![పవర్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/power-1_mr-1739412058-0.jpg.webp?itok=AYkwekJd)
పవర్ ఫుల్!
ఉమ్మడి జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం
హన్మకొండ: వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. చలి పెట్టాల్సిన సమయంలో ఉక్కపోత మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం కొద్దిగా చల్లని వాతావరణం ఉండడంతో వేడి నీటి కోసం గీజర్లు వాడుతున్నారు. పగలు ఎండలు దంచికొడుతుండడంతో ఫ్యాన్లు, ఏసీల వాడకం పెరిగిపోయింది. మరో వైపు ముందుగా నాట్లు వేసిన వరి పంట పొట్ట దశకు రావడంతో నీటి కోసం భూగర్భ జలాల వినియోగం పెరిగింది. ఈక్రమంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది.
మొత్తం సర్వీస్‌లు ఎన్నంటే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 5 సర్కిళ్ల పరిధిలో 18,36,370 విద్యుత్ సర్వీస్‌లున్నాయి. ఇందులో గృహ వినియోగదారులు 12,50,009, కమర్షియల్ 152148, పరిశ్రమలు 8,925, కుటీర పరిశ్రమలు 2,092, వ్యవసాయ 3,92,879, వీధి దీపాలు 21,280, ఇతర సర్వీస్‌లు 9,037 ఉన్నాయి. హనుమకొండ సర్కిల్‌లో అన్ని సర్వీస్‌లు కలిపి 4,84,208 ఉన్నాయి. వరంగల్‌లో 4,19,318, జనగామలో 2,92,650, భూపాలపల్లి 3,00,346, మహబూబాబాద్ సర్కిల్‌లో అన్ని సర్వీస్‌లు కలిపి 3,39,848 ఉన్నాయి.
దంచి కొడుతున్న ఎండలు, వాతావరణంలో మార్పులే కారణం
డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు
విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రణాళిక
ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు
![పవర్ ఫుల్!1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/22jkmwyz-main_030002_mr-1739412058-1.jpg)
పవర్ ఫుల్!
Comments
Please login to add a commentAdd a comment