![రన్ని](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/13022025-wud_tab-10_subgroupimage_1892493520_mr-1739412059-0.jpg.webp?itok=F8Jf4vc4)
రన్నింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి
కాజీపేట రూరల్: రైల్వేలో అతి ప్రధాన రన్నింగ్ స్టాఫ్ (లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, గార్డులు) సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ) సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ టి.హనుమయ్య డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో బుధవారం ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ డివిజనల్ స్పెషల్ కన్వెన్షన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హనుమయ్య ముందుగా ఎం.ఎన్. ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 7వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం రన్నింగ్ స్టాఫ్‌కు రన్నింగ్ అలవెన్స్ 25 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ ప్రెసిడెంట్ చౌబే, సెంట్రల్ కమిటీ జాయింట్ సెక్రటరీ ఆర్‌కె.రాణా, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ సెక్రటరీ ఇరానీ పాషా, సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఏవీఎస్‌ఎన్‌ఎన్.మూర్తి, ఆర్.ఎస్.శ్రీజిత్ రన్నింగ్ స్టాఫ్ సమస్యలపై మాట్లాడారు. అంతకు ముందు డివిజనల్ సెక్రటరీ ఆర్‌ఎస్.శ్రీజిత్ ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఐ జెండాను ఎగురవేశారు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్, కాజీపేట బ్రాంచ్‌కు చెందిన 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
నర్సింహులపేట: మండలంలోని రామన్నగూడేనికి చెందిన దుండి ఉప్పలయ్య(45) చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై మాలోతు సురేశ్ తెలిపారు. రామన్నగూడెం సమీపంలోని వెంకమ్మ చెరువు మత్తడి దగ్గరలోని గుంతలో బుధవారం కరెంట్‌తో చేపలు పట్టే క్రమంలో వైరు తెగి ఉండడాన్ని చూసుకోకపోవడంతో షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
![రన్నింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12hmkd101-330094_mr-1739412059-1.jpg)
రన్నింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment