వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఈసారి వేసవిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈవేసవిలో విద్యుత్ డిమాండ్, వినియోగం భారీగా పెరగనుందనే ఆలోచనతో ప్రత్యేకంగా వేసవి ప్రణాళిక రూపొందించారు. ఫిబ్రవరి చివరి నాటికి వేసవి ప్రణాళికను పూర్తిగా కార్యరూపంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈమేరకు డిమాండ్‌ను బట్టి 33/11 కేవీ సబ్ స్టేషన్లలో అధిక సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచారు. అధిక భారం ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో అధిక సామర్థ్యం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చడంతో పాటు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అధిక భారం ఉన్న ఫీడర్లను గుర్తించి లోడ్ బదలాయింపు చేస్తున్నారు. విద్యుత్ అంతరాయాలను నివారించేందుకు సబ్ స్టేషన్లను అనుసంధానిస్తూ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ వేస్తున్నారు. ఏదైనా సబ్ స్టేషన్‌లో సమస్య ఉత్పన్నమైతే మరో సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అందించేందుకు ఈప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు ఉపయోగపడనున్నాయి. ప్రతీ జిల్లాకు ప్రత్యేకంగా చీఫ్ ఇంజనీర్, జనరల్ మేనేజర్ స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment