Narayanpet
-
మిగిలింది 43 రోజులే..
జిల్లాలో ఇప్పటి వరకు 76 శాతం పన్ను వసూళ్లు మద్దూర్‌లో అత్యల్పం.. ధన్వాడ అత్యధికం జిల్లాలోని 11 మండలాల్లో మద్దూర్ మండలంలో అత్యల్పంగా పన్ను వసూలైంది. ఈ మండలంలో మొత్తం 49 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రూ.45,76,444 పన్ను వసూలు కావాల్సి ఉండగా రూ.23,30,287 (51శాతం) మాత్రమే వసూలయ్యాయి. ఇక మాగనూర్ మండలంలో 64 శాతం, కోస్గి మండలంలో 66 శాతం, అత్యధికంగా ధన్వాడ మండలంలో 98 శాతం వసూలయ్యాయి. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను, సంతలు, లైసెన్సులు, బంజరుదొడ్డి తదితర వాటిపై ఏటా ప్రణాళిక ప్రకారం వంద శాతం పన్ను వసూలు చేయాల్సి ఉంది. వచ్చిన నగదును కార్యాలయంలో జమ చేసి గ్రామ పంచాయతీ అవసరాలు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, గ్రామ సభల ఏర్పాటుకు ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం మరో 43 రోజుల్లో ముగింపు దశకు చేరుకుంటున్నా పన్ను వసూళ్లపై శ్రద్ద పెట్టడం లేదని అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. దీనికితోడు సమగ్ర కుటుంబ సర్వే, ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. ఇలా వస్తుండడంలు పన్నుల వసూళ్లు నెమ్మదించినట్లు పంచాయతీ సిబ్బంది వాపోతున్నారు. నారాయణపేట: జిల్లాలోని 280 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యం చేరుకునేందుకు మరో 43 రోజులే గడువు మిగిలిఉంది. ఇప్పటి వరకు రూ.2.77 కోట్లు (76 శాతం) వసూలయ్యాయి. ఈ ఏడాది రూ.3.63 కోట్ల ఇంటి వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకొంది. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాల అర్హులను ఎంపిక చేసేందుకు వరుస సర్వేలు నిర్వహించగా.. ఈ పనుల్లోనే పంచాయతీ కార్యదర్శులు నిమగ్నమయ్యారు. ఇంటి పన్ను, ఇతర పన్నుల వసూళ్లపై అంతగా దృష్టి సారించలేదు. దీంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మరిన్ని అడ్డంకులు ఏర్పడతాయా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ప్రత్యేక దృష్టి సారిస్తేనే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తూ గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. వచ్చిన నిధులతో పాటు గ్రామ పంచాయతీకి సంబందించిన పన్నులు వసూలు చేస్తూ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూలు 280 జీపీల్లో 1,31,790 ఆస్తులకుగాను రూ.3,63,59,373 వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 2.77 కోట్లు వసూలు చేశారు. మిగిలిన ఈ కొద్ది రోజుల్లోనే లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసం ఎంతైనా ఉంది. ●లక్ష్యం చేరుకుంటాం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యం మేరకు వంద శాతం పన్ను వసూ లు చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇప్పటి వరకు 76 శాతం పన్ను వసూలు చేశాం. ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – కృష్ణ, డీపీఓ, నారాయణపేట జిల్లా వివరాలిలా.. వసూలు కావాల్సింది రూ.3.63 కోట్లు గ్రామ పంచాయతీల్లో వంద శాతం లక్ష్యం చేరేలా కార్యాచరణ వరుస సర్వేలతో కార్యదర్శులకు తప్పని తిప్పలు స్థానిక సంస్థల ఎన్నికలోస్తే వసూళ్లు అంతంతే -
రేపు కేటీఆర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
కోస్గి రూరల్/కొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలను అమలుపర్చడంలో పూర్తిగా విఫలమైందని.. రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతుల తరపున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్ష చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కోస్గి, కొత్తపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 26న చంద్రవంచ గ్రామం నుంచి 4 పఽథకాలను ప్రారంభించారని, ఎంపిక చేసిన గ్రామాల్లో నేటి వరకు కూడా పథకాలు లబ్ధిదారులకు పూర్తిగా అందలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎకరం ఉన్న రైతులకు నిధులు మంజూరు చేశామని వ్యవసాయశాఖ మంత్రిచే చెప్పించినా ఇంత వరకు రైతుల ఖాతాలో జమ కాలేదని అన్నారు. అబద్దపు హమీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 10న కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో చేపట్టే రైతు నిరసన దీక్షకు కేటీఆర్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లా తాజా, మాజీ ఎమ్యెల్యేలు హాజరుకానున్నారని నియోజకవర్గ రైతులందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యకమంలో జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ, సలీం, జనార్ధన్, వెంకట్‌నర్సింలు, కోనేరు సాయిలు,రాజశేఖర్‌రెడ్డి, సాయిలు పాల్గొన్నారు. -
‘కర్ని’ మండల సాధనే లక్ష్యం
మక్తల్: కర్ని గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటింపజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని 11 గ్రామాల ప్రజలు తీర్మానించారు. ఈమేరకు శనివారం మండలంలోని పస్పుల, పంచదేవ్పాడు, పారేవుల, ముస్లాయిపల్లి, దాదాన్పల్లి, అనుగొండ, అంకెన్‌పల్లి, భగువాన్పల్లి, ఎర్సాన్‌పల్లి గ్రామాల ప్రజల మద్దతు కోరుతూ సమావేశాలు నిర్వహించారు. కృష్ణానది తీరాన ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కర్నిని మండలంగా ప్రకటించాలని వారు నినదించారు. ఈ ప్రాంతాలకు మక్తల్ దాదాపు 25 కిలోమీటర్ల దూరంగా ఉంటుందని, నిత్యం రాకపోకలు సాగించాలంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నదని, ఏ చిన్న పని అయిన మక్తల్‌కు రావాల్సిందేనని అన్నారు. కర్నిని మండల కేంద్రంగా ప్రకటిస్తే ఈ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. విషయాన్ని విడతల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. అలసందలు క్వింటాల్ రూ.6,555 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం అలసందలు క్వింటాల్‌కు గరిష్టం, కనిష్టంగా రూ.6,555 ధర పలికింది. అలాగే, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,650, కనిష్టంగా రూ.6,296, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,809, కనిష్టంగా రూ.6,916, వేరుశనగ గరిష్టంగా రూ.6,049, కనిష్టంగా రూ.3,601 ధర పలికాయి. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష కందనూలు: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 20 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 5,016 మంది విద్యార్థులకు గాను 4,161 మంది హాజరయ్యారు. జిల్లాలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగాయని జిల్లా ఇన్చార్జ్ భాస్కర్‌కుమార్ తెలిపారు. 9, 11 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించిన ఆయన పేర్కొన్నారు. -
గుండెపోటా.. వైద్యులు లేరు!
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో.. పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో అయిన అన్ని విభాగాలు అందుబాటులోకి వచ్చి హైదరాబాద్‌కు పోయే బాధ తప్పుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. కొత్తగా నిర్మించే ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం అందుబాటులో ఉండి అందులో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్, థొరాసిక్ సర్జరీ థియేటర్, ఇతర పరికరాలు సైతం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక అవసరమైన గుండె వైద్య నిపుణులు, కార్డియో థొరాసిక్ సర్జన్లను నియమిస్తే తప్ప పాలమూరు వాసుల సమస్యలు తీరవు. ‘ఇటీవల ఓ జిల్లా స్థాయి అధికారి గుండెపోటు బారినపడ్డారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించాక మళ్లీ హైదరాబాద్ రెఫర్ చేసి పంపారు. మరో ఘటనలో 35 ఏళ్ల యువకుడికి గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆదివారం వైద్యులు లేరని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది. ఫలితంగా గుండెపోటు బారినపడి జనరల్ ఆస్పత్రికి వచ్చిన బాధితులు ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్‌కు తరలించే క్రమంలో మృతి చెందిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇటీవల విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్‌కు సడెన్‌గా గుండెపోటు రావడంతో చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చిన కార్డియాలజీ విభాగం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. ప్రైవేట్‌లోనూ అంతే.. పాలమూరు పట్టణంలో ప్రైవేట్ సెక్టార్లో నాలుగు క్యాథ్ ల్యాబ్‌లు ఉండగా ఆరుగురు వరకు కార్డియాలజిస్ట్‌లు అందుబాటులో ఉన్న కార్డియోథొరాసిక్ సర్జన్లు ఒక్కరు కూడా లేరు. దీంతో గుండెకు సంబంధించిన ఏదైనా చిన్నపాటి సర్జరీ చేయాలన్నా హైదరాబాద్ నుంచి టీంలు రప్పించి ఇక్కడ చేస్తున్నారు. ఇందుకోసం రోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. చాలా వరకు మేజర్ సర్జరీలు ఉంటే అందరూ హైదరాబాద్‌కు వెళ్తున్నారు. స్థానికంగా ఒకటి రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొంత మేర సేవలు అందుబాటులో ఉన్న ఫీజులు మాత్రం భారీగా ఉంటున్నాయి. ఎంజియోగ్రాం చేయించుకోవడానికి రూ.15 వేల – 25 వేల వరకు ఖర్చు అవుతోంది. ఒకవేళ స్టంట్ వేయాల్సి వస్తే అదనంగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కూడా అందుబాటులో లేకపోవడంతో నిరుపేదలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. పాలమూరు: ఇటీవల జిల్లాలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే పాలమూరు ప్రజలకు గుండెపోటు వస్తే అంతే సంగతులు అనే విధంగా మారాయి పరిస్థితులు. ఇటు ప్రభుత్వ ఆస్పత్రి.. అటు ప్రైవేట్‌లోనూ సరైన వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో రూ.లక్షల్లో వైద్య ఖర్చులు భరించలేక బాధితులు అవస్థలు పడుతుండగా.. మరికొందరు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటుతో వచ్చే బాధితులకు కనీసం ప్రాథమికంగా చేసే చికిత్స సైతం అందుబాటులో లేకుండాపోయింది. జనరల్ ఆస్పత్రిలో 2డీ ఎకో మిషన్ అందుబాటులో ఉన్నా టెక్నీషియన్ లేక వాడటం లేదు. ఇక ఈసీజీ అందుబాటులో ఉన్న రిపోర్ట్ సక్రమంగా వస్తుందా.. రాదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ చెప్పినా.. జనరల్ ఆస్పత్రిలో గుండెపోటు రోగులను పరీక్షించడానికి ప్రైవేట్ కార్డియాలజిస్ట్‌లను రప్పించి వారంలో నాలుగు రోజులు ఓపీ చూసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయేందిర ఐఎంఏ అధ్యక్షుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. కమిటీ సమావేశం జరిగి దాదాపు 25 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ విధానం అమల్లోకి రాలేదు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే మాదిరిగా ప్రైవేట్ గుండె వైద్యులను తీసుకువచ్చి ఓపీ చూసేలా ఏర్పాట్లు చేసినా ఒకటి రెండు రోజులు కూడా రోగులకు అందుబాటులో ఉండలేదు. దీంతో గుండెకు సంబంధించిన సమస్య వస్తే పేదవాడు సైతం జనరల్ ఆస్పత్రి రావడం లేదు. ఇక ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగుల్లో ఎవరికై నా గుండె సమస్య వస్తే జనరల్ మెడిసిన్ వైద్యుడితో పరీక్షిస్తున్నారు. రోగికి సమస్య తీవ్రత అధికంగా ఉంటే బయటకు రెఫర్ చేసి పంపుతున్నారు. జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి రాని కార్డియాలజీ సేవలు ప్రైవేట్ వైద్యులతో ఓపీ సేవలు అందించాలని కలెక్టర్ సూచించినా అమల్లోకి రాని వైనం ప్రైవేట్‌లోనూ అందుబాటులో లేని కార్డియోథొరాసిక్ విభాగం గుండె సమస్యలు అంటేనే హైదరాబాద్‌కు సిఫార్సు అత్యవసర వేళలో ప్రాణాలు కోల్పోతున్న బాధితులు ఐఎంఏతో సమన్వయం చేసుకుని ప్రైవేట్‌లో ఉన్న వైద్యులతో మాట్లాడటం జరిగింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఓపీ చూడటానికి కసరత్తు చేస్తున్నాం. త్వరలో జనరల్ ఆస్పత్రిలో ప్రైవేట్ కార్డియాలజిస్ట్ సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకొస్తాం. – సంపత్‌కుమార్‌సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
పౌష్టికాహారం సక్రమంగా అందించాలి
ఆత్మకూర్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచించారు. శుక్రవారం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పించడంతో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఆయన వెంట నాయకులు రహ్మతుల్లా, పరమేశ్, తులసీరాజ్, శ్రీను, గంగాధర్‌గౌడ్, నాగేశ్, సుదర్శన్‌శెట్టి, యాదగిరిశెట్టి, సాయిరాఘవ, గాలిపంపు శ్రీను, మణివర్ధన్‌రెడ్డి, రవీందర్, అబ్దుల్లా, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. -
వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు
కొత్తపల్లి: మండలంలోని మన్నాపూర్ అల్లీపూర్ మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు శుక్రవాకం కొగండల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, కడా ప్రేత్యకాధికారి వెంకట్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంతెన లేకపోవడంతో అల్లీపూర్ గామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా రూ.8కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారన్నారు. ఈ వంతెన నిర్మాణంతో ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. డీఈ విలోక్,ఏ ఈ అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ది బీములు, రమేష్‌రెడ్డి, నర్సిములు, లక్ష్మి నారాయణ రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చెన్నప్ప పాల్గొన్నారు. -
జూరాల పరిధిలో ఇలా..
ప్రస్తుతం ఉన్న నీటినిల్వ : 5.287 టీఎంసీలు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం : 9.657 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉన్నది : 1.58 టీఎంసీల శ్రీశైలం పరిధిలో ఇలా.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం : 215.807 టీఎంసీలు ప్రస్తుతం ఉన్న నీటినిల్వ : 84.66 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉన్నది : 40.0 టీఎంసీలు -
కంది రైతుపై ఆంక్షల కత్తి
ఎకరానికి 3.31 క్వింటాళ్ల కొనుగోలుకే పరిమితం ●ప్రైవేటులో విక్రయించా.. పండించిన మొత్తం కందిని ప్రభుత్వం కొనుగోలు చేస్తే బాగుంటుంది. నా సొంత పొలం 10 ఎకరాల్లో కంది పంటను సాగు చేశా. 70 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. 40 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు అంటున్నారు. మిగిలిన పంటను బహిరంగ మార్కెట్లో అమ్మితే రూ.50 వేల వరకు నష్టపోయాను. ఎకరాకు రూ.3.31 మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయాలి. – మారుతి, రైతు, నాగిరెడ్డిపల్లి గ్రామం అనుమతి రాలేదు జిల్లాలో కంది అధిక దిగుబడి వచ్చిన రైతులు ప్రభుత్వం విధించిన ఎకరానికి 3.31 క్వింటాళ్ల నిబంధనతో ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీంతో పరిమితిని 6 క్వింటాళ్లకు పెంచాలనే అంశంపై ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా లేఖ రాశాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే కొనుగోలు చేస్తాం. – ఇంద్రసేనా, మార్క్‌ఫెడ్ డీఎం నర్వ: ఆరుగాలం కష్టించి పండించిన కందులను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. కంది పంట ఇంటికి చేరుతున్న తరుణంలో ధర తగ్గడంతో రైతుల నుంచి మద్దతు ధర కంది పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 6 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోళ్లలో నిబంధనలతో రైతులు పంటను విక్రయించుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో రైతు నుంచి ఎకరానికి 3.31 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా వ్యవసాయశాఖ నిర్వహించిన సమగ్ర సర్వేలో కందిపంట సాగు చేసినట్లు పేర్లు ఉన్న రైతులు నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ప్రభుత్వ ఆంక్షలతో కేంద్రాల్లో పంటను విక్రయించుకోలేక జిల్లా రైతులు కర్ణాటక మార్కెట్‌కు కందిని తీసుకెళ్తున్నారు. 2.65 లక్షల క్వింటాళ్ల దిగుబడి జిల్లాలో వానాకాలం సీజన్లో 70 వేల ఎకరాల్లో రైతులు కందిపంటను సాగుచేశారు. ఇందులో ఈ దిగుబడి అంచనా 2లక్షల 65 వేల క్వింటాళ్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వాతావరణం అనుకూలించక దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. దీనికి తోడు పంట విక్రయించడానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం తేమ 12 శాతం లోపు ఉంటే క్వింటాల్‌కు రూ.7550ల మద్దతు ధర చెల్లిస్తుంది. దీంతో గత నెలలో ఆయా కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించినప్పటికి పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామనే భరోసా రైతులకు అధికారుల నుంచి లభించక ఆందోళన చెందుతున్నారు. కేంద్రానికి కందులు తీసుకెళ్లాలా..? వద్దా అనే సందేహంతో జిల్లాల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. నిబంధన ఎత్తేయాలని ఎమ్మెల్యేకు మొర గత నెలలో నర్వలో కంది కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో రైతులు ఎకరానికి 3.31 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేయాలని మొరపెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించి 6 క్వింటాళ్లకు పెంచేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. తగ్గిన పరిమితి కంది పంట చేతికి రాగానే క్వింటాల్ రూ.10 వేలు ఉన్న ధర రూ.7వేలకు పడిపోయింది. మద్దతు ధర కంటే మార్కెట్లో ధర తగ్గిపోవడంతో మద్దతు ధరతో కంది కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గతంలో ఎకరానికి ఆరు క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది మరింత తగ్గించింది. రైతులకు వచ్చే పంట దిగుబడితో సంబంధం లేకుండా ఎకరానికి 3.31 క్వింటాళ్లు ఒక్కో రైతు నుంచి 40 క్వింటాళ్లకు మించి కొనుగోలు చేయొద్దని ఆంక్షలు విధించింది. అంతర పంటగా సాగు చేసే రైతులకు నాలుగు క్వింటాళ్లు, పూర్తిగా కంది పంట సాగు చేసే రైతులకు ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. చేసేదేమి లేక రైతులు కర్ణాటకకు పంటను తీసుకెళ్తున్నారు. అక్కడ పంటను విక్రయించుకుంటే డబ్బులు త్వరగా వస్తాయని వెళ్తున్నట్లుగా తెలిసింది. ఆంక్షలతో ప్రైవేటులో విక్రయించి నష్టపోతున్న రైతులు మరికొందరు కర్ణాటకు తరలిస్తున్న వైనం జిల్లాలో 70 వేల ఎకరాల్లో కంది సాగు.. 6 కొనుగోలు కేంద్రాలు దిగుబడి అంచనా 2.65 లక్షల క్వింటాళ్లు -
గిరిజనులను నాయకులుగా చేయడమే లక్ష్యం
స్టేషన్ మహబూబ్‌నగర్: ఏఐసీసీ దేశవ్యాప్తంగా 25వేల మంది ఆదివాసీ గిరిజనులను నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ ఆదివాసీ విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మొదటగా ఈనెల 12 నుంచి 14 వరకు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం సోమశిలలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఇద్దరు ఆదివాసీ గిరిజన నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. గిరిజనుల్లో రాజ్యాంగపరమైన హక్కులు, ఇవాళ అమలువుతున్న తీరు, లోపాలు, గిరిజన సంస్కృతిపై జరుగుతున్న దాడి తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీపరంగా ఒక యంత్రాంగం ఉండాలనే ఉద్దేశంతో మొదటగా ఉమ్మడి జిల్లాల వారీగా అనంతరం నియోజకవర్గం, మండలస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ రెండేళ్లలో 5 వేల మంది గిరిజనులను నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణరావు పాల్గొంటారని, చివరిరోజు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు, ఆలిండియా ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శివాజీరావుమోగే ఈ మూడు రోజుల శిక్షణలో పాల్గొంటారని తెలిపారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో ఆదివాసీ విభాగం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి లింగంనాయక్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఆదివాసీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఏఐసీసీ ట్రైనర్ రాహుల్బాల్, ఉమ్మడి జిల్లా శిక్షణ ఇన్చార్జి కోట్యనాయక్, రాష్ట్ర కోఆర్డినేటర్ గణేష్‌నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వివరాలిలా..
దిగుబడి అంచనా 2.65 లక్షల క్వింటాళ్లు కంది సాగు 70 వేల ఎకరాలు మద్దతు ధర రూ.7550 (తేమ 12 శాతం లోపు ఉంటే) కొనుగోలు కేంద్రాలు : నారాయణపేట, దామరగిద్ద, మద్దూరు, మక్తల్, కోస్గి, నర్వ -
ప్రమాద ఘంటికలు
శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో అడుగంటిన జలాలు సాక్షి, నాగర్‌కర్నూల్: వేసవికి ముందే శ్రీశైలం, జూరాల జలాశయాల్లో నీటినిల్వలు భారీ స్థాయిలో అడుగంటుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా నీటిమట్టం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా వేసవి సమీపించక ముందే ఈ రెండు జలాశయాలు సగానికి ఖాళీ అయ్యాయి. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 84.66 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. శ్రీశైలం డ్యాంలోని నీటిని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కోసం ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకోవడంతో ప్రస్తుతం జలాశయం నీరు సగానికి మించి అడుగంటింది. మేలుకోకుంటే ముప్పే.. ఈసారి కృష్ణానదికి భారీస్థాయిలో వరదలు రావడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు నీటితో కళకళలాడాయి. శ్రీశైలం నుంచి ఏపీ, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు సుమారు 3 నెలల పాటు ఇరురాష్ట్రాలు విద్యుదుత్పత్తి కోసం నిరంతరం నీటిని వినియోగించాయి. ఏపీ కోసం హంద్రీనీవా సుజలా స్రవంతి, మల్యాల కేసీసీ, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుహెడ్రెగ్యులేరీ ద్వారా నీటిని విడుదల చేయగా.. తెలంగాణలోని ఎంజీకేఎల్‌ఐకి నీటిని వినియోగించారు. వీటితో పాటు ఇరు రాష్ట్రాల జల విద్యుత్ కేంద్రాల్లో నిత్యం సుమారు 2 నుంచి 3 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఫలితంగా రెండు నెలల్లోనే జలాశయం నీటిమట్టం సగానికి మించి పడిపోయింది. మరో నెల రోజుల్లోనే డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇదే తీరు కొనసాగితే వేసవిలో తాగునీటి సరఫరాకు సైతం ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం జలాశయంలో కేవలం 5.287 టీఎంసీల నీరు ఉండగా.. కేవలం 1.58 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నీటితోనే ఆయకట్టు కింద యాసంగి పంటలకు వారబందీ పద్ధతిలో సాగునీరు అందించడంతోపాటు తాగునీరు అందించడం కష్టసాధ్యంగా మారింది. 4 టీఎంసీలపై ఆశలు.. జూరాల డ్యాంలో నీరు భారీస్థాయిలో పడిపోవడంతో వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ జలాశయం నుంచి కనీసం ఐదు టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని ఆ రాష్ట్రాన్ని ఇటీవల ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విన్నవించారు. ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 4 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి. ఇప్పటికే జూరాల జలాశయంలోని నీరు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో నారాయణపూర్ నుంచి నీటి విడుదలపై ఆశలు నెలకొన్నాయి. డెడ్ స్టోరేజీకి నీటినిల్వ.. పోటాపోటీగా తరలింపుతో వేసవికి ముందే భారీగా తగ్గిన నీటిమట్టం మరో నెలరోజుల్లోనే డెడ్ స్టోరేజీకి రెండు ప్రాజెక్టులు ఇప్పటికే యాసంగి పంటలకు వారబందీ పద్ధతిలో సాగునీరు అప్రమత్తం కాకపోతే తాగునీటికీ తిప్పలే తాగునీటికి ప్రణాళిక.. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కోసం ప్రణాళికను సిద్ధం చేశాం. శ్రీశైలం రిజర్వాయర్‌లో ఇకపై విద్యుదుత్పత్తి చేపట్టకుండా.. నీటిని నిల్వ ఉంచేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తాం. డ్యాంలో 40 టీఎంసీల నీటిమట్టం వరకు తాగునీటి వినియోగానికి వీలు ఉంటుంది. – శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటి పారుదల శాఖ -
క్రీడల్లో రాణించాలి
నారాయణపేట: కరీంనగర్ జిల్లాలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన మూడో తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025 లో భాగంగా నారాయణపేట జిల్లా నుంచి ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ సంధ్య రాణి లాంగ్ జంప్‌లో 4.10 మీటర్లు జంప్ చేసి బ్రౌన్ మెడల్ సాధించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్‌ని శుక్రవారం కార్యాలయంలో ఆమెకు మెడల్ ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలలో మహిళలు రాణించాలని, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం పాన్‌గల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జబ్బార్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.50.60 లక్షల కోట్ల బడ్జెట్లో అన్ని సంక్షేమ పథకాలకు కోత విధించిందని.. పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల ధరలు, వారు చెల్లించే పన్నులు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఈ నెల 10న ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్‌ను ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహా ధర్నాకు జిల్లా నుంచి పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బాల్యానాయక్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు భగత్, సీఐటీయూ జిల్లా నాయకులు వెంకటయ్య, నాయకులు జంబులయ్య, డీవైఎఫ్ఐ నాయకుడు కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు భీమయ్య తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వరస్వామి జాతరకు ఏర్పాట్లు ఆత్మకూర్: పట్టణ శివారులోని చెరువులో వెలసిన స్వయంభూ పరమేశ్వరస్వామి జాతరకు సంబంధించి మార్చి 1, 2, 3 తేదీల్లో రాత్రి 9గంటలకు తేరుమహోత్సవం కనులపండుగగా జరుగనుంది. శుక్రవారం ఆలయ చైర్మన్ వెంకటనర్సింహారావు, వైస్‌చైర్మన్ ఏపూరి యాదగిరిశెట్టి, ప్రధాన కార్యదర్శి సాయిరాఘవ, కోశాధికారి మణివర్ధన్‌రెడ్డి, సహయ కార్యదర్శి తెలుగు నాగేష్, కమిషనర్ శశిధర్ ఆధ్వర్యంలో ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ చేపట్టబోయే ఏర్పాట్ల గురించి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 1560వ సంవత్సరంలో ఆలయంలో లింగాన్ని ప్రతిష్ఠించారని, అప్పటి నుంచి మహాశివరాత్రి సందర్భంగా అమావాస్య అనంతరం జాతరను చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. -
సీఆర్పీలతోనే మహిళా సంఘాల బలోపేతం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామల్లో స్వయం సహాయక (మహిళా) సంఘాల బలోపేతం సీఆర్పీలతోనే సాధ్యమని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని మీటింగ్‌హాల్‌లో ‘సంఘాల బలోపేతంకు సీఆర్పీ వ్యూహం’ కార్యక్రమాన్ని కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్య దేవరాజన్ మాట్లాడుతూ సీఆర్పీలు త్రిపుర, గోవా, ఇతర రాష్ట్రాల్లో మహిళలకు సంఘాల ఏర్పాటుపై శిక్షణ నిచ్చారన్నారు. సీఆర్పీలు ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో మహిళా సంఘాల ఏర్పాటు, ప్రోత్సాహం, బలోపేతం కోసం 8 రోజుల ఆయా జిల్లాలోని గ్రామాలకు వెళ్లి అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. గ్రామాల్లో మహిళలకు చాలా అంశాలపై అవగాహన లేక సంఘాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ ‘సంఘాల బలోపేతం–సీఆర్పీ వ్యూహం’ కార్యక్రమం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య, మండల, జిల్లా, రాష్ట్ర సమాఖ్యలు బాగా పనిచేసి ఆదర్శ రాష్ట్రంగా నిలవాలన్నారు. పలువురు సీఆర్పీలు, బుక్ కీపర్లు సంఘాల ఏర్పాటు, బుక్కీపింగ్తో పలు అంశాలనపై అవగాహ న కల్పించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సెర్ప్ ఐబీ డైరెక్టర్ నవీన్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, మహబూబ్‌నగర్, గద్వా ల, వికారాబాద్, నారాయణపేట డీఆర్డీఓలు నర్సింహులు, నర్సింగరావు, శ్రీనివాస్, మొగు లప్ప, అదనపు పీడీలు, ఏపీఎంలు పాల్గొన్నారు. -
గుడిసెల పోరు ఉధృతం
అమరచింత: పట్టణంలోని నిరుపేదలు ఇంటి స్థలాల హద్దులు చూపాలంటూ రెండున్నరేళ్లుగా గుడిసెలు వేసుకుని ఆందోళన చేస్తున్న పాలకులు పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. మండల కేంద్రంలోని బస్టాండ్ రహదారి పక్కన శనివారం నుంచి రిలేదీక్షలు చేపట్టి తమ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సర్వేనంబర్ 567లోని దుంపాయికుంటలో గల 14 ఎకరాల పొలంలో ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసి 25 ఏళ్ల క్రితం అర్హులైన 400 నిరుపేదలకు ఇంటి పట్టాలను అందించారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు వచ్చినా.. స్థలాలు చూపకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఇంటి స్థలాలకు స్వరాష్ట్రం సిద్ధించినప్పటికీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించలేకపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా తమకు ఇంటి స్థలాల విషయంలో డబుల్ ఇళ్లు అంటూ ఆశ చూపి నట్టేట ముంచిందని వాపోతున్నారు. దీంతో తమకు ఇంటి స్థలం చూపాలనే డిమాండ్‌తో సీపీఎం మద్దతులో 2022 సంవత్సరం నుంచి దుంపాయికుంటో గుడిసెలు వేసుకుని తమ పోరాటం కొనసాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా తమ సమస్య పరిష్కరించడం లేదని గుడిసెల పోరు బాధితులు రిలేదీక్షలకు సిద్ధమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి పలుమార్లు తమ గోడు విన్నవించినా.. ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల రిలే దీక్షలు గుడిసెల పోరు లబ్ధిదారులకు న్యాయం జరగాలని కోరుతూ వారికి మద్దతుగా శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు రిలేదీక్షలు నిర్వహిస్తున్నాం. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహించి సమస్య పరిష్కారం అయ్యేవరకు కదలకుండా ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. – జీఎస్ గోపి, సీపీఎం మండల కార్యదర్శి -
సందేహాలెన్నో..
ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో అర్హుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఎంపిక గ్రామాల్లో గర్తించిన అర్హులకే మొదటి విడతలో ఇళ్లను కేటాయిస్తారా, లేదా అన్ని గ్రామాల్లో అత్యంత నిరుపేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇప్పటికే ఎంపిక చేసిన గ్రామాల్లో పలువురికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హత పత్రాలు అందించారు. అయితే ఒక్కో నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 గృహాలను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో అర్హుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అర్హత పత్రాలు పొందిన వారందరికీ తొలి విడతలో ఇళ్లు మంజూరు కావని అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యం దక్కనుందని సమాచారం. అయితే ఎంపిక చేసిన గ్రామాల్లోనే కాకుండా మిగతా ఊళ్లల్లోని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లువ్వాలని పలువురు కోరుతున్నారు. -
ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
మాగనూర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల అన్నారు. గురువారం మండలంలోని కేజీబీవీ 9, 10వ తరగతి విద్యార్థులకు కేరీర్ గైడెన్స్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ట్రైనీ కలెక్టర్ హాజరై మాట్లాడారు. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న విద్యాకోర్సులు, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే భవిష్యత్ ప్రణాళికపై విద్యార్థినులకు సమగ్ర అవగహన కల్పించారు. భవిష్యత్‌లో సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి అనుగుణంగా, వ్యక్తిగత ఆసక్తి, లక్ష్యాలను గుర్తించడం ఎంత ముఖ్యమో వివరించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్, జీసీడీఓ నర్మద, ఎస్ఓ రాధిక,, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలి ఊట్కూరు: మహిళలు స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని పెద్దజట్రం రైతు వేదికలో షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం– నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత మూడు నెలల కుట్టు శిక్షణ కేంద్రాన్ని న్యాక్ డైరెక్టర్ రాజారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంతవరకు 11 వేల మంది శిక్షణ పొందగా 9 వేల మంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు. మహిళలకు వివిధ రంగాలలో ఒప్పందం చేసుకొని శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని తెలిపారు. శిక్షణ కోసం ఇప్పటి వరకు రూ.120 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రాష్ట్రంలో 20 శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తున్నారని అన్నారు. జిల్లాలో 3 నెలలపాటు ఉచిత శిక్షణ అందించి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తామని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు, పాఠశాలలు, హాస్టళ్ల యూనిఫామ్స్ కుట్టడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డర్లు పొంది ఉపాధి పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఈడి అబ్దుల్కలీల్, డీపీఆర్ఓ రశీద్, మండల స్పెషల్ ఆఫీసర్ ఉమాపతి, శివశంకర్, ఆజమ్మ, సాయిలుగౌడ్, కత్తలప్ప, అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎదురుచూపులు..!
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులపై ఎన్నో ఆశలు ●కొత్త కార్డులు ఇవ్వాలి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇటీవల ఏర్పాటు చేసిన గ్రామసభలో కూడా మరోసారి దరఖాస్తు చేశాం. ప్రభుత్వం నుంచి అమలు చేసే పథకాలకు రేషన్‌కార్డు ప్రమాణికం కావడంతో కార్డు లేక సంక్షేమ పథకాలను కోల్పోతున్నాం. కొత్త కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం. – నరేష్, మరికల్ ఒకేసారి రైతు భరోసా వేయాలి రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా అందిస్తే బాగుంటుంది. మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి వారి ఖాతాల్లో వేయడంతో మిగితా గ్రామాల రైతులు పెట్టుబడి సహాయం కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను ఏకకాలంలో అమలు చేస్తే బాగుటుంది. – మల్లేష్, పెద్దచింతకుంట ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది ముందుగా గుర్తించిన గ్రామాల్లో కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది. వారం రోజుల వ్యవధిలో ఆయా గ్రామాల్లో అర్హులను గుర్తించిన తర్వాత మిగితా గ్రామాల్లో అర్హులను గుర్తిస్తాం. అలాగే రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా ప్రక్రియ కూడా ఆన్లైన్లో మార్చి 31 లోపు పూర్తి చేస్తాం. – రాంచందర్, ఆర్డీఓ, నారాయణపేట మరికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, నూతన రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన అధికారులు గత నెల 26న లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందించారు. ఇటీవల మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా గ్రామాల్లోని లబ్ధి దారుల బ్యాంకు ఖాతాలో ్ల రైతు భరోసాకు సంబంధించిన ఆర్థిక సాయం జమ చేశారు. కానీ మిగిత గ్రామాల రైతులకు రైతు భరోసా అందకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని మిగతా గ్రామాల్లోని అర్హులు కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 280 గ్రామసభలు, 56 మున్సిపల్ వార్డుసభలకు సంబందించి నాలుగు సంక్షేమ పథకాలకు గాను 61,365 దరఖాస్తులు వచ్చాయి. మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రైతు భరోసా అందివ్వడంతో మిగతా గ్రామాలకు పథకాలు ఎప్పుడు చేరతాయి.. అసలు చేరతాయా లేదా అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గ్రామసభల్లో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు లేవని అనేక మంది మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పరిశీలించి అత్యధిక అర్జీలను ఆమోదించి అర్హుల జాబితాల్లో చేర్చారు. అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లో గత నెల 26న సమావేశాలు జరిగాయి. అర్హతనే ప్రామాణికంగా తీసుకుని సొంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల అర్హత పత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. నూతన రేషన్‌కార్డులకు సంబంధించి అర్హుల జాబితాలో పేరొచ్చిన వారి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త కార్డులు జారీ చేయనున్నారు. మిగతా గ్రామా ల్లోనూ జాబితాలు సిద్ధం చేశామని, ఆదేశాలు వస్తే అర్హత పత్రాలు అందిస్తామని అధికారులు అంటున్నారు. జాబితాలు సిద్ధం సంక్షేమ పథకాల అమలుపై వీడని సందిగ్ధం ఎంపిక చేసిన గ్రామాలకే మొదటి ప్రాధాన్యత అర్హుల్లో అనేక సందేహాలు -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మక్తల్: జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్) గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టామని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం మక్తల్ పరిదిలో జాతీయ రహదారి, పలు రహదారులను ఎస్పీ పరిశీలించారు. ఈమేరకు జక్లేర్, కాచ్వార్రోడ్డు, దండు క్రాస్ రోడ్, నల్లజానమ్మరోడ్డు, మక్తల్ బస్టాండ్ చౌరస్తా, కన్యకా పరమేశ్వరి ఆలయం, దాసర్పల్లి క్రాస్‌రోడ్డును పరిశీలించారు. మలుపులు, గ్రామాల నుంచి ప్రధాన రహదారి కలిసే చోట ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన చౌరస్తాల్లో బారికేడ్లు, స్పీడ్ నియంత్రణ, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, మలుపుల వద్ద రేడియం స్టికర్లతో బోర్డులను వేయించాలని హైవే అధికారులను ఆదేశించారు. రాత్రి సమయంలో జాతీయ రహదారితోపాటు ఇతర రోడ్లపైన వాహనాలు ఎట్టి పరిస్థితిలో నిలపవద్దని, హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ అప్రమత్తం చేయాలన్నారు. అతివేగంగా వాహనాలను నడిపే వారికి, నిబంధనలు పాటించని వాహనదారులకు చలాన్లు విధించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. వాహనాలను నడిపేవారు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, ఏఈ అభిషేక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మరోసారి ఇలాంటివి పునరావృతం కావొద్దు
కోస్గి రూరల్: పాఠశాల హెచ్ఎం, వంట ఏజెన్సీ నిర్వాహకుల మధ్య గొడవ నేపథ్యంలో రెండు రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందివ్వకపోవడం, దీనిని నిరసిస్తూ బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో డీఈఓ గోవిందరాజులు, డీఆర్డీఓ మొగులప్ప మండలంలోని నాచారం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. హెచ్ఎం, వంట ఏజెన్సీ మహిళను విచారించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని హెచ్చరించారు. వారితో లిఖితపూర్వకంగా రాయించుకున్నారు. ఇదిలాఉండగా, పలువురు గ్రామస్తులు హెచ్ఎంను బదిలీ చేయాలని ఫిర్యాదు చేశారు. పూర్తి నివేదికను అధికారులకు పంపించిన అనంతరం చర్యలు చేపడతామని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, ఎంఈఓ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ అకాడమీ.. అటకెక్కించారు!
మెయిన్ స్టేడియంలో మూడేళ్ల క్రితం పునఃప్రారంభం గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వస్తారు.. మహబూబ్‌నగర్‌లో గతంలో ఉన్న వాలీబాల్ అకాడమీలోనే నేను ఓనమాలు నేర్చుకున్న. అకాడమీ నుంచి అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయస్థాయి మ్యాచుల్లో ఆడాను. స్పోర్ట్స్ కోటాలో ఇన్కమ్ టాక్స్ శాఖలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం కూడా వచ్చింది. వాలీబాల్ హాస్టళ్లు, అకాడమీ ఏర్పాటయితే నా లాంటి ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. – యశ్వంత్‌కుమార్, అంతర్జాతీయ క్రీడాకారుడు, మహబూబ్‌నగర్ త్వరలో ప్రవేశాలు వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల గురించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు నివేదిక ఇచ్చాం. అనుమతులు రాగానే అకాడమీ సెలక్షన్స్, ప్రవేశాలు నిర్వహిస్తాం. అకాడమీ ఏర్పాటు తో నైపుణ్యం గల క్రీడాకారులను వెలికి తీయవచ్చు. క్రీడాకారులకు మెరుగైన వసతి, ఉత్తమమైన శిక్షణ లభిస్తుంది. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ పాలమూరు జిల్లాకు వాలీబాల్ అకాడమీని మంజూరు చేసింది. నాలుగేళ్ల పాటు నడిచిన అకాడమీలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ చాటారు. దీంతో అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడ శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా ఎదిగారు. వీరు మొదట్లో అకాడమీలో వాలీబాల్‌లో ఓనమాలు నేర్చుకొని దేశానికి ప్రాతినిథ్యం వహించేస్థాయికి ఎదిగారు. పలువురు క్రీడాకారులు జాతీయ సీని యర్ వాలీబాల్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008లో ఈ అకాడమీని మూసివేశారు. మూడేళ్ల క్రితం వసతుల ఏర్పాటు.. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరగడంతో.. మూడేళ్ల క్రితం వాలీబాల్ అకాడమీ తిరిగి పునఃప్రారంభమైంది. రూ.19.70 లక్షల నిధులతో స్టేడియం ఆవరణలోని స్విమ్మింగ్‌పూల్ కాంప్లెక్స్ గదులను అకాడమీ క్రీడాకారుల వసతి కోసం కేటాయించారు. గదుల ఆధునికీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. మంచాలు, టేబుల్స్, బీరువాలతో పాటు క్రీడాకారుల వసతి కోసం ఇతర వస్తువులను కూడా సిద్ధంగా ఉంచారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను తీసి వేసి వాటి స్థానంలో నూతన కోర్టులు ఏర్పాటు చేశారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్ లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. గోడ చుట్టూ ఆకర్షణీయంగా వాలీబాల్ క్రీడాచిత్రాలను తీర్చిదిద్దారు. ప్రవేశాలపై సందిగ్ధం? మెయిన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నూతన వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం 2022 డిసెంబర్ 1వ తేదీన రాష్ట్రంలోని అండర్ 14–18 ఏళ్ల బాలబాలికలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 187 మంది బాలురు, 46 బాలికలు.. మొత్తం 233 మంది ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని అకాడమీకి ఎంపిక చేయాల్సి ఉంది. అయితే సెలక్షన్ నిర్వహించి రెండేళ్లు దాటినా.. క్రీడాకారులకు ప్రవేశాలు కల్పించలేదు. కోచ్‌ల నియామకాలు కూడా జరగలేదు. ఒకవేళ అకాడమీ ప్రారంభిస్తే.. గతంలో జరిగిన సెలక్షన్స్‌లో ప్రతిభ చాటిన వారికి ప్రవేశాలు ఇస్తారా లేదా మళ్లీ కొత్తగా సెలక్షన్స్ నిర్వహిస్తారా అనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. ి● వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేయడం వల్ల ఔత్సాహిక క్రీడాకారులకు మహర్దశ కలుగుతుంది. నిష్ణాతులైన కోచ్‌ల పర్యవేక్షణలో బాలబాలికలకు మెరుగైన శిక్షణ అందజేసి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దుతారు. అయితే మూడేళ్ల క్రితమే అకాడమీ తిరిగి ప్రారంభమైనా ప్రవేశాలు కల్పించకపోవడంపై సీనియర్ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా ప్రవేశాలు కల్పించాలని సీనియర్లు కోరుతున్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రస్థాయి ఎంపికలు సైతం పూర్తి అంతటితోనే ఆగిపోయిన ప్రక్రియ అకాడమీలో క్రీడాకారుల ప్రవేశాలపై సందిగ్ధం? -
ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు
మరికల్: కృష్ణా జలాల కేటాయింపులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి అన్నారు. మరికల్ యువక మండలి భవనంలో గురువారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అఖిలపక్షం నాయకులు, కుల సంఘాలు, యువకులు, రైతులు ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నీళ్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం రాఘవచారి మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే పాలకులు లేకపోవడం వల్లే ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయించిన కృష్ణా జలాల విషయంలో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఏదుల నుంచి డిండికి నీటిని ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 11ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఎత్తయిన షాద్‌నగర్ ప్రాంతంలో ఎత్తిపోతల ద్వారా కాల్వలు తీసి అక్కడ 30 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మిస్తే పాత పాలమూరు జిల్లా అంతటా 35 లక్షల ఎకరాలకు సాగునీరు పారే అవకాశం ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించిన 90 టీఎంసీలను ఫేజ్–1, ఫేజ్–2గా విభజించి 45 టీఎంసీల నీటిని నారాయణపేట కొడంగల్ ప్రాంతానికి కేటాయిస్తే ఈ ప్రాంతంలో వలసలు పూర్తిగా నివారించవచ్చన్నారు. ఇందుకోసం ఈ ప్రాంత ప్రజలు, నాయకులు లేఖల ద్వారా నిరంతరం ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందజేయాలని సూచించారు. అలాగే కోయిల్‌సాగర్, భీమాఫేజ్–1కు పూర్తి స్థాయి నీటిన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో కోయిల్‌సాగర్ చివరి ఆయకట్టు వరకు ధ్వంసమైన పాత కాల్వలను, తూములను మరమ్మతులు చేయాలన్నారు. నారాయణపేట జిల్లాకు రావాల్సిన నీటిపై అప్రమత్తంగా ఉంటేనే భవిష్యత్ తరాలకు మార్గం చూపిన వారమవుతామన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తీసుకరావాలని పిలుపునిచ్చారు. పాలమూరు నీటి పంపకాల విషయంపై ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కూడా వినతి పత్రాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కో కన్వీనర్ సుదర్షన్ టీఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్, చైతన్యా మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, సూర్యప్రకాష్, గోపి, వీరన్న, రాజు, రాములు, హరీష్, విష్ణు, అయ్యప్ప, లక్ష్మయ్య తధితరులు పాల్గొన్నారు. పేట – కొడంగల్‌కు నీటిని కేటాయించాలి పాలమూరు – రంగారెడ్డికి కేటాయించిన 90 టీఎంసీల నీటిని రెండుగా విభజన చేసి 45 టీఎంసీల నీటిని నారాయణపేట, కొడంగల్‌కు కేటాయిస్తే ఇక్కడ నుంచి లక్ష్మిదేవిపల్లికి తీసుకుపోవచ్చు. ఈ మధ్యలో కాల్వల ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావాలి. – వెంకట్రాములు, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు గ్రామాల్లో చర్చ జరగాలి ఉమ్మడి పాలమూరుకు దక్కాల్సిన నీటి వనరులపై గ్రామాల్లో చర్చ జరిగితేనే పాలకులకు కనువిప్పు కలుగుతుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి డిండి పేరుతో 30 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆ ప్రాంత పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని తిప్పి కొట్టెందుకు పాలమూరు రైతులు ఏకం కావాలి. అలాగే కోయిల్‌సాగర్, సంగంబండ రిజర్వాయర్ల స్థాయి కూడా పెంచితే రైతులకు న్యాయం జరుగుతుంది. – తిమ్మప్ప, పాలమూరు అధ్యయన వేదిక మహబూబ్‌నగర్ అధ్యక్షుడు ఇథనాల్ కంపెనీకి నీటిని నిలిపివేయాలి జూరాల నుంచి కోయిల్‌సాగర్‌కు తరలించే 2 టీఎంసీల నీటిలో ఇథనాల్ కంపెనీకి తరలించే ఒక టీఎంసీ నీటిని నిలిపివేయాలి. కంపెనీ వల్ల భవిష్యత్‌లో చుట్టుపక్కల 50 గ్రామాలకు కాలుష్యంతో కూడిన నీళ్లు, గాలి వ్యాపించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కలుషిత నీరు మన్నెవాగులో వదలడం వల్ల పశువులు ఆ నీటిటి తాగి మృత్యువాత పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కంపెనీని రద్దు చేసి ఈ ప్రాంత ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. – చక్రవర్తి, ఇథనాల్ కంపెనీ పోరాట కమిటీ సభ్యుడు ప్రశ్నించకపోతే ఏడారే.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు దక్కాల్సిన కృష్ణా జలాలను నల్లగొండ జిల్లాకు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ప్రశ్నించకపోతే పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మళ్లీ మనం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నారాయణపేట– కొండగల్ ప్రాజెక్టుకు రావాల్సిన నీరు రాకుండా కుట్ర జరుగుతుంది. దీనిని ఇలాగే వదిలేస్తే కరువు చాయలు కమ్ముకోవడం ఖాయం. మన నీళ్ల కోసం ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. – చంద్రశేఖర్, కేఎన్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మక్తల్ ● కృష్ణా జలాలపై ప్రశ్నిద్దాం నల్లగొండ నీటి తరలింపు జీఓ 11ను రద్దు చేయాలి 90 టీఎంసీల నీటిని రెండు భాగాలుగా విభజించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి -
కోలాహలంగా పాల ఉట్లు
మక్తల్: మండలంలోని మాద్వార్‌లోని గట్టుతిమ్మప్పస్వామి (లక్ష్మీవెంకటేశ్వరస్వామి) బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన పాల ఉట్ల కార్యక్రమం వైభవంగా సాగింది. భక్తుల కోలాటం, చిన్నారులు దాండియా నృత్యాలు, అడుగుల భజనలు చేస్తూ ఊరేగింపుగా ముందుకు కదిలారు. అనంతరం వందలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ పాల ఉట్లు కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఉట్టి కొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేశ్వర్‌రావు, జాజాపూర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొరమీను చేపల సాగుతో అధిక ఆదాయం
మరికల్: తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు రైతులు కొరమీను చేపల సాగు వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మండలంలోని పల్లెగడ్డ, మాధ్వార్ క్రాసింగ్ దగ్గర రామ్‌కి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చేపల షెడ్‌ను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెతోపాటు రామ్‌కి పౌండేషన్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. కేవలం నాలుగు గుంటల స్థలంలో రూ. 4.40 లక్షల వ్యయంతో ఈ షెడ్ నిర్మాణం చేపట్టి, వాటిలో ఏర్పాటుచేసిన వాటర్‌ట్యాంకులో కొరమీను చేపలను వదలాలని సూచించారు. మొదటి పంట 8 నెలలకు వస్తుందని, మిగితా పంటలు నాలుగు నెలలకోసారి వస్తాయని, ఒకసారి పంటను విక్రయిస్తే రూ.90 వేల వరకు ఆదాయం వస్తుందని, ఇలా ఏడాదికి మూడు సార్లు తీయవచ్చాన్నారు. నియోజకవర్గంలో మొదట 50 మంది రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాంరెడ్డి, సంజీవ్నాయర్, సూర్యమోహన్‌రెడ్డి, హరీష్, సత్యన్న, రామకృష్ణ, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, గొల్లరాజు పాల్గొన్నారు. -
‘పది’లో వంద శాతంఉత్తీర్ణత సాధించాలి
నారాయణపేట: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల అన్నారు. జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహిస్తుండగా.. ఆమె పాల్గొని మాట్లాడారు. మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు, వసతి గృహాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉమాపతి, జాన్ సుధాకర్, అబ్దుల్ ఖలీల్, ఉపాధ్యాయులు స్వామి, సంగీత, నారాయణరెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. నేతన్న పొదుపు పథకానికి దరఖాస్తు చేసుకోండి నారాయణపేట: నేతన్న పొదుపు పథకానికి (త్రిఫ్ట్ ఫండ్) చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు డి.బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు నేతన్న పొదుపు పథకాన్ని పునఃప్రారంభం చేసి నూతన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. పథకం గడువు రెండేళ్లుగా నిర్ణయించిందని, చేనేత కార్మికులు, అనుబంధ చేనేత కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ కాపీ, 6 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేసి దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. ఈ నెల 15 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అలసందలు క్వింటాల్ రూ.6,666 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం అలసందలు క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.6,666 ధర పలికింది. అలాగే, వేరుశనగ గరిష్టంగా రూ.5,858, కనిష్టంగా రూ.4,005, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,250, కనిష్టంగా రూ.6,080, తెల్ల కందులు గరిష్టంగా 7,521, కనిష్టంగా రూ.6,419 ధరలు పలికాయి. దిగొచ్చిన ఉల్లి ధర ● గరిష్టంగా రూ.2.710.. కనిష్టం రూ.1,700 దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం నిర్వహించిన ఉల్లి వేలంలో ధరలు మరింత దిగొచ్చాయి. మూడు వారాల కిందట వచ్చిన ధరలతో పోలిస్తే సగానికి పడిపోయింది. ఎర్ర ఉల్లి ఎక్కువగా ఉండడం, తెల్ల ఉల్లి వచ్చినా ఆరబెట్టకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. నాణ్యమైన ఉల్లి క్వింటా గరిష్టంగా రూ.2,710 పలకగా.. రెండు వారాల కిందట రూ.4,020గా నమోదైంది. ఆ ధరతో పోలిస్తే రూ.1,310 వరకు తగ్గింది. కనిష్టంగా రూ.1,700 ధర ఉండగా.. రెండు వారాల కిందట రూ.3,510గా ఉందని. ఆ ధరతో పోలిస్తే రూ.1,800 వరకు తగ్గింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 45 కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.8,50 ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగించారు. కాగా.. మధ్యాహ్నం జరిగిన ఈ–టెండర్లో కంది క్వింటా గరిష్టంగా రూ.6,901, కనిష్టంగా రూ. 6,569 ధర లభించాయి. మార్కెట్‌కు దాదాపు 100 బస్తాల కంది అమ్మకానికి వచ్చింది. వేరుశనగ క్వింటాల్ రూ.6,312 జడ్చర్ల/నవాబుపేట: బాదేపల్లి మార్కెట్ యార్డుకు బుధవారం 4,930 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.6,312, కనిష్టంగా రూ.4,005 ధరలు లభించాయి. కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,596, కనిష్టంగా రూ.5,669, మొక్కజొన్న రూ.2,390, పెబ్బర్లు గరిష్టంగా రూ.5,701, కనిష్టంగా రూ.5,202, ఉలువలు గరిష్టంగా రూ.6,359, కనిష్టంగా రూ.5,859 ధరలు పలికాయి. నవాబుపేట మార్కెట్‌కు 3,596 బస్తాల వేరుశనగ వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. గరిష్టంగా రూ.5,911 ధర పలికిందని పేర్కొన్నారు. -
నిలిచిన మధ్యాహ్న భోజనం
కోస్గి రూరల్: వంట ఏజెన్సీల నిర్లక్ష్యం వల్ల రెండు రోజులుగా మధ్యాహ్న భోజనం అందించడం లేదని విద్యార్థులు ధర్నాకు దిగారు. మండలంలోని చెన్నారం ప్రాథమిక పాఠశాలలో రెండు రోజులుగా మధ్యాహ్న భోజనం వండకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నారాయణపేట–పల్లెర్ల రహదారిపై బుధవారం ధర్నా చేపట్టారు. మెనూ అస్సలు పాటించడంలేదని, గుడ్లు, అరటిపండ్లు ఇవ్వడంలేదని, విధిలేని పరిస్థితుల్లో ఇళ్ల నుంచి టిఫిన్ బాక్సులు పంపిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాల హెచ్ఎం అనురాధకు వంట ఏజెన్సీ నిర్వాహకురాలు బాలమణికి మధ్య వివాదం చోటుచేసుకుందని, దీని వల్లనే భోజనం బంద్ చేశారని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎంఈఓ శంకర్‌నాయక్ అక్కడికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని, మెనూ పాటించేలా చూస్తానని అన్నారు. అలాగే, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే చర్యలు చేపడతామని హెచ్ఎం, వంట ఏజెన్సీ నిర్వాహకురాలిని హెచ్చరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన