hockey
-
సవిత, హర్మన్‌ప్రీత్‌కు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల జట్టు గోల్‌కీపర్ సవితా పూనియాకు... ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు దక్కాయి. హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ పేరిట ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఈ పురస్కారాలు అందజేస్తోంది.2024 పారిస్ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండో సారి విశ్వ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన జట్టులోనూ హర్మన్‌ప్రీత్ సభ్యుడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంలో సవిత ప్రధాన పాత్ర పోషించింది. 2024 సంవత్సరానికి గానూ సవిత హాకీ ఇండియా బల్జీత్ సింగ్ ‘గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా దక్కించుకుంది.‘ఈ పురస్కారాలకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. జట్టు సభ్యుల సహకారం లేనిదే ఇది సాధ్యం కాదు. ఈ అవార్డులు ఆటపై ఏకాగ్రతను మరింత పెంచుతాయి’ అని సవిత పేర్కొంది. ‘ఈ అవార్డు నాకు ప్రేరణ వంటిది. యువ ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన చేసేలా ఇవి తోడ్పాటునిస్తాయి’ అని హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు 1975లో ప్రపంచకప్ నెగ్గి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హాకీ ఇండియా ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. -
FIH Pro League: భారత హాకీ జట్లకు నిరాశ
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో సోమవారం భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 2–4 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 2–3 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోయాయి. నెదర్లాండ్స్‌తో జరిగిన పోరు ద్వారా భారత జట్టు గోల్‌కీపర్ సవితా పూనియా తన కెరీర్లో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. వందన కటారియా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ప్లేయర్‌గా సవిత గుర్తింపు పొందింది.నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత్ తరఫున ఉదిత (18వ, 42వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున ఎమ్మా రెజ్నెన్ (7వ నిమిషంలో), ఫే వాన్‌డెర్ (40వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... ఫెలిస్ అల్బెర్స్ (34వ, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది.ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టుకు అభిషేక్ (18వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇంగ్లండ్ తరఫున జేకబ్ పేటన్ (15వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... సామ్ వార్డ్ (19వ, 29వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు. -
Hockey India League 2024-25: సెమీస్‌లో బెంగాల్ టైగర్స్
రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ 2–1 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో బెంగాల్ టైగర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా బెంగాల్ జట్టు టాప్-4లోనే ఉండనుంది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్.. వేదాంత కలింగ లాన్సర్స్‌పై 5-2 గోల్స్ తేడాతో గెలుపొందింది. సూర్మా హాకీ క్లబ్ తరఫున టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 32, 54 నిమిషాల్లో గోల్స్ చేయగా.. ప్రభ్‌జోత్ సింగ్ 26వ నిమిషంలో.. నికోలస్ కీనన్ 33వ నిమిషంలో.. మణిందర్ సింగ్ 51వ నిమిషంలో గోల్స్ చేశారు. లాన్సర్స్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ 5వ నిమిషంలో, థియరీ బ్రింక్‌మన్ 44వ నిమిషంలో.. గుర్సబ్జిత్ సింగ్ 56వ నిమిషంలో గోల్స్ చేశారు. ఈ గెలుపుతో సూర్మా హాకీ క్లబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇదిలా ఉంటే, మహిళా క్రీడాకారిణుల కోసం తొలిసారి నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్ఐఎల్) టోర్నమెంట్లో ఒడిశా వారియర్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నేహా గోయల్ సారథ్యంలోని ఒడిశా వారియర్స్ 2-1 గోల్స్ తేడాతో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టును ఓడించింది. రుతుజా దాదాసో పిసాల్ (20వ, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి ఒడిశా వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సలీమా టెటె కెప్టెన్సీలో ఆడిన సూర్మా క్లబ్ జట్టుకు పెన్నీ స్క్విబ్ (28వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. విజేతగా నిలిచిన ఒడిశా వారియర్స్ జట్టుకు రూ. 1 కోటి 50 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్ సూర్మా క్లబ్ జట్టుకు రూ. 1 కోటి ప్రైజ్‌మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. -
హెచ్ఐఎల్తో ఆర్థిక స్థిరత్వం
హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని... దీని వల్ల యువ ఆటగాళ్లు హాకీని కెరీర్‌గా ఎంచుకునేందుకు మక్కువ చూపుతారని భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ సవితా పూనియా అభిప్రాయపడింది. ఈ నెల 12 నుంచి 26 వరకు మహిళల కోసం తొలిసారి హెచ్ఐఎల్ నిర్వహిస్తుండగా... దీని వల్ల ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని సవిత ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సవిత... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించింది.కెరీర్ విశేషాలు, భవిష్యత్తు లక్ష్యాలు, దేశంలో హాకీ భవిష్యత్తుపై సవిత తన అభిప్రాయాలు వెల్లడించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ప్రతి ప్లేయర్‌కు ఆర్థిక స్థిరత్వం ముఖ్యం. హాకీ ఇండియా లీగ్ వల్ల అది సాధ్యమవుతుంది. క్రీడా సామాగ్రి కొనుగోలు చేసేందుకు కూడా తల్లిదండ్రులపై ఆధార పడాల్సి వస్తే ఆ కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతుంది. జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పుడు అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అదే జూనియర్ స్థాయిలో ఆడేవాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్లకు హెచ్ఐఎల్ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. » ఆర్థిక ఇబ్బందులు లేననప్పుడే ప్లేయర్లు తమ లక్ష్యంపై దృష్టి సారించగలుగుతారు. సీనియర్ ప్లేయర్‌గా జూనియర్లకు ఎప్పుడూ లక్ష్యాన్ని వదలొద్దనే చెబుతా. హాకీ అనే కాదు ఏ క్రీడలోనైనా అంతే. » హాకీని కెరీర్‌గా ఎంపిక చేసుకుంటే గతంలో తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు కనీసం వాళ్లు సంతోషిస్తారు. పిల్లలు మంచి ప్రదర్శన చేస్తే వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం అయితే వస్తుంది. » 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని అనుకుంటున్నా. అప్పటి వరకు రిటైర్మెంట్ గురించి ఆలోచించను. నా నిర్ణయాన్ని మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కాదనలేదు. పెళ్లి తర్వాత భర్త కూడా నన్ను అర్థం చేసుకున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది. » ప్రస్తుతం 2026 ప్రపంచకప్‌తో పాటు ఆసియా క్రీడలపైనే ప్రధానంగా దృష్టి పెట్టా. ఆటను ఆస్వాదిస్తున్నా. » మహిళల హాకీలో హెచ్ఐఎల్ పెను మార్పులు తీసుకువస్తుంది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు దక్కడం ఖాయం. ఎందరో అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. వారి అనుభవాల నుంచి భారత యువ క్రీడాకారిణులు పాఠాలు నేర్చుకుంటారు. » భారత జట్టులో సీనియర్ ప్లేయర్‌గా నా బాధ్యతలేంటో తెలుసు. యువ ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడంతో పాటు... గోల్ కీపర్‌గా ఆటను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
భారత హాకీ హీరో
హాకీలో.. జట్టు విజయంలో డ్రాగ్‌ఫ్లికర్ పాత్ర ఎంతో కీలకం. పెనాల్టీలను గోల్స్‌గా మలచడానికి ఉండాల్సిన అసాధారణ నైపుణ్యం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. సుదీర్ఘ కాలం హాకీని శాసించిన యూరోపియన్ టీమ్‌లు అత్యుత్తమ డ్రాగ్ఫ్లికర్లతో ఫలితాలు సాధించాయి. మన జట్టు కూడా ఒక దశలో జుగ్రాజ్ సింగ్, సందీప్ సింగ్‌లాంటి ఆటగాళ్లతో దూసుకుపోయింది. అయితే వీరిద్దరూ నిష్క్రమించిన తర్వాత మన టీమ్‌లో ఒకరకమైన స్తబ్దత ఆవరించింది. కొందరు ఆటగాళ్లతో చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో.. భారత్ విజయాల్లో వెనుకబడిపోయింది. ఇలాంటి సమయంలో దూసుకొచ్చిన ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్. జూనియర్ స్థాయి పోటీల్లో సత్తా చాటి తన ప్రతిభను ప్రపంచానికి ప్రదర్శించిన అతను ఆ తర్వాత సీనియర్ టీమ్‌లోకి వచ్చి డ్రాగ్ఫ్లికర్గా తన బాధ్యతను సమర్థంగా నెరవేరుస్తున్నాడు. గత కొన్నేళ్లలో హర్మన్ ఆటతోనే భారత్ పలు కీలక విజయాలు సాధించింది. ఇందులో రెండు ఒలింపిక్స్ పతకాలు కూడా ఉండటం విశేషం. ఆటగాడిగానే కాదు గత రెండేళ్లుగా భారత జట్టు కెప్టెన్‌గా కూడా హర్మన్ తనదైన ముద్రతో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా మిశ్రమ ఫలితాలతో..రెండేళ్ల క్రితం హర్మన్‌ప్రీత్ సింగ్ భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో హర్మన్‌ప్రీత్ జట్టును సమర్థంగా నడిపించాడు. ఆ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణపతకం గెలుచుకోవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత సాధించింది. దాంతో హర్మన్‌కు మంచి ప్రశంసలు లభించాయి. అయితే కొద్ది రోజులకే వరల్డ్ కప్ రూపంలో మరో సవాలు వచ్చిపడింది. పరిస్థితి ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. సొంతగడ్డపై పేలవ ప్రదర్శనతో జట్టు క్వార్టర్ ఫైనల్‌కు ముందే నిష్క్రమించింది. 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో హర్మన్ నాయకత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఒలింపిక్స్ పతకాన్ని అందించి..వరల్డ్ కప్‌లో జట్టు ఓడినా నిజానికి ఆ ఏడాదంతా హర్మన్ ప్రదర్శన చాలా బాగుంది. 33 మ్యాచ్‌లలో అతను 42 గోల్స్‌తో సత్తా చాటాడు. ఇదే ప్రేరణగా అతను పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత.. ఒక పెద్ద విజయం సాధిస్తేనే జట్టు స్థాయి నిలబడుతుందని, అందుకు కెప్టెన్‌గా తన వంతు పాత్ర పోషించాల్సి ఉందని హర్మన్ గట్టిగా నమ్మాడు. అతని కెప్టెన్సీలో భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో అతను చెలరేగాడు. సహచరులూ హర్మన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. దాంతో పారిస్ క్రీడల్లో భారత్ కాంస్య పతకాన్ని అందుకొని సగర్వంగా నిలిచింది. 10 గోల్స్‌తో హర్మన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాటిల్లో ఆస్ట్రేలియాపై 1972 తర్వాత ఒలింపిక్స్‌లో గెలిచేందుకు ఉపకరించిన రెండు గోల్స్‌తో పాటు కాంస్య పతక పోరులో స్పెయిన్‌పై అతను సాధించిన రెండు కీలక గోల్స్ కూడా ఉండటం విశేషం. ఇదే ఫామ్‌ను ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగించి భారత్‌ను విజేతగా నిలిపాడు. అప్పుడు కూడా 7 గోల్స్‌తో అతను టాప్‌స్కోరర్‌గా నిలవడం విశేషం. సంగీతం నుంచి హాకీ వైపు..హర్మన్‌ప్రీత్ స్వస్థలం అమృత్సర్ సమీపంలోని టిమ్మోవాల్. వ్యవసాయ కుటుంబం. హర్మన్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా ఇష్టం. ఊర్లో జాతర మొదలు ఎక్కడికి వెళ్లినా హార్మోనియం లేదా మరేదైనా సంగీత పరికరాన్ని కొనిపెట్టమని పోరు పెట్టేవాడట. హర్మన్ వాళ్ల నాన్న సరబ్జిత్ సింగ్ కూడా కొడుకు కోరికను ఎప్పుడూ కాదనలేదు. ఆ సంగీతపరికరాలను వాయిస్తూ తనకు నచ్చిన పాటలు పాడుకుంటూ మైమరచిపోయేవాడు. అయితే స్కూల్లో పీఈటీ టీచర్ హర్మన్‌ను మార్చాడు. పాటలు గీటలు జీవితంలో పనికొచ్చేవి కావు.. ఏదైనా ఆటలోకి ప్రవేశించు, భవిష్యత్తు బాగుంటుందంటూ సూచించాడు. అంతేకాదు అప్పటికే భారత హాకీలో దిగ్గజాలుగా నిలిచిపోయిన పలువురు పంజాబ్ ఆటగాళ్ల గురించి వివరించి అతనిలో స్ఫూర్తి నింపాడు. దాంతో పదేళ్ల వయసులో హర్మన్ చేతిలోంచి హార్మోనియం పెట్టె పోయి హాకీ స్టిక్ వచ్చింది. స్కూల్లో సాధనతోనే సరిపెట్టకుండా హర్మన్‌ను పూర్తిస్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు తండ్రీ సిద్ధమైపోయాడు. ఫలితంగా పంజాబ్‌లోని ప్రముఖ శిక్షణా కేంద్రం సుర్జీత్ సింగ్ అకాడమీలో అతడిని చేర్పించాడు. అక్కడే హర్మన్ ఆటగాడిగా రాటుదేలాడు. హర్మన్ డ్రాగ్ఫ్లికర్గా రాణించడం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. చిన్న వయసులోనే పొలాల్లో అతను ట్రాక్టర్‌తో వ్యవసాయం చేస్తున్నప్పుడు బలమైన గేర్ రాడ్‌ను పదేపదే వాడాల్సి వచ్చేది. దాంతో అతని భుజాలు మరింత బలంగా మారాయి. అదే డ్రాగ్ఫ్లికింగ్లో ఉపయోగపడిందని కోచ్‌లు చెబుతారు. సాధన సమయంలోనూ సాధారణ బంతి కంటే బరువైన బంతులతో హర్మన్ ప్రాక్టీస్ చేయడం కూడా అతని సాఫల్యానికి మరో కారణం. తిరుగులేని కెరీర్..భారత జూనియర్ జట్టులో 15 ఏళ్ల వయసులో మొదటిసారి స్థానం దక్కిన తర్వాత హర్మన్‌ప్రీత్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. యూత్ టోర్నీ సుల్తాన్ జౌహర్ కప్‌లోనే 2014లో 9 గోల్స్ కొట్టి భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత భారత జూనియర్ జట్టు ఆసియా కప్‌ను, వరల్డ్ కప్‌ను గెలుచుకోవడంలో కూడా హర్మన్ కీలక పాత్ర పోషించాడు. సహజంగానే ఈ ప్రదర్శనలు అతడిని సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యేలా చేశాయి. 2015లో 19 ఏళ్ల వయసులో హర్మన్ మొదటిసారి జపాన్‌పై భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గత తొమ్మిదేళ్లుగా ఇంతింతై వటుడింతై అంటూ తన ఆటకు మెరుగులు దిద్దుకుంటూ ఇప్పుడు టీమ్‌లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కెరీర్లో హర్మన్ ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. టీమ్ సభ్యుడిగా అతను 2 ఒలింపిక్స్ పతకాలు, 2 చాంపియన్స్ ట్రోఫీ పతకాలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా కప్, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, జూనియర్ వరల్డ్ కప్‌లలో అతను భాగస్వామి కావడం విశేషం. మూడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డునూ అందుకున్నాడు. -
గొప్ప గుర్తింపే... కానీ ఇక్కడితోనే ఆగిపోను!
అమృత్సర్ శివారు గ్రామంలోని రైతు బిడ్డ హర్మన్‌ప్రీత్ సింగ్. హాకీలో మేటి ఆటగాడిగా ఎదిగాడు. దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ చరిత్రలో వరుస పతకాలు సాధించిన జట్టును నడిపించిన అతన్ని ప్రతిష్టాత్మక ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపిక చేశారు. ఈసారి హర్మన్‌తో పాటు ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్, ఒలింపిక్స్ ‘డబుల్ ధమాకా’ మనూ భాకర్ (షూటింగ్), పారాలింపిక్ చాంప్ ప్రవీణ్‌లను ఆ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తన హాకీ ప్రయాణం, ప్రతిష్టాత్మక అవార్డు సాఫల్యంపై హర్మన్ హర్షం వ్యక్తం చేశాడు. న్యూఢిల్లీ: అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’కు ఎంపికైన భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తన కెరీర్లో ఇదో గొప్ప సాఫల్యమన్నాడు. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతోనే మురిసిపోనని, కెరీర్లో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పాడు. టోక్యో–2020, పారిస్–2024 ఒలింపిక్స్‌లలో భారత హాకీ జట్టు వరుసగా కాంస్య పతకాలు సాధించింది. ఇందులో స్టార్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ కీలక భూమిక పోషించాడు. భారత అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికైన హర్మన్ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే... ఈ పయనం ఎంతో నేర్పింది హాకీలో నా ప్రయాణం నాకెంతో నేరి్పంది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కొన్నింటా గెలిచాం. మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓడాం. కానీ ఫలితాలేవైనా నాకన్నీ అవి అనుభవ పాఠాలే. కెరీర్ మొదలైన రోజే నేనెలా ఎలా మెరుగవ్వాలి. ఏం చేయాలని నా మనసుకు స్వీయ లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు జట్టుగా... సహచరులతో కలిసికట్టుగా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్ పతకాల్లో, నా ‘ఖేల్‌రత్న’లో సహచరుల అండదండలున్నాయి. ప్రపంచకప్ పతకమే లక్ష్యం హాకీలో అడుగు పెట్టిన 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతీ మ్యాచ్‌ను అస్వాదించాను. విజయానుభూతిని అనుభవించాను. ఓటమిని జీర్ణించుకున్నాను. ఇలా నేనెంచుకున్న క్రీడలో ప్రతీక్షణం సంతృప్తికరంగానే గడిచింది. అయితే ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం ప్రపంచకప్ పతకమే! బెల్జియంలో వచ్చే ఏడాది జరిగే ఈవెంట్లో భారత్‌ను సన్నద్ధం చేయడానికి తగిన సమయం లభించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం, మేజర్ టోర్నీల్లో విజయాలే మా జట్టు లక్ష్యాలు. దీనికోసం ఒక్కోఅడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడప్పుడే రిటైర్మెంటా? ఇప్పుడైతే దృష్టంతా ఆటపైనే ఉంది. రిటైర్మెంట్కు చాలా సమయం ఉంది. ప్రపంచకప్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు మిగిలే ఉన్నాయి. జట్టును పరిస్థితులకు తగ్గట్లుగా తయారు చేసి మేజర్ ఈవెంట్లలో గట్టి ప్రత్యర్థిగా బరిలోకి దించే కసరత్తు నిరంతరం చేస్తూనే ఉంటాం.ముఖ్యంగా మ్యాచ్‌ల్లో టీమ్ కాంబినేషనే అత్యంత కీలకమవుతుంది. గెలిచినపుడు పొంగిపోయినట్లే ఓడినపుడు కుంగిపోకుండా ఎక్కడ లోపం జరిగిందో దృష్టిపెట్టి అధిగమించాల్సి ఉంటుంది. -
‘మట్టి’లో మాణిక్యాలు
ఏ దేశంలోని మైదానంలోనైనా సరే.. ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తూ దూసుకెళ్లే భారత హాకీ జట్టు అంటే ప్రపంచ దేశాలకు హడల్.. ఆసియా ఛాంపియన్ ట్రోఫీలతో పాటు ఒలింపిక్స్‌లోనూ భారత్ సత్తాచాటి ఎన్నో మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.. క్రికెట్‌తో పోలిస్తే మన దేశంలో జాతీయ క్రీడ హాకీకి ఆదరణ అంతంత మాత్రమే.. హాకీలో మహిళలు సైతం పతకాల పంట పండిస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నారు. దీంతో కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో హాకీ క్రీడకు కనీస సదుపాయాలు లేకపోయినా క్రీడాకారులు మాత్రం తగ్గేదే లే అన్నట్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ కోచింగ్ తీసుకుంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. టర్ఫ్ గ్రౌండ్స్‌ను అభివృద్ధి చేస్తే మరింత ప్రాక్టీస్ చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల వేట కొనసాగిస్తామంటున్నారు హైదరాబాదీలు.. సికింద్రాబాద్ ఆర్ఆర్సీ గ్రౌండ్లో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్ –2024 పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లాలస తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా, మరో ఇద్దరు సోదరీమణులు భవిష్య, చరిత్ర తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాలస ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) క్యాంపులో ఉంటూ ప్రాక్టీస్ చేస్తోంది. భవిష్య, చరిత్ర కేరళలో సాయ్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. హాకీ పట్ల ఉన్న మక్కువతో జాతీయ స్థాయికి ఎదిగిన క్రమంలో వీరు పడ్డ కష్టాలు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే..కేరళలో శిక్షణ పొందుతున్నాం: భవిష్య, చరిత్ర మల్కాజిగిరికి చెందిన సందీప్ రాజ్ తెలంగాణ మాస్టర్స్ హాకీ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన ఇద్దరు కుమార్తెలు భవిష్య, చరిత్ర తెలంగాణ బాలికల జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక కీస్ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన భవిష్య, చరిత్ర తొలినాళ్లలో జింఖానా మైదానంలో కోచ్ కామేశ్ శిక్షణలో హాకీ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. కేరళలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం అక్కడే ఉండి శిక్షణ తీసుకుంటున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న వీరు అక్కడి రాష్ట్ర భాష మళయాళీ నేర్చుకుని మరీ పరీక్షలకు హాజరవుతున్నారు. తన ఇద్దరు కూతుళ్లు ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. ఆట కోసం ఒడిశా వెళ్లా: లాలస సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని ఆక్సిల్లమ్ స్కూల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. స్థానిక జింఖానా మైదానంలో హాకీ శిక్షణ తీసుకున్నా. కోచ్ కామేశ్ ప్రోత్సాహంతో ఆటలో నైపుణ్యం సాధించా.. హైదరాబాద్‌లో టర్ఫ్ కోర్టులు అందుబాటులో లేకపోవడంతో గ్రావల్ (కంకర మట్టి) కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఉత్తమమైన శిక్షణ కోసం తొలుత బెంగళూరుకు వెళ్లా. పదో తరగతి పరీక్షలు అక్కడే రాయాల్సి వచ్చింది. స్థానిక భాష కన్నడ నేర్చుకుని మరీ పదో తరగతిలో పాసయ్యా. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నవల్ టాటా క్రీడాప్రాంగణంలో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రముఖ హాకీ క్రీడాకారుడు భారత జాతీయ జట్టు మాజీ కెపె్టన్, గోల్ కీపర్ శ్రీజేశ్ ద్వారా స్ఫూర్తి పొంది గోల్ కీపర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యం. తండ్రి జగన్, తల్లి ప్రోత్సాహం ఉంది. ఇప్పటి వరకు మూడు జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. -
మహిళల హాకీ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ సత్తా
-
రాణి రాంపాల్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ
భారత హాకీ స్టార్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రాణి రాంపాల్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అసమాన ప్రతిభకు జెర్సీ నంబర్ 28 చిరునామాగా మారిందని ఆయన అన్నారు. 29 ఏళ్ల రాణి భారత మహిళల హాకీ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సారథ్యంలోనే టోక్యో ఒలింపిక్స్‌లో జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ‘భారత హాకీలో అసమాన ప్రతిభ, అత్యున్నత స్థాయి లక్ష్యాలకు నీ 28 నంబర్ జెర్సీ చిరునామాగా నిలిచింది. ఇకపై మైదానంలో ఆ ఆట కనిపించకపోవచ్చు గానీ ఒక అత్యుత్తమ క్రీడాకారిణిగా నువ్వు అందించిన జ్ఞాపకాలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచి ఉంటాయి. అతి పిన్న వయసులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నువ్వు నీ ఆటతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించావు. సారథిగా ముందుండి నడిపించిన నువ్వు ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా కొత్త బాధ్యతతో ఆటలోనే కొనసాగడం సంతోషకరం’ అని మోదీ తన సోషల్ మీడియా ద్వారా అభినందించారు. -
భారత్‌కు పెద్ద దెబ్బ
ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత మూడో మెగా ఈవెంట్ కామన్వెల్త్ క్రీడలు. ఇందులో భారత క్రీడాకారులు ప్రతీసారి పెద్ద సంఖ్యలో పతకాలు పట్టుకొస్తున్నారు. పతకాల పట్టికలోనూ క్రమంగా పుంజుకుంటూ టాప్–10, టాప్–5 స్థానాల్లో పదిలంగా నిలుస్తున్నారు. అలాంటి మెగా ఈవెంట్లో ఇకపై పతకాల వేట, పోడియం వద్ద మువ్వన్నెల పతాకం రెపరెపలాడటం కష్టంగా మారనుంది. భారత్ అత్యధికంగా గెలిచే అవకాశాలున్న క్రీడాంశాలను ఆతిథ్య దేశం పెద్ద సంఖ్యలో తొలగించడం మన క్రీడాకారులకు నిజంగా గుండెకోతనే మిగల్చనుంది. ఓవరాల్‌గా పతకాల వేటకు పెద్ద దెబ్బ తగలనుంది. లండన్: మరో రెండేళ్లలో జరగబోయే కామన్వెల్త్ క్రీడలు భారత శిబిరాన్ని ఇప్పటి నుంచే నిరాశలో ముంచేశాయి. భారత క్రీడాకారులు పతకాలు కచ్చితంగా గెలిచే క్రీడాంశాలను ఆతిథ్య దేశం స్కాట్లాండ్ తొలగించింది. గ్లాస్గోలో 2026లో జరిగే ప్రసిద్ధ కామన్వెల్త్ పోటీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పరిమితంగా పదే పది క్రీడాంశాలతో మమ అనిపించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ సిద్ధమైంది. గత బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను 19 క్రీడాంశాలతో నిర్వహించారు. ఇప్పుడు ఇందులో 9 క్రీడాంశాలకు కోత పెట్టారు. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను తప్పించారు. షూటింగ్‌ను బర్మింగ్‌హామ్‌లోనే పక్కన బెట్టారు. తాజా తొలగింపుతో హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు నిరాశే మిగిలింది. ఎందుకంటే భారత్ కచ్చితంగా ఈ ఐదు ఈవెంట్లలో పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. బర్మింగ్‌హామ్‌లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 30 పతకాలు ఆ ఈవెంట్లలోనే గెలుపొందడం విశేషం. అంటే దాదాపు సగం పతకాలను ఇకపై భారత్ కోల్పోనుండటం ఎదురుదెబ్బగా భావించవచ్చు. బడ్జెటే ప్రతిబంధకమా? నిజానికి 2026 క్రీడలు ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరగాలి. అయితే అంచనాలను మించిపోతున్న బడ్జెట్ కారణంతో విక్టోరియా వైదొలగింది. దీంతో నిర్వహణకు గ్లాస్గో (స్కాట్లాండ్) ముందుకొచ్చిం ది. అయితే ఈ దేశం కూడా వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, అధికారులు వారికి కల్పించాల్సిన వసతులు, సదుపాయాల గురించి పెద్ద కసరత్తే చేసింది.అధిక సంఖ్యలో క్రీడాంశాల్ని నిర్వహించాలంటే వేదికల సంఖ్య కూడా పెంచాలి. అంటే అక్కడికి అథ్లెట్లు, అధికారిక గణాన్ని తరలించేందుకు రవాణా (లాజిస్టిక్స్) తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని భారీ ఖర్చుల్ని తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చిం ది. ఓ పరిమిత బడ్జెట్‌తో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకే 11 మందితో బరిలోకి దిగే పలు టీమ్ ఈవెంట్లతో పాటు మొత్తం 9 క్రీడాంశాలను తొలగించేసింది. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య నియమావళి ప్రకారం ఆతిథ్య వేదికకు ఆ వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అనుసరించి కేవలం నాలుగే వేదికల్లో పది క్రీడాంశాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా స్కాట్లాండ్ ప్రభుత్వం మోపెడు ఖర్చును తగ్గించి అనుకున్న బడ్జెట్‌లోపే ఈవెంట్ ను నిర్వహించాలనుకుంటుంది. ఆడించే 10 క్రీడాంశాలు ఇవే... అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జూడో, లాన్ బౌల్స్, 3్ఠ3 బాస్కెట్‌బాల్ క్రీడాంశాలతోనే గ్లాస్గో ఈవెంట్ జరుగుతుంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, లాన్ బౌల్స్ క్రీడాంశాల్లో దివ్యాంగ అథ్లెట్ల కోసం కూడా పోటీలు ఉంటాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. తొలగించిన క్రీడాంశాలు... హాకీ, క్రికెట్ టీమ్ ఈవెంట్లతో పాటు బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ (టీటీ), స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను గ్లాస్గో నిర్వాహక కమిటీ పక్కన బెట్టింది.2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గెలిచిన పతకాలు రెజ్లింగ్ (12), వెయిట్‌లిఫ్టింగ్ (10), అథ్లెటిక్స్ (8), టేబుల్ టెన్నిస్ (7), బ్యాడ్మింటన్ (6), జూడో (3), బాక్సింగ్ (7), హాకీ (2), లాన్ బౌల్స్ (2), స్క్వాష్ (2), క్రికెట్ (1), పారా పవర్‌లిఫ్టింగ్ (1).బ్యాడ్మింటన్‌ను తొలగించాలనే గ్లాస్గో నిర్ణయం నన్ను కలవరపాటుకు గురిచేసింది. తీవ్ర నిరాశలో ముంచింది. క్రీడల్లో ప్రగతి సాధించే భారత్‌లాంటి దేశాలకు ఇది గొడ్డలిపెట్టు. మన షట్లర్లు ఈ క్రీడాంశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అంతర్జాతీయ వేదికలో సత్తా చాటుకునే అవకాశాన్ని ఇలా కాలరాయడం నిజంగా దురదృష్టకరం. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఇంకెందుకు కామన్వెల్త్ గేమ్స్? పూర్తిగా ఈవెంట్‌నే పక్కన బెట్టేయండి. కేవలం ఒలింపిక్స్, ఆసియా క్రీడలతోనే సరిపెట్టుకుందాం. ఎందుకంటే కీలకమైన ఆటల్ని తొలగించడం వల్ల కామన్వెల్త్ ప్రభ కోల్పోతుంది. వారి నిర్ణయం నన్ను నిర్ఘాంత పరిచింది. ఇక మనం మన జట్టును కామన్వెల్త్ గేమ్స్‌కు పంపించాల్సిన అవసరమే లేదు. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ గ్లాస్గో నిర్వహించే పది క్రీడల్లో టేబుల్ టెన్నిస్ లేకపోవడం బాధాకరం. ఇదొక్కటే కాదు, తొలగించిన అన్ని క్రీడాంశాల ఆటగాళ్లకు ఎదురుదెబ్బ. ముఖ్యంగా టీటీలో మనం ఎన్నో స్వర్ణాలు గెలిచాం. –శరత్ కమల్, భారత టీటీ దిగ్గజం -
CWG 2026: మనకే దెబ్బ!.. ఎందుకిలా చేశారు?
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నుంచి కీలక క్రీడాంశాలను ఎత్తివేసింది నిర్వాహక బృందం. 2026లో గ్లాస్గో వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నుంచి క్రికెట్, హాకీ, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రోడ్ రేసింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్ని తొలగించారు. ఈ నేపథ్యంలో పతకాల పట్టికలో భారత్ వెనుకబడే అవకాశం ఉంది.మనకే దెబ్బ! తీవ్ర ప్రభావంఎందుకంటే.. హాకీ, క్రికెట్(మహిళలు), బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్లలోనే మనకు ఎక్కువ పతకాలు వస్తున్నాయి. ముఖ్యంగా షూటింగ్లో అత్యధికంగా ఇప్పటి వరకు 135 కామన్వెల్త్ మెడల్స్ గెలిచింది భారత్. ఇందులో 63 పసిడి పతకాలు ఉండటం విశేషం. మరోవైపు.. రెజ్లింగ్‌లోనూ వివిధ విభాగాల్లో 114 మెడల్స్ దక్కాయి.బడ్జెట్‌ను తగ్గించుకోవడం కోసమే!వచ్చే కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఈ రెండింటిని తొలగించారు గనుక భారత్‌కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేర క్రీడల్ని తొలగించడానికి ప్రధాన కారణం బడ్జెట్‌ను తగ్గించుకోవడం కోసమే అని తెలుస్తోంది. గతంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో అత్యధికంగా 10 క్రీడలు మాత్రమే నిర్వహించేవారు. అయితే, 1998 తర్వాత 15- 20 క్రీడలను అదనంగా చేర్చారు.నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్అయితే, గ్లాస్గోలో పాత పద్ధతినే ఫాలో అయ్యేందుకు నిర్వాహకులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తక్కువ క్రీడలు ఉంటే తక్కువ వేదికలు మాత్రమే అవసరమవుతాయి.. ఫలితంగా తక్కువ ఖర్చుతో మెగా ఈవెంట్‌ను పూర్తి చేయవచ్చని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కేవలం నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్ నిర్వహించనున్నారు.స్కాట్స్టౌన్ స్టేడియం, టోల్క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్, కామన్వెల్త్ ఎరీనా/సర్ క్రిస్ హోయ్ వెలడ్రోమ్, స్కాటిష్ ఈవెంట్స్ క్యాంపస్‌లను వేదికలుగా ఎంపిక చేశారు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాదు. భవిష్యత్తులో మరిన్ని క్రీడలను చేర్చే, తొలగించే వెసలుబాటు ఆతిథ్య దేశాల కమిటీలకు ఉంటుంది. తమ దేశ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వీలుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో ఉండబోయే క్రీడలు👉అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్👉స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్👉ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్👉ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్👉నెట్‌బాల్👉వెయిట్‌లిఫ్టింగ్, పారా వెయిట్‌లిఫ్టింగ్👉బాక్సింగ్👉జూడో👉బౌల్స్, పారా బౌల్స్👉3*3 బాస్కెట్‌బాల్, 3*3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్.చదవండి: Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే -
‘కామన్వెల్త్’ నుంచి హాకీ, రెజ్లింగ్ అవుట్!
వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో హాకీతోపాటు షూటింగ్, రెజ్లింగ్, క్రికెట్ తదితర పదమూడు క్రీడాంశాలను పక్కన బెట్టాలని నిర్వాహకులు చూస్తున్నారు. ఈ అంశంపై కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ బయటికి మాత్రం వెల్లడించడం లేదని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కాగా 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీని చేర్చాక ఇప్పటివరకు ఆ క్రీడను కొనసాగించారు.అయితే 2026లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే గ్లాస్గో (స్కాట్లాండ్) బడ్జెట్‌ను తగ్గించుకునే పనిలో భాగంగా హాకీకి మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 19 క్రీడాంశాలను నిర్వహించగా, వీటిని కుదించాలని గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కేవలం నాలుగు వేదికల్లో కుదించిన క్రీడాంశాలను నిర్వహించడం ద్వారా బడ్జెట్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చని భావిస్తోంది.ఇక 2026 ఏడాదిలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉండగా, రెండు వారాల్లోపే ప్రపంచకప్ హాకీ కూడా ఉండటం కూడా సాకుగా చూపే అవకాశముంది. బెల్జియం, నెదర్లాండ్స్‌లు సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ హాకీ టోర్నీ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. హాకీ ఆటను తొలగించాలనుకుంటున్న వార్తలపై స్పందించిన ఎఫ్ఐహెచ్ త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పింది. మంగళవారం క్రీడాంశాల విషయమై ప్రకటన వెలువడుతుందని చెప్పింది. 2022 బరి్మంగ్‌హామ్ గేమ్స్‌లో పురుషుల విభాగం ఆస్ట్రేలియా జట్టుకు స్వర్ణం లభించగా... భారత జట్టుకు రజతం దక్కింది. కాగా తొలగించేక్రీడల జాబితాలో హాకీ, క్రికెట్, రగ్బీ సెవన్స్, డైవింగ్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, రోడ్ సైక్లింగ్, మౌంటేన్బైకింగ్, రిథమిక్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్ , టేబుల్ టెన్నిస్/పారా టేబుల్ టెన్నిస్, ట్రైయథ్లాన్/పారాట్రైయథ్లాన్, రెజ్లింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్‌కు భారత జట్టు ప్రకటన -
పంచాయతీ సభ్యురాలికి ఘోర అవమానం
తాపీ: గుజరాత్‌లోని తాపీ జిల్లాలో పంచాయతీ సభ్యురాలిపై దాడి జరిగింది. తన భర్తతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నదంటూ ఓ మహిళ.. పంచాయతీ సభ్యురాలిపై దాడికి తెగబడింది. అంతటితో ఆగక ఆమె జుట్టును కూడా కత్తిరించింది. ఈ అమానవీయ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే సోంగాఢ్ పంచాయతీ సభ్యురాలైన ఊర్మిళ గమిత్‌పై ఒక మహిళతోపాటు మరో ముగ్గురు హాకీ స్టిక్‌లతో దాడి చేసి, ఆమె జుట్టును కత్తిరించారని సోంగాధ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఆమెపై దాడి చేశారు.పంచాయతీ సభ్యురాలు ఊర్మిళపై శోభనా గమిత్ అనే మహిళ, ఆమె కుమారుడితో పాటు వచ్చిన కొందరు వ్యక్తులు కలసి దాడి చేశారు. ఈ దాడిలో ఊర్మిళ ఎడమ చేతి ఎముక విరిగిందని, నడుము, తలపై గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న బంగారు లాకెట్‌ను నిందితులు లాక్కొని పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఊర్మిళను వైద్య చికిత్స కోసం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఊర్మిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నదని శోభనా గమిత్ పోలీసుల ఎదుట ఆరోపించింది. కాగా ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశామని, సంఘటనా స్థలంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: హస్తినలో ‘అమర’ ప్రేమికుడు! -
భారత్‌పై అక్కసు తీర్చుకున్న పాక్ హాకీ జట్టు!
పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చైనాను 1-0 గోల్స్ తేడాతో ఓడించి ఐదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై న్యారో మార్జిన్‌తో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన తుది సమరంలో జుగ్రాజ్ సింగ్ 51వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. భారత్ ఇదే లీడ్‌ను చివరి వరకు కొనసాగించి విజేతగా నిలిచింది.చైనాకు మద్దతుగా పాక్ ఆటగాళ్లుఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు చైనాకు మద్దతుగా నిలిచి అబాసుపాలయ్యారు. పాక్ ఇదే టోర్నీ సెమీఫైనల్లో చైనా చేతిలో ఘోరంగా ఓడింది. అయినా పాక్ ఆటగాళ్లు నిసిగ్గుగా చైనా జెండాలు పట్టుకుని వేలాడారు. వారు ఏకంగా చెంపలపై చైనా జెండా స్టిక్కర్లు అంటించుకుని మద్దతు తెలిపారు. తాము మద్దతు తెలిపినా చైనా ఓడిపోవడంతో పాక్ ఆటగాళ్లు దిగాలుగా ఉండిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతుండటంతో భారత అభిమానులు పాక్‌ను ఆటాడేసుకుంటున్నారు. వారి బుద్ధే అంతా చీవాట్లు పెడుతున్నారు. కాగా, సెమీస్‌లో చైనా చేతిలో ఓడిన పాక్ మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కొరియాపై 5-2 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన అనంతరమే పాక్ ఆటగాళ్లు నేరుగా వచ్చి భారత్-చైనా ఫైనల్ మ్యాచ్ వీక్షించారు. India's Asian Champions Trophy heroes rewarded! 🏆🇮🇳The victorious Indian Men's Hockey Team gets a well-deserved bonus for their record 5th title win! Each player will receive ₹3 lakhs, while support staff members will be awarded ₹1.5 lakhs each.This well-deserved reward… pic.twitter.com/cvI8avkpvx— Hockey India (@TheHockeyIndia) September 17, 2024చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా -
భారత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. దక్షిణ కొరియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు, స్ట్రయికర్ అరైజీత్ సింగ్ హుండల్ ఓ గోల్ చేశారు. కొరియా చేసిన ఏకైక గోల్‌ను జిహున్ యంగ్ సాధించాడు. భారత్ తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. భారత్ ఈ టోర్నీలో ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో చైనాపై 3-1 గోల్స్ తేడాతో.. రెండో మ్యాచ్‌లో జపాన్‌పై 5-1 గోల్స్ తేడాతో.. మూడో మ్యాచ్‌లో మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ ఈ టోర్నీలో జయకేతనం ఎగురవేసి రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి టైటిల్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. -
రాజ్ కుమార్ హ్యాట్రిక్.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్
చైనా వేదికగా జరుగుతున్న హీరో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను 3-0 తేడాతో మట్టికరిపించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్ను 5-1 తేడాతో చిత్తు చేసింది. తాజాగా మలేసియాపై 8-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.రాజ్ కుమార్ హ్యాట్రిక్మలేసియాతో మ్యాచ్‌లో రాజ్ కుమార్ పాల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఆట 3, 25, 33వ నిమిషాల్లో రాజ్ కుమార్ గోల్స్ చేశాడు. భారత్ తరఫున రాజ్ కుమార్‌తో పాటు అరైజీత్ సింగ్ హుండల్ 6, 39 నిమిషంలో, జుగ్రాజ్ సింగ్ 7వ నిమిషంలో, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో, ఉత్తమ్ సింగ్ 40వ నిమిషంలో గోల్స్ సాధించారు. మలేసియా సాధించిన ఏకైక గోల్‌ను అకీముల్లా అనువర్ 34వ నిమిషంలో సాధించాడు.ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా, పాకిస్తాన్లతో తలపడనుంది. కొరియాతో మ్యాచ్ సెప్టెంబర్ 12న.. పాక్‌తో మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనున్నాయి. చదవండి: స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ -
ముగ్గురు పాక్ హాకీ ప్లేయర్లపై జీవితకాల నిషేధం
లాహోర్: ముగ్గురు పాకిస్తాన్ హాకీ ఆటగాళ్లు సహా ఒక ఫిజియోథెరపిస్ట్‌పై ఆ దేశ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) జీవితకాల నిషేధం విధించింది. ఈ నలుగురు ఒక యూరోపియన్ దేశంలో రాజకీయ పీడిత శరణార్థిగా ఆశ్రయం కోరారు. దీంతో ఆగ్రహించిన పీహెచ్ఎఫ్ ఆ నలుగురుపై కఠిన నిర్ణయం తీసుకుంది. ప్లేయర్లు ముర్తజా యాకుబ్, ఎతేషామ్ అస్లామ్, అబ్దుర్ రహ్మాన్, ఫిజియో వకాస్ గత నెల నెదర్లాండ్స్, పొలాండ్లలో జరిగిన నేషన్స్ కప్ ఆడేందుకు జట్టుతో పాటు వెళ్లారు.తిరిగొచ్చాక ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కోసం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఆ నలుగురు వ్యక్తిగత కారణాలతో గైర్హాజరు అయ్యారు. అనంతరం వారంతా నేషన్స్ కప్ ఆడేందుకు వెళ్లొచ్చిన షెన్జెన్ వీసా (ఐరోపాయేతర పౌరులకు 90 లేదా 180 రోజుల వ్యవధి కోసం మంజూరు చేసే తాత్కాలిక వీసా)తో మళ్లీ నెదర్లాండ్స్‌కు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందారు. ఇది తమ దేశానికి తలవంపు మాత్రమే కాదు... భవిష్యత్తులో యూరోపియన్ దేశాలకు వీసాలు దరఖాస్తు చేసే వారందరికీ ఇది పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఆయా దేశాల్లో జరిగే ఈవెంట్ల కోసం ఇకపై తమ దరఖాస్తులు ఆమోదం పొందడం క్లిష్టతరమవుతుందని పీహెచ్ఎఫ్ కార్యదర్శి రాణా ముజాహిద్ వాపోయారు. -
శ్రీజేష్‌కు రూ.2 కోట్ల భారీ నజరానా.. ప్రకటించిన కేరళ సర్కార్
భారత స్టార్ హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత శ్రీజేష్ అంతర్జాతీయ హాకీకీ విడ్కోలు పలికాడు.ఈ నేపథ్యంలో శ్రీజేష్‌కు కేరళ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అతడికి రూ.2 కోట్ల నగదు బహుమతి ఇవ్వునున్నట్లు కేరళ సర్కార్ వెల్లడించింది. బుధవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.‘భారత హాకీ జట్టులో సభ్యుడు, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన శ్రీజేశ్కు రెండు కోట్ల రూపాయలు బహుమతిగా అందిస్తున్నాం’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. ప్యారిస్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్‌కు ఎక్స్ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. కాగా తన 18 ఏళ్ల కెరీర్లో శ్రీజేష్ భారత్ తరఫున 336 మ్యాచ్‌లు ఆడాడు. -
పడి.. లేచి.. మరో పతకం వైపు...
2023 మార్చి... సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్‌లో భారత జట్టు అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. పేలవ ఆటతో సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచిన టీమ్... గతంలో ఏ ఆతిథ్య జట్టూ ఎదుర్కోని అవమానాన్ని భరించాల్సి వచ్చింది. దాంతో మరోసారి భారత హాకీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. దాదాపు రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన జట్టు ఇదేనా అనిపించింది. అప్పుడప్పుడే మళ్లీ ఆటపై ఆసక్తి పెరుగుతున్న దశలో స్వదేశంలో జట్టు ఆట మళ్లీ నిరాశపర్చింది. దాంతో సహజంగానే జరిగిన మార్పుల్లో భాగంగా ముందుగా కోచ్ గ్రాహం రీడ్‌పై వేటు పడింది. కొత్త కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రెయిగ్ ఫుల్టన్ వచ్చాడు. ఆటగాడిగా, కోచ్‌గా విశేష అనుభవం ఉన్న అతను భారత జట్టును మళ్లీ దారిలోకి తీసుకురాగలడని అంతా భావించారు. ఈ నమ్మకాన్ని ఫుల్టన్ నిలబెట్టుకున్నాడు. తనదైన శైలిలో ఆటగాళ్లను మరింత పదునుగా మార్చే పనిలో పడ్డాడు. అప్పటికే సీనియర్లుగా దేశం తరఫున ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు ఆడిన వారిని కూడా తనకు కావాల్సిన రీతిలో మలచుకున్నాడు. ముఖ్యంగా అవుట్‌ఫీల్డ్‌లో వేగం పెంచడం, ఆరంభం నుంచే దూకుడు పెంచి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడంవంటి విషయంలో ఆటగాళ్లలో కొత్త తరహా ఆటను తీసుకొచ్చాడు. ముందుగా ఆటగాళ్లు కొంత ఇబ్బంది పడ్డా మెల్లగా ఇవి మంచి ఫలితాలు అందించాయి.ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణాలు గెలిచిన భారత్ ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆటగాళ్లందరిలోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. వరల్డ్ కప్ వైఫల్యాన్ని దాటి మున్ముందు పెద్ద విజయం సాధించాలనే కసి, పట్టుదల వారిలో పెరిగాయి. ఒలింపిక్స్‌లో భారత జట్టు ఆట చూస్తే ఫుల్టన్ ప్రణాళికలు ఎంత అద్భుతంగా పని చేశాయో తెలుస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఒకే తరహా ఆటతో కాకుండా వేర్వేరు ప్రత్యర్థుల కోసం జట్టు వేర్వేరు వ్యూహాలు పన్నింది. బెల్జియం జట్టు తమ డిఫెన్స్‌ను పటిష్టంగా ఉంచుకుంటూనే దూకుడుగా ఆడింది. అదే ఆ్రస్టేలియాపై వచ్చేసరికి ఆట మారింది. క్షణకాలం డిఫెన్స్‌లో పడినా ప్రత్యర్థి పైచేయి సాధిస్తుందని తెలుసు కాబట్టి తొలి నిమిషం నుంచి పూర్తిగా అటాకింగ్‌పైనే దృష్టి పెట్టింది. మళ్లీ బ్రిటన్‌తో మ్యాచ్ వచ్చేసరికి డిఫెన్స్‌కు కట్టుబడింది. ఒక ఆటగాడు తగ్గినా కీపర్‌తో కలిసి గోల్స్‌ను కాపాడుకోవడంలో జట్టు సఫలమైంది. సెమీస్‌లో జర్మనీతో ఓడినా గతంలో ఎన్నడూ చూడని అటాకింగ్, ఓటమిని అంగీకరించకుండా పోరాడే తత్వం మన టీమ్ నుంచి కనిపించిందని మాజీ ఆటగాడు వీరేన్ రస్కిన్హా వ్యాఖ్యానించడం విశేషం. క్షణాల వ్యవధిలో వ్యూహాలు మార్చుకోవడం, పరిస్థితికి అనుగుణంగా అప్పటికప్పుడు ఆటతీరును మలచుకోవడం గతంలో భారత జట్టు విషయంలో ఎప్పుడూ చూడనిది. భారత జట్టు గెలుపు మరో వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడు. అతనే ప్యాడీ ఆప్టన్. స్పోర్ట్స్ సైకాలిజిస్ట్ అయిన ఆప్టన్ భారత హాకీ ఆటగాళ్లను మానసికంగా సంసిద్ధం చేయడంలో, ఒత్తిడిని ఎదుర్కోకుండా బలంగా నిలబడే విషయంలో సరైన దిశలో తీర్చిదిద్దాడు. 2011లో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో భారత జట్టు ఇదే ఆప్టన్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌గా వ్యవహరించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కోచ్‌ల వ్యూహాలను అమలు చేసే విషయంలో ఆటగాళ్లు ఎక్కడా గతి తప్పలేదు. ఒలింపిక్స్‌తో రిటైర్ అవుతున్న గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడలా ప్రత్యర్థులను నిలువరించాడు. ఎనిమిది మ్యాచ్‌లలో అతను 62 షాట్లను ఎదుర్కొంటే 50 షాట్లను ఆపడం విశేషం. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీలను గోల్స్‌గా మలచడంలో అద్భుత నైపుణ్యం చూపిస్తూ ఒలింపిక్స్‌లో 10 గోల్స్ నమోదు చేశాడు. డిఫెండర్లు రోహిదాస్, జర్మన్‌ప్రీత్‌లు అద్భుతంగా ప్రత్యర్థి ఆటగాళ్లను అడ్డుకున్నారు. అత్యంత సీనియర్ అయిన మాజీ కెపె్టన్ మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ మిడ్‌ఫీల్డ్‌లో తన పదును చూపించగ, మరో సీనియర్ మన్దీప్ ఫార్వర్డ్‌గా జట్టును నడిపించాడు. అందరి సమష్టి ప్రదర్శన, పోరాటం, పట్టుదల భారత్‌కు వరుసగా రెండో కాంస్యాన్ని అందించాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులోని 11 మంది సభ్యులు ‘పారిస్’లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. –సాక్షి క్రీడా విభాగం జ్యోతికి మళ్లీ నిరాశ పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. వెనుకంజలో గోల్ఫర్లు పారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు. -
వహ్వా హాకీ.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం
టోక్యోలో అద్భుత ఆటతో అదరగొట్టిన భారత హాకీ జట్టు పారిస్ వరకు దానిని కొనసాగించింది. నాటి విజయం తర్వాత అంచనాలను పెంచిన మన టీమ్ ఈసారి కూడా దానికి తగినట్లుగా పతకాన్ని అందించింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి తమ సత్తాను చాటింది. 1952–1972 మధ్య వరుసగా ఒలింపిక్ మెడల్ పోడియంపై నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఎప్పుడూ వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు గెలవలేకపోయింది. ఈసారి మాత్రం గత ఒలింపిక్స్ కాంస్యపు ప్రదర్శనను పునరావృతం చేసింది. రెండు సందర్భాల్లోనూ జట్టు విజయాల్లో కీలకంగా నిలిచిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఈ గెలుపు తర్వాత ఘనంగా తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో భారత హాకీకిది 13వ పతకం కావడం విశేషం. పారిస్: మ్యాచ్‌లో 58 నిమిషాలు ముగిసేసరికి 2–1తో ఆధిక్యంలో భారత్... మరో రెండు నిమిషాలు బంతిపై పట్టు ఉంచుకుంటే చాలు మ్యాచ్ మనదే... అయితే సరిగ్గా 59వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దాంతో అందరిలో కాస్త ఆందోళన... గతంలో చాలా సందర్భాల్లో భారత జట్టు గెలిచే స్థితిలో ఉండి ఆఖరిలో పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్ ఇచ్చి మ్యాచ్ కోల్పోయింది. కాబట్టి కొంత ఉత్కంఠ! అయితే స్పెయిన్ ప్లేయర్ మిరాల్స్ ప్రయత్నాన్ని భారత గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుకున్నాడు. ఆ వెంటనే 60వ నిమిషంలో కూడా వారికి మరో పెనాల్టీ కార్నర్. ఈసారి కూడా శ్రీజేశ్ నిలువరించాడు. దాంతో పాటు చురుగ్గా ఉన్న మన ఆటగాళ్లు బంతిని అందుకొని తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. స్పెయిన్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించినా మళ్లీ మన సర్కిల్‌లోకి రాలేకపోయారు. అంతే... టీమిండియా బృందంలో సంబరాలు మొదలయ్యాయి. శ్రీజేశ్ తన కీపింగ్ పోస్ట్ వద్ద కుప్పకూలిపోగా... సహచరులంతా చుట్టుముట్టి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. సెమీస్‌లో అనూహ్యంగా ఓడినా... చివరకు కాంస్య పతకం గెలుచుకొని భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. ఈ ‘ప్లే ఆఫ్’ పోరులో భారత్ 2–1 గోల్స్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ (30వ నిమిషం, 33వ నిమిషం) సాధించగా... స్పెయిన్ తరఫున మార్క్ మిరాల్స్ (18వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. తాజా ఫలితంతో పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ఖాతాలో నాలుగో కాంస్యం చేరింది. సమష్టి ప్రదర్శనతో... 1980 తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయిన భారత్ 41 ఏళ్ల తర్వాత టోక్యోలో కాంస్యం గెలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ అదే తరహాలో భారతీయుల నమ్మకాన్ని జట్టు వమ్ము చేయలేదు. అటు అటాకింగ్‌లో, ఇటు డిఫెన్స్‌లో కూడా జట్టు ప్రభావం చూపించింది. సస్పెన్షన్ కారణంగా గత మ్యాచ్ ఆడని డిఫెండర్ అమిత్ ఈ మ్యాచ్‌లో తిరిగొచ్చి బలంగా నిలబడ్డాడు. 6వ నిమిషంలో సుఖ్‌జీత్‌కు గోల్ అవకాశం వచ్చినా అతను పోస్ట్‌కు దూరంగా కొట్టాడు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడటంతో గోల్ నమోదు కాలేదు. అయితే రెండో క్వార్టర్లో స్పెయిన్ శుభారంభం చేసింది. క్లేప్స్ను టాకింగ్ చేసే ప్రయత్నంలో ‘డి’లో మన్‌ప్రీత్ ఫౌల్ చేయడంతో స్పెయిన్ పెనాల్టీ స్ట్రోక్ లభించగా, దానిని మిరాల్స్ సులువుగా గోల్‌గా మలిచాడు. అయితే 21 సెకన్లలో రెండో క్వార్టర్ ముగుస్తుందనగా పెనాల్టీతో భారత్ స్కోరు సమం చేసింది. మరో మూడు నిమిషాలకే మళ్లీ పెనాల్టీ ద్వారానే హర్మన్ స్కోరు చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మన జట్టు దానిని చివరి వరకు నిలబెట్టుకోగా... ఆఖరి మూడు నిమిషాల్లో గోల్ కీపర్‌ను తప్పించి స్కోరును సమం చేసేందుకు స్పెయిన్ తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. తమకు లభించిన 6 పెనాల్టీ కార్నర్లను భారత్ 2 గోల్స్‌తో సద్వినియోగం చేసుకోగా... స్పెయిన్‌కు 9 పెనాల్టీలు లభించినా ఆ జట్టు ఒక్కదానినీ గోల్‌గా మలచలేకపోయింది.‘గ్రేట్ వాల్ ఆఫ్ భారత్’ శ్రీజేశ్ అద్భుత ప్రదర్శనే అందుకు కారణం. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు శ్రీజేశ్ ముందే ప్రకటించాడు. అతనికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు జట్టు సభ్యులు వెల్లడించారు. ఒక్కొక్కరికీ 15 లక్షలు ప్లేయర్లకు హాకీ ఇండియా నజరానా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు హాకీ ఇండియా వెల్లడించింది. ఒలింపిక్స్ హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు విశ్వక్రీడల్లో ఇది 13వ పతకం కావడం విశేషం. నెదర్లాండ్స్‌కు స్వర్ణం 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్ పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నెదర్లాండ్స్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3–1తో జర్మనీ జట్టుపై గెలిచింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. గతంలో నెదర్లాండ్స్ జట్టు 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లలో పసిడి పతకాలు సాధించింది. భారత జట్టు అత్యధికంగా 8 స్వర్ణాలు నెగ్గగా... నెదర్లాండ్స్, పాకిస్తాన్, బ్రిటన్, జర్మనీ జట్లు మూడు సార్లు చొప్పున బంగారు పతకాలు గెలిచాయి. నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించింది. –పీఆర్ శ్రీజేశ్ కాంస్యపతక పోరు మాకూ, మా దేశానికి ఎంతో కీలకం. ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫలితం మనకు అనుకూలంగా రాదు. భారత్ వరుసగా రెండు సార్లు పతకం సాధించడం గొప్ప విషయం. ఇది అంత సులువు కాదు. పెనాల్టీ కార్నర్లను మా బృందం చాలా అద్భుతంగా నిలువరించగలిగింది. హాకీపై ఆదరణ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా. –హర్మన్‌ప్రీత్ సింగ్, కెప్టెన్ఎన్నో తరాల పాటు గుర్తుంచుకునే ప్రదర్శన ఇది. భారత హాకీ జట్టు ఒలింపిక్ కాంస్యంతో మెరిసింది. ఇది వరుసగా రెండో పతకం కావడం మరింత ప్రత్యేకం. ప్రతిభ, పట్టుదలకు తోడు సమష్టి కృషి దీనిని అందించింది. ఆటగాళ్లకు నా అభినందనలు. ప్రతీ భారతీయుడికి మానసికంగా హాకీతో బలమైన బంధం ఉంది. ఈ విజయం వల్ల యువతలో ఆటపై మరింత ఆసక్తి పెరుగుతుంది. –నరేంద్ర మోదీ, ప్రధాని Harmanpreet Singh has 10 goals from 8 matches at the Paris Olympics. 🥶🇮🇳pic.twitter.com/Y7sxmI5jDF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024One of the crucial saves of PR Sreejesh. 🫡🇮🇳pic.twitter.com/2Qw7MghpqY— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024 -
కాంస్యం కోసం ఆఖరి పోరు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన భారత పురుషుల హాకీ జట్టు.. గురువారం కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా.. మంగళవారం సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి కాంస్య పతక పోరుకు చేరింది. మూడేళ్ల క్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకమే సాధించగా... వరుసగా రెండోసారి పోడియంపై నిలిచే అవకాశం టీమిండియా ముందుంది. జర్మనీతో సెమీఫైనల్లో భారత్ హోరాహోరీగా పోరాడి ఓడగా... మరో సెమీస్‌లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ పరాజయాం పాలైంది. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘రెడ్ కార్డు’కు గురై సెమీస్‌కు అందుబాటులో లేకుండా పోయిన డిఫెండర్ అమిత్ రోహిదాస్... ఈ మ్యాచ్‌లో ఆడనుండటం భారత్‌కు సానుకూలాంశం. జర్మనీతో పోరులో పెనాల్టీ కార్నర్ అవకాశాలను సది్వనియోగ పర్చుకోలేకపోయిన భారత్.. ఆ విషయంలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఈ టోరీ్నతో కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ మరోసారి కీలకం కానున్నాడు. ‘సెమీస్ పరాజయం చాలా బాధించింది. పసిడి నెగ్గే సువర్ణ అవకాశం చేజారింది. అయితే ఆ ఓటమిని మరిచి కాంస్య పతక పోరుపై దృష్టి పెట్టాం. దేశానికి పతకం అందించేందుకు ఇదే చివరి అవకాశం. అందుకే ప్రతి ఆటగాడు దీన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నాడు’అని శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వేదికగా స్పెయిన్‌తో భారత్ పది సార్లు తలపడగా.. అందులో ఏడింట గెలిచింది. ఒక మ్యాచ్ స్పెయిన్ నెగ్గగా.. మరో రెండు ‘డ్రా’గా ముగిశాయి. -
Paris Olympics 2024: సెమీస్‌లో.. భారత హాకీ జట్టు ఓటమి
పారిస్: నాలుగు దశాబ్దాల తర్వాత వరుసగా రెండోసారి ఒలింపిక్స్ సెమీఫైనల్‌కు చేరిన భారత పురుషుల జట్టు.. తుదిపోరుకు అర్హత సాధించడంలో మరోసారి విఫలమైంది. మంగళవారం హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆరంభం నుంచి ఆధిక్యంలో ఉండి.. టీమిండియా 2–3 గోల్స్‌తో జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (36వ నిమిషంలో) చెరో గోల్ చేశారు.జర్మనీ తరఫున పైలాట్ గోంజాలో (18వ నిమిషంలో), రుహెర్ క్రిస్టోఫర్ (27వ నిమిషంలో), మిల్కావు మార్కో (54వ నిమిషంలో) తలా ఒక గోల్ సాధించారు. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా.. జర్మనీ అనూహ్య గోల్‌తో ముందంజ వేయగా.. చివర్లో గోల్కీపర్ను తప్పించి అదనపు అటాకర్‌తో ప్రయతి్నంచినా భారత్ స్కోరు సమం చేయలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై విజయంతోనే మెడల్ దక్కించుకున్న టీమిండియా... ఈసారి మాత్రం అలాంటి ప్రదర్శన కనబర్చలేకపోయింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్ 4–0తో స్పెయిన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. -
PR Sreejesh: అలా సాగిన ప్రయాణం.. చివరికి భారత అత్యుత్తమ గోల్ కీపర్‌గా..
ఆ అబ్బాయి ముందుగా అథ్లెటిక్స్ను ఇష్టపడ్డాడు.. అందుకే స్ప్రింట్స్‌తో మొదలు పెట్టాడు.. కానీ కొద్ది రోజులకే అది బోర్ కొట్టేసింది.. దాంతో లాంగ్‌జంప్ బాగుంటుందనుకొని సాధన చేశాడు..తర్వాత అదీ నచ్చలేదు. ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని వాలీబాల్ వైపు వెళ్లాడు.. తనకంటే పెద్దవారైన కజిన్స్లో ఎక్కువ మంది వాలీబాల్ ఆడుతుండటంతో అది ఆకర్షించింది. ఈసారీ అదే తంతు. ఇక్కడ కూడా తాను ఆశించిన ఆనందం దక్కలేదు. అతనొక్కడే కాదు.. కేరళలో చాలామందికి ఇది అనుభవమే!అక్కడ పిల్లలంతా ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటారు. అన్ని ఆటల్లో తమ ప్రయత్నమేదో చేస్తూనే ఉంటారు. ప్రొఫెషనల్స్‌గా మారాలనో, లేక పైస్థాయికి చేరి గొప్ప ఆటగాళ్లుగా గుర్తింపు పొందాలనో కాదు.. అక్కడి సంస్కృతి అలాంటిది. ఆటల్లో వారికి ఆనందం కనిపిస్తుంది. ఆ కుర్రాడు కూడా అలాగే అన్ని ప్రయత్నాలూ చేస్తూ చివరకు 12వ ఏట తన అసలు మజిలీకి చేరుకున్నాడు. క్రీడాపాఠశాలలో చేరిన తర్వాత అతను పీఈటీ సూచన మేరకు హాకీని ఎంచుకున్నాడు. హాకీ ఆడితే ఎక్కడా ఉద్యోగం కూడా రాదని కొందరు పెద్దలు చెప్పినా.. అతను పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి ఆ ఆట నచ్చింది.కొన్నాళ్ల శిక్షణ తర్వాత హాకీలో తనకు గోల్ కీపింగ్ ఇంకా నచ్చింది. దాంతో పూర్తిస్థాయిలో గోల్ కీపర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అక్కడి నుంచి సాగిన ప్రయాణం భారత అత్యుత్తమ గోల్ కీపర్‌గా, ప్రపంచ హాకీలో అత్యుత్తమ గోల్ కీపర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకునే వరకు సాగింది. అతనే పరట్టు రవీంద్రన్ (పీఆర్) శ్రీజేశ్. సుదీర్ఘకాలంగా భారత హాకీ వెన్నెముకగా ఉంటూ పలు గొప్ప విజయాల్లో భాగంగా ఉన్న శ్రీజేశ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆట నుంచి తప్పుకోనున్నాడు. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు.శ్రీజేశ్లో ప్రతిభను గుర్తించిన కోచ్‌లు జయకుమార్, రమేశ్ కొలప్ప ముందుగా అతడిని హాకీ వైపు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో గోల్ కీపింగ్‌ను ఎంచుకోవడం వైపు మళ్లించారు. తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్ వారి కేంద్రం. అక్కడే ఓనమాలు నేర్చుకున్న శ్రీజేశ్ ఇప్పటికీ వారి పట్ల తన కృతజ్ఞతను చాటుతుంటాడు. ‘వారిద్దరు నాకు హాకీ నేర్పించారు. దాంతో పాటు ఇతర అంశాల వైపు మనసు మళ్లకుండా పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టేలా చేశారు. అన్నింటినీ మించి వారు ఇచ్చిన ఒక సలహా నా కెరీర్ ఆసాంతం పాటించాను.గోల్ కీపర్ కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఒక జట్టు గెలుపు, ఓటముల మధ్య అతనుంటాడు. కానీ గెలిస్తే అందరిలో ఒకడిగా చూస్తారు. ఓడితే మాత్రం తప్పు మొత్తం అతనిదే అంటూ కీపర్‌ను విలన్‌గా మారుస్తారు అని చెప్పారు. ఇది నేనెప్పటికీ మరచిపోలేను’ అని శ్రీజేశ్ చెప్పుకున్నాడు. ఇన్నేళ్ల కెరీర్లో సహజంగానే అప్పుడప్పుడు వైఫల్యాలు ఉన్నా.. గోల్ కీపర్ స్థానంలో అడ్డుగోడలా నిలబడి శ్రీజేశ్ అందించిన విజయాలెన్నో! ముఖ్యంగా అతి కీలక సమయాల్లో కూడా భావోద్వేగాలను ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉండే అతని శైలి ఇలాంటి విజయాలకు కారణమైంది.జూనియర్‌గా సత్తా చాటి..భారత హాకీ జట్టులో దాదాపుగా ఆటగాళ్లందరూ జూనియర్ స్థాయిలో మంచి ప్రదర్శన తర్వాత సీనియర్‌కు ప్రమోట్ అయినవారే. శ్రీజేశ్ కూడా అలాంటివారిలో ఒకడు.16 ఏళ్ల వయసులో అతను ఇండియా అండర్–21 టీమ్‌లో సభ్యుడిగా ఆస్ట్రేలియా పర్యటించాడు. అంతకు ముందు జాతీయ స్థాయిలో పాఠశాలల కోసం నిర్వహించే నెహ్రూ కప్‌లో సత్తా చాటడంతో అతనికి ఆ అవకాశం దక్కింది. నాలుగేళ్ల పాటు భారత జూనియర్ జట్టు తరఫున నిలకడగా రాణించిన శ్రీజేశ్ భారత్ ఆసియా కప్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి.. బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డునూ గెలుచుకున్నాడు. అయితే ఒకవైపు జూనియర్ టోర్నీల్లో ఆడుతూండగానే 18 ఏళ్ల వయసులో భారత సీనియర్ జట్టులోకి శ్రీజేశ్ ఎంపికయ్యాడు. 2006 దక్షిణాసియా (శాఫ్) క్రీడల్లో అతను మొదటిసారి భారత సీనియర్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు.పోటీని తట్టుకొని..శ్రీజేశ్ జట్టులోకి వచ్చేనాటికి ఇద్దరు సీనియర్ గోల్ కీపర్లు ఏడ్రియన్ డిసూజా, భరత్ ఛెత్రి టీమ్‌లో పాతుకుపోయారు. వారిని దాటి అవకాశం దక్కడం అంత సులువు కాదు. దాంతో అప్పుడప్పుడు ఒక్కో మ్యాచ్ దక్కడం మినహా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశమే రాలేదు. కానీ తన వంతు కోసం ఎదురు చూడటం మినహా ఏం చేయలేని పరిస్థితి. అయితే ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఒక కీలక మలుపు వస్తుంది. అలాంటి అవకాశం లభించినప్పుడు దానిని రెండు చేతులా సమర్థంగా ఒడిసిపట్టుకున్నవాడే పైకి ఎదుగుతాడు.శ్రీజేశ్కు అలాంటి చాన్స్ 2011లో చైనాలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను నిలువరించి అతను జట్టును గెలిపించాడు. దాంతో అందరి దృష్టీ అతనిపై పడింది. శ్రీజేశ్ గోల్ కీపింగ్ నైపుణ్యం గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఎప్పుడూ భారత జట్టు మ్యాచ్ ఆడినా ప్రాధాన్య క్రమంలో తొలి అవకాశం శ్రీజేశ్కే దక్కేది. ఆ తర్వాతే మరో గోల్ కీపర్ ఎవరైనా ఉంటే సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగేవాడు.వరుస ఘనతలు..2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో.. ఆడిన మూడు మ్యాచ్‌లనూ ఓడింది. దాంతో హాకీ ఇండియా సమూల మార్పులతో సిద్ధమైంది. సీనియర్లను వదిలి ఈ సంధి దశలో యువకులతో నిండిన టీమ్‌ను సిద్ధం చేసింది. వీరిలో అందరికంటే ముందు వరుసలో ఉన్న శ్రీజేశ్.. జట్టుకు కీలకంగా మారాడు. ఆపై అతని స్థాయిని పెంచిన టోర్నీ 2013 ఆసియా కప్ వచ్చింది. భారత్ రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో బెస్ట్ గోల్ కీపర్‌గా అతను అవార్డు అందుకున్నాడు. తర్వాతి ఏడాది ఆసియా క్రీడల్లో మరో అద్భుత ప్రదర్శన అతడి నుంచి వచ్చింది.పాకిస్తాన్లో జరిగిన ఫైనల్లో అతను రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను ఆపి జట్టుకు స్వర్ణపతకాన్ని అందించాడు. ఈ ప్రపంచ హాకీలో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పరిగణించే చాంపియన్స్ ట్రోఫీలో శ్రీజేశ్ రెండుసార్లు అత్యుత్తమ గోల్ కీపర్‌గా నిలిచాడు. 2015 హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ పోటీల్లో మూడో స్థానం సాధించడంలో కూడా కీపర్‌గా అతనికి ప్రధాన పాత్ర. 33 ఏళ్ల భారత జట్టు సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఈ టోర్నీలో శ్రీజేశ్ చూపించిన గోల్ కీపింగ్ ప్రదర్శన అసమానం. అసాధారణ రీతిలో కొన్ని పెనాల్టీ కార్నర్లు, స్ట్రోక్‌లను ఆపిన అతను పెనాల్టీ షూటౌట్లో నెదర్లండ్స్ వంటి నంబర్‌వన్ జట్టును నిలువరించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది.ఒలింపిక్స్ పతకాన్ని ముద్దాడి..భారత హాకీ చరిత్రలో నిస్సందేహంగా అత్యుత్తమ గోల్‌కీపర్‌గా శ్రీజేశ్ నిలుస్తాడు. పంజాబ్, హరియాణాలాంటి ఉత్తరాది జట్ల ఆటగాళ్లు శాసించే క్రీడలో ఒక కేరళ ఆటగాడు ఎదిగిన తీరు ఎంతో ప్రత్యేకం. 18 ఏళ్ల కెరీర్, 300కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు, నాలుగు ఒలింపిక్స్ అసాధారణం. చాంపియన్స్ ట్రోఫీలో రెండు రజతాలు, ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో రెండు రజతాలు, ఆసియా కప్‌లో రజతం, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో నాలుగు స్వర్ణాలు, రజతం గెలుచుకున్న భారత జట్లలో శ్రీజేశ్ సభ్యుడు. కానీ ఎన్ని గెలిచినా ఒక ఆటగాడి కల ఒలింపిక్స్ పతకం. 2016 రియో ఒలింపిక్స్‌లో శ్రీజేశ్ కెప్టెన్సీలో జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు రాగలిగింది.అయితే అసలు అద్భుతం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జరిగింది. మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో కాంస్యం సాధించి 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టుకు ఒలింపిక్స్‌లో పతకాన్ని అందించారు. ఇక్కడా శ్రీజేశ్దే ప్రధాన పాత్ర. జర్మనీతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో అతని గోల్ కీపింగ్‌ను చూస్తే ఈ పతకం విలువేమిటో తెలుస్తుంది. తమకంటే సీనియర్లు ఎంతో మంది సాధించలేని పతకాన్ని గెలుచుకున్న ఆనందం దక్కించుకున్న శ్రీజేశ్.. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొని రిటైర్ కాబోతున్నాడు. కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్‌రత్న పురస్కారాలు పొందిన శ్రీజేశ్ పౌర పురస్కారం పద్మశ్రీని కూడా అందుకున్నాడు. అతని ఘనతలకు కేరళ ప్రభుత్వం తగిన గౌరవాన్నిస్తూ ఎర్నాకుళంలోని అతని స్వస్థలం కిజకంబాలమ్లో ఒక రోడ్డుకు ‘ఒలింపియన్ శ్రీజేశ్ రోడ్’ అని పేరు పెట్టడం విశేషం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
విజయమే లక్ష్యంగా...
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన భారత పురుషుల హాకీ జట్టు అదే జోరును ‘పారిస్’లోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. నేడు జరిగే పూల్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా స్థాయికి తగ్గట్టు ఆడితే శుభారంభం చేస్తుంది. పూల్ ‘బి’లోనే డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ఆ్రస్టేలియా, అర్జెంటీనా, ఐర్లాండ్ జట్లున్నాయి. మరోవైపు పూల్ ‘ఎ’లో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ జట్లున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి టాప్–4లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధిస్తాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత భారత జట్టు వరుసగా అర్జెంటీనా (29న), ఐర్లాండ్ (30న), బెల్జియం (ఆగస్టు 1న), ఆ్రస్టేలియా (ఆగస్టు 2న) జట్లతో ఆడుతుంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెబుతానని ప్రకటించిన మేటి గోల్‌కీపర్ శ్రీజేశ్కు వీడ్కోలు కానుకగా పతకం అందించాలని హర్మన్‌ప్రీత్ బృందం పట్టుదలతో ఉంది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 105 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 58 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా...30 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ నెగ్గింది. 17 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. శనివారమే జరిగే ఇతర గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో అర్జెంటీనా... బెల్జియంతో ఐర్లాండ్ తలపడతాయి. గ్రూప్ ‘ఎ’లో బ్రిటన్‌తో స్పెయిన్; దక్షిణాఫ్రికాతో నెదర్లాండ్స్; జర్మనీతో ఫ్రాన్స్ ఆడతాయి. -
భారత్‌కు తొలి పరాజయం
ప్రొ హాకీ లీగ్ టోర్నీలో భారత పురుషుల జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. ఆ్రస్టేలియాతో గురువారం భువనేశ్వర్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–6 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ (12వ, 20వ ని.లో) రెండు గోల్స్ చేయగా... సుఖ్జీత్ (18వ ని.లో), మందీప్ (29వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్ (2వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జలెవ్‌స్కీ (40వ ని.లో), షార్ప్ (52వ ని.లో), అండర్సన్ (55వ ని.లో), జాక్ వెల్చ్ (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్ ఆడుతుంది. -
భారత్‌ను గెలిపించిన శ్రీజేశ్
పురుషుల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్’లో 4–2తో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో విజయం. ‘షూటౌట్’లో గోల్‌కీపర్ శ్రీజేశ్ నెదర్లాండ్స్ జట్టు రెండు ప్రయత్నాలను నిలువరించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. -
భారత్ శుభారంభం
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీని భారత జట్టు ఘనంగా మొదలు పెట్టింది. శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1 గోల్స్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ నిమిషం, 20వ ని.) రెండు గోల్స్ సాధించగా...జుగ్రాజ్ సింగ్ (24వ ని.), లలిత్ ఉపాధ్యాయ్ (50వ ని.) ఒక్కో గోల్ చేశారు. స్పెయిన్ ఆటగాళ్లలో మిరాలెస్ మార్క్ (34వ ని.) ఏకైక గోల్ కొట్టాడు. మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు ఇది 350వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. -
భారత్‌కు తొలి విజయం
భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భారత మహిళల జట్టు నాలుగో మ్యాచ్‌లో విజయం రుచి చూసింది. అమెరికా జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సవితా పూనియా బృందం 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున వందన కటారియా (9వ ని.లో), దీపిక (26వ ని.లో), సలీమా టెటె (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. అమెరికా జట్టుకు సేన్ కార్ల్స్ (42వ ని.లో) ఏకైక గోల్ అందించింది. భారత జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్లు, అమెరికా జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే రెండు జట్లు ఈ పెనాల్టీ కార్నర్లను వృథా చేశాయి. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో భారత్ మూడు పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. సోమవారం జరిగే ఐదో మ్యాచ్‌లో చైనాతో భారత్ ఆడుతుంది. -
టీమిండియా ఆటగాడిపై పోక్సో కేసు
భారత జాతీయ జట్టు హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 22 ఏళ్ల అమ్మాయి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుణ్‌పై కేసు నమోదు చేశారు. 2018లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వరుణ్.. అప్పటినుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను మైనర్‌నని (17 ఏళ్లు).. వరుణ్ స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణలో ఉన్నాడని యువతి ఫిర్యాదులో ప్రస్తావించింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వరుణ్ కోసం గాలిస్తున్నారు. వరుణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు కాకముందు వరకు వరుణ్ భువనేశ్వర్‌లోని జాతీయ శిక్షణా శిబిరంలో ఉన్నట్లు తెలుస్తుంది. 28 ఏళ్ల వరుణ్ కుమార్ భారత జాతీయ జట్టు తరఫున డిఫెండర్ స్థానంలో ఆడతాడు. 2017 నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో స్టాండ్‌బై సభ్యుడిగా ఉన్నాడు. జూనియర్ స్థాయి నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా తరఫున 142 మ్యాచ్‌లు ఆడిన వరుణ్ మొత్తం 40 గోల్స్ చేశాడు. -
Men's Hockey5s World Cup: క్వార్టర్ ఫైనల్లో భారత్ ఓటమి
మస్కట్: పురుషుల హాకీ ‘ఫైవ్–ఎ–సైడ్’ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు పతకం రేసులో నిలువలేకపోయింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 4–7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున రహీల్ మొహమ్మద్ (1వ, 7వ, 25వ ని.లో) మూడు గోల్స్ చేయగా... మందీప్ మోర్ (11వ ని.లో) ఒక గోల్ సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన భారత జట్టు 5 నుంచి 8 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌ల్లో భాగంగా కెన్యాతో జరిగిన పోరులో 9–4తో ఘనవిజయం సాధించింది. -
Men's Hockey5s World Cup: క్వార్టర్ ఫైనల్లో భారత్
మస్కట్: పురుషుల హాకీ ‘ఫైవ్–ఎ–సైడ్’ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. జమైకాతో జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 13–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున మణీందర్ సింగ్ (28వ, 29వ ని.లో), మంజీత్ (5వ, 24వ ని.లో), రహీల్ మొహమ్మద్ (16వ, 27వ ని.లో), మన్దీప్ మోర్ (23వ, 27వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. ఉత్తమ్ సింగ్ (5వ ని.లో), రాజ్‌భర్ పవన్ (9వ ని.లో), గుర్జోత్ సింగ్ (14వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. పూల్ ‘బి’లో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. -
రన్నరప్‌గా నిలిచిన భారత్
మస్కట్: మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని కెపె్టన్సీలోని భారత జట్టు 2–7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జ్యోతి ఛత్రి (20వ ని.లో), రుతుజా (23వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించింది. -
ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా.. నేడు పటిష్టమైన జర్మనీతో భారత్ 'ఢీ'
Women's Hockey Olympic Qualifiers: మరో మ్యాచ్ కోసం ఎదురు చూడకుండా... పటిష్టమైన జర్మనీపై గెలిచి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత మహిళల హాకీ జట్టు ఉంది. రాంచీలో జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఈరోజు జర్మనీతో భారత్; అమెరికాతో జపాన్ తలపడనున్నాయి. సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరిన రెండు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో ఓడిన జట్ల మధ్య మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టుకు మాత్రమే చివరిదైన మూడో బెర్త్ ఖరారవుతుంది. దాంతో భారత్‌తోపాటు మిగతా మూడు జట్లు కూడా సెమీఫైనల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. 2006 నుంచి జర్మనీతో ఏడుసార్లు తలపడ్డ భారత్ ఐదుసార్లు ఓడిపోయి, కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో జర్మనీపై గెలవాలంటే భారత్ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
సెమీస్‌లో భారత్.. ఒలింపిక్స్ బెర్త్ అవకాశాలు సజీవం
రాంచీ: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలను భారత మహిళల హాకీ జట్టు సజీవంగా నిలబెట్టుకుంది. ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సవితా పూనియా సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఇటలీ జట్టుతో జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ఉదిత రెండు గోల్స్ (1వ, 55వ ని.లో) చేయగా... దీపిక (41వ ని.లో), సలీమా టెటె (45వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (53వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఇటలీ జట్టుకు కామిలా మాచిన్ (ప్లస్ 60వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా 1–0తో న్యూజిలాండ్‌ను ఓడించింది. దాంతో గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అమెరికా 9 పాయింట్లతో టాపర్‌గా నిలువగా... రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ 6 పాయింట్లతో రెండో స్థానం సంపాదించి సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో జపాన్‌తో అమెరికా; జర్మనీతో భారత్ తలపడతాయి. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. -
పరాజయంతో మొదలుపెట్టిన భారత్.. ఆరు అవకాశాలు లభించినా..!
రాంచీ: మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీని భారత జట్టు ఓటమితో మొదలు పెట్టింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 0–1 తేడాతో అమెరికా చేతిలో పరాజయంపాలైంది. అమెరికా తరఫున 16వ నిమిషంలో తామెర్ అబిగైల్ ఏకైక గోల్ నమోదు చేసింది. తొలి క్వార్టర్ హోరాహోరీ సాగి ఒక్క గోల్ కూడా నమోదు కాకపోగా, రెండో క్వార్టర్ ఆరంభంలోనే యూఎస్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత భారత మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోరును సమం చేయలేకపోయారు. దురదృష్టవశాత్తూ ఆరు పెనాల్టీ అవకాశాలు వచ్చినా... ఒక్కదానిని కూడా గోల్‌గా మలచలేక భారత్ వృథా చేసుకుంది. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. -
భారత మహిళల ఓటమి
సాంటియాగో (చిలీ): హాకీ మహిళల జూనియర్ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్‌కు తర్వాతి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. టోర్నీ రెండో పోరులో జర్మనీ 4–3 గోల్స్ తేడాతో భారత మహిళల జట్టును ఓడించింది. భారత్ తరఫున అన్ను (11వ నిమిషం), రోప్నీ కుమారి (14వ ని.), ముంతాజ్ ఖాన్ (24వ ని.) గోల్స్ కొట్టగా...జర్మనీ తరఫున లౌరా ప్లూత్ (21వ నిమిషం, 36వ ని.), సోఫియా స్వాబ్ (17వ ని.), కరోలిన్ సీడెల్ (38వ ని.) గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్‌లోనే 2 గోల్స్ సాధించి ముందంజలో నిలిచిన భారత్ మ్యాచ్ అర్ధ భాగం ముగిసే సరికి కూడా 3–2తో ఆధిక్యంలోనే ఉంది. అయితే అనూహ్యంగా పుంజుకున్న జర్మనీ రెండో అర్ధభాగంలో రెండు నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ కొట్టింది. ఆఖరి క్వార్టర్లో ఇరు జట్లూ పోరాడినా ఒక్క గోల్ నమోదు కాకపోగా, జర్మనీ తమ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడుతుంది. -
జాతీయ హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్ర అమ్మాయి
వచ్చే నెలలో స్పెయిన్‌లో జరిగే ఐదు దేశాల హాకీ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా హాకీ ఇండియా (హెచ్ఐ) ఈనెల 22 నుంచి డిసెంబర్ 10 వరకు బెంగళూరులో జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించనుంది. 34 మందితో కూడిన బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఇతిమరపు రజని కూడా చోటు దక్కించుకుంది. ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత్‌తోపాటు ఐర్లాండ్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్ జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీ తర్వాత భారత్ జనవరిలో స్వదేశంలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో పోటీపడుతుంది. -
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా ప్రీతి
ఈనెల 29 నుంచి డిసెంబర్ 10 వరకు చిలీలో జరిగే జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హరియాణాకు చెందిన ప్రీతి కెపె్టన్‌గా వ్యవహరించనుంది. భారత జట్టు: ప్రీతి (కెప్టెన్), రుతుజా (వైస్ కెప్టెన్), ఖుష్బూ, మాధురి కిండో (గోల్‌కీపర్లు), నీలమ్, జ్యోతి, రోప్ని కుమారి, మహిమా టెటె, మంజూ చోర్సియా, జ్యోతి ఛత్రి, హీనా బానో, సుజాత కుజుర్, సాక్షి రాణా, ముంతాజ్ ఖాన్, అన్ను, దీపిక సోరెంగ్, మోనిక టొప్పో, సునెలితా. రిజర్వ్: నిరూపమా దేవి, ఈదుల జ్యోతి. -
ఛాంపియన్ భారత్
రాంచీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున సంగీత కుమారి (17వ ని.లో), నేహా (46వ ని.లో), లాల్రెమ్సియామి (57వ ని.లో), వందన కటారియా (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. Congrats to the 🇮🇳 Women’s 🏑 team as they beat 🇯🇵 4-0 in the final to win the Asian Champions Trophy at Ranchi. 7 matches,7 convincing wins. After the disappointment of missing out on the Asian Games🥇this will give the team huge confidence for the Olympic Qualifiers in 2024 pic.twitter.com/6XY2yPCc4m— Viren Rasquinha (@virenrasquinha) November 5, 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత్ నెగ్గడం ఇది రెండోసారి. 2016లో టీమిండియా తొలిసారి ఈ టైటిల్ సాధించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలిగా రూ. 3 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపింది. -
ఫైనల్లో భారత మహిళలు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ
రాంచీ: మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్‌లో భారత్ 2–0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. భారత్ తరఫున సలీమా టెటె 11వ నిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించగా...19వ నిమిషంలో పెనాల్టీ ద్వారా వైష్ణవి విఠల్ ఫాల్కే గోల్ నమోదు చేసింది. ఆసియా క్రీడల రజతపతక విజేత కొరియా తీవ్రంగా పోరాడినా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. మరో సెమీస్‌లో జపాన్ 2–1తో చైనాను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో చైనాతో భారత్ తలపడుతుంది. -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్‌ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
భారత్ 10, పాకిస్తాన్ 2
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను బలంగా దెబ్బ కొట్టింది. పూల్ ఎ మ్యాచ్‌లో భారత్ 10–2 గోల్స్ తేడాతో పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. అంతర్జాతీయ హాకీలో పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. 2017లో నమోదు చేసిన 7–1 స్కోరును భారత్ ఇక్కడ తిరగరాసింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్‌తో చెలరేగాడు. హర్మన్ 11వ, 17వ, 33వ, 34వ నిమిషాల్లో గోల్స్ కొట్టాడు. వరుణ్ కుమార్ 41వ, 54వ నిమిషాల్లో గోల్స్ సాధించగా...లలిత్ (49వ ని.), షంషేర్ (46వ ని.), సుమీత్ (30వ ని.), మన్దీప్ సింగ్ (8వ ని.) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ తరఫున అబ్దుల్ వహీద్ రానా (45వ ని.), సూఫియాన్ ఖాన్ (38వ ని.) ఒక్కో గోల్ నమోదు చేశారు. బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయం ముగ్గురు భారత బాక్సర్లు సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టి కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకున్నారు. 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో ఆమె 4–1తో జైనాశికర్బెకొవా (కజకిస్తాన్)ను ఓడించింది. తాజా ఫలితంతో ప్రీతి పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించడం విశేషం. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకం విజేత లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), పురుషుల విభాగంలో నరేందర్ (92 కేజీలు) సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్స్‌లో లవ్లీనా 5–0తో సియోంగ్ సుయాన్ (కొరియా)పై, నరేందర్ 5–0తో ఇమాన్ దిలావర్ (ఇరాన్)ను ఓడించారు. మీరాబాయి చానుకు నాలుగో స్థానం టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల కేటగిరీలో చాను నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం 191 కేజీల బరువెత్తిన చాను కాంస్యం కోసం ప్రయత్నిస్తూ చివరి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ గాయపడింది. 117 కేజీల క్లీన్ అండ్ జర్క్ లక్ష్యంగా ప్రయత్నిoచి వెనుక వైపుకు పడిపోయింది. దాంతో కోచింగ్ సిబ్బంది ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. వైద్య పరీక్షలు జరిపి ఆమె గాయం తీవ్రతను తెలుసుకుంటామని భారత అధికారులు వెల్లడించారు. ఫైనల్స్‌కు జ్యోతి క్వాలిఫై భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యెర్రాజి ఆసియా క్రీడల మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. హీట్స్‌ను ఆమె 13.03 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. మరో భారత అథ్లెట్ నిత్య రామ్రాజ్ కూడా ఇదే ఈవెంట్లో ఫైనల్స్‌కు క్వాలిఫై అయింది. లాంగ్‌జంప్‌లో కామన్వెల్త్ రజత పతక విజేత మురళీ శ్రీశంకర్ కూడా ముందంజ వేశారు. 7.97 మీటర్లు దూకిన మురళి అర్హత మార్క్ (7.90 మీటర్లు)ను సునాయాసంగా దాటి ఫైనల్స్‌కు చేరాడు. జెస్విన్ ఆల్డ్రిన్ కూడా భారత్ తరఫున ఫైనల్లో పోటీ పడనున్నాడు. 1500 మీటర్ల పరుగులో భారత్ తరఫున జిన్సన్ జాన్సన్, అజయ్ కుమార్ బరిలోకి దిగుతారు. -
Asian Games 2023 Hockey: సింగపూర్‌పై భారత ఘన విజయం..
చైనా వేదికగా జరగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత పురుషుల హాకీ జట్టు సత్తా చాటుతోంది. ప్రిలిమినరీ రౌండ్ పూల్-ఏ మ్యాచ్‌లో సింగపూర్‌పై 16-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత జట్టులో హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. ఓవరాల్‌గా హర్మన్ ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్ చేయగా.. మన్దీప్ సింగ్ మూడు, వరుణ్‌కుమార్, అభిషేక్ తలా రెండు గోల్స్ చేశారు. ఇక ఈ విజయంతో పూల్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్ధానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రతి పూల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. కాగా మొదటి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌ను 16-0 తేడాతో భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: World Cup 2023: భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు! -
Asia Cup 2023: పాక్‌పై టీమిండియా గెలుపు
ఆసియా కప్ 5s హాకీ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరిగిన ఫైనల్లో భారత్ 6-4 గోల్స్ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంలో భారత్, పాక్‌లు చెరి 4 గోల్స్ చేయడంతో పెనాల్టీ షూటౌట్స్ ద్వారా ఫలితం తేలింది. షూటౌట్స్‌లో భారత్ రెండు అటెంప్ట్స్‌ను గోల్స్‌గా మలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. 5s ఫార్మాట్లో భారత్ పాక్‌ను ఓడించడం మూడు సందర్భాల్లో ఇదే మొదటిసారి. India beat Pakistan in Men's Hockey 5s Asia Cup Final. pic.twitter.com/VyKC6aG06S — Azhutozh ⚕ (@azhutozh) September 2, 2023 సెకెండాఫ్‌లో 2-4 గోల్స్ తేడాతో వెనుకంజలో ఉండిన భారత్.. అనూహ్యంగా పుంజుకుని, షూటౌట్స్ వరకు వెళ్లి విజేతగా నిలిచింది. షూటౌట్స్‌లో పాక్ రెండు ప్రయత్నాల్లో విఫలం కాగా.. గుర్జోత్ సింగ్, మణిందర్ సింగ్‌లు తలో గోల్ చేసి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు భారత్ 2-4 గోల్స్‌తో వెనుకపడి ఉన్నప్పుడు మొహమ్మద్ రహీల్ 2 గోల్స్ చేసి, మ్యాచ్ డ్రా అయ్యేందుకు దోహదపడ్డాడు. Maninder Singh scores the second goal in shoot-out as India clinches Hockey 5s Asia Cup title defeating Pakistan. Both teams were 4-4 tied in normal time before India won the shootout 2-0.#Hockey5sAsiaCup #HockeyIndia pic.twitter.com/SWncUcVxnn — Pritish Raj (@befikramusafir) September 2, 2023 -
భారత్ ఘనవిజయం
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు ఖాతాలో రెండో విజయం చేరింది. మలేసియాతో ఆదివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 5–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సెల్వం కార్తీ (15వ ని.లో), హార్దిక్ సింగ్ (32వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ ని.లో), గుర్జంత్ సింగ్ (53వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు మొత్తం తొమ్మిది పెనాల్టీ కార్నర్లు రాగా అందులో మూడింటిని సది్వనియోగం చేసుకుంది. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. ఆదివారం జరిగిన మిగతా రెండు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. చైనా–కొరియా 1–1తో, పాకిస్తాన్–జపాన్ 3–3తో ‘డ్రా’ చేసుకున్నాయి. -
హ్యాట్రిక్ గోల్స్.. భారత మహిళల ఘన విజయం
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్నీ గోల్స్ తానే సాధించిన లాల్రెమ్సియామి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్ 13వ, 17వ, 56వ నిమిషాల్లో ఆమె మూడు ఫీల్డ్ గోల్స్ కొట్టింది. మొదటి, రెండో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించిన భారత్ చివరి క్వార్టర్లో మరో గోల్‌తో ముగించింది. ఈ టోరీ్నలో రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఇంగ్లండ్, స్పెయిన్లతో తొలి రెండు మ్యాచ్‌లను భారత్ ‘డ్రా’గా ముగించింది. సవితా పూనియా నాయకత్వంలోని మన జట్టు తమ తర్వాతి పోరులో నేడు స్పెయిన్‌తో తలపడుతుంది. -
భారత మహిళల ఘన విజయం
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారత్ తరఫున అన్నీ గోల్స్ తానే సాధించిన లాల్రెమ్సియామి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్ 13వ, 17వ, 56వ నిమిషాల్లో ఆమె మూడు ఫీల్డ్ గోల్స్ కొట్టింది. మొదటి, రెండో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించిన భారత్ చివరి క్వార్టర్లో మరో గోల్‌తో ముగించింది. ఈ టోరీ్నలో రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఇంగ్లండ్, స్పెయిన్లతో తొలి రెండు మ్యాచ్‌లను భారత్ ‘డ్రా’గా ముగించింది. సవితా పూనియా నాయకత్వంలోని మన జట్టు తమ తర్వాతి పోరులో నేడు స్పెయిన్‌తో తలపడుతుంది. -
ఇంగ్లండ్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీని భారత మహిళల జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున హోలీ హంట్ ఏడో నిమిషంలో గోల్ చేయగా... భారత జట్టుకు లాల్రెమ్సియామి 41వ నిమిషంలో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్లో రెండు జట్లకు రెండు చొప్పున పెనాల్టీ కార్నర్లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇదే టోర్నీలో పోటీపడుతున్న భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు చేతిలో 1–2తో ఓడిపోగా... నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. -
భారత్‌దే ఆసియా కప్.. ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం
సలాలా (ఒమన్): ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నమెంట్లో టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా గురువారం జరిగిన ఫైనల్లో 2–1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున అంగద్‌బీర్ సింగ్ (13వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (20వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... పాకిస్తాన్ జట్టుకు అలీ బషారత్ (38వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్‌గా ఆసియా కప్ టైటిల్ నెగ్గడం భారత్‌కిది నాలుగోసారి. గతంలో భారత్ 2004, 2008, 2015లలో విజేతగా నిలిచింది. తాజా టైటిల్‌తో ఆసియా కప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. పాకిస్తాన్ మూడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో మలేసియాపై గెలిచింది. ఆసియా కప్ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారత్, పాకిస్తాన్, కొరియా జట్లు ఈ ఏడాది డిసెంబర్లో కౌలాలంపూర్‌లో జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. తాజా టోర్నీలో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది. టోర్నీ మొత్తంలో భారత్ 50 గోల్స్ సాధించి... కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అభినందించారు. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షలు నగదు పురస్కారం ప్రకటించారు. -
సెమీస్‌లో భారత్.. థాయ్‌లాండ్‌పై 17–0తో ఘన విజయం
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్ జట్టుతో ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అంగద్‌బీర్ సింగ్ (13వ, 33వ, 47వ ని.లో) మూడు గోల్స్ చేయగా... అమన్‌దీప్ లాక్రా (26వ, 29వ ని.లో), ఉత్తమ్ సింగ్ (24వ, 31వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. శ్రద్ధానంద్ తివారి (46వ ని.లో), యోగంబర్ రావత్ (17వ ని.లో), అమన్‌దీప్ (47వ ని.లో), రోహిత్ (49వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు విజయాలు, ఒక ‘డ్రా’తో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పూల్ ‘ఎ’లో నేడు జపాన్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతకు మరో సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. మ్యాచ్ ‘డ్రా’ అయితే పాకిస్తాన్ ముందంజ వేస్తుంది. -
Junior Asia Cup: చైనీస్ తైపీని 18-0 తేడాతో చిత్తు చేసిన భారత్
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ భారీ విజయంతో బోణీ కొట్టింది. చైనీస్ తైపీతో బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా గోల్స్ వర్షం కురిపించి 18–0తో గెలుపొందింది. భారత ఆటగాళ్ల ధాటికి చైనీస్ తైపీ ఆటగాళ్లు చేతులెత్తేశారు. భారత్ తరఫున అరైజీత్ సింగ్ హుండల్ (19వ, 19వ, 30వ, 59వ ని.లో) నాలుగు గోల్స్... అమన్‌దీప్ (38వ, 39వ, 41వ ని.లో) మూడు గోల్స్ సాధించారు. బాబీ సింగ్ ధామి (10వ, 46వ ని.లో), ఆదిత్య అర్జున్ లలాగే (37వ, 37వ ని.లో), కెప్టెన్ ఉత్తమ్ సింగ్ (10వ, 59వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. శ్రద్ధానంద్ తివారి (11వ ని.లో), అంగద్‌బీర్ సింగ్ (37వ ని.లో), అమీర్ అలీ (51వ ని.లో), బాబీ పూవణ్ణ చంద్ర (54వ ని.లో), యోగాంబర్ (60వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. ఈ టోర్నీ విజేత జూనియర్ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. -
ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న హార్ధిక్
భారత హాకీ సమాఖ్య (హెచ్ఐ) 2022 సంవత్సరానికిగాను భారత జట్టుకు సంబంధించి వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్, మహిళల విభాగంలో సవితా పూనియా హాకీ ఇండియా ఉత్తమ ఆటగాళ్లుగా నిలిచారు. ఒడిషాలో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో హార్దిక్ అద్భుత ఆటతీరు కనబర్చాడు. ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ నేషనల్ కప్ టైటిల్ గెలిపించి ప్రొ లీగ్‌కు భారత జట్టు అర్హత సాధించడంలో కీపర్‌గా, కెప్టెన్‌గా సవిత కీలక పాత్ర పోషించింది. ఇద్దరికీ హాకీ ఇండియా తరఫున రూ. 25 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వీటిని అందజేశారు. దీంతో పాటు 2021కు సంబంధించిన అవార్డులను కూడా ప్రకటించగా హర్మన్‌ప్రీత్, సవితా పూనియా అత్యుత్తమ ఆటగాళ్లుగా అవార్డులు అందుకున్నారు. 2022లో సుల్తాన్ జొహర్ కప్ గెలిచిన భారత జూనియర్ జట్టును కూడా ఈ సందర్భంగా సత్కరించారు. -
బెల్జియం, జర్మనీ మ్యాచ్ డ్రా
భువనేశ్వర్: డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం,మాజీ విజేత జర్మనీ జట్ల మధ్య మంగళవారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ లీగ్ మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పూల్ ‘బి’లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం ఓటమి అంచున నిలిచింది. అయితే ఆఖరి క్వార్టర్లో వెగ్నేజ్ (54వ ని.లో) చేసిన గోల్‌తో ‘డ్రా’తో బయటపడింది. అంతకుముందు జర్మనీ జట్టులో వెలెన్ నిక్లస్ (22వ ని.లో), టామ్ గ్రామ్‌బుష్ (52వ ని.లో) చెరో గోల్ చేయగా, సెడ్రిక్ చార్లియర్ 9వ నిమిషంలోనే బెల్జియంకు తొలి గోల్ అందించాడు. ఈ నెల 20న జరిగే ఆఖరి లీగ్‌తో క్వార్టర్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో బెల్జియం, దక్షిణ కొరియాతో జర్మనీ తలపడతాయి. ఈ పూల్ లో జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో జపాన్‌పై గెలిచింది. కొరియా తరఫున లీ జంగ్ జన్ (8వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేశాడు. జపాన్ జట్టులో నగయొషి (1వ ని.లో) గోల్ సాధించాడు. అయితే జపాన్ 11 మందితో కాకుండా 12 మందితో ఆడటం వివాదం రేపింది. -
ఆకాశ్‌దీప్ హ్యాట్రిక్ వృథా.. ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి
IND VS AUS Hockey Test Series: ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత పురుషుల జట్టు ఓటమితో ప్రారంభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–5 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత స్టార్ ప్లేయర్ ఆకాశ్‌దీప్ సింగ్ (10వ, 27వ, 59వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించినా ఫలితం లేకపోయింది. మరో గోల్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (31వ ని.లో) అందించాడు. ఆ్రస్టేలియా తరఫున లాచ్లాన్ షార్ప్ (5వ ని.లో), నాథన్ ఇఫారౌమ్స్ (21వ ని.లో), టామ్ క్రెయిగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... బ్లేక్ గోవర్స్ (57వ, 60వ ని.లో) రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
భారత్ ఘన విజయం
భువనేశ్వర్: ఆద్యంతం అటాకింగ్‌తో ప్రత్యర్థిపై చెలరేగిన భారత జట్టు ప్రొ హాకీ లీగ్‌లో కీలక విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7–4 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలి క్వార్టర్లో కివీస్ ఆధిక్యం ప్రదర్శించినా, ఆ తర్వాత భారత్ జోరు ముందుకు నిలవలేకపోయింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ (7వ నిమిషం, 19వ ని.) సాధించగా, కార్తీ సెల్వమ్ (17వ ని., 38వ ని.) మరో రెండు గోల్స్ కొట్టాడు. రాజ్‌కుమార్ పాల్ (31వ ని.), సుఖ్జీత్ సింగ్ (50వ ని.), జుగ్రాజ్ సింగ్ (53వ ని.) భారత్‌కు మిగతా గోల్స్ అందించారు. న్యూజిలాండ్ తరఫున సైమన్ చైల్డ్ (2వ ని.), స్యామ్ లేన్ (9వ ని.), స్మిత్ జేక్ (14వ ని.), నిక్వుడ్స్ (54వ ని.) గోల్స్ చేశారు. -
‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్ సింగ్
భారత పురుషుల హాకీ జట్టు స్టార్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) 2021–2022 ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. హర్మన్‌తోపాటు ఆర్థర్ డి స్లూవర్, టామ్ బూన్ (బెల్జియం), బ్రింక్‌మన్ (నెదర్లాండ్స్), నిక్లాస్ వెలెన్ (జర్మనీ) కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు. భారత్‌కే చెందిన పీఆర్ శ్రీజేష్, సవిత పూనియా ‘బెస్ట్ గోల్‌కీపర్’ అవార్డు బరిలో ఉన్నారు. ఈనెల 30 వరకు ఆన్లైన్ ఓటింగ్ కొనసాగుతుంది. వచ్చే నెలలో విజేతలను ప్రకటిస్తారు. చదవండి: Asia Cup 2022: ఏం చేస్తున్నావు రోహిత్.. ఇదేనా నీ కెప్టెన్సీ? నిజంగా సిగ్గు చేటు! -
హాకీ ప్రపంచకప్‌కు సన్నాహాలు
భువనేశ్వర్: హాకీ ప్రపంచకప్–2023 టోర్నమెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్‌చంద్ర మహాపాత్రొ అధ్యక్షతన అనుబంధ విభాగాల ఉన్నత అధికారులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్థానిక లోక్‌సేవా భవన్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండ్యన్, క్రీడా విభాగం కార్యదర్శి ఆర్.వినీల్‌కృష్ణ, వివిధ విభాగాల ప్రముఖులు, ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. కటక్, రౌర్కెలా ప్రాంతాల నుంచి అనుబంధ వర్గాలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వరుసగా రెండోసారి హాకీ పురుషుల ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో 2018లో తొలిసారి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంపై ఆనందం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా హాకీ క్రీడాకారులు, క్రీడాభిమానులు, నిర్వాహక వర్గాలు టోర్నమెంట్ నిర్వహణకు ప్రసంశలు కురిపించారని గుర్తుచేశారు. ఈసారి గతంకంటే ఘనంగా ఆద్యంతం విజయవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ దఫా ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల నిర్వహించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. భువనేశ్వర్ లోని కలింగ స్టేడియం, రౌర్కెలా ప్రాంతంలో హాకీ పురుష ప్రపంచకప్–2023 టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2017లో ప్రభుత్వం నిర్వహించిన ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ కావడం క్రీడాలోకంలో జయజయ ధ్వానాలు నేటికి మార్మోగడం అద్భుత విజయంగా వివరించారు. హాకీ ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం రౌర్కెలా స్టేడియం శరవేగంగా సిద్ధమవుతోందని క్రీడా విభాగం కార్యదర్శి వినీల్‌కృష్ణ తెలిపారు. -
హాకీ స్టిక్ మాంత్రికుడు: ద్యాన్ చంద్ /1905-1979
1936 నాటి బెర్లిన్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో జెస్సీ ఒవెన్ సాధించిన ఘనత గురించి ఇప్పటికీ ప్రశంసల వర్ష కురిపిస్తాం. అప్పటి నాజీ ధోరణులపై ఆయన పైచేయి సాధించినట్లు భావిస్తాం. మరి ధ్యాన్ చంద్ గురించి ఏం చెప్పుకోవాలి? ఆయన అంతకు మునుపటి రెండు ఒలింపిక్స్‌లో 20 గోల్స్ సాధించడమే కాక, బెర్లిన్‌లో సైతం తన సత్తా చాటారు. ఫైనల్లో జర్మనీ జట్టుపై మూడు గోల్స్ చేశారు. ధ్యాన్‌చంద్ ప్రపంచంపై చూపిన ప్రభావంపై సమగ్ర పరిశోధన జరగాల్సి ఉంది. ‘‘కేవలం చదవడం, రాయడమే’’ వచ్చిన ఈ సాధారణ భారతీయుడు ప్రపంచ హాకీ భవిష్యత్తునే తిరగరాశారు. హాకీ జట్టు మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నప్పుడు బెర్లిన్ ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ధ్యాన్ చంద్ నియమితులయ్యారు. నిజం చెప్పాలంటే, తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటి కన్నా ఇలా కెప్టెన్‌గా నియమితం కావడమే ధ్యాన్ చంద్ జీవితంలోని అత్యున్నత సంఘటన. ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ పుస్తక రచయితల మాటల్లో చెప్పాలంటే.. ‘ప్రపంచంలోని అతి పెద్ద విడాకులు’ అయిన భారతదేశ విభజన సందర్భంగా చివరకు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫర్నీచర్‌ను సైతం లెక్కపెట్టి, భారత పాకిస్థాన్‌ల మధ్య పంచుకున్నారు. అయితే బ్రిటిష్ భారతావని లేదా అవిభక్త భారతదేశంగా ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన మూడు స్వర్ణాలూ తటస్థమైనవేనని ప్రకటించారు. 1936 నాటి బెర్లిన్ ఒలింపిక్స్‌నే తీసుకుంటే భారతహాకీ జట్టులోని 18 మందిలో పాకిస్థాన్ నుంచి ఇద్దరు హిందువులు, నలుగురు ముస్లిములు, ఎనిమిది మంది ఆంగ్లో ఇండియన్లు ఉన్నాయి. అయితే «ధ్యాన్ చంద్ ఆట నైపుణ్యంతో పోలిస్తే ఆ 14 మందీ తక్కువే కావడంతో, స్వతంత్ర భారతావనే ఆ మానసిక యుద్ధంలో విజయం సాధించింది. ఆత్మకథ అయిన ‘గోల్’లోమాత్రం ధ్యాన్‌చంద్, ‘‘ఆత్మకథ రాసేంతగా నేను మరీ ముఖ్యమైన వ్యక్తినేమీ కాదు’’ అని సవినయతను కనబరిచారు. అలాంటి గొప్ప వ్యక్తి భారత జాతి ప్రతిపత్తిని నిరంతం ప్రకాశవంతం చేస్తూనే ఉంటారు. – కె.ఆర్ముగం, భారత హాకీ అంశాలపై నిపుణులు (చదవండి: మొనగాళ్లకు మొనగాడు ) -
భారత మహిళల పోరు షురూ
ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్): మహిళల ప్రపంచకప్ హాకీలో భారత్ పోరాటం నేడు మొదలవుతోంది. ఆదివారం జరిగే తమ పూల్ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో మన జట్టు కాంస్య పతకంతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఇంగ్లండ్ దూరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతికారం తీర్చుకోవాలనే లక్ష్యంతో సవిత సేన బరిలోకి దిగుతోంది. ఒలింపిక్స్‌లోనే కాదు... ప్రపంచకప్‌లోనూ మన అమ్మాయిల అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానమే! ప్రారంభ ప్రపంచకప్ (1974)లోనే కాంస్య పతకం కోసం పోరాడిన భారత్ మళ్లీ ఎప్పుడూ పతకం బరిలో నిలువనే లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ సీజన్లో మేటి జట్లయిన బెల్జియం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచిన సవిత సేన ఇదే జోరును ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. సీనియర్, మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ గాయంతో అందుబాటులో లేకపోయినప్పటికీ... అనుభవజ్ఞురాలైన సవిత జట్టును చక్కగా నడిపిస్తోంది. వైస్ కెప్టెన్ దీప్ గ్రేస్, గుర్జీత్ కౌర్, ఉదిత, నిక్కీ ప్రధాన్‌లు నిలకడగా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై తొలి దెబ్బ కొట్టేందుకు భారత జట్టు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. -
టీమిండియా హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం..
మెన్స్ హాకీ ఆసియాకప్‌లో టీమిండియా పురుషుల హాకీ జట్టును దురదృష్టం వెంటాడింది. గోల్స్ తేడా కారణంగా టీమిండియా ఫైనల్ చేరకుండానే సూపర్-4లోనే నిష్క్రమించింది. సూపర్-4లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 4-4తో డ్రా చేసుకుంది. దీంతో భారత్, కొరియా ఖాతాలో చెరో ఐదు పాయింట్లు చేరాయి. అయితే జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మలేషియా విజయం సాధించడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. జపాన్‌పై విజయంతో మలేషియా ఖాతాలోనూ ఐదు పాయింట్లు చేరాయి. మూడు జట్లు ఐదు పాయింట్లతో సూపర్-4ను ముగించినప్పటికి మెరుగైన గోల్స్ ఉన్న కారణంగా మలేషియా, కొరియాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక మూడో స్థానం కోసం భారత్.. జపాన్‌తో జూన్ 1న తలపడనుంది. అదే రోజు మలేషియా, దక్షిణ కొరియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. A scintillating game ends in a DRAW!! 💙 IND 4:4 KOR #IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsKOR @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/eor7QdAZuB — Hockey India (@TheHockeyIndia) May 31, 2022 -
ఆసియా కప్‌లో రూపిందర్ సారథ్యంలో బరిలోకి...
ఈనెల 23 నుంచి జకార్తాలో జరిగే ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు సీనియర్ డ్రాగ్‌ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ కెప్టెన్‌గా... డిఫెండర్ బీరేంద్ర లాక్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో జపాన్, పాకిస్తాన్, ఇండోనేసియా, మలేసియా, కొరియా, ఒమన్, బంగ్లాదేశ్ జట్లు బరిలో ఉన్నాయి. టాప్–3లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశం హోదాలో భారత్‌కు నేరుగా ప్రపంచకప్‌లో ఎంట్రీ లభించింది. -
జర్మనీపై భారత్ ఘన విజయం
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత జట్టు కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ (18వ నిమిషం, 27వ నిమిషం) చేయగా... 45వ నిమిషంలో అభి షేక్ మరో గోల్ నమోదు చేశాడు. తాజా ఫలితంతో 11 మ్యాచ్‌ల ద్వారా 24 పాయింట్లు సాధించిన భారత్ లీగ్‌లో అగ్ర స్థానంలోనే కొనసాగనుంది. లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: IPL 2022 RR Vs GT: హార్ధిక్ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు! -
అల్లపురెడ్డి జనార్థనరెడ్డి ఇక లేరు..
-
సక్సెస్ స్టోరీ: యంగ్ అండ్ ఎనర్జిటిక్
కరెంటు బిల్ అనే మాట వినబడగానే... కొండంత భయం ఎదురొచ్చి నిలుచుంటుంది. ఆ కొండను కోడిగుడ్డు స్థాయికి తగ్గించలేమా? కరెంటు బిల్లు అనేది పెద్ద ఖర్చు కాదు. విద్యుత్ వృథాను అరికడితే ‘బిల్’ మనల్ని కనికరిస్తుంది. ‘వెరీగుడ్’ అని వెన్నుతట్టేలా చేస్తుంది. మరి విద్యుత్ వృథాను అరికట్టాలంటే? 26 సంవత్సరాల గోకుల్ శ్రీనివాస్ సక్సెస్ స్టోరీని తెలుసుకోవాల్సిందే... ఒకప్పటి మాదిరిగా ఇంట్లో లైట్ వెలగడానికి మాత్రమే మనం కరెంట్‌ను ఖర్చు చేయడం లేదు. ఇస్త్రీ పెట్టె, ఫ్యాన్, మిక్సీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ వోవెన్, కంప్యూటర్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. విద్యుత్ వినియోగానికే పరిమితమైన మనం ‘వృథా’ను అంతగా పట్టించుకోవడం లేదు. లేదా అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిందే ‘మినియన్’ డివైజ్. దీని సృష్టికర్త గురించి... హైస్కూల్ రోజుల్లో గోకుల్ శ్రీనివాస్‌కు ‘హాకీ’ అంటే ప్రాణం. ఈ ఆటలో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. అయితే ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతని కలలు అవిరైపోయాయి. హాకీ గట్టిగా ఆడలేని పరిస్థితి. కట్ చేస్తే... చదువు పూర్తయిన తరువాత అమెజాన్ ఐటీలో ఉద్యోగం వచ్చింది. సంవత్సరం పూర్తయిన తరువాత ‘ఇది మనకు సెట్ అయ్యే జాబ్ కాదు’ అనిపించింది. తనకు ‘ఎలక్ట్రానిక్స్’ అంటే చా...లా ఇష్టం. రకరకాల డివైజ్‌లు తయారుచేశాడు. అలా తయారు చేసిందే మినియన్ (మిని+ఆన్) సంప్రదాయ విధానాల్లో ‘ఎనర్జీ మానిటరింగ్’ అనేది సంక్లిష్టమైన విషయం.‘మినియన్’ డివైజ్‌తో మాత్రం విద్యుత్ వాడకానికి సంబంధించి మానిటరింగ్, ఎనాలసిస్ చేయడం సులభం. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఎంఎల్ (మెషిన్ లెర్నింగ్) వైర్లెస్ డివైజ్ ‘మినియన్’అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజ్‌లో ఉంటుంది. వృథాను అరికట్టడం మాత్రమే కాదు... ఏదైనా విద్యుత్ ఉపకరణాన్ని రిపేర్ చేయించాల్సిన పరిస్థితి వస్తే అలర్ట్ చేస్తుంది. ‘మినియన్ ల్యాబ్స్’ పేరుతో బెంగళూరులో అంకుర సంస్థను మొదలుపెట్టాడు శ్రీనివాస్. ఇది అంతర్జాతీయ స్థాయిలో హిట్ అయింది. ఇళ్లు, ఆఫీసు, ఫ్యాక్టరీ...లలో ఇంధన వృథాను గణనీయంగా అరికడుతూ ప్రశంసలు అందుకుంటోంది. ‘విద్యుత్ వృథాను అరికట్టడం అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా’ అంటారు. యువత ‘మినియన్’లాంటి ఇంధన వృథాను అరికట్టే పరికరాలను మరిన్ని తయారుచేస్తే ఆ బాధ్యత నెరవేర్చడం సులువవుతుంది. -
తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ పురుషుల జట్టుతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ఒక దశలో 1–4తో వెనుకబడి ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి టీమిండియా అనూహ్యంగా తేరుకుంది. వరుసగా నాలుగు గోల్స్ సాధించి చివరకు 5–4తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మరో ఎనిమిది సెకన్లలో ముగుస్తుందనగా హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చి భారత్‌ను గెలిపించాడు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ, 60వ ని.లో) రెండు గోల్స్ చేయగా... శిలా నంద్ లాక్రా (41వ ని.లో), షంషేర్ సింగ్ (43వ ని.లో), వరుణ్ కుమార్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్ జట్టుకు కెప్టెన్ మార్క్ మిరాలెస్ (20వ, 23వ, 40వ ని.లో) మూడు గోల్స్, పౌ కునిల్ (14వ ని.లో) ఒక గోల్ అందించారు. మహిళల జట్టూ గెలిచింది... మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2–1తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలో మార్టా సెగూ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో జ్యోతి గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం 52వ నిమిషంలో నేహా చేసిన గోల్‌తో భారత్ 2–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రొ లీగ్‌లో భారత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఇటీవల ఒమన్‌లో చైనాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందింది. -
ఆసియా క్రీడలపైనే దృష్టి: కెప్టెన్
ఈ ఏడాది భారత పురుషుల హాకీ జట్టు ప్రధాన లక్ష్యం ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి 2024 పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడమేనని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించాడు. వచ్చే నెలలో మొదలయ్యే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్ మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు సన్నాహకంగా భావిస్తామని మన్‌ప్రీత్ తెలిపాడు. భువనేశ్వర్‌లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో స్పెయిన్, జర్మనీ, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో భారత్ ఆడుతుంది. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ -
ఆట ఏదైనా పాక్‌పై భారత్‌దే పైచేయి
ఢాకా: మూడుసార్లు చాంపియన్ భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో దూకుడు కనబరుస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. దాంతో టోర్నీలో రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో మొత్తం ఏడు పాయింట్లు సాధించిన టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ (8వ, 53వ నిమిషాల్లో) చేయగా... మరో గోల్‌ను ఆకాశ్‌దీప్ సింగ్ (42వ నిమిషంలో) చేశాడు. పాకిస్తాన్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జునైద్ మన్జూర్ (45వ నిమిషంలో) చేశాడు. గత ఐదేళ్లలో పాక్‌తో జరిగిన 12 మ్యాచ్‌ల్లో భారత్ 11 గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడనుంది. -
భారత్ భారీ విజయం.. బంగ్లాపై గెలుపుతో..
Asia Hockey Men Champions Trophy: ఆసియా హాకీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ (12వ, 22వ, 45వ నిమిషంలో) మూడు గోల్స్... జర్మన్‌ప్రీత్‌సింగ్ (33వ, 43వ ని.లో) రెండు గోల్స్ చేశారు. లలిత్ (28వ ని.లో), ఆకాశ్‌దీప్ (54వ ని.లో), మన్దీప్ మోర్ (55వ ని.లో), హర్మన్‌ప్రీత్ (57వ ని.లో) ఒక్కోగోల్ సాధించారు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. చదవండి: నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు: విరాట్ కోహ్లి -
అంతర్జాతీయ హాకీకి భారత స్టార్ ప్లేయర్ గుడ్‌బై..
Sv Sunil Retires From International Hockey: భారత స్టార్ ప్లేయర్ ఎస్వీ సునీల్ అంతర్జాతీయ హాకీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల సునీల్... తన 14 ఏళ్ల కెరీర్లో 264 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 72 గోల్స్ చేశాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లో ఆడిన సునీల్ టోక్యో గేమ్స్‌కు మాత్రం ఎంపిక కాలేదు. 2014 ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన భారత టీమ్‌లో సునీల్ సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: Viral Video: సచిన్‌ను చూసాక ఇషాన్ కిషన్ రియాక్షన్.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్ -
గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన
Olympic Bronze Medalist Rupinder Singh, Birendra Lakra Retired: టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు స్టార్ క్రీడాకారులు గంటల వ్యవధిలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించగా.. గంటల వ్యవధిలో మరో స్టార్ ఆటగాడు, డిఫెండర్ బీరేంద్ర లక్రా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. రూపిందర్ గురువారం ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించగా.. బీరేంద్ర లక్రా వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే రిటైర్ అవుతున్నట్లు ఈ ఇద్దరూ ప్రకటించారు. భారత హాకీకి చేసిన సేవలకు గాను హాకీ ఇండియా వీరిద్దరిని అభినందించింది. ఇదిలా ఉంటే, దేశంలో అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్‌గా గుర్తింపు పొందిన 30 ఏళ్ల రూపీందర్ పాల్.. భారత్ తరఫున 223 మ్యాచ్‌ల్లో 119 గోల్స్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అతను నాలుగు కీలక గోల్స్ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 31ఏళ్ల బీరేంద్ర లక్రా విషయానికొస్తే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అతను.. 201 మ్యాచ్‌ల్లో 10 గోల్స్ సాధించాడు. 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో లక్రా కీలక సభ్యుడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం
Supreme Court Rejects Plea To Recognize Hockey As India's National Game: హాకీని జాతీయ క్రీడగా అధికారికంగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని తగు రీతిలో తాము ఆదేశించలేమంటూ స్పష్టం చేసింది. క్రికెట్ వల్ల హాకీ తన ప్రభావాన్ని కోల్పోతోందని.. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. విశాల్ తివారీ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఇందులో తాము చేయడానికి ఏమీ లేదని, పిటిషనర్ కోరిన విధంగా తాము కేంద్రాన్ని ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలపై ప్రజల్లో చైతన్యం రావాలని అభిప్రాయపడింది. మహిళా బాక్సర్ మేరీకోమ్ వంటి క్రీడాకారిణిలు ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించారని, ఆ స్ఫూర్తి అందరిలో కనిపించాలని పేర్కొంది. బెంచ్ ఆదేశాలతో విశాల్ తివారీ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. చదవండి: టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్‌తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్ -
ధ్యాన్‌చంద్ జయంతి.. ఆసక్తికర విషయాలు
-
‘క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్‌చంద్‌కు గొప్పనివాళి’
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. భారత్ దిగ్గజ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళులు అర్పించారు. క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్‌చంద్‌కు గొప్ప నివాళి అని పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతోనే భారత్ క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుందని అన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ క్రీడాకారులు విశేషమైన ప్రతిభ కనబర్చారని అన్నారు. సాధించిన 7 పతకాలలో.. హకీ విభాగంలో ఒక పతకం గెలుచుకున్నామని తెలిపారు. ఇదే స్పూర్తిని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని అన్నారు. చదవండి: త్వరలో సిద్ధూ, అమరీందర్‌లతో రావత్ చర్చలు -
హాకీ ఆటగాళ్లకు గౌరవం.. పాఠశాలల పేర్లు మార్చిన పంజాబ్
చండీగఢ్: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడంచి భారత పురుషుల జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. కాగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లు పంజాబ్ నుంచి ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో వారి విజయానికి గౌరవంగా భారత పురుషుల హాకీ టీమ్ లో భాగమైన పంజాబ్‌కు చెందిన వివిధ ఆటగాళ్ల పేర్లను పది ప్రభుత్వ పాఠశాలల కు పెట్టాలని పంజాబ్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ అంగీకారం తెలిపారని పంజాబ్ విద్యాశాఖా మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా స్పష్టం చేశారు. చదవండి:IPL 2021: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ యువ పేసర్ మిథాపూర్ జలంధర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలకు హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. ఇకపై ఆ పాఠశాల పేరును ఒలింపియన్ మన్‌ప్రీత్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్, మిథాపూర్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే అమృత్‌సర్‌లోని తిమ్మోవల్ పాఠశాల పేరును వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరుతో మార్చనున్నట్లు పేర్కొన్నారు. అట్టారి పాఠశాల పేరును ఒలింపియన్ శంషర్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌గా.. ఫరీద్‌కోట్‌లోని బాలికల పాఠశాల పేరును ఒలింపియన్ రూపిందర్‌పాల్ సింగ్ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలగా మారుస్తామన్నారు. ఖుస్రోర్‌పూర్ పాఠశాల పేరును ఒలింపియన్ హార్దిక్ సింగ్ పాఠశాల అని, గురుదాస్‌పూర్‌లోని చాహల్ కలాన్ పాఠశాల పేరును ఒలింపియన్ సిమ్రంజిత్ సింగ్ ప్రభుత్వ పాఠశాలగా మార్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. చదవండి:Nithin Maestro Trailer: ‘మాస్ట్రో’ మూవీ ట్రైలర్ విడుదల, ఉత్కంఠ రేపుతున్న క్రైం సీన్స్ -
చూపుడు వేలుపై 3 గంటలకు పైగా
భవానీపట్న (ఒడిశా): హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఆకట్టుకోగా... ఓ ఒడిశా యువకుడు మరో అరుదైన ఫీట్ చేశాడు. బొలాంగిర్ జిల్లాలోని జముత్జోలా గ్రామానికి చెందిన 25 ఏళ్ల రాజ్‌గోపాల్ భోయ్ కుడిచేతి చూపుడు వేలుపై ఏకంగా 3 గంటల 22 నిమిషాల 22 సెకన్లపాటు హాకీ స్టిక్‌ను నిలబెట్టాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నించాడు. గిన్నిస్ నిబంధనల మేరకు సమయాన్ని నమోదుచేసే వారు, జడ్జిలు, వీక్షకుల సమక్షంలో... వీడియో చిత్రీకరణ జరుగుతుండగా... రాజ్‌గోపాల్ ఈ అరుదైన ఫీట్ చేశాడు. అత్యధిక సమయం చూపుడు వేలిపై హాకీ స్టిక్‌ను నిలబెట్టిన వరల్డ్ రికార్డు ప్రస్తుతం 2 గంటల 22 నిమిషాలతో బెంగళూరుకు చెందిన హిమాంశు గుప్తా పేరిట ఉంది. రాజ్‌గోపాల్ విన్యాసానికి సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను నిశితంగా అధ్యయనం చేసిన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు అతని ఘనతను గుర్తించి సర్టిఫికెట్ జారీచేయనున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో శక్తి కావాలని... సంకల్పబలంతోనే ఇది సాధ్యమని ఈ ఫీట్‌కు నిర్వాహకునిగా వ్యవహరించిన సత్యపిర్ ప్రధాన్ అన్నారు. -
పల్లె గర్వించేలా .. దేశం తలెత్తుకునేలా..
అది అటవీ సరిహద్దులోని మారుమూల గ్రామం. ఇప్పుడు ఆ పల్లె పేరు అంతర్జాతీయ స్థాయిలో చర్చానీయాంశంగా మారింది. భారత హాకీ జట్టులో గోల్ కీపర్‌గా రాణిస్తున్న రజని స్వస్థలం ఎర్రావారిపాళెం మండలంలోని యనమలవారిపల్లె. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ యువతి ఇప్పుడు దేశం గర్వించేలా ఒలింపిక్ మెడల్ సాధన దిశగా తన బృందం సభ్యులతో కలిసి దూసుకెళ్తోంది. సాక్షి, ఎర్రావారిపాళెం(చిత్తూరు): మండలంలోని కమళ్ల గ్రామం యనమలవారిపల్లె కుగ్రామానికి చెందిన రమణాచారి, తులసి దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు ఆడ పిల్లలు కాగా, ఒక కుమారుడు. రమణాచారి వడ్రంగి పని చేస్తుండగా, తులసి పశువుల కాపరి. సంతానంలో రెండో కుమార్తె రజని 1 నుంచి 5వ తరగతి వరకు పచ్చారువాండ్లపల్లెలో, 6 నుంచి 10 వరకు నెరబైలు పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత తిరుపతిలో ఉన్నత విద్యను అభ్యసించింది. హాకీకి నెరబైలే పునాది నెరబైలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రజని హాకీ క్రీడకు బీజం పడింది. అక్కడ 8వ తరగతి చదువుతుండగా పీఈటీ వెంకటరాజు సహకారంతో ఈ క్రీడ పట్ల ఆసక్తి పెంచుకుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రజనీ ఆటతీరును గుర్తించిన పీఈటీ ప్రోత్సాహంతో జోనల్ ప్లేయర్‌గా ఉన్న ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో తిరుపతి సాయ్ హాస్టల్లో ఉంటూ హాకీ కోచ్ ప్రసన్నకుమార్ రెడ్డి ప్రోత్సాహంతో తన ఆట తీరును మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత జట్టులో గోల్ కీపర్‌గా ప్రాతినిధ్యం వహిస్తోంది. 2004: 6వ తరగతిలోనే పుత్తూరులో జరిగిన జోనల్స్‌లో రన్నర్స్‌గా నిలిచింది. 2005: తిరుపతిలో జరిగిన ఇంటర్ జోనల్స్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2005: పంజాబ్ రాష్ట్రం జలందర్‌లో పాల్గొని సత్తాచాటింది 2006: ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. 2007: కోయంబత్తూరు, ఇబల్పూర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా 2008: రూర్కెలాలో జాతీయ పోటీల్లో విజయం. 2009: మొదటి సారి అంతర్జాతీయ మ్యాచ్‌లో ప్రవేశం 2010: చైనా, న్యూజిల్యాండ్, చైనా, కొరియా, అర్జెంటినాలో ఆడింది. 2011: ఆస్ట్రియా పోటీల్లో ఈమె జట్టు సిల్వర్ మెడల్ సాధించింది. 2012: జనవరిలో ఢిల్లీలో జరిగిన హాకీలో చాంపియన్‌గా నిలిచింది. 2013: నెదర్లాండ్, జర్మనీ, మలేషియా మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం. 2016: ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2017: జపాన్‌లో జరిగిన ఏషియన్ హాకీ చాంపియన్‌షిప్‌లో ఆసియా చాంపియన్లుగా నిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంస హాకీ క్రీడాకారిణి, గోల్ కీపర్ రజనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. ఇటీవల ఆమె తల్లిదండ్రులను ఆయన సత్కరించారు. చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించేలా పిల్లలను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. గర్వంగా ఉంది కూతుళ్లంటే మాకు ప్రాణం. ఇద్దరికి పెళ్లిళ్లు చేసినా, రజని బాగా చదువుతుండడంతో ఎంత కష్టమైనా ముందుకు తీసుకెళ్దామనుకున్నాం. హాకీ ఇష్టమని చెప్పడంతో ప్రోత్సహించాం. ఆడపిల్లకు ఆటలు ఏమిటని ఊర్లో కొందరు గేలి చేసినా పట్టించుకోలేదు. ముము అనుకున్నట్లుగానే రాణించింది. ఇప్పుడు మా పాపను చూస్తుంటే గర్వంగా ఉంది. ఊరు తలెత్తుకునేలా చేసింది మా కూతురు. – రజని తల్లిదండ్రులు రమణాచారి, తులసి మాటల్లో చెప్పలేని ఆనందం రజనితో పాటు నలుగురు యువతులు 2005లో సాయ్‌కి ఎంపికయ్యారు. వీరిలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రజని ఆట పట్ల ఎంతో ఆసక్తి కనపర్చింది. ఆమె అంకితభావం, క్రమశిక్షణ కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో రాణిస్తోంది. రెండోసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం అంత సులువైన విషయం కాదు. గురువుగా ఆమె ఎదుగుదల నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. – ప్రసన్నకుమార్‌రెడ్డి, హాకీ కోచ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తిరుపతి -
'భారత మహిళల హాకీ జట్టుతో నా ప్రయాణం ముగిసింది'
టోక్యో: భారత మహిళల హాకీ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జోర్డ్ మారిజైన్ స్పష్టం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ ఓటమి అనంతరం మారిజైన్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ''బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్ నా చివరి అసైన్మెంట్. ఈరోజుతో భారత్ మహిళల హాకీ టీంతో నా ప్రయాణం ముగిసింది.ఇంతకాలం మాకు మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మేం ఈరోజు ఒలింపిక్స్‌లో మెడల్ గెలవలేకపోవచ్చు.. కానీ అంతకంటే పెద్ద విజయాన్ని అందుకున్నాం. అదే అభిమానుల ప్రేమాభిమానాలు. ప్రాభవం కోల్పోతున్న స్థితి నుంచి పతకం కోసం పోరాడే స్థాయికి చేరుకున్నాం. ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అందరి అంచనాలకు భిన్నంగా రాణించింది. వారి ఆటతీరుతో ఈరోజు లక్షలాది అమ్మాయిల మనసు గెలుచుకున్నాం'' అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశాడు. We did not win a medal, but I think we have won something bigger. We have made Indians proud again and we inspired millions of girls that dreams CAN come true as long as you work hard for it and believe it! Thanks for all the support! 🇮🇳 — Sjoerd Marijne (@SjoerdMarijne) August 6, 2021 కాగా నెదర్లాండ్స్‌కు చెందిన మారిజైన్ 2017 నుంచి భారత మహిళల హాకీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని పనితీరుపై ముగ్దులైన భారత హాకీ సంఘం మెన్స్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించమని అడిగింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత మళ్లీ టీమిండియా మహిళల హాకీ జట్టును మరింత మెరుగ్గా తయారు చేసే పనిలో పడ్డాడు. కరోనా విరామం అనంతరం.. 2019లో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6-5తో అద్భుత ప్రదర్శన చేసిన అమ్మాయిలు ఒలింపిక్స్‌కుఅర్హత సాధించారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో బరిలో దిగి, ఆద్యంతం గట్టి పోటీనిచ్చిన రాణి రాంపాల్ సేనకు యావత్ భారతావని మద్దతుగా నిలిచింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్ సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించింది. తాజాగా శుక్రవారం బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరు మ్యాచ్‌లో 4-3 తేడాతో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో పోరాట పటిమ ప్రదర్శించినప్పటికీ.. చివరి క్వార్టర్లో ఫలితం తారుమారుకావడంతో పతకం గెలవలేకపోయింది. కాంస్య పతక పోరులో భాగంగా మ్యాచ్ ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి బ్రిటన్ గట్టి పోటీనివ్వగా.. పడిలేచిన కెరటంలా దూసుకుకొచ్చిన రాణి సేన రెండో క్వార్టర్ ముగిసే సరికి చివరి 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసి సత్తా చాటింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ 2, వందనా కటారియా ఒక గోల్ చేశారు. -
‘స్టిక్’ సీన్ మారింది...
సాక్షి క్రీడా విభాగం: ఎన్నో ఏళ్లుగా చెప్పుకోదగ్గ విజయాలు లేని బాధ, ఆటతీరుపై జోక్‌లు... అధికారుల చేతకానితనం, జట్టులో అంతర్గత రాజకీయాలు... ప్రతిభకు పాతర, ఆటగాళ్లంటే చులకనభావం... ఇంటా, బయటా భారత హాకీపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో రెండేళ్ల క్రితం చీఫ్ కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియన్ గ్రాహం రీడ్ ‘భారత జట్టు ఉండాల్సింది ఈ స్థానంలో కాదు. దీన్ని నేను ఎక్కడికో తీసుకెళతాను’ అని తొలి మాటగా అన్నాడు. కొత్తగా రాగానే అందరూ చెప్పే మాటలే ఇవి అని ఎవరూ నమ్మలేదు. పైగా అంతర్గత రాజకీయాలతోపాటు కొత్తగా వచ్చే మార్పులను అంత సులభంగా అంగీకరించలేని తత్వం ఉన్న ఆటగాళ్ల జట్టుతో అతను సాధిస్తాడా అని అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ రీడ్ ఎక్కడా తగ్గలేదు. కంప్యూటర్ సైన్స్ చదివి ఐటీ రంగంలో సుదీర్ఘ కాలం పని చేయడంతో పాటు ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థల్లో పెద్ద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న రీడ్ హాకీలోనూ తనదైన కొత్త శైలితో ఆటగాళ్లను దారిలో పెట్టాడు. రీడ్ వచ్చే నాటికి జట్టులో అందరూ వ్యక్తిగతంగా పెద్ద ప్లేయర్లే. కానీ తుది ఫలితం వరకు వచ్చేసరికి మాత్రం అంతా అంతంతమాత్రమే. ముందుగా టీమ్‌ను ఒక్క చోటికి చేర్చడంలో అతను సఫలమయ్యాడు. పేరుకు శ్రీజేశ్, మన్‌ప్రీత్, మన్దీప్, బీరేంద్ర లక్డాలాంటి సీనియర్లు ఉన్నా వారెప్పుడూ జట్టుకంటే ఎక్కువ కాదనే భావనను రీడ్ కల్పించాడు. కోచింగ్ క్యాంప్‌లో రీడ్ భార్య స్వచ్ఛందంగా ఆటగాళ్లకు ‘పర్సనాలిటీ డెవలప్మెంట్’ క్లాస్‌లు తీసుకొని వారిలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేసిందంటే రీడ్ ఎంతగా తన మిషన్‌లో మునిగాడో అర్థమవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఎంపికైన వారిలో 12 మందికి ఇదే తొలి ఒలింపిక్స్. ఇలాంటి టీమ్‌ను ఎంచుకోవడంలో కూడా కోచ్ సాహసం కనిపిస్తుంది. ఆటగాళ్లు, అధికారులతో ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా నిక్కచ్చిగా నిజం మాట్లాడే రీడ్ తత్వం అందరికీ మేలు చేసింది. ఫిట్నెస్ సూపర్... సుదీర్ఘ కాలంగా భారత హాకీ వైఫల్యాల్లో ఫిట్‌నెస్‌లేమి కూడా కీలకపాత్ర పోషించింది. ఆటపరంగా ఎంతో బాగున్నా, ఆస్ట్రోటర్ఫ్‌పై కొద్దిసేపు ఆడగానే అలసటకు గురై మనోళ్లు ఇబ్బంది పడుతూ కొనసాగడం గతంలో చాలాసార్లు జరిగింది. దీనిని ఎలాగైనా మార్చాలని రీడ్ సంకల్పించాడు. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లతో పాటు సైంటిఫిక్ అడ్వైజర్ రాబిన్ అర్కెల్ సహకారం తీసుకొని ఆటగాళ్లను ఫిట్‌గా తయారు చేశాడు. యూరోపియన్ జట్లతో పోటీ పడినప్పుడు గతంలో ఎదురైన సమస్యలేవీ లేకుండా మనోళ్లు వారితో సమానంగా మైదానంలో చురుగ్గా కనిపించడం ఆటగాళ్లలో వచ్చిన కీలకమార్పు. తీవ్రమైన వేడి ఉన్న ఒసి స్టేడియంలో 13 రోజుల వ్యవధిలో 8 మ్యాచ్‌లు ఆడగలగడం వారి ఫిట్నెస్ను చూపించింది. రీడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మనోళ్లు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడం బాగా మెరుగైంది. టోక్యోలో భారత్ 8 మ్యాచ్‌లలో 25 గోల్స్ చేసింది. ఇక సబ్స్టిట్యూట్లను సమర్థంగా వాడుకోవడం రీడ్ వ్యూహాల్లో బాగా పని చేసింది. సెమీస్‌లో సిమ్రన్‌జిత్‌కు విశ్రాంతినివ్వగా, కాంస్య పోరులో అతను కొత్త ఉత్సాహంతో వచ్చి రెండు గోల్స్ చేశాడు. అమిత్ రోహిదాస్ ‘ఫస్ట్ రషర్’ రూపంలో శ్రీజేశ్కంటే ముందే పెనాల్టీలను ఆపడానికి ముందుకు దూసుకురావడం మనం గతంలో చూడని మార్పు. భారత ఆటగాళ్లు తమను, తమ కోచ్‌ను, తమ సహచరులను, తమ శిక్షణను నమ్మారు కాబట్టే ఈ ఫలితం వచ్చింది. నాలుగు దశాబ్దాలుగా బరిలోకి దిగిన ప్రతీ భారత జట్టు మట్టిపై ఆడిన తమ ముందు తరంవారి విజయాల భారం మోస్తూ కుప్పకూలిపోయేది. ఈ జట్టు మాత్రం అలా కాలేదు. హాకీ మున్ముందు మరింత వెలిగేందుకు తమ వైపునుంచి తొలి అడుగు వేసింది. -
ఒలింపిక్ పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపిన నవీన్ పట్నాయక్
-
41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచింది
-
వీళ్ల సంబరాలు మామూలుగా లేవుగా!
-
నాకు బంగారంలా కనిపిస్తోంది: ఆనంద్ మహీంద్ర
-
పొట్టి బట్టలు వేసుకోవద్దన్నారు.. ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు
‘ఆటలాడితే ఏమొస్తుంది’ అన్నారు తల్లిదండ్రులు. ‘నేను ఆడతాను’ అంది నిషా. ‘పొట్టి బట్టలు వేసుకోకూడదు’ అన్నారు మత పెద్దలు. ‘నేను లెగ్గింగ్స్ వేసుకుని ఆడతాను’ అంది నిషా. ‘మేము బూట్లు బ్యాటు ఏమీ కొనివ్వ లేము’ అన్నారు అయినవాళ్లు. ‘నేనే ఎలాగో తిప్పలు పడతాను’ అంది నిషా. హర్యానాలో సోనిపట్‌లో 25 చదరపు మీటర్ల ఇంట్లో నివాసం ఉండే నిషా ఇవాళ మహిళా హాకీ టీమ్ లో ఇంత పెద్ద దేశానికి పతకం కోసం పోరాడుతోంది.. ‘మాకు మూడో కూతురుగా నిషా పుట్టింది. మళ్లీ ఆడపిల్లా అని బంధువులు హేళన చేశారు. ఇవాళ బ్యాట్‌తో సమాధానం చెప్పింది’ అని ఆనందబాష్పాలు రాలుస్తున్నారు తల్లిదండ్రులు. ఒక సన్నివేశం ఊహించండి. తొమ్మిదేళ్ల వయసు నుంచి హాకీ ఆడుతోంది ఆ అమ్మాయి. గుర్తింపు వచ్చి జాతీయ స్థాయిలో ఆడే రోజులు వచ్చాయి. ఇక దేశానికి పేరు తెలియనుంది. ఏమో... రేపు ప్రపంచానికి తెలియవచ్చేమో. కాని ఆ సమయంలోనే తండ్రికి పక్షవాతం వస్తుంది. ముగ్గురు కూతుళ్లున్న ఆ ఇంట్లో ఆ తండ్రి జీవనాధారం కోల్పోతే తినడానికి తిండే ఉండదు. ఇప్పుడు తండ్రి స్థానంలో బాధ్యత తీసుకోవాలా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగాలా? దిగినా కుదురుగా ఆడగలదా తను? అలాంటి పరిస్థితిలో ఆడగలరా ఎవరైనా అని ఆలోచించండి. ఆడగలను అని నిరూపించిన నిషా వర్శీని చూడండి. ఆమె పోరాటం తెలుస్తుంది. ఆమె నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో తెలుస్తుంది. టైలర్ కూతురు హర్యానాలోని సోనిపట్‌లో పేదలవాడలో పుట్టింది నిషా వర్శి. తండ్రి షొహ్రబ్ వర్శి టైలర్. ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురుగా నిషా జన్మించింది. టైలర్‌గా సంపాదించి ఆ ముగ్గురు కూతుళ్లను సాకి వారికి పెళ్లి చేయడమే పెద్దపని అనుకున్నాడు షొహ్రబ్. ‘పాపం... ముగ్గురు కూతుళ్లు’ అని బంధువులు జాలిపడేవారు అతణ్ణి చూసి. మూడోసారి కూతురు పుడితే ‘మూడోసారి కూడానా. ఖర్మ’ అని అన్నవాళ్లు కూడా ఉన్నారు. షొహ్రబ్ ఏమీ మాట్లాడలేదు. ముగ్గురిని ప్రాణంగా చూసుకున్నాడు. నిషా వర్శి హాకీ ఆడతానంటే ‘మన ఇళ్లల్లో ఆడపిల్లలు ఆటలు ఆడలేదు ఎప్పుడూ’ అన్నాడు. కాని తల్లి మెహరూన్ కూతురి పట్టుదల గమనించింది. ఆడనిద్దాం అని భర్తకు సర్దిచెప్పింది. నిషా వర్శి తల్లిదండ్రులు ఎన్నో అడ్డంకులు క్రీడల్లో రాణించడం, అందుకు తగిన పౌష్టికాహారం తినడం, ట్రైనింగ్ తీసుకోవడం, అవసరమైన కిట్లు కొనుక్కోవడం ఇవన్నీ పేదవారి నుదుటిరాతలో ఉండవు. కలలు ఉండొచ్చు కాని వాటిని నెరవేర్చుకోవడం ఉండదు. కాని నిషా పట్టుపట్టింది. ప్రస్తుతం భారత హాకీ టీమ్‌లో ఆడుతున్న నేహా గోయల్ కూడా ఆమె లాంటి నేపథ్యంతో ఆమె వాడలోనే ఉంటూ ఆమెకు స్నేహితురాలై హాకీ ఆడదామని ఉత్సాహపరిచింది. ఇద్దరూ మంచి దోస్తులయ్యారు. కాని తెల్లవారి నాలుగున్నరకు గ్రౌండ్లో ఉండాలంటే తల్లిదండ్రులు నాలుగ్గంటలకు లేవాల్సి వచ్చేది. తల్లి ఏదో వొండి ఇస్తే తండ్రి ఆమెను సైకిల్ మీద దించి వచ్చేవాడు. ఒక్కోసారి తల్లి వెళ్లేది. వారూ వీరు చూసి ‘ఎందుకు ఈ అవస్థ పడతారు. దీని వల్ల అర్దనానా కాణీనా’ అని సానుభూతి చూపించేవారు. మరొకటి ఏమంటే– ఇస్లాంలో మోకాళ్ల పైభాగం చూపించకూడదని భావిస్తారు. హాకీ స్కర్ట్ మోకాళ్ల పైన ఉంటుంది. మత పెద్దల నుంచి అభ్యంతరం రాకూడదని కోచ్‌కు చెప్పి లెగ్గింగ్స్ తో ఆడటానికి ఒప్పించింది నిషా. ఒలింపిక్స్‌లో కూడా లెగ్గింగ్స్తోనే ఆడింది. కొనసాగిన అపనమ్మకం 2016లో తండ్రి పక్షవాతానికి గురయ్యాక దీక్ష వీడక ఆడి జాతీయ, అంతర్జాతీయ మేచెస్ లో గుర్తింపు పొందింది నిషా వర్శీ. రైల్వే బోర్డ్ టీమ్‌లో ఆడటం వల్ల ఆమెకు రైల్వేలో 2018లో ఉద్యోగం దొరికింది. పరిమిత నేపథ్యం ఉన్న నిషా కుటుంబానికి ఇదే పెద్ద అచీవ్మెంట్. ‘చాలమ్మా... ఇక హాకీ మానెయ్. పెళ్లి చేసుకో’ అని నిషాను ఒత్తిడి పెట్టసాగారు. అప్పటికి ఆమెకు 24 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఆలస్యమైతే పెళ్లికి చిక్కులు వస్తాయేమోనని వారి ఆందోళన. కాని నిషాకు ఎలాగైనా ఒలింపిక్స్‌లో ఆడాలని పట్టుదల. ‘ఒలింపిక్స్‌లో ఆడేంత వరకూ నన్ను వదిలేయండమ్మా’ అని తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబం మంచి చెడ్డలు చూసుకుంటానని మేనమామ హామీ ఇచ్చాక పూర్తిగా ఆట మీదే ధ్యాస పెట్టింది. ఆమె గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటికి వెళ్లడమే లేదు. హాకీ సాధనలో, ఒలింపిక్స్ కోసం ఏర్పాటు చేసిన ట్రయినింగ్ క్యాంప్‌లో ఉండిపోయింది. చివరకు ఆస్ట్రేలియా మీద గెలిచాక సగర్వంగా ఇంటికి ఫోన్ చేసింది. అవును.. ఆడపిల్లే గొప్ప ఒకప్పుడు ఆడపిల్ల అని తక్కువ చూసి బంధువులు, అయినవారే ఇప్పుడు నిషాలోని గొప్పతనం అంగీకరిస్తున్నారు. ప్రతిభకు, ఆటకు, కుటుంబానికి, జీవితానికి కూడా ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సమానమే అని భావన తన సమూహంలో చాలా బలంగా ఇప్పుడు నిషా తీసుకెళ్లగలిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా గోల్ కొట్టడమే అసలైన ప్రతిభ. తాను అలాంటి గోల్ కొట్టి ఇవాళ హర్షధ్వానాలు అందుకుంటోంది నిషా. -
‘రియో’ విజేతను ఓడించి...
టోక్యో: మూడు దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. తమ ఖాతాలో మూడో విజయం జమ చేసుకొని క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా గురువారం జరిగిన పూల్ ‘ఎ’ నాలుగో లీగ్ మ్యాచ్‌లో 3–1 గోల్స్ తేడాతో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్జెంటీనాను ఓడించింది. క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్ తరఫున వరుణ్ కుమార్ (43వ నిమిషం), వివేక్ సాగర్ ప్రసాద్ (58వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించగా... అర్జెంటీనా తరఫున కాసెలా షుట్ (9వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు. తొలి క్వార్టర్‌లోనే గోల్ అప్పగించి వెనుకబడినా... భారత జట్టు ఆ తర్వాత చెలరేగి దూసుకుపోయింది. తాజా విజయంతో పూల్ ‘ఎ’ నుంచి కనీసం రెండో స్థానంలో భారత్ క్వార్టర్స్ చేరడం ఖాయమైంది. నేడు జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది. మెరిసిన మనూ... మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ క్వాలిఫయింగ్ విభాగం స్టేజ్–1 (ప్రెసిషన్)లో భారత షూటర్లు మనూ భాకర్ ఐదో స్థానంలో నిలువగా.... రాహీ సర్నోబత్ 25వ స్థానంలో నిలిచింది. మొత్తం 44 మంది షూటర్లు పాల్గొనగా... అందుబాటులో ఉన్న 300 పాయింట్లకుగానూ మనూ 292 పాయింట్లు సాధించింది. రాహీ 287 పాయిం ట్లు స్కోరు చేసింది. జొరానా అరునోవిచ్ (సెర్బియా– 296), అన్నా కొరకాకి (గ్రీస్– 294), ఆంటోనెటా కొస్టాడినోవా (బల్గేరియా–293) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నేడు క్వాలిఫయింగ్ స్టేజ్–2 (ర్యాపిడ్) జరగనుంది. ఈ రెండు అర్హత పోటీల్లో సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా టాప్–8లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఫైనల్ కూడా శుక్రవారమే జరగనుంది. 11వ స్థానంతో సరి రోయింగ్‌లో భారత ప్రయాణం ముగిసింది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో మెడల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయిన అర్జున్ లాల్–అరవింద్ సింగ్ జంట 11వ స్థానంతో సరిపెట్టుకుంది. 7–12 స్థానాల కోసం గురువారం జరిగిన రేసులో గ్రూప్ ’బి’ నుంచి బరిలోకి దిగిన భారత జోడీ 6ని:29.46 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఓవరాల్‌గా మాత్రం 11వ స్థానంలో నిలిచింది. గోల్ఫ్: 8వ స్థానంలో అనిర్బన్ రెండోసారి ఒలింపిక్స్‌లో ఆడుతోన్న భారత గోల్ఫర్ అనిర్బన్ లాహిరి సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల గోల్ఫ్ తొలి రౌండ్‌ను అతడు ఎనిమిదో స్థానంతో ముగించాడు. 18 హోల్స్ కోర్సును 67 షాట్లల్లో పూర్తి చేసిన అనిర్బన్... సెబాస్టియన్ (కొలంబియా), పాల్ కేసీ (బ్రిటన్), అలెక్స్ నొరెన్ (స్వీడన్)లతో కలిసి సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మరో భారత గోల్ఫర్ ఉదయన్ మానె 76 షాట్లల్లో కోర్సును ముగించి చివరి స్థానం (60వ)లో నిలిచాడు. ఈ ఈవెంట్ నాలుగు రౌండ్ల పాటు జరగనుండగా... 60 మంది పతకం రేసులో ఉన్నారు. మన అశ్వం బాగుంది ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడ) ఈవెంట్లో పాల్గొనడానికి భారత రైడర్ ఫౌద్ మీర్జా కు లైన్ క్లియర్ అయింది. అతని ఈక్వైన్ (గుర్రం) సంపూర్ణ ఆరోగ్యం తో ఉందంటూ ఈవెంట్ జడ్జింగ్ కమిటీ తన రిపోర్టులో పేర్కొంది. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్ జరగడానికి ముందు పోటీల్లో పాల్గొనే రైడర్ల గుర్రాలను జడ్జింగ్ కమిటీ పరిశీలిస్తుంది. వాటికి పోటీలో పాల్గొనేందుకు సరిపడా ఫిట్నెస్ ఉందా... ఏమైనా గాయాలు ఉన్నాయా అనే విషయాలను చూస్తారు. ఒకవేళ వారి పరిశీలనలో గుర్రానికి గాయాలు ఉన్నట్లు తేలితే... దానిని పోటీ నుంచి తొలగిస్తారు. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్ శుక్రవారం నుంచి సోమవారం వరకు జరగనుండగా... ఫౌద్ మీర్జా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
పురుషుల హాకీ జట్టు శుభారంభం
టోక్యో: ఒలింపిక్స్ హాకీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు శుభారంభం చేయగా... మహిళల జట్టు చిత్తుగా ఓడింది. పూల్ ‘ఎ’లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–2తో గెలుపొందింది. హర్మన్‌ప్రీత్ (26వ, 33వ ని.లో) రెండు గోల్స్ సాధించగా, రూపిందర్ పాల్ సింగ్ (10వ ని.లో) ఒక గోల్ చేశాడు. సీనియర్ గోల్‌కీపర్ శ్రీజేశ్ గోల్‌పోస్ట్ వద్ద ప్రత్యర్థి గోల్స్‌ను చాకచక్యంగా ఆడ్డుకోవడంతో ప్రపంచ నాలుగో ర్యాంకర్ భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టులో కేన్ రసెల్(6వ ని.), జెనెస్(43వ ని.) చెరో గోల్ చేశారు. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మరోవైపు మహిళల గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్ చేతిలో 1–5 గోల్స్ తేడాతో ఓడింది. అమ్మాయిల జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచారు. డిఫెండర్లు చేతులెత్తేయగా... అలసత్వం జట్టును నిండా ముంచేసింది. నెదర్లాండ్స్ జట్టులో ఫెలిస్ అల్బర్స్ (6వ, 43వ ని.) రెండు గోల్స్ చేయగా, గెఫిన్ (33వ ని.), ఫ్రెడెరిక్ మట్ల (45వ ని.), జాక్వెలిన్ వాన్ (52వ ని.) తలా ఒక గోల్ సాధించారు. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను కెప్టెన్ రాణి రాంపాల్ పదో నిమిషంలో సాధించింది. 26న జరిగే తదుపరి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు జర్మనీతో ఆడుతుంది. -
రాణి రాంపాల్‌కే మహిళల హాకీ జట్టు పగ్గాలు
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుందని హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును గత వారం ప్రకటించిన హెచ్ఐ కెప్టెన్ పేరును వెల్లడించలేదు. వైస్ కెప్టెన్లుగా గోల్‌కీపర్ సవిత, దీప్ గ్రేస్ ఎక్కా వ్యవహరిస్తారు. ‘ఒలింపిక్స్‌లో జట్టును నడిపించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని భారత్ తరఫున 241 మ్యాచ్‌లు ఆడి 118 గోల్స్ చేసిన రాణి వ్యాఖ్యానించింది. -
కరోనా: భారత హాకీ దిగ్గజం ఇక లేరు
సాక్షి, లక్నో: కరోనా మహమ్మారి మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ (60) కరోనా కారణంగా శనివారం కన్నుమూశారు. ఏప్రిల్ 24న కరోనా సోకడంతో లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే వైరస్ నుంచి కోలుకొని సాధారణ వార్డుకు చేర్చిన అనంతరం శుక్రవారం అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. రవీందర్ పాల్ మరణంపై హాకీ ఇండియా ట్విటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసింది. క్రీడా మంత్రి కిరణ్ రిజుజు సంతాపం తెలిపారు. ఒక గోల్డెన్ క్రీడాకారుడిని కోల్పోయిదంటే ట్వీట్ చేశారు. క్రీడా రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ నివాళులర్పించారు. కాగా 1980లో మాస్కో ఒలింపిక్ విజేత జట్టులో రవీందర్ పాల్ సింగ ఉన్నారు. అలాగే కరాచీ వేదికగా జరిగిన 1980, 83 ఛాంపియన్స్ ట్రోఫీల్లోనూ పాల్గొన్నారు. 1983 సిల్వర్ జూబ్లీ కప్ (హాంకాంగ్), 1982 ప్రపంచకప్ (ముంబై, 1982 ఆసియా కప్ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1984 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు. లక్నోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. చదవండి: కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే! శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్?! Saddened to learn about the loss of former India International who was part of the Gold Medal winning Indian squad at the 1980 Moscow Olympics, Mr. Ravinder Pal Singh. Hockey India sends its condolences to his family and loved ones. 🙏#IndiaKaGame pic.twitter.com/vHjIQlrDqW — Hockey India (@TheHockeyIndia) May 8, 2021 Deeply saddened by the passing of Ravinder Pal Singh sir, member of the 1980 Gold-winning Olympics team. It was a unit which taught generations of us the value of dream, dedication and hard work. May his soul rest in peace. #COVIDSecondWave #Indianhockey 📷 Lucknow Tribune pic.twitter.com/r4RqBMv3Ns — SV Sunil | ಎಸ್.ವಿ. ಸುನಿಲ್ (@SVSunil24) May 8, 2021 -
అర్జెంటీనా పర్యటన మేలు చేసింది
బెంగళూరు: ఇటీవల ముగిసిన అర్జెంటీనా పర్యటనతో భారత పురుషుల హాకీ జట్టు చాలా లాభ పడిందని జట్టు కోచ్ గ్రాహమ్ రీడ్ అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్‌కు మరో మూడు నెలల సమయమే ఉండటంతో భారత ఆటగాళ్లకు మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు ఈ పర్యటన దోహదం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనావల్ల దాదాపు ఏడాది ఆటకు దూరమైనా... అర్జెంటీనా పర్యటనలో భారత జట్టు అంచనాలకు మించి రాణించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కాగా, అర్జెంటీనా పర్యటనలో ఆడిన రెండు ప్రొ లీగ్ మ్యాచ్‌లను గెల్చుకున్న భారత్... నాలుగు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, ఒక దాంట్లో ఓడి... మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం భారత జట్టు బెంగళూరులోని ‘సాయ్’ కేంద్రంలో ఒలింపిక్స్ సన్నాహాల్లో ఉంది. చదవండి: రూ.5,850 కోట్లతో మేం రెడీ..! -
భారత హాకీ దిగ్గజంపై సినిమా
ముంబై : క్రికెటర్లు ధోని, సచిన్ టెండూల్కర్... అథ్లెట్ మిల్కా సింగ్... బాక్సర్ మేరీకోమ్... హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌లపై ఇప్పటికే బయోపిక్‌లు వచ్చా యి. మైదానంలో ఆడిన ఆట మలీ్టప్లెక్స్, సినిమా తెరలపై కూడా ఆడింది. కానీ వీరందరికంటే ముందు అసాధారణ ఆటతో భారత్‌ను గెలిపించి, మువ్వన్నెలను మురిపించి, నియంతలనే మెప్పించిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ ‘షో’ వెండితెరపై వెనుకబడింది. అయితే ఇప్పుడు ఆ ముచ్చట కూడా త్వరలోనే తీరనుంది. బాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ చౌబే భారత హాకీ లెజెండ్‌పై బయోపిక్ రూపొందించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. అన్నట్లు ఈ చిత్రం పేరు మన లెజెండ్ హీరో పేరే... ‘ధ్యాన్‌చంద్’. ఆర్ఎస్వీపీ మూవీస్, బ్లూ మంకీ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రనిర్మాణం చేపట్టినట్లు దర్శకుడు తెలిపారు. వచ్చే ఏడాది సెట్స్‌పై లైట్స్... కెమెరా... యాక్షన్... అంటూ రూపుదిద్దుకోనుంది. 2022లో విడుదల కానుంది. భారత హాకీ చరిత్రనే ‘స్వర్ణ’ అక్షరాలతో లిఖించిన మూడు ఒలింపిక్స్ (1928–అమ్‌స్టర్‌డామ్), (1932 –లాస్ఏంజెలిస్), (1936– బెర్లిన్) ప్రదర్శనలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అయితే తెరపై ఎవరా ‘ధ్యాన్‌చంద్’ అంటే కొన్నాళ్లు నిరీక్షించాలి. స్టార్ హీరోతోనే ఈ చిత్రం ఉంటుందని సమాచారం. -
స్ఫూర్తిదాయక ప్రయాణం..
రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఇదొక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో కనీస వసతులు కూడా లేని చోట హాకీలో శిక్షణ పొందిన 9 మంది గిరిజన బాలికలు జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. 14– 17 ఏళ్ల వయసున్న ఈ బాలికలకు ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) సిబ్బంది నాలుగేళ్ల క్రితం నుంచి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అక్కడ మైదానం లేకపోవడంతో ఓ హెలిప్యాడ్ స్థలంలోనే గిరిజన బాలికలు హాకీలో శిక్షణ పొందారు. ఆటలో రాటుదేలారు. వీరిలో 9 మంది సబ్–జూనియర్, జూనియర్ జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారని ఐటీబీపీ అధికారులు తెలిపారు. మంచి వసతులు కల్పించి, సరైన శిక్షణ ఇస్తే గిరిజన బాలికలు సైతం అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. ‘‘హాకీ మన జాతీయ క్రీడ అని పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే, 2016 దాకా ఆ ఆట గురించి మాకేమీ తెలియదు. ఐటీబీపీ అధికారులు చెప్పిన తర్వాతే తెలుసుకున్నాం. ఇది మొత్తం అటవీ ప్రాంతం. మైదానం లేకపోవడంతో మర్దపాల్ పోలీసు క్యాంప్ సమీపంలోని హెలిప్యాడ్‌లో ప్రాక్టీస్ చేశాం. మైదానం ఏర్పాటు చేయాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరుతున్నాం’’అని సులోచనా నేతం అనే బాలిక పేర్కొన్నారు. (రేప్‌లు ఆగాలంటే.. అమ్మాయిలు మర్యాదగా ఉండాలి..) -
హాకీ ఇండియా సిబ్బందికి కోవిడ్ పాజిటివ్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) సిబ్బందిలో శనివారం ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. శుక్రవారం హెచ్ఐ సిబ్బందికి కోవిడ్–19 పరీక్షలు నిర్వహించగా అకౌంటెంట్, జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ వైరస్ బారిన పడినట్లు తేలింది. దాంతో రెండువారాలపాటు హాకీ ఇండియా కార్యాలయం మూతపడనుంది. మరోవైపు తన తండ్రి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బత్రా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూన్ మొదటి వారంలో మరోసారి తాను కోవిడ్–19 పరీక్షకు హాజరవుతానని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్ఎస్ఎఫ్), జాతీయ ఒలింపిక్ కమిటీలు (ఎన్ఓసీ) తమ ఉద్యోగులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని బత్రా విజ్ఞప్తి చేశారు. -
కరోనా కల్లోలం...
లుసానే: కరోనా (కోవిడ్–19) దెబ్బకు స్పోర్ట్స్ ఈవెంట్ల వాయిదా పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఐపీఎల్, ఈపీఎల్, ఎన్బీఏ, ఫార్ములావన్, బ్యాడ్మింటన్, టెన్నిస్‌లాంటి విఖ్యాత స్పోర్ట్స్ ఈవెంట్స్ వాయిదా పడగా... తాజాగా ఆ జాబితాలోకి హాకీ ప్రొ లీగ్ కూడా జరిగింది. ప్రస్తుతం జరుగుతోన్న ఈ లీగ్ రెండో సీజన్లో ఏప్రిల్ 15 వరకు జరిగే అన్ని మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) శనివారం ప్రకటించింది. అయితే వీటిని తిరిగి నిర్వహించేది లేనిది తెలియాల్సి ఉంది. ‘కరోనాపై మాకు అందుతున్న సమాచారం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆదేశాలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను పరిగణలోకి తీసుకుంటూ... ఏప్రిల్ 15 వరకు జరిగే ప్రొ లీగ్ మ్యాచ్‌లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఎఫ్ఐహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లీగ్‌లో ఆడుతున్న హాకీ దేశాల సంఘాలతో చర్చించాకే ఎఫ్ఐహెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నాటికి కరోనా ఉధృతి తగ్గినట్లయితే... అదే నెల చివర్లో ఈ లీగ్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎఫ్ఐహెచ్ పేర్కొంది. ఈ లీగ్‌లో మొత్తం 9 జట్లు పాల్గొంటుండగా... భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 26న బెర్లిన్ వేదికగా జర్మనీతో ఆడాల్సి ఉంది. -
భారత్‌ను తరచుగా ఓడించేవాళ్లం: ఇమ్రాన్
దావోస్: భారత క్రికెట్ జట్టును ఎన్నోసార్లు తమ జట్టు ఓడించిందంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..తాను క్రికెట్ ఆడే సమయంలో ఎన్నోసార్లు భారత్‌ను ఓడించామని అన్నారు. పరిమాణంలో తమ కంటే 7 రెట్లు పెద్ద దేశమైన భారత్‌ను తరచూగా ఓడించేవాళ్లమంటూ, అప్పట్లో హాకీ, ఇతర క్రీడలలో పాక్ అద్భుతంగా రాణిస్తుండేదని పేర్కొన్నారు. అప్పట్లో ఓడిన జట్టుకు ఏ బహుమతి ఇచ్చేవారు కాదని, కనీసం సానుభూతి చూపేవారు కాదని ఇమ్రాన్ అన్నారు. తాను రాజకీయాల్లోకి రాగానే కొందరు నవ్వారని..కానీ తానెప్పుడు లక్ష్యాన్ని వదిలిపెట్టలేదన్నారు. దేశంలో అనేక సహజ వనరులున్నాయని..సులభతర వాణిజ్య సూచీలో మెరుగైన స్థానాన్ని పొందడమే తమ లక్ష్యమన్నారు. 1960లో పాకిస్తాన్ చాలా అద్భుత దేశమని..ఆసియా దేశాలకు ఆదర్శంగా నిలిచేదని చెప్పుకొచ్చారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా తమ దేశంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిందని..సైన్యం అధికారంలోకి తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు. దేశంలో మంచి పరిపాలన అందించగలిగితే పాకిస్తాన్ అభివృద్ధి చెందడం ఖాయమని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. చదవండి: ఇమ్రాన్‌పై ఒవైసీ ఫైర్ -
హాకీకి సునీత వీడ్కోలు
న్యూఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతోన్న భారత మహిళల హాకీ జట్టు సీనియర్ డిఫెండర్, మాజీ సారథి సునీతా లక్రా గురువారం ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో గత గాయం తిరగబెట్టడంతో తాను రిటైర్ అవుతున్నట్లు ఆమె వెల్లడించింది. ‘ఈ రోజు నాకు చాలా భావోద్వేగమైన రోజు. అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకొంటున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలని భావించా. అందుకోసం సన్నద్ధం కూడా అవుతున్నా. అయితే నా మోకాలికి మరొకసారి సర్జరీ అవసరం అవుతుంది. సర్జరీ చేయించుకున్నా ఒలింపిక్స్ లోపు పూర్తి స్థాయిలో కోలుకుంటానన్న నమ్మకం లేదు’ అంటూ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొంది. 2008లో అరంగేట్రం చేసిన సునీత భారత్ తరఫున 139 మ్యాచ్‌లు ఆడింది. ఆమె నాయకత్వంలోని జట్టు 2018 ఆసియా చాంపియన్‌షిప్ ట్రోఫీలో రెండో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సునీత 2014 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన జట్టులో సభ్యురాలు. -
ఫీల్డ్‌లోనే హాకీ స్టిక్స్‌తో కొట్టుకున్న ఆటగాళ్లు
ఢిల్లీ: అదొక హాకీ మ్యాచ్.. జాతీయ స్థాయిలో జరిగే నెహ్రా హాకీ కప్ టోర్నమెంట్. అందులోనూ ఫైనల్ మ్యాచ్. ఇక్కడ ఆటగాళ్లు క్రీడా స్పూర్తిని మరిచిపోవడమే కాదు.. విజ్ఞతను కూడా వదిలేశారు. హాకీ స్టిక్స్‌తో ఒకరిపై ఒకరు తెగబడ్డారు. మ్యాచ్‌ను గెలిచి తీరాలన్న కసి కాస్తా కొట్లాటకు దారి తీసింది. ఈ కొట్లాటలో పంజాబ్ పోలీస్ జట్టు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ జట్లు భాగమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. 56వ నెహ్రూ హాకీ టోర్నమెంట్లో భాగంగా పంజాబ్ పోలీస్ టీమ్- పంజాబ్ నేషనల్ బ్యాంక్ టీమ్‌లు సోమవారం తుది పోరులో తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా మ్యాచ్ సాగుతోంది. ఆటలో నువ్వా-నేనా అన్నట్లు ఇరు జట్లు తలపడుతున్నాయి. తలో మూడు గోల్స్‌తో సమంగా ఉన్నాయి. ఆ సమయంలో పంజాబ్ పోలీస్ జట్టు.. పీఎన్బీతో కాస్త దురుసుగా ప్రవర్తించింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు తొలుత మాటల యుద్ధానికి దిగారు. అది కాస్తా పెద్దదిగా మారి కొట్టుకునే వరకూ వెళ్లింది. హాకీ స్టిక్స్‌తో ఇరు జట్లు ఆటగాళ్లు కొట్టుకున్నారు. దాంతో మ్యాచ్ నిర్వహాకులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. దీనిపై నేషనల్ ఫుట్‌బాల్ హాకీ ఫెడరేషన్ సీరియస్ అయ్యింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టోర్నమెంట్లో నిర్వహకుల్ని కోరింది. ఈ గొడవ తర్వాత మళ్లీ మ్యాచ్‌ను కొనసాగించగా పీఎన్బీ 6-3 తేడాతో పంజాబ్ పోలీస్ జట్టుపై గెలిచింది. #WATCH Delhi: Scuffle broke out between Punjab Police Hockey & Punjab National Bank Hockey teams during Nehru Cup finals. Elena Norman, Hockey India CEO says, "We're awaiting official report from Tournament officials, based on which Hockey India will take necessary action." pic.twitter.com/Yz3LAtGPl7 — ANI (@ANI) November 25, 2019 -
ఎక్స్‌ప్రెస్ వేగం
హాకీ ఆట ఆడబోతున్నారు హీరో సందీప్ కిషన్. మరి.. ఈ ఆటలో సందీప్ ప్రత్యర్థులను బోల్తా కొట్టించి ఎక్స్‌ప్రెస్ వేగంతో ఎలా గోల్స్ చేస్తారో చూడటానికి కాస్త సమయం ఉంది. సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రానికి ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తారు సందీప్. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తారు. ఈ సినిమా ప్రీ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. నవంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది విడుదల చేయాలను కుంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో హాకీ క్రీడాకారిణి దుర్మరణం
కర్ణాటక, బొమ్మనహళ్లి : రోడ్డు ప్రమాదంలో హాకీ క్రీడాకారిణి సుజాత కేరాళి (17) దుర్మరణం చెందిన ఘటన ధార్వాడ తాలూకాలోని మాదనబావి గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. క్రీడాకారిణి సుజాత కేరాళి ఉదయం తండ్రి మల్లికార్జునతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా జాతీయ రహదారిలో కారు ఢీకొంది. దీంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మల్లికార్జునను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్లో పరారీలో ఉన్నాడు. గరగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సర్దార్ ఇక హాకీ సెలక్టర్...
న్యూఢిల్లీ: ఇటీవలే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్‌సింగ్ ఇక సెలక్టర్ పాత్ర పోషించనున్నాడు. 13 మంది సభ్యుల భారత హాకీ సెలక్షన్ కమిటీలో సర్దార్కు చోటు దక్కింది. ఈ విషయాన్ని సర్దార్ సింగ్ ధ్రువీకరించాడు. ‘భారత హాకీకి ఆటగాడిగానే కాకుండా ఏ రకంగా సేవచేసేందుకైనా నేను సిద్ధం. అందుకే సెలక్టర్ పాత్రను పోషించేందుకు కూడా సిద్ధమయ్యాను. సెలక్టర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. రెండు దశాబ్దాలుగా ఆటగాడిగా హాకీ పరిస్థితుల్ని దగ్గరుండి చూశా. జట్టుకు ఏది ముఖ్యమో అర్థం చేసుకున్నా. అనుభవజ్ఞులు, యువతతో కూడిన సమతూకమైన జట్టుకే నేను మద్దతిస్తా’ అని సర్దార్ సింగ్ పేర్కొన్నాడు. సర్దార్తో పాటు హర్బీందర్ సింగ్, సయ్యద్ అలీ, సుబ్బయ్య, ఆర్పీ సింగ్, రజనీశ్ మిశ్రా, జోయ్‌దీప్ కౌర్, సురేందర్కౌర్, అసుంత లాక్రా, హై పర్ఫామెన్స్ డైరైక్టర్ డేవిడ్ జాన్, భారత సీనియర్ పురుషుల, మహిళల జట్ల కోచ్‌లు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి 1975 హాకీ ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన బీపీ గోవింద సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
తుది పోరుకు భారత్
మస్కట్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా హాకీ చాంపి యన్స్ ట్రోఫీలో నాలుగోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 3–2తో గెలిచింది. భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (19వ ని.లో), చింగ్లేన్‌సనా (44వ ని.లో), దిల్‌ప్రీత్‌సింగ్ (55వ ని.లో).... జపాన్ తరఫున వకురి (22వ ని.లో), జెన్దాన (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘షూటౌట్’లో 3–1తో మలేసియాను ఓడించింది. నేడు జరిగే టైటిల్ పోరులో భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటాయి. గతంలో భారత్ 2011, 2016లలో ఫైనల్లో పాక్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. -
భారత హాకీ జట్టుకు రజతం
బ్యూనస్ ఎయిర్స్: నాలుగేళ్ల క్రితం కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకున్న భారత బృందం ఈసారి యూత్ ఒలింపిక్స్‌లో అదరగొడుతోంది. ఫైవ్–ఎ–సైడ్ హాకీ పురుషుల విభాగంలో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. మలేసియాతో జరిగిన ఫైనల్లో భారత్ 2–4తో ఓడింది. స్వర్ణం–రజతం కోసం అర్జెంటీనాతో భారత మహిళల జట్టు కూడా తలపడనుంది. మహిళల రెజ్లింగ్ 43 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సిమ్రన్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో సిమ్రన్ 6–11తో ఎమిలీ (అమెరికా) చేతిలో ఓడింది. నాలుగు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో ఇప్పటికే భారత్ 10 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇప్పటివరకు మను భాకర్, సౌరభ్ (షూటింగ్), లాల్రినుంగా (వెయిట్‌లిఫ్టింగ్) స్వర్ణాలు సాధించగా... తబాబి దేవి (జూడో), తుషార్ (షూటింగ్), మెహులీ (షూటింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), సిమ్రన్ (రెజ్లింగ్) రజతాలు గెలిచారు. 2010 యూత్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్
సాక్షి, న్యూఢిల్లీ : భారత స్టార్ హాకీ ఆటగాడు, మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించారు. తాను శాస్వతంగా ఆట నుంచి వైదొలుగుతున్నానని బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఏషియన్ గేమ్స్‌లో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. భారీ ఆశల నడుమ ఏషియన్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు చేరకపోవటం సర్దార్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఇన్నాళ్ల తన ప్రయాణంలో హాకీని ఎంతో ఆస్వాధించానని.. జట్టు నుంచి వైదొలగడానికి తనకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. 32 ఏళ్ల సర్దార్ సింగ్ భారత్‌కు 350 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2008-16 మధ్యలో ఎనిమిదేళ్లు భారత జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించాడు. ఇతని నాయకత్వంలోనే 2008లో సుల్తాన్ అజ్లాన్ షా కప్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారత హాకీ జట్టుకు సర్ధార్ చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2012లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ అవార్డులతో గౌరవించింది. అంతే కాకుండా సర్దార్ నాయకత్వంలోనే భారత్ రెండు సార్లు ఒలంపిక్స్‌లో పాల్గొంది. -
సెమీస్‌లో భారత్‌కు షాక్
జకార్తా: డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల సెమీఫైనల్లో అనూహ్య ఓటమి పాలైంది. గురువారం జరిగిన సెమీస్‌లో భారత్ 6–7తో మలేసియా చేతిలో షూటౌట్లో ఓడింది.మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని కొనసాగించిన మన జట్టు చివరి నిమిషంలో ప్రత్య ర్థికి గోల్ సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్‌తో సమంగా నిలవడంతో షూటౌట్ ద్వారా విజేతను తేల్చారు. షూటౌట్లో తొలుత ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా... మన్‌ప్రీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, ఎస్వీ సునీల్ విఫలమయ్యారు. గోల్ కీపర్, కెప్టెన్ శ్రీజేశ్ ప్రత్యర్థి ఆటగాళ్ల మూడు షాట్లను అడ్డుకోవడంతో మళ్లీ స్కోరు 2–2తో సమమైంది. దీంతో ‘సడన్ డెత్’ కొనసాగించారు. అందులోనూ ఇరు జట్లు వరుసగా నాలుగేసి గోల్స్ చేశాయి. ఐదో షాట్‌ను మలేసియా ఆటగాడు గోల్ పోస్ట్‌లోకి కొట్టగా... ఐదో షాట్ ఆడిన సునీల్ గోల్ కొట్టలేకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. అంతకుముందు మ్యాచ్‌లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (33వ ని.లో), వరుణ్ కుమార్ (40వ ని.లో) చెరో గోల్ చేశారు. మలేసియా తరఫున ఫైజల్ సారి (39వ ని.లో), మొహమ్మద్ రహీం (59వ ని.లో) చెరో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 7 పెనాల్టీ కార్నర్ అవకాశాలు రాగా అందులో రెండింటిని గోల్స్‌గా మలిచింది. మరో సెమీస్‌లో జపాన్ 1–0తో పాకిస్తాన్‌పై గెలిచి ఫైనల్ చేరింది. శనివారం స్వర్ణం కోసం మలేసియాతో జపాన్; కాంస్యం కోసం పాకిస్తాన్‌తో భారత్ తలపడతాయి. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎదురైన ప్రతీ ప్రత్యర్థిని చిత్తు చేస్తూ.... రికార్డు స్థాయిలో 76 గోల్స్‌తో సెమీస్‌కు చేరింది శ్రీజేశ్ సేన. ప్రత్యర్థులకు 3 గోల్స్ మాత్రమే ఇచ్చింది. కానీ అసలు పోరులో తమకంటే బలహీన ప్రత్యర్థి చేతిలో ఓడింది. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు... ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గి నేరుగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకున్న భారత్ ఆశలు ఈ ఓటమితో ఆవిరయ్యాయి. ఇక ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే మన జట్టు అర్హత టోర్నీలు ఆడాల్సి ఉంటుంది. -
ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ‘శాట్స్’ ఎండీ ఎ. దినకర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత హాకీ క్రీడకు ధ్యాన్‌చంద్ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ‘సాయ్’ రీజనల్ డైరెక్టర్ శ్యామ్ సుందర్, అసిస్టెంట్ డైరెక్టర్ సీఎం సత్యరాజ్, ‘శాట్స్’ డిప్యూటీ డైరెక్టర్ జి.ఎ.శోభ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విమలాకర్ రావు పలువురు కోచ్‌లు, క్రీడాకారులు, గచ్చిబౌలి స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ హకీ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దినకర్‌బాబు మాట్లాడుతూ యువ క్రీడాకారులు లెజెండ్ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో సత్తా చాటాలని పేర్కొన్నారు. -
లంకపైనా గోల్స్ వర్షం
జకార్తా: ఏషియాడ్ పురుషుల హాకీలో భారత్ భారీ సంఖ్యలో గోల్స్‌తో అదరగొడుతోంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో 20–0తో జయభేరి మోగించింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (9, 11, 17, 22, 32, 42వ నిమిషాల్లో) ఆరు గోల్స్ చేయడం విశేషం. రూపిందర్ పాల్ సింగ్ (1, 52, 53వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (5, 21, 33వ ని.), మన్దీప్ సింగ్ (35, 43, 59వ ని.) మూడేసి కొట్టారు. లలిత్ రెండు, ప్రసాద్, అమిత్, దిల్‌ప్రీత్ సింగ్ తలా ఒక గోల్ సాధించారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ పూల్ ‘ఎ’లో అజేయంగా అగ్రస్థానంలో నిలిచింది. పూల్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన మలేసియాతో గురువారం జరిగే సెమీఫైనల్లో టీమిండియా తలపడతుంది. మరో సెమీఫైనల్లో కొరియాతో పాక్ ఆడుతుంది. బాక్సింగ్‌లో నిరాశ... ఏషియాడ్ మహిళల బాక్సింగ్‌లో మంగళవారం భారత్‌కు నిరాశ ఎదురైంది. 57 కేజీల విభాగంలో సోనియా లాథర్ 0–5తో ఉత్తర కొరియా బాక్సర్ జొ సన్ హ్వా చేతిలో ఓడిపోయింది. 60 కేజీల విభాగంలో పవిత్ర 2–3తో హుస్వాతున్ హసనాహ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలైంది. -
భారత్ శుభారంభం
బెంగళూరు: న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–2తో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (2వ, 34వ నిమిషంలో) రెండు గోల్స్‌తో ఆకట్టుకోగా... మన్దీప్ సింగ్ (15వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (38వ నిమిషంలో) చెరో గోల్ నమోదు చేశారు. ప్రత్యర్థి జట్టు తరఫున స్టీఫెన్ జెన్నెస్ (26వ, 55వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఏడో నిమిషంలో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం వచ్చినా దాన్ని భారత గోల్ కీపర్ కిృషన్ పాఠక్ అడ్డుకున్నాడు. 15వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని మన్దీప్ గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యం 2–0కు పెరిగింది. అనంతరం న్యూజిలాండ్ స్ట్రయికర్ జెన్నెస్ గోల్‌తో ఆధిక్యం 2–1కి తగ్గినా... రెండు క్వార్టర్లు ముగిసే సరికి తర్వాత వచ్చిన రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలను రూపిందర్, హర్మన్‌ప్రీత్ గోల్స్‌గా మలిచి 4–1తో భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. చివర్లో జెన్నెస్ మరో గోల్ చేసినా అది ఆధిక్యాన్ని తగ్గించడానికే పరిమితమైంది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ శనివారం జరుగనుంది. -
హాంకాంగ్‌తో భారత్ తొలి పోరు
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేసియాలోని జకార్తాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. హాకీ ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. పూల్ ‘ఎ’లో భారత్‌తోపాటు కొరియా, జపాన్, శ్రీలంక ఉన్నాయి. ఆగస్టు 22న హాంకాంగ్‌తో ఆడనున్న భారత్ ఆ తర్వాత వరుసగా జపాన్ (24న), కొరియా (26న), శ్రీలంక (28న) జట్లతో తలపడుతుంది. పూల్ ‘బి’లో పాకిస్తాన్, మలేసియా, బంగ్లాదేశ్, ఒమన్, థాయ్‌లాండ్, ఇండోనేసియా జట్లున్నాయి. భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 19న ఇండోనేసియాతో ఆడుతుంది. ఆ తర్వాత కజకిస్తాన్ (21న), కొరియా (25న), థాయ్‌లాండ్ (27న) జట్లను భారత్ ‘ఢీ’కొంటుంది. పురుషుల, మహిళల విభాగంలో విజేతగా నిలిచిన జట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. -
హాంకాంగ్‌తో భారత్ తొలి పోరు
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేసియాలోని జకార్తాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. హాకీ ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. పూల్ ‘ఎ’లో భారత్‌తోపాటు కొరియా, జపాన్, శ్రీలంక ఉన్నాయి. ఆగస్టు 22న హాంకాంగ్‌తో ఆడనున్న భారత్ ఆ తర్వాత వరుసగా జపాన్ (24న), కొరియా (26న), శ్రీలంక (28న) జట్లతో తలపడుతుంది. పూల్ ‘బి’లో పాకిస్తాన్, మలేసియా, బంగ్లాదేశ్, ఒమన్, థాయ్‌లాండ్, ఇండోనేసియా జట్లున్నాయి. భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 19న ఇండోనేసియాతో ఆడుతుంది. ఆ తర్వాత కజకిస్తాన్ (21న), కొరియా (25న), థాయ్‌లాండ్ (27న) జట్లను భారత్ ‘ఢీ’కొంటుంది. పురుషుల, మహిళల విభాగంలో విజేతగా నిలిచిన జట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. -
ప్రపంచకప్ హాకీ టోర్నీకి రజని
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హాకీ క్రీడాకారిణి ఇతిమరపు రజని ప్రపంచకప్ టోర్నమెం ట్లో పాల్గొనే భారత జట్టులో ఎంపికైంది. గతేడాది ఆసియా కప్ నెగ్గిన భారత జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించిన రజని ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్న∙భారత జట్టులో రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జూలై 21 నుంచి ఆగస్టు 5 వరకు లండన్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్ కీపర్లు), సునీత లాక్రా, దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మిన్జ్, మోనిక, నేహా గోయల్, నవ్‌జ్యోత్ కౌర్, నిక్కీ ప్రధాన్, రాణి రాంపాల్ (కెప్టెన్), వందన కటారియా, నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి, ఉదిత. -
భారత్ 1–1 బెల్జియం
బ్రెడా (నెదర్లాండ్స్): చివరి క్షణాల్లో పట్టు సడలించి ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చే అలవాటు మరోసారి భారత్ కొంపముంచింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన భారత హాకీ జట్టు చివరి రెండు నిమిషాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకొని గెలవాల్సిన మ్యాచ్‌ను చివరకు ‘డ్రా’గా ముగించింది. చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో గురువారం ఇక్కడ బెల్జియం, భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో సమమైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (10వ నిమిషంలో), బెల్జియం తరఫున లొయిక్ ల్యూపార్ట్ (59వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడైన ఆటతో చెలరేగిన భారత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒత్తిడిని కొనసాగిస్తూ... మ్యాచ్‌పై పైచేయి కనబర్చింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో దాడులు తీవ్రతరం చేసిన బెల్జియం ఆటగాళ్లు బంతిని ఎక్కువ శాతం తమ నియంత్రణలో ఉంచుకొని భారత ఆటగాళ్లను విసిగించారు. ఈ క్రమంలో భారత్‌కు గోల్ చేసే అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... బెల్జియం ఆటగాళ్లకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను లొయిక్ లూపార్ట్ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. -
అంచనాలను పెంచేసిన గోల్డ్ ట్రైలర్
1948 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ హకీలో గోల్డ్ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రమే ‘గోల్డ్’. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. 2:18నిమిషాల పాటు కొనసాగిన ‘గోల్డ్’ ట్రైలర్, పేరుకు తగినట్లుగానే బంగారం లాంటి సినిమా అనిపిస్తుంది. ‘గోల్డ్, బ్రిటిష్ ఇండియా’ అనే వాయిస్ ఓవర్‌తో 1936 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ట్రైలర్లో బ్రిటీష్ జెండా వైవు తదేకంగా చూస్తున్న అక్షయ్ కుమార్ కళ్లల్లో ‘ఇది కాదు నేను కోరుకున్నది’ అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైలర్లోనే ఈ ఖిలాడీ హీరో దేశభక్తితో పాటు క్రీడల పట్ల తన ప్రేమను ఏక కాలంలోఅద్భుతంగా ప్రదర్శించాడు. బుల్లితెర ధారవాహిక ‘నాగిని’ ఫేం మౌనీ రాయ్ అక్షయ్‌ను బెంగాలీలో తిడుతూ ఓ 5 సెకన్ల పాటు కనిపించింది. ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడిగా మౌనీరాయ్ నటించిన సంగతి తెలిసిందే. కాగా మౌనీరాయ్కు ఇదే తొలి బాలీవుడ్ చిత్రం. ఒకదాని తరువాత ఒకటిగా ఇతర పాత్రల్లో నటించిన కునాల్ కపూర్, అమిత్ సాద్, వినీత్ కుమార్ సింగ్, సన్నీ కౌశ్ల్ల పాత్రల పరిచయం ఉంటుందిం. వీరందరిని దేశం తరుపున హాకీ ఆడే ఆటగాళ్లుగా పరిచయం చేస్తూ ట్రైలర్ కొనసాగింది. ఈ చిత్రంలో అక్షయ్ స్వతంత్ర భారతావని తరుపున ఒలంపిక్‌లో గోల్డ్ మెడల్ సాధించే హాకీ జట్టు కోచ్ ‘తపం దాస్’ పాత్రలో కనిపించనున్నారు. చిత్రం తెరకెక్కింది. అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, అమిత్ సద్, వినీత్ సింగ్, సంగీత్ కౌశల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గోల్డ్’ ఆగష్టు 15 2018న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
భారత్ చేతిలో పాక్ చిత్తు
బ్రెడా (నెదర్లాండ్స్): కొత్త కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన తొలి ప్రముఖ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ భారీ విజయంతో బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (26వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (54వ ని.లో), మన్దీప్ సింగ్ (57వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (60వ ని.లో) తలా ఓ గోల్ చేశారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్... ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ 13వ నిమిషంలో భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్ అవకాశం లభించింది. దాన్ని హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. 16వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని కూడా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 26వ నిమిషంలో రమణ్‌దీప్ తొలి గోల్ నమోదు చేయడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ 43వ నిమిషంలో పాక్‌కు పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కినా దాన్ని గోల్‌గా మలచలేకపోయింది. చివరి క్వార్ట ర్లో బంతిని ఎక్కువగా తమ ఆ«ధీనంలో ఉంచు కున్న భారత్ పదే పదే దాడులకు దిగింది. ఈ క్రమంలో 17 ఏళ్ల దిల్‌ప్రీత్ అద్భుత గోల్‌తో భారత్ ఆధిక్యం 2–0కు పెరిగింది. చివరి 5 నిమిషాల్లో అటాకింగ్ చేయాలనే ఉద్దేశంతో పాక్ జట్టు గోల్కీపర్ను కాదని అదనపు స్ట్రయికర్ను బరిలో దింపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత ఆటగాళ్లు మన్దీప్, లలిత్ చెరో గోల్ చేసి 4–0తో భారత్‌కు తిరుగులేని విజయాన్నందించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ 1–0తో అర్జెంటీనాపై నెగ్గగా... ఆస్ట్రేలియా, బెల్జియం మ్యాచ్ 3–3తో డ్రాగా ముగిసింది. -
ఒక్కడి కల.. ఇండియాను ఏకం చేసింది
రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన తెల్లోళ్ల జెండాకు సలాం కొట్టాల్సిన పరిస్థితులు. అలాంటి సమయంలో ఒక్కడు.. ఒక్కే ఒక్కడు కన్నకల... దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. బ్రిటీషర్లే మన జెండాకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి తెచ్చింది. బాలీవుడ్లో ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే గోల్డ్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రొమో కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ‘మన జాతీయ గీతం వస్తోంది.. లేచి నిల్చొండి అంటూ బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా, జాతీయ గీతం బ్యాక్ గ్రౌండ్లో కనిపించి.. వినిపిస్తాయి. వెంటనే ‘అది మీకు ఎలాంటి భావన కలిగించింది?’ అన్న ఓ ప్రశ్న ఉద్భవిస్తుంది. ఒక్కడు కన్న కల మన జాతీయ గీతానికి బ్రిటీష్ వాళ్లు నిల్చునేలా చేసింది.. అంటూ టీజర్ ను చూపించారు. అక్కీ జాతీయ జెండాను చాటుగా బయటికి తీయటం, హకీ గేమ్ నేపథ్యంలో ఎమోషనల్‌గా టీజర్‌ను కట్ చేశారు. సచిన్ జిగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబోడుచుకునేలా ఉంది. 1948 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ హకీలో గోల్డ్ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్లో ‘గోల్డ్’ చిత్రం తెరకెక్కింది. అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, అమిత్ సద్, వినీత్ సింగ్, సంగీత్ కౌశల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గోల్డ్’ ఆగష్టు 15 2018న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ఆగస్టు 15న ‘గోల్డ్’
అక్షయ్‌కుమార్ హీరోగా దర్శకురాలు రీమా ఖగ్తి రూపొందిస్తున్న చిత్రం ‘గోల్డ్’. హాకీ ప్లేయర్ బల్బీర్‌సింగ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్ బల్బీర్ సింగ్. బల్బీర్ సింగ్ బెంగాలీ కావటంతో స్పెషల్‌గా ఓ కోచ్‌ను పెట్టుకొని మరి బెంగాలీ నేర్చుకున్నాడు అక్షయ్. అంతేకాదు క్యారెక్టర్లో పర్ఫెక్షన్ కోసం బెంగాలీ కల్చర్, కట్టుబొట్టులపై కూడా చాలా రిసెర్చ్ చేసి ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కునాల్ కపూర్,మౌనీరాయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రటించారు. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను తన ట్విటర్లో పోస్ట్ చేశారు అక్షయ్. అక్షయ్ ప్రతినాయక పాత్రలో నటించిన 2.ఓ ఆగస్టులో రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపించటంతో గోల్డ్ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని భావించారు. అయితే 2.ఓ రిలీజ్ ఇప్పట్లో లేకపోవటంతో ముందుగా ప్రకటించినట్టుగానే గోల్డ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. -
సర్దార్ సింగ్‌కు పిలుపు
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ తిరిగి భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మిడ్ ఫీల్డ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా అతనితో పాటు బీరేంద్ర లక్డాలను ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి నెదర్లాండ్స్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం గురువారం జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టుకు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నిరాశజనక ప్రదర్శన కనబరచడంతో జట్టులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కామన్వెల్త్ జట్టులో చోటు దక్కని సర్దార్ సింగ్, లాక్రాలను తిరిగి ఎంపిక చేశారు. జట్టు: గోల్‌కీపర్స్: శ్రీజేశ్ (కెప్టెన్), బహదూర్ పాఠక్. డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, సురేందర్, జర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లక్డా, అమిత్ రొహిదాస్. మిడ్ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్, చింగ్లెన్సన సింగ్, సర్దార్ సింగ్, వివేక్ సాగర్. ఫార్వర్డ్స్: సునీల్ విఠలాచార్య, రమణ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, సుమిత్ కుమార్, ఆకాశ్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్. -
పాక్‌తో భారత్ తొలి పోరు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ తరహాలోనే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత పురుషుల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. జూన్ 23 నుంచి జూలై 1 వరకు నెదర్లాండ్స్‌లోని బ్రెడా నగరంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. భారత్, పాకిస్తాన్‌లతోపాటు నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం జట్లు టోర్నీలో పోటీపడుతున్నాయి. జూన్ 23న పాకిస్తాన్‌తో తొలి లీగ్ మ్యాచ్ ఆడనున్న భారత్... ఆ తర్వాత 24న అర్జెంటీనాతో... 27న ఆస్ట్రేలియాతో... 28న బెల్జియంతో... 30న నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. -
గేలి చేసినా గోల్ చేశా..
అమ్మ తోడ్పాటు, నాన్న కష్టం, శిక్షకుల ప్రోత్సాహం అడవిపల్లె నుంచి నా ప్రతిభను అంతర్జాతీయక్రీడా యవనికపై సుస్థిరం చేశాయి. ఇద్దరు ఆడపిల్లలతల్లి అని మా అమ్మను గేలి చేశారు. హాకీలో శిక్షణ కోసం కురచ దుస్తులు వేసుకుని వెళుతుంటే ఎగతాళి చేశారు. వారిమాటలు నాలో పట్టుదలను పెంచాయి. ఒలింపిక్స్‌లో దేశం నుంచిప్రాతినిథ్యం వహించి, నా పల్లెకు గుర్తింపు తెచ్చాను. హేళన చేసినవారి నుంచే అభినందనలు అందుకున్నా. పట్టుదలకు ప్రోత్సాహం తోడైతే పేదరికాన్ని కూడా జయించవచ్చని హాకీ జాతీయ జట్టుగోల్కీపర్ రజని తన మనసులోని భావాలు పంచుకుంది. చిత్తూరు, భాకరాపేట: మాది ఎర్రావారిపాళెం మండలం ఎనుములవారిపల్లె గ్రామం. ఇది మారుమూల అటవీ సరిహద్దుల్లో ఉంటుంది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం, ఒక తమ్ముడు. నేను రెండో అమ్మాయిని ఐదో తరగతి వరకు పచ్చారవారిపల్లె ప్రాథమిక పాఠశాలకు వెళ్లేదాన్ని. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి బడికి వెళ్లేదాన్ని. అప్పుడు మా బంధువులు కూడా మా అమ్మను ఆడపిల్లల తల్లి అంటూ ఆటపట్టించేవారు. ఎవరినీ ఏమీ అనలేకపోయేదాన్ని. హైస్కూల్లో ఉండగా మా పీఈటీ మాస్టర్ వెంకట రాజు ఆటల పోటీలు నిర్వహించేవారు. నేను కాస్త చురుగ్గా ఉన్నానని గ్రహించిన ఆయన హాకీలో మెళకువలు నేర్పారు. ఆయన సారథ్యంలోనే శిక్షణ తీసుకున్నా. నేను ముందే చెప్పాను కదా సార్. మాది పల్లె. అక్కడి ప్రజల తీరు, మాటలు ఎలా ఉంటాయో మీకు తెలియనిది కాదు. బడికి వెళ్లేటప్పుడు అచ్చు ఆడపిల్ల లా దుస్తులు ధరించే దాన్ని. అయితే హాకీలో శిక్షణకు అవి పనికిరావు. ప్యాంట్, టీషర్టు ధరించి వెళుతుం టే ఆటపట్టించడం నాకు గుర్తు. మా అమ్మ తులసి ఒక మాట అడిగింది. ఈ దుస్తులు వేసుకుని ఆడగలవా? అందుకు నేను చెప్పింది ఒకటే మాట. ఎందుకంటే నా చిన్నతనంలో చూసినవి మనసులో ఉండిపోయాయి. ‘‘అమ్మ పాడి గేదెలు ఇచ్చే పాలు పితకడం, మా నాన్న రమణాచారి వడ్రంగి పనులతో’’ కష్టపడే తీరు నాలోని కసి పెంచింది. అదే పట్టుదలతో హాకీపై మనసు లగ్నం చేశాను. కఠోర సాధన చేయడానికి మా అమ్మ ఆశీర్వాదం, మా నాన్న కష్టం వృథా కానివ్వకూడదని కసిగా సాధన చేశాను. ఆటంకం కాకూడదని.. నా పట్టుదల చూసిన మా అమ్మ,నాన్న కష్టాలు భరించారు. నాలోని క్రీడాకారిణికి ఊపిరి పోయడానికి అప్పులు చేసి, కోచింగ్ క్యాంపులకు పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పేదరికంలో ఉంటే ఎంత చిన్నతనమో అనేది కూడా మా పల్లెల్లో కళ్లారా చూశాను. ఆ సంఘటనలు నేను మరిచిపోలేను. నా బాధ చూసిన మా అమ్మా, నాన్న ఇవన్నీ నీవు ఏమి పట్టించుకోవద్దు. భవిష్యత్తు ఉంది. అనుకున్నది సాధించు. ఇక్కడే మనకు కోల్పోయిన గౌరవం, అభిమానం దక్కుతుందన్నారు. ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే వాస్తవం అనిపిస్తుంది. మొదట నేను జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైనప్పుడు చాలా మంది నోళ్లలో మా ఊరి పేరు నానింది. అనేక ఒడుదుడుకులు ఎదుర్కొ ని, మన దేశం నుంచి ఒలింపిక్ హాకీ జట్టుకు నేను గోల్‌కీపర్‌గా ప్రాతినిథ్యం కల్పించడానికి అవకాశం కల్పించింది. అంతే..! మా పల్లె ప్రపంచ క్రీడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆ సమయంలో బయటివారే కాదు. మా అమ్మనాన్నలకు ఊరి వారి నుంచి అభినందనలు, నాకు శుభాకాంక్షలు అందిన సందర్భంలో కన్నీరు ఉబికింది. బాధతో కాదు.. ఆనందంతో. ఎక్కడైతే నేను, మా అమ్మ హేళనకు గురయ్యామో అక్కడే అభినందనలు అందుకోవడం మరిచిపోలేని తీపి గురుతు. ఆడపిల్లల తల్లిదండ్రులకు మా అమ్మనాన్న ప్రేరణ కలిగించారనే సంతృప్తి మిగిలింది. రజనీ ప్రస్థానం ♦ 2004: ఆరో తరగతిలోనే పుత్తూరులో జరిగిన జోనల్స్‌లో రన్నర్‌గా నిలిచింది ♦ 2005లో తిరుపతిలో జరిగిన ఇంటర్ జోనల్స్‌లో ప్రాతినిథ్యం ♦ 2005లో పంజాబ్ రాష్ట్రం జలంధర్ ♦ 2006 ఢిల్లీ ♦ 2007లో కోయంబత్తూరు, జబల్పూర్ ♦ 2008లో రూర్కెలాలో జాతీయ పోటీలు ♦ 2009లో మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ ♦ 2010లో చైనా, న్యూజిలాండ్, చైనా, కొరియా, అర్జెంటీనాలో ఆడింది. ♦ 2011లో ఆస్ట్రియా పోటీల్లో ఈమె పాల్గొన్న జట్టు సిల్వర్ మెడల్ సాధించింది ♦ 2012 జనవరిలో ఢిల్లీలో జరిగిన హాకీలో చాంపియన్‌గా నిలిచింది. ♦ 2013లో నెదర్లాండ్, జర్మనీ, మలేషియా జరిగిన మ్యాచ్‌ల్లో ప్రాతిని«థ్యం. ♦ 2014లో అంతర్జాతీయ మ్యాచ్‌లో స్వర్ణపతకం ♦ 2016ఒలింపిక్ అర్హత సాధించింది ♦ 2017 జపాన్‌లో జరిగిన ఏసియన్ హాకీ చాంపియన్ షిప్లో ఆసియా చాంపియన్లుగా నిలిచిన భారత మహిళల జట్టుకు రజని గోల్ కీపర్ పల్లెటూరి పిల్లనే... పల్లెటూరి పిల్ల. ఏమిటీ డ్రస్సు అని ఆకతాయి మాటలు అన్నారు. అయినా కుంగిపోలేదు. ఇబ్బంది అనిపించడం సహజమే. కానీ అదే పల్లెటూరి పిల్లగా 18 దేశాల్లో జరిగిన హాకీ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాను. నన్ను ఎగతాళి చేసిన వారే.. రజనీనా మా ఊరి పిల్లేనబ్బా. మా ఊరికి గొప్ప పేరు తెచ్చిం దబ్బా అన్నారు. కుటుంబ నేపథ్యం.. తల్లి : తులసి (పశువుల కాపరి) తండ్రి : రమణాచారి (వడ్రంగి) సంతానం : ముగ్గురు కుమార్తెలు, కుమారుడు (రజనీ రెండో సంతానం) చదువు : 1 నుంచి 5 వరకు పచ్చార్లవాండ్లపల్లె, 6–10వరకు నెరబైలు, తిరుపతిలో డిగ్రీ తల్లి తులసి, తండ్రి రమణాచారిలతో రజని -
ఫైనల్లో భారత్
హామిల్టన్: నాలుగుదేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్ రెండో అంచెలో భారత్ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై 4–2తో గెలుపొందింది. తొలి రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, బెల్జియంలను చిత్తు చేసిన భారత్ ఈ విజయంతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. మన జట్టు తరఫున వివేక్‌సాగర్ ప్రసాద్ (12వ ని.లో), వరుణ్ కుమార్ (30వ ని.లో), మన్దీప్ సింగ్ (58వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (58వ ని.లో) తలా ఒక గోల్ నమోదు చేశారు. జపాన్ తరఫున సెరెన్ తనక (14వ ని.లో), షోతాయమడ (43వ ని.లో) చెరో గోల్ కొట్టారు. తొలి అంచె ఫైనల్లో బెల్జియం చేతిలో భంగపడ్డ భారత్ ఆదివారం జరిగే రెండో అంచె ఫైనల్లో మరోసారి బెల్జియంతో తలపడనుంది. -
ముగిసిన హాకీ జాతీయ శిబిరం
రాయదుర్గం: జాతీయ హాకీ చాంపియన్‌షిప్ సన్నాహకంగా ఏర్పాటు చేసిన సీనియర్ మహిళల హాకీ శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. తెలంగాణ హాకీ సంఘం ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 13 నుంచి ఈ శిబిరం జరిగింది. క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరిచారు. వారికి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ప్రతీ జిల్లాకు ఒక హాకీ కోచ్‌ను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. అర్జున అవార్డు గ్రహీత, ఒలింపియన్ ముకేశ్ కుమార్‌ను హాకీ క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ హాకీ సంఘం చేస్తోన్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో హాకీ సంఘం అధ్యక్షులు సరళ్ తల్వార్, ఒలింపియన్ ముకేశ్ కుమార్, రంగారెడ్డి జిల్లా హాకీ అధ్యక్షులు విజయ్ కుమార్, కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కోచ్ సుఖేందర్ సింగ్ పాల్గొన్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 5 వరకు జాతీయ హాకీ చాంపియన్‌షిప్ జరుగుతుంది. రాష్ట్ర మహిళల హాకీ జట్టు డి. గీత (కెప్టెన్), ఎం. రేఖ (వైస్ కెప్టెన్), ఆర్. మౌనిక, ఎం. రుచిక, ఎం. మాళవిక, జె. కవిత, పి. సాగరిక, ఎం. సరోజ, మీనాక్షి, శ్రుతి కౌశిక్, డి. వైష్ణవి, టి. ప్రియాంక, కె. హారిక, కె. సుప్రియ, ఆర్. ప్రియాంక, ఎం. మౌనిక, సుమన్ కుమారి, అఫ్సాన్ సుల్తానా. -
రాష్ట్ర హాకీ జట్టు కెప్టెన్‌గా వివేక్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సీనియర్ పురుషుల జట్టును ఆదివారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆర్. వివేక్ ఎంపికయ్యాడు. విద్యా సాగర్ మేనేజర్‌గా, సంజయ్ కుమార్ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జాతీయ హాకీ టోర్నమెంట్ జరుగుతుంది. జట్టు వివరాలు: ఆర్. వివేక్, ఫిరోజ్, ఎ. అశోక్ కుమార్, పి. శ్రీనివాస్, వై. శేఖర్, జి. పృథ్వీ రాజ్, బి. రామకృష్ణ, బి. అరవింద్, బి. సాయి వినీత్, కె. ప్రశాంత్, సాయి కుమార్, అభిమన్యు యాదవ్, ఎం. అజీజ్, పి. సన్నీ, అరవింద్, ఎం. రమేశ్, ఎం. వినీత్, జె. రాజశేఖర్. -
స్పోర్ట్స్ క్యాలండర్ 2018
కొత్త ఏడాదిలో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, మరికొన్ని కొత్త ఆశయాలు... ప్రపంచాన్ని గెలిచేందుకు, ప్రపంచానికి పరిచయమయ్యేందుకు మీ కోసమే అంటూ ఎన్నో వేదికలు, మరెన్నో ఆహ్వానాలు... క్రీడాకారులు అద్భుతాలు సృష్టించేందుకు ప్రతీ ఏడూ కొత్త రూపంలో అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి. గత పరాజయాలను మరచి విజయాల వైపు దూసుకెళ్లేవారు కొందరైతే, సాధించిన ఘనతలతో సరిపెట్టుకోకుండా ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేవారు మరికొందరు. అలాంటి క్షణాలను ఆస్వాదిస్తూ ఆటగాళ్ల గెలుపును తమ గెలుపుగా భావించే అభిమానులందరి కోసం కొత్త సంవత్సరం పసందైన క్రీడా సమరాలతో సిద్ధంగా ఉంది. క్రికెట్ మాత్రమేనా అనుకునే భారత అభిమానులు ఆనందించేందుకు అటు కామన్వెల్త్ క్రీడలు, ఇటు ఆసియా క్రీడల సంబరం......లోకం మరిచి ఊగిపోయేందుకు ఫుట్‌బాల్ ప్రపంచ కప్...అసలు విరామమే లేకుండా ఏడాది పొడవునా కొత్త బ్యాడ్మింటన్ షెడ్యూల్... ఎప్పటిలాగే టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్ గలగలలు... మనింటి ఆట హాకీలో మరోసారి ప్రపంచ కప్ ఆతిథ్యం... ఇవి మాత్రమే కాదు ప్రతీ సంవత్సరం ఒకసారి నేనున్నానంటూ వేర్వేరు క్రీడాంశాల్లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లు... 2018లోనూ స్పోర్ట్స్‌ను ఎంజాయ్ చేసేందుకు మీరు రెడీనా...! బ్యాడ్మింటన్ జనవరి 14: పీబీఎల్ ఫైనల్ (హైదరాబాద్) జనవరి 16–21: మలేసియా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 4; కౌలాలంపూర్) జనవరి 23–28: ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 4; జకార్తా) జనవరి 30–ఫిబ్రవరి 4: అఖిలేశ్ దాస్ గుప్తా ఇండియా ఓపెన్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 4; న్యూఢిల్లీ) ఫిబ్రవరి 6–11: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ (మలేసియా) ఫిబ్రవరి 20–25: స్విస్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; బాసెల్) మార్చి 6–11: జర్మన్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; ముల్హీమ్ యాండెరుర్) మార్చి 14–18: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 2; బర్మింగ్హమ్) ఏప్రిల్ 24–29: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (చైనా) మే 1–6: న్యూజిలాండ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; ఆక్లాండ్) మే 8–13: ఆస్ట్రేలియన్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5, సిడ్నీ) మే 20–27: థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ (గ్రేడ్ 1 టీమ్ చాంపియన్‌షిప్; బ్యాంకాక్) జూన్ 12–17: యూఎస్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; అనాహీమ్) జూన్ 26–జూలై 1: మలేసియా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3; కౌలాలంపూర్) జూలై 3–8: ఇండోనేసియా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 2; జకార్తా) జూలై 10–15: థాయ్‌లాండ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; బ్యాంకాక్) జూలై 17–22: సింగపూర్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; సింగపూర్) జూలై 30–ఆగస్టు 5: ప్రపంచ చాంపియన్‌షిప్ (గ్రేడ్ 1 వ్యక్తిగత చాంపియన్‌షిప్, చైనా) ఆగస్టు 28–సెప్టెంబరు 2: స్పానిష్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; గ్రనాడా) సెప్టెంబర్ 4–9: హైదరాబాద్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 6; హైదరాబాద్) సెప్టెంబర్ 11–16: జపాన్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3, టోక్యో) సెప్టెంబర్ 18–23: చైనా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 2; చాంగ్జూ) సెప్టెంబర్ 25–30: కొరియా ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; సియోల్) అక్టోబర్ 2–7: చైనీస్ తైపీ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; తైపీ సిటీ) అక్టోబర్ 16–21: డెన్మార్క్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3; ఒడెన్స్) అక్టోబర్ 23–28: ఫ్రెంచ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 3; పారిస్) అక్టోబర్ 30–నవంబర్ 4: మకావు ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 5; మకావు సిటీ) నవంబర్ 5–18: ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ (గ్రేడ్ 1 టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్; కెనడా) నవంబర్ 6–11: చైనా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 3; ఫుజూ) నవంబర్ 13–18: హాంకాంగ్ ఓపెన్ (గ్రేడ్ 2–లెవెల్ 4; హాంకాంగ్) నవంబర్ 20–25: సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 5; లక్నో) నవంబర్ 27–డిసెంబర్ 2: కొరియా మాస్టర్స్ టోర్నీ (గ్రేడ్ 2–లెవెల్ 5; క్వాంగ్జు) టెన్నిస్ జనవరి 1–6: టాటా ఓపెన్ (పుణే) జనవరి 15–28: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మార్చి 8–18: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మార్చి 21–ఏప్రిల్ 1: మయామి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ ఏప్రిల్ 6–7: డేవిస్‌కప్ ఆసియా జోన్లో భారత్ రెండో రౌండ్ మ్యాచ్ ఏప్రిల్ 15–22: మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 6–13: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 13–20: రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ మే 27–జూన్ 10: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జూలై 2–15: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆగస్టు 6–12: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆగస్టు 12–19: సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఆగస్టు 27–సెప్టెంబర్ 9: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అక్టోబర్ 7–14: షాంఘై మాస్టర్స్ సిరీస్ టోర్నీ అక్టోబర్ 29–నవంబర్ 4: పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నవంబర్ 11–18: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ ఫార్ములావన్ మార్చి 25: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (మెల్బోర్న్) ఏప్రిల్ 8: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి (సాఖిర్) ఏప్రిల్ 15: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) ఏప్రిల్ 29: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి (బాకు) మే 13: స్పెయిన్ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) మే 27: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) జూన్ 10: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్) జూన్ 24: ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి (లె కాస్టెలెట్) జూలై 1: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి (స్పీల్బెర్గ్) జూలై 8: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్) జూలై 22: జర్మనీ గ్రాండ్‌ప్రి (హాకెన్‌హీమ్) జూలై 29: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్) ఆగస్టు 26: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్పా ఫ్రాంకోర్చాంప్స్) సెప్టెంబర్ 2: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) సెప్టెంబర్ 16: సింగపూర్ గ్రాండ్‌ప్రి (మరీనా బే) సెప్టెంబర్ 30: రష్యా గ్రాండ్‌ప్రి (సోచి) అక్టోబర్ 7: జపాన్ గ్రాండ్‌ప్రి (సుజుకా) అక్టోబర్ 21: యూఎస్ గ్రాండ్‌ప్రి (ఆస్టిన్) అక్టోబర్ 28: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) నవంబర్ 11: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి (సావోపాలో) నవంబర్ 25: అబుదాబి గ్రాండ్‌ప్రి (యాస్ మరీనా) చెస్ మార్చి 10–28: క్యాండిడేట్స్ టోర్నమెంట్ (బెర్లిన్) ఏప్రిల్ 1–10: ఆసియా యూత్ చాంపియన్‌షిప్ (చైనా) మే 25–జూన్ 3: ఆసియా జూనియర్ చాంపి యన్షిప్ (మంగోలియా) సెప్టెంబర్ 4–16: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ (టర్కీ) సెప్టెంబర్ 23–అక్టోబర్ 6: వరల్డ్ చెస్ ఒలింపియాడ్ (బాతూమి, జార్జియా) అక్టోబర్ 19–నవంబర్ 1: వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ (గ్రీస్) నవంబరు 2–12: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (ఫిలిప్పీన్స్) నవంబరు 9–28: వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ (లండన్) నవంబరు 24–డిసెంబరు 3: వరల్డ్ యూత్ చెస్ ఒలింపియాడ్ (టర్కీ) ఆర్చరీ మార్చి 2–9: ఆసియా కప్ (థాయ్‌లాండ్) ఏప్రిల్ 23–29: వరల్డ్ కప్ స్టేజ్–1 (చైనా) మే 21–26: వరల్డ్ కప్ స్టేజ్–2 (టర్కీ) జూన్ 19–24: వరల్డ్ కప్ స్టేజ్–3 (అమెరికా) జూలై 17–22: వరల్డ్ కప్ స్టేజ్–4 (జర్మనీ) అథ్లెటిక్స్ మార్చి 2–4: వరల్డ్ ఇండోర్ చాంపియన్‌షిప్ (బర్మింగ్హమ్) ఏప్రిల్ 16: బోస్టన్ మారథాన్ ఏప్రిల్ 22: లండన్ మారథాన్ మే 4: డైమండ్ లీగ్ మీట్–1 (దోహా) మే 12: డైమండ్ లీగ్ మీట్–2 (షాంఘై) మే 26: డైమండ్ లీగ్ మీట్–3 (యూజిన్, అమెరికా) మే 31: డైమండ్ లీగ్ మీట్–4 (రోమ్) జూన్ 7: డైమండ్ లీగ్ మీట్–5 (ఓస్లో) జూన్ 10: డైమండ్ లీగ్ మీట్–6 (స్టాక్‌హోమ్) జూన్ 30: డైమండ్ లీగ్ మీట్–7 (పారిస్) జూలై 5: డైమండ్ లీగ్ మీట్–8 (లుజానే) జూలై 13: డైమండ్ లీగ్ మీట్–9 (రాబట్, మొరాకో) జూలై 20: డైమండ్ లీగ్ మీట్–10 (మొనాకో) జూలై 21–22: డైమండ్ లీగ్ మీట్–11 (లండన్) ఆగస్టు 18: డైమండ్ లీగ్ మీట్–12 (బర్మింగ్హమ్) ఆగస్టు 30: డైమండ్ లీగ్ మీట్–13 (జ్యూరిక్) ఆగస్టు 31: డైమండ్ లీగ్ మీట్–14 (బ్రస్సెల్స్) హాకీ జూన్ 23–జూలై 1: పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (అమ్‌స్టర్‌డామ్) జూలై 21–ఆగస్టు 5: మహిళల ప్రపంచకప్ (లండన్) నవంబర్ 17–25: మహిళల చాంపియన్స్ ట్రోఫీ (చైనా) నవంబర్ 28–డిసెంబర్ 16: పురుషుల ప్రపంచకప్ (భువనేశ్వర్) రెజ్లింగ్ ఫిబ్రవరి 27–మార్చి 4: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (కిర్గిస్తాన్) జూలై 17–22: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ) సెప్టెంబర్ 17–23: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (స్లొవేకియా) అక్టోబర్ 20–28: ప్రపంచ సీనియర్ చాంపియన్ షిప్ (హంగేరి) నవంబర్ 12–18: ప్రపంచ అండర్–23 చాంపియన్ షిప్ (రొమేనియా) వెయిట్‌లిఫ్టింగ్ ఏప్రిల్ 20–30: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ (ఉజ్బెకిస్తాన్) జూలై 6–14: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఉజ్బెకిస్తాన్) నవంబర్ 24–డిసెంబర్ 3: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (తుర్క్మెనిస్తాన్) టేబుల్ టెన్నిస్ ఏప్రిల్ 6–8: ఆసియా కప్ (జపాన్) ఏప్రిల్ 29–మే 6: వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (జర్మనీ) డిసెంబర్ 2–9: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ (ఆస్ట్రేలియా) షూటింగ్ మార్చి 1–13: వరల్డ్ కప్–1 (రైఫిల్, పిస్టల్, షాట్‌గన్; మెక్సికో) ఏప్రిల్ 20–30: వరల్డ్ కప్–2 (రైఫిల్, పిస్టల్, షాట్‌గన్; కొరియా) మే 22–29: వరల్డ్ కప్–3 (రైఫిల్, పిస్టల్; జర్మనీ) జూన్ 5–15: వరల్డ్ కప్–4 (షాట్‌గన్; మాల్టా) జూలై 9–19: వరల్డ్ కప్–5 (షాట్‌గన్; అమెరికా) ఆగస్టు 31–సెప్టెంబర్ 15: ప్రపంచ చాంపియన్‌షిప్ (కొరియా). కామన్వెల్త్ క్రీడలు ఏప్రిల్ 4–15 గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా ఆసియా క్రీడలు ఆగస్టు 18–సెప్టెంబర్ 2 జకార్తా, ఇండోనేసియా ప్రపంచకప్ ఫుట్‌బాల్ జూన్ 14–జూలై 15 మాస్కో, రష్యా యూత్ ఒలింపిక్స్ అక్టోబర్ 6–18 బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా. -
పాక్‌తో భారత్ తొలి పోరు
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్ హాకీ పోటీల్లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ ఒకే పూల్‌లో ఉండటం విశేషం. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య మంగళవారం విడుదల చేసింది. పూల్ ‘బి’లో భారత్, పాక్‌లతో పాటు ఇంగ్లండ్, మలేసియా, వేల్స్ జట్లున్నాయి. ఐదుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియా... న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెనడా, స్కాట్లాండ్లు పూల్ ‘ఎ’లో ఉన్నాయి. ఏప్రిల్ 7న భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాక్‌తో తలపడుతుంది. తర్వాత 8న వేల్స్, 10న మలేసియా, 11న ఇంగ్లండ్‌లతో పోటీపడుతుంది. పూల్ ‘ఎ’లో భారత మహిళల జట్టు: భారత మహిళల జట్టు పూల్ ‘ఎ’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, మలేసియా, వేల్స్‌తో తలపడనుంది. పూల్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్కాట్లాండ్, కెనడా, ఘనా జట్లున్నాయి. ఏప్రిల్ 5న జరిగే తొలి మ్యాచ్‌లో వేల్స్‌ను ఎదుర్కోనున్న భారత్... 6న మలేసియా, 8న ఇంగ్లండ్, 10న దక్షిణాఫ్రికాలతో ఆడుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5 నుంచి 14 వరకు జరగనున్నాయి. -
ఒక కాజ్ కోసం న్యూడ్ ఫొటోషూట్!
పెర్త్: సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ఎల్జీబీటీ కమ్యూనిటీకి అండగా నిలబడాలని పెర్త్ హాకీ ఆటగాళ్లు నిర్ణయించారు. ఇందుకోసం వాళ్లు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించనిరీతిలో ఒంటిపై దుస్తులు విడిచి.. నగ్నంగా క్యాలెండర్ల ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. సమాజంలో స్వలింగ సంపర్కులపై ఎంతో వివక్ష నెలకొందని, వారు ఎన్నో రకాలుగా దూషణలు ఎదుర్కొంటున్నారని, దీనికి వ్యతిరేకంగా తాము నిలబడాలని నిర్ణయించామని ద పెర్త్ పైథాన్ హాకీ జట్టు ఆటగాడు రీడ్ స్మిత్ తెలిపాడు. పెర్త్ పైథాన్ పురుష జట్టుతోపాటు ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్లేయర్స్ సైతం ఈ నగ్న ఫొటోషూట్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. హాకీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడంతోపాటు హోమోఫొబియోకు వ్యతిరేకంగా నిలబడేందుకు తాము ఫొటోషూట్‌లో పాల్గొన్నామని పెర్త్ పైథాన్ జట్టు ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఈ నెల 23న హాకీ ఆటగాళ్ల నగ్న క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. -
మూడోసారి ఆసియా కప్ భారత్ సొంతం
-
మూడోసారి ఆసియా కప్ భారత్ సొంతం
ఢాకా : ఆసియా కప్ హాకీ-2017 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం ఢాకా వేదికగా మలేసియాతో తలపడిన భారత్ హాకి జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయ భేరి మోగించింది. టోర్నీలో గ్రూప్ దశ నుంచి భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఫస్ట్ హాఫ్ మూడో నిమిషంలో రమణ్ దీప్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. అనంతరం 29వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ మరో గోల్‌ను భారత్‌కు అందించారు. మైదానంలో మెరుపులా కదులుతున్న భారత ఆటగాళ్ల నుంచి బంతిని లాక్కునేందుకు మలేసియా స్ట్రైకర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మలేసియా ఆటగాడు సహ్రిల్ సాబా 50వ నిమిషంలో ఆ జట్టుకు తొలి గోల్ అందించాడు. మిగిలిన సమయంలో మలేసియా ఆటగాళ్లను గోల్ చేయనివ్వకుండా భారత ప్లేయర్లు చేసిన ప్రయత్నాలు సఫలం చెందాయి. దీంతో భారత్ మూడో మారు ఆసియా విజేతగా నిలిచింది. లలిత్ ఉపాధ్యాయ్‌కు గోల్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఆకాశ్ దీప్ సింగ్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. -
పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్
ఢాకా : ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరింది. సెమీ ఫైనల్లో దయాది పాకిస్తాన్‌ను టోర్నీలో రెండోసారి మట్టికరిపించింది. గ్రూప్ దశను అజేయంగా ముగించిన భారత్ సెమీస్‌లో కూడా అదే జోరును కొనసాగించింది. సూపర్ ఫోర్లో భాగంగా శనివారం జరిగిన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0తో విజయ ఢంకా మోగించింది. మ్యాచ్ ఇలా.. ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. దీంతో తొలి అర్థభాగంలో రెండు క్వార్టర్లలో ఎవరికీ పాయింట్లు దక్కలేదు. ఈ రెండు క్వార్టర్లలోనూ బంతిని పాకిస్తాన్ క్రీడాకారులు ఎక్కువ సమయం తమ అదుపులో ఉంచుకున్నారు. 39వ నిమిషంలో సత్భీర్‌సింగ్ అద్భుతంగా గోల్ చేసి భారత్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లు తడబడ్డారు. గోల్ చేయాలన్న ఆలోచనలో తప్పులు మీద తప్పులు చేశారు. దీంతో 41వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ ప్రీత్ గోల్‌గా మలచి భారత్ ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మరు నిమిషమే లలిత్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి నెట్టి ఇండియాకు మూడో గోల్ అందించాడు. 57వ నిమిషంలో గుర్జంత్‌సింగ్ గోల్ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. కాగా, ఆసియా కప్ ఫైనల్లో భారత్ మలేసియాతో తలపడనుంది. -
ఆసియాకప్‌లో భారత్ శుభారంభం
ఢాకా: బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న హాకీ ఆసియాకప్‌లో భారత్ శుభారంభం చేసింది. నేడు (బుధవారం) జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-1తో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ తొలి అర్థ భాగం నుంచి చివరి వరకు భారత ఆటగాళ్లు ఆధిపత్యాన్ని చలాయించారు. భారత ఆటగాడు ఎస్వీ సునీల్ మూడో నిమిషంలో తొలి గోల్ సాధించగా.. జపాన్ ప్లేయర్ కెంజి కిటజటో నాలుగో నిమిషంలో గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. అనంతరం మ్యాచ్ ఉత్కంఠగా సాగుంతుండగా భారత ఆటగాడు లలీల్ ఉపాధ్యాయ 22 నిమిషంలో గోల్ సాధించాడు. దీంతో భారత్ 2-1 తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాతా భారత ఆటగాళ్లు జపాన్‌కు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించారు. రమణ్‌దీప్ సింగ్ 33 నిమిషంలో మరో గోల్ సాధించగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ 35వ, 48 నిమిషాల్లో వరుస గోల్స్ సాధించడంతో భారత్ విజయం సులువైంది. ఇటీవలె భారత హాకీ జట్టుకు కొత్త కోచ్ స్జోయెర్డ్ మరిజ్నేను నియమించిన విషయం తెలిసిందే. ఇక భారత్ తరువాతి మ్యాచ్ ఆతిథ్య బంగ్లాదేశ్‌తో శుక్రవారం తలపడనుంది. -
చలాకీగా.. హాకీ!
పెనాల్టీ కార్నర్, పెనాల్టీ షూటౌట్, డిఫెన్స్ గేమ్... హీరోయిన్ తాప్పీ ప్రజెంట్ ఎక్కడికి వెళ్లినా వీటి గురించే మాట్లాడుతున్నారట. కాస్త టైమ్ దొరికితే పాత హాకీ మ్యాచ్‌లను చూస్తున్నారట. వీలైతే హాకీ ప్లేయర్స్‌తో గేమ్ గురించి డిస్కస్ చేస్తున్నారట. ఎందుకంటే తాప్సీ తర్వలో హాకీ ప్లేయర్‌గా వెండితెరపై కనిపించబోతున్నారు. ఇండియన్ హాకీ ప్లేయర్ సందీప్‌సింగ్ జీవితంలోని కొన్ని కీలక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. ఇందులో సందీప్ పాత్రలో దిల్జీత్ కనిపించనున్నారని హిందీ ఇండస్ట్రీ టాక్. హీరోను ఇన్స్పైర్ చేసే హాకీ ప్లేయర్ రోల్లో తాప్సీ కనిపించబోతున్నారట. అందుకే ఆమె హాకీ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ‘‘20 ఏళ్ల క్రితం మా నాన్నగారు హాకీ ఆడుతున్నప్పుడు, ఆయన సాధించిన మెడల్స్ చూస్తూ పెరిగాను. హాకీ ఆడాలనే ఆకాంక్ష అప్పుడే నా మనసులో నాటుకుపోయింది. అది ఇప్పుడు నెరవేరుతోంది. నా హాకీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది’’ అని తాప్సీ పేర్కొన్నారు. ఆ సంగతలా ఉంచితే.. తాప్సీ చలాకీగా హాకీ ఆడుతుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదని చూసినవాళ్లు అంటున్నారు. -
సప్తవర్ణ శోభితం
ఒలింపిక్స్ వెలుగులు... క్రికెట్ మెరుపులు... 70 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం ఏడు దశాబ్దాలు... ఒక దేశం సొంతంగా క్రీడల్లో సాధించిన ప్రగతి గురించి చెప్పుకునేందుకు ఈ సమయం సరిపోతుంది. భారత్‌కు సంబంధించి ఇందులో తొలి సగం క్రీడల్లో ఉనికి కోసం చేసిన ప్రయత్నం కాగా... మిగతా సగం క్రికెట్ ప్రాభవం, దాని కారణంగా ఆదరణ కోల్పోయిన ఇతర క్రీడలు కనిపిస్తాయి. ప్రపంచ కప్ విజయాలు, ఒలింపిక్ పతకాలు, వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలు, దేశంలో ఆటకు దిశానిర్దేశం చేసిన క్షణాలు, ఫలితంతో సంబంధం లేకుండా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఘటనలు... స్వాతంత్య్రానంతరం భారత క్రీడా రంగం పురోగతిలో చెప్పుకోదగ్గ ఘటనలు ఎన్నో. అలాంటి విశేషాల సమాహారం... – సాక్షి క్రీడావిభాగం క్రికెట్ (1983, 2011 వన్డే ప్రపంచ కప్‌లు, 2007 టి20 ప్రపంచకప్) స్వాతంత్య్రానికి ముందు భారత క్రికెట్ జట్టు ఒక్క ఇంగ్లండ్‌తోనే నాలుగు టెస్టు సిరీస్‌లు ఆడి నాలుగూ ఓడింది. 1947 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో భారత్ కొత్త ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత పలు గొప్ప విజయాలు, అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చినా... 1983 వరకు కూడా క్రికెట్‌పై అభిమానం దేశంలో కొద్ది మందికే పరిమితం. వన్డే క్రికెట్ వచ్చిన తర్వాత 1975, 1979లలో మన ఘోర ప్రదర్శన ఆటపై ఆసక్తిని మరింత తగ్గించింది. అయితే 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు వన్డేల్లో విశ్వవిజేతగా నిలవడంతో ఒక్కసారి అంతా మారిపోయింది. ఈ గెలుపు తర్వాత దేశ ప్రజల జీవితాల్లో క్రికెట్ ఒక భాగంగా మారిపోయింది. ఇంటింటా అభిమానులు, ప్రత్యక్ష ప్రసారాలు, భారీ ఎత్తున ఆదాయం, క్రికెటర్లను దేవుడిలా కొలవడం... ఇలా అన్నింటికీ ఈ విజయమే నాంది పలికింది. 28 ఏళ్ల తర్వాత 2011లో భారత్ మరోసారి ప్రపంచ కప్ గెలవడం అభిమానులను ఆనంద పర్చింది. అంతకుముందే 2007లో భారత్ మరో క్రికెట్ విప్లవానికి కారణమైంది. ఆ ఏడాది తొలి టి20 ప్రపంచ్‌కప్‌ను భారత్ గెలుచుకోవడం కూడా క్రికెట్లో కొత్త శకానికి తెర తీసింది. టి20 ఫార్మాట్ ఉజ్వలమైన భవిష్యత్తుకు, ఆటగాళ్ల కోసం బంగారు బాతులా పరిణమించేందుకు ఈ వరల్డ్ కప్ మేలి మలుపుగా చెప్పవచ్చు. హాకీ (5 స్వర్ణాలు, 1975 ప్రపంచకప్) స్వాతంత్య్రానికి ముందు 3 ఒలింపిక్స్‌లలో స్వర్ణాలతో సత్తా చాటిన భారత జట్టు 1947 తర్వాత మరో 5 బంగారు పతకాలతో వెలు గులు విరజిమ్మింది. 1948 లండన్ ఒలింపిక్స్ నుంచి 1980 మాస్కో ఒలింపిక్స్ వరకు ఈ ప్రస్థానం కొనసాగింది. వీటికి తోడు 1975లో జరిగిన ప్రపంచకప్‌ను కూడా గెలుచుకొని హాకీలో తమ ఆధిక్యాన్ని భారత్ బలంగా ప్రదర్శించింది. కానీ 1983 తర్వాత క్రికెట్ పురోగతికి తోడు స్వీయ వైఫల్యాలతో భారత హాకీ ప్రాభవం తగ్గిపోయింది. ఆ తర్వాత 9 ఒలింపిక్స్ క్రీడలు జరిగితే ఐదో స్థానమే అత్యుత్తమ ప్రదర్శన. ఒకసారి అయితే కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది. ఇక గత దశాబ్ద కాలంలో పడుతూ లేస్తూ మన హాకీ ప్రయాణం సాగుతోంది. ఆహా అనిపించే ఒక్క విజయం లభించే లోపే, అయ్యో అనిపించే మరో నాలుగు పరాజయాలతో తీవ్రంగా నిరాశపర్చడం జట్టుకు అలవాటైంది. టెన్నిస్ (ఒలింపిక్ పతకం, గ్రాండ్‌స్లామ్ డబుల్స్ విజయాలు) ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ సాధించిన కాంస్య పతకమే నిస్సందేహంగా భారత టెన్నిస్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పవచ్చు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అతను ఈ ఘనత సాధించి అందరినీ అబ్బుర పరిచాడు. ఇక సింగిల్స్‌లో ఓపెన్ శకానికి ముందు 1961 సమయంలో రామనాథన్ కృష్ణన్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకోవడం గొప్ప ఘనత. ఈ తరంలో భారత టెన్నిస్‌కు గుర్తింపు తెచ్చిన త్రయంగా పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలను చెప్పవచ్చు. ఈ ముగ్గురూ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నవారే. ఈ ముగ్గురి ఖాతాలో కలిపి మొత్తం 36 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఆనందుడి విజయం... చదరంగ క్రీడలో ఒక భారతీయుడు సాధించిన అద్భుతం ఇది. తన చతురంగ బలాలను సమర్థంగా నడిపిస్తూ చెస్ ప్రపంచానికి రారాజుగా నిలిచిన ఘనత మన విశ్వనాథన్ ఆనంద్‌కు దక్కింది. 2000లో తొలిసారి ఆనంద్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఈ క్రీడలో భారత కీర్తిని శిఖరాన నిలిపాడు. ఆ తర్వాత కూడా మరో నాలుగు సార్లు ఆనంద్ విశ్వ విజేత కావడం విశేషం. పసిడి గురి (2008 ఒలింపిక్స్) భారత షూటర్ అభినవ్ బింద్రా ఒలింపిక్ క్రీడల్లో సాధించిన స్వర్ణం మన ఆటల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడి పతకం గెలుచుకున్నాడు. మన ఒలింపిక్ చరిత్రలో వ్యక్తిగత విభాగంలో ఇదే ఏకైక స్వర్ణం. బ్యాడ్మింటన్ (2 ఆల్ ఇంగ్లండ్ టైటిల్స్, 2 ఒలింపిక్ పతకాలు) భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన క్షణం 1980 ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్. 9 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన ప్రకాశ్ పడుకోన్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలుచుకొని ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌తో సమాన విలువ గల ఈ టైటిల్‌ను ఆ తర్వాత 2001లో తెలుగు తేజం పుల్లెల గోపీచంద్ కూడా సొంతం చేసుకొని మన కీర్తిని పెంచాడు. దీని తర్వాత మరో రెండు ఘటనలు భారత్‌లో బ్యాడ్మింటన్ మేనియాను పెంచాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. నాలుగేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో పూసర్ల వెంకట (పీవీ) సింధు దీనికంటే మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దేశంలో క్రికెట్ తర్వాత రెండో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా బ్యాడ్మింటన్ మారిందంటే ఈ ఘనతలే కారణం. అథ్లెటిక్స్ (మిల్కా సింగ్, పీటీ ఉష ప్రదర్శనలు) భారత్‌లో పరుగుకు గుర్తింపు తెచ్చిన మొదటి వ్యక్తి మిల్కా సింగ్. స్వాతంత్య్రానంతరం 1960 రోమ్ ఒలింపిక్స్‌లో అతని ప్రదర్శన ఎప్పటికీ భారత క్రీడల్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ పోటీల 400 మీటర్ల పరుగులో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. కేవలం 0.1 సెకను వ్యవధిలో కాంస్యం కోల్పోయాడు. కానీ నాటి పరిస్థితులు, సౌకర్యాలను బట్టి చూస్తే దీనిని చాలా పెద్ద ఘనతగా చెప్పవచ్చు. అథ్లెటిక్స్‌లో కూడా మన విజయాల గురించి మాట్లాడటం, అథ్లెట్లకు గుర్తింపు లభించడం పీటీ ఉషతోనే సాధ్యమైంది. ఈ ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’ 1984 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో సెకనులో వందో వంతు తేడాలో 400 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. అయితే 1986 సియోల్ ఆసియా క్రీడల్లో ఏకంగా 4 స్వర్ణాలు సాధించి భారత్ ఘనతను చాటింది. అప్పటి నుంచి పరుగెత్తే ప్రతీ పాపను పీటీ ఉషతో పోల్చడం మన దేశంలో అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఫుట్‌బాల్ (ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం) ప్రపంచ ఫుట్‌బాల్‌లో భారత్ పరిస్థితి ఇప్పుడు చూస్తే అంతా అగమ్య గోచరం. ర్యాంకు 100కు చేరువలో... ఆట చూస్తే అంతకన్నా ఘోరమే. కానీ 1950 నుంచి 1962 వరకు పుష్కర కాలం పాటు మన ఫుట్‌బాల్ కూడా వెలిగింది. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు తయారయ్యారు. 1951, 1962 ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచిన మన జట్టు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో కూడా నిలవడం విశేషం. అయితే 80వ దశకం నుంచి తిరోగమన బాట పట్టిన ఈ ఆట క్రికెట్ వెల్లువలో దాదాపు కొట్టుకుపోయింది. లీగ్‌ల ద్వారా ప్రస్తుతం నిలబెట్టే ప్రయత్నం కొంత చేస్తున్నా అది కంటితుడుపుగానే సాగుతోంది. కబడ్డీలో అజేయం... గ్రామీణ క్రీడ కబడ్డీలోనూ భారత్‌దే ఆధిపత్యం. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో తొలిసారి కబడ్డీని మెడల్ ఈవెంట్‌గా ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి భారత్ వరుసగా ఏడు ఆసియా క్రీడల్లో అజేయంగా నిలిచి ఏడు స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. మూడుసార్లు నిర్వహించిన ప్రపంచకప్ పోటీల్లోనూ భారత్ చాంపియన్‌గా నిలిచింది. దక్షిణాసియా క్రీడల్లో మూడుసార్లూ టీమిండియాకు ఎదురేలేదు. అంజూ అద్భుతం... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఒకే ఒక్క పతకం దక్కింది. దిగ్గజాలు పాల్గొనే ఈ పోటీల్లో సాధించిన గెలుపు మన అథ్లెటిక్స్ చరిత్రలోనే అరుదైన ఘట్టం. 2003 పారిస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అంజూ బాబీ జార్జ్ లాంగ్‌జంప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత మరే భారత అథ్లెట్‌కు పతకం దక్కలేదు. కొన్నింట్లో ఇంకా వెనుకబాటే... స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా కొన్ని రకాల క్రీడల్లోనే భారత జట్టు పరిస్థితి మెరుగ్గా ఉంది. వాటిలోనే మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నా... ఇంకా మన ముద్ర చూపించని క్రీడలు కూడా చాలా ఉన్నాయి. ఆర్చరీ, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్‌లలో మన ఆట అంతంత మాత్రమే. మున్ముందు అయినా వీటిలో కూడా మన వైభవం పెరుగుతుందని ఆశిద్దాం. జాదవ్ నుంచి సాక్షి వరకు... భారత్‌కు స్వాతంత్య్రం లభించేనాటికి మన దేశం తరఫున ఒక్కరు కూడా వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయారు. అయితే ఐదేళ్ల తర్వాత 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో ఆ కల ఫలించింది. ఖాషాబా జాదవ్ కుస్తీ పోటీల్లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. మెక్సికో, కెనడా, జర్మనీలకు చెందిన స్టార్ రెజ్లర్లను ఓడించి అతను సాధించిన ఈ విజయం అసమానం. ఆ తర్వాత కరణం మల్లీశ్వరి (2000 సిడ్నీ ఒలింపిక్స్; వెయిట్‌లిఫ్టింగ్–కాంస్యం), రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (2004 ఏథెన్స్; షూటింగ్–రజతం), విజేందర్ సింగ్ (2008 బీజింగ్; బాక్సింగ్–కాంస్యం), సుశీల్ కుమార్ (2008 బీజింగ్; రెజ్లింగ్–కాంస్యం) కూడా ఒలింపిక్స్‌లో తమ సత్తాను ప్రదర్శించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఏకంగా ఆరు పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. రెజ్లర్ సుశీల్ కుమార్, షూటర్ విజయ్ కుమార్‌లు రజత పతకాలు గెలుపొందగా...యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్), మేరీ కోమ్ (బాక్సింగ్), గగన్ నారంగ్ (షూటింగ్), సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్) కాంస్య పతకాలు సాధించారు. భారత ఒలింపిక్ చరిత్రలో వ్యక్తిగత క్రీడాంశంలో రెండు పతకాలు (రజతం, కాంస్యం) సాధించిన ఏకైక క్రీడాకారుడిగా సుశీల్ కుమార్ నిలిచాడు. 2016 రియో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్యంతో, షట్లర్ పీవీ సింధు రజతంతో తమ విలువను చూపించారు. -
హాకీ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హాకీ జట్టు కోచ్ పదవికి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ హాకీ సంఘం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫుల్ టైమ్ హాకీ కోచ్‌గా పనిచేయుటకు అనుభవం, నైపుణ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కోచ్ ఎంపికలో సీనియర్ జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిం చి, ఎన్ఐఎస్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలనే నిబంధనలను పరిగణనలోకి తీసుకోనుంది. 40 ఏళ్లు కలిగి ఆంగ్ల భాషా ప్రావీ ణ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు తమ బయోడేటాను ఈనెల 10 లోగా telangana.hockey@hockeyindia.orgలో అప్లోడ్ చేయాలని సూచించింది. -
భారత్xదక్షిణాఫ్రికా
జొహన్నెస్‌బర్గ్: వచ్చే ఏడాది లండన్‌లో జరిగే మహిళల ప్రపంచ కప్‌నకు అర్హత సాధించడమే లక్ష్యంగా... శనివారం మొదలయ్యే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నీలో భారత్ బరిలోకి దిగనుంది. పూల్ ‘బి’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి మ్యాచ్ తర్వాత భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా అమెరికా (10న), చిలీ (12న), అర్జెంటీనా (16న) జట్లతో తలపడుతుంది. పూల్ ‘ఎ’లో మరో ఐదు జట్లున్నాయి. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన జట్లు ఈ ఏడాది నవంబరులో జరిగే హెచ్‌డబ్ల్యూఎల్ ఫైనల్స్ టోర్నీకి... వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచ కప్ పోటీలకు అర్హత పొందుతాయి. -
‘హాకీ’ ప్రతిభకు ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హాకీ క్రీడాభివృద్ధికి కృషిచేస్తోన్న తెలంగాణ హాకీ సంఘం క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టింది. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారి కోసం తొలిసారిగా అవార్డ్స్ ఫంక్షన్‌ను నిర్వహించింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు యువ క్రీడాకారులను అవార్డులతో సత్కరించి వారిని ఉత్సాహపరిచింది. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో నిలకడగా రాణించిన క్రీడాకారులకు ఈ అవార్డులను అందజేసింది. సబ్ జూనియర్ విభాగంలో ఎస్. శివకుమార్ (నల్లగొండ), కె. జ్యోతి (రంగారెడ్డి), జూనియర్ కేటగిరీలో రంజిత్ చంద్ (హైదరాబాద్), ఫాతిమా (నిజామాబాద్), సీనియర్ విభాగంలో రామకృష్ణ (వరంగల్), డి. గీత (రంగారెడ్డి)లకు ‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డులు అందజేసింది. క్రీడాకారులతో పాటు కరీంనగర్‌కు చెందిన సురేందర్ సింగ్ ‘బెస్ట్ మేనేజర్’ అవార్డును అందుకోగా... సంజయ్ కుమార్ (హైదరాబాద్) బెస్ట్ కోచ్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అంతర్ జిల్లా పోటీలను సమర్థంగా నిర్వహించిన వరంగల్ జిల్లాకు కూడా అవార్డు లభించింది. అధ్యక్షునిగా సరళ్ తల్వార్: తెలంగాణ హాకీ నూతన అధ్యక్షునిగా తల్వార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరళ్ తల్వార్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షునిగా వ్యవహరించిన కె. అమరేందర్ రెడ్డి ఇటీవలే తన పదవికి రాజీ నామా చేయడంతో సరళ్ తల్వార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సంఘానికి కార్యదర్శిగా మాజీ హాకీ క్రీడాకారుడు, ఒలింపియన్ ఎన్. ముఖేశ్‌కుమార్ ఉన్నారు. -
భారత్‌కు ఆరో స్థానం
లండన్: హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత్‌కు ఆరో స్థానం లభించింది. 5–6 స్థానాల కోసం ఆదివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 2–3తో కెనడా చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో కెనడా జట్టు వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ (7వ, 22వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. కెనడా జట్టుకు గార్డన్ (3వ, 44వ నిమిషాల్లో) రెండు గోల్స్... కీగన్ (40వ నిమిషంలో) ఒక గోల్ అందించారు. -
ఒక పతనం.. ఒక ఉత్థానం..!
జాతిహితం మీరు యూపీఎస్సి పరీక్షలకోసం సిద్ధమవుతున్నవారిలో భాగం కానట్లయితే, ఒలింపిక్స్‌లో నిజమైన బంగారు పతకాన్ని భారత హాకీ జట్టు ఎప్పుడు గెల్చుకుందనే విషయం మీకు గుర్తు ఉండకపోవచ్చు. నిజమైన అని ఎందుకంటున్నానంటే 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో మనకు హాకీలో స్వర్ణ పతకం ఒక మినహాయింపు కింద లభించింది. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్‌పై సోవియట్ దాడికి నిరసనగా బలమైన హాకీ జట్లు మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరిం చాయి. పై ప్రశ్నకు సమాధానం.. 1968లో మెక్సికో నగరంలో మనం హాకీలో కంచుపతకం సాధించాం అన్నదే. దాని తర్వాత 1975లో కౌలాలంపూర్‌లో ప్రపంచ కప్ గెల్చుకోవడమే భారత హాకీ సాధించిన ఏకైక పెద్ద ట్రోఫీగా మిగిలిపోయింది. 60ల వరకు ప్రతి ప్రపంచ స్థాయి పోటీలోనూ భారత్–పాకిస్తాన్ హాకీ జట్లు ఫైనల్ చేరడం రివాజుగా ఉండేది. నిజం చెప్పాలంటే, పాకిస్తాన్ జట్టు నేటికీ తొలి మూడు లేదా నాలుగో స్థానంలో నిలబడటానికి కాస్త పోరాటం సాగిస్తోంది. ఒలింపిక్, ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీలకు అర్హత పొందడానికి కొట్టుమిట్టులాడుతూ చివరకు విఫలం అవుతున్న చందాన భారత హాకీ అంతిమ దిశకు చేరుకున్న విధంగా పతనమైపోయింది. దీనికి మనం ముందుగా భారతీయ హాకీ సమాఖ్య అధికారులను తప్పు పట్టాల్సి ఉంటుంది. తర్వాత క్రీడాకారులకు ప్రోత్సాహకాల లేమిని, చివరగా ఆస్ట్రో టర్ఫ్ (అన్ని వాతావరణాల్లో, వర్షంతో పని లేకుండా హాకీ అడటానికి వీలిచ్చే కృత్రిమ ఉపరితలం)ని ప్రవేశపెట్టడాన్ని తప్పుపట్టాలి. గతంలో 9 ఒలింపిక్ స్వర్ణాలు, ఒక ప్రపంచ కప్ సాధించిన బలుపుతో హాకీ అధికారి కంగా మన జాతీయ క్రీడగా కొనసాగుతున్నప్పటికీ మనం హాకీ గురించి మాట్లాడుకోవడం మానేశాము. అనివార్యంగా పాకిస్తాన్ కూడా పెద్ద లీగ్ పోటీల్లో అర్హత సాధించలేక పతనమైపోయింది. ఎనిమిది దశాబ్దాలపాటు ప్రపంచాన్ని శాసించిన ఉపఖండ హాకీ శకం ముగిసిపోయింది. జన్మస్థానంలోనే మహాపతనం ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌తో పాటు యూరోపియన్ దేశీయ లీగ్, జాతీయ జట్లు కూడా ముందుగా భారత్‌పై, తర్వాత పాకిస్తాన్‌పై టెన్నిస్ తరహా స్కోర్లు సాధించడం రివాజుగా మారిపోయింది. అంతర్జాతీయ హాకీ సంస్థ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కూడా భీతిల్లుతున్న స్థాయికి మనదైన హాకీ పతనమైపోయింది. హాకీకి జన్మస్థానమైన ఉపఖండంలోనే అది పూర్తిగా అంతరించిపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్న చింతతో వీరు ఇప్పుడు ఆటను కాపాడే పేరుతో భారతీయ హాకీ సమాఖ్యకు డబ్బులు గుమ్మరించడం ప్రారంభించారు. ఈ భీతితో కూడిన ఔదార్యంతోనే ప్రముఖ విదేశీ కోచ్‌లు (ఆస్ట్రేలియన్ దిగ్గజ కోచ్ రిక్ చార్ల్స్వర్త్తోపాటు) భారత్‌కు హాకీ పాఠాలు బోధించడానికి వచ్చేశారు. హాకీ క్రీడ ఎంత మౌలికమార్పుకు గురైందంటే, బంతిని డ్రిబ్లింగ్ చేసే, అదుపులో ఉంచుకునే, ప్రత్యర్థిని ఏమార్చి బంతిని తప్పించే కళలో మన సాంప్రదాయిక నైపుణ్యాన్ని అది అసందర్భంగా మార్చి వేసింది. ఆస్ట్రో టర్ఫ్ కీలక సమస్య కాదు. అన్ని వాతావరణాలకు తట్టుకునే ఉపరితల పరిస్థితులను రూపొందించవలసిన అవసరం ఉంది. ఆటను వేగవంతంగా మార్చడంలో, గోల్ స్కోర్ చేయడంలో, రిఫరీ విజిల్స్ని పరిమితం చేయడంలో మార్పు తీసుకొచ్చిన స్థితి ఇది. కాబట్టి హాకీ స్టిక్ వాడే సమయంలో తప్పులు చేయడాన్ని (గట్టిగా బాదుతున్నప్పుడు హాకీ స్టిక్‌ను భుజంకంటే పైకి ఎత్తకపోవడం), బంతిని ప్రత్యర్థి పాదాల కేసి కొట్టడాన్ని పరిమితం చేశారు. ఇలాంటి అనేక సందర్భాల్లో మీరు ఇప్పుడు ఆటను కొనసాగించవచ్చు. ఆటకు వేగాన్ని కల్పించడమే ఈ భావన ఉద్దేశం. ఈ క్రమంలో సంక్లిష్టమైన ఉపఖండ నిపుణతలు మనకు అందించిన సానుకూలతను ఇది ధ్వంసం చేసింది. ఆధునిక లేక కొత్త హాకీ పూర్తిగా పవర్ హిట్టింగ్, వేగంతో కూడి ఉంది. పాత ఆసియన్ అటాకింగ్ సూత్రం 5–3–2–1 (అయిదుగురు ఫార్వర్డ్లు) భూస్థాపితమైపోయింది. కొత్త నిబంధనల వల్ల మీ డేంజర్ ఏరియా కుడివైపున పొంచివున్న ప్రత్యర్థి అటాకర్ లాంగ్ పాస్ని అడ్డగించి బంతిని గోల్‌లోకి తోసే అవకాశం ఉంటోంది. ఫీల్డ్ హాకీ అనేది షూకింద జారడానికి ధరించే స్కేట్లు లేని ఐస్–హాకీలా మారిపోయింది. మీకు బలం, వేగం, అవకాశం కోసం పొంచుకుని ఉండటం సాధ్యమైతే గోల్ చేయడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. ఈ తరహా ఆట యూరోపియన్లకు సరిగ్గా సరిపో యింది. అక్కడే హాకీ స్వర్ణయుగాన్ని అది తన చేతుల్లోకి తీసేసుకుంది. అధికారం చలాయించేవాళ్లదే ఆధిపత్యం యూరోపియన్ల గుత్తాధిపత్యంలోని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)ను 1924లో నెలకొల్పినప్పటినుంచి 2017లో భారతీయుడైన నరేందర్ బాత్రా కీలక స్థానం పొందేంత వరకు, ఆసియా ఆధిపత్యంలోని హాకీ క్రీడకు సంబంధించినంతవరకూ ఏ యూరోపియనేతర వ్యక్తి కూడా సమాఖ్య అత్యున్నత పదవిని చేపట్టలేకపోయాడు. అధికారం ఉన్న చోటే గేమ్ విధి నిర్ణయమైపోయింది. ఈ సమస్య ఇంకా ముందుకెళ్లింది. దీంతో మరొక సమస్య ఏర్పడింది. హాకీకి పతకాలు ఉన్నాయి కానీ మార్కెట్లు లేవు. డబ్బులు లేవు. హాకీ అంతర్జాతీయంగానే పతనమైపోయింది. మీకు అధికారం లేనట్లయితే అంతర్జాతీయ స్థాయిలో ఆ ఆటపై ఆధిపత్యం ఉన్న యజమానులు మీపై కూడా ఆధిపత్యం చలాయిస్తారన్నదే ఈ తొలి కథ గుణపాఠం. ఇక రెండో కథ క్రికెట్‌కి సంబంధించింది. భారత్ లాగే పాకిస్తాన్ కూడా ఇంగ్లిష్ క్లబ్ వ్యవస్థ నుంచి తన క్రికెట్‌ని వారసత్వంగా పొందింది. కానీ భారత్ లాగా కాకుండా పాక్ ప్రభుత్వం ప్రారంభం నుంచే క్రికెట్‌పై ఆజమాయిషీని తనవద్దే పెట్టుకుంది. క్రికెట్‌పై ఆజమాయిషీ చేయడం జాతీయ విధి అని పాక్ పాలక వర్గం భావించింది. ప్రభుత్వాధికారం కిందే ఒక లెఫ్టినెంట్ జనరల్, ఒక అత్యున్నతాధికారి, రాజకీయ నేతలు, ఇప్పుడు ఒక సంపాదకుడు పీసీబీని నిర్వహించడానికి నియమితులవుతూ వస్తున్నారు. ప్రధాని లేదా అధ్యక్షుడు బోర్డు ప్రధాన సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. విషాదకరమైన విషయం ఏమిటంటే, ఒక క్రికెటర్ లేదా ప్రొఫెషనల్ తప్ప మరెవరైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును నిర్వహించే అవకాశముంది. దీని ఫలితం ఏమిటి? దేశంలో గొప్ప టాలెంట్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్‌కు దీనివల్ల జరిగిన మంచి ఏమిటి? అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ ఫిక్సింగ్, చీటింగ్, బాల్ ట్యాంపరింగ్, విదేశీ జైళ్లలో దాని టెస్టు ప్లేయర్లు శిక్ష అనుభవించడం, తిరిగొచ్చాక మళ్లీ దేశం కోసం ఆడటం. దాని ఆర్థిక వనరులు సంవత్సరాలుగా కుప్పగూలిపోయాయి. పాక్ క్రికెట్ బోర్డు 2004లో భారత్ పర్యటన సమయంలో మాత్రమే వాస్తవంగా చివరిసారిగా లాభాలను ఆర్జిం చింది. ఉగ్రవాదుల హెచ్చరికలు దేశీయ క్రికెట్‌ను ఇప్పుడు ధ్వంసం చేశాయి. కాని వాస్తవానికి గత ఏడు దశాబ్దాలుగా పాకిస్తాన్ దేశీయ క్రికెట్ భారత్‌లాగా ఎన్నడూ అభివృద్ధి చెందింది లేదు. ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లను అందరినీ ఆకర్షించిన ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ పతనంతో పాకిస్తాన్ క్రికెట్‌కు పెనుదెబ్బతగిలింది. కానీ ఆ పరిణామం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. వాస్తవానికి ప్రపంచంలోని ఉత్తమ ప్రతిభా సంపన్నులను ఆకర్షిస్తున్నదీ, వారిని ఇక్కడ ఆడిస్తున్నదీ భారత్ మాత్రమే. ప్రభుత్వం కానీ, న్యాయవ్యవస్థ కానీ ఎంత సదుద్దేశంతో అయినా సరే.. ప్రైవేట్ నాయకత్వంలో నడుస్తున్న ఒక ప్రొఫెషనల్ క్రీడలో జోక్యం చేసుకుంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయినేది ఈ రెండో కథ చెబుతోంది కదా. వైఫల్యాలనుంచే పునరుజ్జీవం ఇక మూడవది అత్యంత సంతోషకరమైన కథ. భారత హాకీని ఎలా పునరుద్ధరించవచ్చు అని చెబుతుందిది. దాదాపుగా అంత్యదశకు చేరుకున్న హాకీ క్రీడ బాధ్యతను కొత్త నాయకత్వం చేపట్టింది (ప్రభుత్వ మద్దతుతోనే), పైగా భారత క్రికెట్‌ను నిర్వహిస్తున్న వారి సలహా కూడా భారత హాకీ బోర్డు తీసుకుంటోంది. దేశీయంగా కూడా హాకీ లీగ్ పోటీల నిర్వహణకు ప్రయత్నం జరిగింది. కొన్ని వైఫల్యాలున్నప్పటికీ ప్రపంచంలోనే ఉత్తమ క్రీడాకారులను ఆకర్షించడం ద్వారా ఇది వాస్తవంగానే విజయం సాధించింది. దీంతో రాంచీ వంటి చిన్న పట్టణాల్లో కూడా స్టేడియంలు కళకళలాడాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులకు దేశీయ లీగ్ పోటీలు విలాస జీవితాన్ని కల్పించాయి. కానీ, భారత్ ప్రపంచ విజేతగా మారలేదు. యూరోపియన్ నిబంధనలతో కూడిన హాకీ ఇప్పటికీ ఆసియా ఖండ జట్టుకు సవాలుగానే ఉంటోంది. కానీ భారత్ ఇప్పుడు ఆసియా నంబర్ వన్ గానూ ప్రపంచ హాకీలో 6వ స్థానంలోనూ ఉంటోంది. తద్వారా వరల్డ్ కప్, ఒలింపిక్స్, చాంపియన్స్ ట్రోఫీలకు ఆటోమేటిక్‌గా అర్హత సాధించింది. ప్రధాన జట్లపై మన జట్టు ఆటతీరు మెరుగుపడింది. వాస్తవానికి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లపై భారీ స్కోరుతో ఓడిపోయిన ఘటనలు మన జ్ఞాపకాల నుంచి తొలిగిపోతున్నాయి. ప్రపంచ స్థాయిలో గెలుపొందనప్పటికీ, స్వర్ణం గెలుచుకున్న రోజుల కంటే ఇప్పుడే భారత హాకీ ప్రపంచ హాకీ శక్తిగా పేరు సాధించింది. భారత్ హాకీకి మార్కెట్‌ను సాధించి దాన్ని ప్రపంచానికి బహుమతిగా అందించింది. దీని ఫలితం ప్రపంచ స్థాయి ఉత్తమ ఆటగాళ్లు ఇక్కడికి రావడమే కాకుండా ఈ సంవత్సరం అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు ఒక భారతీయుడు అధ్యక్షుడయ్యారు. పతకాల కంటే అధికంగా డబ్బే మాట్లాడే అంతర్జాతీయ క్రీడలో మీ ఆర్థిక బలాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేందుకు ఇది గొప్ప పాఠం. ప్రపంచ క్రికెట్‌ను ‘లార్డ్స్’ నడుపుతున్నప్పుడు 1971–72 మధ్య కాలంలో భారత్ తన స్పిన్ బలంతో కేవలం రెండంటే రెండు సీరీస్లు నెగ్గగానే వారు లెగ్ ట్రాప్లోని ఫీల్డర్లపై నిబంధనలు విధించారు. తర్వాత వెస్టిండీస్ తమ పేస్ బౌలింగుతో శివతాండవమాడుతున్నప్పుడు ఈ కులీనులే బౌన్సర్లపై పరిమితి విధించారు. నలుగురు ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యంలోంచి పెరుగుతూ వచ్చిన వెస్టిండీస్ క్రికెట్ ఆనాటినుంచి కోలుకోలేదు. అలాంటి ఘటనలు గత రెండు దశాబ్దాలుగా జరగక పోవడానికి కారణం.. అధికారాన్ని ఎలా ఉపయోగించాలో భారత్ తెలుసుకుని ఉండటమే. ఇప్పుడు మళ్లీ అలాంటి అధికారాన్ని వదులుకుని మంచి బాలురుగా మారిపోవాలని మనల్ని ఆదేశిస్తున్నారు. నన్ను నమ్మడం లేదా.. అయితే ఐసీసీకి చెందిన నిర్వాహక కమిటీ (సీఓఏ) ఇటీవలే బీసీసీఐకి జారీ చేసిన రెండు ఫర్మానాలను ఒకసారి చూడండి. శేఖర్ గుప్తా twitter@shekargupta -
8న సీనియర్ హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): ఈ నెల 8 వ తేదీన జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని స్థానిక ఎస్పీజీ హైస్కూలు మైదానంలో సీనియర్ హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి డి. సుధీర్ గురువారం ప్రకటనలో తెలిపారు. 16 సంవత్సరాలు దాటి, ఆసక్తి కలిగిన క్రీడకారులు రూ. 10 ప్రవేశ రుసుంతో ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన జిల్లా హాకీ సీనియర్ జట్టు ఈనెల 26 నుంచి 29 వరకు విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. -
భారత్ చరిత్రను రిపీట్ చేసేనా?
లక్నో:జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో మరోసారి చరిత్ర సృష్టించేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. 15 ఏళ్ల క్రితం చివరిసారి జూనియర్ వరల్డ్ కప్ హాకీ టైటిల్‌ను సాధించిన భారత్.. ఆ తరువాత ఇంతవరకూ ఆ ట్రోఫీని గెలవలేదు. తాజాగా సొంతగడ్డపై జరుగుతున్న జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత జట్టు గత చరిత్రను పునరావృతం చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం గం.6.00లకు నగరంలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆరంభమయ్యే మ్యాచ్‌లో బెల్జియంతో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సన్నద్ధమైంది. జూనియర్ వరల్డ్ కప్ టోర్నీలో స్పెయిన్ ను క్వార్టర్ ఫైనల్ ఓడించిన భారత్.. సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దాంతో హర్జిత్ సింగ్ అండ్ గ్యాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టైటిల్ వేటలో భారత్ విజయం సాధిస్తుందనే ధీమాతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మన్దీప్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, ఆర్మాన్ ఖురేషీ, సంతా సింగ్‌లతో కూడిన జట్టు భారత యువ జట్టు బలంగా కనిపిస్తోంది. దాంతో 2001 నుంచి భారత్ ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఎలాగైనా తెరదించాలని భారత్ భావిస్తోంది. ఇప్పటివరకూ ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమి అనేది లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. దాంతో తుదిపోరు మరింత ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ ఈ టైటిల్ వేటలో భారత్ విజయం సాధించిన పక్షంలో మన జాతీయ క్రీడ హాకీకు ఎంతో కొంత పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. -
హాకీలో సత్తాచాటిన ఆంధ్ర జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 హాకీ పోటీల్లో ఆంధ్ర బాల, బాలికల జట్లు తమ సత్తా చాటుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరుగుతున్న జాతీయస్థాయి హాకీ పోటీల్లో బాలికల జట్టు జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 11–0తో విజయకేతనాన్ని ఎగరేసింది. హేమలత–3, పుష్ప–1, హిమబిందు–4 గోల్ సాధించారు. జిల్లాకు చెందిన జ్యోతి–3 గోల్లు చేసి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించింది. తమిళనాడుతో జరిగిన మ్యాచ్ 2–2తో డ్రాగా ముగిసింది. బాలుర హాకీ జట్టు సీబీఎస్ జట్టుతో తలపడగా 2–0 తో విజయకేతనాన్ని ఎగరేసింది. జట్టులో ఉదయ్–1, గంగాధర్–1, గోల్స్ చేశారు. జట్టు ప్రదర్శన సంతోషాన్నించ్చిందని అండర్–19 స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర బాలికల జట్టులో జిల్లా నుంచి ఐదు మంది, బాలుర జట్టులో ముగ్గురు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
హాకీటోర్నీ విజేత ‘అనంత’ జట్టు
ధర్మవరంటౌన్ : విశాఖపట్నంలోని ఎలమంచిలిలో జరుగుతున్న ఏపీ 7వ జూనియర్ బాలుర హాకీ ఇంటర్ డిస్ట్రిక్ టోర్నీలో ‘అనంత’ జట్టు విజయకేతనం ఎగురవేసింది. సోమవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ‘అనంత’ జట్టు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ‘అనంత’ జట్టు వైజాగ్ జట్టుతో తలపడగా 2–0 తేడాతో విజయం సాధించింది. అనంత జట్టులో సాయి–1, శివ–1లు తలా ఒక గోల్ చేసి జట్టును విజయ తీరానికి చేర్చారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధాన కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఎమ్మెల్సీ చలపతిరావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతిని అందజేశారు. విజేత జట్టుకు హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాంఛోఫెర్రర్, ధర్మాంబ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లెం వేణుగోపాల్, బీవీఆర్ శ్రీనివాసులు, పరిశీలకుడు వడ్డే బాలాజీలు అభినందనలు తెలిపారు. -
హాకీలో ఎస్ఆర్కేఆర్ విద్యార్థుల ప్రతిభ
భీమవరం : అంతర్ కళాశాలల హాకీ పోటీల్లో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ చెప్పారు. సోమవారం కళాశాల వద్ద విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఎల్.బుల్లయ్య కళాశాలలో ఈనెల 2 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రా వర్సిటీ అంతర్ కళాశాల హకీ పోటీలు జరిగాయన్నారు. తమ కళాశాల హాకీ జట్టులోని జె.మహేష్‌కుమార్, ఏవీఎస్ పవ¯ŒS ఈనెల మూడో వారంలో చెన్నైలో నిర్వహించే సౌత్జో¯ŒS పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరితో పాటు ఎ¯ŒS.సాయికిరణ్‌ను బైస్టాండ్గా ఎంపిక చేశారన్నారు. అంతర్ కళాశాలల పోటీల్లో విజయం సాధించిన హాకీ బృందాన్ని కళాశాల డైరెక్టర్ సాగి విఠల్ రంగరాజు, ప్రిన్సిపాల్ పార్థసారథివ ర్మ, పీడీ పి.సత్యనారాయణరాజు అభినందించారు. -
భారత్‌కు తొలి గెలుపు
మెల్బోర్న్: నాలుగు దేశాల ఇన్విటేషనల్ టోర్నమెంట్లో భారత పురుషుల హాకీ జట్టుకు తొలి విజయం దక్కింది. గురువారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్‌లో చివరి క్వార్టర్లో అద్భుతంగా ఆడిన భారత జట్టు 4-2తో మలేసియాపై నెగ్గింది. నికిన్ తిమ్మయ్య (24, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ (31వ ని.) గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. చివర్లో ఆకాశ్‌దీప్ (56) చేసిన గోల్‌తో భారత్ తిరుగులేని ఆధిక్యం సాధించింది. శనివారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడుతుంది. తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భారత్ 2-3 గోల్స్‌తో ఓడింది. గోవాపై కోల్‌కతా విజయం ఫటోర్డా: తమ చివరి మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించిన అట్లెటికో డి కోల్‌కతా జట్టు గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవాపై 2-1తో విజయం సాధించింది. కోల్‌కతా నుంచి బెలెన్కోసో (28), పియర్సన్ (90) గోల్స్ చేయగా గోవా నుంచి మందర్ దేశాయ్ (80) ఏకై క గోల్ సాధించాడు. -
23న హాకీ జూనియర్ బాలుర జట్టు ఎంపిక
కర్నూలు(టౌన్): జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న ఉదయం 11 గంటలకు స్థానిక ఎస్టీబీసీ కళశాల మైదానంలో హాకీ జూనియర్ బాలుర జట్టును ఎంపిక చేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి డి. సుధీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 1998 తర్వాత జన్మించిన క్రీడాకారులే ఎంపికకు హాజరు కావాలన్నారు. 15 సంవత్సరాల వయస్సు దాటిన అభ్యర్థులు ప్రవేశ రుసుం రూ.10 చెల్లించి పుట్టిన తేదీ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారన్నారు. -
హాకీ కోచ్‌గా వెంకటేశ్వర్లు
దేవనకొండ: ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి హాకీ పోటీలకు తెర్నెకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటశ్వర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సునీలమ్మ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. గతంలో ఈయన దాదాపు ఐదుసార్లు జాతీయస్థాయి పోటీలకు కోచ్‌గా వ్యవహరించారన్నారు. గ్రామ సర్పంచు రాజన్న, ఉపసర్పంచు సత్యరాజు, ఎంఈఓ యోగానందం, ఎంపీడీఓ ఉమామహేశ్వరమ్మ, ఎంపీపీ రామచంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
హాకీ విజేత వైఎస్ఆర్ కడప జిల్లా
- ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు నూనెపల్లె: రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో వైఎస్ఆర్ కడప జిల్లా జట్టు విజేతగా నిలిచింది. తూర్పుగోదావరి, అనంతపురం జిల్లా జట్టు ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. హాకీ సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలో ఈ పోటీలు నిర్వహించారు. మెదటి సెమీఫైనల్లో అనంతపురంపై గెలిచిన వైఎస్ఆర్ కడప, రెండో సెమీఫైనల్లో విశాఖపట్నం జట్టుపై తూర్పుగోదావరి జట్టు ఫైనల్లో తలపడ్డాయి. ఫలితం 2–2 రావడంతో షూటౌట్ నిర్వహించగా. వైఎస్ఆర్ కడప జట్టు 5–2 తేడాతో తూర్పుగోదావరిపై విజయం సాధించింది. అనంతపురం, విశాఖపట్నం జట్టు మూడో స్థానానికి పోడీపడగా 2–1 అనంతపురం గెలుపొందింది. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి.. జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.జె. చాణిక్య రాజు మాట్లాడారు. అందరి సహకారంతో ఈ సారి నంద్యాలలో జాతీయ స్థాయి హాకీ పోటీలను నిర్వహిస్తామన్నారు. హాకీ సంఘం జిల్లా కార్యదర్శి సుధీర్ , లయన్స్‌క్లబ్ అ«ధ్యక్షుడు భవనాశి నాగమహేష్, నెల్లూరు హాకీ అసోసియేషన్ కార్యదర్శి ధామస్ పీటర్, వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సుభాన్ బాషా, కర్నూలు హాకీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌రాజు, నంద్యాల హాకీ కార్యదర్శి స్టీఫెన్, లయన్స్‌క్లబ్ కార్యదర్శి రామకృష్ణుడు, ప్రముఖులు ప్రభుదాస్, జోసఫ్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ మహిళా హాకీ టోర్నీ ప్రారంభం
నంద్యాల: స్థానిక ఎస్పీజీ మైదానంలో ఏపీ మహిళా హాకీ టోర్నీ శుక్రవారంప్రారంభమైంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, ఏపీ హాకీ అసోసియేషన్ కార్యదర్శి నిరంజన్‌రెడ్డి పాల్గొని టోర్నీని ప్రారంభించారు. ఎమ్మెల్యే భూమా క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సాధారణమని, ఓడిన వారు మళ్లీ గెలవడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని విజయనగరం మినహా మిగతా జిల్లాల నుంచి 250మంది క్రీడాకారులు, 50మంది కోచ్‌లు, మేనేజర్లు టోర్నీకి హాజరయ్యారు. తొలిరోజు పశ్చిమగోదావరి జిల్లాపై నెల్లూరు 5–0స్కోరుతో ప్రకాశంపై గుంటూరు 4–0 స్కోరుతో విజయం సాధించగా కృష్ణ–చిత్తూరు జిల్లాల మ్యాచ్ టైగా ముగిసింది. ఆదివారం ఫైనల్స్ జరగనున్నాయి. కార్యక్రమంలో కర్నూలు హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు చాణిక్యరాజు, కార్యదర్శి సుధీర్, కర్నూలు విండోస్ స్కూల్ మేనేజర్ అగస్టీన్ పాల్గొన్నారు. -
మా హాకీకి గుర్తింపు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముకేశ్ కుమార్ నేతృత్వంలోని తెలంగాణ హాకీ సంఘం (టీహెచ్)కు గుర్తింపు ఇచ్చే విషయంలో వివాదం నెలకొంది. ముకేశ్ కార్యవర్గాన్ని కాకుండా భీమ్ సింగ్ ఆధ్వర్యంలోని సంఘానికి ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) గుర్తింపు ఇవ్వడమే దీనికి కారణం. 2015 డిసెంబర్లోనే తమ సంఘాన్ని హాకీ ఇండియా (హెచ్ఐ) గుర్తించినా... ఓఏటీ మాత్రం తమ దరఖాస్తును పట్టించుకోలేదని ముకేశ్ కుమార్ ఆరోపించారు. ‘ఈ ఏడాది జనవరిలోనే ఓఏటీకి కావాల్సిన సంబంధిత పత్రాలు అందజేశాం. వారి సూచన మేరకు అక్టోబర్ 15న మా ప్రతినిధి ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యారు. అరుుతే మరో వర్గాన్ని గుర్తించడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై హాకీ ఇండియాకు ఫిర్యాదు చేశాం’ అని ముకేశ్ కుమార్ చెప్పారు. హెచ్ఐ చైర్మన్ నరీందర్ బాత్రా తనకు పూర్తిగా మద్దతు పలికారని, హెచ్ఐ చెప్పినవారికి కాకుండా మరొక సంఘాన్ని ఓఏటీ గుర్తించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. పది నెలల వ్యవధిలోనే హాకీ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ముకేశ్ వెల్ల్లడించారు. మరోవైపు ముకేశ్ ఆరోపణలను ఓఏటీ అధ్యక్షుడు రంగారావు ఖండించారు. ‘ఆటగాడిగా మేం ముకేశ్‌ను గౌరవిస్తాం. అరుుతే మేం నిబంధనల ప్రకారమే వ్యవహరించాం. ఎన్నికలు, కార్యవర్గంలాంటి ప్రాథమిక అంశాలను పట్టించుకోకుండా సంఘం అని చెబితే ఎలా? ప్రస్తుతానికి భీంసింగ్ వర్గాన్నే మేం గుర్తిస్తున్నాం. బాత్రాకూ అదే చెప్పాను. మున్ముందు దీనిపై మరింతగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని రంగారావు స్పష్టం చేశారు. -
రేపు సీనియర్ బాలికల జిల్లా జట్టు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 15న మంగళవారం సీనియర్ బాలికల జిల్లా జట్టు ఎంపికను స్థానిక ఆర్డీటీ క్రీడా గ్రామంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌బాబు తెలిపారు. ఆసక్తి కలిగిన బాలికలు ఈ ఎంపికలకు హాజరుకావచ్చన్నారు. ఎంపికైనవారు కర్నూలు జిల్లా నంద్యాలలో 7వ రాష్ట్రస్థాయి సీనియర్ హాకీ క్రీడా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీలు ఈ నెల 18 శుక్రవారం నుంచి 20వ తేదీ ఆదివారం వరకు ఉంటాయన్నారు. -
హాకీ ఎంపికలకు స్పందన
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ మహిళల హాకీ ఎంపికలకు మంచి స్పందన లభించింది. ఎంపికకు విచ్చేసిన జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. సుభాన్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో హాకీ క్రీడకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. హాకీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు క్రీడాకారులు కృషిచేయాలని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు నంద్యాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో, అనంతరం హర్యాణలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ఎంపిక ప్రారంభించి, జిల్లా జట్టు ప్రకటించారు. కార్యక్రమంలో హాకీ కోచ్ ఖాదర్‌బాషా, వ్యాయామ ఉపాధ్యాయులు మమత, షకీల, వెంకటలక్ష్మీ, సీనియర్ క్రీడాకారుడు సందీప్, క్రీడాకారిణులు పాల్గొన్నారు. జిల్లా జట్టు : రాజేశ్వరి, పద్మజ, శైలజ(ప్రొద్దుటూరు), చిన్ని, శైలజ(బయనపల్లె), శ్రీలత, హారతి, జ్యోతి, హాజిత, ప్రమీల, నరిష్మ, ప్రశాంతి, కల్పన, జి.లక్ష్మీదేవి, లక్ష్మీదేవి(కడప), కె.గణిత, మనీష, గంగాదేవి. స్టాండ్‌బై : వెంకటభార్గవి, గంగాదేవి, శశి. -
మళ్లీ కెప్టెన్సీ ఇస్తే..
న్యూఢిల్లీ:మరోసారి భారత పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తే ఆ పదవిని అత్యంత సంతోషంగా స్వీకరిస్తానని అంటున్నాడు మాజీ సారథి సర్ధార్ సింగ్. రియో ఒలింపిక్స్ ముందు వరకూ దాదాపు నాలుగు సంవత్సరాలు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తనకు దక్కిన అరుదైన గౌరవమన్నాడు. మరొకసారి టీమిండియా పగ్గాలు అప్పజెప్పితే సంతోషంగా స్వీకరిస్తానని మనసులో మాటను వెల్లడించాడు. జట్టు పగ్గాలను కోల్పోవడం కాస్త నిరాశ కల్గించినా, దేశానికి ఆడటం అంతకన్నాముఖ్యమన్నాడు. ఇటీవల కాలంలో తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలపై సర్దార్ స్పందించాడు. జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి రావడం ఒక భాగమని, అదే క్రమంలో తనపై కూడా అనేక రూమర్లు వచ్చాయన్నాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఓడించి టైటిల్ సాధించడంపై సర్దార్ హర్షం వ్యక్తం చేశాడు. ఏ టోర్నమెంట్‌లోనైనా పాకిస్తాన్ పోరు అంటే అదొక పెద్ద ఛాలెంజ్ అని పేర్కొన్నాడు. లీగ్‌ల్లో పాకిస్తాన్ ఓడించిన భారత జట్టు.. అదే ఫైనల్లో కూడా పునరావృతం చేసి ఆ ట్రోఫీని మన జవాన్లకు అంకితమిచ్చిందన్నాడు. తాను ఎప్పుడూ ఫామ్‌ను పరీక్షించుకుంటూ ముందుకు వెళుతుంటానని, అదే సమయంలో యువకు ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడపడం ఆనందంగా ఉందన్నాడు. మరొకసారి కెప్టెన్ గా పగ్గాలు తనకు ఇచ్చినట్లైతే అత్యంత సంతోషంగా ఆ పదవిని స్వీకరిస్తానని సర్దార్ తెలిపాడు. -
చైనాను హడలెత్తించిన భారత్
9-0తో భారీ విజయం ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ క్వాంటన్ (మలేసియా): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సాధించిన విజయంతో జోరు మీదున్న భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో మరో భారీ విజయం సొంతం చేసుకొని సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. చైనాతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9-0 గోల్స్ తేడాతో అద్భుత విజయం దక్కించుకుంది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (9వ, 39వ నిమిషంలో), యూసుఫ్ అఫాన్ (18వ, 40వ ని.లో), జస్జీత్ సింగ్ కుమార్ (22వ, 51వ ని.లో)రెండేసి గోల్స్ చేయగా... రూపిందర్ పాల్ సింగ్ (24వ ని.లో), నికిన్ తిమ్మయ్య (33వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (36వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ గెలుపుతో భారత్ ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో 10 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. బుధవారం జరిగే చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య మలేసియా జట్టుతో భారత్ తలపడుతుంది. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గాయం కారణంగా కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అతని స్థానంలో ఆకాశ్ చిక్టే గోల్‌కీపర్‌గా వ్యవహరించగా... రూపిందర్‌పాల్ సింగ్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. తొమ్మిదో నిమిషంలో ఆకాశ్‌దీప్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత చివరి నిమిషం వరకు చైనాపై పూర్తి ఆధిపత్యం చలారుుంచింది. భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు రాగా... ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. చైనాకు రెండు పెనాల్టీ కార్నర్లు వచ్చినా భారత గోల్‌కీపర్ ఆకాశ్ అప్రమత్తంగా వ్యవహరించి వాటిని నిర్వీర్యం చేశాడు. -
భారత జట్లకు మిశ్రమ ఫలితాలు
వాలెన్సియా (స్పెరుున్): అంతర్జాతీయ హాకీ ఇన్విటేషనల్ టోర్నమెంట్లో భారత జూనియర్ పురుషుల, మహిళల జట్లకు మిశ్రమ ఫలితాలు లభించారుు. నాలుగు దేశాల టోర్నీలో భాగంగా జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత జూనియర్ పురుషుల జట్టు 3-1తో విజయం సాధించగా... ఐదు దేశాల టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జూనియర్ మహిళల జట్టు 0-3తో ఓడిపోరుుంది. భారత పురుషుల జట్టు తరఫున వరుణ్ కుమార్ రెండు గోల్స్ చేయగా... అజయ్ యాదవ్ మరో గోల్ సాధించాడు. -
భారత్‌కు గట్టిపోటీ ఇస్తాం: పాక్ కోచ్
క్వాంటాన్(మలేషియా):ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గట్టిపోటీ ఇస్తామని పాకిస్తాన్ కోచ్ ఖవాజా జునైద్ పేర్కొన్నాడు. అసలు ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటేనే ఎప్పుడూ భావోద్వేగాలు నిండి వుంటాయని, అయితే రేపటి మ్యాచ్ ఎటువంటి గంభీర వాతావరణం లేకుండా జరగాలని కోరుకుంటున్నట్లు జునైద్ తెలిపాడు. 'భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ అంటే ఎప్పుడూ భావోద్వేగంగా ఉంటుంది.ఇరు జట్ల మధ్య పోరు అంటే లక్షల సంఖ్యలో అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తారు. ఇరు జట్ల వల్లే హాకీకి మరింత పాపులారిటీ వచ్చిందని అనుకుంటున్నా. భారత్ తో మ్యాచ్‌లో గట్టిపోటీ ఇవ్వడానికి పాక్ యువకులు సిద్ధంగా ఉన్నారు. మా జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉంటే, భారత జట్టులో అనుభవం మెండు. మా అనుభవ లేమిని రేపటి మ్యాచ్‌లో అధిగమించాల్సి ఉంది. మేము ఒక సంవత్సరకాలంలో ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ మాత్రమే ఆడాం. మరోవైపు గత ఐదేళ్లలో భారత్ 200కు పైగా మ్యాచ్‌లు ఆడింది. ఏది ఏమైనా ఈ మ్యాచ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆవేశానికి లోనుకావద్దని మా కుర్రాళ్లకు చెప్పా'అని జునైద్ పేర్కొన్నాడు.