Yadadri District News
-
ప్రత్యేక తరగతులు.. పరీక్షలు
ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కార్యాచరణ భువనగిరి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైన ప్రభుత్వ కళాశాలలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మే 22నుంచి ప్రారంభంకానున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. దీన్ని ఈనెల 22వ తేదీనుంచి అమలు చేయనున్నారు. అన్ని కాలేజీల్లో 82శాతం లోపే ఉత్తీర్ణత జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 11 ఉన్నాయి. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడినప్పటికీ.. ఏ ఒక్క కాలేజీలో 90 శాతం ఉత్తీర్ణత మించలేదు. ప్రథమ సంవత్సరం గత ఏడాది 34.8 శాతం, ఈ సారి 42.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్ గత ఏడాది 52 శాతం, ఈసారి 63.11 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సబ్జెక్టుల్లో అధికంగా ఫెయిల్ ఎంపీసీ విభాగంలో గణితం, కెమిస్ట్రీ, బైపీసీ విభాగంలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, సీఈసీ విభాగంలో ఎకానమిక్స్‌లో ఎక్కువగా ఫెయిల్ అయ్యారు. వీటితో పాటు ఇంగ్లిష్‌లో కూడా చాలా మంది తప్పినట్లు తెలుస్తోంది. కళాశాలల వారీగా ఉత్తీర్ణత ఇలా.. కళాశాలప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం హాజరు/ఉత్తీర్ణత శాతం హాజరు/ఉత్తీర్ణత శాతం రామన్నపేట 164/113 68.9 208/172 82.7మోత్కూర్ 159/109 68.6 105/91 86.7భువనగిరి 65/39 60.0 100/76 76.0చౌటుప్పల్ 101/60 59.4 117/64 54.7పోచంపల్లి 126/67 53.2 124/94 75.8నారాయణపురం 135/59 43.7 127/79 62.2భువనగిరి 145/54 37.2 126/62 49.2యాదగిరిగుట్ట 80/19 23.8 109/67 61.5వలిగొండ 111/26 23.4 124/49 39.5బి.రామారం 34/06 17.7 40/12 30.0ఆలేరు 115/19 16.5 116/52 44.8కార్యాచరణ ఇదీ.. ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైన కళాశాలల్లోని విద్యార్థులకు జిల్లా ఇంటర్మీడియట్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకోసం 20 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ● 30 శాతం కంటే తక్కువగా ఉత్తీర్ణత సాధించిన కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ● ప్రత్యేక తరగతులకు హాజరుకాని విద్యార్థులకు జూమ్ ద్వారా తరగతులు నిర్వహించనున్నారు. ● రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ఆయా టెస్టులు నిర్వహిస్తారు. ● ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రధాన సబ్జెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ● ముఖ్యమైన ప్రశ్నలు మాత్రమే చదివిస్తారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 30 వరకు గడువు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22నుంచి ప్రారంభంకానున్నాయి. ఫీజు చెల్లింపునకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. తప్పనిసరిగా హాజరుకావాలి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తరగతులతో పాటు టెస్ట్‌లు నిర్వహిస్తాం. విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలి. –రమణి, డీఐఈఓ ఫ 28వ తేదీ నుంచి అమలు ఫ మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ.. -
పక్షులే ప్రాణంగా!
ఆయన ఇల్లంతా కిలకిలరాగాలు ఆ ఇంట్లోకి అడుగు పెడితే చాలు పక్షుల కిలకిల రావాలు.. రామచిలుకల కిచకిచలు ఆహ్లాదం కలిగిస్తాయి. ఊర పిచ్చుకల సందడి ఎంతగానో ఆకట్టుకుంటుంది. పక్షి ప్రేమికుడైన ప్రదీప్ చిన్ననాటి హాబీ అయిన పక్షుల పెంపకమే నేడు ఫాం హౌస్‌గా మారింది. ప్రస్తుతం వివిధ దేశ విదేశాలకు చెందిన 500 రకాల పక్షులను ఇక్కడ సాకుతున్నాడు. తన లాంటి పక్షి ప్రేమికులకు వాటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇస్తున్నాడు. – నకిరేకల్ ఫ పక్షుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్న ప్రదీప్ ఫ పక్షుల కోసం ప్రత్యేక ఫాంహౌస్ ఏర్పాటు ఫ ఇక్కడ వివిధ రకాల 500 పక్షుల సంరక్షణ ఫ విదేశీ రంగురంగుల పక్షులు సైతం లభ్యం ఫ ఎక్కడ కొత్త రకం పక్షి కనిపించినా.. తెప్పించడమే పని ఫ వాటి దాణాకే నెలకు రూ.15 వేలకుపైగా ఖర్చు ఇతర దేశాల పక్షులు కూడా.. ప్రదీప్ బాల్యం నుంచి పక్షుల పెంపకాన్ని హబీగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి పక్షులను సంరక్షిస్తున్నాడు. ప్రస్తుతం షెడ్డులో పెద్దపెద్ద జాలీ బోన్లు ఏర్పాటు చేసి పక్షులను సాకుతున్నాడు. ఇప్పుడు సుమారు 50 నుంచి 100 రకాల పక్షులను 500పైగానే పెంచుతున్నాడు. విదేశీ పక్షులు ఎక్కువగా చైన్నె, బెంగళూరు, కేరళ వంటి ప్రాంతాల్లో పెంచుతారు. ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుకున్న ప్రదీప్ వాటిని ఇక్కడికి తెప్పిస్తున్నాడు. దేశంలో ఎక్కడ డిఫెరెంట్ పక్షులు కనిపించినా వాటిని తెచ్చుకుని సంరక్షించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక్కడ మనకు మాట్లాడే రామచిలుకలు, పావురాలు, ఇతర రకాల అందమైన పక్షుల కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే ఒక్కో పక్షి రూ.600 నుంచి రూ.60 వేల పైనే ధర పలుకుతాయి. పక్షుల జీవిత కాలం ఏడాదిన్నర నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన రాపోలు లింగయ్య రిటైర్డ్ ఉపాధ్యాయుడు. నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆయన కుమారుడు రాపోలు ప్రదీప్‌కు చిన్నతనం నుంచి పక్షులంటే ఎనలేని ప్రేమ. ప్రదీప్ 17 ఏళ్ల క్రితం నుంచి మూసీ రోడ్డులోని తన ఇంట్లో 100 పక్షులతో పెంపకాన్ని ప్రారంభించాడు. తర్వాత ఏడేళ్ల క్రితం నకిరేకల్‌లోని చీమలగడ్డలో 500 గజాల స్థలంలో రూ.10 లక్షల వ్యయంతో రేకుల షెడ్లు వేసి పక్షుల ఫాంహౌస్ ఏర్పాటు చేశాడు. ఆ పరిసర ప్రాంతమంతా చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాడు. షెడ్డుపైన జమ్ము వేసి.. స్ప్రింక్లర్ల ద్వారా నిరంతరం నీటితో తడుపుతూ ఎండ నుంచి పక్షులకు రక్షణ కల్పిస్తున్నాడు. ఫాం హౌస్‌లో పక్షుల సంరక్షణే ఆయన దిన చర్చ. పనిమీద ఎక్కడికై నా వెళ్లినా.. సాయంత్రానికి ఫాంహౌస్ చేరుకుని వాటిని సంరక్షిస్తుంటాడు. పక్షుల షెడ్డులో రాపోలు ప్రదీప్ 500 పక్షులు పెంచుతున్నా.. చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగాను. అప్పటి నుంచే నాకు పక్షులంటే ప్రాణం. చిన్నతనంలో కనిపించిన ఒకటి రెండు పక్షులను తెచ్చుకున్నాను. ఆ తరువాత పక్షుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్నాను. ఇప్పుడు 500 పక్షుల వరకు పెంచుతున్నాను. పక్షులు అవసరమైన వారికి వస్తే లాభాపేక్ష లేకుండా ఇస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా సాయంత్రంలోగా పక్షుల ఫాం హౌస్‌కు చేరుకుంటాను. చిన్న పిల్లల మాదిరిగా వాటిని సంరక్షిస్తాను. – రాపోలు ప్రదీప్,పక్షి ప్రేమికుడు, నకిరేకల్హైదరాబాద్, గుజరాత్ నుంచి దాణా ప్రదీప్ తన పక్షుల కోసం ప్రతి నెలా రూ.15 వేలపైనే దాణా కోసం ఖర్చు చేస్తున్నారు. సూర్యాపేట, హైదరాబాద్, గుజరాత్, చైన్నై తదితర ప్రాంతాల నుంచి దాణా తెప్పిస్తున్నాడు. వాటికి కొర్రలు, రాగులు, వేరుశనగ, పెసర్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ తదితర పదార్థాలను ఆహారంగా ఇస్తున్నాడు. పశు వైద్యుల సలహాలు తీసుకోవడంతోపాటు పక్షులకు వైద్యం చేయిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. -
28న ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో ఈనెల 28వ తేదీన జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ భారతి చట్టంపై గ్రామాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో ఉన్నతాధికారులు పాల్గొంటారని, ఈ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించి సమస్యలపై వినతులు అందజసేందుకు కలెక్టరేట్‌కు రావద్దని, అధికారులకు సహకరించాలని కోరారు. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి బియ్యంసాక్షి, యాదాద్రి : కొత్తరేషన్ కార్డుదారులకు మే నెల నుంచి సన్న బియ్యం పంపి ణీ చేస్తామని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఈనెలలో కొత్తగా 419 రేషన్ కార్డులు మంజూ రయ్యాయని, వీటిపై 30,188 యూనిట్లకు బియ్యం సరఫరా చేస్తామన్నారు. ఏప్రిల్ నెలలో 2,16, 904 కార్డులకు గాను 6,76,188 యూ నిట్ల (లబ్ధిదారులకు) బియ్యం ఇచ్చామన్నారు. మే నెలనుంచి పెరిగిన వాటితో కలిపి 2,17,323 కార్డులకు 7,06,368 యూనిట్ల బియ్యం సరఫరా చేస్తామన్నారు. బొమ్మలరామారం నిప్పులకొలిమి భువనగిరిటౌన్ : జిల్లాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం బొమ్మలరామారం మండలంలో ఏకంగా 44.1 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. గత పదేళ్లలో ఏప్రిల్ నెలలో ఈస్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా మండలాల్లోనూ 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రానున్న మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ బదిలీ భువనగిరి : జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం వైద్యారోగ్య శాఖనుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాజారావు 8 నెలల కిత్రం ఇక్కడికి వచ్చారు. ఆయన స్థానంలో ఆర్థోపెడిక్ సర్జరీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్లకు ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశ్వర్లను డాక్టర్ రాజారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు, డీసీహెచ్ఎస్ చిన్ననాయక్ సన్మానించారు. -
వరంగల్‌కు గులాబీ దండు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు సన్నద్ధం సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి యాదాద్రి : వరంగల్‌లో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సన్నద్ధ్దమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో బస్సులు, కార్లు, జీపులలో ఆదివారం ఉదయమే తరలివెళ్లనున్నారు. వరంగల్ జిల్లాకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. అన్ని గ్రామాల్లో ఆదివారం ఉదయం జెండాలు ఆవిష్కరించి సభకు బయలుదేరుతారు. వినూత్న రీతిలో.. వరంగల్ సభకు ఉమ్మడి నల్లగొండ నుంచి లక్ష మందిని తరలించేలా టార్గెట్ పెట్టుకున్నారు. అందులో సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచే సగం మంది ప్రజలు, రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని గతంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించారు. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో జనం తరలించేందుకు చర్యలు చేపట్టారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి వినూత్న రీతిలో ఎడ్ల బండ్లలో ఈ నెల 22న పార్టీ శ్రేణులు వెళ్లగా, శుక్రవారం సైకిళ్లపై కూడా తరలివెళ్లారు. ఆదివారం ఉదయం వెళ్లేందుకు వందకు పైగా డీసీఎంలు, మరో వంద వరకు బస్సులు, వందల సంఖ్యలో అద్దె కార్లు, సొంత కార్లలో వెళ్లనున్నారు. అద్దె వాహనాలను బుక్ చేసుకొని.. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 13,500 మందిని బీఆర్ఎస్ సభకు తరలించాలని నిర్ణయించి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. అద్దె వాహనాలను బుక్ చేసుకొని మరీ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో 135 డీసీఎంలు, 100 బొలేరోలు, 20 బస్సులు, తూపాన్ వాహనాల్లో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సభ విజయవంతానికి మండలాల్లో సభలు నిర్వహించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. భువనగిరి నియోజకవర్గం నుంచి... భువనగిరి నియోజకవర్గం నుంచి 15 వేల మందిని తరలించేందుకు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఏర్పాట్లు చేశారు. 200 బస్సులతో పాటు 150 వరకు కార్లు ఏర్పాటు చేశారు. రెండు గ్రామాలకు ఒక బస్సు చొప్పున వెళ్లనున్నాయి. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లేలా సన్నద్ధ్దం చేశారు. పార్టీ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కూడా సభకు పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలేరులో గ్రామానికో బస్సు.. ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామానికి ఒక బస్సు పెట్టారు. కార్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. వరంగల్‌కు దగ్గరగా ఉన్నందున ఆ నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ ఆధ్వర్యంలో 15వేల మంది వరకు తరలించనున్నారు. సన్నాహక సమావేశాలు, పాదయాత్రలు యాదాద్రి జిల్లాలో జనసమీకరణ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, గ్యాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అధిష్టా నం అప్పగించింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేట్ కొలుపుల అమరేందర్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు సభను విజయవంతం చేయడానికి నెలరోజుల పాటు శ్రమించారు. మండల కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో వలిగొండ నుంచి యాదగిరిగుట్ట వరకు, రాయగిరి నుంచి యాదగిగుట్ట వరకుపాదయాత్రలు చేశారు. ఫ ఉమ్మడి జిల్లా నుంచి బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో ఓరుగల్లుకు.. ఫ మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల్లో ఏర్పాట్లు ఫ సూర్యాపేట, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు నుంచే ఎక్కువ మంది.. ఫ ఇప్పటికే సూర్యాపేట నుంచి ఎడ్లబడ్లపై వెళ్లిన రైతులు, పార్టీ శ్రేణులు -
పహల్గాం మృతులకు నివాళి
యాదగిరిగుట్ట: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన పర్యాటకుల ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిలో గా యపడిన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరిగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి భువనగిరి
39° /24°Iగరిష్టం/కనిష్టంవాతావరణం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025భద్రత కల్పించడమే లక్ష్యం రైతుల భూములకు భద్రత కల్పించడానికే ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. - IIIలోపోటెత్తిన భక్తులుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. 30వేల మందికి పైగా దర్శించుకున్నారు. - IIలో -
యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం చేపట్టారు.అంతకుముందు ప్రధానాలయంలో నిత్యపూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. ఇక ప్రాకార మండపపం, ముఖ మండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం నిర్వహించారు. -
మలేరియా రహిత జిల్లాగా మారుద్దాం
భువనగిరి : మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2030 నాటికి మలేరియాను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిందన్నారు.ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి మందులు అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా ప్రోగ్రాం అధికారి సాయిశోభ, ప్రోగాం అధికారులు డాక్టర్ శిల్పిని, వీణ, సుమన్ కళ్యాణ్, మాస్ మీడియా జిల్లా అంజయ్య, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉక్కపోత.. చిన్నారుల వెత!
ఫ అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల లేమి ఫ చాలా చోట్ల ఫ్యాన్లు కూడా లేని దయనీయ స్థితి ఫ ఎండతీవ్రతకు ఉక్కిరిబిక్కిరి ఆలేరు రూరల్ : ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే తన ప్రతాపం ప్రదర్శిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువయ్యాయి. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వగా అంగన్వాడీ కేంద్రాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రాల్లో సౌకర్యాలు కొరవడటంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా కేంద్రాల్లో కనీసం ఫ్యాన్లు కూడా లేవని, ఎండవేడిమికి కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఉక్కపోతకు ఉండలేకపోతున్నారు. ఎండతీవ్రత కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు పంపాలంటే జంకుతున్నారు. జిల్లాలో 901 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలిపి 25వేల మందికి పైనే ఉన్నారు. ఎండతీవ్రత వల్ల కేంద్రాలకు చిన్నారుల హాజరుశాతం తగ్గుతోంది. కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఫ్యాన్లు లేని కేంద్రాలే అధికం ఆలేరు ప్రాజెక్టు పరిధిలో 219 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కేవలం 56 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 116 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోని ఇరుకు గదులు, వరండాల్లో నిర్వహిస్తున్నారు. 47 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో మరుగుదొడ్లు లేనివి 111, మంచినీటి సౌకర్య లేనివి 70, విద్యుత్, ఫ్యాన్ వసతి లేని కేంద్రాలు 96 వరకు ఉన్నాయి. గాలి, వెలుతురు రాకపోవడం, ఫ్యాన్లు లేకపోవడం, వానొస్తే కురువడం, బండలు పగిలిపోయి ఎలుకలు, పాములకు నిలయంగా మారుతున్నాయి. ఆరు కేంద్రాలకు నూతన భవనాలు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు. రఘునాథపురం, మల్లాపురం, మంచిరోనిమామిళ్లు గ్రామంలో గోతులు తీసి వదిలేయగా.. టంగుటూరు, మాసాయిపేట, మోటకొండూర్‌లో పనులే మొదలుకాలేదు. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయి. -
చిన పిల్లల రక్షణ ఇలా..
వేసవి కాలంలో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో తిరిగితే పిల్లలు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరి నీరు, నిమ్మరసం, కీర దోస, పుదీన నీరు తాగించాలి. తెల్లని వదులైన కాటన్ దుస్తులు వేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి పంపవద్దు. తలనొప్పి, తలతిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, అధిక చెమట, అదిక దాహం కలిగితే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, నల్లగొండ -
మండే ఎండల్లో జర భద్రం
నిరుపయోగంగా ఆస్పత్రి భవనం మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంఆవరణలో నిర్మించిన 30 పడకల భవనం నిరుపయోగంగా ఉంది.జైలును పరిశుభ్రంగా ఉంచాలి జైలును పరిశుభ్రంగా ఉంచాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ జైలు సిబ్బందికి సూచించారు.- IIIలోశనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025- IIలోఫ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఫ 42 డిగ్రీలకుపైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఫ మే నెలలో 46 డిగ్రీలకు చేరే అవకాశం ఫ ఇప్పటికే ఆల్ట్రా వైలెట్ (యూవీ) 10 శాతం నమోదు ఫ ఈ పరిస్థితుల్లో జనంతోపాటు.. పశుపక్షాదులకు జాగ్రత్తలు తప్పనిసరి ఫ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కాపాడుకోవాలి భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత మొదలవుతోంది. రాత్రి 10 గంటలకు కూడా వాతావరణం చల్లబడడం లేదు. ఎండల దాటికి ప్రజలు ఇళ్లనుంచి బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురిస్తే ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉంది. లేదంటే మే నెలలో 46 డిగ్రీలకు మించే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండడంతోపాటు చెట్లను, జీవరాశులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధులు జాగ్రత్తగా ఉండడం మంచింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళ వృద్ధులు బయటికి వెళ్లొద్దు. చెమటలు బాగా వచ్చి, కళ్లు తిరిగితే సంబంధిత డాక్టర్‌ను కలిసి ఈసీజీ తీయించుకోవాలి. ఎండలకు రక్తపోటు పెరుగుతుంది. రక్తం గడ్డకట్టి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. విరోచనాలు, వాంతులు ఎక్కువగా అయితే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎలక్ట్రోలైట్స్ పౌడర్‌ను తీసుకోవాలి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ పేషెంట్లు జాగ్రత్తగా మత్తు, శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవద్దు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు బాగా తాగాలి. – రమణ, జనరల్ ఫిజిషియన్, సూర్యాపేట నల్లగొండ : వాతావరణ మార్పుల కారణంగా ఎండలు మండుతున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి పెరిగి జనం అల్లాడుతున్నారు. డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. దీనికి తోడు ఏసీల వాడకం పెరగడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఈ కారణంగా జిల్లాలో ఆల్ట్రా వైలెట్ (యూవీ) పది శాతం నమోదవుతోంది. ఆకాశంలో తెల్లటి మేఘాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం జాగ్రతలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి మంగ్యానాయక్ సూచిస్తున్నారు. కోదాడ, భువనగిరిటౌన్ : చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం. మొక్కల పెంపకంలో చాలా కేర్ తీసుకుంటారు. అయితే, వేసవిలో మొక్కలను కాపాడుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ చిట్కాలు పాటిస్తే ఎండబారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.. ఉద్యానవన అధి అధికారులు. ● రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాతే మొక్కలకు నీరు పెట్టుకోవాలి. ● ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత మొక్కలపై నేరుగా పడకుండా గ్రీన్‌మ్యాట్ పైకప్పుగా ఏర్పాటు చేసుకోవాలి. ● గ్రీన్‌మ్యాట్‌పై రెండు మూడు గంటలకు ఒకసారి నీటిని చల్లాలి. ● మొక్కలకు రసాయన ఎరువులను అందించవద్దు. మొక్కల పాదుల్లో తడి ఆరకుండా చూసుకోవాలి. ● కుండీల్లో మొక్కలు నాటితే తరచూ మట్టిని మార్చాలి. మట్టిలో ఆవు పేడ కలపాలి. మట్టి ఎక్కువ రోజులు తడిగా ఉండటానికి కుండీలో ఎండిన ఆకులను ఉంచాలి. ● మొక్కలకు వేప పిండిని ఎరువుగా ఉపయోగించవచ్చు. కోదాడ, రామగిరి(నల్లగొండ), నకిరేకల్ : వేసవిలో జంతు ప్రేమికులు వారి పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ● ఎప్పటికప్పుడు శుభ్రమైన, చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలి. ● పెంపుడు జంతువు ఉండే ప్రాంతం చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. గాలి వేగంగా వెళ్తున్న స్థలాన్ని ఎంచుకోవాలి. ● మధ్యాహ్నం సమయంలో నేలపై నడవనివ్వకూడదు. ● ఊపిరాడకపోవడం, అలసట, అధిక నిద్ర లాంటి లక్షణాలను గ్రహించాలి. వాటి శరీరానికి తగినంత గాలితీసుకునే అవకాశం ఇవ్వాలి. ● పెంపుడు జంతువులు ఉండే ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయకుండా.. గాలి మార్పిడి ఉండేలా చూసుకోవాలి. ● తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. ● వేసవి ఒత్తిడిని తగ్గించడానికి వాటికి టానిక్లను తాగించాలి. ● పక్షుల సంరక్షణకు ఇంటి గోడలు, వరండాలు, డాబాలపై చిన్నచిన్న చిప్పల్లో నీళ్లు పోసి ఉంచాలి. ● వీటి పక్కనే చిరుధాన్యపు గింజలు పోసి ఉంచాలి. ● రోడ్ల వెంట ఉండే చెట్ల మొదళ్ల వద్ద కూడా నీటి వసతులు కల్పించాలి. మొక్కలకు నీరు పోస్తున్న దాత్రక్ పద్మ సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్‌లో పాల్గొనాలి వేసవిలో పక్షులు దాహార్తి తీర్చడానికి ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కానీల్లో నీటి చిప్పలు, కృతిమ గూళ్లను, ఫీడర్లను ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కనీల్లో పిట్టగోడలపై పిల్లల చేత నీటి కుప్పలను ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. ధాన్యపు చిప్పలను కూడా ఏర్పాటు చేసి పక్షుల మనుగడకు దోహదపడాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్‌లో అందరూ భాగస్వాములు కావాలి. – కనుకుంట్ల విద్యాసాగర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, నకిరేకల్ న్యూస్రీల్కిచెన్, టెర్రస్ గార్డెన్లను కాపాడుకోండి ఇలా.. పెంపుడు జంతువులు – జాగ్రత్తలు.. -
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ బదిలీ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) హెడ్ కాని స్టెబుల్స్, కానిస్టేబుల్స్ బదిలీ అయ్యారు. ఇందులో ఐదుగురు హెడ్ కానిస్టెబుల్స్, ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నట్లు ఆర్ఎస్ఐ శేషగిరిరావు తెలిపారు. ఐదుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుల్స్‌ను వరంగల్, ఒక కానిస్టేబుల్‌ను హైదరాబాద్క బదిలీ చేసినట్లు వెల్లడించారు. వీరి స్థానంలో కొత్తవారు రానున్నారని, త్వరలో విధుల్లో చేరుతారని పేర్కొన్నారు. యాదగిరి కొండపై తనిఖీలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఆలయ పరిసరాల్లో శుక్రవారం బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. క్యూలైన్లు, ఉచిత దర్శన మార్గం, ఆలయ పరిసరాల్లో తనిఖీలు చేశాయి. అనుమానితుల లగేజీ బ్యాగులను పరిశీలించాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఘటన నేపథ్యంలో రాచకొండ సీపీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నేత్రపర్వంగా నిత్యకల్యాణం భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. ముందుగా వేకువజామున సుప్రభాత సేవల, తోమాల సేవ, సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారికి కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కుంకుమార్చన నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన భువనగిరి : మండలంలోని బస్వాపురం ఐకేపీ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులు కావస్తుందని, ఇప్పటి వరకు కాంటా వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి, పగలు వడ్లకుప్పల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని, త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు విజయ్‌కుమార్, సత్యనారాయణ, మంగమ్మ తదితరులు ఉన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలిసూర్యాపేట అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. -
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి,యాదాద్రి : తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ, ఇండియన్ పౌల్ట్రీ ఎక్యూప్మెంట్ మాన్యుఫాక్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్లెక్సీకి పాలభిషేకం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టర్ల ద్వారా కుండా పౌల్ట్రీ యజమానుల ద్వారా జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. పౌల్ట్రీ రైతులను ఆదుకోవడానికి ముందుకువచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కాసర్ల మోహన్‌రెడ్డి, పౌల్ట్రీ ఇండియా ఫౌండర్ అనిల్ధుమాల్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, జనరల్ సెక్రటరీ భాస్కర్‌రావు, పౌల్ట్రీ ఇండియా డైరెక్టర్ పొట్లూరి చక్రధర్‌రావు, పౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
సూర్యాపేటటౌన్ : మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బీవీ రమణ రెండు రోజుల జైలు శిక్ష విధించారు. సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఆరుగురు పట్టుబడినట్లు తెలిపారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బీవీ రమణ ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా, మిగతా ఐదుగురికి రూ.6వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకుల దుర్మరణంమునుగోడు: బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం మునుగోడు మండలంలోని ఊకొండి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి మురళి (21), బింగి మచ్చగిరి(20) ఇరువురు స్నేహితులు. మురళి హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు వివాహానికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా చిట్యాలలోని పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్న అతడి స్నేహితుడు మచ్చగిరితో కలిసి చిట్యాల వరకు బైక్‌పై వెళ్లి, అక్కడి నుంచి బస్సులో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో ఊకొండి నుంచి ఇద్దరు కలిసి బైక్‌పై సాయంత్రం సమయంలో బయలుదేరారు. గ్రామ శివారులోని సెల్‌టవర్ సమీపంలోని మూలమలుపు వద్ద విద్యుత్‌స్తంభానికి బైక్ బలంగా ఢీ కొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మునుగోడు ఎస్సై రవి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేతికి వచ్చిన కుమారులు అర్ధాంతరంగా మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న ఐదు టిప్పర్లు సీజ్ కోదాడరూరల్ : అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న ఐదు టిప్పర్లను, మట్టి తవ్వుతున్న జేసీబీని మైనింగ్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కోదాడ మండలం కూచిపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 633లో అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు మైనింగ్ అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది తనిఖీ నిర్వహించారు. మట్టి తవ్వుతున్న జేసీబీతో పాటు ఐదు టిప్పర్లను సీజ్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 615లో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 4వరకు మట్టి తవ్వేందుకు అనుమతి తీసుకొని దానిని జూన్ 4వరకు గడువు ఉన్నట్లుగా ఫోర్జరీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈమేరకు వానికి జరిమానా విధించనున్నట్లు మైనింగ్ ఏడీ విజయరామరాజు, ఆర్ఐ జగదీష్ తెలిపారు. జూదరుల అరెస్ట్త్రిపురారం : త్రిపురారం గ్రామ శివారులోని పంట పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న వారిపై శుక్రవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారయ్యారు. ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని పొలాల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఐదుగురు పారిపోయినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.7200 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టైర్ల షాపులో అగ్నిప్రమాదం
మిర్యాలగూడ అర్బన్: ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి టైర్ రీ ట్రేడింగ్ వర్క్ షాపు పూర్తిగా దగ్ధమైన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు మచ్చ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ విజయలక్ష్మి టైర్ రీ ట్రేడింగ్ వర్క్ షాపు లోపలి నుంచి పొగలు వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు షాపు యజమాని మచ్చ శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. షాపు వద్దకు వచ్చిన శ్రీనివాస్ తాళం తీసి చూడగా అప్పటికే టైర్లకు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ వ్యాపించింది. విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో వందకు పైగా రీ బాటమ్ చేసిన టైర్లు దగ్ధం కాగా వర్క్ షాపులోని మిగతా సామగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో మొత్తం రూ.16 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపాడు. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
అంతర్జాతీయ స్థాయికి తూరు్పగూడెం వాసి
తుంగతుర్తి : లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ మారుమూల ప్రాంత వాసి. నిరుపేద కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయి వరకూ చేరుకున్నాడు. తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన తల్లాడ రామకోటయ్య, కమలమ్మ దంపతుల కుమారుడు తల్లాడ భాస్కర్ భోపాల్ లోని సీఎస్ఐఆర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఐఆర్– ఏఎంపీఆర్ఐ) డైరెక్టర్‌గా నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన సీఎస్ఐఆర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సీఎస్ఐఆర్ – ఐఐపీ డెహ్రాడూన్‌లో చీఫ్ సైంటిస్ట్‌గా, మెటీరియల్స్ రిసోర్స్ ఎఫీషిఝెన్సీ డివిజన్ హెడ్‌గా పని చేస్తున్నారు. ప్రపంచంలోని టాప్ 2 శాస్త్రవేత్తల్లో ఒకరుగా.. తల్లాడ భాస్కర్ నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ మొదటి నుంచి చదువులో రాణిస్తూ ఉండేవారు. సంవత్సరం క్రితం భాస్కర్ తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయనకు గ్రామంలో ఇంటి స్థలం కూడా లేదు. ప్రాథమిక విద్య తూర్పు గూడెంలో, ఆరు, ఏడవ తరగతి గుమ్మడవెల్లిలో, 8, 9వ తరగతి తుంగతుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, పదో తరగతి సూర్యాపేట జెడ్పీ బాలుర పాఠశాలలో 1986–87 లో ఇంటర్మీడియట్ సూర్యాపేటలో చదివారు. నాడు తుంగతుర్తి, గుమ్మడవెల్లి గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ (2022– 2024 )ప్రకారం ఆయన ఎనర్జీ రంగంలో ప్రపంచంలోని టాప్ 2 శాస్త్రవేత్తల్లో ఒకరుగా నిలిచారు. చదువే ప్రధానం : డాక్టర్ తల్లాడ భాస్కర్ చదువుకుంటేనే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. నా చిన్నతనంలో మా కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న కుటుంబం కాదు. నేను చదువుకొని ముందుకు వెళ్తే ఏదో ఒకటి లభిస్తుందని ఉన్నతంగా చదువుతున్నా. ఫ నిరుపేద కుటుంబంలో జన్మించి శాస్త్రవేత్తగా ఎదిగిన తల్లాడ భాస్కర్ ఫ సీఎస్ఐఆర్– ఏఎంపీఆర్ఐ డైరెక్టర్‌గా నియామకం ఫ సూర్యాపేటలోనే ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం -
జైలును పరిశుభ్రంగా ఉంచాలి
నల్లగొండ : ఖైదీలకు వసతులు కల్పించడంతోపాటు జైలును పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ షమీం అక్తర్ సూచించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైలును ఆయన సందర్శించారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనకు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జైలులోని వంటగదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను జస్టిస్ షమీం అక్తర్ పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల వివరాలు, సౌకర్యాలు, ఏర్పాట్లు తదితర వివరాలను జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ వివరించారు. అదేవిధంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, సంక్షేమ హాస్టళ్ల ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియా ప్రతి నిధులతో మాట్లాడారు. జిల్లా జైలులో సుమారు 177 మంది ఖైదీలు ఉన్నారని, అందులో 21 మంది మహిళా ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం జైలును నిర్వహిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జైలర్ బాలకృష్ణ, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరామిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌లు ఉన్నారు. ఫ ఖైదీలకు వసతులు కల్పించాలి ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఫ నల్లగొండ జిల్లా జైలును సందర్శించిన జస్టిస్ షమీమ్‌అక్తర్ -
బోరు మోటార్ల చోరీ నిందితుల అరెస్ట్
నార్కట్‌పల్లి : వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం డీఎస్పీ శివరాంరెడ్డి నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 9న రాత్రి సమయంలో షాపల్లి గ్రామంలోని కన్నెబోయిన శ్రీను వ్యవసాయ బోరు మోటారు చోరీకి గురైంది. ఈమేరకు బాధితుడు నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన మాగి నాగరాజుపై అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం పక్క సమాచారంతో మండల కేంద్రంలోని అమ్మనబోలు రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైక్‌లపై అనుమానాస్పదంగా ఉన్న నలుగురిలో మాగి నాగరాజు ఉండడంతో అతడిని పట్టుకుని విచారించారు. గత రెండు సంవత్సరాల నుంచి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి షాపల్లి, తొండల్వాయి, నక్కలపల్లి, కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, నారెగూడెం, వివిధ గ్రామాల్లో వ్యవసాయ భూముల వద్ద బోరుమోటార్లు చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో వారిని విచారించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.9.60 లక్షల విలువైన 24 బోరు మోటార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో నార్కట్‌పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన మాగి నాగరాజు (ఎ–1), సుద్దాల నర్సింహ(ఎ–2), బకరం శేఖర్(ఎ–3), బాషపాక సైదులు(ఎ–4), నల్లమాద లింగయ్య(ఎ–5), బాషపాక లింగయ్య(ఎ–6)గా ఉన్నారని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరంతా ఉదయం ఎక్కడెక్కడ బోరు మోటార్లు ఉన్నాయని రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యండిండి: మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన శుక్రవారం డిండి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పీహెచ్సీ ప్రహరీ వద్ద ఉన్న చెట్లపొదల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని పీహెచ్సీ సిబ్బంది, చుట్టు పక్కల ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు దాదాపు 50 సంవత్సరాల వరకు ఉంటుందని, గోధుమ రంగు షర్ట్, బ్లూ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. తెలిసిన వారు 8712675544, 8712670223 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫ 24 బోరు మోటార్లు, రెండు బైక్‌లు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డి -
నీటిసంపులో పడి బాలుడు మృతి
చింతపల్లి: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గండికోట మురళి– సరస్వతిలకు కుమారుడు గండికోట సతీష్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లారు. వేసవి సెలవులు కావడంతో సతీష్ ఇంటి వద్దే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో జారి పడ్డాడు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడి కోసం వెతికారు. సతీష్ నీటి సంపులో విగతజీవుడిగా పడి ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపించారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి కొండమల్లేపల్లి : ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనుముల మండలానికి చెందిన వంగాల లవయ్య (48) ద్విచక్రవాహనంపై దేవరకొండలో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి గ్రామ సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలుకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో లవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య వంగాల మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. -
చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలి
నకిరేకల్: విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ఉద్దీపన(వీవీఎం ఎయిడెడ్) స్కూల్ ప్రథమ వార్షికోత్సవాన్ని గురువారం రాత్రి స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో స్కూల్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాను కూడా చిన్నతనం నుంచే ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని మందుకు సాగానని గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు ఇష్టమైన ఆటల్లో ప్రోత్సహించాలన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారథ్యంలో ఉద్దీపన స్కూల్లో కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తుండడం అభినందనీయమన్నారు. నకిరేకల్ జెడ్పీహెచ్‌ఎస్‌ను పోలీస్ శాఖ దత్తత తీసుకుని ఎన్రోల్మెంట్ కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీరేశం నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హెచ్ఎం గంగాధర భద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్కూల్ సలహాదారుడు డాక్టర్ ఆనందన్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, ట్రస్మా గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు మంజుల, రజితాశ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీలు చామల శ్రీనివాస్, బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్రావు, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య, మున్సిపల్ కమిషనర్ బాలయ్య, వివిధ మండలాల ఎంఈఓలు మేకల నాగయ్య, అంబటి అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ, చెరుకు సతీష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఫ నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కావాలి
మోత్కూరు: ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేయాలని కలెక్టర్ వి.హనుమంతరావు ఆదేశించారు. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా ధాన్యంలోని తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేయాలన్నారు. కేంద్రాలలో రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే అధికారుల దృష్టికి తేవాలన్నారు. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ మోత్కూరు మార్కెట్ యార్డులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి సందర్శించారు. ధాన్యం రాశులను పరిశీలించారు. వారివెంట అధికారులు వడ్డేమాన్ కీర్తి, తుంగ గోపినాథ్, ముక్కాముల అశోక్, సింగిల్‌విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, సీఈఓ వరలక్ష్మి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీని ఆదుకోవాలి
ఆలేరురూరల్: నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీకి రూ.50 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆలేరులోని వైఎస్ఎన్ గార్డెన్లో జరిగిన తెలంగాణ పాల రైతుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. మదర్, విజయ, కరీంనగర్, ముల్కనూర్ డెయిరీలతో పాటు ప్రైవేట్ డెయిరీలు తక్కువ రేటుకే పాల సేకరణ చేసి రైతులకు నష్ట చేకుర్చుతున్నారన్నారు. మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకపోయిందని ఆస్తులను అమ్మాలని పాలకవర్గం నిర్ణయించడం దారుణమన్నారు. నష్టాలకు కారణం రైతులు కాదని పాలకవర్గాలు చేసిన తప్పిదాలేనని పేర్కొన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్ను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, లీటర్ పాల ధరకు రూ.5 ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. భూమిలేని వారికి, వ్యవసాయ కార్మికులకు 90 శాతం సబ్సిడీపై పాడి పశువులను పంపిణీ చేయాలని కోరారు. పాల రైతులకు రూ.3 లక్షలు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య, నర్సింహులు, పోతిరెడ్డి సుదర్శన్, తీగల సాగర్, బొంతల చంద్రారెడ్డి, జంగారెడ్డి, మేక అశోక్, బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సంజీవ్‌రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, భిక్షపతి, సత్తిరెడ్డి, పోశెట్టి, భాస్కర్, నాగరాజు, సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి -
మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు
భువనగిరిటౌన్ : భానుడి భగభగలతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు పగలు వడగాల్పులు, రాత్రివేళల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి వాతావరణం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా గురువారం నారాయపురంలో 43.1 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గుండాల 42.8, రామన్నపేట 42.7, చౌటుప్పుల్ 42, బీబీనగర్ 42, మోత్కుర్ 41,7, వలిగొండ 41.5, ఆత్మకూర్, మోటకొండూర్, రాజాపేట 41.5, ఆలేరు, భువనగిరి, పోచంపల్లి, యాదగిరిగుట్ట 41 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంభూదాన్పోచంపల్లి: ఈ యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 2.45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకొన్నామని జిల్లా సహకార అధికారి(డీసీఓ) మురళీరమణ అన్నారు. గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో జూలూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 216 పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 214 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అందెల లింగంయాదవ్, మార్కెట్‌కమిటీ డైరెక్టర్ రేనిగుంట లాలయ్యయాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ పెంటయ్య, మాజీ ఎంపీటీసీ చిలుక బుచ్చయ్య, కాంగ్రెస్‌పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మోటె బాలరాజు, జిల్లా నాయకులు చేగూరి ప్రభాకర్, జడల అంజయ్య, గణేశ్, పర్వతం అశోక్, సీఈఓ రెబ్బాస్ నర్సింహ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్భువనగిరిటౌన్ : చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 691 చెక్ బౌన్స్ కేసులను గుర్తించినట్లు, ఈ కేసులలో నోటీసులు కూడా జారీ చేసే ప్రక్రియ ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు. ప్రత్యేక కౌన్సెలింగ్ కోసం మే 5 నుంచి 19వ తేదీ వరకు ప్రీ సిట్టింగ్‌లు నిర్వహించబడుతాయని తెలిపారు. కౌన్సిలింగ్ నిర్వహించడానికి భువనగిరి, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్, యాదాద్రి కోర్టుల న్యాయమూర్తులకు తగిన సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కూంబింగ్ ప్రక్రియను నిలిపివేయాలి భువనగిరిటౌన్ : ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో కొనసాగుతున్న పోలీస్ ఎన్కౌంటర్ కూంబింగ్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గోద శ్రీరాములు, ఎండీ జహంగీర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు కాశపాక మహేష్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేసే ప్రక్రియలో భాగంగా అమాయక ఆదివాసీ గిరిజన ప్రజలను కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టు పార్టీ ప్రతిపాదన ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు కొనసాగించి అమాయక ఆదివాసీలకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, టీపీఎఫ్, డీటీఎఫ్, ఐద్వా నాయకులు ఏశాల అశోక్, కొంమడుగు నర్సింహ, ఎండీ ఇమ్రాన్, బట్టుపల్లి అనురాధ, రాసాల నర్సింహ, దాసరి పాండు, మాయ కృష్ణ, పుట్ట రమేష్, జి.శ్రీనివాసాచారి, లక్ష్మయ్య, వెంకటేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తుండగా సబ్ కలెక్టర్ ఆదేశాలతో తనిఖీ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ హరిబాబు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని బకల్వాడ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేసిన గువ్వల శ్రీనివాస్‌కు స్థానికంగా బాలికల ఉన్నత పాఠశాలలో సెంటర్ పడింది. గువ్వల శ్రీనివాస్‌కు బదులుగా అప్పాముల శ్రీనివాస్ అనే మరో విద్యార్థి గురువారం సాంఘిక శాస్త్రం పరీక్ష రాస్తుండగా.. విషయం తెలుసుకున్న ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన సబ్ కలెక్టర్ తహసీల్దార్ హరిబాబు, ఎంఈఓ బాలునాయక్‌ను పరీక్షా కేంద్రానికి పంపి తనిఖీ చేయాలని ఆదేశించారు. రూం నంబర్ 8లో 166 రూల్ నంబర్‌తో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, కోర్డినేటర్లపై విచారణ చేసి నివేదికను డీఈఓకు పంపుతామని ఎంఈఓ బాలునాయక్ తెలిపారు. కాగా గురువారం పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాలను డీఈఓ భిక్షపతి తనిఖీ చేశారు. ఈ ఘటనపై విలేకరులు డీఈఓను ప్రశ్నించగా.. ఓపెన్ పరీక్షలు ఓపెన్‌గానే జరుగుతాయని సమాధానం చెప్పడం గమనార్హం. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌కు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధర్మానాయక్, సెంటిమేరీ పాఠశాలలో దశరథ్‌నాయక్, బకల్వాడ పాఠశాలలో రాజు, బాలికల ఉన్నత పాఠశాలలో బాలునాయక్ పరీక్షల్లో కాపీ చేయించేందుకు గాను విద్యార్థుల నుంచి రూ.2500 నుంచి రూ.4వేల వరకు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాసేందుకు గాను రూ.5వేల నుంచి రూ.8వేలు వసూలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఫ మిర్యాలగూడ బాలికల జెడ్పీహెచ్ఎస్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఫ సబ్ కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ తనిఖీ ఫ ఇద్దరిపై కేసు నమోదు -
‘భూ భారతి’తో సాదాబైనామాలకు మోక్షం
భూదాన్‌పోచంపల్లి : భూ భారతి చట్టంతో సాదాౖబైనామాలకు మోక్షం లభించనుందని, తద్వారా 10 లక్షల మందికి మేలు జరుగుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి పట్టణంలోని జెడ్పీ హైస్కూల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతితో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. జిల్లాలో భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన భూదాన్‌పోచంపల్లిని పైలట్ మండలంగా ఎంపిక చేయాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం మండలంలో 67 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారిణి రమణి, పోచంపల్లి ఇన్చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఆర్ఐ వెంకట్‌రెడ్డి, భువనగిరి వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ రేఖాబాబురావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు పాక మల్లేశ్‌యాదవ్, భారత లవకుమార్, జిల్లా నాయకులు తడక వెంకటేశం, సామ మధుసూధన్‌రెడ్డి, కళ్లెం రాఘవరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ డైరెక్టర్లు కుక్క దానయ్య, మద్ది అంజిరెడ్డి, మర్రి రాజిరెడ్డి, సుర్వి వెంకటేశ్‌గౌడ్, ఏర్పుల శ్రీనివాస్, తోట శ్రీనివాస్, పక్కీరు నర్సిరెడ్డి, కాసుల అంజయ్య, ఉపునూతుల వెంకటేశం, గునిగంటి వెంకటేశ్, కుక్క కుమార్, చెన్నబత్తిని యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి -
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. రైల్వే ఏఎస్ఐ బి. సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్బందంకు చెందిన చల్లా లింగయ్య కుమారుడు చల్లా కళ్యాణ్(27) తనకు పెళ్లి కావడం లేదని కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. బుధవారం వారి బంధువుల పెళ్లికి హాజరైన కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం బైక్‌పై మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల వద్దకు చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఏఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో .. రాజాపేట: అప్పుల బాధతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజాపేట మండలం కొండ్రెడ్డిచెర్వులో గురువారం రాత్రి జరిగింది. కొండ్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన కర్రె మహేష్(28)కు అదే గ్రామానికి చెందిన కళ్యాణితో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మహేష్ తన కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లాకు వలస వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో గిరాకీలు తగ్గడంతో ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఆటోలో గ్రామానికి చెందిన కూలీలతో కలిసి నిత్యం కూలీ పనికి వెళ్తూ తనకున్న 2 ఎకరాల్లో వ్యవసాయం చేసేవాడు. 5 బోర్లు వేయడం, ఇల్లు కట్టడం, కొత్త ప్యాసింజర్ ఆటో కొనడం వంటి వాటికి రూ.20 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఎకరంన్నర భూమి అమ్మాడు. పంట దిగుబడి రాక, ఆటో నడవక అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మహేష్ భార్య కళ్యాణి అదే గ్రామంలో ఉన్న తన తల్లిగారింటికి వెళ్లింది. పనికి వెళ్లిన మహేష్ రాత్రయినా కళ్యాణి వాళ్ల తల్లిగారింటికి రాకపోయేసరికి, కళ్యాణి తమ ఇంటికి వెళ్లి చూడగా.. మహేష్ ఉరేసుకుని కనిపించాడు. అనారోగ్యంతో వృద్ధుడు.. అడ్డగూడూరు: అనారోగంతో బాధపడుతున్న వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం కోటమర్తిలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటమర్తి గ్రామానికి చెందిన కొంపెల్లి నారాయణ(60) కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన నారాయణ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రయినా నారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నారాయణ మనవడు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా అక్కడ చెట్టుకు ఉరేసుకుని నారాయణ ఆత్మహత్య చేసుకుని కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యా దు అందలేదని ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
శుభవార్త చర్చి వార్షికోత్సవాలు ప్రారంభం
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవాలను గురువారం సాయంత్రం ఫాదర్ మార్టిన్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం చర్చిలో జరిగే దివ్యబలి పూజలకు నల్లగొండ మేత్రాసన పీఠాదిపతి దమన్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సందేశమిస్తారన్నారు. అదేవిధంగా సాయంత్రం మేరీమాత ప్రతిమతో పురవీధుల్లో ఊరేగింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫాదర్ అల్లం బాల, చర్చి కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎద్దుల పందేలకు ఏర్పాట్లు పూర్తి శుభవార్త చర్చి వార్షికోత్సవాలను పురస్కరించుకుని స్థానిక శుభోదయ యువజన సంఘం, చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలకు స్థానిక మాంట్‌ఫోర్డ్ స్కూల్ మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఎద్దుల పందేలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభిస్తారని యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి న్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. భార్య మృతి
చౌటుప్పల్ రూరల్: బంధువుల అంత్యక్రియలకు బైక్‌పై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి డీసీఎం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో భార్య మృతి చెందింది. భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామ స్టేజీ వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన కొండె జంగయ్య తన భార్య హైమావతి(39)తో కలిసి చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో తమ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బైక్‌పై వస్తున్నారు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామ స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైమావతి తీవ్రంగా గాయపడింది. జంగయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. హైమావతిని చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జంగయ్య రైల్వే డిపార్ట్మెంట్లో గ్యాంగ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. వీరికి బీటెక్ చదివే కుమారుడు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె ఉన్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఫ భర్తకు గాయాలు -
డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి 2400 స్పాస్మో ట్యాబ్లెట్లు, ఒక బైక్, రూ.22,000 నగదు, రెండు సెల్ఫోన్లు, మెడికల్ షాప్ లైసెన్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ కేసు వివరాలను ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ రాజశేఖర్‌రెడ్డితో కలిసి డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11గంటల సమయంలో నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని మునుగోడు రోడ్డులో వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్కచెల్మ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా వసీముద్దీన్ అలియాస్ వసీం అక్రం బైక్‌పై బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగును తనిఖీ చేయగా అందులో 288 మత్తు కల్గించే స్పాస్మో ట్యాబ్లెట్ షీట్లు లభించాయి. అతడి నుంచి ట్యాబ్లెట్ల షీట్లతో పాటు బైక్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వసీముద్దీన్తో పాటు అక్కచెల్మ ప్రాంతానికే చెందిన అతడి స్నేహితులు ఖాజా షోయబ్, షేక్ అమేర్ కొంతకాలంగా స్పాస్మో ట్యాబ్లెట్స్ సేవిస్తూ వాటికి బానిసయ్యారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని వీరు ముగ్గురు స్థానికంగా మెడికల్ షాపుల్లో ఈ స్పాస్మో ట్యాబ్లెట్లు అమ్మట్లేదని తెలుసుకుని, గత ఆరు నెలల నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడు కొప్పురవారి యశ్వంత్ మణిదీప్ శ్రీనివాసరావు దగ్గరకు బైక్‌పై వెళ్లి స్పాస్మో ట్యాబ్లెట్లు కొనుగోలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఒక్కో షీట్‌ను రూ.100కు కొని వారి అవసరం మేరకు వినియోగించగా.. మిగిలిన ట్యాబ్లెట్లను ఒక్కో షీట్ రూ.180కు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పట్టుబడిన వసీముద్దీన్ను తీసుకొని పిడుగురాళ్లకు వెళ్లి ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడు మణిదీప్ శ్రీనివాసరావును పట్టుకున్నట్లు తెలిపారు. అతడి వద్ద నుంచి 15 షీట్ల స్పాస్మో ట్యాబ్లెట్లు, సెల్‌ఫోన్, మెడికల్ షాపు లైసెన్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. వసీముద్దీన్, మణిదీప్ శ్రీనివాసరావును రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఖాజా షోయబ్, షేక్ అమేర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు శంకర్, సందీప్‌రెడ్డి, కానిస్టేబుళ్లు రబ్బాని వెంకటనారాయణ, కిరణ్, షకీల్, శ్రీకాంత్, సైదులును ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి టాబ్లెట్టు అమ్మొద్దు.. మెడికల్ షాపుల నిర్వాహకులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి టాబ్లెట్లు అమ్మొద్దని డీఎస్పీ శివరాంరెడ్డి సూచించారు. ఒకవేళ అధిక డబ్బులకు ఆశపడి అమ్మితే షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా స్పాస్మా టాబ్లెట్ల కోసం మెడికల్ షాపుల వద్దకు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఫ 2400 స్పాస్మో ట్యాబ్లెట్లు, బైక్, రూ.22,000 నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
అర్హులకే ఇళు్ల వచ్చేలా..
ఇంటింటి సర్వే ప్రారంభించిన అధికారులు సాక్షి, యాదాద్రి : నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన సర్వేను వేగవంతం చేసింది. అయితే ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా ఇందులో 17 గ్రామాలను ఎంపిక చేసి 724 ఇళ్లను ఇప్పటికే మంజూరు చేసింది. గ్రామాల్లో మిగతా ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈనె 22 నుంచి గెజిటెడ్ అధికారులతో మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా దరఖాస్తుదారుల ఇళ్లలో విచారణ (సర్వే) ప్రారంభించింది. ఈ సర్వే ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల జాబితాలను జిల్లా కలెక్టర్‌కు అందజేయగా అత్యంత నిరుపేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో గ్రామానికి ఐదుగురు అధికారులు ఒక్కో గెజిటెడ్ అధికారికి 200 ఇళ్ల విచారణ బాధ్యతలు అప్పగించారు. ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాల ఆధారంగా ఒక్కో గ్రామానికి నలుగురు నుంచి ఐదుగురు అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీఓలు, ఎంపీఓలు, పీఆర్ జేఈలు, ఏఓలు, మున్సిపల్ అధికారులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు 200 ఇళ్ల పరిశీలన చేస్తున్నారు. గుడిసెలు, ఇంటిపై టార్పాలిన్ కవర్లు కప్పుకున్న వారు, పెంకుటిల్లు ఉన్నవారు, కిరాయికి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అనంతరం అర్హుల జాబితాలను పంచాయతీ, మున్సిపాలిటీల నోటీస్ బోర్డుల్లో అతికిస్తారు. అనంతరం కలెక్టర్‌కు అందజేస్తారు. మే మొదటి వారంలో లబ్ధిదారుల జాబితా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మే మొదటి వారంలో ఇళ్లు మంజూరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అధికారులు సర్వే అధారంగా ఇచ్చిన జాబితాలను కలెక్టర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రికి సమర్పించి ఆయన నుంచి మంజూరు తీసుకుంటారు. అనంతరం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఇవీ అనర్హతలు.. ఫ ఆర్సీసీ ఇల్లు ఉన్న వారికి ఇవ్వరు. ఫ రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి, లేదా 5 ఎకరాల నీటిపారుదల లేని భూమి ఉండొద్దు. ఫ నాలుగు చక్రాల వాహనం, వ్యవసాయ అనుబంధ 3బై4 చక్రాల వాహనం ఉండొద్దు. ఫ రూ.50 వేల కంటే ఎక్కువ కిసాన్ క్రెడిట్ కార్డు పరపతి ఉండొద్దు. ఫ ఇన్‌కం టాక్స్ చెల్లించే వారు అనర్హులు. ఫ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఫ ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఉండకూడదు. ఫ ప్రస్తుతం ఉన్న ఇంటికి అనుబంధంగా మరో నిర్మాణం, లేదా ఉమ్మడిగా ఇంటి నిర్మాణం చేసే వారికి పథకం వర్తించదు. ఫ ఒక్కో అధికారికి 200 ఇళ్లు కేటాయింపు ఫ పక్కాగా నిబంధనల అమలుపై దృష్టి ఫ అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఫ నెలాఖరు వరకు పూర్తికానున్న సర్వే నిబంధనలు ఇలా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం లబ్ధిదారు ఉంటున్న ఇంటి పైకప్పు, గోడల రకం, కచ్చా లేదా పక్కా నిర్మాణమా చూపాలి. లబ్ధిదారు ఉంటున్న ఇల్లు అద్దె లేదా సొంతమా.. ఇంటి నిర్మాణ స్థలం ఉంటే దానిరకం (పట్టా, రిజిస్టర్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకం, స్థలం పంచుకుంటే దానికి సంబంధించిన రుజువులు) ఉండాలి. ఇంటి స్థలం 60 గజాల కంటే ఎక్కువ ఉందా.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు, మున్సిపాలిటీల్లో నెలకు రూ.25 వేల కంటే తక్కువగా ఆదాయం ఉండాలి. లబ్ధిదారు గ్రామంలో కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండాలి. మున్సిపాలిటీలో ఐదేళ్లకు మించి నివాసముండాలి. 400 నుంచి 600 చదరపు అడుగుల్లో రెండు గదులు, ప్రత్యేకంగా వంట గది, టాయిలెట్‌తో ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంది. -
వృద్ధురాలికి గాయాలు
అడ్డగూడూరు: వలింగొడ–తొర్రూర్ జాతీయ రహదారిపై అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామంలో తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా.. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ స్టేజీ వద్ద ఎదరుగా వస్తున్న డీసీఎం తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న పెండెం గౌరమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ నాగరాజు తెలపిపారు. నాణ్యత పాటించని హోటళ్లకు జరిమానా సూర్యాపేట అర్బన్: సూర్యాపేట పట్టణంలో నాణ్యత పాటించని పలు హోటళ్లకు గురువారం మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. వివరాలు.. పట్టణంలోని డీమార్ట్ సమీపంలోని కావేరి రెస్టారెంట్లో మాంసం, చికెన్ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి వినియోగిస్తున్నందన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రూ.5000 జరిమానా విధించారు. ఈ రెస్టారెంట్ పక్కనే గల దిల్కుష్ బేకరీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచనందుకు రూ.500, నిల్వ ఉంచిన పదార్ధాలతో ఫాస్ట్‌ఫుడ్ చేస్తున్న గాయత్రి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, స్సైసీ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు రూ.1000 చొప్పున జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ తెలిపారు. తనిఖీల్లో హెల్త్ అసిస్టెంట్ మస్కాపురం సురేష్, సిబ్బంది బాషుమియా, యాదగిరి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎలుకల నివారణ చర్యలు ధాన్యం గిడ్డంగి చుట్టూ చెత్త లేకుండా రోజూ శుభ్రం చేస్తుండాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలను ఉపయోగించి ఎలుకలను నిర్మూలించాలి. గిడ్డంగి తలుపుల కింది భాగాలకు జింక్ రేకులు అమర్చాలి. రంధ్రాలకు వైర్ మెష్ మూతలు అమర్చాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ రోజులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. పెద్దవూర: యాసంగి వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటికి వచ్చిన ధాన్యాన్ని ఎలా భద్రపర్చుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసి పండించిన ధాన్యాన్ని భద్రపరుచుకోవడం రైతులకు సవాలుగా మారింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పండించిన పంటలో 10 నుంచి 20 శాతం నష్టపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్. ధాన్యం నిల్వ చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. ధాన్యం నూర్పిన తర్వాత ఇంటి అవసరాలు, విత్తనాలకు కలిపి సుమారు ఏడాదికి పైగా భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ధాన్యం రంగు, రుచి తగ్గుతుంది. సాధారణంగా వరికోతల సమయంలో ధాన్యంలో 20శాతం తేమ ఉంటుంది. గతంలో కూలీలచే వరి కోతలు కోపించేవారు. కూలీల కొరత ఒకవైపు, అకాల వర్షాల భయంతో పంట చేతికి వచ్చేదాకా రైతులకు భరోసా లేకుండా పోతుంది. కూలీలచే వరి పంటను కోసిన తర్వాత వరి పసలను ఆరబెట్టడం వల్ల 4 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. ధాన్యంలో 14 శాతానికి తేమ ఉంటే బూజు పట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం రైతులు వరికోత యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పంట పచ్చగా ఉన్నప్పుడే వరి కోతలు కోస్తున్నారు. దీంతో ధాన్యంలో మరింత తేమ ఉండే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమ శాతం 14లోపు వచ్చేదాక చూసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు ఆశించి నష్టం కలుగచేస్తాయి. అంతేకాక ఎలుకలు ధాన్యాన్ని తినడమేకాక, వాటి విసర్జనలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది. నిల్వ ఉంచిన ధాన్యాన్ని నష్టపరిచే కీటకాలు ఫ ముక్క పురుగు : పంట కోయడానికి ముందు నుంచి ముక్క పురుగు నష్టం కలిగిస్తుంది. బియ్యంలో తెల్లని పురుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ పురుగులే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి అందులో గుడ్లు పెట్టి తన నోటి నుంచి వెలువడే కొవ్వు పదార్థంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. లార్వా ప్రౌడ దశలోని ముక్క పురుగు గింజ లోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది. ఫ వడ్ల చిలుక: ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే ధాన్యం చెడువాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపులుగా చేరి గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి లార్వా గింజ లోపలికి తొలుచుకుని పోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరక ముందే పై పొట్టులో చిన్న రంధ్రం చేస్తుంది. ప్రౌఢ దశకు చేరిన తరువాత ఆ రంధ్రం ద్వారా వడ్ల చిలుక బయటకు వస్తుంది. ఇది వడ్ల మూటలు, గిడ్డంగులపై కనిపిస్తుంది. ఫ నుసి పురుగు: దీనినే పుచ్చ పురుగు లేదా పెంకు పురుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో చాలా చిన్నదిగా 3 మి.మీ పొడవు ఉంటుంది. ప్రౌఢ కీడకం ధాన్యం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, ఆ తరువాత గింజ పైపొరను, ఆ తర్వాత లోపలి బియ్యపు గింజను తిని తీవ్ర నష్టం కలిగిస్తుంది. ధాన్యం నిల్వ చేసే పద్ధతి రైతులు తక్కువ ధాన్యం నిల్వ చేసుకోవాలంటే వెదురు గాదెలు, సిమెంటు గాదెలు, లోహపు గాదెల్లో నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలనుకుంటే గోదాములు లేదా గిడ్డంగులను సిమెంట్ కాంక్రీటుతో నిర్మించుకుంటే పూర్తి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా కీటకాలు, తేమ, వర్షం నీరు లోనికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే గాజు ముక్కలు, సిమెంటుతో పూడ్చి వేయాలి. ధాన్యం నిల్వలో కొత్త గోనె సంచులు ఉపయోగించాలి. గోనె సంచుల పైన, లోపల మలాథియాన్ లేదా ఎండో సల్ఫాన్ ద్రావణం స్ప్రే చేయాలి. మరునాడు సంచులను ఎండలో ఆరబెట్టాలి. -
30 ఏళ్ల ముందుచూపుతో..
ఆలేరురూరల్: ఆలేరు మున్సిపాలిటీలో ముప్పై ఏళ్ల వరకు ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేలా ముందుచూపుతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన రెండు ట్యాంకులు, 14 కిలోమీటర మేర పైపులైన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు 2023 సెప్టెంబర్‌లోనే పాలన అనుమతులు లభించగా 2024 అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు. 20 నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థతో యంత్రాంగం ఒప్పందం కుదుర్చుకుంది. పనులు పూర్తయితే మున్సిపాలిటీలో ముప్పైఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండదు. ఆలేరును రెండు జోన్లుగా విభజించి.. ఆలేరు మున్సిపాలిటీని రెండు జోన్లుగా విభజించి పనులు చేపట్టారు. జోన్–1 రైల్వే ట్రాక్ ఉత్తర దిశలో నూతనంగా 7 లక్షల లీటర్లు, జోన్–2లో రైల్వే ట్రాక్‌కు దక్షిణ దిశలో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల రెండు ట్యాంకులను నిర్మిస్తున్నారు. ఈరెండింటి నిర్మాణానికి రూ.2.97 కోట్లు కాగా ఇంటింటికి నీటి సరఫరాకు అవసరమైన పైప్లైన్ల నిర్మాణాలకు రూ.1.63 కోట్లును కేటాయించారు. ఇతర పనులు, జీఎస్టీ తదితర చెల్లింపులకు రూ.6.49 కోట్లు, ఐదు సంవత్సరాల పాటు నీటి పథకాల నిర్వహణకు 87లక్షల రూపాయలు కేటాయించారు. ట్యాంకుల నిర్మాణం ఎక్కడెక్కడంటే.. అమృత్–2 పథకం కింది ఆలేరు మున్సిపాలిటీలో రెండు భారీ నీటి ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఇందులో ఒకటి ఆలేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, రెండోది కొలనుపాక రోడ్డు పాత మున్సిపాలిటీ భవనం వద్ద నిర్మిస్తున్నారు. కళాశాలలో ట్యాంకు నిర్మాణ పనులు పూర్తికావొస్తుండగా పాత మున్సిపల్ భవనం వద్ద నిర్మాణ పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతున్నాయి. త్వరలోనే పనులు పూర్తిచేస్తాం ఆలేరు ప్రజలకు అమృత్ పథకం 2.0 కింద తాగనీరు అందించడానికి రెండు భారీ ట్యాంకులు నిర్మిస్తున్నాం. త్వరలోనే పనులు పూర్తి చేసి ట్యాంకులను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తాం. దీంతో 30 ఏళ్ల వరకు తాగునీరు సమస్య ఉండదు. – బి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఆలేరు ఫ ఆలేరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులు ఫ రెండు చోట్ల భారీ నీటి ట్యాంకులు ఫ 14 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం ఫ త్వరలోనే పూర్తికానున్న పనులు ఫ మున్సిపాలిటీలో తీరనున్న నీటికష్టాలు నిధుల కేటాయింపు ఇలా.. (రూ.కోట్లలో..) మంజూరైన నిధులు 12 ట్యాంకుల నిర్మాణానికి 2.97 పైప్‌లైన్ పనులకు 1.63 మరో ఏడు రకాల పనులకు 3.75 ఇతర చెల్లింపులకు 2.74 పథకం నిర్వహణకు 87లక్షలుఆలేరు మున్సిపాలిటీ వివరాలు మొత్తం వార్డులు 12 నివాసగృహాలు 4,877 నల్లా కనెక్షన్లు 4,650 నీళ్ల ట్యాంకులు 27 మున్సిపల్ బోర్లు 49 అద్దె బోర్లు 06 నీటి సరఫరా 1.6 ఎంఎల్డీ -
ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు
రాజాపేట: కాంగ్రెస్ పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా గురువారం రాజాపేటలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుందని విమర్శించారు. వరంగల్ ఎల్కతుర్తిలో జరగనున్న బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు తిరుమలేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గోపాల్ గౌడ్, నాయకులు భాస్కర్ గౌడ్, సంతోష్ గౌడ్, గుంటి కృష్ణ, రామచంద్రారెడ్డి, కటుకం స్వామి, రామిండ్ల నరేందర్, వీరేశం, ఉప్పలయ్య గౌడ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంకరొస్తేనే గొంతు తడిచేది!
చౌటుప్పల్ : పట్టణంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం, మరో వైపు ఎండలకు మంచినీటి పథకాలు అడుగంటడంతో పరిస్థితి దయనీయంగా మారింది. మున్సిపల్ యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో సమస్య తీర్చలేకపోతోంది. భగీరథ నీళ్లు సగం లోపే.. రోజురోజుకూ పట్టణ విస్తరణతో పాటు జనాభా పె రుగుతోంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు, 31,202 మంది జనాభా ఉంది. రోజుకు 6.5 ఎంఎల్డీల (65లక్షల లీటర్లు) నీరు అవసరం. ప్రస్తుతం కేవలం 2.5 ఎంఎల్డీల(25లక్షల లీటర్లు) నీళ్లు మాత్రమే వస్తున్నాయి. పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగకపోవడంతో ఉన్నంతలో పొదుపుగా వార్డులకు పంపిణీ చేస్తున్నారు. స్థానిక బోర్లనుంచి అరకొరగా వస్తున్న నీటితో కలిసి వంతుల వారీగా సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సమస్య తీవ్రం ప్రధానంగా 09,16,17,18,20వ వార్డు పరిధిలోని బంగారిగడ్డ, హనుమాన్‌నగర్, రత్నానగర్, సుందరయ్యకాలనీ, అంజనసాయి మెడోస్, బస్టాండ్ ఏరి యాతో పాటు మరికొన్ని కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో మేనెలలో ఎద్దడి ఏర్పడగా ..ఈసారి ఫిబ్రవరిలోనే మొదలైంది.రోజుకు రూ.1200 వెచ్చిస్తున్నాం గతంలో మే నెలలో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచే నీటి కష్టాలు వచ్చాయి. మా హోట ల్కు మూడు నెలలుగా మున్సిపాలిటీ నల్లా నీరు నిలిచిపోయింది. మా సొంత బోరు కూడా ఎండిపోయింది. దీంతో రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నాం. ఇందుకోసం రోజుకు రూ.1200 వరకు ఖర్చు చేస్తున్నాం. హోటళ్లకు కూడా ఎంతోకొంత మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకోవాలి. –గోపాలకృష్ణ శెట్టి, ప్రసాద్ ఉడిపి హోటల్ నిర్వాహకుడు, చౌటుప్పల్ చౌటుప్పల్‌లో తాగునీటికి కటకట ఫ డిమాండ్‌కు అనుగుణంగా అందని మిషన్ భగీరథ నీళ్లు ఫ ఎండలకు అడుగంటిన స్కీం బోర్లు ఫ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ఫ సరిపోక ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్న జనం -
ఇంటికి మూడు డ్రమ్ములే సరఫరా
అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నా నీఇ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కా రం కావడం లేదు. ఈ క్రమంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఇంటికి మూడు డ్రమ్ముల చొప్పున అందజేస్తున్నారు. ఇవి కూడా క్రమం తప్పకుండా సరఫరా చేయకపోవడంతో జనం నీటి కోసం అల్లాడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ట్యాంకర్‌కు రూ.500 నుంచి రూ.600 వరకు వెచ్చిస్తున్నారు. హోటళ్లు, బేకరీలు, దుకాణా లకు మున్సిపాలిటీ నీటి సరఫరా మూడు నెలలుగా నిలిచిపోయింది. ఇందుకు ట్యాంకర్‌కు రూ.1000నుంచి రూ.1200 వరకు చెల్లి స్తున్నట్లు నిర్వాహకులు వాపోతున్నారు. -
‘ఎల్ఆర్ఎస్’ను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి,యాదాద్రి : అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో సమావేశం అయ్యారు. ఎల్ఆర్ఎస్ ఆవశ్యకత, ఫీజు రాయితీ గురించి వివరించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈనెల 30వరకు గడువు ఉందని, మళ్లీ గడువు పొడిగించే అవకాశం లేకపోచ్చన్నారు. రెగ్యులరైజ్ చేసుకోని భూముల్లో రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, డీపీఓ సునంద పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
పెళ్లింట పసిడి గుబులు
రూ.లక్షకు చేరిన తులం బంగారం ధర ఫ సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో ఆందోళన ఫ కట్న, కానుకల కింద ఇచ్చే బంగారం తగ్గించుకునే ఆలోచన ఫ జిల్లా వ్యాప్తంగా తగ్గిన కొనుగోళ్లు ఫ వెలవెలబోతున్న జ్యువెలరీ, బంగారం షాపులుసాక్షి, యాదాద్రి : ‘పెళ్లికి మా అమ్మాయికి ఎన్ని తు లాల బంగారం పెడతారు’ ఏయే నగలు ఇస్తారు?.. ‘మా అబ్బాయికి మీరెన్ని తులాలు పెడతారో చెప్పండి?’ పెళ్లి ఖాయం చేసుకున్నాక పెట్టిపోతల విషయంలో జరిగే చర్చల్లో సర్వసాధారణంగా వినిపించే మాటలివి.. కానీ, ఇప్పుడు పెళ్లి బడ్జెట్లో బంగారం ప్రస్తావన తెస్తేనే దడ పుడుతోంది. తులం బంగారం లక్ష రూపాయలకు చేరడంతో అన్ని వర్గాల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పసిడి పేరెత్తినే అమ్మో అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన బంగారం ధర ఆయా వర్గాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వివాహాది శుభకార్యాలకు సిద్ధమవుతున్న కుటుంబాలు ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే అవకాశం ఉంది. ఆడపిల్ల కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం వచ్చే నెలనుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న కుటుంబాలు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. కట్నం కింద బంగారు ఆభరణాలు పెట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో బంగార ధర తులం రూ.లక్షకు చేరడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో గుబులు మొదలైంది. త్వరలో మరింత పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ప్రధానంగా ఆడపిల్లల తల్లిదండ్రలు వేదన వర్ణణాతీతం. ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేయలేకపోయామని మదనపడుతున్నారు. భారీగా తగ్గిన కొనుగోళ్లు బంగారం కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా 300కు పైగా బంగారం, జ్యువెలరీ షాపులు ఉన్నాయి. ధర తక్కువగా ఉన్నప్పుడు ఒక్కో దుకాణంలో రోజుకు సగటున పది తులాల బంగారం విక్రయించేవారు. ఇప్పుడు అందులో సగం కూడా వ్యాపారం జరగడం లేదని యజమానులు చెబుతున్నారు. -
వరంగల్ సభకు లక్ష మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘వరంగల్‌లో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షమందిని తరలించేందుకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా వరంగల్‌కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి నుంచి 12,500 చొప్పున 50వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జనసమీకరణ వివరాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోంది. ఇది బీఆర్ఎస్ సభనా, లేక టీఆర్ఎస్ సభనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్ వస్తుండే. ఆల్రెడీ బీఆర్ఎస్ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు. ఎడ్లబండ్ల యాత్ర మొదలైంది ఎడ్లబండ్లు, సైకిల్, పాద యాత్రలకు పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ ప్రారంభమైంది. నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద పూజలు చేసి రైతులు ర్యాలీని ప్రారంభించారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాటను గుర్తుగా 16 బండ్లతో వరంగల్ సభకు ర్యాలీగా వెళ్లారు. అర్వపల్లి నుంచి సైకిళ్ల మీద యాత్రగా వెళతామని యువత ముందుకు వస్తే రెండు రోజులు ఆగాలని చెప్పాను. పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. ఎండల తీవ్రతతో ఆగాలని సూచించాం. జనాల్లో అలాంటి వాతావరణం వస్తే సభ విజయవంతమవుద్దనేది కచ్చితమైంది. మేము పేరుకే రజతోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ప్రజల ఆలోచన వేరే ఉంది. వారే పెద్ద ఎత్తున బయల్దేరి సభకు రావాలని చూస్తున్నారు. వరంగల్ సభ పండుగ వాతావరణంలో జరగబోతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అప్పుడే సభకు ఏ విధంగా నైనా హాజరు కావాలని చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే మంచి జరుగుతుందనే భావన జనాల్లో ఉంది. చరిత్రలో నిలిచిపోనుంది రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. సభపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. సభ తర్వాత ప్రజల్లో కాంగ్రెస్‌పై మరింత వ్యతిరేకత పెరుగుతుందన్న భయాందోళన ప్రభుత్వంలో ఉంది. అందుకే సభపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఫ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీగా జనసమీకరణ ఫ నాలుగు నియోజకవర్గాల నుంచే సగం మంది ఫ మిగతా చోట్ల నుంచి పెద్ద సంఖ్యలో తరలిస్తాం ఫ కేసీఆర్ చెప్పేది వినేందుకు ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా వస్తామంటుండ్రు ఫ కాంగ్రెస్‌కు ఓటేసినోళ్లే కసిగా సభకు రావడానికి సిద్ధమవుతుండ్రు ఫ ఎక్కడ చూసినా సభపైనే చర్చ ఫ సభ పేరు వింటేనే అధికార పక్షం జంకుతుంది ఏ నోట విన్నా సభపైనే చర్చ ఏ పెళ్లిలో, ఏ చావుకెళ్లినా బీఆర్ఎస్ సభ గురించి చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు మమ్ముల చూసి పక్కకు పోయినోళ్లు కూడా ఇయ్యాల మా దగ్గరకు వస్తుండ్రు. సభకు రావాలని చూస్తుండ్రు. కాంగ్రెస్‌కు ఓటేసిన నేతలే కసిగా వరంగల్ సభకు వచ్చేందుకు సిద్ధమవుతుండ్రు. జనాలకు కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాయమాటలతో ఇంకా ఏమైనా రుణమాఫీ, రూ.2,500 వస్తుందనే ఆశతో కాంగ్రెస్‌కు ఓటేసిండ్రు. ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు చెప్పిన మాయ మాటలకు నిరుద్యోగులు ఎట్రాక్టు అయినరు. ఇప్పటి యువతకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. దాంతో నిరుద్యోగులు ఎట్రాక్టు అయ్యిండ్రు. తల్లిదండ్రులకు కూడా యువతే చెప్పుకుంది. రుణమాఫీ ఇస్తే సరిపోతుందా..ఉద్యోగాలు కూడా రావాలనడంతో వారు ఆలోచనలో పడి ఓటేశారు. అలాంటి నిరుద్యోగులు కూడా ఇప్పుడు కేసీఆర్ వెంటే నడిచేందుకు సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ మోసాలు సంవత్సరంలో తెలుసుకున్నరు. ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే భర్తీ చేసిందని దాంతో నిరుద్యోగులు అసలు విషయం తెలుసుకున్నారు.వరంగల్ సభకు వాళ్లే ముందు నడవబోతున్నారు. కేసీఆర్‌కు ఓటేయక పొరపాటు జరిగిన విషయాన్ని గమనించి సభకు రావాలని చూస్తున్నారు. -
పీసీసీ పరిశీలకులొస్తున్నారు!
సాక్షి,యాదాద్రి : నేతలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ లకావత్ ధనవంతి, డాక్టర్ పులి అనిల్‌కుమార్ నియమించింది. పరిశీలకుల బాధ్యతలు జిల్లా పరిశీలకులుగా నియమితులైన ధనవంతి, పులి అనిల్‌కుమార్ త్వరలో బాధ్యతలు స్వీకరించ నున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ డెలిగేట్స్, డీసీసీ మాజీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీని యర్ నేతలతో సమావేశం కానున్నారు. ఆ తరువాత జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అధిష్టానానికి నివేదికలు అందజేస్తారు. వీటి అధారంగా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు దక్కనున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాకు పోత్నక్ ప్రమోద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిశీలకుడిగా భువనగిరి పట్టణానికి చెందిన పోత్నక్ ప్రమోద్‌కుమార్‌ను నియమించారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్న ప్రమోద్‌కుమార్ గతంలోనే పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది.ఫ జిల్లాకు ఇద్దరి నియామకం ఫ లకావత్ ధనవంతి, పులి అనిల్‌కుమార్‌కు బాధ్యతలు -
ఆర్పీల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందకు గాను ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చేందుకు రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ) ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి, అర్హత కలిగిన ఉపాధ్యాయులు నమూనా ఫారంలో పూర్తిచేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 24న సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలన్నారు. వివరాల కోసం కో ఆర్డినేటర్ సెల్ నంబర్ 98487 07758ను సంప్రదించాలని కోరారు. యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం చేసి తులసీదళ, సహస్ర నామార్చనతో కొలిచారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. నారాయణపురం@43.1 భువనగిరిటౌన్ : ఎండలు మండిపోతున్నాయి.ఉదయం 8 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరడంతో జనం ఎండ వేడిమిని తాళలేకపోతున్నారు. గడిచిన నాలుగైదు రోజులుగా జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు నమోదవుతుండడమే దీనికి నిదర్శనం. బుధవారం అత్యధికంగా సంస్థాన్‌నారాయణపురంలో 43.1, రామన్నపేటలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరువాత గుండాల 42.5, రాజాపేట 42.4, వలిగొండ 42.4, మోత్కూరు 42.2, చౌటుప్పల్ 42.2, ఆలేరు 42.0, అడ్డగూడూరు 42.0, ఆత్మకూర్(ఎం) లో 42 డిగ్రీలుగా నమోదైంది. ఎండనుంచి ఉపశమనం పొందడానికి గొడుగులు, టోపీలు ధరిస్తున్నారు. జిల్లాను వాతావరణ శాఖ ఆరెంజ్ జోన్‌గా ప్రకటించింది. -
తమ్ముడి మృతి తట్టుకోలేక అన్న ఆత్మహత్య
భువనగిరిటౌన్, భూదాన్‌పోచంపల్లి: తమ్ముడు మృతి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన అన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి మండలం తుక్కాపూర్‌లోని ఓ వెంచర్లో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన పర్వతం ఆంజనేయులు, అండాలు దంపతులకు ఇద్దరు కుమారులు కిరణ్‌కుమార్(25), సాయితో పాటు ఒక కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబం పదేళ్ల క్రితం ఆలేరుకు వలస వెళ్లి అక్కడ పాత ఇనుప సామాను వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే చిన్న కుమారుడు సాయి మూడు నెలల క్రితం ఉరేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబం అక్కడ నుంచి భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లికి వచ్చి ఉంటున్నారు. తమ్ముడి మృతి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన కిరణ్‌కుమార్ తనకు బతకడం ఇష్టంలేదని తాను చనిపోతానంటూ తరచూ తల్లికి చెప్పేవాడు. కాగా మంగళవారం రాత్రి కిరణ్‌కుమార్ తనకు పని ఉందని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తన సోదరికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనంతరం భువనగిరి మండలం తుక్కాపూర్‌లోని ఓ వెంచర్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం కిరణ్‌కుమార్ మృతదేహాన్ని పెద్దరావులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. -
కల్యాణ కట్ట పంచాయితీ
ఎలాంటి సమాచారం ఇవ్వలేదు యాదగిరిగుట్ట ఆలయంలో 20 మంది నాయీ బ్రాహ్మణులను కొత్తగా నియమించడానికి కోర్టు ఆర్డర్ ఉందని ఈఓ చెబితే అది చూపెట్టాలని అడిగాం. కల్యాణ కట్టకు కొత్తగా ఎవరినైనా కేటాయిస్తే దేవస్థానం ఆధ్వర్యంలో మా సంఘానికి లెటర్ ఇస్తారు. కానీ ఎలాంటి కాపీ ఇవ్వలేదు. ఈఓతో పాటు కొంతమంది అధికారులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆర్డర్ తయారు చేసి 20 మందిని నియమించారు. – రాచకొండ జానకిరాము, రాష్ట్ర దేవాలయ కల్యాణ కట్ట అధ్యక్షుడు మా కల నెరవేరింది కల్యాణ కట్టలో విధుల్లో చేరడంతో మా కల నెరవేరింది. కల్యాణ కట్టలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులు మా నియామకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేశారు. తిరిగి మేము కూడా హైకోర్టుకు వెళ్లాం. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆర్డర్ కాపీని తీసుకొచ్చి ఈఓకు ఇచ్చాం. దీంతో విధుల్లో చేర్చుకునేందుకు ఈఓ ఆదేశించారు. తోటి నాయీ బ్రాహ్మణులతో కలిసి పనిచేస్తాం. – జంపాల రాజు, యాదగిరిగుట్ట నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ కట్టలో నాయీ బ్రాహ్మణుల మధ్య పాత.. కొత్త పంచాయితీ నెలకొంది. ప్రస్తుతం దేవస్థానం కల్యాణ కట్టలో 96మంది నాయీ బ్రాహ్మణులు కమీషన్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరో 20మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించే విధంగా దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులతో ఈఓ భాస్కర్‌రావు నియమించారు. ఆ 20మంది నాయీ బ్రాహ్మణులు బుధవారం విధుల్లో హాజరయ్యేందుకు కల్యాణ కట్టకు చేరుకున్నారు. దీంతో అప్పటికే కొనసాగుతున్న 96మంది వారిని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ ఏఈఓతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్డర్ ఉండటంతో నూతనంగా 20 మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించేందుకు అనుమతించామని ఏఈఓ వివరించారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు అక్కడి చేరుకొని సముదాయించారు. అనంతరం కోర్టు ఆర్డర్, దేవాదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూపెట్టిన తర్వాత 20 మంది ఉద్యోగంలో చేరారు. ఉత్తర్వుల కాపీలో ఇలా.. దేవాలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన 33 మంది నాయీ బ్రాహ్మణులకు కల్యాణ కట్టలో పని కల్పించేందుకు కమిషన్ పద్ధతిలో తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో సూచించారు. ఈ మేరకు 20 మందిని అదనంగా నియమించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫ యాదగిరిగుట్ట క్షేత్రం కల్యాణ కట్టలో కొత్తగా 20 మంది నాయీ బ్రాహ్మణుల నియామకం ఫ ఇప్పటికే పనిచేస్తున్న వారి నుంచి అభ్యంతరం ఫ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
నూతనకల్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి.. మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకన్న–సుమలత దపంతుల రెండో కుమార్తె వైష్ణవి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ఎంపీసీ విభాగంలో 467మార్కులు సాధించడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వైష్ణవిని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధ, మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్‌రెడ్డి, జెన్నారెడ్డి వివేక్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
రేపు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రాక
నల్లగొండ: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ శుక్రవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరి 10గంటలకు నల్లగొండలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 11:30గంటలకు జిల్లా జైలుఖానాను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఆర్అండ్బీ అతిథి గృహంలో భోజనం చేసి రాత్రి 7గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు. బుద్ధ జయంతికి రావాలని మంత్రి జూపల్లికి ఆహ్వానంనాగారం: ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో మే 12న నిర్వహించనున్న బుద్ధ జయంతి వేడుకలకు రావాలని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్‌లో కలిసి ఆహ్వాన పత్రం అందించినట్లు బోధిసత్వ ఫౌండేషన్ అధ్యక్షుడు పులిగిల్ల వీరమల్లుయాదవ్ తెలిపారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో వీరమల్లుయాదవ్ మాట్లాడుతూ... ఫణిగిరి బౌద్ధ క్షేత్రం విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా బుద్ధ జయంతి రోజున ప్రపంచ సుందరీమణులతో హెరిటేజ్ వాచ్ కార్యక్రమం నిర్వహించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి జపాల్‌లోని హిరోషిమా ప్రభుత్వంతో బౌద్ధ వారసత్వ సంపదను కాపాడుకోవాలని నిర్ణయించడం సంతోషదాయకమన్నారు. కుటుంబ తగాదాలతో దాడి ● ఇద్దరికి గాయాలునకిరేకల్: కుటంబ తగదాల కారణంగా అత్త, ఆమె తమ్ముడిపై అల్లుడు దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలోని తాటికల్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని తాటికల్ రోడ్డులో నివాసముంటున్న బోయింద జానమ్మకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను సూర్యాపేటకు చెందిన పెరుమాళ్ల రవికి ఇచ్చి వివాహం చేసింది. భార్యాభర్తల మధ్య తగదాలు రావడంతో జానమ్మ నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్లో అల్లుడిపై మంగళవారం ఫిర్యాదు చేసింది. మంగళవారం రాత్రి 12గంటల సమయంలో అల్లుడు రవితో పాటు మరో వ్యక్తి చింతమల్ల రాహుల్ జానమ్మ ఇంటికి వచ్చి ఆమెతో పాటు ఆమె తమ్ముడు ఎడ్ల ప్రకాష్‌పై దాడి చేసి గాయర్చారు. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చారి తెలిపారు. సీహెచ్‌సీని సందర్శించిన వరల్డ్ బ్యాంక్ బృందంఆలేరురూరల్: ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ని వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులు డాక్టర్ రమణ, డాక్టర్ కృష్ణ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగులుకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ కేసుల గురించి వివరాలు అడిగారు. రోగులకు అందిస్తున్న సేవలు, మంచి ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. డాక్టర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్, కళ్యాణ్, డాక్టర్ యశోదా, డాక్టర్ శిల్ప, డీపీఓ నెహ్రూ, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ స్వప్న, రజిని, రామ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
మర్రిగూడ: ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యులు కృషిచేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కె. అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మర్రిగూడ మండల కేంద్రంలోని కమ్యూటనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రూ.3లక్షల విలువైన రెండు ఆక్సిజనేటర్ మిషన్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. త్వరలోనే ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు డయాలసిస్ సెంటర్‌ను, రోగులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించారు. ఓపీ థియేటర్‌ను ఉపయోగంలోకి తేవాలన్నారు. ఆస్పత్రికి సంబంధించిన ఇంక్యూబేషన్ అన్నిరకాల పరికరాలు కూడా అందుబాటులోకి తేవాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ మాత్రునాయక్, సూపరింటెండెంట్ శంకర్‌నాయక్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ -
చాడలో బౌద్ధ చరిత్ర
ఫ గతేడాదిగా పురావస్తు శాఖ తవ్వకాలు ఫ పెద్ద ఎత్తున బయటపడుతున్న బౌద్ధం ఆనవాళ్లు ఫ ఏడు రోజుల క్రితం తవ్వకాల పనులను పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంఏడు రోజుల క్రితం చాడ గ్రామాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కో–కన్వీనర్ భద్రగిరీష్, సభ్యులు ఎం. రవి, కుండె గణేష్, ఎండీ ఇమ్రాన్ సందర్శించారు. తవ్వకాల్లో బయటపడుతున్న పురాతన సంపదను పరిశీలించారు. తవ్వకాలు నిర్వహిస్తున్న వారిలో తెలంగాణ వారసత్వశాఖ అధికారులు పి. నాగరాజు, సాగర్, పూణా దక్కన్ కాలేజీ ప్రొఫెసర్ ఘన్‌వీర్ శ్రీకాంత్, ఇతర సిబ్బంది ఉన్నారు. తవ్వకాల్లో దాదాపు 80మంది పాల్గొంటున్నారు. చాడను సందర్శించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంతవ్వకాలను పరిశీలిస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి తర్వాత అతిపెద్ద బౌద్ధ స్థూపం ఆనవాళ్లు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ఇందులో బుద్ధ విగ్రహాలు, శిల్పాల శకలాలు, మట్టిపూసలు, బొక్కగాజులు, శాతవాహన కాలం నాటి డిజైన్న్ పెంకులు, పొడవైన పెద్ద ఇటుకలు, బౌద్ధ విహార గోడలు బయల్పడుతున్నాయి. 2003లోనే గుర్తింపు.. 2003లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చాడ గ్రామంలో బౌద్ధం ఆనవాళ్లు గుర్తించింది. అంతేకాకుండా 2010లో గ్రామానికి చెందిన భూమయ్యగౌడ్ పొలం దున్నుతుండగా పురాతన విగ్రహం ఒకటి బయటపడింది. దీంతో పురాతన చరిత్రను బయటకు తీయడానికి పురావస్తు శాఖ పూనుకుంది. ఈ గ్రామంలో ఎన్నో బౌద్ధ మత ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వాటిని దేవతామూర్తులుగా పూజిస్తారు. 2024లో చాడ గ్రామంలో ఆర్కియాలజీ శాఖ తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. భూమయ్యగౌడ్కు చెందిన రెండు ఎకరాల్లో ఈ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం వేసవిలో చేసిన విధంగానే ఈసారి కూడా ఆర్కియాలజీ శాఖ అధికారులు, విద్యార్థులు తవ్వకాలను పరిశీలిస్తున్నారు. గ్రామానికి చెందిన కూలీలతో తవ్వకాలు ప్రారంభించారు. దొరికిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించి భద్రపరుస్తున్నారు. గతేడాది బయటపడిన శాసనం 2024లో జరిపిన తవ్వకాల్లో బ్రహ్మీ లిపిలో ఉన్న శాసనం బయటపడింది. ఈ శాసనంలో చాడ పేరు సదరిక అని ఉంది. సదరిక క్రమంగా వాడుకలోంచి చాడగా మారిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చాడ శాసనం గురించిన వివరాలు ఎపీగ్రఫీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె. మునిరత్నంరెడ్డి గతంలోనే వెల్లడించారు. బిక్కేరు వాగు బౌద్ధం నుంచే.. ఆలేరు వాగు కాస్తా చాడ వరకు వచ్చేసరికి బిక్కేరు వాగుగా మారుతుంది. అప్పట్లో బౌద్ధ భిక్షువులు ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి బిక్కేరు అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ లభించిన నిలబడి ఉన్న బౌద్ధ విగ్రహం నల్లగొండలోని పానగల్ మ్యూజియంలో ఉంది. 2024 నుంచి జరుపుతున్న తవ్వకాల్లో మరికొన్ని విగ్రహాలు దొరికినా వాటి వివరాలు ఆర్కియాలజీ శాఖ అధికారులు బయటకు చెప్పడం లేదు. ఇక్కడ లభిస్తున్న వస్తువులు, మట్టిపొరలు, గాజులు, పూసలు, విగ్రహాలు, నాణేలు తదితర బౌద్ధం ఆనవాళ్లను ఆర్కియాలజికల్ విద్యార్థులు గ్రేడింగ్ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న బౌద్ధ స్థూపానికి సంబంధించిన ఇటుకల కుప్పలు ఇప్పుడు లేవు. ప్రస్తుతం అవి చెదిరిపోయాయి. తవ్వకాల్లో ఇంకా బౌద్ధ శిల్పాలు బయటపడే అవకాశం ఉంది. ఎకరం రెండు ఎకరాల్లో కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు జరిగితే మరింత చరిత్ర బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బౌద్ధం ఆనవాళ్లను అక్కడే భద్రపరిచారు. అయితే చాడలో లభిస్తున్న వాటిని ఇక్కడే భద్రపర్చాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి చరిత్ర మరో ప్రాంతానికి తరలిపోకుండా ఇక్కడే మ్యూజియం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తవ్వకాలు పూర్తయిన తర్వాత విడుదల చేసే సంపూర్ణ నివేదిక వచ్చినప్పుడు ఇక్కడి ప్రాముఖ్యత, విశిష్టత వెలుగు చూస్తుందని పురావస్తుశాఖ అధికారులు అంటున్నారు. గాంధార శిల్ప సంపదఇక్కడ దొరికిన బౌద్ధ శిల్పాలలో గాంధార శైలికి చెందిన బుద్ధుడి స్థానక భంగిమ శిల్పాలు, అర్ధ శిల్పాలు, బుద్ధ విగ్రహాల తలలు, విగ్రహాల శకలాలు, క్రీ.పూ. 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దపు నాణేలు, టెర్రకోట బొమ్మలు, దంతపు గాజుల ముక్కలు, శాతవాహన కాలం నాటి కుండ పెంకులు, శాతవాహనకాలం నాటి ఇటికెలు, పూసలు అనేకం వెలుగుచూస్తున్నాయి. -
వీడని తల్లి, కుమార్తె మరణం మిస్టరీ..?
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన తల్లి, కుమార్తె మరణ మిస్టరీ 11 రోజులవుతున్నా ఇంకా వీడలేదు. ఈ నెల 12వ తేదీన వారిద్దరు ఇంట్లో మృతిచెందగా.. ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్‌గా బదిలీపై 15 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి మిర్యాలగూడలో నివాసముంటున్నారు. ఈ నెల 10వ తేదీన సీతారాంరెడ్డి కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో హైదరాబాద్‌కు వెళ్లి.. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి చిన్న కుమార్తె వేద సాయిశ్రీ గొంతుపై కత్తిగాటుతో, భార్య రాజేశ్వరి బెడ్రూంలో ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. నాలుగు బృందాలతో దర్యాప్తు.. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఒక బృందం ఏపీలోని జమ్మలమడుగు, రొంపిచెర్ల, కుంబంపాడు, దాచేపల్లి, నకిరేకల్ ప్రాంతాలలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించినా.. మరో బృందం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు, సెల్‌ఫోన్స్ సిగ్నల్స్ వంటి అంశాలపై కూపీ లాగినా.. మరో బృందం మృతుల ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించినప్పటికీ, ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ తాను నిద్రలో ఉన్నానని, తనకు ఏమీ తెలియదని చెప్పడంతో కేసు మిస్టరీ వీడడంలేదు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి క్లూ దొరకలేదా..? ఒకవేళ దొరికినా.. ఆ విషయాలను ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో సేకరించిన విషయాలను పోల్చి చూసుకునేందుకు ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.ఫ నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫ 11 రోజులవుతున్నా కొలిక్కి రాని కేసు -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
చిట్యాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన దాసరి యోగేంద్ర విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద ప్రమాదాలు జరగకుండా వాహదారులకు సూచనలు చేసేందుకు గాను కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. బుధవారం పాలకేంద్రం సమీపంలో విధులు నిర్వహిస్తున్న యోగేంద్రను టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
కాంగ్రెస్ ప్రజావిశ్వాసం కోల్పోయింది
భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్టాడారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. భువనగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి క్యామ మల్లేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఖాజా అజీమోద్దీన్, దిడ్డికాడి భగత్, కుశంగుల రాజు, చెన్న మహేష్, కడారి వినోద్, తుమ్మల పాండు, సిద్దుల పద్మ, సుదగాని రాజు, రత్నపురం పద్మ, ఎనబోయిన జహంగీర్, తాడూరి భిక్షపత్తి, తాడెం రాజశేఖర్, పాల్గొన్నారు.ఫ భువనగిరి మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి -
వీడని వర్షం.. తీరని నష్టం
ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఫ ఈదురు గాలులకు నేలకొరిగిన వరి ఫ మామిడి, సపోట తోటలకు నష్టం ఫ పంట దక్కలేదని రైతుల ఆందోళన ఫ పలు చోట్ల ఆస్తినష్టం మోత్కూరు : రైతులను అకాల వర్షాలు వీడడం లేదు. ఆదివారం రాత్రి ఈదురుగాలుతో కూడిన వర్షానికి పంట, ఆస్తినష్టం వాటిల్లింది. పొడిచేడులో వడగండ్లు పడటంతో కప్ప మల్లేష్ వరి చేలో ధాన్యం పెద్ద ఎత్తున రాలిపోయింది. పైరు నేలకొరిగింది. దాచారంలో పది విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ముంత లక్ష్మి ఇంటిపై చెట్టు విరిగి పడి రేకులు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో లక్ష్మి ఇంట్లోనే ఉండడంతో ఆమెకు గాయాలయ్యాయి. గాదె నర్సయ్య ఇంటి పైకప్పు రేకులు గాలికి లేచిపోయాయి. పెంకులు పగలడంతో నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది. కొంతమంది రైతుల వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. అనాజిపురంలో కొల్లు శంకర్ మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. వలిగొండ : పహిల్వాన్‌పురం, టేకులసోమారంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు దెబ్బతిన్న మామిడి తోటలను చౌటుప్పల్ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కవిత సోమవారం పరిశీలించారు. రెండు గ్రామాల్లో ఎనిమిదిన్నర ఎకరాల్లో మామిడికి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. నివేదికను అధికారులకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. రాజాపేట : మండలంలోని మల్లగూడెంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వడగండ్ల వానకు వరి చేలలో ధాన్యం నేలరాలింది. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు కోరారు. గుండాల : మండలంలోని రామారంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు గ్రామానికి చెందిన మల్లెపాక శ్రీకాంత్, మల్లెపాక సాంబయ్య, బండారు ముత్తయ్యల రేకుల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన తమను ఆదుకోవాలని బాధితులు అధికారులను కోరారు. తుర్కపల్లి : మండలంలోని తిర్మలాపూర్, వీరారెడ్డిపల్లిలో వడగండ్ల వాన, ఈదురు గాలులకు వరి చేలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల మామిడి కాయలు నేలరాలాయి. ఆస్తినష్టం వాటిల్లింది. -
ఇక నుంచి డ్రోన్ ద్వారా పెట్రోలింగ్
భువనగిరిటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించనున్నామని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఎస్సీ కంకణాల రాహుల్‌రెడ్డి తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించేందుకు భువనగిరి పట్టణ శివారు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సోమవారం డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా ఎగురవేశారు. డ్రోన్‌ద్వారా పరిశీలించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వ్యక్తులను పట్టుకు న్నారు. ఈ సందర్భంగా అదన పు ఎస్పీ మాట్లాడుతూ.. విజి బుల్ పోలీసింగ్, సత్వర స్పందన, టెక్నాలజీకి.. ఈ మూడింటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలి పారు. ప్రతి ఏరియాలో బ్లూ కోల్ట్స్, పెట్రోకార్, సైకిల్ పెట్రోలింగ్‌తో పాటు డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలుత భువనగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగించి ఎటువంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయో పరిశీలిస్తామన్నారు. టెక్నాలజీ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. ఫ రాచకొండ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా.. ఫ పైలెట్ ప్రాజెక్టుగా భువనగిరి ఫ వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ రాహుల్‌రెడ్డి -
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష
గుండాల : రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్రంలోని నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. అమలుకు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంతో ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో గోస పడుతున్నారని పేర్కొన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఏ ఒక్కరు అధైర్యపడవద్దన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నీళ్ల అయిలయ్య కాదు.. భూ కబ్జాల అయిలయ్య అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు ఎండీ ఖలీల్, నాయకులు ఎం.రామకృష్ణారెడ్డి, ఎం.బాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాములు, జి.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, అట్ల రంజిత్‌రెడ్డి, రాజు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత -
హరిత హననం!
అడవులు, పొలాలు, రోడ్ల వెంట భారీ వృక్షాలు నరికివేత మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు హరితహారం, వన మహోత్సవం పేరుతో నాటిన లక్షల కొద్దీ మొక్కలు బొగ్గవుతున్నాయి. ఎదిగిన చెట్లను అక్రమార్కులు తమ స్వార్థం కోసం నరికి బొగ్గుబట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడవులతోపాటు పొలాలు, రహదారుల వెంట ఉన్న భారీ వృక్షాలు గొడ్డలి వేటకు గురవుతున్నాయి. ఫలితంగా కోట్లాది మొక్కలు నాటినా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన బొగ్గు బట్టీలు విచ్చలవిడిగా రాజుకుంటున్నా అధికారులు నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.నెలనెలా లక్షలాది రూపాయలు చేతులు మారడమేనన్న ఆరోపణలున్నాయి. ఎదిగిన చెట్లు ఎదిగినట్లే నరికివేత.. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24నుంచి 33 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేలు, నియోజకవర్గంలో 40 లక్షల చొప్పున మొక్కలు నాటుతున్నారు. 10 విడతలుగా చేపట్టిన హరితహారం, వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుమారు 6 కోట్ల వరకు మొక్కలు నాటారు. అందులో మొదటి ఆరు విడతల్లో నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. ఎదిగిన చెట్లను ఎప్పటికప్పుడు నరికి బొగ్గు బట్టీలకు తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు అటవీ శాఖ ఇచ్చిన అనుమతులను కాదని బట్టీల్లో విలువైన కర్రను కాల్చి బొగ్గు చేస్తున్నారు.సర్కారు తుమ్మకు మాత్రమే బొగ్గు బట్టీలకు అనుమతి ఉంది. కానీ వేప, చింత, కానుగు, మోదుగు ఇలా ప్రతి చెట్టు బట్టీల్లో కాల్చేస్తున్నారు. మోత్కూరు మండలం పనకబండ, దత్తప్పగూడెం, దాచారం, కమ్మగూడెం,అనాజిపురం, సూరారం, అడ్డగూడూరు మండలం అజీంపేట, లక్ష్మ్మీదేవికాలువ, వెల్దేవి, మానాయికుంట, గుండాల మండలం వెల్మజాల, వస్తాకొండూరు, మరిపడగ, మోటకొండూరు మండలం బొగ్గుబట్టీలు అధికంగా ఉన్నాయి. కమిటీలు ఎక్కడ? సహజ వనరులకు సంరక్షించేందుకు గతంలో రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ, వీఎస్ కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ వాల్టా చట్టాన్ని పరిరక్షించాల్సిన కమిటీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే కలపను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. రైల్వే బొగ్గు కంటే చౌక కర్ర బొగ్గు రైల్వే బొగ్గు కంటే తక్కువ ధరకు లభిస్తోంది. బొగ్గు తయారైన అనంతరం సంచుల్లో నింపి హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, నెల్లూరుతో పాటు ఒడిశాకు లారీల ద్వారా తరలిస్తున్నారు. రైల్వే బొగ్గు కంటే చౌకగా లభిస్తుండడంతో కర్ర బొగ్గును ఆర్డర్లపై కొనుగోలు చేస్తారు. వివిధ కంపెనీలు, హోటళ్లలకు కర్ర బొగ్గు సరఫరా చేస్తున్నారు. నాటిన మొక్కలు విడతల వారీగా (లక్షల్లో) విడత సంవత్సరం మొక్కలు మొదటి 2015 33.627 రెండవ 2016 73.038 మూడవ 2017 114.98 నాల్గవ 2018 85.948 ఐదవ 2019 70.11ఆరవ 2020 49.62ఏడవ 2021 27.82 ఎనిమిదవ 2022 30.89తొమ్మిదవ 2023 22.99 హరితహారం, వనమహోత్సవంలో నాటిన మొక్కలు గత ప్రభుత్వ హయాంలో పది విడతలుగా హరితహారం నిర్వహించగా సుమారు 5.85 కోట్ల మొక్కలు నాటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూన్‌లో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 11.45 లక్షల మొక్కలు నాటారు. అందులో చాలా చెట్లు కనుమరుగయ్యాయి. న్యూస్రీల్ఫ బొగ్గుబట్టీలకు తరలుతోన్న కలప ఫ ఓవైపు నాటుడు.. మరోవైపు నరుకుడు ఫ దెబ్బతింటున్న పర్యావరణం ఫ నిర్లిప్తంగా అటవీశాఖ అధికారులు -
మహాశివుడికి బిల్వార్చన, అభిషేకం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి అనుబంధంగా ఉన్నా శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం చేసి తులసీపత్రాలతో అర్చించారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపం, ముఖ మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
మునగాల: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం ముకుందాపురం శివారులో సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ బి. ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మునగాల మండల కేంద్రానికి చెందిన నారగాని రాంబాబు(40) కోదాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై కోదాడ నుంచి మునగాలకు వస్తుండగా.. మార్గమధ్యలో ముకుందాపురం వద్ద ముందు ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదలో రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.యువకుడి అదృశ్యం.. కేసు నమోదుచౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లగూడెం గ్రామానికి చెందిన కానుగు శ్రీకాంత్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తన భార్య విజయలక్ష్మిని చౌటుప్పల్ పట్టణంలోని ఆమె తల్లిగారి ఇంటి వద్ద దింపిన శ్రీకాంత్ తిరిగి కుంట్లగూడెం వెళ్తానని చెప్పి బయల్దేరాడు. రాత్రి అయినా కూడా శ్రీకాంత్ ఇంటికి చేరుకోకపోవడంతో అతడి తమ్ముడు సాయి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా శ్రీకాంత్ ఆచూకీ తెలియరాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. శ్రీకాంత్ నలుపు, లేత నీలం రంగు చొక్కా, తెలుపు రంగు ప్యాంట్ ధరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి ● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములుసూర్యాపేటటౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లో పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీమన ఊరు–మన బడ్ఙి పథకంలో పూర్తిచేసిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తిచేయించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో పనిచేసే సర్వీస్ పర్సనన్స్కు వేతన బకాయిలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని, నూతన పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి. శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి జి. వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్. దామోదర్, ఎన్. నాగేశ్వరరావు, వి. రమేష్, డి. లాలు, కె. జ్యోతి, డి. శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు. -
వార్షికోత్సవానికి ‘శుభవార్త’ ముస్తాబు
మఠంపల్లి: మఠంపల్లిలోని శుభవార్త చర్చి వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 24, 25 తేదీల్లో వేడుకలు నిర్వహించేందుకు చర్చిని విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. మఠంపల్లిలో శుభవార్త చర్చిని 1908 నుంచి 1915 మధ్యకాలంలో నిర్మించారు. దీనిని 110 ఏళ్ల క్రితం మొదటి రెవరెండ్ ఫాదర్ ఫాస్కలీ స్థానిక క్రైస్తవుల సహకారంతో ప్రారంభించారు. చర్చి ప్రాంగణంలోని కొలనులో ఆరోగ్యమాత(మేరీమాత) విగ్రహం ఉంది. శిథిలావస్థకు చేరిన ఈ చర్చిని 1984లో స్థానిక క్రైస్తవ పెద్దలు సుమారు రూ.50లక్షలతో 100 అడుగుల ఎత్తు గల రెండు గోపురాలతో అద్భుతంగా పునఃనిర్మించారు. మొదటి ఫాదర్ ఫాస్కలీ అనాథలు, వృద్ధులకు ఆశ్రయమిచ్చేందుకు స్థానికంగా అన్నమ్మ(మేరీమాత) పేరుతో మఠం స్థాపించారు. దీంతో అనేక మంది సిస్టర్స్ ఇక్కడికి వచ్చి పేదలు, వృద్ధులకు సేవలందిస్తున్నారు. అన్నమ్మ మఠం ద్వారా వైద్యశాల, సెయింట్ మేరీస్ పేరుతో ఉన్నత పాఠశాలను స్థాపించడంతో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. శుభవార్త చర్చి ద్వారా మఠంపల్లి నుంచి వెళ్లిన అనేక మంది మత గురువులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో సేవలందిస్తున్నారు. ప్రతి ఏడాది చర్చి వార్షికోత్సవంలో భాగంగా ఏప్రిల్ 25న నిర్వహించే శుభవార్త చర్చి జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మత గురువులు, బిషప్‌లతో పాటు దేశవిదేశాల్లోని క్రైస్తవులు కూడా హాజరవుతుంటారు. మంగళవార్త దేవాలయం నుంచి శుభవార్త చర్చిగా..మఠంపల్లిలోని శుభవార్త చర్చికి గతంలో మంగళవార్త దేవాలయంగా పేరుండేది. అయితే కన్య మరియమాత గర్భంలో బాలయేసు జన్మించనున్నాడని గాబ్రియేల్(దేవదూత) దూత పలికిన శుభసూచికమైన వార్తనే శుభవార్తగా భావించి ఈ చర్చికి శుభవార్త చర్చిగా నామకరణం చేసినట్లు క్రైస్తవులు చెబుతున్నారు. 26నుంచి ఎద్దుల పందేలు.. చర్చి వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో చర్చి కమిటీ సహకారంతో ఈ నెల 26 నుంచి 29 వరకు మాంట్‌ఫోర్డ్ హైస్కూల్ మైదానంలో రోజూ రాత్రి 10గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎద్దుల పందేలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దులకు అన్నివిభాగాల్లో కలిపి రూ.8.78లక్షల నగదు బహుమతులతో పాటు షీల్డ్‌లు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 24, 25 తేదీల్లో వేడుకలు -
ఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర
చాలా సంతోషంగా ఉందిఅమ్మానాన్నతో మాట్లాడాలని అనిపించినప్పుడు మా వద్ద ఫోన్ లేకపోవడంతో మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు పాఠశాలలో ఫోన్ బాక్స్‌లు ఏర్పాటు కావడంతో అమ్మానాన్నతో ఎప్పుడైనా మాట్లాడుకునే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది. – జోత్స్న, 7వ తరగతి, ఎస్సీ గురుకుల పాఠశాల, బీబీనగర్ విద్యార్థులకు ఇబ్బందులు తప్పాయితల్లిదండ్రులతో విద్యార్థులు మాట్లాడుకోవడానికి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో టెలిఫోన్ బాక్స్‌లు ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఇప్పటి వరకు విద్యార్థులు తమ హౌస్ మాస్టర్ అయిన టీచర్ ఫోన్ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడేవారు. ఇప్పుడు విద్యార్థులకు ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. – రూప, ప్రిన్సిపాల్, ఎస్సీ గురుకుల పాఠశాల, బీబీనగర్● ప్రతి పాఠశాలలో 10 టెలిఫోన్ బాక్స్‌లు ఏర్పాటు ● విద్యార్థులే నేరుగా ఫోన్లో తమ తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం ● ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు బీబీనగర్: ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఫోన్ మిత్ర పేరిట ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గురుకులాల్లో చదివే తమ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలంటే ఫోన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. ఏదైనా అత్యవసరం ఉంటే టీచర్ ఫోన్‌కు చేయడం తప్పితే.. సాధారణంగా మాట్లాడాలంటే తల్లిదండ్రులు హాస్టల్‌కు రావాల్సిందే. కానీ ఈ ఫోన్ మిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులు కావాల్సినప్పుడల్లా తమ తల్లిదండ్రులతో నేరుగా ఫోన్లో మాట్లాడుకునే సౌకర్యం ప్రభుత్వ కల్పిస్తోంది. 10 టెలిఫోన్ బాక్సులు ఏర్పాటుఫోన్ మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎస్సీ గురుకుల పాఠశాలలో గరిష్టంగా 10 టెలిఫోన్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉండగా.. 15వేలకు పైగా విద్యార్థులు వాటిల్లో చదువుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉండగా.. బీబీనగర్‌లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో 720 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకులాల్లో టెలిఫోన్ బాక్స్‌లను విడతల వారీగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ప్రత్యేక యాక్సిస్ కార్డుతో..విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు ఆయా పాఠశాలల్లోని టెలిఫోన్ బాక్స్‌లలో నిక్షిప్తమై ఉంటాయి. తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్న విద్యార్థులకు ప్రత్యేకంగా పంపిణీ చేసే యాక్సిస్ కార్డులను స్వైప్ చేసి ఉచితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్లు తల్లిదండ్రులతో మాట్లాడాలంటే అది కూడా అత్యవసరమైతేనే 40మంది విద్యార్థులకు కలిపి ఉండే హౌస్ మాస్టర్ అయిన టీచర్‌ను అడిగి ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఫోన్ మిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులు నేరుగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఫోన్ భాక్స్లు ఏర్పాటు కావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కోతకు గురైన రహదారికి మరమ్మతులు
శాలిగౌరారం: శాలిగౌరారం మండలంలో కోతకు గురైన 365వ నంబర్ జాతీయ రహదారి అంచులను సంబంధిత అధికారులు మట్టితో పూడ్చివేయించారు. ‘పగుళ్లతో ప్రమాదకరంగా 365వ నంబర్ హైవే’ అనే శీర్షికన ఈ నెల 19న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందించి అంచులు కోతకు గురైన చోట మట్టిపోసి పూడ్చే పనులు చేపట్టారు. సమస్యను పరిష్కారమయ్యేలా కృషి చేసిన ‘సాక్షి’కి వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. మందుబాబులకు జైలు శిక్ష, జరిమానాసూర్యాపేటటౌన్: సూర్యాపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 13మందిని సోమవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చగా నలుగురికి జైలు శిక్షతో పాటు రూ.2వేల చొప్పున జరిమానా, మరో తొమ్మిది మందికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బీవీ రమణ తీర్పు వెలువరించినట్లు పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ ● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తోంది. ఏపీకి చెందిన మరో ఆర్టీసీ బస్సుకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ శివారులోకి రాగానే అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో బస్సు డ్రైవర్ నక్క శ్రీనివాస్ ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండానే ఒక్కసారిగా బస్సును రోడ్డు కిందికి దింపాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న సత్తుపల్లి డిపో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు మేఘన, సాయిప్రియాంక, మోహన్‌రావుకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సత్తుపల్లి డిపో బస్సు డ్రైవర్ నరేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 8మంది రిమాండ్
హుజూర్నగర్: ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 8మందిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను హుజూర్నగర్ సీఐ చరమంద రాజు సోమవారం విలేకరులకు వెల్లడించారు. హుజూర్‌నగర్‌కు చెందిన షేక్ ఖలీముద్దీన్, షేక్ అయూబ్ పాషా, పొట్టేపంగు కాటయ్య, తిరుమలశెట్టి రామమోహన్‌రావు, సామల నర్సింహారెడ్డి, మేళ్లచెరువు మండలం నల్ల బండగూడేనికి చెందిన తోడేటి గోపికృష్ణ, గరిడేపల్లి మండలం రాయినిగూడేనికి చెందిన వాడపల్లి నర్సింహారావు, ఏపీలోని విజయవాడకు చెందిన పొట్టి కోటయ్య సులువుగా డబ్బులు సంపాదించాలని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఆన్లైన్లో ఐపీఎల్ మ్యాచ్‌లకు బెట్టింగ్ పెడుతున్నారు. బెట్టింగ్ పెట్టగా వచ్చిన డబ్బులు పంచుకుందామని వీరు ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని ఓ దుకాణం వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 సెల్ఫోన్లు, రూ.3,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరి బెట్టింగ్ యాప్‌లలో ఉన్న రూ.66,067ను ఫ్రీజ్ చేసి, సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ ముత్తయ్య, ఏఎస్ఐ బలరాంరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నీటి సంపులో దూకి వివాహిత ఆత్మహత్య
సంస్థాన్ నారాయణపురం: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వివాహిత నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా జూలకల్లు మండల కేంద్రానికి చెందిన జంజనం వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ దంపతులు 30ఏళ్ల క్రితం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారి కుమారుడు మల్లికార్జున్ గుంటూరు జిల్లా మంగళగిరిలో నివాసముంటూ జ్యూయలరీ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మల్లికార్జున్‌కు పల్నాడు జిల్లా కూరపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన నాగమణి(25)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో సరైన పనిలేక మల్లికార్జున్ పుట్టపాకలో తన తండ్రి నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పనులను చూసుకోవడానికి భార్య నాగమణితో కలిసి వారం క్రితం వచ్చాడు. వీరి కుటుంబంతో కొంతకాలంగా పలు విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగమణి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ జగన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. నాగమణిని తన తల్లింద్రడుల దగ్గరకి పంపించకపోవడం, ఆమెకు సెల్‌ఫోన్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పోగొట్టుకున్న బ్యాగు బాధితుడికి అప్పగింత
నిడమనూరు: వెండి వస్తువులు గల బ్యాగును ఆటో మర్చిపోగా.. నిడమనూరు పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో ఆటోను గుర్తించి బ్యాగును బాధితుడికి అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రానికి చెందిన అన్నెబోయిన శివకుమార్ తన ఇంట్లో శుభకార్యానికి కావాల్సిన 25 తులాల వెండి వస్తువులను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి బ్యాగులో పెట్టుకొని నిడమనూరుకు వస్తున్నాడు. అలీనగర్ (14వ మైలు) దగ్గర ఆటో దిగి నిడమనూరుకు వెళ్తూ.. ఆటోలో శివకుమార్ తన బ్యాగును మరిచిపోయాడు. వెంటనే నిడమనూరు పోలీసులను ఆశ్రయించగా.. సీసీ కెమెరాల సహాయంతో ఆటోను గుర్తించి బ్యాగును బాధితుడు శివకుమార్‌కు అందజేసినట్లు ఎస్ఐ వి. నరేష్ తెలిపారు. -
పిడుగుపడి పత్తి లోడు లారీ దగ్ధం
నేరేడుచర్ల: పిడుగుపడి పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం చింతపల్లిలోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ నుంచి 24 టన్నుల పత్తి లోడుతో లారీ బయల్దేరి తమిళనాడు రాష్ట్రం కోవిల్‌పట్టిలోని మహావిష్ణు స్పిన్నింగ్ మిల్లుకు వెళ్తోంది. మార్గమధ్యలో రాత్రి 11.30గంటల సమయంలో లారీ నేరేడుచర్లకు రాగానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో రహదారి పక్కన పిడుగు పడడంతో నిప్పు రవ్వ ఎగిరి లారీలోని పత్తిపై పడింది. చిల్లేపల్లి వద్దకు రాగానే లారీలోని పత్తి నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెనుక నుంచి వస్తున్న వాహనాదారులు మంటలు గమనించి లారీ డ్రైవర్ రమేష్‌కు చెప్పడంతో అతడు లారీని రోడ్డు పక్కన ఆపి కిందకు దిగాడు. స్థానికులు నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. మిర్యాలగూడ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. జేసీబీ సహాయంతో లారీలో నుంచి కొంత పత్తిని తొలగించడంతో మంటలు తగ్గుముఖం పట్టాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది 8గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీతో పాటు అందులోని పత్తి దగ్ధం కావడంతో సుమారు రూ.80లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్‌నాయక్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంలో ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా చూశారు. 8గంటలు శ్రమించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది -
షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం
కేతేపల్లి: ఇంజన్లో షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్‌లో నివాసముంటున్న వి. వెంకట్రావు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. వెంకట్రావు సోమవారం తన భార్యతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్దకు రాగానే కారు ఏసీలో నుంచి నుంచి పొగలు వచ్చాయి. ఇది గమనించిన వెంకట్రావు దంపతులు కారును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగారు. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారుకు మొత్తం అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నకిరేకల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
ఆలేరురూరల్ : మండలంలోని కొలనుపాక చర్చిలో ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ఏసుక్రీస్తును ఆరాదిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొ ని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. మరణాన్ని జయించి తిరిగి సజీవుడైన దేవుడు ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు. యుగయుగాలకు ఏసయ్య సజీవుడై ఉంటాడన్నారు. క్రీస్తు సమాధిలోనుంచి లేచివచ్చిన శుభవేళ ఈస్టర్ పండుగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరాజు, నీలం పద్మ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఐలు జిల్లా కమిటీ ఎన్నిక
భువనగిరిటౌన్ : ఆలిండియా లాయర్స్ యూని యన్ (ఐలు) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కుక్కదువ సోమయ్య, అధ్యక్షుడిగా బొల్లపల్లి కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా తడక మోహన్, పాల్వంచ జగతయ్య, ఎండీ నేహాల్ సహాయ కార్యదర్శులుగా సీసా శ్రీనివాస్, సూదగాని శ్రీహరి, చింతల రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారిగా బొడ్డు కిషన్‌తో పాటు మరో పది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. సమావేశంలో జేల్లా రమేష్, ఎండీ ఖయ్యూం, యాదాసు యాదయ్య, ఆకుల మల్లే శం, పిడుగు ఐలయ్య, గదగాని శంకర్, జిట్టా భాస్కర్‌రెడ్డి, ఎస్కే హమీద్, కుక్కదువ సాయి, సునీల్‌కుమార్, చింతల రాజు, వెన్నెల, భీమగాని శ్రీనివాస్, పారునంది రవికుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలుభువనగిరి : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఆదివారం ప్రశాతంగా ప్రారంభమయ్యాయి. ఓపెన్ టెన్త్ పరీక్షలకు జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 408 విద్యార్థులకు గాను 362 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ ఇంటర్‌కు నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,006 మంది విద్యార్థులకు 882 మంది హాజరయ్యారు. 124 మంది గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. జర్మనీలో ఉద్యోగావకాశాలు భువనగిరి : జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రిపుల్ విన్ ప్రాజెక్టు కింద ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పానాధికారి సాహితీ తెలిపారు. గుర్తింపు పొందిన నర్సింగ్ కళాశాలలో జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, 21 నుంచి 38 ఏళ్లలోపువారు అర్హులన్నారు. జర్మనీ భాషలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 25లోపు బయోడేటా పంపాలని, వివరాలకు 9440051581, 9440048500ను సంప్రదించాలని కోరారు. నేడు ప్రజావాణి రద్దు భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. భూభారతి పోర్టల్‌పై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని, అందుకే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాజిక సేవతో గుర్తింపు ఆలేరురూరల్ : సామాజిక సేవతో సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తుందని నేత్ర, అవయవ దాతల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖుర్షిద్ పాషా పేర్కొన్నారు. ఆలేరుకు చెందిన సినియర్ సిటిజన్ మొరిగాడి సర్వయ్య తన మరణానంతరం భౌతికదేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగిస్తూ ఆదివారం హామీపత్రం అందజేశారు. సమాజహితం కోసం తన కుటుంబసభ్యులను ఒప్పించి, వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం సర్వయ్య తన శరీరాన్ని దానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మో హన్‌రావు, మొరిగాడి మహేష్, ముల్లెక్కల ర వికుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నేళ్లకెన్నాళ్లకు..!
బొల్లేపల్లి కాల్వ నిర్వాసితుల గుర్తింపునకు కదిలిన యంత్రాంగం● 2022లో 80 ఎకరాలకు పైగా భూ సేకరణ ● రెండు దశాబ్దాలు గడిచినా అందని పరిహారం ● రైతుల వినతులు, పోరాటాలతో కదలిక ● ప్రారంభమైన సర్వేబీబీనగర్ : సాగునీటి కాల్వ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. 20 ఏళ్లలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, అధికారులకు వినతులు, ప్రజాప్రతినిధుల నిలదీతలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల్లో కదలిక వచ్చింది. కాల్వ కోసం రైతులు ఇచ్చిన భూములను గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు. కాల్వ స్వరూపం ఇదీ.. బీబీనగర్, భువనగిరి మండలాల పరిధిలోని ఎనిమిది గ్రామాలతో పాటు ఐదు గిరిజన తండాలకు బీబీనగర్ మండలం రాఘవాపురం చెరువు నుంచి సాగునీరు అందజేయాలని 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం రాఘవాపురం చెరువు వద్ద నుంచి భువనగిరి మండలం బొల్లేపల్లి వరకు 21 కిలో మీటర్ల మేర కాలువ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. అదే సంవత్సరం కాల్వ పనులను ప్రారంభించి 2002లో పూర్తి చేశారు. ఈ కాల్వ ద్వారా రాఘవాపురం, లక్ష్మీదేవిగూడెం, బ్రాహ్మణపల్లి, రామునిగుండ్లతండా, పెద పలుగుతండా, జంపల్లి, బొల్లేపల్లితో పాటు మరో ఆరు గ్రామాల పరిధిలో సుమారు 2వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 80 ఎకరాల మేర భూ సేకరణకాల్వ నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించగా నేటికీ వారికి పరిహారం మాత్రం అందలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల సర్వే చేపట్టారు. గతంలో సేకరించిన భూ మికి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాలువ 16.5 మీటర్ల వెడల్పు ఉంది. కుడివైపు 10 మీటర్లు, ఎడమ వైపు 6.5 మీటర్లు వెడల్పు ఉండేలా హద్దురాళ్లు పెడుతున్నారు. మొత్తం 80 ఎకరాల మేర భూ సేకరణ జరగనుంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో సర్వే రైతుల పోరాటాలు, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి చొరవతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో పది రోజుల క్రితం సర్వే ప్రారంభించారు. గ్రామాల వారీగా ఎంత భూమి పోయింది, రైతులు ఏమేరకు నష్టపోయారో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.త్వరగా పరిహారం అందజేయాలి బొల్లేపల్లి కాల్వ ద్వారా భూములు కొల్పోయిన రైతులకు రెండు దశాబ్దాలు గడిచినా నష్టపరి హా రం అందలేదు, దీని పై గతంలో నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. సర్వే నివేదిక ప్రకారం రైతులందరికీ త్వరగా పరిహారం అందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – కొమ్మిడి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బ్రాహ్మణపల్లి, బీబీనగర్ మండలంకాల్వలో రెండు ఎకరాలు పోయింది బొలేపల్లి కాల్వలో రెండు ఎకరాల భూమి పోయింది. 25 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పరిహారం రాలేదు. మొన్నటి నుంచి అధికారులు సర్వే చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి. – ముక్కెర వెంకటేష్ యాదవ్, బట్టుగూడం 9 కిలో మీటర్లు సర్వే జరగాల్సి ఉంది బొల్లేపల్లి కాల్వ మొత్తం 21కిలో మీటర్ల పొడవు ఉంది. ఇప్పటి వరకు భూ సేకరణకు సంబంధించి 12 కిలో మీటర్ల మేర సర్వే పూర్తి చేశాం. మరో తొమ్మిది కిలో మీటర్లు సర్వే చేయాల్సి ఉంది. సర్వే కొనసాగుతోంది. పూర్తయ్యాక ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. – శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఏఈ, బీబీనగర్ మండలం -
పరిశీలన.. తప్పుల సవరణ
672 పాఠశాలలు ఎంపికజిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా సర్వే కోసం 672 పాఠశాలలను ఎంపిక చేశారు. నల్లగొండ డైట్ విద్యార్థులతో పాటు భువనగిరిలోని మదర్ థెరిస్సా, స్టాన్ఫోర్డ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చౌటుప్పల్‌లోని ఏఎంఆర్ బీఈడీ కళాశాలలకు చెందిన 63 మంది విద్యార్థులకు సర్వే బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలు కేటాయించారు. రోజూ రెండు పాఠశాలల్లో సర్వే చేస్తున్నారు. వీరికి క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు సహకరిస్తున్నారు. యూడైస్‌లో తప్పులు ఉంటే వాటిని సవరించి తుది నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయనున్నారు. ఈనెల 15న మొదలైన సర్వే 21వ తేదీ వరకు కొనసాగనుంది.భువనగిరి : పాఠశాలలకు సంబంధించి యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)లో నమోదు చేసిన సమగ్ర సమాచారాన్ని విద్యాశాఖ తొలిసారిగా థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తోంది. ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలు పారదర్శకంగా ఉన్నాయా, లేదా.. అని థర్డ్ పార్టీ వ్యక్తులు నేరుగా పాఠశాలలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగానే పాఠశాలలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించనుంది. బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వేపాఠశాలల సమగ్ర సమాచారాన్ని ఉపాధ్యాయులు ఏటా యూడైస్‌లో నమోదు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించి ఎంఈఓలకు నివేదిక అందజేస్తారు. ఎంఈఓల పరిశీలన అనంతరం ఆన్లైన్లో నమోదు చేస్తారు. పాఠశాలలకు నిధుల కేటాయింపు, పథకాల అమలుకు ఈ నివేదిక ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలకు, పాఠశాలల్లోని రికార్డులకు సరిపోలక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తప్పులను సవరించేందుకు విద్యాశా ఖ బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వే చేయిస్తోంది. ఈ అంశాలపై సర్వేపాఠశాలల్లో నమోదైన విద్యార్థులు, వారంతా అదే స్కూల్లో చదువుతున్నారా, ఉపాధ్యాయుల సంఖ్య, తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి, వంటగది, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, గ్రంథాయాలు, డిజిటల్ తరగతి గదులు, క్రీడా మై దానం, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందాయా, క్రీడా మైదానం ఉందా, తరగతి గదులెన్ని, ఇంకా ఎన్ని అవసరం తదితర వివరాలను యూడైస్‌లో నమోదు చేశారు. థర్డ్ పార్టీ వ్యక్తులు స్కూళ్లకు వెళ్లి సరిపోల్చి చూస్తున్నారు.‘యూడైస్’పై థర్డ్ పార్టీతో సర్వే పాఠశాలలకు వెళ్లి పరిశీలిస్తున్న బీఈడీ, డీఈడీ విద్యార్థులు నేడు విద్యాశాఖకు నివేదిక అందజేత దీని ఆధారంగానే బడులకు బడ్జెట్పారదర్శకత కోసమే సర్వే పాఠశాలల్లోని సమగ్ర సమాచారాన్ని ప్రతి విద్యా సంవత్సరం యూడైస్‌లో నమోదు చేస్తాం. వివరాలు సరిగా ఉన్నాయా లేదా సరిపోల్చేందుకు విద్యాశాఖ తొలిసారిగా థర్డ్ పార్టీతో సర్వే చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వే చేయిస్తున్నాం. – సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఆర్థిక భద్రత కల్పించేందుకే శిక్షణ
భూదాన్‌పోచంపల్లి : ఉపాధి హామీ కూలీ జీవనోపాదులు మెరుగుపర్చి, వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి స్వయం ఉపాధిలో శిక్షణ అందిస్తున్నామని డీఆర్డీఓ నాగిరెడ్డి తెలిపారు. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో డీఆర్డీఓ, ఎస్బీఐ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకంలో వంద రోజుల పనిదినాలు పూర్తయిన కూలీలకు అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. శనివారం శిక్షణ శిబిరాన్ని సందర్శించి వారికి యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం కూలి పనులపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించాలన్న ఉద్దేశంతో అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు యూనిట్ల స్థాపనకు బ్యాంకులు, సీ్త్రనిధి ద్వారా రుణ సహాయం అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధిహామీకూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రఘుపతి, ఎంపీడీఓ భాస్కర్, జాబ్స్ జిల్లా మేనేజర్ కేపీ రాజు, ఏపీఓ కృష్ణమూర్తి, ఏపీఎం నీరజ, కో ఆర్డినేటర్ శ్రీకాంత్, ట్రైనర్ శంకర్రావు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, టీఏ కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ అమృత, జెఆర్సీ పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యయాదగిరిగుట్టరూరల్: ప్రభు త్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ సత్యనారాయణ అన్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని ఎంపీపీఎస్, పీఎంశ్రీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం, స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో పీఎంశ్రీ పథకానికి ఐదు పాఠశాలలు ఎంపికవగా అందులో మల్లాపురం కూడా ఉందన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలోఉన్నత విలువలతో కూడిన విద్య అందుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం కసిరెడ్డి కొండల్‌రెడ్డి, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్, ఎంఈఓ శరత్‌యామిని, రాములు, పుచ్చుల సంధ్య, ముత్యం రాములు, మంగు భాస్కర్, రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
మోటకొండూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అనతికాలంలోనే ప్రజావ్యతిరేకత మూటగట్టుకుందని, రానున్నది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. శనివారం మోటకొండూరులో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సబ్బండ వర్గాలకు ఇచ్చిన 420 హామీల్లో ఏఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది న్నరకాలంలోనే రాష్ట్రంలో 500 మంది రైతులు, 80 మంది నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అనేక మంది గీతకార్మికులు తాటిచెట్ల పైనుంచి పడి మృతిచెందారని, వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే భూకబ్జాలకు పాల్పడుతూ పోలీస్ స్టేషన్లను పార్టీ కార్యాలయాలుగా మార్చారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రజల్లో నమ్మకం పో యిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఆలేరు నియోజకవర్గ ప్రజలతో జనసంద్రం కావాలని, అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు బొట్ల యాదయ్య, లింగాల శ్రీకర్‌రెడ్డి, ప ల్లా వెంకట్‌రెడ్డి, దూదిపాల రవీందర్‌రెడ్డి, నాయిని రామచంద్రారెడ్డి, బాల్ద లింగం, బీస కృష్ణంరాజు, పన్నాల నవీన్‌రెడ్డి, చామకూర అమరేందర్‌రెడ్డి, భూమండ్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఫ రజతోత్సవ సభతో సత్తా చాటుదాం ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత -
హమాలీల కొరతతో కొనుగోళ్లు జాప్యం
బొమ్మలరామారం : హమాలీల కొరత వల్ల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఏర్పడిందని, సోమవారం నుంచి అన్ని కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కాంటా వేస్తామని పీఏసీఎస్ చైర్మన్ బాల్ నర్సింహ తెలిపారు. బొమ్మలరామారం మండల వ్యాప్తంగా పది కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు ఒక్క కేంద్రాన్ని ప్రారంభించకపోవడం, 20 రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్ద ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘20 రోజులైనా గింజ కొనలే’ శీర్షికతో శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు పీఏసీఎస్ చైర్మన్ నాగినేనిపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. హమాలీల సమస్యను అధిగమించేందుకు స్థానిక కూలీలతో పాటు బిహార్ కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సోమవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఫ 21 నుంచి అన్ని కేంద్రాల్లో ప్రారంభిస్తాం ఫ పీఏసీఎస్ చైర్మన్ బాల్ నర్సింహ -
పని ఏదైనా.. చేసేది వారే!
ఈ ఫొటోలోని ఇద్దరు మిర్యాలగూడ పట్టణంలోని టాకా రోడ్డులో హెయిర్ స్టూడియోలో పని చేస్తున్న ఢిల్లీకి చెందిన మున్నా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖాీసీం. రెండేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక దగ్గరే పని చేస్తుండటంతో స్నేహితులుగా మారారు. ఇద్దరు ఒకే దగ్గర ఉంటూ షాపునకు వెళ్లి వస్తుంటారు. ఒక్కొక్కరికి నెలకు రూ.17 వేల జీతం వస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల వలస కూలీలు ఎక్కడ చూసినా వారే.. హోటళ్ల నుంచి వరినాట్ల వరకు పనులు చక్కబెడుతున్నారు రైస్ మిల్లులు.. మార్కెట్లలో హమాలీలుగా వారే అధికం తోటలు, డెయిరీఫామ్‌లు, సెలూన్లలో సైతం.. కష్టం ఎక్కువ.. కూలి తక్కువ కావడంతో ఈ రాష్ట్రాల కూలీలతో పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా ఇక్కడి కూలీల కంటే.. ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ మంది కనిపిస్తారు. ఫబిహార్, బెంగాల్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారు ఇటుక బట్టీలు, మార్కెట్లు, తోటలు, రైస్ మిల్లులు, డెయిరీ ఫామ్, భవన నిర్మాణం, సెంట్రింగ్, పీఓపీ, వ్యవసాయం, పౌల్ట్రీఫాం, సెక్యూరిటీ గార్డ్ పనుల్లో ఉన్నారు. ఫ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు మగ్గం వర్క్‌లు, పాల్ సీలింగ్, పెయింటింగ్, హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, కరెంట్ ఫిట్టింగ్, సోఫాల తయారీ, పెళ్లి మండపాల తయారీలో పని చేస్తున్నారు. ఫ రాజస్థాన్‌కు చెందిన వారు టీస్టాళ్లు, వస్త్ర వ్యాపారం, హోటళ్లు, ఐస్‌క్రీమ్, ఎలక్టిక్ షాపులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏ రంగంలో చూసినా ఇతర రాష్ట్రాల వారే కీలకంగా మారారు. పనివాడిగా, కూలీగా, మేసీ్త్రలుగా, యజమానులుగా, వ్యాపారులుగా మారి వివిధ రంగాల్లో పనులను చక్కబెడుతున్నారు. వారి ప్రాంతాల్లో పనుల్లేక, వలస వచ్చిన వారు ఇక్కడ అన్ని రంగాల్లోనూ పైచేయి సాధిస్తున్నారు. తక్కువ కూలితో, ఎక్కువ సమయం పనిచేస్తున్న వీరిని ఇక్కడి ప్రజలు సైతం అక్కున చేర్చుకుంటున్నారు. వరినాట్లు వేయడానికి కూడా బిహార్ నుంచి కూలీలను తీసుకొస్తున్నారంటే వీరి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. వలస కూలీలు ఇక్కడ భాషను నేర్చుకొని స్థానికులతో మమైకమవుతున్నారు. ఉమ్మడి నల్లగొండఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,42,686 మంది కూలీలు ఉండగా.. అందులో దాదాపు 32 వేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఫ నల్లగొండ జిల్లాలో 46,030 మంది కూలీలు ఉండగా, అందులో దాదాపు 10 వేల మంది ఇతర రాష్ట్రాల వారే. ఫ సూర్యాపేట జిల్లాలో 79,329 మంది కూలీలకు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 18 వేల మంది ఉన్నట్లు అంచనా. ఫ యాదాద్రి భువనగిరి జిల్లాలో 17,327 మంది కూలీలు ఉండగా, అందులో ఇతర రాష్ట్రాల వారు దాదాపు నాలుగు వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది.భువనగిరి– చిట్యాల రోడ్డులో వలిగొండ సమీపంలో చెరుకు రసం విక్రయిస్తున్న ఇతను అనిల్ చౌహాన్. ఈయన రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇదే వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 32 వేల మంది -
జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి
సూర్యాపేటటౌన్: జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. కళాశాలకు చెందిన 58 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్టు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. కళాశాల విద్యార్థులు కన్నా ఉజ్వన్ గణితంలో 99.969 పర్సంటైల్ సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జి.తేజశ్రీ ఆలిండియా 1622వ ర్యాంకు, కె.ఉజ్వన్ 2254వ ర్యాంకు, వి.బిందుమాధవి 2541వ ర్యాంకు, సీహెచ్.హన్షితశ్రీ 2651వ ర్యాంకు, బి.శివమణి 2769వ ర్యాంకు, జె.మేనక 8319వ ర్యాంకు, డి.జగదీషారాజు 9498వ ర్యాంకు, పి. ప్రేమ్చందర్ 9863వ ర్యాంకు సాధించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో పాటు అధ్యాపక బృందాన్ని కరస్పాండెంట్ జయవేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి అభినందించారు. ‘ప్రగతి’ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులునల్లగొండ: జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. శనివారం ప్రకటించిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు వి. శ్రీనిధి రాథోడ్ 79వ ర్యాంకు, జంపాల అభినవ్ 155వ ర్యాంకు, కల్లేపల్లి సమీరా 4738వ ర్యాంకు, రమావత్ సందీప్ 4854వ ర్యాంకు, కె. స్టాలిన్ 13,358వ ర్యాంకు, టి. కార్తీక్ 13,822వ ర్యాంకు, బి. భవాని 14,118వ ర్యాంకు, డి. సునీల్‌నాయక్ 19,990వ ర్యాంకు సాధించారు. తమ కళాశాల నుంచి 95 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. ఇంటర్లో అధిక మార్కులతో పాటు జేఈఈలో ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ. నరేంద్రబాబు, ఎ. శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్‌రెడ్డి అభినందించారు. ‘గౌతమి’ విద్యార్థుల ప్రభంజనంనల్లగొండ: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శనివారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు జి. నితీష్‌రెడ్డి 370వ ర్యాంకు, ఎం. శివాజి 2396వ ర్యాంకు, ఐ. రికిత్ 5582వ ర్యాంకు, జి. తేజస్విని 6,174వ ర్యాంకు, ఆర్. శ్రీకర్ 6,916వ ర్యాంకు, ఎ. శశివంత్ 8,468వ ర్యాంకు, పి. రాజశేఖర్ 9,241వ ర్యాంకు, ఎం. సింహాద్రి 10,497వ ర్యాంకు, ఎం. శ్రీను 10,769వ ర్యాంకు, డి. పూజిత 11,444వ ర్యాంకు, కె. జయచంద్ర 12,233వ ర్యాంకు, ఎస్. భావన 13,706వ ర్యాంకు, జె. చంద్రకోటి 14,923వ ర్యాంకు, ఎం. సాత్విక్‌రెడ్డి 15,558వ ర్యాంకు, బి. శశిధర్ 15,688వ ర్యాంకు, కె. ప్రణయ్ 17,535వ ర్యాంకు, ఆర్. శివతేజ 18,385వ ర్యాంకు, ఎం. అక్షయ్ వర్షిత్ 18,797వ ర్యాంకు, ఆర్. అభినవ్ రాథోడ్ 19,137వ ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు కాసర్ల వెంకట్‌రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిరెడ్డి రఘుపాల్‌రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు. -
న్యాయవాదుల చట్ట సవరణను పునఃసమీక్షించాలి
భువనగిరిటౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల న్యాయవాదుల చట్టం–1961ను సవరించడం వలన న్యాయవాద వృత్తి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని, ఈ చట్ట సవరణపై కేంద్రం పునఃసమీక్షించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో మామిడి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదుల చట్టంను సవరించడం వలన బార్ కౌన్సిల్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని అన్నారు. అంతేకాకుండా విదేశీ లాయర్లను కేసులు వాదించేందుకు అనుమతించడం సరికాదన్నారు. వెంటనే సవరణ బిల్లును రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని కోరారు. 2019 తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ చేసుకున్న అడ్వకేట్లందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న జడ్జిల ఇళ్లోలో డబ్బుల సంచులు దొరకడం అవమానకరమని, ఆవిధంగా దొరికిన వారిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుక్క దువ్వ సోమయ్య, తడక మోహన్, సహాయ కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, కోశాధికారి బొడ్డు కిషన్, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ నేహాల్, యాదసు యాదయ్య, జెల్లా రమేష్, ఎండీ ఖయ్యూం, గాదపాక శంకర్, ఆకుల మల్లేశం, పిడుగు ఐలయ్య, జిట్టా భాస్కర్‌రెడ్డి, ఎస్కే హమీద్ తదితరులు ఉన్నారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి -
పరిశోధనకు మూలం ప్రశ్నావళి
నల్లగొండ టూటౌన్: పరిశోధనకు మూలం ప్రశ్నావళి తయారీ అని ఐపీఈ ప్రొఫెసర్ వై. రామకృష్ణ అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శని వారం నిర్వహించిన ‘అకడమిక్ రైటింగ్ ఫర్ పీహెచ్డీ స్కాలర్స్ అండ్ యంగ్ టీచర్స్’ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని డేటా కలెక్షన్, ఎనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనే అంశాలపై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్డీ చేసే విద్యార్థులు డేటా కలెక్షన్‌కు వెళ్లే ముందు ప్రశ్నావళి తయారు చేయడంలో ఉపయోగించే స్కేల్స్ తో పాటు వాటిని ఎనాలసిస్ చేయడానికి ఉపయోగించే ఎక్సెల్ షీట్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ గ్రంథాలయ అసోసియేట్ ప్రొఫెసర్ చక్రవర్తి, ఎంజీయూ ప్రొఫెసర్ అంజిరెడ్డి, ఆకుల రవి, శ్రీదేవి, రవిచంద్ర, పీహెచ్డీ స్కాలర్స్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరీశుడికి వెండి కలశాలు, పాత్రలు బహూకరణ యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి శనివారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు వెండి కలశాలు, వెండి పాత్రలు బహూకరించారు. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌కు చెందిన బిరదవోలు వరశ్రీ కుటుంబ సభ్యులు సుమారు 7కిలోల వెండితో తయారు చేసిన 11 వెండి కలశాలు, ఒక ఏక హారతి, ఒక ధూప హారతి పాత్రలను ఈఓ భాస్కర్‌రావుకు అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్‌కే చెందిన డాక్టర్ బీవీఎస్ రాంప్రసాద్ కిలో వెండితో తయారుచేసిన 2 వెండి కలశాలను ఈఓకు అందించారు. అంతకుముందు వారు గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వరి పంట కోయనీయడంలేదని ఆత్మహత్యనాగారం: వరి పంట కోయనీయకుండా అడ్డుకోవడంతో మనస్తాపానికి గురైన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫణిగిరి గ్రామానికి చెందిన వట్టె భద్రమ్మ(61), ముత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరికి ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. పెద్ద కుమారుడు 20ఏళ్ల క్రితమే మృతి చెందాడు. భర్త మృతిచెందిన తర్వాత పెద్ద కోడలు విజయ తన పుట్టింటికి వెళ్లి జీవనం కొనసాగిస్తోంది. దీంతో భద్రమ్మ తన మనవరాలు(విజయ కుమార్తె) పేరిట రూ.10లక్షల విలువైన ఇంటి స్థలం, రెండెకరాల పొలం రాసిచ్చింది. అయితే తన భర్త వాటా కింద రావాల్సిన మిగతా ఎకరంన్నర పొలం తమ పేరిట రాసివ్వాలని విజయ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. అంతేకాకుండా ఆ ఎకరంన్నరలో పండించిన వరిని కోయనీయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన భద్రమ్మ శనివారం వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి చిన్న కుమారుడు పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపారు. ఈతకు వెళ్లి బావిలో బాలుడు గల్లంతుసూర్యాపేటటౌన్: ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు బావిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసారం గ్రామానికి చెందిన పల్లె వెంకన్న, లలిత దంపతుల కుమారుడు మహేందర్(11)తో పాటు అతడి స్నేహితులు వేణు, అభిలాష్, దినేష్ ఈత కొట్టేందుకు గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లారు. దినేష్ బావి ఒడ్డున కూర్చొని ఉండగా మిగిలిన ముగ్గురు బావిలోకి దూకారు. మహేందర్, వేణుకు ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా బావిలో ఉన్న అభిలాష్ వారి ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే మొదట వేణును బయటకు తీసుకొచ్చి వెంటనే మహేందర్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే అతడు బావిలో మునిగిపోయాడు. బావి లోతుగా ఉండటంతో కాపాడలేకపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ బాలునాయక్, తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు చైనా మోటార్లు, రెండు ట్రాక్టర్ మోటార్లతో నీటిని తోడుతున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
మామిడికాయలు అమ్ముకొని ఇంటికి వెళ్తుండగా..
కోదాడరూరల్: మార్కెట్లో మామిడికాయలు అమ్ముకొని తిరిగి ట్రాక్టర్‌పై ఇంటికి వెళ్తుండగా.. లారీ ఢీకొనడంతో తండ్రి మృతిచెందాడు. కుమారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామానికి చెందిన రైతు, పీఏసీఎస్ డైరెక్టర్ నేరళ్ల సైదులు(57) తన కుమారుడు సాయితో కలిసి శుక్రవారం ట్రాక్టర్లో మామిడికాయలను లోడ్ చేసుకుని సూర్యాపేట మార్కెట్లో అమ్ముకొని రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ శివారులో వై–జంక్షన్ వద్దకు రాగానే ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో సైదులుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి కుమారుడు సాయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడి కుమారుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్‌రెడ్డి తెలిపారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు -
మానవత్వం చాటుకున్న ‘మాచన’
శాలిగౌరారం: పుట్టుకతో దివ్యాంగుడైన ఆ బాలుడి తండ్రి కొన్నేళ్ల క్రితం పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఆ సమయంలో రెండేళ్ల వయస్సున్న అతడిని తల్లి వదిలేసి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఆ బాలుడిని తాతయ్య, నానమ్మ, బాబాయి చేరదీసి సాకుతున్నారు. వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు శనివారం నల్లగొండ కల్టెరేట్‌కు రాగా.. వీరి పరిస్థితి తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వైద్య పరంగా ఆ బాలుడిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వివరాలు.. శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన ముక్కాంల సృజన్ పుట్టుకతో దివ్యాంగుడు. సృజన్ తండ్రి 2019 మే 11న గొర్రెలను మేపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. అప్పుడు సృజన్ వయస్సు రెండు సంవత్సరాలు. భర్త మృతిచెందడం, కుమారుడు దివ్యాంగుడు కావడంతో సృజన్ తల్లి అతడిని తాతయ్య, నానమ్మ వద్ద వదిలిపెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో సృజన్ అనాథగా మారాడు. దివ్యాంగుడైన సృజన్‌ను తాత, నానమ్మ ముక్కాంల భిక్షమయ్య, సత్తమ్మతో పాటు బాబాయి నరేశ్ సాకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వికలాంగుల పింఛన్ రాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు శనివారం సృజన్‌ను తీసుకొని నానమ్మ సత్తమ్మ, బాబాయి నరేశ్ కలిసి నల్లగొండ కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టరేట్లో విధి నిర్వహణలో ఉన్న పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వారిని గమనించి అల్పాహారం తినేందుకు సృజన్‌ను పిలిచాడు. సృజన్ నడవలేడని, తల్లిదండ్రులు కూడా లేరని బాబాయి నరేశ్ రఘునందన్‌కు తెలిపాడు. దీంతో చలించిపోయిన రఘునందన్ సృజన్‌కు ఉచితంగా వైద్యం చేయిస్తానని నానమ్మ, బాబాయికి హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌లో ఉన్న న్యూ లైఫ్ హోమియోకేర్ వైద్యుడు గద్దె సుభాష్చందర్తో ఫోన్లో మాట్లాడి సృజన్ పరిస్థితిని వివరించాడు. దీంతో సోమవారం హాస్పిటల్‌కు రావాలని వైద్యుడు సూచించడంతో.. రఘునందన్‌కు సృజన్ నానమ్మ కృతజ్ఞతలు తెలిపింది. దివ్యాంగుడైన సృజన్ పరిస్థితి చూసి చలించి సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాచన రఘునందన్ తెలిపారు. దివ్యాంగుడైన బాలుడికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ -
సహకార సంవత్సరంగా ప్రకటించడం హర్షణీయం
● డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి నల్లగొండ టౌన్: 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడం హర్షణీయమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజాభివృద్ధికి సహకార వ్యవస్థ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ సహకార వ్యవస్థ పురోగతికి సహకార సంఘాలు, డీసీఓ వ్యవస్థ, బ్యాంకులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వ్యాపారంలో, లాభాలు గడించడంలో, ఎన్పీఏలు తగ్గించడంలో ముందుందన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, పాశం సంపత్‌రెడ్డి, కొండ సైదయ్య, గుడిపాటి సైదయ్య, వంగూరి రంగాచారి, రామచంద్రయ్య, జూలూరు శ్రీనివాస్, వీరస్వామి, శ్రవణ్‌కుమార్, సీఈఓ శంకర్రావు పాల్గొన్నారు. ఎంజీయూ పీజీ, ఎంసీఏ ఫలితాలు విడుదల నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పీజీ మూడో సెమిస్టర్, ఐపీసీ, ఎంసీఏ, ఐఎంఏఈ మూడో సెమిస్టర్ ఫలితాలను శనివారం యూనివర్సిటీ చీఫ్ ఆఫీసర్ ఆప్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. పీజీ, ఐపీసీ అండ్ ఐఎంఏఈలో 72.61 శాతం, ఎంసీఏలో 76.61 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. భవనంపై నుంచి జారిపడి తాపీ మేస్త్రి మృతి పెద్దఅడిశర్లపల్లి: మిషన్ భగీరథ ప్లాంట్‌లోని భవనంలో లీకేజీకి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి తాపీ మేస్త్రి మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో శనివారం జరిగింది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం అబ్బనబోయినగూడెం గ్రామానికి చెందిన నర్ర నర్సింహ(50) తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ సమీపంలో మిషన్ భగీరథ ప్లాంట్‌లోని పంప్ హౌజ్ ఫేస్–1 భవనంలో ఏర్పడిన లీకేజీకి గత మూడు రోజులుగా అతడు మరమ్మతులు చేస్తున్నాడు. శనివారం మరమ్మతు పనులు పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద జారిపడ్డాడు. దీంతో నర్సింహ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
రేవంత్‌రెడ్డితోనే మాదిగలకు న్యాయం జరిగింది
● ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిచండూరు: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి వలన మాదిగలకు న్యాయం జరిగిందని, ఆంధ్రాలో మాత్రం మంద కృష్ణమాదిగ వల్ల అన్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. రాష్ట్రంలో మాదిగలకు 9శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా చండూరులో శనివారం నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో త్వరలో నిర్వహించబోయే వర్గీకరణ విజయోత్సవ సభకు ప్రతిఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. రోస్టర్ పాయింట్ 6శాతం కాకుండా 7శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మంద కృష్ణమాదిగ కృషిచేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వర్గీకరణ జీఓ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా జిల్లాల వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. 30 సంవత్సరాల మాదిగల నిర్విరామ పోరాట ఫలితంగా 9శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్, ఓయూ అధ్యక్షుడు జోగు గణేష్, సంజీవ, విజయ్, జంగయ్య, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
యువతకు ఉపయోగపడని యూత్ హాస్టల్
నాగార్జునసాగర్: యువతకు ఉపయోగపడేలా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గతంలో దేశవ్యాప్తంగా 143 యూత్ హాస్టల్స్ ఏర్పాటు చేయగా.. అందులో భాగంగా తెలంగాణలో మూడు ఏర్పాటు చేశారు. ఈ మూడింటిలో ఒక దానిని నాగార్జునసాగర్‌లో సుమారు ఐదెకరాలలో నిర్మించారు. ఈ యూత్ హాస్టల్ నిర్మాణానికి 1997లో శంకుస్థాపన చేసి.. 2003లో ప్రారంభించారు. ఇది నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట ఉంది. ఇందులో ఏడు డార్మెట్లు ఉండగా 3 మహిళలు, 4 పురుషులు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. 100మంది వరకు బస చేయవచ్చు. యువత విహారయాత్రకు వచ్చినప్పుడు గ్రూపులుగా ఒకే చోట కలుసుకునేందుకు, నాలెడ్జ్ ఎక్స్చేంజ్కు ఉపయోగపడేలా దీనిని నిర్మించారు. గతంలో ఇందులో బస చేసేందుకు ఒక్కరికి ఒకరోజుకు కేవలం రూ.30 అద్దె ఉండేది. తర్వాత రూ.50 చేయగా.. ప్రస్తుతం రూ.80 చేశారు. ఇందులో రెండు గదులు కూడా ఉండగా.. వాటికి అద్దె ప్రారంభంలో రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.500 ఉంది. అయితే ఈ యూత్ హాస్టల్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి కేవలం లాడ్జీలుగా ఉపయోగపడ్డాయి. 2015 వరకు ఇందులో పనిచేసే కేర్‌టేకర్, తోటమాలి, స్వీపర్లకు వేతనాలు పోగా రూ.14,86,000 నగదు నిల్వలు ఉన్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నాగార్జునసాగర్‌లో శిక్షణ ఇచ్చిన సమయంలో ఆ డబ్బులను ఖర్చు చేసి గతంలో ఉన్న బెడ్లు, బెడ్షీట్లు మార్చేందుకు, తదితర ఖర్చులకు వినియోగించారు. ఈ యూత్ హాస్టల్ ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ రంగులు కూడా వేయలేదు. గత 54నెలలుగా ఇందులో పనిచేసే వారికి వేతనాలు ఇవ్వలేదు. ఏమైనా అద్దెలు వస్తే సుమారు రూ.50వేలు జమ అయితే ఒకటి, రెండు నెలలకు చెక్కులు రాసి వేతనాలు అందిస్తుంటారు. నెహ్రూ యువకేంద్రం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఈ యూత్ హాస్టల్‌కు మేజనేజర్గా వ్యవరిస్తుండగా.. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నారు. ఇలాంటి యూత్ హాస్టళ్లు తెలంగాణలో సికింద్రాబాద్‌లోని బోట్స్ క్లబ్లో, హనుమకొండలో ఉన్నాయి. లీజుకు అడిగిన పర్యాటక అభివృద్ధి సంస్థఇటీవల తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ యూత్ హాస్టల్‌ను సందర్శించింది. దీనిని ఆధునీకరించి వినియోగంలోకి తీసుకొస్తే పర్యాటకులు బస చేసేందుకు ఉపయోగపడుతుందని లీజుకు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. అప్పట్లో నాగార్జునసాగర్ డ్యాంపై సీఆర్పీఎఫ్ సిబ్బంది పహారాగా ఉన్నారు. వారు బస ఇందులో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వారు తెలంగాణ వైపు పహారా విధుల నుంచి విరమించుకొని వెళ్లిపోయారు. దీంతో ఈ యూత్ హాస్టల్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. దీనిని పర్యాటక అభివృద్ధి సంస్థకు లీజుకు ఇస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, జిల్లా అధికారులు సమాలోచనలు చేసి ప్రజలకు ఉపయోగపడేలా ఈ యూత్ హాస్టల్‌ను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో డ్యాం భద్రతకు వచ్చిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఈ హాస్టల్ కేటాయింపు వారు వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే.. ఆదాయం రాక సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి -
యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలు నేత్రపర్వంగా చేపట్టారు. గురువారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చాన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి భక్తులకు స్వామి, అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, నిత్యకల్యాణం, జోడు సేవత్సంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
‘భూ భారతితో’ భూ సమస్యలకు చెక్
ఆత్మకూరు(ఎం) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గురువారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. రైతుల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణిని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. ఇకపై భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించనుందన్నారు. ప్రతి రైతుకూ భూధార్ కార్డు : కలెక్టర్ హనుమంతరావు ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి రైతుకు భూధార్ కార్డు ప్రభుత్వం అందజేస్తుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భూభారతి చట్టం 36 ఆప్షన్లతో రైతులకు సులభంగా అర్థమయ్యేలా తెలుగు భాషలో ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో కూరెళ్ల అనిల్ ఇంట్లో సన్నబియ్యంతో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అధికారులు భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రాజారాం, పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ గంధమల్ల జహంగీర్, తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములునాయక్, మార్కెట్ డైరెక్టర్ పాశం వినోద, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ మంగమ్మ, మాజీ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
వాగులను తోడేస్తున్నారు!
జోరుగా ఇసుక అక్రమ రవాణా ధర్మారెడ్డిగూడెం టు కాచారం, హైదరాబాద్ యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం పరిధిలోని వాగు నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తూ అక్రమ దందా సాగిస్తున్నారు. రాత్రి సమయంలో అక్రమార్కులు జేసీబీల ద్వారా ఇసుక తోడి కాచారం ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలకు అమ్ముతున్నారు. రోజూ సుమారు 30 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు. వాగు వెంట ఉన్న రైతులు, గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే విధంగా సైదాపురం–మాసాయి పేట, మైలార్గూడెంను కలుపుతూ వలిగొండ చెరువు వరకు ఉన్న వాగు రూపురేఖలు లేకుండాపోయింది. వాగులో ఇసుక తరలించడంతో పాటు పరీవాహకంలో అక్రమార్కులు ఫిల్టర్ ఇసుక కూడా తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫ ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పేరిట దందా ఫ ట్రాక్టర్ రూ.3000 వరకు విక్రయం ఫ లారీల్లో హైదరాబాద్‌కు తరలింపు ఫ మొక్కుబడిగా తనిఖీలు ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండాపోతోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లను అవకాశంగా మలుచుకుని అక్రమార్కులు దందా సాగిస్తున్నారు. వాగులనుంచి ట్రాక్టర్ల ద్వారా రహస్య ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి లారీలు, టిప్పర్ల ద్వారా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ప్రధానంగా ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), అడ్డగూడూరు, రాజాపేట మండలాల్లో విస్తరించిన వాగులను అక్రమార్కులు టార్గెట్ చేస్తున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా సాగుతున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. –యాదగిరిగుట్ట రూరల్, ఆలేరు రూరల్, రాజాపేట -
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
భువనగిరి : వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ మనోహర్ సూచించారు. అసంక్రమిత వ్యాధులు, రెబీస్ నివారణ, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికల్ ఆపీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలకు కలెక్టరేట్లో గురువారం శిక్షణ ఇచ్చారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, ఎండకు బయటకు వెళ్లిన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప్పు, చక్కెర స్థాయికి మించి తీసుకోవడం వల్లే మధుమేహం వస్తుందని, వ్యాధిగ్రస్తులు జొన్న, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు. సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు సంబంధించిన రెబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. అనంతరం అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదే విధంగా హిమోఫిలియో దినోత్సవం సందర్భంగా హిమోఫిలియోపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ యధోద, డాక్టర్లు సత్యేంద్రనాథ్, అనిల్, అశ్విన్‌కుమార్, హేమంత్‌కుమార్, సుమన్‌కళ్యాణ్, శిల్పిని, రామకృష్ణ, సాయిశోభ, వీణ, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ మనోహర్ -
అధికారుల అండదండలతోనే..
ఆలేరు మండలం కొలనుపాక, రాజనగరం, ధర్మారెడ్డిగుడెం, మంతపురి, సాయిగుడెం, తూర్పుగుడెం, గొలనుకొండ వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల సాకుతో అక్రమార్కులు ఇసుక దందా సాగిస్తున్నారు. రెండుమూడు డీడీలు తీసి పది ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిస్తున్నారు. రహస్యప్రాంతాల్లో డంప్ చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు లారీల్లో చేరవేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.5వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతోనే అక్రమ దందా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. అక్రమార్కులు తమ సంపాదనంలో నెలనెలా వారికి కొంత ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. -
వరి గడ్డి ధర రెట్టింపు
భువనగిరి, రామన్నపేట : వరి గడ్డి బంగారంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వేలాది ఎకరాల్లో వరి చేలు ఎండిపోయాయి. దీంతో వానాకాలం సీజన్ పూర్తయ్యే దాకా ఎండుగడ్డిని భద్రపరుచుకునే అవసరం పాడి రైతులకు ఏర్పడింది. ముందు జాగ్రత్తగా గడ్డి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. 2,91,000 ఎకరాల్లో వరి సాగు యాసంగిలో 2,91,000 ఎకరాల్లో వరిసాగు చేశారు. మూసీ పరీవాహకంలో వరి నాట్లు కొంత ఆలస్యం కాగా.. మూసీ పరివాహకేతర ప్రాంతాల్లో ముందుగానే నాట్లు వేశారు. దీంతో మూసీ పరీవాహకేతర ప్రాంతాల్లో 15 రోజుల క్రితం నుంచే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు లేకపోవడం, ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతుండడంతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో బావులు, బోర్లు వట్టిపోయి సాగునీరందక వేలాది ఎకరాల్లో వరి చేలు ఎండిపోయాయి. ఎండిన పంటను రైతులు పశువులు, జీవాలకు వదిలారు. దీంతో ఎండుగడ్డికి డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది, ఈసారి ధర ఇలా.. వర్షాలు సమృద్ధిగా కురిసిన సంవత్సరం ఎండుగడ్డికి అంతగా డిమాండ్ ఉండదు. చాలామంది రైతులు అమ అవసరాలకు కొంత నిల్వ చేసుకుని, మిగతా గడ్డిని పొలంలోనే కలియదున్నేవారు. కానీ, ఈ యాసంగి సీజన్లో నెలకొన్న పరిస్థితుల వల్ల ఎండుగడ్డికి డిమాండ్ పెరిగింది. గత ఏడాది యాసంగిలో ఎకరం గడ్డి రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయించారు. ప్రస్తుతం ఎకరం గడ్డి రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. కట్టలెక్కన గతంలో రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.150 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. ప్రధానంగా మూసీ పరివాహకేత ప్రాంతాల్లో బోరు బావుల కింద పండే వరి గడ్డిని పశువులు ఎక్కువగా మేస్తాయి. దీంతో ఈ గడ్డికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంగా మారిన గడ్డి ఎండుగడ్డి వ్యాపారంగా మారింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారుల అవతారం ఎత్తారు. వరి కోతలు ప్రారంభించకముందే వ్యాపారులు ముందుగానే గడ్డి బుక్ చేసుకుంటున్నారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇది వ్యాపారులకు ఉపాధిగా మారింది. ధర పెరిగింది బోరు అడుగంటడంతో యాసంగిలో సాగు చేసిన వరి చేను పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులకు గడ్డి కోనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానాకాలం గడ్డి వచ్చే వరకు సుమారు 3 ఎకరాల గడ్డి అవసరం అవుతుంది. కొనుగోలు చేసేందుకు వెళ్తే ఎకరానికి రూ.వెయ్యికి పైనే చెబుతున్నారు. గతంలో ఎకరం గడ్డి రూ.500లకే వచ్చేది. –వనగంటి రవీందర్, రైతు పహిల్వాన్‌పురం ఫ అడుగంటిన భూగర్భ జలాలు.. వేలాది ఎకరాల్లో ఎండిన చేలు ఫ ముందస్తు జాగ్రత్తగా గడ్డి కొనుగోలు చేస్తున్న పాడి రైతులు ఫ ఎకరం విస్తీర్ణంలోని గ్రాసానికి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు డిమాండ్ఇతర జిల్లాల నుంచి.. ఆత్మకూర్(ఎం), మోత్కూరు, ఆలేరు, రాజాపేట, అడ్డగూడూరు, గుండాల, భువనగిరి, వలిగొండ, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడి గడ్డి నాణ్యవంతంగా ఉంటుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న సిద్ధిపేట, మెదక్, మేడ్చల్ జిల్లాల రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్లు, డీసీఎంలు, ఆటోల్లో తరలిస్తున్నారు. -
ముగిసిన ఎస్ఏ–2 పరీక్షలు
భువనగిరి : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఎస్ఏ–2 వార్షిక పరీక్షలు గురువారం ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 715 పాఠశాలల్లోని 35వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 9వ తేదీ నుంచి, 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి.ఈ నెల 23న తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. అందజేయనున్నారు. తాగునీటి సమస్య రావొద్దు యాదగిరిగుట్ట రూరల్: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని జెడ్పీ సీఈఓ శోభారాణి ఆదేశించారు. యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై తాగునీటి సరఫరాపై సమీక్షించారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లోన్లు ఇచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నవీన్‌కుమార్, ఏపీఎం సుధాకర్, ఉద్యోగులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరింపజేయాలినల్లగొండ టౌన్: బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తరింపజేయాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికం బోర్డు సలహా సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టెలికం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ సేవలను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఆ దిశగా ఽఅధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు మరింత చేరువ అయినప్పుడే టెలికం రంగం అభివృద్ధిపదంలో పయనిస్తుందన్నారు. అంతకు ముందు ఎంపీ రవిచంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ పాశ్యం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ గురువయ్య, అధికారులు రవిప్రసాద్, మురళికుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపిక సంస్థాన్ నారాయణపురం : మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన కర్నాటి అక్షిత జాతీయ అర్చరీ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికై ంది. హైదరాబాద్‌లో ఈనెల 15నుంచి 17వ తేదీ వరకు జరిగిన రీజినల్ స్పోర్ట్స్ మీట్–2025 ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో 70, 60, 50, 30 మీటర్ల విభాగాల్లో అక్షిత విజేతగా నిలవడంతో నేషనల్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపిక చేశారు. అక్షిత హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ కేంద్రీయ విద్యాలయంలో ఇటీవల పదవ తరగతి పూర్తి చేసింది. గత ఏడాది కూడా జాతీయస్థాయిలో మెడల్ సాధించింది. ఈ సందర్భంగా అక్షిత మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించడం తన లక్ష్యమన్నారు. జాతీయ స్థాయి పోటీల కోసం తన తండ్రి అప్పు చేసి 20 రోజుల పాటు శిక్షణ ఇప్పించారని, ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. -
ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డకు చెందిన గుంటి ఆదినారాయణ(65) తన స్కూటీపై పట్టణానికి వస్తున్న క్రమంలో అదే రోడ్డులో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు వేగంగా వచ్చి ఢీ కొట్టాడు. దీంతో ఆదినారయణ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ఆదినారాయణ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న డైమండ్ నేత్ర నిధి ప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను సంప్రదించగా మృతుడి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ● మృతుడి నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు -
కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేలేని అసమర్థులు వారే..
నకిరేకల్: పదేళ్ల పాటు అధికారంలో ఉండి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలేని అసమర్థులు బీఆర్ఎస్ పార్టీ వాళ్లేనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. నకిరేకల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల విషయంలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే వీరేశం ఖండించారు. 2014లో తాత్కాలికంగా 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయిస్తే అవే అసంపూర్తిగా వస్తున్నాయన్నారు. గడిచిన పదేళ్లలో ఉమ్మడి జిల్లాకు కృష్ణానది నుంచి చుక్కనీరు తేలేకపోయారన్నారు. వారు నిజంగా రైతుల పక్షపాతి అయితే బ్రాహ్మణ వెల్లంల, డిండి, నక్కలగండి ప్రాజెక్టులతోపాటు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం కష్టపడుతుంటే మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో నకిరేకల్ పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, నాయకులు లింగాల వెంకన్న, కంపాసాటి శ్రీనివాస్, నకిరేకంటి నరేందర్, పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, యాసారపు వెంకన్న, గడ్డం స్వామి పాల్గొన్నారు. మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకోం నకిరేకల్ ఎమ్మేల్యే వేముల వీరేశం -
విద్యుదాఘాతంతో ప్లంబర్ మృతి
సంస్థాన్ నారాయణపురం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన సంస్థాన్‌నారాయణపురం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన కొల్లూరి పవన్(19) ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. కొత్తగూడెం గ్రామంలో నూతన ఇంటిలో జరుగుతున్న ప్లంబర్ పనికి వెళ్లాడు. ప్లంబింగ్ మిషన్‌కు ఎర్తు రావడంతో పవన్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పవన్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్ తెలిపారు. -
బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం
మునుగోడు: ఆరేళ్ల చిన్నారి ప్రసన్న బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని తహసీల్దార్ నరేందర్ భరోసా ఇచ్చారు. మునుగోడు మండలంలోని కల్వ లపల్లి గ్రామానికి చెందిన పగిడిమర్రి మహేష్– అనిత దంపతుల పెద్ద కుమారై ప్రసన్న బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆ కుటుంబ ధీనగాధని గురువారం సాక్షి దినపత్రికలో ఆరేళ్ల చిన్నారికి బ్రెయిన్ క్యాన్సర్ శీర్షికన కథనం ప్రచురించింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి కుటుంబ పరిస్థితి పరిశీలించి నివేదిక అందించాలని మునుగోడు తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈమేరకు ప్రసన్న ఇంటికి వెళ్లి ఆ కుటుంబ ఆర్ధిక పరిస్థితులపై తహసీల్దార్ ఆరా తీశారు. అయితే కుటుంబానికి రేషన్ కార్డు లేకపోవడంతో ఎక్కడా ఉచిత వైద్యసేవలు అందడంలేదని కథనంలో ప్రచురించగా ఆ కుటుంబానికి నూతన రేషన్ కార్డు మంజూరుచేస్తామని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కలెక్టర్‌కు నివేదిక అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడేళ్లుగా తాము రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నామని, మంజూరైతే తమ కుమారైకు ఆరోగ్యశ్రీ, ఇతర పథకాల ద్వారా ఉచిత వైద్యసేవలు అందుతాయని పేర్కొంటున్నారు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రసన్నను పరామర్శించిన తహసీల్దార్ -
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
కేతేపల్లి: కేతేపల్లిలో గురువారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా మోటకొండూరు గ్రామానికి చెందిన బందనాదం అరుణ(33)ఇటీవల తన తల్లిగారి ఊరైన కేతేపల్లి మండలంలోని రాయపురం గ్రామానికి వచ్చింది. ఈక్రమంలో తన ఇద్దరు పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు గురువారం కేతేపల్లికి వచ్చిన అరుణ స్థానిక ఎస్సీ కాలనీ సమీపంలో కాలి నడకన రోడ్డును దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఈప్రమాదంలో అరుణ తలకు తీవ్రంగా గాయమైంది. సమాచారం అందుకున్న కేతేపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అరుణ ఆరోగ్యం విషమించి గురువారం సాయంత్రం మృతి చెందింది. కాగా.. మృతురాలి భర్త ప్రసాద్ ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. వారికి పదేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతిచెందడంతో చిన్నారులు అనాథలుగా మారారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. పెట్రోల్ పోసుకొని బాలిక ఆత్మహత్యబీబీనగర్: మానసిక స్థితి సరిగా లేక మనోవేదనకు గురవుతున్న బాలిక ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రవెళ్లి గ్రామానికి చెందిన గుండు దీపిక(17) మానసిక స్థితి బాగోలేక గత కొంత కాలంగా ఇంట్లోనే ఉంటుంది. ఇటీవల పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మనోవేదనకు గురై గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. అరుపులు బయటకు వినిపించడంతో స్థానికులు దీపికను 108లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఉరేసుకుని యువకుడి బలవన్మరణం తిరుమలగిరి(నాగార్జునసాగర్): కొన్ని నెలల క్రితం తల్లి మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరుమలగిరి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపెల్లి గ్రామానికి చెందిన చిత్రం కొండల్(35) భువనగిరి కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం తన తల్లి మృతి చెందటంతో అవివాహితుడైన కొండల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు. -
భూదానం.. వజ్రోత్సవం
భూదానోద్యమం పురుడుపోసుకుని 74 ఏళ్లు పూర్తిభూదాన్పోచంపల్లి : భూదాన ఉద్యమానికి అంకురార్పణ జరిగి నేటికి (శుక్రవారం) సరిగ్గా 74 ఏళ్లు పూర్తయ్యాయి. అడిగిందే తడవుగా వెదిరె రాంచంద్రారెడ్డి ఒకటి, కాదు రెండు కాదు.. ఏకంగా 100 ఎకరాల భూమి 1951 ఏప్రిల్ 18న దానంగా ఇచ్చి పోచంపల్లిలో భూదానోద్యమానికి నాందిపలికారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దాంతో పోచంపల్లికి భూదాన గంగోత్రిగా అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. భూదానోద్యమానికి బీజం పడి 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా భూదాన వజ్రోత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించి ప్రజలలో భూదాన స్ఫూర్తిని కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. స్ఫూర్తినిచ్చిన భూదానం..మహాత్మాగాంధీ శిష్యుడైన ఆచార్య వినోబాభావే దేశమంతటా పాదయాత్రలు చేస్తున్న సమయంలో సర్వోదయ నాయకుడు శ్రీ రామకృష్ణ దూత్ ఆహ్వానం మేరకు 1951 ఏప్రిల్15న హైదరాబాద్ సమీపంలోని శివరాంపల్లిలో నిర్వహించే సర్వోదయ సమ్మేళనంలో తన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితులను తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి వెంటనే పాదయాత్రగా బయలుదేరి 17న పోచంపల్లికి చేరుకున్నారు. సాయంత్రం హరిజనవాడలో తిరిగి ఆ రోజు రాత్రి పీర్లకొట్టం (ఇప్పుడున్న వినోబాభావే మందిరం)లో బస చేశారు. మరుసటి రోజు అనగా ఏప్రిల్ 18న చెరువు సమీపంలో నున్న జువ్విచెట్టు కింద దళితులతో సమావేశమయ్యారు. తమకు కొంత భూమిని ఇప్పిస్తే సాగు చేసుకొని జీవిస్తామని దళితులంతా తమ గోడును వెల్లబోసుకున్నారు. దాంతో వినోబాభావే స్పందిస్తూ, మీలో ఎవరైనా భూమిని దానం చేసేవారున్నారా అని అడగటంతో అక్కడే ఉన్న పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి వెంటనే లేచి తన తండ్రి జ్ఞాపకార్ధం 100ఎకరాల భూమిని దానం చేస్తానని ప్రకటించి అక్కడికక్కడే దానపత్రాన్ని రాసి నిండుసభలో వినోబాభావేకు అందించారు. దాన రూపేణ లభించిన ఆ భూమిని వెంటనే పేదలకు పంచి భూదానోద్యామానికి బీజం వేశారు. దీనికి గుర్తుగా పోచంపల్లిలో భూదానస్తూపాన్ని నిర్మించారు. ఇలా ప్రారంభమైన భూదానోద్యమ స్ఫూర్తి విశ్వవ్యాప్తమై పోచంపల్లికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇలా 100 ఎకరాలలో మెదలైన ఈ ఉద్యమం దేశమంతటా విస్తరించి 44 లక్షల ఎకరాల భూమిని దానంగా సేకరించి 40లక్షల మంది భూమి లేని నిరుపేదలకు పంచిపెట్టబడింది. మహోన్నతమైన భూదానోద్యమం భూ సంస్కరణలకు, దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగడానికి దోహదపడింది. పోచంపల్లితో విడదీయని అనుబంధంఆచార్య వినోబాభావేకు పోచంపల్లితో విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 గాంధీ వర్ధంతి జనవరి 30న రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా చేసిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబాభావే పేర్కొనడం విశేషం. వినోబాభావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన ఆవిశ్రాంత కృషికి గాను 1982లో ‘భారతరత్న’ బిరుదును ప్రకటించింది.టూరిజం పార్కులో నేడు ప్రత్యేక కార్యక్రమాలు భూదానోద్యమం ఆవిర్భవించి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా పోచంపల్లిలో శుక్రవారం భూదాన వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గాంఽధీగ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినోబాబావే మందిరంలో ఉదయం శాంతి యజ్ఞం, ఆచార్య వినోబాభావే, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేయనున్నట్లు తెలిపారు. సర్వోదయ మండలి ఆధ్వర్యంలో..భూదాన వజ్రోత్సవాలను పురస్కరించుకొని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో స్థానిక టూరిజం పార్కులో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సర్వోదయ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్ గురువారం తెలిపారు. ఆర్థిక అసమానతలు తొలగించిన భూదానం భూదానోద్యమం ద్వారానే దేశంలో భూసంస్కరణలు నేడు పోచంపల్లిలో భూదాన వజ్రోత్సవాలుప్రారంభానికి నోచుకోని వినోబాభావే మందిరం2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పోచంపల్లిని సందర్శించిన సందర్భంగా.. శిథిలావస్థకు చేరిన వినోబాభావే మందిరాన్ని పునఃనిర్మించాలని భూదానయజ్ఞబోర్డు చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి వినతి మేరకు రూ.50లక్షలు మంజూరు చేశారు. దాంతో వినోబాభావే మందిరాన్ని 2014లో పునఃనిర్మించి నాటి భూదానోద్యమ ఫొటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. కానీ, గత పదకొండు ఏళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. వినోబాభావే మందిరానికి తాళం వేసి ఉండటంతో పోచంపల్లికి వచ్చిపోయే పర్యాటకులు వినోబాభావే మందిరాన్ని సందర్శించకుండానే నిరాశతో వెనుతిరిగిపోతున్నారు. భూదా నోద్యమం ద్వారా మన జిల్లా, రాష్ట్రం, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిపెట్టిన వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని వారి వారసులు గత ప్రభుత్వానికి విన్నవించినా నేటికి ఆ కల కూడా నెరవేరలేదు. అలాగే వెదిరె రాంచంద్రారెడ్డి పేరిట తపాల బిళ్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినా అదీ కార్యరూపం దాల్చలేదు. -
పశువుల ఎరువుతో భూసారం పెంపు
ఇలా దుక్కి దున్నాలి దుక్కిని ఎలా పడితే అలా దున్నడం వల్ల సాగు చేసే పంటలకు నష్టం వాటిల్లుతుంది. రైతులు వేసవిలో మెట్ట భూములను వానాకాలం సీజన్ కోసం సన్నద్ధం చేస్తుంటారు. వేసవిలో వచ్చే అధిక వర్షాలకు ఎంతో సారవంతమైన మట్టి నీటి వరదకు వాలు ప్రాంతంలో కొట్టుకుపోతుంది. దీంతో మెట్ట ప్రాంతాల్లో భూమి వాలుకు అడ్డంగా దుక్కి చేయాలి. వాలుకు అడ్డంగా దుక్కి దున్నితే నీటి ప్రవాహం తగ్గి మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.పెద్దవూర: ప్రస్తుతం రైతులు అధిక శాతం రసాయన ఎరువుల ద్వారానే పంటలు సాగు చేస్తున్నారు. దీంతో నేలలోని పోషకాల నిల్వల్లో సమతుల్యం లోపించి ఉత్పాదక శక్తి తగ్గుతుంది. చీడపీడలు ఆశించడం, సూక్ష్మ పోషకాల లోపాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే సేంద్రియ పద్ధతులు పాటించాలని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో..పశువులు, మేకలు, గొర్రెల పేడ పంటల సాగుకు ఎంతగానో ఉపయోగపడతాయి. పశువుల పేడ నేల సారవంతం చేయడంలో సహాయ పడుతుంది. ఇది నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు కలిగి ఉంటుంది. ఇవి మొక్కల పెరుగుదలకు అవసరం. ఇది సేంద్రియ ఎరువుతో సమానం. దీనిని దుక్కులు దున్నడానికి ముందే పంట భూముల్లో వేసి దున్నితే చాలా మంచిది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతోంది. దుక్కులు దున్నిన తర్వాత పశువుల పేడ మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు పశువుల పేడ ఉపయోగపడుతుంది. ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల పెంటను వినియోగించాలి. భూసారం పదిలంసాధారణంగా రైతులు వేసవిలో పశుశుల ఎరువును వ్యవసాయ పొలాలకు తరలిస్తుంటారు. అదే సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఎండల కారణంగా పొలంలో వెదజల్లితే వాటిలోని పోషకాలు ఆవిరవుతాయి. పశువుల పెంటను పొలంలో కుప్పలుగా పోసుకోవాలి. భూమిలో తగిన తేమ ఉన్న సమయంలోనే వెదజల్లి వెంటనే దుక్కిలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. భూమి గుల్ల బారడానికి తోడ్పడుతుంది. సహజ సిద్ధమైన లవణాలు అందుతాయి. నేలలోని ఆమ్లత్వం, క్షారత్వం, నీటిని నిల్వ ఉంచే గుణాన్ని అదుపు చేసి మొక్కలకు అందేవిధంగా సహాయపడతాయి. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చు. -
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో రోగి మృతి
మిర్యాలగూడ అర్బన్: మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చేరిన రోగి బుధవారం మృతిచెందాడు. అయితే ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందాడని ఆరోపిస్తూ బుధవారం ఆస్పత్రి ఎదుట మృతుడి బందువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండల పరిధిలోని బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన మొండికత్తి క్రిష్ణయ్య(70) గత కొంతకాలంగా మోకాళ్లు, కీళ్ల నొప్పులు బాధపడుతున్నాడు. దీంతో ఈ నెల 14వ తేదీన అతడిని కుటుంబ సభ్యులు మిర్యాలగూడలోని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. క్రిష్ణయ్యను పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. బుధవారం ఉదయం క్రిష్ణయ్యకు ఆస్పత్రి సిబ్బంది సైలెన్ బాటిల్ పెట్టి ఓ ఇంజక్షన్ ఇవ్వగా.. అతడి నోటి వెంట నురగ రావడంతో పాటు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన ఆస్పత్రి సిబ్బంది సీపీఆర్ చేసి పరీక్షించగా అప్పటికే అతడు మృతిచెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే క్రిష్ణయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడారు. ఈ ఘటనపై మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస సమరధ్ను వివరణ కోరగా.. ఇంజక్షన్ వికటించి క్రిష్ణయ్య మృతిచెందలేదని, ఇందులో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. క్రిష్ణయ్య గుండెపోటు వచ్చి మృతిచెంది ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫ వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన ఫ గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చన్న సూపరింటెండెంట్ -
కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా
ఆత్మకూర్(ఎస్): మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో కుక్కను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక కూలీ మృతిచెందగా.. పలువురికి తీవ్ర తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని కోటపహడ్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట రూరల్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన కేశరాజుపల్లి శంకర్ ఆటోలో ఆత్మకూర్(ఎస్) మండలం శెట్టిగూడెంలో మిరప తోట ఏరడానికి బుదవారం తెల్లవారుజామున బయల్దేరారు. ఉదయం 4:30 సమయంలో కోటపహాడ్ గ్రామ పంచాయతీ సమీపంలో ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ఆటో డ్రైవర్ కుక్కను తప్పించబోగా.. అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మాదరబోయిన యాదమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. యాదమ్మ మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుమారుడు లింగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు. ఫ మహిళా కూలీ మృతి ఫ పలువురికి గాయాలు -
ఆరేళ్ల చిన్నారికి బ్రెయిన్ క్యాన్సర్
మా పాపకు ప్రాణదానం చేయండిమాది నిరుపేద కుటుంబం. మా పెద్ద పాపకి బ్రెయిన్ క్యాన్సర్ రావడంతో ఉన్న ఇంటిని అమ్మి వైద్యం చేయించాం. అయినా నయం కాలేదు. మా దగ్గర ఖర్చు చేయడానికి పైసలు లేవు. ఎవరైనా దాతలు మాకు సహాయం అందించి మా పాప ప్రాణం కాపాడండి. మాకు రేషన్‌కార్డు లేకపోవడంతో ఎక్కడా ఉచిత వైద్యం పొందలేకపోతున్నాం. మాపై దయతలచి అధికారులు రేషన్‌కార్డు మంజూరు చేయాలని వేడుకుంటున్నా. – అనిత, ప్రసన్న తల్లి మునుగోడు: తోటి పిల్లలతో కలిసి బడికి పోవాల్సిన ఆరేళ్ల చిన్నారి బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడింది. ఎలాగైనా తమ కుమార్తెను కాపాడుకోవడానికి ఆమె తల్లిదండ్రులు ఇల్లు అమ్మి, అప్పులు చేసి కీమోథెరపీ చేయిస్తున్నారు. ప్రస్త్తుతం వారి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన పగిడిమర్రి మహేష్, అనిత దంపతులకు 2016లో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారైలు సంతానం. పెద్ద కుమారై ప్రసన్న 2019లో జన్మించింది. 2023లో ప్రసన్న అనారోగ్యానికి గురికావడంతో అప్పటి నుంచి ఆ చిన్నారిని అనేక ఆస్పత్రుల్లో వైద్యులకు చూపించినా ఆమెకు వచ్చిన జబ్బు ఏమిటో ఏ డాక్టర్ గుర్తించలేకపోయారు. ఆరు నెలల క్రితం ఆ చిన్నారి బ్రెయిన్లో ట్యూమర్ ఉందని వైద్యులు తేల్చారు. దీనికి తోడు బ్రెయిన్ క్యాన్సర్ కూడా ఉందని చెప్పారు. ఆస్తులు అమ్మి వైద్యం చేయిస్తున్న తల్లిదండ్రులు.. మహేష్ వండ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి స్వగ్రామంలో ఎలాంటి వ్యవసాయ భూమి, ఆస్తులు లేవు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లి తన అన్నదమ్ములతో కలసి ఉంటూ అక్కడే పనిచేసి ఓ ఇల్లు కొనుక్కున్నాడు. కుమారై అనారోగ్యానికి గురికావడంతో ఆ ఇంటిని రూ.23 లక్షలకు విక్రయించి ఆమెకు హైదరాబాద్‌లో కీమోథెరపీ చేయిస్తున్నాడు. అంతేకాకుండా తన వద్ద ఉన్న వస్తువులు రవాణా చేసే రెండు వాహనాలను కూడా విక్రయించినా తన కుమార్తె వైద్యానికి డబ్బులు సరిపోకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేశాడు. ఇప్పటి వరకు రూ.40లక్షల వరకు ప్రసన్న వైద్యం కోసం ఖర్చు చేశాడు. రేషన్ కార్డు లేకపోవడంతో ఆర్థిక భారం.. మహేష్, అనిత దంపతులు 2018లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి నూతన రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో వారికి నేటికీ రేషన్ కార్డు మంజూరు కాలేదు. దీంతో వారి కుమార్తెకు ఏ ఆస్పత్రిలో కూడా ఉచిత వైద్యం అందడం లేదు. కనీసం తమ చిన్నారికి అవసరమైన రక్తం కూడా వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. తమకు రేషన్ కార్డు ఉంటే వైద్య ఖర్చుల భారం సగానికి పైగా తగ్గేదంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమపై దయతలచి తమ చిన్నారిని కాపాడుకునేందుకు నూతన రేషన్ కార్డు మంజూరు చేయడంతో పాటు వైద్య ఖర్చులకు దాతలు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. ఫ సొంత ఇల్లు అమ్మి, అప్పులు చేసి కీమోథెరపీ చేయిస్తున్న తల్లిదండ్రులు ఫ ఇప్పటివరకు రూ.40లక్షలకు పైగా అయిన వైద్యం ఖర్చు ఫ దాతల సాయం కోసం ఎదురుచూపులు -
తమ్ముడి మామే సూత్రధారి
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన మణికంఠ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన నలుగురికి బుధవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నకిరేకల్‌కు చెందిన గద్దపాటి సురేష్ నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. సురేష్ తమ్ముడు నరేష్‌కు 2017లో హైదరాబాద్‌కు చెందిన మాతరి వెంకటయ్య కుమార్తె ఉమామహేశ్వరితో వివాహమైంది. కొన్నాళ్ల వరకు నరేష్ సంసారం సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాత అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భార్యను దూరంగా ఉంచడంతో పాటు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే తన కుమార్తె సంసారం నాశనం కావడానికి తన అల్లుడైన నరేష్ అన్న సురేషే కారణమని మాతరి వెంకటయ్య భావించాడు. సురేష్ కూడా వేరే మహిళతో చాలాకాలంగా సాన్నిహిత్యంగా ఉంటూ తన భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలియడంతో పాటు నరేష్ వివాహేతర సంబంధాన్ని సురేష్ ప్రోత్సహిస్తున్నాడని నమ్మిన మాతరి వెంకటయ్య ఎలాగైనా సురేష్‌ను అంతమొందిస్తే తన అల్లుడు నరేష్‌కు బుద్ధి వచ్చి తన కుమార్తెతో మంచిగా ఉంటాడని భావించాడు. సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం.. ఈ మేరకు మాతరి వెంకటయ్య హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన చిక్కు కిరణ్‌కుమార్ అలియాస్ సీకే కిరణ్‌కుమార్‌ను సంప్రదించి అతడి ద్వారా తన అల్లుడు నరేష్‌పై నిఘా పెట్టించాడు. ఆరు నెలల నుంచి నిఘా పెట్టగా.. తన అల్లుడు నరేష్ మరో మహిళతో సహజీవనం చేస్తూ ఒక పాపను కూడా కన్నాడని తెలిసింది. సురేష్ ప్రోత్సాహంతోనే నరేష్ ఇదంతా చేశాడని నమ్మిన వెంకటయ్య, అతడి కుమార్తె ఉమామహేశ్వరి సురేష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన కిరణ్‌కుమార్‌కు చెప్పగా.. తాను గతంలో నేవీలో కమ్యూనికేషన్ వింగ్‌లో పనిచేశానని, ఆధారాలు దొరకకుండా హత్య ఎలా చేయాలో తనకు బాగా తెలుసని, రూ.15 లక్షలు ఇస్తే హత్య చేస్తానని కిరణ్‌కుమార్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఈ క్రమంలో కిరణ్‌కుమార్ నెల క్రితం కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామానికి చెందిన తన బంధువు ముశం జగదీశ్‌కు విషయం చెప్పి, రూ.3 లక్షలు పారితోషికం ఇస్తానని ఆశచూపి ఈ హత్యలో భాగస్వామి కావాలని కోరాడు. దీంతో జగదీశ్ ఒప్పుకున్నాడు. వీరిద్దరు కలిసి నెల రోజుల నుంచి నల్లగొండ పట్టణంలో రెక్కీ నిర్వహిస్తూ గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ కదలికలను కనిపెడుతూ వచ్చారు. హత్య జరిగింది ఇలా.. నెల రోజులు రెక్కీఅనంతరం ఈ నెల 11న చిక్కు కిరణ్‌కుమార్ హైదరాబాద్ నుంచి జెన్ కారులో చెర్వుగట్టు వరకు వచ్చాడు. హత్య చేయడానికి కావల్సిన కత్తులు, మాస్కులు, టోపీలు, గ్లౌజ్‌లను వెంట తెచ్చుకున్నాడు. కారు చెర్వుగట్టు వద్ద పెట్టిన కిరణ్‌కుమార్ అప్పటికే అక్కడ వేచి ఉన్న ముశం జగదీశ్‌తో కలిసి బైక్‌పై చర్లపల్లి వరకు వచ్చారు. అక్కడ నుంచి ఆటోలో రాత్రి 10 గంటలకు రామగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి గీతాంజలి అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని పథకం ప్రకారం మృతుడి షాపు వెనకాల అప్పటికే ఉంచిన బైక్ తీసుకుని 10.45గంటలకు కలర్ ల్యాబ్ వద్దకు వచ్చారు. తమకు ఫొటోలు, ప్రింట్లు కావాలని సురేష్‌ను అడగ్గా.. రాత్రయింది రేపు ఉదయం రమ్మని సురేష్ వారికి చెప్పాడు. అర్జెంటుగా కావాలని అడగడంతో ఫొటోలు ప్రింట్ ఇచ్చే పనిలో సురేష్ నిమగ్నమవ్వగా.. అదే అదునుగా భావించిన కిరణ్‌కుమార్, జగదీశ్ కత్తులతో సురేష్ గొంతు కోసి వీపు, పొట్ట భాగంలో విచక్షణారహితంగా పొడిచారు. అనంతరం బైక్‌పై చర్లపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి మరో బైక్‌పై చెర్వుగట్టుకు వెళ్లి అక్కడ రక్తం అంటిన దుస్తులు, కత్తులు అన్నీ కారులో పెట్టుకుని అమ్మనబోలు వైపు వెళ్లిపోయారు. మార్గమధ్యలో మూసీ వాగులో రక్తం అంటిన దుస్తులు, కత్తులను పడేసి హైదరాబాద్ పారిపోయారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ శివరాంరెడ్డి నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా.. బుధవారం హత్యకు పథకం వేసిన నరేష్ మామ మాతరి వెంకటయ్య(ఏ1 ), అతడి కూతురు, నరేష్ భార్య గద్దపాటి ఉమామహేశ్వరి(ఏ4)ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. చిక్కు కిరణ్‌కుమార్(ఏ2 ), ముశం జగదీశ్(ఏ3 )ను నార్కట్‌పల్లిలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి మారుతీ జెన్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు ఛేదించిన డీఎస్పీ శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ సైదులును ఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుని తదుపరి విచారణ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఫ తన కుమార్తె సంసారం నాశనం చేశాడనే కక్షతో గద్దపాటి సురేష్‌ను హత్య చేయించిన అతడి తమ్ముడి మామ ఫ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి
నల్లగొండ టూటౌన్: విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి అన్నారు. బుధవారం ఎంజీయూలో ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్రాంక్లిన్ టెక్ సిస్టమ్స్ కంపెనీ సహకారంతో ఐటీ, నాన్‌ఐటీ, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ సెక్టార్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 250మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జయంతి, సుధారాణి, నాగరాజు, సత్యనారాయణరెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
51కిలోల గంజాయి పట్టివేత
భువనగిరిటౌన్: ఏపీలోని చిత్తూరు నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు తరలిస్తున్న రూ.14.50 లక్షల విలువైన 51.13 కిలోల గంజాయిని బుధవారం భువనగిరిలో పట్టుకున్నట్లు పట్టణ ఇన్స్పెక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు. ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం... ఎస్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ శివారులోని వైల్ట్ స్టోన్ వెంచర్ వద్ద జగదేవ్‌పూర్ రోడ్డులో బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా 51.13 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న సంగారెడ్డి జిల్లా ఈశన్నపురం గ్రామానికి చెందిన మహమ్మద్ అమీర్, సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన డ్రైవర్ మొహమ్మద్ ఇస్మాయిల్, అదే ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ కార్మికుడు మహమ్మద్ ఇస్మాయిల్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుర్చినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మరో నిందితుడు హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన బాషా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
చౌటుప్పల్: ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గణేష్‌నగర్ కాలనీలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామానికి చెందిన పందేటి చలపతిరావు(38) చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో గల దివీస్ ఫార్మా కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గత 20 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గణేష్‌నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. మంగళవారం సాయంత్రి చలపతిరావు భార్య భవిత ప్రార్ధన నిమిత్తం స్థానికంగా చర్చికి వెళ్లింది. కుమార్తె ఇంట్లోనే ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తితో చలపతిరావు రాత్రి 8గంటల సమయంలో ఇంట్లోని మరో గదికి వెళ్లి సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రార్ధన ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన భవిత తన భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి బోరున విలపించింది. మృతుడి తండ్రి వీరరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
భూ హక్కులకు రక్ష.. భూ భారతి
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, యాదాద్రి : ధరణి లోపాల కారణంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు నేటి (గురువారం) నుంచి ఈనెల 30వ తేదీ వరకు మండల స్థాయిలో అవగాహన సదస్సులు చేపట్టాలని నిర్ణయించారు. తొలిరోజున ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారంలో కలెక్టర్ అధ్యక్షతన సదస్సులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భూభారతిలోని కీలక అంశాలు ధరణి చట్టంలో హక్కుల రికార్డు సవరణ కోసం నియమం లేదు. తప్పుల సవరణకు కోర్టులను ఆశ్రయించాల్సిందే. శ్రీభూభారత్ఙిలో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు అవకాశం ఉంది. ధరణిలో ఏర్పడిన సమస్యలకు సంబంధించి సుమారు 3,200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డుల్లో పేరు లేని వారు, హక్కుల రికార్డులో నమోదు చేసుకోవడానికి కొత్తగా చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సాదాబైనామాలకు పరిష్కారం పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. జిల్లాలో సుమారు 9వేల వరకు సాదాబైనామాలు పెండింగ్‌లో ఉన్నాయి. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు, వ్యవసాయ భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 2020, అక్టోబర్ 12వ తేదీ నుంచి 2020 నవంబర్ 10వ తేదీ మధ్య క్రమబద్ధీకరణ కోసం సన్న, చిన్నకారు రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిపై ఆర్డీఓలు విచారణ చేసి, అర్హత ఉన్నవారికి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారు. హక్కుల రికార్డుల్లో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారు. టైటిల్ డీడ్ పునరుద్ధరణ గతంలో మాదిరిగా పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ జారీచేస్తారు, భూభారతి హక్కుల రికార్డుల్లో నమోదైన అందరికీ, తనంతతాను గాని, భూ యజమాని గాని దరఖాస్తు చేస్తే రికార్డులు పరిశీలించి తహసీల్దార్ పాస్ పుస్తకం జారీ చేస్తారు. నిర్ణీత రుసుము రూ.300 చెల్లించాలి. అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు, ఆపైన కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చు. న్యూస్రీల్ఫ భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం ఫ అవగాహన కల్పించేందుకు నేటి నుంచి 30వ తేదీ వరకు సదస్సులు ఫ తొలిరోజు ఆత్మకూర్ (ఎం), బొమ్మలరామారంలో సభలుబాధ్యతల వికేంద్రీకరణ భూమి కొనుగోలు, దానం, బాగ పంపిణీ తనఖా రిజిస్ట్రేషన్ – పట్టామార్పు (మ్యుటేషన్) ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డుల్లో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్, పట్టామార్పు ఒకేరోజు జరిగిపోతుంది. స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, పట్టా మార్పిడీ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. నిర్ణీత తేదీన రిజస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రర్ చేస్తారు. సొంతంగా రాసుకున్న దస్తావేజులను కూడా సమర్పించవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి దస్తావేజుతో పాటు భూమి పటం సమర్పించాల్సి ఉంటుంది. నిషేధిత జాబితాలో లేని లేదా ఇతర చట్టాలను ఉల్లంఘించకుండా ఉన్న భూములను తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్టర్డ్ దస్తావేజుకు సవరించిన భూభారతి రికార్డును జతపరిచి కొనుగోలుదారు, అమ్మకందారుకు అందజేస్తారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ చేసి హక్కుల రికార్డుల్లో నమోదు చేస్తారు. నిర్ణీత తేదీలోపుగా తహసీల్దార్ పట్టామార్పు చేయకపోతే, దానంతటదే పట్టా మార్పు జరుగుతుంది. భూభారతి పోర్టల్‌లో నిర్దేశించిన నమూనాలో దరఖాస్తు చేయాలి, నిర్ణీత ఫీజు చెల్లించాలి. దరఖాస్తుతో పాటు వారసుల ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీని సమర్పించాలి. -
28 నుంచి పాలిసెట్ ఉచిత శిక్షణ
యాదగిరిగుట్ట: టీజీ పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 28 నుంచి మే 8వ వరకు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని, మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 80998 99793, 90106 29270ను సంప్రదించాలని కోరారు. 75శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాల సరఫరాభువనగిరిటౌన్ : నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, మినీ కిట్ పథకం కింద 75 శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు సరఫరా చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 కేజీల కిట్ ధర రూ.492.50 ఉంటుందని పేర్కొన్నారు. 25శాతం రైతు వాటా కింద రూ.123.50 చెల్లించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి గల వారు ఏఈఓలను సంప్రదించాలని కోరారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు విశేషంగా జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు. ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదానల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఈనెల 17 నుంచి మే 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ) డాక్టర్ ఉపేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని, తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అసమానతల నిర్మూలనలో అంబేడ్కర్ కృషి మరువలేం రామగిరి(నల్లగొండ): దేశంలో సామాజిక అసమానతల నిర్మూలనతోపాటు రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన కృషి మరువలేమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఇ.వెంకటేసు అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో సామాజిక న్యాయం ఔచిత్యం అనే అంశంపై బుధవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక కీలక అంశాల్లో అంబేడ్కర్ పాత్ర ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత సమాజ ఉన్నతికి కారకులు కావాలని కోరారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, ఐక్యూసి కోఆర్డినేటర్ వైవీఆర్.ప్రసన్నకుమార్, పరీక్ష నియంత్రణ అధికారి బి.నాగరాజు, డాక్టర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
చేనేత వారసత్వాన్ని చాటి చెప్పాలి
భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్‌లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు పోచంపల్లిని సందర్శించి తెలంగాణ చేనేత వారసత్వం, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. బుధవారం కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆమె భూదాన్‌పోచంపల్లిలోని టూరిజం పార్కులో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. మ్యూజియం, ఆడిటోరియం, హాంప్లి థియేటర్‌ను సందర్శించారు. అనంతరం టూరిజం, హ్యాండ్లూమ్ అధికారులు, ఈవెంట్ ఆర్గనైజర్లతో సమావేశమయ్యారు. పోచంపల్లి ఇక్కత్‌తో పాటు గొల్లభామ, గద్వాల, నారాయణపేట తదితర హ్యాండ్లూమ్ వస్త్రాలతో గదులను డెకరేట్ చేయాలని సూచించారు. అదేవిధంగా టూరిజం ప్రాంగణంలో స్థానిక చేనేత కళాకారులచే మగ్గాలు, తదితర స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. టూరిజం అభివృద్ధికి విదేశీయుల పర్యటన దోహదం మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 40 దేశాలకు చెందిన అందాల భామలు మే 15న పోచంపల్లికి వస్తున్నారని స్మితా సబర్వాల్ తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల్లో 140 దేశాలకు చెందిన వారు పాల్గొంటున్నారని, వారిని బృందాలుగా విభజించి తెలంగాణ సంప్రదాయాలను పరిచయం చేయడానికి ప్రముఖ ప్రదేశాలు, దేవాలయాలను సందర్శించనున్నారని పేర్కొన్నారు. ఎండలు బాగా ఉన్నందున విదేశీయులకు ఇబ్బందులు కలగకుండా పోచంపల్లిలో సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8గంటల లోపు కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేశామని చెప్పారు. చేనేత పరిశ్రమతో పాటు టూరిజం అభివృద్ధికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. హ్యాండ్లూమ్ థీమ్‌ను అంతర్జాతీయ ఆడియన్స్, ఇండియన్స్ ప్రమోట్ చేస్తున్నామని ఇందుకు పర్యాటకశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ స్వయం మగ్గం నేశారు. అదేవిధంగా మగ్గం నేసే వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్‌రెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ నాగేశ్వర్రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్, టూరిజం శాఖ ఈడీ విజయ్, సీఈ శ్రీనివాస్, డీఈఈ హనుమంతరావు, ఏఈ రాంప్రసాద్, ఆర్ఐ వెంకట్‌రెడ్డి, స్థానిక టూరిజం మేనేజర్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.ఫ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ -
యూనిఫాం వస్త్రం వచ్చేసింది
జూన్ మొదటి వారంలో అందజేస్తాం జిల్లాకు చేరుకుంటున్న యూనిఫాం వస్త్రాల బాధ్యతలను ఎంఈఓలు చూసుకుంటున్నారు. వారి పర్యవేక్షణలోనే ఎమ్మార్సీ భవనంలో వస్త్రాలను భద్రపరుస్తున్నారు. వస్త్రం పూర్తిగా వచ్చిన తర్వాత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించనున్నారు. జూన్ మొదటి వారంలోనే విద్యార్థులకు యూనిఫాం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – సత్యనారాయణ, డీఈఓ భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిఏటా యూనిఫాం అందజేస్తోంది. వాటికి సంబంధించిన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) సరఫరా చేస్తోంది. ఈమేరకు జిల్లాకు అవసరమైన వస్త్రాన్ని పంపించారు. వీటిని ఆయా మండలాల్లోని ఎమ్మార్సీ భవనాల్లో భద్రపర్చారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో అందించే దుస్తుల్లో స్వల్ప మార్పులు చేశారు. చొక్కాలు, లాంగ్ ట్రాక్‌లకు పట్టీలు, భుజాలపై కప్స్ వంటివి లేకుండా సాధారణ డిజైన్ చేశారు. ఈసారి 6, 7వ తరగతుల విద్యార్థులకు కూడా ప్యాంట్లను అందించనున్నారు. ప్రస్తుతం నెక్కర్లకు సంబంధించిన వస్త్రం మాత్రమే జిల్లాకు చేరుకుంది. మొత్తం 2.30లక్షల మీటర్ల వస్త్రం అవసరం కానుండగా ప్రస్తుతం 60,167 మీటర్ల వస్త్రం జిల్లాకు వచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి ఒక జత యూనిఫాంను జూన్ మొదటి వారంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. జాప్యం లేకుండా.. జిల్లాలో 730 పాఠశాలలున్నాయి. వీటిలో 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జిల్లా ఉన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలతోపాటు టీయూడబ్ల్యూఎస్, కేఈబీవీ, యూఆర్ఎస్, ఆదర్శ, టీజీఆర్ఈఎస్ పాఠశాలల్లో సుమారు 55 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతిఏటా రెండు జతల యూనిఫాం అందజేస్తోంది. గతంలో కుట్టే బాధ్యతను ఏజెన్సీలకు ఇవ్వడంతో జాప్యం చేసేవారు. దీంతో గత ఏడాది మహిళా సంఘాలకు అప్పగించగా సమర్థవంతంగా నిర్వహించారు. తర్వాత రెండో జత ఎస్ఎస్జీ గ్రూపులకు ఇచ్చారు. దుస్తులను త్వరగా కుట్టి ఇవ్వడంతో పాటు వారికి ఆర్థికంగా దోహదపడింది. ఇదివరకు జతకు రూ.50లు ఇచ్చారు. గతేడాది నుంచి ఒక్కో జతకు రూ.75లు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 40వేల మంది విద్యార్థుల యూనిఫాం కుట్టినందుకుగాను ఇంకా రూ.20లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు డీఆర్డీఏ ఖాతాల్లో ఉండగా.. మహిళలకు చేరాల్సి ఉంది. విద్యార్థుల కొలతల ప్రకారం గతంలో విద్యార్థులకు కొలతలు లేకుండా యూనిఫాం కుట్టేవారు. దీనివల్ల కొందరికి వదులుగా మరికొందరికి బిగుసుగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈ సారి పాఠశాలల వారీగా కొలతలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో విద్యార్థుల కొలతలు తీసుకునే ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఫ ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాకు వచ్చిన 60,167 మీటర్ల వస్త్రం ఫ విద్యార్థులకు జూన్ మొదటి వారంలో యూనిఫాం అందించేందుకు ఏర్పాట్లు ఫ ఈసారి 6, 7వ తరగతుల విద్యార్థులకు కూడా ప్యాంట్లు -
భూదాన వజ్రోత్సవాలను జయప్రదం చేయాలి
భూదాన్‌పోచంపల్లి: భూదానోద్యమానికి అంకురార్పణ జరిగి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా పోచంపల్లిలో ఈ నెల 18న నిర్వహించే భూదాన వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని గాంఽధీగ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం పోచంపల్లిలోని వినోబాభావే మందిరాన్ని ఆయన సందర్శించి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న పోచంపల్లిలో భూదాన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భూదాన యజ్ఞబోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డితో పాటు స్థానిక ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్, భూ భారతిసభ్యులు సునీల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, గాంధీ జ్ఞాన్ప్రతిష్టాన్ సెక్రటరీ సుబ్రమణ్యం తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వినోబాభావే సేవాసమితి నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ, వేశాల మురళి, భాస్కర్ పాల్గొన్నారు. ఫ గాంఽధీగ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి -
నిధులు సక్రమంగా వినియోగించాలి
సాక్షి, యాదాద్రి : కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ఒక్క రూపాయి కూడా వదలకుండా ఖర్చు చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన దిశ (జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ) సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వివిధ శాఖల అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలపై ఎంపీ అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు సంబంధిత శాఖలు ఎలా ఖర్చు చేస్తున్నాయి.. అవి ప్రజలకు గ్రౌండింగ్ అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలని సూచించారు. బ్రిడ్జిల పనులు పూర్తి చేయాలి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే భువనగిరి మూసీ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏళ్లుగా పనులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన తప్పు పట్టారు. అమృత్ 2.0 పథకం కింద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భువనగిరి మున్సిపాలిటీలో మంచి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుడా చూడాలని మిషనర్ భగీరథ అధికారులకు సూచించారు. అనంతరం దిశా సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిధులను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, మందడి ఉపేందర్‌రెడ్డి, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నిధులిచ్చినా పనులు పూర్తి చేయరా: బీర్ల ఐలయ్య తాగు నీటి సమస్యల పరిష్కారానికి నిధులు ఇచ్చి ఏడాది దాటినా పనులు పూర్తి కావా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధికారులను ప్రశ్నించారు. ఆలేరు మండలం కొలనుపాక, రాఘవాపురం, శ్రీనివాసపురం, పటేల్ గూడెం గ్రామాల్లో మూడు రోజులకోసారి మంచినీరు వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది
చిట్యాల: ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాలలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేయాలని, పనిచేసే నాయకులకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణ యుగమని, కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరగా.. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల అయిలయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, రాచకొండ క్రిష్టయ్య, సుంకరి యాదగిరిగౌడ్, కూరెళ్ల లింగస్వామి, కొలను వెంకటేష్‌గౌడ్, మెండె సైదులు, కందాటి రమేష్‌రెడ్డి, జిట్ట బోందయ్య, కోనేటి ఎల్లయ్య, పోల్లేపల్లి సత్యనారాయణ, మర్రి జలంధర్‌రెడ్డి, పోకల రాములు, ఆవుల ఆనంద్, కునూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
అంబేడ్కర్‌కు ప్రముఖుల నివాళి
సాక్షి, యాదాద్రి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం భువనగిరిలోని వినాయక చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంక్ష్ యాదవ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకుల శ్యాంసుందర్ తదితర ప్రముఖులు హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచం గర్హించదగిన మేధావి అంబేడ్కర్ : ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రపంచం గర్హించదగిన మేధావి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. తాను రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాలు సమాన విద్య, సమాన హక్కులు, ప్రాథమిక హక్కులు పొందగలుగుతున్నాయంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లేనన్నారు. అంబేడ్కర్‌ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, ఉద్యోగ జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ : మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
రైతన్నను ముంచిన వడగండ్ల వాన
మోటకొండూరు, అడ్డగూడూరు, ఆత్మకూర్(ఎం), ఆలేరు రూరల్ : జిల్లాలో ఆదివారం సాయంత్రం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులకు భారీ నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కోత దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. మామిడి కాయలు నేలరాలాయి. వ్యవసాయ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేశారు. నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : బీర్ల ఐలయ్యఈదురుగాలులు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను సోమవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పరిశీలించారు. రైతలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టం నివేదిక పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నాయకులు యాస లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ తండ మంగమ్మ, యెల్లంల సంజీవరెడ్డి, గంగపురం మల్లేష్, కొంతం మోహన్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు. వందల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసిన అధికారులు -
భూ భారతికి శ్రీకారం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఽభూమిపై హక్కుల విషయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఇక క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి భూభారతి విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. పరిష్కారం కానున్న సమస్యలివే.. రెవెన్యూ రికార్డుల్లో గతంలో పట్టాదారు కాలమ్‌తో పాటు కబ్జాదారు కాలమ్ కూడా ఉండేది. అయితే ధరణి తీసుకువచ్చినప్పుడు కబ్జా కాలమ్‌ను తొలగించి పట్టాదారు కాలమ్‌ను మాత్రమే రికార్డుల్లో ఉంచింది. దీంతో గతంలో భూములు కొని పట్టాలు చేసుకోని వారు, సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన వారు కబ్జాలో ఉన్నప్పటికీ వారికి ఆ భూమిపై హక్కులు లేకుండా పోయాయి. గతంలో అమ్ముకున్న వారికే ధరణిలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. ఇలాంటి సమస్యలు అనే కం ఉత్పన్నం అయ్యాయి. అదేవిధంగా ధరణి అమలులో భాగంగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూములన్నింటినీ ఆన్లైన్ చేసే సందర్భంలో ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరుతో పట్టాలు ఎక్కడం, కొందరికి భూమి ఉన్నంతగా కాకుండా తక్కువగా, ఎక్కువగా పాస్‌బుక్కుల్లో ఎక్కడం, మరికొందరు తమ భూములను అమ్ముకున్నప్పటికీ వారే దొడ్డిదారిన ఆ భూమిని పాస్‌బుకుల్లో తమ పేరున ఎక్కించుకోవడం, మరికొందరు కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు ఉన్నా ఒక్కరే పట్టా చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి ధరణిలో పరిష్కారం కాలేదు. దాంతో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూ భారతి ద్వారా ఇలాంటి సమస్యలకు కోర్టుకు వెళ్లాల్సిన పని లేకుండానే క్షేత్ర స్థాయిలో పరిష్కరించుకోవచ్చు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవడం, అక్కడా పరిష్కారం కాకపోతే కలెక్టర్‌కు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ధరణిలో పాస్‌బుక్ పొందిన పట్టాదారుడే తిరిగి వారేవారికి పట్టా చేస్తేనే పేరు మారేది. కలెక్టర్‌కు కూడా దాన్ని మార్చే అధికారం లేకపోవడంతో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వాటికి భూ భారతిలో మోక్షం లభించనుంది. ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ ఆగిపోతే ఆ డబ్బులు రైతులకు వచ్చేవి కావు. అలాంటివి ఇప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పట్టా భూమి పొరపాటున ప్రభుత్వ భూమి అని పడితే దాన్ని మార్పు చేయాలంటే సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా 2023 నుంచి అలాంటి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు వాటితోపాటు పెద్ద మొత్తంలో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది.మొదటగా నాలుగు మండలాల్లో.. మొదట రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతిని అమలు చేయనున్నారు. జూన్ నుంచి అన్ని మండలాల్లో అమలు చేస్తారు.ఈ చట్టంలో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు, ఆర్డీఓలకు అధికారాలు లభించనున్నాయి.భూ సమస్యలు ఇక వేగంగా పరిష్కారం భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ నుంచి అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలు -
మహాశివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి అలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తగా చేపట్టారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపం, ముఖ మండపంలో శ్రీసుదర్శనహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశ్వీరచనం, నిత్యకల్యాణ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. పాడి రైతుల సదస్సును జయప్రదం చేయాలి రాజాపేట : ఆలేరులో ఈనెల 24న జరిగే పాడి రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పాడిరైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజ్‌గౌడ్, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాజాపేటలో సోమవారం పాడి రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. నెలనెలా బిల్లులు చెల్లించకపోవడం, ప్రోత్సాహకం చెల్లించకపోవడం, పాల ధర పెంచకపోవడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. దాణ ధర కూడా పెరగడంతో పాడి పశువులను పోషించలేని స్థితిలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోతుందన్నారు. సదస్సులో పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బబ్బూరి పోశెట్టి, పాలసంఘం చైర్మన్ సందిల భాస్కర్ రమేష్, నాయకులు పల్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి : భారత్ సైన్యంలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, అసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నా రు. దరఖాస్తుకు విద్యార్హతల సర్టిఫికెట్లు తప్పనిసరిగా జతపర్చాలన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
యువ వికాసానికి 31,902 అర్జీలు
భువనగిరిటౌన్ : రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ముగిసింది. సోమవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 31,902 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ 9,874, ఎస్టీ 2,579, బీసీ 16,990, ఈబీసీ 814, మైనార్టీ 1,590, క్రిష్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 55 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడంతో వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా దరఖాస్తు గడువు పెంచినట్లు ప్రచారం జరుగుతుందని, ఇందులో వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగుల నుంచి గడువు పెంచాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని, దీనిపై మంగళవారం ఏదైనా నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రత్యేక కౌంటర్లుదరఖాస్తుదారుల నుంచి హార్డ్ కాపీలు స్వీకరించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సోమవారం సెలవు రోజు అయినప్పటికీ సిబ్బంది అందుబాటులో ఉండి హార్డుకాపీలు స్వీకరించారు. ముగిసిన దరఖాస్తు గడువు సెలవు రోజూ హార్డు కాపీల స్వీకరణ -
ౖరెతులకు తిప్పలు!
వారి తప్పులు..సాక్షి, యాదాద్రి : రేషన్ కార్డ్ ఎడిట్, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పిదాల వంటి సాంకేతిక సమస్యలు వేలాది మంది రైతులను రుణమాఫీకి దూరం చేసింది. ఇంకా 30 శాతం మంది రైతులు అర్హతలున్నా రుణమాఫీ పొందలేదు. డిసెంబర్లో జరిగిన నాలుగో విడతలోనూ ఉపశమనం లభించకపోవడంతో.. వీరంతా తమ రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో అర్జీలు సమర్పిస్తున్నారు. నాలుగు విడతల్లో 80,962 మందికి మాఫీరాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు విడతల్లో 80,962 మంది రైతులకు రూ.669.73 కోట్లు హాపీ అయ్యాయి. తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాలు 36,483 మందికి 199.46, రెండో విడతలో రూ.లక్షన్నర లోపు 19,798 మందికి రూ.193.96 కోట్లు, మూడో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు 13,011 మందికి రూ.164.66 కోట్లు మాఫీ జరిగింది. నాలుగో విడతలో 11,690 మంది రైతులు రూ.111.65 కోట్లు లబ్ధి పొందారు. ఇంకా 30 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. మాఫీ వర్తించకపోవడానికి కారణాలివీ..సాంకేతిక సమస్యలకు తోడు మానవ తప్పిదాలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వేలాది మంది రైతులు రుణమాఫీకి దూరం చేసింది. రేషన్ కార్డ్ ఎడిట్, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లలో తప్పులు దొర్లడం, ఫోన్ నంబర్లు సరిపోలకపోవడం, ఖాతాలు క్లోజ్ చేయడం వంటి కారణాలతో చాలా మంది రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో రాలేదు. వీరంతా కలెక్టరేట్, రైతువేదికలు, వ్యవసాయ కార్యాలయాలు, పీఏసీఏసీల్లో ఏర్పాటు చేసిన హెల్స్డెస్క్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లలో ప్రభుత్వ సూచన మేరకు దరఖాస్తు చేసుకున్నారు. 4,300కు పైగానే దరఖాస్తులు వచ్చాయి. జిల్లా అధికారులు వీటిని పరిశీలించి ఉన్నతస్థాయికి పంపారు. ఇటువంటి వారికి నాలుగో విడతలో రుణమాఫీ చేశారు. కానీ, చాలా మంది పేర్లు జా బితాలో రాలేదు. ప్రధానంగా ఏపీజీవీబీ, పీఏసీఎస్, డీసీసీబీ, వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. వానాకాలం వరకై నా సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.పేరువచ్చినా డబ్బులు జమ కాలేదు నాలుగో విడతలో రుణమాఫీ అయిందని జాబితాలో పేరు వచ్చింది. కానీ, బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఆంధ్రప్రదేశ్ గ్రా మీణ వికాస్ బ్యాంకు పేరు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చడంతో టెక్నికల్‌గా సమస్య ఏర్పడినట్లు చెబుతున్నారు. నాతో పాటు చాలా మంది రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలి. –చిలువేరు రాజమల్లారెడ్డి, బొమ్మలరామరాంసాంకేతిక సమస్యలను సరిచేయని అధికారులు అర్హతలున్నా వర్తించని రుణమాఫీ జిల్లాలో ఇంకా 30 శాతం మంది ఎదురుచూపులు కొత్త రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న బ్యాంకులు ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేస్తున్న రైతులుఅధికారుల చుట్టూ తిరుగుతున్నా ఆలేరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.70 వేలు పంట రుణం తీసుకున్నా. మొదటి విడుతలోనే రుణమాఫీ జాబితాలో నా పేరు వచ్చింది. ఖాతాలో డబ్బు కూడా జమ అయింది. అయినా బ్యాంకు అధికారులు కొత్త రుణం ఇవ్వడం లేదు. కారణం అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. రుణం కోసం బ్యాంకు చుట్టు తిరుగుతున్నా. – ఎన్. చంద్రారెడ్డి, బహుద్దూర్‌పేట -
సన్నాహక సమావేశాలు.. పాదయాత్రలు
సాక్షి, యాదాద్రి : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభపై పార్టీ నేతలు దృష్టి సారించారు. అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో ఇటీవల జిల్లా నేతలతో సమావేశమై సభకు జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు వారు సభ విజయవంతంపై తలమునకలయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముగిసిన సన్నాహక సమావేశాలురజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలు ముగి శాయి. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి,నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, క్యామమల్లేష్ తదితర నాయకులు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తుంగుతుర్తి నియోజకవర్గంలో సన్నాహక సమావేశం నిర్వహించాల్సి ఉంది. పాదయాత్రలుసభ విజయవంతం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సోమవారం బీఆర్ఎస్ విద్యార్థి సంఘం, యువజన విభాగం ఆధ్వర్యంలో రాయగిరి నుంచి యాదగిరిగుట్టలోని వైకంఠద్వారం వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో పాటు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ మాజీ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా వలిగొండ మండలం వేములకొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయనుంచి యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల వరకు బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నారు. పాదయాత్రను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అదే విధంగా పోటాపోటీగా వాల్‌రైటింగ్ చేస్తున్నారు. వరంగల్‌వైపు జాతీయ రహదారి, ప్రధాన రోడ్ల వెంట చలో వరంగల్, రజతోత్సవ సభను జయప్రదం చేయాలంటూ వాల్‌రైటింగ్ చేయడం ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. రాయగిరి నుంచి గుట్టకు పాదయాత్రభువనగిరి, యాదగిరిగుట్ట : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ భువనగిరి మండలం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వైకుంఠద్వారం వరకు బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, షిఫ్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు రాయగిరిలో పాద యాత్రను పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. పాదయాత్రలో బీఆర్ఎస్ గుట్ట మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, నాయకులు మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్, ప్రవీణ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, ఆలేరు నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేష్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ మిట్ట అరుణ్గౌడ్, ఆయా మండలాల యూత్, విద్యార్థి విభాగాల అధ్యక్షులు ఎండీ అజ్జు, పల్లె సంతోష్ గౌడ్, భగత్‌సింగ్, రాసాల ఐలేష్ యాదవ్, బాల్సింగ్, భానుచందర్, బండ జహంగీర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జన సమీకరణకు నేతల సన్నాహాలు ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేల మంది తరలించాలని లక్ష్యం -
ప్రమాదవశాత్తు ఆయిల్ పామ్ తోట దగ్ధం
గుర్రంపోడు: మండలంలోని చామలేడు గ్రామానికి చెందిన కొండ పెద్దులు ఆయిల్ పామ్ తోట ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఉపాధిహామీ కూలీలు తన ఆయిల్ పామ్ తోట వెంట కాల్వలో కంపచెట్లు తొలగించి నిప్పు పెట్టి వెళ్లడంతో ఆ మంటలు తన తోటకు అంటుకొని చెట్లు దగ్ధమైనట్లు బాధిత రైతు తెలిపాడు. మొత్తం మూడెకరాల తోటలో దాదాపు రెండెకరాలలో కాపు కొచ్చే దశలో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు, డ్రిప్పు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.4లక్షల మేర నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు తెలిపారు. చౌల్లరామారంలో.. అడ్డగూడూరు: అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామంలోని సౌట కుంటలో సోమవారం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌట కుంటలో ఇటీవల ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు తొలగించిన కంప చెట్లకు సోమవారం నిప్పు పెట్టడంతో పెద్దఎత్తున మంటలు ఎగిసి పక్కనే ఉన్న వరి పొలాల వైపు వ్యాపించాయి. స్థానిక రైతులు గమనించి మోత్కూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. -
కొత్తపేట గ్రామంలో విషాదఛాయలు
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామానికి చెందిన అప్పల కొండయ్య కుమారుడు ఆదిత్య(27), ఊర ముత్తయ్య కుమారుడు ప్రవీణ్(25) చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరిద్దరు ఆదివారం రాత్రి కొత్తపేట నుంచి బైక్‌పై సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో చీకటిగూడెం గ్రామ స్టేజీ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ హైవేపై ఉన్న జంక్షన్ వద్ద సూర్యాపేట వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుపుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ వేర్వేరుగా సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
సంస్థాన్ నారాయణపురం: విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ఒక లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సర్వేల్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి బుర్రా వెంకటేశం అన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదివిన ఆయన ఆదివారం పాఠశాలను సందర్శించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. నూతనంగా 5వ తరగతి అడ్మిషన్ పొందిన విద్యార్థితో ముచ్చటించారు. భవిష్యత్‌లో కలెక్టర్ అవుతానని సదరు విద్యార్థి చెప్పడంతో అభినందించారు. తాను ఈ పాఠశాలలో అడిష్మన్ కోసం తన అమ్మతో కలిసి వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకముందు పాఠశాలలో బీఆర్ అంబేడ్కర్‌తో పాటు ఇతర మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, పాల్వాయి రజిని, రామ్మోహన్రావు, గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి రమణకుమార్, డిప్యూటీ కార్యదర్శి ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్‌కుమార్ తదితరులున్నారు. అంతకుముందు మల్లారెడ్డిగూడెం గ్రామంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు నర్రి యాదయ్య ఇంట్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం -
పడిపోతున్న నిమ్మ ధర
నకిరేకల్: వేసవిలో నిమ్మకాయలకు మంచి ధర వస్తుందనుకున్న రైతులు సరైన ధర లేక దిగాలు చెందుతున్నారు. పది రోజుల క్రితం పండు నిమ్మకాయలు బస్తాకు రూ.1800, పెద్ద సైజు కాయలు బస్తాకు రూ.2200, చిన్న సైజు కాయలు బస్తాకు రూ.1200 ధర లభించింది. గత రెండు, మూడు రోజుల నుంచి ఈ ధరలు సగానికి సగం పడిపోతున్నాయి. నకిరేకల్ నిమ్మ మార్కెట్లో ప్రస్తుతం పండు కాయ బస్తా ధర రూ.1000 నుంచి రూ.1300, పెద్ద సైజు కాయ బస్తాకు రూ.1200 ధర పలుకుతోంది. చిన్న సైజు కాయ బస్తాకు రూ.200 ధర వస్తుంది. నిమ్మ ఎగుమతయ్యే ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో అక్కడ నిమ్మ కొనుగోళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రేటు ఉందని చెట్ల మీద చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులు కాయలను కోయడంతో దిగుబడులు పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా నిమ్మ అధికంగా దిగుబడి రావడంతో ఢిల్లీ, గుజరాత్ వంటి నగరాల్లో ధర పెరగడం లేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రోజుకు ఏడు వేల బస్తాల రాక..ఉమ్మడి జిల్లాలో సూమారు 30వేల ఎకరాలకు పైగానే నిమ్మ తోటలు సాగువుతున్నాయి. దాదాపు 20వేల రైతు కుటుంబాలు, కౌలుదారుల కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఏకై క నిమ్మ మార్కెట్‌ను 2018 జూన్ 17న నకిరేకల్‌లో ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో అత్యధిక విస్తీర్ణంలో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఏటా మూడు లక్షల టన్నులకు పైనే నిమ్మ దిగుబడి వస్తోంది. నకిరేకల్ నిమ్మ మార్కెట్‌కు గత 15రోజుల వరకు ప్రతిరోజు 2వేల నుంచి 3వేల వరకు నిమ్మకాయల బస్తాలు రాగా.. తాజాగా వారం రోజుల నుంచి రోజుకు 6వేల నుంచి 7వేల బస్తాలు వస్తున్నాయి. ఈ నిమ్మ మార్కెట్ నుంచి డీసీఎంలలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతున్నాయి. నిమ్మ దిగుబడులు పెరగడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నిమ్మకాయలు అధికంగా రావడంతోనే ధరలు పడిపోయాయని మార్కెటింగ్ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపి మంచి ధర వచ్చేలా చూడాలని నిమ్మ రైతులు కోరుతున్నారు. వేసవిలో లభించని ఆశించిన రేటు దిగుబడి పెరగడంతో ధర లేదంటున్న మార్కెట్ అధికారులు -
నిర్దిష్టమైన ధర నిర్ణయించాలి
నేను మూడెకరాల్లో నిమ్మ సాగు చేశాను. 250 చెట్లు ఉన్నాయి. నకిరేకల్ నిమ్మ మార్కెట్‌కు 13 బస్తాల నిమ్మకాయలు తీసుకొచ్చాను. ఒక్కో చిన్న సైజు కాయ బస్తాకు రూ.200 ధర వచ్చింది. పండు కాయలకు బస్తాకు రూ.1300, పెద్ద సైజు కాయలకు రూ.1200 మించి ధర రావడం లేదు. పది రోజుల క్రితం మార్కెట్‌కు వస్తే రోజుకు రూ.30 వేలు వచ్చేవి. నేడు రూ.10వేలకు మించి రావడం లేదు. ధర సగానికి సగం పడిపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి. నిమ్మ దీర్ఘకాలిక పంట అయినందున ప్రభుత్వం బస్తాకు ఒక నిర్దిష్టమైన ధర నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. – అన్నెబోయిన సురేందర్, బండమీదిగూడెం, శాలిగౌరారం మండలం -
పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడిగా వర్రె వెంకటేశ్వర్లు
మోత్కూర్: స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడిగా మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామానికి చెందిన వర్రె వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి శివశంకర్‌రావును నియమించగా.. ముగ్గురు సభ్యులలో ఒకరిగా వర్రె వెంకటేశ్వర్లును నియమితులయ్యారు. వర్రె వెంకటేశ్వర్లు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల మోత్కూరు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భూమి చదును చేస్తుండగా బయల్పడిన శివలింగం చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రణబోతు బాజీరెడ్డి ఆదివారం తన వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా శివలింగంతో పాటు నాగప్రతిమ బయల్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని శివలింగాన్ని తిలకించారు. కాగా ఈ స్థలంలో గతంలో గుడి ఉండేదని గ్రామస్తులు తెలిపారు. ఆలయంలో చోరీ నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని కమలానగర్లో గల సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. సోమవారం నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం ముఖద్వారం తలుపు తెరిచి లోపలికి ప్రవేశించి బీరువా తాళాలను తీశారు. అందులో ఉన్న సీతాదేవికి సంబంధించిన 15 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.20వేల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ యడవల్లి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డీజే నిర్వాహకులపై కేసు సూర్యాపేటటౌన్: నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు డీజే నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం చిలుకూరు మండలం బేతవోలులో బర్త్‌డే వేడుకల్లో డీజే వినియోగించడంతో.. స్థానికుల ఫిర్యాదు మేరకు చిలుకూరు పోలీస్ స్టేషన్లో కార్యక్రమ నిర్వాహకులు, డీజే యజమానులు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసి డీజే సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. శనివారం సూర్యాపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూరి బజార్లో పెళ్లి వేడుకలో డీజే ఉపయోగించినందుకు గాను ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ఆదివారం సూర్యాపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరాంతండాలో బర్త్‌డే వేడుకల్లో డీజే పెట్టగా.. ఇద్దరు నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య
● న్యాయం చేయాలని కోదాడ– జడ్చర్ల హైవేపై కుటుంబ సభ్యుల రాస్తారోకోనిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్‌లోనే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హాస్టల్లో ఉంటూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. జాన్‌రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్లో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. చీకోటి ప్రవీణ్‌పై కేసు నమోదునల్లగొండ: హనుమాన్ జయంతి సందర్భంగా నల్ల గొండ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓవైసీ బ్రదర్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో సుమోటోగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు
పెద్దవూర: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించటంతో జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మండుతున్న ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే పంట ఎదుగుదల, దిగుబడిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మండల ఉద్యానవన అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వేసిన, ఎదిగిన పంట పెరుగుదలను కాపాడుకుంటూ, పంట పరిస్థితిని బట్టి రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించి సాగు చేపట్టాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. ● ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆయిల్‌పామ్ తోటల్లో మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుమును, పచ్చిరొట్ట ఎరువు పంటగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన తరువాత చిన్న, చిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి. ● ప్రతి మొక్కకు రెండువైపులా ఒక్కో మైక్రోజెట్ (30 లేదా 40 లీటర్లు డిశ్చార్జ్ అయ్యేవి) అమర్చుకోవాలి. ● వేసవిలో చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలి. చెట్టుకు ఇరుపక్కల జెట్‌కు గంటకు 40 లీటర్ల సరఫరా సామర్థ్యం ఉంటే రోజుకు రెండు గంటలు నీరు అందించాలి. ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో వేసవిలో ప్రతి చెట్టుకు రోజుకు 250–330 లీటర్ల నీటిని అందించాలి. ● మూడేళ్ల లోపు వయస్సు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతి నెల అబ్లెషన్ సాదనంతో(రెండుసార్లు) తొలగించాలి. ● అవసరం మేరకు మాత్రమే (అన్ని చెట్లు కాకుండా) ఎండిన, విరిగిన లేదా చీడపీడలు ఆశించిన ఆకులను తొలగించాలి. ● ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్‌పామ్ మొక్కలతో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు నీరు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి. ● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోసిన తరువాత నరికి ముక్కలు చేసిన ఆయిల్‌పామ్ ఆకులను, మగ పూల గుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ అయిన ఆయిల్‌పామ్ గెలలను, పాదుల్లో మల్చింగ్గా పరచాలి. ● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో పక్వానికి వచ్చిన ప్రతి గెలను, అల్యూమినియం కడ్డీ లేదా కత్తిని ఉపయోగించి కోయాలి. ఆయిల్‌పామ్ సాగులో పాటించాల్సిన మెళకువలపై ఉద్యానవన అధికారి సూచనలు ఎదిగిన ఆయిల్‌పామ్ తోటలకు నెలకు ఎకరాకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్, 2.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్‌ను, ఒక కిలో బోరాక్స్‌ను విడివిడిగా నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా మొక్కలకు అందించాలి. ఇలా చేయడం వల్ల సమయం, ఎరువులపై ఖర్చు కూడా ఆదా చేయొచ్చు. ఆయిల్‌పామ్ తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపిస్తే మట్టి, పత్ర విశ్లేషణ కొరకు నమూనాలను సిఫార్సు చేసిన రీతిలో సేకరించి విశ్లేషణ కోసం పంపాలి. -
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన
నకిరేకల్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని, ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు జీఓను విడుదల చేయడంపై హర్షిస్తూ నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డ్రోన్ సహాయంతో నకిరేకల్ మెయిన్ సెంటర్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయించారు. అనంతరం సాయి మందిరం సమీపంలో స్టేడియంకు వెళ్లే దారిలో మహనీయుల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారిత కోసం జీవితాంతం పరితపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్, పూజర్ల శంభయ్య, మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, బత్తుల ఉశయ్యగౌడ్, పెద్ది సుక్కయ్య, కంపసాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం -
విద్యార్థులపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ
యాదగిరిగుట్ట: విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు, యువతకు కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. పేద విద్యార్థులకు రూ.5లక్షల రుణాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేబినెట్లో ఆ విషయాన్ని ప్రసావించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల హక్కులు సాధించేలా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువతది కీలకపాత్ర అన్నారు. 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్‌రెడ్డి, ఆలేరు నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాసాల ఐలేష్‌యాదవ్, కొంపల్లి నరేష్, పల్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ -
మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
మునుగోడు: భర్త గుండెపోటుతో మృతిచెందడం తట్టుకోలేక ఒక్క రోజు వ్యవధిలోనే భార్య కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన నల్ల గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల గ్రామానికి చెందిన దుబ్బ శంకరయ్య(65), దుబ్బ లక్ష్మమ్మ(61) భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శంకరయ్య మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకరయ్య ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం శంకరయ్యకు గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సోమవారం శంకరయ్య మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన మృతదేహంపై పడి బోరున విలపించినా లక్ష్మమ్మ కూడా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు హైదరబాద్‌కు తరలించారు. అక్కడకి వెళ్లేసరికి ఆమె కూడా మృతిచెందింది. అన్యోన్యంగ జీవించిన భార్యాభర్తలు ఒక్క రోజు వ్యవధిలోనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దంపతుల అంత్యక్రియలు సోమవారం పలివెల గ్రామంలో ఒకేసారి నిర్వహించారు. ఒక్కరోజు వ్యవధిలో గుండెపోటుతో ఇరువురు మృతి -
మంత్రి పదవిపై మాటల యుద్ధం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి పదవి మంట రేపుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి జానారెడ్డి తీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్, చండూరులో బహిరంగంగానే విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో 15 రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దాదాపుగా ఖరారైందని, ఇక ప్రకటనే తరువాయి అన్న చర్చ జోరుగా సాగింది. అదే సమయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కేబినెట్లో చోటు కల్పించాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాయడంతో చిచ్చు మొదలైంది. రాజగోపాల్‌రెడ్డికి వచ్చే మంత్రి పదవిని అడ్డుకునేందుకు ఆయన లేఖ రాశారని రాజగోపాల్‌రెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోలోపల రగులుతూనే ఉన్నా ఆ మంట ఆదివారం బహిర్గతమైంది. జానాపై భగ్గుమన్న రాజగోపాల్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కొంతమంది దుర్మార్గులు అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 20 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి ధర్మరాజు మాదిరిగా పెద్దన్నలా వ్యవహరించకుండా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషించారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయం, సామాజిక కూర్పు అంటున్న జానారెడ్డికి ఇన్నేళ్ల తర్వాత ఆ అంశం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమ కుటుంబంలో ఇద్దరికీ పదవులు ఇస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తానికి జానారెడ్డి లేఖ కాంగ్రెస్‌లో కాకరేపగా.. ఆయనను రాజగోపాల్‌రెడ్డి ధృతరాష్ట్రుడితో పోల్చుతూ హాట్ కామెంట్ చేయడం పార్టీలో చిచ్చు రగిల్చింది. ఫ జానారెడ్డి తీరుపై భగ్గుమన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మండిపాటు ఫ వేరే జిల్లాలకు మంత్రి పదవులివ్వాలని లేఖ రాయడంపై అభ్యంతరం ఫ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నఅధిష్టానం నిర్ణయం ఏమిటో? ప్రస్తుత పరిస్థితులు అన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. జానారెడ్డి లేఖను పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇస్తుందా..? ముందుగా ఇచ్చిన హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మాట నిలుపుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే జిల్లా కాంగ్రెస్ పెద్దలు డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించారన్న చర్చ సాగుతోంది. తనకు మంత్రి పదవి కావాలని బాలునాయక్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ఇది జరగడం, ఆయన ఎప్పుడు బహిర్గతం అవుతారోనన్నది చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి రచ్చ ఎటు దారి తీస్తుందో? ఎప్పుడూ గుంభనంగా ఉండే జానారెడ్డి ఒక్కసారిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడం వెనుక ఆంతర్యమేమిటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని సూటిగా చెప్పలేక వేరే జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాశారన్న చర్చ జరుగుతోంది. ఆయన లేఖ తరువాతే కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి బహిరంగా విమర్శలు చేయడం ఎటు దారి తీస్తుందో చూడాలి. అంతేకాదు మరోవైపు రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రి అయ్యే అర్హత లేదా? అని ప్రశ్నించారు. తాను ఇన్నాళ్లూ ఆగానని, ఇకపై కచ్చితంగా మంత్రి పదవిని అడుగుతానని స్పష్టం చేశారు. అంతేకాదు ఖమ్మంలో 9 మంది గెలిస్తే మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండలో 11 మంది గెలిచినప్పుడు ఎందుకు మూడో మంత్రి పదవి ఇవ్వరని ప్రశ్నించారు. -
1,200 మందికి ఉద్యోగ అవకాశాలు
బీబీనగర్: బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి తరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బీబీనగర్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో 1,200మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. మేళాలో 63 కంపెనీలు పాల్గొనగా 250 మందికి వెంటనే ఉద్యోగాలు కల్పించి నియామక పత్రాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు మేళాను ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు పొట్ట నవీన్‌కుమార్, దాసమోని వెంకటేశ్, శ్యామ్, రవి, విశ్వనాథ్, శ్రీను, బాలు, వెంకట్, విజయ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండ బిడ్డకు ఉన్నత పదవి
నల్లగొండ : నల్లగొండ వాసికి మరో ఉన్నత పదవి లభించింది. హైకోర్ట్ జస్టిస్‌గా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్‌ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా ఏమాత్రం వివాదం లేకుండా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన షమీమ్ పట్టణంలోనే పాఠశాల, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నాగపూర్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్ఎం, ీపీహెచ్డీ చేశారు. నల్లగొండలో దాదాపు 16 సంవత్సరాల లాయర్‌గా ప్రాక్టీస్ చేసి సివిల్, క్రిమినల్, రెవెన్యూ కేసులను వాదించారు. 2002లో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణలోని వివిధ న్యాయ స్థానాల్లో సేవలందించారు. న్యాయపరమైన తీర్పులు, సామర్థత, చట్టంపై లోతైన అవగాహన తదితర కారణాలతో జస్టిస్ షమీమ్ అక్తర్‌కు 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర బడుగు, బలహీన వర్గాలు ప్రధానంగా కార్మికులు, మహిళలు, పేదల హక్కుల పరిరక్షణలో జస్టిస్ షమీమ్ అక్తర్ కీలక పాత్ర వహించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం (ఏడీఆర్) ద్వారానే సత్వర న్యాయం లభిస్తుందనే నమ్మకంతో అనేక కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించారు. రాజ్యాంగం అంశాలపై విశేష పట్టు ఉన్న జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పులు పలు కేసుల తుది నిర్ణయాలకు మార్గదర్శకంగా మారాయి. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినప్పటికీ అనేక న్యాయ సంబంధిత, రాజ్యాంగ పరమైన అంశాలపై తన ప్రసంగాల ద్వారా యువ న్యాయవాదులు, సహచర న్యాయమూర్తులకు మార్గదర్శకంగా నిలిచారు. ఆయనను తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ నియామకం -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చౌటుప్పల్ : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ పదవీ ప్రమాణస్వీకా రోత్సం ఆదివారంఅట్టహాసంగా జరిగింది.ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. నూతన చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లతో మార్కెట్ కార్యదర్శి రవీందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 20 శాతం నిధులు వ్యవసాయానికి కేటా యించి చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. చౌటుప్పల్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి నిధులు తీసుకువస్తానన్నారు. చౌటుప్పల్ ప్రాంతంలోని మూసీ కాలువల్లో కృష్ణా, గోదావరి జలాలను పారించడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించే బాధ్యత తనదేనన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం, వ్యవసాయం బాగుండాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.రాజకీయాల్లో రాజగోపాల్‌రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఆయనకు మంత్రి పదవి లభిస్తే చౌటుప్పల్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి నాయకత్వంలో చౌటుప్పల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. నూతన పాలకవర్గం రైతులకు చేరువై సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, తాడూరి వెంకట్‌రెడ్డి, చిక్కా నర్సింహ, గుత్తా ఉమాదేవి, నూతి రమేష్‌రాజు, అందెల లింగంయాదవ్, నారబోయిన రవి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మార్కెట్ సెక్రటరీ రవీందర్‌రెడ్డి, నాయకులు పబ్బు రాజుగౌడ్, పాశం సంజయ్‌బాబు, చెన్నగోని అంజయ్యగౌడ్, ఉప్పు భద్రయ్య, కొయ్యడ సైదులుగౌడ్, మొగుదాల రమేష్, సుర్వి నర్సింహ, బోయ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
‘చలో వరంగల్’ను విజయవంతం చేయాలి
యాదగిరిగుట్ట రూరల్ : వరంగల్‌లో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా రాసిన చలో వరంగల్ వాల్ రైటింగ్‌ను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో స్వయంగా చలో వరంగల్, జై కేసీఆర్ నినాదాలతో వాల్ రైటింగ రాశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సభలో కేసీఆర్ చెప్పే మాటల కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆమె వెంట ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు రేపాక స్వామి, కానుగు బొట్టు రాజు, సీస శేఖర్, యడపల్లి మహేష్, కానుగు అనిల్ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత -
యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలు, ప్రతిష్టా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణపుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. సాయంత్రం జోడు సేవను ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. తెలుగుభాష ఘనతను చాటిన ఉషారాణిమోత్కూరు : ఉగాదిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళనంలో మోత్కూరుకు చెందిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం కార్యదర్శి రేగోటి ఉషారాణి ప్రతిభ కనబరిచారు. చక్కటి కవిత రచించడమే కాకుండా గానం చేసి తెలుగు భాష ఘనతను చాటారు. ఇందుకు గాను ఆమెకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్.ఎన్.నర్సింహారెడ్డి, సైనిక దళం జనరల్ మేజర్ ఎన్.శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, మెమెంటో అందుకున్నారు. ప్రచారం చేసి.. ఆలోచింపజేసి చౌటుప్పల్ : మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ వినూత్న ప్రచారం చేస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. ఆదివారం చౌటుప్పల్‌లోని వారాంతపు సంతలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు – అనర్థాలపై ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా యువతకు సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూమపానం, మద్యపానంతో పోలిస్తే డ్రగ్స్ వందల రెట్లు ప్రమాదకరమైనవన్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడితే వారిచే మాన్పించడం చాలా కష్టమన్నారు. బానిసలుగా మారిన వ్యక్తులు నేరాలకు పాల్ప డుతారని పేర్కొన్నారు. తాము చంపుతున్నది ఎవరినో సైతం వారికి తెలియని పరిస్థితులు ఉంటాయన్నారు. డ్రగ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు. అల్లందేవిచెర్వు మాజీ సర్పంచ్‌కు పురస్కారం సంస్థాన్ నారాయణపురం: మండలంలోని అల్లందేవిచెర్వు మాజీ సర్పంచ్ సుర్వి యాదయ్య బిందేశ్వరి మండల అవార్డు అందుకున్నారు. యాదవ రాజ్యాధికార సాధన సమితి, బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవార్డు అందజేశారు. యాదయ్య సర్పంచ్ల పెండింగ్ బిల్లుల కోసం అనేక పోరాటాలు చేసినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యాదయ్య తెలిపారు. -
ఈదురు గాలులు, వడగండ్లు
అడ్డూగూడూరు : జిల్లాలో ఆదివారం సాయంత్రం పలు చోట్ల భారీ ఈదురుగాలు, వడగండ్ల వర్షం కురిసింది. అడ్డగూడూరు మండల కేంద్రంతో పాటు చౌల్లరామారం, కోటమర్తి, చిర్రగూడూరు, జానకిపురం గ్రామాల్లో అక్కడక్క చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వర్షపు నీటిలోనుంచి వడ్లను వేరు చేసేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈదురు గాలులకు తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. చౌల్ల రామారం గ్రామానికి చెందిన పురుగుల మల్లేష్ సాగు చేసిన మూడెకరాల వరి చేను వడగండ్ల వానకు దెబ్బతింది. ఏడు ఎకరాల్లో సాగు చేసి కుప్ప చేసి మొక్కజొన్నలు వర్షానికి తడిసి మద్దయ్యాయి. దీంతో రూ.5లక్షల వరకు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆలేరురూరల్ : మండల పరిధిలోని శ్రీనివాసపురం, పటేల్గుడెం, కొలనుపాకలో చెట్లు కూలాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆత్మకూరు(ఎం) : పల్లెపహాడ్‌లోని కొనుగోలు కేం ద్రంలో వడ్లు కొట్టుకుపోయాయి. కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోటకొండూర్: చామాపూర్లోని పాశం బాల్‌రెడ్డి ఇంటి ఎదుట కరెంట్ స్తంభం కూలిపోయింది. దీంతో పాటు పలు గ్రామాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోతకు వచ్చిన వరి చేల్లో ఈదురు గాలులు, వడగండ్లకు వడ్లు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం రాలిన మామిడి కాయలు, నేలకొరిగిన వరి చేలు కూలిన చెట్లు, స్తంభాలు, నిలిచిన కరెంట్ సరఫరాఉదయం ఎండ, సాయంత్రం వాన భువనగిరిటౌన్ : జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అ వుతుండగా, సాయంత్రం ఉన్నట్టుండి వాతా వరణం చల్లబడి వర్షం కురుస్తోంది. ఆదివా రం ఆలేరులో 10.8 మి.మీ, అడ్డగూడూరు 9 మి.మీ, మోటకొండూరు 3.3, బీబీనగర్ 1, రాజాపేట 0.8, యాదగిరిగుట్టలో 0.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత సగటున 40 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది. -
గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరిస్తా
యాదగిరిగుట్ట: గొర్రెల కాపరుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో నిర్వహించిన గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆవిర్భావ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గొల్ల కురుమ బిడ్డగా గొర్రెల కాపరుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాపరులు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలన్నారు. అంతకు ముందు బీసీ పితామహుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
నేడు రక్తదాన శిబిరం
భువనగిరిటౌన్ : మహానీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం భువనగిరిలోని బాగాయత్ హైస్కూల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అయ్యప్ప సేవకుడికి పురస్కారంభూదాన్పోచంపల్లి : మండలంలోని ఇంద్రియాలకు చెందిన అయ్యప్ప సేవకుడు సుర్వి బాలరాజుగౌడ్ గురుస్వామి పరశురాం పురస్కారం అందుకున్నారు. కేరళలోని మలయాళ భగవతి పీఠం, ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఆనంద్గోపన్, శబరిమలై పూర్వ మేల్ శాంతిశంకరన్ నంబూద్రి, బ్రహ్మశ్రీ శివ నరసింహన్ తాంత్రి, సుబ్రహ్మణ్యం నంబూద్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. అయ్యప్పస్వామి దీక్ష వ్యాప్తి, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా పురస్కారం దక్కినట్లు బాలరాజు తెలిపారు. 24న పాడి రైతుల సదస్సు భువనగిరిటౌన్ : ఆలేరులో ఈనెల 24న జరిగే పాల రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరిలోని సుందరయ్య భవన్లో మేక అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా అఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి ఉపాధి పొందుతున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ డెయిరీలు తక్కువ ధరకు పాలు సేకరిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నెలనెలా పాల బిల్లులు కూడా రావడం లేదన్నారు. సదస్సులో పాడి రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ జహంగీర్, మంగ నర్సింహులు, జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి
రాజాపేట : ప్రపంచ దేశాలు మనవైపే చూస్తున్నాయని, భారత్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర ఇంచార్జి అభయ్ పాటిల్ పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా శనివారం రాజాపేటలో నిర్వహించిన గావ్ చలో.. బస్తీ చలో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌరస్తా వరకు స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాయివాలాను ప్రధానమంత్రిని చేసిన ఏకై క పార్టీ బీజేపీయేనన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానిక కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మేకల రమేష్, పట్టణ ఇంచార్జి కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, అధ్యక్షుడు సాధనబోయిన శంకర్, నాయకులు దాచపల్లి శ్రీను, జెన్న సిద్దులు, మధు, గొట్టి పాముల సాయికృష్ణ, దిడ్డి సత్యనారాయణ, ఉపేందర్, శ్రీహరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ముంపు లేకుండా గంధమల్ల
1.41 టీఎంసీల సామర్థ ్యంతో రిజర్వాయర్ నిర్మాణం.. పాలనా ఆమోదం తెలిపిన ప్రభుత్వంసాక్షి, యాదాద్రి : ఆలేరు నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గంధమల్ల రిజర్వాయర్‌కు పరిపాలనా ఆమోదం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వ రం ప్రాజెక్టు ప్యాకేజీ –15లో భాగంగా ప్రతిపాదించిన ఈ రిజర్వాయర్‌ను.. ముంపు సమస్య లేకుండా, తక్కువ భూసేకరణతో నిర్మించనున్నారు. రిజర్వాయర్ సామర్థ్యం రెండు దఫాలు కుదింపుతుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. జలాశయాన్ని 9.86 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.800 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ రూపొందించింది. ఈ రిజర్వాయర్ ద్వారా ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 68 వేల ఎకరాలకు సాగు నీరందించాలన్నది లక్ష్యం. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. బెకమ్, నవయుగ, ప్రసాద్ సంస్థలు కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. అయితే రిజ ర్వాయర్ నిర్మాణంలో ఐదు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో వీరారెడ్డిపల్లి పూర్తిగా, గంధమల్ల, భీమరిగూడెం, ఇందిరానగర్ పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా 4,027 (అటవీ భూములు 230ఎకరాలు కలుపుకుని) ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇది అధికారులకు సవాల్‌గా మారింది. దీంతో పాటు ముంపు ప్రాంతాల గుండా 400 కేవీ హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఉండడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పవర్‌గ్రిడ్ అధికారులు ప్రభుత్వానికి వివరించారు. సాంకేతిక కమిటీ సూచన మేరకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు కుదించింది. అయినా మూడు గ్రామాలు ముంపునకు గురవుతుండడం, 2,094 ఎకరాల భూమి సేకరించాల్సి వస్తుంది. ముంపు గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం మరోసారి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గించింది. రూ.574.56 కోట్లు మంజూరు పాత కాంట్రాక్టు సంస్థలకే పనులు అప్పగింత భూసేకరణకు సిద్ధమవుతున్న రెవెన్యూ, నీటిపారుదల శాఖ ప్రాజెక్టు పూర్తయితే 68 వేల ఎకరాలకు సాగు నీరుమాట నిలుపుకున్నాం గంధమల్ల రిజర్వాయర్ నిర్మిస్తామని ఎన్నికల ప్రచా రంలో హామీ ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంది. వీలైనంత త్వరలో రిజర్వాయర్ పనులు పూర్తి చేసి గోదావరి జలాలతో ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. ముంపు బాధలేకుండా రిజర్వాయర్ పనులకు పరిపాలనామోదం తెలిపినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. –బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే 1.41 టీఎంసీలతో నిర్మాణం1.41 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకోసం రూ.574.56 కోట్లు మంజూరు చేసింది. రిజర్వాయర్ కోసం గంధమల్ల, వీరారెడ్డిపల్లి రెవెన్యూ పరిఽధిలో సుమారు వెయ్యి ఎకరాలు సేకరించాల్సి వుంది. ఇందులో రిజర్వు పారెస్ట్ నుంచి 239 ఎకరాలు తీసుకోనున్నారు. దీనికి బదులు వరంగల్ జిల్లాలో ప్రభుత్వం భూమిని అటవీశాఖకు కేటాయించింది. ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదం లభించడంతో భూసేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న బెకమ్, నవయుగ, ప్రసాద్ సంస్థలు సంయుక్తంగా రిజర్వాయర్ పనులు చేపట్టనున్నాయి. -
కుక్కలకు అందించే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి..
ఇళ్లలో పిల్లులు, కుక్కల్ని పెంచుకునేవారు.. వాటిని ఎంతో ఇష్టంగా చూసుకుంటారు. అయితే, వీటిని పెంచడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి ప్రత్యేక దుస్తులు, బెల్ట్‌లు, బెడ్లు, ఆహార పదార్థాలు అవసరం. ఇప్పుడు నల్లగొండ పట్టణంలో వాటికోసం ప్రత్యేక స్టోర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కుక్కలు, క్యాట్లకు కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు, బెల్ట్, బెడ్, షాంపులు లభిస్తాయి. అన్ని రకాల పప్పీస్ బ్రీడ్ విక్రయిస్తారు. అంతే కాకుండా ఇంటి వద్దకు వెళ్లి డాగ్‌కు కావాల్సిన సర్వీస్ చేస్తారు. కుక్కల యజమానులు ఔటింగ్‌కు వెళ్లినప్పుడు డే కేరింగ్ సౌకర్యం ఉంది. డాగ్స్‌కు గ్రూమింగ్, బాతింగ్ చేయిస్తారు. అంతే కాకుండా వాటికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రితో పాటు ప్రైవేట్ క్లినిక్‌లు ఉన్నాయి. పర్సనల్ డాక్టర్లు కూడా ఉన్నారు. కుక్క పిల్లలకు మొదటి 30 రోజుల వరకు మదర్ మిల్క్ తప్పనిసరి. ఒకవేళ మదర్ మిల్క్ సరిపోకపోతే 20 రోజులు దాటిన తర్వాత బాలెన్స్డ్ ఫుడ్ అందించాలి. 30 రోజుల వయస్సు తర్వాత హైప్రొటీన్తో కూడిన స్టాటర్ ఫుడ్ అందించాలి. 3 నుంచి 18 నెలల మధ్యలో లెస్ ప్రొటీన్ ఉన్నటువంటి పప్పి ఫుడ్ పెట్టాలి. 18 నెలల తర్వాత ఇచ్చే ఫుడ్‌ను అడల్ట్ ఫుడ్ అంటారు. ఇందులో పెడిగ్రీ ప్రో, రాయల్ కానైన్, వెట్ ప్రొ, డ్రూల్స్, ఎన్ అండ్ డీ ఇలా చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. మదర్‌తో కడుపులో ఉన్న పప్పీని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఇవ్వాలి. ఇందులో హై ప్రొటీన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ ఏ, ఈ, అమైనో యాసిడ్లు ఉంటాయి. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
భువనగిరి : 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ఈసారి ముందస్తుగానే పుస్తకాల సరఫరా ప్రారంభించింది. విడుతల వారీగా నెల రోజుల్లో పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు రానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని భువనగిరిలోని పాత గ్రంథాలయంలో భద్రపరుస్తున్నారు. 51,542 మంది విద్యార్థులుజిల్లాలో 730 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక 484, ప్రాథమికోన్నత 68, ఉన్నత, జిల్లా పరిషత్ 163, కస్తూరిబా 7, మోడల్ స్కూళ్లు, గురుకులాలు 11 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 51,542 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి 5 నుంచి 11 పుస్తకాలు అవసరం. రెండు విభాగాలుగా పుస్తకాల ముద్రణఇంగ్లిష్, తెలుగు భాషల్లో పుస్తకాల ముద్రణ ఉండటంతో రెండు విభాగాలుగా సరఫరా చేస్తున్నారు. జిల్లాకు 3,90,170 పుస్తకాలు, 110 టైటిల్స్ ఇండెంట్ పెట్టారు. ఇందులో మొదటి విడత ఎస్ఏ–1 పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు 2 లక్షలు రావాల్సి ఉంది. ఇందులో ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం పుస్తకాలు వస్తున్నాయి. వీటిని ఓ పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్‌లో ముద్రించారు. 3నుంచి 10వ తరగతి వరకు క్యూ ఆర్ కోడ్ ముద్రించారు. ప్రస్తుతం 27,960 పుస్తకాలు, 8 టైటిల్స్ జిల్లాకు చేరాయి.నెల రోజుల్లో పూర్తి స్థాయిలో వస్తాయి రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు రావడం ప్రారంభమైంది. ఈనెల 11వ తేదీ నాటికి 27,960 పుస్తకాలు, 8 టైటిల్స్ వచ్చాయి. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో పుస్తకాలు జిల్లాకు చేరుతాయి. వీటిని పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పంపిణీ చేస్తాం. – సత్యనారాయణ, డీఈఓ 3.90 లక్షల పుస్తకాలకు ఇండెంట్ జిల్లాకు చేరినవి 27,960 పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పంపిణీ -
హాషిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
భువనగిరి: రూ.80 లక్షలు విలువ చేసే మత్తు పదార్థమైన హాషిష్ ఆయిల్‌ను తరలిస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ, భువనగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషరేట్‌లో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాకు చెందిన పెట్ల శేఖర్ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని శ్రీవిద్యా కళాశాలలో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాడు. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల ద్వారా హైదరాబాద్‌లో గంజాయి సరఫరా చేసే దుర్గా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హషిష్ ఆయిల్ సరఫరా చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో శేఖర్ తన చిన్ననాటి స్నేహితుడైన అనిమినిరెడ్డి దుర్గారావును కలిసి హాషిష్ ఆయిల్ గురించి వివరించాడు. దీంతో దుర్గా నుంచి హాషిష్ ఆయిల్ సేకరించి ఇద్దరు తమకు తెలిసిన ప్రాంతాల్లో అవసరమైన వారికి విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం శేఖర్, దుర్గారావులు దుర్గా వద్ద సుమారు 4 కేజీల హాషిష్ ఆయిల్ కొనుగోలు చేశారు. భువనగిరి రైల్వేస్టేషన్లో దిగి మండలంలోని అనంతారం గ్రామానికి వెళ్లే సర్వీస్ రోడ్డు మార్గంలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో సమాచారం మేరకు ఎస్ఓటీ, భువనగిరి రూరల్ పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. వారి వద్ద 4 కేజీల హాషిష్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించారు. ఆయిల్‌తో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, దుర్గా పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. సమావేశంలో డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఎస్ఓటీ పోలీసులు, రూరల్ ఎస్హెచ్ఓ సంతోష్‌కుమార్ ఉన్నారు. రూ.80లక్షల విలువగల హాషిష్ ఆయిల్ స్వాధీనం -
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
ఆలేరురూరల్: తాటిచెట్టు పైనుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలేరు మండలంలో చోటు చేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. శారాజిపేట గ్రామానికి చెందిన దూడల ఆంజనేయులు(45) కుల వృత్తిలో భాగంగా ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలు జారి తాటి చెట్టు పైనుంచి కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులకు వృద్ధురాలు అప్పగింతనల్లగొండ: కర్ణాటక రాష్ట్రానికి చెందిన వృద్ధురాలిని కలెక్టర్ శుక్రవారం ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. వృద్ధురాలు నాగమ్మ తన ఇంట్లో సమస్యల కారణంగా మనస్థాపానికి గురై నల్లగొండకు వచ్చింది. సామాజిక కార్యకర్త శ్రీకాంత్ గత మూడు రోజుల క్రితం రైల్వే స్టేషన్లో వృద్ధురాలిని గుర్తించాడు. ఆమె వివరాలు అడిగి వయోవృద్ధుల శాఖకు సమాచారం ఇచ్చాడు. దీంతో వయోవృద్ధుల శాఖ అధికారి కృష్ణవేణి మెడికల్ కళాశాలలో చేర్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆమెకు ఇక్కడ ఆశ్రయం కల్పించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు శుక్రవారం నల్ల గొండకు రాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి, శ్రీకాంత్ సునీల్ పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతకోదాడరూరల్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న ఆటోను కోదాడరూరల్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్ఐ అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలేనికి చెందిన షేక్. సికిందర్ కోదాడ మండల బీక్యాతండాలో రేషన్‌కార్డుల దారుల నుంచి నాలుగు క్వింటాళ్ల పాత రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేశాడు. వాటిని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన భరత్ కుమార్‌కు విక్రయించేందుకు వెళ్తున్నాడు. కూచిపూడి వద్ద పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. ఈమేరకు సికిందర్‌పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు
రామన్నపేట: పెంచుకున్న రెండు పాడిగేదెలు, రెండు పాడి ఆవులు చనిపోయాయి. సాగుచేసిన వరిపొలం ఎండిపోయింది. పెరిగిన అప్పుల కారణంగా దంపతుల మధ్య వాగ్వాదం నెలకొంది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న భర్త మరుసటిరోజే గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక్కరోజు వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. హృదయ విదారకమైన సంఘటన రామన్నపేట మండలంలోని నిధానపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన బొబ్బల మల్లయ్య కుమార్తె కావ్య(25)కు రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామానికి చెందిన జినుకల ఆంజనేయులు(31)తో ఏడేళ్ల క్రితం జరిగింది. వారికి నిహాన్, విహాన్ అనే ఇద్దరు ఆరేళ్లలోపు కుమారులు ఉన్నారు. ఆంజనేయులు నిధానపల్లిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం వారికి చెందిన రెండు పాడిగేదెలు, రెండు పాడి ఆవులు చనిపోయాయి. దాంతో పాటు యాసంగిలో సాగుచేసిన వరిపొలం ఎండిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఈనెల 8న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదేరోజు భర్త ఆంజనేయులు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురైన కావ్య గురువారం తమ వ్యవసాయబావి వద్ద పశువుల కొట్టంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్త తెలుసుకున్న ఆంజనేయులు హైదరాబాద్ నుంచి రామన్నపేటకు బయలు దేరాడు. మార్గమధ్యంలో గడ్డిమందు కొనుగోలు చేశాడు. ఇంద్రపాలనగరం శివారులోని అయ్యప్పగుడి సమీపంలో దానిని సేవించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు ఫోన్‌చేసి తెలిపాడు. దీంతో వారు అక్కడకు వెళ్లి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లయ్య తెలిపారు. కాగా.. కావ్య, ఆంజనేయులు మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం గ్రామంలో ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. దంపతుల మధ్య గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న భార్య విషయం తెలుసుకుని గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డ భర్త తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు అనాథలైన చిన్నారులుతల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమారులు నిహాన్, విహాన్‌లు అనాథలయ్యారు. అంత్యక్రియల సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియక ధీనంగా చూస్తూ ఉండిపోయారు. చిన్నారుల చూసి బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. హృదయ విదారకమైన సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరు మృతి
మాడ్గులపల్లి: రోడ్డు వెంట నిలిపిన ట్రాక్టర్‌ను బైక్ వెనుక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం, గోప్యానాయక్‌తండా గ్రామానికి చెందిన ముడావత్ ిపీర్యా(36) చిట్యాల మండలం నుంచి పనినిమిత్తం తన ద్విచక్ర వాహనంపై హాలియా మండలం సూరేపల్లి గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారుకు చేరుకోగానే అదే గ్రామానికి చెందిన రేకా గోవింద్ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌ను నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచాడు. ఈక్రమంలో బైక్‌పై వస్తున్న పీర్యా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆస్తి కోసం ఘాతుకం
సవతి కూతురును హత్యచేసిన మహిళ శాలిగౌరారం: ఆస్తి కోసం సవతి కూతురును హత్య చేసి మృతదేహాన్ని మూసీనదిలో పూడ్చిపెట్టగా పోలీసులు హత్య కేసును ఛేదించి ఆ మహిళతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామం పడమటితండా(డి)కి చెందిన జాటోతు పీనానాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య శాంతి, రెండవ భార్య లలిత. మొదటి భార్యకు కొడుకు, కూతురు మహేశ్వరి(23) ఉండగా రెండవ భార్య లలితకు కుమార్తె(14) ఉన్నారు. మొదటి భార్య శాంతి అనారోగ్యం బారినపడడంతో 16 సంవత్సరాల క్రితం ఆమెకు పీనానాయక్ రూ.4 లక్షలు నగదు, పోషణ కోసం నెలకు రూ.4 వేలు ఇవ్వడంతో పాటు కుమార్తె మహేశ్వరిని తన వద్ద ఉంచుకొని చదివిపించి వివాహం చేసేవిధంగా పెద్దల సమక్షంలో ఒప్పదం చేసుకుని శాంతికి దూరంగా ఉంటున్నాడు. దీంతో శాంతి తన కుమారుడితో కలిసి దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలోని తన పుట్టినింటికి వచ్చి అక్కడే ఉంటోంది. శాంతి నుంచి విడిపోయిన సంవత్సరం తర్వాత పీనానాయక్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆయన తన కుమార్తె మహేశ్వరి, రెండవ భార్య లలితతో కలిసి ఉంటున్నాడు. ప్రస్తుతం లలితకు కుమార్తె(14) ఉంది. ప్రస్తుతం పీనానాయక్ రెండవ భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. పీనానాయక్‌కు స్వగ్రామంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమితో పాటూ హైదరాబాద్‌లోని బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో రెండు సొంత ఇళ్లు ఉన్నాయి. తండ్రి, పినతల్లి వద్ద ఉంటూ మహేశ్వరి(23) బీఎస్సీ నర్సింగ్ విద్య పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కాంట్రాక్టు పద్ధతిలో స్టాప్‌నర్స్‌గా పనిచేస్తుంది. మహేశ్వరికి వివాహం చేసేందుకు తండ్రి పీనానాయక్ పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్‌కు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న బంధువైన ఓ అబ్బాయికి మహేశ్వరిని ఇచ్చి వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో 2024 అక్టోబర్‌లో రూ.కోటి కట్నం ఇచ్చేవిధంగా ఒప్పందంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. మహేశ్వరికి కట్నం కింద బోడుప్పల్ లక్ష్మీనగర్‌లోని ఒక ఇల్లుతో పాటు బంగారం, కొంత నగదు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. డిసెంబర్ 7న ఇంట్లో హత్య చేసి... మహేశ్వరిని చంపాలనే పథకంలో భాగంగా 2024 డిసెంబర్ 7న ఇంట్లో పాయసంలో నిద్రమాత్రలు వేసి మహేశ్వరికి ఇచ్చారు. ఆ పాయసం తాగిన మహేశ్వరి స్పృహతప్పి పడిపోవడంతో లలిత, రవిలు కలిసి మహేశ్వరిని గొంతునులిమి చంపాశారు. అనంతరం మహేశ్వరి మృతదేహాన్ని గోనేసంచిలో మూటకట్టి మరో వ్యక్తి సహాయంతో అదేరోజు రాత్రి రవి కారులో మృతదేహాన్ని తీసుకువచ్చి నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తి వద్ద మూసీనదిలో బ్రిడ్జి పిల్లర్ నెంబర్ 1 సమీపంలో ఇసుకలో గుంతతీసి పూడ్చిపెట్టారు. రాత్రి ఇంటికి వచ్చిన పీనానాయక్.. కుమార్తె మహేశ్వరి ఇంటికి రాకపోవడంతో ఎటు పోయిందని భార్య లలితను అడగగా డ్యూటీకని చెప్పి ఇంట్లో ఫోన్వదిలి వెళ్లిపోయిందని, తాను ప్రేమించిన వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంటానని ఫోన్‌చేసి చెప్పిందని వివరించింది. దీంతో భార్య చెప్పిన విషయాన్ని నమ్మిన మహేశ్వరి తండ్రి పీనానాయక్ కుమార్తెకు వివాహ నిశ్చితార్ధం కావడంతో ప్రేమ విషయాన్ని బయటకు పొక్కుండా రహస్యంగా ఉంచి కుమార్తె కోసం వెతకడం ప్రారంభించాడు. మహేశ్వరిని వివాహం చేసుకునే అబ్బాయి మహేశ్వరి ఫోన్ ఎత్తడం లేదని, మెసేజ్‌లకు స్పదించడంలేదని మామ పీనానాయక్‌కు చెప్పడంతో అదోఇదో చెబుతూ నెట్టుకొస్తున్నాడు. ఈక్రమంలో ఆ అబ్బాయి ఒత్తిడి చేస్తుండటంతో వారం రోజుల క్రితం పీనానాయక్ తన కుమార్తె అదృశ్యంపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్ డేటా, లొకేషన్ ఆధారంగా పీనానాయక్ రెండవ భార్య లలితను, ఆమె ప్రియుడు రవిని విచారించారు. దీంతో మహేశ్వరి హత్య, మృతదేహం పూడ్చివేత విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మేడిపల్లి పోలీసులు, శాలిగౌరారం పోలీసుల సహాయంతో శుక్రవారం ఉదయం నేరస్తులను పట్టుకొచ్చి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించారు. ఇసుకలో పూడ్చిపెట్టిన మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి స్థానిక తహశీల్దార్ యాదగిరి సమక్షంలో పంచనామా జరిపి హైదరాబాద్‌కు చెందిన వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. మహేశ్వరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని మూసీనది ఇసుకలో పాతిపెట్టిన నిందితులు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు ఫోన్‌కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులుఆస్తి పోతుందనే కక్షతో... తనవద్ద ఉంటున్న సవతి కుమార్తె మహేశ్వరి పెళ్లికి కోటి రూపాయల కట్నం ఇస్తుండటం, కట్నం కింద ఇల్లు, బంగారం, నగదు ఇవ్వడం లలితకు నచ్చలేదు. దీంతో మహేశ్వరిపై లలిత కక్ష పెంచుకుంది. మహేశ్వరిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పీనానాయక్ పేరున బ్యాంకులో ఉన్న రూ.20 లక్షల నగదును భర్తపై ఒత్తిడి తెచ్చి తన ఖాతాలోకి మార్చుకుంది. ఇక ఇల్లు, బంగారం దక్కాలంటే మహేశ్వరిని భూమి మీదలేకుండా చేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో లలిత తన స్వగ్రామమైన వెలిశాలకు చెందిన తన మేనమామ కుమారుడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయిన రవితో వివాహేతర సంబంధం పెట్టకొని.. మహేశ్వరిని చంపితే ఆస్తి మొత్తం తనకు, తన కుమార్తెకే దక్కుతుందని, ఎలాగైనా మహేశ్వరిని చంపాలని రవితో కలిసి పథకం రచించింది. -
విద్యుదాఘాతంతో వరిగడ్డి దగ్ధం
హుజూర్‌నగర్‌రూరల్: విద్యుదాఘాతంతో వరిగడ్డి దగ్ధమైన ఘటన శుక్రవారం హుజూర్నగర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని వేలపసింగారం గ్రామానికి చెందిన రైతులు కర్నె వీరారెడ్డి, కలకండ జయరాజులకు చెందిన ట్రాక్టర్లలో తమ వ్యవసాయ పొలంలో ఉన్న వరిగడ్డిని శుక్రవారం ఉదయం గ్రామానికి తీసుకువస్తున్నారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఉన్న పశువుల ఆస్పత్రికి చెందిన విద్యుత్ వైరుకు గడ్డి ట్రాక్టర్ తగలడంతో వైరు తెగి వరిగడ్డిపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అంతేకాకుండా వెనుక వస్తున్న జయరాజు చెందిన ట్రాక్టర్లో ఉన్న గడ్డికి మంటలు అంటుకున్నాయి. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. వరిగడ్డి పూర్తిగా దగ్ధమైందని సుమారు రూ.15 వేలు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. -
చౌటుప్పల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖరారు
చౌటుప్పల్ : చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఖరారయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు శుక్రారం ఉత్తర్వులు జారీ చేశారు. గత మార్చి నెలలోనే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పంపించిన విధంగా కమిటీ ఏర్పాటు ప్రతిపాదనలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించారు. చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలోని 5గ్రామాలతోపాటు పోచంపల్లి మండలంలోని 10, నల్లగొండ జిల్లా చిట్యాల మండంలోని 10 పంచాయతీలు ఈ మార్కెట్ పరిధిలోకి రానున్నాయి. అందులో బాగంగా పాలకవర్గ ఏర్పాటులోనూ ఆయా మండలాల నుంచి పలువురికి ప్రాతినిథ్యం లభించింది. నూతన కమిటీలో చోటు దక్కింది వీరికే..మార్కెట్ కమిటీ పాలకవర్గం 18మంది సభ్యులతో ఖరారయ్యింది. చైర్మన్గాచౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లికి చెందిన ఉబ్బు వెంకటయ్య నియమితులయ్యా రు. వైస్ చైర్మన్‌గా లక్కారం గ్రామానికి చెందిన ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లుగా బోయ వెంకటేశం, కరంటోతు శంకర్, ఢిల్లీ చంద్రకళ, చప్పిడి సంజీవరెడ్డి, కాటేపల్లి నవీన్, ఎండి.గౌస్‌ఖాన్, చిమ్ముల వెంకట్‌రెడ్డి, పబ్బు శ్రీకాంత్, మర్రి రాజిరెడ్డి, సుర్వి వెంకటేష్, ట్రేడర్ల నుంచి దాచేపల్లి విజయ్, గజ్జెల కృష్ణమూర్తితోపాటు వెలిమినేడు పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, చౌటుప్పల్ మున్సిపల్ ప్రత్యేకాధికారి, చౌటుప్పల్ వ్యవసాయాధికారి సభ్యులుగా వ్యవహరించనున్నారు. చౌటుప్పల్ సింగిల్‌విండో చైర్మన్‌కు కమిటీలో చోటు దక్కలేదు. నూతన పాలకవర్గం ఈనెల 13న ప్రమాణస్వీకారం చేయనుంది. చైర్మన్‌గా ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్‌గా ఆకుల ఇంద్రసేనారెడ్డి వెలువడిన అధికారిక ప్రకటన 13న ప్రమాణ స్వీకారం -
రైతన్నలకు అకాల కష్టం
సాక్షి,యాదాద్రి: వరినాట్లు మొదలుకొని.. చేతికొచ్చిన ధాన్యం అమ్ముకునే దాకా అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. వీటికితోడు ఏటేటా అకాల వర్షాలు అన్నదాతలకు అంతులేని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వడ్లు వెల్లువలా తరలివస్తున్నా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ఈ క్రమంలో కేంద్రాల్లో పోసిన ధాన్యం అకాల వర్షాలకు తడుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు అకాల వర్షంఈనెల 3, 10 తేదీల్లో జిల్లాలో రెండుసార్లు అకాల వర్షం కురిసింది. 3న కురిసిన వర్షంతో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో 139 మంది రైతులకు చెందిన వరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. 160 ఎకరాల మామిడి, 60 ఎకరాల వరిపంట దెబ్బతిన్నట్లు అధికారులే లెక్కకట్టారు. కాగా 10వ తేదీన కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోగా, కోతకు సిద్ధంగా ఉన్న వరిపైర్లు నేలవాలాయి. కొన్నిచోట్ల ధాన్యం రాలింది. జిల్లాలోని నాన్ఆయకట్టులో వరికోతలు తుది దశకు చేరుకోగా, మూసీ ఆయకట్టులో వరికోతలు జోరందుకున్నాయి. ఇదీ..పరిస్థితి!ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లు వేగం పుంజుకోలేదు. దీనికితోడు మిల్ల ర్లకు ధాన్యం కేటాయించలేదు. కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయశాఖ అధికారులు తేమ శాతం కూడా చూసిందిలేదు. మిల్లులకు ధాన్యం తరలించే లారీల కేటాయింపు పూర్తి కాలేదు. కొనుగోలును ఎంట్రీ చేసే ట్యాబ్‌లు ఇంకా అందుబాటులోకి రాలేదు. అక్కడక్కడా అరకొరగా కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఽరైతుల ధాన్యం కొంత తడవగా, మరికొంత కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని అరబెట్టడం, కుప్పపోయడంతోనే సరిపోతుందని, కొనుగోలు చేయడం లేదని రైతులు అంటున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.ఇప్పటి వరకు ప్రారంభించినవి 92నిర్ణయించిన కొనుగోలు కేంద్రాలు 323 కొనుగోలు కేంద్రాలకు వెల్లువలా ధాన్యం ఖరారుకాని మిల్లుల ట్యాగ్ తేమ శాతం చూసేవారే కరువు నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు అకాల వర్షాలతో వడ్లు వర్షార్పణం కన్నీరుమున్నీరవుతున్న రైతాంగంకొనుగోలు చేసిన ధాన్యం 242 మెట్రిక్ టన్నులుఐదు క్వింటాళ్ల వడ్లు చెరువుపాలు ఇరవై రోజుల క్రితం 500 బస్తాల వడ్లను గుండాల బండమీద రాశిగా పోశా ను. రెండుసార్లు అకాల వర్షం కురిసింది. దీంతో వడ్లు తడవడమే కాకుండా సుమారు ఐదు క్వింటాళ్ల వడ్లు బండ కింద ఉన్న రామసముద్రం చెరువులోకి కొట్టుకుపోయాయి. రోజూ ఆరబెట్టి కుప్పపోస్తున్నా. రంగు మారితే కొంటారో లేదోనని భయంగా ఉంది. వెంటనే కొనుగోలు చేయాలి. – దేవనబోయిన మంజుల రైతు, గుండాలకొనుగోలు లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు -
వరంగల్ సభను విజయవంతం చేయాలి
భువనగిరి : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలన్నారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ కన్వీనర్ కొల్పుల అమరేందర్, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ పట్టణ, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిర ణ్‌కుమార్, జనగాం పాండు. రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జేడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, గోపాల్, సత్తిరెడ్డి,అబ్బగాని వెంకట్, భిక్షపతి, పాండు, వినోద్, జహంగీర్ పాల్గొన్నారు. -
ఇచ్చేదే కొంత.. దానికీ చింతే!
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా క్రమం తప్పకుండా చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబపోషణ భారంగా మారుతోంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్‌లు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. – నర్సింహ, పారిశుద్ధ్య కార్మికుడు, మహబూబ్‌పేట ప్రతినెలా తిప్పలే.. రెండు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు నెలల వేతనం బకాయి ఉండగా రెండు నెలల జీతం ఇచ్చారు. మరో రెండు నెలలు ఆపారు. ప్రతి నెలా ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. వేతనాల అందక ఆర్థికంగా అవస్థలు పడుతున్నాం. ఇంటి అవసరాలకు బాకీలు చేయాల్సి వస్తుంది. – బర్ల ఇస్తారి, పారిశుద్ధ్య కార్మికుడు, మాసాయిపేట వేతనం కోసం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల నిరీక్షణ యాదగిరిగుట్టరూరల్ : గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా 5వ తేదీ లోపే వేతనాలు చెల్లించాల్సి ఉండగా ఆలస్యమవుతోంది. 14 నెలలుగా ఏ సమయంలో వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 428 గ్రామ పంచాయతీల్లో 1,860 మంది పారిశుద్ధ్య కార్మికులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.9,500 చొప్పున గ్రామ పంచాయతీలు వేతనం చెల్లిస్తున్నాయి. పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తరువాత వీరికి వేతన కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన స్పెషల్ గ్రాంట్స్, ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దీంతో నిధుల కొరత ఏర్పడి ప్రత్యేక అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఎంతోకొంత ఆస్తిపన్ను వసూలైనప్పటికీ పంచాయతీల నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయి. నెలనెలా ఎదురుచూపులే.. వీధులను శుభ్రం చేయడం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ తదితర సేవల్లో రోజూ పారిశుద్ధ్య కార్మికులు నిమగ్నమవుతుంటారు. వీరికి ప్రతినెలా వేతన వెతలు తప్పడం లేదు. ప్రస్తుతం రెండు నెలలకు (ఫిబ్రవరి, మార్చి) సంబంధించిన వేతనాలు రావాల్సి ఉంది.అధికారులు చొరవ చూపి క్రమం తప్పకుండా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. నెలవారీ అవసరాలకు అవస్థలు పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి ముందు నెల కాగానే ఠంచన్‌గా వచ్చిన వేతనాలు ఆ తరువాత జాప్యం జరుగుతుండడంతో పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉన్న వారికి అద్దె చెల్లింపు, కిరాణ షాపుల్లో బకాయిలు, రుణాలు, చిట్టీలు ఉన్న వారికి కిస్తులు చెల్లించడం కష్టతరంగా మారింది. ఫ రెండు నెలలుగా పెండింగ్ ఫ పంచాయతీల్లో నిధుల లేమి ఫ చేతులెత్తేస్తున్న ప్రత్యేక అధికారులు -
బాధితులకు న్యాయం చేస్తాం
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని జంగంపల్లి గ్రామంలో పహాణీల్లో పేర్లు మార్పుల వల్ల భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి గ్రామంలో పహాణీల్లో పేర్లు మార్చి భూములను తొలగించిన కారోబార్‌పై గత నెల 22న సాక్షి దినపత్రికలో ప్రచురించిన కబ్జాల కారోబార్ కథనానికి యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ కృష్ణారెడ్డి శుక్రవారం గుట్ట తహసీల్దార్ కార్యాలయంలో విచారణ కమిటీలోని సభ్యులైన ఆర్ఐలు విజయసింహారెడ్డి, శ్రీకాంత్, సర్వేయర్లతో సమావేశమై మాట్లాడారు. పహాణీలో మార్పుల జరిగిన భూముల వివరాలు క్షేత్ర స్ధాయిలో విచారణ చేయాలన్నారు. కాలువల పేరుతో భూములను తొలగించి, వాటిల్లో కాలువ పోకుండా ఉన్న భూములను పరిశీలించాలన్నారు. నిబంధలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు కూడా ఉంటాయన్నారు. రైతులు అధైర్యపడవద్దని, అసైన్డ్ భూములు ఎవరు అమ్మినా కొన్నా కఠిన చర్యలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ సత్యనారాయణ, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ రాము త దితరులు ఉన్నారు. భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ‘కబ్జాల కారోబార్’ వ్యవహారంపై విచారణ చేయాలని ఆదేశం