప్సా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాదాల సతీష్‌కుమార్ అన్నారు. వడుప్సా ఆధ్వర్యాన శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవనంలో ప్రయివేట్ హైస్కూళ్లకు చెందిన పదో తరగతి విద్యార్థుల కు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు అనగానే భయపడొద్దని, సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించుకుని మోడల్ ప్రశ్నాపత్రాలను కూడా అనుసరించి సన్నద్ధం కావాలన్నారు. మోటివేషనల్ స్పీకర్ బారపాటి గోపి పలు సూచనలు చేశారు. జనరల్సెక్రటరీ విజ్ఞానేశ్వర్, కోశాధికారి వి.ముక్తేశ్వర్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాముల పరిశీలన వరంగల్: సాధారణ తనిఖీల్లో భాగంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా గోదాములను కలెక్టర్ సత్య శారద, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి శనివారం పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూం గోదాములకు సంబంధించిన రికార్డులు, భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ ఇక్బాల్, నాయ బ్ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు. -
ఎంజేపీ విద్యార్థులకు అస్వస్థత
హసన్‌పర్తి: మండల పరిధి జయగిరి శివారులోని మహాత్మాజ్యోతిరావు పూలే బాలుర గురుకులంలో శుక్రవారం రాత్రి ఆరుగురు విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. కడుపు నొప్పి రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇందులో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. బాదం కాయలు తినడంతో వారు అ స్వస్థతకు గురైనట్లు తెలిపారు. కాగా, విద్యార్థుల ఆ రోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, సంఘటన జరి గిన రోజు రాత్రే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తహసీల్దార్ చల్లా ప్రసాద్ పేర్కొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద వరంగల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా బోధన సాగాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపుపై శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి అధికారులతో మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు చాలా కీలకమని పేర్కొన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాల ని, వారాంతపు పరీక్షలు, రివిజన్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఉదయం పిల్లలకు రాగి జావ, సాయంత్రం సైతం అల్పాహా రం అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి దేశాయిపేట: తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయ ని కలెక్టర్ సత్యశారద అభిప్రాయపడ్డారు. దేశాయిపేట ప్రభుత్వ పాఠశాల, ఎల్బీనగర్లోని మసూంఅలీ పాఠశాలల్లో జరిగిన సమావేశాల్లో కలెక్టర్ పాల్గొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం జిల్లా వ్యాప్తంగా 125 పాఠశాలల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్ధులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులు సమన్వయంతో పనిచేసి పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలని చెప్పారు. 9,237 మంది విద్యార్థులకు 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. -
‘సమ్మర్’కు సిద్ధం
20 ఏళ్లుగా వస్తున్నాను.. ఏ పట్నం వేయాలన్నా కావాల్సిన పూజా సామగ్రి కోసం నడికూడకు రావాల్సిందే. నేను 20 ఏళ్లుగా వచ్చి తీసుకుని వెళ్తున్నాను. రూ.12 వేల నుంచి రూ.15 వేలలో నాణ్యమైన గజ్జెల లాగు సెట్టు దొరుకుతుంది. – రామ్మూర్తి, కేసముద్రం ●– వివరాలు 8లోuగద్దెల ప్రాంగణంలో భక్తులు హన్మకొండ: రోజురోజుకూ ఎండలు మండుతుండడంతో విద్యుత్ సరఫరా డిమాండ్ క్రమేపీ పెరుగుతోంది. వేసవిలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు ఈసారి టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబర్చింది. ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్తోంది. డివిజన్లు, సర్కిళ్ల వారీగా ప్రత్యేకంగా వేసవి ప్రణాళికను రూపొందించుకుంది. ఈప్రణాళిక అమలుకు కార్యాచరణ రూపొందించుకుని వేసవిలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించారు. హనుమకొండ సర్కిల్లో ఈనెల 5న గరిష్టంగా 5.41 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. రాబోయే మూడు నెలల్లో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అంచనాలు ఉండడంతో సరిపడా సదుపాయాలు కల్పించారు. వేసవి ప్రణాళికలో భాగంగా హనుమకొండలో కొత్తగా 16 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా.. మరో 40 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. అయిదు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. ప్రత్యామ్నాయం ఏర్పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలోనీ, మెయింటనెన్స్ సమయంలో, ఇతర కారణాల చేత ఒక లైన్లో లేదా సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే అంతరాయాలు లేని విద్యుత్ అందించేందుకు 7 ప్రత్యామ్నాయ (ఇంటర్ లింకింగ్) విద్యుత్ లైన్లు వేశారు. వేసవి ముందస్తు ప్రణాళికలో భాగంగా వరంగల్ జిల్లాలో కొత్తగా 124 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 13 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. 9 సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, మెయింటనెన్స్ సమయంలో కానీ, ఇతర కారణాల చేత కానీ ఒక లైన్లో లేదా సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే అంతరాయాలు లేని విద్యుత్ అందించేందుకు 16 ప్రత్యామ్నాయ (ఇంటర్ లింకింగ్) విద్యుత్ లైన్లు వేశారు. మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు హనుమకొండ జిల్లాలో 40 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు 16 కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వరంగల్ జిల్లాలో కొత్తగా 124.. 13 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు సబ్స్టేషన్ల సామర్థ్యం కూడా.. ఇంటర్ లింకింగ్ లైన్లు సిద్ధం -
కాంట్రాక్టు టీచర్లుగా ఉత్తర్వులు
జిల్లాలో 14 మంది అభ్యర్థులకు పోస్టింగ్‌లు విద్యారణ్యపురి: 2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన బీఈడీ అభ్యర్థులకు శనివారం పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. హనుమకొండ జిల్లాకు 18 మందిని కేటాయించగా.. వారికి శుక్రవారం రాత్రి మెసేజ్‌ల రూపంలో సమాచారం ఇచ్చి మరుసటి రోజు కాంట్రాక్టు టీచర్లుగా నియమాక పత్రాలు అందజేసేందుకు కలెక్టర్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ వాసంతి పర్యవేక్షణలో పీజీ హెచ్ఎంలతో ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించారు. 18 మందికి గాను 14మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇద్దరు అభ్యర్థులు తాము అందుబాటులో లేమని ఈనెల 16న హాజరుకానున్నట్లు డీఈఓ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. మరో ఇద్దరు ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో రెగ్యులర్ టీచర్లుగా ఉద్యోగంలో చేరారు. హాజరైన వారికి డీఎస్సీ ర్యాంకుల ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందించి.. వివిధ మండలాల్లోని ఖాళీలను చూపించగా ఎంపిక చేసుకున్నారు. వీరు ఏప్రిల్ 23వ తేదీ వరకు కాంట్రాక్టు టీచర్లుగా కొనసాగుతారు. వేసవి సెలవుల అనంతరం తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం నుంచి విధుల్లో చేరి విధులు నిర్వర్తిస్తారు. -
24 కిలోల గంజాయి స్వాధీనం
ఖిలా వరంగల్: రైలులో గంజాయి తరలిస్తున్న దంపతులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.6 లక్షల విలువైన 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్లో సంబంధిత అధికారులు నిఘా పెట్టారు. ఈక్రమంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు గోగి శంకర్‌దాస్– గోగి పూర్ణిమదాస్లు ఒడిషాలో ప్రదీప్ అనే గంజాయి స్మగ్లర్ వద్ద 24 కిలోల గంజాయి కొనుగోలు చేసి ముంబై–భవనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరారు. శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్లో రైలు దిగి బయటకు వెళ్లేందుకు యత్నిస్తుండగా.. డగ్స్ కంట్రోల్ టీం, మిల్స్‌కాలనీ ఎస్సై సురేశ్ వారి బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి లభించింది. వారిని అరెస్టు ఎండు గంజాయి, 2సెల్ఫోన్లు స్వాధీన పర్చుకుని మిల్స్‌కాలనీ స్టేషన్‌కు తరలించారు. -
ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి
వరంగల్ చౌరస్తా: ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఐక్యమత్యంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరావది లక్ష్మి నారాయణ తెలిపారు. శుక్రవారం వరంగల్, హనుమకొండ జిల్లాల ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశం వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా లక్ష్మీనారాయణ హాజరై మా ట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణ మహా సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, అమూల్య మైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాబోయే కాలంలో ఆర్యవైశ్యుల విద్య, వైద్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో భారీ భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రేణుకుంట్ల గ ణేష్ గుప్తా, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఆగిరి వెంకటేష్, గార్లపాటి శ్రీనివాస్, తోట సురేష్, తల్లాడ వెంకటరామయ్య, రమేశ్, పవిత్ర శ్రీనివాస్, దొడ్డమోహన్ రావు, శ్రీనివాస్, శ్రీ రామ్ రవీందర్ పాల్గొన్నారు. మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ -
పలువురు విద్యార్థులకు అస్వస్థత
● బాదంకాయలనుకుని వేరే కాయలు తిన్న జయగిరి వసతి గృహం విద్యార్థులు ● ఆరుగురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు ఎంజీఎం : హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలోని మహాత్మా రావుజ్యోతి పూలే వసతి గృహంలో బాదంకాయల మాదిరిగా ఉన్న వాటిని తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు శుక్రవారం బాదంకాయలు అనుకుని అదేమాదిరిగా ఉన్న వేరేకాయలను తిన్నారు. విషయం తెలుసుకున్న వైద్యార్యోగశాఖాధికారులు అక్కడికి చేరుకుని వారిని పరిశీలించారు. వసతి గృహంలోనే చికిత్స అందించినట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఐదవ తరగతి చదువుతున్న సుశాంత్, సచిన్, హరికృష్ణ, సామ్యూల్, చందు, రిషిత్లను మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. -
బ్యాంకు ఉద్యోగుల ధర్నా
హన్మకొండ చౌరస్తా: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వరంగల్ జిల్లా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో అశోక జంక్షన్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద వివిధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సమితి అధ్యక్షుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో పనిఒత్తిడికి సరిపడా నియామకాలు చేపట్టాలని, ఐదు రోజుల పనిదినాలు వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగులకు పనిచేసే ప్రాంతంలో రక్షణ కల్పించాలని, వర్క్‌మెన్ డైరెక్టర్, ఆఫీసర్లు, డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలపైన వేసే ఆదాయ పన్ను బ్యాంకులే భరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 21న మరో ధర్నాతోపాటు మార్చి 3న పార్లమెంట్ ఎదుట ధర్నా, మార్చి 24, 25వ తేదీల్లో దేశవ్యాప్త సమ్మెలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సమన్వయ సమితి కార్యదర్శి శశిధర్‌రెడ్డి, రాకేష్, కృష్ణమోహన్, రఘు, వేణుమాధవ్, ఏఐబీఓసీ దిలీప్‌కుమార్, అనిల్, సుందర్ నాయక్, శ్రీనివాస్, సాహిత్య, శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రైల్వే బ్లాక్‌తో పలు రైళ్ల దారి మళ్లింపు
కాజీపేట రూరల్: కాజీపేట–విజయవాడ మధ్య జరుగుతున్న రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో పలు రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు దారి మళ్లించి నడిపిస్తున్నట్లు తెలి పారు. రైళ్ల దారి మళ్లింపుతో కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల నుంచి వివిద ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడనున్నారు. దారి మళ్లించిన రైళ్లు ఇవే.. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు షాలీమార్–హైదరాబాద్ (18045) డైలీ వెళ్లే షాలీమార్ ఎక్స్‌ప్రెస్, ముంబాయి–భువనేశ్వర్ (11019) డైలీ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్–ముంబాయి (11020) డైలీ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్–షాలీమార్ (18046) డైలీ వెళ్లే షాలీమార్ ఎక్స్‌ప్రెస్, ఈ నెల 19వ తేదీన షాలీమార్–సికింద్రాబాద్ (22849) వెళ్లే షాలీమార్ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్ ఈ నెల 18, 19వ తేదీన ఆదిలాబాద్–తిరుపతి (17406) డైలీ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో రీషెడ్యూల్‌గా నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ‘వందేభారత్’ కోచ్‌ల తగ్గింపుఈ నెల 19వ తేదీ నుంచి కాజీపేట మీదుగా నాగపూర్ – సికింద్రాబాద్– నాగపూర్ (20101/201002) మధ్య ప్రవేశపెట్టిన నాగపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను తగ్గించి నడిపిస్తున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. నాగపూర్–సికింద్రాబాద్ ప్రధాన నగరాల ప్రాధాన్యతను, ఈ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి పెద్దగా ఆధారణ రాకపోవడంతో కోచ్‌ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గడిచిన 5 నెలల్లో ఆక్యుపెన్సీ రేటు కేవలం 33 శాతం మాత్రమే ఉండటడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని 20 నుంచి 8 కోచ్‌లకు తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఎక్స్‌ప్రెస్‌కు సిర్పూర్కాగజ్నగర్, మంచిర్యాల, పెద్దపల్లి స్టేషన్లో హాల్టింగ్ కల్పించాలని ప్రయాణికుల డిమాండ్ ఉంది. భక్తులపై తేనెటీగల దాడి ఎస్ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా మేడారం జాతరకు శుక్రవారం వచ్చిన భక్తులపై తేనెటీగలు దాడి చేయగా సుమారు 15మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి తరలించగా వైద్యాధికారులు చికిత్స చేశారు. వైద్యశిబిరం సందర్శనకు వచ్చిన డీఎంహెచ్ఓ గోపాల్‌రావు చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తేనెటీగల దాడిలో గాయపడినవారితో కలిసి శుక్రవారం 110 మందికి వైద్యసేవలు అందించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. మేడా రం జాతరలో ఈగలు, దోమలు వ్యాపించకుండా మటన్, చికెన్ షాపులు ఏర్పాటు చేసిన యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అవగాహన కల్పించారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సందర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అ ధికారులు డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ య ము న, డీపీఎంఓ సంజీవరా వు, దుర్గారా వు, వైద్యాధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎత్తు బంగారంతో అమ్మవారి ప్రతిరూపం
అమ్మవార్లకు మొక్కుగా సమర్పించే ఎత్తు బంగారంతో సమ్మక్క, సారలమ్మల ప్రతిరూపాలుగా అలంకరించిన హైదరాబాద్‌కు చెందిన రాముయాదవ్ కుటుంబ సభ్యుల తీరు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘తరతరాల నుంచి అమ్మవార్లను పూజిస్తున్నాం. ప్రతీ మహాజాతరకు కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం 500 మంది కలిసి మేడారానికి వస్తుంటాం. మినీజాతర సందర్భంగా జాతరకు వచ్చి అమ్మవార్లకు ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తాం. అలాగే అమ్మవార్లకు మొక్కుగా 10 రకాల మద్యాన్ని ఆరగించి పూజలు చేశామని, యాటపోతుతో నైవేద్యం సమర్పించాం విడిది చేసే చోట బంగారంతో అమ్మవార్ల ప్రతిరూపాలను చేసి పూజలు, నైవేద్యం సమర్పించాకే గద్దెలకు వెళ్లి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ’ అని వారు తెలిపారు. -
‘జంపన్న’లో స్నానం..అమ్మవార్ల దర్శనం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణం శుక్రవారం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, ఎత్తు బంగారం, పూలు, పండ్లు, ఒడి బియ్యం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం పరిసరాలన్నీ భక్తుల రద్దీతో కనిపించాయి. మొక్కుల అనంతరం భక్తులు వంటావార్పు చేసుకొని సహఫంక్తి భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా నేటి (శనివారం)తో మేడారం మినీజాతర ముగియనుంది. జాతరలో మెరుగ్గా పారిశుద్ధ్య పనులు.. మేడారం మినీజాతరలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా సాగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా కార్మికులు చెత్తా, చెదారాన్ని తొలగించి శుభ్రం చేస్తున్నారు. రోడ్ల వెంట దుమ్ము, దూళి లేవకుండా ట్యాంకర్లతో నీళ్లు చల్లుతున్నారు. డీపీఓ దేవరాజ్ పారిశుద్ధ్య పనులు నిరంతరం పర్యవేక్షిస్తూ చెత్త సేకరణపై కార్మికులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. భక్తులకు ఉచిత తాగునీరు మేడారంలో భక్తులకు అక్కడక్కడ ఉచిత తాగు నీటి శిబిరాలను ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని శిబిరాలను తరలించి భక్తులకు అందిస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత తాగునీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎండతీవ్రత పెరగడంతో భక్తులకు ఉచిత తాగు నీటి శిబిరాలు దాహాన్ని తీరుస్తున్నాయి. పూజా మందిరంలో పొగలు.. ఎండోమెంట్ కార్యాలయంలో శా లాహారం ప్రహరీకి అనుకొని ఉ న్న వనం పూజా మందిరంలో పొ గలు వ్యాపించాయి. మందిరంలో ని చెత్త చెదారానికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో అక్కడే ఉన్న దేవాదాయ శా ఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఫైర్ ఇంజన్ ద్వా రా మంటలను చల్లార్చారు. పూ జా మందిరంలో ఒక్కసారి పొగ వ్యాపించడంతో ఎండోమెంట్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. వనదేవతలకు మొక్కులు సమర్పించిన భక్తులు మార్మోగిన గద్దెల ప్రాంగణం నేటితో మినీ జాతర ముగింపు -
పాఠశాలల్లో వసతులు కల్పించండి
వరంగల్: పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న ఆమె పీఎంశ్రీ, సర్వశిక్ష అభియాన్ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ జిల్లా పరిధిలో పీఎంశ్రీ పథకం కింద 16 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తయ్యాయని, కొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ నిధులతో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ టీచర్లుగా 2008 డీఎస్సీ అభ్యర్థులు
విద్యారణ్యపురి: 2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన బీఈడీ అభ్యర్థులను అప్పట్లో ఎస్జీటీలుగా ఎంపిక చేయలేదు. దీంతో వారు కొన్నేళ్లుగా తమను టీచర్లుగా నియమించాలని కోరుతూ వస్తున్నారు. ఎట్టకేలకు సర్కారు కరుణ చూపింది. కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 182మంది అభ్యర్థులు ఉండగా, వీరికి శనివారం ఆయా జిల్లాకేంద్రాల్లోని డీఈఓ కార్యాలయాల్లో నియామకపత్రాలు అందించనున్నారు. ఇటీవల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 2008 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇటీవల హనుమకొండ డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 295మంది అభ్యర్థులకుగాను 182మంది సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఎంపికై న వారు శనివారం తమ ఒరిజనల్ విద్యార్హతల సర్టిఫికెట్లతో కేటాయించిన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వెళ్లాలి. సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించి డీఈఓల చేతుల మీదుగా కాంట్రాక్ట్ ఎస్జీటీగా నియామక పత్రాలు అందించనున్నారు. నెలకు రూ.31,040 వేతనం కాంట్రాక్ట్ టీచర్లుగా నియమితులైనవారికి నెలకు రూ,31,040 వేతనం ఇవ్వనున్నారు. నియమ నిబంధనల ప్రకారం రూ.100 బాండ్ పేపర్ సమర్పించాలి. ఆ తరువాత కేటాయించిన పాఠశాలలో విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 182మంది ఎస్జీటీలుగా ఎంపిక నేడు డీఈఓ కార్యాలయాల్లో నియామక పత్రాలు అందజేతజిల్లాల వారీగా అభ్యర్థులు ఇలా..వరంగల్ 08 హనుమకొండ 18 జేఎస్ భూపాలపల్లి 43 ములుగు 28 మహబూబాబాద్ 52 జనగామ 33 -
నర్సిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి
● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి కాళోజి సెంటర్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా మరోమారు అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపించాలని టీఎస్ యూ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, గురుకులాల పనివేళలను మార్చాలని, డిప్యూటీ వార్డెన్, కేర్ టేకర్లను నియమించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నర్సిరెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా గెలిస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని రవి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప, తాటికాయల కుమార్, సుజన్ ప్రసాదరావు, మేకిరి దామోదర్, భగవంత రావు, గుండు కరుణాకర్ పాల్గొన్నారు.సీసీఐ కొనుగోళ్లపై విచారణ చేయాలి: పెద్ది వరంగల్: సీసీఐ పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్‌కు వచ్చిన పత్తిని రూ.5 వేల నుంచి 6 వేలకు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. సీసీఐకి విక్రయిస్తే రూ.7521 మద్దతు ధర వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను ఇటీవల సస్పెండ్ చేయడం అవినీ తి అక్రమాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఈ కుంభకోణం జరిగిందని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువు దోపిడీ చేసిందని ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. -
అందరి సహకారంతో విజయవంతం: కలెక్టర్ దివాకర
అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే మేడారం జాతర విజయవంతమైందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. మినీ జాతరకు వచ్చిన భక్తులతో మేడారం సందడి వాతావరణం సంతరించుకుందన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాల కు గురికాకుండా అన్ని ఏర్పాట్లు కల్పించామన్నారు. ఈనెల 16న (ఆదివారం) సెలవు రోజు భక్తుల వేలాది తరలివస్తారనే అంచనాతో అప్పటి వరకు కావాల్సిన ఏర్పాట్ల కూడా చేశామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత చర్యల కోసం పోలీసులు చర్యలు చేపట్టారన్నారు. జాతర కవరేజ్ చేసి స హకరించిన మీడియాకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపా రు. ముందుగా కలెక్టర్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సాంప్రదాయంగా దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు కలెక్టర్‌కు స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించి అమ్మవార్ల ప్రసాదం అందించారు. కలెక్టర్ వెంట ఈఓ రాజేంద్రం, మంగపేట తహసీల్దార్ రవీందర్, డీటీ సురేష్‌బాబు, తదితరులు ఉన్నారు. -
కేయూలో టాప్ సైంటిస్టులు వీరే..
కేయూ క్యాంపస్: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలకు ర్యాంకింగ్స్ ఇచ్చే అమెరికాకు చెందిన ఏడీ సైంటిఫిక్ ఇండెక్స్(అల్పర్డోగల్) ఈ ఏడాది జాబితాను విడుదల చేసింది. పరిశోధనా పత్రాల హెచ్ ఇండెక్స్ ఐ 10 ఇండెక్స్ సైటేషన్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను ఖరారు చేశారు. కాకతీయ యూనివర్సిటీలో టాప్ ఐ సైంటిస్టుల జాబితాను కూడా సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచారు. ఏడీ సైంటిఫిక్ ఇండెక్స్ ప్రపంచ, జాతీయ, ప్రాంతీయ విషయాల్లో 13 ప్రధాన రంగాలు, 197 ఉప శాఖల్లో అత్యంత సమగ్రమైన విశ్లేషణను అందిస్తుంది. ఈ విశ్లేషణలు గత 6 సంవత్సరాల నుంచి వాటి విలువలతో సహా హెచ్ ఇండెక్స్ ఐ 10 ఇండెక్స్, సైటేషన్ కౌంట్ వంటి సూచికలపై ఆధారపడి ఉంటాయి. 2025 ఈనెల 14 నాటికి ర్యాంకింగ్‌లు మొత్తం హెచ్ ఇండెక్స్ ప్రకారం నిర్ణయించబడి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రపంచంలో 221 దేశాల్లో 24,503 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న సైంటిస్టుల పరిశోధనలు ఈ సంస్థ పరిశీలన చేయగా అమెరికాలోని హా ర్వర్డ్ యూనివర్సిటీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేయూ 960 స్థానంలో నిలిచింది. కేయూ సైంటిస్టులు.. యూనివర్సిటీ స్థాయిలో టాప్ 5 సైంటిస్టులుగా కేయూకు చెందిన ఐదుగురు ప్రొఫెసర్లకు స్థానం లభించింది. కేయూ ఫార్మసీ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ రఘురామారావు మొదటిస్థానం, అదే కళాశాలకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ సిద్ది వీరేశం రెండోస్థానం, బయోటెక్నాలజీ విభాగం రి టైర్డ్ ఆచార్యులు సదానందం మూడో స్థానం, జు వాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి నా ల్గో స్థానం, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రసాద్ ఐదో స్థానంలో నిలిచారు. జువాలజీ విభా గం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి పరిశోధనలపరంగా నాలుగు పేటెంట్లు కలిగి ఉండగా.. ఫార్మసీ కళా శాల ప్రొఫెసర్ ప్రసాద్ పలు పేటెంట్లు పొందారు. -
వసతుల కల్పనకు నిధులు వినియోగించాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మంజూరైన నిధులను ఆయా పాఠశాలల్లో వివిధ వసతుల కల్పనకు సత్వరమే వినియోగించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీఎం శ్రీ పథకం నిధుల వినియోగం, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా అధికారులతో పాటు ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఏఈలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఆయా పాఠశాలల్లో నిధులతో గ్రంథాలయం ఏర్పాటు, మ్యూజికల్ బ్యాంకు ఏర్పాటు క్రీడోత్సవాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు స్నాక్స్ అందించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ వాసంతి, సమగ్రశిక్ష గుణాత్మక విద్య సమన్వయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, కమ్యునిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, జీసీడీఓ సునిత, ప్రణాళిక అధికారి బి.మహేశ్, సహాయ గణాంక సమన్వయకులు రఘు చందర్రావు, అధికారులు పాల్గొన్నారు. -
కోటలో ఆస్ట్రేలియన్ల సందడి
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలావరంగల్ కోటను శుక్రవారం ఆస్ట్రేలియా దేశస్తులు సందర్శించారు. ఈసందర్భంగా శిల్ప కళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఆతర్వాత ఖుష్‌మహల్‌ను వారు సందర్శించి నిర్మాణ శైలి మహా అద్భుతంగా ఉందని కొనియాడారు. కాకతీయుల చరిత్ర, విశిష్టత గురించి కోట గైడ్ రవియాదవ్ విదేశీయులకు వివరించారు. సాయంత్రం టీజీటీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకతీయుల చరిత్రను వివరించే సౌండ్, లైటింగ్ షోను తిలకించారు. కార్యక్రమంలో టీజీటీడీసీ ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్, పురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
వెయిటేజీ మార్కుల దందా
ఎంజీఎం : ఔట్సోర్సింగ్ ఏజెన్సీల దందా రోజురోజుకూ పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ నియామక ఏజెన్సీలను దక్కించుకున్న నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నిరుద్యోగ అభ్యర్థులనుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కాకతీయ మెడికల్ కళాశాల సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను దక్కించుకున్న నిర్వాహకులు ఏకంగా ఎంజీఎం పరిపాలనాధికారులను తప్పుదోవ పట్టించారు. అర్హత లేని ఉద్యోగులకు వెయిటేజీ మార్కులు కల్పించేలా ల్యాబ్ అటెండెంట్లకు ల్యాబ్ టెక్నీషియన్లుగా ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేశారు. వెయిటేజీ మార్కుల విషయంలో మరోమారు విచారణ చేయాలని ఎంజీఎం అధికారులకు మెయిల్ రావడంతో అసలు ఏం జరిగిందని విచారించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. అసలేం జరిగిందంటే.. వైద్యారోగ్యశాఖలో స్టాఫ్‌నర్సులతోపాటు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టుల నియామకాల కోసం ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నెలలో రాత పరీక్షలు నిర్వహించింది. అభ్యర్థులకు రాత పరీక్షల మార్కులతోపాటు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల్లో పనిచేసిన ఉద్యోగులకు ఆయా విభాగాల అఽధికారుల ద్వారా సర్వీసును బట్టి వెయిటేజీ మార్కులు కల్పిస్తారు. ఈ మార్కులతో అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలను పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించిన కేఎంసీలోని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నిర్వాహకులు తెలివిగా వ్యవహరించారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో 12 మంది ల్యాబ్ అటెండెంట్లు, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యారు. 16మంది అభ్యర్థులు రాత పరీక్షల్లో పాల్గొనగా ఆస్పత్రిలో పనిచేసే మూడు ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లకు మాత్రమే సర్టిఫికెట్లు ఇచ్చే అర్హత ఉంటుంది. కానీ నిర్వాహకులు తెలివిగా ల్యాబ్ అటెండెంట్లను సైతం టెక్నీషియన్‌గా పేర్కొంటూ వారికి వెయిటేజీ మార్కులు కల్పించారు. మొత్తం 16 మంది అభ్యర్థులను టెక్నీషియన్లుగా పేర్కొంటూ ఎంజీఎం పరిపాలనాధికారులకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ఈ సర్టిఫికెట్ల సమర్పిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని భావించిన నిర్వాహకులు.. ఆయా అభ్యర్థులనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కేఎంసీలోని ఔట్సోర్సింగ్ ఏజెన్సీల చేతివాటం ల్యాబ్ అటెండెంట్లకు టెక్నీషియన్లుగా సర్టిఫికెట్లు ఎంజీఎం అధికారులను తప్పుదోవ పట్టించిన నిర్వాహకులు మెమోలు జారీ చేసిన అధికారులు ఎంజీఎం అధికారుల పునర్విచారణ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో అభ్యర్థులకు కల్పించిన వెయిటేజీ మార్కుల విషయంలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంసీఆర్బీ)నుంచి ఎంజీఎం అధికారులకు ఓ మెయిల్ వచ్చింది. వీటిని తిరిగి విచారణ చేసి ధ్రువీకరించాలని ఆ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో ఎంజీఎం అధికారులు విచారణ చేశారు. అటెండెంట్లకు టెక్నీషియన్లుగా సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు మెమోలు జారీ చేశారు. ఈక్రమంలో శుక్రవారం సదరు నిర్వాహకులను పిలిచి విచారణ చేశారు. తమకు తెలియకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. వెయిటేజీ మార్కులు పొందిన అభ్యర్థులను పూర్తిస్థాయిలో విచారిస్తే వారినుంచి ఏజెన్సీలు ఎంత వసూలు చేశాయో బయటపడుతుందని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
మహా శివరాత్రికి ఏర్పాట్లు చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 26న శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వరస్వామి, స్వయంభు దేవాలయం, ఆకారపు బొమ్మలగుడి, దుర్గేశ్వరాలయం, భోగేశ్వరాలయం తదితర ఆలయాల్లో రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హోమం, ప్రవచనాలతోపాటు క్యూలైన్ మేనేజ్మెంట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సునీత, ఈఓ రత్నాకర్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్‌రావు, డీఎంహెచ్ఓ సాంబశివరావు, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్నరాణి, ఈఈలు మహేందర్, శ్రీనివాస్ ఎంహెచ్ఓ రాజేశ్, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, ఎస్సై చాంద్‌పాషా పాల్గొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి సహకరించాలి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చి రైతులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో భూ సేకరణకు సంగెం గ్రామ రైతులతో శుక్రవారం ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేతో జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
సర్వీస్ కొనసాగింపు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఇటీవల రిటైర్డ్ అయిన ముగ్గురు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీస్‌ను కొనసాగిస్తూ రిజిస్ట్రార్ వి.రాంచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన బాటనీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బీఏ జర్నలిజం విభాగానికి చెందిన ఆర్.ఆదిరెడ్డి, కెమిస్ట్రీ విభాగానికి చెందిన ఉషారాణి సర్వీస్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవ్యవస్థపై దాడి అమానుషంవరంగల్ లీగల్: రంగారెడ్డి జిల్లా 9వ అదనపు కోర్టు జడ్జిపై గురువారం జరిగిన దాడిని న్యాయ వ్యవస్థపై దాడిగా భావిస్తున్నామని, ఇది అమానుష చర్య అని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్ అన్నారు. దాడికి నిరసనగా శుక్రవారం జిల్లా కోర్టు ఎదుట వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా అఽధ్యక్షుడు జీవన్‌గౌడ్ మాట్లాడుతూ.. నిందితులు, కక్షిదారులు తమ ప్రయోజనాలు నెరవేరలేదనే కక్షతో న్యాయమూర్తులు, న్యాయవాదులపై దాడులు చేయడం సహించరాని విషయమని, ప్రభుత్వం సత్వరమే నిందితులపై చర్యలు తీసుకోవాలని, న్యాయవ్యవస్థలో పనిచేసే వారి కోసం రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈచర్యపై ప్రజలంతా నిరసన తెలపాలని హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్‌బాబు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్, జయాకర్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు లడే రమేశ్, సుదర్శన్, చారి, విజయేందర్, మురళి, సహోదర్‌రెడ్డి, అంబరీశ్, రాజేంద్రప్రసాద్, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్ల నియామకం కేయూ క్యాంపస్: కేయూ హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్లుగా ఫిజిక్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.నరేందర్, మైక్రో బయాలజీ విభాగానికి చెందిన డాక్టర్ సుజాతను నియమిస్తూ శుక్రవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు పదవిలో ఏడాదిపాటు బాధ్యతలు నిర్వర్తరించనున్నారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి వీరికి నియామక ఉత్తర్వులు అందజేశారు. సీడీపీఓ కార్యాలయ స్థల మార్పు కాజీపేట అర్బన్: హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌజ్ ఎదురుగా కొనసాగుతున్న హనుమకొండ అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ కార్యాలయాన్ని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని చేనేత జౌళిశాఖ కార్యాలయం పక్కకు మార్చినట్లు శుక్రవారం సీడీపీఓ విశ్వజ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రకాల పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ‘ఎన్హెచ్ఎం’తో తగ్గిన మరణాలుఎంజీఎం: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల మాతా శిశు మరణాల రేటు చాలా వరకు తగ్గిందని.. మరింత మెరుగైన సేవలందిస్తూ గర్భిణుల్లో అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించి తగిన సేవలందించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆర్మన్ స్వచ్ఛంద సంస్థ, జాతీయ ఆరోగ్య మిషన్ సంయుక్తంగా జిల్లాలోని పలు యూపీహెచ్సీ, పీహెచ్‌సీల ఏఎన్ఎంలకు నిర్వహించిన శిక్షణలో అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, వైద్యులు సంతోషిని, సౌజన్య, డెమో అశోక్‌రెడ్డి, ఎస్ఓ ప్రసన్నకుమార్, హెచ్ఈఓ రాజేశ్వర్‌రెడ్డి, డీడీఎం ప్రవీణ్, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజల్లో అవగాహన పెంచాలి
● కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్: తడి, పొడి చెత్తను ఇళ్లల్లో వేర్వేరుడబ్బాల్లో వేసి అందించేందుకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం వరంగల్ పోతన సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, కంపోస్ట్ యూనిట్‌ను కమిషనర్ తనిఖీ చేశారు. ట్రాన్స్ఫర్ స్టేషన్లో పొడి చెత్త సేకరణ రిజిస్టర్‌ను పరిశీలించారు. తనిఖీల్లో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్ భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్‌రాజ్, వెంకన్న, ఐటీసీ వావ్ ప్రతినిధి పవన్, ఏంఐఎస్ గౌతమి తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీ, ‘పాక్స్’ల పదవీకాలం పొడిగింపు
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు పదవిలో కొనసాగేలా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం గడువు శుక్రవారంతో ముగియగా.. అదే రోజున మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే పదవీకాలం ముగిసిన గ్రామ పంచాయతీలు, ఎంపీపీ, జిల్లా పరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. సహకార సంఘాలకు కూడా ప్రత్యేక అధికారుల నియామకం ఇబ్బందికరం కాగా.. పాలకవర్గాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ‘పాక్స్’ల పదవీకాలం ఆరు నెలలు పొడిగించినట్లు చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి వరంగల్‌లో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాలు మరో ఆరు నెలలు సేవలు అందించనున్నాయి. ఇదిలా ఉండగా.. సహకార సంఘాల పదవీ కాలం పొడిగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖకు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం -
తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు
వరంగల్ క్రైం: క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, విధి నిర్వహణలో ఏదైనా వ్యక్తిగత సమస్యలతో ఒత్తిళ్లకు గురైతే మీ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు తెలపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ‘విధి నిర్వహణతో పాటు వ్యక్తిగతంగా ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను నియంత్రించడం ఎలా’ అనే అంశంపై అవగాహన సదస్సు శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లోని రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ ఉద్యోగులకు విధి నిర్వహణలో ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా విధులు నిర్వహించడంతోనే ఈ ఒత్తిళ్లను అధిగమించవచ్చన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమన్నారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ఒత్తిళ్లు అధిగమించేందుకు ప్రతీరోజు వ్యా యామం, యోగా చేయాలని సూచించారు. అంతకుముందు నగరానికి చెందిన మనస్తత్వవేత్తలు డాక్టర్ జ్యోతి, స్వరూప, బెన్సన్లు మానసిక ఒత్తిళ్లను ఏవిధంగా నియంత్రించుకోవాలో పోలీస్ సిబ్బంది, అధికారులకు తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రవీందర్, అదనపు డీసీపీలు రవి, సురేశ్, ఏసీపీలు జితేందర్, మధుసూదన్, నాగయ్య, అనంతయ్య, ఏఓ రామకృష్ణ ఆర్.ఐలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, పరిపాలన విభాగం అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమస్య ఉంటే శ్రేయోభిలాషులకు తెలపండి సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సు -
‘కాంగ్రెస్ పాలనపై గ్రామస్థాయి నుండి వ్యతిరేకత’
హనుమకొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనచారి. ఎన్నికల ముందు అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, ఇప్పటివరకూ ఏ ఒక్క హానమీ నెరవేర్చలేనది మధుసూదనచారి ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యం పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీని ఎమ్మెల్సీ మధుసూదనచారి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మధుసూదనచారి మాట్లాడుతూ.. ‘కడియం శ్రీహరి తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారాడు. పార్టీ మారిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి పోటీలో నిలబెట్టు. బీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యమంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాం. పూర్తి స్థాయిలో కులగణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. BRSసాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఎక్కడికి వెళ్తే రేవంత్‌రెడ్డి పబ్బం గడుస్తదో అక్కడికి వెళతాడు’ అని విమర్శించారు మధుసూదనచారి. -
విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో)
జిల్లా ఫిబ్రవరి 7న 8న 9న 10న 11న(సర్కిల్) 2024 2025 2024 2025 2024 2025 2024 2025 2024 2025 హనుమకొండ 4.85 5.08 4.73 5.08 4.86 4.97 4.94 4.91 4.80 4.93 వరంగల్ 3.95 4.27 3.83 4.15 3.99 4.41 3.88 4.36 4.80 4.31 జనగామ 5.23 5.55 5.29 5.39 5.40 5.51 5.31 4.96 5.12 5.60 మహబూబాబాద్ 3.72 4.22 3.85 4.13 3.80 4.26 3.82 4.20 3.68 4.04 భూపాలపల్లి 7.22 7.79 7.15 7.65 7.10 7.96 7.11 8.20 6.81 8.26 విద్యుత్ డిమాండ్ (మెగావాట్లలో) జిల్లా ఫిబ్రవరి 7న 8న 9న 10న 11న (సర్కిల్) 2024 2025 2024 2025 2024 2025 2024 2025 2024 2025 హనుమకొండ 283 329 281 317 305 308 301 323 292 327 వరంగల్ 267 316 266 306 279 315 277 297 268 360 జనగామ 279 306 273 318 284 270 282 308 273 292 మహబూబాబాద్ 322 389 331 383 346 388 344 389 317 360 భూపాలపల్లి 354 367 345 364 352 390 342 379 332 386 -
హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు
లింగాలఘణపురం: మండలంలోని కుందారం సమీపంలో 2019లో దేవరుప్పుల మండలం రామచంద్రగూడేనికి చెందిన కైరిక ఆంజనేయులుపై హత్యాయత్నం జరిగింది. ఈఘటనకు కారకులైన అదే గ్రామానికి చెందిన కైరిక భాస్కర్, నాగన్నకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్ జడ్జి సుచరిత బుధవారం తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆంజనేయులు, భాస్కర్, నాగన్న మధ్య చిట్టీ డ బ్బుల విషయంలో గొడవలున్నాయి. ఈనేపథ్యంలో ఆంజనేయులును చంపాలని పథకం ప్రకారం బైక్‌పై వెళ్తున్న అతడిని భాస్కర్, నాగన్న కుందారం సమీపంలో సుమోతో ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయాలైన ఆంజనేయులు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈఘటనకు సంబంధించి ఆంజనేయులు బంధువులు చిక్కుడు భాస్కర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్సై ఎస్.రవీందర్ కేసు నమోదు చేశారు. కోర్టు కానిస్టేబుల్ నరేశ్ నిందితులకు శిక్షపడేలా సాక్ష్యులను ప్రవేశపెట్టినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు. -
భారీగా గుట్కా నిల్వల పట్టివేత
వరంగల్ క్రైం: గ్రేటర్ వరంగల్ పరిధిలో బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిషేధిత గుట్కా నిల్వలపై కొరఢా ఝులిపించారు. హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమార్‌పల్లిలో ఎండీ అబీబుద్దీన్ అహ్మద్ ఇంట్లో గుట్కాలు ఉన్నాయన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీ చేశారు. రూ.1,15,000 విలువగల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. నిందితుడు ఎండీ అబీబుద్దీన్ను అదుపులోకి తీసుకొని తదుపరి చర్యలు కోసం హనుమకొండ పోలీసులకు అప్పగించామన్నారు. దాడిలో ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కాజీపేటలో.. కాజీపేట: సోమిడి గ్రామంలో సుంచు వెంకటేశ్వర్లు అనే వ్యాపారి కిరాణా దుకాణంలో గుట్కాలను అమ్ముతున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆకస్మిక దాడులు చేశారు. రూ.32,500ల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కాజీపేట పీఎస్‌లో అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఖిలా వరంగల్‌లో.. ఖిలా వరంగల్: : మధ్యకోటకు చెందిన వ్యాపారి ఎండీ శేక్ అలీ, కరీమాబాద్‌కు చెందిన వ్యాపారి తాళ్ల మురళి విష్ణు వేర్వేరుగా గుట్కాప్యాకెట్లు నిల్వ చేసి ఇతరులకు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి శేక్ ఆలీ షాపులో రూ.73,600, తాళ్ల మురళి విష్ణు షాపులో రూ 13,170 విలువ గల గుట్కాప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై వేర్వేరుగా కేసు నమోదు చేసి తదిపరి చర్యల నిమిత్తం మిల్స్‌కాలనీ పోలీసులకు కేసులను అప్పగించారు. దాడిలో ఎస్సై దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు. -
రన్నింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి
కాజీపేట రూరల్: రైల్వేలో అతి ప్రధాన రన్నింగ్ స్టాఫ్ (లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, గార్డులు) సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ) సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ టి.హనుమయ్య డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో బుధవారం ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ డివిజనల్ స్పెషల్ కన్వెన్షన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హనుమయ్య ముందుగా ఎం.ఎన్. ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 7వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం రన్నింగ్ స్టాఫ్‌కు రన్నింగ్ అలవెన్స్ 25 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ ప్రెసిడెంట్ చౌబే, సెంట్రల్ కమిటీ జాయింట్ సెక్రటరీ ఆర్కె.రాణా, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ సెక్రటరీ ఇరానీ పాషా, సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఏవీఎస్ఎన్ఎన్.మూర్తి, ఆర్.ఎస్.శ్రీజిత్ రన్నింగ్ స్టాఫ్ సమస్యలపై మాట్లాడారు. అంతకు ముందు డివిజనల్ సెక్రటరీ ఆర్ఎస్.శ్రీజిత్ ఎఐఎల్ఆర్ఎస్ఐ జెండాను ఎగురవేశారు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్, కాజీపేట బ్రాంచ్‌కు చెందిన 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి నర్సింహులపేట: మండలంలోని రామన్నగూడేనికి చెందిన దుండి ఉప్పలయ్య(45) చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై మాలోతు సురేశ్ తెలిపారు. రామన్నగూడెం సమీపంలోని వెంకమ్మ చెరువు మత్తడి దగ్గరలోని గుంతలో బుధవారం కరెంట్‌తో చేపలు పట్టే క్రమంలో వైరు తెగి ఉండడాన్ని చూసుకోకపోవడంతో షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పవర్ ఫుల్!
ఉమ్మడి జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగంహన్మకొండ: వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. చలి పెట్టాల్సిన సమయంలో ఉక్కపోత మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం కొద్దిగా చల్లని వాతావరణం ఉండడంతో వేడి నీటి కోసం గీజర్లు వాడుతున్నారు. పగలు ఎండలు దంచికొడుతుండడంతో ఫ్యాన్లు, ఏసీల వాడకం పెరిగిపోయింది. మరో వైపు ముందుగా నాట్లు వేసిన వరి పంట పొట్ట దశకు రావడంతో నీటి కోసం భూగర్భ జలాల వినియోగం పెరిగింది. ఈక్రమంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. మొత్తం సర్వీస్‌లు ఎన్నంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 5 సర్కిళ్ల పరిధిలో 18,36,370 విద్యుత్ సర్వీస్‌లున్నాయి. ఇందులో గృహ వినియోగదారులు 12,50,009, కమర్షియల్ 152148, పరిశ్రమలు 8,925, కుటీర పరిశ్రమలు 2,092, వ్యవసాయ 3,92,879, వీధి దీపాలు 21,280, ఇతర సర్వీస్‌లు 9,037 ఉన్నాయి. హనుమకొండ సర్కిల్లో అన్ని సర్వీస్‌లు కలిపి 4,84,208 ఉన్నాయి. వరంగల్‌లో 4,19,318, జనగామలో 2,92,650, భూపాలపల్లి 3,00,346, మహబూబాబాద్ సర్కిల్లో అన్ని సర్వీస్‌లు కలిపి 3,39,848 ఉన్నాయి. దంచి కొడుతున్న ఎండలు, వాతావరణంలో మార్పులే కారణం డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రణాళిక ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు -
వీడిన హత్య కేసు మిస్టరీ
పరకాల: రెండేళ్ల క్రితం నడికూడ మండలం ధర్మారం శివారులో జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. వృద్ధురాలి కన్నకొడుకు సన్నిహితుడే హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలగా.. నిందితుడు పరకాల పోలీసుల ముందు లొంగిపోగా.. బుధవారం అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ పి.రవీందర్ పరకాల ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన వాడికాల బొందమ్మకు నలుగురు సంతానం. ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు. తనకున్న 10 గుంటల భూమిని కొడుకుకు కాదని.. కూతుర్లకు ఇస్తానని గ్రామంలో జరిగిన పంచాయితీలో చెప్పడమే ఆమెకు శాపమైంది. కొడుకుకు ఇవ్వాలని అదే గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డి వృద్ధురాలితో వాదించాడు. ఆవిషయాన్ని మనసులో పెట్టుకున్న వృద్ధురాలు పంచాయితీ జరిగిన మరుసటి రోజు 2023 మార్చి26న రాజిరెడ్డి ఇంటికి వెళ్లి తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నావంటూ శాపనార్థాలు పెడుతూ దూషించింది. దీంతో ఆగ్రహించిన రాజిరెడ్డి ఇంటి చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలిని చితకబాది హత్య చేశాడు. అంతటితో ఊరుకోకుండా మృతదేహంపై ఉన్న బంగారు గాజులు, మెడలోని బంగారు గొలుసు, కమ్మలు దోచుకొని ఎడ్ల కొట్టంలో దాచిపెట్టాడు. తర్వాత మృతదేహాన్ని తన కారులో వేములవాడ వైపు తీసుకెళ్ల్లి.. మళ్లీ అదే రాత్రి హుజూరాబాద్, నడికూడ మీదుగా ధర్మారం శివారులోని కెనాల్ కల్వర్టు వద్ద పడేసి వెళ్లిపోయాడు. గ్రామస్తులు అందించిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్యగా కేసు నమోదు చేశారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వృద్ధురాలి హత్య కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరపగా ఆమె సొంత గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డే హత్య చేసినట్లు పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుడి కోసం గాలిస్తుండగా పరకాల పోలీసుల ముందు మరొకరి సాయంతో లొంగిపోయాడు. వృద్ధురాలి నుంచి దోచుకున్న బంగారాన్ని వరంగల్‌లోని ఓ జ్యువెల్లరీలో కరిగించి కడెం చేయించుకున్నాడు. కొద్ది రోజులకు తన అవసరాల కోసం ఓ ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు డీసీపీ రవీందర్ వెల్లడించారు. నిందితుడి నుంచి కారును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్య కేసును ఛేదించిన పరకాల, శాయంపేట సీఐలు క్రాంతికుమార్, రంజిత్‌రావు పోలీసు బృందాన్ని డీసీపీ రవీందర్, ఏసీపీ సతీశ్‌బాబు అభినందించారు. రెండేళ్ల క్రితం ధర్మారం శివారులో లభ్యమైన వృద్ధురాలి మృతదేహం హత్యగా కేసు నమోదు.. కీలక ఆధారాలు లభ్యం పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు.. కారు స్వాధీనం -
ప్రత్యేక ప్రణాళిక..
వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఈసారి వేసవిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈవేసవిలో విద్యుత్ డిమాండ్, వినియోగం భారీగా పెరగనుందనే ఆలోచనతో ప్రత్యేకంగా వేసవి ప్రణాళిక రూపొందించారు. ఫిబ్రవరి చివరి నాటికి వేసవి ప్రణాళికను పూర్తిగా కార్యరూపంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈమేరకు డిమాండ్‌ను బట్టి 33/11 కేవీ సబ్ స్టేషన్లలో అధిక సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచారు. అధిక భారం ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో అధిక సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్లను అమర్చడంతో పాటు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అధిక భారం ఉన్న ఫీడర్లను గుర్తించి లోడ్ బదలాయింపు చేస్తున్నారు. విద్యుత్ అంతరాయాలను నివారించేందుకు సబ్ స్టేషన్లను అనుసంధానిస్తూ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ వేస్తున్నారు. ఏదైనా సబ్ స్టేషన్లో సమస్య ఉత్పన్నమైతే మరో సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అందించేందుకు ఈప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు ఉపయోగపడనున్నాయి. ప్రతీ జిల్లాకు ప్రత్యేకంగా చీఫ్ ఇంజనీర్, జనరల్ మేనేజర్ స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది.