-
ఫాస్ట్‌లో... ఇదే లాస్ట్ అవుతుందా?
హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా ఫ్రాంచైజీ నుంచి వచ్చిన పది సినిమాలు ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టుకోవడం ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీ నుంచి 11వ చిత్రం రానుంది. ‘ఫాస్ట్ ఎక్స్’ (‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ పదో చిత్రం) సినిమాకు దర్శకత్వం వహించిన లూయిస్ లెటర్రియర్ పదకొండవ సినిమానూ తెరకెక్కించనున్నారు. కాగా ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు లూయిస్. ‘‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11వ చిత్రం షూట్‌ను ఈ ఏడాదే ఆరంభిస్తాం. ప్రస్తుతం నేనో హారర్ మూవీ చేస్తున్నాను. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబరు 15న పూర్తవుతుంది. సెప్టెంబరు 16న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ 11వ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తాను. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో తొలి భాగం 2001లో విడుదలైంది. సరిగ్గా పాతికేళ్ల తర్వాత 2026లో ఈ సిరీస్‌లోని 11వ చిత్రం విడుదల చేస్తాం. తొలి చిత్రాన్ని విడుదల చేసిన తేదీనే (జూన్ 18) 11వ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని ఉంది. కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కుదురుతుందో లేదో చూడాలి’’ అని చెప్పుకొచ్చారు లూయిస్. కాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీలో ఇదే లాస్ట్ చిత్రం అవుతుందని హాలీవుడ్ టాక్. -
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
టైటానిక్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలతో చాలా పేరు తెచ్చుకున్న నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. వృద్ధ్యాప్య సమస్యల కారణంగా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈయన అభిమానులు, పలువురు నెటిజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)యూకేకి చెందిన బెర్నార్డ్ హిల్.. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. టీవీ, సినిమా, థియేటర్ రంగాల్లో నటుడిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్లో క్లాసిక్ సినిమాలైన 'టైటానిక్'లో షిప్ కెప్టెన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రాయాలజీలో కింగ్ పాత్రల్లో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఇప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయారు.(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)It’s with great sadness that I note the death of Bernard Hill. We worked together in John Paul George Ringo and Bert, Willy Russell marvellous show 1974-1975. A really marvellous actor. It was a privilege to have crossed paths with him. RIP Benny x#bernardhill pic.twitter.com/UPVDCo3ut8— Barbara Dickson (@BarbaraDickson) May 5, 2024 -
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ విడాకులు తీసుకుంది. తన భర్త సామ్ అస్గారితో అధికారికంగా విడిపోయింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరి పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గతేడాది జూలైలో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట .. ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే పెళ్లికి ముందే దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు.కాగా.. బ్రిట్నీ స్పియర్స్‌కి ఇది మూడో వివాహం కాగా.. ఆమె రెండో భర్త కెవిన్ ఫెడెర్‌లైన్‌తో ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. వీరిద్దరు 2004 నుంచి 2007 వరకు కలిసి ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. బ్రిట్నీ స్పియర్స్ మొదట చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను 2004లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే విడిపోయింది. ఆ తర్వాత 2016లో నటుడు అస్గారితో డేటింగ్ చేయడం ప్రారంభించింది. 2021 సెప్టెంబర్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. 2022లో స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. -
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
టైటిల్: ది కంజూరింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్నటీనటులు: వేరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, సారా కేథరిన్ హుక్, జులియన్ హిలార్డ్, జాన్ నోబుల్, ఎజిన్ బొండురెంట్, రూయ్ ఓకోన్నూర్ తదితరులుదర్శకత్వం: మేఖేల్ చావ్స్నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్హారర్ సినిమాలు అంటేనే క్రియేటివీటికి మారుపేరు. లేనిది ఉన్నట్లుగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. కానీ ది కంజూరింగ్ మాత్రం అలాంటి హారర్ మూవీ కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రం. అమెరికాలో జరిగిన ఓ హత్య ఆధారంగా రూపొందించారు. అసలు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? దెయ్యమా? లేక మనుషులేనా? అన్నది తెలియాలంటే ది కంజూరింగ్ చూసేయాల్సిందే.హాలీవుడ్లో హారర్ సినిమాలకు కొదువే లేదు. గతంలో వచ్చిన అన్నా బెల్లె, ది నన్ వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలే. మైఖేల్ చావ్స్ తెరకెక్కించిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ కూడా అంతకుమించి ఉందనడంలో సందేహం లేదు. ఈ 21వ శతాబ్దంలో అత్యంత భయపెట్టే చిత్రాల్లో ది కంజూరింగ్ ఒకటని చెప్పొచ్చు. ఈ మూవీ చూశాక దెయ్యాలు కూడా చేతబడులు చేస్తాయా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు దెయ్యం ఏంటి? చేతబడులు చేయడమేంటి? అనే డౌటానుమానం మొదలైందా? అయితే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ 1981 ప్రాంతంలో జరిగిన కథ. ఇందులో డేవిడ్ గ్లాట్జెల్, డెబ్బీ, ఆర్నె, లోరాయిన్, ఈడ్, క్యాస్టనర్, జూడీ వారెన్ పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. మసాచుసెట్స్‌లోని ఓ ఫ్యామిలీలోని చిన్న పిల్లాడు(డేవిడ్ గ్లాట్జెల్)కి పట్టిన దెయ్యాన్ని విడిపించేందుకు భూతవైద్యుని వద్దకు వెళ్తారు. అదే క్రమంలో ఆ పిల్లాడిని విడిచిపెట్టిన ఆ దెయ్యం.. ఆర్నె అనే యువకుడి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యం ఆవహించిన ఆర్నె తన యాజమానిని హత్య చేస్తాడు. దీంతో పోలీసులు ఆర్నెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇలాంటి కేసు అమెరికాలోనే మొదటిదని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోతారు. అదే క్రమంలో జైల్లో ఉన్న ఆర్నెను దెయ్యం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తూనే ఉంటుంది. అయితే ఆ దెయ్యాన్ని నిలువరించేందుకు.. ఆర్నెను రక్షించేందుకు లోరాయిన్, ఈడ్ ప్రయత్నిస్తారు. కానీ ఆ క్రమంలోనే వారికి అసలు నిజం తెలుస్తుంది? అసలు లోరాయిన్, ఈడ్ ఎవరిని కలిశారు? వారికి తెలిసిన నిజమేంటి? ఆర్నెను వేధిస్తున్న దెయ్యం ఒకరా? ఇద్దరా? లేక ఆత్మనా అనే సస్పెన్ష్ చివరి వరకు ఆడియన్స్‌కు అర్థం కాదు.డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడేవారు ది కంజూరింగ్ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రంలో దెయ్యం మనిషిని ఆవహించే సన్నివేశాలు మాత్రం ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటాయి. ప్రతి సీన్ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తాయి. దెయ్యం ఆర్నెను తన అధీనంలోకి తెచ్చుకునే క్రమంలో వచ్చే దృశ్యాలు ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను డైరెక్టర్ మరింత రియలిస్టిక్‌గా చూపించారు. అంతే కాకుండా చివర్లో ఓ బిగ్ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ చూడాల్సిందే. 2021లో వచ్చిన ఈ థ్రిలర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని చిన్నపిల్లల సమక్షంలో చూడవద్దని మనవి. -
రెండేళ్లుగా గప్‌చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
సౌత్ కొరియా సింగర్ ఆండా రెండేళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. అప్పటివరకు ఎంతో యాక్టివ్‌గా ఉన్న ఈ బ్యూటీ ఉన్నట్లుండి సామాజిక మాధ్యమాలను ఎందుకు దూరం పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది ఆండా. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర వార్త బయటపెట్టింది.ఓ విషయం చెప్పాలితనకు పెళ్లైందని, ఓ బిడ్డ కూడా పుట్టిందని వెల్లడించింది. ఈమేరకు భర్తతో కలిసున్న వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసింది. 'హలో, నా పేరు ఆండా. చాలాకాలంగా నేను సైలెంట్‌గా ఉండటంతో నేనెలా ఉన్నానని కంగారుపడుతున్నారేమో! నేను బాగున్నాను.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఇది సాంగ్‌కు సంబంధించినది కాదు.. ఇదెలా చెప్పాలా? అని చాలాకాలంగా టెన్షన్ పడుతున్నాను. ఇక దాన్ని చెప్పేస్తున్నాను.పెళ్లి - పాపగతేడాది ఓ అద్భుతమైన వ్యక్తిని కలిశాను. మేమిద్దరం శీతాకాలంలో పెళ్లి చేసుకున్నాం. మాకు ఓ పాప పుట్టింది. మీరు ఇకపై ఆండా 2.0ను చూడబోతున్నారు. తల్లిగా, భార్యగా, సింగర్‌గా అన్ని పనులు నిర్వర్తించనున్నాను. మీ అందరికోసం మరింత కష్టపడతాను. థాంక్యూ' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Anda🎈 (@anda_kiss)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement