లింగాలఘణపురం: మండలంలోని కుందారం సమీపంలో 2019లో దేవరుప్పుల మండలం రామచంద్రగూడేనికి చెందిన కైరిక ఆంజనేయులుపై హత్యాయత్నం జరిగింది. ఈఘటనకు కారకులైన అదే గ్రామానికి చెందిన కైరిక భాస్కర్, నాగన్నకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్ జడ్జి సుచరిత బుధవారం తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆంజనేయులు, భాస్కర్, నాగన్న మధ్య చిట్టీ డ బ్బుల విషయంలో గొడవలున్నాయి. ఈనేపథ్యంలో ఆంజనేయులును చంపాలని పథకం ప్రకారం బైక్‌పై వెళ్తున్న అతడిని భాస్కర్, నాగన్న కుందారం సమీపంలో సుమోతో ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయాలైన ఆంజనేయులు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈఘటనకు సంబంధించి ఆంజనేయులు బంధువులు చిక్కుడు భాస్కర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్సై ఎస్.రవీందర్ కేసు నమోదు చేశారు. కోర్టు కానిస్టేబుల్ నరేశ్ నిందితులకు శిక్షపడేలా సాక్ష్యులను ప్రవేశపెట్టినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment