-
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
అదానీని ఇవాళే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్ట్‌లను చేస్తున్నారు.. కానీ, గౌతమ్ అదానీని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదానీ.. భారత చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లఘించారనని నిరూపించబడిందని చెప్పుకొచ్చారు. అదానీని వంద శాతం ప్రధాని మోదీనే కాపాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం ఆరోపణ కేసులో గౌతమ్ అదానీ, ఇతరులపై అభియోగాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. అమెరికాలో ఇది స్పష్టంగా నిరూపించబడింది. అయినప్పటికీ అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్చగా తిరుగుతున్నారు. చట్టాలు ఆయనకు వర్తించవా?. అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం. #WATCH | Delhi: When asked if he would raise the issue of US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, in Parliament, Lok Sabha LoP Rahul Gandhi says, "We are raising this issue. It is my responsibility as LoP, to raise this… pic.twitter.com/UenrnN2dej— ANI (@ANI) November 21, 2024ఇదే సమయంలో అదానీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మేము పార్లమెంట్ సాక్షిగా ఎన్నో సార్లు చెప్పాము. కానీ, అదానీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం మాత్రం ముందుకు రాదు. ఎందుకంటే ప్రధాని మోదీనే అదానీని వంద శాతం కాపాడుతున్నారు. మోదీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారు. అదానీ అక్రమాలపై విచారణ జరిపేందుకు జేపీసీ ఏర్పాటు చేయాలన్నది ముందు నుంచి మా డిమాండ్. ఇప్పుడు కూడా ఇదే కోరుతున్నాం. అదానీ రూ.2000 కోట్ల స్కాం చేసినా స్వేచ్చగా బయటే తిరుగుతున్నారు. ఇక, రాహుల్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యాలయంలో పవర్ కట్ కావడంతో అదానీ పవర్, మోదీ పవర్ ఏది పనిచేస్తుందో అర్థం కాలేదు అంటూ సెటైర్లు వేశారు. కచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తుతాం. ప్రజలకు అన్ని వివరాలను వెల్లడిస్తాం. ఏ రాష్ట్రంలో అదానీ అవినీతికి పాల్పడినా కచ్చితంగా విచారణ జరపాలి. ఈ వ్యవహారంలో అదానీకి తోడుగా ఉన్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ, అదానీని అరెస్ట్ చేయరు.. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి.. కాబట్టి ఆయనపై విచారణ కూడా ఉండదు. అదానీ దేశాన్ని హైజాక్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి సెబీ చీఫ్ మదహబి పురి బుచ్‌ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. #WATCH | Delhi: On US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, Lok Sabha LoP Rahul Gandhi says, "JPC is important, it should be done but now the question is why is Adani not in jail?...American agency has said that he has… pic.twitter.com/rAzVUoquqN— ANI (@ANI) November 21, 2024 -
శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని
పరమేశ్వరుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఉజ్జయిని. ఇక్కడ ఉన్నది మహాకాళేశ్వరుడు. మహాకాలుడు అంటే చాలా నల్లనివాడు అని ఒక అర్థం. అలాగే మృత్యువుకే మృత్యువు, కాలానికే కాలం.. అంటే కాలాన్నే శాసించేవాడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విశిష్టత ఏమిటంటే.. తెల్లవారుఝామున జరిగే అభిషేకం. అది భస్మాభిషేకం. ఆ భస్మం చితాభస్మం. అంటే మహాకాలేశ్వరుడి రూపంలో ఉన్న శివుడికి అప్పుడే కాలిన శవభస్మంతో చేసే అభిషేకం అత్యంత ప్రీతిపాత్రం. దీనికే భస్మహారతి అని పేరు. తెల్లవారుఝామున 3.30 గంటలకు మాత్రమే జరిగే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు పురుషులు మాత్రమే అర్హులు. అదీ ప్రత్యేక వస్త్రధారణతో మాత్రమే. సాధారణంగా జాతకంలో అపమృత్యు దోషాలు ఉన్నవారు, దీర్ఘరోగాలతో బాధపడేవారు, అంతుచిక్కని సమస్యలతో మానసిక వేదన పడుతున్నవారు ఈ భస్మహారతిలో పాల్గొని, ఉపశమనం పొందుతుంటారు.నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిని పూర్వం అవంతీ నగరమనేవారు. సప్తమహానగరాలలో అవంతీనగరం కూడా ఒకటి. ఈ ఉజ్జయిని నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మూలంగా ఎంత ప్రసిద్ధి పొందిందో, మహాకాళికాదేవి వల్ల కూడా అంత ప్రసిద్ధి పొందింది కాబట్టి ఉజ్జయినీ నగరానికి వెళితే ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని, అటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళిని కూడా సందర్శించి నేత్రపర్వాన్ని పొందవచ్చు.స్థలపురాణంఉజ్జయినీ నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నలుగురు కొడుకులూ తండ్రికి తగ్గ పుత్రులు. ఆ నగరానికి సమీపంలోని పర్వతం మీద దూషణుడనే రాక్షసుడుండేవాడు. వాడు ఋషి పుంగవుల జపతపాలకు, వైదిక ధర్మానుష్టానానికి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు. దూషణుడు ఉజ్జయినీ పురప్రజలను కూడా అలాగే భయభ్రాంతులకు గురిచేయసాగాడు. అయితే వేదప్రియుడు మాత్రం ఇవేమీ పట్టకుండా ఒక పార్థివ లింగాన్ని తయారు చేసుకుని, శివదీక్షలో తదేక ధ్యానంలో గడపసాగాడు.దూషణుడు ఒకనాడు వేదప్రియుణ్ణి సంహరించేందుకు ప్రయత్నించగా ఆ లింగం నుంచి మహాశివుడు మహాకాళేశ్వరుడిగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని భస్మం చేశాడు. వేదప్రియుడి భక్తితత్పరతలకు సంతోషించిన మహేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అసహాయులైన, దీనులైన తనవంటి భక్తులను అకాల మృత్యుభయం నుంచి కాపాడేందుకు ఇక్కడే ఉండవలసిందిగా నీలకంఠుడిని వేడుకున్నాడు వేదప్రియుడు. ఆ కోరికను మన్నించిన స్వామి ఆనాటి నుంచి మహాకాళేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగస్వరూపుడిగా ఉజ్జయినీ క్షేత్రంలో కొలువుదీరాడు.మరో గాథఉజ్జయినీ రాజ్యాధిపతి చంద్రసేనుడు ఒకరోజు శివపూజ చేస్తుండగా శ్రీకరుడనే గోపాలుడు అక్కడికి వచ్చాడు. చంద్రసేనుడి శివార్చనా విధానాన్ని గమనించి తానూ అలాగే స్వామికి పూజ చేయాలని భావించిన శ్రీకరుడు, దారిలో ఒక రాతిముక్కను తీసుకుని దాన్నే శివలింగంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజించసాగాడు. ఆ బాలుడు పూజలో నిమగ్నమై ఒక్కోసారి బాహ్యస్మృతిని కూడా కోల్పోయేవాడు. తల్లి ఎంత పిలిచినా పలికేవాడు కాదు. ఒకరోజు పూజలో లీనమై బాహ్యస్మృతి మరిచిన శ్రీకరుని దగ్గర నుంచి అతను శివలింగంగా భావిస్తున్న రాతిముక్కను అతని తల్లి తీసిపారేసింది. స్మృతిలోకి వచ్చిన బాలుడు తల్లి చేసిన పనికి చింతస్తూ శివుణ్టి వేడుకుంటూ ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు అతన్ని కరుణించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు.భస్మాభిషేకంఉజ్జయినీ మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకానంతరం చితాభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడి విశిష్టత. చితాభస్మం సాధారణంగా అమంగళకరమైనా, స్వామిని తాకడం వల్ల అతి మంగళప్రదమైనదిగా మారుతోంది. భస్మ హారతితోబాటు మరోవిధమైన అర్చన కూడా కాలేశ్వరుడికి జరుగుతుంది. ఇది భస్మాభిషేకం. ఆవుపేడను కాల్చి బూడిద చేసి, మూటగట్టి, దానిని శివలింగం పై భాగాన వేలాడదీసి, అటువంటి మరో మూటతో మెల్లగా కొడుతుంటారు.అప్పుడు భస్మం మహాకాలుడి మీదనేగాక, మొత్తం ఆలయమంతా పరుచుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో నాగసాధువులు రుద్రనమకం చెబుతూ ఢమరుకం, మృదంగం, భేరీలు మోగిస్తూ, శంఖనాదాలు చేస్తారు. ఆ సమయంలో ఆలయంలో ఉన్నవారికి సాక్షాత్తూ కైలాసంలోనే ఉన్నామేమో అనుకునేంతటి అలౌకికానుభూతి కలుగుతుంది.ఇతర విశేషాలుమహాకాళేశ్వరాలయం నేటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షి్ర΄ా(శి్ర΄ా)నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు, 28 సాధారణ తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండాలు ఉన్నాయి. ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్థులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాలేశ్వర లింగం. ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది. మహాకాలేశ్వరుడి విగ్రహం పైన ఓంకారేశ్వర లింగం ఉంటుంది. ఆ పైన ఉండేది నాగచంద్రేశ్వర లింగం. ఆలయంలో గణపతి, ΄ార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పుగోడలపై ఉంటాయి. దక్షిణభాగంలో మహాదేవుని వాహనమైన నంది విగ్రహం ఉంటుంది. మహాకాలేశ్వరలింగం స్వయంభూలింగం. ఇది అత్యంత ్ర΄ాచీనమైనది. సృష్టి ్ర΄ారంభంలో బ్రహ్మ శివుడిని ఇక్కడ మహాకాలునిగా కొలువు తీరి ఉండమని ్ర΄ార్థించాడట. బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి ప్రత్యేక శోభను ఇస్తున్నాడని పురాణగాథలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ఉన్న ఉజ్జయిని మహాకాలుడి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండదీ΄ాలని పిలుస్తారు.కాలభైరవాలయంఉజ్జయిని వెళ్లినవారు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవుని సందర్శించుకుని, అటు పిమ్మట మహాకాళికా లేదా మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం ఆచారం. కాగా కాలభైరవుడి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేయడం, మామూలుగా గుడికి కొబ్బరికాయ తీసుకు వెళ్లినట్లుగా కాలభైరవుడి ఆలయానికి వెళ్లే భక్తులు మద్యం, కల్లు సీసాలను తీసుకువెళ్లి సమర్పించడం ఆచారం. కాలభైరవార్చన విశిష్ట ఫలప్రదమైనదిగా పేరు పొందింది.ఎలా వెళ్లాలంటే..? హైదరాబాద్‌నుంచి ఉజ్జయినికి నేరుగా రైళ్లున్నాయి. లేదంటే పూణే వెళ్తే అక్కడినుంచి కూడా ఉజ్జయినికి రైళ్లుంటాయి. హైదరాబాద్‌నుంచి జైపూర్ఎక్స్ప్రెస్ ట్రెయిన్ ఎక్కితే సుమారు 19 గంటల్లో ఉజ్జయినిలో దిగవచ్చు. చవకగా, తొందరగా వెళ్లగలిగే మార్గాలలో అది ఒకటి. ఇంకా యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా వెళ్లవచ్చు. విమానంలో అయితే హైదరాబాద్‌నుంచి పూణే లేదా ఇండోర్ వెళ్తే అక్కడినుంచి ఉజ్జయినికి రైలు లేదా బస్సులో వెళ్లవచ్చు.– డి. పూర్ణిమాభాస్కర్ (చదవండి: దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!) -
జమ్ముకశ్మీర్‌లో సున్నా డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.శ్రీనగర్‌లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత -0.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నవంబర్ 23 వరకు కశ్మీర్లో వాతావరణం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 24న వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, లోయలోని ఎత్తయిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది. కాశ్మీర్‌లోని ఖాజిగుండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత -2.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, పహల్గామ్లో -3.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. షోపియాన్‌లో-3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.గుల్మార్గ్లో ఉష్ణోగ్రత 0.0 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో -0.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. కోకర్నాగ్లో కనిష్ట ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. బందిపొరలో -2.4 డిగ్రీల సెల్సియస్, బారాముల్లా -0.4 డిగ్రీల సెల్సియస్, బుద్గామ్ -2.1 డిగ్రీల సెల్సియస్, కుల్గామ్ -2.6 డిగ్రీల సెల్సియస్, లార్నులో -3.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
హైదరాబాద్ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం
భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్ మంథన్’ పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ ‘జానపద జాతర’లో తమ కళలను ప్రదర్శిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అగ్ర నేత మోహన్ భాగవత్‌తో పాటూ అనేకమంది కేంద్రమంత్రులూ వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. ‘జాతీయ గిరిజన గౌరవ దివస్’ పేరుతో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. ఈ జాతరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు.ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే ‘కేచక్’ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కు హాజరవుతున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహణ విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారు. చదవండి: మణిపుర్ ఘర్షణలకు ముగింపెప్పుడు?ఈ సందర్భంగా జరిగే ఎగ్జిబిషన్లో తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళలు, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ గ్రామీణ క్రీడలు, సాహిత్యం, ఇతర సాంస్కృతిక అంశాలౖపై చర్చలు ఉంటాయి. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా... వారి అందరి సాంస్కృతిక పునాదులు జానపదంలోనే ఉన్నాయి. మన మూలాలను ఒకసారి అందరికీ చాటిచెప్పే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు అందరూ ఆహ్వానితులే. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది.– పగుడాకుల బాలస్వామి; ప్రచార ప్రసార ప్రముఖ్, వీహెచ్‌పీ, తెలంగాణ రాష్ట్రం(నేటి నుంచి ‘లోక్ మంథన్’ ప్రారంభం) -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియా ఆటగాళ్ల ముందున్న భారీ రికార్డులు ఇవే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.మూడో స్థానానికి చేరనున్న విరాట్ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సిరీస్‌లో విరాట్ మరో 350 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకతాడు. ప్రస్తుతం సచిన్, సంగక్కర, పాంటింగ్ విరాట్ కంటే ముందున్నారు. ఈ సిరీస్‌లో విరాట్ 350 పరుగులు చేస్తే పాంటింగ్ అధిగమించి మూడో స్థానాన్ని ఆక్రమిస్తాడు.బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే..!బీజీటీలో బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత్ పేసర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం భారత్ తరఫున కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ 200 వికెట్ల క్లబ్లో ఉన్నారు.బుమ్రా ఈ సిరీస్‌లో 27 వికెట్లు తీస్తే వేగంగా 200 వికెట్ల మైలురాయిని తాకిన భారత పేసర్‌గానూ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 50 టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీయగా.. బుమ్రా ప్రస్తుతం 40 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు.కోచ్ రికార్డునే గురి పెట్టిన జైస్వాల్టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుకే గురి పెట్టాడు. బీజీటీలో జైస్వాల్ మరో 15 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు గంభీర్ (1134 పరుగులు) పేరిట ఉంది.బీజీటీలో యశస్వి మరో 444 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 2010లో 1562 పరుగులు చేశాడు. -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల సినీస్టార్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తోంది. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. హీరోల్లో తొలిస్థానంలో రెబల్ స్టార్ నిలవగా.. నటీమణుల్లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్-10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్స్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్దాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్‌లో నిలిచారు.Ormax Stars India Loves: Most popular female film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/aa6SKu5kZB— Ormax Media (@OrmaxMedia) November 21, 2024Ormax Stars India Loves: Most popular male film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/t1qOxTGkKo— Ormax Media (@OrmaxMedia) November 21, 2024 -
రేవంత్.. మూసీలో అదానీ వాటా ఎంత?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికే అవమానం అంటూ కామెంట్స్ చేశారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయటకు తీయాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు. అదానీతో కాంగ్రెస్-బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం.. అరిష్టం. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో!ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు!తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి!మీరు అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి!తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత?మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత? అంటూ ప్రశ్నించారు. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు..భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు..అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ లో అదానీ వాటా ఎంతో!ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా..… https://t.co/CxL4jEGNIk— KTR (@KTRBRS) November 21, 2024 -
విరాట్, రోహిత్ వేరు.. నా స్టైల్ వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలుపుతానని పేర్కొన్నాడు. పేసర్లు కెప్టెన్సీలో అత్యుత్తమంగా రాణిస్తారన్న బుమ్రా.. అందుకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ నిదర్శనమని కొనియాడాడు.ఆ పరాభవాన్ని మోసుకురాలేదుఇక న్యూజిలాండ్ చేతిలో పరాభవాన్ని తాము ఆస్ట్రేలియాకు మోసుకురాలేదని.. ఇక్కడ గెలుపే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతామని బుమ్రా పేర్కొన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్ వేదికగా ఈ సిరీస్ మొదలుకానుంది.అయితే, వ్యక్తిగత కారణాల వల్ల టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరంగా ఉండగా.. ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన బుమ్రా కెప్టెన్సీ, మొదటి టెస్టులో తొలి టెస్టు కూర్పు తదితర అంశాల గురించి తన మనసులోని భావాలు వెల్లడించాడు.విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు‘‘కెప్టెన్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. విరాట్, రోహిత్.. భిన్నమైన కెప్టెన్లు. నాకు కూడా నాదైన ప్రత్యేక శైలి ఉంది. నా స్టైల్లో జట్టును ముందుకు నడిపిస్తా. దీనిని నేను భారంగా భావించను. బాధ్యతలు తీసుకోవడం నాకెంతో ఇష్టమైన పని.ఇంతకు ముందు రోహిత్‌తో కూడా మాట్లాడాను. ఇక్కడ ఎలా జట్టును ముందుకు నడిపించాలో నాకు కాస్త స్పష్టత వచ్చింది. పేసర్లను కెప్టెన్లు చేయాలని నేను తరచూ చెబుతూ ఉంటాను. వ్యూహాత్మకంగా వాళ్లెంతో బెటర్. ప్యాట్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందిగతంలో కపిల్ దేవ్‌తో పాటు చాలా మంది పేసర్లు సూపర్‌గా కెప్టెన్సీ చేశారు. ఇదొక కొత్త సంప్రదాయానికి తెరతీస్తుందని నేను భావిస్తున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ కావడం ప్రస్తావనకు రాగా.. ‘‘మనం గెలిచినపుడు సున్నా నుంచి మొదలుపెడతాం. మరి ఓడినపుడు కూడా అలాగే చేయాలి కదా!న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. అయితే, అక్కడికీ.. ఇక్కడికీ పిచ్ పరిస్థితులు వేరు. ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తుదిజట్టు ఖరారైంది.. కానీఇక ఇప్పటికే తాము తొలి టెస్టుకు తుదిజట్టును ఖరారు చేశామని.. శుక్రవారం ఉదయమే ఈ విషయం గురించి అందరికీ తెలుస్తుందంటూ బుమ్రా అభిమానులను ఊరించాడు.చదవండి: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, పూర్తి వివరాలు -
ఒకేరోజు అదానీ షేర్ల నష్టం రూ.2.6 లక్షల కోట్లు!
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. దాంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లు ప్రారంభం అయిన సమయం నుంచి కేవలం అదానీ గ్రూప్ లిస్ట్‌డ్ కంపెనీల నుంచే దాదాపు రూ.2.6 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ప్రతిషేరు సుమారు 20 శాతం నష్టాల్లో కదలాడుతున్నాయి. దాంతో అదానీ గ్రూప్ సంస్థల సంపద రూ.12.3 లక్షల కోట్లకు చేరినట్లు తెలిసింది.ఏయే కంపెనీలు ఎంతే నష్టపోయాయంటే..అదానీ ఎంటర్ప్రైజెస్: 20 శాతంఅదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్: 20 శాతంఅదానీ గ్రీన్ ఎనర్జీ: 18 శాతంఅదానీ పవర్: 14 శాతంఅదానీ టోటల్ గ్యాస్: 14 శాతంఅంబుజా సిమెంట్స్: 18 శాతంఏసీసీ: 15 శాతంఅదానీ విల్మార్: 10 శాతంఎన్డీటీవీ: 14 శాతంసంఘీ ఇండస్ట్రీస్: 6 శాతంఅసలు కేసేంటి?20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల(రూ.16,890 కోట్లు) లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఇవ్వచూపినట్లు అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ సోలార్ ప్రాజెక్ట్‌ల్లో అమెరికా ఇన్వెస్టరల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం ఎఫ్‌బీఐ ద్వారా దర్యాప్తు చేస్తోంది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. దాంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురిని ఇందులో నిందితులుగా చేర్చారు.డాలర్ డినామినేటెడ్ బాండ్లపై అదానీ ప్రకటనఅమెరికా కేసు అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్‌లో ముందుకువెళ్లకూడదని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువారం ఎక్స్ఛేంజీలకు ప్రకటన విడుదల చేసింది. ‘అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్, యూఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజీ కమిషన్(ఎస్ఈసీ)లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా బోర్డు సభ్యులపై నేరాభియోగాలు చేశాయి. కాబట్టి ప్రతిపాదిత డాలర్ డినామినేషన్ బాండ్ల విషయంలో ముందుకువెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది. ఈ ఆఫర్ విలువ సుమారు రూ.3,960 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు‘అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే సహించబోం’ఈ వ్యవహారంపై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ స్పందించారు. అదానీ సోలార్ ప్రాజెక్ట్‌ల కాంట్రాక్ట్‌ల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని చెప్పారు. ఈ అంశంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ కేసును ఎఫ్‌బీఐ న్యూయార్క్ కార్పొరేట్, సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్స్ దర్యాప్తు చేస్తున్నాయి.