Guntur District Latest News
-
పూలే సేవలు అజరామరం
గుంటూరు వెస్ట్ : మహాత్మా జ్యోతీరావు పూలే జయంత్యుత్సవాన్ని శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే లు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, జీఎంసీ ఇన్చార్జి మేయర్ షేక్ సజిల, బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్ కె.మయూరి, డీఆర్వో ఖాజావలి తదితర అధికారులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ పూలే సేవలను కొనియాడారు. జ్యోతీరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను హిందూ కాలేజీ సర్కిల్లో ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేశామని పేర్కొన్నారు. బీసీ భవనం నిర్మాణానికి అందరూ సహకరించాలన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ పూలే దంపతులు నేటి యువతకు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం 400 మంది బీసీ లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.13.08 కోట్ల విలువైన సబ్సిడీ రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శైలజ, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధరరావు పాల్గొన్నారు. తొలి సామాజికతత్త్వవేత్త జ్యోతీరావు పూలే గుంటూరు ఎడ్యుకేషన్: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం గళం విప్పిన దేశ తొలి సామాజిక తత్త్వవేత్త జ్యోతీరావు పూలే అని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతీరావు పూలే జయంత్యుత్సవం సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ పూలే సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డెప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ పాల్గొన్నారు. గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతీరావు పూలే నగరంపాలెం(గుంటూరు వెస్ట్): మహాత్మా జ్యోతీరావుపూలే గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక తత్త్వవేత్త అని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం పూలే జయంతి సందర్భంగా పోలీస్ కార్యాలయ ఆవరణలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప ఉద్యమకారుడు పూలే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు (పరిపాలన) రమణమూర్తి, హనుమంతు (ఏఆర్), ఏఓ అద్దంకి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
అసమర్థత కప్పిపుచ్చుకునేందుకే జగన్‌పై ఎంపీ ఆరోపణలు
వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల రూరల్: ఎన్నికల్లో ఓట్లు, సీట్లు కోసం ఇచ్చిన హామీలను అమలు చేయక కూటమి నేతలు కుట్రలు పన్నుతూ, తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాజీ సీఎం వైఎస్. జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అలవిగాని హామీలిచ్చి వాటిని అమలు చేయలేక, ప్రజల సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్‌పై ప్రశ్నిస్తున్న జగన్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ విద్యా సంస్థలకు చెందిన లావు కృష్ణదేవరాయలుకు రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేకపోయినా, యువకులను పోత్రహించాలన్న ఉద్దేశంతో తమ నాయకుడు జగన్ ఆ రోజు మొదటి సారిగా ఎంపీ అభ్యర్థిగా అవకాశమిచ్చి భారీ మెజార్టీతో గెలిపించినట్లు గుర్తు చేశారు. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కే కృష్ణదేవరాయల దుర్బుద్ధి ఇప్పుడు బయట పడిందిని తెలిపారు. కృష్ణ దేవరాయలు ఎంపీగా గెలిచారంటే అది జగన్, పల్నాడు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తల గొప్పతనమేనని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్‌పై ఉన్న కేసుల గురించి అమిత్‌షా వద్ద కృష్ణదేవరాయలు ప్రస్తావించటమంటే అది ఆయన అజ్ఞానమని చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్లో కృష్ణదేవరాయలు ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అప్పులపాలవుతుంటే వారిని ఆదుకోవడంలో ఎంపీగా విఫలమైన కృష్ణదేవరాయలు వరికపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఆయన అసమర్థత తెలుపుతుందని పిన్నెల్లి విమర్శించారు. -
కృషి చేసిన పూలే
సమాజ అభ్యున్నతి కోసం పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): సమాజం కోసం, మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతీరావు పూలే అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. జ్యోతీరావు పూలే జయంత్యుత్సవం సందర్భంగా బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళలకూ సమాంతర హక్కులు ఉండాలని, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన ఎంతగానో పాటు పడ్డారన్నారు. ఆయన ఆశయన సాధనే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతీరావు పూలే అని కొనియాడారు. బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. మహిళలకు విద్య అవసరమని చాటి చెప్పారన్నారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు కృషి చేశారన్నారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ మహిళలు ఇంటికి పరిమితం కాకూడదని, వారికి విద్య అవసరమని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతీరావుపూలే అని కొనియాడారు. మహిళల అభ్యున్నతి ఎంతో కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు విలువ లేకుండా పోయిందన్నారు. మహిళల పట్ల దుర్భాషలాడడం పరిపాటిగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ నేత మేకతోటి దయాసాగర్, పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, కొత్తా చిన్నపరెడ్డి, బత్తుల దేవ, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, నందేటి రాజేష్, సి.హెచ్.వినోద్, విజయ్, ఈమని రాఘవరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడలో జరగనున్న ఏపీ స్టేట్ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు వీఎస్ఎస్ లలిత్, ఎస్.చరణ్ కుమార్, వి.హర్షిణి ఎంపికయ్యారని టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర పోటీల్లోనూ పతకాలు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మిర్చి యార్డుకు వరుస సెలవులు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాలు యార్డుకు సాధారణ సెలవులు, సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవం పురస్కరించుకుని సెలవు ఇచ్చారు. దీంతో యార్డుకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్టు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో రైతులు తమ సరుకును తీసుకురావద్దని కోరారు. సోమవారం అర్ధరాత్రి నుంచి రైతుల సరుకును యార్డులోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. మంగళవారం యథావిథిగా యార్డులో క్రయవిక్రయాలు కొనసాగుతాయని ఆమె వివరించారు. నేడు టీచర్ బదిలీలు, ఉద్యోగోన్నతులపై అవగాహన గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులు, సీనియార్టీ జాబితాలపై శనివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, మొహ్మద్ ఖాలీద్ శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు షేక్ జిలానీ పాల్గొని ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. డ్రోన్ల వినియోగంతో సమయం ఆదా కొరిటెపాడు(గుంటూరు): పురుగు మందుల పిచికారీకి డ్రోన్ల వినియోగంతో రైతులకు సమయం ఆదా అవుతుందని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక కృషి భవన్లో శుక్రవారం సాయంత్రం డ్రోన్ల నమూనాలను రైతుల అవగాహన కోసం ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డీఏఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్కేవీవై పథకం ద్వారా రైతుల గ్రూపులకు 80 శాతం సబ్సిడీపై కిసాన్ డ్రోన్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. డ్రోన్ల తయారీదారుల ప్రతినిధులు రవికుమార్, సుధీర్ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్న మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు డ్రోన్లను కొనుగోలు చేయడానికి రుణాల కోసం అన్ని బ్యాంకులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ప్రతినిధులు, ఏపీ ఆగ్రోస్ ప్రతినిధులు పాల్గొన్నారు. 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం నిజాంపట్నం: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులపాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధించినట్లు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సాయిసందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సముద్రంలో వివిధ చేపలు, రొయ్యల జాతుల సంతాన ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ప్రతి ఏటా 61 రోజులపాటు వేట నిషేధం అమల్లోకి తెస్తుందన్నారు. ఈ సమయంలో రొయ్య, చేప జాతులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తికి దోహదపడే సమయమన్నారు. వేట నిషేధ సమయంలో మండలంలోని మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని తెలియజేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి వేటకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయండి
మంగళగిరి: నేటి విద్యార్థులు పరిశోధనా రంగంలో రాణించి కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయాలని బెర్హంపూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్(బసర్) యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ కుమార్ గంగూలీ కోరారు. మండలంలోని నీరుకొండ గ్రామంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం 9వ రీసెర్చ్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గంగూలీ మాట్లాడుతూ బోధనతో పాటు పరిశోధనా రంగంలో రాణించేలా ప్రొఫెసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌తోపాటు పరిశ్రమల సందర్శన ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ మనోజ్ కుమార్ అరోరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రీసెర్చ్ డీన్ డాక్టర్ రంజిత్ థాఫా మాట్లాడుతూ రీసెర్చ్ డేను పురస్కరించుకుని కిండబేజాద్ మాదిరిగా నలుగురు ప్రొఫెసర్లుకు ఉత్తమ పరిశోధనా పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీలలో పరిశోధనలు పెరగాలి బెర్హంపూర్ బసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ కుమార్ గంగూలి -
ఆరోగ్య సంరక్షణలో ఫార్మా రంగం కీలకం
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ గుంటూరు మెడికల్: ఆరోగ్య సంరక్షణలో ఫార్మా రంగం ఎంతో కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ అన్నారు. శుక్రవారం గుంటూరు కేపిటల్ హోటల్లో బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఫార్మాటెక్ కన్వర్ట్ 2025 కార్యక్రమానికి వీరపాండియన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఫార్మా రంగం విశిష్టతను వివరించారు. గౌరవ అతిథి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ట్రస్టు సీఈఓ పి.రవిశుభాష్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఫార్మా పాత్ర ఎంతో ఉందన్నారు. ఇంకా పలువురు వక్తలు ప్రసంగించారు. -
విత్తన షాపుల్లో ఆకస్మిక తనిఖీలు
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం సహాయ సంచాలకులు ఆర్.శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని పత్తి విత్తనాల ప్రాసెసింగ్ పరిశ్రమలు, పంపిణీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ డీలర్ల దుకాణాలు, పార్సిల్, రవాణా కార్యాలయాల్లో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా రికార్డులను పరిశీలించారు. గుంటూరు నగరంలోని వివిధ విత్తనాల దుకాణాల్లో 65 బీటీ పత్తి విత్తన శాంపిల్స్ హెర్బి సైడ్ ట్రైట్ (హెచ్‌టీ) జన్యు పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కమిషనరేట్ ఏడీఏ శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ హెచ్‌టీ కలిగిన బీటీ పత్తి విత్తనాల ఉత్పత్తి, సాగు, అమ్మకాలజీ కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో ఇటువంటి విత్తనాలు అమ్మకాలు జరగకుండా ఉండటానికి ముందుగానే గుంటూరు జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో సేకరించిన పత్తి విత్తన నమూనాలన్నీ అక్కడే పరీక్ష చేయగా హెచ్టీకి సంబంధించిన జన్యువు లేదని నిర్ధారించడమైందన్నారు. అనుమతి లేని విత్తనాలు విక్రయించినా, నిల్వ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనరేట్ కార్యాలయం వ్యవసాయ అధికారి వీఎస్ సురేషన్, స్థానిక వ్యవసాయ అధికారి కె.రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ ఆధీనంలోకి మస్తాన్ దర్గా..?
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): నగరంపాలెంలోని హజ్రత్ కాలేషా మస్తాన్ దర్గా ఇప్పుడు వక్ఫ్ ఆదీనంలోకి వెళ్ళనున్నట్టు సమాచారం. వక్ఫ్ కమిటీ ఆదేశాల మేరకు దీనిని స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ముక్తార్ బాషా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖుదూస్, సూపరిటెండెంట్ హుస్సెన్ ఇబ్రహిం బేగ్ పోలీసులతో వచ్చారు. దర్గా వ్యవహారాలను ఎప్పటి నుంచో రావి రామోహన్‌రావు అలియాస్ దర్గా రాము, అతని కుటుంబ సభ్యులు చూస్తున్నారు. దర్గాకు వచ్చే కానుకల్లో నిబంధనల మేరకు ఏడు శాతం వక్ఫ్ బోర్డుకు చెల్లించాలి. అయితే సక్రమంగా దర్గా రాము చెల్లించడం లేదు. రూ.9 లక్షలకు పైగా ఇంకా బకాయి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు కమిటీ చైర్మన్ ఉత్తర్వుల మేరకు దర్గా ముతవల్లిగా ఉన్న రామును పదిరోజులపాటు అధికారులు సస్పెండ్ చేశారు. దర్గాను స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. రాము అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సోమవారం వరకు గడువు ఇవ్వాలని రాము కోరడంతో వక్ఫ్ అలధికారులు గడువు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాముకు వక్ఫ్‌బోర్డు కమిటీ సభ్యుడిగా వ్యవహరించే ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అండదండలు ఉండటంతో దర్గాను ఆధీనంలోకి తీసుకునేందుకు వక్ఫ్ అధికారులకు అడ్డంకిగా మారినట్టు సమాచారం. అయితే రాముపై, అతని కుమారుడిపై ఇటీవల వెల్లువెత్తిన వివాదాల నేపథ్యంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డు సభ్యుడు నసీర్ అహ్మద్ కూడా దర్గాను ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన వక్ఫ్ అధికారులు దర్గా రాముతో ఫోన్లో సంప్రదింపులు సోమవారం వరకు గడువు -
గుంటూరు
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సేవలు, మొక్కుబడులు నిలిపివేత దుగ్గిరాల: కంఠంరాజుకొండూరులోని మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో మే ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఆర్జిత సేవలు, మొక్కుబడులు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ కె.సునీల్‌కుమార్ శుక్రవారం తెలిపారు. అమ్మవారి దర్శనం మాత్రమే యథాతథంగా ఉంటుందని, భక్తులు గమనించి సహకరించాలని కోరారు. ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేటరూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన సకిల వెంకటేష్, వెంకటలక్ష్మీ భార్గవి దంపతులు శుక్రవారం రూ.లక్ష విరాళం అందజేశారు. ముగిసిన సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. 9 -
ఇంటర్ ఫెయిల్ అవుతామనే భయంతో ఇల్లు వదిలి వెళ్లిన విద్యార్థినులు
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని పెదవడ్లపూడి, తాడేపల్లిలో నివాసముండే ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయంతో ఇల్లు వదిలి పారిపోయారు. తాడేపల్లిలో ఉన్న విద్యార్థిని తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి శుక్రవారం వారిద్దరి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఖాజావలి మాట్లాడుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తమ పిల్లలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి ిసీఐ కల్యాణ్ రాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి 24 గంటల్లో వారి ఆచూకీ కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. 24 గంటల్లో తల్లిదండ్రులకు అప్పగింత -
వక్ఫ్ స్వాతంత్య్ర పోరాటం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వక్ఫ్ సవరణ బిల్లును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. నినాదాలతో హోరెత్తించారు. వామపక్షాలు, పలు ముస్లిం సంఘాలు ఆందోళనలో పాలుపంచుకున్నాయి. పార్టీలకతీతంగా చేపట్టిన కార్యక్రమం కావడంతో వేదికపై తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా ఉన్నారు. ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అని నినదిస్తూ వామపక్షాల నేతలు పోస్టర్ ప్రదర్శించారు. అదే వేదికపై టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉండడంతో వామపక్ష నాయకులు అసహనం వ్యక్తం చేశారు. వేదిక దిగిపోయారు. అనంతరం వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన కూటమి పార్టీ నేత, ఎమ్మెల్యే నసీర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. కొద్దిసేపు నసీర్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు మద్దతు తెలిపి ముస్లింలకు ద్రోహం చేశారని, ఇప్పుడు ఆ పార్టీ నేత ఆందోళనలో పాల్గొని ద్వంద్వ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తూర్పు మాజీ శాసన సభ్యుడు షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ పార్టీలకతీతంగా అందరం ఐకమత్యంగా వక్ఫ్ సవరణ బిల్లుపై పోరాడాలని కోరారు. జమియతుల్ ఉలెమా అధ్యక్షుడు ముఫ్తి బాసీద్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముస్లింలపై కక్ష కట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తారు. వక్భ్బిల్లుకు వ్యతిరేకంగా శనివారం సీపీఐ ఆధ్వర్యంలో గల్లీ టు ఢిల్లీ నినాదంతో నిరసన చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు, ఆవాజ్ కమిటీ అధ్యక్షడు చిష్టి, ముస్లిం ఐక్య వేదిక నాయకుడు బాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యదర్శి గులాం రసూల్, సీపీఐ, సీపీఎం నాయకులు, ముఫ్తి, మౌలానా పాల్గొన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఆందోళన వామపక్షాలు, పలు ముస్లిం సంఘాల మద్దతు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ససీర్ రాజీనామా చేయాలంటూ నినాదాలు ముస్లింల వెంటే నా ప్రయాణం టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియామకానికి టీడీపీ ప్రత్యేక శ్రద్ధ వహించిందని పేర్కొన్నారు. ముస్లింల వెంటే తన ప్రయాణమని, పోరాటానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. -
హోర్డింగ్స్ పేరుతో దోపిడీ
● కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్న ఎల్ఈడీ స్క్రీన్స్ ● నగరంలో పలుచోట్ల అనధికారికంగా నిర్వహణ ● నగరంలో గ్యాంట్రీ హోర్డింగ్స్ 35కి అనుమతి ఇస్తే 40 నిర్మాణం ● వీటన్నింటికీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు ● నగరపాలక సంస్థ ఆదాయానికి గండి ● పట్టించుకోని పట్టణ ప్రణాళిక అధికారులు నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గుంటూరు నగరపాలక సంస్థలో దోపిడీ పర్వం రాజ్యమేలుతోంది. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో గ్యాంట్రీ(క్రేన్) హోర్డింగ్స్‌కు 35కి మాత్రమే అనుమతి ఉంది. కూటమి నేతలు, అధికారుల అండదండలతో 40 ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, వీటికి ఈ మధ్య ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి మరి దోపిడీకి తెరతీశారు. వీటి ద్వారా కాంట్రాక్టర్లకు ఏటా కోట్లాది రూపాయిలు వస్తున్నా కార్పొరేషన్‌కు మాత్రం నామమాత్రంగా మొక్కుబడి చెక్కులు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అవి కూడా పాస్ అయ్యేయో..కాలేదో తెలియని పరిస్థితి. భారీగా వసూలు నగరంలో ఏర్పాటు చేసే ఒక్కో గ్యాంట్రీ బోర్డుకు కాంట్రాక్టర్లు నెలకు రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఇందులో రెండు పక్కలా అయితే రూ.1.80 లక్షలు, ఎల్ఈడీ బోర్డ్‌కి 1.20 లక్షలు తీసుకుంటున్నారు. వాస్తవానికి గానూ ప్రతి సంవత్సరం నగరపాలక సంస్థకు ఒక్కో బోర్డుకు రూ. 3.50లక్షలు చెల్లించాలని ఒప్పందం. అయితే, సదరు ఏజెన్సీ నిర్వాహకులు 20 బోర్డులకు మాత్రమే ట్యాక్స్ కడుతున్నట్లు తెలుస్తోంది. 40 బోర్డులకు ప్రతి సంవత్సరం రూ.1.40కోట్లు కట్టాల్సి ఉండగా, కేవలం 20 బోర్డులకు రూ.70 లక్షలే కడుతున్నట్లు సమాచారం. ఇందులోనూ కొంత భాగం చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని కార్యాలయ సిబ్బంది చెప్పుకుంటున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. స్టెబిలిటీ సర్టిఫికెట్ కూడా మాయే.. నగరంలో ఏర్పాటు చేసిన 40 బోర్డులకు ఎంఓయూలో 10 X 20 సైజు పెడుతున్నట్లు చూపారు. కాని వాస్తవంగా చూస్తే 30 X 17 సైజుల్లో ఏర్పాటు చేశారు. 10 X 20 సైజుకు మాత్రమే స్టెబిలిటీ సర్టిఫికెట్ ఉంది. దీనికి తోడు ఎల్ఈడీ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడంతో బరువు మరింత పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, గాలి దుమారాలకు గ్యాంట్రీ హోర్డింగ్స్ నిర్వహణ ప్రశ్నార్థకంగా ఉందనే చెప్పుకోవచ్చు. వీటి లోపాలపై డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు పలుమార్లు కౌన్సిల్ వేదిక అధికారులను నిలదీసిన సందర్భరాలు చాలానే ఉన్నాయి. కాని అధికారులు మాత్రం కౌన్సిల్ రోజు వరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని మాట చెప్పడం, ఆ తరువాత దానిని పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఎల్ఈడీ స్క్రీన్స్ ఎంఓయూలో ఉంది గ్యాంట్రీ బోర్డులతో పాటు ఎల్ఈడీ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఎంఓయూలో ఒప్పందం ఉంది. హోర్డింగ్స్ బకాయిలు వసూలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. – రాంబాబు, సిటీ ప్లానర్ కరెంట్ బిల్లులు కూడా నగరపాలక సంస్థ ఖాతాలోనే.. హోర్డింగ్స్/బోర్డులు/గ్యాంట్రీ హోర్డింగ్స్ నిర్వహణకు కరెంట్ నగరపాలక సంస్థ సరఫరా చేస్తుంది. దీనికి ఆయా ఆయా ఏజెన్సీలు నగరపాలక సంస్థకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏజెన్సీలు కనీసం కరెంట్ బిల్లులు కూడా చెల్లించకపోవడంతో రూ. లక్షల్లో బకాయిలు ఉన్నాయని పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల కిందట జరిగిన కౌన్సిల్ సమావేశంలో స్వయంగా నగరపాలక సంస్థ సిటీప్లానర్ రూ.9 కోట్లు బకాయిలు ఉన్నాయని ఒప్పుకోవడం గమనార్హం. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 20257వైభవంగా చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు పొన్నూరు: మండల పరిధి ములకుదురులోని శ్రీ భూనీలా రాజ్యలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం అర్చకులు స్వామిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 515.30 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది. ముగిసిన శ్రీరామనవమి వేడుకలు తెనాలిటౌన్: రూరల్ మండలం కంచర్లపాలెంలోని శ్రీ సీతారామాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలు గురువారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో జరీబు భూమికి ఓ విధంగా, మెట్ట భూమికి మరో విధంగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు కేటాయించారు. భూమి తేడాలను బట్టి దాని విలువను, పరిహారాన్ని నిర్ణయించారు. గ్రామంలో స్థలం విలువ ఎక్కువ... దూరం వెళ్లే కొద్దీ తక్కువగా ఉంటుందనేది వాస్తవం. అలాంటప్పుడు భూముల తరహాలోనే గ్రామాలు, గ్రామ శివార్ల విషయంలోనూ ఉండాలి. భవిష్యత్తు అవసరాలకు భూమి మినహాయింపు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడాలి. అది తప్పనిసరి బాధ్యత. న్యూస్‌రీల్ -
పట్టుదలతో అంకుఠిత దీక్ష
ఢిల్లీ టూ గుంటూరు ● తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధన ● నాలుగేళ్లకు పైగా కష్టపడి లక్ష్యం సాకారం ● ఓ వైపు విధులు నిర్వహిస్తూ పరీక్షకు సిద్ధం ● మహిళలకు భద్రత, రక్షణ లక్ష్యం దేశంలో అత్యున్నత సర్వీసుల్లో కొలువు సాధించాలంటే కఠోరమైన సాధన, అకుంఠిత దీక్ష , పట్టుదల ఉండాలి. ఒకవేళ లక్ష్య సాధనలో అపజయాలు, అటుపోట్లు ఎదురైనా ధైర్యంతో విజయం వైపు ముందుకు సాగాలి. ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలంటే మరింతగా శ్రమించక తప్పదు. అయితే, దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలను ప్రాథమిక దశలో కట్టడి చేయాలనే ఆలోచన ఆమెలో ఐపీఎస్ లక్ష్య సాధనకు బీజం వేసింది. దీంతో కఠోరమైన సాధన మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కొక్క ప్రభుత్వ కొలువుల్లో విధులు నిర్వహిస్తూ.. మరోవైపు ఐపీఎస్ సాధించేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారు దీక్ష. తొలి ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికై , దేశవ్యాప్తంగా 208 ర్యాంక్ సాధించారు. తెలంగాణ హైదరాబాద్ అప్పాలో శిక్షణ పూర్తయిన తర్వాత గుంటూరు జిల్లాకు బదిలీయ్యారు. నగరంపాలెం: దేశ రాజధాని పశ్చిమ ఢిల్లీ వాసి దీక్ష. తండ్రి దిల్జీత్‌సింగ్ విద్యాశాఖ అధికారి. తల్లి సునీత అసోసియేట్ ఆచార్యులు. ఇద్దరు సోదరులు. ఆమె భర్త ముఖేష్ ఆదాయపుపన్ను శాఖ అధికారి (ఐఆర్ఎస్). 2016లో యూపీఎస్సీ పరీక్షల్లో దీక్ష ఉత్తీర్ణత సాధించారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు ఎంపికై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో విధులు నిర్వర్తించారు. ఓ వైపు సమర్థంగా విధులు నిర్వహిస్తూ.. మరలా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2018లో డీఎస్పీ ర్యాంకర్ అధికారిగా ఎంపికై ఢిల్లీలో నాలుగేళ్లు పని చేశారు. ఈ సమయంలో అనేక సవాళ్లు, దేశ రాజధానిలో వీఐపీల రాకపోకలు, బందోబస్త్ ఇతరత్రా అంశాలపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది. 2021లో దీక్ష ఐపీఎస్‌కు ఎంపికై , 208వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమె ఆనందానికి ఆవధుల్లేవు. ఇక తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అప్పాలో ఐపీఎస్ శిక్షణ పూర్తి కావడం చకచకా జరిగిపోయాయి. గుంటూరు జిల్లాకు శిక్షణ ఐపీఎస్ అధికారిణిగా ఇటీవల విధుల్లో చేరారు. నేరాలు కలిచివేసేవి : దీక్ష ఐపీఎస్ సాధించాలనే లక్ష్యం మొదట్లోనే మదిలో నాటుకుంది. చిన్నారులు, బాలికలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై జరిగే నేరాలు మరింతగా కలిచివేసేవి. మహిళలపై నేరాలను తొలిదశలోనే నియంత్రించాలనే ఒక బలమైన కోరిక ఉండేది. సాధ్యమైనంత వరకు వాటిని కట్టడి చేయాలనేది నా ఆశయం. కుటుంబ వివాదాలు, మాదక ద్రవ్యాల వాడకం వల్ల తలెత్తే దుష్పరిణామాలు, తద్వారా విచ్ఛినమయ్యే కుటుంబాల పరిస్థితులు, సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలపై అవగాహన కల్పించడం, ముందస్తు చర్యలపై కూలంకషంగా వివరించాలనేది లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోని అత్యున్న సర్వీస్ ద్వారా మహిళలకు భద్రత, వారికి రక్షణ కల్పించాలనేది ఒక లక్ష్యంగా మారింది. దీంతో ఐపీఎస్ కొలువు సాధిం చేందుకు అహర్నిశలు శ్రమించాను. విధి నిర్వహణలో తీరిక లేకున్నా.. పట్టుదల, అకుంఠిత దీక్షతో రేయింబవళ్లు చదివాను. నాలుగేళ్లకు పైగా కష్టపడ్డాను. ఐపీఎస్‌లో దేశవ్యాప్తంగా 208వ ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉంది. ఏదైనా ప్రభుత్వ కొలువు సాధించాలంటే కఠోరమైన సాధన ఉండాల్సిందే. పోటీ పరీక్షలను పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో కొలువు సాధించాలనే తపన ఉండాలి. తద్వారా విజయం వైపు నడవాలి. ఐదు రోజుల్లో ఐదు కోట్ల రూపాయల దోపీడీ కేసు ఛేదన గుంటూరు జిల్లాకు తొలి పోస్టింగ్ అయినా.. తెలుగు భాషా కొంత వరకు మాట్లాడుతున్నా. జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ నేతృత్వంలో ముందస్తు చర్యలు చేపడుతున్నాం. సైబర్ నేరాలపై మేళాలు, కొద్ది నెలలు క్రితం జిల్లాలోని మహిళల కోసం ప్రారంభించిన మహిళా మీ కోసం.. మీ భద్రత.. మా బాధ్యత చాలా బాగుంది. సత్ఫలితాలునిచ్చాయి. ఇటీవల మంగళగిరి ఆత్మకూరు వద్ద జరిగిన రూ.5 కోట్ల బంగారు అభరణాల దోపిడీ ఘటనను సవాల్‌గా స్వీకరించాం. ఐదు రోజుల్లోనే దోపీడీని ఛేదించాం. సినీ ఫక్కీలో జరిగిన దోపిడీని కొద్ది రోజుల్లో రికవరీ చేయడం మరిచిపోలేని అనుభూతి. ఇక మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని క్వారీ తిరునాళ్లలో సమర్థంగా విధులు నిర్వర్తించాం. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంలో సఫలీకృతులయ్యాం. -
‘డై’యేరియాతో బీ కేర్‌ఫుల్ !
గుంటూరు మెడికల్: వేసవిలో వచ్చే వ్యాధుల్లో అతిసారం (డయేరియా) ముఖ్యమైంది. సకాలంలో వైద్యం చేయని పక్షంలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ప్రతి ఏడాది వేసవిలో జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత ఏడాది గుంటూరు నగరంలోని శారదా కాలనీలో 326 కేసులు నమోద్వగా, ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. చేబ్రోలు పీహెచ్సీ, మంచాల గ్రామంలో 62 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత వేసవిలో వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. కారణాలు విరేచనాలు నీళ్లుగా, పలచగా అవుతుంటే డయేరియా( అతిసారవ్యాధి) అంటారు. వైద్య పరిభాషలో దీన్ని ‘గ్యాస్ట్రో ఎంటైరెటిస్’గా పిలుస్తారు. ఈ వ్యాధి జీర్ణవ్యవస్థకు సోకుతుంది. నీళ్ల విరేచనాలు నూటికి 70శాతం వైరస్ క్రిముల వల్ల వస్తాయి. కలుషితమైన నీటిని తాగడం వల్ల, మలం మీద వాలిన ఈగలు ఆహార పదార్థాలపై వాలాకా తినడం ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి ప్రవేశించి విరేచనాలు అవుతాయి. లక్షణాలు ● జీర్ణ వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉడి వాంతులు, విరేచనాలు అవుతాయి. ● విరేచనాలు నీళ్లుగా, పలుచగా కావడం, కడుపులో మెలిపెట్టినట్లు నొప్పి ఉంటుంది. ● నీరసం, వికారం, వాంతులు, శరీరంలో లవణాలు పోయి పిక్కల నొప్పులు వస్తాయి. ● మనం తాగే నీరు శరీరం నుంచి అధిక మొత్తంలో బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ ఏర్పడి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ● డీహైడ్రేషన్‌లో నాడి వేగంగా లేదా బలహీనంగా కొట్టుకోవటం లేదా ఒక్కోసారి అసలు తెలియపోవడం ఉంటుంది ● నీరసం, నోరు, నాలుక, పిడచ కట్టుకుపోవడం, శరీరం ఎండిపోవడం ఉంటుంది ● ఒక్కోసారి మూత్రం అసలు రాకపోవడం లేదా చాలా తక్కువగా రావడం లేదా ముదురు పసుపు రంగులో వస్తుంది. ● వయస్సుతో సంబంధం లేకుండా డీ హైడ్రేషన్ వస్తుంది. దీనివల్ల పిల్లలకు, వృద్ధులకు ఎక్కువ ప్రమాదం. పిల్లలకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి డయేరియా వల్ల పెద్దవారికంటే పిల్లలకు ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వ్యాధి లక్షణాలు గుర్తించి దాహం పెరిగితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగించాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తారు. ఒక ప్యాకెట్ పౌడర్‌ను లీటర్ నీటిలో కలుపుకుని తాగాలి. విరేచనాలు అయ్యేవారికి కారం, మసాల వంటి ఘాటు పదార్థాలు పెట్టకూడదు. వ్యాధి తగ్గే వరకు వారికి వైద్యుల సలహా ప్రకారం మందులు, ఆహారం అందించాలి. వేసవిలో అతిసారం వ్యాపించే అవకాశం గత ఏడాది 388 కేసులు నమోదు ఒకరు మృతి ముందస్తు జాగ్రత్తలు పాటించాలి -
ఉచితంగా వైద్య సేవలు
వేసవిలో కేసులు నమోదయ్యే దృష్ట్యా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండేసీ పడకలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంచాం. మందులు, సైలెన్లు, అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి ముందస్తుగా గుర్తించి నివారణ చర్యల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అతిసార వ్యాధి బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. –డాక్టర్ కొర్రా విజయలక్ష్మి , డీఎంహెచ్ఓ, గుంటూరు -
కిరణ్ ఒక్కడే కాదు.. ఎందరో ఉన్నారు !
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో కిరణ్‌లాంటి వాళ్లు ఎంతో మంది వైఎస్సార్ సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు, మంత్రులు, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారందరినీ కూడా ప్రభుత్వం శిక్షించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకిరెడ్డి నాగ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ,ఆయన సతీమణి భారతిపై కిరణ్ చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. పోలీసులు ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా కొంతకాలం నుంచి వైఎస్సార్ సీపీ మహిళలపై, నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులపై అసభ్యకరంగా మార్ఫింగ్‌లు చేసి పోస్టులు పెడుతున్నారని తెలిపారు. కిరణ్‌పైనే కాకుండా మిగిలిన వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహిళలను కించపరిస్తే సహించమని తెలిపారు. , కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి, రాష్ట్ర బూత్ కమిటీల అధ్యక్షులు కొండమడుగుల సుధాకర్‌రెడ్డి, కొలుసు మోహన్ యాదవ్, కొండకాయల వంశీ, కృష్ణ, సత్తిరెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరినీ శిక్షించాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకిరెడ్డి నాగ నారాయణమూర్తి -
భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ పాత్ర కీలకం
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్: భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ పాత్ర ఎంతో కీలకమని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. జాతీయ సర్వే దినోత్సవంలో భాగంగా ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ భూమిపై మమకారం ఉంటుందని తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 10న జాతీయ సర్వే దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, 53 మంది సర్వే శాఖ ఉద్యోగులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన సర్వేయర్లకు ఇన్చార్జి కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్. మల్లికార్జునరావు, కార్యదర్శి ఆర్.మల్లికార్జునరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.లక్ష్మీనారాయణ, పి.వి. భావన్నారాయణ, సాంబశివరావు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్ నాశనం
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ గుంటూరు వెస్ట్ : మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్తు నాశనంతో పాటు దేశ అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ కమ్యూనిటీ విజిలెన్స్ అవగాహన సదస్సును జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, అమ్మకాలపై కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. వినియోగం అరికట్టేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నిషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ర్యాలీలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ నిషేధిత మాదక ద్రవ్యాల కేసుల్లో వ్యక్తులను అరెస్టులు చేసి విచారించేటప్పుడు, ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులకు వీటిని తీసుకొచ్చినట్లు తెలిపారన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విద్యనభ్యసిస్తున్న వారు అధికంగా సేవిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేసి, నిషేధిత మత్తు పదార్థాలను విద్యార్థులు వినియోగించకుండా చూడాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పోలీసు శాఖ రూపొందించిన ఈగల్ ప్రచార పోస్టర్లను జిల్లా ఇన్చార్జి కలెక్టర్, ఎస్పీ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, డీఆర్వో ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డీఈఓ రేణుక, ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి, జిల్లా అధికారులు ఆవిష్కరించారు. -
‘హ్యాకింగ్’ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: జిల్లా ప్రజలకు సైబర్ మోసాలపై విసృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం హ్యాకింగ్ సినిమా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. హ్యాకర్ల సైబర్ నేరాలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకులు నరేష్ దోనె, మణివరన్ తెలిపారు. ఇటీవల వచ్చిన ఏఐతో ఫొటో ద్వారా కూడా సరికొత్త సైబర్ నేరాలను హ్యాకర్లు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు వీటి బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలను చిత్రం ద్వారా తెలియజేయనున్నట్లు తెలిపారు. అంజలి సమర్పణలో అనుపమ ఆర్ట్స్ పతాకంపై రావూరి సురే ష్‌బాబు చిత్రం నిర్మిస్తున్నారని చెప్పారు. కొన్ని సన్నివేశాలను కొండవీడులో చిత్రీకరించామని, నటిగా ముంబైకు చెందిన కావ్య దేశాయ్ నటిస్తున్నట్లు వారు తెలిపారు. -
తెనాలి లాయర్స్ డైరీ ఆవిష్కరణ
తెనాలి: పట్టణానికి చెందిన న్యాయవాదుల చరిత్రపై రూపొందించిన ‘తెనాలి లాయర్స్ డైరీ’ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ పి.వెంకట జ్యోతిర్మయి గురువారం తన చాంబరులో ఆవిష్కరించారు. తెనాలి న్యాయవాది గుంటూరు కృష్ణ ఈ డైరీని రూపొందించారు. తెనాలి న్యాయవాదులు సమాజానికి చేసిన సేవలను, వృత్తిలో ఎదిగిన విధానాలను డైరీలో భావితరాలకు ఉపయోగపడేలా రూపొందించడం అభినందనీయమని వెంకట జ్యోతిర్మయి అన్నారు. 2011, 2018లో తెనాలి లాయర్స్ డైరీని తీసుకురాగా, మార్పులు చేర్పులతో ప్రస్తుతం ముద్రించినట్లు కృష్ణ చెప్పారు. తెనాలి కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన డాక్టర్ వెంకట జ్యోతిర్మయి చేతుల మీదుగా డైరీని ఆవిష్కరింప చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సహకరించిన పట్టణ ప్రముఖులు, న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి నన్నపనేని శ్రీహరి, హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు గొడవర్తి కిరణ్‌బాబు పాల్గొన్నారు. -
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
మేడికొండూరు: పార్టీ నేతలంతా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మండలంలోని పాలడుగులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ‘గావ్ చలో’ అభియాన్ (పల్లెకు పోదాం చలో) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. అనంతరం మేడికొండూరు మండల మాజీ అధ్యక్షుడు ఆమతి వెంకటరమణ నివాసంలో స్థానిక నాయకులతో మాట్లాడారు. పార్టీ నేతలంతా ప్రజలకు చేరువ అవడానికి కృషి చేయాలని చెప్పారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ సమావేశంలో మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు బాషా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు, జిల్లా ఇన్చార్జి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు మోదీ ఫొటో లేకపోవడంపై ఆగ్రహం పాలడుగు సచివాలయంలో ప్రధానమంత్రి మోదీ చిత్రపటం లేకపోవడంతో పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఫోటోను తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. -
నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ చీరాల రాక
చీరాల టౌన్: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం చీరాల వస్తున్నారని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు గురువారం తెలిపారు. గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనకు వస్తున్నారని రాజ్ భవన్ నుంచి సమాచారం అందడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు గవర్నర్ వాడరేవులోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారని, శనివారం విజయవాడ రాజ్‌భవన్‌కు ప్రయాణమవుతారని సమాచారం అందించారు. ఈ మేరకు ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ వ్యక్తిగత పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎయిమ్స్‌లో కార్డియాక్ ఐసీయూ విభాగం ప్రారంభం గుండె జబ్బు రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు మంగళగిరి: నగర పరిధిలోని ఎయిమ్స్‌లో గురువారం నూతనంగా కార్డియాక్ ఐసీయూ విభాగాన్ని ప్రారంభించారు. ఇప్పటికే కార్డియాక్ విభాగంలో యాంజియోప్లాస్టీతో పాటు అన్ని రకాల సేవలందుతున్నాయి. అయితే, ఐసీయూ విభాగం లేకపోవడంతో గుండె సంబంధిత రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకతప్పడం లేదు. అన్ని రకాల వైద్య సేవలతో ఐసీయూ విభాగం అందుబాటులోకి రావడంతో రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కుడికాలువకు నీటి విడుదల నిలుపుదల విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు అధికారులు గురువారం నీటిని నిలుపుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 515.30 అడుగుల వద్ద ఉంది. ఇది 140.8451 టీఎంసీలకు సమానంగా ఉంది. ఇక్కడ నుంచి ఎస్ఎల్బీసీకి 841 క్యూసెక్కులు విడుదలవుతోంది. దుర్గమ్మ సన్నిధిలో ఎన్నికల కమిషనర్లు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ, తెలంగాణ ఎన్నికల కమిషనర్లు గురువారం దర్శించుకున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ఇంద్రకీలాద్రికి విచ్చేయగా ఆలయ అధికారులు వారిని సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్, ఏఈవో చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలతో వారిని సత్కరించారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన డి. మాల్యాద్రి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,11,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఆలయ అధికారి లక్ష్మణ్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
సమాజ హితమే సాహిత్యం పరమావధి
తాడేపల్లి రూరల్: మాతృ భాషలు మృత భాషలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. ఏ ప్రాంత సంస్కృతి పరిరక్షించబడాలన్నా ఆ ప్రాంత భాష ముందుగా రక్షింపబడాలని తెలిపారు. వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో బీఏ (ఐఎఎస్) విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు, వాదాలు – సమాలోచన’’ అనే అంశంపై ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ హితమే సాహిత్యం పరమావధి అని పేర్కొన్నారు. రాష్ట్ర రహదారుల భద్రతా విభాగం డీఐజీ సీహెచ్. విజయారావు మాట్లాడుతూ మాతృభాషలో సివిల్ సర్వీసెస్ రాసి లక్ష్యాన్ని సాధించడం సులువని తెలిపారు. అనంతరం యూనివర్సిటీ ప్రచురించిన 11 సంవత్సరాల యూపీఎస్సీ పాత ప్రశ్నపత్రాలు – సమాధానాలు, విశ్లేషణతో కూడిన గ్రంథాన్ని ఆవిష్కరించి, ఉచితంగా విద్యార్థులకు అందజేశారు. వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ డి. రాంబాబు మాట్లాడుతూ తెలుగు ప్రధాన అంశంగా తీసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత మార్గ నిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర లయోలా విశ్రాంత వైస్ ప్రిన్సిపాల్ గుమ్మా సాంబశివరావు, రచయిత్రి నైనాల వాణిశ్రీ , బీఏ విభాగాధిపతి బి. శివనాగయ్య, సహాయ ఆచార్యులు అద్దంకి ప్రజాపతి, వర్సిటీ వీసీ జి. పార్థసారథివర్మ, ప్రో వీసీలు ఏవీఎస్ ప్రసాద్, కె. రాజశేఖరరావు, ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ కె. సుబ్బారావు, బీఏ ఉప విభాగాధిపతి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కాచి చల్చార్చిన నీరు తాగాలి
డయేరియా బాధితులకు ద్రవ రూపంలో ఉండే మజ్జిగ, పాలు, బార్లీ గంజి, పలచగా తయారు చేసిన సగ్గుబియ్యం, రాగి జావ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, సోయాబీన్స్ రసం, ఇతర పళ్ల రసాలు ఇవ్వొచ్చు. మలమూత్ర విసర్జన తర్వాత, భోజనం చేసే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం చాలా ఉత్తమం. ఇంట్లో వైద్యాలు, మందుల షాపుల వద్దకు వెళ్లి మందులు తెచ్చుకోవడం చేయవద్దు. డయేరియా వచ్చినప్పుడు అర్హత ఉన్న వైద్యనిపుణుడి వద్దకు వెళ్లాలి. –డాక్టర్ షేక్ నాగూర్ బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గుంటూరు -
ఆటో బోల్తా పడి 10 మందికి గాయాలు
తెనాలి రూరల్: కుక్కలను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా 10 మంది గాయాలపాలయ్యారు. తెనాలి వైకుంఠపురం సమీపంలో గురువారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన ధర్మ, యాకోబు, బెంజమిన్, మరియమ్మ, శ్యామల, వెంకటరత్నం, అమ్మారావు, సుశీల, సైమాన్ రాయి పని కోసం తెనాలి మండలం కొలకలూరుకు కొద్ది రోజులుగా వస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మూల్పూరుకే చెందిన ఆటో డ్రైవర్ మూల్పూరి నరేష్ ఆటోలో వీరు వస్తున్నారు. తెనాలి వైకుంఠపురం సమీపంలో రహదారిపై మూడు కుక్కలు అడ్డు వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా కొట్టడంతో అందులోని 10 మంది గాయపడ్డారు. 108లో వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో యాకోబు పరిస్థితి విషమంగా ఉండంతో గుంటూరు పంపారు. ఘటనపై త్రీ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. -
థలసేమియా ట్రాన్స్‌ప్యూజన్ సెంటర్‌కు స్థలం కేటాయించండి
కలెక్టర్‌ను కోరిన రెడ్‌క్రాస్ కార్యవర్గ సభ్యులు నరసరావుపేట: రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ‘మీ డాక్టర్ మీ ఇంటికి’ అనే ప్రాజెక్టు దేశం మొత్తంలో 33 జిల్లాలకు మంజూరు కాగా అందులో పల్నాడు జిల్లా ఒకటని రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంజుల జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.అరుణ్‌బాబును కలిసి రెడ్‌క్రాస్ జిల్లా కార్యకలాపాలను గురించి వివరించారు. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించి జిల్లాలో ఉన్న గిరిజన తండాలు, మత్స్యకారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యాన్ని అందజేస్తామని తెలియజేశారు. అలాగే జిల్లాకు రెడ్ క్రాస్ ద్వారా థలసేమియా ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ మంజూరైందని, సుమారు రూ.6లక్షల విలువ చేసే సామగ్రి కూడా మంజూరు చేశారని, ఈ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 10 పడకల స్థలాన్ని మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ కోరారు. ఆర్డీఓ కాంపౌండ్‌లో ఉన్న 15 సెంట్ల రెడ్‌క్రాస్ స్థలాన్ని సర్వే చేయించి రెడ్‌క్రాస్‌కు కేటాయిస్తే అందులో నూతన భవన నిర్మాణం చేసి ఓల్డ్ ఏజ్ హోమ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్, ఉచిత వైద్యశాల, అనాథ శరణాలయం, జనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి జిల్లా కలెక్టర్ సుముఖత వ్యక్తం చేసినట్లు డాక్టర్ కంజుల తెలిపారు. రెడ్‌క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు, మేనేజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ పరిశీలన పెదకూరపాడు: 75త్యాళ్ళూరు జిల్లా పరిషత్ హైస్కూల్లోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను రాష్ట్ర బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులతో సంభాషించి, వారు చేస్తున్న ప్రాజెక్టులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ స్టేట్ ఆఫీసర్, యునిసెఫ్ కన్సల్టెంట్ సుదర్శన్ మాట్లాడుతూ రానున్న కాలం అంతా రోబోటిక్, డిజిటల్ టెక్నాలజీదేనని, విద్యార్థులు నూతన టెక్నాలజీని ఉపయోగించి తాము తయారుచేసిన నమూనాలకు స్టార్టప్ ప్రోగ్రాం కింద ప్రోత్సాహక నగదు, పేటెంట్ పొందవచ్చన్నారు. ఇన్నోవేటివ్ స్పిరిట్‌తో విద్యార్థులు ముందడుగు వేయాలని అన్నారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విన్నూతనమైన ప్రాజెక్టులను తయారు చేయడానికి విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించాలన్నారు. హెచ్ఎం ఎ.శ్రీనివాస రెడ్డి, అటల్ ల్యాబ్ ఇన్చార్జి కె.వి.సుబ్బారావు, ఈఆర్డీసీకి చెందిన అమర్, మెంటర్ సుస్మిత, సీఆర్పీ శివ, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్ఫూర్తిదాయకం– కేఎస్ సామాజిక దృక్పథం
పట్నంబజారు: సామాజిక స్ఫూర్తితో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాలు, పలువురు మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు కలిసి బుధవారం బృందావన్ గార్డెన్స్‌లోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సత్కార సభ నిర్వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ అధ్యాపకుడిగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యావేత్త.. అనేక కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఎందరో నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు అందించిన మేధావిగా కొనియాడారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన సామాజిక ఉద్యమకారుడు అని చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ నిరాడంబరత, సమయపాలనకు ఆయన పెట్టింది పేరని, సామాజిక ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషిని వీడియోల రూపంలో భద్రపరిస్తే భావితరాలకు అది ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు వి.లక్ష్మణరెడ్డి, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ఆయన సేవలను కొనియాడారు. స్పందించిన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో ముందుకు సాగుతూ సమస్యలపై పోరాడేందుకు ముందు నిలబడడం తనకు అలవాటుగా మారిందని వివరించారు. ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిన అన్ని ప్రజోపయోగ పోరాటాల్లో తన వంతు పాత్ర పోషించినట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, స్ఫూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బందా రవీంద్రనాథ్, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి గోరంట్ల వెంకట్రావు, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధనుంజయరెడ్డి, సీపీఎం నేత భారవి, విశ్రాంత ప్రధాన అధ్యాపకులు డీఏఆర్ సుబ్రహ్మణ్యం, ముత్యం పాల్గొన్నారు. -
నేటి నుంచి కృపా మహాసభలు
గుంటూరురూరల్: క్రీస్తు నామాన్ని ఘనపరిస్తే ఆయన మనలను ఘనపరుస్తాడని కృపా మినిస్ట్రీస్ అధ్యక్షుడు బ్రదర్ మాథ్యూస్ తెలిపారు. బుధవారం నల్లపాడు రోడ్డులో ప్రతిఏటా నిర్వహించే కృపా మహాసభల ప్రాంగణంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 19వ కృపా మహాసభలను గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. హౌసింగ్‌బోర్డ్ కాలనీ ఎదురు రోడ్డులో నల్లపాడు రోడ్డునందు ఈ సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 13వ తేదీ ఆదివారం సాయంత్రం వరకూ ఈ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీస్తుని భక్తులు లక్షలాదిగా పాల్గొంటారన్నారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు పగటిపూట ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. వేసవి కాలం కావున క్రీస్తుని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. రాత్రి సమయంలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చినవారికి భోజన వసతి, మరుగుదొడ్లు, ప్రత్యేకంగా మినిస్ట్రీస్ వలంటీర్ల రక్షణలో భద్రత ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమవుతాయని, రాత్రి ప్రార్థనలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మినిస్ట్రీస్ సేవకులు, బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు లక్షలాదిగా హాజరుకానున్న క్రీస్తు భక్తులు -
మనోళ్లే ఆర్పీగా పెట్టుకోండి
● ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ● నియమించిన మెప్మా సిబ్బంది నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ‘మనోళ్లే.. నేను చెప్తున్న కదా.. ఆ అమ్మాయిని రిసోర్స్ పర్సన్(ఆర్పీ)గా పెట్టుకోవాలి’ అంటూ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇవ్వడంతో మెప్మా సీఎంఎం పావని, సీఓ సరోజిని కొత్తగా ఓ ఆర్పీని నియమించారు. అంతేగాక వేరే ఆర్పీల వద్ద నుంచి 22 గ్రూపులను తీసుకుని ఆమెకు కేటాయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఎంలు(సిటీ మిషన్ మేనేజర్), సీఓలు(కమ్యూనిటీ ఆర్గనైజర్)ల కంటే ఆర్పీలు ఎక్కువగా ఉన్నారని.. వీరికి జీతాలు చెల్లించేందుకూ అవస్థలు పడాల్సిన దుస్థితి ఉందని, కొత్తవారిని తీసుకోవద్దని మెప్మా ఎండీ స్పష్టంగా ఆదేశించినా సిబ్బంది పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే లేటర్ ఇచ్చారని కొత్త ఆర్పీని నియమించారు. బుధవారం రామిరెడ్డితోటలోని బంగ్లా మున్సిపల్ స్కూల్లో సమావేశమై కొత్త ఆర్పీని గ్రూపు సభ్యులకు పరిచయం చేశారు. లాగిన్ ఇవ్వడం లేదు కొత్త ఆర్పీ కోసం సమైక్యలో గ్రూపు సభ్యులంతా కలిసి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం మేరకే కొత్త ఆర్పీని నియమించాం. కానీ లాగిన్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం వేరే ఆర్పీల వద్ద ఉన్న గ్రూపుల నుంచి 22 గ్రూపులను కొత్త ఆర్పీకి కేటాయించాం. – పావని, సీఎంఎం గుంటూరు–ఔరంగాబాద్ రైలు 90 నిమిషాలు ఆలస్యం లక్ష్మీపురం(గుంటూరు వెస్ట): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా ప్రయాణించాల్సిన గుంటూరు–ఔరంగబాద్ రైలు ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో 90 నిమిషాలపాటు ఆలస్యంగా ప్రయాణిస్తుందని డివిజన్ సీనియర్ డిసీఎం ప్రదీప్‌కుమార్ బుధవారం తెలిపారు. రైలు నంబర్ 17253 రైలు గుంటూరు–ఔరంగబాద్ రైలు ఈనెల 11, 12, 13వ తేదిలలో 90 నిమిషాలపాటు ఆలస్యంగా ప్రయాణిస్తుందని ప్రయాణికులు గమనించి సహకరించాల్సిందిగా కోరారు. పీహెచ్సీలలో డీఎంహెచ్ఓ తనిఖీలు అచ్చంపేట(క్రోసూరు): పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. మాదిపాడు పీహెచ్సీ పరిధిలోని చింతపల్లి, మాదిపాడు సబ్ సెంటర్స్‌లో జరిగే సాధారణ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి డీఎంహెచ్ఓ పలు సూచనలు చేశారు. చిన్న పిల్లల వాక్సినేషన్‌ను వేసవి దృష్ట్యా ఉదయం 11 గంటల లోపు ముగించాలని తెలిపారు. అనంతరం పీహెచ్సీ కార్యకలాపాలపై వైద్యాధికారి డాక్టర్ ఎం.ఇన్నారావును అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో జిల్లా ప్రోగ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ డి.హనుమకుమార్ పాల్గొన్నారు. అచ్చంపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ స్రవంతి, మాదిపాడు సీహెచ్ఓ హర్ష వర్ధన్, శివ నాగేశ్వరి, ఆరోగ్య విస్తరణ అధికారి పి.వెంకటరావు, హెల్త్ ఎడ్యుకేటర్ పార్వతి, సూపర్వైజర్ పి.రాధాకృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయండి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్‌లో ఫిజియోథెరఫిస్ట్స్ ప్రొఫెషన్ కౌన్సిల్ సభ్యులను తక్షణమే నియమించాలని ఆంధ్రప్రదేశ్ ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాపట్ల వేంకటహరికృష్ణ కోరారు. ఈమేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.వెంకటేశ్వరరావు, సెక్రటరీ డాక్టర్ సుమైలను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫిజియోథెరఫిస్ట్స్ ప్రొఫెషన్ కౌన్సిల్ ప్రత్యేక సభ్యులను నియమించేందుకు గజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. నాటి గజిట్ ఆధారంగా కౌన్సిల్ ఏర్పాటు చేస్తే తమ సమస్యలు పరిష్కరించేందుకు తమకు అవకాశం కలుగుతోందన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ షేక్ సుభాని, రాష్ట్ర కమిటి సభ్యులు డాక్టర్ చెవుల ఏడుకొండలు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ గ్రేస్, డాక్టర్ ఇమ్రాన్‌ఖాన్, డాక్టర్ రాజేష్ రోషన్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ దయాకర్ తదితరులు ఉన్నారు. తొలుత నూతనంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటేశ్వరరావును ఫిజియోథెరఫిస్ట్స్ అసోసియేషన్ నేతలు బొకే అందజేసి సత్కరించారు. -
రాసి రంపానబెట్టు..!
● పోలీస్ స్టేషన్లలో రైటర్లదే హవా! ● ఏ ఫిర్యాదు అయినా రాత్రి 10.30 తర్వాతే కేసు ● స్టేషన్ బయట బాధితులు పడిగాపులు కాయాల్సిందే లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వస్తున్న బాధితులకు నరకం కనిపిస్తోంది. ఫిర్యాదుపై కేసు నమోదుకు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. కేసు నమోదుకు స్టేషన్ రైటర్లు, సిబ్బంది తాత్సారం చేస్తున్నారు. రోజూ రాత్రి 10.30 గంటల తర్వాత రాజీ కుదరకపోతేనే కేసు నమోదు చేస్తున్న దుస్థితి నెలకొంది. దీనివల్ల బాధితులు ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం, అరండల్‌పేట, నగరంపాలెం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లు రోజూ అర్ధరాత్రివరకు జనంతో రద్దీగా ఉంటాయి. ప్రతి స్టేషన్లోనూ స్టేషన్ ఎస్హెచ్ఓలు, ఎస్ఐల కంటే రైటర్లదే హవా. ఏ కేసైనా వారికి తెలీకుండా నమోదవదు. ఈ కేసులన్నీ రాత్రి 10.30 గంటల తర్వాతే నమోదవుతాయి. వాస్తవానికి స్పెషల్ బ్రాంచి సిబ్బంది రోజూ రాత్రి 9 గంటల తర్వాత డీఎస్ఆర్(డైలీ స్టేషన్ రికార్డు) సేకరిస్తారు. అయితే అప్పటికీ ఏ కేసులూ నమోదు కావు. ఉదయం పత్రికల్లో మాత్రం నమోదైన కేసులు రిపోర్ట్ అవుతాయి. వీటిని చూసి స్పెషల్ బ్రాంచి సిబ్బంది రోజూ అవాక్కవడం పరిపాటే. ఆయన స్టైలే వేరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్‌గా సుదీర్ఘకాలం పని చేసి హెడ్‌కానిస్టేబుల్‌గా ఉద్యోగోన్నతి పొందిన వ్యక్తి రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన స్టైలే వేరు. స్టేషన్ ఎస్హెచ్ఓ, ఎస్ఐ, తోటి సిబ్బందినీ లెక్క చేయరట. గతంలో బోరుగడ్డ అనిల్ కేసు విషయంలో వీర్‌కు వెళ్ళిన స్టేషన్ అధికారి ఈయనను ఏరి కోరి తెచ్చి స్టేషన్ రైటర్ బాధ్యతలు అప్పగించారట. అప్పటి నుంచి ఈయన బాధితులను రాచిరంపాన పెడుతున్నారని సమాచారం. స్టేషన్ అధికారి కేసు నమోదు చేయాలని చెప్పినా రాత్రి 10.30 గంటల వరకు బాధితులను అక్కడే ఉంచి 11 గంటల తర్వాత కేసు నమోదు చేస్తుంటారని చెబుతున్నారు. ఎవరైనా బాధితులు గట్టిగా ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ లేరని, సిబ్బంది బయటకు వెళ్లారని సాకులు చెబుతారని సమాచారం. ఆ రెండు స్టేషన్లలో కొత్త రైటర్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా వీరేంద్ర, నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా వీరా నాయక్ ఉన్న సమయంలో రైటర్లు పూర్తి హవా నడిపే వారు. స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఫిర్యాదులపై రాత్రి 10 గంటలు దాటిన తరువాతే కేసు కట్టేవారు. ఇటీవల ఎస్హెచ్ఓలు బదిలీ కావడంతో కొత్తగా అధికారులు బాధ్యతలు చేపట్టారు. దీంతో రైటర్లు కూడా మారారు. ఇప్పడు కొత్తగా వచ్చిన వారి తీరు ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.. బాధితులకు గౌరవం ఇవ్వాలి ఇటీవల గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని రైటర్లు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, బాధితులతో అగౌరవంగా ప్రవర్తించినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించాం. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదును పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తప్పవు. – కె.అరవింద్, డీఎస్పీ, వెస్ట్ సబ్ డివిజన్ -
12 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్, జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలను ఈనెల 12వ తేదీనుంచి 18వ తేదీవరకు నిర్వహించనున్నారు. పట్టణ రామలింగేశ్వరపేట లోని ఓపెన్ ఆడిటోరియం (తడికలబడి)లో జరగనున్న ఈ పోటీల బ్రోచర్‌ను బుధవారం స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతులమీదుగా ఆవిష్కరించారు. వివరాలను పరిషత్ నిర్వాహకులు, తెనాలి కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కన్న, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కార్యదర్శి పిట్టు వెంకట కోటేశ్వరరావు, కోశాధికారి సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఏడురోజులు జరిగే నాటికల పోటీల్లో 11 నాటికలను ప్రదర్శిస్తారు. తొలిరోజున జరిగే ప్రారంభసభలో రజక సంఘం నేత పెసర్లంక రమణకు వైఎస్ రాజశేఖరరెడ్డి పురస్కారం ప్రదానం చేస్తారు. 16న తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా కందుకూరి వీరేశలింగం పురస్కారాన్ని భీమవరానికి చెందిన చైతన్య కళాభారతి సంగీత నృత్యనాటక కళాపరిషత్ నిర్వాహకుడు రాయప్రోలు భగవాన్‌కు బహూకరిస్తారు. 18న జరిగే ముగింపుసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అత్తోట కిషోర్‌కుమార్ (చంటి)కు రాజశేఖరరెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేస్తామని వివరించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన జరిగే ఆయా సభల్లో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు పాల్గొంటారని వివరించారు. బ్రోచర్ ఆవిష్కరణలో పార్టీ నేతలు అక్కిదాసు కిరణ్‌కుమార్, కఠారి హరీష్, షేక్ దుబాయ్‌బాబు, అత్తోట సర్పంచ్ నాగపుణ్యేశ్వరరావు పాల్గొన్నారు. జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు ఏడురోజుల పాటు 11 నాటికల ప్రదర్శన మూడు సభల్లో ప్రముఖులకు పురస్కారాల ప్రదానం -
లారీ కిద పడి మహిళ మృతి
పొన్నెకల్లు(తాడికొండ): నడిచి వెళుతున్న మహిళ ప్రమాద వశాత్తు వరిచెత్త లారీ వెనుక చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పొన్నెకల్లు బైపాస్ రోడ్డు పక్కనున్న వైన్స్ షాపులో అదే గ్రామానికి చెందిన అస్త్రాల అన్నపూర్ణ(70) అనే మహిళ కొంత కాంగా పనిచేసేందుకు వెళుతుంది. బుధవారం ఉదయం దుకాణానికి వెళుతుండగా చెత్త లోడుతో వెళుతున్న లారీ తగలడంతో వెనుక టైర్ల కింద పడి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని సీఐ కె.వాసు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలి అల్లుడు చినయాకోబు ఫిర్యాదు మేరకు ఎస్ఐ జోజి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జిల్లా వైద్యశాలలో పర్యటించిన కాయకల్ప బృందం
తెనాలిఅర్భన్: తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం కాయకల్ప బృందం పర్యటించింది. మంగళగిరిలోని నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు డాక్టర్ నిర్మలగ్లోరి, డాక్టర్ స్టెఫిగ్రేస్లు తల్లీపిల్లల వైద్యశాలలోని పలు వార్డులు, ఆపరేషన్ ఽథియేటర్, జిల్లా వైద్యశాలలోని పలు వార్డులు, ల్యాబ్‌లను పరిశీలించి అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. డాక్టర్ నిర్మల గ్లోరి మాట్లాడుతూ కాయకల్ప కార్యక్రమంలో భాగంగా తెనాలి రావటం జరిగిందన్నారు. ఆస్పత్రిలో నిబంధనలకు అనుగుణంగా రోగులకు సేవలు అందింస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో శానిటేషన్ బాగోకపోతే ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉంటుందన్నారు. దానిపై ప్రత్యేక పరిశీలన జరుపుతున్నట్లు వివరించారు. జిల్లా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. రోగులకు అందించే సేవలు సంతృప్తికరంగా ఉన్నట్లు రోగులు తెలిపారన్నారు. వారి వెంట వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఆర్ఎంవో డాక్టర్ మల్లికార్జునరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, పలువురు వైద్యులు, సిబ్బంది ఉన్నారు. -
వీధి కుక్కల నియంత్రణకు సహకరించాలి
నెహ్రూనగర్: నగరంలో వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అవసరమని, అందుకు జంతు ప్రేమికులూ సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అభ్యర్థించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో జంతు ప్రేమికులు, పశుసంవర్ధక శాఖ, నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ అధికారులతో ఏబీసీ నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ వీధి కుక్కల కుటుంబ నియంత్రణ, సంక్షేమానికి సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తామని చెప్పారు. నగరంలో వీధి కుక్కల సమస్యలపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, ఇటీవల ఇద్వా నగర్లో కుక్క దాడిలో ఐజాక్ అనే బాలుడు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రస్తుతం నగరంలో పశుసంవర్ధక శాఖ లెక్కల మేరకు 35 వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని, వీటికి నగరపాలక సంస్థ ఏటుకూరు రోడ్ లోని ఏబీసీ చేస్తుండగా కొందరు జంతు ప్రేమికుల పేరుతో లేవనెత్తిన ఫిర్యాదుల మేరకు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు. కేంద్ర బృందం పరిశీలన అనంతరం వారి సూచనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏబీసీ ఆపరేషన్లు వెంటనే పునఃప్రారంభం చేయడానికి పశుసంవర్ధక శాఖ నుంచి 5 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లను నియమించిందన్నారు. స్టేరిలైజేషన్ చేసిన కుక్కలను అదే ప్రాంతంలో వదిలేలా, చేసిన వాటికీ ప్రత్యేక ట్యాగ్లు ఏర్పాటు చేస్తామన్నారు. సదరు కార్యకలాపాలను జంతు ప్రేమికులు కూడా నేరుగా పరిశీలించవచ్చన్నారు. అనంతరం జంతు ప్రేమికులు చెప్పిన అంశాలను, ఫిర్యాదులపై కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్య పరిష్కారం చేసుకుంటూ, ఏబీసీ నిర్వహణ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం, పశుసంవర్ధక శాఖ నుండి డాక్టర్ చక్రవర్తి, ఈశ్వరరెడ్డి, జీఎంసీ విఏఎస్ డాక్టర్ వెంకటేస్వర్లు, జంతు ప్రేమికులు ప్రదీప్ జైన్, తేజోవంత్, రాజ్యలక్ష్మీ, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు -
గుంటూరు
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సదరం క్యాంప్ పునఃప్రారంభం తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 515.60 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి గుడి పునర్నిర్మాణానికి వినుకొండకు చెందిన కె.వెంకటమాధవ్, లక్ష్మీప్రియ దంపతులు బుధవారం రూ.1,00,116 అందజేశారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : ఆలయాల్లో కూటమి నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. పూజా కార్యక్రమాల పేరుతో భక్తులను దోచుకోవడమేకాక ఖర్చులకు అధిక బిల్లులు పెట్టి ఇష్టారాజ్యంగా దిగమింగుతున్నారు. తాజాగా ఆలయ కమిటీల నామినేటెడ్ పదవుల పేరుతో ఆశావహుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. గుంటూరు నగరంలో కొన్ని ఆలయాలకు కమిటీలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి కూటమి నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు. పట్నంబజారులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో కమిటీకి చైర్మన్ సభ్యులు ఉన్నా.. వారికి విలువ ఇవ్వడం లేదు. ఓ టీడీపీ కార్పొరేటరే అంతా తానై పెత్తనం చేస్తున్నారు. ఉత్సవాల సమయంలోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డారు. రూ.90లక్షలకు మించి ఖర్చు చేయకుండా రూ.కోటి 25 లక్షల వరకు ఖర్చయిందని చెప్పి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లెక్కలు చూపమంటే చల్లగా జారుకుంటున్నారని సమాచారం. దీనిపై ఆర్యవైశ్య సంఘాలు భగ్గుమంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ● పాతగుంటూరలోని గంగపార్వతీ సమే అగస్తేశ్వరస్వామి ఆలయంలో జనసేనలో చేరిన ఓ కార్పొరేటర్ కుమారుడు రాజ్యమేలుతున్నాడని తెలుస్తోంది. కమిటీలో తాను చెప్పిన వారికే ప్రాధాన్యం ఉంటుందని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ● కొత్తపేటలోని గంగాపార్వతి సమేత మల్లికార్జున స్వామి గుడిలో కూడా ఒక జనసేన కార్పొరేటర్ ఓవరాక్షన్ చేస్తున్నారు. తానే తర్వాతి ఛైర్మన్నని ప్రకటించుకుంటూ అధికారులు, అర్చకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సమాచారం. ● చౌత్రా సెంటర్లోని కోదండ రామాలయంలో టీడీపీ నేత వసూళ్ళ పర్వానికే తెరదీశాడు. పూజా కార్యక్రమాల పేరుతో భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ● రైలుపేటలోని ఆంజనేయస్వామి దేవస్థానంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ● లాలాపేట వేంకటేశ్వరస్వామి గుడికి ప్రస్తుతం ఉన్న కమిటీని ఎలాగైనా రద్దు చేయాలే ఉద్దేశంతో సమావేశాల పేరుతో కూటమి నేతలు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కుట్రలు పన్నుతున్నారు. వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోవతే కమిటీ రద్దవుతుందని చెబుతున్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లోనూ కమిటీ సభ్యులకు ప్రాధాన్యం లేకుండా చేశారు. టీడీపీ నేతలే కీలకపాత్ర పోషిస్తున్నారు. కోల్డ్‌వార్ నామినేటడ్ పదవులపై కూటమి నేతల్లోనే కోల్డ్‌వార్ నడుస్తోంది. పదవుల కోసం ఎవరికి వారు పైరవీలు నడుపుతున్నారు. అధికార పార్టీ నేతల వద్దకు వెళ్లి తమకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. అయితే టీడీపీ ప్రజాప్రతినిధులు వారి పార్టీ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పదవుల అమ్మకం 7న్యూస్రీల్ఈఓల నుంచి వివరాలు తెలుసుకుంటాం ఆలయాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మా దృష్టికి రాలేదు. కమిటీల ఏర్పాటుకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రాలేదు. లాలాపేట వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో, చౌత్రా రామాలయం ఈవోలు సెలవులో ఉన్నారు. మిగతా ఆలయాల గురించి పూర్తి వివరాలు ఈవోలను అడిగి తెలుసుకుంటాం. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, లాలాపేట గ్రూప్ టెంపుల్స్ ఆలయాల కమిటీలు ఉన్నాయి. మిగతా గుడుల వివరాలు అడిగి తెలుసుకుంటాం. – కేబీ శ్రీనివాస్, డెప్యూటీ కమిషనర్, దేవదాయశాఖ ఆలయాల్లో కూటమి నేతల కాసుల కక్కుర్తి కమిటీల పేరుతో ఆశావహుల నుంచి భారీగా వసూళ్లు దోపిడీకి దేవదాయ శాఖ అధికారుల వత్తాసు కూటమి అధినాయకత్వం ఆశీస్సులు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఆలయాల్లోని కమిటీ పదవుల అమ్మకం వ్యాపారం జరుగుతోందని తెలుస్తోంది. 6ఏ, 6బీ, 6సీ ప్రామాణికంగా రేట్లు ఫిక్స్ చేస్తున్నారని చెబుతున్నారు. రూ 5 లక్షల మొదలుకొని, రూ 15 లక్షల వరకు కమిటీల ఏర్పాటు కోసం.. ఒకటికి నలుగురి దగ్గర వసూళ్ళకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. -
నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్ట చర్యలు
పట్నంబజారు: ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రధాన కూడళ్లలో ఆటోలు, సిటీ బస్సులు, ఇతర వాహనాలు నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం గుంటూరు నగరంలోని ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో, కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో, ఆర్కేటీ సెంటర్, టౌన్ చర్చి, కింగ్ హోటల్ సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, పూల మార్కెట్ వరకు నడుచుకుంటూ ట్రాఫిక్ సరళి పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయానికి కారణమవుతున్న సమస్యల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ నిబంధనలు పటిష్టంగా అమలు పరచడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు. ఆటోవాలాలు, ఇతర వాహనదారులు వాటి వాహనాలను క్రమపద్ధతిలో నిలుపుకునేలా చూడాలన్నారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బి.సీతారామయ్య, కొత్తపేట పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం.వీరయ్యచౌదరి, పాతగుంటూరు పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ వై.వీరసోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ నగరంలో పర్యటన -
డ్రగ్స్‌తో జీవితాలు బలి చేసుకోవద్దు
ఈగల్ టీమ్ ఎస్పీ నగేష్ ఏఎన్‌యూ(గుంటూరు): డ్రగ్స్‌తో జీవితాలు బలి చేసుకోవద్దని యువతకు పోలీస్ విభాగ ఈగల్ టీమ్ ఎస్సీ కె.నగేష్ సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహిస్తున్న ఏఎన్‌యూ మహోత్సవ్ 2కే25 కార్యక్రమంలో భాగంగా బుధవారం యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ‘ఎరాడికేషన్ ఆన్ డ్రగ్స్’ అనే అంశంపై విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగేష్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామాలను వివరించారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ జోలికి పోరాదని సూచించారు. ఈగల్ ఎస్పీతో కలిసి వర్సిటీ అధికారులు, విద్యార్థులు అధ్యాపకులు డ్రగ్స్ ఎరాడికేషన్పై ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామలపై స్కిట్ ప్రదర్శించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, రెక్టార్ ఆచార్య రత్నషీలామణి, ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం.గోపికృష్ణ, డి. చంద్రమౌళి, కన్వీనర్ డాక్టర్ సిహెచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యువ శాస్త్రవేత్తలుగా ఎంపికై న విద్యార్థులకు అభినందన
గుంటూరు ఎడ్యుకేషన్: ఇస్రో యువికా యువ శాస్త్రవేత్త కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి ఎంపికై న విద్యార్థులను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్‌తేజ అభినందించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో భార్గవ్‌తేజ మాట్లాడుతూ ఇస్రో యువికా యువ శాస్త్రవేత్త కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 3.50 లక్షల మంది పోటీ పడగా, అందులో కేవలం 350 మంది ఎంపికయ్యారని అన్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికై న 10 మంది విద్యార్థుల్లో గుంటూరు జిల్లాకు చెందిన ముట్లూరు జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి సందు పవన్దుర్గ, డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థి వక్కపట్ల సోమశేఖర్ ఉండడం జిల్లాకు గర్వకారణమన్నారు. మే 18 నుంచి 31 వరకు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరగనున్న యువికా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనున్న విద్యార్థులు జిల్లాకు పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, ముట్లూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం జోస్ మేరీ, సైన్స్ ఉపాధ్యాయుడు రామాంజనేయులు, టీచర్లు పాల్గొన్నారు. -
టీడీపీ ప్రజా దర్బార్‌లో రభస
గుంటూరు మెడికల్: గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డులో బుధవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజలను అధిక సంఖ్యలో తరలించే యత్నంలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు కావాల్సిన వారు కార్యక్రమానికి వస్తే ఇస్తామంటూ ఆటోల్లో ప్రచారం చేశారు. దీంతో స్థానిక ప్రజలు అధిక మొత్తంలో ప్రజా దర్బార్‌కు హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని, రేషన్ కార్డులు కావాలని, పెన్షన్లు ఇప్పించాలంటూ పలువురు ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రేషన్ కార్డులు మంజూరుకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని, అనుమతి రాగానే అందరికీ పథకాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మణిగింది. అధిక మొత్తంలో ప్రజలు పథకాల కోసం హాజరవడంతో జనాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగి రభస చోటు చేసుకుంది. -
స్టాంప్ వెండార్లపై కత్తి
గుంటూరు వెస్ట్: ఉపాధి మార్గాలు సృష్టించడం సంగతి దేవుడెరుగు ఉన్న కాస్త జీవనోపాధిని హరించే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. దాదాపు 150 ఏళ్ల నుంచి నడుస్తున్న నాన్ జుడీషియల్ స్టాంపుల విక్రయాలు మందగించాయి. ప్రభుత్వ కొత్త విధానాలతో అమ్మబోతే అడివి కొనబోతే కొరివిలాగా ఉంది జిల్లాలోని స్టాంపు వెండార్ల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపుల విక్రయాలకు తెచ్చిన నూతన విధానం అటు స్టాంపు వెండార్లతోపాటు ప్రజలకు కూడా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. గతంలో స్టాంపు కావాలంటే నేరుగా వెండార్ వద్దకు వెళ్ళి, లేదా ఎవరినైనా పంపి స్టాంపులు కొనుగోలు చేసుకోవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎవరికై తే స్టాంపు కావాలో వారే వెళ్లాలి. వారి ఆధార్ కార్డు ఇవ్వాలి. వారి ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలి. అప్పుడు దానిని కంప్యూటర్లో నమోదు చేసి స్టాంపు ప్రింట్ తీసి ఇస్తారు. ఈ ప్రక్రియ జరగాలంటే అరగంట పడుతుంది. ఇక్కడ మరో విషయమేమిటంటే ఆన్లైన్లో ఆధార్ ఓపెన్ కాకపోతే స్టాంపు లభించదు. ఇలా అయితే ఒక్క స్టాంపు వెండార్ రోజుకు ఎన్ని స్టాంపులు విక్రయించగలరు. ఓటీపీతోనే అసలు తంటా రూ. 10 నుంచి రూ.100 వరకు ఉండే నాన్ జుడీషియల్ స్టాంపులు కొనాలంటే వెండార్‌కు ఆధార్ కార్డు ఇవ్వాలి. అందులో ఉన్న పేరు, చిరునామాకు మాత్రమే స్టాంపు లభిస్తుంది. అడ్రస్ మారినా స్టాంపు ఇవ్వడం కుదరదు. ప్రతి స్టాంపు వెండార్ స్టాంపులు విక్రయించేందుకు ఒక దుకాణంతోపాటు కంప్యూటర్, ప్రింటర్, డిస్ప్లే ఏర్పాటు చేసుకోవాలి. ఈ వృత్తిలో చాలా మంది వయోధికులు ఉన్నారు. వారికి ఇంత సెటప్ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. కంప్యూటర్ పరిజ్జానం లేదు. పైగా స్టాంపుల సరఫరా అరకొరగానే ఉంటుంది. వచ్చే కమీషన్ దుకాణం అద్దెకూ సరిపోదు. రోజూ సంపాదించే మూడు, నాలుగొందలతోనే జీవించే వెండార్లే చాలామంది. వీరంతా ఇప్పుడు వృత్తికి దూరం కావాల్సిందే. నెల రోజుల నుంచి కనీసం తీసుకున్న స్టాకులో 5 శాతం కూడా స్టాంపు వెండార్లు విక్రయించలేదు. కారణం ఇంత తతంగం భరించలేక. ఐజీ కార్యాలయం ఏకపక్ష నిర్ణయం ఈ కొత్త విధానం రూపకల్పనలో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖాధికారుల పాత్రే కీలకం. ఈ విధానాన్ని ముందుగా కనీసం జిల్లా రిజిస్ట్రార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు స్టాంపు వెండార్లకు తెలియజేయకుండానే అమలు చేస్తున్నారు. వెండార్ స్టాంపులు విక్రయించాలన్నా ముందుగా కంప్యూటర్లో లాగిన్ అవ్వాలి. దీనికి ఓటీపీ నమోదుకు పావుగంట పడుతుంది. ఈలోపు ఓటీపీ రాకపోతే మళ్లీ ప్రక్రియ మొదటికే వస్తుంది. దీంతో వెండార్లు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు పరిష్కరించండి పాత తేదీల్లో స్టాంపులు విక్రయించకుండా ఉండేందుకు ఈ విధానం తెచ్చామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే పాత తేదీల్లో స్టాంపులు కొనుగోలు దాదాపుగా ఆగిపోయింది. పాత తేదీల్లో అగ్రిమెంట్లు రాసుకున్నా అవి పనికిరావు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారమే ఫీజులు చెల్లించాలి. తమను సాగనంపేందుకే ఈ నూతన విధానం అమలు చేస్తున్నారని వెండార్లు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రక్రియలో లోపాలు సవరించాలని కోరుతున్నారు. నాన్ జుడీషియల్ స్టాంప్స్ విక్రయాల్లో ఇబ్బందులు నూతన విధానంతో మందగించిన అమ్మకాలు దుకాణం, కంప్యూటర్ సిస్టమ్స్ ఉండాల్సిందేనంటూ హకుం ఆధార్ ఇచ్చి, ఓటీపీ చెబితేనే స్టాంప్ పేపర్ మనుగడ కష్టమేనంటున్న స్టాంప్ వెండార్లు -
దెబ్బతిన్న ఉద్యాన పంటలు
నరసరావుపేట రూరల్: ఈదురు గాలులు కారణంగా జిల్లాలోని 25.2 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు జిల్లా ఉద్యాన అధికారి సీహెచ్‌వీ రమణారెడ్డి మంగళవారం తెలిపారు. పంటలు దెబ్బతినడం వలన 40 మంది రైతులు నష్టపోయినట్టు వివరించారు. ఉద్యాన సహాయకులు మంగళవారం గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నట్టు తెలిపారు. నరసరావుపేట మండలంలో మునగ, బొప్పాయి, రాజుపాలెం మండలంలో బొప్పాయి, అరటి, మాచవరం, పెదకూరపాడు, అమరావతి మండలాల్లో అరటి, సత్తెనపల్లి మండలంలో అరటి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పెదగార్లపాడులో వైభవంగా రథోత్సవం దాచేపల్లి : పెదగార్లపాడులో రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పండుగ ముగిసిన తరువాత మూడవ రోజున ఈ గ్రామంలో రథోత్సవం జరుపుతారు. రామాలయంలో ఉన్న రథాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించి , అర్చకులు పూజలు చేసిన అనంతరం రథోత్సవ కార్యక్రమం చేపట్టారు. రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. భక్తులు ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.వెంకట్, రాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. మంగళవారం ఉదయం వారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్‌కు చిన్నారులు లావణ్య, ప్రవీణ్ చౌదరి పేరున విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మూల విరాట్‌ను తాకిన సూర్యకిరణాలు జంపని(వేమూరు): ఏకాదశి పర్వదినం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్ చెన్నకేశవున్ని సూర్య కిరణాలు తాకాయని దేవస్థానం అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి తెలిపారు. మండలంలోని జంపని గ్రామంలో చెన్న కేశవాలయంలో మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్ స్వరూపం చెన్నకేశవున్ని సూర్యకిరణాలు తాకాయి పాదాల నుంచి కిరీటం వరకు స్వామి వారి ప్రతి అంగాన్ని తాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్య భగవాసుడు కేశవున్ని స్పృశించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు తెలిపారు. నృసింహుడిని దర్శించుకున్న శృంగేరి ప్రతినిధులు అద్దంకి రూరల్: పుణ్యక్షేత్రమైన శింగరకొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం శృంగేరి ప్రతినిధులు సందర్శించారు. మేనెల 19వ తేదిన నిర్వహించనున్న మహా కుంభాభిషేకం సందర్భంగా పిఠాధిపతులు విచ్చేయుచున్నందున ముందుగా వారి ప్రతినిధులు లక్ష్మీ నరసింహాస్వామిని సందర్శించారు. వారిని కార్యనిర్వాహణాధికారి, అర్చకులు ఆలయ సంప్రదాయాలు ప్రకారం ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
వృద్ధురాలి హత్యలో ప్రస్ఫుటమైన పోలీసుల నిర్లక్ష్యం
ఉదయం 4.30 సమయంలో బారా ఇమాంపంజా మసీదు సెంటర్ వద్ద జరిగిన ఘర్షణ సమయంలో నలుగురు నిందితులు అక్కడే ఉన్నట్లు సమాచారం. అక్కడికి వచ్చిన ఏఎస్ఐ నిందితులను వదిలి పెట్టడం, స్టేషన్ సెక్టార్ ఎస్ఐకు సమాచారం ఉన్నప్పటీకీ స్పందించకపోవటంతోనే షాజహాన్‌పై దాడి, వృద్ధురాలు ఖాజాబీ హత్య, ప్రభుత్వాసుపత్రి వద్ద హసన్‌పై దాడి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వృద్ధురాలి హత్య జరిగిన తరువాత సదరు స్టేషన్ సిబ్బంది, రక్షక్ వాహన సిబ్బంది స్టేషన్ ఎస్హెచ్ఓకు గంటన్నరకు పైగా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఫైరోజ్, ఫయాజ్‌లు పోలీసుల అదుపులో ఉండగా, మరో ఇద్దరు నిందితులైన ఆసీఫ్, సన్ని ఇంతవరకు దొరకలేదు. నిందితుల్లో ఒకరైన ఆసీఫ్‌కు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అప్పుడే స్పందించి ఉంటే..? -
కుక్కకాటు..ప్రాణాలకు చేటు
గుంటూరు మెడికల్: జిల్లాలోని కాకుమానులో ఆరేళ్ల చిన్నారి కౌసర్ 2016లో కుక్కలదాడిలో మృతిచెందగా, 2017 సెప్టెంబర్ 21న గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడులో నాలుగేళ్ల ధూపాటి ప్రేమ్‌కుమార్ కుక్కలు కరిచి మృతిచెందాడు. తాజాగా స్వర్ణభారతినగర్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఐజాక్ ఈనెల 6వ తేదీన కుక్కల దాడిలో చనిపోయాడు. కేవలం పిల్లలే కాకుండా పెద్దవారు సైతం కుక్కకాటు బారిన పడి మరణిస్తున్నారు. ప్రతి ఏడాది జిల్లాల్లో కుక్కకాటు ద్వారా 10 మందికి పైగా మరణిస్తున్నారు. కుక్కకాటు ద్వారా సంభవించే రేబిస్ వ్యాధి 2011లో ఉభయ తెలుగు రాష్ట్రాలను వణికించివేసింది. ప్రతి కుక్కలోనూ రేబిస్ వైరస్ ఉండదు. కానీ వైరస్ ఉన్న కుక్క ఏదో తెలియదు. కాబట్టి ప్రతి కుక్కకాటును సీరియస్‌గానే పరిగణించాలి. పిచ్చికుక్క కరిచిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మనుషులు రేబిస్‌కు గురైతే.. మనుషులు రేబిస్ వ్యాధికి గురైనప్పుడు దవడ, గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి ఎంత దాహం వేసినా నీటిని తాగలేరు. ఎక్కువ సందర్భాల్లో రోగి నీటిని చూసినా, నీటి శబ్ధం విన్నా భయకంపితులవుతారు. ఈ లక్షణాన్ని హైడ్రో ఫోబియా అని పిలుస్తారు. ఇలాంటి స్థితిలో మతిస్థిమితం కోల్పోయి ఊపిరి పీల్చుకోలేక మనుషులు కూడా మరణిస్తారు. కుక్కకాటు బాధితులు.... గుంటూరు జీజీహెచ్‌లో 2023లో 34,931 మంది కుక్కకాటు బాధితులు ఇంజక్షన్లు చేయించుకున్నారు. 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 40,262 మంది కుక్కకాటు బాధితులు ఇంజక్షన్లు చేయించుకున్నారు. 2025 జనవరిలో 3157 మంది, ఫిబ్రవరి 2877 మంది, మార్చిలో 2728 మంది ఇంజక్షన్లు చేయించుకున్నారు. ఏప్రిల్ 1న 66 మంది, ఏప్రిల్ 2న 95 మంది, ఏప్రిల్ 3న 117, ఏప్రిల్ 4న 87 మంది, ఏప్రిల్ 5న 93, ఏప్రిల్ 7న 137 మంది కుక్కకాటు ఇంజక్షన్లు చేయించుకున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి పిచ్చికుక్క కరిచిన వెంటనే గాయాన్ని చల్లటి నీటితో, సబ్బుతో కడగాలి. గాయంపై నీరు ధారగా పడే విధంగా చేయాలి. గాయంపై టింక్చర్ అయోడిన్ వేయాలి. గాయానికి కుట్లు వేయటం, ఆయింట్మెంట్ పూయటం, గాయాన్ని నిప్పుపెట్టి కాల్చటం, కోయటం వంటివి చేయకూడదు. కుక్క కరిచిన వెంటనే సాధ్యమైనంత మేరకు త్వరగా వైద్యులను సంప్రదించి టీకాలు వేయించకోవటం ద్వారా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలి. – డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్, గుంటూరుప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్లు... గుంటూరు జీజీహెచ్‌లోనూ, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా కుక్కకాటు బాధితులకు ర్యాబీపూర్ వ్యాక్సిన్లు చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి రోజూ సుమారు 70 నుంచి 80 మంది కుక్కకాటు వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. అవుట్ పేషేంట్ విభాగంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉచితంగా ర్యాబీపూర్ వ్యాక్సిన్‌ను చేస్తున్నారు. అత్యవసర విభాగంలో అన్ని వేళలా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. – డాక్టర్ యశశ్వి రమణ, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్● రేబిస్ వ్యాధి సోకే ప్రమాదం నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు జిల్లాలో ప్రతి ఏడాది 10 మందికిపైగా మృత్యువాత ఇటీవల కుక్కలదాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ర్యాబీపూర్ వ్యాక్సిన్లు కుక్కకాటు మరణాలుకుక్కకాటుకు సకాలంలో ఇంజెక్షన్లు చేయించకపోవటంతో గుంటూరు గోరంట్లలోని ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిత వ్యాధుల ఆస్పత్రి (జ్వరాల ఆస్పత్రి)లో చికిత్స పొందుతూ 2020లో ఏడుగురు, 2021లో 13 మంది మరణించారు. 2022లో తొమ్మిది మంది, 2023లో 13 మంది, 2024 తొమ్మిది మంది చనిపోయారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025దరఖాస్తు ఇలా.. జిల్లా జైలులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తనిఖీలు గుంటూరు లీగల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు జిల్లా కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తనిఖీ చేశారు. ఆయన కారాగారంలో ఉన్న లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయంపై పలు సూచనలు చేశారు. జైల్లో ఏ ఒక్క ముద్దాయి న్యాయ సహాయం పొందకుండా ఉండకూడదని, ప్రతి ఖైదీకి ఉచిత న్యాయ సహాయం త్వరితగతిన అందించటానికి తగు సూచనలు చేశారు. వంటశాలను పరిశీలించి అక్కడ ఖైదీలకు అందించే ఆహారాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జైలు సిబ్బందికి వంటశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఖైదీలకు అందించే భోజనం, ఇతర సదుపాయాల గురించి విచారించగా సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ఖైదీలకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఈయన వెంట డెప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్.బి.ఏ. ఝాన్సీ, లీగల్ ఎయిడ్ క్లినిక్ పారా లీగల్ వలంటీర్స్, జైలు సిబ్బంది పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 516.00 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్ – 2025 ఆన్లైన్ దరఖాస్తు గడువు మరో 15 రోజుల్లో ముగియనుంది. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2025కు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cets. apsche.ap.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2025ను ఎంపిక చేసుకోవాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. ధ్రువపత్రాల వివరాలు తప్పనిసరి ● ఏపీ ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్ కేటగిరీల వారీగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్లో క్లిక్ చేయాలి. అదేవిధంగా సంబంధిత ధ్రువపత్రానికి సంబంధించిన నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువపత్రాల నంబరును సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటో తేదీ తరువాత తీసుకున్న ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు. ● విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు ఏ విద్యాసంస్థల్లో, ఏ ఊరిలో చదివారనే వివరాలను ఆయా విద్యాసంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివర్లో ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్ చేయాలి. ఉదాహరణకు గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి తన సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఎంపిక చేసుకున్నప్పటికీ, అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతరత్రా కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. ● ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేసిన తరువాత ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్ హాల్ టిక్కెట్‌తో పాటు ఆన్లైన్ ప్రింటవుట్ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. 7న్యూస్‌రీల్ దరఖాస్తు చేసేందుకు ఈనెల 24 చివరి తేదీ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు పరీక్ష మే 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27వరకు ఇంజినీరింగ్‌కు సంబంధించి టెస్ట్ దరఖాస్తు సమయంలో జాగ్రత్తలతో కౌన్సెలింగ్‌లో తొలగనున్న ఇబ్బందులుఏపీఈఏపీసెట్–2025 సైట్‌కు లాగిన్ అయిన తరువాత ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఐదు దశల్లోని ప్రక్రియను పూర్తి చేయాలి. స్టెప్–1 మొదలు స్టెప్–5 వరకు ఐదు దశల్లో కనిపించే ట్యాబ్‌లను వరుస క్రమంలో క్లిక్ చేస్తూ, పొందుపర్చిన వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టెప్1: ‘ఎలిజిబులిటీ క్రైటీరియా అండ్ ఫీజు పేమెంట్’కు లాగిన్ అయ్యి సీనియర్ ఇంటర్ హాల్‌టికెట్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, ఈ–మెయిల్ ఐడీ నమోదు చేయాలి. దీంతో పాటు ఇంజినీరింగ్–ఫార్మసీ, అగ్రికల్చర్–ఫార్మసీ, బోత్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని, క్లిక్ చేయాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరీపై క్లిక్ చేసి, ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి. క్రెడిట్, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ మార్గాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంది. స్టెప్–2: నో యువర్ పేమెంట్ స్టేట్స్పై క్లిక్ చేసి, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి. తదుపరి చేరనున్న కోర్సుల వారీగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్ చేయడంతో స్టెప్–2 దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. స్టెప్–3: ఫిల్ అప్లికేషన్లో పేమెంట్ చేసిన ఐడీతో పాటు సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి. స్టెప్–4: ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్‌పై క్లిక్ చేసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు. స్టెప్–5: ఇక్కడ క్లిక్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి. ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్, పుట్టినతేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్ హాల్ టిక్కెట్, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి. -
ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి
ఏపీఈజీఏ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా గుంటూరు వెస్ట్: ప్రభుత్వ, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్‌బాషా మంగళవారం జిల్లా ఖజానా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.చంద్రశేఖరరెడ్డిని కోరారు. చాంద్ బాషా మాట్లాడుతూ 2025 మార్చి నుంచి కన్వేయెన్స్ అలవెన్సులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేయాలన్నారు. ఎస్టిఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన కంప్యూటర్లు చాలా కాలం నుంచి పనిచేయక ఇబ్బంది పడుతున్నారన్నారు. అనంతరం చాంద్ బాషా ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి డీటీఓకు పుష్పగుచ్ఛం అందజేశారు. అభినందనలు తెలిపిన రిటైర్డ్ ఉద్యోగులు జిల్లా ఖజానా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.చంద్రశేఖరరెడ్డిని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రెజరీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వర్లు, నాగరాజు పేర్కొన్నారు. -
ఈ బైక్ డిజైన్ పోటీల్లో ఆర్వీఆర్జేసీ ప్రతిభ
గుంటూరు రూరల్: తమ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ బైక్‌కు జాతీయస్థాయిలో అవార్డులతోపాటు, నగదు బహుమతులను సాధించటం సంతోషకరమని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. మంగళవారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇటీవల గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ యూనివర్సిటీలో ఐఎస్‌ఐఈ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఈపి ఈబైక్ డిజైన్ ఛాలెంజ్ (సీజన్ 5.0) జాతీయ స్థాయి పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఈ బైక్ ద్వితీయ స్థానంలో నిలిచి రన్నరప్ అవార్డు (రూ.30,000 నగదు బహుమతి), ఫ్యూచర్ అవార్డు (రూ.5,000 నగదు బహుమతి)లను గెలుచుకున్నారన్నారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్‌లు మాట్లాడుతూ ఇంధన కాలుష్యం నివారించేందుకు, ఐఎస్‌ఐఈ నిర్వహించిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, తమ కళాశాల విద్యార్ధులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం గర్వకారణమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాల అధ్యాపక నిపుణుల నేతత్వంలో ఈ–బైక్ వాహన తయారీలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నుండి 25 మంది విద్యార్థులతో కూడిన జట్టు పాల్గొన్నారన్నారు. ఈ–బైక్ ద్విచక్ర వాహన తయారీలో 60వి, 40 ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని, 60వి, 2కెడబ్ల్యూ బీఎల్డీసీ మోటార్‌ను, 4 కెడబ్ల్యూ కంట్రోలర్‌ను అమర్చడం జరిగిందన్నారు. ఒకసారి ఛార్జ్ చేసిన అనంతరం ఇది 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో సుమారు 90 నుండి 100 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక,ఆర్థిక సహాయాలను అందించడానికి కళాశాల యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. అవార్డులను పొందిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, డాక్టర్ కె చంద్రశేఖర్, డాక్టర్ డివివి కృష్ణప్రసాద్, పీ వెంకటప్రసాద్, పీ వెంకటమహేష్, ఆర్ మారుతీవరప్రసాద్, తదితరులు అభినందించారు. -
భూముల రీ సర్వే ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలి
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ గుంటూరువెస్ట్: జిల్లాలో భూముల రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో నిర్దేశించిన గ్రౌండ్ ట్రూ థింగ్ వివరాలను ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ శంకరన్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 14 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వే పూర్తయిందన్నారు. వాటికి సంబంధించి వివరాలు ఆన్లైన్లో నమోదు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియ చాలా కీలకమని, ఎటువంటి తప్పులు లేకుండా వివరాలు నమో దు చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహించిన రీసర్వేలో గుర్తించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అధికారుల సందేహాలను ఇన్చార్జి కలెక్టర్ నివృత్తి చేశారు. యార్డుకు 1,44,446 బస్తాలు మిర్చి రాక కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,44,446 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,41,802 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,900 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,400 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,917 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. పసుపు ధరలు దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో గురువారం 673 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొమ్ములు 442 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,300, గరిష్ట ధర రూ.12,400, మోడల్ ధర రూ.12,000, కాయలు 231,బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,300, గరిష్ట ధర రూ.12,500, మోడల్ ధర రూ.12,000, మొత్తం 504.750 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. -
జీవ నియంత్రణ పద్ధతులు సమష్టిగా చేపట్టాలి
గుంటూరు రూరల్: రైతులు విచక్షణ రహితంగా వినియోగిస్తున్న ఎరువులు, పురుగు మందుల వల్ల సాగు ఖర్చు పెరుగుతుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి అన్నారు. రైతులు సుస్థిర వ్యవసాయ విధానాలు, జీవనియంత్రణ పద్ధతులు సమష్టిగా చేపట్టాలని తెలిపారు. నగర శివారులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతు రక్షణ వేదిక ఆధ్వర్యాన మంగళవారం ప్రత్యామ్నాయ వ్యవసాయం ఎందుకు? ఎలా అనే అంశంపై చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ అధిక రేటు, అధిక ఆదాయం ఇచ్చే పంటలను పండించాలని సూచించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించాలని, రైతు స్థాయిలో విత్తనోత్పత్తి జరగాలని, విత్తన సాధికారత సాధించాలని, కౌలురైతులకు ప్రోత్సాహాలను కల్పించాలని, బయో డైవర్సిటీ, కమ్యూనిటీ సీడ్ డెవలప్మెంట్, పాతతరం విత్తనాలను సంరక్షించుకోవాలని, సుస్థిర వినియోగం, సాంప్రదాయ వ్యవసాయ విధానలు చేపట్టాలని సూచించారు. కమ్యూనిటీ సీడ్ బ్యాంక్‌లు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు రైతులకు వెన్నంటి ఉండి సుస్థిర దిగుబడులకు దోహదం చేయాలని కోరారు. రైతులను సంఘటితం చేయాలని, యువతను వ్యవసాయంవైపు ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ వ్యవసాయం చేయాలని అన్నారు. ఫలితంగా లాభాలు ఆర్జించవచ్చని అన్నారు. అనంతరం ప్రత్యామ్నాయ వ్యవసాయం ఎలా? ఎందుకు అనే అశంపై డాక్టర్ వేణుగోపాలరెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతు రక్షణ వేదిక ప్రతినిధి డాక్టర్ కె రాజమోహన్‌రావు, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ ప్రొపెసర్ డాక్టర్ డి నరసింహారెడ్డి, సెంటర్ ఫర్ స్టెయినబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు, ఎస్బీపీజీఆర్ ప్రతినిధి డాక్టర్ బి శరత్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి -
అంతర్జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో బీఏ (ఐఎఎస్) విభాగం, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమం పోస్టర్‌ను వర్సిటీ వీసీ డాక్టర్ పార్థసారథి వర్మ, బీఏ (ఐఎఎస్) విభాగాధిపతి డాక్టర్ బి. శివనాగయ్యలు మంగళవారం ఆవిష్కరించారు. వీసీ మాట్లాడుతు ఈనెల 10,11 తేదీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. బీఏ విభాగ అధిపతి డాక్టర్ బి.శివనాగయ్య మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యంలో కథ, కథానిక, గల్పిక, నవల, ఆధునిక కవిత్వం, హైకూలు, నానీలు వంటి ప్రక్రియలు, సీ్త్రవాద, దళిత, మైనార్టీ వాద, ప్రతీక వంటి వాదాలలో ఇప్పటివరకు జరిగిన కృషిని మూల్యాంకనం చేస్తూ భవిష్యత్తు తరాలకు ఈ విషయాలలో ఒక దిశను నిర్దేశించడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యమని అన్నారు. మరిన్ని వివరాల కోసం సహాయ ఆచార్యులు డాక్టర్ కె.ప్రజాపతి 9889941900 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ కె.రాజశేఖరరావు, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, బీఏ (ఐఎఎస్) ఉప విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా
మంగళగిరిటౌన్: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యాన చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మంగళవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. బాలకృష్ణ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ కార్పొరేట్ విధానాల వల్ల సంక్షోభంలో కూరుకుపోయిందని, చేనేత కార్మికులు ఆకలిచావులు, ఆత్మహత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడంతో మరింత సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేతన్న నేస్తం పథకం షెడ్డు కార్మికులకు, సహకార సంఘాలతో నేత నేయిస్తున్న చేనేత కార్మికులకు అమలు జరగలేదని గుర్తు చేశారు. కూటమి నాయకులు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే చేనేత పరిశ్రమను రక్షిస్తామని, జీఎస్టీ, రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీలు అమలుకావడం లేదని ఎద్దేవా చేశారు. సహకార సంఘాలకు చెల్లించాల్సిన యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ రిబేటు, రూ.156 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం చేనేత జౌళి శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.రామారావు, రాష్ట కమిటీ సభ్యులు కె.వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ సీతారామాంజనేయులు, కె.మల్లికార్జునరావు, కె.కుమారి తదితరులు పాల్గొన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
గుంటూరు లీగల్ గుంటూరు జిల్లా కోర్టులో పనిచేసి బదిలీలపై వెళుతున్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.జి.బి.పార్థసారథి, లేబర్ కోర్టు కమ్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్ డి.తిరుమలరావు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్న్స్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫీసు కోర్టు జడ్జి ఎ.అనితలను మంగళవారం ఘనంగా సన్మానించారు. వీడ్కోలు కార్యక్రమానికి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగలశెట్టి శివసూర్యనారాయణ అధ్యక్ష వహించగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయమూ ర్తుల ఉన్నతిని కొనియాడారు. వీరు భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. -
● పరిశీలనలో పాల్గొన్న రాష్ట్ర అధికారి వనజ ● జిల్లాలో 6 పాయింట్ల గుర్తింపు
‘విద్యామిత్ర’ స్టాక్ పాయింట్ల పరిశీలన నరసరావుపేట ఈస్ట్: పల్నాడుజిల్లా పరిధిలోని 1,46,044 మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా అందించనున్న వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలని పథకం రాష్ట్ర పరిశీలనాధికారి వనజ తెలిపారు. విద్యా మిత్ర ద్వారా అందించే వస్తువులను భద్రపరిచే స్టాక్ పాయింట్లను మంగళవారం జిల్లా సీఎంఓ పద్మారావు, ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. జిల్లాలో శంకర భారతీపురం జెడ్పీ హైస్కూల్ (నరసరావుపేట), జెడ్పీ హైస్కూల్ (రొంపిచర్ల), జెడ్పీ హైస్కూల్ (నకరికల్లు), జెడ్పీ హైస్కూల్ (నాదెండ్ల), సెయింటాన్స్ స్కూల్ (యడ్లపాడు), శారదా హైస్కూల్ (చిలకలూరిపేట) స్టాక్ పాయింట్లుగా గుర్తించారు. రాష్ట్ర పరిశీలకులు వనజ మాట్లాడుతూ, విద్యామిత్ర ద్వారా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, షూస్, బెల్ట్, డిక్షనరీలను అందిస్తున్నట్టు వివరించారు. వాటి భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షానికి తడవకుండా, చెదలు పట్టకుండా చూడాలన్నారు. విద్యా మిత్ర మెటీరియల్ సరఫరాకు రహదారి పరంగా ఇబ్బందులు లేకుండా స్టాక్ పాయింట్లను గుర్తించటంపై విద్యాశాఖాధికారులను అభినందించారు. సాగర్‌డ్యాంపై తెలంగాణ వైపు సీఆర్పీఎఫ్ పహారా ఉపసంహరణ విశాఖపట్నం 234 బెటాలియన్‌కు చార్జ్ అప్పగింత విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న ములుగు 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ దళాలు సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు పహారా విధులు ఉపసంహరించుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంధ్రవైపు పహారా కాస్తున్న విశాఖపట్నం 234 బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావుకు 39 ములుగు బెటాలియన్ కమాండెంట్ రాఘవ చార్జ్ అప్పగించారు. ఆంధ్రా వైపు నుంచి సీఆర్పీఎఫ్ దళాలు తెలంగాణ వైపు గల డ్యాంమీదకు వెళ్లారు. వీరు జూన్ 23వ తేదీ వరకు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. గత 16 నెలలుగా తెలంగాణ వైపు తెలంగాణ దళాలు, మన రాష్ట్రం నుంచి ఆంధ్ర బెటాలియన్ పహారాలో సాగర్ ప్రాజెక్టు ఉంది. ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రాజెక్టు భద్రత విశాఖపట్నం బెటాలియన్ పహారాలోకి వెళ్లింది. -
ఆర్వోబీ నిర్మాణం చేపట్టాలి
భవిష్యత్తు అవసరాల కోసమే గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్‌విలాస్ ఆర్వోబీ నిర్మాణాన్ని గుంటూరు ప్రజల అవసరాలతోపాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ సాధన జేఏసీ నాయకుడు ఎల్ఎస్ భారవి డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని శంకర్‌విలాస్ కూడలిలో ఫ్లై ఓవర్ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వం నిర్మించనున్న ఆర్వోబీ ద్వారా వచ్చే ఇబ్బందులపై ప్రజలను చైతన్యపరిచే పోస్టర్లు ఆవిష్కరించారు. భారవి మాట్లాడుతూ హిందూ కళాశాల నుంచి లాడ్జి సెంటర్ వరకు ఐకానిక్ ఫ్లైఓవర్ బ్రిడ్జిగా నిర్మాణం చేయబోతున్నట్లు చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు మాట తప్పారని అన్నారు. అరండల్‌పేట 8,9 లైన్లు నుంచి ఏసీ కళాశాల వరకు 930 మీటర్లు నిర్మాణాన్ని చేపడుతూ, ఆర్యూబీ సైతం ప్రస్తుతానికి సాధ్యం కాదని స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రకటించటం ద్వారా ట్రాఫిక్ కష్టాలు తీరకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల కిందట అప్పటి పాలకులు మెగా ఫ్లై ఓవర్ ప్రతిపాదించగా 2017లో టీడీపీ ప్రభుత్వంలోనే అప్పటి ఎంపీ గల్లా జయదేవ్, రోడ్డు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు శంకర్ విలాస్ బ్రిడ్జిని స్వయంగా పరిశీలించి, రూ.167 కోట్లతో ఆర్ఓబీ నిర్మాణం చేపట్టబోతున్నట్లు ప్రకటించారని తెలిపారు. ముందుగా ట్రాఫిక్ ఇబ్బందులేకుండా ఆర్యూబీని నిర్మిస్తామని చెప్పారు. ఆర్యూబీ లేకుండా ఆర్వోబీని నిర్మించటం చారిత్రక తప్పిదమే కాక, ప్రజలను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తుందని హెచ్చరించారు. ఇటీవల డొంకరోడ్డులోని మూడు వంతెనల వద్ద మూడో ట్రాక్ నిర్మాణం పేరుతో మూడు నెలలపాటు ట్రాఫిక్‌తో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. నగర ప్రజల ట్రాఫిక్ అవసరాలను 90 శాతం తీరుస్తున్న శంకర్ విలాస్ ఆర్వోబీని నిర్మాణం పేరుతో రెండేళ్లు ఆపివేస్తే ప్రజల కష్టాలు ఏవిధంగా ఉంటాయో ఊహించలేమన్నారు. రూ.98 కోట్లతో పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన సరైనది కాదన్నారు. దీనిపై మంత్రులు, సీఎం దృష్టి సారించి తగినన్ని నిధులు కేటాయించి బహుళ ప్రయోజనకరమైన హిందూ కళాశాల కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు నిర్మించేలా ప్రజావాణిని తాము వినిపిస్తున్నామని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్వోబీ సమస్య కేవలం వ్యాపారస్తులకు సంబంధించిందే కాదని లక్షలాది మంది ప్రజలకు సంబంధించినది అని అన్నారు. భావి తరాల ప్రయోజనాలను గుర్తించి రైల్వే శ్వేత బంధం ప్రాజెక్టు నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత నిధులు విడుదల చేసి హిందూ కళాశాల నుంచి లాడ్జి సెంటర్ వరకు నిర్మాణం చేపట్టాలని కోరారు. గురువారం ఉదయం లాడ్జి సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు పెద్ద ఎత్తున మానవహారంతో నిరసన తెలియచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రేట్ పేయిర్స్ అసోసియేషన్ నాయకులు వల్లూరి సదాశివరావు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి జి.వెంకటరావు, ఆటో యూనియన్ జేఏసీ నాయకులు మస్తాన్‌వలీ, ఎల్ఐసి నాయకులు రాజేశ్వరరావు, అరండల్‌పేట, బ్రాడీపేట వ్యాపారస్తుల జేఏసీ నాయకులు కమలకాంత్, సాంబశివరావు, మహిళా జేఏసీ నాయకురాలు కల్యాణి, వివిధ పౌర సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రకటించినట్లు పొడవు తగ్గించరాదు రేపు నగరంలో మానవహారం -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
తాడికొండ: ఈ నెల 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని తాడికొండలో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్ల ను మంగళవారం ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్‌తేజ, ఆర్డీఓ శ్రీనివాసులు పరిశీలించారు. జయభారత్ కాలనీ, పొన్నెకల్లు ఎస్సీ కాలనీలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను సందర్శించారు. పొన్నెకల్లులో కార్యక్రమ నిర్వహణకు అనువుగా ఉందని నిర్థారించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న ఎస్సీ కుటుంబాలను పీ4 విధానంలో భాగంగా ఉన్నత కుటుంబాలకు దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎస్సీ కాలనీలో పలువురితో ముచ్చటించి, పొన్నెకల్లు బైపాస్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికకు సీఎం చేరుకుని ప్రసంగిస్తారు. కార్యక్రమంలో తహసీల్దారు మెహర్‌బాబు, ఎంపీడీవో సమతావాణి ఉన్నారు. ‘శిశిరం’ మరింత గుర్తింపునిస్తుంది చైల్డ్ సూపర్ స్టార్ లిటిల్ భాను తెనాలి: శ్రీకృష్ణ ఆర్ట్స్ పతాకంపై తెనాలి, పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకొంటున్న బాలల సినిమా ‘శిశిరం’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న తనకు, ఈ చిత్రంలో మరింత గుర్తింపు లభిస్తుందని బాల నటుడు, తండేల్ ఫేమ్ భానుప్రకాష్ అన్నాడు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రిన్సెస్ హోటల్లో శిశిరం చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాను మాట్లాడారు. కళల కాణాచి తెనాలిలో షూటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుంచి 11 వరకు తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందన్నారు. తండేల్ చిత్రంలో జాతీయ సమైక్యతను చాటి చెప్పే పాత్రలో భాను అద్భుత నటనకు గాను తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఏంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ, వన్‌టౌన్ సీఐ మల్లికార్జున రావు, కొరియా గ్రాఫర్ ‘అమ్మ’ సుధీర్ అభినందించారు. సమావేశంలో ప్రొడక్షన్ డిజైనర్ ఎం.శ్రీకాంత్, పీఆర్ఓ అంబటి శ్యామ్‌సాగర్, బాలనటులు పాల్గొన్నారు. రేపు గుంటూరులో జాబ్ మేళా గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్ల సర్కిల్లోని గుంటూరుజిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గాబాయి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి ఆంధ్ర కో–ఆపరేటివ్ బ్యాంక్, సీఐఐ–ఎంసీసీ, పేటీఎం, అపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫెయిర్ డీల్ క్యాపిటల్, క్యాప్స్టన్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకై ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 98668 22697 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
ప్రభుత్వ ఆమోదానికి జెడ్పీ బడ్జెట్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆమోదం సాధ్యం కాలేదు. వరుసగా రెండుసార్లు వాయిదా పడిన సర్వసభ్య సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందలేకపోయిన దృష్ట్యా పంచాతీరాజ్ చట్టంలోని సెక్షన్ 199 సబ్ రూల్ 3 కింద బడ్జెట్‌ను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపినట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సోమవారం చెప్పారు. పార్టీ ఫిరాయించిన చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా.. జెడ్పీ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమోదించేందుకు చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గత నెల 15న ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. వైఎస్సార్ సీపీ నుంచి జెడ్పీటీసీగా గెలిచిన హెనీ క్రిస్టినా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాంచడంతో పాలకవర్గంలో సింహభాగమైన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ఆమె తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కీలకమైన బడ్జెట్ ఆమోదం కోసం రెండు వారాల వ్యవధిలో గత నెల 29న రెండోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసినా, అదే రోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవమని, బడ్జెట్ ఆమోదానికి కావాల్సిన సంఖ్యలో టీడీపీ ప్రజా ప్రతినిధులు హాజరు కావడం లేదనే సమాచారంతో రెండు రోజుల ముందుగా సమావేశాన్ని వాయిదా వేశారు. చైర్పర్సన్ హోదాలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు జెడ్పీటీసీల అనుమతి లేకుండా, వారికి కనీస సమాచారమివ్వకుండా ఏకపక్షంగా పనులను మంజూరు చేస్తున్న విషయమై గతేడాది కాలంగా జెడ్పీటీసీలు ప్రతి సర్వసభ్య సమావేశంలోనూ గళం విప్పుతున్నారు. జెడ్పీ పాలకవర్గంలో భాగస్వాములైన జెడ్పీటీసీలను పక్కనపెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యమిస్తూ, వారు చెప్పిన పనులకు జీ హుజూర్ అనడంపై జెడ్పీటీసీలు తీవ్ర అగ్రహంతో ఉన్నారు. ఆర్థిక సంవత్సర బడ్జెట్లో జెడ్పీటీసీలకు తెలియకుండా, సమావేశంలో ఆమోదింపచేయకుండా రూ.12 కోట్ల అభివృద్ధి పనులకు ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, జెడ్పీటీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమోదించుకోలేని దుస్థితి వరుసగా రెండుసార్లు వాయిదా పడిన సర్వసభ్య సమావేశం ఏకపక్ష పనులు అనుమతులపై తీవ్ర అభ్యంతరం పార్టీ ఫిరాయించిన చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చిన జెడ్పీటీసీలు బడ్జెట్ ఆమోదం తమ వల్ల కాదంటూప్రభుత్వానికి నివేదన గత ఏడాది మార్చి 31 నాటికే ఆమోదించుకోవాల్సిన బడ్జెట్ పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ప్రభుత్వానికి పంపిన సీఈవో బడ్జెట్ ఆమోదం తమ వల్లకాదంటూ ప్రభుత్వానికి నివేదన చైర్పర్సన్ తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లే జెడ్పీ బడ్జెట్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపడం చైర్పర్సన్ తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లుగా భావించాలి. జెడ్పీ చరిత్రలోనే కోరం కాక వాయిదా పడటం తొలిసారి. గతనెల 29న జరగాల్సిన సమావేశాన్ని 50 శాతం సభ్యులు వాయిదా వేయాలని కోరినట్లుగా జెడ్పీటీసీలకు లేఖలు పంపారు. 50 శాతం మంది వాయిదా కోరి ఉంటే, మూడింట ఒక వంతు సభ్యులతో కోరం ఏర్పాటు చేసి, గత నెల 29నే సమావేశాన్ని ఎందుకు జరపలేకపోయారో ప్రజలకు చెప్పాలి. బడ్జెట్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపడం జెడ్పీ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు పాలకమండలి సభ్యులను, జిల్లా ప్రజలను అవమానించడమే. పార్టీ ఫిరాయించిన చైర్పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి. – పిల్లి ఓబుల్‌రెడ్డి, రొంపిచర్ల జెడ్పీటీసీ బడ్జెట్ సమావేశం వరుసగా రెండుసార్లు వాయిదా పడటంతో ఇక ఆమోదింపచేసుకోవడం తమ వల్ల కాదంటూ ప్రభుత్వానికి నివేదించడం జెడ్పీ పరిపాలన తీరు, తెన్నులకు అద్దం పడుతోంది. గత ఏడాది మార్చి 31 నాటికే ఆమోదించుకోవాల్సిన బడ్జెట్ చివరికి ప్రభుత్వ ఆమోదం కోసం వెళ్లింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.643 కోట్ల ఆదాయంతో రూపొందించిన ఆంచనా బడ్జెట్లో రూ.640 కోట్లు వ్యయం చూపారు. అదే విధంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాలను మినహాయిస్తే జెడ్పీ బడ్జెట్ రూ.71.11 కోట్ల ఆదాయం, రూ.69.10 కోట్ల మిగులుగా చూపారు. -
గుంటూరు డీఆర్ఎంగా సుథేష్ఠ సేన్ బాధ్యతల స్వీకరణ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు డీఆర్ఎంగా ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) సుధేష్ఠ సేన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాజామాజీ డీఆర్ఎం ఎం.రామకృష్ణ సుథేష్ఠకు బాధ్యతలు అప్పగించారు. రామకృష్ణ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్‌కు ప్రిన్సిపల్ చీఫ్ సెఫ్టి ఆఫిసర్‌గా వెళ్లనున్న విషయం తెలిసిందే. సేన్ రైల్వేలో 1996 బ్యాచ్‌కు చెందిన వారు. ఆమె ఎకనామిక్స్‌లో ఆనర్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పబ్లిక్ పాలసీలో మాస్ట్ర్స్ డిగ్రీని పూర్తి చేశారు. తొలుత ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌కు ఎంపికై ముంబై సెంట్రల్ రైల్వేలో ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించారు. అక్కడి నుంచి భోపాల్, జబల్పూర్, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్‌కత్తాలోని వెస్ట్ సెంట్రల్ రైల్వేల్లో పని చేశారు. మంచి అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వేలో ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్ఏ అండ్ సీఏఓ)గా పని చేశారు. ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, భారత ప్రభుత్వంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఎన్సీఈఆర్టీగా డెప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు రైల్వే డివిజన్‌ను సిబ్బంది సమన్వయంతో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. అనంతరం డివిజన్లోని పలు విభాగాధిపతులతో ఆమె మాట్లాడారు. తల్లీబిడ్డకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలి గుంటూరు లీగల్: ప్రతి బిడ్డా ఆరోగ్యంగా జన్మించాలని, ప్రసవ సమయంలో తల్లీబిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు సోమవారం గుంటూరు జీజీహెచ్‌లోని నర్సింగ్ విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బంది, పిల్లల వైద్యశాఖ, ప్రసూతి వైద్య శాఖలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో జియావుద్దీన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తల్లులు, నవజాత శిశువుల మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. సదస్సులో డాక్టర్ అరుణ, డాక్టర్ దేవకుమార్, డాక్టర్ జయంతి, డాక్టర్ ఝాన్సీవాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తదితరులు పాల్గొన్నారు. -
రైస్ పుల్లింగ్ పేరుతో మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): రైస్ పుల్లింగ్ పేరుతో కొందరు తమను మోసగించారని భార్యాభర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించారు. బాధితుల నుంచి ఎస్పీ సతీష్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదిదారుల మొరను ఎస్పీ ఆలకించారు. బాధితులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని డీఎస్పీలు, సీఐలను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), సుబ్బారావు (మహిళా పీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు. రుణం ఇప్పిస్తానని మోసం గతేడాది కొత్తపేటకు చెందిన ఓ మహిళ పరిచయమైంది. డ్వాక్రా గ్రూప్ ద్వారా రూ.2 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికింది. పొదుపు ద్వారా రూ.23 వేలు చెల్లించాలని చెప్పగా, రెండు విడతలుగా ఆమెకు చెల్లించా. మరో రూ.2 లక్షలు రుణం ఇప్పిస్తానని చెప్పగా అందుకు మేము నిరాకరించాం. దీతో రూ.2 లక్షల చెక్కు వచ్చిందని కొత్తపేటలో ఉంటున్న తన ఇంటికి తీసుకెళ్లింది. అల్పాహారం భుజించగా, కొద్దిసేపటికి మత్తులోకి జారుకున్నాను. దీంతో నా బంగారు ఉంగరం, చెవి పోగులు తస్కరించింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకు పట్టించుకున్న పాపానపోలేదు. న్యాయం చేయగలరు. – సీహెచ్.మంగాదేవీ, వెంకటరమణకాలనీ 2/4వ అడ్డరోడ్డు. భార్యాభర్తల ఆవేదన పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అర్జీలు స్వీకరించిన ఎస్పీ సతీష్‌కుమార్ రూ.1.47 కోట్లకు టోకరా తొమ్మిదేళ్ల క్రితం బుచ్చయ్యతోటలో ఉంటున్న ఓ ఫిజియోథెరపిస్ట్ పరిచమయ్యాడు. రైస్ పుల్లింగ్ వ్యాపారం చేస్తున్నట్లు నమ్మించాడు. ముందుగా రూ.40 లక్షలు చెల్లిస్తే రూ.కోట్లల్లో డబ్బులొస్తాయమని నమ్మబలికాడు. ఇప్పటి వరకు సుమారు రూ.1.47 కోట్లను విడతలవారీగా చెల్లించాను. ప్రస్తుతం డబ్బులు అడిగితే సమాధానం చెప్పడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. న్యాయం చేయగలరు. – జి.ఆంజనేయులు, నాసరమ్మ, భార్యాభర్తలు, చల్లవారిపాలెం, గుంటూరు రూరల్ -
ప్రాణ సంకటం
● కుక్కల స్వైరవిహారం ● గుంటూరు ప్రజలు బెంబేలు ● గాలిలో పసిప్రాణాలు ● చోద్యం చూస్తున్న నగరపాలక సంస్థ అధికారులు నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు కుక్కకాట్లకు బలవుతున్నారు. అయినా నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి తాజాగా ఆదివారం స్వర్ణ భారతినగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు ఐజక్ బలయ్యాడు. కుక్క మెడ కరుచుకుని తీసుకుపోవడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 2017 డిసెంబర్‌లోనూ ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి కుక్క కరవడంతో చనిపోయాడు. కొద్ది నెలల క్రితం సంపత్‌నగర్‌లో ఓ బాలికపై కుక్క దాడి చేసింది. గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఏడేళ్ల క్రితం హుస్సేన్‌నగర్ ఆంజనేయ కాలనీలో 9 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గుంటూరులో రోజూ ఏదోచోట కుక్కకాటుకు ప్రజలు బలవుతున్నారు. జీజీహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జనవరి 9 నుంచి ఆగిపోయిన ఏబీసీ ఆపరేషన్లు గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణ కోసం నగరపాలక సంస్థ గతంలో చర్యలు చేపట్టింది. ఏటుకూరు రోడ్డులో స్నేహ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ (ఏబీసీ) ఆపరేషన్లు చేయించేది. ఈ ఆపరేషన్లు చేసినందుకు ఒక్కో కుక్కకు రూ.రెండు వేల వరకూ స్నేహ సంస్థకు కార్పొరేషన్ చెల్లించేంది. అయితే నిబంధనలు పాటించకుండా ఆపరేషన్లు జరుగుతున్నాయని, స్టేరిలైజేషన్ సక్రమంగా ఉండటం లేదని, కుట్లు కూడా సరిగా వేయడం లేదని కొందరు జంతుప్రేమికులు యానిమాల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీంతో గత ఏడాది అక్టోబర్ 18న గుంటూరుకు విచ్చేసిన యానిమల్ బోర్డ్ సభ్యులు స్నేహ సొసైటీ చేస్తున్న ఆపరేషన్లలో లోపాలున్నాయని గుర్తించి ఆపరేషన్లు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో జనవరి 9 నుంచి ఏబీసీ ఆపరేషన్లు ఆగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ స్నేహ సంస్థ ఏబీసీ ఆపరేషన్లు చేసేందుకు అప్పీలు చేసుకోవడంతో జనవరి 24న యానిమల్ బోర్డ్ సభ్యులు గుంటూరు వచ్చి స్నేహ సంస్థ ఏబీసీ సెంటర్‌ను పరిశీలించారు. ఇంకా ఆపరేషన్ల నిర్వహణలో లోపాలు ఉన్నాయని సభ్యులు తేల్చారు. నగరపాలక సంస్థ తరుఫునే ఆపరేషన్ల చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. ఆపరేషన్లు చేయకుండానే బిల్లులు గుంటూరు నగరంలో 31,400 కుక్కలు ఉన్నట్లు నగరపాలక సంస్థ లెక్కలు చెబుతున్నాయి. 4,500 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసినందుకు రూ.37,48,500 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అయితే చాలా కుక్కలకు ఆపరేషన్లు చేయకుండానే చేసినట్లుగా బిల్లులు పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్ది నెలల క్రితం ఇక్కడ ఇన్చార్జ్ ఎంహెచ్‌ఓగా పనిచేసిన ఓ అధికారి ఆధ్వర్యంలో గోల్మాల్ జరిగిందనే విమర్శలు న్నాయి. రికార్డ్స్ పరిశీలించిన అధికారులకు లెక్కల్లో తేడాలు ఉన్నాయని పసిగట్టినట్లు సమాచారం. కౌన్సిల్లో చర్చ వీధి కుక్కల స్వైరవిహారం అంశం సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చింది. వీధికుక్కల నియంత్రణలో అధికారుల వైఫల్యంపై వైఎస్సార్ సీపీ సభ్యులు నిలదీశారు. దీనికి స్పందించిన ప్రజారోగ్యధికారులు డిసెంబర్ 31 నాటికి నగరంలో ఉన్న వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, ఏబీసీ ఆపరేషన్లు పూర్తి చేస్తామని ప్రకటించారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
పొన్నెకల్లు (తాడికొండ): తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ, ఆర్డీవో శ్రీనివాసరావు ఇతర అధికారులు పరిశీలించారు. పొన్నెకల్లు ఎస్సీ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బైపాస్ రోడ్డులో బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ఏర్పాట్లను పరిశీలించారు. తాడికొండలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఉన్న నేపథ్యంలో తాడికొండలో లేదా పొన్నెకల్లులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దిశగా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మెహర్‌బాబు, సీఐ కె వాసు పలువురు మండల స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రేపటి నుంచి ఐసెట్‌కు ఉచిత శిక్షణ గుంటూరు ఎడ్యుకేషన్ :పట్టాభిపురంలోని టీజేపీఎస్ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఐ–సెట్‌కు ఈనెల 9వ తేదీ నుంచి ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అనితాదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్టు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఎనలెటికల్, మాఽథమాటికల్, కమ్యూనికేషన్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ వంటి విషయాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ యు. (97011 72533), కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎం.శివకొండయ్య (96766 74858)ను సంప్రదించాలని సూచించారు. కాలువలోకి దూసుకెళ్లిన కారు – ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ మంగళగిరి: నగర పరిధిలోని యర్రబాలెం చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటన సోమవారం జరిగింది. మంగళగిరి నుంచి కృష్ణాయపాలెం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారులో డ్రైవర్ ఒక్కరు మాత్రమే వుండగా వెంటనే కారు డోర్ తీసుకుని కారుపైకి ఎక్కి కాపాడాలని అరవడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అతడిని రక్షించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
అర్జీల పరిష్కారంలో సమన్వయం ముఖ్యం
గుంటూరువెస్ట్: ప్రజల సమస్యలను మరింత వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత కాలంలోనే పరిష్కరించాలన్నారు. పరిష్కారానికి వీలుకానివి, కోర్డు కేసుల్లో ఉన్నవి అర్జీదారునికి వివరించి చెప్పాలని పేర్కొన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా పరిష్కరించాలని తెలిపారు. తమ అర్జీలను ప్రజలు స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చన్నారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయన్నారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. అనంతరం వచ్చిన 2235 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ -
బడ్జెట్ లెక్కలపై అధికారుల వద్ద సమాధానం లేదు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన బడ్జెట్లో చాలా లోపాలున్నాయని వాటిపై ప్రశ్నిస్తే అధికారుల వద్ద నుంచి ఎటువంటి సమాధానం లేదని నగర డెప్యూటీ వనమా బాలవజ్రబాబు(డైమండ్‌బాబు) విమర్శించారు. సోమవారం నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ ఆమోద సమావేశం జరిగిన తీరును వజ్రబాబు ఖండించారు. కౌన్సిల్ హాల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. రూ.1534 కోట్లు బడ్జెట్ అంచనాల్లో చూపి, రూ.1018కోట్లు ఖర్చుపెడుతున్నట్లు చెప్పారని, ఈ నిధులు 57 డివిజన్లకు ఏ విధంగా ఖర్చు పెడతారని ప్రశ్నిస్తే సమాధానం లేదని విమర్శించారు. రూ.670కోట్ల ప్రారంభ నిల్వ చూపిన అధికారులు అది ఏయే ఖాతాల్లో ఉందని అడిగితే సమాధానం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ సంవత్సరంలో నగరపాలక సంస్థ ఖర్చు పెట్టబోయే రూ.187కోట్లకు లెక్కల్లో సారూప్యత లేదని, దీనిపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశామని వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఫిక్స్డ్ డిపాజిట్స్ కింద రూ.150 నుంచి రూ.200కోట్ల వరకు ఉండాలని, ప్రస్తుతం రూ.45కోట్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారని విమర్శించారు. సాధారాణ ఖర్చుల కింద ఈ సంవత్సరం రూ.169 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపారని, వాటికి ఎలా ఖర్చుపెట్టారో చూపలేదని పేర్కొన్నారు. వీటన్నింటికీ ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ పులి శ్రీనివాసులు సీఎంఓలో పనుందని చెప్పి వెళ్లిపోయారని వజ్రబాబు విమర్శించారు. ఇన్ఛార్జ్ మేయర్ సజీల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.అధికారులు కూటమి ప్రభుత్వానికి అమ్ముడుపోయారని ఆయన వజ్రబాబు ఆరోపించారు. సుదీర్ఘంగా చర్చ జరగాల్సి ఉంది కూటమి సర్కారులో అధికారులు అమ్ముడుపోయారు కౌన్సిల్ నుంచి కమిషనర్ బయటకువెళ్లిపోవడమేమిటీ? నగర డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ధ్వజం -
పాన్‌మసాలా యాడ్స్ చేస్తున్న సెలబ్రిటీలపై చర్యలు తీసుకోండి
ప్రజారోగ్యానికి పెనుముప్పులా మారిన పాన్ మసాలా ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న ప్రముఖ సినీనటులపై కఠినమైన చర్యలు చేపట్టాలి. బాలీవుడ్ నటులు, ప్రముఖులు ఏకమై హానికరమైన పాన్‌మసాలా ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన సెలబ్రిటీలపైనా ఇటీవల తెలంగాణలో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రకటనలు యిచ్చే వారిపై కఠినమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. – ఏపీ సిటిజన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు, న్యాయవాది షేక్.జిలానీ, న్యాయవాదులు నూనె పవన్‌తేజ, పాలపాటి అనీల్‌కుమార్, సత్య, సైదా, షారూక్. -
బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి: గుంటూరు నగరంలో వీధి కుక్క దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు కె ఐజక్ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశాలతో బాలుడి కుటుంబానికి సోమవారం పరిహారం అందించారు. బాలుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల సంతాన నియంత్రణ కోసం 4 నెలల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 3.43 లక్షల వీధి కుక్కలు ఉండగా, అందులో 2.03 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తయిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా అదుపు చేసేందుకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీని తక్షణం చేపట్టాలని సీఎం సూచించారు. గుంటూరు తరహా ఘటనలు మళ్లీ తలెత్తకుండా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత నెహ్రూనగర్: వీధి కుక్క దాడిలో మృతి చెందిన బాలుడు ఐజాక్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్కును ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీల అందజేశారు.. సోమవారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వర్ణభారతినగర్ శివారు ఇద్వా నగర్లో కుక్క దాడిలో మృతి చెందిన బాలుని తల్లిదండ్రులు రాణి, నాగరాజులను పరామర్శించి రూ.5 లక్షల చెక్కుని అందించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, కౌన్సిల్ టీడీపీ ఫ్లోర్‌లీడర్ కె.రవీంద్ర, స్థానిక కార్పొరేటర్ బి.స్మిత పద్మజ, ఎస్ఎస్ సోమశేఖర్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సాయి కల్యాణ చక్రవర్తి గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బి.సాయి కల్యాణ్‌చక్రవర్తి నియమితులయ్యారు. రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న కొందరికి పదోన్నతి, మరికొందరికి స్థాన చలనం కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న బి సాయి కళ్యాణ్ చక్రవర్తిని గుంటూరు జిల్లా ప్రధాని న్యాయమూర్తిగా నియమించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయుచున్న వై.వి.ఎస్.బి.జి.పార్థసారథిని హైకోర్టు రిజిస్టర్ జనరల్‌గా నియమించారు. గుంటూరు నగరంలో పర్యటించిన ఐజీ పట్నంబజారు: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం గుటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పాతగుంటూరు పోలీసు స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో ఆనందపేటలో జరిగిన వృద్ధురాలు పఠాన్ ఖాజాబీ హత్య, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన దాడి నేపథ్యంలో సంబంధిత కేసు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని, నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలని స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం ఆనందపేట 2వలైనులో హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ఐజీ వెంట ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్య, పాతగుంటూరు పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ వై.వీరసోమయ్య తదితరులు ఉన్నారు. యార్డుకు 1,53,787 మిర్చి బస్తాలు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,53,787 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,37,288 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యా ర్డులో ఇంకా 64,276 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. -
దివ్యాంగుల చట్టంలో అనేక వెసులుబాటులున్నాయి
గుంటూరు వెస్ట్: విభిన్న ప్రతిభావంతుల చట్టం–2016లో అనేక వెసులుబాటులున్నాయని వాటిని తెలుసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో దివ్యాంగుల ఆస్తిపాస్తుల నిర్వహణ, ఫ్యామిలీ పెన్షన్‌తోపాటు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు వీలుగా మందపాటి ఉదయ్ సాగర్, కొత్తపల్లి రవిబాబులను సంరక్షకులుగా నియమిస్తూ గార్డియన్షిప్ సర్టిఫికెట్‌ను అందజేశారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టాన్ని అనుసరించి దివ్యాంగుల ఆస్తిపాస్తుల నిర్వహణ, ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు అవకాశముంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ్ -
రాజధానిలో ఇదే నిజం
ఇంటి ఇంటికో న్యాయం.. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజధాని అమరావతి గ్రామాలలో ఇంటి ఇంటికో న్యాయం అన్నట్లు వ్యవహారాలు సాగుతున్నాయి. పాలకులు, ఉన్నతాధికారుల ఇష్టాయిష్టాలే నిర్ణయాలవుతున్నాయి. వాటినే న్యాయమైనవిగా చిత్రీకరించే యత్నాలు జరుగుతున్నాయి. గ్రామకంఠాల హద్దుల నిర్ణ యాలు, ప్రత్యామ్నాయంగా మినహాయించే భూమి విషయంలో తీవ్ర అన్యాయాలు చోటుచేసుకున్నాయనేది బహిరంగ రహస్యమే. దీనిపై ఏపీ సీఆర్డీఏ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లిన ప్రతిసారీ పలు గ్రామాల వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అయితే తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారని యజమానులు వాపోతున్నారు. గ్రామకంఠాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని అప్పటి, ఇప్పటి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వద్ద ఎంతగా మొత్తుకుంటున్నా దాటవేత మాటలే తప్ప స్పష్టత రావడం లేదనే తీవ్ర ఆరోపణలు గ్రామస్తుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అన్యాయాలను సరిచేస్తారనే నమ్మకం సడలుతున్నందున న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మినహా గత్యంతరం లేదని రాజధాని గ్రామాల్లోని రైతులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసమంటూ... అమరావతి రాజధాని కోసం భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం–ఎల్పీఎస్) కింద తాడేపల్లి, ఉండవల్లితోపాటు 29 గ్రామాల పరిధిలో భూములను తీసుకునే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు విభిన్న హామీలను కుమ్మరించింది. గ్రామాలను యథాతథంగా ఉంచుతామని, గ్రామకంఠాలను స్పష్టంగా నిర్దేశిస్తామని, భవిష్యత్తు అవసరాలకు గ్రామ శివార్ల నుంచి కొంత భూమి యజమానులకు మినహాయింపుగా ఇస్తామని నమ్మబలికింది. రాజధాని ప్రకటన నోటిఫికేషన్ నాటికి ఉన్నది ఉన్నట్లేనని వెల్లడించింది. అయితే ఆ తరువాత పలుకుబడి కలిగిన వారికి ఓ న్యాయం, పేదలకు మరో న్యాయం అన్నట్లు వ్యవహారాలు జరిగాయి. ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందడానికి కొత్త నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వానికి అనుకూలురుగా ఉన్న వారి నూతన భవనాలు, షెడ్లను పరిగణలోకి తీసుకోగా, పేదలవి తిరస్కరణకు గురైన ఉదాహరణలు ఉన్నాయి. 2014–2019 మధ్య కాలంలో ఇలాంటివి చాలానే చోటుచేసుకున్నాయి. ఒక్కో గ్రామంలో ఒక్కోలా... గ్రామకంఠం పరిధిలో నిర్మాణాలున్న యజమానులకు భవిష్యత్తు అవసరాల కోసం, ఖాళీ స్థలాల ఆధారంగా గ్రామ శివారును సరిహద్దుగా నిర్ణయించి, అక్కడి నుంచి 500 మీటర్లు పూర్తిగా వదిలేస్తామని మంత్రి నారాయణ ఊరూరా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇల్లు, పశువుల కొష్టం, గడ్డి వామి, బ్యారన్ తదితర నిర్మాణాల ప్రహరీలను గుర్తించి వాటిని హద్దుగా నిర్ణయిస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాంటి యజమానులు స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే పది సెంట్ల వరకు మినహాయింపుగా ఇస్తామని కూడా వివరించింది. ఇందుకు పంచాయతీరాజ్ చట్టాన్నీ ఉదహరించింది. కాగా కొన్ని గ్రామాల్లో పై హామీ విషయంలో అధికారులు ఉదారంగా వ్యవహరించగా మరికొన్ని చోట్ల అమలు చేయలేదు. దరఖాస్తుదారుల్లో పలువురికి పది సెంట్లు మాత్రమే మినహాయించగా, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వారికి, పలుకుబడి కలిగిన వారికి, అధికారులకు లంచాలు ముట్టచెప్పిన వారికి ఇష్టానుసారం భూమిని మినహాయించిన దాఖలాలు ఉన్నాయి. ఇంటి, ఇంటికీ, గ్రామ గ్రామానికీ మధ్య ఉన్న వ్యత్యాసాలను ఉటంకిస్తూ తమకూ తగిన న్యాయం చేయాలని 9.2 ద్వారా ఏపీ సీఆర్డీఏకి విభిన్న గ్రామాల వారు అర్జీలు అందజేస్తూ వచ్చారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఇప్పటికీ అధికారికంగా ఏపీ సీఆర్డీఏ నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లో డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీని మంత్రి నారాయణకు గుర్తు చేస్తున్నారు. తుళ్లూరు, విజయవాడల్లోని కార్యాలయాలకు వెళ్లి విన్నవిస్తున్నారు. ఈ ఫొటోలోని ఇళ్లు నెక్కల్లులోని ముగ్గురు సోదరులవి. వీరి నివాసాలు శివారులో ఉన్నా గ్రామకంఠం పరిధిలోకి చేర్చలేదు. భూమి మినహాయింపు ఇవ్వలేదు. తమకు జరిగిన అన్యాయంపై దరఖాస్తు చేసుకున్నా, ఎన్నిసార్లు అధికారులను కలిసినా ఇప్పటికీ ఫలితం లేదు. గ్రామకంఠం హద్దుల అంశంలో దారుణాలు ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా నిర్ణయాలు యజమానిని బట్టి భూమి మినహాయింపులు పేదోళ్లకు ఒకలా.. పెద్దోళ్లకు మరోలా అవకాశాలు అమరావతిలో అంతులేని అక్రమాలు మంత్రి నారాయణ హామీలకు మోసపోయామంటున్న బాధితులు న్యాయం జరగకపోతే కోర్టుకే అంటున్న యజమానులు ఈ ఫొటోలో కనిపిస్తున్న భూమి తుళ్లూరు దామినేని కృష్ణవేణికి చెందినది. రోడ్డు నిర్మాణం కోసం 1.28 ఎకరాలు అవసరమైంది. ఇక్కడ రెండు బ్యారన్లు, రెండు షెడ్లు ఉన్నాయంటూ 1.28 ఎకరాలకు సమానమైన భూమిని ఇవ్వడంతో పాటు పరిహారంగా 6,193.83 చదరపు గజాల ప్లాట్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. కష్ణవేణి భర్త దామినేని శ్రీనివాసరావు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు ప్రధాన అనుచరుడు, తుళ్లూరు మండల స్థాయి టీడీపీ నాయకుడు కావడమే ఇందుకు కారణం. నెక్కల్లు గ్రామ సర్వేనెంబరు 143/3లో మిక్చర్ కాలనీ(విభిన్న సామాజిక వర్గాల వారు కలిసి ఉంటారు.)లోని వారికి తీవ్ర అన్యాయం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. కాలనీలో చుట్టుపక్కల ఇళ్లు ఉన్నా పరిఽగణలోకి తీసుకోలేదు. న్యాయం చేయాలని కోరుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. -
‘లెక్క’జిత్తుల బడ్జెట్
● అంతా అంకెల గారడీ ● వైఎస్సార్ సీపీ సభ్యుల నిరసన ● కౌన్సిల్లో బడ్జెట్ ఆమోదానికి నిరాకరణ ● ఎట్టకేలకు మెజార్టీ సభ్యుల మద్దతుతో బడ్జెట్‌కు ఆమోదం ● వీధి కుక్కల స్వైరవిహారంపై సుదీర్ఘ చర్చ చిన్నారికి వైఎస్సార్ సీపీ నేతల నివాళి నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): బడ్జెట్ అంతా అంకెల గారడీ అని, నక్కజిత్తుల బడ్జెట్ అని వాస్తవ లెక్కలకు బడ్జెట్లో పొందుపరిచిన అంకెలకు పొంతన లేదని వైఎస్సార్ సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో సోమవారం ఉదయం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. వాస్తవానికి ఈ సమావేశం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇన్చార్జి మేయర్ సజిల 11.57 గంటలకు వచ్చి సమావేశాన్ని ఆరంభించారు. సుదీర్ఘ చర్చ అనంతరం మెజార్టీ సభ్యుల మద్దతుతో రూ.1534.27కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బాలుడి మృతికి సంతాపం కౌన్సిల్ సమావేశంలో తొలుత గుంటూరు స్వర్ణభారతి నగర్లో ఆదివారం వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు ఐజాక్ మృతిచెందడంపై సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ నగరంలో కుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో లెక్కలు తేల్చాలని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు) ప్రశ్నించారు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని కార్పొరేటర్ మొహమూద్ పేర్కొన్నారు. గతంలో డెప్యూటీ మేయర్‌గా ఉన్న ప్రస్తుత ఇన్చార్జి మేయర్ షేక్ సజీల కూడా వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోస్టర్ ప్రదర్శించారని కార్పొరేటర్లు సంకూరి శ్రీనివాసరావు, సాంబిరెడ్డి గుర్తుచేశారు. తక్షణం ప్రత్యేక సమావేశం నిర్వహించి వీధికుక్కల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని డెప్యూటీ మేయర్ డైమండ్‌బాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం డిమాండ్ చేశారు. దురదృష్టకర ఘటన వీధికుక్క దాడిలో బాలుడి మృతి దురదృష్టకరమని కుమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు. నగరంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ(ఏబీసీ) ఆపరేషన్లు జరిగేవని, యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆదేశాలతో అవి నిలిచిపోయాయని వివరించారు. ప్రస్తుత సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి నగరపాలక సంస్థ తరపున ఏబీసీ ఆపరేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో 31,400 కుక్కలు ఉన్నాయని, వీటలో 4,500 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు చేశామని,, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లూ వేశామని వెల్లడించారు. కుక్కలను పట్టుకునేందుకు వెళ్తున్న మున్సిపల్ సిబ్బందిపై కొందరు దాడి చేశారని, వారిపై కేసు పెట్టామని పేర్కొన్నారు. బడ్జెట్ తయారీలో లోపాలు వార్షిక బడ్జెట్ తయారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించారని వైఎస్సార్సీపీ సభ్యులతో పాటు, కూటమి సభ్యులూ ఆరోపించారు. అసలు బడ్జెట్లో పొందుపరిచిన లెక్కలకు వాస్తవిక లెక్కలకు పొంతనే లేదన్నారు. టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది రూ.5 కోట్లు చూపితే ఈ యేడు రూ.10కోట్లు ఏ విధంగా వస్తాయని కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ నుంచి అసలు ఎంత ఆదాయం వస్తుందని కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాంప్రసాద్ అడిగిన ప్రశ్నకు అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఈ బడ్జెట్ తనకేం అర్థం కాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులకు అడ్డంకులు బడ్జెట్ సమావేశంలో వైఎస్సార్ సీపీ సభ్యులకు అడుగడుగునా కూటమి సభ్యులు అడ్డంకులు సృష్టించారు. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గలాభా సృష్టించారు. ఖాళీ స్థల పన్నులు, మీడియా డిస్ప్లే డివైజ్ ఫీజులు, పారిశుద్ద్యం, ట్రేడ్ లైసెన్స్‌లు, యూజర్ చార్జీలు, ట్యాక్స్‌లు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణలో లోపాలున్నాయని పలువురు సభ్యులు ప్రశ్నించారు. సాయంత్రం వరకు కొనసాగిన బడ్జెట్ సమావేశంలో చివరిగా డెప్యూటీ మేయర్ బాలవజ్రబాబు బడ్జెట్‌పై పశ్నలను అడిగే క్రమంలో కూటమి సభ్యులు లేచి నిలబడి తాము బడ్జెట్‌ను ఆమోదిస్తున్నామని, తీర్మానం చేయాలని అక్కడి నుంచి వెళ్లేపోయే యత్నం చేశారు. దీంతో ఇన్చార్జ్ మేయర్ సజీల వార్షిక బడ్జెట్ ఆమోదం పొందినట్టు ప్రకటించారు. దీనిని వైఎస్సార్ సీపీ సభ్యులు ఖండించారు. బడ్జెట్ స్వరూపం ఇలా రూ.కోట్లలో ప్రారంభ నిల్వ 670,23,59,195 జమలు 864,04,08,399 మొత్తం 1534,27,67,594 ఖర్చులు 1018,23,16,149 అంత్య నిల్వ 513,04,51,445 -
ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం
కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామక్రిష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు -
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
గుంటూరు రూరల్: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామంలో ఆదివారం జరిగింది. సీఐ రామానాయక్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు అన్నవరపు వసంతరావు (63) తనకున్న కొద్దిపాటి పొలంతోపాటు గ్రామంలో మరో రెండు, మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో గతంలో కొంత అప్పులు ఉన్నా.. ఈ ఏడాది పండించిన పంటలకు మద్దతు ధరలేకపోవటంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పుల వాళ్ళ వేధింపులు పెరిగి ఆర్థికంగా దెబ్బతిన్నాడు. మనస్థాపంతో ఈనెల 4న తన పొలంలో కలుపు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలో అపస్మారక స్థితిలో పడిఉన్న వసంతరావును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సంఘటనపై మృతుని కుమారుడు రవి ఫిర్యాదు మేరకు వట్టిచెరుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాస్టర్ మృతిపై విచారణకు డిమాండ్
వేటపాలెం: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పాస్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ చార్లెస్ ఫీన్నీ డిమాండ్ చేశారు. ఆదివారం వేటపాలెం క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆధ్వర్యంలో వందల మందితో దేశాయిపేట నుంచి వేటపాలెం గడియార స్తంభం సెంటర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పలువురు పాస్టర్లు మాట్లాడుతూ.. ప్రవీణ్ పగడాలను హత్య చేశారనే నమ్ముతున్నామని, ఒక దైవజనుడిని హత్య చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటే అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఒక్క ప్రవీణ్‌ను చంపితే వందలాది మంది ప్రవీణ్‌లు పుట్టుకొస్తారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల రక్షణకు భరోసా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అన్నాలదాసు భాస్కర్‌రావు, పాస్టర్ సత్యంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రగోరి, మండల దైవ సేవకులు, మహిళలు పాల్గొన్నారు. భారీ ర్యాలీకి తరలివచ్చిన వందల మంది క్రైస్తవులు -
తల్లీకుమారుడిని బలిగొన్న ట్రాక్టర్
బాపట్ల టౌన్ : ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు తల్లీకుమారుడిని బలిగొంది. ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో కుమారుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన తల్లిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని మచ్చావారిపాలెం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న పెర్ల శివయ్య (45) తన తల్లి చిట్టెమ్మను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని బాపట్ల వైపు నుంచి జగనన్నకాలనీ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పెర్ల శివయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి చిట్టెమ్మకు రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు స్పందించి చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ చిట్టెమ్మ(70) మృతి చెందింది. శివయ్యకు భార్య భవాని, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిట్టెమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శివయ్య నాలుగో సంతానం. రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు ఒక్కసారే మృతి చెందడంలో ఏరియా వైద్యశాలలో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లడిల్లిన తల్లిదండ్రులు
కుక్క దాడిలో గాయపడి మరణించిన బాలుడు ఐజాక్ తల్లిదండ్రులు నాగరాజు, రాణి గుంటూరు జీజీహెచ్ వద్ద గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. వీధి కుక్కలను నియంత్రించలేని అధికారయంత్రాంగం తీరుకు నిరసనగా బంధువులు ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన చేశారు. దీంతో గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆస్పత్రి వద్దకు వచ్చి బాధితులతో మాట్లాడారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా తల్లిదండ్రులకు అప్పగించారు. – గుంటూరు రూరల్ -
బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవాలి...
శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి, ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి.–డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు. -
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
గోళ్లపాడు (ముప్పాళ్ల): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని గోళ్లపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుందురువారిపాలెం గ్రామానికి చెందిన కామేపల్లి చంద్రశేఖర్ (32) తన ట్రాక్టర్లో మొక్కజొన్న విత్తనాలు లోడుతో పొలంలో వస్తున్నాడు. పొలంలో ఉన్న గుంతలో పడి డ్రైవర్ సీటులో ఉన్న చంద్రశేఖర్ ఎగిరి కింద పడ్డాడు. చంద్రశేఖర్ గుండెలపై గుండా ట్రాక్టర్, లోడుతో ఉన్న ట్రక్కు వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వి.సోమేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పోరాట యోధుడు పాపిరెడ్డి
గుంటూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ సోషలిస్ట్ ఫ్రంట్ యోధుడు మోదుగుల పాపిరెడ్డి (88) ఆదివారం కన్నుమూశారు. ఈయన వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తండ్రి. పాపిరెడ్డి పౌర హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. పాపిరెడ్డి ప్రస్థానం మోదుగుల పాపిరెడ్డి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో 1937 అక్టోబర్ 9న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన ఎంఏ, ఎల్ఎల్బీ వరకూ చదివారు. 1961లో గుంటూరులో న్యాయవాది వృత్తిలో కొనసాగారు. విద్యార్థి దశలోనే ఆయన సోషలిస్ట్ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. సోషలిస్ట్ పార్టీకి తన జీవితాన్ని అంకితం చేశారు. 1955లో రామ్మనోహర్ లోహియా గుంటూరుకు వచ్చినపుడు ఆయన ప్రసంగాలతో పాపిరెడ్డి ప్రభావితమయ్యారు. లోహియాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. సోషలిస్ట్ ఉద్యమ నేతలైన మధుమిమాయో, రాజ్‌నారాయణ్, మధుదండావతే, జార్జి ఫెర్నాండేజ్ తదితరులతో కలిసి జాతీయస్థాయిలో పనిచేశారు. 1975లో లోక్‌నాయక్ జయప్రకాష్‌నారాయణ నిర్వహించిన ఉద్యమంలో పాల్గొని ఐదు నెలలు అజ్ఞాత జీవితం గడిపారు. 1975 నవంబర్ 14న అరెస్టు అయ్యారు. 1977 జనవరి వరకు రాజమండ్రి, సికింద్రాబాద్ జైళ్లలో ప్రభుత్వం ఆయనను నిర్బంధించింది. పాపిరెడ్డితోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ బి.సత్యనారాయణరెడ్డి, బీజేపీ నాయకులు జూపూడి యజ్ఞనారాయణ, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కాతా జనార్దనరావు తదితరులు జైల్లో కలిసి ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని కాండ్లరేవు సత్యాగ్రహంలో జార్జిఫెర్నాండేజ్తో కలిసి పాపిరెడ్డి పాల్గొన్నారు. ఓపీడీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. కార్మికుల ఆకలిచావులను నిరసిస్తూ 1989లో గుంటూరు కలెక్టరేట్ వద్ద పాపిరెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పాపిరెడ్డి తెలుగు భాషాభిమాని. తమిళనాడులో హోనూరు, కృష్ణగిరి జిల్లాల్లో పాదయాత్రలు జరిపి తెలుగు భాషాభివృద్ధి కోసం పోరాడారు. బరంపురంలో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభల విజయానికి చీఫ్ పాట్రన్‌గా ఎంతో కృషిచేశారు. అఖిల భారత తెలుగు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై భాష కోసం పాటుపడ్డారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పాపిరెడ్డి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రజల స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్ హరిస్తుందంటూ గళమెత్తారు. పాపిరెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందించింది. వందలాది పురస్కారాలు పాపిరెడ్డిని వరించాయి. ఆయన సేవా కార్యక్రమాల్లోనూ ముందుండేవారు. పెదపరిమి గ్రామంలో ఆర్సీఎం స్కూలు కమిటీ కన్వీనర్‌గా పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తాడికొండలో సత్యసాయిబాబా కళాశాల పాలకవర్గ సభ్యుడిగా పనిచేశారు. పెదపరిమి గ్రామంలో వినాయకుడి ఆలయాన్ని నిర్మించారు. పలువురి సంతాపం మోదుగుల పాపిరెడ్డి మృతి వార్త తెలిసి గుంటూరు జిల్లాతోపాటు పలు జిల్లాల్లో ఆయన ఆత్మీయులు, అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వణుకూరి శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి ఇన్చార్జ్ సుధీర్ భార్గవ్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, మోపిదేవి వెంకటరమణ, కోవెలమూడి రవీంద్ర, రాయపాటి శ్రీనివాస్, రావెల కిషోర్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, బీజేపీ నేత జూపూడి రంగరాజు ఉన్నారు. ఒకే జైలులో ఉన్నాం : యలమంచిలి శివాజీ పాపిరెడ్డి మృతికి రైతు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో పాపిరెడ్డి తాను ఒకే జైలులో ఉన్నామని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్‌కుమార్ కూడా పాపిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. అంబటి నివాళి పాపిరెడ్డి మృతికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాళి అర్పించారు. పాపిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కూడా పాపిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. జీవితమంతా ప్రజల కోసం తపించిన నేత సేవా కార్యక్రమాల్లోనూ ముందు ప్రముఖుల సంతాపం -
ఎస్ఆర్ఎం విద్యార్థికి ‘బెస్ట్ పేపర్ ఇన్ ట్రాక్’ అవార్డు
నగరి : గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్, పారి స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సెకండ్ ఇయర్ పీహెచ్డీ చదువుతున్న సయ్యదాహఫ్సా అనే విద్యార్థికి ‘బెస్ట్ పేపర్ ఇన్ ట్రాక్ అవార్డు‘ దక్కింది. గత నెల 21వ తేదీన బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎవిడెన్స్ బేస్డ్ మేనేజ్మెంట్ (ఐసీఈబీఎం)లో పాల్గొన్న ఆమె ‘బియాండ్ ది డెస్క్: ఫ్యూయలింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ త్రూ వర్క్‌ప్లేస్ ఫ్లెక్సిబిలిటీ’ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఇందుకు గాను ఆమెకు ‘బెస్ట్ పేపర్ ఇన్ ట్రాక్ అవార్డు’ ప్రదానం చేశారు. కాగా ఆమె భర్త షేక్ సలీమ్ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్‌గా ఉన్నారు. కళాశాల డీన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎఆర్ఎం పీఎస్‌బీలు అందించిన మద్దతు, మార్గదర్శకత్వంతోనే అవార్డు సాధించగలిగానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. విలువైన సలహాలు సూచనలు అందించిన డాక్టర్ జుమాన్ ఇక్బాల్‌కు, ప్రోత్సాహం అందించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలి
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ నగరంపాలెం: రౌడీషీటర్లు, ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో శనివారం కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల (పీఎస్)కు సంబంధించి న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని సూచించారు. ఆయా పీఎస్‌ల పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, సాక్ష్యాధారాలు సమర్పించాలని తెలిపారు. పలు కేసుల్లోని ముద్దాయిలు, రౌడీషీటర్ల హాజరు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లపై శ్రద్ధ వహించాలని చెప్పారు. ముద్దాయిల జాడ తెలియకపోతే ష్యూరిటీలను కోర్టుకు హాజరుపరచాలని సూచించారు. హత్య, హత్యాయత్నం, ఎన్డీపీఎస్, పోక్సో, అత్యాచార కేసుల్లో నేరాలకు సంబంధించి విచారణను సంబంధిత కోర్టులో త్వరితగతిన జరిగేలా చేయాలని ఆదేశించారు. గత నెలలో ఆయా న్యాయస్థానాల్లో పలు కేసులకు సంబంధించి వెలువరించిన తీర్పులు, నిందితులకు విధించిన శిక్షలపై సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. శిక్షల విధింపులో మరింత కృషి చేస్తే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని కట్టడి చేయవచ్చునని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ –2 సీఐ బి.నరసింహారావు, పీఎస్‌ల కోర్టు ఏఎస్ఐలు, హెస్సీలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
నంద్యాల, సూర్యాపేట ఎడ్లకు ప్రథమ బహుమతి
తెనాలి రూరల్: స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహిస్తున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన, పశు పాల ప్రదర్శన పోటీలు ముగిశాయి. గత నెల 29వ తేదీ నుంచి జరుగుతున్న పోటీల్లో చివరి రోజైన శుక్రవారం సీనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు. 11 జతల ఎడ్లు పోటీ పడ్డాయి. రాత్రి పొద్దు పోయే వరకు హోరాహోరీగా పోటీలు జరిగాయి. నంద్యాల జిల్లా పెదకొట్టలకు చెందిన జోరెడ్డి కేశవరెడ్డి, తెలంగాణ జిల్లా సూర్యాపేటకు చెందిన ఏఎస్పీ సుంకి సురేందర్‌రెడ్డి కంబైన్డ్ ఎడ్ల జత నిర్ణీత సమయంలో 3619.9 అడుగులు లాగి ప్రథమ బహుమతిని పొందాయి.తాడేపల్లికి చెందిన లంకిరెడ్డి నిక్షేత్రెడ్డి ఎడ్ల జత(3394.10 అడుగులు) రెండో బహుమతిని, ప్రత్తిపాడు మండలం పెద్దగొట్టటిపాడుకు చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్ల జత (3351.8 అడుగులు) మూడో బహుమతిని సాధించాయి. సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిగా బెల్లెట్ బండిని అందజేశారు. పోటీలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యవేక్షించారు. -
అలరించిన శ్రీరామ గానా మృతం
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భక్త నారద గాన సభ ఆధ్వర్యంలో శనివారం శ్రీరామ గానా మృతం నిర్వహించారు. కార్యక్రమాన్ని విశ్రాంత అదనపు ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, సంగీత విద్వాంసులు కె.వి.బ్రహ్మానందం, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య పాహి రామప్రభో, రామచంద్రుడితు రఘువీరుడు, ననుబ్రోవమని చెప్పవే, సీతా కళ్యాణ వైభోగమే అంటూ పలు భక్తి గీతాలను రమ్యంగా ఆలపించారు. సభికులను అలరించాయి. వయోలిన్‌పై పాలపర్తి ఆంజనేయశాస్త్రి, మృదంగంపై కాకరపర్తి జగన్మోహిని వాయిద్య సహకారాన్ని అందించారు. అనంతరం కళాకారులను సత్కరించారు. కుటుంబ సభ్యుల చెంతకు చేరిన వృద్ధుడు తాడేపల్లి రూరల్: ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు వృద్ధుడు చేరాడు. ప్రకాశం జిల్లాకు చెందిన వృద్ధుడు దారితప్పి తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లికి చేరుకోవడంతో స్థానికులు ఆశ్రయమిచ్చిన సంగతి తెలిసిందే. తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య వృద్ధుడిని శుక్రవారం తాడేపల్లి ఆశ్రమానికి తరలించి, కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. కుంచనపల్లిలో ఉన్నారని సిబ్బంది ద్వారా సమాచారం రావడంతో శనివారం వారిని పిలిపించి అప్పగించారు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు తహసీల్దార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నేలకొరిగిన నాలుగు విద్యుత్ స్తంభాలు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగరంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి అమరావతి రోడ్, ఆంజనేయస్వామి గుడి వద్ద వీధి లైట్ల కోసం వేసిన నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో తక్షణమే సరఫరా నిలిపివేశారు. స్తంభాలు కూలడంతో అమరావతి రోడ్లో ట్రాఫిక్‌కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సంబంధిత అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది స్తంభాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ వినుకొండ: వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పీఎస్ ఖాన్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు, జమైత్ – ఉల్ – ఉలేమా, జమైత్ ఇస్లాం–ఎ–హింద్ సహా పలు మైనార్టీ సంస్థలు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేశాయన్నారు. దేశంలో 14.6 శాతం ఉన్న ముస్లింల అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వక్ఫ్‌బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం, వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్లుగా ఎవరి అధీనంలో ఉంటే వారివే అనడం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం.. ఇవన్నీ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలు అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ఈ బిల్లును వ్యతిరేకించిందని గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. కౌన్సిలర్లు గౌస్‌బాషా, షేక్ రఫీ, మైనార్టీ నాయకులు హఫీజ్, గౌస్‌బాషా, హిప్పీ, జాని, అయాజ్, అమీర్, రబ్బానీ పాల్గొన్నారు. -
విలువలతో కూడిన బోధనతో విద్యార్థుల్లో వికాసం
గుంటూరు ఎడ్యుకేషన్: విలువలతో కూడిన బోధనతో విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని అభివృద్ధి పర్చగలమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. రింగ్ రోడ్డులోని శ్రీ చైతన్య సీవో–ఐపీఎల్ పాఠశాల ద్వితీయ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ సాంకేతిక విద్యా బోధనకు శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో సీవో–ఐపీఎల్ పాఠశాలను నెలకొల్పడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో సమాజంలో మెలుగుతూ దేశభక్తిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. అనంతరం విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో శ్రీచైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, డీన్ శివకుమార్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, ఇన్‌చార్జ్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అట్టడుగువర్గాల అభ్యున్నతికి కాంక్షించిన జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో నడవాలని జెడ్పీ సీఈవో కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. జెడ్పీ కార్యాలయంలో శనివారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హెనీ క్రిస్టినా మాట్లాడారు. జగ్జీవన్‌రామ్ జీవిత చరిత్ర, ఆశయాలను స్ఫూరిగా తీసుకుని ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళి గుంటూరు లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలోని గుంటూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప ప్రధానిగా జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. కార్యక్రమానికి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగళశెట్టి శివ సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ఏపీ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈవెన సాంబశివ ప్రసాద్, నాలుగవ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుకుమార్, బార్ కౌన్సిల్ మెంబర్ వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ న్యాయవాదులు పాల్గొన్నారు బాబూజీని ఆదర్శంగా తీసుకోవాలి ఏఎన్‌యూ: క్రమశిక్షణ, లక్ష్య సాధనలో బాబూ జగ్జీవన్‌రామ్‌ను యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ రోడ్ సేఫ్టీ విభాగ డీఐజీ సీహెచ్. విజయారావు తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలోని బాబూ జగ్జీవన్‌రామ్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జయంతి వేడుకలు నిర్వహించారు. డీఐజీ విజయారావు ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని అవాంతరాలను అధిగమించి అత్యున్నత స్థాయికి చేరి జగ్జీవన్‌రామ్ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. విద్యార్థులంతా ఆయన బాటలో నడవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్, ఫూలే, అంబేడ్కర్ వంటి అహనీయుల సేవలు, ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ అధ్యయనకేంద్రం డైరెక్టర్ ఆచార్య పీజే రత్నాకర్ మాట్లాడుతూ విద్యార్థిగా, సామాజిక ఉద్యమాల నాయకుడిగా, రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా జగ్జీవన్‌రామ్ విలక్షణమైన ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్, ఫూలే అధ్యయన కేంద్రాల డైరెక్టర్లు వై. అశోక్ కుమార్, ఎం. త్రిమూర్తిరావు, యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ పి. బ్రహ్మాజీరావు, పీజీ పరీక్షల కోఆర్డినేటర్ ఎం. సుబ్బారావు, బాలుర వసతి గృహాల వార్డెన్ ఆచార్య మల్లికార్జున, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ కృష్ణారావు పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్‌రామ్ పోరాటం నగరంపాలెం: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్‌రామ్ 118వ జయంతి వేడుకలను శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అధ్యక్షత వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తాత్కాలిక మేయర్ షేక్ సజీల జ్యోతి ప్రజ్వలన చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో కూటమి ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ మహానీయుల జీవితాలను పిల్లలు ఆదర్శంగా తీసుకుని ఎదిగేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉందని చెప్పారు. ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ మాట్లాడుతూ బిహార్‌లోని మారుమూల గ్రామంలో జన్మించి, ఉప ప్రధాని స్థాయికి ఎదిగి జగ్జీవన్‌రామ్ చరిత్ర సృష్టించారని అన్నారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అమరావతిలో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఆర్ఓ ఖాజావలి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, కార్పొరేటర్ పోతురాజు సమత, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య
నరసరావుపేటటౌన్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి సంఘటన శుక్రవారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో హుబ్లి ఎక్స్‌ప్రెస్ కింద పడి పెద్దచెరువు ప్రాంతానికి చెందిన గాలి థామస్(70) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన పైలెట్ సమాచారాన్ని నరసరావుపేట రైల్వే పోలీసులకు అందించారు. ఎస్ఐ శ్రీనివాసనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
డీఆర్ఎం రామకృష్ణ బదిలీ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డీఆర్ఎం ఎం.రామకృష్ణ బదిలీ అయ్యారు. ఆయన నైరుతీ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. స్థానిక పట్టాభిపురం రైల్వే డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా డివిజన్ ఏడీఆర్ఎం సైమన్ మాట్లాడుతూ రామకృష్ణ కృషిని కొనియాడారు. డీఆర్ఎం రామకృష్ణ మాట్లాడుతూ సంతృప్తికరంగా విధులు నిర్వర్తించినట్టు వివరించారు. అనంతరం రామకృష్ణను ఏడీఆర్ఎం సైమన్, సీనియర్ డీపీఓ షహబాజ్ హానూర్, సీనియర్ డీపీఓ రత్నాకర్, సీనియర్ డీఎస్టీఈ మద్దాలి రవికిరణ్, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, యూనియన్ నాయకులు, సంఘ్ యూనియన్ తదితరులు సత్కరించారు. -
క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి
ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా రేపల్లె రూరల్: క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా అన్నారు. అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రేపల్లె క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవుని వాఖ్యాన్ని ప్రజలకు చేర్చి పరిశుద్దులను చేసే పాస్టర్లపై దాడులకు పాల్పడటం అమానుషమని పేర్కొన్నారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు చిత్రాల ఓబేదు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అన్నికోణాలలో సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో పాస్టర్లపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ కుటుంబ సభ్యులకు క్రైస్తవ సంఘాలు అన్ని వేళలా అండగా నిలుస్తాయని అన్నారు. ర్యాలీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, నెహ్రు బొమ్మ సెంటరుల మీదగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్, పోలీసుస్టేషన్లలో వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు గుజ్జర్లమూడి ప్రశాంత్‌కుమార్, గుజ్జర్లమూడి ఇమ్మానుయేలు, సముద్రాల ప్రభుకిరణ్, షేక్ ఖుద్దూష్, ఆలా రాజ్‌పాల్, జాలాది మునియ్య, జాలాది సునీల్, వివిధ చర్చిల పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కేఎల్‌యూలో అంతర్జాతీయ మహిళా సదస్సు
తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా సమ్మిట్(సదస్సు)ను ఉమెన్ డెవలప్మెంట్సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు మహిళా మణులతో కలిసి ప్రో.చాన్సలర్ డాక్టర్ కె.ఎస్.జగన్నాథరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సదస్సుకు గుంటూరుకు చెందిన సమగ్ర ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కె.నీరజ, యూఎస్ఏ సాడ్ డియగో యూనివర్శిటీ డీన్ డాక్టర్ మహాశ్వేత సర్కార్, కాసా ఎలైట్ డైరెక్టర్ ప్రీతి కొరటాల, రాష్ట్ర విపత్తుల శాఖ మేనేజర్ యశశ్విని పెద్ది, చినోయ్ డిజైన్ మేనేజింగ్ డైరెక్టర్ సాందీపని వజ్జి, అఖిల భారత సైకలాజికల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కె.లక్ష్మి తులసిబాయి, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బొల్లినేని కీర్తి, హోప్ విన్ ఆస్పత్రుల వ్యవస్ధాపక సీఈఓ ఎండీ షమా సుల్తానా, ది స్టెమ్ మేకర్ వ్యవస్థాపక సీఈఓ ఆష క్రాంతి నందిగం, ఏపీ హై కోర్టు న్యాయవాది అనుపమ దార్ల, కేఆర్ఆర్ ఇన్నోవేషన్ డైరెక్టర్ సిఇవో రష్మితరావు, లిటిల్ బ్లాక్ స్టార్ కో ఫౌండర్ తిరుమల శెట్టి మేఘన, సేఫ్, ఫన్ టైమ్ ఉపాధ్యక్షురాలు సుమ అట్లూరి ముఖ్యఅతిథులుగా హాజరై తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏడు అంశాలపై బృందాలుగా ఏర్పడి చర్చలు జరిపారు. మహిళా సమ్మిట్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ రూతు రమ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కార్యదర్శి కోనేరు శివకాంచనలత తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించాలి
జాయింట్ కలెక్టర్ భార్గవ్‌తేజ గుంటూరు వెస్ట్: దివ్యాంగుల సమస్యలపై అధికారులు దృష్టి సారించి వారి ఇబ్బందులను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వికలాంగుల కమిటి సమావేశంలో జేసీ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈసందర్భంగా వివిధ దివ్యాంగ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్సులు, మున్సిపల్ కాంప్లెక్సుల్లో దుకాణాలు, స్టాల్స్ కేటాయింపులో దివ్యాంగులకు అవకాశాలు కల్పించాలన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వంద శాతం వినికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా బస్సు పాస్ ఇవ్వాలన్నారు. దివ్యాంగుల ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే వారి కుటుంబాలు బాగుంటాయని పేర్కొన్నారు. అవసరం మేరకు ట్రైసైకిళ్లు మంజూరు చేయాలని కోరారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంలో గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగి సూరిటీ అడుగుతున్నారని, దీన్ని కొంత ఆలోచించాలని పేర్కొన్నారు. సమావేశంలో వికలాంగుల సంక్షేమ అధికారి సువార్త, జెడ్పి సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సఖీ నివాస్ ప్రారంభం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నగరంపాలెంలోని మహిళా ప్రాంగణంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ (సఖీ నివాస్)ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటీజన్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్య కుమారి, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం రూ. 2.27 కోట్లతో సఖీ నివాస్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో ఐసీడియస్ పీడీ కె.విజయలక్ష్మీ, ఆర్జెడి జయలక్ష్మి, మహిళా సహకార ఆర్థిక సంస్థ జిల్లా మేనేజర్ రమణశ్రీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మజ, గుంటూరు పశ్చిమ తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు
కొరిటెపాడు(గుంటూరు): పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌లో రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఏటా రైతులకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర పొలాల్లో చల్లి పూతకు వచ్చిన తర్వాత కలియదున్నితే సేంద్రీయ పదార్థం బాగా పెరుగుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. దీంతో ఇటీవల ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ప్రభుత్వం రాయితీపై వీటిని అందిస్తోంది. తాజాగా రాయితీ ధరలను ఖరారు చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా(గుంటూరు, పల్నాడు, బాపట్ల)కు ఈ ఏడాది 9,536 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించారు. అందులో గుంటూరు జిల్లాకు 301 క్వింటాళ్ల జీలుగ, 436 క్వింటాళ్లు జనుము, 967 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 1,704 క్వింటాళ్లు కేటాయించారు. పల్నాడు జిల్లాకు 2,607 క్వింటాళ్లు జీలుగ, 1,559 క్వింటాళ్లు జనుము, 1,178 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 5,544 క్వింటాళ్లు కేటాయించారు. అలాగే బాపట్ల జిల్లాకు 856 క్వింటాళ్లు జీలుగ, 853 క్వింటాళ్లు జనుము, 779 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 2,488 క్విటాళ్లు కేటాయించారు. వీటిని 50 శాతం రాయితీతో రైతులకు ఇవ్వనున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా వీటిని సరఫరా చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు. గరిష్టంగా ఐదు బ్యాగులు జీలుగ విత్తనాలు క్వింటా పూర్తి ధర రూ.12,300 కాగా, 50 శాతం రాయితీతో రూ.6,150 చొప్పున రైతులకు అందజేయనున్నారు. అలాగే క్వింటా జనుము విత్తనాల పూర్తి ధర రూ.10,900 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.5,450 చెల్లించాలి. పిల్లిపెసర క్వింటా పూర్తి ధర రూ.18 వేలు కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.9 వేలు చొప్పున రైతులకు విక్రయిస్తారు. జీలుగ, జనుము విత్తనాలు 10 కిలోల ప్యాకెట్ల రూపంలో, పిల్లిపెసర 8 కిలోల ప్యాకెట్ కింద ఎకరాలోపు రైతులకు ఒక బ్యాగ్, రెండు ఎకరాలకు రెండు బ్యాగులు, మూడు ఎకరాలకు మూడు బ్యాగ్‌లు, నాలుగు ఎకరాలున్న రైతులకు నాలుగు బ్యాగ్‌లు, ఐదు ఎకరాలు, అంత కన్నా ఎక్కువ ఉన్న వారికి గరిష్టంగా ఐదు బ్యాగుల పంపిణీ చేయనున్నారు. రైతు ఆసక్తిని బట్టి మూడు రకాల విత్తనాలు వేర్వేరుగానూ, మూడు రకాల విత్తనాలు కలిపి ఒకే బ్యాగ్ రూపంలోనూ ఇవ్వనున్నారు. మూడు కలిపిన వాటిలో నాలుగు కిలోల చొప్పున జీలుగ, జనుము, రెండు కిలోల పిల్లిపెసర ఉంటాయి. 10 కిలోలు కలిగిన మిక్సింగ్ కిట్ పూర్తి ధర రూ.1,296 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.648లు చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాలు అవసరమైన రైతులు రైతు సేవా కేంద్రాల(ఆర్ఎస్కే)లో తమ వాటా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఏపీ సీడ్స్ ఉమ్మడి గుంటూరు జిల్లా మేనేజర్ పి.సుమలత శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9,536 క్వింటాళ్ల కేటాయింపు 50 శాతం రాయితీతో రైతులకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు -
కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి
వినుకొండ: మిరపకాయల కూలీల ఆటో తిరబడి ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఏనుగుపాలెం సమీపంలో జరిగింది. ఉమ్మడివరం నుంచి నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ప్రతిరోజు కూలీలు వెళ్తూ ఉంటారు. ఉదయం ఏనుగుపాలెం సమీపంలో ఆటో తిరగబడింది. ఈ ప్రమాదంలో జోజమ్మ (60) మృతి చెందింది. మార్తమ్మ, వెంకాయమ్మ, అంకమ్మ, కోటమ్మ, మరియమ్మ, ఆదెమ్మ తదితర ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో వారిని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారు.మరో ఏడుగురికి తీవ్రగాయాలు -
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో శుక్రవారం స్థానిక ఎన్జీఓ రిక్రియేషన్ హాల్లో జరిగింది. సమావేశానికి జిల్లా జేఏసీ చైర్మన్, సంఘం జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్, రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ. 25వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఎన్జీఓ సంఘ నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు సర్కారు రూ. 7,200 కోట్లు విడుదల చేసిందని వివరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శిగా శ్యామ్ సుందర్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుకుమార్, మహిళా ఉపాధ్యక్షురాలుగా శ్రీవాణి, మహిళా సంయుక్త కార్యదర్శిగా విజయలక్ష్మి, జిల్లా సంయుక్త కార్యదర్శిగా సయ్యద్ జానీ భాష, కృష్ణకిషోర్, విజయబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగూర్ షరీఫ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, పివి నాగేశ్వరరావు, ధనుంజయ నాయక్, ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి గుంటూరు నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు సూరి, కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన మహిళా విభాగం నాయకురాలు రాధా రాణిని, బదిలీపై వెళ్లిన మహిళా సంఘం నాయకురాళ్ళు శివజ్యోతి, లక్ష్మీరమ్యలను సత్కరించారు. -
మిర్చి ఘాటు చూపిస్తాం
కొరిటెపాడు(గుంటూరు): మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ గుంటూరు మిర్చి యార్డులో ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కంచుమాటి అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన క్వింటా మిర్చి ధర రూ.11,781లు మోసపూరితంగా ఉందని ధ్వజమెత్తారు. రైతులు క్వింటా మిర్చి పండించడానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలకు పైగా ఖర్చు అవుతుండగా, దీనిలో సగం మద్దతు ధర కల్పించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండతోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుల నుంచి మిర్చిని నేరుగా కొనుగోలు చేస్తే రైతులు, కౌలు రైతులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 2019 నుంచి 2023 వరకు క్వింటా మిర్చి రూ.18 వేలు నుంచి రూ.27 వేల వరకు ధర వచ్చిందని గుర్తుచేశారు. ఈ ఏడాది కేవలం రూ.7 వేలు నుంచి రూ.13 వేలు లోపు ధర పలికిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే ధరలు కొనసాగితే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ధరల స్థిరీకరణ కింద కేవలం రూ.300 కోట్లు కేటాయించడం చూస్తే రైతులంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదని స్పష్టమవుతోందని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ.ఐదువేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముందుగా నరసరావుపేట రోడ్ వైపు ప్రధాన గేటు నుంచి నినాదాలు చేస్తూ మిర్చి యార్డు కార్యదర్శి చాంబర్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యార్డు కార్యదర్శి ఎ.చంద్రికకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన యార్డు కార్యదర్శి చంద్రిక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి విధి విధానాలు రాలేదని చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతులను ఆదుకోకపోతే త్వరలో మిర్చి యార్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల గుంటూరు, పల్నాడు జిల్లాల నాయకులు బైరగాని శ్రీనివాసరావు, కె.రామారావు, జి.బాలకృష్ణ, బి.రామకృష్ణ, బిక్కి శ్రీనివాస్, జి.పిచ్చారావు, ఈవూరి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదుకోకుంటే త్వరలో యార్డు ముట్టడి ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల హెచ్చరిక -
‘బర్డ్‌ఫ్లూ మృతి’ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే
నరసరావుపేట: బర్డ్‌ఫ్లూ వ్యాధితో రెండేళ్ల చిన్నారి ఆరాధ్య మృతి నేపథ్యంలో వెంటనే పల్నాడు జిల్లాను బర్డ్‌ప్లూ ఇన్ఫెక్షన్ సెంటర్‌గా ప్రకటించాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్య ఫలితమేనని అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలయ్యనగర్ ఒకటో లైనులో ఉండే ఆరాధ్య కుటుంబాన్ని కేంద్ర బృందం పరిశీలించే సమయంలో ఆయన కూడా అక్కడకు వచ్చారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు పెండ్యాల గోపీ, జ్యోతిలను అడిగి తెలుసుకున్నారు. వారికి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలిక బర్డ్‌ప్లూతో చనిపోవటం బాధాకరమన్నారు. ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు అవయవాలు పనిచేయక పోవడం వల్ల బాలిక చనిపోయిందని నిర్ధారించారన్నారు. మొదటి బర్డ్‌ప్లూ కేసు 2021లో మహారాష్ట్రలో నమోదుకాగా, తిరిగి రెండో కేసు నరసరావుపేటలో నమోదు కావడం బాధాకరమైన విషయమన్నారు. జిల్లాను బర్డ్‌ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్‌గా ఎందుకు ప్రకటించలేదని గోపిరెడ్డి ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
చంద్రబాబు సమాధానం చెప్పాలి
కేంద్రంలోని బీజేపీ సర్కారు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భయమెందుకు? ఎన్నికల ముందు ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది తగదు. తక్షణమే వక్ఫ్ సవరణ బిల్లుకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు సమాధానం చెప్పాలి. షేక్.మస్తాన్ వలి, కాంగ్రెస్‌నేత, గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే -
గుంటూరు
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వైభవంగా మహా కుంభాభిషేకం పొన్నూరు: పొన్నూరు పట్టణంలోని తెలగ పాలెంలో ఉన్న కోదండ రామాలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రిఫ్రిజిరేటర్ బహూకరణ పిడుగురాళ్ల: పట్టణ పోలీస్ స్టేషన్‌కు రిఫ్రిజిరేటర్‌ను తిరుమల ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల తరఫున శుక్రవారం అందించారు. డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పెద్దలందరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ షేక్ నూరిఫాతిమా డిమాండ్ చేశారు. స్ధానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఐ, ముస్లిం ఐక్యవేదిక, ఆవాజ్ కమిటీ, పలు ముస్లిం సంఘాలన్నీ ఐక్యంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టాయి. ముందుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు ప్రదర్శనగా బయలుదేరారు. మార్కెట్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ముస్లింలు చంద్రబాబుడౌన్ డౌన్, నరేంద్రమోదీ డౌన్ డౌన్, వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పెమ్మసాని రాజీనామా చేయాలి అనంతరం నూరిఫాతిమా మాట్లాడుతూ ఎన్నికల ముందు ముస్లిం మైనార్టీల హక్కులకు భంగం కలిగితే రాజీనామాలకూ వెనకాడబోమని గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారని, ఇప్పుడు వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై ఎందుకు మాట్లడడం లేదని నిలదీశారు. పెమ్మసాని తక్షణం రాజీనామా చేసి ముస్లింల పక్షాన పోరాడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వక్ఫ్‌బోర్డు బిల్లుపై తక్షణం స్పందించాలని, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. గుంటూరు తూర్పులో ముస్లింల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఇంట్లో కూర్చోవడం సరికాదని, ముస్లింల పక్షాన పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా పలువురు ముస్లిం ప్రముఖులు వక్ఫ్ సవరణ బిల్లుపై గళమెత్తారు. టీడీపీ, జనసేన ద్వంద్వ వైఖరిపై ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాలు, వామ పక్ష నాయకులు, మతపెద్దలు, ముస్లిం సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 7న్యూస్‌రీల్ బిల్లుపై ముస్లింల ఆగ్రహం పోరాటానికి సిద్ధం కేంద్రమంత్రి పెమ్మసాని రాజీనామా చేయాలని డిమాండ్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఇంట్లో కూర్చుంటే కుదరదని హెచ్చరిక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అన్యాయం. పార్లమెంటులో దీనిని ఆమోదించుకోవడం తగదు. మోదీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష కట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 శాతం వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడు ఈ బిల్లు వల్ల కలెక్టర్ల ద్వారా వక్ఫ్ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – షేక్ వలి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాబు, పవన్ ముస్లిం ద్రోహులు ముస్లింలపై కక్ష కట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక నల్ల చట్టాలను తీసుకొచ్చింది. తాజాగా వక్ఫ్ సవరణ బిల్లును కుట్రపూరితంగా ఆమోదించుకుంది. ముస్లింలు బ్రిటిష్‌వారి తూటాలకే భయపడ లేదు. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదు. ఇప్పుడు దేశం కోసం అంటూ బీజేపీ కాకమ్మ కబుర్లు చెబుతోంది. రాష్ట్రంలో ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి తగిన బుద్ధి చెబుతాం. ముస్లిం ద్రోహులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మిగిలిపోతారు. – గులాం రసూల్, వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులు -
మొరాయిస్తున్న సాగర్ కుడికాలువ గేట్లు
మూడేళ్లకే మరమ్మతులకు లోనైన 8వ గేటువిజయపురిసౌత్: సుమారుగా 10.50లక్షల ఎకరాలకు సాగునీరందించే కుడి కాలువ గేట్లు మూడేళ్లకే మరమ్మతులకు లోనయ్యాయి. 8వ గేటు కిందికి దిగకపోవడంతో గురువారం ఎమర్జెన్సీ గేటు ద్వారా దానిని మూసివేసి 2వ గేటు ద్వారా కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు మూడు గేట్లు ఉండగా, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌కు 9 గేట్లు ఉన్నాయి. మూడేళ్ల క్రితం కుడి కాల్వ 9వ గేటు కిందికి, పైకి జరుగకపోవడంతో బలవంతగా కిందికి దింపేందుకు ప్రయత్నం చేయగా ఊడిపోయి కాలువలోకి కొట్టుకు పోయింది. ఆ గేటును అమర్చకపోవటంతో చాలా రోజులు వరకు నీటి విడుదల కొనసాగింది. ఆ సమయంలోనే కుడి, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దగల తూములకు కొత్తగేట్లకు టెండర్లు పిలిచారు. 9వ గేటు మరమ్మతులు చేశాక అదే కంపెనీకి పనులు అప్పగించారు. కుడి హెడ్ రెగ్యులేటర్ గేట్లకు తొమ్మిదింటికిగాను రూ.3.30కోట్లు, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ మూడు గేట్లకు రూ.2.50కోట్లు, సూట్ గేటుకు రూ.1.50కోట్లకు 2022లో టెండర్లు పిలిచి పనులు చేయించారు. అవికాస్త అప్పుడే మరమ్మతులకు గురైనట్లు సమాచారం. విద్యుదుత్పాదన కేంఽద్రం ద్వారా కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో హెడ్‌రెగ్యులేటర్ గేట్లు అంతగా వినియోగించ లేదు. నీటి అవసరాల మేరకు ఎక్కువగా 2,9వ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇటీవలే ఈ రెండు గేట్లు మూసివేసి 8వగేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం దానిని మూసేందుకు ప్రయత్నించగా కిందికి దిగలేదు. దీంతో ఇంజినీర్లంత శ్రమించి ఎట్టకేలకు మూసివేశారు. ప్రస్తుతం 2వ గేటు ద్వారా 3,031 క్యూసెక్కులు కుడి కాలువకు విడుదల చేస్తున్నారు. బుధవారం వరకు 4050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
యార్డుకు 1,25,074 మిర్చి బస్తాలు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,25,074 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,23,828 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,600 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 57,307 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇవ్వండి
కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: జిల్లాలోని రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అవసరమైన అనుమతులు, ఇతర ప్రక్రియలు నిర్దేశించిన సమయంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక తవ్వకాలకు బోట్స్‌మెన్ సొసైటీకి కేటాయించే రాయిపూడి డి–సిల్టేషన్ పాయింట్ పర్యవేక్షణ ఏ శాఖ పరిదిలోకి వస్తుందో రాష్ట్ర మైనింగ్ శాఖాధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. బొమ్మువారి పాలెం–16 ఓపెన్ శాండ్ రీచ్ మైనింగ్ ప్లాన్‌ను రూపొందించి టెండర్ ప్రక్రియ సిద్ధం చేయాలన్నారు. గుండెమెడ ఓపెన్ శాండ్ రీచ్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బిడ్‌ను ఆహ్వానించి ఈ నెల 16నాటికి అర్హత గల బిడ్డర్‌కు కేటాయించాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నదిలో ఇసుక నిల్వల కోసం హైడ్రో గ్రాఫిక్ సర్వే కోసం ఈఈ, కేసీ కెనాల్ డివిజన్‌కు జిల్లా వాటా కింద రూ.24 లక్షలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక సరఫరా చేసే కేంద్రాల వద్ద పర్యవేక్షణ కోసం సంబంధిత తహసీల్దార్ల ద్వారా రెవెన్యూ, మైనింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి నాగిని, తదితర అధికారులు పాల్గొన్నారు. -
టెన్త్ మూల్యాంకనం ప్రారంభం
● విధులకు 945 మంది ఉపాధ్యాయులు ● మినహాయింపు కోరుతూ డీఈఓ వద్దకు క్యూ కట్టిన టీచర్లు ● షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరించడంతో విధుల్లో చేరిక గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో క్యాంపు అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అధ్యక్షతన జరిగిన మూల్యాంకనం విధులకు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈనెల 9 వరకు జరగనున్న వాల్యూయేషన్ విధులకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను నియమించారు. వీరిలో కొందరు గురువారం వాల్యూయేషన్ కేంద్రంలో రిపోర్టు చేసేందుకు వచ్చారు. డీఈఓ సీరియస్ అయితే చాలామంది విధుల నుంచి మినహాయింపు కోరడంపై డీఈఓ సీవీ రేణుక అసహనం వ్యక్తం చేశారు. స్పాట్ వాల్యూయేషన్ ఆర్డర్లు పొందిన ఉపాధ్యాయులు విధుల్లో చేరని పక్షంలో వారిని తన అనుమతి లేకుండా పాఠశాలల్లో విధులకు చేర్చుకోరాదని హెచ్ఎంలను ఆదేశించారు. సహేతుకమైన కారణాలు లేకుండా విధుల నుంచి తప్పించుకోవాలని చూసే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. డీఈఓ హెచ్చరికలతో దిగి వచ్చిన ఉపాధ్యాయులు ఎట్టకేలకు స్పాట్ కేంద్రంలో రిపోర్టు చేశారు. చీఫ్ ఎగ్జామినర్లు 105, ఎగ్జామినర్లు 630, స్పోషల్ అసిస్టెంట్లు 210 మంది చొప్పున విధులకు హాజరయ్యారు. దూరవిద్య ఇంటర్ ఆన్సర్ షీట్లకు ఇదే ప్రాంగణంలో మూల్యాంకనాన్ని ప్రారంభించారు. స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి వసతులు కల్పించినట్టు డీఈఓ సీవీ రేణుక చెప్పారు. విధుల నుంచి మినహాయించండి చాలామంది తమను విధుల నుంచి మినహాయించాలని కోరుతూ డీఈఓ సీవీ రేణుక వద్ద క్యూ కట్టారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, అత్యవసర శస్త్రచికిత్సలు చేయించుకున్న ఉపాధ్యాయులను విధుల నుంచి మినహాయించేందుకు అధికారులకు అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయులు ఏదో ఒక సాకుతో విధుల నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతల సిఫార్సులతో యత్నిస్తున్నారు. దాదాపు 50 మంది వరకు ఉపాధ్యాయులు వేర్వేరు కారణాలతో మినహాయింపులు కోరడంతో గురువారం మధ్యాహ్నానికీ మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఆ తర్వాత డీఈఓ హెచ్చరికతో గురువులు దిగొచ్చారు. మూల్యాంకనం ప్రారంభమైంది. -
కన్నకొడుకే కాలయముడు
● మతి స్థిమితం లేని తల్లిని చంపిన కొడుకు ● మంచంపై నిద్రిస్తుండగా రోకలి బండతో మోది హత్య బొల్లాపల్లి: కన్న కొడుకు చేతిలో జన్మనిచ్చిన తల్లి దారుణంగా హత్యకు గురైన సంఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో గురువారం జరిగింది. వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్, బండ్లమోటు ఎస్ఐ ఎ.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... వెల్లటూరు గ్రామానికి చెందిన గజ్జ చిన్న నరసయ్య, గజ్జ సోమమ్మ (67) దంపతులకు ముగ్గురు మగ, ఇద్దరు ఆడ సంతానం. చిన్న కుమారుడు బాదరయ్య అవివాహితుడు కావడంతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మిగిలిన సంతానంలో అందరికీ వివాహాలై వేర్వేరుగా ఉంటున్నారు. మతిస్థిమితం లేని తల్లి ఎప్పుడు గొణుగుతుండడం, తనకు వివాహం కాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న నిందితుడు బాదరయ్య తెల్లవారుజామున మంచం మీద పడుకుని నిద్రిస్తున్న తల్లిని రోకలిబండతో కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు గజ్జ శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అందజేశారు. -
దమ్ముంటే పెమ్మసాని రాజీనామా చేయాలి
ఇచ్చిన మాటకు కట్టుబడాలి ● వక్ఫ్‌బోర్డు బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు తెలపడం సిగ్గుచేటు ● వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా ధ్వజం పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): మైనార్టీల స్వేచ్ఛకు భంగం కలిగితే తక్షణం రాజీనామా చేస్తానని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దమ్ముంటే ఇప్పుడు తక్షణం మాట నిలబెట్టుకోవాలని వైఎస్సార్ సీపీ గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా డిమాండ్ చేశారు. వక్ఫ్‌బోర్డు బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆమె గురువారం గుంటూరు మంగళదాస్ నగర్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు బిల్లు ముస్లింల హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తారు. మోసం చేయడంలో గురువు చంద్రబాబును పెమ్మసాని అనుసరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో పెమ్మసాని చేసిన ఉపన్యాసం వీడియోను ప్రదర్శించారు. వక్ఫ్‌బోర్డు బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ, జనసేన మైనార్టీలకు ద్రోహం చేశాయని దుయ్యబట్టారు. వక్ఫ్‌బోర్డులో నాన్ మైనార్టీ సభ్యుడిని పెట్టే అంశం వల్ల ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకించడంతోపాటు, పార్లమెంట్లో కూడా సుస్పష్టంగా ఎంపీల చేత చెప్పించిన అంశాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ముస్లింలకు ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ఈవీఎం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ నోరు మెదపరేంటీ..! మైనార్టీలకు తీరని ద్రోహం జరుగుతుంటే, మైనార్టీ ఎమ్మెల్యే అయిన ఎం.డీ.నసీర్ అహ్మద్ నోరు మెదపకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఫాతిమా అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా గెలిచారు కనుకనే ఆయనకు మైనార్టీల కష్టాలు ఏమాత్రం తెలియవన్నారు. ఈద్గా వద్ద దీనిపై చర్చించేందుకు పలువురు సుముఖత చూపిన నేపథ్యంలో పక్కన పేటీఎం బ్యాచ్‌ను పెట్టుకుని ఏ ఒక్కరినీ రానీయకుండా నసీర్ అడ్డుకున్నారని విమర్శించారు. మైనార్టీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కులమతాలకతీతంగా అందరూ మైనార్టీలకు అండగా నిలవాలని ఫాతిమా కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నేతలు, పలువురు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ వెబ్సైట్లో టీచర్ల సీనియార్టీ జాబితా
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను డీఈవోజీఎన్‌టీ.బ్లాగ్స్పాట్.కామ్‌లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు అర్హత కలిగిన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు వెబ్సైట్లో ఉంచిన సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈనెల 11వ తేదీలోపు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.సౌపాడులో వీధి కుక్కల దాడిఎనిమిది మందికి తీవ్ర గాయాలుగుంటూరు రూరల్: వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామంలో గురువారం వీధి కుక్కలు దాడిచేసి ఎనిమిది మందిని తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన ఎరుబోయిన గంగయ్య, ఇస్సాకు, తాటి మస్తాను, తాటి శివయ్య, నాగనజీమా, షేక్ బుల్లోడు, పరమేశ్వరరావు, గండు సాంబయ్యలను 108లో గుంటూరుకు జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో ఓ బాలుడు ఉన్నారు. ఇటీవల గ్రామాల్లో శునకాల బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత శనివారం వట్టిచెరుకూరులో రైతు మక్కెన సుబ్బారావుకు చెందిన బర్రెదూడపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇప్పటికీ దూడ పరిస్థితి విషమంగానే ఉంది. ఇప్పటికై నా అధికారులు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య పారా వలంటీర్లు వారధులు13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీనరసరావుపేటటౌన్: న్యాయవ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ పేర్కొన్నారు. గురువారం అదనపు జిల్లా కోర్డు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. పారా లీగల్ వలంటీర్ల విధులు, నైతికత, రాతపూర్వక నైపుణ్యం, రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను, చట్టపరమైన సలహాలు ఇచ్చే విధివిధానాలను గురించి వివరించారు. న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించి ప్రజలకు చట్టాలపై కనీస అవగాహన కల్పించేలా కృషి చేయాలని సూచించారు.ధాన్యం సేకరణ లక్ష్యం 10వేల మెట్రిక్ టన్నులునరసరావుపేట: రబీ సీజన్లో ధాన్యం సేకరణ 10వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ధేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం సేకరణ సమావేశం వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. రబీలో 2024–25 సంవత్సరానికి 234 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 20,561 హెక్టార్లలో వరిసాగు చేశారన్నారు. దీనిలో 1,32,773 ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయటం జరిగిందన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటా రూ.2320లు, సాధారణ రకం క్వింటా రూ.2300లుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు కనీస మద్దతు ధర పొందాలంటే ఈ–పంట ద్వారా పంటను నమోదుచేయించి 100శాతం ఈకేవైసీ చేయించాలన్నారు. మాయిశ్చర్ మీటర్లను త్వరగా కాలిబ్రేషన్ చేయించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నారదమునిని ఆదేశించారు. రైస్ మిల్లులను తనిఖీ చేసి మిల్లు సామర్ధ్యం, ఇతర వివరాలు ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలన్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 517.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిత్యాన్నదానానికి విరాళం మోపిదేవి: వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి నిత్యన్నదానానికి కావూరుకు చెందిన తుమ్మల సాయి రాఘవ్ రూ. లక్ష విరాళాన్ని గురువారం సమర్పించారు.కొనసాగుతున్న సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురు వారం కొనసాగింది. పలు విభాగాలకు చెందిన దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. 7 -
20 కిలోల గంజాయి స్వాధీనం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాడీపేట 1/1వ లైన్లో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గురువారం రాత్రి జరిగింది. అరండల్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. ఏటి అగ్రహారానికి చెందిన పైర్ధ కిరణ్‌బాబు బ్రాడీపేట 1/1 లైన్‌లోని నగరపాలక సంస్థ సులబ్ కాంప్లెక్స్‌లో పని చేసే బిహార్‌కు చెందిన గుల్షన్కుమార్కు గంజాయి విక్రయించి వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు అరండల్‌పేట సీఐ వీరాస్వామి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కిరణ్‌బాబు వద్ద బస్తాలో 20.620 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్టేషన్‌కు తరలించారు. గంజాయి కొనుగోలు చేసిన బిహార్‌కు చెందిన గుల్షన్ కుమార్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కిరణ్బాబుపై సుమారు 39కి పైగా గంజాయి, దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కిరణ్‌బాబు డిసెంబర్లో బాపట్ల సబ్‌జైల్ నుంచి విడుదలై బయటకు వచ్చాడని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. కిరణ్‌బాబు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నాడు? నగరంలో ఎవరెవరికి విక్రయిస్తున్నాడు అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. -
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య
బొల్లాపల్లి: పురుగుమందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లాపల్లి మండలం కండ్రిక గ్రామానికి చెందిన బైలడుగు రమణ(45) మద్యానికి బానిసైన భర్తను బెదిరించేందుకు గత నెల 29వ తేదీన పురుగుల మందు తాగింది. వెంటనే బంధువులు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు. భర్త చిన్న బాదరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ జె.భాస్కరరావు తెలిపారు. -
నవ్యకేర్‌తో జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ ఒప్పందం
గుంటూరు మెడికల్ : క్యాన్సర్ రోగులకు మెరుగైన, సత్వర వైద్య సేవలు అందించేందుకు గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ గురువారం నవ్య కేర్ నెట్వర్క్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఆంధ్రప్రదేశ్ చాప్టర్)తో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో క్లినికల్ సామర్‌ాధ్యలను మెరుగుపరచడం, ఆధారిత చికిత్సా ప్రణాళికలు, వర్చువల్ మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వర్చువల్‌గా ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం మధ్య ఏర్పడిన భాగస్వామ్యంలో ఒక భాగమని పేర్కొన్నారు. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ రాష్ట్రంలో క్యాన్సర్ సంరక్షణను మెరుగుపరచడానికి ఒక సమర్థవంతమైన నెట్‌వర్క్‌ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు కింద కింగ్ జార్జ్ హాస్పిటల్ (విశాఖపట్నం), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (కాకినాడ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (గంటూరు), స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (కర్నూల్)లలో అమలు చేస్తారన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం, ఎక్కడమిక్ డీఎంఈ డాక్టర్ రఘునందన్ ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ సంరక్షణను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ గుంటూరు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలను మెరుగైన క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు తాము అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో నాట్కో క్యాన్సర్ సెంటర్ కో ఆర్డినేటర్ యడ్లపాటి అశోక్‌కుమార్, క్యాన్సర్ వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్, డెప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నీలి ఉమాజ్యోతి, డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పెన్షన్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ జి.పున్నారావు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్లోని పెన్షనర్స్ హోమ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సవరణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. ఇటువంటి అంశాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సమావేశంలో జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్.వెంకటేశ్వర్లు, ఎం.ఎన్.మూర్తి, టి.శ్రీనివాసరావు, పార్థసారథి పాల్గొన్నారు. -
నంబూరులో లారీ ఢీకొని మహిళ మృతి
పెదకాకాని: రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళను లారీ ఢీకొనడంతో మృతి చెందిన ఘటన నంబూరులో జరిగింది. పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామానికి చెందిన వుయ్యూరు వెంకటరత్నం బుధవారం రాత్రి గ్రామంలోని గోళ్లమూడి రోడ్డులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి బయలు దేరింది. శివాలయం సెంటర్‌కు వచ్చే సరికి గోళ్ళమూడి నుంచి ఈమని వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వెంకటరత్నం(52) పరిస్థితి విషమించి మరణించింది. మృతురాలికి కుమార్తె లావణ్య, కుమారుడు తారక్ ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉండటంతో మృతదేహాన్ని పెదకాకానిలోని అపరకర్మల సత్రంలోని ఏసీ బాక్స్‌లో ఉంచారు. -
బాకీ ఎగ్గొట్టేందుకు తప్పుడు కేసు
నరసరావుపేటటౌన్: బాకీ డబ్బులు ఎగ్గొట్టేందుకు తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని ఏలూరి ప్రసాద్ విమర్శించారు. గురువారం ప్రకాష్‌నగర్ సిరి అపార్ట్మెంట్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అమరా వెంకటేశ్వరరావు బాధితులతో కలిసి మాట్లాడారు. పట్టణానికి చెందిన అమరా వెంకటేశ్వరరావు అమరా ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహిస్తూ ఆర్థిక సమస్యలతో 2023లో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అతనికి సన్నిహితంగా ఉండే వారి వద్ద సుమారు రూ.10 కోట్లు అప్పుగా తీసుకొని ఇంజినీరింగ్ కాలేజీ నిర్మించాడన్నారు. కాలేజీని కోర్టు వేలం వేసి బ్యాంకుకు చెల్లించవలసిన పైకం పోనూ మిగిలిన మొత్తాన్ని సొసైటీ పేరిట సుమారు రూ.4 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారన్నారు. వెంకటేశ్వరరావు మృతి అనంతరం ఆయన భార్య అమరా సుధారాణి, వారి పిల్లలు బాకీదారులతో సన్నిహితంగా ఉంటూ ఉన్న ఆస్తిని అమ్మి బాకీలు తీరుస్తామని నమ్మబలుకుతూ వచ్చారన్నారు. ఇటీవల నరసరావుపేటలో ఐపీ పెట్టే వారి సంఖ్య పెరగటంతో వీళ్లు కూడా డబ్బులు ఎగ్గొట్టాలని దురాలోచన చేశారన్నారు. అందులో భాగంగానే బుధవారం సుధారాణి తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి నిజానిజాలు తెలుసుకొని తగిన న్యాయం చేయవలసిందిగా కోరారు. సమావేశంలో కండె హనుమంతరావు, కూరపాటి శ్రీనివాస గుప్తా, కొత్తూరు సురేషు, పెనుగొండ ప్రతాపు, పెనుగొండ ప్రభాకర్, సీతారామయ్య, చీరాల నారాయణ, ఇక్కుర్తి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ శ్రేణుల దాడి
లంకెలకూరపాడు(ముప్పాళ్ల): ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు దాడికి దిగిన సంఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామంలోని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొంత కాలంగా నరసరావుపేటలో నివాసముంటున్నాడు. మాజీ సర్పంచ్ వర్ధంతి కార్యక్రమానికి గ్రామానికి వచ్చాడు. పాతకక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి(పెదకాపు), అతని కుమారుడు బ్రహ్మారెడ్డి, కిష్టిపాటి లింగారెడ్డిలు విచక్షణారహితంగా దాడి చేశారు. ముఖంపైన తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేస్తుండగా స్పృహ కోల్పోవటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. జరిగిన సంఘటనపై ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాయపడిన శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్ సీపీ నాయకులు ఎంజేఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
పిడుగురాళ్ల: వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ సూచించారు. పిడుగురాళ్ల పట్టణ, గ్రామీణ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో రూరల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో గురవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఈ మాట్లాడుతూ... విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. కరెంట్ బిల్లుల వసూళ్లలో అలసత్వం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ పరిధిలోని జానపాడు, రూరల్ పరిధిలోని జూలకల్లు సబ్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. వేసవిలో లోడ్ పెరుగుతున్న కారణంగా దానికి అనుగుణంగా విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ను అందించాలని ఆదేశించారు. 50 శాతం అదనపు లోడ్ సబ్సిడీ స్కిమ్‌ను గృహ వినియోగదారులందరు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.నాగసురేష్బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.సింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ -
పైపులైన్ పనులు ఆగవు
ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా నకరికల్లు: ఒప్పుకున్నా లేకున్నా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని పైపులైన్ చేపడతామని అధికారులు రైతులను హెచ్చరించారు. బీపీసీఎల్ పైపులైన్ ఏర్పాటులో భాగంగా మండలంలోని చల్లగుండ్ల, నకరికల్లు, నర్శింగపాడు గ్రామాల రైతులతో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీదేవి మాట్లాడుతూ బీపీసీఎల్ పైపులైన్ ఏర్పాటుకు భూములు తీసుకునేది భూసేకరణ కిందకు రాదని భూ వినియోగం మాత్రమేనన్నారు. గుర్తించిన భూమిలో ఆరుమీటర్ల లోతులో ఒకటిన్నర మీటరు వెడల్పులో పైపులైను ఏర్పాటు ఉంటుందన్నారు. పైపులైను పనులు చేపట్టేందుకు 18 ఇంటు 18మీటర్ల వెడల్పులో భూమిని వినియోగించుకొని పైపులైన్ పూర్తయ్యాక భూమిని యథావిధిగా బాగు చేసి ఇస్తామన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంట పూర్తయ్యాకే పనులు చేపతామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న భూముల విలువను బట్టి రెండున్నర రెట్లు కలిపి మొత్తం సెంటుకు రూ12వేలు చొప్పున రైతులకు చెల్లిస్తామని తెలిపారు. దీనికిగాను రైతులు అంగీకారపత్రం ఇవ్వాలని ఒకవేళ ఒప్పుకోకుంటే ఇది కేంద్రప్రభుత్వం ప్రాజెక్టు అని పోలీస్ బందోబస్తు నడుమ అయినా పూర్తిచేసి తీరాల్సి వస్తుందని హెచ్చరించారు. డిమాండ్లకు ఒప్పుకొంటేనే భూములిస్తాం.. పైపులైను వేసిన భూముల్లో గోడౌన్లు కట్టుకోవాలన్నా... ప్లాట్లు వేసుకోవాలన్నా... అమ్ముకోవాలన్నా, భూమిలో పైపులైన్లు ఉండడం మూలంగా ఇబ్బందులు తలెత్తుతాయని, పనులు చేపట్టే క్రమంలో భూమిని పంటకు పనికిరాకుండా చేస్తారని, హద్దురాళ్లు చెల్లాచెదరు చేస్తారని రైతులు వాపోయారు. హామీలు నెరవేరుస్తామని రాతపూర్వకంగా ఇవ్వాలని, అలాగే సెంటుకు రూ.20వేలు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే భూములు ఇచ్చేందుకు ఒప్పుకోమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆర్డీఓ రమణాకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పనులు చేపట్టిన 105 గ్రామాల్లో సెంటుకు రూ 2వేలు చొప్పున మాత్రమే ఇచ్చారని, ఇక్కడి రైతుల కోసం రూ 12వేలు ఇస్తున్నార న్నారు. తహశీల్దార్ కె.పుల్లారావు, బీపీసీఎల్ ప్రాజెక్టు లీడర్ భగవాన్ శుక్లా, సైట్ ఆఫీసర్ అమిత్ కాంబ్లో, సైట్ ఇన్చార్జి పవన్, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. పోలీసుల భద్రతతోనైనాపూర్తిచేస్తాం బీపీసీఎల్ పైప్‌లైన్ ఏర్పాటుపై రైతులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు -
అమ్మ చారిటబుల్ ట్రస్టు సేవలు అబినందనీయం
ఐటీసీ మాజీ ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు చేబ్రోలు: మూఢనమ్మకాలను విడనాడి ప్రజలే ముందుకు వచ్చి నిర్మించుకుంటే శ్మశానాలే దేవాలయాలుగా మారతాయని ఐటీసీ మాజీ ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు అన్నారు. చేబ్రోలు మండలం వేజెండ్లలో బుధవారం కొత్తగా నిర్మించిన శ్మశాన వాటికను అద్దంకి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. వేజండ్లలో కెలిన్, దహనశాలను నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికై నా చివరి మజిలీ ఇదేనన్నారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉంటే ఎన్నో అద్భుతాలు చేయవచ్చనన్నారు. శ్మశాన వాటిక నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సేవకులు స్వామి జ్ఞాన ప్రసన్న గిరి సేవలు అభినందనీయమన్నారు. వారి సేవలను కొనియాడారు. అన్ని పనులు ప్రభుత్వం చేయదని కొన్ని మనమే చేసుకోవాలని ఇది సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. అమ్మ చారిటబుల్ ట్రస్టు సేవకులు స్వామి జ్ఞాన ప్రసన్న గిరి మాట్లాడుతూ మనిషి మరణిస్తే కనీసం గౌరవంగా సాగరంపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దానికి ఊర్లో ఉండే స్మశాన వాటిక ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అమ్మా ఆశ్రమం సేవకులు, సత్య హరిశ్చంద్ర సేవా సమిత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ కె.నరసింహారావు అన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నరసింహారావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మరణించిన ఉపాధ్యాయ, ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఖాళీలు లేవనే పేరుతో కాలయాపన చేయడం సరికాదని పేర్కొన్నారు. 12వ వేతన సవరణ(పీఆర్సీ) కాలం ముగిసి, ఇప్పటికే 21 నెలలు గడిచిపోయినా కనీసం కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయలేదని, వెంటనే కమిషన్‌ను ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ కె.వీరాంజనేయులు మాట్లాడుతూ 2003 డీఎస్పీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఫ్యాప్టో మాజీ చైర్మన్ సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేయనందున ఉపాధ్యాయులకు డెప్యూటీ డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్, డీఈఓ పోస్టులు అందని ద్రాక్షలా మిగిలిపోయాయని, తక్షణమే జీఓలు 73, 74, 75 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. బసవలింగరావు మాట్లాడుతూ తెలుగు మీడియంను కనీసం సమాంతర మీడియంగానైనా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడిన మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అడిషనల్ సెక్రటరీ జనరల్ యు.రాజశేఖర రావు మాట్లాడుతూ సరెండర్ లీవ్ బకాయిలతోపాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో ఫ్యాప్టో కో–చైర్మన్ షేక్ ఫైజుల్లా, ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ డీకే సుబ్బారెడ్డి, మహమ్మద్ ఖలీద్, ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యులు కళాధర్, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ రామచంద్రయ్య, యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఎం.హనుమంతరావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కరీముల్లా, జిల్లా అధ్యక్షుడు సీహెచ్కొండయ్య, ఫ్యాప్టో భాగస్వామ్య పక్షాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ తేజకు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టీచర్ల నిరసన -
యార్డుకు 1,30,848 బస్తాలు మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,30,848 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,28,132 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,600 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. యార్డులో ఇంకా 56,061 బస్తాలు నిల్వ ఉంది. -
జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా కిరణ్మయి
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా చిలువూరి కిరణ్మయి బుధవారం విధుల్లో చేరారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. ప్రస్తుతం మంగళగిరి టీబీ శానిటోరియం హాస్పిటల్లో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా కిరణ్మయి విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతి పొంది గుంటూరు జీజీహెచ్ గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరారు. గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్మయి సికింద్రాబాద్ గాంధీలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సు 2000లో పూర్తి చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట పీహెచ్సీలో స్టాఫ్ నర్సుగా 2001 జనవరిలో చేరి ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. హెడ్‌నర్సుగా 2007లో ఉద్యోగోన్నతి పొంది నిజామాబాద్ పీచ్పల్లికి బదిలీ అయ్యారు. అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి ప్రత్యేక బదిలీ అయి 2008లో గోరంట్లలోని జ్వరాల ఆస్పత్రిలో చేరారు. 2018 వరకు అక్కడే పనిచేసి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. అనంతరం మంగళగిరి బదిలీ అయ్యారు. ఇప్పుడు గ్రేడ్ –1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరిన కిరణ్మయికి పలువురు నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ యూనియన్ అధికారులు, వైద్య సిబ్బంది, వైద్యులు అభినందనలు తెలిపారు. -
థియేటర్లో పరిచయంతో స్నేహితులుగా మారి..
శివసుబ్రహ్మణ్యం 2009లో చీరాల నుంచి గుంటూరు వచ్చి స్థిరపడ్డాడు. తొలినాళ్లలో ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. 2018లో ఓ సినిమా ఽథియేటర్‌లో టైలర్ శ్రీను పరిచయమయ్యాడు. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో 2022 నుంచి చోరీలకు శ్రీకారం చుట్టారు. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడం ప్రారంభించారు. స్కూటీపై వెళ్తూ గొలుసులు తెంచుకెళ్లేవారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, ఆధారాల్లేకుండా జాగ్రత్తపడటంలో వీరు నేర్పరులు. ధనవంతులు ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా చోరీలు చేశారు. దొంగలించిన సొత్తును తెలిసిన వారి ద్వారా బంగారు దుకాణాల్లో విక్రయించేవారు. ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకుని జల్సాలు చేసేవారు. వీరు పట్టాభిపురం పీఎస్ పరిధిలో 2, నల్లపాడు పీఎస్ పరిధిలో 4, తెనాలి వన్‌టౌన్ పరిధిలో 2, అరండల్ పేట పీఎస్, తెనాలి త్రీటౌన్ పీఎస్, చీరాల టూ టౌన్, చీరాల త్రీ టౌన్ పీఎస్ పరిధిలో ఒక్కొక్క చోరీ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు. -
శంకర్ విలాస్ ఆర్వోబీని కుదించటం సరికాదు
గుంటూరు ఎడ్యుకేషన్: రాబోవు 50 ఏళ్లలో నగర ప్రజల భవిష్యత్ ప్రజల అవసరాలు, బహుళ ప్రయోజనాలను నెరవేర్చేలా శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, చాలీచాలని నిధులతో తక్కువ నిడివితో నిర్మిస్తే ప్రయోజనం ఉండదని శంకర్ విలాస్ ఫైఓవర్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. బుధవారం అరండల్‌పేటలోని ఓ హోటల్లో సమావేశమైన జేఏసీ నాయకులు శంకర్‌విలాస్ ఆర్వోబీ నిర్మాణం, భవిష్యత్తు అవసరాలపై మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా డిజైన్‌లో చేయాల్సిన మార్పులపై పౌర సంఘాల అభిప్రాయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు ఎల్ఎస్ భారవి మాట్లాడుతూ ఆర్వోబీకి తాము వ్యతిరేకం కాదని, అది భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా ఉండాలన్నదే తమ అభిప్రాయం అని స్పష్టం చేశారు. గతంలో ప్రకటించిన ప్లాన్‌కు భిన్నంగా, ప్రజల ఆమోదం లేని కొత్త ప్లాన్‌తో అధికార యంత్రాంగం ముందుకు వెళ్లటం సరికాదన్నారు. గతంలో హిందూ కాలేజి సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకూ నిర్మిస్తామని, ఆర్వోబీ, ఆర్యూబీ రెండింటినీ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇప్పుడు ప్లాన్‌ను పూర్తిగా మార్చేశారన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు రోజువారీ రాకపోకలు సాగించే ప్రజలకు శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రధాన మార్గమన్నారు. అటువంటి ఆర్వోబీని మూసివేస్తే, మూడు వంతెనలు, ఇతర మార్గాలు ప్రజలు అవసరాలు తీర్చలేదన్నారు. ముందుగా ఆర్యూబీ నిర్మించి, తర్వాత ఆర్వోబీ నిర్మించాలన్నారు. ప్రస్తుత ట్రాఫిక్ అవసరాల రీత్యా ఆరు లైన్ల నిర్మాణం అవసరం అని చెప్పిన కలెక్టర్, అధికార యంత్రాంగం నాలుగు లైన్లకు తగ్గించటమే కాకుండా, ఆర్యూబీ లేకుండా ట్రాఫిక్ అవసరాలు ఎలా తీరుతాయో ప్రజలకు చెప్పాలని కోరారు. జేఏసీ నాయకుడు పీవీ మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని, పౌర సంఘాలతో చర్చిస్తే స్పష్టత వస్తుందన్నారు. అధికార యంత్రాంగం డీపీఆర్ ఆమోదానికి ముందు ప్రజలతో ఎలాంటి చర్చా జరపలేదన్నారు. అలాగే సామాజిక ప్రభావం సర్వే సైతం నిర్వహించలేదన్నారు. 23 అడుగుల సర్వీసు రోడ్డులో ఐదు అడుగులు డ్రైన్‌కు పోతే మిగిలిన రోడ్డులో ట్రాఫిక్ సులభంగా ఎలా వెళుతుందని ప్రశ్నించారు. ఆర్యూబీ లేకపోతే తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు జీజీహెచ్, విద్యాసంస్థలు, హాస్పిటల్స్, ఇతర వాణిజ్య అవసరాల కోసం రాకపోకలు సాగించటం సాధ్యం కాదన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, చరిత్రలో చెప్పుకునే విధంగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని, అవసరం అయితే అందుకు అదనపు నిధులు సాధన కోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు అవధానుల హరి, ఎన్.కమలకాంత్, రాధాకృష్ణ, వి.సదాశివరావు, వెంకట్రావు, కె.నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అదనపు నిధులు సమకూర్చి పాత ప్లాన్ ప్రకారం నిర్మించాలి కలెక్టర్‌కు జేఏసీ ప్రతినిధుల వినతి -
వైద్య సిబ్బంది 8వ తేదీలోగా అభ్యంతరాలు తెలపాలి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కార్యాలయం పరిధిలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి ఎం.మజిదాబి తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు పట్టాభిపురంలోని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయంలో నేరుగా వచ్చి తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రేవుల హక్కులపై జెడ్పీలో బహిరంగ వేలం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని 11 రేవుల్లో పడవలు, బల్లకట్లు నడుపుకునేందుకు బుధవారం జెడ్పీ సమవేశ మందిరంలో సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం ప్రక్రియ నిర్వహించారు. జెడ్పీ డెప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలంలో ఏడు రేవులను పాటదారులు దక్కించుకోగా, నాలుగు రేవులకు పాటదారులు పాల్గొనకపోవడంతో వాయిదా వేశారు. అచ్చంపేట, మాచవరం, అమరావతి, కొల్లిపర మండలాల పరిధిలోని చామర్రు, గింజుపల్లి, తాడువాయి, మాదిపాడు, దిడుగు, ధరణికోట రేవుల్లో పడవ, పుట్లగూడెంలో బల్లకట్టును వచ్చే ఏడాది మార్చి 31 వరకు తిప్పుకునేందుకు నిర్వహించిన వేలంలో పాటదారుల నుంచి జెడ్పీకి మొత్తం రూ.1,46,07,526 ఆదాయం సమకూరింది. కాగా చింతపల్లి, వల్లభాపురంలో పడవ, మాదిపాడు, గోవిందాపురంలో బల్లకట్టు వేలంలో పాటదారులు ఆసక్తి చూపలేదు. వేలం ప్రక్రియలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రానైట్ తరలింపు లారీ పట్టివేత ముప్పాళ్ళ: ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా గ్రానైట్ తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నరసరావుపేట – సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని ముప్పాళ్ళ దర్గా సమీపంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె.చంద్రశేఖర్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న లారీని గుర్తించారు. లోడ్‌కు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవని గుర్తించి తదుపరి చర్యలు నిమిత్తం లారీని పోలీసులకు అప్పగించారు. -
● రెండేళ్ల నుంచి ఐఆర్, డీఏలు లేవు ● మూడేళ్ల నుంచి సరెండర్ లీవ్‌లు లేవు ● సీపీఎస్ రద్దు ఊసే లేదు ● ఏపీజీఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన
పీఆర్సీకి మోక్షం ఎప్పుడు ? గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్లుగా పీఆర్సీ లేదని, డీఏ, ఐఆర్ లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి సరెండర్ లీవు లేదని, చివరకు సీపీఎస్ రద్దు ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి చేసుకొన్నా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణంలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చాంద్‌బాషా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేకుంటే ఉద్యోగులు ధర్మ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పోతురాజు, ఉపాధ్యక్షుడు రహెమాన్, సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోటా సాహె బ్, నగరశాఖ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, నగర శాఖ ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదరత్తయ్య, జాను, నగర శాఖ కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘98’ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి
మంగళగిరి టౌన్: 1998 డిఎస్సీ అభ్యర్ధులకు న్యాయం చేయాలని ఓబీసీ జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళగిరి ఐబీఎన్ భవన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఉద్యోగం రాని వారికి వయోపరిమితి నెలల వ్యవధి మాత్రమే ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీ రిమైనింగ్ కాండిడేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా ఇంతవరకు డీఎస్సీపై ఎటువంటి స్పందన లేదని, పలుమార్లు విజ్ఞాపనలు సమర్పించామని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో దాదాపు 1500 మంది అభ్యర్ధులు ఉన్నారని, 600 శాంక్షన్డ్ పోస్టులు మిగిలి ఉన్నాయని మానవతా దృక్పథంతో మరో 900 పోస్టులు కలిపి తక్షణం ఎస్జీటీలుగా అపాంయింట్మెంట్లు ఇవ్వాలని కోరారు. అనంతరం ప్రెస్‌క్లబ్ నుంచి మంగళగిరి అంబేడ్కర్ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 98 డిఎస్సీ అభ్యర్థులు చంద్రయ్య, జగ్గయ్య, రత్నబాబు, రామారావు, గోవిందరావు, సుహాసిని, మేరి తదితరులు పాల్గొన్నారు.నేడు కేతవరంలోప్రతిష్టా మహోత్సవంబెల్లంకొండ: మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన కేతవరంలో కొండపై వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహుని ఆలయంలో గురువారం ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నట్లు మండల దేవదాయ శాఖ ఈఓ అవుడూరి వెంకటేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొండ దిగువన గల స్వామివారి ఆలయం వద్ద జీవ ధ్వజస్తంభం, పరివార దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 9 గంటలకు జరగనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.అభాగ్య శిశువుల కోసం ‘ఊయల’నరసరావుపేట: అభాగ్యులైన శిశువులను అక్కున చేర్చుకునేందుకు బుధవారం జిల్లా శిశు సంక్షేమం, సాధికారిత అధికారి ఆధ్వర్యంలో పెద్దచెరువులోని శిశుగృహంలో క్రెడిల్ బేబీ రెడెప్షంన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా అభాగ్యులైన శిశువులను చెత్తకుప్పలు, కాలువల్లో వేయకుండా బతకనిచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో వేయాలని పీడీ ఉమాదేవి కోరారు.7న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంనెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ రూ.1534.27కోట్ల ఆమోదం కోసం గత నెల 29న జరగాల్సిన కౌన్సిల్ సమావేశం ఉగాది, రంజాన్ పండగల దృష్ట్యా మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఇన్చార్జ్ మేయర్ షేక్ సజీల వాయిదా వేసిన సంగతి తెలిసింది. తిరిగిన ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన నోటిసులను సభ్యులకు నగరపాలక సంస్థ సిబ్బంది అందజేశారు. -
సహజీవనానికి అడ్డు వస్తుందని చిన్నారికి చిత్రహింసలు
మంగళగిరి: సహజీవనానికి అడ్డు వస్తుదన్న అక్కసుతో తల్లి, పెద్దనాన్న చిన్నారిని చిత్రహింసలు పెట్టి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మరియమ్మకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్నకుమార్తె ప్రీతి అక్క భర్త నాగేంద్రబాబుతో ప్రేమలో పడి సహజీనం చేస్తోంది. దీనిని గమనించిన ప్రీతి భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ప్రీతికి మూడేళ్ల పాప ఉంది. దీంతో పాపతో సహా ప్రీతి, నాగేంద్రబాబు చినకాకానిలో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని మూడునెలలుగా నివాసం ఉంటున్నారు. తమ బంధానికి అడ్డు వస్తుందన్న అక్కసుతో కొద్ది రోజులుగా నాగేంద్రబాబు పాపను కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడు. పాపను అమ్మమ్మతో ఉండాలని ఒత్తిడి చేస్తున్నాడు. మంగళవారం రాత్రి నాగేంద్రబాబు ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుండడంతో కోపంతో ఊగిపోయాడు. దారుణంగా కొట్టాడు. ప్రీతి కూడా అడ్డు చెప్పలేదు. సమాచారం తెలుసుకున్న అమ్మమ్మ మరియమ్మ పాపను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించింది. బుధవారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సజావుగా జేఈఈ మెయిన్స్
గుంటూరు ఎడ్యుకేషన్ : జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండో సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) లకు విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీబీటీ విధానంలో ఆన్లైన్ పరీక్షల కోసం గుంటూరులో రెండు, పల్నాడు జిల్లాలో రెండు చొప్పున వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అయాన్ డిజిటల్ జోన్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల పరిధిలో విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు హడావుడి పడుతూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈనెల 3, 4, 7, 8వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1 (బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, 9వ తేదీన పేపర్–2ఏ బీఆర్క్,పేపర్–2బీ బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. గుంటూరు, పల్నాడులోని పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు -
బ్లేడ్‌తో ఇద్దరిపై దాడి
సత్తెనపల్లి: బ్లేడుతో ఇద్దరిపై యువకుడు దాడి చేసిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన గింజుపల్లి అశోక్ కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం పూటుగా మద్యం తాగాడు. ఇంటి సమీపంలోని ఎనిమిదో తరగతి చదువుతున్న మేడూరు చాణిక్యతో ఏంటి రా.. నా వైపు చూస్తున్నావ్! అంటూ దూషించి దాడి చేసి బెదిరించడంతో చాణిక్య వెంటనే తల్లి మేడూరు జ్యోతికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఎయిర్టెల్ కార్యాలయంలో పనిచేస్తున్న జ్యోతి తన బిడ్డ చాణిక్యపై దాడి చేస్తున్నారంటూ చూసి రమ్మని తన వద్ద పనిచేసే ఏల్పూరి నవీన్, తూమాటి శ్రీకాంత్‌లను పంపింది. వారు ఘటన స్థలానికి చేరుకొని ఎందుకు దాడి చేసి, బెదిరిస్తున్నావు అంటూ ప్రశ్నించారు. దీంతో అశోక్ కుమార్ బ్లేడ్ తీసుకొని ఏల్పూరి నవీన్ మెడ, చెవి పైన, తూమాటి శ్రీకాంత్ చేతులపై దాడి చేశాడు. ఎవరైనా దగ్గరకు వస్తే దాడి తప్పదు అంటూ బ్లేడు చూపిస్తూ హల్చల్ చేయడంతో స్థానికులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పట్టణ ఏఎస్ఐ సుబ్బారావు పరారైన అశోక్ కుమార్‌ను క్రిస్టియన్ పేటలో పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన ఏల్పూరి నవీన్‌ను ఏరియా వైద్యశాలకు తరలించగా, వైద్యులు 10 కుట్లు వేశారు. తూమాటి శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. -
పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యం
● ధరలు దారుణంగా పడిపోయాయి ● ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి ● సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కల్లూరి శ్రీనివాసరావు ఆవేదన ప్రత్తిపాడు: పొగాకు ధరలు దారుణంగా పడిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి పరిణమిస్తుందని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కల్లూరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన తిమ్మాపురం సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు పొగాకు రైతుల దైన్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరుడు పొగాకు ధర రూ 15 వేలు ఉందని, ఇప్పుడు ఆరు వేలు కూడా లేదని ప్రశ్నించారు. రైతుల దీనస్థిథిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పొగాకుకు గత ఏడాది భారీగా ధర వచ్చిందని, దీంతో ఈ ఏడాది సెంటు భూమి లేని రైతులు కూడా పొలాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశారని పేర్కొన్నారు. పత్తి, మిర్చి పంటలు తెగుళ్ళతో పోతున్నాయని, అందుచేత రైతులంతా పొగాకు మీదనే ఆధారపడ్డారని తెలిపారు. పొగాకు సాగుకు ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి అయ్యిందని, ధర చూస్తే రూ.ఆరువేలు కూడా పలకడం లేదని ఆవేదన చెందారు. పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రైతులను కాపాడలేకపోతే ఎందుకీ సమావేశాలని అసహనం వ్యక్తం చేశారు. శనగలకు కూడా సరైన గిట్టుబాటు ధర లేదని ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. -
బాలికలపై నేరాలను నివారించాలి
గుంటూరు వెస్ట్ : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వసతి గృహాల్లో 18 ఏళ్లలోపు బాల, బాలికలపై నేరాలు నివారించేందుకు నిర్దేశించిన ముందస్తు భద్రతా రక్షణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్పటల్స్, ప్రవేశ మార్గాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. తల్లిదండ్రులు కాకుండా, విద్యార్థుల కోసం వచ్చే ఇతర బంధువుల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. విద్యా సంస్థలకు, వసతి గృహాలకు ప్రహరీలు నిర్మించడంతోపాటు, వాచ్మెన్లను తప్పక ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్‌కు విద్యార్థులు వచ్చిన తరువాత తిరిగి వారు వారి ఇళ్లకు వెళ్లే వరకు పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు వహించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల సమస్యలు ఉంటే వాటిని ఆశాఖ వెంటనే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వద్ద భద్రత పెంచాలన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ బాలికలపై నేరాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు ప్రహరీలు నిర్మించడం, వాచ్మెన్లను నియమించడం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, అడిషనల్ ఎస్పీ జి.వి.రమణమూర్తి, డీఎస్పీ సుబ్బారావు, ఆర్ఐఓ జి.కె.జుబేర్, జిల్లా వైద్య శాఖ అధికారి కె.విజయలక్ష్మి, ఈఓ టి.వి.రేణుక, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. ప్రైవేటు బస్సులకు రూట్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలి జిల్లాలో ఆరు రూట్లులో ప్రైవేటు బస్సులకు అనుమతులు పారదర్శకంగా ఇవ్వాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వై జంక్షన్– పెదపలకలూరు, ఆర్టీసీ బస్టాండ్– లాం, ఆర్టీసీ బస్టాండ్– అడవి తక్కెళ్ళపాడు, పాత గుంటూరు మణి హోటల్–ఆర్టీసీ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్– ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా రెడ్డిపాలెం, గుజ్జనగుండ్ల– గుండవరం వరకు మొత్తం 6 రూట్లకు 54 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నెల 9లోగా ఆర్టీఏ అధికారులు వీటిపై సమీక్షించి పూర్తి వివరాలతో రిపోర్ట్ అందజేస్తే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జిల్లా ఉప రవాణా కమీషనర్ సీతారామిరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం కృష్ణకాంత్, ట్రాఫిక్ డిఎస్సీ రమేషన్ పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
తోడు దొంగలు చిక్కరు..దొరకరు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఇద్దరూ తోడు దొంగలు.. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో నేర్పరులు. సీసీ కెమెరాలకు చిక్కరు.. దొరకరు.. మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు చేసినా ఏ పీఎస్ పరిధిలోనూ వీరిపై కేసుల్లేవు. ఎట్టకేలకు నల్లపాడు పోలీసులు వీరి ఆట కట్టించారు. ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను ఎస్పీ సతీష్‌కుమార్ బుధవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెలలో నల్లపాడు పీఎస్ పరిధిలోని లింగయ్యపాలెంలో, గుంటూరు క్లబ్ దగ్గర్లో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. దీనిపై సీఐ వంశీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. ఏటుకూరురోడ్ డీఎస్ నగర్ తొమ్మిదో వీధిలో ఉంటున్న టైలర్ వల్లెపు శ్రీనును అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతనిచ్చిన సమాచారంతో వసంతరాయపురం నాలుగో వీధికి చెందిన అన్నపురెడ్డి శివ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. వీరిద్దరూ కలిసి బంగారు గొలుసుల చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చోరీలు చేసినట్టు తేల్చారు. ఇప్పటివరకు 13కుపైగా చోరీలకు పాల్పడినా వీరిపై కేసులు లేవని గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.32 లక్షల ఖరీదు చేసే 390 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసును దర్యాప్తు చేసిన సీఐ వంశీధర్, ఎస్ఐ జనార్దన్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, మస్తాన్‌వలి, బిక్షనాయక్, వెంకటేశ్వర్లును ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుప్రజ (క్రైం), శిక్షణ ఐపీఎస్ అధికారిణి దీక్ష, డీఎస్పీ భానోదయ పాల్గొన్నారు. గొలుసుల చోరీల్లో దిట్టలు మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు ఏ పీఎస్‌లోనూ కేసుల్లేవు ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం -
పులిసిన రాజకీయం
ఫ్లెక్సీల వివాదంతో ముదిరిన విభేదాలు తాను చెప్పిన పనులు చేయనందుకే.. తూర్పు ఎమ్మెల్యే అనుచరులు కొందరు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ పనులు చేపట్టారు. ఆ బిల్లులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాస్ చేయలేదు. దీంతో ఎమ్మెల్యే నసీర్ కమిషనర్‌కు ఫోన్ చేసి బిల్లులను పాస్ చేయాలని కోరినట్లు సమాచారం. అయినా కమిషనర్ బిల్లులను పాస్ చేయలేదు. దీనికితోడు కొల్లి శారదా మార్కెట్లో ఆశీలు వసూలు విషయంలోనూ నసీర్ మాట కమిషనర్ వినలేదు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కమిషనర్ తన మాట వినడం లేదని ఇప్పటికే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి స్పందించిన కేంద్రమంత్రి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు వర్సెస్ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌గా మారిపోయింది గుంటూరు రాజకీయం.. కొద్దికాలంగా మున్సిపల్ కమిషనర్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అండదండలతో ఎమ్మెల్యేలను లెక్కచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చెప్పిన పనులేవీ చేయకపోవడంతో ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. నాలుగు నెలలుగా ఇద్దరూ ఎడముఖంపెడముఖంగా ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో తాము చెప్పిన పనులేవీ మున్సిపల్ అధికారులు చేయడం లేదని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యంపై ప్రజల నిలదీత.. ఎమ్మెల్యే సీరియస్ తాజాగా బుధవారం తన నియోజకవర్గం రాజీవ్‌గాంధీనగర్‌లో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్ధ్యం అధ్వానంగా ఉందంటూ ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఎక్కడ స్వచ్ఛ సర్వేక్షణ్, రోడ్లు ఉడ్చుకుంటే సరిపోతుందా? పారిశుద్ధ్యాన్ని పట్టించుకోరా? ఒక ఎమ్మెల్యే పర్యటనకు వచ్చినా మున్సిపల్ అధికారులు రారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడీఎఫ్ టీం వస్తే అధికారులు వెళ్లారంటూ స్థానిక మున్సిపల్ సిబ్బంది బదులిచ్చారు. సాయంత్రం సమావేశమై మరీ క్లాస్ దీంతో ఎమ్మెల్యే నసీర్ సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులతో సమావేశమయ్యారు. అధికారుల తీరుపై చిర్రుబుర్రులాడారు. తన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజల నుంచి రూ.లక్షల ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ పారిశుద్ధ్య పనులూ చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి పారిశుద్ధ్య పనులను రోజూ పరిశీలించి ఒక్కొక్కరి వ్యవహారం తేలుస్తానని చెప్పారు. దీంతో కమిషనర్, ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలాఉంటే వారి మధ్య విభేదాలుంటే వాళ్లూవాళ్లూ చూసుకోవాలిగానీ తమను బలి చేస్తే ఎలాగంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన వారికి బిల్లులు చెల్లించలేదని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అలక రంజాన్ ముందు రోజు ఎమ్మెల్యే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగింపు అర్ధరాత్రి కమిషనర్‌కి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే వర్గీయులు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికుల ఫిర్యాదులు స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి పట్టించుకోరా అంటూ నసీర్ ఆగ్రహం అధికారులతో సమావేశమై మండిపాటు టీడీపీ అధిష్టానానికి కమిషనర్‌పై ఫిర్యాదుకు సిద్ధం కమిషనర్ వర్సెస్ ఎమ్మెల్యే రంజాన్ ముందురోజున నగరమంతా ఉన్న ఫ్లెక్సీలను పట్టించుకోని మున్సిపల్ అధికారులు పాతబస్తీలోని ఫ్లెక్సీలను మాత్రం తొలగించడం వివాదానికి దారితీసింది. తూర్పు ఎమ్మెల్యే నసీర్ రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి రోడ్డుపై భైఠాయించి కమిషనర్‌కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. అధికార పార్టీ వారే రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడానికి మున్సిపల్ కమిషనరే కారణమనే భావనలో ఉన్న నసీర్ కమిషనర్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. -
స్థలం లేక అల్లాడుతున్నాం!
తాడికొండ: రాజధానిలో ఈద్గాకు స్థలం లేక పదేళ్లుగా మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాలను పూలింగ్‌కు ఇచ్చిన ఈ ప్రాంతంలో ముస్లింలకు ఈద్గా స్థలం కావాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూలింగ్ సమయంలో సీఆర్డీఏ భూములు తీసుకునేప్పుడు తమ పరిస్థితి వివరిస్తే ఈద్గాకు స్థలం కేటాయించడమే కాకుండా మసీదు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, అయితే ఇప్పుడు పూర్తిగా విస్మరించారని ముస్లింలు చెబుతున్నారు. పవిత్ర రంజాన్ రోజున కూడా ప్రార్థనలు చేసుకునేందుకు జానెడు జాగా లేక రోడ్డుపైనే టెంట్లు వేసి ప్రార్థనలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ముస్లింలు అధికంగా ఉన్న రాయపూడి గ్రామంలో ఈద్గాకు స్థలం కేటాయించాలని పూలింగ్ సమయంలోనే నాటి ఎమ్మెల్యే, అధికారులు, సీఎంకు పలుమార్లు ముస్లింలు వినతిపత్రాలు అందజేశారు. అయితే ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లేస్తే గతంలోనూ, ఇప్పుడూ తమను నట్టేట ముంచారని, సమస్యను ఎమ్మెల్యేకి వివరిస్తే ఇదిగో పరిష్కారం చేస్తామని చెబుతున్నారని, సీఎం దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపైనే టెంట్ వేసి ప్రార్థనలు రాజధానిలో మైనార్టీల ఆవేదన ఈద్గాకు స్థలం కేటాయించాలని డిమాండ్ సర్కారుకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం -
విజిబుల్ పోలీసింగ్‌తోనే ప్రజల్లో విశ్వాసం
తాడేపల్లి రూరల్: విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడు పోలీస్‌శాఖపై నమ్మకం పెరుగుతుందని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ చెప్పారు. తాడేపల్లి రూరల్‌పరిధిలోని నులకపేటలో మంగళవారం రాత్రి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.పౌరసరఫరాల గోదాము పరిశీలనతాడికొండ: తాడికొండ సివిల్ సప్లైస్ గోదాములో జరుగుతున్న గోల్మాల్ వ్యవహారంపై ఎట్టకేలకు సివిల్ సప్లైస్ అధికారులు స్పందించారు. ‘రేషన్ బియ్యం సరఫరాలో గోల్మాల్’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి డీఎస్ఓ పద్మ స్పందించారు. గోదామును తనిఖీ చేశారు. సరుకు వివరాలు, రిజిస్టర్‌ను పరిశీలించారు. డీలర్లకు తక్కువగా సరుకు వెళుతున్న విషయంపై హమాలీలు, గోదాము ఇన్చార్జిని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన డీఎస్ఓ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన డీలర్ ఎవరు? అతనికి సరుకు వెళుతుందా అని ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని డీలర్లను కోరారు. ప్రతి బస్తాకు తమకు 600 గ్రాముల నుంచి కిలో వరకు తక్కువగా వస్తుందని, తూకం వేయకుండానే నేరుగా లోడింగ్ చేస్తున్నారని లిఖిత పూర్వకంగా డీలర్లు ఫిర్యాదు ఇచ్చారు.సదరం ధ్రువపత్రాలు కోసం 4 నుంచి శ్లాట్ బుకింగ్తాడికొండ: దివ్యాంగులకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపుల కోసం స్లాట్ బుకింగ్‌లు ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తాడికొండ, తుళ్ళూరు ఎంపీడీవోలు కె.సమతావాణి, కానూరి శిల్ప ఒక ప్రకటనలో తెలిపారు. 4న ఉదయం 10 గంటల నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరు నమోదు చేయించుకోవాలని వారు సూచించారు.అరండల్‌పేటలో యువకుడి హత్య!లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్):అరండల్‌పేట 1వ లైన్లో నలుగురి మధ్య జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి మరణానికి దారి తీసింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. అరండల్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. వెంకటప్పయ్య కాలనీకి చెందిన గణేష్ (35)కి అరండల్‌పేటలో భిక్షాటన చేస్తూ మద్యం, గంజాయి తాగే మరో ముగ్గురితో స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో ఒక స్నేహితుడి సోదరి పట్ల గణేష్ అసభ్యంగా ప్రవర్తించడంతో ముగ్గురూ కలిసి గణేష్‌పై దాడి చేశారు. ఈ ఘటన సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న గణేష్‌ను తీవ్రంగా కొట్టడంతో వారి వద్ద నుంచి పారిపోయి దాక్కున్నాడు. అయితే గొంతు ఎండిపోయి అక్కడికక్కడే మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్ధానికులు అరండల్‌పేట పోలీసులకు రాత్రి 11గంటలకు సమాచారం అందించడంతో వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ వీరాస్వామి, సిబ్బందితో చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ రౌడీషీట్ ఉన్నట్లు సమాచారం. -
వలస కూలీల ఆటోను ఢీకొన్ని ప్రైవేటు బస్సు
మేడికొండూరు : విషదళ సమీపంలోని ఎన్నారై కళాశాల వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మేడికొండూరు సీఐ నాగూర్ మీరా సాహెబ్ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు మేడికొండూరు మండల పరిధిలోని సరిపుడి గ్రామంలో గుడారాలు నిర్మించుకొని నివసిస్తున్నారు. రోజూ కూలి పనుల కోసం పొన్నూరు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం కూడా తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పేరేచర్ల గ్రామ శివారు దాటిన తర్వాత ఎన్నారై కళాశాల సమీపంలో అతివేగంగా అజాగ్రత్తగా వస్తున్న ప్రైవేట్ బస్సు కూలీల ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో త్కోసారిగా పల్టీ కొట్టి పక్కకు బోల్తా పడింది. ప్రమాదంలో తుపాకుల జయమ్మ, తుపాకుల సుబ్బారావు, మాణిక్యమ్మ, తుపాకుల లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు సిఐ నాగూర్ మీరా సాహెబ్ తెలిపారు. కళాశాల బస్సును దొంగిలించి ఆటోను ఢీకొట్టాడు వలస కూలీలను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన బస్సు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది ఎన్నారై కళాశాలకు చెందిన బస్సుగా తెలిసింది. ఈ బస్సును పేరేచర్ల జంక్షన్ వద్ద ఆపి డ్రైవర్ మందులు కొనుక్కుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి నడుపుకుంటూ తీసుకెళ్లిపోయాడు. దీంతో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మేడికొండూరు పోలీసులు పల్నాడు జిల్లా లిథం కళాశాల సమీపంలో బస్సును అదుపులోకి తీసుకొని దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు. బస్సు దొంగిలించిన వ్యక్తి జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పొన్నవోలు నాగేశ్వరరావు అని గుర్తించారు. నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసు గంట వ్యవధిలోనే పోలీసులు ఛేధించారు. నలుగురికి తీవ్ర గాయాలు -
జీవన సత్యాన్ని చాటిన ‘జేబు చెప్పిన ఊసులు’
తెనాలి: పట్టణానికి చెందిన డీఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్ ఆధ్వర్యంలో 14వ జాతీయస్థాయి నాటకోత్సవాలు మంగళవారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో ఏర్పాటైన నాటకోత్సవాలను ప్రముఖ సినీ రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. తొలిరోజున సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి ‘జేబు చెప్పిన ఊసులు’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. ‘జేబు నిండుగా ఉంటే మనకు అందరూ ఉంటారు.. అదే జేబు ఖాళీ అయితే మనకోసం ఎవరూ ఉండరు.. జీవితం చివరి రోజుల్లో భరోసా ఉండదు’ అనే నిజాన్ని అర్థవంతంగా చెప్పిందీ నాటకం. మన దగ్గర మనసుంది...మమకారం ఉంది.. వాటితోపాటు డబ్బును కూడా కాపాడుకోవాలనేది నాటక సందేశం. మనిషనేవాడు జాగ్రత్త పడుతూండాలి.. తనకోసం కూడా ఆలోచించుకోవాలి.. విలువైన డబ్బును తన కోసం కొంతయినా జాగ్రత్త చేసుకోవాలి.. ఆ డబ్బే చివరి దశలో ఆసరా అవుతుంది.. లేకుంటే జీవితంలో అభద్రత చోటుచేసుకుంటుంది.. జేబులు చెప్పే నిజాలను పట్టించుకోవాలంటూ ‘జేబు చెప్పిన ఊసులు’ నాటకం మనిషి ఎలా బతకాలో ఎలా బతకకూడదో తెలియచెప్పిన వాస్తవ ఘటనల సమాహారంగా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. స్నిగ్ధ రచించిన నాటకాన్ని మంజునాథ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. ప్రధాన పాత్రల్లో ఎస్డీ బాషా, మంజునాథ్, ప్రశాంత్, మల్లాది భాస్కర్, ఆకెళ్ల గోపాలకృష్ణ, కె.శ్రీదేవి నటించారు. సంగీతం నాగరాజు, లైటింగ్ ఉమాశంకర్. నాటకం తదుపరి జరిగిన సభకు కళాపరిషత్ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ రంగస్థల, సినీనటుడు నాయుడుగోపి అధ్యక్షత వహించారు. ఈ సభలో విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రంగస్థల నటి, రచయిత్రి, దర్శకురాలు కె.విజయలక్ష్మికి ఎన్టీఆర్ జీనవ సాఫల్య పురస్కారాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా ప్రదానం చేశారు. విశ్రాంత పోస్టల్ సూపరింటెండెంట్ కె.రమేష్, కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి పీఎస్సార్ బ్రహ్మాచార్యులు, కోశాధికారి ఎ.పోతురాజు పాల్గొన్నారు.ఆలోచింపజేసిన సాంఘిక నాటకం జాతీయస్థాయి నాటకోత్సవాలు ప్రారంభం విశాఖ నటి, రచయిత్రి, దర్శకురాలు విజయలక్ష్మికి ఎన్టీఆర్ జీవనసాఫల్య పురస్కారం -
ప్రాణం తీసిన ఈత సరదా
పెదకాకాని: స్నేహితులతో కలిసి గుంటూరు చానల్‌కు ఈత నేర్చుకునేందుకు వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించిన ఘటన తక్కెళ్ళపాడులో జరిగింది. గుంటూరుకు చెందిన షేక్ జానీ(18) మరో ముగ్గురు స్నేహితులు మేకా వంశీ, లోకేష్‌కుమార్, మహబూబ్‌లతో కలసి ఈత నేర్చుకునేందుకు పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడు సమీపంలో ప్రవహిస్తున్న గుంటూరు చానల్ వద్దకు చేరుకున్నాడు. కృష్ణానది నుంచి ప్రారంభమైన గుంటూరు చానల్(కొత్తకాలువ) మండలంలోని నంబూరు, పెదకాకాని, తక్కెళ్ళపాడు, రామచంద్రపాలెం గ్రామాల గుండా ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం గుంటూరు చానల్లో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. తక్కెళ్ళపాడు గ్రామంలోకి వెళ్ళే సమీపంలో కాలువలోకి దిగి ఈత కొడుతుండగా ఈత పూర్తిగా రాని షేక్ జాని నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. అదే సమయంలో అక్కడ సుమారు 30 మంది యువకులు ఈత కొడుతున్నారు. జాని నీటిలో మునగడంతో స్నేహితులు కేకలు వేశారు. దీంతో కొందరు నీటిలో మునిగిపోయిన జానీని వెతికి ఒడ్డుకు చేర్చారు. ఘటనా స్థలంలోనే ప్రథమ చికిత్స అందిస్తుండగా జానీ మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడు జానీకి తల్లి వహీదా, చెల్లెలు సానియా, తమ్ముడు సైఫ్అలీ ఉన్నారు. తండ్రి కొంతకాలంగా కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటున్నాడు. జానీ గుంటూరులోని వస్త్రదుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు జానీ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని అమ్మ చారిటబుల్ ట్రస్టు వారి వాహనంలో గుంటూరు మార్చురీకి తరలించారు. మృతుని తల్లి షేక్ వహీదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.పి.నారాయణస్వామి తెలిపారు. -
46 ఎకరాల గడ్డివాములు దగ్ధం
తెనాలిరూరల్: అగ్నిప్రమాదంలో సుమారు రూ.ఐదు లక్షల విలువైన 46 ఎకరాల వరిగడ్డి వాములు దగ్ధమైన ఘటన తెనాలి పినపాడు వద్ద మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పినపాడు ప్రాంతానికి చెందిన 13 మంది రైతులు ఉమ్మడిగా గడ్డివాములను వేశారు. 46 ఎకరాలు గడ్డిని 15 గడ్డివాములుగా ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించి గడ్డివాములు తగలబడటం ప్రారంభించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచగా, సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. గడ్డి వాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎండ వేడికి దగ్ధమయాయా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రైతులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఇక్కడే గడ్డి వాములు వేస్తున్నామని, పంటలు నూర్పి గడ్డిని 13మంది రైతులము కలిసి ఒకచోట వాములు వేశామని, గడ్డికి ఎలా మంటలు వ్యాపించాయో తెలియదని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అర్పిన లాభం లేకుండా పోయిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మద్యం మత్తులో వృద్ధుడి హత్య
గుంటూరు రూరల్: మద్యం మత్తులో వృద్ధుడిని హత్య చేసిన ఘటన రెడ్డిపాలెం సమీపంలో మంగళవారం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ కథనం ప్రకారం శారదా కాలనీకి చెందిన దారావత్ రాము (60) ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుని జీవిస్తుంటాడు. ఈ క్రమంలో రెడ్డిపాలెం వద్ద అదే గ్రామానికి చెందిన బట్టు రాజు అనే వ్యక్తితో కలిసి మంగళవారం మద్యం తాగాడు. ఈ సమయంలో వివాదం జరిగింది. దీంతో రాజు ఆవేశంలో మద్యం బాటిల్ పగలగొట్టి రాముపై దాడిచేశాడు. దాడిలో రాము తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన విషయం తెలిసిన సౌత్ డివిజన్ డీఎస్పీ భానోదయ సిబ్బందితో కలిసి ఘటన స్థలికి చేరుకున్నారు. వివరాలను సేకరించిన సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వైభవంగా ఆలయ వార్షికోత్సవం నిజాంపట్నం: అడవులదీవి గ్రామంలో వేంచేసియున్న అనంత సాయిబాబా మందిర 15వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. బాబాకి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. రేపు బ్రహ్మంగారి ఆరాధన తిరునాళ్ల కర్లపాలెం: ఏట్రవారిపాలెంలో పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన తిరునాళ్ల గురువారం జరుగుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు.శిలువ పాదయాత్ర నాదెండ్ల: ఇర్లపాడు విచారణ ఆర్సీఎం సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గ్రామం నుంచి కనపర్రు బాలయేసు పుణ్యక్షేత్రం వరకు శిలువ పాదయాత్ర నిర్వహించారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అయితే అందుకనుగుణంగా అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా లేదనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా ప్రమాదాలను నియంత్రించడం ఆ శాఖకు అగ్నిపరీక్షగా పరిణమించనుంది. దీనికి సర్కారు నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. ప్రజలూ అప్రమత్తంగా ఉండా లని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. మిస్ట్ వాహనాలు నిరుపయోగం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో గుంటూరు, 1, 2, తెనాలి, మంగళగిరి, పొన్నూరు, వెలగపూడి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయంలో ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. వెలగపూడి, హైకోర్టు, సీఎం క్యాంపు కార్యాలయాల్లో ఉన్న అగ్నిమాపక దశాలు తాత్కాలికమే. వీటితోపాటుగా సీఎం కాన్వాయ్ విధుల్లో ఒక అగ్నిమాపక వాహనం ఉంటుంది. జిల్లాలో ఒక డీఎఫ్‌వో, ఇద్దరు ఏడీఎఫ్‌వోలు కలిపి 138 మంది సిబ్బంది ఉండాలి. మొత్తం ఏడు ఫైరింజన్లు, 5 మిస్ట్ బుల్టెట్లతోపాటు ఆధునిక అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉడాలి. వీటిలో మిస్ట్ జీప్, మిస్ట్ బుల్లెట్ ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి. వీటి టైర్లు ఎండకు పాడైపోతున్న దుస్థితి. ఫైరింజన్ వెళ్ళలేని స్థితిలో మిస్ట్ వాహనాల ద్వారా మంటలు అదుపుచేస్తారు. వీటికి ఉండాల్సిన ట్యాంకర్లూ లేవు. మిస్ట్ జీప్, బుల్లెట్లు దుమ్ముపట్టుకుపోయాయి. ఫ్లోటింగ్ పంపు, చిన్నచిన్న సందుల్లోకి వెళ్ళే డీసీపీ ట్రాలీల నిర్వహణ సరిగా లేదు. సిబ్బంది కొరత గుంటూరు జిల్లాలో అగ్నిమాపక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో ఇద్దరు ఏడీఎఫ్లు ఉండాల్సి ఉండగా ఒకరే ఉన్నారు. స్టేషన్ ఆఫీసర్లు ముగ్గురు, లీడింగ్ ఫైర్‌మెన్ 21, డ్రైవర్లు 21, ఫైర్మెన్లు 67 మంది ఉండాల్సి ఉండగా.. ఫైర్మెన్లు 38 మంది మాత్రమే ఉన్నారు. 20 మంది హోంగార్డులతో ఈ స్థానాలు భర్తీ చేశారు. ఇంకా పది మంది సిబ్బంది కొరత ఉంది. ఇప్పటికే ప్రతిపాదనలు పంపినా సర్కారు నుంచి స్పందన లేదు. ఉన్న సిబ్బందికి సరైన తర్ఫీదు కూడా లేదు. ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల లీక్‌లు, షార్ట్సర్క్యూట్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 101కు డయల్ చేయాలి. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకూ అవగాహన కల్పిస్తున్నాం. – ఎం.శ్రీనివాసరెడ్డి, జిల్లా, అగ్నిమాపకశాఖాధికారి 7న్యూస్రీల్జిల్లాలో ప్రమాదాలు ఇలా.. అగ్నిప్రమాదాల నియంత్రణ పెను సవాలే మూలనపడిన అత్యాధునిక వాహనాలు అరకొర సిబ్బందే గతి వేసవి నేపథ్యంలో అప్రమత్తత అవసరం -
చికిత్సలన్నీ పూర్తి ఉచితం
జీజీహెచ్ క్యాథ్‌ల్యాబ్‌లో కార్డియాలజీ రోగులకు యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, ఫేస్మేకర్ ఇతర అన్ని రకాల గుండె చికిత్సలు పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. న్యూరో రేడియాలజీ వైద్యసేవలనూ అందుబాటులోకి తీసుకొచ్చాం. మెదుడు రక్తనాళాల్లో పూడికలు, కాళ్ళ రక్తనాళాల్లో ఏర్పడే పూడికలు తీసివేసి స్టంట్లు వేస్తున్నాం. – డాక్టర్ బొర్రా విజయ్‌చైతన్య, సీనియర్ ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, క్యాథ్‌ల్యాబ్ నిర్వాహకులు కార్డియాలజీ వైద్య విభాగాన్ని అభివృద్ధి చేశాం. ఇటీవల 100కుపైగా గుండె బైపాస్ సర్జరీలు చేసి రికార్డు సృష్టించాం. 25వేలకుపైగా క్యాథ్‌ల్యాబ్ చికిత్సలు పూర్తిచేశాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, జింకానా, నాట్కో సంస్థ, ఇతర దాతల సహకారంతో ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – డాక్టర్ యశశ్వి రమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
ఉపాధ్యాయ సమస్యలపై నేడు ఫ్యాప్టో నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. మంగళవారం కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో జరిగిన గుంటూరు జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు 30 శాతం ఐఆర్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ఆర్థిక బకాయిలు, జెడ్పీ పీఎఫ్ రుణాలు, ఏపీజీఎల్ఐ క్లోజర్స్, సరెండర్ లీవ్స్ నిధులు విడుదల చేయడంతో పాటు సీపీఎస్, జీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. కారుణ్య నియమకాలు తక్షణమే పూర్తి చేసి, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ కె. వీరాంజనేయులు, డెప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్‌రావు, డీకే సుబ్బారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ. వేళాంగిణి రాజు, పి.ప్రసాద్, జిల్లా నాయకులు ఎం.సాంబశివరావు, ఎంపీ సుబ్బారావు, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ముగిసిన టెన్త్ పరీక్షలు
● 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ● గుంటూరు స్టాల్ బాలికోన్నత పాఠశాలలో మూల్యాంకనం ● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్ష రాసిన విద్యార్థులు పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వస్తూనే కేరింతలు కొట్టారు. పరీక్షలు ముగిసిన ఆనందంలో మునిగితేలారు. మంగళవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షను జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాల పరిధిలో 27,372 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 27,222 మంది హాజరయ్యారు. డీఈఓ సీవీ రేణుక,, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ వెంకట్‌రెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ల ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు డీఈవో సీవీ రేణుక ప్రకటించారు. జిల్లాలో ఒక్క మాల్ ప్రాక్టీసు కేసూ నమోదు కాలేదని చెప్పారు. ఈనెల 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ఈనెల 3వ తేదీ గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో 3వ తేదీ నుంచి వారం రోజుల పాటు స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మూల్యాంకన విధుల్లో భాగంగా చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్స్ విధులకు జిల్లా వ్యాప్తంగా 1,200 మంది ఉపాధ్యాయులను నియమించారు. గతేడాది పెదకాకానిలోని సెయింట్ జోసఫ్ హైస్కూల్లో నిర్వహించిన స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు తిరిగి స్టాల్ బాలికోన్నత పాఠశాలకు మార్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్పాట్ వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. విధులకు నియమితులైన ఉపాధ్యాయులందరూ గురువారం స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
శంకర్‌విలాస్ బ్రిడ్జిపై అపోహలొద్దు
గుంటూరు వెస్ట్: శంకర్‌విలాస్ బ్రిడ్జి పునర్నిర్మాణంపై ఎవరికీ అపోహలు వద్దని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి ఆర్యూబీ అంశాన్ని కూడా పరిశీలించామని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలరీత్యా ఆర్యూబీ స్థానంలో ఆర్వోబీకి మాత్రమే అవకాశం ఉందన్నారు. మొత్తం 900 మీటర్ల పొడవుతో స్థానిక ఏసీ కళాశాల నుంచి అరండల్‌పేట 9వ లైను వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.98 కోట్లు ఇప్పటికే మంజూరు చేసిందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతోపాటు, అండర్పాస్లూ నిర్మిస్తామని పేర్కొన్నారు. మొత్తం బ్రిడ్జి నిర్మాణంతో 134 స్ట్రక్చర్లు ఎఫెక్ట్ అవుతాయని వివరించారు. ఇప్పటికే 40 మంది తమ అంగీకారం తెలిపారని, మరికొంత మంది కోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే వారిని కూడా ఒప్పించే యత్నం చేస్తున్నామన్నారు. బ్రిడ్జి వల్ల ప్రభావితం అవుతున్న వారితో మూడు సమావేశాలు నిర్వహించామన్నారు. ఎప్పటికప్పుడు వారి అభిప్రాయాలు తీసుకుంటూ నిర్మాణ డిజైన్ చేపట్టామని పేర్కొన్నారు. బ్రిడ్జి తొమ్మిది మీటర్ల హైట్ ఉంటుందని పేర్కొన్నారు. కొందరు ఆరేడు మీటర్లు సరిపోతుంది కదా అని అంటున్నారని, అయితే ప్రస్తుతం రైళ్లన్నీ ఎలక్ట్రికల్ విధానంలో నడుస్తున్నాయని, వీటి ఎత్తు సుమారు 7 మీటర్లు ఎత్తు ఉంటుందని వెల్లడించారు. దీంతో తొమ్మిది మీటర్ల ఎత్తు నిర్మాణం తప్పనిసరని స్పష్టం చేశారు. నిర్మాణంతో నష్టపోయేవారికి చెల్లించే పరిహారం కూడా చట్టానికి లోబడి ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం కొత్త బ్రిడ్జి నిర్మించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం : ఎస్పీసమావేశంలో ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైన నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు బ్రిడ్జిపై రాకపోకలు సాగించవచ్చని పేర్కొన్నారు. నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాతే బ్రిడ్జిని పగులగొడతారని తెలిపారు. అమరావతి, గోరంట్ల నుంచి వచ్చే వాహనాలు ఇన్నర్‌రింగ్ రోడ్డువైపు మళ్లిస్తామన్నారు. వీలైనంత వరకు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అంశాలను ప్లాన్ ద్వారా వివరించారు. భవిష్యత్తు అవసరాల కోసం నిర్మాణం తప్పనిసరి ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం కలెక్టర్ నాగలక్ష్మి -
జోరుగా రిజిస్ట్రేషన్లు.. భారీగా ఆదాయం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో సెలవురోజు కూడా రిజిస్ట్రేషన్లు ఆగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం, సోమవారాలు సెలవు దినాలైనా ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఈ రెండు రోజులు పనిచేశాయి. ఇందులో భాగంగా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆదివారం ఒక్కరోజే 24 రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.కోటి 1 లక్ష ఆదాయం వచ్చిందని, సోమవారం 18 రిజిస్ట్రేషన్లు జరగా 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. భూములు, పొలాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్లు భారీగా క్రయ విక్రయాలు జరిగాయి. ఆదివారం ఒక్కరోజే రూ.కోటికిపైగా ఆదాయం వచ్చింది. ఉగాది, ఆదివారం అయినప్పటికీ కొనుగోలు దారులు వెనక్కి తగ్గలేదు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావడంతోసెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేశాయి. దీంతో పొలాలు, స్దలాలు, ఇళ్లు భారీగా కొనుగోలు జరిగాయి. 2023–2024 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 161 కోట్ల రూపాయలు ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కాగా 142 కోట్ల రూపాయలు మాత్రమే లక్ష్యాన్ని పూర్తిచేశారు. అదే ఆర్ధిక సంవత్సరంలో 15903 డాక్యుమెంటేషన్లు జరిగాయి. కాగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంగళగిరి సబ్ రిజిష్టర్ కార్యాలయానికి 200 కోట్లు ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 176 కోట్లు లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలో సుమారు 16 వేల డాక్యుమెంటేషన్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
మద్యం మత్తులో ఆటోలను ఢీకొట్టిన కారు
● రెండు ఆటోల్లో 17మందిపైనే ప్రయాణికులు ● ఎనిమిది మందికి గాయాలు చినగంజాం: మద్యం మత్తులో కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న కూలీల ఆటోలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి పైనే గాయాల పాలైన ఘటన సోమవారం సాయంత్రం చినగంజాం రొంపేరు బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చినగంజాం పల్లెపాలెం, చీరాల బోయనవారిపాలెం గ్రామానికి చెందిన పలువురు మహిళా కూలీలు నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో కూలీ పనుల కోసం వచ్చి సోమవారం సాయంత్రం పనులు ముగించుకొని ఆటోలలో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వారి ఆటోలు రొంపేరు బ్రిడ్జి సమీపానికి వచ్చేసరికి చీరాల నుంచి వస్తున్న ఏపీ 31 బీకే 1881 నంబరుతో ఉన్న కారులో డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి ఎదురుగా వస్తున్న కూలీల ఆటోను ఢీ కొట్టాడు. ముందు వెళ్తున్న బోయనవారిపాలెం ఆటోను బలంగా ఢీ కొట్టడంతో వెనుక ఉన్న ఆటో దానిని ఢీ కొట్టింది. వెనుక ఉన్న ఆటోలో మహిళా కూలీలకు స్వల్ప గాయాలు కాగా ముందు ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒక వృద్ధురాలికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. కారు, ఆటో డ్రైవర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్య చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. గాయాలపాలైన మహిళా కూలీలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న బీహార్‌కు చెందిన శంశాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలించినట్లు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న కొండేపి శివజ్యోతి కాలు విరిగినట్లు చీరాల ఔట్ పోస్టు ఏఎస్ఐ శ్యాం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఆయన వివరించారు. -
నగర పరిసరాల్లో జిల్లా ఎస్పీ పర్యటన
నగరంపాలెం: గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది విధినిర్వహణ తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు. పట్టాభిపురం పీఎస్ పరిధిలోని పట్టాభిపురం, కోబాల్డ్‌పేట మసీదులు, లాలాపేట పీఎస్ పరిధిలోని ఎత్తురోడ్డు మసీదు, పాతగుంటూరు పీఎస్ పరిధిలోని ఆంధ్ర ముస్లిం కళాశాల, నగరంపాలెం పీఎస్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సమీపంలోని ఈద్గాల వద్ద నెలకొల్పిన బందోబస్త్‌ను పరిశీలించారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రార్థనలు ముగిసే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రార్థనలు ముగిశాక ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. రంజాన్ పర్వదిన సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకునేలా ఆయా ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట సీఐలు ఎ.అశోక్‌కుమార్ (తూర్పు ట్రాఫిక్ పీఎస్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్ పీఎస్), వైవీ.సోమయ్య (పాతగుంటూరు పీఎస్), పోలీస్ అధికారులు ఉన్నారు.నేడు యథావిధిగా టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్షగుంటూరు ఎడ్యుకేషన్ రంజాన్ పండుగ సెలవు కారణంగా వాయిదా పడిన 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష మంగళవారం యథావిధిగా జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం మంగళవారం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించినప్పటికీ, టెన్త్ సోషల్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా 150 కేంద్రాల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే సోషల్ స్టడీస్ పరీక్షకు విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలని ఆయా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సూచించారు.జెస్సీరాజ్‌కు పతకాలుమంగళగిరి: ఈనెల 26 నుంచి 31 వరకు తైవాన్‌లో జరిగిన తైవాన్ ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ స్కేటింగ్ పోటీలలో మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ అద్భుత ప్రతిభ కనపరిచింది. సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్ విభాగాలలో రెండు గోల్డ్ మెడల్స్, పెయిర్ స్కేటింగ్‌లో సిల్వర్, ఇన్ లైఫ్ ఫ్రీ స్టాల్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. సోమవారం జెస్సీరాజ్‌కు ఏషియన్ ఆర్టిస్ట్ స్కేటింగ్ చైర్మన్ అలెక్స్ వాంగ్ పతకాలు అందజేసి అభినందించారు.ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తుబాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీచినగంజాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా ఎస్పీ సోమవారం చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంగళవారం మొత్తం 904 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని వీరిలో ఒకరు అడిషనల్ ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 27 మంది సీఐలు, 67 మంది ఎస్ఐలు ఉన్నారన్నారు. మొత్తం బందోబస్తును 11 సెక్టార్లుగా విభజించామన్నారు. అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన ప్రదేశాలలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్, బాపట్ల, చీరాల, రేపల్లె సీసీఎస్ డీఎస్పీలు రామాంజనేయులు, మొయిన్,శ్రీనివాసరావు, జగదీష్ నాయక్‌లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నారాయణ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
కనిపించె ప్రగతికి స్వాగతం
తెనాలి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కత్తెర కాన్పులు అధికమయ్యాయి. సాధారణ ప్రసవాలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సమీక్షలో తేలిన అంశమిది. దీనిపై వైద్యాధికారులతో ఆస్పత్రుల్లో చేయించిన తనిఖీల్లో కఠోర వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నూటికి 98 శాతం ప్రసవాలు సిజేరియన్లతోనే జరిగాయి. అయితే తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 35 శాతం వరకు సాధారణ కాన్పులు చేయగలిగారు. గత ఆర్నెల్లలో జరిగిన ప్రసవాలను సమీక్షించుకుంటే నిగ్గు తేలిన అంశమిది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీసుకున్న ముందస్తు చర్యలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రసవాల తనిఖీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, తెనాలి ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఇటీవల పట్టణంలోని ఐదు ప్రైవేటు ఆస్పత్రులు, సమీపంలోని మరో కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలను తనిఖీలు చేశారు. ఆ ఆస్పత్రుల్లో నెలకు వంద వరకు ప్రసవాలు జరిగితే, అందులో రెండు మాత్రమే సాధారణ కాన్పులు. మిగిలిన 98 సిజేరియన్లే. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సగటున నెలకు 200 ప్రసవాలు జరిగా యి. గత ఆర్నెల్లలో 1200పైగా ప్రసవాలు జరిగితే అందులో 444 కాన్పులు సాధారణమే. అంటే దాదాపు 35 శాతం. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ కాన్పులను ఎందుకు ప్రోత్సహించడం లేదని అధికారులు నిర్వాహకులను ప్రశ్నించారు. ఇకపై ఆదిశగా ప్రయత్నించాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలపై గత ప్రభుత్వం దృష్టి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేవలం ఆదేశాలతోనే సరిపెట్టకుండా అందుకు అవసరమైన చర్యలను తీసుకుంది. ఆస్పత్రిలోని లేబర్ రూమ్‌ను ఆధునికీకరించారు. పెయింట్ వేయించారు. ఏసీలు అందుబాటులోకి తెచ్చారు. లేబర్ రూంలో అవసరమైన టేబుల్స్ సమకూర్చారు. ఐదుగురు స్టాఫ్ నర్సులకు సాధారణ ప్రసవాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వీటితోపాటు మహిళలకు గర్భిణి నిర్ధారణ కాగానే, రిజిస్ట్రేషన్ చేసి, కౌన్సెలర్‌తో కౌన్సెలింగ్ ఇప్పించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్సర్‌సైజులపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారంపై డైటీషియన్ సూచనలు చేస్తున్నారు. ఓపీ హాలులోని టీవీలో ఎక్సర్సైజులు, ఆహారంపై ప్రసారాలు చేస్తు న్నారు. ప్రసవం దగ్గర పడే వరకు ఇలాంటి జాగ్రత్తలు కొనసాగిస్తున్నారు. నొప్పులు మొదలుకాగానే లేబర్ రూంకు తీసుకెళతారు. ప్రవస సేవలకు నలుగురు మెటర్నటీ అసిస్టెంట్లు, అనుభవజ్ఞులైన ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఇన్ని చర్యల కారణంగానే ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులకు అవకాశం కలుగుతోంది. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 35 శాతం వరకు సాధారణ కాన్పులు గత ప్రభుత్వ చర్యలతో ఒనగూరిన ప్రయోజనం సాధారణ ప్రసవాలకు వైద్యులు కృషి ప్రైవేటు ఆసుపత్రుల్లో 98 శాతం సిజేరియన్లు తగ్గించాలని కమిటీ ఆదేశంతెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఆర్నెల్లలో జరిగిన ప్రసవాలు... నెల ప్రసవాలు సిజేరియన్ సాధారణ మొత్తం కాన్పులు కాన్పులు అక్టోబరు 264 168 96 నవంబరు 276 165 111 డిసెంబరు 204 135 69 జనవరి 174 110 64 ఫిబ్రవరి 144 97 47 మార్చి 27వరకు 145 88 57 మొత్తం 1207 763 444 -
కార్మికులపై కూటమి కత్తి
● 60ఏళ్లు దాటిన వారిని విధుల నుంచి తొలగింపు ● పారిశుద్ధ్య విభాగంలో 103 మందికి ఉద్వాసన ● ఇంజినీరింగ్ విభాగంలో 39 మంది తొలగింపు ● గత ప్రభుత్వ హయాంలో 60 ఏళ్లు నిండితే కుటుంబ సభ్యులకు అవకాశం ● ఇప్పుడు ఆ అవకాశం లేదని అధికారుల స్పష్టీకరణ నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) కూటమి ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోంది. ఆప్కాస్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ సిబ్బంది వందల మందిని 60 ఏళ్ల వయసు దాటిందనే సాకుతో విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శ్రామిక వర్గం నిరసన గళం వినిపిస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో కుటుంబ సభ్యులకు అవకాశం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 103 మంది పారిశుద్ధ్య, 39 మంది ఇంజినీరింగ్ కార్మికులను కూటమి ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. గత వైఎస్సార్ సీపీ పాలనలో 60 ఏళ్ళు వయసు నిండిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. దీంతోపాటు ఆప్కాస్ పద్ధతిలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకూ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఆప్కాస్ పద్ధతిలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ఉద్యోగం ఇవ్వడం లేదు.. 60 ఏళ్లు పూర్తయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ విధానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోస్టులు అమ్ముకునేందుకే కుట్ర! 2025 మార్చి 31కి 142 మందిని విధుల నుంచి తొలగించాలని నగరపాలక సంస్థలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇంజినీర్ అధికారులకు జాబితాతో కూడిన సర్క్యులర్‌ను ఉన్నతాధికారులు జారీ చేశారు. జాబితాలో ఉన్న కార్మికులను మంగళవారం నుంచి విధులకు రానివ్వద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోస్టులు అమ్ముకునేందుకే కూటమి ప్రభుత్వం 60 ఏళ్ల వయసు దాటిన వారిని విధుల నుంచి తొలగిస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు గుంటూరు నగరపాలక సంస్థలో 60 ఏళ్లు పూర్తయిన పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కార్మికులను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం దారుణం. పనిచేసిన కాలానికి గ్రాట్యూటీ అమలు చేయకుండా కనీస పెన్షన్ ఇవ్వకుండా వారిని ఇంటికి పొమ్మనడం తగదు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే. ఇప్పటికై నా సర్కారు గ్రాట్యూటీ చెల్లించి కనీసం పెన్షన్ రూ.5,000 ఇవ్వాలి. తొలగించిన కార్మికుల కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలి. –బందెల రవికుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి -
‘కొండవీటి కళారేఖ’ కావ్యావిష్కరణ
నరసరావుపేట ఈస్ట్: కొండవీడు పాలకుల సాహితీ సేవ, ప్రజారంజక పాలనను చారిత్రక పద్య కావ్యంగా తీసుకురావడం అభినందనీయమని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కల్లి శివారెడ్డి తెలిపారు. శ్రీనాథ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో విశ్రాంత ప్రిన్సిపాల్, పద్యకవి డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డి రచించిన ‘కొండవీటి కళారేఖ’ చారిత్రక పద్య కావ్యాన్ని శివారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సాహితీలోకంలో డాక్టర్ చేరెడ్డి ధ్రువతారగా నిలిచిపోతారని కొనియాడారు. పుస్తక సమీక్షకులు డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి, డాక్టర్ మేళ్లచెర్వు భానుప్రసాదు మాట్లాడుతూ మస్తాన్‌రెడ్డి కలం పట్టి పద్యం రాయడం మొదలు పెట్టి 60 వసంతాలు నిండాయని తెలిపారు. ఆయన రచించిన ‘అఖండ యోగి’ పాఠకుల మన్ననలు పొందిందని పేర్కొన్నారు. కొండవీటి కావ్యరేఖ సైతం అందరి హృదయాలలో నిలిచిపోతుందని వివరించారు. అనంతరం గాయత్రీ పరివార్ సత్సంగ్, సంస్కృత సంధ్యా, సద్గురు కళాసమితి ఆధ్వర్యంలో డాక్టర్ చేరెడ్డి మస్తాన్‌రెడ్డిని పద్య కళానిధి బిరుదుతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీనాథ సాహితీ పరిషత్ కార్యదర్శి స్వర్ణ చినరామిరెడ్డి, ఆయా సంస్థల ప్రతినిధులు డాక్టర్ పోపూరి గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ వేదాంతం సత్య శ్రీనివాస అయ్యంగార్, పి.వి.ఎస్.ఆర్. ప్రసాదరావు పాల్గొన్నారు. -
ఏకాదండయ్య పంతులు జీవితం స్ఫూర్తిదాయకం
గుంటూరు ఎడ్యుకేషన్: ఎనిమిది దశాబ్దాల క్రితం అప్పటి కాలమాన పరిస్థితుల కనుగుణంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్య, వైద్య, ఆధ్యాత్మిక, ఆదరణ గృహాల ద్వారా సమాజ హిత సేవలందించిన ఏకాదండయ్య పంతులు జీవితం వర్తమాన, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఆర్ఎల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏకాదండయ్య పంతులు చారిటీస్ ఆధ్వర్యంలో సోమవారం అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. రాళ్లబండి వెంకట సత్య రామాంజనేయ శర్మ నూతన పంచాంగ శ్రవణం గావించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఏకాదండయ్య పంతులు బహుముఖ సేవలను కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన న్యాయవాది కొండూరి కృష్ణారావు మాట్లాడుతూ ఏకాదండయ్య పంతులు ధార్మిక సంస్థలను చిరకాలంగా మేనేజింగ్ ట్రస్టీ కోటంరాజు శేష చంద్రమౌళీశ్వర రావు నేతృత్వంలో మిగతా ట్రస్టీలు కాపాడుతూ సామాజిక సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రముఖ వైద్యులు వి.రమణరావు కమలవల్లి దంపతులను ఘనంగా సత్కరించి సన్మాన పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక ట్రస్టీ కొండూరి నందకిషోర్, ట్రస్టీలు కేఎస్ఆర్ కుటుంబరావు, భట్రాజు కృష్ణ కిషోర్, కేసానుపల్లి వెంకట శ్రీరామ సుబ్బారావు, నెప్పల్లి వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఆర్ఎల్ నాగేశ్వరరావు -
గుంటూరు
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సంతోషాల రంజాన్రంజాన్ పర్వదినాన్ని సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మసీదులు, ఈద్గాలు కళకళలాడాయి. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేసవి దృష్ట్యా మసీదులు, ఈద్గాల వద్ద షామియానాలు వేశారు. తాగునీటి సదుపాయం కల్పించారు. భక్తులు ఇబ్బంది పడకుండా పలుచోట్ల కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంలోని పలు మసీదులను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉంటే కొన్నిచోట్ల ముస్లింలు కేంద్ర ప్రభుత్వం చేయనున్న వక్ఫ్ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. నల్లరిబ్బన్లు చేతికి ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. – నగరంపాలెం(గుంటూరు వెస్ట్)7వైభవంగా పోలేరు తల్లి తిరునాళ్ల రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడులో గ్రామ దేవత పోలేరు తల్లి తిరునాళ్లను సోమవారం నిర్వహించారు. గ్రామ స్తులు పొంగళ్లు చేసి నైవేద్యంగా సమర్పించారు. ఏర్పాట్లను ఆల య ధర్మకర్త చాగంటి శ్రీనివాసరెడ్డి, సభ్యులు పర్యవేక్షించారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 519.70 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువకు 4,050 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి సోమవారం చిలకలూరిపేట గణపవరానికి చెందిన గ్రంథి శ్రీనివాసరావు కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందించింది. న్యూస్‌రీల్ -
రేపల్లె నుంచి దూరప్రాంతాలకు సర్వీసులు నడపాలి
రేపల్లె రూరల్: తీరప్రాంతమైన రేపల్లె ఆర్టీసీ నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను నడపాలని పట్టణ ఆదర్శ వేదిక కార్యదర్శి యడ్లపల్లి కిషోర్‌బాబు విన్నవించారు. రేపల్లె ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతూ డిపో వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణలకు సోమవారం వినతిపత్రం అందజేశారు. రేపల్లె – విశాఖపట్నం – శ్రీకాకుళం, రేపల్లె – మచిలీపట్నం – కాకినాడ – విశాఖపట్టణం – శ్రీకాకుళం పోర్టు, రేపల్లె – తిరుపతి – బెంగళూరు, రేపల్లె – హైదరాబాద్ (బెర్త్‌తో కూడుకున్న బస్సులు)లతో పాటు శ్రీశైలం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు సర్వీసులు నడపాలన్నారు. అదేవిధంగా మోపిదేవి మీదగా చల్లపల్లికి మినీ సర్వీసులను ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎన్.సాయికృష్ణమాచార్యులు, కొడాలి ఆనందరావు, నటరాజ్ ఉన్నారు. -
తెనాలి వైద్యశాలలో అరుదైన సర్జరీ
తెనాలిఅర్బన్: రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఆటో హ్యాండిల్ రెండు తొడల మధ్య ఇరుకున్న ఓ వ్యక్తికి ఆపరేషన్ చేసి ప్రాణప్రాయాన్ని తప్పించారు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు. సేకరించిన వివరాలు, వైద్యుల కథనం ప్రకారం.. తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్‌కు చెందిన ప్రసాద్ (28) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోనగర్ వైపు తన ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రసాద్ నడుపుతున్న ఆటో హ్యాండిల్ అతని రెండు తొడల మధ్యలో ఇరుక్కుపోయింది. ఎంత సేపు ప్రయత్నించి హ్యాండిల్ బయటకు రాకపోవడంతో స్థానికులు దానిని కట్ చేసి, అతడిని జిల్లా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ జె.హనుమంతరావు రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం సెలవు అయినప్పటికీ హుటాహుటిన వైద్యశాలకు వచ్చారు. ఓపీ నుంచి అదే స్ట్రక్చర్‌పై థియేటర్‌కు తీసుకువెళ్లి అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. రెండు తొడల మధ్యలో ఇరుకున్న హ్యాండిల్‌ను తొలగించడంతో పాటు లోపల దెబ్బతిన్న నరాలను కూడా సరిచేసి కుట్లు వేశారు. వెంటనే సర్జరీ చేయడం వలన ప్రాణపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సలో ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎనస్తీషియా వైద్యులు డాక్టర్ యశస్వి, డాక్టర్ తులసీలు పాల్గొన్నారు. రోగి తరఫు బంధువులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తొడల మధ్యలో ఇరుకున్న ఆటో హ్యాండిల్‌ను తొలగించిన వైద్యులు వ్యక్తికి తప్పిన ప్రాణాపాయం