batti vikramarka
-
ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శం: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కల్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కల్యాణ పత్రికను సీఎంకు అందజేశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు ఉండాలి. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ఇందులో భాగమే. శాంతి భద్రతలు అదుపులోకి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. నేను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నాం. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. ఫ్యూచర్ సిటీని నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ రూపకల్పన జరుగుతుంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం’ అని తెలిపారు.భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం.దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు భాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. ఆదాయం పెంచాలి.. పేదలకు పెంచాలన్నది మా ప్రభుత్వ విధానం. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు.. ఇది అభివృద్ధి చేసే సందర్భం. మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉంది. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతాం’ అని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. ఉగాది వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలో పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది పరుగులు పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు. -
కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి, కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం
-
భూ భారతి, ధరణిపై అసెంబ్లీలో మాటల యుద్దం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో ధరణి, భూ భారతి అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో నినాదాలు కొనసాగుతున్నాయి.ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ధరణి, భూ భారతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..‘భూములపై రైతులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే. కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది. భూస్వాముల చట్టం ధరణి. లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాశారు.పల్లా రాజేశ్వర్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోంది. దున్నేవాడితే భూమి కదా సాయుధ పోరాట నినాదం. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి. బంగాళాఖాతంలో ధరణిని వేస్తామని చెప్పాం. బంగాళాఖాతంలో వేశాం.. కొత్త చట్టం తెచ్చాం. జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు. ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.భూ భారతి కాదు.. భూ హారతి: పల్లా రాజేశ్వర్ రెడ్డిభూ భారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే.. మేము కూడా ధరణిపైనే ఎన్నికలకు వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూ భారతి కాదు భూ హారతి. జమాబంది పేరుతో మరో దుకాణం తెరిచింది. ఇప్పుడు జమాబంది ఎందుకో ప్రభుత్వం చెప్పాలి.భవిష్యత్‌లో భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం: పొంగులేటిపల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వారిని ఓడించారు. ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎవరిని ఆదరిస్తారో చూద్దాం. ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు. 2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం. -
బీఆర్ఎస్కు ఎలా కౌంటరివ్వాలో మాకు తెలుసు: భట్టి
Telangana Assembly session Updates..👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై చర్చ..బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్.. 👉బడ్జెట్లో మూల ధన వ్యయం తగ్గిస్తున్నారు. బడ్జెట్లో సూక్తి ముక్తావళి చాలా ఉంది. కానీ, వాస్తవం చూస్తుంటే కమీషన్ల ప్రభుత్వంలా కనిపిస్తుంది. నిధులు లేక వ్యవస్థలు కూనరిల్లుతున్నాయి. సచివాలయంలో ధర్నాలు ఎన్నడూ చూడలేదు. తెలంగాణ నమూనా ఏంటో అర్థం కావడం లేదు. కూల్చివేతల్లోనా, కమీషన్లలోనా అర్థం కావడం లేదు. భూసేకరణ పేరుతో పేద, గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 15 నెలల్లోనే లక్షా 63వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి పొందిన సాయాన్ని గుర్తుచేస్తే బాగుండేది. ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్..బడ్జెట్‌పై హరీష్ రావు స్పీచ్ పొలిటికల్ విమర్శలే ఉన్నాయి.బడ్జెట్‌పై హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడలేదు.హరీష్ రావు సబ్జెక్టు మాట్లాడుతారు అని చూసాం కానీ మాట్లాడలేదు.మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టే అంత సమయం ఇచ్చాం.మాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు.హరీష్ రావు.. ఆర్ఆర్ టాక్స్ వ్యాఖ్యలకు సరైన సమయంలో స్పందన ఉంటుంది.బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో మాకు తెలుసు.మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్..పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ తయారు కాబోతోంది.సెంట్రల్ హాల్ తయారు చేయాలని ఆలోచన జరుగుతుంది.కౌన్సిల్ రెడీ అవ్వగానే మధ్యలో హాల్ రెడీ అవుతుంది.అందరికీ కూర్చునే విధంగా హాల్స్ రెడీ చేస్తాం. 👉సభలో బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభించిన హరీష్ రావు.కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.మిగతా ఉద్యోగాలు అన్ని బిఆర్ఎస్ పాలనలో ఇచ్చినవి.56000 ఉద్యోగాలు ఇచ్చాము అని అసత్యపు ప్రచారాలు ప్రభుత్వం చేస్తుంది.భట్టి బడ్జెట్ మీద నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు మొండి చెయ్యి చూపారు.ఈ ఏడాదైనా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన వారి ఆశల మీద భట్టి బకెట్ల కొద్దీ నీళ్లు చల్లారు.ఎన్నికల ముందు రేవంత్ నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ చుట్టూ అంగ ప్రదక్షిణం గావించారు.ఊరూరు బస్సు యాత్రలు చేసి రెచ్చగొట్టారు.నిరుద్యోగులను మీ పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇల్లిల్లూ తిప్పారు.నాడు నమ్మించారు, నేడు నిండ ముంచారు.ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుష్ర్పచారం చేసారు.తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నిధులు, నీళ్లు, నియామకాలు నెరవేర్చిన ప్రభుత్వం మాది.తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. ముల్కీ రూల్స్ నుంచి 610 దాకా తెలంగాణ పోరాడింది దేని కోసం?స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని. మా ఉద్యోగాలు మాకు కావాలని. అదే చేసిండు కేసీఆర్60-80శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్ ను 95శాతానికి పెంచిండు.అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించిండు.ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్షరాల లక్షా 62వేల ఉద్యోగాలు భర్తీ చేసినం.ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే మీ ప్రచారం విష ప్రచారం.అబద్దమే మీ ఆత్మ. అబద్దమే మీ పరమాత్మ.ఇదే కాదు నీ జాబ్ క్యాలెండర్ సంగతి, నీ నిరుద్యోగ భృతి సంగతి, నువ్వు చెబుతున్న 57 వేల ఉద్యోగాల తప్పుడు లెక్కల సంగతి తేలిపోయింది.జాబుల్లేని క్యాలెండర్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్ అంటారా?మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఏడాదిన్నరగా పంచుతున్నవు తప్ప, నువ్వు వెలగబెట్టింది ఏమి లేదు.మీరు చెప్పుకుంటున్న 57వేల ఉద్యోగాల్లో మేం ఇచ్చినవే 50వేలు. ఆరు వేల పోస్టులు కూడా ఇవ్వలేదు.15నెలల పాలనలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేసిన పోస్టులు ఎన్ని?గ్రామపంచాయతీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదు.ప్రభుత్వానికి అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు సవాల్భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గమైనా? సిద్దిపేట నియోజకవర్గమైనా?పూర్తిగా 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తాను. కృష్ణ జలాలపై ప్రభుత్వం పోరాటం చేయాలి.575 టీఎంసీలను తెలంగాణకు తీసుకురావాలి.కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సెక్షన్స్-3 తీసుకొచ్చారు.గతంలో నేను కేసీఆర్ సంతకాలు పెట్టినట్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.అక్కడ ఆదిత్య నాథ్, తెలంగాణ నుంచి ఎస్కే జోషి మాత్రమే సంతకాలు చేశారు.కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుంది.కృష్ణా జలాలపై ప్రత్యేక చర్చ పెట్టాలి. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం.ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే ప్రజలకు తెలుస్తుంది.హరీష్ కామెంట్స్.. మెగా డీఎస్సీ పేరుతో మోసం చేశారు. సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలపై నమ్మకం పోయింది. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. శ్రీధర్ బాబు కామెంట్స్..నీటి వాటాలపై ప్రత్యేకమైన చర్చ పెడదాం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నీళ్ల వాటాల గురించి స్పష్టమైనటువంటి వైఖరిని తెలిపారు.శాసన మండలిలో జూపల్లి కామెంట్స్..బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది..తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షకు అనుగుణంగా పాలన జరగలేదు.మంత్రి జూపల్లి వాఖ్యల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం..సభలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ సభ్యులు.. హరీష్ రావు కామెంట్స్..👉బడ్జెట్‌పై మాట్లాడుతుంటే అధికారపక్షం నేతలు అడ్డుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు రుణమాఫీ చేయడం లేదు. కాంగ్రెస్ పాలనలో రైతులది ఒడవని దుఖం. ఒక్క సిద్దిపేటలోని రూ.2లక్షల రుణమాఫీ కాని వారు 10వేల మంది ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు విషయంలో రికార్డు సృష్టించాం. పన్నులు లేకుండా సాగు నీళ్లు ఇవ్వండి. రుణమాఫీ కాని రైతులందరికీ విడుదల చేయాలని కోరుతున్నాం. సంపూర్ణ రుణమాఫీ జరిగితే నేను బహిరంగ క్షమాపణలకు సిద్ధం. హరీష్ రావు కామెంట్స్..మహాలక్ష్మి 2500, పెన్షన్ పెంపు, వితంతువు పెన్షన్ముఖ్యమంత్రి మంచి కళాకారుడు, వక్త.ఆరు గ్యారెంటీలను బడ్జెట్లో మరిచిపోయారు.పెన్షన్ 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని వృద్ధులు కాలం చేస్తున్నారు.కొత్త పెన్షన్స్ లేవు, 4000 పెంపు లేదు, కోత మాత్రం లక్ష మందికి చేశారు.తెలంగాణలో కోటి మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఉన్నారు.లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 👉హరీష్ రావు బుద్ధి మాన్యం అనే పదాన్ని అభ్యక్షన్ చేసిన స్పీకర్👉బుద్ధిమాన్యం తప్పేమీ కాదని నిండు సభలో బట్టలూడదీసి కొడతా అని సీఎం అనడం కరెక్టా అంటూ హరీష్ వాదన.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..బుద్ధి మాన్యం అనే వ్యాఖ్యను ఖండిస్తున్నాం.స్పీకర్ అభ్యంతరం చెప్పినప్పుడు ఏకీభవించాలి.జగదీష్ రెడ్డి తరహాలో హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు.స్పీకర్ అభ్యంతరానికి హరీష్ రావు అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదు.బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలు వ్యాఖ్యలు హరీష్ రావు చేస్తున్నారు.మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..సభ్యుల సంఖ్య ప్రకారం అందరికీ అవకాశాలు ఇస్తున్నాం.కాంగ్రెస్ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 30 నిమిషాలు ఉంటుంది.బీఆర్ఎస్ సభ్యుల ప్రకారం 19 నిమిషాలు.బిజెపికి ఏడు నిమిషాలు, ఎంఐఎంకి ఐదు నిమిషాలు.హరీష్ రావు కామెంట్స్..నన్ను మాట్లాడమంటే మాట్లాడతా లేదంటే వెళ్ళిపోతాను.ప్రతి చిన్న విషయానికి ఇంట్రప్షన్ చేస్తే కుదరదు. 👉హరీష్ వ్యాఖ్యలు.. భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అనుముల వారి పాలనలో ఎన్నికల భూములు అమ్ముతారో చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారు. అంచనాలకు అనుగుణంగా రీచ్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉంది?. 👉కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర బుద్ధి రేటు 5.5% ఉంటే బడ్జెట్లో 20% ఉంది అన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం దేశమంతా ఉంటే కర్ణాటకలో ఎందుకు లేదు?. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జీఎస్టీ వృద్ధిరేటు దేశం కంటే ఏనాడు తక్కువ లేదు కాంగ్రెస్ పాలనలో తగ్గింది. గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ రాగానే అన్ని ఎందుకు తగ్గిపోయాయి?. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్లతో ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం అయింది. హైడ్రాతో భయపెట్టారు, ఎయిర్‌పోర్టుకు మెట్రో రద్దు అన్నారు, మూసీ ప్రక్షాళన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పెట్టుబడులు రాకుండా పోయాయి అని కామెంట్స్ చేశారు. 👉హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన..హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేసిన విప్‌లు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్..వైఎస్సార్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేశారు.ఎన్నికలకు రెండు మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్డును కమీషన్లకు కకుర్తిపడి అమ్ముకున్నారుబీఆర్ఎస్ కోకాపేటా యాక్షన్ అంతా మాకు తెలుసు.బీఆర్ఎస్ నాయకుల బినామీలు వంద కోట్లకు కొనుగోళ్లను ఎవ్వరూ మర్చిపోలేదు.రోడ్డును ఎవరైనా అమ్ముకుంటారా?చరిత్ర మర్చిపోయి ఎవ్వరూ మర్చిపోలేదు👉మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్స్..అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలి.ప్రభుత్వం ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎల్ఏ మినిస్టర్ ఉన్నారు.హరీష్ రావు మాట్లాడేటప్పుడు ప్రతిసారి అడ్డుకోవద్దు. 👉ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కామెంట్స్..శ్రీనివాస్ యాదవ్ నీతులు మాకు కాదు వాళ్ల పార్టీ వాళ్లకు చెప్పుకోవాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి.వాస్తవాలకు దూరంగా మాట్లాడినప్పుడు స్లోగన్స్ ఇవ్వడం తప్పేమీ కాదు.అడ్డగోలుగా మాట్లాడతాము అంటే మౌనంగా ఉండలేం.హరీష్ రావుకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.👉హారీష్‌రావు కామెంట్స్..గత బడ్జెట్లో భట్టి విక్రమార్క చెప్పిన విషయాలను ప్రస్తావించిన హరీష్. గత సంవత్సరం బడ్జెట్‌ను సమీక్షించుకుందాం. ఫార్మాసిటీ భూములపై నాడు పోరాటం చేశారు. ఇప్పుడు బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారు. అలాగే, రుణమాఫీకి 31వేల కోట్లు సిద్ధం చేశామని గత బడ్జెట్లో చెప్పారు. ఇప్పుడు 21వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారు. చేతగాని వాళ్లు ఎవరో ప్రజలకు అర్థమైంది.👉ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తామన్నారు. వానాకాలంలో ఎగబెట్టారు. యాసంగిలో 12వేలు అన్నారు. అది కూడా సరిగా అందలేదు. కౌలు రైతులకు 12వేలు ఇస్తామన్నారు. ఇప్పడు, రైతులు, కౌలు రైతులే తేల్చుకోవాలంటున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్‌గా క్యాలెండర్‌గా మారింది. రివైజ్డ్ ఎస్టిమేషన్స్‌లో 27వేల కోట్లు తక్కువ చేసి చూపారు.👉హెచ్ఎండీఏ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెస్తామంటున్నారు. హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రభుత్వ భూములు అమ్మవద్దన్న వారే అప్పుడు అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు విమర్శించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి. బడ్జెట్లో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేశారు.👉జాబ్ క్యాలెండర్‌పై నిలదీస్తే నిరుద్యోగులను అశోక్‌నగర్‌లో అరెస్ట్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు?.. ఉద్యోగాలు ఇచ్చారా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా?. ఆర్ఆర్ఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరమైనా భూసేకరణ చేసిందా?. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్.. నో బీఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడు ముక్కు పిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. ఇవి అవాస్తవిక అంచానాలని ఆనాడే చెప్పాను. 👉ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీ, కౌన్సిల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు.👉అలాగే, సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.👉లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను సభకు సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు. -
ఆరు గ్యారంటీలు గోవిందా.. బడ్జెట్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణలోని ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అలాగే, పీఆర్సీకి సంబంధించి ఎలాంటి ప్రకటనలేదని కామెంట్స్ చేశారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై కేటీఆర్ స్పందించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు గోవిందా అని అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయింది. ఏడాది దాటినా ఉద్యోగాల ఊసేలేదు. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు రావాలి. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డు ఊసేలేదు. అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.తులం బంగారం ఎక్కడ?.ఎన్నికల్లో ఇచ్చిన హమీ తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2000 పథకానికి పాతరేశారు. రూ.4000 ఇస్తామన్న పెన్షన్లు గోవిందా అనేలా బడ్జెట్ ఉంది. బడ్జెట్లో మహిళలకు తీరని అన్యాయం జరిగింది. కులగణన సర్వే పేరుతో వెనుకబడిన వర్గాలను మోసం చేసింది. కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం 40 శాతం గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను వెన్నుపోటు పొడిచింది. రైతు కూలీలకు ఏ ఒక్కరికీ రూ.12వేలు రాలేదు. ఆదాయం రూ.70వేల కోట్లు పడిపోయిందని సీఎం చెప్పారు. అంబేద్కర్ అభయహస్తం ప్రస్తావనే లేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ కుప్పకూల్చింది. కరోనా కంటే ప్రమాదకరం కాంగ్రెస్ వైరస్. మేం సంవత్సరానికి రూ.40వేల కోట్లు అప్పు చేస్తే గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే లక్షా 60వేల కోట్లు అప్పు చేసిందన్నారు. పెండింగ్ నగరంగా హైదరాబాద్..తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుంది. ప్రభుత్వ అందమే సక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం. రంకెలు కాదు రేవంత్ రెడ్డి..అంకెలు ఎక్కడ పోయినాయి. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు మా హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే.. ఇప్పుడు చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్ లో లేదు. వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామనీ హామీ ఇచ్చారు. అది ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలలో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహా నగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. -
తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్లు: భట్టి
👉తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. తెలంగాణ బడ్జెట్ రూ.3.4లక్షల కోట్లు2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లు.రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు.మూలధన వ్యయం రూ.36,504 కోట్లు. బడ్జెట్ కేటాయింపులు..పౌరసరఫరాల శాఖ- 5734 కోట్లువిద్య - 23,108కోట్లుపంచాయతీ &రూరల్ డెవలప్మెంట్ -31605 కోట్లురైతు భరోసా- 18,000 కోట్లు.వ్యవసాయ రంగానికి -24,439 కోట్ల రూపాయలుపశుసంవర్ధక శాఖకు -1,674 కోట్లు.పౌరసరఫరాల శాఖకు -5,734 కోట్లు.మహిళా, శిశు సంక్షేమం -2,862 కోట్లుఎస్సీ అభివృద్ధి -40,232 కోట్లుఎస్టీ అభివృద్ధి-17,169 కోట్లుబీసీ అభివృద్ధి-11,405కోట్లుచేనేత రంగానికి-371మైనారిటీ-3,591కోట్లువిద్యాశాఖకు-23,108 కోట్లుకార్మిక ఉపాధి కల్పన-900 కోట్లుపంచాయతీరాజ్ శాఖకు-31,605 కోట్లుమహిళా శిశు సంక్షేమశాఖ-2,862 కోట్లు.షెడ్యూల్ కులాలు-40,232 కోట్లుషెడ్యూల్ తెగలు-17,169 కోట్లు.వెనుకబడిన తరగతుల సంక్షేమానికి-11,405 కోట్లు.ఐటీ శాఖకు-774 కోట్లువిద్యుత్ శాఖకు-21,221 కోట్లుమున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు-17,677 కోట్లునీటి పారుదల శాఖకు-23,373 కోట్లురోడ్డు భవనాలు శాఖకు-5907 కోట్లుపర్యాటక శాఖకు-775 కోట్లుక్రీడా శాఖకు-465 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు-1023 కోట్లుదేవాదాయ శాఖకు-190 కోట్లుహోంశాఖకు- 10,188 కోట్లుమహాలక్ష్మి పథకానికి రూ.4305 కోట్లుగృహజోత్యి పథకానికి రూ.2080 కోట్లు.సన్న బియ్యం బోనస్‌కు రూ.1800 కోట్లు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1143 కోట్లు. బడ్జెట్ పూర్తి కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..భట్టి ప్రసంగం..అంబేద్కర్ స్పూర్తితో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.తెలంగాణ తాత్కాలిక, దీర్థకాలిక ప్రయోజనాలే ముఖ్యం. మాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారు.అబద్ధపు వార్తలతో ప్రజలు మోసం చేస్తున్నారు. అబద్దపు విమర్శలను తిప్పి కొడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు మా నినాదం.తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో సీఎం పాలనను ముందుకు నడిపిస్తున్నారు.నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం 200 బిలియన్ డాలర్లు. రాబోయే ఐదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు ఉండేలా కార్యాచరణ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు.58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసన్న వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్..40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ.ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు.ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు 2000 అదనపు సబ్సిడీ.వడ్ల బోనస్ కింద రైతులకు 1,206 కోట్లు చెల్లింపు.తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపు.57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ.రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు.బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులుప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు.స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు.గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు.విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం.కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేరిక.. 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ లబ్ధి..ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంపు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు వేగంగా వస్తున్న మార్పుల ప్రభావాన్ని తెలంగాణ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధుని సాధిస్తుంది.24-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లు.గత ఏడాదితో పోల్చితే వృద్ధి రేటు 10.1శాతంగా నమోదైంది. బడ్జెట్ ప్రసంగం చదువుతున్న భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రిగా భట్టి మూడోసారి బడ్జెట్ ప్రసంగం..👉బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతల నినాదాలు.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు.. 👉బడ్జెట్ ప్రతులను స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు.అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన..అసెంబ్లీ మీడియా పాయింట్ కేటీఆర్ కామెంట్స్..ఎండిన పంటలు, రైతులకు సంఘీభావంగా నిరసన చేస్తున్నాం.11 నెలలుగా మేము ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం.వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.. రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు.ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు.తెలంగాణలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోపిడి చేస్తున్నారు.కేసీఆర్ పాలనలో 36శాతం కృష్ణా జలాలను వాడుకొని రైతులకు నీళ్లు ఇచ్చాం.కాంగ్రెస్ పాలనలో కిందికి నీళ్లు వదిలి.. పంటలు ఎండబెట్టారు.కాలం తెచ్చిన కరువు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.రేవంత్ రెడ్డి ముందు చూపులేని ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయి.రేవంత్ రెడ్డి గుడ్డి చూపు, చేతగాని, తెలివితక్కువ తనం వల్ల రైతులకు సమస్యలు.ఎండిన పంటలకు ఎకరానికి 25వేల పంట నష్టం ఈ బడ్జెట్ లో కేటాయించాలిపంటలు ఎండిపోవడానికి చెక్ డ్యామ్ లు, చెరువులు నిలపకపోవడం వల్లే నష్టం జరిగింది.త్వరలో ఎండిన పంటలు ఉన్న ప్రాంతాల్లో పర్యటన చేస్తాం👉తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 👉అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం కేబినెట్ భేటీ.. అసెంబ్లీ హాల్లో బడ్జెట్ మీద కేబినెట్ భేటీబడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి11.14కు తెలంగాణ బడ్జెట్శాసన సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టిమండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కఘనస్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ సెక్రటరీ నరసింహచార్యులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు. ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క.అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరు కానున్న భట్టి. 👉నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.👉వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.👉2024–25లో ప్రతిపాదించిన రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఇది సుమారు 5 శాతం అదనం.👉ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. అనంతరం 11:14 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.గ్యారంటీలకు తోడుగా! 👉తాజా బడ్జెట్లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.👉ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.👉రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, పంటల బీమా ప్రీమియం కోసం రూ. 5 వేల కోట్లను ప్రతిపాదించే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ పథకాలకు సంబంధించి రాష్ట్రం భరించాల్సిన మొత్తాన్ని కూడా బడ్జెట్లో చూపించనున్నారు.👉గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 36వేల కోట్ల వరకు ప్రతిపాదించగా.. ఈసారి దీన్ని రూ.65 వేల కోట్లవరకు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రూ.లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల దాకా..! 👉తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 12 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో 2014–15 సంవత్సరానికి గాను 10 నెలల కాలానికి బడ్జెట్ పెట్టగా.. 2024–25లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌తో పాటు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2014–15లో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టారు. తర్వాతి నాలుగేళ్లలో బడ్జెట్ పరిమాణం రూ.1.75 లక్షల కోట్ల వరకు చేరింది.👉2019–20లో కరోనా ప్రభావంతో బడ్జెట్‌ను తగ్గించి రూ.1.46లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. తర్వాతి రెండేళ్లలోనే ఏకంగా రూ.85 వేల కోట్ల మేర బడ్జెట్ పెరిగి రూ.2.30లక్షల కోట్లకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2.90లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ 2024–25లో రూ.2.91లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ (2024–25) బడ్జెట్లో అంచనా వ్యయాన్ని రూ. 2.75 లక్షల కోట్లుగానే ప్రతిపాదించడం గమనార్హం. -
రేవంత్‌కు ఝలక్.. బీఆర్ఎస్ బాటలోనే బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల అఖిలపక్ష సమావేశానికి బీజేపీ సభ్యులు హాజరుకాకూడదని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. మరోవైపు.. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనడం లేదు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో.. పార్టీ కార్యక్రమాల కారణంగా సమావేశానికి హాజరు కాలేకపోతున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలని కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అంటూ చెప్పుకొచ్చింది.ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనున్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. -
అట్లాస్ నివేదిక ఇచ్చిన భట్టికి ధన్యవాదాలు.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దివాళాకోరు మాటలు మాట్లాడే సీఎం దేశం ఎక్కడా ఉండరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒక్కటే మాట చెబుతున్నారు. రేవంత్ మాట మాట్లాడే ముందు ఒక్కసారి భట్టి విక్రమార్క నివేదికను చూడాలని హితవు పలికారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ అట్లాస్ నివేదిక ఇచ్చిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. ప్రస్తుతం తెలంగాణ అట్లాస్ నివేదికను నెట్ నుంచి తొలగించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలను నివేదికలో భట్టి విక్రమార్క ఉతికి ఆరేశారు. ఆ నివేదికలో తెలంగాణ దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ వన్ అని చెప్పింది. కేసీఆర్ హయంలో సంపద ఎలా పెరిగిందో నివేదికలో ఉంది. భారత దేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. జీఎస్డీపీలో తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో గుజరాత్‌ను కూడా దాటింది. గత పదేళ్లలో తెలంగాణ ఆదాయం, సంపద పెరిగిందన్నారు. కేసీఆర్ పాలనపై సొల్లు వాగుడు వాగిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ అట్లాస్ ఇప్పటికైనా చూడాలి. జీవ సంపదలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని నివేదికలో ఉంది. విద్యుత్ వినియోగం కూడా కేసీఆర్ ప్రభుత్వ హయంలోనే పెరిగింది. బీఆర్ఎస్ పాలనలోనే ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వ నివేదికనే చెబుతోంది. అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలకు వ్యతిరేకంగా నివేదిక ఉంది. అన్ని వివరాలు ఆ నివేదికలో ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ రేవంత్ మాత్రం మాట మార్చడం లేదంటూ మండిపడ్డారు. పది నెలల్లో తెలంగాణ అప్పులపై కట్టిన వడ్డీ 22వేల 56కోట్లు. నెలకు కడుతుంది 2,200 కోట్లు. ఇది నివేదికలో ఉంది. కానీ ఆరువేల కోట్లకు పైగా నెలకు అప్పులకు వడ్డీ కడుతున్నట్టు రేవంత్ మాట్లాడుతున్నారు. రేవంత్ బూతులు మాట్లాడం మానేయాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. విజ్ఞత లేని రేవంత్.. తెలంగాణను క్యాన్సర్ రోగితో పోల్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత లక్ష మంది రేషన్ కార్డులు తొలగించినట్టు నివేదికలో ఉందన్నారు. కాంగ్రెస్ హయంలో తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి వచ్చింది. రాబడి కంటే ఖర్చు ఎక్కువ చేస్తోంది. ఈ డబ్బు ఎక్కడికి పోతుంది?. ఎందుకు అప్పులు చేస్తున్నారు?. ముఖ్యమంత్రి రేవంత్‌వి తుగ్లక్ నిర్ణయాలు.. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాళేశ్వరం ఎండ పెట్టడం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఒక దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోంది. కాంగ్రెస్ పార్టీది దిక్కుమాలిన, సిగ్గుమాలిన పాలన. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు. నేను చెప్పిన విషయాలు అబద్ధం అని చెబితే ఏం చేయడానికి అయిన నేను సిద్ధం’ అని సవాల్ విసిరారు. -
తెలంగాణలో మరోసారి కులగణన సర్వే
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కులగణన సర్వే (telangana census survey)నిర్వహించింది. అయితే తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రకటించారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఆ విజ్ఞప్తులపై భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ మరోసారి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఉంటుంది. తొలిసారి చేపట్టిన కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వారికి మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఈ నెల 16 నుంచి 18 మధ్య మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తున్నాం.సర్వేలో పాల్గొనే వాళ్ళు టోల్ ఫ్రీ, మండల కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు..కేసీఆర్ (kcr), కేటీఆర్ లాంటి వాళ్లకు మరో అవకాశం ఇస్తున్నాం. రాష్ట్ర జనాభాలో వీళ్ళు చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి మొదటి వారంలో కేబినెట్ ఆమోదం తెలుపుతాం. ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. రాబోయే అసెంబ్లీలో బిల్లు పెట్టి.. చట్టం చేస్తాం.అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి..కేంద్రానికి పంపుతాం. త్వరలోనే తెలంగాణ నుంచి బృందంగా వెళ్లి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ పెద్దలను కలుస్తాం. కేంద్రం వద్దకు వెళ్లినప్పుడు కలిసివచ్చే రాజకీయ పార్టీలను తీసుకెళ్తాం. దశాబ్దాల బీసీ కల త్వరలోనే నెరవేర్చబోతున్నాం. ఓబీసీల లక్ష్యాలను సాధించడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. బీసీ రిజర్వేషన్లు ప్రకటన తర్వాతే పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్రం చట్టబద్ధత కల్పిస్తుందని ఆశిస్తున్నాం. మా పార్టీ ఎంపీలే కాదు...అన్ని పార్టీల ఎంపీలను కలుపుకోని వెళ్తాం.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 👉చదవండి : రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఫౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన! -
20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పాదకతను ప్రోత్సహించి భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి త్వరలో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ(Green Energy Policy) ప్రకటించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. కాలుష్య కారక థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ(Green energy) ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రం కూడా ఆ దిశలో అడుగులు వేస్తోందని చెప్పారు. రాష్ట్రం 11,399 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పత్తితో దేశంలో ముందంజలో ఉండగా, 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచడమే పాలసీ లక్ష్యమన్నారు. శుక్రవారం హెచ్ఐసీసీలో పారిశ్రామిక, వ్యాపార, ఇతర రంగాల భాగస్వాములతో నిర్వహించిన సదస్సులో భట్టి మాట్లాడారు. అనంతరం వివరాలను వెల్లడించారు. భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ ‘సాంకేతిక, ఫార్మా, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల అభివృద్ధికి రాష్ట్రం కేంద్రంగా ఆవిర్భవించింది. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు అధిక విద్యుత్ డిమాండ్(Electricity Demand) కు దోహదపడతాయి. 2024–25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడగా, 2029–30 నాటికి 24,215 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా’అని భట్టి చెప్పారు. భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ‘పునరుత్పాదక విద్యుత్ రంగం(electricity sector) లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం 7,889 మెగావాట్ల సౌర విద్యుత్, 2,518 మెగావాట్ల జల విద్యుత్, 771 మెగావాట్ల డి్రస్టిబ్యూటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ, 128 మెగావాట్ల పవన విద్యుత్ సహా 221 మెగావాట్ల ఇతర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. పాలసీలో భాగంగా సౌర విద్యుత్‌తో పాటు ఫ్లోటింగ్ సోలార్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులు తీసుకొస్తాం. ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తాం..’అని భట్టి తెలిపారు.రాష్ట్రంలో ఈ ఏడాది కూడా విద్యుత్ చార్జీల(electricity charge) ను పెంచబోమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ, కె.వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఇందనంగా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నామని భట్టి చెప్పారు. ఆ్రస్టేలియా– ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఐఐటీలో రెండురోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పరిశోధన, సంబంధిత సైన్స్ ఆధారిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వైఎస్సార్ నాయకత్వంలోనే హైదరాబాద్ ఐఐటీకి పునాదులు పడ్డాయని, ఐఐటీలు దేశ నిర్మాణానికి వేదికలని చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణిలో పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టుపై హైదరాబాద్ ఐఐటీ ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. సింగరేణి డైరెక్టర్ బలరామ్ నాయక్, ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి ఎంఓయూపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఆ్రస్టేలియా కాన్సులేట్ జనరల్ (బెంగళూరు) హిల్లరీ మెక్గేచి, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీ దినేష్ మహోర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో అధికార, విపక్షాల సమరం
-
ప్రధాని, అదానీ కలిసి దేశం పరువు తీశారు: సీఎం రేవంత్
Congress Chalo Raj Bhavan Updates..రాజ్‌భవన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ..ప్రధాని, అదానీ అనుబంధం మన దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందిదేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇచ్చే పరిస్థితిని తెచ్చారుఅదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారుజేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందిఅదానీ విషయంలో ప్రధానిని అడిగినా, కడిగినా కనీసం మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రి రాజ్‌భవన్ వద్దకు నిరసన ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మా నిరసన కొందరికి నచ్చకపోవచ్చు. 75 ఏళ్ల కష్టపడి కాంగ్రెస్.. దేశ ప్రతిష్టను పెంచింది. ప్రధాని, అదానీ కలిసి దేశం పరువు తీస్తున్నారు.అదానీ లంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు తేల్చాయి.ఈ విషయంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైంది.ఈ అంశంపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిలదీశారు.కానీ, దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు.మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నాం.అదానీపై విచారణ జరగాలి.అదానీ అంశంపై జేపీసీ వేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.కానీ, కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.దీనిపై అవసరమైతే రాష్ట్రపతిభవన్ వద్ద కూడా నిరసనలు తెలుపుతాం.విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన నేను కూడా నిరసనల్లో పాల్గొనాల్సి వచ్చింది.ప్రజాస్వామ్యాన్ని, పప్రజా ధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.నక్కలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది.నేను ధర్నా చేయను.. మరి బీఆర్ఎస్ నేతలు చేస్తారా?.తన విధానమేంటో బీఆర్ఎస్ చెప్పాలి.అదానీ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలా వద్దా చెప్పండి.ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ను అనుబంధం ఉంది.అందులో భాగంగానే అదానీ అవినీతిపై బీఆర్ఎస్ మాట్లాడటం లేదు.బీఆర్ఎస్ నేతలు రెడీ అంటే అసెంబ్లీలో తీర్మానం చేద్దాం.. బీఆర్ఎస్ నేతలు వస్తారా?. 👉రాజ్‌భవన్ వద్ద రోడ్డుపై సీఎం రేవంత్, భట్టి, కాంగ్రెస్ నేతలు బైఠాయింపు..నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు..కాసేపట్లో గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న హస్తం నేతలు.అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మౌనంపై నిరసనలు.ఏఐసీసీ పిలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు. 👉టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నిరసనల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 👉నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు బయలుదేరారు. 👉అక్కడి నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు.👉దేశంలో అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అవినీతి, మోసం, మనీలాండరింగ్, మార్కెట్ మానిప్యులేషన్ లాంటి అంశాలలో అదానీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
ఏం చేశాం.. ఏం చేద్దాం?
-
కేటీఆర్‌తో మాకేం పోలిక.. కేసీఆర్ లేకపోతే ఆయనెక్కడ?: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా? అని అన్నారు. ఇదే సమయంలో ఒకవేళ భవిష్యత్‌లో కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా.. మేము విలువ ఇవ్వమంటూ ఘాటు విమర్శలు చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్లో భట్టి, మంత్రి కోమటిరెడ్డి మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. బ్రమ్మనవెల్లి ప్రాజెక్టు వల్ల వచ్చే ఐదేళ్లలో నల్గొండ జిల్లా స్వరూపం మారబోతుంది. నల్గొండ జిల్లాలో కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయి. భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయి. నాకు, తలా ఒక ఎకరం ఇవ్వాలని కోమటిరెడ్డిని అడుగుతున్నా. రాష్ట్రంలో డైట్ చార్జీలు పెంచడం వల్ల మంచి జరిగింది . ఈ నెల 15, 16వ తేదీల్లో అన్ని హాస్టల్స్‌లో జిల్లా కలెక్టర్లు లంచ్ కార్యక్రమం ఉంటుంది. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల డైట్ చార్జీలు పెంచలేదు. రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి విద్యార్థులకు అందిస్తే చరిత్రలో నిల్చిపోతామన్నారు.అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఏం అడిగినా ఒకే అంటున్నారు. సచివాలయానికి పని కోసం వస్తే పైసలు లేవు అంటున్నారు. వైఎస్సార్ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ ఉండేది.. మళ్ళీ ఇప్పుడు భట్టి దగ్గర కనిపిస్తోందన్నారు.అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ లేకుండా కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా?. కేటీఆర్ మాకు పోలిక ఏంటి?. కేటీఆర్ భవిషత్లో ఒకవేళ ముఖ్యమంత్రి అయినా మేము ఆయనకు విలువ ఇవ్వం అంటూ కామెంట్స్ చేశారు. -
అప్పులు మీరు చేస్తే.. వడ్డీలు మేము కడుతున్నాం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అతలాకుతలం చేసిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది. మేము 54వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారు. అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాలల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రూ.64వేల కోట్లు అప్పులు చెల్లించాం.అప్పులు మీరు చేస్తే.. వడ్డీలు మేము కడుతున్నాం. శాలరీలు, పెన్షన్ల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశాం. అధిక పన్నులు వేయకుండానే ప్రతీ పైసా అర్థవంతంగా ఖర్చు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి మంత్రులంతా కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అతలాకుతలం చేసింది. ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్నాం. విద్యుత్‌పై భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నాం. మేము అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థపై వైట్ పేపర్ ప్రకటించాం’ అని చెప్పుకొచ్చారు. -
చర్చకు సిద్దమా.. బీజేపీ, బీఆర్ఎస్కు రేవంత్ సవాల్
సాక్షి, మహబూబ్‌నగర్: పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో నా కంటే మీకే బాగా తెలుసు అంటూ గులాబీ పార్టీపై సెటైర్లు వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, తెలంగాణలో రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోదీ సిద్దమా? అని ప్రశ్నించారు. చర్చకు ఎవరు వచ్చినా తాము సిద్దమే అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్‌లోని అమిస్తాపూర్ రైతు పండుగ ముగింపు సభ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న రైతుల రుణమాఫీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30 ప్రాధాన్యత ఉన్న రోజు. గతేడాది ఇదే రోజున మీరు నాకు అండగా నిలబడ్డారు. నాకు ఈ అవకాశం వస్తుందని ఏనాడూ అనుకోలేదు. ఆనాడు పాలమూరు బిడ్డల కన్నీళ్లను నేను చూశాను. 70 ఏళ్ల తర్వాత మళ్లీ పాలమూరు బిడ్డకు పాలించే అవకాశం వచ్చింది. పాలమూరు కష్టాలు నాకు తెలుసు. రైతుల కష్టాలు కూడా నాకు తెలుసు. ఏడాది పాలనలో రూ.54వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. ఏడాది క్రితమే నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాం. సీఎం పదవి బాధ్యత.. జవాబుదారితనంతో పని చేస్తున్నాను.ఈరోజు వరి వేసుకుంటే రూ.500 బోనస్ ఇస్తామన్నది మా ప్రభుత్వం కాదా?. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో నా కంటే మీకే బాగా తెలుసు. ఆనాడు వరి వేస్తే ఉరే అన్నది కేసీఆర్ కాదా?. కాళేశ్వరానికి లక్షా రెండువేల కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా రికార్డు స్థాయిలో సాగు జరిగింది. గతంలో కాళేశ్వరం వల్లే పంటలు పండాయని చెప్పుకున్నారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదు. తెలంగాణలో రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోదీ సిద్దమా?. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా చర్చకు మేం సిద్దం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు దఫాలుగా మాఫీ చేయలేకపోయారు. ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసి కేవలం రూ.11వేల కోట్ల రుణమాఫీనే చేశారు. పంటలకు కనీస మద్దతు ధర తెచ్చిన ఘనత మాది. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్.. రైతులను ఉచిత విద్యుత్ ఇచ్చారు. సమైక్య పాలనలో కంటే కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం జరిగింది. పాలమూరులో గెలిచిన కేసీఆర్ జిల్లాకు ఏం చేశారు అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ మాటలు నమ్మి గిరిజనులు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టేవాళ్లా. కొండగల్‌లో పారిశ్రామిక పార్కులు నిర్మించి ఉద్యోగాలు తేవాలని నేను అనుకున్నాను. లగచర్లలో కుట్ర ప్రకారమే దాడి జరిగింది. గొడవ చేసి మంపెట్టారు. విపక్షాల వలలో పడొద్దు. రైతులు కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. వినకుండా కొందరు ఆవేశపడ్డారు. ఈ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి రూ.73వేల కోట్లను బడ్జెట్లో కేటాయించాం. పదేళ్లలో ఏ ప్రాజెక్ట్‌ను నిర్మించకపోగా.. పాలమూరును ఎడారిగా చేశారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చాం.. మీలా రైతులను గాలికి వదిలేయలేదు. కొన్ని సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదు. బీఆర్ఎస్ లాగా వదిలేయం అని కామెంట్స్ చేశారు. -
కేటీఆర్.. ఇంకా భ్రమలోనే ఉన్నావా?: భట్టి సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేటీఆర్ టార్గెట్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తానని మాట్లాడుతున్నాడని అన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు, ఎమ్మెల్యేలను పాఠశాలలు తనిఖీ చేయాలని ఆదేశించాం. ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరమే. ఐఏఎస్ అధికారులపై కేటీఆర్ తీరు సరైంది కాదు. జిల్లా కలెక్టర్ ను అసభ్య పదజాలంతో తిట్టడం ఏంటి?. కేటీఆర్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి. తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో కేటీఆర్ ఉన్నారు. భ్రమల్లో నుంచి కేటీఆర్ బయటకు రావాలి.రాజకీయ కుట్రలను జార్ఖండ్ ప్రజలు ఎదురించారు. అన్ని కుట్రలపై జార్ఖండ్ ప్రజలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తానని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. పార్టీలో సమిష్టి నిర్ణయాలతో ప్రభుత్వం నడుస్తోంది. కాంగ్రెస్ ఆలోచనా విధానంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.. పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి డైలీ సీరియల్ అనేది అలవాటు. డ్రగ్స్ కేసు , మియాపూర్ భూముల కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల లాంటివి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలల తరబడి నడిపారు అంటూ కామెంట్స్ చేశారు. -
కుల గణన చారిత్రాత్మక విజయం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర సాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు అంటూ కామెంట్స్ చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటోంది. ప్రజావాణితో పార్టీ భావజాలాన్ని నమ్మి.. ఓటేసిన ప్రజల అభిప్రాయాలను, ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నాం. గత ప్రభుత్వం ఎప్పుడూ గడీల మధ్య ఉండి పాలన చేసింది. విద్య, వైద్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు 40శాతం పెంచి అందిస్తున్నాం. అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.రాష్ట్ర సాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తెచ్చుకున్నాం. ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి.. 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక గాలికి వదిలేశారు. బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలను తట్టుకొని ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ.. ఆ వడ్డీని ప్రభుత్వం కట్టనుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కుల గణన చారిత్రాత్మక విజయం. దేశానికి తెలంగాణ మోడల్‌గా కుల గణన నడుస్తుంది. కుల గణనను అడ్డుకోవాలని దోపిడీదారులు ప్రయత్నం చేస్తున్నారు. వనరులు ప్రజలకు సమానంగా పంచాలి అని కోరుకునే వారు కుల గణనకు మద్దతు ఇవ్వాలి’ అని కోరారు. -
కేటీఆర్.. ఏది వైఫల్యం: భట్టి సీరియస్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోయాయని అమాయకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే, కేటీఆర్.. మీ రాజకీయ లబ్ధి కోసం సామాన్య ప్రజలను బలి చేయకండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కేవలం విమర్శలనే ఎజెండా పెట్టుకుందని మండిపడ్డారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమలు పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా?. ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమా? లేక రుణమాఫీ ఇవ్వడమా?. ఏది ప్రభుత్వ వైఫల్యమో కేటీఆర్ చెప్పాలి. కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోయాయని అమాయకులను రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ మీ రాజకీయ లబ్ధి కోసం సామాన్య ప్రజలను బలిచేయకండి. పొల్యూషన్ సమస్య రాకూడదనే క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండరు. బీఆర్ఎస్ కేవలం విమర్శలు చేయడమే ఎజెండా పెట్టుకుంది.జవహర్లాల్ నెహ్రూ ఆర్థిక విధానాలు దేశంలో సమానత్వానికి నాంది పలికాయి. పంచవర్ష ప్రణాళికలు ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి. కొంతమంది కూహనా మేధావులు ఏమీ తెలియకుండా నెహ్రూపై విమర్శలు చేస్తున్నారు. సైన్స్ అభివృద్ధికి కూడా నెహ్రూ బాటలు వేసారు’ అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: మొదటి ముద్దాయి కేటీఆర్.. శిక్ష తప్పదు: టీపీసీసీ చీఫ్ -
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం
-
హైడ్రాపై హైరానా వద్దు.. హైదరాబాద్ అంటేనే రాక్స్, లెక్స్: భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమేనని భట్టి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు అంటూ కామెంట్స్ చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ..‘చెరువుల ఆక్రమణ హైదరాబాద్‌కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రాక్స్, లెక్స్ అండ్ పార్క్స్. కాలక్రమేనా పార్క్స్ అండ్ లేక్స్ కబ్జాలకు గురి అయ్యాయి.చిన్న వర్షం పడితేనే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమే. మూసీపై ప్రజలకు కొందరు భ్రమలు కల్పిస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు 2024 వరకు కబ్జాకు గురైన చెరువులపై సర్వే చేశారు. హైదరాబాద్‌లో 20 పార్కులు పూర్తిగా కబ్జా అయ్యాయి. మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు. చెరువులు కబ్జా కాకూడదు అనేదే మా ఆలోచన. మాది ప్రజా ప్రభుత్వం. ప్రజల ఎజెండా మాత్రమే కానీ.. వ్యక్తిగత ఎజెండాలు లేవు.మన ఆస్తులు మనకు కావాలి.. కాపాడుకోవాలి అని తెలంగాణ తెచ్చుకున్నాం. కోరి కొడ్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడుకునే బాధ్యత మనమీద ఉంది. గత పాలకులు బాధ్యత లేకుండా పాలన చేశారు. కబ్జాకు గురైన కట్టడాలను కూల్చాలని కేటీఆర్, హరీష్ అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వక్రీకరిస్తున్నారు. మూసీ బాధితులకు ఆదుకుంటాం. ఇళ్లకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. మూసీ బాధితులను ఆదుకునేందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి. మూసీ గర్భం, ఎఫ్టీఎల్ వరకు మాత్రమే వెళ్తున్నాం.. బఫర్ జోన్ జోలికి వెళ్ళడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్ -
బీఆర్ఎస్ నేతల కొట్లాట.. బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి సైటెర్లు
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే, బాధత్య గల శాసనసభ్యులు బజారు మీదకు వచ్చి తన్నుకోవడం బాధ కలిగించిందన్నారు. బీఆర్ఎస్ నేతల తన్నులాట నేపథ్యంలో తమ ఉనికి కోసం బీజేపీ డ్రామాలాడుతోందన్నారు.కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఉపేక్షించాం. బీఆర్ఎస్ నేతలు అలాగే రోడ్ల మీదకు వచ్చి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వ ఏం చేయాలో అది చేస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రతిపక్ష హోదా లేకుండా సీఎల్పీ సీటును సైతం గుంజుకున్నారు. వాళ్ళ మాదిరిగా మేము ప్రవర్తించడం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు వినిపించాలని కోరుకుంటున్నాం.ప్రతిపక్ష నేతలు అంటే మాకు గౌరవం ఉంది. అసెంబ్లీలో అధికార పార్టీ ఎవరో, ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ వెల్లడించారు. ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవాలని మాకు లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థరహితం. బీజేపీ కేవలం తమ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇది కూడా చదవండి: హైడ్రాపై రంగనాథ్ కీలక వ్యాఖ్యలు -
ఢిల్లీలో రేవంత్.. పీసీసీ చీఫ్ రేసులో ఆ ముగ్గురు?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కాగా, రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవితోపాటు, మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు.. శుక్రవారం తెల్లవారుజామునే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు.ఇక, గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితోపాటు పార్టీ కోర్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్సీలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో నూతన పీసీపీ చీఫ్, కేబినెట్ విస్తరణ, రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ వివరించనున్నారు.పీసీసీ రేసులోకి కొత్త పేర్లు..ఇక, తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తున్నట్టు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలంటున్నారు. దీంతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుండి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది.వారి పేర్లు ఇలా.. ఎస్సీ సామాజికవర్గం నుండి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్.బీసీ సామాజిక వర్గం నుండి మధు యాష్కీ.ఇదిలా ఉండగా.. నేటి సమావేశంలోనే కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. సీఎంతో సహా ఇప్పుడున్న 12 మంది మంత్రులకు అదనంగా మరో నలుగురిని మంత్రి మండలిలోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలలో సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, బాలునాయక్, రామచంద్రనాయక్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, కోదండరాం తదితరులు ఉన్నారు. -
TG: రైతులకు శుభవార్త.. మూడో విడతలో రుణమాఫీ నిధులు విడుదల
సాక్షి, వైరా: తెలంగాణలో మూడో విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు. 14.45లక్షల మంది రైతులకు మూడో విడతలో రుణాలను విడుదల చేశారు. ఇక, ఇప్పటికే రెండు విడతల్లో రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో రూ.12వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.👉వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 140 కోట్ల మంది స్వేఛ్చావాయువులు పీల్చేలా కాంగ్రెస్ స్వాతంత్ర్యం తెచ్చింది. ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్‌కు అడ్డా. వరంగల్ డిక్లరేషన్‌లో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ మాట్టిచ్చారు. మే 6, 2022న రైతు డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా రుణమాఫీ చేస్తున్నాం. ఎనిమిది నెలల్లోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఈరోజు రూ.18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం.. చేశాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం.. చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం. మేం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయ్యింది. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు. సీతారామ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత మాది. 2026 కల్లా సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ప్రతీ నియోజకవర్గంలో 3400 ఇళ్లను మంజూరు చేశాం. సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణకు ఇచ్చారు. ఆ గ్యారంటీలను అమలు చేయడానికి మేం కృషి చేస్తున్నాం. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలోకి విసిరేసే బాధ్యత తీసుకుంటా. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. 65వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు గాడిత గుడ్డు ఉంది. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి. బీఆర్ఎస్ను బద్దలకొడుతాం.. బీజేపీని బొందపెడతాం. 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేడు చరిత్రలో లిఖించదగిన రోజు. సాధ్యం కాదన్న రూ.2లక్షల రుణమాఫీని చేసి చూపిస్తున్నాం. రుణమాఫీ చేయలేమని అందరూ అన్నారు. కానీ, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ చేశాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం.. సంకల్పాన్ని నిజం చేశాం. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే.. ఆ డబ్బులు వడ్డీలకే సరిపోయాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ కూడా చేయలేదు. సీఎం రేవంత్ ఆదేశించిన మరుక్షణమే రైతుల ఎకౌంట్లలోకి రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ ఒక్కటే కాదు.. రైతుల సమస్యలపై కూడా దృష్టిపెట్టాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా వ్యవసాయ శాఖకు నిధులు కేటాయించాం. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య తేడాను చూడండి. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు రుణమాఫీనే నిదర్శనం. ఆర్థిక మంత్రిగా రుణమాఫీ బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయపరంగా, పారిశ్రామికపరంగా కీలక అడుగులు వేస్తున్నాం. రూ.36వేల కోట్ల పెట్టుబడులను సీఎం తీసుకువచ్చారు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రాకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేసింది. ఇందిరాసాగర్‌ను రీడిజైన్ చేసి ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. రూ.1000 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.23వేల కోట్లకు పెంచారు. డబ్బులు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ మానసపుత్రిక అని మాట్లాడుతున్నారు. ఒక్క ఎకరాకు కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వలేదు. దోపిడీ చేయడం కోసమే వాళ్లకు మానసపుత్రిక. గోదావరిపైనే ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌తో రూ.23వేల కోట్లకు అంచనాలు పెంచి దోపిడీ చేశారు. కాంగ్రెస్ ఎక్కువ ప్రాజెక్ట్‌లు కట్టిందా? బీఆర్ఎస్ ఎక్కువ కట్టిందా? అనే చర్చకు సిద్ధం. 👉మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీతారామకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. తెలంగాణలో రైతులకు ఈరోజు పండుగ రోజు. గత బీఆర్ఎస్ సర్కార్ నాలుగుసార్లు రుణమాఫీ చేస్తే మిత్తిలకు కూడా సరిపోలేదు. రూ.31వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మకం. ఆరేళ్లలోనే సీతారామ ప్రాజెక్ట్‌కు రూ.600 కోట్లు ఇచ్చాం. ఎంత ఖర్చు అయినా సరే మిగిలిన పనులు పూర్తి చేస్తాం.👉మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం సంతోషకరం. తెలంగాణలో మార్పు కోసమే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నాం. ఎన్నికల కష్టాలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది.👉మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా రూ.2లక్షలు రుణమాఫీ చేయలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది. గతంలో సీతారామ ద్వారా బీఆర్ఎస్ ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదు. ఇందిర, రాజీవ్ ప్రాజెక్ట్‌లను రీడిజైన్ చేసి సీతారామ తెచ్చారు. సీతారామ ప్రాజెక్ట్‌ను పదేళ్లు సాగదీస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీతారామ పనులు వేగవంతం చేశాం. మిగిలిన సీతారామ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేస్తాం.👉మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ప్రజా ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు గోదావరి నీటిని తీసుకొచ్చాం. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తికి కట్టుబడి ఉన్నాం అంటూ కామెంట్స్ చేశారు. -
సుంకిశాలపై మాటల యుద్దం.. కేటీఆర్‌కు భట్టి కౌంటర్
సాక్షి, ఖమ్మం: సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు కూలిపోతే మా ప్రభుత్వానికి ఎలా బాధ్యత అవుతుందని భట్టి ప్రశ్నించారు.కాగా, తాజాగా భట్టి విక్రమార్క ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాళేశ్వరం, సుంకిశాల కట్టింది బీఆర్ఎస్ పార్టీనే. ప్రాజెక్ట్‌లు మీరే కట్టారు కాబట్టి.. అవి కూలితే మీదే బాధ్యత. మా ప్రభుత్వంలో కట్టడాలపై మాది బాధ్యత అవుతుంది. సాగర్‌లోకి నీళ్లు రాకుండా ఉంటాయా?. మేము ఎందుకు దాచిపెడతాము. మేడిగడ్డ కరెక్ట్ కాదిన మేము ముందే చెప్పాం. మీరు కట్టిన ప్రాజెక్ట్‌లు క్వాలిటీ లేకుండా అవినీతితో కట్టారు. రాష్ట్రంలో మిగతా ప్రాజెక్ట్‌లు కూడా చెక్ చేయాల్సి అవసరం ఉంది. ప్రాజెక్ట్‌ల విషయంలో జరిగిన తప్పులను కేటీఆర్, బీఆర్ఎస్ ఒప్పుకుని ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రాజెక్ట్‌లో ఇంజినీర్లు చేయాల్సిన పని మీరు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.ఇక, సుంకిశాల విషయంలో అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మహిళల పట్ల రేవంత్, భట్టి ప్రవర్తన అవమానకరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ప్రవర్తనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంల ప్రవర్తన అత్యంత అవమానకరమైంది. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి వీరు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలి. వారిపట్ల గౌరవంగా ఉండాలి. ఈ రకమైన ప్రవర్తన సరికాదు. కాంగ్రెస్ నేతల నుండి ఈ రకమైన వ్యాఖ్యలు కేవలం మన నాయకులపైనే కాకుండా మహిళలందరి పట్ల వారి ధిక్కారాన్ని, అగౌరవాన్ని తెలియజేస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. Highly shameful and disgraceful behaviour of CM and Deputy CM in the state assembly We demand their unconditional apology to both Smt @BrsSabithaIndra Garu and Smt @sunitavakiti Garu. Both of them are senior legislators and former ministers, known for their dignified behaviour… https://t.co/HXuCP9f9Bv— KTR (@KTRBRS) August 1, 2024 -
సీఎం రేవంత్ కామెంట్స్.. అసెంబ్లీలో గందరగోళం
Live Updates..శాసనసభ రేపు ఉదయం10 గంటలకు వాయిదాద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన శాసనసభద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానంబీఆర్ఎస్ నిరసనల మధ్యలోనే ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం ఇస్తున్న డిప్యూటీ సీఎం. బీఆర్ఎస్ నిరసన కరెక్ట్ కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వైఖరి అవలంబించలేదు.బీఆర్ఎస్ నిరసనల మధ్యలోనే ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేసిన ప్రభుత్వంబీఆర్ఎస్ నిరసనల మధ్య కొనసాగుతున్న తెలంగాణ శాసనసభ.ద్రవ్య వినిమయ బిల్లుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో మాట్లాడిస్తున్న ప్రభుత్వం.స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనసభా నాయకుడు ఎవరి పేరును ప్రస్తావించలేదు-మంత్రి శ్రీధర్ బాబు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేయడం కరెక్ట్ కాదు.ఎంఐఎం, బీజేపీ మాట్లాడకపోతే తర్వాత వారికి అవకాశం ఇవ్వాలని కోరిన మంత్రి.మాట్లాడే అవకాశం నేను ఇస్తాను నిరసన ఆపాలి: స్పీకర్మాట్లాడే అవకాశం ఇస్తా అన్నా కూడా ఎందుకు ఆందోళన చేస్తున్నారు.సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తాను.వివేక్ వెంకటస్వామి మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తాను.అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రుల భేటీ సీఎం భేటీ కంటే ముందు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబుస్పీకర్ గడ్డం ప్రసాద్‌తో భేటీ అయిన సీఎం రేవంత్, మంత్రులు.. సభలో BRS ఆందోళన చేయనున్న నేపథ్యంలో స్పీకర్‌తో భేటీ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డికి సీఎం క్షమాపణ చేప్పే వరకు నిరసన చేయాలని బీఆర్ఎస్ పట్టు👉సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ..👉సీఎం రేవంత్ కామెంట్స్‌లో సభలో గందరగోళం నెలకొంది. 👉బీఆర్ఎస్ నేతలు స్పీకర్ వెల్‌లోకి దూసుకొచ్చారు. 👉బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 👉సభ నుంచి ముఖ్యమంత్రి వెళ్లిపోవడంపై బీఆర్ఎస్ నిరసన.👉ప్రతిపక్ష పార్టీ తలపై ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసి సభ నుంచి వెళ్లిపోయారంటూ టిఆర్ఎస్ నిరసన.👉అధికార విపక్షాల నిరసనల మధ్య శాసనసభ 15 నిమిషాలు వాయిదా👉అసెంబ్లీ లాబీలో సబిత ఇంద్రారెడ్డి చిట్ చాట్రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.ఈరోజు సీఎం సీట్లో కూర్చోబెట్టాను.ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , రేవంత్ రెడ్డి నా కుమారుడికి టికెట్ రానివ్వలేదు.మహిళలను ఇలానేనా అవమానించేది.లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని మాట్లాడితే, నన్ను టార్గెట్ చేశారు.👉అసెంబ్లీ లాబీలో కేటీఆర్ చిట్ చాట్సబిత ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాంఅక్కలను నమ్ముకుంటే ముంచుతారు అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడుసబిత ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి.భట్టి విక్రమార్క కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తునట్లు అనిపిస్తుంది 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది.పదేండ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు.కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా ఉన్న నాకు సీఎల్పీ, ఎల్ఓపీగా బాధ్యతలు ఇచ్చారు.సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నా వెనుక ఉండి నన్ను సీఎల్పీ, ఎల్ఓపీగా కాకుండా అధికారం కోసం పార్టీ మారారు.సబితా ఇంద్రారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు సబితా ఇంద్రారెడ్డి.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మరోసారి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్స్పీకర్ పోడియం ముందు వచ్చి నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు.మహిళా నాయకురాళ్లపై మంత్రులుగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటున్న బీఆర్ఎస్. 👉కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కన్నీరు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి.అసెంబ్లీలో సబిత భావోద్వేగం.నన్ను ఎందుకు టార్గెట్ చేశారు.రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారు.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.పార్టీ మార్పులపై చర్చ జరగాలి.రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి నేనే ఆహ్వానించాను.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా?అక్కడున్న కాకి మా ఇంటి మీద వాడితే కాల్చుతా అన్నారు రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా?సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?వెనక కూర్చున్న అక్కలు ఎవరిని మోసం చేశారు?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి భవిష్యత్తు చూపించాం.ముఖ్యమంత్రి ఎవరిని అవమానిస్తున్నారు ఆలోచన చేసుకోవాలి?ఆడిబిడ్డలాగా ఉన్న మేము ఎవరిని మోసం చేసాము?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి? 👉రేవంత్ రెడ్డి కామెంట్స్..అక్కగా నేను సబితా ఇంద్రారెడ్డిని నమ్మాను.నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని చెప్పి.. కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్లోకి వెళ్లారు.ఒకవైపు నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని.. మరోవైపు కేసీఆర్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరారు.మల్కాజ్‌గిరిలో పోటీ చేయమని, బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందారు.రాజ్ భవన్ వెళ్లి వచ్చాక అన్ని అంశాలపై సమాధానాలు చెప్తా అన్ని విషయాలు బయటపెడతాను.👉 బీఆర్ఎస్ నేతల నిరసన..స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం.రెండు గంటలు సమయం ఇచ్చిన చైర్‌కు బీఆర్ఎస్ మర్యాద ఇవ్వడం లేదు.మహిళలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదుఎంత అవకాశం ఇచ్చిన నిరసన చేయడం సరైన పద్ధతి కాదు. 👉సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..కేటీఆర్ మేము కలసి వస్తాం అని చెప్తున్నారు.కానీ ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు..కాంగ్రెస్‌లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.మీ వెనుకాలా కూర్చున్న అక్కలను నమ్ముకుంటే అంతే సంగతి.వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో నిలబడాల్సి వస్తుంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.ప్రభుత్వానికి సహాకరించేది ఉంటే ప్రతిపక్ష నేత సభకు రావాలి.మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని మమ్మల్ని అంటున్నారు.2014 నుంచి 19 వరకు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు.కాంగ్రెస్‌లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.బీఆర్ఎస్ నేతల వెనుక ఉన్న అక్కలను నమ్మితే అంతే..వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో నిలబడాల్సి వస్తుంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.సబితను సొంత అక్కగానే భావించాను. 👉 సీతక్క కామెంట్స్..మీతో వస్తాం తమ్ముడు అని చెప్పి మోసం చేశారు.రాహుల్ గాంధీ దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు.పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డితో ఫిర్యాదు చేయించారు.ఒక్కరిద్దరు మహిళా సభ్యులు మీతో వస్తామని చెప్పి మోసం చేశారు.ఆమెను చేర్చుకున్నప్పుడు రాజీనామా చేశారు.అందుకే బాధతో సీఎం ఇలా మాట్లాడారు.👉కేటీఆర్ కామెంట్స్..కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి.కేసీఆర్ పథకాలు పేర్లు మార్చినా పర్లేదు కానీ కొనసాగించాలి.పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలి.ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దాం.. ఇప్పుడు అభివృద్ధి చేద్దాం.మాపై కోపం ఉంటే మమ్ములను తిట్టండి.. కానీ ఉద్యమం కోసం పుట్టిన పార్టీని తిట్టకండి.ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మౌనంగా భరించం.ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం అని కాళోజి వ్యాఖ్యలను కొనసాగిస్తాం. 👉కేటీఆర్ మాజీ మంత్రిరాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు.48 గంటల్లో నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయి.అదానీ కంపెనీ పై కేంద్ర కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. అదే అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నారు.ఆటో కార్మికులు రైతులు 383, ఆటో కార్మికులు 53, నేతనులు 15 మంది మరణించారు వాళ్లను ప్రభుత్వం ఆదుకోవాలిమూసి నది అభివృద్ధి కోసం లక్షన్నర రూపాయలతో ప్రణాళికలు అని ప్రచారం జరుగుతోంది.నా ప్రభుత్వంలో మూసీ నది అభివృద్ధి పనులను మొదలుపెట్టాం. మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్.. మూసీ నది పై ఖర్చుల విషయంలో తప్పుడు ప్రచారాలను నమోదుమూసీ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.ఇప్పుడు డిపిఆర్ పరిధిలోనే ఉన్నాయి.అభివృద్ధి చేస్తాం.. అని తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్..మూసీ అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దాం.ఎన్ని వేల కోట్లు అయినా అభివృద్ధి అనేది మంచిదే.అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు సహకరించాలి. 👉కేటీఆర్ కామెంట్స్..పాలసీలు తెస్తాము అంటుంది.. కానీ, కేసీఆర్‌పై ఝలసీ పాలసీ తప్ప ఏమీ కనిపించడం లేదు.నా ఇంటలిజెన్స్ ఏంటో ప్రజలకు తెలుసు.నేను చదువుకున్నాను. పోటీ పరీక్షలు రాశాను.హైదరాబాద్, గుంటూరులో చదువుకున్నారు.విదేశాల్లో కూడా చదివాను.అమెరికాలో ఉద్యోగం చేసిన అదే ఉద్యోగం పేరుతో హైదరాబాద్ వచ్చాను.ముఖ్యమంత్రి ఎక్కడ చదివారో.. ఆయన గతమెంటో బయట వేరే మాట్లాడుకుంటున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 17 సంవత్సరాలుగా నాకు తెలుసు.పదిహేళ్లుగా కొంత చెడింది అంతే తప్ప నాకు మంచి మిత్రుడు.సౌత్ తెలంగాణ అభివృద్ధి జరిగితే సంతోషం.ప్రోటోకాల్ పాటిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటాము.రాష్ట్రంలో పొలిటికల్ దాడులు జరుగుతున్నాయి.సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాడి చేస్తున్నారు.దావోస్‌కు వెళ్తున్న సీఎం రేవంత్‌కు అభినందనలు.పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను.బోగస్ పెట్టుబడులను నమ్మకూడదని సూచిస్తున్నాను.అదానీని రాహుల్ వ్యతిరేకిస్తుంటే రేవంత్ వెల్కమ్ చెబుతున్నారు. రేవంత్ కౌంటర్..నేను ప్రభుత్వ స్కూళ్లలో మా జిల్లా, హైదరాబాదులోనే చదువుకున్నాను.గుంటూరు పోలేదు అక్కడ చదువుకోలేదు.నేను ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు కూడా అర్హుడేని. 👉సీఎం రేవంత్ కామెంట్స్..కేటీఆర్ సూచనల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.పదేళ్ల పాలన చేసిన వారు పదినెలలు పూర్తి చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నాం.బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించాం.బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు.సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారు.దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందిరికీ తెలియాలి.మేము ఎప్పుడూ మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదు.ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదు.స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదు.ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, కరీంనగర్ న్యూయార్క్ చేస్తామన్నారు.గతంలో కేసీఆర్ చెప్పినట్టు మేము చెప్పలేదు.ఎంఎంటీస్ పనులు చేపట్టకపోవడం వెనుక కుట్ర ఉంది.ముచ్చర్ల భూసేకరణపై కేటీఆర్ రెచ్చగొడుతున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను నిర్మిస్తాం.సిరాజ్, నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 జాబ్ ఇవ్వాలని నిర్ణయించాం.నిఖత్ జరీన్‌కు ఉద్యోగం ఇస్తానని జాబ్ ఇవ్వలేదు.నేత కార్మికులకు పని కల్పించామని అబద్ధాలు చెప్పారు.పాలసీలు మార్చింది గత ప్రభుత్వమే.ముచ్చర్లలో గొప్ప నగరం నిర్మిస్తాం.పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారుమహేశ్వరంలో భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికే వచ్చాయి.ఆజామాబాద్‌లో రేపు ఇన్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ప్రారంభమవుతుంది.హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు చేస్తామని అన్నాము.తాగుబోతులకు అడ్డాగా ఉన్న స్టేడియంలో మారుతున్నాయి.అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ధరణిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురాబోతుంది.కేటీఆర్ రెండు గంటలు మాట్లాడి రాజకీయ కోణంలో విషం చిమ్ముతున్నారు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కొనసాగిస్తాం.పదేళ్లు పాలించారు కాబట్టి తెలంగాణపై ఒక అభిప్రాయం ఉంటుంది. 👉కేటీఆర్‌పై సీతక్క ఫైర్గత పదేండ్లు బీఆర్ఎస్ పాలన కోట శ్రీనివాస్ కోడి కూర కథలాగా ఉంది.లక్షలాది పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారుబీఆర్ఎస్ పదేండ్లలో ఎవరికి ఇండ్లు ఇచ్చారుబంగారు తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్తుంటే నిజమని అన్నారుఉద్యోగాల విషయంలో కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందిమేం ప్రకటించిన పథకాలకు కొంత పెంచి ప్రకటించారు. అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?మా పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం బాధ కలుగుతుందిఇచ్చిన ప్రతి మాట కచ్చితంగా చేస్తాంఅబద్ధాలు అద్భుతంగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట..పదేళ్లలో ఉద్యోగాలు ఇస్తే.. ఉస్మానియా యూనివర్శిటీకి ఎందుకు వెళ్ళలేదు.డబుల్ పెన్షన్ తీసుకుంటున్న లక్ష్మమ్మ నుంచి రికవారి చేశారు.. మా దృష్టికి రాలేదు.మీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెన్షన్ తీసుకున్నారు.సాగు చేసుకుంటున్న రైతులకు ధరణిలో లేదని రైతుబంధు రాకుండా చేశారు.ప్రతి రోజూ ధనిక రాష్ట్రం.. బంగారు తెలంగాణ అంటే.. బయట ఉన్న మేము నిజమే అనుకున్నాం.మరీ మా మానిఫెస్టో చూసి.. గ్యాస్ సిలిండర్ మేము 500 అంటే.. మీరు నాలుగు వందలకే అన్నారు.ఇలా ఎన్నో పథకాలు పెంచి ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారా?.అద్భుతంగా ధనిక రాష్ట్రాల్లో రైతులు, ప్రజలకు పథకాలు అందిద్దాం అనుకున్నాం.కానీ పదేళ్లు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.తప్పకుండా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తాం. 👉మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మలేదు.కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టింది అయినా ప్రజలు నమ్మలేదు.మేము 2000 అంటే 2016లో అన్నారు అయినా ప్రజలు నమ్మలేదు.2018లో బీఆర్ఎస్ను నమ్మి ప్రజలు మోసపోయారు.అందుకే 2023లో బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చుని పెట్టారు.కేటీఆర్ సభలో సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.కాంగ్రెస్ మొదటి బడ్జెట్‌కే ప్రతిపక్ష బీఆర్ఎస్ భయపడుతోంది.ఇప్పుడే ఇంత భయపడితే ఇంకా నాలుగు సంవత్సరాలు మిగిలి ఉంది. 👉 కేటీఆర్ కామెంట్స్..రైతు భరోసా బీఆర్ఎస్ 10,000 అంటే కాంగ్రెస్ 15,000 అన్నది.బడ్జెట్లో రైతు భరోసాకు నిధులు ఎందుకు కేటాయించలేదు?రైతులకు 72 వేల కోట్లు రైతుబంధు వేస్తే.. 25000 దుర్వినియోగం అని గగ్గోలు పెడుతున్నారు.కౌలు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.కౌలు రైతులు కళ్ళల్లో వత్తులు పెట్టుకొని చూస్తున్నారు.అన్ని వడ్లకు 500 బోనస్ అన్నారు.. ఇస్తామనేది సన్న ఒడ్లు మాత్రమే అంటున్నారు.ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ ఫసల్ బీమా యోజన బెకార్ అన్నది.సొంత రాష్ట్రం గుజరాత్ ఫసల్ బీమా యోజనలోకి వెళ్లలేదు.ఫసల్ బీమా యోజన మంచిది కాదు అందుకే మేము వెళ్ళలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో ఎందుకు చేరుతుందో సమాధానం చెప్పాలి.కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 16,000 కోట్లు అయ్యాయి.లక్షన్నర వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే 12,000 కోట్లు ఎందుకు అవుతుంది?రుణమాఫీ లబ్ధిదారుల కోతలు కాంగ్రెస్ ప్రభుత్వం కోస్తోంది.ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు.పీఎం కిసాన్ కండిషన్ పెట్టి రుణమాఫీ ఎలా చేస్తారు?కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది.కోటి మందిని కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది చేసి తీరాల్సిందే.ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలి వాళ్లంతా ఎదురుచూస్తున్నారు.కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలి.ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తా అన్నారు కానీ వాళ్లపై లాఠీలు జులిపిస్తున్నారు.జేఎన్టీయూ హాస్టల్ లో తయారుచేసిన సాంబార్లో ఎలుకలు ఈతలు కొడుతున్నాయి. 👉 కేటీఆర్ కామెంట్స్..రాష్ట్రాన్ని అప్పులపాలు చేశామని తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని క్యాన్సర్, ఎయిడ్స్ పేషంట్లా పోల్చడం సరికాదు. ఓట్లకు ముందు అభయహస్తం, ఓట్ల తర్వాత శూన్యహస్తం. హామీల పత్రాలకు పాతర.. శ్వేతపత్రాల జాతర. గ్యారెంటీలకు టాటా, లంకెబిందెల వేటవిపక్షంలో ఉండగా తెలంగాణ అభివృద్ధిని భట్టి ప్రశంసించారు.ముఖ్యమంత్రి సీట్లోకి భట్టి వెళ్లాలని కోరుకుంటున్నాను.కాంగ్రెస్ నాయకులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గా ఉంది. మా హయాంలో సంపదను పెంచాం.కరోనా లాంటి సమయంలోనూ జీతాలు ఆపలేదు.మా పాలనలో రాష్ట్ర సంపద, జీఎస్డీపీ పెరిగింది.తెలంగాణ అభివృద్ధి గురించి సోషియో ఎకానమీ అవుట్ లుక్‌లో ప్రభుత్వమే చెప్పింది.తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుతమే చెప్పింది.దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్ర పాత్ర పెరిగిందని మీరే చెప్పారు. మంత్రులు సభలో చెప్పిన మాటలు తప్పా?బడ్జెట్లో ఉన్న లెక్కలు తప్పా చెప్పాలి.లెక్కలతో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి అద్భుతం.తెలంగాణ దివాళా తీసిందని అనటం ఎంతవరకు సమంజసం. భట్టి కామెంట్స్..గత ప్రభుత్వంపై సెటైర్లు.రెవెన్యూ రిస్పిట్స్ అద్భుతంగా ఉన్నాయి.2021 నుంచి 2023-24 వరకు ఒకటో తేదీన ఇచ్చే జీతాలు 15వ తేదీ వరకు ఎందుకు జీతాలు ఇవ్వలేదు?ఎందుకు పెండింగ్ పెట్టారు?.ఆ నిధులన్నీ ఎటు వెళ్లాయి. 👉 ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. నేటి సమావేశాల్లో ప్రభుత్వం మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టనుంది.👉నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం శాసనసభ బిల్లును ఆమోదించనుంది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం 2,91,159 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది.👉డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభిస్తారు.👉బడ్జెట్‌పై పూర్తిస్థాయిలో వివరణను ఆర్థిక మంత్రి భట్టి సభకు తెలియజేస్తారు.👉ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు చర్చించనున్నారు. అలాగే, ప్రభుత్వ వివరణ ఇవ్వనుంది.👉అనంతరం ద్రవ్య వినిమయ బిల్లు 2024-25ను సభ ఆమోదించనుంది. -
తెలంగాణ తెచ్చుకుందే జాబ్స్ కోసం.. గ్రూప్స్ అభ్యర్థులతో భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిసెంబర్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తున్నట్టు భట్టి చెప్పుకొచ్చారు. నిరుద్యోగులు చెప్పిన ప్రతీ విషయాన్ని సీరియస్‌గా ఆలోచిస్తామని హామీ ఇచ్చారు.కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో నేడు గ్రూప్-2 అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ను ఆదేశించాం. మూడు నెలల కాలంలోనే 54వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించాం. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఓవర్ ల్యాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం.గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవి. సీఎల్పీ నేతగా నేను, పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే మా పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిది. ఎన్నికల్లో హామీ ఇచ్చాం మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుంది. మేము అలా ఆలోచించడం లేదు మా బిడ్డలు స్థిరపడాలి. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నాం. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కేసుల పాలైతే మీరే నష్టపోతారు. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడవద్దు. కొద్ది రోజుల్లోనే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తాం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారు. ప్రిపేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్లైన్లోనే ప్రశ్నలు వేయవచ్చు.. అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇక నుంచి అశోక్ నగర్లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. నిరుద్యోగులు చెప్పిన ప్రతీ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తాం. మీరు మా బిడ్డలు.. రాష్ట్ర సంపద.. మీ మేధస్సు నిరుపయోగం కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన. ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది, పరిష్కరిస్తుంది. గ్రూప్-2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వారి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం’ అని అన్నారు. -
రుణమాఫీ చేస్తున్నాం.. హరీష్ రాజీనామాకు సిద్ధమా?: సీఎం రేవంత్
Updates..టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..👉ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పిన దాని కంటే ముందే చేస్తున్నాం. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలామంది మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమని నిరూపించాం. 👉60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. సోనియా గాంధీ కుటుంబం గౌరవం కాపాడాలి. దేశానికి ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదు.👉వ్యవసాయం దండుగ కాదు పండుగ. రైతులకు రుణమాఫీ చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉంది. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బు పడుతుంది. ఆగస్టు 15వ తేదీ లోపల మరో లక్ష రూపాయలు వేస్తాం అని చెప్పుకొచ్చారు. 👉రుణమాఫీపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలి. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై నేషనల్ మీడియాలో చెప్పాలి. భారతదేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ మోదీ హామీ కాదు. ఇది రాహుల్ గాంధీ హామీ. దివంగత మహానేత వైఎస్సార్ ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అలాగే, రుణమాఫీ గురించి కూడా 20 ఏళ్లపాటు చెప్పుకోవాలి.👉విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు, వేల కోట్ల అప్పులు ఉన్నవాళ్లకి కూడా ఏం కాదు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం. దీనిపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలి. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం. ఇపుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. 👉‘ఆగస్టు దాటకుండానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అమలుకు నిద్రలేని రాత్రులు గడిపాం. అర్హులైన అందరికీ రైతు రుణమాఫీ చేస్తాం. రూ.7లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టినప్పటికీ రూ.2లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాం. రేషన్‌కార్డులు లేని ఆరు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాం. అయితే, అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు. 👉 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. 👉 కాగా, రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 👉 కాసేపట్లో ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగనుంది.👉పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. 👉ఇక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది.👉ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.👉మరోవైపు ఈరోజు భేటీలో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నేతల మధ్య సమన్వయంపై చర్చ జరుగనుంది. అలాగే, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌పై పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.👉ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారు.👉అలాగే, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.👉ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. -
ఆరు వేల పోస్టులతో మరో నోటిఫికేషన్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలోనే రాష్ట్రంలో ఐదు లేదా ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీని నిర్వహిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో డీఎస్సీ పోస్టోపోన్ చేయాలని అక్కడక్కడా ధర్నాలు, వినతులు చూస్తున్నాం. డీఎస్సీ ఆలస్యమైతే మరింత నష్టం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు అందరం చూశాం. డీఎస్సీ పరీక్షకు అభ్యర్థులు హాజరు అవ్వండి. త్వరలోనే ఐదు లేదా ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీని నిర్వహిస్తాం. ఈసారి పరీక్షల కోసం ఇప్పటికే రెండు లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు’ అని తెలిపారు.ఎవరు ఆందోళన చెందవద్దు. మీరు అందరూ ఉద్యోగాలు తెచ్చుకుని స్థిరపడాలనేదే మా ఆశ. కొన్ని నెలల తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది. మీ భవిష్యత్‌ని కాంక్షించే ప్రభుత్వం ఇది. రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం. ఈ రాష్ట్రం సర్వతోముభివృద్ధి జరగాలి ఇక్కడ వనరులు ఇక్కడే ఉపయోగపడాలి అని తెలంగాణ ఇచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 30,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది.పదేళ్లు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్-1 నిర్హహించలేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేము రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. ఎన్నికలు సమీపించాయి, అయినప్పటికీ కూడా ఆ సమయంలో ప్రకటన చేసి కావాలని ఆలస్యం చేస్తే కూడా మేము, అదనపు పోస్టులు కలిపి 11,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, విద్యావ్యవస్థ మీద దృష్టి సారిస్తే దాదాపు 16,000 పోస్టులు కాళీగా ఉన్నట్లు తెలిసింది. నిర్లిప్తతంగా ఉన్న విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడంలో భాగంగా డీఎస్సీని త్వరిత గతిన పూర్తి చేయాలని నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు పోతున్నాం అని తెలిపారు. -
బొగ్గు గనుల కేటాయింపు..అవసరమైతే ప్రధానితో భేటీ అవుతాం : భట్టి
సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (A) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉంది. అయినప్పటికీ వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కబొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పాల్గొన్న భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతాయి.రానున్న ఐదు సంవత్సరాలలో 8 భూగర్భ గనులు, మూడు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడనున్నాయి.ఇలా 2032 నాటికి ఐదు భూ గర్భగనులు ఆరు ఓపెన్ కాస్ట్ గనులు,2037-38 నాటికి మరో 5 గనులు మూతపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా 39 గనులు 40 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు ఎనిమిది వందల మంది కార్మికుల స్థాయికి పడిపోయి సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులుగా ఈ పరిణామాన్ని ఊహించలేము అని అన్నారు.సింగరేణి సంస్థకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగానే రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి సింగరేణికి న్యాయం చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు,మరో నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ ఎన్టీపీసీ కేంద్రానికి, సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కు కూడా బొగ్గు ఎంతో అవసరం ఉంది. ఇది సుమారు 24 మిలియన్ టన్నులు. ఈ డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను స్వయంగా గత బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ విషయాలు వివరించా. కొత్త బ్లాకులు కేటాయించాలని తాటిచెర్ల బ్లాక్-2కు అవునుమతి ఇవ్వాలని కోరాను.ఇప్పుడు కిషన్ రెడ్డిని కోరుతున్నాం. సింగరేణి సంస్థ బతకాలన్న, అందులో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్ బాగుండాలంటే కొత్త గనులు కేటాయించడం అవసరం ఉందన్నారు.గతంలో నిర్వహించిన వేలంపాట ద్వారా సత్తుపల్లి బ్లాక్-3 కోయగూడెం బ్లాకు-3లను పొందిన ప్రైవేటు కంపెనీలు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దుచేసి ఆ బ్లాకులు సింగరేణికి కేటాయించాలని కోరుతున్నామన్న భట్టి విక్రమార్క.. ఆ రెండు బ్లాకులు కేటాయిస్తే సింగరేణి వెంటనే అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తుందని తెలిపారు. -
2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సింగరేణి ప్రభుత్వ సంస్థ.. కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉంది అంటూ భట్టి కామెంట్స్ చేశారు.కాగా, హైదరాబాద్‌లో శుక్రవారం పదో రౌండ్లో కోల్‌మైన్ యాక్షన్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి లేఖను అందించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి కాకుండా మొట్టమొదటిసారి కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రక్రియను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసు.సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు, కొంగు బంగారం. సింగరేణి బొగ్గు వల్లే మన రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్స్ నడుస్తున్నాయి. 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్‌లు కేటాయించాల్సిన అవసరం ఉంది. త్రైపాక్షిక ఒప్పందాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 1400 వందల మిలియన్ టన్నులు బొగ్గును తియ్యడానికి అవకాశం ఇంకా ఉంది.2015లో కొత్త చట్టం వల్ల సింగరేణి తనకు ఉన్న అర్హతలను కోల్పోయింది. సత్తుపల్లి, కోయగూడ, మరో రెండు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని కేంద్రం వద్ద ప్రతిపాదన ఉంది. సింగరేణి ప్రభుత్వ సంస్థ. కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కోల్ బ్లాక్స్ వెళ్లాయి. రిజర్వేషన్లు పక్కన పెట్టీ ప్రైవేటీకరణ దిశగా వేలం పాట నడవడం వల్ల సింగరేణికి నష్టం. 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉంది.రిజర్వేషన్ కోటాలో బొగ్గు బ్లాక్‌లు కేటాయించాలి. రిజర్వేషన్ల అంశంలో కిషన్ రెడ్డి చొరవ చూపాలి. కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిలపక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తాం. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థ బతకాలి అంటే కొత్త గనులు కేటాయించడం ఎంతో అవసరం. సత్తుపల్లి, కొయగూడ బ్లాక్‌ల పాత లీజు రద్దు చేసి వాటిని సింగరేణికి కేటాయించాలని కోరుతున్నాం. సింగరేణి భవిషత్ కోసం మరో 0.5 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సింగరేణి సంస్థను కాపాడేందుకు చట్టంలో మార్పులు చేయాలని కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
TS Congress: భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై సీనియర్ నేత హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందోని వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. కాగా, వీహెచ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భట్టి విక్రమార్క నాకు ఖమ్మం లోక్‌సభ సీటు రాకుండా చేస్తున్నారు. భట్టి నాకు ద్రోహం చేస్తున్నారు. సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు.. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఈరోజు భట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీని చేసింది నేనే. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలి. నేను లోకల్ కాదు అంటున్నారు. రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా?. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేసిన నాకు న్యాయం చేయండి. ఖమ్మం లోక్‌సభ సీటు నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా?. బీసీలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమేనా?. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర, కుల గణన అంటున్నారు. రాహుల్ అయినా నాకు న్యాయం చేయాలి. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే నేను తప్పుకుంటాను. లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి నేనే అర్హుడిని. నేను పార్టీ కోసం పనిచేశాను. నేను చనిపోయే వరకు పార్టీలోనే ఉంటాను. చనిపోయిన తరువాత పార్టీ జెండా నాపై ఉంటుంది. నేను పార్టీ మారే వ్యక్తిని కాదు. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశాను. నా వయసు నాకు అడ్డంకి కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
హరీష్ రావుకు భట్టి కౌంటర్..
-
తెలంగాణ బడ్జెట్: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Live Updates.. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలు సోమవారానికి వాయిదా. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 29,669 కోట్లు ద్రవ్యలోటు రూ.32,557 కోట్లు. రెవెన్యూలోటు రూ.5944 కోట్లు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెస్తాం ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటాం ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుంది నిస్సహాయులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం సమానత్వమే మా ప్రభుత్వ విధానం అందరం కోసం మనందరం అనే స్పూర్తితో ముందుకెళ్తాం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడం మా చిత్తశుద్ధికి నిదర్శనం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత గత ప్రభుత్వం దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు చూపించారు.. ఒక్క పైసా ఇవ్వలేదు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు జీఎస్డీపీ 2022-3తో పోలిస్తే 13,02,371 కోట్ల నుంచి 14,49,708 కోట్లకు ఆర్ధిక వృద్ధి 14.7 శాతం నుంచి 11.3 శాతం క్షీణించింది దేశీయ స్థాయిలో వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయింది అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం టీఎస్ పీఎస్ సీ నిర్వహణ కోసం 40 కోట్లు కేటాయింపు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలు నెరవేర్చాం విద్యుత్ రంగానికి ర.16,825 కోట్లు కేటాయింపు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్ల అదనపు చెల్లింపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం గృహ జ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్ సంక్షేమ పథకాల అమలుకు రూ.53,196 కోట్లు మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తాం రాష్ట్రంలో ప్రభుత్వం తరపున రెండు లెదర్ పార్కులు రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు త్వరలో డ్రై పోర్టులను అందుబాటులోకి తెస్తాం పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ప్రతిపాదిస్తున్నాం గ్రామీణ ప్రజల అభివృద్ధికి ఏఐ టెక్నాలజీని వినియోగిస్తాం ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బంది రానీయం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరిస్తాం అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాం ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా నిలబడుతుంది 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు పాలనకు కాదు రాష్ట్రాభివృద్ధికి హైదరాబాద్ గుండెకాయ హైదరాబాద్ కు ఆర్ధిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఫార్మా, ఐటీ, ఓఆర్ఆర్, 24 గంటల విద్యుత్ ఘనత కాంగ్రెస్‌దే హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్ గా మారుస్తాం మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధికి నూతన విధానాలు హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు థేమ్స్ నది తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి సాంస్కృతిక కట్టడాల పరిరక్షణను పకడ్బందీగా అమలు చేస్తాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కోసం రూ.1,000 కోట్లు తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్ లుగా విభజిస్తాం ORR, RRR మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ జోన్ RRR ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్ గా విభజన సాగుకు పనికి రాని భూములకు సైతం గత సర్కార్ రైతుబంధు ఇచ్చింది పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ భూములకు రైతుబంధు ఇచ్చారు రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిస్తాం ఆయిల్ పామ్ సాగుకు అదనంగా లక్ష ఎకరాలకు పెంపు కైలు రైతులకు రైతు బీమా పథకం వర్తింపజేస్తాం త్వరలో నూతన విత్తన విధానం అమల్లోకి తెస్తాం ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా మారింది ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనంపై ఐదుగురితో కమిటీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను మరింత అభివృద్ధి చేస్తాం ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,000 కోట్లు ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250కోట్లు గురుకులాల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కాలేజీలు ఎస్టీ సంక్షేమానికి రూ.13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1,546 కోట్లు సాంప్రదాయ వృత్తుల వారికి శిక్షణతోపాటు పనిముట్లు బీసీ సంక్షేమానికి రూ.8,000 కోట్లు కేటాయింపు కాంగ్రెస్ మేనిఫెస్టో సింహభాగం మహిళల సంక్షేమానికే మహిళలకు గత డిసెంబర్ 9 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పోషకాహారం తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కేటాయింపులు ఇలా.. ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.53,196 కోట్లు. ఐటీ శాఖకు రూ.774 కోట్లు. పంచాయతీరాజ్ శాఖకు రూ.40080 కోట్లు. పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు. వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు. ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు. బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సింహభాగం మహిళల సంక్షేమానికే. బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1546 కోట్లు. సాంప్రదాయ వృత్తుల శిక్షణతో పాటు పనిముట్లు. విద్యుత్-గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. విద్యుత్ రంగానికి 16825 కోట్లు కేటాయింపు మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు అదనపు కేటాయింపు. గృహజ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ విద్యారంగానికి రూ.21,389 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు. ఎస్సీ సంక్షేమం రూ.21874కోట్లు. ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు. పరిశ్రమల శాఖకు రూ.2543 కోట్లు ప్రతిపాదిస్తాం. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం. విద్యారంగానికి రూ.21389 కోట్లు. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు రూ.500 కోట్లు కేటాయింపు. 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం. గుజరాత్, ఢిల్లీ, ఒడిశా తరహాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు. మా ప్రభుత్వంలో 6956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించాం. వైద్య రంగానికి రూ.11,500 కేటాయింపు. యువజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. యువకులను రెచ్చగొట్టం కాదు.. ఆత్మగౌరవంతో బతికేలా చేస్తాం. జాబ్ క్యాలెండర్ తయారు ప్రక్రియను ప్రారంభించాం. త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నాం. త్వరలో 15వేల కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. టీఎస్పీఎస్సీకి రూ.40కోట్ల ఆర్థిక వనరులు. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగి మరణిస్తే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా. చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కొనుగోలు చేస్తాం. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనత తెలంగాణది. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌కు కట్టుబడి ఉన్నాం. గృహజ్యోతి పథకం కింద రూ.200 యూనిట్ల ఫ్రీ కరెంట్. గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయింపు. ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ.16,825 కోట్లు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల సాయం. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించాం. నూతన హైకోర్టు భవనానికి వంద ఎకరాల స్థలం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అయిష్టంగా ఉంది. ప్రణాళిక, హేతుబద్దత లేకుండా గత ప్రభుత్వం అప్పులు చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు సవాళ్లుగా మారాయి. నీళ్లు, నిధులు, నియామకాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతుంది. ►తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ►బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క. ►మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి శ్రీధర్ బాబు. ►తెలంగాణ బడ్జెట్ 2.75 లక్షల కోట్లు. నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి కేటీఆర్ దూరం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ బీఆర్ఎస్ సభకు హాజరుకానున్న కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని. అనంతరం తెలంగాణ భవన్‌కు కేటీఆర్ ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం. సీఎల్పీలో కాళేశ్వరం టూర్, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్న నేతలు సీఎల్పీ భేటీకి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు ►బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్‌కు అందించిన ఆర్థిక మంత్రి భట్టి, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. ►శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ పత్రాలు అందజేసిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ►ఈనెల 12వ తేదీన బడ్జెట్ సమావేశాలను ముగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్. ►మరోవైపు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ►విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలను సభలో మాట్లాడనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ►ఈనెల 13న మేడిగడ్డ పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. ►సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించిన ప్రభుత్వం. ►కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయం. ►కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌కు అప్పగించిన సీఎం రేవంత్ ►కాసేపట్లో అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికే అసెంబ్లీ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ►బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కామెంట్స్ స్పీకర్ పదవి ఆఫర్ ఇచ్చారు. నేనే వద్దన్నాను. రెండో విడతలో మంత్రి పదవి వస్తుంది అని ఆశిస్తున్నాను. కేసీఆర్ ముర్కుడు.. రేషన్ బియ్యం సరఫరాలో, ధాన్యం సేకరణలో అవినీతికి పాల్పడ్డారు ప్రాణహిత చేవెళ్ల కోసం రెండువేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తే పైపులకే కేసీఆర్ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో SLBCకి కొంత నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. దానికి కూడా నిధులు ఇవ్వలేదు 9:50AM, Feb 10, 2024 బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయి: భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను అమలు చేస్తాం 9:47AM, Feb 10, 2024 ముగిసిన తెలంగాణ కేబినెట్‌సమావేశం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం మధ్యాహ్నం గం. 12.లకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ అంచనా రూ. 3లక్షల కోట్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు ►తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం ►బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం: భట్టి విక్రమార్క ►బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం. ►తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ►కాసేపట్లో బడ్జెట్‌కు ఆమోదం తెలుపునున్న రాష్ట్ర కేబినెట్ ►తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ►మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది. -
CM Revanth: అమిత్‌షాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. విభజన సమస్యలపై ప్రధానంగా భేటీ సాగింది. విభజన సమస్యలపై త్వరలోనే ఇద్దరు సీఎస్‌లను పిలిచి మాట్లాడతానని అమిత్‌షా హామీ ఇచ్చారు. నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరోల కోసం పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి ఉన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ, సాంకేతిక అనుమతులు ఇవ్వాలని వినతించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్.. ఈ పర్యటనలో భాగంగా ఫైనాన్స్, హెల్త్, ఇరిగేషన్, పరిశ్రమలతో పాటు పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. -
ఇది దొరల ప్రభుత్వం కాదు..ప్రజల ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి
-
ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం
సాక్షి, హైదరాబాద్: ప్రతి గెలుపులో పాఠాలుంటే.. ఓటమిలో గుణపాఠాలు ఉంటాయని.. ఆ గుణపాఠాలు నేర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చామని, నిరుద్యోగులకు అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. కానీ సరైన విధంగా ప్రచారం చేసుకోలేకపోయామని పేర్కొన్నారు. ‘నిజం గడప దాటే లోపల.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంద’న్న సామెత నిజమైందని.. కాంగ్రెస్ అబద్ధాలు, అలవి గాని హామీలను ప్రజలు నమ్మారని వ్యాఖ్యానించారు. యూట్యూబ్‌లో కొందరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే నివారించలేకపోయామని, దానితోనూ కొంత నష్టం జరిగిందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ‘స్వేద పత్రం’ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. కేవలం 1.85శాతం ఓట్లతో తాము ఓడిపోయామని.. ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల తేడాతో కోల్పోయామని చెప్పారు. ఇది ఘోర పరాజయం కాదని, ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా. మీరు విజయవంతం కావాలని మేం కోరుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. వందరోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. వందరోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మొన్ననే నాలుక మడతేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా.. ఉప ముఖ్యమంత్రి తాము ఆమాటే అనలేద న్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఆరు గ్యారంటీలు కాదు. 142 హామీలున్నాయి. వాటిని లెక్కతీశాం. మా పార్టీ తరఫున శాఖల వారీగా షాడో టీమ్‌లు ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో వాటిని షాడో కేబినెట్ అంటారు. అలాంటిదే మా లెజి స్లేచర్లో ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి ప్రభుత్వ శాఖలో, ప్రతిరంగంలో సర్కారు పనితీరు.. వారు ఏం చేస్తున్నారు? ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? తదితర అంశాలన్నింటినీ నిశితంగా గమనించి ప్రజలకు వివరిస్తాం..’’ అని కేటీఆర్ చెప్పారు. దీప స్తంభంగా మారిన తెలంగాణను ఆరనివ్వబోమని, పడిపోనివ్వబోమని పేర్కొన్నారు. ఏ విచారణకైనా మేం సిద్ధం రాజకీయాల్లో పోటీకి వెళ్లిన ప్రతిసారీ గెలుస్తామనే ఆశిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు చెప్తున్నామని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడుతామని, ప్రతి అంశంపై రివ్యూ చేస్తామని చెప్పారు. ‘‘అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు, హామీలను నెరవేర్చేందుకు వినియోగిస్తారా? కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా? అనేది వారి విజ్ఞత. ఏ విచారణ అయినా.. ఏ కమిషన్ అయినా.. ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కావాలంటే విచారణ చేయాలని మేమే సభలో డిమాండ్ చేశాం. అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాం..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. యువత విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మినట్టు అనిపించిందని.. అప్పుడే స్పందించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా ఉందని చెప్పారు. తమ తరఫున చిన్నచిన్న తప్పులు, పొరపాట్లు జరిగాయని.. సవరించుకొని ముందుకెళ్తామని వివరించారు. ఉద్యోగుల జీతాల విషయంలో కరోనా ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతే కొంత ఇబ్బంది వచ్చిందని.. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఊహించని వాళ్లు ఓడిపోయారు! మీడియాతో లంచ్ సందర్భంగా కూడా కేటీఆర్ పలు అంశాలపై చిట్‌చాట్ చేశారు. ‘‘ప్రజల తీర్పును అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంత చేసినా ఎలా ఓడిపోయాం? ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోవాలి, అక్కడ కేసీఆర్ సీఎంగా ఉండాలని ప్రజలు ఓట్లేసినట్టు చెపుతున్నారు. కోనేరు కోనప్ప, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, సింగిరెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి వంటి వారు ఓడిపోతారని ఎవరైనా అనుకుంటారా? వారికి రెండు సార్లు అవకాశం ఇచ్చాం కదా.. ఓసారి వీళ్లకు ఇద్దామని ప్రజలు భావించారని అనిపిస్తోంది..’’ అని పేర్కొన్నారు. -
TS Assembly: సీఎం రేవంత్ Vs అక్బరుద్దీన్.. మాటల యుద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడి చర్చ నడుస్తోంది. విద్యుత్ అప్పులపై అసెంబ్లీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అలాగే, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గత పదేళ్లుగా బీఆర్ఎస్, ఎంఐఎం కలిసే ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాల్లో ఎంఐఎం పాత్ర ఉంటుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం పని చేసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ను, నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీఆర్ అలీకి వ్యతిరేకంగా ఎంఐఎం పనిచేసింది. కవ్వంపల్లి వంటి దళిత ఎమ్మెల్యేను అవమానించడం ఎంఐఎంకు తగదు. అక్బరుద్దీన్ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాత్రమే. ముస్లింలందరికీ నాయకుడు కాదు. బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రులే.. అన్ని విషయాలను సభ ముందు పెడితే అక్బరుద్దీన్‌ను అభినందిస్తాం. బీఆర్ఎస్, మజ్లిస్ మిత్రులమని కేసీఆర్ చెప్పారు. ఎంఐఎంకు కేసీఆర్ మిత్రుడు కావచ్చు. మోదీకి కూడా మద్దతు ఇవ్వొచ్చు. అది వాళ్ల ఇష్టం. అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదు. అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశాం. అక్బర్ అన్ని విషయాలు చెబుతున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయి తొమ్మిది మంది చనిపోయారు. ఆ ఘటనలో ఏఈ ఫాతిమా చనిపోయింది. ఫాతిమా చనిపోతే ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదు. మైనార్టీలను ముఖ్యమంత్రులను, రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ పార్టీనే’ అని అన్నారు. పవర్ పంచ్.. మరోవైపు విద్యుత్ అంశంపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విద్యుత్ మొండి బకాయిల్లో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ సౌత్ టాప్‌లో ఉంది. సూర్యాపేట జిల్లాలోనూ రైతులు కరెంట్ కోసం ఆందోళన చేశారు. కేటీఆర్, హరీష్ రావు, ఎంఐఎం బాధ్యత తీసుకుని విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తారా? అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ సీరియస్.. ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. మేం ఎవరికీ భయపడం. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. నిజామాబాద్‌లో ఎంఐఎం పోటీ చేసిందా అని ప్రశ్నించారు. ఎంఐఎం ఎప్పుడు ఎక్కడా ఎలా పోటీ చేయాలో మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. మమ్మల్ని బీజేపీ బీ టీమ్ అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలిసి పనిచేయం. సీఎం రేవంత్‌కు ఛాలెంజ్ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా గందరగోళం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. భట్టి విక్రమార్క్ ఫైర్.. అనంతరం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. నేను ఏం చెబుతున్నానో వినకుండా మాట్లాకండి. కొత్తవాళ్లు ఏదైనా మాట్లాడితే పెద్ద మనసుతో అర్థంచేసుకోవాలి. అక్బరుద్దీన్ అఖల్ ఉందా అని మాట్లాడటం సరికాదు. -
శ్వేతపత్రంపై వాడీవేడీ చర్చ
-
రాష్ట్రాన్ని దివాలా తీయించారు
సాక్షి, హైదరాబాద్: తక్కువ బడ్జెట్ మొత్తాలతో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ఆస్తులు సాధించి పెడితే, లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా రాష్ట్రాన్ని దివాలా తీయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రోజువారీ వ్యాపారం చేసే చిరువ్యాపారులు ఏ రోజుకారోజు అప్పు తెచ్చి రోజులు గడిపినట్టు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాలకు రిజర్వ్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) తెచ్చి నడిపే దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులను కడితే, కేసీఆర్ ప్రభుత్వం కట్టకకట్టక కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనులతో ఎందుకూ పనికి రాకుండా పోయిందని ధ్వజమెత్తారు. పాలమూరు–రంగారెడ్డి పథకం పూర్తి చేయలేకపోయిందని, కానీ గొప్ప ప్రాజెక్టులు పూర్తి చేసినట్టు జనాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా జరిగిన లఘు చర్చకు భట్టి జవాబిచ్చారు. అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దారుణంగా మార్చింది. అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేసే దుస్థితికి తెచ్చింది. ప్రభుత్వ రుణ భారం 34 శాతానికి పెరిగింది. ఈ భారాన్ని ఎవరు మోయాలి? ఆస్తులు సృష్టించామని చెప్తున్నారు. మరి ఆదాయం ఎందుకు రావటం లేదు? జీతాలు కూడా ఎందుకు సకాలంలో ఇవ్వలేకపోయారు? ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అందుకే శ్వేతపత్రం విడుదల చేశాం..’ అని చెప్పారు. ఎలా చేసినా ప్రభుత్వ అప్పులే ‘బహిరంగ మార్కెట్లో కంటే అధిక వడ్డీలకు రుణాలు తెచ్చారు. హరీశ్‌రావుకు అన్నీ తెలుసు. ఇంతకాలం స్వేచ్ఛ లేనందున మాట్లాడలేదు. ఇప్పుడైనా వాస్తవాలను అంగీకరించి మా వాదనతో ఏకీభవిస్తారని ఆశిస్తున్నా. తెలంగాణ వచ్చాక మేం పాలనలో ఉండి ఉంటే భూతల స్వర్గం చేసేవాళ్లం. కానీ వీళ్లు అప్పుల కుప్ప చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలో ప్రభుత్వం నేరుగా రుణాలు తెచ్చినా, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పూచీకత్తుతో, పూచీకత్తు లేకుండా అప్పులు తెచ్చినా.. చివరకు భారం పడేది ప్రభుత్వంపైనే. ఆ అప్పులన్నీ ప్రభుత్వ అప్పులే. ఇలా 2014 నుంచి 2023 వరకు చేసిన మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు. ప్రతి కుటుంబం నెత్తిపై రూ.7 కోట్ల అప్పు తీసుకున్నారు..’ అని భట్టి ధ్వజమెత్తారు. ఆదాయం పెరిగితే ఓడీ ఎందుకు? ‘రాష్ట్ర ఆదాయం, జీఎస్డీపీ బాగా పెరిగితే ఓడీ ఎందుకు తీసుకున్నారు? ఓడీ అంటే ఏమిటి? రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయని లోతుగా చెప్పట్లేదు. ఓడీ అంటే దివాలా తీయడం. బ్యాంక్రప్ట్ కావడం. రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసి ఓడీ తీసుకోబోమనే మాట ఇవ్వమంటే ఎలా? అయితే మీలాగా మాత్రం మేం చేయం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలు ఎక్కిస్తాం. ఆర్థిక క్రమశిక్షణతో సంపదను సృష్టించి అభివృద్ధి పనులు చేపడతాం..’ అని స్పష్టం చేశారు. మేం మీలా చేస్తామని ఎలా అనుకున్నారు? ‘తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా ప్రాంత అధికారులతో శ్వేతపత్రం రూపొందించా రని బీఆర్ఎస్ సభ్యులు అనటం వింతగా ఉంది. మాకు తెలంగాణ ప్రజలు, అధికారులపై నమ్మకముంది. గత ప్రభుత్వం పదేళ్ల పాటు పని చేయించుకున్న అధికారులతోనే శ్వేతపత్రం తయారు చేయించాం. కానీ మీకు తెలంగాణ అధికారులపై నమ్మకం లేకనే కదా.. ఏపీ కేడర్ అధికారులను పిలిపించుకుని సీఎస్‌గా, డీజీపీగా నియమించుకుంది. మేము కూడా మీలాగే చేస్తామని ఎలా అనుకున్నారు?’ అంటూ భట్టి ఎద్దేవా చేశారు. జనం ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు.. ‘మేం ప్రతిపక్షాలను ప్రత్యర్థులుగానే చూస్తాం తప్ప శత్రువుగా చూడం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలపాలన్నదే మా ఉద్దేశం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు. అన్ని విషయాలు చెప్తే రాష్ట్ర పరపతిపై ప్రభావం పడుతుందని చెప్పటం లేదు. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నాం. మోయలేని అప్పు భారం ఉన్నా, జనం ఆకాంక్షలను నెరవేర్చేలా ముందుకు సాగుతాం..’ అని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు శాసనసభ లేనప్పుడు ఎవరైనా ప్రజావాణికి రావ చ్చని, తమ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భట్టి చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో చెప్పలేదని, ఉద్యోగాలిస్తామని చెప్పా మన్నారు. కాళేశ్వరంను పనికిరాకుండా చేశారు ‘కాళేశ్వరం పేరుతో రూ.97 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఆ ప్రాజెక్టును గొప్పగా చూపి పనికిరాకుండా చేశారు. గొప్పలకు పో యిన ప్రాజెక్టు మిషన్ భగీరథ. ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే ఊరి జనం మంచి నీళ్లు తాగారు అన్నట్టు చెప్పుకొన్నారు. కానీ నా పాదయాత్రలోనే దాని అసలు డొల్లతనం స్పష్టమైంది. చాలా ప్రాంతాల్లో జనం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తవ్వించిన మంచినీటి బావుల నుంచే నీళ్లు తోడుకుని తాగుతున్నారు. అందుకే ఈ పథకంపై విచారణ జరపాలని కోరుకుంటున్నా..’ అని డిప్యూటీ సీఎం అన్నారు. -
చేసిందంతా చేసి పరువు పోతుందంటున్నారు: భట్టి విక్రమార్క ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కట్టిందే ఒక్క కాళేళ్వరం ప్రాజెక్ట్.. ఎన్నికలకు ముందే మేడిగడ్డ కూలిపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా తెచ్చిన అప్పులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీలో భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ..‘ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారు. దేశంతో తెలంగాణ పోటీ పడాలి అనే ఈ శ్వేతపత్రం. రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ శ్వేతపత్రం. ఇంతా చేసి బయటకు చెప్పకండి.. పరువు పోతుందంటున్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయో అనేది తెలియాలి. ప్రణాళికబద్దంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన ముందు పెద్ద సవాల్ ఉంది. మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ లేదు. ఏ బడ్జెట్లోనైనా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్ ఉంటుంది. పదేళ్లల్లో ఇన్ని కోట్ల బడ్జెట్‌తో ఏం సాధించారు. కానీ, గత ప్రభుత్వ కాలంలో చాలాసార్లు 20శాతం కంటే ఎక్కువగా బడ్జెట్లో గ్యాప్ ఉంది. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించారు. కానీ, అంతా రివర్స్ అయ్యింది. ఆర్థిక పరిస్థితి ఓవైపు.. ప్రజల ఆకాంక్షలు మరోవైపు. బడ్జెట్ అంటే అంకెల గారడీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కట్టామన్నారు.. ప్రజలందరికీ చూపించారు. మేం వెళ్లి చూస్తామంటే అడ్డుకుని అరెస్ట్ చేశారు. కట్టింది ఒక్కటే ప్రాజెక్ట్ అది కూడా కూలిపోయింది. మిషన్ భగీరథకు కూడా అలాగే చెప్పి అప్పులు తెచ్చారు. ప్రాజెక్ట్ సెఫ్టీ వాళ్లు మేడిగడ్డ మళ్లీ కట్టాలి అన్నారు. ఎల్లింపల్లి కూడా మేం కట్టిందే, దాన్ని కూడా మీరు వాడుకున్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరంలో వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తామని బ్యాంకులకు చెప్పింది. ఓఆర్ఆర్ కట్టింది మేమే.. దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. మీరు చేసిన దివాళా పని సెట్ చేసుకోవడం మాకు కష్టమే. మీరు చాలా స్వేచ్చగా మాట్లాడవచ్చు. మాకు కిరీటాలు వచ్చాయనుకోవడం లేదు. కార్పొరేషన్లు అప్పులు తీర్చవు.. ప్రభుత్వమే అప్పులు తీర్చాలి. రాష్ట్రంపై మీకంటే ఎక్కువ ప్రేమ మాకే ఉంది. రాష్ట్రం ఇచ్చిందే మేము. తెచ్చిన అప్పులతో బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌లు కట్టారంటే అది లేదు. కేంద్ర సంస్థలు ఏం తెచ్చారు? వచ్చిన ఐటీఐఆర్‌ను పోగొట్టారు. రెండు ఫామ్‌హౌజ్‌లను మాత్రమే తెచ్చారు. మా వెన్నులో భయం పెట్టుకునే పని చేస్తున్నాం. గడిచిన పదేళ్లలో ఎప్పుడైనా ఇలా నవ్వుతూ మాట్లాడుకున్నామా?’ అని అన్నారు. -
తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణం గత ప్రభుత్వమే..
-
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని ఈనెల 23న సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సేవ డేస్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి,సురేష్ రెడ్డి,గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్,మనోహర్ తదితరులు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. డిసెంబర్ 10 నుంచి ఈనెల 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వారు డిప్యూటీ సీఎంకు వివరించారు. వరంగల్ లో 38 కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహించగా 16,000 మంది హాజరయ్యారని ఇందులో 1500 మంది నిరుద్యోగులను ఎంపిక చేసామని చెప్పారు.అదే విధంగా 2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ లో నిర్వహించే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు కూడా రావాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు!) -
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం
-
ప్రజాభవన్‌లోకి భట్టి ఫ్యామిలీ గృహ ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం చేశారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఇక, గృహ ప్రవేశం అనంతరం భట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం సందర్భంగా హోమం కార్యక్రమం చేపట్టారు. ఈ హోమం కార్యక్రమంలో భట్టి దంపతులు పాల్గొన్నారు. అనంతరం, భట్టి విక్రమార్క సచివాలయానికి బయలుదేరారు. కాసేపట్లో సచివాలయంలోని తన చాంబర్లో భట్టి ఛార్జ్ తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చింది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, ప్రజాదర్బార్‌ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కాగా, రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
ఖమ్మం జిల్లాలో భట్టి, పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ శ్రేణుల స్వాగతం
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క ప్రమాణం
-
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Live Updates.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు థాకరే ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్.. కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, మిగతా బెర్తులపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ అసెంబ్లీలో మంత్రుల ప్రమాణ స్వీకారం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరు కాని సీఎండీ ప్రభాకర్ రావు. సమావేశానికి రావాలని ఆదేశించినా హాజరు కాని ప్రభాకర్ రావు. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరైన రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల చేయనున్న ప్రభుత్వం. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. విధివిధానాలను రూపొందించాలని అధికారులకు రేవంత్ ఆదేశం. ఆర్టీసీ పరిస్థితులు, ఆదాయం, వ్యయంపై సీఎం రేవంత్ ఆరా. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4కోట్ల భారం పడే అవకాశం. ఆర్టీసీ బస్సుల్లో రోజూ 12-13 లక్షల మంది ప్రయాణం. ►కాసేపట్లో విద్యుత్ శాఖ, ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష ►మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ. ►మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు. ►నిన్న తొలి కేబినెట్లోనే విద్యుత్ శాఖపై వాడీవేడి చర్చ ►నేడు సమీక్షకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రెడ్డి హాజరుకావాలన్న సీఎం రేవంత్. ►ప్రజా దర్బార్ ముగించుకుని సెక్రటేరియట్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ►విద్యుత్ శాఖపై సెక్రటేరియట్లో రివ్యూ చేయనున్న సీఎం రేవంత్ ►సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు ►జెన్కో ఏఈ నియామక పరీక్ష వాయిదా వేయాలని వినతి. ►సీఎం రేవంత్‌ను కలిసి సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్. ప్రజా దర్బార్‌లో సీఎంను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించిన బాధితులు. ►ఇక, ప్రజా దర్బార్‌కు ప్రత్యేక యంత్రాగం. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20 మంది సిబ్బంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్స్ చేస్తున్న సీఎం రేవంత్. వచ్చిన ఫిర్యాదులపై మళ్లీ సమీక్ష చేయాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్. ప్రతీ నెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష. ►కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ►జూబ్లీహిల్స్ నివాసం నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు బయలు దేరిన సీఎం రేవంత్ రెడ్డి.. ►మరికాసేపట్లో ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌కు హాజరు కానున్న సీఎం రేవంత్ ►కాసేపట్లో ప్రజా దర్బార్.. ►ప్రజా దర్భార్‌లో కోసం భారీగా వచ్చిన ప్రజలు.. గడీల పాలన అంతం కోసం ఇనుప కంచెలను తొలగించి, జ్యోతిరావు పూలే ప్రజా భవన్ కు తెలంగాణ ప్రజలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ప్రజా దర్బార్ లో తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్ కు తరలివచ్చిన ప్రజలు.@revanth_anumula#PrajalaTelanganaSarkaar pic.twitter.com/quqLv4pKeT — Telangana Congress (@INCTelangana) December 8, 2023 తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. నేడు, జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బర్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎన్నికల సమయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, విద్యుత్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. సెక్రటేరియట్లో విద్యుత్ శాఖపై మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టనున్నారు. సీఏండీ ప్రభాకర్ రావును రివ్యూకు అటెండ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థలో 85వేల కోట్ల అప్పులపై ఆరా తీయనున్నారు. నేడు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు, విద్యుత్ సంక్షోభం సృష్టించే కుట్ర జరిగిందని తొలి క్యాబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం రేవంత్. అయితే, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. Praja Telangana - ప్రజల తెలంగాణ 10 గంటలకు ప్రజాభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్. -- తమ వినతులతో ప్రజా భవన్ కు భారీగా చేరుకున్న ప్రజలు. Telangana Chief Minister Revanth Reddy Praja Darbar at Praja Bhavan at 10 o'clock. -- People reached the Praja… pic.twitter.com/aZUhEhzd43 — Congress for Telangana (@Congress4TS) December 8, 2023 -
భట్టికి రెవెన్యూ.. ఉత్తమ్‌కు ఆర్థికం?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు కీలకంగా మారింది. ఎక్కువ మంది సీనియర్లు ఉండటం, ప్రాధాన్య శాఖల కోసం పోటీపడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. పలువురు సీనియర్లకు మంత్రులుగా అవకాశం ఖాయమైనా.. వారికి కేటాయించే శాఖలేమిటనేది ఇంకా తేలలేదు. బుధవారం అర్ధరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. సీఎంగా రేవంత్, మంత్రులుగా మరో 12 మంది వరకు ప్రమాణం చేస్తారని తెలిసింది. ఈ జాబితాలో సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో భట్టికి రెవెన్యూ, ఉత్తమ్‌కు ఆర్థికశాఖ ఇవ్వవచ్చని.. మరో సీనియర్ నేతకు హోంశాఖ ఇవ్వనున్నారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. కానీ పక్కాగా స్పష్టత రావడం లేదు. తొలి రోజున ప్రమాణం చేసేది ఎందరు? వాస్తవానికి గురువారం రేవంత్‌రెడ్డి ఒక్కరే ప్రమాణం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ తర్వాత సంఖ్య పెరుగుతూ వచ్చింది. రేవంత్‌తోపాటు ఐదుగురు అని ఓసారి, ఆరుగురు అని మరోసారి, మొత్తం తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం చేస్తారని ఇంకోసారి వార్తలు వచ్చాయి. చివరిగా 12 మంది వరకు తొలిరోజునే ప్రమాణం చేయనున్నట్టు గాందీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరకపోతే.. మిగతావారు ఈనెల 9న, లేదా మరో రోజున ప్రమాణం చేస్తారని వివరించాయి. కొందరు సీనియర్ల శాఖలు ఢిల్లీలోనే ఖాయం రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులను నియమించే వెసులుబాటు ఉంది. కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిలో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పారీ్టలో సీనియర్లు, ఇతర కోటాల్లో మరో ముగ్గురికిపైనే నేతలు మంత్రి పదవుల పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ బెర్తుల కోసం అటూఇటూగా 30మంది వరకు పేర్లను పరిశీలించిన ఏఐసీసీ.. పలువురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై రేవంత్‌కు దిశానిర్దేశం చేసిందని, రేవంత్ విచక్షణ మేరకు మరికొందరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీనితోపాటు కొందరు సీనియర్లకు శాఖల కేటాయింపుపై ఢిల్లీలోనే స్పష్టత వచ్చిందని.. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ, ఉత్తమ్‌కు ఆర్థిక శాఖ ఇవ్వనున్నారని గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రెండు శాఖలతోపాటు హోంశాఖ కోసం పలువురు సీనియర్లు పోటీపడుతున్నారని తెలిసింది. దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబులకూ కీలక శాఖలు దక్కనున్నట్టు సమాచారం. అధిష్టానం సూచనలకు అనుగుణంగా.. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఆయా మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. మంత్రి పదవుల రేసులో ఉన్నది వీరే.. మంత్రి పదవుల కోసం సీనియర్లతోపాటు కొందరు జూనియర్ ఎమ్మెల్యేలు కూడా వివిధ కోటాల కింద పోటీ పడుతున్నారు. సామాజికవర్గాల ప్రాతిపదికన జూనియర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి రావడంతో ఈ జాబితా పెరిగిపోయింది. సీనియర్ల జాబితాలో.. భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి జి.వివేక్, జి.వినోద్, తుమ్మల నాగేశ్వర్రావు, దొంతి మాధవరెడ్డి, బాలూ నాయక్, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. జూనియర్ల జాబితాలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆది శ్రీనివాస్, ఈర్ల శంకర్, వాకిటి శ్రీహరి, బీర్ల అయిలయ్యల పేర్లున్నాయి. వీరితోపాటు అద్దంకి దయాకర్, షబ్బీర్‌అలీ, బలరాం నాయక్ తదితరులు సామాజిక వర్గాలు, ఇతర కోటాల్లో మంత్రి పదవి ఆశిస్తున్నట్టు తెలిసింది. వీరిలో ఎవరెవరికి మంత్రులుగా అవకాశం వస్తుంది? వారిలో గురువారం ఎందరు ప్రమాణ స్వీకారం చేస్తారు? ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించనున్నారన్నది గురువారం తేలిపోనుంది. కేబినెట్‌పై ఢిల్లీలో మల్లగుల్లాలు రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివకుమార్‌తో మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. సీనియర్లు ఉత్తమ్, భట్టి తదితరులు వెలిబుచ్చిన అభిప్రాయాలను ఈ సందర్భంగా రేవంత్‌కు డీకే వివరించినట్టు తెలిసింది. తర్వాత బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో రేవంత్ జరిపిన భేటీల్లోనూ మంత్రి పదవులపై చర్చించినా.. ఓ నిర్ణయానికి రాలేకపోయినట్టు సమాచారం. రేవంత్ హైదరాబాద్‌కు వచ్చేందుకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. కానీ మధ్యలో ఉండగానే అధిష్టానం పెద్దల పిలుపు మేరకు వెనక్కి వెళ్లారు. మహారాష్ట్ర సదన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయి అరగంటకుపైగా చర్చించారు. మరోవైపు ఢిల్లీలోనే డీకే శివకుమార్‌తో ఉత్తమ్, భట్టి, జి.వినోద్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు విడివిడిగా భేటీ అయ్యారు. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని, ప్రాధాన్య శాఖలు కేటాయించాలని కోరారు. రేవంత్‌ను కలవని సీనియర్లు! మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం దాకా ఢిల్లీలోనే ఉన్న రేవంత్‌రెడ్డి ఓవైపు.. ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు తదితర సీనియర్లు మరోవైపు ఏఐసీసీ పెద్దలతో భేటీలు జరిపారు. కానీ సీనియర్లు ఎవరూ కూడా రేవంత్‌ను కలవలేదు. ఆయన అధిష్టానం పెద్దలను కలసినప్పుడూ వారు దూరంగానే ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ సీఎం ప్రమాణస్వీకార ఏర్పాట్లు .. అప్డేట్స్
Live Updates.. రేవంత్ సీఎం.. ఆర్ట్స్ కాలేజ్ వద్ద సంబరాలు ముఖ్యమంత్రిగా గురువారం సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సంబురాలు ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్, బాణసంచా కాల్చి సంబరాలు మీ అందరి ఆశీస్సులతో ప్రమాణం చేయబోతున్నా: రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ తెలంగాణ ప్రజలకు ఆహ్వానం సీఎల్పీ నేత ఎనుముల రేవంత్‌రెడ్డి పేరిట ప్రకటన విడుదల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణం తెలంగాణ ప్రజలకు అభినందనలు విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడింది తెలంగాణ మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది మీ అందరి ఆశీస్సులతో డిసెంబరు 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నా ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం హైదరాబాద్‌కు టీ కాంగ్ సీనియర్లు తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన పలువురు సీనియర్ నేతలు సీఎం పదవి కోసం చివరిదాకా కొనసాగిన ఆశావహుల ప్రయత్నాలు తామూ రేసులో ఉన్నామంటూనే.. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటనలు ఏఐసీసీ పెద్దలను కలిసి తమ పేర్లను పరిశీలించాలని విన్నపాలు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో రేవంత్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు మంత్రి వర్గ కూర్పుపై నిన్న రాత్రి, ఇవాళ రేవంత్ కసరత్తులు రేపే ప్రమాణం కావడంతో హైదరాబాద్‌కు తిరుగు పయనం రేవంత్ వెంట మాణిక్‌రావ్ ఠాక్రే కూడా హైదరాబాద్‌కే రేవంత్ బయల్దేరిన కాసేపటికే నగరానికి సీనియర్లు కూడా హైదరాబాద్ బయలుదేరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్బీ స్టేడియం వద్ద భారీగా ఏర్పాట్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వేదికగా ఎల్బీ స్టేడియం స్టేడియంలో భారీ ఏర్పాట్లు మొత్తం మూడు వేదికలు ప్రధాన వేదికపైనే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం వేదిక ఎడమ వైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక కుడి వైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్‌కు ఘన స్వాగతం అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు స్డేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు ఇబ్బందుల్లేకుండా చర్యలు.. స్టేడియం వద్ద సీఎస్ సమీక్ష ఎల్బీ స్టేడియంలో రేపు జరిగే సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్ శాంతకుమారి సాయంత్రం సీఎస్ వెంట డీజీపీ రవిగుప్తా కూడా ఉదయం సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎస్, డీజీపీ సాయంత్రం మరోసారి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇద్దరు వచ్చే అతిథులు పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం ఠాక్రేతో ముగిసిన రేవంత్‌రెడ్డి భేటీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేముందు ఏఐసీసీ నుంచి రేవంత్‌కు పిలుపు హుటాహుటిన వెనక్కి వెళ్లిన రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో భేటీ ఏఐసీసీ కార్యాలయంలోని మహారాష్ట్ర సదన్‌లో గంటపాటు చర్చ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన రేవంత్ రేవంత్‌తో పాటు హైదరాబాద్‌కు ఠాక్రే? రేపు రేవంత్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేయనున్న పలువురు రేపు తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్ Telangana CM designate Revanth Reddy meets Congress Telangana in charge, Manikrao Thakare at Maharashtra Sadan, in Delhi. pic.twitter.com/RJODkAaGAE — ANI (@ANI) December 6, 2023 తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ? 1. సీఎం - రేవంత్ రెడ్డి 2. డిప్యూటీ సీఎం - భట్టి విక్రమార్క 3. దామోదర రాజనర్సింహ ( మాదిగ) 4. గడ్డం వివేక్ ( మాల) 5.సీతక్క( ఎస్టీ) 6. పొన్నం ప్రభాకర్(గౌడ్) 7. కొండా సురేఖ ( పద్మశాలి) 8. ఉత్తమ్ కుమార్ రెడ్డి 9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 10. కోమటి రెడ్డి వెంకట రెడ్డి 11. మల్ రెడ్డి రంగారెడ్డి 12. తుమ్మల నాగేశ్వర రావు ( ఖమ్మం) 13. దుద్దిల్ల శ్రీధర్ బాబు( బ్రాహ్మణ) 14. షబ్బీర్ ఆలీ 15. జూపల్లి కృష్ణారావు 16. శ్రీహరి ముదిరాజ్ 17. వీర్లపల్లి శంకర్ (ఎంబీసీ) స్పీకర్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి / శ్రీధర్ బాబు తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ ప్రజలంతా ఎల్బీ స్టేడియంలోప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చింది మాణిక్‌రావు ఠాక్రేతో రేవంత్‌రెడ్డి భేటీ మహారాష్ట్ర సదన్‌లో సమావేశం రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంపై చర్చ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్ రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్ గత రాత్రి సీఎం ప్రకటన తర్వాత హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి డీకే శివకుమార్ నిన్న అర్ధరాత్రి దాదాపు గంటన్నర పాటు రేవంత్ చర్చలు ఈ ఉదయం నుంచి వరుసగా కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తూ వచ్చిన రేవంత్ రేపటి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందజేత మంత్రి వర్గ కూర్పుపైనా చర్చించిన ఏఐసీసీ పార్లమెంట్‌కు వెళ్లి పలువురు ఎంపీలను కలిసిన రేవంత్ స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపిన ఎంపీలు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు రిట్నర్ కాసేపటి కిందట హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు సైతం చేరుకున్న రేవంత్ హైకమాండ్ నుంచి రేవంత్‌కు పిలుపు హుటాహుటిన ఎయిర్పోర్ట్ నుంచి ఏఐసీసీ కార్యాలయానికి వెళ్తున్న రేవంత్‌రెడ్డి ఎందుకు పిలిచారో అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ 300 అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారానికి.. 300 మంది అమరవీరుల కుటుంబాలకు టీ పీసీసీ ఆహ్వానం మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు.. రేవంత్ భావోద్వేగ వ్యాఖ్యలు కాంగ్రెస్ విజయం అమరవీరులకు అంకితమని ప్రకటన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు.. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ 8వ గేట్ నుంచి ముఖ్యమంత్రి ఎంట్రీ గ్రౌండ్ కేపాసిటీ మొత్తం 80 వేల మందికి అవకాశం స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు సీసీటీవీ కెమెరాలతో బందోబస్త్ ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు ఢిల్లీ నుంచి వస్తున్న నేతలకు భద్రత కట్టుదిట్టం దాదాపు లక్షమంది స్టేడియానికి వచ్చే అవకాశం ట్రాఫిక్ పోలీసులు సూచించిన స్థలాల వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి ముగిసిన రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయల్దేరిన రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నాం తెలంగాణ సీఎంగా ప్రమాణం ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం పలు పార్టీల అగ్రనేతలు, రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, సినీ.. క్రీడా రంగ ప్రముఖులకు ఆహ్వానం రేవంత్‌తో పాటు రేపు మంత్రులుగా ప్రమాణం చేయనున్న ఆరుగురు స్పీకర్ ఎన్నిక తర్వాత మిగిలిన కేబినెట్ ఎంపిక రేపు ఆరుగురి ప్రమాణం? మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో మల్లగుల్లాలు వరుసగా ఏఐసీసీ నేతలతో భేటీ అవుతున్న రేవంత్‌రెడ్డి రేవంత్‌తో ప్రమాణం చేసేది ఆరుగురే? ఒక డిప్యూటీ సీఎం , ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం స్పీకర్ ఎవరనేది తేలాక.. మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నాం: డీజీపీ రవిగుప్తా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు సుమారు లక్ష మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు: డీజీపీ రవిగుప్తా ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు ఎవరికి వారే.. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం అందరి ప్రయత్నాలు అధిష్టానంపైనే ఆశలు పెట్టుకున్న సీనియర్లు నిన్న సీఎం ప్రకటన తర్వాత సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందన్న ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకులంతా కలిసి పని చేయాలన్న ఖర్గే డీకే శివకుమార్‌ను కలిసి మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధిష్టానమే మంత్రి పదవుల్ని నిర్ణయిస్తుందన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవిపై ఆశతో ఉన్న ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రేవంత్‌కు రాహుల్ అభినందనలు తెలంగాణ కాబోయే సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్ గాంధీ అభినందనలు తెలంగాణలో ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ నెరవేరుస్తుంది రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్యయుత పాలన అక్కడి ప్రజలకు అందుతుంది రేవంత్ ప్రమాణ స్వీకారానికి వాళ్లకు ఆహ్వానం డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తెలంగాణ సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్ ఏర్పాట్లు చేస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు ఎల్బీ స్టేడియంలో సీఎస్, డీజీపీ, జీహెచ్ఎంసీతోపాటు ఇంటటెలిజెన్స్ అధికారులు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, భద్రత పర్యవేక్షణ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మాజీ మంత్రులు ఇప్పటికే పలువురిని వ్యక్తిగతంగా ఆహ్వానించిన రేవంత్ తెలంగాణ అమర వీరుల కుటంబానికి ఆహ్వానం కూడా మంచి పాలన అందిస్తాం: డీకేఎస్ ఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరిన డీకే శివకుమార్ తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో డీకేఎస్ కీలక పాత్ర తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకుడిగా బాధ్యతలు.. ప్రచారంలో పాల్గొన్న డీకేఎస్ సీఎల్పీ భేటీ వివరాలను అధిష్టానానికి తెలియజేశా: డీకేఎస్ తెలంగాణ ప్రజలు మాకు అధికారం అప్పగించారు: డీకేఎస్ వాళ్లకి మంచి పాలన అందిస్తాం: డీకేఎస్ రేపు హైదరాబాద్‌కు రానున్న డీకేఎస్ రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేఎస్ హై కమాండ్ కు నివేదిక అందించాము. హై కమాండ్ సీఎం అభ్యర్థి పై నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానానికి అన్ని అంశాలను వివరించాం ఇకపై అధిష్టానమే నిర్ణయాలను తీసుకుంటుంది. రేవంత్ రాజీనామా వాయిదా? లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపు సీఎం పదవి దక్కడంతో ఎంపీ పదవికి రాజీనామా అయితే రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్? రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేయనున్న రేవంత్ డీకే శివకుమార్‌ను కలిసిన శ్రీధర్‌బాబు డీకే శివకుమార్‌ను కలిసిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా డీకే శివకుమార్‌ను కలిశా కాంగ్రెస్ అధిష్టానం మేరకు నడుచుకుంటాం మంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఇస్తే తీసుకుంటాను ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నా కల: బండ్ల గణేష్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన బండ్ల గణేష్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు నా కల నేను చెప్పినట్లు జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్రమాణ స్వీకారోత్సవం ఏడోతేదీ అని చెప్పడంతో సంతోషించాను. రేవంత్ పార్టీని ముందుకు తీసుకెళ్లిన విధానం ప్రజలకు నచ్చింది. రాజ్‌భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు టీకాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్ సీఎల్పీ నేతగా రేవంత్‌ను ఎన్నుకున్నట్టు తెలిపిన నేతలు 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖ గవర్నర్‌కు అందజేత రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం చేస్తారని గవర్నర్‌కు తెలిపిన నేతలు రేవంత్ రాజీనామా రేవంత్ రెడ్డి పార్లమెంట్‌కు వెళ్లారు ఈ సందర్భంగా ఎంపీ స్థానానికి రేవంత్ రాజీనామా చేశారు. అలాగే, పార్లమెంటులో ఎంపీలను కలిసిన రేవంత్ రెడ్డి రూమ్ నెంబర్-66లో పలు పార్టీల ఎంపీలతో సమావేశమైన రేవంత్ రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు #WATCH | Delhi | Telangana CM-designate Revanth Reddy arrives at the Parliament. The Congress MP from Malkajgiri is expected to tender his resignation as a Member of the Parliament, ahead of his swearing-in ceremony in Hyderabad tomorrow. pic.twitter.com/5Kllvj5fHx — ANI (@ANI) December 6, 2023 రేపు రజినీ ఉద్యోగ నియామకంపై రేవంత్ సంతకం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని హామీ దివ్యాంగురాలు రజినీకి హామీ ఇచ్చిన రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని రజినీకి పిలుపు. రేపు రజినీ ఉద్యోగ నియామక ఫైల్‌పై సంతకం చేయనున్న రేవంత్. అధిష్టానం నిర్ణయానానికి కట్టుబడాలి: కాంగ్రెస్ నేతలు సాక్షి టీవీతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎం పదవి ఎవరైనా ఆశించడంలో తప్పులేదు కానీ అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే లక్ష్యం సాక్షి టీవీతో షబ్బీర్ అలీ.. ఏఐసీసీ అగ్రనేతలను రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు పూర్తి స్థాయి మంత్రి వర్గం ఉంటుందా లేదా అనే సమాచారం లేదు అలాంటి చర్చ ఇప్పుడు జరగలేదు ప్రజలకు సుస్థిర పరిపాలన అందిస్తాము. సోనియా, రాహుల్, ప్రియాంకతో రేవంత్ భేటీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో రేవంత్ సమావేశం సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించిన రేవంత్ Telangana CM designate Revanth Reddy meets Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra in Delhi pic.twitter.com/hUuu2gl7bF — ANI (@ANI) December 6, 2023 #WATCH | Telangana CM-designate and state Congress president Revanth Reddy arrived at the residence of Congress Parliamentary Party Chairperson Sonia Gandhi to meet her, this morning. pic.twitter.com/JASV0qjvCg — ANI (@ANI) December 6, 2023 రేవంత్ ప్రమాణ స్వీకారంలో స్వల్ప మార్పు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం టైమ్‌లో స్వల్ప మార్పు. రేవంత్ రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎస్, డీజీపీ పర్యవేక్షణ సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చేరుకున్న సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించిన డీజీపీ ఎన్నికల్లో ఓడిన వారికి కేబినెట్లో చోటు.. ►కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం ►ఎన్నికల్లో టిక్కెట్ త్యాగం చేసిన వారికి, ఓడిన సీనియర్ నేతలకు మంత్రి మండలిలో చోటు కల్పించేందుకు టీకాంగ్రెస్ కసరత్తు ►టిక్కెట్ త్యాగం చేసిన చిన్నారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్‌తో పాటు ఓడిన షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్న ఏఐసీసీ ఖర్గేతో రేవంత్ భేటీ.. కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన రేవంత్ భేటీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ ప్రమాణస్వీకారోత్సవానికి ఖర్గేను ఆహ్వానించిన రేవంత్ Telangana CM-designate and state party chief Revanth Reddy met the party's national president Mallikarjun Kharge at his residence in Delhi, today. pic.twitter.com/XMOGLKrVo6 — ANI (@ANI) December 6, 2023 #WATCH | Telangana CM elect Revanth Reddy arrives at the residence of Congress President Mallikarjun Kharge in Delhi pic.twitter.com/bDAcNI6pOw — ANI (@ANI) December 6, 2023 కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ.. ఢిల్లీ పర్యాటనలో భాగంగా బిజీగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ అయ్యారు. #WATCH | Telangana CM designate and state Congress President Revanth Reddy leaves from his residence in Delhi pic.twitter.com/tDKTb1jhIV — ANI (@ANI) December 6, 2023 రేవంత్ నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు.. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీస్ ఆంక్షలు ఇంటివద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు రేవంత్ నివాసం వద్ద భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్న పోలీస్ అధికారులు రేవంత్ నివాసం నుండి బయటకు వచ్చే రూట్‌ను క్లియర్ చేస్తున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రేవంత్ నివాసం వద్ద చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండటంతో తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది సీఎల్పీ నేత, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి 200 మీటర్ల దూరంలోనే బారీకేడ్లు వేసి ఆంక్షలు ఇప్పటికే రేవంత్ నివాస పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఇంటెలిజెన్స్ పోలీసులు. కాసేపట్లో ఖర్గేతో రేవంత్ భేటీ.. ఈరోజు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్న రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్న రేవంత్ మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై చర్చించనున్న రేవంత్ నేడు సోనియా గాంధీని కలవనున్న రేవంత్ నేడు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలవనున్న రేవంత్ రెడ్డి రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్న రేవంత్ డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్‌తో కలిసి క్యాబినెట్‌పై కసరత్తు చేయనున్న రేవంత్ క్యాబినెట్ కూర్పు కసరత్తులో పాల్గొననున్న ఉత్తమ్, భట్టి 9న తెలంగాణ కాంగ్రెస్ కృతజ్ఞత సభ డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ కృతజ్ఞత సభ అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలియజేయనున్న కాంగ్రెస్ అంతకు ముందే కొలువు దీరనున్న తెలంగాణ కేబినెట్ డిసెంబర్ 7వ తేదీనే ప్రమాణం చేయనున్న రేవంత్‌రెడ్డి రేవంత్‌తో పాటు మరికొందరు మంత్రులుగా కూడా! ఆరు గ్యారెంటీలపై కృతజ్ఞత సభలో కీలక ప్రకటన చేసే అవకాశం ►కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డిని ఎంపిక చేశామని, ఈ నెల 7న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ►తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10.28 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులుగా ఎవరెవరు ఉంటారన్న దానిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక రెండు రోజుల పాటు అనేక తర్జనభర్జనలు, సంప్రదింపులు జరిపి, నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ►ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. ఖర్గే తెలంగాణ సీఎల్పీ భేటీ చేసిన తీర్మానాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించాలని నిర్ణయించారని చెప్పారు. గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం సహా ఇతర మంత్రి పదవుల అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సుపరిపాలన అందించబోతోందని.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పారు. -
ఢిల్లీ పెద్దలతో భట్టి విక్రమార్క మంతనాలు ?
-
తెలంగాణ సీఎం ఎవరు?.. వెయిటింగ్!
Live Updates ఏఐసీసీ నిర్ణయం కోసం వెయిటింగ్ ►సీఎల్పీ భేటీ అనంతరం.. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేపట్టిన డీకే శివకుమార్ ►ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడిన డీకేఎస్ ►ముగిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ ►ఎమ్మెల్యేల అభిప్రాయలను ఏఐసీసీకి పంపిన డీకేఎస్ ►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక సమాచారం కోసం వెయిటింగ్ ►కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ ముగిసిన సీఎల్పీ సమావేశం.. ►మరో రెండు గంటల్లో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం ►తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం. ►సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్న డీకే శివకుమార్. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో మాట్లాడుతున్న డీకే, దీపాదాస్ మున్షి. ►సీఎల్పీ సమావేశం అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత ఎంపికను అధిష్టానానికి అప్పగించారు. సీఎల్పీ తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఎల్పీ నిర్మానాన్ని భట్టి విక్రమార్క, తుమ్మల బలపరిచారు. తీర్మానాన్ని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తున్నాం. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. ►హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపికపై పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేశారు. ►ఏకవాఖ్య తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి.. తీర్మానాన్ని బలపరిచిన తుమ్మల నాగేశ్వర రావు ►సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్‌లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరు. #WATCH | Telangana: Congress Legislature Party (CLP) meeting begins in Hyderabad. Karnataka Deputy CM DK Shivakumar, State Congress chief Revanth Reddy and other Congress MLAs are present in the meeting. pic.twitter.com/xsQ2AayKQW — ANI (@ANI) December 4, 2023 ►కాంగ్రెస్ సీఎల్పీ నేతల సమావేశం ప్రారంభమైంది. నగరంలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపిక, మంత్రులు ఎవరు? అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ►సీఎం పదవి కోసం ముగ్గురు సీనియర్ నేతల లాబీయింగ్. ►ఢిల్లీ పెద్దలతో భట్టి విక్రమార్క్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఏకాభిప్రాయం కుదుర్చుకునేందకు అధిష్టానం ప్రయత్నాలు. ►సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. నా గెలుపు ములుగు ప్రజల విజయం, న్యాయం గెలిచింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాను. ►మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజా పాలన కోసమే కాంగ్రెస్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం. బీఆర్ఎస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కేబినెట్లో ఎవరు? ►వివేక్ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్ రావు, వెడ్మ బోజ్జు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ఆది శ్రీనివాస్, రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, సీతక్క, కొండా సురేఖ, భట్టి విక్రమార్క్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్, కూనంనేని సాంబశివరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా పద్మావతి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహ, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్, రామ్ మోహన్ రెడ్డి. సీఎం ఎంపిక అధిష్టానం నిర్ణయం: భట్టి విక్రమార్క ►అంతకుముందు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. సీఎల్పీ సమావేశంలో అందరి నిర్ణయం తీసుకుని పార్టీ అధిష్టానం సీఎంను ఎంపిక చేస్తుంది. నేను సీఎల్పీ నేతగా ఉన్నాను. పార్టీ అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేశాను. ఉచిత కరెంట్ అనగానే దేశంలో గుర్తుకు వచ్చేది వైఎస్సార్. ఎన్నికల ముందే చెప్పారు ఉచిత కరెంట్ ఇస్తానని.. చెప్పడమే కాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టారు. అది చేసి చూపించిన పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ అంటే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్. కరెంట్‌ను ముట్టుకుంటే ఎలా మాడిపోతారో ఇప్పుడు ఫలితాలు చూశారు కదా. 70 స్థానాల్లో గెలవబోతున్నామని ముందే చెప్పాను. గెలిచి చూపించాం. మా అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ చూస్తే తెలుస్తుంది. ఎంత బలంగా జనం ప్రజా ప్రభుత్వం తెచ్చుకోవాలని సిద్ధమయ్యారో. ప్రజాస్వామితంగా పాలన ఉండాలని కోరుకున్నారు. దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ గెలవాలని కోరుకున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ అడవుల్లో ఎవరూ తిరగని ప్రాంతాల్లోకి వెళ్లాను.. అక్కడే పడుకున్నాను. సింగరేణి ప్రాంతాల్లో కూడా తిరిగాను. మా పార్టీ అధికారంలోకి రాగానే ఏమీ చేస్తామన్నది క్లారిటీ ఇచ్చాం. ►పార్క్ హయత్‌లో డీకే శివకుమార్‌తో ఉత్తమ్, భట్టి, రాజగోపాల్ రెడ్డి భేటీ. సీఎల్పీ సమావేశం కంటే ముందే నేతల సమావేశంతో ఉత్కంఠ. ఈ సమావేశం తర్వాత హెటల్ ఎల్లాకు బయలుదేరనున్న నేతలు ►ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ►మరోవైపు.. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను రాజ్‌భవన్‌కు తీసుకువెళ్లేందుకు హెటల్ ఎల్లా వద్ద టీపీసీసీ బస్సులను సిద్ధం చేసింది. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. ►పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ►ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎగ్జిట్‌పోల్స్ ఎఫెక్ట్.. ‘వేల కోట్ల చెల్లింపులకు బీఆర్ఎస్ ప్లాన్!’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్టు ఎక్కువ సంఖ్యలో పోల్స్ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను దీవించారు. డిసెంబర్ మూడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. పదేళ్లుగా బీఆర్ఎస్ నేతలు భూదోపిడీలకు పాల్పడ్డారు. లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు, ప్రభుత్వానికి చెందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ధరణిని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ పరిధిలో వేలాది ఎకరాలు దోచుకున్నారు. అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలు పనులు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు వేల కోట్ల చెల్లింపులు ఈ రెండు, మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ప్రభుత్వం నుండి మరొక ప్రభుత్వం మారుతున్న క్రమంలో ఇష్టరాజ్యoగా వ్యవహరించకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలి. తెలంగాణలో గత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ధర్మపురి, హుజూర్ నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో ఇబ్బందులు నెలకొన్నాయి. ప్రస్తుతం కోర్టులలో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. కమీషన్ల కోసం రైతుబంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోంది. ప్రభుత్వ అన్ని ట్రాన్సాక్షన్స్‌పై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ ట్రాన్సాక్షన్‌పై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్‌లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్.. డిసెంబర్ నాలుగున బీఆర్ఎస్ కేబినెట్ భేటీ -
కాంగ్రెస్‌లో సీఎం పదవి.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో అదనంగా ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా?. పైపుల కోసమే మిషన్ భగీరథ స్కీం పెట్టినట్లు ఉంది అని ఎద్దేవా చేశారు. కాగా, భట్టి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనబడుతున్నాయి తప్ప బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని చూపిస్తారా?. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తెలంగాణ ప్రజలకు అవసరమైనవే. ఉచిత విద్యుత్ ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు వైఎస్సార్. ఉచిత కరెంట్.. విద్యుత్ ఉత్పత్తులపై పేటెంట్ హక్కు కాంగ్రెస్‌దే. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనంగా నాలుగు శాతం విద్యుత్ కేటాయించాం. కరెంట్ ఇచ్చింది మేమే.. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారు?. 24 గంటల కరెంట్ ఇస్తుంటే లాగ్‌బుక్స్ ఎందుకు దాచిపెట్టారు?. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని హామీలను నెరవేరుస్తాం. సంపద సృష్టించే అవకాశాలపై ఫోకస్ పెడతాం. మొట్టమొదటి సారి భూములపై హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. మా పార్టీ హయాంలోనే పాస్‌పుస్తకాలు, పట్టాదారీ పుస్తకాలు ఇచ్చాం. ధరణి పెద్ద స్కాం.. దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కాం ధరణి. కేసీఆర్ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు. ధరణి పెట్టింది దోచుకోవడానికే. ఏ రికార్డ్ చూసి ధరణిలో భూముల వివరాలు నమోదు చేశారు?. మధిర నియోజకవర్గంలో ప్రజలు నన్నే నమ్ముతారు. కాంగ్రెస్ సునామీలా.. భారీ మెజార్టీతో గెలవబోతుంది. 70-85 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. వందకు వంద శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎం పదవిని ఆశించడంతో తప్పులేదు. కాంగ్రెస్‌లో అందరి అభిప్రాయం తీసుకుని ప్రొసీజర్స్ ప్రకారం సీఎంను ఎన్నుకుంటారు. అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం అభ్యర్థి ఎన్నిక. కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆశయాలు నెరవేరలేదు. మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు చేయిస్తాం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోనే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటో తేలిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లు అన్నింటిలోనూ అవినీతి జరిగింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే అతి తక్కువ ఖర్చుతో తెలంగాణకు గోదావరి నీళ్లు వచ్చేవి. అనేక అబద్ధాలు చెప్పి కేసీఆర్ ఓట్లు వేయించుకున్నాడు. చెప్పిన పనులను పదేళ్లుగా కేసీఆర్ చేయలేదు. కేసీఆర్ ఏ హామీ ఇచ్చినా ప్రజలు పట్టించుకోవడం లేదు. తీసుకొచ్చిన అప్పులను కేసీఆర్ ఏం చేశారు?. 2 లక్షల ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అని అన్నారు. -
‘మేడిగడ్డపై 15-20 పిల్లర్లు కుంగిపోయాయి’
సాక్షి, మధిర: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో హైస్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ సర్కార్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ సేఫ్టీ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని కామెంట్స్ చేశారు. కాగా, ఖమ్మం జిల్లాలోని మధిరలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ మంత్రుల ఆరోపించడం హస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీపై 15-20 పిల్లర్లు కుంగిపోయాయి. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను బయటకు రానివ్వడం లేదు. మేడిగడ్డపై కాంగ్రెస్ నేతలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఎంతో గొప్పగా నిర్మించామంటూ బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది. మున్ముందు ముప్పు తప్పదు.. మున్ముందు కూడా బ్యారేజీతో ముప్పు ఉందని కేంద్ర బృందం చెప్పింది. మొత్తం బ్యారేజీ పనిచేయని స్థితికి వచ్చింది. ఏడో బ్లాక్ రిపేరు చేయడానికి వీలుగా లేదని నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ చెప్పింది. మొత్తం బ్లాక్‌ని పునాదులతో సహా తొలగించి పునర్నిర్మించాలని సూచించింది. సమస్య పరిష్కరించేంత వరకు బ్యారేజీని ఉపయోగించే పరిస్థితి కూడా లేదని కేంద్ర బృందం తెలిపింది. ఒక వేళ ఉపయోగిస్తే మొత్తం బ్యారేజీని మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి రావొచ్చని బృందం చెప్పింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. ఈసారి అధికారంలోకి రామని సీఎం కేసీఆర్‌కి అర్థమైపోయింది. రోజురోజుకి మా గ్రాఫ్ పెరుగుతోంది. మొన్నటి వరకు 80లోపు సీట్లు వస్తాయనుకున్నాం.. ప్రస్తుతం జనం నుంచి వస్తున్న స్పందన చుస్తే 80 సీట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు గంటల కరెంటు ఇస్తారని, రైతుబంధు రాదని కేసీఆర్ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్‌లు జనంలోకి బలంగా వెళ్లాయి. కాంగ్రెస్ వస్తే గ్యారెంటీ స్కీమ్‌లు అమలవుతాయని జనం నమ్ముతున్నారు. సీపీఐ పార్టీతో పొత్తుల విషయంపై కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో కవితపై కేంద్రమంత్రి ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ -
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సత్తుపల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల వర్గీయలు బిగ్ షాకిచ్చారు. దీంతో, అక్కడి రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. సత్తుపల్లిలో బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తుమ్మల వర్గీయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వరరావును అవమానించేలా కేటీఆర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి 500 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్.. మరోవైపు ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న కేటీఆర్‌కు ప్రపంచజ్ఞానం ఉందనుకున్నాను. 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీపై వారెంటీ లేదు.. గ్యారెంటీ లేదు.. ముసలి నక్కా అని మాట్లాడం అదేం భాష. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి.. కానీ, ఇదేం పద్దతి. నీ కంటే ఎక్కువ భాష మాట్లాడగలను. సభ్యతా, సంస్కారం అడ్డు వస్తోంది. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. ప్రజలు ఇచ్చే దరఖాస్తు తీసుకునే ధైర్యం నీకు లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు.. ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు 75-80 సీట్లు ఇవ్వబోతున్నారు. మేము ఆరు గ్యారెంటీలు ప్రకటించాం.. అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో వాటిని అమలు చేస్తాం. గ్యారెంటీలు ప్రజలకు చెందకుండా మీరు కుట్ర చేస్తున్నారు. మేము ప్రకటించాం.. బాగాలేకపోతే లేదని చెప్పండి. మీ కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం కాదు.. ప్రజల కోసం గ్యారెంటీలు పెట్టాం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓట్లు కాంగ్రెస్‌కు వేస్తారు.. మీ బెదిరింపులకు కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు ప్రజలకు బుద్ధి చెబుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్.. -
కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యా: మైనంపల్లి
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీకి వెళ్లి.. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలోనే ఆయన కండువా కప్పుకోనున్నారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా తెలియశారు. ‘‘ఈనెల 27న సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నా. మల్కాజిగిరి, మెదక్ టికెట్ నాకు, నా కుమారుడికి, అలాగే.. మేడ్చల్ టికెట్ నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు ఇవ్వమని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరాను. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గాలికి పెద్ద వాళ్లు కొట్టుకుపోవడం ఖాయం అని మైనంపల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు మైనంపల్లిని అఫీషియల్‌గా పార్టీలోకి ఆహ్వానించేందుకు సోమవారం మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ తదితరులు దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి చేరుకుంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మీట్లో పాల్గొని చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే.. రెండ్రోజుల కిందట బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా ప్రకటించారు. తనకు మల్కాజ్గిరి, తన కొడుక్కి మెదక్ సీట్ల ఒప్పందంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది. మైనంపల్లితోపాటు మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మైనంపల్లితో కాంగ్రెస్ కీలక నేతలు దఫదఫాలుగా చర్చలు జరిపారు. చివరకు తండ్రీకొడుకులకు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. -
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌పైనే మందకృష్ణ విమర్శలు!
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు సంధించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ బిల్లు పెట్టమంటే పెట్టలేదు. ప్రతిపక్ష పాత్రలో లేఖ రాయండని అడిగినా.. రాయలేదు. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటేనే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాం అని తెలిపారాయన. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్‌పై అభిప్రాయాలు తీసుకోవడానికి గాంధీభవన్‌కు ఆయన నేతృత్వంలోని బృందం వెళ్లింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్ నేతలకు ఎస్సీల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్‌కు ఆయన వినతిప్రతాలు సమర్పించారు. వర్గీకరణ అంశం సామాజిక అంశంగా గుర్తించిందే కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ చీలీకల సమస్య కాదు. ‘‘మా ఆకాంక్ష వర్గీకరణ అంశంపై పీసీసీ రేవంత్, ఇంచార్జ్ ఠాక్రే ,భట్టికి తెలియజేసాం. ఎస్సీ వర్గీకరణ పోరాటం దళితుల మధ్య చీలిక అంశం కాదు. సామాజికాంశం. అసమానతలను పరిష్కరించడం కోసమే వర్గీకరణ అంశం. అన్ని కులాలను సమానంగా చూడడమే వర్గీకరణ. ► ఎస్సీ రిజర్వేషన్స్ ఫలాలు అన్ని కులాలకు అందడం లేదని అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 1965లో లోకూర్ కమిటి ని నియమించింది. పంజాబ్ లో 1974 నుండి ఇప్పటి వరకు ఎస్సి వర్గీకరణ అమలు కావడం లేదు. ఎస్సి రిజర్వేషన్స్ వర్గీకరణ ను కాంగ్రెస్ సమర్థించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ కోసం వైఎస్సార్ చంద్రబాబు పై ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ హయాంలో పార్లమెంట్ లో వర్గీకరణ అంశంపై తీర్మానం చేశారు. కేంద్రం ద్వారా వర్గీకరణ చేసే అంశం రాష్ట్రాలకు ఇస్తామని 2009 లో కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టింది. 2018లో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ కట్టబెట్టాలంటూ కేంద్రం పై ఓత్తిడి తెస్తామంటూ మేనిఫెస్టో లో పెట్టారు. ► తమిళనాడులో జనార్దన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తో dmk వర్గీకరణ అమలు చేస్తుంది. పార్లమెంట్ లో బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలు రాశారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న వర్గీకరణ బిల్లు పెట్టలేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని 9 ఏళ్లుగా కోరుతున్నా.2018 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు తెలిపాం. ఇక్కడ ముగ్గురు ఎంపి లు గెలిచిన ఏనాడూ ప్రశ్నించలేదు. పార్లమెంట్ లో రేవంత్ మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడాల్సి ఉంటే బాగుండేది. ఆరు సంవత్సరాలు అవుతున్న అసెంబ్లీ లో వర్గీకరణ పై సిఏల్పి నేత బట్టి విక్రమార్క మాట్లాడలేదు. ► రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో జరిగిన సమావేశం లో ఎస్సి వర్గీకరణ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. గద్వాల్ సభలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామని తెలిపారు.అయితే జనాభా ప్రతిపాదికాన మాదిగలకు టికెట్లు కేటాయించలేదు. వర్గీకరణ మీద అనుకూలమని మీరు చెబితే ప్రధాని కి లేఖ రాయాలి. పార్లమెంట్ లో వర్గీకరణ పై ప్రైవేట్ బిల్లు పెట్టాలి అని కోరాను. రేవంత్, ఠాక్రే మాకు అనుకూలంగా వస్తుంది అన్నారు. వారు మాకు అనుకూలంగా లెటర్ ఇస్తే మా నిర్ణయం చెబుతాం అని చెప్పాం. వర్గీకరణ పై కాంగ్రెస్ స్టాండ్ నిజాయితీగా ఉండాలి. లేదంటే రాజకీయంగా సీరియస్‌గా ఉంటాం అని మందకృష్ణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించేవారి నుంచి దరఖాస్తులకు ఫీజులు! మరోవైపు టీకాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. టికెట్ ఆశించేవారి నుంచి దరఖాస్తు తీసుకోవాలని, దరఖాస్తుదారుల నుంచి ఫీజులు వసూలు చేయాలని, ఓసీలకు రూ.10వేలు, ఎస్సీ-ఎస్టీలకు అభ్యర్థులకు రూ.2,500 తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గజ్వేల్‌లో దళిత బంధుకోసం రోడ్డెక్కారు! -
తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ: కేసీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు పొలిటికల్ కౌంటరిచ్చారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కౌంటరిచ్చారు. భట్టి తన పాదయాత్రను రమ్యంగా వర్ణించారని అన్నారు. భట్టి మరోసారి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ చేశారు. పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు. అది సహజమైన పరిణామం అని అన్నారు. ఈ సందర్బంగా సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘చనిపోయేంతవరకు జయశంకర్ తెలంగాణపై రాజీపడలేదు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క లీడర్తోనే తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్రం 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. తలసారి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఉన్న తెలంగాణను తుడిచేసింది కాంగ్రెస్, జవహర్‌లాల్‌నెహ్రు అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది. 1969లో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడితే ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ వ్యతిరేకించారు. టీడీపీ హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారు. తాగునీటి కోసం 2.5 లక్షల కిమీల పైప్‌లైన్ వేశాం. కాంగ్రెస్ హయాంలో 35వేల చెరువులు మాయమైపోయాయి. తెలంగాణ ఏర్పడక ముందే మిషన్ కాకతీయ పేరు పెట్టాం. కాళేశ్వరమే లేకపోతే తుంగతుర్తి, డోర్నకల్, కోదాడకు నీల్లు వచ్చేవా?. ఒకప్పుడు ఎండిపోయిన గోదావని నేడు సముద్రాన్ని తలపిస్తోంది. దక్షిణ తెలంగాణకు రేపటి వర ప్రదాయిని కాళేశ్వరం. ఇండియాలోనే మొత్తంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఎంత క్రమశిక్షణ పాటిస్తే.. 24 గంటల విద్యుత్ సాధ్యమవుతుంది. 24 గంటల కరెంట్ ఇస్తుంటే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండాలు పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు. కాంగ్రెస్ నేతలా మాకు నీతులు చెప్పేది. మన్యం కష్టాలు కాంగ్రెస్ చరిత్ర అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు వస్తా పోతా ఉంటారు.. నెల రోజుల్లో ప్రభుత్వాన్ని పడగొడతాం అంటారు. మోదీకి మన మీద ఏం పగనో మనకు తెలియదు. జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రం ఇండియాలో ఒక్క తెలంగాణ మాత్రమే. బీజేపీ వైఖరేంటో ఎవరికీ అర్థం కాదు. వందేభారత్ రైళ్లకు వందసార్లు జెండా ఊపి ప్రారంభిస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కూడా కేసీఆర్ విమర్శలు చేశారు. రైల్వేస్టేషన్ లిఫ్టుని కూడా బీజేపీ నేతలు జాతికి అంకితం చేస్తారు’ అంటూ సెటైర్లు వేశారు. ఇది కూడా చదవండి: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత -
భట్టి Vs బీఆర్ఎస్.. అసెంబ్లీలో కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా, సమావేశాల్లో భాగంగా శనివారం అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయగా.. హస్తం నేతలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. ► సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మంచివారే. ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారని కేసీఆరే చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ లేదు.. ఏపీకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది వేరే కాంగ్రెస్ అని అన్నారు. ► కాంగ్రెస్.. ఎక్స్పైర్ అయిన మందు. చిన్న పిల్లలకు ఎక్కాలు రావు.. రాష్ట్రంలోని విపక్ష పార్టీలకు లెక్కలు రావు. కాంగ్రెస్‌కు విశ్వసనీయత పోయింది. ఓట్ల కోసమే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మాకు కట్టడం మాత్రమే తెలుసు. విపక్షాలకు కూలగొట్టడం ఒక్కటే తెలుసు. కాంగ్రెస్‌లో ఉన్నది నలుగురు ఎమ్మెల్యేలు. ఆ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రులని ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్‌కు కనిపించడం లేదని విమర్శించారు. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బతుకులు ఆగమయ్యాయన్నారు. కర్ణాటకలో గెలిచామని తెలంగాణలో కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ► అలాగే, తాము ప్రధాని మోదీకి భయపడలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గల్లీలో బీజేపీ తిడుతుంటే ఢిల్లీలో బీజేపీ అవార్డులు ఇస్తున్నదని చెప్పుకొచ్చారు. గుజరాత్ మోడల్ అంటే అంతా డొల్ల అని విమర్శించారు. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని తెలిపారు. ► ఇక, అంతకుముందు.. పట్టణ ప్రగతి అంశంపై శాసన సభలో చర్చిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయమంతా తమ హయాంలో పునాదులు వేసిన వాటి ఫలాలే అన్నారు. ఓఆర్ఆర్, మెట్రో, ఫ్లై ఓవర్లు తదితర ఎన్నో అభివృద్ధి పనుల్ని సిటీలో కాంగ్రెస్ చేపట్టడం వల్లే ఇంతలా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. 2 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్.. హైదరాబాద్ పరిధిలో 1లక్ష ఇళ్లను కూడా చూపించలేకపోయారని ఆరోపించారు. తాము సంపదను సృష్టిస్తే బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ స్థలాలు అమ్ముతోందని ఆరోపించారు. ► మంత్రి తలసాని కూడా భట్టికి కౌంటరిచ్చారు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇష్టం ఉండదని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్ కూడా లేరని అన్నారు. గతంలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. దేశ విదేశాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ పాలనను మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. డబల్ బెడ్రూం ఇళ్లపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం అని కొట్టి పారేశారు. ఇది కూడా చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా? -
ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైంది: భట్టి ఫైర్
సాక్షి, గాంధీ భవన్: తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ భట్టి విక్రమార్క్ సంచలన కామెంట్స్ చేశారు. తొమ్మిదేళ్ల కాలంలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దోచేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కాగా, భట్టి విక్రమార్క శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తెలంగాణ మహమ్మారిగా తయారైంది. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అందరూ కోరకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బెల్టు షాపులను మూయించాలని ప్రజలు మమ్మల్ని అడిగారు. చేనేత కార్మికుఉ జీఎస్టీ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్‌కి పట్టం కట్టాలని చూస్తున్నారు. సింగరేణిని బొందపెడుతున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని విద్యార్థులు అనుకుంటున్నారు. ధరణి పోర్టల్ పేరుతో మా భూములు మాకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: హిమాన్షు అన్నా.. మా బడినీ జర దత్తత తీసుకోరాదే..! -
సెల్ఫీ విత్ ‘జలయజ్ఞం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 750 గ్రామాల్లో 109 రోజుల పాటు 1,360 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క త్వరలోనే మరో రాష్ట్ర వ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్న బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నలకు సమాధానమిచ్చే విధంగా ‘సెల్ఫీ విత్ జలయజ్ఞం’ పేరుతో ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సందర్శించే కార్యక్రమం చేపడతారని గాంధీభవన్ వర్గాల సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఇందిరాసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల మీదుగా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టుల వరకు దాదాపు నెల రోజుల పాటు జరగనుంది. ఈనెల 25 తర్వాత భట్టి ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వాస్తవాల కోసమే.. ఈ ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైనా తెలంగాణ ఏర్పాటయిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల వద్దకు భట్టి వెళ్లనున్నారు. సదరు ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు? ఎంత ఖర్చుతో పూర్తి చేశారు? ఎన్ని ఎకరాల ఆయకట్టు లభించింది? ఎంత మంది రైతులకు లబ్ధి చేకూరింది? అనే అంశాలను ప్రజలకు వివరించనున్నారు. స్థానిక నేతలతో కలిసి ప్రాజెక్టుల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల పట్ల వహించిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడంతో పాటు వాస్త వంగా బీఆర్ఎస్ హయాంలో వచ్చిన కొత్త ఆయ కట్టు లెక్కను నిగ్గు తేల్చడమే ఎజెండాగా ఈ కార్య క్రమం చేపడుతున్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలి పాయి. కాగా తన పాదయాత్ర విశేషాలను, అనుభ వాలను వివరించేందుకు గాను శనివారం భట్టి గాంధీభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలను, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నట్టు భట్టి ‘సాక్షి’కి వెల్లడించారు. -
కాంగ్రెస్ సీఎం ఎవరు?.. భట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, తిరుపతి: తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా తెలంగాణలో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉచిత కరెంట్‌పై ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఉచిత కరెంట్ అంశంపై తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, భట్టి విక్రమార్క ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. ఇక, తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారిని భట్టి దర్శించుకున్నారు. అనంతరం, భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. దివంగత సీఎం వైఎస్సార్ ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. ఉచిత కరెంట్ పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతకు ముందు టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్, ఫ్యామిలీని టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ‘కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడు రోజులు జోరు వానలే.. -
కాంగ్రెస్ కార్యకర్తలు పులుల్లాగా విజృంభిస్తున్నారు: రాహుల్
Live Updates.. ►రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోసంగా ఉంది. మా ఐడియాలజీ దేశాన్ని కలపడం. ఇతరులది దేశాన్ని విభజించడం. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్ధించింది. తెలంగాణకు వచ్చినప్పుడు నా యాత్రకు శక్తినిచ్చారు. మీ మనసుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే మీరు కాంగ్రెస్ ఆలోచనను సమర్ధించారు. పాదయాత్ర చేసిన భట్టిని అభినందిస్తున్నా. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నా. తెలంగాణ ఒక స్పప్నంగా ఉండేది. జోడోయాత్రతో విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ కార్యకర్తలు పులుల్లాగా విజృంభిస్తున్నారు’ అని స్పష్టం చేశారు. ►భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుపెట్టాను. పీపుల్స్ మార్చ్ అనేది భట్టి విక్రమార్క్ యాత్ర కాదు.. అధికార మదంతో విర్రవీగుతున్న వారికి వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర ఇది. భారత్ జోడో యాత్రు కొనసాగింపే పీపుల్స్ మార్చ్. రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారు. పోడు రైతులను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు యత్నించారు. కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వం. ధరణిని రైతులు వ్యతిరేకిస్తున్నారు. మన రాష్ట్రం మనకు వస్తే భూములు వస్తాయని ప్రజలు అనుకున్నారు. ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకున్నా. భారతదేశాన్ని ఒక్కటి చేయాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు’ అని పేర్కొన్నారు. ►కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సభలో పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. రైతు రుణమాఫీ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు. తెలంగాణ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే’’ అని పొంగులేటి అన్నారు. ► ‘తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. విద్యార్థుల పోరాటాలతో ఆమె తెలంగాణ ఇచ్చారు. రెండుసార్లు కేసీఆర్‌కు అధికారం ఇచ్చారు.. అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ వచ్చినా 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వచ్చేది కాంగ్రెస్ పభుత్వమే. ఆరు నెలల పాటు అందన్నీ కలిశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ నెరేవేర్చుతాం. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలిపేయడం కాంగ్రెస్‌కే సాధ్యం. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. ►రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరారు. కాంగ్రెస్ కండువా కప్పిన రాహుల్.. పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ► రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో ప్రసంగించనున్నారు. ►గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. కాసేపట్లో గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మంకు ఆయన చేరుకోనున్నారు. ►కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభ ప్రారంభం కానుంది. సభకు జనం భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం 5.30కి సభా ప్రాంగణం వద్దకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. జనంతో సభా ప్రాంగణం సందడిగా మారింది. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరనున్నారు. ► ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ విధానాలు నాకు నచ్చాయి. ఈరోజు కాంగ్రెస్‌లో నేను చేరగలను.. కానీ, నేను పార్టీ పెట్టాను. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఉండవు. ► సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో నేతల్లో భిన్నాభిప్రాయాలే.. వర్గ విభేదాలు లేవు. జనగర్జన సభకు రాకుండా ప్రజలను అడ్డుకోవడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90-100 సీట్లు వస్తాయి. ► ఖమ్మంలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్ల ఏర్పాటుపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ సభకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకుంటున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ► జనగర్జన సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ► జూలూరుపాడు, సుజాతనగర్లో చెక్‌పోస్టులు పెట్టి పోలీసులు అడ్డుకుంటున్నారు. ► పాల్వంచ, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ► తనిఖీల పేరుతో వాహనాల పత్రాలు లేకపోతే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో, పొంగులేటి అభిమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోతున్నారు. సాక్షి, ఖమ్మం: తెలంగాణలో తిరిగి పట్టు పెంచుకుని అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమైంది. ► తెలంగాణ జనగర్జన సభను పురస్కరించుకుని కాంగ్రెస్‌లో కోలాహలం నెలకొంది. ► సీనియర్లు అంతా ఏకతాటికిపై వస్తుండటం.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతుండటం.. సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ముగుస్తుండటం నేపథ్యంలో దీనికి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ► ఐదు లక్షల మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు అంతా సిద్ధం చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. ► ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ జనగర్జన సభకు హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 5:30 గంటలకు సభా ప్రాంగణానికి రాహుల్ విచ్చేస్తారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. సభ ముగిశాక రోడ్డు మార్గంలో గన్నవరం వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారని వివరించాయి. ► ఈ సభకు ఏర్పాట్లు పూర్తికాగా.. నగరం మొదలు సభా ప్రాంగణం వరకు భారీ కటౌట్లు, పార్టీ తోరణాలతో ముస్తాబు చేశారు. ► గతంలో ఎన్నడూ లేని విధంగా సభకు భారీగా జన సమీకరణ చేస్తుండగా.. దాదాపు ఐదు లక్షల మందిని తరలించేందుకు ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేశారు. ► 55 అడుగుల ఎత్తులో 144 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 200 మంది కూర్చొనేలా సభా వేదికను నిర్మించారు. 140 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సభాస్థలిని 100 ఎకరాల్లో ఏర్పాటు చేయగా వేదిక ముందు 1.50 లక్షల మంది కూర్చొని వీక్షించేలా గ్యాలరీలు, కుర్చీలు సిద్ధం చేశారు. అలాగే మిగతా వారు సభను వీక్షించేలా 12 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతోపాటు మరో 4 లక్షల మంది నిల్చొని చూసేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కీలక ప్రకటనకు అవకాశం.. ఈ సభతోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. రానున్న ఎన్నికల్లో అనుసరించే రాజకీ య వ్యూహం, ఇతర పార్టీలతో పొత్తులు, ప్రజలకు ఇవ్వాల్సిన హామీలపై ఈ వేదిక నుంచే రాహుల్ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ బిగ్ షాక్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సక్సెస్ అయిందని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఖమ్మం సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్స్ చేస్తున్నాయి. ఇక, రేపటి సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీ చేరునున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచిన వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రేపు ఖమ్మం సభలో భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీకి నేతలు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లా జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన బాటలోనే సత్తుపల్లిలో ముగ్గురు కౌన్సిలర్లు అధికార పార్టీకి రాజీనామా చేశారు. పొంగులేటితో కలిసి ముందుకెళ్తున్నట్టు ముగ్గురు కౌన్సిలర్లు ప్రకటించారు. ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి పకడ్బందీగా చేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టిస్తోంది. కాంగ్రెస్ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. సభ జరిగే రోజున ఖమ్మంలో మంచినీరు వదలొద్దని అధికారులను ఆదేశిస్తున్నారని చెప్పారు. ఖమ్మంలో సభ విజయవంతం కావొద్దని జిల్లా మంత్రి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తలదన్నేలా కాంగ్రెస్ సభ ఉంటుందని పొంగులేటి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మా వల్లే పార్టీ హైలైట్ అయ్యింది.. మమ్మల్నెందుకు పట్టించుకోరు.. -
పోలీసులకు రాజకీయాలతో పనేంటి.. భట్టి విక్రమార్క వార్నింగ్!
సాక్షి, ఖమ్మం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌లో ప్రారంభమైన తన పాదయాత్ర ఖమ్మంలో ముగుస్తుందన్నారు. ఖమ్మంలో జనగర్జన పేరుతో ముగింపు సభ జరగబోతున్నట్టు తెలిపారు. అధికార మదాన్ని దించాడానికే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అని స్పష్టం చేశారు. కాగా, భట్టి విక్రమార్క కూసుమంచిలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో జూలై 2న జరిగే సభకు రాహుల్ గాంధీ హాజరవుతారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్‌లపై దమ్ముంటే చర్చకు రావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌లను ఎందుకు ఆపిందో చెప్పాలి. అభివృద్ధి అంటే కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లకు మధ్యలో స్తంభాలు, రంగులు వేయడం కాదు. రాజకీయాలకు అతీతంగా పోలీసులు పనిచేయాలి. పోలీసులు పాలేరు ఎమ్మెల్యే ఆదేశాలతో పని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చట్ట ప్రకారం చర్యలుంటాయి. సింగరేణిని ప్రయివేటు పరం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు ఏమీ ఇవ్వకుండా సున్నా చూపెట్టారు. పాలేరు శాసనసభ్యుడిని కాంగ్రెస్ గుర్తుపై గెలిపిస్తే కేసీఆర్ దగ్గర కాంట్రాక్టుల కోసం ఓట్లను అమ్ముకున్నాడు. బీఆర్ఎస్లోకి వెళ్లాలనుంటే కాంగ్రెస్ పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారాలి. ప్రజాస్వామ్య ద్రోహి పాలేరు ఎమ్మెల్యే. మీరు వేసే ఓటుకు ఎవరు గౌరవిస్తారో వారికే ఓటు వేయండి. ఓటును అమ్ముకునే నాయకులను గ్రామాల్లోకి రానివ్వకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీలో పెను మార్పులు!.. కేంద్రమంత్రిగా బండి, కిషన్ రెడ్డి, ఈటలకు.. -
సూర్యాపేట నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పాదయాత్ర
-
బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి పొలిటికల్ కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే, తాను రాజకీయాల్లో లేనంటూనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, భట్టి పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో పాల్గొననున్నట్లు బండ్ల గణేశ్ తెలిపారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ‘అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అని బండ్ల గణేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అన్నా వస్తున్నా అడుగులో అడిగేస్తా చేతిలో చెయ్యేస్తా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్… https://t.co/ZTmWiMcCaL — BANDLA GANESH. (@ganeshbandla) June 25, 2023 ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్.. ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ -
నేను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్‌లో చేరడం లేదు: పొంగులేటి
సాక్షి, నల్లగొండ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎండదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వడదెబ్బతో ఆయనకు జ్వరం, తలనొప్పి, నీరసం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో, భటి పాదయాత్రకు బ్రేక్ పడింది. కాగా, వైద్యుల సూచనల అనంతరం భట్టి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా.. అనారోగ్యానికి గురైన భట్టి విక్రమార్కను కేతేపల్లిలో పొంగులేటి శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో భట్టిని పరామర్శించారు. అనంతరం, పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. వేసవి ఎండను కూడా లెక్కచేయకుండా భట్టి విక్రమార్క వంద రోజలు పాదయాత్ర చేశారు. అన్ని కులాలు, మతాల వారిని కలుస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భట్టిని పరామర్శించడానికే ఇక్కడికి వచ్చాను. సీఎం కేసీఆర్ మాయమాటలతో తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం అభినందనీయం. తెలంగాణ ప్రజలు కన్న కలలు.. కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాష్ట్రంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం చేస్తున్నారు. అమరుల కుటుంబానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా?. తెలంగాణ బిడ్డలు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను క్షమించరు. నేను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్‌లోకి రావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోంది. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. పొంగులేటి చేరిక సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారిద్దరూ హ్యాండ్ ఇవ్వనున్నారా? -
గుత్తా, జగదీష్ రెడ్డి కుటుంబ ఆస్తులపై భట్టి సంచలన ఆరోపణలు!
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి గురించి మాట్లాడమంటే వారిద్దరూ నా పంచ గురించి మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డికి భటి కౌంటర్ ఇచ్చారు. వీరి ఆస్తులు వేల కోట్లకు ఎలా చేరుకున్నాయని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, కనగల్లులో భట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భవిష్యత్తే లేకుండా పోయింది. ధరణి పేరుతో భూమి గుంజుకుంటున్నారు. గిరిజన పోడు భూములను లాక్కుంటున్నారు. ఉద్యోగాలు వస్తామని ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడా ఇల్లు లేదు.. వాకిలి లేదు. ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వడం లేదు. ఉపాధి పనులు చేసుకునేవాళ్లకు కూలీ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో నేడు భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లాలోని దాదాపు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించారు. సొరంగం తవ్వేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకువచ్చాం. టన్నెల్‌కు సంబంధించిన దాదాపు 32 కిలోమీటర్ల పనులను పూర్తి చేశాం. రాష్ట్రం వచ్చి పదేళ్లువుతోంది.. ఇన్నేళ్లలో పట్టుమని రెండు మూడు కిలోమటర్లు కూడా తవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడమంటే నా పంచ గురించి, నా గోశి గురించి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎక్కడా మార్పు రాలేదు. బీఆర్ఎస్ నాయకుల జీవితాల్లో మాత్రం అద్భుతమైన మార్పు వచ్చింది. సీఎం కేసీఆర్, జగదీష్ రెడ్డి కుటుంబం, గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ ఆస్తులు వేల కోట్లు పెరిగాయి. వీరిద్దరి లాంటి వాళ్లతో నల్లగొండ జిల్లా ప్రజలకు ఏలాంటి ప్రయోజనం ఉండదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. కార్యకర్తల నారాజ్! -
భలే కొంటున్నారు సారూ...
-
ఢిల్లీ లో రాహుల్ గాంధీ ని ఇల్లు ఖాళీచేయిస్తే
-
సోమేష్ కుమార్ నియామకంపై భట్టి సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ తన ముఖ్య సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమేష్ కుమార్ నియామకంపై తెలంగాణ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రిటైర్ అయిన వాళ్లను ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తాజాగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలి. కానీ, సోమేష్ కుమార్ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా ప్రభుత్వ అడ్వయిజర్‌గా నియమికమయ్యారు. రైటర్ అయిన వాళ్లను ఎందుకు నియమిస్తున్నారు. వీళ్లపై చాలా అపోహలు ఉన్నాయి. భూ భకాసురులు భూములను ఆక్రమించుకునేందుకు సోమేష్ సహాయపడ్డారు. ధరణితో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి భూములను ధరణి పేరుతో లాక్కున్నారు. ప్రభుత్వం పేదల భూమిని లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్లాన్‌లో సూత్రదారి సోమేశ్ కుమార్. అలాంటి వ్యక్తిని మళ్ళీ సలహాదారుగా నియమించుకున్నారు. ఓఆర్ఆర్ లీజ్ వెనుక సోమేష్ కుమార్, అరవింద్ ఉన్నారు. 30 సంవ్సతరాలు లీజుకు ఇవ్వడం ఏంటి?. ఇంత మంది సలహాదారులు ఎందుకు?. రిటైర్డ్ అధికారులతో ప్రభుత్వం నడపాలనుకుంటున్నారా?. లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఇరిగేషన్ శాఖకు రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు. సోమేష్ కుమార్‌ను సలహాదారుగా నియమించడం అంటే.. మళ్లీ దోపిడీని ప్రారంభించినట్టే. వెంటనే సోమేష్ సలహాదారు పదవిని రద్దు చేయాలి. ఆయనపై ఎంక్వరీ వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తాం. సోమేస్ కనుసన్నల్లోనే హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల భూములు చేతులు మారాయి. ఇంధిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి వెల్లి వచ్చే దమ్ము కేటీఆర్‌కు తలసానికి ఉందా?. ఫార్మాసిటీ కట్టాలంటే పేదల భూములు లాక్కోవడం ఎందుకు?. గజ్వేల్, సిరిసిల్లలో భూములు లేవా?. ప్రభుత్వం బెదిరింపులతో ఎంతకాలం నడుస్తుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. కేటీఆర్ అనుచరుడికి సీటు! -
‘రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదు’
సాక్షి, హుస్నాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చేవెళ్ల సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయితే, అమిత్ షా రిజర్వేషన్ల తొలగింపు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు సీరియస్ అవుతున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అమిత్‌షా వ్యాఖ్యలు బాధ కలిగించాయి. దేశ హోంమంత్రి మతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు?. మత రాజకీయాలు చేస్తే దేశాన్ని ఎవరు కాపాడాలి?. అమిత్ షా వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు. ఇక, అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. తాజాగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగించడం అమిత్ షా తరం కాదు. అమిత్ షాపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. -
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా.. ఆద్యంతం భట్టికి ఆత్మీయ అనుబంధమే
మంచిర్యాల టౌన్/ మంచిర్యాల రూరల్ (హాజీపూర్): హాథ్‌సే హాథ్ జోడో యత్ర కొనసాగింపులో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా పిప్రి వద్ద షురూ అయిన ఈ యాత్ర 31 రోజుల పాటు సాగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా సాయంత్రం పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఇంటి నుంచి యాత్ర ప్రారంభమైంది. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి భట్టి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్సవ విగ్రహంలా ఎమ్మెల్యే.. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మంచిర్యాల అ భివృద్ధికి నిధులు తీసుకురావడంలో స్థానిక ఎమ్మె ల్యే విఫలమయ్యారని ఆరోపించారు. గోదావరి బ్యా క్ వాటర్ వచ్చి, రాళ్లవాగు ఉప్పొంగి ఈ ప్రాంతం మునిగిపోయినా నిరాశ్రయులను ఆదుకోకుండా, వారికి పరిహారం ఇవ్వకుండా, ఉత్సవ విగ్రహంలా దివాకర్‌రావు ఉన్నారని విమర్శించారు. స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్నారు. పనిచేయని ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. యాత్రలో పాల్గొన్న జనం మాకు అవసరం లేదంటూ నినాదాలు చేశారు. పనిచేసే వారు, ఈ ప్రాంత ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసే నాయకులే మనకు కావాలన్నారు. అధికారంలో ఉ న్నా, లేకపోయినా ప్రజల కోసం తపించే నా యకు డు ప్రేమ్‌సాగర్‌రావు అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కో రారు. చేతగాని ఎమ్మెల్యే దివాకర్‌రావు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఎద్దేవా చేశారు. సమస్యలు తెలుసుకుంటూ... పాదయాత్రలో భాగంగా మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో దోస, పండ్లు అమ్ముకునే వారిని భట్టి పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేదరివాడలో వెదురు బుట్టలు, చాటలు తయారు చేసి అమ్ముకునే బొల్లం రజితతో మాట్లాడగా, తాను బీఈడీ చదివానని చెప్పింది. ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తప్పనిసరి పరిస్థితుల్లో కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోగా, డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు సైతం ఇవ్వడం లేదని చెప్పింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే కులవృత్తులకు పెద్దపీట వేస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని భట్టి తెలిపారు. హాజీపూర్ మండలంలో ఘన స్వాగతం.. పాదయాత్ర హాజీపూర్ మండలం వేంపల్లికి చేరగానే స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. భట్టితోపాటు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీటీసీ డేగ బాపు దంపుతులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జాతీయ రహదారి మీదుగా ముల్కల్ల, గుడిపేట వరకు యాత్ర చేశారు. గుడిపేటలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత గుడిపేట గోదావరి రోడ్ మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మీదుగా భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది. భట్టి విక్రమార్క పాదయాత్రలో స్థానికులకు అభివాదం చేస్తూ కలిసిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సమస్యలు పరిష్కరించాలని, నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తమ ఇళ్లు, భూములు కోల్పోకుండా అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌పై కేక్ కటింగ్.. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌పై కేక్ కట్ చేశారు. మత్స్యకారులు భట్టికి చేపల వల అందజేశారు. అనంతరం భట్టి పాదయాత్రకు ప్రాజెక్ట్ వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు భట్టికి జిల్లాలోకి స్వాగతం పలికారు. పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ, రఘునాథ్‌రెడ్డి, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఒడ్డె రాజమౌళి, ఎంపీటీసీ బాలరాజు, నాయకులు సురేందర్, కుమార్ యాదవ్, పార్టీ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు. -
సత్యాగ్రహ దీక్షతో సమరానికి సై అంటోన్న తెలంగాణ కాంగ్రెస్
-
ఉత్తర తెలంగాణలోని 20 అసెంబ్లీ సీట్లపై కాంగ్రెస్ ఫోకస్
-
నా యాత్రలో అందరూ భాగస్వాములు కావాలి: భట్టి విక్రమార్క
మధిర: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కోరారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజారహత్నూర్ మండలం పిప్పిరి నుంచి ప్రారంభమయ్యే తన పాదయాత్ర 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,365 కిలోమీటర్ల మేర సాగి ఖమ్మంలో ముగుస్తుందని తెలిపారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త శక్తి మేరకు తనతో నాలుగు అడుగులు వేసి పారీ్టకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవమే నినాదాలుగా సాధించుకున్న తెలంగాణలో సమస్యలు కాంగ్రెస్‌తోనే పరిష్కారమవుతాయన్న విషయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తానని భట్టి తెలిపారు. మూడు బహిరంగ సభలు పాదయాత్రలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు భట్టి తెలిపారు. మంచిర్యాల, హైదరాబాద్ శివారుతో పాటు ఖమ్మంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, అవసరాలు, ఆశయాలను కాంగ్రెస్ ఎజెండాగా మార్చుకుని ముందుకెళ్తోందని.. తన యాత్రలో ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొనాలని కోరారు. ఇదీ రూట్ మ్యాప్.. ఈనెల 16వ తేదీన మొదలుకానున్న తన పాదయాత్ర రూట్ మ్యాప్ వివరాలను భట్టి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఖానా పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్పూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, ముదిగొండ, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు మీదుగా ఖమ్మం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో పాటు నాయకులు చావా వేణు, సూరంశెట్టి కిషోర్, మిర్యాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
‘మీకు అవమానం జరిగితే తెలంగాణకు జరిగినట్టా?’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలువురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఈ కేసులో కవితకు నోటీసులు అందడంతో ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్ ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తోంది. తాను గాంధేయవాదినంటూ కేజ్రీవాల్ గొప్పలు చెప్పారు. లిక్కర్ స్కామ్‌పై కేజ్రీవాల్ సమాధానం చెప్పాలి. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేశారు. కేజ్రీవాల్ కూడా రాజీనామా చేయాలి. దీనిపై అన్నా హజరే బయటకు వచ్చి మాట్లాడాలి. మీకు అవమానం జరిగితే తెలంగాణకు జరిగినట్టా..?. లిక్కర్ స్కామ్‌లో ఎంత పెద్దవాళ్లు ఉన్నా తప్పించుకోలేరు. దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేయాలి. కవితకు నోటీసులు వస్తే తెలంగాణకు అవమానం జరిగినట్లా..?. కవితకు అవమానం.. తెలంగాణకు కాదు. భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారా?. దీనిపై సమాజం ప్రశ్నించాలి. ప్రతిపక్షాలను కేంద్రం వేధిస్తోంది అనేది వేరే చర్చ. కానీ.. లిక్కర్ స్కామ్‌కి, వేధించడానికి సంబంధం లేదు. లేని విషయాల్లో వెంటాడితే ఖండించాలి. అంతుకు ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కూడా నోటీసులిచ్చారు. వాళ్లది లిక్కర్ స్కామ్ కాదు. వ్యక్తిగత దోపిడీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొలేదు. వారికి సీబీఐ, ఈడీ క్లీన్‌చీట్ ఇచ్చిందన్నారు. -
కాంగ్రెస్‌లో మరో ‘యాత్ర’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో పాదయాత్రకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్ర సాగుతుండగా.. వచ్చే నెల తొలివారంలో అదే పేరుతో యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి మొదలుపెట్టి.. రోజుకో నియోజకవర్గం చొప్పున మొత్తం 35 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో భట్టి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు భేటీ అయి యాత్ర షెడ్యూల్‌పై కసరత్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా యాత్ర కొనసాగించి ఖమ్మంలో ముగింపు సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ షెడ్యూల్ మేరకు నియోజకవర్గాల నేతలకు సమాచారం అందించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరగనున్న ఏఐసీసీ ప్లీనరీ తర్వాత ఈ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. బాసర టు ఖమ్మం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెండు నెలల వ్యవధిలో హాథ్‌సే హాథ్ జోడో యాత్రలను పూర్తి చేయాలని ఏఐసీసీ ఇంతకుముందే ఆదేశించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈనెల ఆరో తేదీన ములుగు నియోజకవర్గం నుంచి యాత్రను ప్రారంభించారు. దీనిలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొని తామంతా కలిసే ఉన్నామని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల కారణంగా రేవంత్ యాత్రలో సీఎల్పీ నేత భట్టి తొలుత పాల్గొనలేకపోయారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తాను కూడా రాష్ట్రంలో మరోవైపు నుంచి యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హాథ్‌సే హాథ్ జోడో యాత్రలను రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని.. అందువల్ల ఓ వైపు రేవంత్, మరోవైపు భట్టి ఆధ్వర్యంలో యాత్రలు చేయడం ద్వారా త్వరగా ముగించవచ్చన్నదే పార్టీ యోచన అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో వివాదమేమీ లేదని అంటున్నాయి. భట్టి ఆధ్వర్యంలో నిర్వహించే యాత్రలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, శ్రీధర్‌బాబు, వి.హనుమంతరావు వంటి ముఖ్య నేతలతోపాటు రేవంత్‌రెడ్డి కూడా పాల్గొంటారని చెప్తున్నాయి. -
ఆ ‘ప్రాజెక్టుల’ను మీ ఖాతాలో వేసుకుంటే ఎలా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో జూరాల, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మిస్తే, వాటి ద్వారా వచ్చే నీటిని తామే అందిస్తున్నట్టు అధికార పార్టీ నేతలు చెప్పుకోవటం ఏంటని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కింద 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది, కానీ, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి చేయకుండానే నీళ్లు ఎలా ఇస్తున్నారో అర్థం కావటం లేదు. భారీ ఎత్తున ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను జనం ముందుంచేందుకు మేం వెళ్తే అరెస్టు చేస్తారు. వేరే దేశాల నుంచి వచ్చేవారిని మాత్రం అనుమతిస్తారు. ఏంటీ దారుణం’’అంటూ ప్రభుత్వతీరును తప్పుపట్టారు. అందులోని లోపాలను జనం ముందుంచుతామన్న భయంతోనే తమను అరెస్టు చేశారని ఆరోపించారు. పద్దులపై చర్చలో భాగంగా శనివారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల వెనుక ఉన్న భూములు ముంపునకు గురై పంటనష్టం జరుగుతున్నందున సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేసి నీరు అందిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగటం లేదని, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపచేసేందుకు కేంద్రంతో పోరాడి నిధులు తేవాలని అన్నారు. ఎకరాకు రూ.24 లక్షలు ఇవ్వాలి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజీవ్ సాగర్, ఇందిరసాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా మార్చి 8 ఏళ్లు అవుతున్నా పూర్తి కాలేదన్నారు. సీతమ్మ ప్రాజెక్టు భూ పరిహారం కింద కనీసం ఎకరాకు రూ. 24 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేట్టిన రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారో, డిండి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీళ్లు ఇస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. మల్లన్న సాగర్ నుంచి సంగారెడ్డికి ఎప్పటిలోగా నీళ్లు ఇస్తారో చెప్పాలన్నారు. 1996 పోలీస్ బ్యాచ్‌లో కొందరికి పదోన్నతులు ఇచ్చి కొందరికి ఆపటానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. హోంగార్డులకు పే స్కేల్ అమలు చేయాలని పేర్కొన్నారు. -
మీరు నీళ్లిస్తే వలసలు ఆగలేదేం?
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ హయాంలోనే నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులు పూర్తయి లక్షల ఎకరాలకు నీళ్లందితే పాలమూరు జిల్లాలో వలసలు ఎందుకు కొనసాగాయో ఆ పార్టీనే చెప్పాలి. ఆ ప్రాజెక్టుల కింద కాంగ్రెస్ హయాంలో 27,300 ఎకరాలకే నీళ్లందాయి. పంప్ హౌస్‌లు పూర్తి చేయకుండా, కాలువలు తవ్వకుండా బిల్లులు తీసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చాక రూ. 3,663 కోట్లతో మొత్తం పనులు పూర్తి చేసి 5,69,506 ఎకరాలకు నీళ్లు అందించాం. జూరాల కింద లక్ష ఎక రాల ఆయకట్టు పెంచాం. మిషన్ కాకతీయతో వలస వెళ్లిన వారు తిరిగి వచ్చారు’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పద్దుల పై చర్చలో సీఎల్పీ నేత భట్టి సాగునీటి ప్రాజెక్టులపై చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. ‘కాళేశ్వరం’ ఇప్పుడు వెళ్లండి..: గతేడాది భారీ వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతం బురదమయమై ఉండటంతో ప్రమాదాలు నివారించేందుకే ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వలేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అందుకే అప్పుడు కాంగ్రెస్ నేతల ప్రాజెక్టు సందర్శనను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ఇప్పుడు సమావేశాలు పూర్తయ్యాక వెళ్తానంటే అధికారులను ఇచ్చి పంపుతామని, కడుపునిండా భోజనం కూడా పెట్టిస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై గతేడాదే కృష్ణా బోర్డు భేటీలో అభ్యంతరం తెలిపామన్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని ఎన్జీటీ, కృష్ణా బోర్డు ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇప్పించగలిగామని చెప్పారు. 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చాం... పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞంలో కొత్తగా వచ్చిన ఆయకట్టు 5.71 లక్షల ఎకరాలు మాత్రమేనని, స్థిరీకరించింది కేవలం 93 వేల ఎకరాలేనని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం 17.23 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 30.56 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిందన్నారు. గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి 56 ఏళ్లు పట్టిందని, మధ్యప్రదేశ్‌లో ఇందిరాసాగర్ ప్రాజెక్టు పూర్తికి 21 ఏళ్లు పట్టిందన్న హరీశ్‌రావు... తాము మూడున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి 817 చెరువులు, 66 చెక్‌డాంలు నింపామని వివరించారు. అనుమతి రాగానే పాలమూరు–రంగారెడ్డి పనులు.. ఎస్ఎల్బీసీని ఏడాదిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్ కేంద్రానికి పంపామని మంత్రి హరీశ్ తెలిపారు. వట్టెం నుంచి డిండికి నీళ్లు తీసుకుంటామని ప్రతిపాదించామని అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. -
టీఎస్ అసెంబ్లీ: కేటీఆర్ Vs భట్టి విక్రమార్క
Updates.. ►తెలంగాణ శాసన మండలిలో విప్‌లను నియమించారు. మండలిలో చీఫ్ విప్‌గా భాను ప్రసాద్ నియామకమయ్యారు. విప్‌లుగా కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు నియమించారు. ►తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీష్ రావు కౌంటర్ మధ్య శనివారం వాడీవేడి వాదనలు జరిగాయి. ముందు భట్టి మాట్లడుతూ.. కాళేశ్వరానికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారని అన్నారు. 18 లక్షల ఎకరాలకు బ్యారేజి కట్టారు కానీ.. నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పంపులు మునిగిపోయాయని చుద్దామంటే పోనివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.అసెంబ్లీలో తమ మైకులు కట్ చేసి వాళ్లకు మాత్రే ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మమ్మల్ని కట్టేసి వాళ్లకు కొరడా ఇచ్చి కొట్టమన్నట్టుగా ఉందన్నారు. ►సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కొరడాతో తాము కొట్టడం లేదని, మీకు మీరే కొట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాళేశ్వరం వద్దకు రేపు వెళ్తామంటే చెప్పండి.. దగ్గరుండి తీసుకెళ్తానని అన్నారు. వరద వచ్చినప్పుడు వెళ్తే జారిపడతారని భట్టిని పంపలేదన్నారు. కాళేశ్వరం మునిగిందని కాంగ్రెస్ నేతలు సంబర పడుతున్నారని.. కానీ ప్రకృతి విపత్తు వచ్చిందన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ఎజెన్సీ నుంచే రిపేర్ చేయించామని తెలిపారు. ► తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ ఫిషర్మెన్ విభాగం ప్రయత్నం. మెట్లు సాయికుమార్ సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ క్రమంలో వారు మత్య్సకారులకు రూ. 10లక్షల జీవిత బీమా, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ► శాసనసభ ఆవరణలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌కు బండ ప్రకాష్ నామినేషన్ దాఖలు. ► నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ► భట్టికి కేటీఆర్ కౌంటర్ కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రోను పూర్తి చేసిన ఘనత మాదే. మెట్రో రైలుకు కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోంది. కేంద్రానికి నివేదికలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఇష్టారాజ్యంగా మెట్రో ఛార్జీలు పెంచొద్దని స్పష్టం చేశాం. మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదన లేదు. కాంగ్రెస్ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారమే మెట్రోరైల్ నడుస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తామాని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీనే మెట్రోను తీసుకువచ్చింది. మెట్రో ఛార్జీలు అగ్రిమెంట్‌కు విరుద్ధంగా పెంచారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మెట్రో లిమిటెడ్‌కు లాభం చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. మెట్రో యాడ్స్ ఇచ్చే విషయంలో ప్రతిపక్ష పార్టీలకు స్పేస్ ఇవ్వడం లేదు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల వాగ్వాదం చోటుచేసుకుంది. -
టీఎస్ అసెంబ్లీ: కేటీఆర్ Vs శ్రీధర్ బాబు హీటెక్కిన సభ
Updates.. ► సింగరేణిని ప్రయివేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులను, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టి సింగరేణిని కాపాడుకుంటామని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ►బయ్యారం విషయంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట తప్పింది. బయ్యారంలో స్టీల్ నిక్షేపాలు లేవని కేంద్ర మంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం ప్రారంభించాం. వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో కూడా జిందాల్, మిట్టల్ వారితో ప్రాథమికంగా సంప్రదింపులు ప్రారంభించాం. కేంద్రం ముందుకు రాకపోతే ప్రయివేటు రంగం ద్వారానైనా లేదా సింగరేణి ద్వారానైనా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్ బాబు.. ► అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మధ్య మాటల హీట్ చోటుచేసుకుంది. ధరణి పోర్టల్‌పై ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ మాట్లాడుతూ.. ధరణి రైతులకు శాపంగా మారుతోంది. కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతులు గందరగోళంలో ఉన్నారు. ధరణిని రద్దు చేయాలన్నదే మా నినాదం. ► శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ధరణిపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలి. లోపాలు ఉంటే సరి చేస్తాం కానీ.. ధరణిని మొత్తం తొలగించం. ► శాసన మండలి సోమవారానికి వాయిదా.. ► ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కనీసం 8,9 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు. కరెంట్ కోసం రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. కరెంట్ కోతలపై శాసన మండలిలో చర్చ జరగాలి. ► అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఇచ్చే కరెంట్ కూడా ఏ సమయంలో ఇస్తున్నారో చెప్పడం లేదు. ఈ విషయాన్ని సభలో సభాపతికి విన్నవించినప్పటికీ.. మా వైపు చూడటం లేదు. సభలో ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకురాని పరిస్థితి ఉంది. అందుకే సభ నుంచి బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నాము. ► ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించకపోవడం దురదృష్టకరం. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ కోతలపై చర్చించి పరిష్కరించాలి ► శాసనమండలిలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు వద్దు అనుకునే వారే బడ్జెట్‌ను విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలలో నీటి యుద్దాలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడ్జెట్ సమావేశాలంటే ఖాళీ కుంటలు, ఎండిన పంటలు, కరెంట్ ధర్నాలు ఉండేవి. నేడు మండు వేసవిలో నిండైన చెరువులు దర్శన మిస్తున్నాయి. ► దేశానికి తెలంగాణ మార్గదర్శి, దిక్సుచి అయ్యింది. ప్రజలకు హామీలు ఇవ్వడం.. మర్చిపోవడం రాజకీయ పార్టీల నైజం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలా కాదు. మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా పెంచారు. ప్రజలకు సేవ చేయడం ఇతర రాష్టాల్లో ఓ రాజకీయ క్రీడ. కానీ, తెలంగాణ ప్రభుత్వానికి అదో టాస్క్. రాష్ట్రంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు జరిగాయి. రోజుకు 18 గంటలు ప్రజల గురించే ఆలోచించి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.ప్రజల కోసం మనస్సు పెట్టి, ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తి కేసీఆర్. ► మతాల పేరుతో ఓట్ల రాజకీయాలు కేసీఆర్ ఎప్పుడు చేయలేదు.. చేయరు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతాము. సచివాలయం ఎందుకు కడుతున్నారు అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. సచివాలయం వద్దన్నారు. ఇప్పుడేమో ప్రారంభ తేదీ మేము చెప్తే, ప్రారంభ తేదీ కూడా మేమే చెప్తాం అని అంటున్నారు. ప్రగతి భవన్ కడితే కూడా వద్దన్నారు. ► కొందరు నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యాదాద్రిని సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు?. ► మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తోంది. ఎన్ని పోరాటాలు చేసి అయినా ప్రైవేటీకరణను అడ్డుకుంటాము. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నివారణకు కేంద్రం సహకరించడం లేదు. ఢిఫెన్స్ ఏరియాలో భూసేకరణకు కేంద్రం ముందుకు రావడం లేదు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆలయాలు, ప్రార్థనామందిరాలను తొలగిస్తాము. ఇందు కోసం చట్టాన్ని కూడా తీసుకొస్తాము. ఏ దేవుడు ధుమ్ము, ధూళిలో ఉండాలనుకోరు.. భక్తులు కూడా కోరుకోరు. మళ్లీ వాటిని వేరే చోట నిర్మిస్తాము. కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదు. ఆర్మీ జోన్ భూములు నైజాం భూములు. కావాలంటే కేంద్రంలో పంచాయితీ పెట్టొచ్చు. బయ్యారంపై పలుమార్లు కేంద్రం మాట తప్పింది. ► సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. -
దేశ సందపను దోపిడీ చేస్తున్నారు: అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. కాగా, సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత భట్లి విక్రమార్క.. కేసీఆర్ సర్కార్‌పై కౌంటర్ అటాక్‌కు దిగారు. అటు కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంకెలు పెద్దగా ఉన్నాయి.. కేటాయింపులు చిన్నగా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ప్రకటించలేదు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. అదానీ కంపెనీ ఏం చేసిందో బయటపడింది. హిండెన్‌బర్గ్ అన్నీ బయటపెట్టింది. దేశ సంపద దోపిడీకి గురవుతోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదు. రూ. 4.86 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి?. సామాన్యులపైనే భారం పెరుగుతోంది. తలసారి ఆదాయం ఎలా పెరిగిందో లెక్కలు చెప్పాలి. రాష్ట్రంలో కొంత మంది తలసరి ఆదాయం మాత్రమే పెరిగింది. పేదలు ఇళ్లు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా బిల్లులు వేస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల్లో లక్షలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో ఫీజులపై నియంత్రణ ఉండాలి అని సూచనలు చేశారు. -
స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ముఖ్యనేతలతో మాణిక్‌రావు ఠాక్రే సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాణిక్‌రావు ఠాక్రే.. కాంగ్రెస్ నేతలతో గాంధీ భవన్లో సమావేశమై కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరోసారి మాణిక్‌రావు ఠాక్రే హస్తం పార్టీ నేతలతో వరుసగా భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు ముఖ్య నేతలతో ఠాక్రే భేటీ కానున్నారు. -
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే అందరూ పని చేయాలి : భట్టి విక్రమార్క
-
ఏ మీడియా ప్రభుత్వాన్ని శాసించలేదు: రేవంత్
-
‘చంద్రబాబు మీడియా వైఎస్సార్‌ను ఏం చేయలేకపోయింది’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లిలో ఉన్న గాంధీ ఐడియాలజీ సెంటర్లో పీసీసీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ధరణి పోర్టల్‌పై పార్టీ నేతలకు అవగాహన కల్పించడంతో పాటు జనవరి 26న ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడో యాత్రలు, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా అమలు, ఎన్నికల నిబంధనలపై చర్చించనున్నారు. అయితే, ఈ సమావేశం సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడుతూ.. ‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను ఏమీ చేయలేకపోయారు. ఏ మీడియా కూడా ప్రభుత్వాన్ని శాసించలేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. అధికారం సాధించే దిశగా పనిచేద్దాము. దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్నా ప్రధాని మోదీ స్పందించడం లేదు. అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పడం దురాక్రమణలకు అనుమతి ఇచినట్లే అవుతుంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా గాంధీ పదవి స్వీకరించలేదు. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారు. చలిని సైతం లెక్కచేయకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. దేశంలో విచ్చినకర శక్తులకు భయపడకుండా యాత్ర కొనసాగుతోంది. జనవరి 26న జెండా ఎగరవేయడంతో బాధ్యత తీరలేదు. అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించింది. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2003లో ఎలాంటి విపత్కర పరిస్థితులను ప్రజలు ఎదుర్కొన్నారో 2023లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేది కాంగ్రెస్ పార్టీనే. మనందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఏల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘2003లో దివంగత మహానేత వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఒక సంచలనం. మీడియా మొత్తం వ్యతిరేకంగా ఉన్నా.. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని వైఎస్సార్ బయలుదేరారు. పాదయాత్రతో వైఎస్సార్ సమూల మార్పులు తీసుకువచ్చారు. నాలాంటి ఎంతో మంది వైఎస్సార్ పాదయాత్రలో భాగస్వామ్యులు అయ్యారు’ అని అన్నారు. -
టీపీసీసీలో చల్లారని సెగ!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో అసంతృప్తుల స్వరం పెరుగుతోంది. టీపీసీసీ కమిటీలపై నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. కొందరు నేతలు చాపకింద నీరులా తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుంటే, కొందరు బహిరంగంగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మరికొందరు సముచిత స్థానం దక్కలేదనే ఆవేదనతో రాజీనామాల బాట పడుతున్నారు. కొండా సురేఖ, బెల్లయ్య నాయక్, భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, గీతారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావులను అనుసరిస్తూ తాజాగా మరో ముఖ్య నేత దామోదర రాజనర్సింహ అసమ్మతి గళం విప్పారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ అధిష్టానం తీరుపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కల్చరే తెలియని వాళ్లకు పదవులా? ఏఐసీసీ ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కమిటీల విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. పార్టీలోని కొందరు ఎస్సీ నేతలతో సమావేశమైన ఆయన, మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కమిటీల కూర్పుపై పదునైన విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేనంతమంది ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించారని, ఇంతటి జంబో కమిటీలు అవసరమా? అని ప్రశ్నించారు. కొత్త కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగలేదని, పీసీసీ ప్రతినిధులను ఎన్నుకున్న నాటి నుంచి ఇది కొనసాగుతోందని చెప్పారు. కొత్త కమిటీల్లో నిన్న, మొన్న వచ్చిన వాళ్లు, కాంగ్రెస్ కల్చర్ తెలియని వారే ఉన్నారని, వారికి ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కోవర్టిజం అనే రోగం పట్టుకుందని, అధిష్టానం కూడా కోవర్టులకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన అధిష్టానం, మనోభావాలు దెబ్బతినే విధంగా పదవులు ఇచ్చిందని, కోవర్టులకే పదవులు వచ్చాయని చెప్పారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని, పార్టీలో ఎవరి ఎజెండా వారికి ఉందని అన్నారు. సంబురాలు చేసుకున్న నేతలు అసమ్మతి వ్యవహారం ఇలా ఉంటే తాజా కమిటీల్లో పదవులు దక్కిన నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జి.మధుసూదన్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌కు వచ్చి మాజీ ఎంపీ మల్లు రవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు. బాణాసంచా కాల్చి ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ తర్వాత మల్లు రవి, ఈరవత్రి అనిల్, నాగరిగారి ప్రీతంలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిటీల కూర్పుకు తమ మద్దతు తెలియజేశారు. మల్లు రవి మాట్లాడుతూ.. కొత్త కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం దక్కిందన్నారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 8 శాతం, బీసీలకు 29 శాతం పదవులు ఇచ్చారని, ఉదయపూర్ డిక్లరేషన్ ఈ వర్గాలకు 50 శాతం పదవులు ఇవ్వాలని తీర్మానించిందని, కానీ టీపీసీసీ కమిటీల్లో 60 శాతం ఇచ్చామని చెప్పారు. ఎలాంటి చిన్న తప్పిదాలు జరిగినా వాటిని సవరించుకుంటామని, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత కలిసి సరి చేస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ కనుకనే నేతలు మాట్లాడగలుగుతారని, దామోదర రాజనర్సింహ చెప్పిన అన్ని విషయాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని, కోవర్టులు ఎవరో కూడా పరిశీలిస్తుందని మల్లు రవి చెప్పారు. నాగరి గారి ప్రీతం మాట్లాడుతూ ..తాజా కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద పీట వేశారని చెప్పారు. యువకులు, సీనియర్ల కాంబినేషన్లో కమిటీలున్నాయనేదే తమ భావన అన్నారు. త్వరలో కమిటీ విస్తరణ ఉంటుందని, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. పోరగాళ్లకు పదవులు ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారని, వారికి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అసమర్థులకు పోస్టులు ఇచ్చారని మరొకొందరు అంటున్నారని, మరి సమర్థులైన నేతలు ఇప్పటిదాకా ఏం చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇలావుండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగిన ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లిన ‘సామాజిక కాంగ్రెస్’బృందం అక్కడే మకాం వేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తోంది. కమిటీలను ప్రక్షాళన చేయాలి కమిటీల కూర్పులో చాలా తప్పిదాలు జరిగాయని, వాటిని సవరించాలని, కమిటీలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని రాజనర్సింహ డిమాండ్ చేశారు. కోవర్టులెవరో గుర్తించి కాంగ్రెస్ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత అధిష్టానిదేనన్నారు. అధిష్టానాన్ని గౌరవిస్తామని, అదే సమయంలో ఆత్మ గౌరవం కోసం పోరాటం కూడా చేస్తామని దామోదర స్పష్టం చేశారు. కమిటీల నియామకంలో జరిగిన తప్పులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకే తాను బాధతో విలేకరుల సమావేశం పెట్టానని చెప్పారు. ఎక్కడ లోపం జరిగిందో అర్థం చేసుకుని అధిష్టానం చర్యలు తీసుకోవాలని, మున్ముందు వచ్చే కష్టాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఐటీ దాడులు, మర్రి శశిధర్‌పై భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పోడు భూముల వ్యవహరం తెరపైకి వచ్చింది. కాగా, పోడు భూముల సమస్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పోడు సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. పోడు రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆడుకుంటోంది. అర్హులైన వారికి భూములు ఇవ్వలేదు. ప్రభుత్వ విధానాలతో అధికారులు, గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇక, తెలంగాణలో దాడులపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. గతంలోనూ ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. రెగ్యులర్‌గా జరిగే రైడ్స్‌ను పార్టీలు, ప్రభుత్వం చూపించడం తప్పు. విధినిర్వహణలో జరిగే చర్యలను కూడా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయం చేశాయి. మర్రి శశిధర్ రెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్ళేది కాదు.. కానీ వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కాంగ్రెస్ పార్టీతో మర్రి కుటుంబానికి సుదీర్ఘంగా అనుబంధం ఉంది. మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. నేను జగ్గారెడ్డితో మాట్లాడుతాను. ఆయన ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాను. నాకు బేషజాలు లేవు. కాంగ్రెస్ పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎన్నికలకు రెడీగా ఉంటుంది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం అభ్యంతరకం. శ్రీనివాస్ రావు కాళ్లు మొక్కడాన్ని ఖండిస్తున్నాం. కాళ్లు మొక్కుతా బాంచన్ అనే కాలం నుంచి మనం బయటకు వచ్చాము అని కామెంట్స్ చేశారు. -
రేవంత్, భట్టి టార్గెట్‌గా జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి టీపీసీసీపై సంచలన కామెంట్స్ చేశారు. జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గాంధీభవన్‌లో మీటింగ్ పెట్టాల్సిందిపోయి ఇళ్లల్లో కూర్చుని జూమ్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ పెట్టడానికి ఇదేమైనా కంపెనీనా?. ఉన్న 10 మంది కూడా గాంధీభవన్‌లో కూర్చోలేని పరిస్థితి. కొన్ని ఛానళ్ల భజనతోనే రేవంత్‌కు పీసీసీ దక్కింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారే పరిస్థితి ఉంటే రేవంత్, భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ ఏం చేస్తున్నారు. నేతలు పార్టీ మారకుండా చూడాల్సిన బాధ్యత పీసీసీకి లేదా?. అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయాక గాంధీభవన్‌లో ఏం చేస్తారు?. మర్రి శశిథర్ రెడ్డి లాంటి వారు పార్టీ నుంచి మారితే కాంగ్రెస్ చాలా నష్ట పోతుంది. 12 మంది ఎమ్మెల్యేల ను కాపాడుకోవడం లో ఉత్తమ్ , భట్టి ఫెయిల్ అయ్యారు. మునుగోడులో ఓటమిని రేవంత్ అంగీకరించాలి. పార్టీ గెలిస్తే క్రెడిట్ రేవంత్‌కు, ఓడితే మిగలిన వారికి ఇస్తారా?. మాణిక్యం ఠాగూర్ వ్యవస్థను సెట్ చేయడం లేదు. పార్టీలో చాలా ప్రక్షాళన చేయాలి. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు వస్తుంది అనుకోవడం తప్పు. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ను బలహీనపరచేందుకే టీఆర్ఎస్, బీజేపీ పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయి. మీడియాన డైవర్ట్ చేసేందుకే రెండు పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. నిరుదోగ్యులకు ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను టీఆర్ఎస్ మరిచిపోయింది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య దాడుల వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. -
మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది : భట్టి విక్రమార్క
-
రుణాలు బడా వ్యాపారులకేనా.. రైతులకు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలను నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) కింద రద్దు చేసే పాలకులు, ఆరుగాలం కష్టపడే రైతుకు రుణమాఫీ చేయమంటే మాత్రం వెనకాడుతారెందుకని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అంబానీ, అదానీ, ఇతర సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గురువారం ఇక్కడి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రైతు ప్రభుత్వమా? లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? అని నిలదీశారు. తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైతు రుణమాఫీ గురించి చొరవ చూపితే బాగుండేదని హితవు పలికారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇప్పించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, కేంద్రమంత్రి పర్యటన ఉపన్యాసాలకే పరిమితం కావడం విచారకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఎక్కువ వడ్డీకి ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక ప్రైవేటు అప్పులు తీర్చలేని పరిస్థితిల్లో రైతులు ఉన్నారని, ఈ దుస్థితి వారి ఆత్మహత్యలకు దారితీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని భట్టి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై ఫైర్ -
కాంగ్రెస్ పార్టీలోకి గద్దర్ ...?
-
అసెంబ్లీ నుంచి బహిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఇక రాజాసింగ్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మండిపడగా.. రాష్ట్రాన్ని తగలబెట్టి శ్మశానాలు ఏలుతారా అంటూ టీఆర్ఎస్, బీజేపీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మతఘర్షణలు చేయించడానికి సీఎం కుట్ర పన్నుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ నుంచి బహిష్కరించండి శాసనసభ విలువలను దిగజా రుస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవా రం లేఖ రాశారు. ఎమ్మెల్యేగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి సభ ప్రతిష్టకు భంగం కలిగించిన రాజాసింగ్‌పై రాజ్యాంగంలోని 194వ ఆర్టికల్ నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అధికారం అసెంబ్లీకి ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 22న మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నా యన్నారు. ఈ ఏడాది అసెంబ్లీలోనూ అసంబద్ద వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని ఖాద్రి గుర్తు చేశారు. రాజాసింగ్‌ను బహిష్కరించాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మతకల్లోలాలకు దారి తీసేలా, మత ఘర్షణలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సమాజ బహిష్కరణ చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై బీజేపీ మిడతల దండులా దాడి చేస్తోందని, మత అలజడులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం భట్టి విలేక రులతో మాట్లాడారు. బీజేపీ నేతల తీరు దేశ సమైక్యత, సమగ్రత, లౌకికవా దానికి పెనుముప్పుగా మారుతోందన్నారు. రాజాసింగ్ తన స్థాయి మరిచి జుగుప్సకర వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సమాజహితం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రాజాసింగ్‌ను కట్టడి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇతర మతా లను గౌరవించాలని, కానీ రాజాసింగ్ అందుకు భిన్నంగా మాట్లాడినందున భారత రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిని జైలుకు పంపండి: రేవంత్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘మత విద్వేషాలు రెచ్చగొట్టి, తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ ఎంతకైనా బరితెగిస్తుందని రాజాసింగ్ మాటలు ధ్రువీకరి స్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోని వాస్తవాలను మరుగున పరచడా నికి టీఆర్ఎస్ కృత్రిమంగా సృష్టిస్తోన్న గందరగోళాన్ని కూడా ప్రజలు గమ నిస్తున్నారు’ అని రేవంత్ ఆ ట్వీట్లో వ్యాఖ్యానించారు. రాజాసింగ్‌ను జైలుకు పంపాలి: అసదుద్దీన్ ఒవైసీ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను జైలుకు పంపాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన దారు స్సలాంలో మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ కు బెయిల్ రావడంపై మండిపడ్డారు. పోలీసుల పొరపాటుతో ఆయనకు జైలు తప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దీనిని సరిదిద్దుతారని ఆశిస్తు న్నానని పేర్కొన్నారు. రాజాసింగ్‌పై తీవ్ర ఆరో పణలు ఉన్నాయని, సహించరాని వివాదాస్పద వాఖ్యలతో ఆయన వీడియోను విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా రాజాసింగ్ వైఖరి అసభ్యకరంగా ఉందని ఒవైసీ నిప్పులు చెరిగారు. వివాదాస్పద వాఖ్యలు చేసిన రాజాసింగ్ వాయిస్ శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. వాయిస్ శాంపిల్ నిర్ధారణ ద్వారా బలమైన కేసు పెట్టాలని ప్రభు త్వానికి సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఇలాంటి వాఖ్యలు చేయడం ఇదే చివరిసారి కావాలని పేర్కొన్నారు. నుపుర్‌శర్మ వ్యవహారం నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదని ఆయన దుయ్యబట్టారు. ఎక్కడ కనిపించినా దాడి చేయండి: ఫిరోజ్‌ఖాన్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే హైదరాబాద్ లోని ముస్లింలు రాజాసింగ్ ఎక్కడ కనిపించినా దాడి చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మతాన్ని కించప రిచేలా మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్య మాల్లో బుధవారం ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫిరోజ్‌ఖాన్ మాట్లాడుతూ.. శాంతి, సమానతలతో ఉన్న హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకుని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. -
‘మీరు కూడా పార్టీ మారుతారా’.. భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం/హైదరాబాద్: ‘నేనే కాంగ్రెస్.. కాంగ్రెస్సే నేను. పార్టీ సీనియర్లు అందరితోనూ మాట్లాడుతా.. నేతలు, శ్రేణులు అధైర్యపడొద్దు’అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మీరు కూడా పార్టీ మారుతారా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, ఆయన పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడానికి సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం జరుగుతోందని, ఈ ట్రాప్‌లో ఎవరూ పడొద్దని సూచించారు. మునుగోడు కాంగ్రెస్‌కు కంచుకోట అని, గతంలో కంటే అత్యధిక మెజారిటీ ఇప్పుడక్కడ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పోటీ టీఆర్ఎస్ మాత్రమేనని, వామపక్షాల మద్దతు కూడా అడుగుతామని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ ఎంపీ అని, సంగారెడ్డిలో జగ్గారెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా తిరుగుతున్నారని విలేకరులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. పార్టీ ఆంతరంగిక విషయాలను బజారులో పెట్టి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, ఈ విషయాలన్నీ గాంధీ భవన్ లేదా ఏఐసీసీ కార్యాలయంలో మాట్లాడుకోవాలన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం టీపీపీసీ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో అప్పుడు తీసుకుంటుందని చెప్పారు. బీజేపీ ప్లానింగ్ కమిషన్‌ను మూసివేసి నీతి అయోగ్‌ను తీసుకురావడమే పెద్ద తప్పన్నారు. నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు అవడం, కాకపోవడం వారి ఇష్టాయిష్టాలకు సంబంధించినదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. పాలనపై అవగాహన లేకుండా బీజేపీ ఇష్టారీతిన వ్యవహరిస్తోందని, స్వాతంత్య్ర పోరాటంలో అడ్రస్ లేని బీజేపీ తామే స్వాతంత్ర్యం తెచ్చినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి నవభారత్ను నిర్మించింది కాంగ్రెస్సేనని, ఆ స్ఫూర్తిని ప్రజల్లో రగిల్చేందుకు కాంగ్రెస్ పార్టీ ‘ఆజాదీ గౌరవ్ యాత్ర’లను నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 9 నుంచి 15 వరకు అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తోందని, జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి సత్తుపల్లి నియోజకవర్గం వరకు 75 కిలోమీటర్ల మేర తాను పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, జావిద్, వీరభద్రం పాల్గొన్నారు. ‘ఆజాదీ గౌరవ్ యాత్ర’లను విజయవంతం చేయాలి... అంతకుముందు... ఆజాదీ గౌరవ్ యాత్రలపై అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవ స్వరో్ణత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ఆజాదీ గౌరవ్ యాత్ర’లను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరగనున్న ఈ యాత్రల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనేలా డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కాంగ్రెస్ పోరాటంతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం, నవ భారత నిర్మాణం కోసం కాంగ్రెస్ చేసిన పోరాటాలు, త్యాగాలను యాత్రల ద్వారా వివరించాలన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ భారీ జాతీయ జెండాలతో అన్ని నియోజకవర్గాలు కలిసే విధంగా యాత్రలు నిర్వహించాలని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎలా అందించిందో ఈ యాత్రల్లో ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ వర్గానికే పదవులు.. హరీశ్ వర్గాన్ని అణగదొక్కుతున్నారు’ -
మునుగోడులో ఉప ఎన్నికపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలిటిక్స్ శరవేగంగా మారుతున్నాయి. కాగా, కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. శనివారం సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదు. రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోంది. ఆయనకు ఉన్న ఇబ్బంది తెలుసుకొని పరిష్కారం చేస్తామన్నారు. సాధ్యమైనంత వరకు ఆయన పార్టీలోనే ఉండేలా చూస్తాము. వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రజలు కష్టాలు పడుతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆదాయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు దారాపోశారు. ఇంత వరకు ఒక ఎకరాకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ కోసం సీనియర్లను కేసీఆర్ తొక్కేస్తుండు.. -
కొత్తగా పార్టీలో చేరే వారికి టికెట్ల హామీ లేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామనే హామీని ఎ వ్వరూ ఇవ్వడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆది నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఎలాం టి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీని బలంగా ఉంచిన వారి ప్రయోజనాలను విస్మరించ మని స్పష్టం చేశారు. భట్టి ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో అప్పటికే పనిచేస్తున్న నాయకులకు తెలియకుండా నేరుగా కొత్త వారు వచ్చి గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే వివాదం సాగుతుండగా.. భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుని హోదాలో పార్టీ వైఖరిని వెల్లడిస్తూ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి పని చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తామని, అయితే ఇన్నాళ్లు కాంగ్రెస్ కంచుకోటను బలంగా ఉంచిన వారిని ఎవరి కోసం పణంగా పెట్టమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2022 వరకు కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ, కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తూ వచ్చిన నాయకుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, కార్యకర్తల సమష్టి కృషి వల్ల జిల్లాలో పార్టీ బలమైన శక్తిగా మనగలుగుతోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలను, నాయకులను ఎప్పటికీ వదులుకోమని స్పష్టం చేశారు. అదే సమయంలో కొత్తగా చేరిన వారి సేవలను కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల టికెట్ల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ విధానపరంగా జరుగుతుందని భట్టి తెలిపారు. -
సోనియా, రాహుల్‌కు ప్రజలు అండగా ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ కుట్రపూరితంగా ఈడీ నోటీసులు ఇప్పించిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఈడీ నోటీసులు ఇప్పించినంత మాత్రాన దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిర, రాజీవ్ వారసులు భయపడతారా? అని శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ‘1978 నవంబర్‌లో ఇందిరాగాంధీ లోక్‌సభకు ఎన్నికైనప్పుడు అధికారంలో ఉన్న జనతా పార్టీ కక్షపూరితంగా వ్యవహరించింది. కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ పేరిట ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించి అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత దేశం మొత్తం తిరగబడి ఇందిరకు అండగా నిలబడింది. 1980లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని 350 సీట్లతో గెలిపించి ఇందిరాగాంధీని ప్రధానిని చేశారు. ఇప్పుడు అదే తరహాలో సోనియా, రాహుల్‌లకు దేశ ప్రజలు అండగా నిలబడతారు’అని భట్టి తెలిపారు. -
ఈడీ నోటీసులు రాహుల్, సోనియాలను భయపెట్టలేవు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల కిందటి కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇవ్వడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఎనిమిదేళ్లు పరిపాలించిన తర్వాత కూడా ప్రధాని మోదీకి కలలో కూడా కాంగ్రెస్ పార్టీయే వస్తోందని ఎద్దేవా చేశారు. ఈడీ సమన్లు తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని ఆయన బుధవారం ట్విట్టర్‌తోపాటు ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. కాగా, తమ అగ్రనేతలకు ఈడీ సమన్లు జారీ చేయడం బీజేపీ పిరికిపంద చర్య అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈడీ నోటీసులకు తమ నాయకత్వం భయపడబోదని నవసంకల్ప్ శిబిరంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, సోనియా కుటుంబంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడితే కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా రోడ్ల మీదకు వస్తారని, అప్పుడు తట్టుకోవడం బీజేపీతో సాధ్యం కాదని అన్నారు. బీజేపీకి మూల్యం తప్పదు: ఉత్తమ్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబానికి ఈడీ సమన్లు ఇచ్చిన బీజేపీ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎనిమిదేళ్ల క్రితం మూసివేసిన కేసులో విచారణకు పిలుస్తున్నారని మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు. -
Nava Sankalp Shivir: అధికారంపై మథనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మేధోమథనం జరగనుంది. ‘నవ సంకల్ప శిబిర్’ పేరిట మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని బాల వికాస్ ప్రాంగణంలో బుధ, గురువారాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన చింతన్ శిబిర్ అనంతరం విడుదల చేసిన ‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్’లోని అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. అలాగే రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ఆరు కమిటీలను నియమించారు. సంస్థాగత వ్యవహారాలు, రాజకీయ, ఆర్థిక, వ్యవసాయం, సామాజిక న్యాయం, యువజనం పేరిట ఏర్పాటు చేసిన ఈ కమిటీలకు ఒక్కో దానికి సీనియర్ నేత కన్వీనర్‌గా 10 మంది సభ్యుల చొప్పున నియమించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి అంశంపై ఆయా కమిటీలు చర్చించి సభ్యుల అభిప్రాయాల మేరకు నివేదికను నవసంకల్ప్ శిబిర్ ముఖ్య కమిటీకి అప్పగించనున్నాయి. ఈ కమిటీ ఆ నివేదికలను రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో ప్రవేశపెట్టి చర్చించి.. అనంతరం వాటిని పార్టీ పాలసీగా, చింతన్ శిబిర్ నిర్ణయాలుగా అధికారికంగా రెండోరోజు ప్రకటించనుంది. ఈ నివేదికనే 2023 ఎన్నికల్లో పార్టీ రూట్మ్యాప్గా తీసుకోనున్నారు. ఈ చింతన్ శిబిర్కు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పర్యవేక్షకుడిగా హాజరుకానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్య నేతలు ఈ శిబిరంలో పాల్గొననున్నారు. టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, ఏఐసీసీ కమిటీల్లోని ఆఫీస్ బేరర్లు, మాజీ మంత్రులు, ఎంపీలకు ఈ సమావేశ ఆహ్వానం లభించింది. ప్రజల ఆకాంక్షల మేరకే..: భట్టి టీపీసీసీ ఆధ్వర్యంలో నవ సంకల్ప శిబిర్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి కీసరలో నిర్వహిస్తున్న నవ సంకల్ప్ మేధోమథన శిబిర్ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీ భవన్లో సన్నాహక సమావేశం జరిగింది. అనంతరం పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, ముఖ్య నేతలు అద్దంకి దయాకర్, హజ్మతుల్లా, సునీతారావుతో కలసి భట్టి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా రాష్ట్ర సాధన ఫలాలను అన్ని వర్గాలకు అందించేందుకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ఈ శిబిరంలో లోతైన అధ్యయనం చేస్తామని ఆయన వెల్లడించారు. ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని సూచించారు. అలాగే రాష్ట్రస్థాయిలో గాంధీ భవన్లో వేడుకలు నిర్వహించనున్నట్టు భట్టి తెలిపారు. స్థానిక సంస్థలకు నిధులివ్వండి.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అప్పులపాలు చేసి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తోందని విక్రమార్క దుయ్యబట్టారు. తమను ఎన్నుకున్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సొంత నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేయించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా సర్పంచ్‌లు, ఎంపీటీసీలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. తమ పార్టీ ఒత్తిడి చేసిన కారణంగానే రూ. 280 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, పెండింగ్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేసి సర్పంచ్‌లకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రాహుల్ సభతో వ్యవసాయానికి దశ,దిశ
సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో నష్టపోతున్న అన్నదాతలకు భరోసా ఇవ్వడం కోసం పోరాటాల చరిత్ర కలిగిన ఓరుగల్లునుంచే మరో రైతు ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వరంగల్‌లో నిర్వహించే రాహుల్ గాంధీ (రైతు సంఘర్షణ) సభ తెలంగాణలో వ్యవసాయరంగానికి దశ–దిశ చూ పించే చారిత్రక ఘట్టంగా మిగిలిపోనుందన్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరగనున్న సభ ఏర్పాట్లను సోమవారం కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క, టి.జీవన్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జె.గీతారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నా ల లక్ష్మయ్య, బలరాం నాయక్ తదితరులతో కలసి భట్టి పరిశీలించారు. అనంతరం మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలనుంచి పారిపోయాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పాలకులు రైతులను, వ్యవసాయాన్ని రాజకీయ అవసరం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పా ర్టీ ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నా చేస్తే, బీజేపీ గల్లీలో ధర్నాలు చేసి కొనుగోలు బాధ్య త తమది కాదన్నట్టుగా విడ్డూరంగా వ్యవహరించా యని భట్టి దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండ గట్టడానికి ఈ నెల 6వ తేదీన రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుల పక్షాన పోరాడుతున్న రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ‘మన సభ – మన పోరాటం’ నినాదంతో ప్రతి రైతు కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా గురువారం.. విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
మోదీ.. తెలంగాణ ద్రోహి
సాక్షి, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ విభజన గురించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రాజ్యసభ సాక్షిగా అమరవీరుల ఆత్మబలిదానాలను కించపరుస్తూ తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారని మండిపడ్డారు. మోదీ తెలంగాణ ద్రోహి అని అన్నారు. విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ ఒక్క హామీనీ నెరవేర్చకుండా.. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఇస్తే ఏపీలో అధికారం దక్కదని తెలిసినా అప్పటి యూపీఏ, ఎన్డీయే పక్షాలను ఒప్పించి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్ధంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టిన రోజు లేని మోదీ ఇప్పుడు అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే మంత్రి హరీశ్‌రావు రాష్ట్రానికి పట్టిన పెద్ద కర్మ అని, ఆయన కాంగ్రెస్ గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభానికి గజ్వేల్‌కు ప్రధానిని ఆహ్వానించిననాడే విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించమని కేసీఆర్ కోరకుండా కొంచెం ప్రేమ ఇవ్వాలని కోరిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. మోదీ, కేసీఆర్‌లవి వీధి నాటకాలని విక్రమార్క విమర్శించారు. -
‘టచ్ చేయమంటున్నారు కదా.. సంజయ్ టచ్‌చేయ్’
సాక్షి, హైదరాబాద్: దమ్ముంటే తనను టచ్ చేసి చూడాలని సీఎం కేసీఆర్ విసిరిన సవాల్‌కు బీజేపీ స్పందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ‘సీఎం కేసీఆర్ అవినీతి తనకు తెలుసని, జైల్లో పెడతామని సంజయ్ అంటున్నారు. నన్ను జైల్లో పెడతారా, దమ్ముంటే టచ్ చేసి చూడాలని కేసీఆర్ అంటున్నారు. టచ్ చేయమంటున్నారు కదా.. సంజయ్ టచ్‌చేయ్’ అని భట్టి వ్యాఖ్యా నించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ నేతలు, కేసీఆర్, సంజయ్‌ల మాటలన్నీ నాటకాలని, దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని కోరారు. ‘యాసంగిలో వరి వేయొద్దని సీఎం చెప్పడమేంటి? వరి కొత్తగా పండించట్లేదు. కేంద్రం కొనట్లేదు కాబట్టి తాను కొననంటే కేసీఆర్ ఏం చేస్తున్నట్లు? వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రణాళి కలు రాష్ట్రం బాధ్యతే కదా? నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే తన స్వ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతులను బీజేపీ ట్రాప్‌లో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్ని స్తున్నారు’అని మండిపడ్డారు. ఏడేళ్లుగా నీటి వాటాల్లో బీజేపీ అన్యాయం చేస్తోందని కేసీఆర్ చెబుతున్నారని, మరి ఏడేళ్లుగా బీజేపీ నీళ్లు ఇవ్వకుండా ఉంటే ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడ లేదని, ఇప్పుడు నోరు విప్పితే ఎలా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తాను పెంచలేదని, అందుకే ఇప్పుడు పన్ను తగ్గించ నని కేసీఆర్ చెప్పడం సరైంది కాదన్నా రు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై ప న్నులు తగ్గించాలని, వీటిని జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని భట్టి డిమాండ్ చేశారు. -
రాజకీయ నాయకులు ఒకరినొకరు కలవడం తప్పా..?
-
మహానేతకు నివాళి - మల్లు భట్టివిక్రమార్క
-
ఎన్నికలు రాగానే దళిత బంధు తెచ్చారు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికలు రాగానే దళిత బంధు అంటూ సీఎం కేసీఆర్ కొత్త పథకాన్ని తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏడేళ్లలో కేసీఆర్ ఎప్పుడైనా దళిత, గిరిజన నేతలతో సమావేశం పెట్టి ఏమి చేద్దాం అని అడిగారా అని ఆయన నిలదీశారు. దళిత బంధు అమలు చేస్తా.. ఎవడు ఆపుతాడో చూస్తా అన్న సీఎం ఈ పథకాన్ని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాభవన్‌లో జరిగిన పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దళిత, గిరిజనులకు కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ప్రగతి భవన్ అమ్ముతావో, సెక్రటేరియట్ అమ్ముతావో చెబితే తాము మద్దతు ఇస్తామని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని గూడేలు తిరుగుతామని, ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దండు కట్టి దండోరా వేస్తామన్నారు. దళిత దండు కార్యక్రమంలో తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని, కాంగ్రెస్ కార్యకర్తలు మండలాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. దీంతో టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో చావు డప్పులు మోగాలన్నారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత గిరిజనులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన చట్టాలను అమలయ్యేలా మళ్లీ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గిరిజనులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, ఆదిలాబాద్ నుండి ఖమ్మం జిల్లా వరకు పోడు భూములపై పోరాటం చేస్తామన్నారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని, హరితహారం పేరుతో కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు, చదువులు లేవని ధ్వజమెత్తారు. రైతు బంధు, దళిత బంధులు ఎన్నికల హామీలేనని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ఎస్టీ సెల్ అధ్యక్షులు జగన్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్లను నియమించకుండా గాడిదలు కాస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ రాష్ట్రానికి నియంతలా మారిన కేసీఆర్.. ముందు తన రాజకీయ క్రీడలను ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. తాము ఏడాది క్రితమే అన్ని ఆసుపత్రులు తిరిగి వైద్యుల నియామకానికి చిట్టా ఇచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వం గాడిదలు కాసిందా? అని ప్రశ్నించారు. నవ్వులాటలు, గాలి మాటలతో ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టారని మండిపడ్డారు. వద్దంటే ఎన్నికలు పెట్టి నాగార్జునసాగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగేందుకు కారణమయ్యారని విమర్శించారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని, కనీసం 15 రోజులపాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని కోరారు. వైరస్‌ను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకురావాలని భట్టి డిమాండ్ చేశారు. ఢిల్లీ తరహాలో ఒక యాప్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల వివరాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఎప్పుడు, ఎన్ని డోసుల వ్యాక్సిన్ కావాలో ఈ ప్రభుత్వం దగ్గర యాక్షన్ ప్లాన్ లేదని మండిపడ్డారు. చదవండి: ఈటలతో కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క భేటీ -
క్లబ్బులు , పబ్బులు మూసివేయాలి బట్టి విక్రమార్క
-
బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టిన అనంతరం ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల పుస్తకంలా ఉంది తప్ప.. దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన అభివర్ణించారు. కరోనా వల్ల ఆదాయం దెబ్బతిన్నదని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు 2లక్షల 30 వేల 825 కోట్ల రూపాయలతో తో బడ్జెట్ ను ప్రవేశపెట్టడంలో ఎలా సాధ్యమో ముఖ్యమంత్రి చెప్పాలని భట్టి అన్నారు. ఎఫ్.ఆర్.బీ.ఎం. చట్టాన్ని సవరిస్తున్న సందర్భంలోనే రాబోయో మూడేళ్లలో ప్రతి ఏడాది రూ. 50 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకొస్తోందని చెప్పిన మాట ఇప్పుడు వాస్తవం అవుతోందని అన్నారు. ఇప్పటికే మూడున్నర లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉంది.. ఇప్పుడు తెచ్చే ఒటిన్నర లక్షల కోట్ల అప్పుతో.. అది రూ 5 లక్షల కోట్లకు చేరుతుందని భట్టి మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అర్థిక లోటును రూ. 45 వేల కోట్లకుపైనే చూపించచారన్నారు. ద్రవ్యలోటును అప్పులతోనే భర్తి చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం అప్పలు భారాన్ని విపరీతంగా పెంచబోతున్నారని చెప్పారు. ప్రభుత్వం భారీగా తీసుకువచ్చిన అప్పులతో సామాన్యులకు ఉపయోగపడే ఎటువంటి కార్యక్రమం చేయలేదని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భ్రుతి, 57 ఏళ్లకే ఇస్తానన్న ఫెన్షన్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కు పనికివచ్చే కార్యాచరణ ప్రణాళికలు ఏమీ లేవని భట్టి మీడియాకు వివరించారు. ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మోసం చేసేందుకు మాత్రమే పనికి వస్తుందని అన్నారు. ప్రజల్లోనే భ్రమల్లోకి నెట్టేలా కేసఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు. 2020-21 బడ్జెట్ అంచనాలను చూస్తే.. రూ. లక్షా 43 వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టి.. రివైజ్ చేసే సరికి అది కాస్తా.. రూ. లక్ష 17 వేల కోట్లకు తగ్గిందని అన్నారు. గత ఏడాది బడ్జెట్ రూ. లక్షా 43 వేల కోట్లకే చేరలేదు.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రూ. 2లక్షల 30 వేల కోట్లకు చూపించడం అంటే ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదని భట్టి అన్నారు. రెవెన్యూ రిసీట్స్ విషయానికి వస్తే గత ఈ ఏడాది రూ. లక్షా 76 వేల కోట్ల రూపాయలకు చూపించారు.. గత ఏడాది రివైజ్డ్ బడ్జెట్ విషయానికి వస్తే.. రూ. లక్షా 17 వేల కోట్ల కు వచ్చింది.. ఈ ఏడాది ప్రభుత్వం చూపించిన లక్షా 70 వేల కొట్ల రూపాయాల రెవెన్యూ రిసీట్స్ ఎలా వస్తాయో ప్రభుత్వం చెప్పాలని భట్టి గట్టిగా డిమాండ్ చేశారు. నాన్ టాక్స్ రెవెన్యూ విషయానికి వస్తే.. గత ఏడాది రూ. 30 వేల కోట్లను ప్రభుత్వం చూపించింది.. అందులో కేవలం రూ. 19 వేల కోట్లు మాత్రమే వచ్చింది.. మరి ఈ ఏడాది నాన్ ట్యాక్స్ రెవెన్యూని రూ. 30 వేల కోట్లు అని బడ్జెట్ లో ప్రభుత్వం ఎలా చూపించిందో చెప్పాలని భట్టి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు. -
ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు: భట్టి
సాక్షి, సత్తుపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోయి, జ్ఞానం లేవని, ఎవరు చెప్పినా వినే రకం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలు విమర్శలు చేశారు. నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరినైనా కొనగలనన్న నమ్మకం, మూర్ఖత్వం ఉన్న కేసీఆర్ కు రైతులు, ప్రజలు కర్రుకాల్చి బుద్ధ వచ్చేలా వాతలు పెట్టాలన్నారు.రైతులతో ముఖాముఖీలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో రైతులతో భట్టి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాల వీరభద్రం, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశమంతా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. రైతాంగ సమస్యలు వదిలిస్తే.. దేశవ్యయసాయ రంగం అగమ్యగోచరంలా తయారవుతందన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే గమినించి ఉత్తర భారత రైతులు వారి ప్రాణాలు ఫణంగా పెట్టి.. 55 మంది చనిపోయినా.. పోరాటం చేస్తున్నారని భట్టి వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలు దేశానికి అత్యంత ప్రమాదకరమని భట్టి రైతులకు చెప్పారు. దేశాన్ని కాపాడేది జవాన్.. దేశ ప్రజలకు అన్నం పెట్టేది కిసాన్.. అని కాంగ్రెస్ పార్టీ.. ఈ ఒక్క నినాదంతోనే తమ విధానం స్పష్టం చేసిందని అన్నారు. మోదీ విధానాలతో రైతుల పరిస్థితి, భవిష్యత్ ఆందోళణకరంగా మారుతుందని అన్నారు. దేశంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారేనని.. వారు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటే.. ఎక్కడ అమ్ము కుంటారని భట్టి ప్రశ్నించారు. ఇక్కడ స్థానికంగా పండించే మిర్చి, పత్తి, పసుపు పంటను మండల కేంద్రానికి తీసుకెళ్లి అమ్ముకవడానికి ఇబ్బందులు పడుతుచాన్న సమయంలో.. కల్లాల్లోనే అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏ మహారాష్ట్రకో, గుజరాత్ కో పంటను తీసుకెళ్లి రైతు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఏ నినాదం వెనుక.. ఎవరి ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతిని కాస్త లోతుగా ఆలోచిస్తే.. ఈ చట్టాలు రైతుల కోసం కాదు.. కేవలం బహుళజాతి సంస్థల కోసమో అన్న వాస్తవం తెలుస్తుందన్నారు. దేశ వ్యవసాయ రంగం మొత్తం కార్పరేట్ ల చేతుల్లో పెట్టడం కోసమే ఈ చట్టాలు తీసుకువచ్చారన్నది స్పష్టమైన అంశమని చెప్పారు. ఇది నిజంగా రైతుల కోసమే తెచ్చిన చట్టాలు అయితే.. వారు వద్దని ఢిల్లీ సరిహద్దులో ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేస్తుంటే.. వెంటనే వాటిని వెనక్కు తీసుకునేవారినన్నారు. కాంట్రాక్టు ఫార్మింగ్ తో భూములను, పంటలను కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. అంబానీ, అదానీ వంటి వారితో సామాన్య రైతులు పోరాటం చేయలేరని... అన్నారు. ఆహర ధాన్యాలు అందరికీ అందుబాటులో ఉంచాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎసెన్షియల్ కమెడిటీస్ చట్టం తీసుకువచ్చిందని.. దానివల్ల ధరల నియంత్రణ ఉంటుందని అన్నారు. కానీ దానిని ఎత్తేయడం వల్ల ఎవరైనీ ఎంతైన ఆహార పదార్థాలను, పంటలను గోడౌన్ల్లో దాచేస్తే.. అవి అందక.. ధరలు ఆకాశంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల ఇటు వినియోగదారుడు.. అటు.. రైతులు తీవ్రంగా నష్టపోతారని భట్టి ప్రజలకు వివరించారు. ఇప్పటికే దేశవ్యాప్తగా అనే ఎఫ్.సీ.ఐ గోడౌన్లను అదానీ సంస్థకు కేంద్రం లీజుకు ఇచ్చిందని చెప్పారు. ఈ మూడు చట్టాలవల్ల దేశ రైతులకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దేశ స్వాతంతరం వచ్చిన తరువాత గణతంత్ర దినోత్సవం నాడు.. కేవలం సైనికుల కవాతు మాత్రమే ఉండేది.. కానీ మొదటిసారు.. రైతులు బటయకు వచ్చి కవాతు చేశారుని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా రైతులంతా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి ఇది దుస్తితి.. మనమం విక్రమార్క చెప్పారు. అప్పుడే పాలకులు దిగివస్తారని చెప్పారు. మోడీ, కేసఆర్ లు కేవలం బహుళజాతి సంస్థల కోసం మాత్రమే పని చేస్తున్నారు.. బీజేపీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు.. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన.. వారికి లేదని చెప్పారు. మోడీ, కేసీఆర్ లకు ప్రజల సంక్షేమం అవసరం లేదని.. కేవలం కార్పొరేట్ల కోసమో పనిచేస్తున్నారని ఆగ్రహంగా చెప్పారు. వారిద్దరికీ అధికారం తప్ప మరేమీ అవసరం లేదని చెప్పారు. అదే సమయంలో ఈ మధ్య మద్దతు ధర ఉన్న సమయంలో.. మొక్కలు క్వింటాలకు రూ.1800 ధర పలికింది.. అదే మద్దతు ధర లేకపోతే.. వెంటనే రూ.900 కి పడిపోయింది. దీంతో రైతులకు క్వింటాలుకు రూ. 1000 నష్టపోయిన పరిస్థితి అని చెప్పారు. మద్దతు ధర లేకపోతే ఒక్క పంటకే ఇలా ఉంటే.. మొత్తంగా అసలు మద్దతు ధర లేకపోతే.. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకే అందడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు. ఢిలీ సరిహద్దుల్లో 85 రోజలుగా జరగుతున్న రైతు ఉద్యమం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో కార్పొరేట్ చేసేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. మార్కెట్ యార్డులను ఎత్తేసేలా కుట్రలు చేస్తున్నారు. దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.. వారికి మద్దతు ధర లేకపోతే.. ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిట్టుబాటు, మద్దతు ధర కల్పించింది. - దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంథని ఢిల్లీలో రైతులు మూడు నెలల నుంచి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 53 మంది చనిపోయినా.. రైతులు పోరాటం ఆపడం లేదు. రైతులకు కనీస మద్దతు ధర లేకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోతారు. కేసీఆర్ కూడా మోదట చట్టాలను వ్యతిరేకించినా.. తరువాత యూటర్న్ తీసుకున్నాడు. ఈ బిల్లు వల్ల కార్పొరేట్లకు తప్ప.. రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. - వి.హనుమంతరావు, మాజీ ఎంపీ భట్టి విక్రమార్క మల్లు నేత్రుత్వంలో చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలపై సీఎల్పీ బ్రుందం చేస్తున్న పోరాటం చాలా గొప్పది. ఈ పోరాటంలో భట్టి గారికి మేము అండగా ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయి. కేసీఆర్.. చెప్పేవన్నీ అబద్దాలే. పేదలకు సేవచేసింది కాంగ్రెస్ మాత్రమే. మాట తప్పిన వాళ్లను ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు. సంభాని చంద్రశేఖర్, మాజీ మంత్రి -
సీఎం కేసీఆర్‌కు భట్టి విక్రమార్క సవాల్
సాక్షి, సూర్యాపేట : కాళేశ్వరం నీళ్లు, తెచ్చిన అప్పులపై రాష్ట్రంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా శనివారం సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఇక్కడ జరుగుతున్నది రాజకీయ సమాశం కాదు.. ఎన్నికల సమావేశం అంతకన్నాకాదని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలు అమల్లోకి వస్తే.. కోట్లాది రైతాంగ సోదరులు జీవితాలు దుర్భరంగా మారతాయని భట్టి చెప్పారు. ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. రైతాంగ సోదరులు పడుతున్న బాధను శాసనసభలో మీ గొంతుగా వినిపంచాలనే రైతులతో ముఖాముఖీగా మాట్లాడుందుకు ఇక్కడకు వచ్చానని భట్టి చెప్నారు. రైతులతో ముఖాముఖీ అనేది విమర్శలు చేసే వేదికకాదు.. కేవలం వాస్తవాలు, రైతుల కష్టాలు చర్చించుకునే సమావేశం మాత్రమేనని భట్టి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడుతూ.. పొలం బ్రహ్మండంగా ఉంది.. రైతులు బాగున్నారు అంటున్నారు.. నిజంగా పొలం బాగుంటే చందుపట్ల గ్రామంలో ఎండిపోయిన వరిపంటను చూపిస్తూ.. రైతు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏమోచ్చిందని భట్టి ఆగ్రహంగా అన్నారు. ఈ ప్రాంతానికి రాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రమ ఫలితమే.. ఎస్సారెస్పా కాలువ వచ్చిందని చెప్పారు. గాలివాటపు గెలుపుతో వచ్చిన మంత్రి పదవితో స్థానికమంత్రి జగదీశ్వర్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని భట్టి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి చెబుతున్నట్లు ఇవి కాళేశ్వరం నీళ్లు కావు.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిన శ్రీరాంసాగర్ ఎస్సారెస్పీ.. డిండీ ప్రాజెక్టుల వల్ల వచ్చిన నీళ్లని భట్టి ప్రజలకు వివరించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడకు తీసుకువచ్చిన నీటి చుక్కకూడా లేదని.. లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధమని భట్టి తీవ్రస్థాయిలో చెప్పారు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చిన నీళ్లను.. కాళేశ్వరం నీళ్లని ప్రజలకు, రైతులకు అబద్దాలు చెబుతారా? అని భట్టి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎస్సారెస్పీ ఫేజ్ 2 కాలువ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలని భట్టి వివరించారు. ఇక్కడకు వచ్చే నీళ్లు.. మొదట శ్రీరామ్ సాగర్/కడెం ప్రాజెక్టుల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి... అక్కడనుంచి మిడ్ మానేరుకు అక్కడనుంచి లోయర్ మానేరుకు.. చివరగా ఇక్కడకు నీళ్లు పారుతున్నాయని భట్టి చెప్పారు. ఈ ఏడేళ్లుగా కేసీఆర్ కొత్తగా కట్టిన ఒక్క ప్రాజెక్ట కూడా లేదన్నారు. రాత్రిపూటో.. పగలో మత్తులో మాట్లాడే మాటలు ప్రజలు నమ్మరని భట్టి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా.. కాళేశ్వరం లెక్కలు.. అప్పులు.. పారిన నీళ్లపై రాష్ట్రంలో మీరు ఎక్కడ చర్చకు పెట్టినా నేను సిద్ధమే వచ్చి వివరిస్తా.. అని భట్టి ఛాలెంజ్ చేశారు. స్థానిక మంత్రి నోరుతెరిస్తే.. చెప్పేవన్నీ అబద్దాలని భట్టి అన్నారు. మంత్రి.. ముఖ్యమంత్రి కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో కొత్తగా ఒక్క విద్యుత్ ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?? అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. 2015లో మొదలు పెట్టిన భద్రాద్రి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. అందులోనూ.. ఈ ప్రాజెక్టులో వాడుతున్న సబ్ క్రిటికల్ టెక్నాలజిని 2018లో నాటి ప్రభుత్వం మూసేసిందని చెప్పారు. ఇందులోనూ దాదాపు రూ. 10 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడుతోందని అన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీపైనా.. రూ. 10 కోట్ల అవినీతినైనా.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? నేను లెక్కలతో సహా వివరిస్తా.. అని భట్టి చెప్పారు. ఈ అవినీతి సొమ్ములు నీకు (మంత్రి జగదీష్ రెడ్డి) చెందుతున్నాయా..? మీ ముఖ్యమంత్రికి చెందుతున్నాయా? అని భట్టి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, ప్రజలను ప్రయివేటు బ్యాంకులకు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు.. రూ. 3 లక్షల కోట్ల అప్పలు తెచ్చారని అన్నారు. ఆ అప్పులు కట్టలేక.. పేదవాళ్లు తాగే మద్యం, డీజిల్ పై పన్నులు పెంచుతున్నారని అన్నారు. కేసీఆర్ తెచ్చిన అప్పులు కట్టాల్సింది పేద ప్రజలే అని భట్టి చెప్పారు. ఈ ఏడాది మద్యం మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 30 వేల కోట్ల రూపాయాలు పన్నుల రూపంలో వసూలు చేసిందన్నారు. ఇదిలావుండగా.. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు వెనక్కు తీసుకోవాలని... ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు ఉండాలని భట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మల్లుతో పాటు.. మాజీ ఎంపీ మధు మాష్కీ గౌడ్, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఎన్.ఎస్.యూ.ఐ అద్యక్షుడు బల్మూరి వెంకట్ స్థానిక నేతలు పాల్గొన్నారు. మధుమాష్కీ గౌడ్ పవర్ లేని పవర్ మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయమంటే ప్రజలనే కుటుంబ సభ్యులుగా చూసుకోవాలి. నమ్మకంతో ఇటు టీఆర్ఎస్ ను, అటు బీజేపీని అధికారం ఇస్తే.. ప్రజలను నట్టేట ముంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మేల్యలు దోపిడీ దారులుగా మారుతున్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి మరోరెండు సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తోంది. రైతులకు వ్యతిరేకంగా న్రవర్తించిన ఏ ఒక్కరిని వదిలి పెట్టం. వీ. హనుమంత రావు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. అప్పులు తెచ్చి రైతులు సన్నబియ్యం వేసి.. నష్టపోతున్నారు. -
నల్లచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయండి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేయబోమని రాష్ట్ర అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘వ్యవసాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోని అంశం. కేంద్రం తెచ్చిన చట్టాలను అమలు చేయాలా వద్దా అన్నది రాష్ట్రాల ఇష్టం. నరేంద్రమోదీ ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలు నిర్బంధ చట్టాలు కావు. అయినా మోదీకి అమ్ముడుపోయిన కేసీఆర్ ఈ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి అమలైతే రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. పంటకు గిట్టుబాటు ధర ఉండదు. కంపెనీలు రైతులను మోసం చేస్తే కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే ఈ చట్టాలను వెంటనే వెనక్కి పంపాలి’అని రేవంత్ అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కౌశిక్చరణ్ యాదవ్‌లతో కలసి ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు రైతు ఉద్యమానికి సంఘీభావంగా పదిరోజులపాటు ప్రజల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అచ్చంపేటలో నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో అక్కడి రైతులు, కాంగ్రెస్ నేతల డిమాండ్ మేరకు పాదయాత్రగా మారిందని రేవంత్ చెప్పారు. కేంద్రం దుర్మార్గపు చర్యలను అడ్డుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మోదీకి తలూపుతున్నారని, ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్‌కు రైతుల పక్షాన నిలిచే పెద్ద మనసు ఎందుకు రావడంలేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎకరాకు 25 లక్షలు ఇస్తే గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఉన్న వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ను ఫార్మా రైతులకు ఇస్తారా అని ప్రశ్నిం చారు. భవిష్యత్తులో నిరుద్యోగ, రైతాంగ అంశాలే ఎజెండాగా, జై కిసాన్, జై జవాన్ నినాదంతో ముందుకెళ్తామని రేవంత్ చెప్పారు. కాగా, 10 రోజులుగా రైతాంగ సమస్యలపై పాదయాత్ర నిర్వహించిన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కేడర్ అక్కున చేర్చుకుందని, ఆయన్ను తమ నాయకుడిగా గుర్తించిందని మాజీ ఎంపీ మల్లు రవి చెప్పారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా తమ జిల్లాల్లో పాదయాత్ర చేయాలని రేవంత్‌ను కోరుతున్నారని, దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలి: భట్టి విక్రమార్క ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఉద్యమించాలని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క రైతులకు పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన పోరుబాట–పల్లెబాట యాత్ర బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లానుంచి నల్లగొండ జిల్లా డిండి మండలం తవక్లాపూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలో రైతులతో ముఖా ముఖి నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు పలుకుతూ.. సీసీఐ కేం ద్రాలను ఎత్తివేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజల సాగు, తాగునీటి సమ స్య పరిష్కారానికి చేపట్టిన డిండి ఎత్తిపోతల పథ కం పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తానన్న సీఎం మాట ఏమైందని ప్రశ్నించారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ అమలుకు వీలుకాని హామీలిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హన్మంతరావు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్ పాల్గొన్నారు. -
దూకుడు పెంచిన టీకాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో నయా జోష్ వచ్చింది. యాత్రలజోరు పెరిగింది. ముఖ్యనాయకులు ‘నడక మంచిదే’అంటున్నారు. నల్ల వ్యవసాయచట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతుయాత్రలు చేపట్టిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇకముందు కూడా ఇదే దూకుడును కొనసాగించాలని యోచిస్తోంది. ఈ యాత్రల ద్వారా పార్టీ కేడర్‌లో కదలిక వస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టగలుగుతున్నామని భావిస్తున్న టీపీసీసీ నాయకత్వం 2023 ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించేపనిలో పడింది. రైతులు, నిరుద్యోగుల సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లాలని, జై జవాన్, జై కిసాన్ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా రాష్ట్రవ్యాప్త యాత్రలకు శ్రీకారం చుట్టేందుకు టీపీసీసీ ముఖ్యులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రెండు యాత్రలు... రెండు రూట్లు రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఇద్దరు ముఖ్యనేతలు ఈ నెలలో యాత్రలు చేపట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఈ నెల 7న అనూహ్యంగా అచ్చంపేట దీక్షా శిబిరం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించి 10 రోజులపాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో పార్టీ శ్రేణులను ఆయన కదిలించగలిగారు. రోజుకు నాలుగైదు గ్రామాల చొప్పున 40 గ్రామాల్లో ఆయన పర్యటించారు. పాదయాత్ర ముగింపు సమయంలో రావిరాలలో భారీ జనసమీకరణతో బహిరంగసభ నిర్వహించి ఒక్కసారిగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడతానని ప్రకటించారు. మరోవైపు భట్టి విక్రమార్క కూడా ఈ నెల 9వ తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లాతో యాత్ర చేపట్టారు. అక్కడి నుంచి రోజూ ఆయన కూడా నాలుగైదు గ్రామాల్లో తిరుగుతూ రైతులతో మమేకం అవుతున్నారు. వీలున్నచోటల్లా సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈ నెల 22 వరకు తన యాత్రను కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు యాత్రలు పార్టీకి ఉపయోగకరంగానే ఉన్నాయనే భావన టీపీసీసీ ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. ఈ యాత్రల గురించి టీపీసీసీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ ఇన్నాళ్లూ ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేయలేకపోయామని, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభమైనందున, దీన్ని కొనసాగించి ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటేనే పార్టీకి మేలు కలుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్‌కు త్వరలోనే పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమకారులతో వరుస సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఇప్పటికే కొందరిని కలిశారని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని అంటున్నారు. మొత్తంమీద వరుస ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర స్థాయి యాత్రలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. -
నిధులు దోపిడీ చేస్తున్న కేసీఆర్: భట్టి
సాక్షి, నిజామాబాద్ : కొన్నిలక్షల ఎకరాలకు నీళ్లు పారేలా.. ఈ ప్రాంతానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అందించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖాముఖీలో భాగంగా ఆయన ఆదివారం శ్రీరామ్ ప్రాజెక్టును సందర్శించారు. ఆయనతోపాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ప్రాజెక్టును అందించిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రుణపడి ఉండాలని అన్నారు. నేడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, జీవన స్థితిగతులు పెరిగిన అందుకు ఆధునిక దేవాలయాలైన ఇలాంటి ప్రాజెక్టులు కారణం అని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులు పెరు చెప్పి, వాటికి కాస్త సున్నం వేసి.. వాటికి వారి పేర్లు పెట్టుకునే సంస్కృతికి టీఆర్ఎస్ నాయకులు దిగజారారని భట్టి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాజెక్టును కేసీఆర్ తన ధనదాహంతో రీ డిజైన్ పేరుతో మార్చారని మండి పడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి 7 జిల్లాలకు మంచి నీరు, పరిశ్రమలకు నీటి సదుపాయంతో సహా 16 లక్షల ఎకరాలకు నీరు అందేదని భట్టి వివరించారు. కేసీఆర్ కేవలం ధనదాహంతో నీళ్లు తెలంగాణలో పారకుండా రీ డిజైన్ పేరుతో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ప్రాజెక్టు అంచనాలను విపరీరంగా పెంచి రూ. లక్ష 15 వేల కోట్లకు పెంచారని చెప్పారు. కేసీఆర్ అత్యాశ వల్ల తెలంగాణ నష్టపోతోందని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వద్ద పసుపు కుంకుమ జల్లి.. మా వల్లే ఈ నీళ్లు పారుతున్నాయని చెప్పుకోవడం.. అత్యంత బాధాకరమని భట్టి చెప్పారు. రాష్ట్ర నిధులు.. నీళ్లు దోపిడీకి గురి అవుతున్నాయని భట్టి విక్రమార్క మీడియాతో అన్నారు. -
'రైతుల పోరాటం.. కేసీఆర్ యూటర్న్'
ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మద్దతు ధరపై యూటర్న్ తీసుకున్నారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కుర్చీని ఎడమ కాలి చెప్పుతో పోల్చి అగౌరవ పరిచిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు తెగించి రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని, ఈ చట్టాలు అమలైతే రైతులు బానిసలవుతారని భట్టి పేర్కొన్నారు. అన్నం పెడుతున్న రైతుల కడుపు కొట్టవద్దని విఙ్ఞప్తి చేశారు. ఐకేపి సెంటర్ల ద్వారా రైతుల పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్‌దేనని చెప్పారు. రానున్న రోజుల్లో మద్దతు ధర కోసం పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని చెప్పారు. పసల్ బీమా యోజన రాష్ట్ర వాటా చెల్లించడం లేదని, వాటా కట్టనందున 960 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని తెలిపారు. -
టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకు రాష్ట్ర పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఉత్తమ్ నివాసానికి వెళ్లి తేనీటి విందు అందుకున్నారు. అనంతరం గాంధీభవన్‌కు చేరుకున్నారు. తొలుత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాణిక్యం.. తర్వాత కోర్‌కమిటీ సభ్యులతో కలసి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక గురించి అభిప్రాయ సేకరణ చేశారు. – సాక్షి, హైదరాబాద్ 30 నిమిషాలు.. సింగిల్ ఎజెండా టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశం 30 నిమిషాల పాటు ఒకే ఎజెండాతో సాగింది. అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందో చెప్పాలని కోర్‌కమిటీని కోరారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, చిన్నారెడ్డి, కోర్‌కమిటీ సభ్యులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, వీహెచ్‌లు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ఒక్కో నేత నుంచి వ్యక్తిగతంగా టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఠాగూర్ అభిప్రాయాలను సేకరించారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ విడివిడిగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి మాణిక్యం ఠాగూర్ అభిప్రాయాలు తీసుకునే సందర్భంలో అందరు నేతలూ పార్టీ భవిష్యత్ సంక్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన పార్టీ నేతల్లో ఒకరిద్దరు మినహా ఎవరూ మీడియాకు తాము చెప్పిన విషయాలను వెల్లడించడలేదు. కోర్‌కమిటీ సమావేశం ముగించుకుని వచ్చిన ఉత్తమ్‌ను మీడియా ప్రశ్నించగా, సోనియాగాంధీ నిర్ణయమే తన నిర్ణయమని చెప్పినట్లు వివరించా రు. జానారెడ్డిని అడగ్గా తన అభిప్రాయాన్ని పార్టీకి చెప్పానని, పార్టీ అంతర్గత వ్యవహారాలు వెల్లడించలేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా అదేతరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చగా, మాజీ ఎంపీ వీహెచ్ మాత్రం బీసీలకు ఈసారి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పినట్లు వెల్లడించారు. ఎప్పుడు బీసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారో నోట్ రూపంలో ఇన్చార్జికి అందజేసినట్టు ఆయన తెలిపారు. పొన్నాల, పొన్నం, సంపత్, కోమటిరెడ్డి.. అందరూ తమ నిర్ణయం పారీ్టకి చెప్పామని దాటవేశారు. నేనెందుకు పార్టీ మారతా: జానారెడ్డి ఈ సందర్భంగా జానారెడ్డి పార్టీ మార్పు అంశాన్ని మీడియా ప్రస్తావించింది. దీనిపై మాట్లాడుతూ తాను పార్టీ మారుతానన్న దాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన పార్టీ మార్పు గురించి ప్రచారం చేస్తున్న మీడియా ఇందుకు సంజాయిషీ చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం అభ్యర్ధనని, తాను పార్టీ ఎందుకు మారతానని కుండబద్దలు కొట్టారు. కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అన్నీ అధిగమించి అధికారంలోకి వస్తాం: మాణిక్యం ఠాగూర్ కోర్‌కమిటీ సమావేశానికి ముందు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలసి మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్ష హోదాలో ఉత్తమ్ సమర్థంగా పనిచేశారని కితాబిచ్చారు. ఎలాంటి సందర్భంలోనూ ఆయన సహనం కోల్పోకుండా వ్యవహరించారని, కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకు ఉత్తమ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు. కాంగ్రెస్ టీం ఇండియా లాంటిదని, మొదట్లో ఓడినా తర్వాత గెలుస్తుందని, అన్ని సమస్యలను అధిగమించి 2023లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై గురు, శుక్ర వారాల్లో రాష్ట్ర పార్టీకి చెందిన 100–150 మంది నేతల అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారు. ఈ అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్టానానికి ఇస్తానని, కొత్త అధ్యక్షుడిని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమిస్తారని మాణిక్యం స్పష్టం చేశారు. కాగా, గురు, శుక్రవారాల్లో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, ఏఐసీసీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో మాణిక్యం విడివిడిగా సమావేశమవుతారని గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
విశ్వనగరమా.. వెనిస్ నగరమా..?
సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ మహానగరం వెనిస్ నగరంలా తయారైందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానంటే.. తన కుమారుడు మంత్రి కేటీఆర్ విశ్వనగరంగా మార్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిప్డడారు. ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పూర్తిగా వైఫల్యం చెందాయని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 72 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం పలు సందర్భాల్లో చెప్పారని, ఆ డబ్బంతా ఎక్కడ పోయిందని నిలదీశారు. టీఆర్ఎస్ పాలన నుంచి నగరాన్ని కాపాడుకోవాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని భట్టి పిలుపునిచ్చారు. శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. (హైదరా‘బాధలకు’ బాధ్యులెవరు?) పాలమూరు ఎత్తిపోతల పంపులు అండర్ గ్రౌండ్లో వద్దని నిపుణుల కమిటీ వద్దని చెప్పిన ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో తమ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ వినిపించుకోలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ వ్యవస్థ నిర్విర్యం అయ్యిందని, ఏడేళ్ల కింద రిటైర్డ్ అయిన వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈఎన్సీ మురళీధర్ రావు వల్ల ఇరిగేషన్ భ్రష్టు పట్టిందన్నారు. మురళీధర్ రావుపై సీబీఐ చేత విచారణ జరిపితే బాగోతం బయటపడుతుందని డిమాండ్ చేశారు. కల్వకుర్తి పంపులను చూడనీయకుండా తమను ఎందుకు ఆపుతున్నారని, తాము ఖచ్చితంగా వెళ్లితీరుతామని విక్రమార్క స్పష్టం చేశారు. నీటమునిగిన పంపుహౌజ్.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టు ఎల్లూరు వద్ద పంపుహౌజ్ నీట మునిగింది. అయిదు మోటార్లు నీట మునగటంతో భారీ నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతిక కారణాలతో వాటర్ లీకవ్వటంతో మోటార్లు మునిగాయని అధికారులు చెబుతున్నారు .ప్రతిపక్షాలు మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టాన్నెల్ వద్ద జరుపుతున్న బ్లాస్టింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్ల నీటమునిగిన వ్యవహారం వివాదాస్పదమవుతుంది. సంఘటన స్ధలానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షపార్టీల నేతలకు పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. -
రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దుబ్బాక ఎన్నికకు సంబంధించి మంగళవారం వీడియో కాన్ఫరరెన్స్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..' దుబ్బాక అభ్యర్థి పేరు హైకమాండ్ పరిశీలనలో ఉంది.. అభ్యర్థి పేరు రేపు ప్రకటిస్తాం. యావత్ కాంగ్రెస్ కుటుంబ ఎన్నికగా దుబ్బాక ఎన్నికను నేతలు సహకరించాలి.7 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి చోటుచేసుకుంది.సీఎం నుంచి వీఆర్వో వరకు ప్రతీ ఒక్కరూ దోచుకుంటున్నారు.కేసీఆర్ సీఎం అయ్యాక.. తెలంగాణను భ్రష్టు పట్టించాడు. ఎవరూ డబ్బు పంపిణీ చేసిన.. ఓట్లు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలి. (చదవండి : సోలీపేట సుజాతను గెలిపిద్దాం : హరీష్ రావు) తెలంగాణ అమరవీరులకు న్యాయం చేశాడా.. అన్యాయం చేశాడా అనేది ఈ ఎన్నికతో తేలిపోవాలి. దుబ్బాక ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే ఏ చేసేందుకైన సిద్ధం గా ఉన్నాం. రేపటి నుంచి నేను దుబ్బాక లో ఉంటా. గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించండి. ఎల్ఆర్ఎస్ స్కీం ద్వారా ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాట ఇస్తున్న.. దయచేసి పైసలు కట్టొద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫ్రీగా చేస్తాం.'అని పేర్కొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..' దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం నేతలందరూ కృషి చేయాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కీలకం. నేతలందరూ ఓటు నమోదును సీరియస్‌గా తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం డబ్బులు కొల్లగొట్టాలని చూస్తోంది.డబ్బులు చెల్లించవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలి. రెండున్నర ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తాం.' అంటూ తెలిపారు. (చదవండి : దుబ్బాక ఉప ఎన్నికలు: కోవిడ్ నిబంధనలు) ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. దౌల్తాబాద్ మండలంలో 8వ తేదీన ఘనంగా మీటింగ్ నిర్వహించనున్నాం. బేషజాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని నా విజ్ఞప్తి. 2023 ఎన్నికలకు దుబ్బాక ఎన్నిక నాంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి నాయకత్వం ఉంది. దుబ్బాకలో వచ్చే 15 రోజులు కష్టపడితే విజయం తధ్యం.నాకు కేటాయించిన ప్రాంతాల్లో ఇతర పార్టీల కంటే 5వందలు లేదా 1000 ఓట్లు అధికంగా తెచ్చే ప్రయత్నం చేస్తా. ' అంటూ వెల్లడించారు. -
భట్టి ఇంటికి తలసాని
-
అనూహ్య ఘటన.. భట్టి ఇంటికి తలసాని
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గురువారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లుభట్టి విక్రమార్క విసిరిన సవాలును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. మహానగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరిపితే తమనకు చూపించాలని భట్టి డిమాండ్ చేయగా.. దానికి తలసాని అంగీకరించారు. దీంతో గురువారం ఉదయం మంత్రి తలసాని అధికారులతో నేరుగా భట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు. తమ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను చూపిస్తామని తమతో రావాలని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించిన భట్టి, తలసానితో కలిసి ఒకే కారులో బయలుదేరారు. అయితే తొలుత మంత్రిని చూసి షాక్ అయిన భట్టి.. తలసానిని సాదరంగా లోపలకి ఆహ్వానించారు. ఇద్దరు కలిసి కాసేపు సరదాగా చర్చించుకుని అనంతరం బయలుదేరి వెళ్లారు. అధికారులతో కలిసి ఇద్దరూ డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించనున్నారు. (మేం గొప్పలు చెప్పం.. చేసి చూపిస్తాం) అసలు ఏం జరిగింది.. రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడేందుకు కొద్దినిమిషాల ముందు కాంగ్రెస్ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ల మధ్య వాడీవేడీ వాగ్వాదం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నేతలకు భట్టి కౌంటర్ చేయడం, దాన్ని తప్పుపడుతూ మంత్రులు వ్యాఖ్యలు చేయడంతో కొద్దిసేపు సభ వేడేక్కింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని భట్టి చెబితే..తెలంగాణ మాటెత్తే అర్హత లేదని మంత్రులు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడటంతో కొద్దిసేపు సభ వాడివేడిగా సాగింది. షురూ అయిందిలా... గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృధ్ధి పనులు, మౌలిక వసతులపై బుధవారం సభలో చర్చ సందర్భంగా హైదరాబాద్ అభివృధ్ధి అంతా తమ చలవేనని, టీఆర్ఎస్ చేసిందేమీ లేదంటూ, రాష్ట్రాన్ని దివాళా తీయించారంటూ భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ సభ చివరలో ప్రస్తావించారు. రాష్ట్రం ఏమీ దివాళా తీయలేదని, కాంగ్రెస్ పార్టీనే దివాళా తీసిందని, త్వరలోనే గాంధీభవన్‌కు టులెట్ బోర్డు పెట్టాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగం పెరిగిందని, వారి హయాంలో మాదిరి ప్రస్తుత ప్రభుత్వంలో ధర్నాలు, ఖాళీ కుండల ప్రదర్శనలు లేవని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన భట్టి, ‘కాంగ్రెస్ హయాంలో ధర్నాలున్నాయి కాబట్టే ప్రజాస్వామ్యయుతంగా సమస్యలకు పరిష్కారం దొరికింది. కానీ ఇప్పుడు ధర్నాలు ఎక్కడ చేయనిస్తున్నారు. పోలీసు కట్టడితో ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయిస్తున్నారు. పోలీసులు లేకుండా వందల సంఖ్యలో అసెంబ్లీ ముందు ధర్నాలుండేవి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ధర్నా చౌక్ ఎత్తేశారు’ అని పేర్కొన్నారు. దీనికి అధికార సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్ సైతం దీనికి అభ్యంతరం చెప్పారు. అయిన తన ప్రసంగాన్ని కొనసాగించిన భట్టి, ‘గాంధీభవన్ గూర్చి చులకనగా మాట్లాడుతున్నారు. గాంధీభవనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. గాంధీభవన్ ఉంది కావునే అసెంబ్లీలో నేను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడే బిల్లు పెట్టిచ్చాం’అన్నారు. దీనిపై కల్పించుకున్న సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ‘తెలంగాణఫై భట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అభివృధ్ధి చేసుకున్నాక తెలంగాణ తీసుకుందామన్న వ్యక్తి మీరు’ అంటూ విరుచుకుపడ్డారు. అనంతరం మళ్లీ మట్లాడిన భట్టి, కేటీఆర్ తన ప్రసంగంలో లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారని, ఎన్నికలప్పుడే ఇళ్లు గుర్తొస్తాయంటూ చురకలంటించారు. అసలు లక్ష ఇళ్లు ఎక్కడున్నాయో చూపించాలన్నారు. ఈ సమయంలో భట్టి మైక్‌ను స్పీకర్ కట్ చేయడంతో కాంగ్రెస్ సభ్యులు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు పోడియం ముందుకు పోయారు. ఈ సమయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ కల్పించుకుంటూ ‘రేపు ఉదయం మీ ఇంటికి వస్తా. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించారో స్వయంగా చూపిస్తా’ అన్ని గట్టిగా అన్నారు. అనంతరం కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో స్పీకర్ తిరిగి భట్టికి అవకాశమిచ్చారు. మళ్లీ భట్టి మాట్లాడుతూ, ‘టైం చెబితే ఇంటికి వస్తా..లక్ష ఇళ్లు ఎక్కడ ఇచ్చారో, కట్టారో చూయించాలి’ అని కౌంటర్ ఇచ్చారు. అనంతరం చివరలో మళ్లీ మాట్లాడిన మంత్రి కేటీఆర్, భట్టి విమర్శలను దీవెనలుగా తీసుకుంటానని, ఆయన తనకు మంచి మిత్రుడేనని నవ్వుతూ అనడంతో అంతా శాంతించారు. -
దగా చేస్తున్న కేసీఆర్: భట్టివిక్రమార్క
సాక్షి, జనగామ: తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ దగా, మోసం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్ర ఆసుపత్రిని గురువారం ఆయన సీఎల్సీ బృందంతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదికి లక్షా 80 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను పేదలకు కేటాయించామనే చెప్పే కేసీఆర్ వారికి పనికి వచ్చే ఆసుపత్రులకు ఎంత కేటాయించారని ప్రశ్నించారు. ఈ ఆరున్నర ఏళ్లలో కొత్తగా ఒక్క ఆసుపత్రి అయినా కేసీఆర్ ప్రభుత్వం కట్టిందా అని ధ్వజమెత్తారు. పేదలకు ఉపయోగపడే ఇటువంటి ఆసుపత్రుల్లో డాక్టర్లు లేకపోవడం.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇన్నిన్ని ఖాళీలు ఉంటే ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కేసీఆర్ దగా చేస్తున్నారని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కేంద్ర ఆసుపత్రిని నాలుగేండ్ల కింద ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటి వరకూ జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఉండాల్సిన ఏ వసతులు లేవని ఆరోపించారు. ఇది జిల్లా కేంద్ర ఆసుపత్రి అనే ఆ విషయాన్నే కేసీఆర్ మరిచిపోయారా? అసలు ఈ ప్రభుత్వానికి గుర్తుందా అని మండిపడ్డారు. జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 2200 కరోనా కేసులు వస్తే.. అందులో 1900 రోగులను హోమ్ క్వారంటైన్‌కు పంపారన్నారు. అసలు బుద్ధి ఉన్నవారేవరైన అలా పంపుతారా అని భట్టి విక్రమార్క విమర్శించారు. ఇక్కడ డాక్టర్లు లేరు.. ఉన్న ఒకరో, ఇద్దరి మీదో మోయలేని భారం పడుతోందని చెప్పారు. ఈ కరోనా మరణాలకు సీఎం కేసీఆర్‌యే బాధ్యత వహించాలన్నారు. కరోనా రాష్ట్రంలోకి రానేరాదు.. వైరస్ పేలిపోతుంది.. అని జోకర్లా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని విమర్శించారు. జనగామ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్టులు 14 మంది ఉండాల్సి ఉండగా 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. డిప్యూటీ సివిల్ సర్జన్స్ పోస్టులు 10 ఉంటే 9 ఖాళీలు ఉండగా.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 7 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. డెంటల్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2, ఫార్మసీస్ట్ పోస్తులు 4 ఉంటే మూడు ఖాళీగా ఉన్నాయన్నారు. మొత్తంగా జనగామ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 32 ఖాళీలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘ఉద్యమంతా ఉద్యోగాల కోసమే అన్న రాజేందర్ నీ మాటలు ఎవరయ్యా నమ్మేది.. ఇతర శాఖల్లో ఖాళీల సంగతి పక్కన పెడితే ఒక్క నీ శాఖలోని వేల ఖాళీలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కటైన ఈ ఆరున్నర ఏళ్లలో భర్తీ చేశారా’ అని ప్రశ్నించారు. -
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో భట్టి పర్యటన
సాక్షి, భద్రాచలం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో సీఎం కేసీఆర్ చేతులెత్తేశారని అన్నారు. సీఎల్పీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీపీఈ కిట్లు ధరించి, కరోనా నిబంధనలు పాటిస్తూ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డును పరిశీలించి, అందిస్తున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ చావా యుగంధర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన వారు ఉంటే ఉంటారు.. పోతే పోతారు అన్న చందంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో తాము పలు సూచనలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్య పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మూడు రాష్ట్రాలకు తలమానికంగా ఉన్న భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో కనీసం 1/3 వంతు మంది సిబ్బంది కూడా లేరని అన్నారు. ఇక్కడ మొత్తం 205 మంది పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 61 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇదే ఆస్పత్రిలో పనిచేసే డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని, అలాంటి వారికే దిక్కు లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఈ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, అయినా సర్కారు పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
‘కరోనా విషయంలో కేసీఆర్ విఫలమయ్యారు’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ గురించి ఆరునెలల క్రితం గవర్నర్‌కి చెప్తే తమని సీఎం కేసీఆర్ దూషించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ‘తెలంగాణలో కరోనా కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని గవర్నర్ స్వయంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు అండగా కాంగ్రెస్ ఉందని తెలియజేయడానికి సీఎల్పీ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రుల పర్యటన చేపట్టాం. తెలంగాణలో టెస్టుల సంఖ్య పెంచకపోవడానికి కారణం ఏంటో ప్రభుత్వం చెప్పాలి? రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. హెల్త్ అండ్ మెడికల్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. మండల కేంద్రాల్లో 30 బెడ్స్, జిల్లా కేంద్రాల్లో 100 పడకల హాస్పటల్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? 2014 ఎన్నికల్లో గిరిజనులకు హెలికాప్టర్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 108 వ్యవస్థ పూర్తిగా బలహీనపడిపోయింది. కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలి. కాంట్రాక్టుర్లకు వేల కోట్లు ఇస్తున్న ప్రభుత్వం కరోనాను ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. సీఎల్పీనేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ‘ ఏజెన్సీ ఏరియాల్లో కరోనా విజృంభిస్తుందిజ వర్షాల వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం ఐసోలేషన్ సెంటర్స్ లేకపోవడం బాధాకరం. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ హాస్పటల్స్‌లో ప్రభుత్వం ధరలు ఫిక్స్ చేసి మానిటరింగ్ చెయ్యాలి. మినరల్ రిసోర్స్ నిధులు సరిగ్గా వాడుకోవడం లేదు’ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, కరోనా వ్యాధి ఏజెన్సీ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వచ్చినా వైద్యరంగంలో కొత్తగా ఎలాంటి ఏర్పాట్లు చెయ్యలేదు. చికిత్స చేయడానికి ఒక్కరిని కూడా పర్మినెంట్ ఉద్యోగులను తీసుకోలేదు. ఎమ్సీజీ జిల్లా ఆసుపత్రిలో అభివృద్ధి చేయడం ప్రభుత్వం మర్చిపోయింది. కరోనా వ్యాధి వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’ అని ఆమె తెలిపారు. చదవండి: ఈ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు -
‘కార్పొరేషన్ పేరిట ప్రభుత్వం అప్పులు చేస్తోంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్ పెట్టి భారీగా రుణాలు తీసుకుంటుందని, 200 శాతం అదనంగా లోన్లు తీసుకోవడానికి తెర లేపిందని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘రుణాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేశారు. అప్పులను చూస్తుంటే రాష్ట్రం ఏమైపోతుందా అని భయమేస్తోంది. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్లింది. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.318918 కోట్ల అప్పు చేసింది. 70 ఏళ్లలో రూ.69000 కోట్ల అప్పు ఉంటే 6 ఏళ్లలో 3 లక్షల రూపాయల కోట్లు అప్పు చేశారు. అదనంగా అప్పులు చేసేందుకు ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేశారు. ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికే 3 లక్షల కోట్లు అప్పులకు 40వేల కోట్లు వడ్డీ చెల్లిస్తుంటే.. 6 లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారు? చివరికి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. అప్పులు తీర్చడానికి మళ్లీ ప్రజలపై భారం వేయక తప్పని పరిస్థితి. దీని గురించి ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఈ సీఎం చేస్తున్న అప్పులను ఆపకపోతే బతికే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ప్రభుత్వం అప్పులు చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ తరపున ప్రజల్లో చర్చ చేస్తాం. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైద్యానికి ఖర్చు భరించలేక పేద ప్రజలు అప్పుల పాలవుతున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులను కాంగ్రెస్ తరపున విజిట్ చేస్తాం. రేపటి నుంచి భద్రాచలం నుంచి విజిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం’ అని తెలిపారు. చదవండి: ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం -
కాంగ్రెస్‌లో రచ్చ : టీ కాంగ్రెస్ దారెటు..
సాక్షి, హైదరాబాద్ : వరుస ఓటములతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల లేఖ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. నాయకత్వ మార్పు కోరుతూ పార్టీ సీనియర్లు రాసిన లేఖ పలువురు నేతల ఆగ్రహానికి దారితీస్తోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రజలకు, పార్టీకి అండగా నిలిచిన గాంధీ కుటుంబమే పార్టీ పగ్గాలు చేపట్టాలని రాష్ట్రానికి చెందిన సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం.. సీల్పీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతున్న తరుణంలో సీనియర్లు లేఖలు రాయడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వాన్ని తట్టిలేపి, ప్రజల పక్షన సోనియా, రాహుల్ పోరాడారని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీకి, సోనియా, రాహుల్ గాంధీకి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. (సీడబ్ల్యూసీ భేటీలో ప్రకంపనలు) ఇక ఇదే అంశంపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ లో పదవులు అనుభవించి ఇప్పుడు కొందరు పార్టీకి వ్యతిరేకంగా లేఖలు రాస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీ అధికార కాంక్షతో లేరు. కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం పనిచేయాలి. రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి’ అని వ్యాఖ్యానించారు. (అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా) చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ కార్యకర్త సోనియా, రాహుల్ నాయకత్వం కోరుకుంటున్నారు. బహిరంగ లేఖ రాసిన నేతల తీరును ఖండిస్తున్నాం. బహిరంగ లేఖ రాసిన నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి -
తెలంగాణ సర్కార్‌కి ఉత్తమ్ కొత్త సవాల్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముందుగానే విన్నవిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఇందిరా భవన్లో జరిగిన సిటీ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. డివిజన్ల విభజన హేతుబద్ధంగా ఉండాలన్నారు. అన్ని డివిజన్లలో ఓటర్లు సమానంగా ఉండాలని తెలిపారు. అర్హులైన ఒక శాతం మంది పేదలకు ఇళ్లు మంజూరు చేస్తే బల్దియా ఎన్నికల నుంచి కాంగ్రెస్ తప్పుకుంటుందని ఉత్తమ్ సవాల్ విసిరారు. అదే విధంగా సచివాలయంలో ఆలయం, మసీదు కూల్చివేతపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీల్లో ఆగస్టు 24వరకు పార్టీ కమిటీలు పూర్తి చేయాలని ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. అనుబంధ విభాగాల కమిటీలు కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టును అనాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకువచ్చారని గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన ఆరేళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రి కి ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించలేదని దుయ్యబాట్టారు. తాను మంత్రిగా దిగిపోయే ముందు రూ. 200 కోట్లు మంజూరు చేస్తే ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. (దుబ్బాక ఉప ఎన్నికపై టీపీసీసీ ప్రకటన) ఉస్మానియా ఆస్పత్రి విషయాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లుతామని అన్నారు. సచివాలయంలోని పవిత్రమైన దేవాలయం, మసీదు కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సచివాలయం కూల్చివేత బాధ కల్గించిందని, అమూల్యమైన తెలంగాణ ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్ అసత్యాలు, అబద్ధాలు మాట్లాడుతున్నారని, కారు స్టీరింగ్ తమ చేతుల్లో ఉందని చెప్పిన ఎంఐఎం బ్రదర్స్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మసీదు, మందిర్ కూల్చివేతపై ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. మూడు పెద్ద నగరాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి వెళతామని అన్నారు. బస్తీ దవాఖానాలు కేటీఆర్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని ఎద్దేవా చేశారు. (మంత్రులు, అధికారులు భౌతిక దూరం పాటించాలి) అదేవిధంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సచివాలయంలోని ఆలయం, మసీదు కూల్చివేత విషయాన్ని గ్రేటర్ ఎన్నికల్లో జనాల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. మందిర్, మసీదు కూల్చివేత ఎన్నికల అంశంగా కాకుండా సామాన్యుడి బతుకు దెరువుకు, భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా చూడాలన్నారు. బల్దియా ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్తి తన పరిధిలో కనీసం ఇద్దరిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సొంత నియోజకవర్గాలకు వదిలి ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని పలువురు నేతలు ఉత్తమ్‌ను కోరారు. ఈ సమావేశానికి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. -
‘అందుకే కేసీఆర్ కరోనాపై సమీక్ష పెట్టడం లేదు’
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖలో ఉన్న లోపాలు బయటకు వస్తాయనే భయంతోనే సీఎం కేసీఆర్ కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించడంలేదని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైద్యశాఖకు నిధులు విడుదల చేయండని, ప్రైవేటు హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకుంటామని చెబుతున్న మంత్రి ఈటలకు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడ టెస్ట్ కిట్స్ లేవని చెబుతున్నారు.. 1,82,000 కోట్ల రూపాయల బడ్జేట్ ఉన్న రాష్ట్రంలో వైద్యం గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మానవత్వం లేని పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కోరత కూడా తీవ్రంగా ఉందని ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రుల రేట్లను ప్రభుత్వమే ఫిక్స్ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలని, 17 మంది అధికారులను.. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా నియమించాలని భట్టి పేర్కొన్నారు. -
'ప్రజారోగ్యం గాలికొదిలేసిన దిక్కుమాలిన ప్రభుత్వం'
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పట్టణాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాలకు విస్తరించే పనిలో ఉందన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో భట్టి మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని ఇంత దారుణంగా గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదని మండిపడ్డారు. వెంటనే గ్రామాల్లో, మండల కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను కంట్రోల్ చేయడానికి కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను కాంగ్రెస్ నేతలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం వాడుకుంటుందని భట్టి విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పు వల్లే గజ్వేల్‌లో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని.. టీఆర్ఎస్ అనే ఫ్యూడల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదని.. దళిత వర్గానికి రాజ్యాంగ రక్షణ కరువయిపోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై సిరిసిల్ల దగ్గర మొదలుకొని గజ్వేల్ నుంచి రాజాపూర్ వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల పై డీజీపీ కి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన కూడా కరువయింది.. ఈ దాడుల గురించి గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా గవర్నర్‌ను నేరుగా కలవకుండా మెయిల్ ద్వారా ఫిర్యాదును పంపుతున్నట్లు తెలిపారు. -
దక్షిణాది రాష్ర్టాల నుంచి ఆ గౌరవం పీవీకే దక్కింది
సాక్షి, హైదరాబాద్ : పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు శుక్రవారం ఇందిరాభవన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీపీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య , షబ్బీర్ అలీ, కమిటీ చైర్మన్ గీతారెడ్డి, వీహెచ్ హనుమంతరావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే దేశాన్ని పాలించే స్థాయికి పీవీ ఎదిగారని కొనియాడారు. ఒక సామాన్యుడు సైతం ప్రధాని కావచ్చనే విషయాన్ని పీవీని చూసి స్ఫూర్తి పొందాలన్నారు. ఒక తెలుగువ్యక్తికి అంతటి గోప్ప స్థాయి కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి పీవీకి దక్కిన గౌరవం మరెవరికి దక్కలేదని, సోనియాగాందీ సలహామేరకు ఏఐసీసీ ఆమోదంతో పీవీ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. పీవీ ప్రధాని పదవి చేపట్టాక దేశ ఆర్థిక సంస్కరణలు పీవీకి ముందు ఆయన తర్వాత అనేలా ఉన్నాయని పేర్కొన్నారు. ('పుట్టుక నుంచి చనిపోయే వరకు పీవీ కాంగ్రెస్ వాది') 24వ శతాబ్ధంలో రాజీవ్‌గాంధీ ఆలోచనలకు రూపకల్పన చేసింది పీవీ అని వీహెచ్ హన్మంతరావు అన్నారు. సొంత గూటి నుంచే పీవీకి గట్టి పోటీ ఉండేదన్నారు. 'పీవీని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం జరిగింది. మా అధ్యక్షుడు మాటకు గౌరవం ఇచ్చి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటం లేదు. కొందరు ఆయన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎవరి వల్లా కాదు. మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. పీవీ ఆశించినట్లు బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి' అని వీహెచ్ అన్నారు. తెలుగు జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహారవు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన ఘనత భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (హ్యాపీ బర్త్‌డే తారక్: సీఎం జగన్) -
కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
-
భట్టి దయతో అక్కడ గెలిచాడు: ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తప్పించుకునే ప్రయత్నం చేశాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు ప్రభుత్వాలు అలానే చేశాయన్నారు. ఎన్నికలను తప్పించుకోవడానికి కోర్టులో కేసులు వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడ్డాయని మండిపడ్డారు. ఇక తాజగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ పార్లమెంట్‌లోని అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను ఎంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని, కాగా సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి.. కళ్లులొట్ట పోయినట్లుగా బయటపడ్డారని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డబ్బుతో, భట్టి విక్రమార్క దయతో అసెంబ్లీలో గెలిచారని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరం అయిందని, ఎన్నికలను అపహాస్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాధిస్తున్న విజయాల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఎన్నికల్లో బీజేపీ మతం తప్ప వేరే ప్రచారం చేయలేదని, ప్రజలకు సంబంధించి ఒక్క విషయం మాట్లాడలేదని పేర్కొన్నారు. అశాంతి కావాలంటే బీజేపీ.. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లామన్నారు. క్యాంప్ రాజకీయాలకు చిరునామాగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని, కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ చేసిన రాజకీయాలు దేశం అంతా చుశారని ఆయన వ్యాఖ్యానించారు. -
'వారికి ఓట్లు అడిగే అర్హత లేదు'
సాక్షి, మధిర : ప్రజా సమస్యలు పరిష్కరించని అధికార పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారాలని్నంటినీ సీఎం కేసీఆర్ కేంద్రీకృతం చేశారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అన్నింటికీ సర్వాధికారిగా ముఖ్యమంత్రే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని అధికారాలను తన వద్దనే ఉంచుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది ఆత్మ గౌరవం కోసమని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పౌరులకు, అధికారులకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి వింత చర్యలను అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఆరేళ్లుగా ఉద్యోగాల భర్తీ లేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని చెప్పారు. మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మౌలిక వసతులు కరువయ్యాయని, ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో సమాధానం చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే భవిష్యత్ అంధకారమని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లు అప్పుచేశారని, ఇంకా అప్పులు చేసి ప్రభుత్వం ప్రజలను తాకట్టు పెడుతోందన్నారు. సమగ్ర ప్రణాళికతో, సంపూర్ణ అభివృద్ధితో మధిర అభివృద్ధికి ఆలోచించే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశామని, చైర్మన్‌గా మధిర మాజీ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది తూములూరి కృష్ణారావు, సభ్యులుగా వీరమాచనేని శ్రీనివాసరావు, కటుకూరి శ్యామారావు, బిక్కి రాజా, మైనిడి జగన్మోహన్రావు, సయ్యద్ రషీద్ తదితరులు ఉంటారని తెలిపారు. -
'కేసీఆర్ పాలన సామాజ్య్ర వాద శక్తులకంటే దారుణం'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సామ్రాజ్య వాద శక్తుల కంటే దారుణంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు. టీఆర్ఎస్ పతనం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న కొన్ని చట్టాలపై అభ్యంతరం తెలుపుతూ గాంధీభవన్ నుంచి శాంతియుత ర్యాలీ తీయాలనుకున్నామని తెలిపారు. కాగా లౌకిక వాదాన్ని పెంచే ర్యాలీకి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆరోపించారు. దీంతో మౌనంగా శాంతి యాత్ర చేద్దామనుకున్నా ఇప్పుడు పోలీసులు అనుమతించలేదని, గాంధీభవన్ చుట్టు వేలాది మంది పోలీసులను మోహరించి కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేయడం దారుణమని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రంలో గాంధీని చంపిన వారి పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. 6 దశాబ్దాల తమ పాలనలో లౌకిక వాదంలో బతికిన ప్రజలు ప్రస్తుతం బీజేపీ పాలనలో మాత్రం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీకి పరోక్షంగా కేసీఆర్ సహాయసహకారాలు అందించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గుండెను తట్టి లేపుదామని కార్యకర్తలకు భట్టి పిలుపునిచ్చారు. -
'అప్పులు చేయడం ఆపితే భారం తగ్గుతుంది'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం ఆపితే ప్రజలపై భారం తగ్గుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వెంటనే బెల్ట్ షాపులు, పర్మిట్ రూల్స్, హైవేలపై మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు చేయడంతో రాష్ట్రం పై భారం పడుతుందని విమర్శించారు. ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలపై మద్య రూపంలో రుద్దుతుంది. మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులను మద్యం ద్వారా వచ్చే ఆదాయం వల్ల కేసీఆర్ పాలన చెయ్యాలని చూస్తున్నారు. సామాన్యుల నుంచి మద్యం పై ఏడాదికి దాదాపు 25వేల కోట్లు రాబడి వస్తుందని ఆయన తెలిపారు. సామాన్య ప్రజలను మద్యానికి బానిసగా చేసేందుకు విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి.ఇప్పటికైనా మద్యంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని భట్టి హెచ్చరించారు. -
‘సమత’గా పేరు మార్పు: ఎస్పీ
సాక్షి, ఖానాపూర్(ఆదిలాబాద్) : దిశ కేసులో లాగే కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత ఘటనలోనూ సమ న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సోమవారం ఆయన సీఎల్పీ నాయకులతో కలిసి ఎల్లాపటార్‌లోని సంఘటన ప్రాంతాన్ని, ఖానాపూర్ మండలంలోని గోసంపల్లెలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నాచితక పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సమతను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం, హత్య చేయడం అత్యంత పాశవికంగా ఉందన్నారు. ఈ ఘటన అందరినీ కలిచివేసిందన్నారు. మహిళలపై దాడులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రాంలో ఇటీవల కాలంలో సుమారు 15 మందిపై అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. అత్యాచార ఘటనలన్నింటినీ ఒకేలా చూస్తూ ఒకే కోర్టు ద్వారా విచారించి తక్షణమే శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరపున బాధిత కుటుంబానికి రూ.లక్ష అందజేశారు. సంఘటితంగా పోరాడుదాం.. అత్యాచారాలు, హత్యలపై సంఘటితంగా పోరాడుదామని సీఎల్పీ నేతలు పేర్కొన్నారు. పాలకులు అగ్రవర్ణాలు, దళితులను వేర్వేరుగా చూడొద్దన్నారు. ఎల్లాపటార్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మద్యం మత్తుతోనే ఇలాంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామాల్లో బెల్టు షాపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. ఎల్లాపటార్ ఘటనను పార్లమెంట్లో చర్చించేలా టీపీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ ఘటనలన్నింటినీ ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిదులు కె.విశ్వప్రసాద్, లక్ష్మణ్‌రెడ్డి, లచ్చన్న, మహేశ్, మోహిద్, ఆకుల శ్రీనివాస్, వాల్సింగ్, మాజిద్, శంకర్, మహేందర్, సాగర్, శంకర్‌గౌడ్, రవీందర్, శ్రీనివాస్, మల్లయ్య, నారాయణ, ప్రదీప్, గంగాదర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిన సీఎం ఖానాపూర్: రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చడంతో పాటు మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కేరాఫ్‌గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. పొట్టకూటి కోసం వెళ్లిన వివాహితను దుండగులు కనికరం లేకుండా అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్యచేశారన్నారు. దిశ నిందితులకు ఒక న్యాయం.. ‘సమత’కు మరో న్యాయం సరికాదని మహిళలందరికీ సమన్యాయం జరగాలని అన్నారు. 12, 13న బీజేపీ ఆందోళనలు రాష్ట్రంలో మద్యం నిషేధించాలని కోరుతూ ఈనెల 12,13 తేదీల్లో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు అరుణ పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ టేకు గంగారాం, మహిళ మోర్చా అధ్యక్షురాలు విజయ, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు రావుల రాంనాథ్, తోకల బుచ్చన్న, పడాల రాజశేఖర్, టేకు ప్రకాశ్, నాయిని లక్ష్మణ్, దాదె మల్లయ్య, వేణు, రాజేశ్వర్ తదితరులున్నారు. ‘సమత’గా పేరు మార్పు ఆసిఫాబాద్‌అర్బన్: గత నెల 24న లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ పేరును సమతగా మార్చుతున్నట్లు ఎస్పీ మల్లారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి బాధితురాలి పేరును సమతగా పేర్కొనాలని సూచించారు. సోషల్ మీడియా, తదితర వాటిల్లోనూ సమతగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన విచారణ జరిపేందుకు కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు వెల్లడించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. మృతురాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతినెలా పెన్షన్, డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. నిందితులను చట్ట ప్రకారం శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
మహిళలకు భద్రత కరువు : భట్టి విక్రమార్క
సాక్షి, ఆసిఫాబాద్ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గతనెల 24న కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ శివారులో దళిత మహిళ సమతపై అత్యాచారం, హత్య చేసిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులతోకలసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రతిరోజు సచివాలయానికి వచ్చి ప్రజా పరిపాలనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విచ్ఛలవిడిగా మద్యం అమ్మకాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎల్లాపటార్‌లో దళిత మహిళపై అత్యాచార, హత్య ఘటనపై గవర్నర్ దృష్టికి తెచ్చామని పేర్కొన్నారు. మహిళలపై దాడులు అరికట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మహిళలపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. భద్రతపై మహిళలకు ప్రభుత్వం ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు కేవలం టీఆర్ఎస్ నాయకులకే పని చేస్తున్నారని విమర్శించారు. వారి వెంట మాజీ ఎంపీలు నిఖిల్, రాథోడ్ రమేశ్ తదితరులు ఉన్నారు. -
గవర్నర్ తమిళసై ను కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ బృందం గవర్నర్ తమిళసై ని శనివారం కలిసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, మద్యం అమ్మకాలను నియంత్రించాలని గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఎక్కడ చూసిన హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడి ఆదాయాన్ని పెంచేవిధంగా కాకుండా రెగ్యులేటేడ్ మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజల భద్రత కోసం వినియోగించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని టీఆర్ఎస్ నేతలు ఉపయోగించుకుంటున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. -
శాంతి భద్రతలు అదుపు తప్పాయి : భట్టి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందని, పోలీసు యంత్రాంగం ప్రజల కోసం పనిచేయడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఒక్క హైదరాబాద్‌లోనే రెండేళ్లలో వేలమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, రోజుకు ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. భట్టి అధ్యక్షతన గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. దిశ ఘటన తమను తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆసిఫాబాద్, వరంగల్‌లో మహిళలపై జరిగిన ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులకు ఉరిశిక్ష పడాలని అభిప్రాయపడ్డారు. మహిళలపై దాడులకు మద్యమే ప్రధానకారణంగా కనిపిస్తోందన్నారు. మద్యాన్ని నియంత్రించాలి మద్యం నియంత్రణ కోసం శనివారం ట్యాంక్‌బండ్ నుంచి రాజ్‌భవన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి చార్జీల పెంపు పేరుతో ఆ భారాన్ని ప్రజలపై ఎందుకు మోపారో అర్థం కావడం లేదన్నారు. సీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), పొడెం వీరయ్య (భద్రాచలం)లు గైర్హాజరయ్యారు. భట్టితో పాటు శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. -
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరపాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కమిటీ వేస్తామని హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. -
‘ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్ చేతిలో నలిగి పోతుంది’
సాక్షి, హైదరాబాద్ : వ్యవస్థలను, ఉద్యోగులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్‌లా దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ప్రవర్తించడం లేదని ఆయన విమర్శించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేయాలని కోరగా.. కమిటీ వేసినా ప్రభుత్వం ఇసుక రేణువంత కూడా పట్టించుకోదని హైకోర్టు వాఖ్యానించిందని ప్రస్తావించారు. జ్యూడీషియల్ వ్యవస్థ చెప్పినా ఈ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్ చేతిలో నలిగి పోతుందని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని, లేకపోతే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ చర్చలకు పిలవకపోతే రాజ్యాంగ సంక్షోభం గురించి గవర్నర్‌కు రాష్ట్రపతికి విన్నపిస్తామని పేర్కొన్నారు. వెంటనే జీతాలు చెల్లించాలి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్షాలు కుట్ర చేశాయని హైకోర్టుకు ఆఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వీటికి ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సెల్ఫ్ డిస్మిస్ అని కేసీఆర్ చెప్పడం వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు, గుండె పోటుతో చనిపోయారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ ప్రతిపక్షాలపైన నెపం నెట్టుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు రెండు నెలల నుంచి ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జీతాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, వెంటనే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మీరు స్కామ్‌లంటారు..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న స్కీంలన్నీ స్కామ్‌లని రాష్ట్ర బీజేపీ నేతలు వల్లె వేస్తుంటే.. కేంద్రం నుంచి వచ్చే బీజేపీ మంత్రులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బాగున్నాయని, దేశమంతా అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో అమలవుతోన్న మిషన్ భగీరథ పథకం అతిపెద్ద స్కాం అని మీరు నిందిస్తుంటే.. కేంద్రమంత్రి షెకావత్ మాత్రం ఆ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతున్నారన్నారు. అంటే అతి పెద్ద స్కామ్ పథకాలను దేశంలో అమలు చేయాలని బీజేపీ అనుకుంటుందేమో చెప్పాలని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో భట్టి మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన ఏంటో చెప్పాలని అన్నారు. రెండు పార్టీలు కలసి రాష్ట్ర ప్రజలను తప్పు దో వ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మిషన్ భగీరథ పథకం రూ.50 వేల కోట్లను నిలువు దోపిడీ చేసిన అతిపెద్ద కుంభకోణమని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్కాంల కోస మే స్కీంలు తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది తప్ప ప్రజ ల ఉపయోగం కోసం చేసినట్టు లేదని ఎద్దేవా చేశారు. రెవెన్యూతో చర్చించే సమయం లేదా.. రాష్ట్రంలో తుగ్లక్ పాలనతో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని, వారం రోజులుగా రెవెన్యూ అధికారులు సమ్మె చేస్తూ తహసీల్దార్ కార్యాలయాలు మూసేస్తే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని భట్టి ప్రశ్నించారు. ఓ తహసీల్దార్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన తర్వాత రెవెన్యూ ఉద్యోగులతో చర్చలకు సమయం లేని సీఎంకు.. కేంద్రం నుంచి వచ్చే మంత్రులతో కూర్చుని ప్రెజెంటేషన్లు ఇచ్చేందుకు సమయం ఉందా అని నిలదీశారు. -
హక్కులను అణచివేస్తున్న సర్కార్
సాక్షి, హైదరాబాద్: ప్రజల భావ వ్యక్తీకరణను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అణచివేస్తోందని, రాష్ట్రం లో ప్రజలకు కనీస హక్కులు లేకుండా చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపునిచి్చన ‘చలో ట్యాంక్‌బండ్’కార్యక్రమంపై చర్చించేందుకు శనివారం గాంధీ భవన్లో ముఖ్య నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం చేపట్టినా కాంగ్రెస్ నేతల ఇళ్లను పోలీసులు దిగ్బంధనం చేస్తున్నారని, నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని, జిల్లాల్లోని నేతలను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని, ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పూర్తిగా అణచివేసే విధంగా ఉన్న ప్రభుత్వ చర్యలను సహించేది లేదని అన్నారు. ‘చలో ట్యాంక్‌బండ్’సందర్భంగా చేసిన అరెస్టులు, లాఠీ చార్జీలను తీవ్రంగా ఖండించారు. గాయపడ్డ వారికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో చికిత్సలు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా, భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఆదివారం మరోసారి సమావేశం కావాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీ చందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎన్నికల అస్త్రం సమసిపోయింది: జెట్టి అయోధ్య వివాదాస్పద భూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీకి ఎన్నికల అస్త్రం సమసిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకునేందుకు యతి్నంచేదని, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీకి కీలక ఎన్నికల అస్త్రం చేజారినట్టయిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని, ప్రజలంతా సమన్వయంతో ముందుకెళ్లాలని ఆ ప్రకటనలో ఆయన కోరారు. పోలీసుల తీరు దుర్మార్గం: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న ఆర్టీసీ కారి్మకులపై పోలీసులు ప్రవర్తించిన తీరు దుర్మార్గంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విచారం వ్యక్తం చేశారు. ఉద్యమకారులు, ఆర్టీసీ కారి్మకులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించి రక్తపాతం సృష్టించారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ వైఖరి మార్చుకోవాలని, పరిస్థితి చేయి దాటిపోక ముందే ఆర్టీసీ కారి్మకులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే 22 మంది కారి్మకులు చనిపోయారని, ఇంకా వేలాది మంది తీవ్ర నిరాశా నిస్పృహలతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు రవాణా వ్యవస్థ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 90 శాతం దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తోందని, ఆరీ్టసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రైవేటీకరణతో విపరీతంగా చార్జీలు పెరుగుతాయని, పేద ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండదన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరిపి, బస్సులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘ఆర్టీసీని హస్తగతం చేసుకునేందుకు కుట్ర’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన అహంకారానికి పరాకాష్ట అని సీఎల్పీనేత భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమని, కార్మికులు వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ దేశం ఇచ్చిన కార్మిక చట్టాల ద్వారా సమ్మె చేయడం ఒక భాగమని అన్నారు. ఈ మేరకు భట్టి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కార్మికులతో చర్చలు జరిపి సమస్యకు ఒక సానుకూల పరిష్కారం చూపడం ప్రభుత్వం బాధ్యత. సమ్మెకు దిగిన ఉద్యోగులతో చర్చలు జరపకుండా.. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంభావనికి నిదర్శనం’ అన్నారు. చదవండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదు.. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పై అధిక పన్నులు వేసి ఆర్టీసీ నష్టాలకు కారణం అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్టీసీ అనేది ప్రభుత్వం ఆస్తి. ఆ ఆస్తులను ప్రభుత్వం సంరక్షించాలి. కోరికల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయనలోని ఫ్యూడల్ మనసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఒక రాచరిక పరిపాలన చేస్తున్నట్లు ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలన చేస్తున్నట్లు లేదు. ఆర్టీసీ కార్మికులు తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్టీసీ వ్యవహారంలో ముఖ్యమంత్రి వ్యహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఆ సంస్థను హస్తగతం చేసుకునేందుకే అంతర్లీనంగా కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోంది. కార్మికుల పక్షాన మేము నిలబడటం’ అని విక్రమార్క పేర్కొన్నారు. -
కసరత్తు షురూ.. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం!
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూచట్టం తీసుకువస్తున్నట్లు ఆర్అండ్బీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారని, అవసరమైతే మూడు, నాలుగు రోజులు కూర్చొని సభ్యుల సూచనలు, సలహాలతో కొత్త చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. బుధవారం శాసనసభలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఎక్సైజ్, హోం, వ్యవసాయ, పశుసంవర్ధక, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం పద్దులను సీఎం తరఫున మంత్రులు సభలో ప్రవేశపెట్టారు.రెవెన్యూ పద్దులపై ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఇప్పటివరకు 98శాతం రికార్డులను నవీకరించామని తెలిపారు. 68.37 లక్షల ప్రైవేటు ఖాతాలకుగాను 58.48 ఖాతాలకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలిచ్చినట్లు చెప్పారు. కేవలం 12–13% ఖాతాలపై అభ్యంతరాలుండటంతో పక్కనపెట్టామని, త్వరలోనే విధానపర నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ రికార్డుల సవరణలో అనుభవదారుల కాలమ్‌లో పేర్లను తొలగించడం ద్వారా భూమిపై ఉన్న హక్కు కోల్పోతున్న రైతుల విషయంలో ఆలోచిస్తామని, మంత్రి చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో మార్పులు... రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖను అనుసంధానించడం ద్వారా రిజిస్ట్రేషన్ రోజే మ్యుటేషన్‌కు చర్యలు తీసు కుంటామని, అదే రోజు పాస్‌పుస్తకం, 1బీలో కూడా పేరు చేర్చేలా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు చెప్పారు. స్లాట్ విధానంతో డాక్యుమెంట్ల జారీలో వేగాన్ని పెంచామని, సగటున రోజుకు 43 డాక్యుమెంట్లు నమోదవుతున్నాయని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది రూ.2,046 కోట్ల రాబడి రాగా, ఈసారి ఇప్పటికే రూ.6,012 కోట్ల ఆదాయం లభించిందని, ఇది ఏకంగా 237% అధికమని తెలిపారు. భూస్వామ్యవర్గాలకు మేలు కలిగేలా: భట్టి తెలంగాణ పోరాటమే భూమి కోసం జరిగింది.అలాంటి భూమిని ప్రస్తుత ప్రభుత్వం జమీందార్, భూస్వామ్యవర్గాలకు కట్టబెట్టేలా భూ రికార్డుల ప్రక్షాళనను చేసిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అనుభవదారుల కాలమ్ నుంచి పేర్లు తొలిగించడంతో వారి ఆస్తులపై పేదలు హక్కులు కోల్పోతున్నారని చెప్పారు. భూ రికార్డుల నవీకరణ ఉద్దేశం మంచిదే అయినా.. చేసిన విధానం బాగాలేదని అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా ఉదాహరణలు చెబుతుంటే సమయం అయిపోందని స్పీకర్ మైక్ కట్ చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం కంకణం కట్టుకుంటే.. అడ్డగోలుగా మాట్లాడటం సబబుకాదన్నారు. పర్మిట్ రూమ్‌లు ఎత్తివేయండి పర్మిట్ రూమ్‌ల వల్ల శాంతిభద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయని భట్టి అన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేక జీఓ ద్వారా టానిక్ పేరిట కొన్ని బార్లకు అనుమతిచ్చినట్లు తెలిసిందని, అది సరికాదన్నారు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పటికే పలు డిపోలు, వర్క్‌షాప్‌లను తాకట్టు పెట్టిందని, తాజాగా ఎలక్ట్రానిక్ బస్సుల నిర్వహణ ఒప్పందంలోను అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందని విచారణ జరపాలన్నారు. పౌరసరఫరాల పద్దుపై పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, పేదోళ్ల కడుపునింపేందుకు ఏడాదిగా రూ.5,413 కోట్ల సబ్సిడీని భరించినట్లు తెలిపారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని, టీఆర్ఎస్లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునేలా మార్గదర్శనం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కాంగ్రెస్ పార్టీ బృందం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ బృందంలో నల్లగొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య ఉన్నారు. దాదాపు అరగంటపాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు అందజేశారు. గత గవర్నర్ నరసింహన్ రాజ్యాంగాన్ని కాపాడా ల్సిందిపోయి తానే ఫిరాయింపులకు తెరలేపేలా టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేయించారని చెప్పారు. ఇదే అదనుగా సీఎం కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారని వివరించారు. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లో విలీనం అవుతున్నామని చెప్పిన ఎమ్మెల్యేలు కూడా ఒకేరోజు టీఆర్ఎస్లోకి వెళ్లలేదని, ఒక్కోరోజు ఒక్కొక్కరు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి తాము టీఆర్ఎస్లోకి వెళుతున్నట్టు ప్రకటించారని చెప్పారు. దీనిపై తాము అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్లు కూడా ఇచ్చామని చెప్పారు. టీఆర్ఎస్లో విలీనం అవుతున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలిచ్చిన పిటిషన్ ఆధారంగా సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు బులెటిన్ ఇచ్చారని చెప్పారు. తామిచ్చిన పిటిషన్లను పరిష్కరించి ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యే వారని, అప్పుడు 2/3 వంతు మంది సభ్యులు టీఆర్ఎస్లోకి వెళ్లే అంశమే వచ్చేది కాదన్నారు. తమ పార్టీ నుంచి వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇచ్చారని, ఫిరాయింపులపై తాము కోర్టును ఆశ్రయించామన్నారు. టీఆర్ఎస్ అనుసరిస్తున్న ఈ వైఖరి దేశ ప్రజాస్వామానికి ప్రమాదంలా, వైరస్‌లా మారిందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవా లని కోరారు. కాంగ్రెస్ నేతల వినతికి స్పందించిన గవర్నర్ ప్రతిపక్షంగా చేయాల్సింది కాంగ్రెస్ పక్షాన చేయాలని, రాజ్యాంగ పరిధిలో చేయాల్సిన అంశాలను పరిశీలించి ముందుకెళ్తానని అన్నారు. ప్రజాదర్బార్ పెట్టాలని చెప్పాం: భట్టి గవర్నర్‌తో భేటీ అనంతరం భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతుందో గవర్నర్‌కు వివరించామని, గవర్నర్ స్పందించిన తీరు తమకు సంతృప్తినిచ్చిందని చెప్పారు. ప్రజాదర్బార్ నిర్వహించాలన్న గవర్నర్ ఆలోచన మంచిదని చెప్పామని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలను, కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులను కలవని పరిస్థితుల్లో గవర్నర్ ప్రజలను కలవాలని నిర్ణయించుకోవడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. -
అభివృద్ధి కోసమే అప్పులు.. నిజాలు తెలుసుకోండి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో ఆదివారం ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికోసమే అప్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో అప్పులు 40 శాతం ఉన్నాయని, అదేక్రమంలో రాష్ట్ర అప్పులు 21 శాతం ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించటంలేదని, కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలోనే కట్టి రికార్డులు నమోదు చేశామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులేవీ కనబడటం లేదా అని ప్రశ్నించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క శనివారం చేసిన విమర్శల్ని కేసీఆర్ ఆక్షేపించారు. విక్రమార్క సొంత జిల్లాలో ఏడాదికాలంలోనే భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మించామని సభ దృష్టికి తెచ్చారు. ఏ అంశంపైనైనా అవగాహన పెంచుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. బడ్జెట్లో ప్రతిపైసాకు లెక్కలు చెప్పామని, ఆర్థిక మాంద్యంతో తలెత్తిన ఇబ్బందులను కూడా వివరించామని చెప్పారు. ప్రస్తుతం దేశ ఆర్థికస్థితి బాగోలేదని.. ప్రతి అంశాన్ని పరిశీలించి బడ్జెట్ రూపొందించామని తెలిపారు. బడ్జెట్లో కోతపెట్టిన విషయం బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పానని, ఎందుకు కోతపెట్టాల్సి వచ్చిందో కూడా వెల్లడించామన్నారు. అవాస్తవాలు, సత్యదూరమైన విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు.