![భారీగా గుట్కా నిల్వల పట్టివేత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12hmkd277-330130_mr-1739412059-0.jpg.webp?itok=CAtcVxEo)
భారీగా గుట్కా నిల్వల పట్టివేత
వరంగల్ క్రైం: గ్రేటర్ వరంగల్ పరిధిలో బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిషేధిత గుట్కా నిల్వలపై కొరఢా ఝులిపించారు. హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమార్‌పల్లిలో ఎండీ అబీబుద్దీన్ అహ్మద్ ఇంట్లో గుట్కాలు ఉన్నాయన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీ చేశారు. రూ.1,15,000 విలువగల గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. నిందితుడు ఎండీ అబీబుద్దీన్‌ను అదుపులోకి తీసుకొని తదుపరి చర్యలు కోసం హనుమకొండ పోలీసులకు అప్పగించామన్నారు. దాడిలో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీధర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కాజీపేటలో..
కాజీపేట: సోమిడి గ్రామంలో సుంచు వెంకటేశ్వర్లు అనే వ్యాపారి కిరాణా దుకాణంలో గుట్కాలను అమ్ముతున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆకస్మిక దాడులు చేశారు. రూ.32,500ల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కాజీపేట పీఎస్‌లో అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఖిలా వరంగల్‌లో..
ఖిలా వరంగల్: : మధ్యకోటకు చెందిన వ్యాపారి ఎండీ శేక్ అలీ, కరీమాబాద్‌కు చెందిన వ్యాపారి తాళ్ల మురళి విష్ణు వేర్వేరుగా గుట్కాప్యాకెట్లు నిల్వ చేసి ఇతరులకు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి శేక్ ఆలీ షాపులో రూ.73,600, తాళ్ల మురళి విష్ణు షాపులో రూ 13,170 విలువ గల గుట్కాప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై వేర్వేరుగా కేసు నమోదు చేసి తదిపరి చర్యల నిమిత్తం మిల్స్‌కాలనీ పోలీసులకు కేసులను అప్పగించారు. దాడిలో ఎస్సై దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment