Narayanpet
-
పునరావాసానికి సన్నద్ధం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న చెంచుపెంటల తరలింపునకు అవసరమైన చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ(ఎన్టీసీఏ) ద్వారా బాధితులకు పునరావాస ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అధికారులు పునరావాస ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మరో రెండు నెలల్లోనే పునరావాసానికి పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. విడతల వారీగా చెంచుపెంటల తరలింపు.. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న పులులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న చెంచుపెంటలను ఖాళీ చేయించి, అడవి బయట వారికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణ, వాటికి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పించడం, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడంలో భాగంగా పునరావాస ప్రక్రియను చేపడుతున్నట్టు అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రక్రియను ప్రారంభించగా, తొలి విడతగా తరలించనున్న సార్లపల్లి, కుడిచింతల్ బైల్, వటవర్లపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించి, స్థానికుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలింపునకు ఒప్పుకున్న వారికే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బలవంతం చేయబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక చెంచుల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. తొలి విడతలో మూడు గ్రామాలు.. నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న సుమారు 20 వరకు చెంచుపెంటలను విడతల వారీగా ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించాలని అటవీశాఖ భావిస్తోంది. వీటిలో మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేతో పాటు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తోంది. సార్లపల్లిలో మొత్తం 269 కుటుంబాలు ఉండగా, వీరిలో 83 కుటుంబాలు మాత్రమే చెంచులు కాగా, మిగతా ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఇతర వర్గాలు మాత్రమే తరలింపునకు అంగీకారం చెబుతుండగా, మెజార్టీ చెంచులు ఒప్పుకోవడం లేదు. ప్యాకేజీ కింద 5 ఎకరాలు, లేదంటే రూ.15 లక్షలు అడవిని ఖాళీ చేసి మరో చోటుకు తరలుతున్న స్థానికులకు పునరావాసం కింద ఎన్టీసీఏ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, లేదా 5 ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని బాధితులు ఎంచుకోవచ్చు. ఖాళీ చేయనున్న గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఇప్పటికే భూమిని గుర్తించారు. అక్కడే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇళ్లు, పాఠశాల, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. నల్లమల అడవి నుంచి చెంచుపెంటలతరలింపునకు కొనసాగుతున్న కసరత్తు మొదటి విడతలో కుడిచింతలబైల్,సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాలు ఎన్టీసీఏ ద్వారా ప్రత్యేక పునరావాస ప్యాకేజీ పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఏర్పాట్లు -
పెరిగిన పట్టాదారులు
జిల్లా వ్యాప్తంగా 259 రెవెన్యూ గ్రామాల్లో 1,86,236 మంది రైతులకుగాను 4,63,476 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా తీసుకురావడంతో ఉన్న భూమిని భాగాలు చేసుకుంటూ కుటుంబ సభ్యులు పట్టా చేసుకోవడం షురూ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 1,92,020 మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ వినియోగంలో లేని భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇవ్వకుండా ప్రత్యేకంగా సర్వే చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా 3,744 ఎకరాలు తేలింది. దీంతో జిల్లాలో 4,58,626 ఎకరాలకు రైతు భరోసా వేసేందుకు అధికారులు లెక్క తేల్చారు. 1,92,020 మంది రైతులకుగాను రూ.266 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాగా అందులో 1.80 లక్షల మంది రైతులు తమ పట్టాపాసు పుస్తకాలతో పాటుబ్యాంకు పుస్తకాలు, ఆధార్‌కార్డులు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా 12 వేల మంది రైతులకు సంబంధించి ఇంకా పోర్టల్ పూర్తిగా వివరాలు నమోదు కాకపోవడంతో వారికి రైతుభరోసా కాస్త ఆలస్యంగా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఛత్రపతి శివాజీ ఆదర్శనీయుడు
దామరగిద్ద: ఛత్రపతి శివాజీ మహరాజ్ అందరికి ఆదర్శనీయుడని, గొప్ప వ్యక్తులను స్మరించుకునేలా విగ్రహాన్ని నెలకొల్పడం ఎంతో సంతోషయనీమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, స్వామి ఆదిత్య పరాశ్రీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, బీష్మ పౌండేషన్ చైర్మర్ రాజ్‌కుమార్ అన్నారు. మండలంలోని కాన్‌కుర్తిలో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్యఅథితులుగా హాజరై మాట్లాడారు. మొగల్ సామ్రాజ్య నిరంకుశ పాలనను ఎదిరించి దేశంలో హిందు సామ్రాజ్య స్థాపనకు కృషిచేసిన గొప్ప పరిపాలన దక్షుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఆదర్శనీయుడిని భావి తరాలు గుర్తించేలా విగ్రహావిష్కరణ చేసిన భజరంగ్‌దళ్ యువతను అభినందించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, స్థానిక మాజీ ఎంపీటీసీ బస్వరాజ్, భీంరెడ్డి, స్థానిక యువకులు పాల్గొన్నారు. మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేరకు పదికి పైగా బహుళజాతి కంపెనీలు మేళాలో పాల్గొనగా దాదాపు 200 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. మేళాకు విచ్చేసిన అభ్యర్థుల ధ్రుపత్రాలను పరీశీలించా రు. అనంతరం పలు కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సత్యయాదవ్ నారాయణపేట రూరల్: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా కే.సత్యయాదవ్ ఎంపికయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి అధ్యక్ష పదవి ఎంపికకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించగా, ఎన్నికల అధికారిగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కట్ట సుధాకర్ హాజరయ్యారు. ఈ మేరకు జిల్లాలో 9మంది నాయకులు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడ్డా రు. అయితే అధిష్టానం పట్టణానికి చెందిన కొండ సత్యయాదవ్ వైపు సానుకూలంగా వ్యవహరించడంతో ఆ పార్టీ రాష్ట్ర సహ ఎన్నికల అధికారి కే.గీతామూర్తి ఆయన పేరును ధ్రువీకరిస్తూ నియామక పత్రాన్ని విడుదల చే సింది. ఈ మేరకు సత్యయాదవ్ నియామకంపై ఆ పార్టీ మండల అధ్యక్షులు జ్యోతి, సాయిబన్న ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జొన్నలు క్వింటాల్ రూ.2,421 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జొన్నలు క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.2,421 ధర పలకగా 15 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,630, కనిష్టంగా రూ.5,225 ధరలు కోడ్ చేయగా 331 క్వింటాళ్లు చేశారు. తెల్లకందులు గరిష్టంగా రూ.7,740, కనిష్టంగా రూ.6,869 (104 క్వింటాళ్లు), వేరుశనగ గరిష్టంగా రూ.6,550, కనిష్టంగా రూ.4,140 ధర పలకగా 187 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నేడు పీయూలో హ్యాండ్‌బాల్ ఎంపికలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని పీడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమిళనాడు పెరియార్ యూనివర్సిటీలో ఈ నెల 28నుంచి నిర్వహించనున్న అంతర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 21న నారాయణపేటలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుండడంతో సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీయోగేష్ గౌతమ్‌తో కలిసి ఎమ్మెల్యే పర్యవేక్షించారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లి వద్ద గల మెడికల్ కళాశాల, సింగారం చౌరస్తాలో నూతన పెట్రోల్ బంక్‌ను, హెలిప్యాడ్ స్థలాన్ని, అప్పక్‌పల్లి వద్ద సభా స్థలాన్ని పరిశీలించారు. ఆయా స్థలాల్లో పనులు చేయిస్తున్న అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సభా స్థలి వద్ద 12 స్టాళ్లను ఏర్పాటు చేసే విషయమై వారు చర్చించారు. వేదికకు ఎటువైపు స్టాళ్లను ఏర్పాటు చేయాలనేది వేదిక స్తలాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామన్నారు. అనంతరం కలెక్టర్ మెడికల్ కళాశాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసే శిలాఫలకాలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌తో అక్కడి ఏర్పాట్లపై చర్చించారు. ● ఎస్పీ యోగేష్‌గౌతమ్ సింగారం శివారులో ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి చుట్టూ బారికేట్స్ ఏర్పాటు చేయాలని, అప్పక్ పల్లి గ్రామ శివారులో పబ్లిక్ మీటింగ్ సంబంధించిన స్థలాలను పరిశీలించి పబ్లిక్ మీటింగ్ వద్ద భద్రతా ఏర్పాట్లను, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పబ్లిక్ మీటింగ్ వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, సింగారం శివారులో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వారితోపాటు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, ఆర్డీఓ రామచందర్ నాయక్, గ్రంథాలయ సంస్థల వార్ల విజయకుమార్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్‌రెడ్డి,ఆర్ అండ్ బీ శాఖ అధికారులు ఉన్నారు. మెడికల్ కళాశాలను పరిశీలించిన ఆర్వీ కర్ణన్ నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను బుధవారం కమిషనర్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, జాతీయ ఆరోగ్య మిషన్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈ నెల 21న సీఎం నారాయణపేట పర్యటన సందర్భంగా బుధవారం నారాయణపేటకు వచ్చి అప్పక్‌పల్లి వద్ద మెడికల్ కళాశాలను పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కళాశాలలో జరిగే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలపై కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో చర్చించారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని, పాత బస్టాండ్‌లోని ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రిని సందర్శించి ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
ముగిసిన టెన్త్ ఇంటర్నల్ మార్కుల పరిశీలన
నారాయణపేట రూరల్: సీసీఈ విదానంలో భాగంగా టెన్త్ విద్యార్థులకు పాఠశాలలో నిర్వహించే కృత్యాలకు సంబంధించి సబ్జెక్ట్ టీచర్లు వేసిన ఇంటర్నల్ మార్కుల పరిశీలన కార్యక్రమం బుధవారం ముగిసింది. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 146 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 7,631 మంది టెన్త్ విద్యార్థులకు ఆ పాఠశాలలో నిర్వహించిన ఫార్మెటివ్ పరీక్షలు, ప్రాజెక్టు ఇతర అంశాలకు సంబందించి సబ్జెక్టు వారికిగా 20 మార్కుల చొప్పున ఒక్కో విద్యార్థికి మొత్తం కేటాయించిన 120మార్కులను సరిచూశారు. జిల్లా వ్యాప్తంగా జీహెచ్‌ఎంల నేతృత్వంలో ఒక లాంగ్వేజ్, మరో నాన్ లాంగ్వేజ్ టీచర్ల 31 ప్రత్యేక బృందాలు గత మూడు రోజులుగా వారికి కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ఆరు చొప్పున స్కూళ్లను తనిఖీ చేశారు. మార్కుల పరిశీలన చేసి ఆయా మార్కులను ఆన్లైన్ అప్లోడ్ చేయించి డీఈఓ కార్యాలయంలో నివేదిక అందించారు. అదేవిధంగా గురువారం నుంచి జరిగే మొదటి ఫ్రీఫైనల్ పరీక్షల కోసం విద్యార్థులకు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలలను ఎంఈఓ బాలాజి, డీఎస్ఓ భానుప్రకాష్, జీహెచ్ఎంలు అనురాధ, సత్యనారాయణసింగ్, సునీత, భారతి, బృంద సభ్యులు యాద్గీర్ నారాయణరెడ్డి, మధుసూదన్, రవికుమార్ తనిఖీలో పాల్గొన్నారు. -
ఎదురుచూపులు..
వివరాలు 8లో uనారాయణపేట: రైతు భరోసా పంపిణీలో వాయిదా ల పర్వం కొనసాగుతోంది. దీంతో జిల్లాలోని చాలా మంది రైతులు తమకు ఇంకెప్పడు సాయం అందుతుందని ఎదురుచూస్తున్నారు. సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి జిల్లాలోని కోస్గి మండలం చంద్రవాంఛలో నాలుగు పథకాల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని జనవరి 26న శ్రీకారం చుట్టారు. జిల్లా లోని 1,92,020 మంది రైతులకుగాను ( 4,58,626 ఎకరాలకు) రూ.266 కోట్లు రైతు భరోసా వారి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. తొలి రోజు నారాయణపేట జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,348 రైతులకు రూ.13.87 కోట్లు జమచేసింది. కాగా రెండు, మూడో విడతలో రైతుల ఖాతాలో జమ చేసింది కేవలం రూ.97 కోట్లు మాత్రమే అని చెప్పవచ్చు. మిగతా రైతులు తమకు ఎప్పుడు రైతు భరోసా పడుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఈ నెల 21న సీఎం వస్తుండడంతో ఆ లోపు దాదాపు బడ్జెట్ రిలీజ్ చేయిస్తారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొందరికే అందిన ‘రైతుభరోసా’ మొత్తంగా రూ.266 కోట్లకు.. రూ.97 కోట్లు ఖాతాల్లో జమ పట్టా పాసు బుక్కులున్న రైతులు 1,92,020 మంది మూడు విడతల్లో 3 ఎకరాల్లోపు వారికి మాత్రమే అందిన వైనం పూర్తయ్యేదెప్పుడని రైతులు ఆవేదన -
ఇబ్బందిగా ఉంది
మూడు ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు రైతు భరోసా పడలేదు. నిత్యం మరికల్ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో పెట్టుబడి సాయంకు ఇబ్బందిగా మారింది. –పద్మనాభం, రైతు, అప్పంపల్లి, మరికల్ మం ఎకరా భూమికి పడలేదు మూడు ఎకరాలలోపు రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా పడింది అని అధికారులు చెబుతున్నారు. నాకు ఉన్నది ఎకరా పొలమే. ఇప్పటివరకు రైతు భరోసా తన అకౌంట్లో జమ కాలేదు. – చెన్నయ్య, కొత్తపల్లి మాకెప్పుడొస్తుందో.. మాకు 3.10 ఎకరాల పొలం ఉంది. గత వారం రోజుల క్రితం 3 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా పడిందని చెప్పారు. మాకు ఎప్పుడు రైతు భరోసా పడుతుందో తెలియని పరిస్థితి. త్వరగా అందజేస్తే పంటల పెట్టుబడికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పుతాయి. – బాల్యనాయక్, కొత్తపల్లి తండా ఆందోళన అవసరం లేదు.. రైతు భరోసా డబ్బులు రైతులకు రోజు పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు లక్ష మందికి పైగా రైతులకు వారి ఖాతాలో నగదు జమ అయ్యాయి. అర్హులైన రైతులందరికి మార్చి 31 వరకు అందరికి రైతు భరోసా వస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జాన్‌సుధాకర్, డీఏఓ ● -
స్వచ్ఛందంగా తరలింపు..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న ఆవాసాల్లో ఉంటున్న వారిని అడవి బయట పునరావాసం క ల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరలింపు ప్రక్రియ స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన వారికే చేపడతాం. పునరావాసం కింద రూ.15 లక్షల ఆర్థిక సహాయం, లేదా 2 హెక్టార్ల భూమి కేటాయింపు ఉంటుంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ సక్రమంగా ఇస్తేనే వెళతాం.. ఎన్నాళ్ల నుంచో అడవినే నమ్ముకుని ఉంటున్నాం. పులులు, వన్యప్రాణుల సంరక్షణకు మా ఊరిని ఖాళీ చేసి మరో చోటికి పంపిస్తాం అంటున్నారు. పునరావాసం కింద నష్టపరిహారాన్ని అందించి, అక్కడ సౌకర్యాలు కల్పించిన తర్వాతే వెళతాం. అందరికీ న్యాయమైన పరిహారాన్ని అందించి పునరావాస ప్రక్రియ చేపట్టాలి. – మండ్లి భౌరమ్మ, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం మాకు జీవనోపాధి కల్పించాలి.. ఏళ్లుగా ఉన్న మా ఊరిని ఖాళీ చేయించి, మమ్మల్ని మరో చోటుకి తరలిస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, పరిహారం ఎప్పుడు అందుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పునరావాసం కల్పిస్తే అక్కడ జీవనోపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. – పోషప్ప, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం ● -
అన్నింటా.. అట్టడుగు
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని సూచించే అక్షరాస్యత, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, మౌలిక సదుపాయాల కల్పన ఇలా అన్నింట్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే అట్టడుగున కొనసాగుతున్నాయి. అక్షరాస్యత విషయంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు రాష్ట్రంలోనే వెనకబడే ఉన్నాయి. ఈ జిల్లాల్లో అక్షరాస్యత శాతం కనీసం 50 శాతం కూడా మించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ● పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్స్లోనూ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 28.8 శాతం మంది విద్యార్థులు పాఠశాల దశలోనే చదువుకు దూరమవుతున్నారు. ఇక వనపర్తి జిల్లా 8.81 శాతం మంది డ్రాపౌట్స్‌తో కాస్త మెరుగ్గా ఉంది. విద్యార్థులకు, ఉపాధ్యాయుల నిష్పత్తిలోనూ గద్వాల, నారాయణపేట జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరతలో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ● తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు చివరి వరుసలో ఉన్నాయి. నారాయణపేట జిల్లా రూ.1,94,962 తో అట్టడుగున ఉండగా.. తర్వాతి వరుసలో జోగుళాంబ గద్వాల జిల్లా కొనసాగుతోంది. అభివృద్ధి పురోగతికి సూచీగా నిలిచే జీఎస్డీపీలోనూ నారాయణపేట జిల్లా చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయంలో మహబూబ్‌నగర్ జిల్లా కాస్త మెరుగ్గా మొదటి నుంచి పదో స్థానంలో కొనసాగుతోంది. ఉపాధి, పరిశ్రమలు కరువు.. ఉమ్మడి జిల్లాలో ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లోనూ వెనుకబాటు కనిపిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో కేవలం 18 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 297 పరిశ్రమలు ఉన్నాయి. పశుసంపదలో మేటి.. పశుసంపద విషయంలో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే ఉమ్మడి పాలమూరు మేటిగా నిలిచింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా 12.95 లక్షల గొర్రెలతో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. కూలీల సంఖ్య విషయానికి వస్తే గద్వాల జిల్లా 92.2 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. వనపర్తి జిల్లాలో 88.2 శాతం మంది కూలీలు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33.9 శాతం మంది సాగుదారులు ఉన్నట్టు నివేదికలో వెల్లడయింది. రాష్ట్రంలోని మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల తర్వాత నాగర్‌కర్నూల్‌లోనే అత్యధికంగా 21.4 శాతం ఎస్సీ జనాభా ఉంది. హైదరాబాద్, కరీంనగర్ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో తక్కువగా 1.5 శాతం మంది మాత్రమే ఎస్టీలు ఉన్నారు. జాతీయ రహదారుల విస్తరణ విషయంలో నల్లగొండ మొదటిస్థానంలో ఉండగా.. నాగర్‌కర్నూల్ జిల్లా 252.83 కి.మీ., విస్తీర్ణంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య) అక్షరాస్యతలో రాష్ట్రంలోనే చివరన ఉమ్మడి పాలమూరు గద్వాల, పేటలో 50 శాతంలోపే.. తలసరి ఆదాయంలోనూ అంతంత మాత్రమే మౌలిక సదుపాయాల కల్పనలో చివరి వరుసలోనే తెలంగాణ స్టాటిస్టిక్ రిపోర్టులో వెల్లడి జనాభా సాంద్రతలో.. (ప్రతి చదరపు కిలోమీటర్‌కు) -
కేజీబీవీ జీసీడీఓపై వేటు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) జీసీడీఓ(గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్)పై వేటు పడింది. విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఓ పాఠశాలలో విచారణకు సంబంధించి అనుకూలంగా రిపోర్టు ఇవ్వనందుకే జీసీడీఓను తొలగించారని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల రాజాపూర్ కేజీబీవీలో ఎస్ఓ విద్యార్థినులకు సరిగా గుడ్లు, అరటి పండ్లు ఇవ్వడం లేదని, విద్యార్థినులను పాఠశాలలో చేర్చుకునే విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉపాధ్యాయులు రెండు గ్రూపులుగా విడిపోయి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు జీబీవీ వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో డీఈఓ విచారణకు ఆదేశించారు. రాజాపూర్ ఎంఈఓ, కేజీబీవీ జీసీడీఓ రాధ సైతం విచారణకు వెళ్లి రిపోర్టును సమర్పించారు. ఈ క్రమంలో విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటారని అనుకున్న క్రమంలో కేజీబీవీ జీసీడీఓ రాధను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. విద్యాశాఖ అధికారుల తీరుపై యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌తో పాటు పలువురు సంఘం నాయకులు డీఈఓను కలిశారు. వారు మాట్లాడుతూ ఇలాంటి పరిణామాలు బాధాకరమని, సంబంధం లేకుండా ఒక అధికారిణి తొలగించడం సరికాదని విమర్శించారు. ఎవరికి మేలు చేసేందుకు తొలగించారని, గతంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని తీసుకువచ్చేందుకు అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. జీసీడీఓగా నియమించేందుకు అర్హత లేకుంటే మొదట విధుల్లోకి తీసుకోకుండా ఉండాల్సిందని, ఇప్పుడు అర్ధాంతరంగా తొలగిస్తే సంబంధిత అధికారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, ఈ అంశాన్ని పరిశీలించాలన్నారు. తమకు అనుకూలంగా రిపోర్టు రాయనందుకే కొందరు కుట్రలు పన్ని జీసీడీఓ తొలగించారని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విధుల నుంచి తొలగిస్తూ మహబూబ్‌నగర్ డీఈఓ ఉత్తర్వులు రిపోర్టు అనుకూలంగా ఇవ్వనందుకేతొలగించారని ఆరోపణలు -
ఏసీబీకి చిక్కిన మక్తల్ సీఐ
మక్తల్: ఓ కేసు విషయంలో వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి చెందిన సందె వెంకట్రాములు మక్తల్‌లో శ్రీనిధి అనే సొసైటీని ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి ప్రతినెలా కిస్తుల ప్రకారం డబ్బులు కట్టిస్తున్నారు. అయితే సొసైటీలో కొందరు వ్యక్తులతో బేధాభిప్రాయాలు రావడంతో మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందె వెంకట్రాములుపై కేసు నమోదు చేశారు. అయితే సందె వెంకట్రాములు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ప్రతి సోమవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌కు రావాలని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ వచ్చింది. ఆఫీసు, ఇళ్లలో సోదాలు.. కేసుకు సంబంధించిన చార్జీషీటు కోర్టులో దాఖలు చేయాల్సిన విషయంలో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను మక్తల్ సీఐ జి.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సందె వెంకట్రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం మంగళవారం మక్తల్ పోలీస్ కార్యాలయంలో నిందితుడి నుంచి కానిస్టేబుల్ నర్సింహ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివారెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయం, కానిస్టేబుళ్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాడుల్లో ఏసీబీ అధికారులు లింగస్వామి, జిలాని సయ్యద్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం ఓ కేసు విషయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
కూలీలు, సాగుదారులు
87.6%కూలీలు సాగుదారులు92.2%86.9%88.2%33.9 %27.3 %81.1%25.9 %22.3 %20.8 %జో.గద్వాలవనపర్తినారాయణపేటనాగర్కర్నూల్మహబూబ్నగర్ -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు ఈ నెల 21న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వస్తున్నారని.. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రం సమీపంలోని మెడికల్ కళాశాలలో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 21న మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్‌లో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో ఏర్పాటుచేసే హెలిప్యాడ్ వద్దకు చేరుకుని జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించడంతో పాటు జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం అప్పక్‌పల్లి వద్ద ఉన్న మెడికల్ కళాశాలలో వంద పడకల ఎంసీహెచ్ విభాగంతో పాటు నర్సింగ్ కళాశాల, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. కళాశాల వద్ద ఏర్పాటుచేసే పబ్లిక్ మీటింగ్‌లో సీఎం పాల్గొంటారని చెప్పారు. అక్కడి నుంచి తిరిగి సాయంత్రం హైదరాబాద్ బయలుదేరుతారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు దగ్గరుండి పూర్తిచేయాలని సూచించారు. సింగారం నుంచి అప్పక్‌పల్లి వరకు రోడ్డుతో పాటు ఇరువైపులా స్థలాన్ని శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమాల్లో సీఎంతో పాటు పాల్గొనే వీవీఐపీలకు అన్ని వసతులను సమకూర్చాలని.. మధ్యాహ్న భోజనం మెడికల్ కళాశాలలోనే ఏర్పాటు చేయాలన్నారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. పబ్లిక్ మీటింగ్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. పోలీసు శాఖపరంగా ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతకుముందు సింగారం చౌరస్తాలో సీఎం ప్రారంభించే పెట్రోల్ బంక్, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ స్థలం, హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రాంకిషన్, టీజీఎంఐడీసీ ఈఈ సురేందర్‌రెడ్డి, ఎస్ఈ జైపాల్‌రెడ్డి, ఆర్టీఓ మేఘాగాంధీ, డీఎస్పీ లింగయ్య తదితరులు ఉన్నారు. బాధిత మహిళలకు ‘భరోసా’ జిల్లా పోలీసు శాఖ భరోసా కేంద్రాల ద్వారా బాధిత మహిళలు, బాలికలకు అండగా నిలవడం అభినందనీయమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ కాలనీలో భరోసా కేంద్రం వార్షికోత్సవానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ యోగేష్ గౌతమ్ హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రం పనితీరును నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. ఏడాది కాలంలో 71 కేసులు నమోదయ్యాయని.. అందులో పోక్సో గ్రేవ్ 51, నాన్ గ్రేవ్ 9, అత్యాచార కేసులు 11 ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని బాధిత మహిళలు, బాలికలకు భరోసా కేంద్రం నిర్వాహకులు అండగా ఉంటూ.. వారికి నిరంతరం రక్షణ కల్పించాలన్నారు. బాధితులకు న్యాయపరమైన సూచనలు, కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. అదే విధంగా బాధితులకు నైపుణ్యాలను నేర్పించి.. సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహద పడాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా చూస్తున్నట్లు చెప్పారు. బాధితులకు సురక్షిత వాతావరణంలో చేయూత అందించేందుకు భరోసా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హింస, లైంగిక వేధింపులకు గురైన బాలికలు, మహిళలు మరల అటువంటి వాటి బారిన పడకుండా చూడటమే భరోసా సెంటర్ లక్ష్యమన్నారు. బాధితులకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న భరోసా కేంద్రం సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎన్.లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, భరోసా కేంద్రం ఇన్చార్జి ఎస్ఐ సునీత, కోఆర్డినేటర్ ప్రమీల, దేవి, చైల్డ్‌లైన్ నర్సింహులు, సఖి సెంటర్ రమాదేవి, కవిత, సీడబ్ల్యూసీ నుంచి కమల, నరేష్ పాల్గొన్నారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
పోలీసు బందోబస్తు నడుమ..
మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో చేపట్టిన భూ సర్వేపై రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అధికార బృందాన్ని అడ్డుకుంటున్నారు. ఊట్కూర్ మండలంలోని బాపూర్, దామరగిద్ద మండలంలోని వత్తుగుండ్ల తండా, మక్తల్ మండలం కాట్రేవ్‌పల్లి రైతులు భూ సర్వేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు నడుమ అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. రైతులు భూ నష్టపరిహారం చెల్లింపు విషయంలో నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేను కలిసి విన్నవించాలని.. సర్వే పనులను అడ్డుకోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. -
ఆదిలోనే అవాంతరాలు..!
నారాయణపేటబుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025వివరాలు 8లో uనారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట –కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఓవైపు భూములు కోల్పోతున్న రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. మరోవైపు సర్వేయర్ల కొరత వేధిస్తోంది. ఫలితంగా భూ సర్వే ప్రక్రియ సాఫీగా సాగక ఇరిగేషన్ అధికారులు, సర్వేయర్లు తలలు పట్టుకుంటున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు ల్యాండ్ అకేషన్ ఆఫీసర్, ఆర్డీఓ రాంచందర్ నాయక్ పర్యవేక్షణలో ఈ నెల 15 నుంచి భూసేకరణ సర్వే కొనసాగుతోంది. అయితే పక్షం రోజుల్లో సర్వేను పూర్తిచేయాలని అధికారులు సర్వేయర్ల బృందంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న 9మంది సర్వేయర్లతో 15 రోజుల్లో సర్వేను పూర్తి చేయడం కష్టతరమని వారు బహిరంగంగా చెబుతున్నారు. పక్కా జిల్లాల నుంచి మరి కొంతమంది సర్వేయర్లను కేటాయిస్తే నిర్ణీత గడువులోగా సర్వే చేసేందుకు వీలవుతుందని ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సర్వేయర్ల కొరతను తీర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు సర్వేయర్లు చెబుతున్నారు. 373.18 ఎకరాల సర్వే.. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం స్టేజ్–1 భూత్పూర్ నుంచి ఊట్కూర్ ట్యాంక్, స్టేజ్–2 ఊట్కూర్ ట్యాంక్ నుంచి జయమ్మ ట్యాంక్ వరకు, స్టేజ్–3 జయమ్మ ట్యాంక్ నుంచి కానుకుర్తి ట్యాంక్ వరకు చేపట్టనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి సంయుక్తంగా సర్వే చేయాలని ల్యాండ్ అకేషన్ ఆఫీసర్, ఆర్డీఓ రాంచందర్ నాయక్ సూచిస్తూ ఈ నెల 13న ప్రొసీడింగ్‌ను సర్వే ఏడీకి పంపించారు. మక్తల్ మండలంలోని కాట్రేవ్‌పల్లి నుంచి కానుకుర్తి వరకు దాదాపు 373.18 ఎకరాలకు సంబంధించి భూ సర్వే చేపట్టాలని ప్రొసీడింగ్‌లో పేర్కొన్నారు. పొంతన లేని లెక్కలు.. వాస్తవానికి ఇరిగేషన్ అధికారులు డీజీపీఎస్ సర్వే నిమిత్తం మార్కింగ్ ఇస్తున్నారు. ఈ మేరకు సర్వేయర్లు జీపీఎస్ పరికరంతో కొలతలు చేస్తున్నారు. అయితే ఇరిగేషన్ శాఖ అధికారుల లెక్కలకు, సర్వేయర్ల లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న సర్వేయర్లలో ఎవరికి సరిగా సబ్ డివిజన్ పని రాదని జిల్లా ఆధికారే అంటున్నారని ఇరిగేషన్ ఆధికారులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి జీపీఎస్‌తో సర్వే చేస్తే సుమారు 3 నుంచి 5 మీటర్ల వరకు తేడా వస్తుందని.. విషయాన్ని జిల్లా సర్వే అధికారులకు చెప్పినా పెడచెవిన పెడుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. కాగా, సర్వే చేయడానికి ఆర్డర్స్ ఇచ్చి 15 రోజులు గడిచినా కేవలం 180 ఎకరాల సర్వే మాత్రమే జరిగింది. ఇప్పటి వరకు సబ్ డివిజన్ రికార్డు సమర్పించలేదంటే సర్వేయర్ల బృందం పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా కలెక్టర్ సర్వే శాఖపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తే తప్ప భూసేకరణలో ముందడుగు పడే అవకాశం కనిపించడం లేదు. మండలాల వారీగాభూ సర్వే ఇలా.. మక్తల్ మండలంలోని కాట్రేవ్‌పల్లిలో 68.30 ఎకరాలు, ఎర్గాన్పల్లిలో 5.25, మంతన్‌గోడ్‌లో 10.30, టేకులపల్లిలో 2.11, కాచ్వార్‌లో 14.25 ఎకరాల సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఊట్కూర్ మండలంలోని వెడివెల్లిలో 24.09, పూలిమామిడిలో 1.02, పెద్దపొర్లలో 15.25, జీర్నల్లిలో 9.27, దంతన్‌పల్లిలో 58.02, బాపూర్‌లో 70.28, తిప్రాస్‌పల్లిలో 3.36 ఎకరాలు. నారాయణపేట మండలంలోని జాజాపూర్‌లో 9.33, సింగారంలో 10.17, కౌరంపల్లిలో 11.20, పేరపళ్లలో 13.03 ఎకరాలు. దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో 11. 33, దామరగిద్దలో 5.07, లింగారెడ్డిపల్లి లో 16.20, గడిమున్కన్‌పల్లిలో 10.05 ఎకరాల సర్వే చేపట్టాలని ప్రొసీడింగ్‌లో పేర్కొన్నారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సర్వేకు అడ్డంకులు జిల్లాలో వేధిస్తున్న సర్వేయర్ల కొరత మరోవైపు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత 15 రోజుల్లో సర్వే కష్టమేనంటున్న అధికారులు రైతులు సహకరించాలి.. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కావాల్సిన భూమి సేకరణకు రైతులు సహకరించాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. భూసేకరణ ప్రక్రియ త్వరగా జరిగితే ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతాయి. ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందుతుంది. – రాంచందర్‌నాయక్, ఆర్డీఓ, నారాయణపేట -
అపార్‌కు ఆటంకాలు
మరికల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) గుర్తింపు కార్డు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతుంది. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివి విద్యార్థులకు అందజేయనున్నారు. ఇది విద్యార్థి జీవితకాలం గుర్తింపుకార్డుగా ఉపయోగపడే ఈ కార్డుకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. జిల్లాలో 678 పాఠశాలలు ఉండగా ఈ నెల 17 నాటికి కేవలం 31.54 శాతం మాత్రమే పూర్తి చేసుకుంది. అత్యధికంగా దామరగిద్ద మండలంలో 45 శాతం పూర్తి చేయగా.. అత్యల్పంగా నర్వ మండలంలో 21 శాతం నమోదైంది. విద్యార్థులు ఉన్నత చదువులకు 12 అంకెల నంబర్‌తో కూడిన అపార్ గుర్తింపు కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్ణయించింది. ఇందుకుగాను రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీని అమలుకు ఇటవల చర్యలు చేపట్టింది. అపార్ కార్డు కోసం విద్యా సంస్థల నిర్వాహకులు ఆధార్ కార్డు ప్రకారం విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే, ఆధార్‌కార్డుల్లో తప్పులను సరి చేసుకునేందుకు విద్యార్థులు ఆధార్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కాని అక్కడ తీవ్రజాప్యం కావడం వల్ల అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే యూడైస్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదర్శ, గురుకుల, కేజీబీవీలు, ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం లక్ష మందికి పైగా విద్యార్థులున్నారు. ఏడాది నుంచి విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నా ఎంతకీ లక్ష్యం చేరడంలేదు. ఐడీలు కేటాయిస్తున్నప్పటికీ ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఆధార్ కేంద్రాలకు పరుగులు పాఠశాలల్లో చేర్పించే సమయంలో విద్యార్థుల వివరాలు, ఆధార్‌కార్డులోని వివరాలు ఒకే విధంగా ఉంటేనే అపార్ నంబరు వస్తుంది. లేని పక్షంలో వెబ్సైట్లో వివరాలు నమోదు కావడం లేదు. పాఠశాలలోని వివరాలు మార్చేందుకు వీలుండదు. వివరాలు తప్పుగా ఉన్న విద్యార్థులకు జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సంబంధిత ఉపాధ్యాయులు చెబుతుండంతో ఆధార్ వివరాలను మార్చేందుకు ఆధార్‌కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ మార్చాలంటే ఆధారాలతో కూడిన ధ్రువ పత్రాలు కావాలంటున్నారు. వాటిని సంపాదించాలంటే తలకుమించిన భారమే. పేరు పూర్తిగా లేకపోవడం, పుట్టిన తేదీల్లో తేడా ఉండటంతో అపార్‌లో నమోదులో సమస్యలు ఎదురవుతున్నట్లు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. ఒక్కసారి విద్యార్థుల వివరాలు ఆపార్లో నమోదైతే ఇక మార్పులు చేసుకోవడానికి ఎలాంటి వీలుండదు. వేగవంతం చేస్తాం ఆధార్‌కార్డుల్లో విద్యార్థుల వివరాలు సక్రమంగా లేకపోవడం, వాటిని సరిచేసుకునేందుకు అధిక సమయం పడుతుండడంతో అపార్ కార్డు నమోదు ప్రక్రియ ఆలస్యంగా సాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 31.54 శాతం నమోదు చేశాం. అపార్‌కార్డు గుర్తింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – గోవిందరాజులు, డీఈఓ ఎల్కేజీ నుంచి విద్యార్థులకుఅపార్ ఐడీలు జిల్లాలో ఇప్పటికీ 31.54 శాతమే పూర్తి మొత్తం విద్యార్థులు 1,03,363 మంది ఆధార్ ఆధారంగా వివరాల నమోదు పాఠశాలలో, ఆధార్ వివరాల్లో పేర్లు, పుట్టిన తేదీల్లో తేడాతో ఇబ్బందులు మార్పు చేర్పులకు సమయం పడుతుండడంతో తీవ్ర జాప్యం -
కార్చిచ్చు ముప్పు..
● అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందస్తు చర్యలు ● క్విక్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ● వీవ్లైన్స్, ఫైర్లైన్స్తో మంటల అదుపు ● అటవీ సమీప గ్రామాల్లో అవగాహన సదస్సులు ● నల్లమలలో విలువైన ఔషధ మొక్కలు, వన్యప్రాణులు అచ్చంపేట: వేసవి నేపథ్యంలో నల్లమలలోని వన్యప్రాణులతోపాటు విలువైన అటవీ సంపదకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అడవుల్లో చెట్ల ఆకులు రాలే సీజన్. చెట్ల నుంచి కింద పడిన ఆకులు ఎండిపోవడంతోపాటు కుప్పలుగా కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వాటిపై నిప్పు పడితే కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. తద్వారా అటవీ సంపదతోపాటు వన్యప్రాణులకూ ముప్పు వాటిల్లుతోంది. అయితే జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ విపత్తును నివారించవచ్చని భావిస్తున్న అటవీశాఖ అధికారులు.. జిల్లాలోని అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అడవి బుగ్గిపాలు కాకుండా కాపాడుకునేందుకు ముందస్తుగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా వీవ్లెన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అటవీశాఖ సిబ్బందితో అడవిలో ఎండిన ఆకులను వరుసగా పేర్చి కాల్చివేస్తున్నారు. ఒకవేళ అగ్గి రాజుకున్నా శరవేగంగా విస్తరించకుండా ఈ ఫైర్ లైన్స్‌తో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. నల్లటి రంగుతో సరిహద్దు వేసవిలో చెట్ల ఆకులు రాలడం వల్ల చిన్నపాటి నిప్పురవ్వ పడినా అడవి దావనంలా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది నేలపై రాలిన చెట్ల ఆకులను ఒకచోట పోగు చేసి.. కిలోమీటర్ పొడవునా కాల్చుతున్నారు. తద్వారా నిప్పు అంటుకున్నా మంటలు విస్తరించవు. మరోవైపు నల్లటి రంగుతో సరిహద్దు గీత ఏర్పడి వన్యప్రాణులు సైతం అడవి దాటి బయటకు వెళ్లకుండా ఫైర్‌లైన్స్ ఉపయోగపడతాయి. విలువైన చెట్లు.. ఔషధ మొక్కలు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా నల్లమల అమ్రాబాద్ అభయారణ్యం గుర్తింపు పొందింది. ఇక్కడ ఔషధ మొక్కలతోపాటు టేకు, నల్లమద్ది, వేప, చేదు వేప, ఇప్ప తదితర చెట్లు అధికంగా ఉన్నాయి. వేసవి ప్రారంభంలోనే ఆకులు రాలి ఎండిపోయాయి. వాహనాల్లో వెళ్తున్న వారు సిగరెట్, బీడీలు తాగి.. పూర్తిగా ఆర్పకుండానే రోడ్డు పక్కనున్న అడవుల్లోకి విసురుతుంటారు. మరోవైపు పశువుల కాపరులు, అడవుల్లోకి ప్రవేశించే ఇతర వ్యక్తులు సైతం చుట్ట, బీడీ, సిగరెట్లు కాల్చిన అగ్గిపుల్లలను నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. తద్వారా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. శాటిలైట్ సహాయంతో.. నల్లమల అటవీ ప్రాంతంలో అగ్గి అంటుకున్న వెంటనే ఆర్పేందుకు వీలుగా అటవీశాఖ అధికారులు తక్షణ స్పందన (క్విక్ రెస్పాన్స్) బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రేయింబవళ్లు ఎక్కడ అగ్గి రాజుకున్నా శాటిలైట్ సహాయంతో ప్రమాదాన్ని గుర్తించి.. మంటలను ఆర్పివేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మరోవైపు అటవీ సమీప గ్రామాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
21న జిల్లాకు సీఎం రాక
నారాయణపేట: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 21న నారాయణపేటకు రానున్నారని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం హెలిప్యాడ్ కోసం స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్, స్టేజీ తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు, వాటిలో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, రెండు పోలీస్ స్టేషన్ల భవన నిర్మాణాలు, పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభించనున్నారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ బెన్‌షాలం, ట్రైనీ కలెక్టర్ గరీమానరుల, అదనపు ఎస్పీ రియాజ్ హూల్ హక్, ఆర్డీఓ రాంచందర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాంకిషన్, సిఐలు శివ శంకర్, రామ్‌లాల్ ఉన్నారు. బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన నారాయణపేట రూరల్: నూతన మెడికల్ కళాశాల వద్ద వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు సీఎం జిల్లాకు రానుండగా.. బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. మండలంలోని అప్పక్‌పల్లి శివారులో జరగనున్న కార్యక్రమానికి భద్రతతో పాటు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై జిల్లా పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఇతర అంశాలపై సమీక్షించారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. -
శ్రీశైలం యాత్రికులకు 24 గంటలు అనుమతి
మన్ననూర్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్‌పోస్టుల ద్వారా 24 గంటలు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు డీఎఫ్ఓ రోహిత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల చెందిన శివమాలధారులు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే అటవీ ప్రాంతంలో ప్రయాణించే క్రమంలో ఎలాంటి శబ్దం చేయరాదన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 18 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సివిల్ ఫిర్యాదులను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదుదురాలతో ఎస్పీ నేరుగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించాల్సిదిగా సీఐ, ఎస్ఐలకు సూచించారు. -
నిరంతరం గస్తీ..
అటవీ పరిరక్షణకు గస్తీ ముమ్మరం చేశాం. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాం. ఆకతాయిలు, పశువుల కాపరులు, ఇతరులు అడవుల్లోకి అగ్గిపెట్టెలు తీసుకుపోకుండా అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు వెంట వెళ్లే వారు నిప్పు వేసినా అడవి కాలకుండా ఇరువైపులా 20 – 30 మీటర్ల వరకు గడ్డి, ఆకులను ముందుగానే కాల్చివేస్తున్నాం. – గురుప్రసాద్, ఎఫ్ఆర్ఓ, దోమలపెంట కఠిన చర్యలు.. ఎవరైనా అడవిలో నిప్పు పెట్టినట్లు తేలితే అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అడవులు అగ్నిప్రమాదాల బారిన పడకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాం. వీవ్లైన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటుతో ఒకచోట నుంచి మరో చోటకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాం. – రోహిత్‌రెడ్డి, డీఎఫ్ఓ ● -
శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
ఊట్కూర్: ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని ఎంపీ డీ.కే అరుణ అన్నారు. మండలంలోని చిన్నపోర్లలో సోమవారం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆమెతోపాటు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఆదిత్య పరాశ్రీ, సిద్దలింగేశ్వర స్వామి, శాంతనంద్ పురోహిత్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు శ్యాంకుమార్, సామాజిక సమసరత ప్రముఖ్ అప్పల ప్రసాద్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం డీ.కే. అరుణ మాట్లాడుతూ శివాజీ స్ఫూర్తి తో గ్రామ గ్రామాన యువత ఏకమై దేశ, ధర్మ రక్షణ కోసం కృషిచేయాలన్నారు. పిల్లల భవష్యత్తు కోసం సమాజంలో భారతీయ సనాతన ధర్మం పట్ల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కుర్మన్న, కొండయ్య, రతంగ్‌పాండురెడ్డి, బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, పగుడాకుల శ్రీనివాసులు, బంగ్లా లక్ష్మికాంత్‌రెడ్డి, భాస్కర్, రవీంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పది’ ఇంటర్నల్ మార్కుల పరిశీలన ప్రారంభం నారాయణపేట రూరల్: విద్యాశాఖ ఏర్పాటు చేసిన సీసీఈ విధానంలో భాగంగా టెన్త్ విద్యార్థులకు పాఠశాలలో నిర్వహించే కృత్యాలకు సంబందించి సబ్జెక్ట్ టీచర్లు వేసిన ఇంటర్నల్ మార్కుల పరిశీలన కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ఆ పాఠశాలలో నిర్వహించిన ఫార్మెటివ్ పరీక్షలు, ప్రాజెక్టు ఇతర అంశాలకు సంబందించి కేటాయించిన 120 మార్కులను సరిచూశారు. జిల్లా వ్యాప్తంగా 126 ఉన్నత పాఠశాలలకు గాను మండలాల వారీగా 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో జీహెచ్ఎం నేతృత్వంలో ఒక లాంగ్వేజ్ టీచర్, మరో నాన్ లాంగ్వేజ్ టీచర్లు సభ్యులుగా ఉన్నారు. మూడు రోజుల పాటు ఒక్కో టీమ్ ఆరు పాఠశాలను పరిశీలించే విధంగా షెడ్యుల్డ్ అందించారు. మొదటిరోజు 45 పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. మార్కుల పరిశీలన చేసి ఆన్లైన్ అప్లోడ్ చేసి, డీఈఓ కార్యాలయంలో నివే దిక అందిస్తారు. అదేవిధంగా ఈ నెలలో జరిగే ఫ్రిఫైనల్ పరీక్షల కోసం విద్యార్థులకు సూచనలు చేయనున్నారు. అలరించిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు స్టేషన్ మహబూబ్‌నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు అలరిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం మూడోరోజు శారద కళా పరిషత్ (మహబూబ్‌నగర్) ఆధ్వర్యంలో మయసభ దుర్యోధన, మైత్రి కళా సమితి (నంచర్ల), శివాంజనేయ నాట్య కళా మండలి (చిన్నరాజమూర్) సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలోని శ్రీకృష్ణ, కుచేల ఘట్టం, జ్ఞానమృత కళామండలి (కోయిలకొండ) ఆధ్వర్యంలో గయోపాఖ్యాన యుద్ధ ఘట్టం, గరుత్మంత నారద సంవాదం నాటకాలను ప్రదర్శించారు. కళాకారులు తమ అభినయంతో అలరించారు. గాయకులు చెన్నకేశవులు భక్తిపాటలు పాడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ పదేళ్ల నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో మన్యంకొండ క్షేత్రంలో పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం చివరి రోజు పద్యనాటక ప్రదర్శనల్లో భాగంగా రాజరాజేశ్వరి భజన మండలి (మహబూబ్‌నగర్), శ్రీరామాంజనేయ భజన మండలి (బొక్కలోనిపల్లి) ఆధ్వర్యంలో భజనలు నిర్వహిస్తారని, పుట్టోజు చంద్రమౌళి బృందంచే అన్నమయ్య సంకీర్తనాలహరి, ఇతర భక్తిపాటల కార్యక్ర మం ఉంటుంది. కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు శ్రవణ్‌కుమార్, సూ పరింటెండెంట్ నిత్యానందాచారి, జిల్లా కళాకారుల సంస్థ కోశాధికారి ఎండీ సలీం, శ్రీమిత్ర కళానాట్య మండలి ఉపాధ్యక్షుడు నర్సింహులు, కళాకారులు కాశన్న పాల్గొన్నారు. -
ఎత్తిపోతల సర్వే పనులను అడ్డుకున్న రైతులు
మక్తల్: మండలంలోని కాట్రేవ్‌పల్లి, యర్నాగ్పల్లి గ్రామాల్లో సోమవారం అధికారులు చేపట్టిన మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన కాల్వ నిర్మాణంతో తమ జీవనాధారమైన భూములు పోతాయని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు సర్వే చేయొద్దని తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న నారాయణపేట డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ చంద్రశేఖర్, తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే భీమా ప్రాజెక్టులో ఇప్పటికే భూము లు కోల్పోయామని.. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఉన్న భూములను తీసుకుంటే రోడ్డున పడతామని రైతులు వాపోయారు. భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, లేనిపక్షంలో ఎకరాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో అధికారులు సర్వే చేయకుండా వెనుదిరిగారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
నారాయణపేట: పదో తరగతి వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగారంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ హాస్టల్ విద్యార్థులకు ప్రేరణ తరగతుల నిర్వహణలో భాగంగా నిర్వహించిన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సబ్జెక్టులపై పట్టు సాధించడానికి కష్టపడి చదవాలని, ప్రతిరోజు సబ్జెక్టులపై ఉపాధ్యాయులతో అవగాహన పెంచుకోవాలని సూచించారు. హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుందని, పరీక్షలకు 15 రోజుల ముందు అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ కావాలన్నారు. అనంతరం ఆల్ ఇన్ వన్ క్వశ్చన్ బ్యాంక్, బీసీ వెల్ఫేర్ మంత్రి ఇన్సిరేషన్ లెటర్ల కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి అబ్దుల్ కలీం, డీఆర్డీఓ మొగులప్ప, డీపీఆర్ఓ రషీద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మద్దూరు మండలంలోని పెదిరిపాడ్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. -
పంటచిత్రం.. ఉపగ్రహంతో నిక్షిప్తం
రైతులకు ప్రయోజనం పంటల సాగు విస్తీర్ణం శాసీ్త్రయంగా నమోదు చేసేందుకు నూతన విధానం అమలు చేస్తుంది. యాప్‌తో గుర్తించిన ప్రాంతాల్లో ఫొటోతో సహా వివరాలను నమోదు చేయడంతో పంటల వివరాల్లో కచ్చితత్వం ఉంటుంది. రైతులు మార్కెట్లకు వెళ్తే మద్దతు ధర చెల్లించేందుకు ప్రయోజనం కలుగుతుంది. సర్వేలో నమోదు అయితే ఇబ్బందులు తప్పుతాయి. – వెంకటేష్, డీఏఓ, మహబూబ్నగర్మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు ఏ పంట వేశారో క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి పక్కాగా డిజిటల్ క్రాప్ సర్వేతో నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ (పంట) సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రతి క్లస్టర్లో 2 వేల ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఒక్కో ఏఈఓ పరిధిలో 5 వేల ఎకరాలు ఉంటే.. 2 వేల ఎకరాలు సర్వే, మిగతా ఎకరాలు సాధారణ పంట నమోదు చేయాలని సూచించారు. ఈ విధానం వల్ల సాగు చేసే పంటలు, విస్తీర్ణం, హద్దులతో సహా గుర్తించడంతో నమోదు ప్రక్రియ ప్రామాణికంగా ఉంటుందని భావిస్తున్నారు. సీజన్ల వారీగా సమగ్ర సర్వే.. జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్ల వారీగా ఏటా ప్రభుత్వం పంటల సమగ్ర సర్వే నిర్వహిస్తుంది. సంబంధిత ఏఈఓలు పంట పొలాలకు వెళ్లకుండా రైతులను అడిగి రాసుకోవడంతో పంట ఉత్పత్తులను విక్రయించే సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పంటల సాగు వివరాల సేకరణ పక్కాగా ఉండాలనే ఆలోచనతో డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. 2022లో శాటిలైట్ సాయంతో పంటల వివరాలు నమోదు చేసేందుకు జిల్లాలో పలు స్థానాలను గుర్తించి ప్రయోగాత్మకంగా సర్వే చేశారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 15 వేల లొకేషన్ పాయింట్లు గుర్తించగా.. జిల్లాకు కొన్ని స్థానాలను కేటాయించి పంటల నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. చాలా గ్రామాల్లో కాడా స్ట్రాల్ మ్యాప్‌లు లేకపోవడం, పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని సర్వే చేసేందుకు వ్యవసాయ విస్తరణాధికారులు నిరాకరించడంతో అప్పట్లో డిజిటల్ సర్వేను వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ డిజిటల్ సర్వే మొదలుపెట్టారు. కానీ, ఇలా చేస్తేనే కచ్చితంగా ఏ పంట వేశారనేది నమోదుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో జిల్లాలో ఐదు రోజుల క్రితం ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేపట్టారు. ఏటా వానాకాలం, యాసంగిలో పంటల నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక యాప్‌తో నమోదు వ్యవసాయ సిబ్బంది సర్వే నంబర్లో ఉండే పంట పొలాన్ని చూసి.. పండిస్తున్న పంట వివరాలను నమోదు చేయడంతోపాటు ఫొటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏఈఓ కచ్చితంగా పంట దగ్గరికి వెళ్లి.. ఫొటో తీసి అక్కడే యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. పంట ఫొటో సర్వే నంబరు భూమికి 25 మీటర్ల పరిధిలో ఉంటేనే యాప్ పనిచేస్తుంది. కాడాస్ట్రాల్ మ్యాప్ ఉంటే సూచించిన సర్వే నంబర్ ఎక్కడుందనేది గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. మ్యాప్‌లు లేని ప్రాంతాల్లో సర్వే నంబర్ ఎక్కడ ఉందనేది తెలుసుకొని సర్వేలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ పంట సాగు చేశారు.. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలు పక్కాగా నమోదు చేయాల్సి ఉంటుంది. పంట లేకుంటే నో క్రాప్ అని నమోదు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. పంట బీమా, ఉత్పత్తుల క్రయవిక్రయాలు, రైతు బీమా, రైతు భరోసా తదితర పథకాలను డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పక్కాగా అమలు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. పక్కాగా సాగు లెక్క కోసం ప్రత్యేక యాప్ -
వీడని మిస్టరీ
● ఏళ్లు గడుస్తున్నా హత్య కేసుల్లో దోషులను గుర్తించని పోలీసులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లోనే పలు మర్డర్ కేసులు ● రాజకీయంగా సంచలనం సృష్టించినవి సైతం అదే తీరు ● రెండు, మూడు రోజుల్లో దొరక్కుంటే అంతే సంగతులు.. ● ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా ఛేదించడంలో విఫలం సాక్షి, నాగర్‌కర్నూల్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి నేర పరిశోధన, కేసుల ఛేదింపుల్లో పోలీసులకు ఆయుధంగా మారుతోంది. సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు, ఫోరెన్సిక్ ఆధారాల సాయంతో హత్య కేసులను ఛేదించడం సులభతరం అవుతోంది. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని హత్యకేసుల్లో నిందితులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. మరికొన్ని కేసుల విచారణ ఏళ్లతరబడిగా కొనసాగుతోంది. చాలా సందర్భాల్లో రెండు, మూడు రోజుల్లో నిందితులు పట్టుబడకపోతే ఆ కేసు పెండింగ్‌లో పడిపోతోంది. ఉమ్మడి జిల్లాలో సంచలనం కలిగించిన హత్య కేసుల్లోనూ నిందితులను గుర్తించలేకపోవడం పోలీసుల పనితీరుకు మచ్చగా నిలుస్తోంది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌లోనే ఎక్కువ గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33 హత్యలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో ఎక్కువగా నేరాలు నమోదయ్యాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 30 హత్యలు జరిగాయి. ఆ తర్వాత వనపర్తిలో 14, జోగుళాంబ గద్వాలలో 9, నారాయణపేట జిల్లాలో 8 హత్య కేసులు నమోదయ్యాయి. విచారణ కొనసాగుతోంది.. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో వ్యక్తి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇంకా నిందితులను గుర్తించలేదు. ఈ కేసు మినహా ఎక్కడా మర్డర్ కేసులు పెండింగ్‌లో లేవు. ఎప్పటికప్పుడు పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. – వెంకటేశ్వరరావు, డీఎస్పీ, వనపర్తి -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
మద్దూరు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటాలని.. ఇందుకోసం ప్రతి కార్యకర్తల బూత్ స్థాయి నుంచి కృషి చేయాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ వెంకటయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మద్దూరు, కొత్తపల్లి, కోస్గి మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేంద్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు శంకర్, వెంకటయ్య, విజ యభాస్కర్‌రెడ్డి, రాజు, సాయిలు, భరత్, రవికుమార్, కాశీ, నరేష తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు నారాయణపేట రూరల్: నారాయణపేట జిల్లాకు చెందిన ఇద్దరు దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. దామరగిద్ద గ్రామానికి చెందిన కనకప్ప ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన టీ–45 పరుగుపందెం 100 మీటర్లు, 200 మీటర్ల పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచాడు. దీంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అదేవిధంగా మాగనూర్ మండలం కొల్పూర్ గ్రామానికి చెందిన లింగప్ప టీ –44 పరుగుపందెం 400 మీటర్లు, 1500 మీటర్ల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో జిల్లా నుంచి ఇరువురు క్రీడాకారులు సోమవారం నుంచి చైన్నెలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. వీరికి మక్తల్ మాజీ ఎంపీటీసీ బాలకిష్టారెడ్డి రూ.10వేలు ఆర్థికసాయం అందించినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ రమణ తెలిపారు. పోటెత్తిన వేరుశనగ నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం వేరుశనగ పోటెత్తింది. చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఆదివారం మార్కెట్‌కు ఒక్కసారిగా 10,071 బస్తాల వేరుశనగ తీసుకువచ్చారు. అయితే క్వింటాల్ గరిష్టంగా రూ.6,960, కనిష్టంగా రూ.4,884 ధర వచ్చిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. ఎవరికై నా ఇబ్బందులు కలిగితే వెంటనే వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేయాలని చైర్మన్ లింగం రైతులకు సూచించారు. -
ప్రగతి పరుగులు..!
నారాయణపేట: పేట.. జిల్లాగా ఆవిర్భవించి నేటికి ఆరెళ్లు పూర్తయ్యింది. 2019 ఫిబ్రవరి 17న.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన నూతనంగా జిల్లాగా ఆవిర్భవించింది. మొత్తం 11 మండలాలు, 252 రెవెన్యూ గ్రామాలు.. 280 జీపీలతో ఏర్పాటైంది. 2023లో మరో రెండు మండలాలు గుండుమాల్, కొత్తపల్లి పెరిగాయి. మొదట మూడు మున్సిపాలిటీలు నారాయణపేట, మక్తల్, కోస్గి ఉండగా.. ఈ ఏడాది మద్దూరు పురపాలికగా మారడంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. చేరువైన పాలన.. జిల్లా ఆవిర్భవించడంతో కలెక్టర్, ఎస్పీలతో పాటు వివిధ జిల్లా ప్రభుత్వ శాఖలకు సంబంధించి అధికారులు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్, ఎస్పీలను నేరుగా కలిసి సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునేందుకు వీలు కలిగినట్లయింది. జిల్లా ఏర్పాటైన తర్వాత తొలి ఇన్చార్జ్ కలెక్టర్‌గా రొనాల్డ్‌రోస్ బాధ్యతలు చేట్టారు. ఆ తర్వాత తొలి కలెక్టర్‌గా ఎస్.వెంకట్రావ్ బాధ్యతలను చేపట్టిన రెండు నెలల్లోనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ– ఆఫీస్‌కు కార్యరూపం దాల్చారు. అనంతరం కలెక్టర్ దాసరి హరిచందన రెండేళ్లపాటు జిల్లాను ప్రగతిలో పరుగులు పెట్టించారు. సైన్స్పార్కు, కళంకారి నేత చీరలు, కరోనా సమయంలో కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అనంతరం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కోయ శ్రీహర్ష విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పదో తరగతిలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా పక్కా ప్రణాళికతో ముందడుగు వేశారు. రాష్ట్రంలోనే జిల్లాను మెరుగైన స్థానంలో నిలిపారు. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ నాల్గో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, ఎస్పీలుగా రేమారాజేశ్వరి, చేతన, ఎన్.వెంకటేశ్వర్లు, యోగేష్ గౌతమ్ బాధ్యతలు చేపట్టారు. అన్ని రంగాల్లో.. ఎవరూ ఊహించని విధంగా నారాయణపేట జిల్లా ఏర్పాటు కావడంతో ప్రగతిలో పరుగులు తీస్తుందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ హయాంలో 2019 నుంచి 2023 వరకు మారుమూల ప్రాంతాలకు రహదారులు, వంతెనల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది. ప్రభుత్వ ఆస్పత్రుల అప్‌గ్రేడ్.. నూతన పల్లె దవాఖానాలతో ప్రజలకు వైద్యసేవలు మరింత మెరుగయ్యాయి. 2023 డిసెంబర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఇక్కడి రైతుల ఎన్నో ఏళ్ల కలను నెరవేరుస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.4,350 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం టెండర్లు పిలిచి మొదటి దశలో పనులు ప్రారంభించేందుకు భూ సర్వే పనులు కొనసాగుతున్నాయి. గతేడాది ఆక్టోబర్‌లో జిల్లా కేంద్రానికి సమీపంలోని అప్పంపల్లి దగ్గర నూతన మెడికల్ కళాశాల ప్రారంభం కాగా.. మొదటి సంవత్సరం తరగతులు సైతం ఆరంభమయ్యాయి. దేవరకద్ర నుంచి మక్తల్ మీదుగా కృష్ణాకు రైల్వేలైన్ ఏర్పాటు కావడంతో రవాణా సౌకర్యం మరింత సులభతరమవుతుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చినట్లయ్యింది. ఒకప్పుడు వలసలకు అడ్డాగా మారి.. అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతం.. జిల్లాగా ఆవిర్భవించడంతో ఒక్కసారిగా దశ తిరిగింది. చెరువులు.. కుంటలకు నీరు చేరడంతో ప్రతి ఎకరా సాగులోకి వచ్చింది. వలస వెళ్లిన వారంతా గ్రామాలకు వచ్చి సాగుబాట పట్టారు. విద్య, వైద్యంలో రాష్ట్ర స్థాయిలోఎంతో ముందంజలో నిలిచింది. ఊహించని విధంగా మెడికల్ కళాశాల మంజూరు కావడం.. ఏన్నో ఏళ్ల రైతుల కల నెరవేరుస్తూ పేట– కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన.. దేవరకద్ర – మక్తల్ మీదుగా కృష్ణాకు రైల్వే లైన్.. నలుదిశలా ‘పేట’ చేనేత చీరలకు గుర్తింపు.. ఈ – ఆఫీస్‌కు కార్యరూపం దాల్చడం.. ఇలా ఆరేళ్లలో అద్భుత ప్రగతిని సాధించి.. నేటితో ఏడో వసంతంలోకి జిల్లా అడుగిడుతోంది. అనతికాలంలో జిల్లా అనూహ్య అభివృద్ధి విద్య, వైద్యంలో ముందడుగు మెడికల్ కళాశాల మంజూరుతోమరింత ఊతం కృష్ణాకు రైల్వేలైన్ ఏర్పాటు..పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం పేట – కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన నేడు ఏడో వసంతంలోకి జిల్లా.. -
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
మక్తల్: ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతతకు మార్గమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేదపండితుడు తిప్పయ్యస్వామి అన్నారు. ఆదివారం పట్టణంలోని మళ్లికార్జున ఆలయం వద్ద శివస్వాముల 25వ మహాపడిపూజ కార్యక్రమం గురుస్వామి వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా శివమాలధారులు, భక్తులు పురవీధుల గుండా కలశంతో ఊరేగింపు నిర్వహించారు. పడమటి ఆంజనేయస్వామి ఆలయం, మల్లికార్జునస్వామి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్దకు చేరుకొని మహాపడిపూజ కార్యక్రమం తిప్పయ్య గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. జ్యోతిర్లింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివమాలాధారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, భజనలతో ఆ ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌చైర్మన్ నర్సింహగౌడ్, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, మాజీ సర్పంచు గోవర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి గురుస్వాములు, మాలాధారులు పాల్గొన్నారు. -
ప్రజల ఆకాంక్షను నెరవేర్చాం
నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. 2018 ఎన్నికల ప్రచారంలో తనను ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే జిల్లా ఇస్తానని నాటి సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. వారి ఆకాంక్ష మేరకు కేసీఆర్ జన్మదినం నాడు జిల్లాను ప్రారంభించుకున్నాం. ప్రతి ఎకరాకు నీరందించి సాగును పండుగ చేశాం. కేసీఆర్ పేరు ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. – ఎస్.రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, నారాయణపేట అభివృద్ధిలో ముందడుగు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా అన్ని రంగాల్లో పరుగులు తీస్తోంది. మా తాతయ్య దివంతగ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి కల అయిన జాయమ్మ చెరువుకు సాగునీరు తేవడం, పేట– కొడంగల్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించడం మా తొలి విజయం. విద్య, వైద్య రంగాల్లో జిల్లా మరింత ముందడుగు వేస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలను నెలకొల్పేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – చిట్టెం పర్ణికారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట ● -
విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని, విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కళాశాల ముందు నిరసన తెలపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కనీసం ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యారంగాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. ఓ పక్క గురుకుల విద్యాలయాల్లో పుడ్ పాయిజన్‌తో విద్యార్థులు మరణిస్తుంటే మరో పక్క ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటిలో అరకొర సౌకర్యాలు, అధ్యాపకుల లేమి, మంచి నీటి సమస్య, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు లాంటి ఎన్నో లోపాలతో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించి ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. గౌస్, వెంకటేష్, సురేష్, సాగర్ పాల్గొన్నారు. -
నేరాల కట్టడే ప్రధాన లక్ష్యం
మరికల్: సమాజంలో పెరుగుతున్న నేరాలను కట్టడి చేయడమే పోలీసుల ముందున్న ప్రధాన లక్ష్యమని డీఎస్పి లింగయ్య అన్నారు. మరికల్ మండల కేంద్రంలో శనివారం మాధ్వార్ రోడ్డు, గజ్జలమ గడ్డ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. మొత్తం 77మంది పోలీసులు ఆరు గ్రూపులుగా విడిపోయి 150 ఇళ్లలో సోదాలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు, 3 గూడ్స్ ఆటోలు, కారును స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీఎస్పి మాట్లాడుతూ ప్రజలకు రక్షణ, భద్రతాభావం కల్పించడం తమ బాధ్యత అన్నారు. ఎవరైన కాలనీలో కొత్త వ్యక్తులు సంచరించినా.. అనుమానాస్పదంగా తచ్చాడినా వెంటనే వారి వివరాలను పోలీసులకు అందజేయాలని సూచించారు. అలాగే మహిళలు, విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని, ప్రతిఒక్కరో రోడ్డు భదత్రా నిబంధనలు పాటించాలని, లైసెన్స్ తప్పనిసరిగా వద్ద ఉంచుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ రాజేందర్‌రెడ్డి, శివశంకర్, ఎస్ఐలు రాము, రమేష్, కృష్ణంరాజు, రేవతి, మహేశ్వరి, నవీద్, స్పెషల్ పార్టీ బలగాలు పాల్గొన్నారు. -
హుండీ లెక్కింపు పూర్తి
నారాయణపేట రూరల్: మండలంలోని ఎక్లాస్పూర్ తిమ్మప్పస్వామి ఆలయానికి సంబంధించి జాతర పూర్తి కావడంతో శనివారం ఆలయ హుండీ లెక్కింపును చేపట్టారు. దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి శ్యాంసుందర్ జోషి, అర్చకులు మాణిక్ శాస్త్రి ఆధ్వర్యంలో, పోలీసు బందోబస్తు మధ్య గ్రామస్తులు హుండీలో నగదు లెక్కించారు. రూ.2.85లక్షలు వచ్చినట్లు ప్రకటించారు. అదేవిధంగా టెంకాయలు, ఇతర టెండర్లు, హర్షిక ఆదాయాన్ని లెక్క కట్టగా మొత్తం రూ.8,78, 606 ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామ్ రెడ్డి, కన్నా జగదీష్, మధుసూదన్ రెడ్డి, రమాకాంత్, సత్యనారాయణ, బాలప్ప పాల్గొన్నారు. శనేశ్వరుడికి పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడికి భక్తుల చేత ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తిలతైలాభిషేక పూజలు చేయించారు. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి.. భక్తిశ్రద్ధలతో శనేశ్వరుడికి పూజలు చేశార. అనంతరం బ్రహ్మసూత్ర పరమ శివుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,841 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 3,149 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,841, కనిష్టంగా రూ.4,009 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,000, కనిష్టంగా రూ.5,667, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,388, కనిష్టంగా రూ.2,270, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,100, కనిష్టంగా రూ.5,555, పత్తి గరిష్టంగా రూ.6,109, కనిష్టంగా రూ.5,889 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,716, కనిష్టంగా రూ.5,709, కందులు గరిష్టంగా రూ.6,909, కనిష్టంగా రూ.6,709గా ధరలు నమోదు అయ్యాయి. -
ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోండి
నారాయణపేట: ప్రతి పోలీస్ ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందరికీ ఏఎస్పీ రియాజ్ హూల్ హక్ ఆధ్వర్యంలో జడ్చర్ల డిటిసి ట్రైనింగ్ సెంటర్లో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీసు చేయించడం జరిగిందని ఆయన వివరించారు. ఈమేరకు ట్రైనింగ్‌ను పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, శాంతి భద్రతలు పరీక్షించడానికి పోలీసులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రజల రక్షణ కొరకు పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ ఫైరింగ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఫైరింగ్ శిక్షణను జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ హాజరై ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సిఐలు నరసింహ, శివ శంకర్, రాజేందర్ రెడ్డి, సైదులు, ఎస్ఐ లు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఆర్డర్ కాపీలు అందుకున్న అభ్యర్థులువివరాలు 8లో uఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తయింది. ఈ పరిశీలన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు కొనసాగింది. తాజాగా కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియామక ఉత్తర్వులను వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధిత అభ్యర్థులు కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియామకం కానున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 182 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ నూతన జిల్లాల వారీగానే పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతుండగా.. ఖాళీలను బట్టీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. నారాయణపేట/మద్దూర్: డీఎస్సీ– 2008 నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఎస్టీటీలుగా వారం రోజుల్లోగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని బాధిత అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. మెరిట్ జాబితాలో ఉన్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ వస్తున్నారు. 17 ఏళ్ల న్యాయ పోరాటం.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. అయితే వీరందరికీ సాధ్యమైనంత త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసినా వివిధ కారణాలతో జ్యాపం జరుగుతూ వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన ఫలించిన 17 ఏళ్ల ఎదురుచూపులు హైకోర్టు ఉత్తర్వులతో పోస్టింగులు కాంట్రాక్టు ఎస్జీటీలుగా అవకాశం ఉమ్మడి జిల్లాలో 182 మందికి న్యాయం -
పాలకవర్గాలకే ‘సహకారం’
●సీఎంకు కృతజ్ఞతలు పీఏసీఎస్ పాలకవర్గాల కాలపరమితి మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. మా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని పెంచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్రావుకు కృతజ్ఞతలు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతులకు మరింత చేరువ చేసేందుకు సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాం. – విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్, మహబూబ్నగర్అచ్చంపేట/కోస్గి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులను ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు అందుకొని పీఏసీఎస్‌లకు పంపించారు. ఎన్నికల ప్రక్రియకు ఆరు నెలల ముందే కసరత్తు మొదలుపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనా.. ప్రస్తుతం పాలకవర్గ పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న సందేహాలకు తాజా ఉత్తర్వులతో తెరపడింది. జిల్లాలోని 87 సొసైటీల పాలకవర్గాలు మరో ఆరు నెలలపాటు కొనసాగనున్నాయి. డీసీసీబీ పాలకవర్గ పదవీకాలాన్ని కూడా పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీసీఎంఎస్‌కు సంబంధించి అంశం ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్షం. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలకు మరో పదిరోజుల సమయం ఉండటంతో ఈలోగా డీసీఎంఎస్ పాలకవర్గ పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హర్షాతిరేకాలు.. ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల పదవీకాలం శనివారంతో ముగిసింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 20తో పూర్తవుతుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో డీసీసీబీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్ల పదవీకాలం పొడిగింపు ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు డీసీఎంఎస్‌కు సంబంధించి వెలువడని నిర్ణయం గతంలోనూ పొడిగింపు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనూ 2018 ఫిబ్రవరి 4న పాలకవర్గాల పదవీకాలం ముగియగా ఆరు నెలల చొప్పున రెండుసార్లు పర్సన్ ఇన్‌చార్జ్‌ల పదవీకాలాన్ని పొడిగించారు. 2020 ఫ్రిబవరి 15న ఎన్నికలు నిర్వహించారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రెండేళ్లు, టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు మూడేళ్లపాటు పొడిగించారు. పర్చన్ ఇన్‌చార్జ్‌లను నియమిస్తే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగించింది. -
సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి
నారాయణపేట టౌన్: సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో నడిస్తే ప్రజలకు కొంతమేర సేవ చేసిన వారమవుతామని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు ఆమె హాజరయ్యారు. ముందుగా బంజారా, గిరిజనులు చేపట్టిన శోభాయాత్రను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన రహదారి గుండా ఎర్రగుట్ట వరకు సాగింది. ఈ సమావేశానికి ఆర్డీఓ రాంచంద్ర నాయక్ హాజరై ప్రసంగించారు. ఆయన బోధనలు అందరూ ఆచరించాలని అన్నారు. కార్యక్రమానికి పూజారి రాము నాయక్,గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రమావత్ నరేష్, నర్సిగ్ నాయక్, ఉమ్మడి జిల్లా గిరిజన నాయకులు హాజరయ్యారు. ఆదర్శప్రాయుడు.. మరికల్: సంత్ సేవాలాల్ గిరిజనుల అభ్యున్నతికి.. వారి చైతన్యానికి ఎనలేని కృషి చేశారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మరికల్ మండలంలోని బూడ్యగానితండాలో శనివారం సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించగా ఎమ్మెల్యే ఆయన చిత్రపటం వద్ద పూజలు చేశారు. అనంతరం మరికల్ వరకు గిరిజన మహిళలు ర్యాలీ నృత్యాలు చేస్తు చౌరస్తాలో జయంతి సంబరాలను నిర్వహించారు. -
3, 5 నంబర్ల మోటార్లు
కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి.. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లు నింపాలి. ఈ రిజర్వాయర్లకు అనుసంధానంగా ఉన్న చెరువులను కూడా రెగ్యులర్‌గా నింపుతూ ఉండాలి. ఇందుకోసం ఎల్లూరు పంప్‌హౌజ్‌లో 5 మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు మోటార్లు పాడయ్యాయి. నాలుగున్నరేళ్ల క్రితం పంప్‌హౌజ్‌లోకి నీరు చేరడంతో మూడో నంబర్ పంప్ మోటార్ దెబ్బతినగా.. ఇప్పటి వరకు ఆ మోటార్ మరమ్మతుకు నోచుకోలేదు. అలాగే రెండేళ్ల క్రితం 5వ నంబర్ పంప్ మోటార్ కూడా దెబ్బతినగా.. దీనిని కూడా అలాగే వదిలేశారు. దీంతో మిగిలిన మూడు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. -
రేపు జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు
నారాయణపేట రూరల్: కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలను ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప తెలిపారు. స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు 16 ఏళ్లలోపు విద్యార్థులు ఆదార్ కార్డు, టెన్త్ మెమో తీసుకొని హాజరు కావాలన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో జిల్లా జట్టు ఎంపిక చేసి ఈనెల 20 నుంచి రాష్ట్రస్థాయిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇద్దరు ఎస్ఐల బదిలీ మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు ఎస్ఐలను శుక్రవారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నచింతకుంట ఎస్ఐగా ఉన్న శేఖర్‌ను నారాయణపేట వీఆర్‌కు, నారాయణపేట వీఆర్‌లో ఉన్న ఎస్ఐ రామ్‌లాల్‌ను సీసీకుంటకు బదిలీ చేశారు. -
విద్యా ప్రమాణాలు పెంపొందించాలి
నారాయణపేట: గత మూడేళ్లుగా ఎఫ్ఎల్ఎన్పైన పనిచేస్తున్నప్పటికీ విద్యార్థుల విద్యా ప్రమాణాలు తరగతి స్థాయికి అనుగుణంగా లేకపోవడం ఏంటని.. ఇకనైనా పెంపొందించేందుకు దృష్టి సారించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం అమలుపరుస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా విద్యార్థుల ప్రగతి నమోదు వివరాలపై శుక్రవారం విద్యాశాఖాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. మిడ్లైన్ పరీక్షకు సంబంధించిన ఎఫ్ఎల్ఐపి వివరాలు రెండు రోజుల్లోగా ఈ యాప్‌లో నమోదు చేయాలన్నారు. 40 రోజుల కార్యక్రమంలో భాగంగా వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా జరుగుతున్న బోధనను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు మానిటరింగ్ చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అమలుపరుస్తున్న భాషా పఠన కార్యక్రమంలో భాగంగా ఒక నిమిషంలో విద్యార్థులు చదవగలిగే పదాల వివరాలను టైమర్ సహాయంతో నమోదు చేస్తూ విద్యార్థులకు ధారాళంగా చదవడం అలవాటు చేయాలన్నారు. ఇకమీదట ప్రతి వారం సమీక్ష సమావేశాలు ఉంటాయని విద్యార్థుల ప్రగతి పైన మానిటరింగ్ అధికారుల పర్యవేక్షణ పైన సమీక్షను నిర్వహిస్తానని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధి కారి గోవిందరాజు, ఏ ఎమ్ ఓ విద్యాసాగర్, సెక్టోర ల్ అధికారులు శ్రీనివాస్, జిసిడివో నర్మద సీఎస్ ఏఫ్ ప్రతినిధులు షాలెట్, జై, హర్ష పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారుల డైరీని కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి , విజయవంతం చేసినందుకుగాను డీఏఓ, వ్యవసాయ శాఖ అధికారులను అభినందిస్తున్నమన్నారు. శాఖ పరంగా ఏ విధమైన సహకారాన్ని అయిన అందించడానికి అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రెవె న్యూ అడిషనల్ కలెక్టర్ బేన్‌షాలం, డీఏఓ జాన్‌సుధాకర్, ఏడీఏలు నగేష్, హైమవతి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు వెడల్పునకు సహకరించాలి నారాయణపేట: రోడ్డు వెడల్పు పనులలో గృహ యజమానులు సహకరించాలని.. వారికి నష్టం కలగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ మీటింగ్ మాల్లో కోస్గి రోడ్డు వెడల్పు పనులపై తహసీల్దార్, మున్సిపల్ అధికారులు, ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోయే వారితో డిస్ట్రిక్ లెవెల్ నెగోషియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.4200 స్క్వేర్ యాడ్ ప్రకారం రెసిడెన్షియల్ ప్లాట్స్‌కు, రూ.11,600 కమర్షియల్ షాప్‌లకు నష్టపరిహారం ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు .ఈ సందర్భంగా 188 మందికిగాను, 165 మంది ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం తీసుకొనుటకు సమ్మతి తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలం , ఆర్డీవో రామచంద్ర, తహసీల్దార్ బక్క శ్రీనివాస్, నాగరాజు కమిషనర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నతాధికారులపరిశీలనలో ఉంది..
ఎల్లూరు లిఫ్టులోని ఐదు మోటార్లలో రెండు మోటార్లు పాడై చాలా కాలం అవుతోంది. ఇటీవల మరో పంపు మోటారు కూడా స్వల్ప మరమ్మతుకు గురైంది. అయితే దీనికి ఇక్కడే మరమ్మతు చేయవచ్చు. ప్రస్తుతం రెండు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. అయితే మిషన్ భగీరథ కోసం రెగ్యులర్‌గా నీటి ఎత్తిపోతలు చేపట్టాలి. ఇలా చేయడం వల్ల మోటార్ల మరమ్మతు చేపట్టేందుకు ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికై తే మరమ్మతు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. – లోకిలాల్‌నాయక్, పంపుహౌజ్ నిర్వహణ విభాగం డీఈఈ ● -
బీసీ జనాభాను తక్కువ చేసి చూపారు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో బీసీల 20 లక్షల జనాభాను తక్కువ చేసి చూపారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. శుక్రవారం ధర్మాపురంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు జనాభాను తక్కువ చేసి చూపించి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు. మరో సారి చేపడుతున్న రీ సర్వేలో తప్పులు సరిదిద్దుకొని న్యాయం చేయకపోతే బీసీల ఆగ్రహానికి గురికావా ల్సి వస్తుందని హెచ్చరించారు. పాలమూరు వీరు డు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామ ని అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందెశ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతంలో పండుగ సాయన్న వీరగాధను పొందుపరిచామని అన్నారు. ప్రతిరోజూ ప్రతి పాఠశాలలో ఆయనను స్మరించుకుంటున్నామన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పండుగ సాయన్న ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ముదిరాజ్‌లు నేటికీ అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బెక్కెం జనార్దన్ రచించిన పండుగ సాయన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు ఎన్పీ వెంకటేష్, బెక్కెం జనార్దన్, పెద్ద విజయ్‌కుమార్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్, పండుగ సాయన్న సామాజిక సేవాసంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణముదిరాజ్, మైత్రి యాదయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ -
వేతనాలు అందించాలి
నెల నెలా వేతనాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాం. పాత బకాయిలు మొత్తం చెల్లించడంతో పాటునెల నెలకు వేతనాలు చెల్లిస్తే బాగుంటుంది. – నరేందర్, ఎంఎన్ఓ ఆర్నెళ్లుగా ఆర్థిక ఇబ్బందులు నాకు నెలకు రూ.22,750 వేతనం అందాల్సి ఉంది. ముందు ప్రభుత్వ జిల్లా దవాఖానా వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండేది. ఆ శాఖ ద్వారానే రెండు నెలలకు ఒకసారి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బడ్జెట్ విడుదలయ్యేది. మెడికల్ కళాశాల ప్రారంభం తర్వాత మమ్మల్ని ఆ శాఖలో విలీనం చేశామని చెబుతున్నారు. తమకు వేతనాలు రావడం లేదు. వెంటనే సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నాం. – మనోహర్, రేడియోగ్రాఫర్ డీఏంఈకి సరెండర్ చేశాం ఐసీయూ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న 20 మంది సిబ్బంది వివరాలను డీఎంఈకి సరేండర్ చేశాం. వారికి సంబంధించి వేతనాలను కోరుతూ ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం బడ్జెట్ రీలీజ్ చేయగానే వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. – మల్లికార్జున్, సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ● -
న్యాయమూర్తిపై దాడి హేయమైన చర్య
నారాయణపేట రూరల్: రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్వర్యంలో న్యాయవాదులు స్థానిక కోర్టులో విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ సభ్యులు మాట్లాడుతూ.. ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఈమేరకు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పటిష్టమైన చట్టం లేకపోవడంతో ఏకంగా జడ్జిపైనే దాడికి పాల్పడ్డాడడని వివరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం న్యాయవాదులు, జడ్జీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, చెన్నారెడ్డి, న్యాయవాదులు సీతారామరావు, లక్ష్మీపతి, బాలప్ప పాల్గొన్నారు. పెసర క్వింటాల్ రూ.6,550 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పెసర క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.6,506 ధర పలికింది. శనగలు గరిష్టంగా రూ.6,069, కనిష్టంగా రూ.6,033, వేరుశనగ గరిష్టంగా రూ.6,550, కనిష్టంగా రూ.4,569, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,759, కనిష్టంగా రూ.4,602, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,909, కనిష్టంగా రూ.5,555 ధర పలికాయి. విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకే ఫోరం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫోరం చైర్పర్సన్, టెక్నిక్ మెంబర్ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్ భవన్లో విద్యుత్ వినియోగదారుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తక్షణ పరిష్కారం చూపినట్లు తెలిపారు. 50 ఫిర్యాదులను స్వీకరించినట్లు పేర్కొన్నారు. వచ్చే వేసవిలో విద్యుత్ సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యుత్‌శాఖ అఽధికారులపై ఉందన్నారు. వేసవిలో వచ్చే సమస్యలను అధిగమించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఈ రమేష్, సీజీఎం రామాంజనాయక్, వెంకట్, లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు. -
మరమ్మతు చేయరా..?
కేఎల్ఐ ప్రాజెక్టులో పాడైన రెండు మోటార్లు ● ఎల్లూరు పంప్‌హౌజ్‌లో నాలుగున్నరేళ్లుగా గాలికొదిలేసిన వైనం ● మూడింటితోనే కొనసాగుతున్న ఎత్తిపోతలు ● వివిధ రకాల సాకులతో కాలయాపన ● ఏటా వేసవిలో తప్పని సాగు, తాగునీటి కష్టాలు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పంపు మోటార్ల మరమ్మతు ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో పడుతూనే ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు–రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా అందుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు లిఫ్టు నుంచి కృష్ణానది నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు నింపుతున్నారు. అయితే ప్రాజెక్టులోని మొదటి పంపుహౌజ్ (ఎల్లూరు లిఫ్టు)లో రెండు మోటార్లు పాడై ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఇందుకు ఇటు ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత కంపెనీ ప్రతినిధులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. ఎత్తిపోతలకు ఇక్కట్లు.. ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న మూడు మోటార్లలో రెండింటితోనే నీటి ఎత్తిపోతలు నిర్వహిస్తుండగా.. మరొకటి స్పేర్‌లో ఉంది. రెండు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు చేపడుతుండటంతో వరదల సమయంలో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు ఆలస్యమవుతోంది. కృష్ణానది వరద ప్రవాహ సమయంలో ఎల్లూరు పంప్‌హౌజ్‌లో నాలుగు మోటార్లు నడిపించి రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలి. ఈ నీటితో రిజర్వాయర్లతో పాటు, చెరువులు కూడా నింపుకోవాలి. కానీ, ఎల్లూరు లిఫ్టులో రెండు మోటార్లు మాత్రమే పనిచేస్తుండడంతో ఆశించిన స్థాయిలో ఎత్తిపోతలు జరగడం లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 2,208 చెరువులు నింపేందుకు నెలలు గడిచిపోతోంది. మరమ్మతులకు ఆటంకం కేఎల్ఐ ప్రాజెక్టులో మోటార్లు పాడైతే మరమ్మతు చేపట్టడం ఇబ్బందికరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ స్కీం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్‌గా నీటి ఎత్తిపోత జరుగుతుంది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. అయితే పాత బిల్లులు పెండింగ్‌లో ఉండటం కూడా కొంత కారణమని సంబంధిత కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరువాసుల సాగు, తాగునీటి కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో.. రూ.వేల కోట్లు వెచ్చించి.. సంవత్సరాల తరబడి శ్రమించి ప్రాజెక్టు నిర్మించారు.. కానీ, రెండు మోటార్లకు చిన్నపాటి మరమ్మతు చేసేందుకు అంతకు మించి కాలయాపన చేస్తున్నారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది.. ఎవరు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విషయం పక్కనపెడితే.. ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం ప్రతిఏటా ఎండాకాలంలో ఇటు సాగునీటికి, అటు తాగునీటికి గోస పడక తప్పడం లేదు. – కొల్లాపూర్ -
వేతనాలు అందక వెతలు
నారాయణపేటశనివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025వివరాలు 8లో uనారాయణపేట: జిల్లా ప్రభుత్వ దవాఖానాలో విధులు నిర్వర్తిస్తున్న ఐసీయూ సిబ్బందికి ఆర్నెళ్లుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో నానా ఆవస్థలు పడుతున్నారు. టీవీవీపీ కాంట్రాక్టర్ పరిధిలో ఉన్నప్పుడు గతేడాది జూలై వరకు వేతనాలు వారి అకౌంట్లో జమ అయ్యాయి. ఆ తర్వాత రెగ్యూలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ఇటు తెలంగాణ వైద్య విధాన పరిషత్, అటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెండింగ్ వేతనాల చెల్లింపు బాధ్యత మాది కాదంటే మాది కాదంటూ జాప్యం చేస్తున్నాయి. దీంతో ఆ రెండు శాఖల మధ్య వైద్య ఉద్యోగులు నలిగిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలను చెల్లించాలని వేడుకుంటున్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానాలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సిబ్బంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 20 మంది పని చేస్తున్నారు. వారిలో జిల్లా ప్రభుత్వ దవాఖానాలోని ఐసీయూ విభాగంలో రేడియా గ్రాఫర్ 1, ల్యాబ్టెక్నిషన్ 1 , ఎఫ్ఎన్ఓ/ఎంఎన్ఓ 8 , సెక్యూరిటీ గార్డ్స్ 3, వెంటిలేటర్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్సులు ఆరుగురు పని చేస్తున్నారు. అందులో రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సులకు రూ.22,750, మిగతా వారికి రూ.13,500 వేతనాలు చెల్లించాల్సి ఉంది. మెడికల్ కాలేజీ ప్రారంభంతో.. గత అక్టోబర్ నెలాఖరులో నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి సమీపంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ దవాఖానా అటు వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), ఇటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎం ఈ) పరిధిలో నిర్వహణ కొనసాగుతుంది. టీవీవీపీ పరిధిలో ఉన్న జిల్లా ప్రభుత్వ దవాఖానను టీచింగ్ ఆసుపత్రిగా మారుస్తూ డీఎంఈ పరిధిలోకి తీసుకురావడం, ఆసుపత్రిలో పని చేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మెడికల్ కాలేజీ ప్రారంభంకాక ముందు రెండు నెలల బకాయి ఉండగా, మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యాక నాలుగు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. నల్లబ్యాడ్జీలతో నిరసన పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం ఐసీయూ సిబ్బంది నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టాల్సి ఉంటుందని, ఇకపైన ఏం జరిగిన సంబంధిత ఆధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిబ్బంది హెచ్చంచారు. రెండు శాఖల మధ్య.. తమ వేతన బకాయిల విషయమై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు టీవీవీపీ అధికారులను అడిగితే ఆసుపత్రి డీఏంఈ పరిధిలోకి మారినందున వేతనాలు ఆ శాఖనే చెల్లిస్తుందని చెబుతున్నారని తెలిపారు. ఇటు డీఎంఈ అధికారులను అడిగితే ఆసుపత్రి తమ శాఖ పరిధిలోకి మారినట్టు తమకు ఇంకా అధికారిక ఉత్తర్వులు అందలేదని పేర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను వైద్య విధాన పరిషత్ కమిషనర్, కలెక్టర్ సిక్తాపట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లామని, ఇంత వరకు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో జిల్లా ఆస్పత్రి సిబ్బంది రెండు శాఖల మధ్య నలుగుతున్న వైనం ఆర్నెళ్లుగా అందని వేతనాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన -
ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరం
నారాయణపేట రూరల్: ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు క్రీడల్లో పాల్గొనాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు ఆడటం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం పొందవచ్చని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో సైతం ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు సాధించుకోవచ్చని తెలిపారు. అనంతరం రన్నింగ్, త్రో, జంప్ తదితర క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఏర్పాటు చేశారు. ఈనెల 18, 19 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే క్రీడా పోటీలకు నారాయణపేట జిల్లా తరఫున వీరు పాల్గొననున్నారు. కార్యక్రమంలో రాకేష్, అక్తర్ పాషా, గణేష్, నరసింహులు, నరేష్, మహేష్, లత తదితరులు పాల్గొన్నారు. -
మైనర్లతో వివాహం నేరమే
వివాహానికి చట్టబద్ధంగా కనీస వయసు తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం నుంచి జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని ఆధారంగా చూపాల్సి ఉంటుంది. చట్టపరంగా యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, ఏ మాత్రం అవగాహన లేకుండా కేవలం ఆకర్షణకు లోనై ప్రస్తుతం చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే సమయంలో వయసు గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే యువతుల కనీస వయసు 18 ఏళ్లు నిండని పక్షంలో వారిని మైనర్లుగా భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మైనర్లను వివాహం చేసుకోవడం, పెద్దల అనుమతి లేకుండా తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. ఇలాంటి కేసుల్లో యువతి సమ్మతి లేకుంటే యువకుడిపై అత్యాచారం, అపహరణ కేసులు కూడా నమోదు చేస్తారు. ఒకవేళ యువతి సమ్మతి ఉంటే కనీస వయసు పూర్తయ్యే వరకు ఆమె ఇష్టానుసారం ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉంచుతారు. -
బాలికల అభ్యున్నతికి కృషి
నారాయణపేట: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో ప్రచార రథాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, లింగ సమానత్వం, బాలిక విద్యపై విస్తృత ప్రచారం చేయాలని, బేటీ బచావో బేటీ పడావో పథకం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో బాలికల సంక్షేమానికి, బాలికల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు గ్రామస్థాయిలో ప్రచారం చేయడానికి సాంస్కృతిక కళాకారులచే నాటికలు, చైతన్య గీతాలతో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ వెంకటమ్మ, సూపర్వైజర్ శ్రీలత, డీసీపీఓ తిరుపతయ్య,సఖి సెంటర్ అడ్మిస్ క్రాంతి రేఖ, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్టులు అనిత, నర్సిములు, విజయ్ కుమార్, కవిత, కరిష్మ,అశ్విని, సాయి పాల్గొన్నారు. -
జిల్లాలో ఎరువుల కొరత లేదు
నారాయణపేట: జిల్లాలో ఎరువుల కొరత లేదని, 5వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌సుధాకర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు.. రాష్ట్రంలో పలుచోట్ల యూరియా లేదని, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కానీ జిల్లాలో ఎరువులకు ఎలాంటి ఢోకా లేదన్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 1.54 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు, ప్రధానంగా 1.36 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని అన్నారు. అయితే ప్రతి ఏటా యాసంగిలో 40 నుంచి 60 శాతమే సన్నరకాలు సాగుచేసేవారని, ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో ఈ ఏడాది సన్నరకాలు 80 శాతం సాగు చేశారని వివరించారు. ఇదిలాఉండగా, జిల్లాకు 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేశామని, 5 వేల మెట్రిక్ టన్నులు వినియోగించారని, మరో 5వేల మెట్రిక్ టన్నులు అంచనాకు మించి స్టాక్ ఉందని వివరించారు. డీఏపీ 5 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 7 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వాడారని, ఇంకా నిల్వలు మిగిలి ఉన్నాయని డీఏఓ జాన్‌సుధాకర్ వివరించారు. అందుబాటులో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లా వ్యవసాయాధికారి జాన్‌సుధాకర్ -
చేనేత రంగాన్ని సమష్టిగా కాపాడుకుందాం
నారాయణపేట రూరల్: దేశ స్వాతంత్ర సమరంలో ప్రధాన పాత్ర పోషించి ప్రజల మానం కాపాడుతున్న చేనేత పరిశ్రమను అందరం కలిసి సమష్టిగా కాపాడుకుందామని సహకార భారతి జాతీయ అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రా పిలుపునిచ్చారు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలో అఖిల భారత సహకార భారతి చేనేత విభాగం కో కన్వీనర్ కే.శ్రీనివాస్ అధ్యక్షతన చేనేత కార్మికుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మిశ్రా మాట్లాడుతూ.. సమాజంలో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, కానీ గత ప్రభుత్వాలు వీటిని విస్మరించాయని అన్నారు. వారి సంక్షేమం కోసం సహకార భారతి తన వంతు కృషి చేస్తున్నదని అన్నారు. అయినా రాష్ట్రంలో కార్మికుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం నడుస్తున్న త్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ లో ప్రభుత్వం మూడు నుంచి రెండేళ్లు, ముగ్గురు సభ్యుల నుంచి ఇద్దరిని చేయడం, రూ.2200 నుంచి రూ.1800 తగ్గించడం చూస్తుంటే ప్రభుత్వ విధానం విడ్డూరంగా ఉందని అన్నారు. వెంటనే గతంలో మాదిరి ఈ పథకంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ, ప్రతినిధులు శ్రీనివాస్, కుమార స్వామి, బాల్‌రెడ్డి, ఉదయబాను, యాదగిరి, రాధాకృష్ణ, వెంకట్రాములు, వివిధ చేనేత సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. -
నారాయణపేట
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ప్రేమ పెళ్లి.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఏది సరైనది? 91పెద్దలు కుదిర్చిన పెళ్లి ప్రేమ వివాహం లవ్ అండ్ అరేంజ్ 5611231841ప్రస్తుతం ప్రేమలో సోషల్ మీడియా ప్రభావం ఉందా? ఎక్కువగా ఉందిఏ మాత్రం లేదు 22713న్యూస్‌రీల్ -
బీసీలు చైతన్యం కావాలి
నారాయణపేట రూరల్ : సమాజంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు చైతన్యం కావాలని బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.రామాంజనేయులుగౌడ్ అన్నారు. సమాజ్ వాదీ ఉద్యమ నేత అక్కల బాబుగౌడ్ రచించిన ‘విముక్తి రాజనీతి’ కవిత సంపుటి పుస్తకాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. సమకాలీన రాజకీయ వ్యవస్థపై 77 ఏళ్ల స్వతంత్ర పాలన, 76 సంవత్సరాల రాజ్యాంగ అమలులో రాజ్యాంగ బద్ధంగా దేశ ప్రజలందరికీ, సామాజిక, ఆర్థిక రాజకీయ సమానత్వం అందలేదన్నారు. అణచివేయబడిన వర్గాల ప్రజల రాజకీయ ఓటు చైతన్యం గురించి, సబ్బండ జాతులు రాజకీయ అధికారాన్ని సాధించే దిశగా తన కవితల్లో బాబుగౌడ్ స్పష్టంగా సరలమైన భాషలో వివరించారని తెలిపారు. లోతైన విషయ అవగాహనతో నేటి రాజకీయ పరిస్థితులను, పాలనా విధానాలను అద్భుతంగా వివరించడాన్ని యువత తెలుసుకోవాలన్నారు. బీసీ ప్రజలు ఐక్యంగా పోరాటం చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించాలన్నని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి రంగప్ప యాదవ్, ఉమ్మడి జి ల్లా ప్రధాన కార్యదర్శి లింగంగౌడ్, జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, రవికుమార్, లక్ష్మణ్, ము ష్టి రాజు, గోవింద్, నరసింగప్ప, నారాయణ, యా దయ్య, నరసింహులు, రాజుగారు తదితరులు పాల్గొన్నారు. -
సగర శంఖారావాన్ని విజయవంతం చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్: సగరుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 16న జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సగర శంఖారావం నిర్వహిస్తున్నామని.. సగరులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పుర పరిధిలోని ఊయ్యాలవాడ సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాముడి వారసత్వం, భగీరథుడి వంశం సగరులదని.. ఇప్పుడు సగర కులం అంటే రోజువారీ కూలీలు, తాపీ మేసీ్త్రలుగా మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని, బీసీలకు ప్రభుత్వం కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్లలో సగరుల వాట ఎంత అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ పదవి సగరులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు శేఖర్, జిల్లా ఇన్చార్జ్ మోడం ఆంజనేయులు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి వేముల సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
విడిపోతున్న జంటలు అధికమే
తెలిసీతెలియని వయసులో ప్రేమ వివాహాలు చేసుకుంటున్న జంటల్లో చాలామంది విడిపోతున్నారు. పట్టణ ప్రాంతాలకు చదువుకోవడానికి వస్తున్న అమ్మాయిలు ఆటోడ్రైవర్లు, ఇతర పోకిరీల ఉచ్చులో పడి మోసపోతున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకుంటున్న వారిలో మనస్పర్థలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇద్దరి మధ్య దూరం ఏర్పడి, విడాకులకు దారి తీస్తోంది. ఇలా ఏటా పదుల సంఖ్యలోనే జంటలు విడిపోతున్న దాఖలాలున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు, పెద్దలను ఒప్పించి ఒక్కటైన జంటలు సైతం చిన్నపాటి కారణాలకే విడిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. గతేడాది జిల్లాలో 10 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. -
జీవితమే ముఖ్యం
ప్రేమ అనేది రెండు మనసుల మధ్యన ఏర్పడే విడదీయరాని బంధం. ఇరువురిది ఒకేదారి అయినప్పుడే ఈ బంధం సాఫీగా సాగుతుంది. పెళ్లి అనే సరికొత్త జీవనం వైపు అడుగులు వేయించి భవిష్యత్ పునాదులకు బీజం వేస్తోంది. కానీ, ఇలాంటి ప్రేమ ప్రస్తుత రోజుల్లో తాత్కాలికమే అయింది. తెలిసీతెలియని వయసులో కొందరు ఆకర్షణకు లోనై.. మత్తులో మునిగి తేలుతున్నారు. మరికొందరు చిన్న వయసులోనే ప్రేమ పేరిట జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ ఎంతో బలమైందన్నది ఎంత నిజమో.. మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకున్న వారి జీవితం అంతే బలంగా.. సాఫీగా సాగుతుందన్నది అంతే నిజం. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రేమ వివాహాలు, ప్రేమ ముసుగులో జరుగుతున్న దారుణాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – మహబూబ్‌నగర్ క్రైం/ నారాయణపేట ప్రేమపేరుతో ప్రాణాలు తీసుకోవద్దు.. తీయొద్దు ● ఒప్పుకోకపోతే యువతులపై దాడులు సరికాదు ● పెద్దలు అంగీకరించకపోయినా ఆత్మహత్యలు ● జిల్లాలో అమ్మాయిలు, మహిళలపై పెరుగుతున్న దాడులు -
జపాన్ ‘సకురా’కు జిల్లా విద్యార్థి ఆవిష్కరణ
నారాయణపేట టౌన్: జపాన్ సకురా ప్రోగ్రాంకు దామరగిద్ద గురుకుల పాఠశాల విద్యార్థి శివారెడ్డి తయారుచేసిన కొబ్బరి పూలకుండీ ఆవిష్కరణ ఎంపికై ంది. పర్యావరణ అనుకూల సామగ్రిని ప్రోత్సహించడానికి బయోడిగ్రేడబుల్ కొబ్బరి పూల కుండీలను విద్యార్థి శివారెడ్డి తయారు చేశాడు. ఈ ఆవిష్కరణ జపాన్ సకురా ప్రోగ్రాంకు ఎంపికై ంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన 11వ జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో పాల్గొని ఘనత సాధించినట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు. రాష్ట్రం నుంచి 4 ప్రదర్శనలు ఎంపిక కాగా వాటిలో జిల్లా నుంచి కొబ్బరిపూల కుండీ ఆవిష్కరణ ఎంపిక కావడం గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా గైడ్ టీచర్ కరీనా, విద్యార్థిని జిల్లా సైన్స్ అధికారి హెచ్.భాను ప్రకాష్‌తో కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు. రేపటి నుంచి పద్యనాటక ప్రదర్శనలు స్టేషన్మహబూబ్నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీమిత్ర కళానాట్యమండలి ఆధ్వర్యంలో దేవాలయం ప్రాంగణంలో శనివారం నుంచి ఈనెల 18 వరకు పద్యనాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు మండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ తెలిపారు. జిల్లాకేంద్రం తెలంగాణ చౌరస్తాలోని శ్రీవీరబ్రహ్మంద్రస్వామి మఠంలో పద్య నాటక ప్రదర్శనలపై గురువారం శ్రీమిత్ర కళానాట్య మండలి మండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల నుంచి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తమ సంస్థ ఆధ్వర్యంలో పద్యనాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు శనివారం శాసీ్త్రయ నృత్య ప్రదర్శన, మయసభ దుర్యోధన ఏకపాత్రాభినయం, శ్రీరామాంజనేయ యుద్ధ ఘట్టం, శ్రీకృష్ణ రాయబారం పూర్తినాటకం, 16న శ్రీరామాంజనేయ యుద్ధ ఘట్టం, శ్రీకృష్ణ రాయబారం, కౌరవసభ, దేవేంద్రసభ, 17న శ్రీకృష్ణాంజనేయ యుద్ధ ఘట్టం, మయసభ దుర్యోధన, 18న అన్నమయ్య సంకీర్తనాలహరి, భజనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో శ్రీమిత్ర కళానాట్య మండలి ఉపాధ్యక్షులు ఎ.ప్రభాకరాచారి, నర్సింహులుతో పాటు మాధవరాజు, సి.రాజు, చిన్నారెడ్డి, దామోదర్, శేఖరాచారి, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రిని సందర్శించిన డబ్ల్యూహెచ్ఓ బృందం దేవరకద్ర: దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. ఆస్పత్రిలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించారు. ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో మ హిళలకు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఐసీయూ గదిని, అందులో ఉన్న సదుపాయలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాలలో పల్లె దవ ఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తెచ్చినట్లు డీఐఓ పద్మజ వివరించా రు. కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య బృందం సభ్యులు శ్రవణ్, సోనికా, విశాల్, సుబాష్, పవన్‌కుమార్, ఎల్హెచ్ఓ మహేశ్, రమేశ్, కిషన్, వైద్యాధికారి శరత్చంద్ర పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
నారాయణపేట: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా.. సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ నాణ్యమైన విద్యుత్ అందజేయాలని సీజీఎం ప్రభాకర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళికలో భాగంగా వేసవిలో పెరిగే విద్యుత్ వాడకం తట్టుకొనే విధంగా అదనంగా ట్రాన్న్స్ఫార్మర్ల కోసం రూ.4 కోట్లు, 11 కేవీ లైన్ నిర్మాణం కోసం రూ.80 లక్షలు, 33 కేవీ లైన్ ఏర్పాటుకు రూ.30 లక్షలు, నూతన డీటీఆర్‌కు రూ.4.5 లక్షలు ప్రణాళికలను రూపొందించారన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సరఫరా చేసేలా వనరులు సమకూర్చుకోవాలన్నారు. 33/11 కేవీ ఉప విద్యుత్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించటం, నియంత్రికల ఓవర్ లోడ్ లేకుండా నూతన వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే 11 కేవీ విద్యుత్ తీగల అధిక లోడ్ లేకుండా విద్యుత్ నియంత్రికలు అవసరమైన చోట మార్చుటకు ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ సంజీవరెడ్డి, డీఈ శ్రీనివాస్, డీఈటీ జితేందర్, నర్సింహ రావు తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులు రాలే
రెండు నెలల క్రితం 76 క్వింటాళ్ల సన్న వడ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. క్వింటాకు రూ.2320 చొప్పున నా బ్యాంకు ఖాతాలో రూ.1.76 లక్షలు జమ అయ్యాయి. కానీ, బోనస్ డబ్బులు రూ.38 వేలు ఇంకా జమ కాలేదు. ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి. – రాఘవరెడ్డి, రైతు, నిడ్జింత నెల రోజులైనా అందలే.. దాదాపు నెల రోజుల క్రితం మొత్తం 38 క్వింటాళ్ల సన్న వడ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ధాన్యం డబ్బు మాత్రం ఖాతాలో వేశారు. బోనస్ డబ్బు మాత్రం ఇంకా జమ కాలేదు. త్వరగా వేస్తే పంటల పెట్టుబడికి ఇతర ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుంది. – దోరోళ్ల సాయప్ప, రైతు, కొత్తపల్లి త్వరలో జమ అవుతాయి బోనస్ చెల్లింపులో రై తులు ఎలాంటి ఆందో ళన చెందవద్దు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం డ బ్బులు ఇప్పటి వరకు అందరికి పడ్డాయి. బోనస్ డబ్బులు సైతం రోజు పడుతున్నాయి. మరో పక్షం రోజుల్లో అందరికీ డబ్బులు పడే అవకాశం ఉంది. – సుదర్శన్, డీఎస్ఓ ● -
బోనస్‌పైనే ఆశలు..!
నారాయణపేట: ధాన్యం బోనస్ డబ్బుల కోసం జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముగిసి రెండు నెలలు పూర్తయిన నేటికీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వరి ధాన్యం క్వింటాపై రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడంతో చాలామటుకు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 102 వరి ధాన్యం ప్రభుత్వ కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 89,928 ధాన్యం (ఎంటీఎస్) కొనుగోలు చేశారు. రూ.10.46 కోట్ల కోసం ఎదురుచూపులు రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,320తో పాటు అదనంగా రూ. 500 చొప్పున బోనస్ చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 12,597 మంది రైతులతో దొడ్డు రకం 18,175 మెట్రిక్ టన్నులు, సన్నరకాలు 71,750 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి క్వింటాల్‌కు రూ. 2,320 చొప్పున రైతులందరికి చెల్లించాల్సిన డబ్బులు రూ.208.63 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యా యి. సన్నరకాల ధాన్యం కొనుగోళ్లలో 7,17,653 క్వింటాళ్లకు గాను రూ.35.88 కోట్ల చెల్లింపులకు గాను రూ.25.41 కోట్లు చెల్లించారు. మిగతా రూ.10.46 కోట్ల మేర రైతులకు బోనాస్ చెల్లించాల్సి ఉండగా గత రెండు నెలలుగా రైతులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. సన్న రకాలు విక్రయించిన రైతుల వివరాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆన్లైన్ న మోదుచేసి పౌరసరఫరాల శాఖ మార్కెటింగ్ అధికారి లాగిన్‌కు పంపించడంతో డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. సన్న రకాల బోనస్ చెల్లించేందుకు డీఎస్ఓ లాగిన్‌కు వెళతాయి. అక్కడి నుంచి రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంది. ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నాఅందని డబ్బులు రైతులకు తప్పని ఎదురుచూపులు జిల్లాలో పెండింగ్ రూ.10.46 కోట్లు -
ఎన్నికలకు సన్నద్ధం కావాలి
నారాయణపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రిటర్నింగ్ అధికారులు, స్టేజ్ వన్, టూ సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగారంలో బుధవారం మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్ఓలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుండే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని, నోటిఫికేషన్ లో స్పష్టంగా వివరాలను పొందుపర్చాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సమయపాలనను పక్కాగా పాటిస్తూ, నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలన్నారు. నిబంధనలు తప్పనిసరి అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ప్రతి రోజు త్వరితగతిన డైలీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్ సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో, విత్ డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయిస్తే, తగిన ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరిగితే, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆర్ఓలు, సహాయ ఆర్ఓలకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. శిక్షణ తరగతుల్లో ట్రైనీ కలెక్టర్ గరిమనరుల, అదనపు కలెక్టర్ బెన్ షాలం, డీపీఓ కృష్ణ, డీఈఓ గోవిందరాజు, ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం పొడిగించాలి
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, పాలక మండలి సభ్యులు రంగారెడ్డి, మంజులారెడ్డి, భూపాల్‌రావు, బక్కన్నయాదవ్, భీంరెడ్డి, వెంకటేష్‌గుప్తా, వంశీచంద్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా సంతకాల సేకరణ చేపట్టారు. ● ఇదిలా ఉండగా.. సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాలకవర్గాల కాలపరిమితి ముగియగానే ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుంది. కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మాత్రం మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాన్ని ఆరు నెలల కాలపరిమితితో పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వ సంప్రదాయంగా కొనసాగుతుంది. గత మూడు దశాబ్దాలుగా పీఏసీఎస్ పదవీకాలం ముగిసిన రెండేళ్ల వరకు ఎన్నికలు జరగకపోయినా ప్రతి ఆరునెలలకు ఒకసారి పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఉంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న 9 డీసీసీబీ బ్యాంకుల్లో రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండటంతోపాటు వాణిజ్యపరంగా మంచి అభివృద్ధి సాధించాయి. అందుకే అధికారుల ఇన్చార్జి పాలనలో కొనసాగే కంటే ఉన్న పాలక వర్గాలను కొనసాగించాలని కోరుతూ అన్ని ఉమ్మడి జిల్లాల్లోని డీసీసీబీ చైర్మన్ల అధ్యక్షతన సమావేశం నిర్వహించి వినతిపత్రాలు అందించాలనే రాష్ట్రంలోని ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ల నిర్ణయంలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం ఒక్క పాలమూరు జిల్లాలోనే కాకుండా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల డీసీసీబీ బ్యాంకుల్లో వాటి పర్యవేక్షణలో పనిచేసే పీఏసీఎస్‌ల చైర్మన్లు తమ సొసైటీల అభివృద్ధికి సంపూర్ణంగా సేవలు చేస్తున్నందున ఈ పాలక వర్గాలనే కొనసాగించాలని పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌గౌడ్ ఆకాంక్షించారు. -
నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 18, 19 తేదీల్లో 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను నేడు (గురువారం) జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 లోపు బాలబాలికలకు ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తామని, ఆసక్తి గల క్రీడాకారులు ఎస్ఎస్సీ మెమో, తహసీల్దార్ ద్వారా కుల ధ్రువపత్రం, జనన ధ్రువపత్రాలతో రిపోర్ట్ చేయాలని కోరారు. మిగతా వివరాల కోసం 9492177535, 9440656162 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని సోమశిల గ్రామంలో ఏఐసీసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ట్రైకా చైర్మన్ బెల్లయ్యనాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు జ్యోత్రి ప్రజల్వన చేసి శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, వాటి పరిరక్షణ తదితర అంశాలపై శిక్షణ శిబిరంలో వక్తలు వివరిస్తారని చెప్పారు. శిక్షణ తరగతులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూడు రోజులపాటు కొనసాగే శిక్షణ తరగతుల్లో పలువురు ప్రొఫెసర్లు, ఎమ్మెల్యేలు గిరిజనులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. అనంతరం గిరిజన సంఘం నాయకులు మంత్రి జూపల్లిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు లింగయ్యనాయక్, హన్మంతునాయక్, శంకర్‌నాయక్, గోపి, బస్తీరాం, బాలు, శ్రీరామ్‌నాయక్ పాల్గొన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి కృష్ణా తీర ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రకాష్‌రెడ్డితో కలిసి సోమశిల నదీతీర ప్రాంతాలు పరిశీలించారు. లాంచీలో వెళ్లి మల్లేశ్వరం ఐల్యాండ్, అమరగిరి ప్రాంతాలను సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సోమశిలలో భక్తుల విడిది కోసం నూతనంగా షెడ్లు, డార్మెటరీ గదులు నిర్మించనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు ఇతరవి తీర్చిదిద్దుతామన్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు వెళ్లే లాంచీని రోజువారీగా తిప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. -
రైతులకు నష్టమే మిగులుతోంది..
కష్టపడి పండించిన కూరగాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే దళారులు, వ్యాపారులు కిలో టమాట రూ.5కు అడుగుతారు. తమతో ప్రతి కూరగాయల్ని తక్కువ ధరలకే కొనుగోలు చేసి వారు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రేయనకా.. పగలనకా కష్టపడి కూరగాయలు పండించిన రైతుకు నష్టాలు వస్తే.. వ్యాపారులకు మాత్రం లాభాలు గడిస్తున్నారు. – మణెమ్మ, మందిపల్లితండా వ్యాపారులే లాభపడుతున్నారు.. వారాంతపు సంతలో కూ రగాయల ధరలు రైతులు నేరుగా విక్రయిస్తే తక్కువ ధర ఉంటుంది. అదే వ్యాపారులతో అధిక ధరలు ఉంటున్నాయి. చాలామటుకు దళారులు.. పొలాల వద్దకు, లేదా రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన వెంటనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వినియోగదారులకు అధిక ధరకు విక్రయించి త్రీవంగా ముంచుతున్నారు. పంట పండించిన రైతులు నష్టపోతుండగా.. వ్యాపారులు అధిక లాభం పొందుతున్నారు. మొత్తంగా రైతు, వినియోగదారుడు తీవ్రంగా నష్టపోతున్నాడు. – లక్ష్మమ్మ, పెద్దచింతకుంట -
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో మరికల్, ధన్వాడ, ఊట్కూర్, దామారగిద్ద, కోస్గి మండల్లాలో మాత్రమే అరకొరగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇవి జిల్లా అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇక్కడ కేవలం ఒక గుంట, లేక అర ఎకరా లోపు మాత్రమే కూరగాయలు సాగు చేయడం వల్ల అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఒక రైతు రెండు నుంచి మూడు ఎకరాలకు పైగా కూరగాయలను సాగు చేసి ఇతర పంటలకు మార్కెటింగ్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఈ పరిస్థితి లేకనే గ్రామాల్లో జరిగే వారాంతపు సంతలకు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన కూరగాయలను విక్రయిస్తున్నారు. నారాయణపేట, మక్తల్, మద్దూరు, మరికల్ మండల్లాలో జరిగే వారాంతపు సంతలకు ఎక్కువగా కర్ణాటకలోని రాయచూర్ నుంచి దిగుమతి అవుతున్నాయి. మద్దూరు, కోస్గి మండల్లాలో జరిగే సంతలకు సరిహద్దు ప్రాంతాలతో పాటు కర్నూల్ జిల్లా నుంచి వస్తున్నాయి. 70 శాతం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే జిల్లా అవసరాలను తీర్చడం గమనార్హం. క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్, క్యాలిప్లవర్, బీట్రూట్, బీర్నీస్, ముళ్లంగి సాగు మాత్రం జిల్లాలో నామమాత్రంగా ఉంది. ఇక్కడ కేవలం టమాటా, బీర, బెండకాయ, దొండకాయ, చిక్కు డు.. ఆకు కూరగాయలు మాత్రం నామమాత్రంగా పండిస్తున్నారు. ఇవి ఏవి కొనుగోలు చేసినా కిలో రూ.60 పైనే ఉండడంతో సామాన్య, పేద ప్రజలు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. -
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
నారాయణపేట: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుకాసురులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై పోలీసుశాఖ దాడులను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రజలు డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. పోలీసు వారి సూచనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్య అనుమతి పొందిన వారికి మాత్రమే రాష్ట్రంలో ఇసుక తరలించేందుకు, విక్రయించేందుకు అనుమతి ఉందన్నారు. ప్రత్యేక బస్సుల ఏర్పాటు నారాయణపేట రూరల్: మాఘశుద్ద పౌర్ణమిని పురస్కరించుకుని వైష్ణవాలయాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బ స్సులను ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణపేట డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం శివారులోని ఏక్లాస్పూర్ తిమ్మప్పస్వామి, మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి క్షేత్రాలకు బుధ, గురువారాల్లో ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు పహారా మధ్య భూ సర్వే ఊట్కూర్/దామరగిద్ద: నారాయణపేట – కొ డంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా ఊట్కూర్ మండలం బాపూర్ శివారులో చేపట్టిన భూ సర్వే మంగళవారం పోలీసు పహారా మధ్య కొనసాగింది. బాపూర్ శివారులోని 20 ఎకరాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్, సంపుహౌజ్ నిర్మాణాల కోసం ఐదు రోజుల క్రితం సంబంధిత అధికారులు భూ సర్వే చేపట్టగా.. గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ లింగయ్య, సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో అధికారులు భూ సర్వే పనులు చేపట్టారు. అదే విధంగా దామరగిద్ద తండా సమీపం నుంచి రోడ్డు నిర్మాణ పనులను ముమ్మరం చేసి నట్లు ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ తెలిపారు. తహసీల్దార్లు దయాకర్‌రెడ్డి, అమరేంద్ర కృష్ణ, చింత రవి, ఇరిగేషన్ డీఈ కేతన్ కుమార్, ఏఈలు వెంకటేశ్, రవికుమార్ పాల్గొన్నారు. వేరుశనగ @ రూ.6,269 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ. 6,269, కనిష్టంగా రూ. 3,869 ధర పలికింది. ఎర్రకందులు గరిష్టంగా రూ. 7,750, కనిష్టంగా రూ.6,222, తెల్ల కందులు గరిష్టంగా రూ. 8వేలు, కనిష్టంగా రూ. 6,212 ధరలు వచ్చాయి. -
తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం
కోస్గి రూరల్: వెనకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధిపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డితో కలిసి మంగళవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడంగల్‌ను మరో సిరిసిల్లగా మారుస్తానని హామీ ఇచ్చి ఎడారిగా మార్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తుంటే.. ఓర్వలేక అడ్డుకుంటున్నారని ధ్వజమె త్తారు. పట్టణంలో రోడ్డు వెడల్పు బాధితుల కోసం రూ. 7కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాలో రైతుభరోసా డబ్బు లు జమ అవుతున్నాయని.. తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు రాములు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, అన్న కి ష్టప్ప, విక్రంరెడ్డి, హరి, రాజేష్, భానునాయక్, న ర్సింహ, రాంబాబు, బాల్‌రాజ్, కృష్ణమూర్తి, సోమ శేఖర్, సుధాకర్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి ఉన్నారు. -
పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలలకు విడుదలైన పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పీఎంశ్రీ కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పీఎంశ్రీ పథకానికి మొదటి విడతగా 12 పాఠశాలలు, రెండో విడతగా ఏడు పాఠశాలలు ఎంపికయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలని డీఈఓ గోవిందరాజులుకు సూచించారు. సంబంధిత పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి వివరాలతో డాక్యుమెంట్ తయారుచేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. అనంతరం పదో తరగతి వార్షిక పరీక్షలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు జరగబోతున్నాయని.. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో గణిత, భౌతిక శాస్త్రంలో విద్యార్థులు వెనకబడి ఉన్నారని.. వారికి పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా చూడాలన్నారు. ఈ విషయంపై సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించాలని డీఈఓకు సూచించారు. జిల్లాలోని సబ్జెక్టు ఫోరమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వాలని, సబ్జెక్టుల వారీగా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారంలో నాణ్యత పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు మూడవ స్లిప్ టెస్ట్ పూర్తయిన తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని.. జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎఫ్ఏఓ చారి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, శ్రీనివాస్, రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి తదితరులు ఉన్నారు. మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ.. ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. మాస్టర్ ట్రైనర్స్‌చే వీరికి శిక్షణ తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీపీఓ కృష్ణ పాల్గొన్నారు. -
ప్రత్యేకమా.. పొడిగింపా?
14న ముగియనున్న ‘సహకార’ పాలకవర్గాల గడువు ● ఆరు నెలల వరకు ఎన్నికల నిర్వహణ అనుమానమే.. ● పదవీకాలం పొడిగించాలని కోరుతున్న చైర్మన్లు ● స్పెషలాఫీర్ల నియామకానికి అధికారుల కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో మొత్తం 87 సహకార సంఘాలు అచ్చంపేట: రైతులకు క్షేత్రస్థాయిలో సాగుపరమైన సేవలందిస్తూ.. అండగా నిలుస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 14తో ముగియనుంది. అయితే వీటికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకాధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఆ తర్వాతే వీటి ఎన్నికలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే బ్యాంకు కార్యకలాపాలన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉండటంతో ప్రత్యేకాధికారుల పాలనతో వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే మరో ఆరు నెలలు పొడిగించాలని డీసీసీబీ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలోనూ అప్పటి ప్రభుత్వం ఆరు నెలల చొప్పున నాలుగు సార్లు డీసీసీబీ పాలకవర్గాలకు కొనసాగించిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం గడువు పొడిగిస్తుందా.. లేక ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గుచూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సొసైటీల ప్రత్యేకాధికారుల నియమాకానికి ఉమ్మడి జిల్లాలోని సహకార శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆరు నెలల ముందుగానే ప్రక్రియ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 76 సొసైటీలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ డీసీసీబీ పరిధిలోని ఐదు జిల్లాలు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధులు కలుపుకొంటే మొత్తం 87 పీఏసీఎస్‌లు ఉన్నాయి. అయితే పీఏసీఎస్‌లకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఫ్రిబవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. ఈ పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగుస్తుంది. సాధారణంగా సొసైటీల కాలపరిమితి ముగిసే ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ చేపట్టి గడువు వరకు పూర్తిచేసేది. అయితే ప్రస్తుతం వీటి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యంగా మారింది. జిల్లాకో కేంద్ర బ్యాంకు.. కొత్త జిల్లాలు ఏర్పడినా ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలోనే ఏడు జిల్లాల ప్యాక్స్‌లను నిర్వహిస్తున్నారు. కొత్తగా జిల్లాకో కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో ఎన్నికలు ఒకే డీసీసీబీ కింద నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా కొత్తగా 40 ప్యాక్స్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. -
కేసుల పరిష్కారానికి రాజీమార్గం ఉత్తమం
నారాయణపేట: చిన్నచిన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని.. వచ్చేనెల 8న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ఆవరణలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. రాజీ అయ్యే కేసులను జాతీయ లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకునేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. యాక్సిడెంట్, పరస్పర దాడులు, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన కేసులతో పాటు చిన్నచిన్న చోరీల కేసులు, కరోనా సమయంలోని కేసులు, డ్రంకెన్ డ్రైవ్ తదితర కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. జిల్లాలోని నారాయణపేట పట్టణ, రూరల్, మాగనూరు, మద్దూరు, దామరగిద్ద, ఉట్కూర్, కోస్గి, ధన్వాడ, మక్తల్, కృష్ణా, నర్వ, మరికల్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఈపెట్టి, డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఎకై ్సజ్ శాఖలో ఉన్న పెండింగ్ కేసులను క్లియర్ చేయాలన్నారు. మొత్తం 6,540 కేసులను క్లియర్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ సివిల్‌జడ్జి వింధ్య నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి మహమ్మద్ ఉమర్, అడిషనల్ జూనియర్ జడ్జి సయ్యద్ జాకియా సుల్తానా, డీఎస్పీ లింగయ్య తదితరులు ఉన్నారు. -
రైతు కష్టం దళారులపాలు
కూరగాయల రైతును నిండా ముంచుతున్న వ్యాపారులు మరికల్: రాత్రనకా.. పగలనకా ఎంతో కష్టపడి కూరగాయలను సాగు చేస్తున్న రైతును అటు దళారులు, వ్యాపారులు నిండా ముంచుతున్నారు. నేరుగా పొలాల వద్దకు వెళ్లడం.. తక్కువ ధరకు కూరగాయలు కొనుగోలు చేయడం.. బయటి మార్కెట్లో అంతకు రెండు మూడింతలు ఎక్కువకు విక్రయిస్తూ రైతు కష్టాన్ని వీరు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రైతుకు కష్టం తప్ప లాభం దక్కడం లేదు. సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు విత్తనాలు, నారు, కలుపు, ఎరువులు, కూలీలు, రవాణా తదితరాలన్నీ కలిపి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడి ఖర్చు అవుతున్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేసిన కూరగాయల్ని విక్రయిస్తున్న దుకాణదారులు, మద్యవర్తులు ఏకంగా అధిక లాభాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం రైతుల నుంచి టమాటాను కిలో రూ.5 నుంచి 10 కొంటున్నారు. వీటినే మార్కెట్లో కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. మొత్తంగా లాభం లేకపోవడంతో రైతులు నానాటికి కూరగాయల సాగును తగ్గించి వరి, ఇతర పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. అన్నదాత నుంచి తక్కువధరకు కొనుగోలు రెండు, మూడింతలు అధిక ధరకు బయటి మార్కెట్లో విక్రయాలు క్రమంగా తగ్గుతున్న కూరగాయలు సాగు ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల మొగ్గు జిల్లాలో కూరగాయల దిగుబడి 16 టన్నులు.. అవసరం 135 టన్నులు కర్ణాటక.. ఆంధ్ర నుంచి దిగుమతులు కూరగాయల సాగును జిల్లాలో రైతులు తగ్గిస్తూ వస్తుండడంతో విధిలేని పరిస్థితిలో బయటి నుంచి దిగుబతి చేసుకోవాల్సి వస్తోంది. జిల్లాకు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం రాయచూర్, యాద్గీర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాల నుంచి చాలావరకు కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో రవాణా ఖర్చులు కలిపి వ్యాపారులు కూరగాయల ధరలను నిర్ణయి స్తున్నారు. జిల్లాలో గత 15 ఏళ్ల నుంచి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నా రైతులు కూరగాయల సాగును తగ్గించి పత్తి, వరిపైనే మక్కు వ చూపుతున్నారు. ఉధ్వాన శాఖ అధికారులు మార్కెట్లో కూరగాయలకు ఉన్న డి మాండ్‌పై రైతులకు పూర్తి స్థాయిలో అ వగా హన కల్పించడంతోపాటు.. బయటి మార్కెట్లో వచ్చే లాభాలు రైతుకు అందేలా చూ స్తేనే జిల్లాలో సాగు పెరిగే అవకాశం ఉంది. -
ప్రత్యేకమా.. పొడిగింపా?
14న ముగియనున్న ‘సహకార’ పాలకవర్గాల గడువు ● ఆరు నెలల వరకు ఎన్నికల నిర్వహణ అనుమానమే.. ● పదవీకాలం పొడిగించాలని కోరుతున్న చైర్మన్లు ● స్పెషలాఫీర్ల నియామకానికి అధికారుల కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో మొత్తం 87 సహకార సంఘాలు అచ్చంపేట: రైతులకు క్షేత్రస్థాయిలో సాగుపరమైన సేవలందిస్తూ.. అండగా నిలుస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 14తో ముగియనుంది. అయితే వీటికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకాధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఆ తర్వాతే వీటి ఎన్నికలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే బ్యాంకు కార్యకలాపాలన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉండటంతో ప్రత్యేకాధికారుల పాలనతో వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే మరో ఆరు నెలలు పొడిగించాలని డీసీసీబీ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలోనూ అప్పటి ప్రభుత్వం ఆరు నెలల చొప్పున నాలుగు సార్లు డీసీసీబీ పాలకవర్గాలకు కొనసాగించిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం గడువు పొడిగిస్తుందా.. లేక ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గుచూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సొసైటీల ప్రత్యేకాధికారుల నియమాకానికి ఉమ్మడి జిల్లాలోని సహకార శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆరు నెలల ముందుగానే ప్రక్రియ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 76 సొసైటీలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ డీసీసీబీ పరిధిలోని ఐదు జిల్లాలు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధులు కలుపుకొంటే మొత్తం 87 పీఏసీఎస్‌లు ఉన్నాయి. అయితే పీఏసీఎస్‌లకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 ఫ్రిబవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. ఈ పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగుస్తుంది. సాధారణంగా సొసైటీల కాలపరిమితి ముగిసే ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ చేపట్టి గడువు వరకు పూర్తిచేసేది. అయితే ప్రస్తుతం వీటి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యంగా మారింది. జిల్లాకో కేంద్ర బ్యాంకు.. కొత్త జిల్లాలు ఏర్పడినా ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలోనే ఏడు జిల్లాల ప్యాక్స్‌లను నిర్వహిస్తున్నారు. కొత్తగా జిల్లాకో కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో ఎన్నికలు ఒకే డీసీసీబీ కింద నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా కొత్తగా 40 ప్యాక్స్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. -
పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలలకు విడుదలైన పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పీఎంశ్రీ కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పీఎంశ్రీ పథకానికి మొదటి విడతగా 12 పాఠశాలలు, రెండో విడతగా ఏడు పాఠశాలలు ఎంపికయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలని డీఈఓ గోవిందరాజులుకు సూచించారు. సంబంధిత పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి వివరాలతో డాక్యుమెంట్ తయారుచేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. అనంతరం పదో తరగతి వార్షిక పరీక్షలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు జరగబోతున్నాయని.. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో గణిత, భౌతిక శాస్త్రంలో విద్యార్థులు వెనకబడి ఉన్నారని.. వారికి పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా చూడాలన్నారు. ఈ విషయంపై సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించాలని డీఈఓకు సూచించారు. జిల్లాలోని సబ్జెక్టు ఫోరమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వాలని, సబ్జెక్టుల వారీగా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారంలో నాణ్యత పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు మూడవ స్లిప్ టెస్ట్ పూర్తయిన తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని.. జిల్లాలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎఫ్ఏఓ చారి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, శ్రీనివాస్, రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి తదితరులు ఉన్నారు. మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ.. ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. మాస్టర్ ట్రైనర్స్‌చే వీరికి శిక్షణ తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీపీఓ కృష్ణ పాల్గొన్నారు. -
సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి సైన్స్‌పై ఇష్టాన్ని పెంచుకోవాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఫోరమ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాలెంట్ టెస్టుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సైన్స్‌లో రాణించాలన్నారు. అంతకుముందు ఆన్లైన్ లో నిర్వహించిన పోటీలో తానియ ఫాతిమా (కోస్గి) ప్రథమ బహుమతి సాధించగా, నిహారిక (కోస్గి) ద్వితీయ బహుమతి, త్రిష, మేఘ వాణీ (మద్దూర్) తృతీయ బహుమతులు గెలుపొందారు. వారికి ప్రశంసా పత్రాలు, మెమొంటో లను అందించి అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, జిహెచ్ఎం సత్యనారాయణ సింగ్, సైన్స్ ఫోరం సభ్యులు మహేష్, శ్రీనివాస్ రెడ్డి, సక్సేన, అమృత్ తో, కనకప్ప పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలంటూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా యూనియాన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతోపాటు కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటమ్మ, లక్ష్మీ, సత్యమ్మ, దేవమ్మ, పాపమ్మ, తిప్పమ్మ, అనంతమ్మ, చంద్రమ్మ, అంజమ్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు. -
రైతుల పక్షాన.. బీఆర్ఎస్ పోరాటం
కొద్దికాలంలోనే తీవ్ర వ్యతిరేకత రాష్ట్రంలో కొద్దికాలంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల్లో 420 హామీలిచ్చి ఏ ఒక్కటీ కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్రుకాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద తండాలో కూడా వంద గిరిజన కుటుంబాలకు చెందిన భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని.. మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా వీరికి అండగా కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. రోటిబండతండా రైతులతో సభలో కేటీఆర్ మాట్లాడించారు. కోస్గి శివాజీ చౌరస్తాలో ప్రజలకు అభివాదం చేస్తున్న కేటీఆర్ కోస్గి: ‘రాష్ట్రంలోని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను కళ్లలో పెట్టుకొని చూసినం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో రైతుబంధుకు రాం రాం.. పూర్తిస్థాయి రుణమాఫీ జరగలేదు. కానీ, మిత్రుడు అదానీ, అల్లుడు, ఎనుముల కుటుంబ కోసం రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కోస్గిలో చేపట్టిన ‘రైతు నిరసన దీక్ష’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై రైతులనుద్దేశించి ప్రసంగించారు. పచ్చని పంటలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో దుర్యోధనుడి పాలన కొనసాగుతుంది. కొడంగల్ ప్రజల ఓట్లతో గెలిచిన రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతంలోని భూముల్లో తొండలు గుడ్లు పెడుతాయి తప్ప వ్యవసాయానికి పనికి రాదని చెప్పి.. ఇప్పుడు అవే భూములను లాక్కునే ప్రయత్నం చేశాడని, ఇక్కడికి వచ్చి చూస్తే తుంకిమెట్ల నుంచి రోడ్డుకు ఇరువైపులా పచ్చని వరిపంటలు కనిపిస్తున్నాయని చెప్పారు. 60, 70 ఏళ్ల నుంచి సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజన రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే లగచర్ల, రోటిబండతండా రైతుల పోరాట స్ఫూర్తి ఆదర్శ ప్రాయమన్నారు. తండాల్లో 70 మంది మీద మొదట కేసులు పెట్టారు.. తర్వాత కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మద్దతుదారుల పేర్లు తొలగించి 40 మంది బీఆర్ఎస్ మద్దతుదారులను మాత్రమే జైల్లో పెట్టారు. వీరితోపాటు అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని 40 రోజుల పాటు జైల్లో ఉంచారని గుర్తుచేశారు. జైల్లో ఉన్న నరేందర్‌రెడ్డిని మేం కలవడానికి వెళ్తే.. నేను బాగానే ఉన్నాను. రైతుల కోసం నెల కాదు ఏడాదైనా జైల్లో ఉంటాను. అక్రమంగా కేసులు బనాయించి చర్లపల్లి జైల్లో పెట్టిన రైతులను విడిపించాలని మాజీ ఎమ్మెల్యే సూచించారని గుర్తుచేశారు. మా మాజీ ఎమ్మెల్యే రైతుల పక్షాన జైలుకు వెళితే.. సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని దుయ్యబట్టారు. కేటీఆర్ పర్యటన సాగిందిలా.. మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కొడంగల్ నియోజకవర్గంలోని మెట్లతండాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ప్రవేశించింది. 2: 20 గంటలకు నియోజకవర్గంలోని తుంకిమెట్ల గ్రామంలోని చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. 2:27 గంటలకు ఇదే గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వడ్ల మోనయ్యచారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. 2:40 గంటలకు లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం వద్ద కాసేపు వాహనాలు నిలిపారు. అక్కడ సాగు చేసిన వరి పొలాలను కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు, తదితరులు పరిశీలించారు. 2:45 గంటలకు హకీంపేటకు చేరుకొని భూబాధిత మహిళ జ్యోతి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె బిడ్డకు నామకరణం చేశారు. 3: 15 గంటలకు కోస్గిలోని రామాలయం చౌరస్తాకు చేరుకున్నారు. 4:02 గంటలకు కోస్గిలోని రైతు నిరసన దీక్ష సభకు చేరుకున్నారు. 4:05 గంటలకు సభాధ్యక్షుడు మాజీ ఎమెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రసంగం. 4: 24 గంటలకు కేటీఆర్ ప్రసంగం.. 31 నిమిషాలపాటు సాగింది. 4:59 గంటలకు కేటీఆర్ హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. పచ్చని పొలాలను అదానీ, అల్లుడికి దానం చేస్తే ఊరుకోం లగచర్ల రైతుల పోరాట స్ఫూర్తి ఢిల్లీని కదిలించింది రాష్ట్రంలో దుర్యోధన పాలన సాగుతోంది కోస్గి ‘రైతు నిరసన దీక్ష’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎత్తిపోత పథకం కాంట్రాక్టు మంత్రి కోసమే కొడంగల్– పేట ఎత్తిపోతల పథకం కాంట్రాక్టు కాంగ్రెస్‌లోని ఓ మంత్రి కోసం రూ.4,500 కోట్లు పెట్టాడని కేటీఆర్ దుయ్యబట్టారు. అంతుకు ముందే పాలమూరు ఎత్తిపోతల ద్వారా కొడంగల్ ఒక్క నియోజకవర్గానికే 1.50 లక్షల ఎకరాలకు సాగునీటి అందించడానికి 90 శాతం పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు ఆ పనులు ఆపి జూరాల నుంచి మళ్లీ నీళ్లు తీసుకొస్తానని కొత్త నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు. -
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం రాత్రి సూర్యప్రభవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య సేవ ముందుకు కదిలింది. బంగారు ఆభరణాలు, రకరకాల పూల అలంకరణల మధ్య స్వామివారు భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. నేడు హనుమత్‌వాహన సేవ.. ప్రభోత్సవం మన్యంకొండలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి హనుమత్‌వాహన సేవ నిర్వహించనున్నారు. అలాగే అదేరోజు రాత్రి ప్రభో త్సవం కూడా జరుపుతారు. ప్రభోత్సవ కార్యక్రమం రథోత్సవం మాదిరిగానే తేరు మైదానంలో కొనసాగనుండగా.. వేలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. -
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నారాయణపేట రూరల్: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని అఖిలభారత చేనేత కార్మిక సంఘం కో కన్వీనర్ కెంచె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నారాయణపేట, ఉట్కూర్ మండలాల్లోని జాజాపూర్, చిన్నపోర్ల గ్రామాల్లో సోమవారం పర్యటించి నేతకార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న సహకార భారతి ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నారాయణపేటలో నిర్వహిస్తున్న చేనేత కార్మికుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి సహకార భారతి చేనేత విభాగం అఖిల భారత అధ్యక్షుడు అనంతకుమార్ మిశ్రా, సహకార భారతి రాష్ట్ర కార్యదర్శి నాగిళ్ల కుమారస్వామి హాజరవుతారని, ఇక్కడి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వంతో పోరాటం చేసి న్యాయం చేసేందుకు కృషి చేస్తారన్నారు. పెద్ద ఎత్తున నేతకార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయభాను, జిల్లా అధ్యక్షులు బాల్ రెడ్డి, కిష్టప్ప, రాధాకృష్ణ, రఘురాములు, రాములు, బలప్ప, వెంకటయ్య పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట టౌన్: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని.. నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాతాల నుంచి ప్రజలు తమ వినతులు కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ రాంచందర్‌కు అందజేశారు. 37 మందికి హెచ్‌సీలుగా పదోన్నతి మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేస్తున్న 37 మంది కానిస్టేబుల్స్‌కు హెడ్‌కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ సోమవారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 22 మందికి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఐదుగురికి, వనపర్తిలో ఆరుగురికి, గద్వాలలో ముగ్గురికి, నారాయణపేట జిల్లాలో ఒకరికి హెడ్‌కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పించారు. వీరిలో మహబూబ్‌నగర్‌లో ఒకరికి, నాగర్‌కర్నూల్ జిల్లాలో 13 మందికి, వనపర్తిలో ఆరుగురికి, గద్వాలలో ఆరుగురు, నారాయణపేట జిల్లాలో 9 మందికి, ఇంటలిజెన్స్‌లో ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చారు. పదోన్నతి వచ్చిన హెడ్‌కానిస్టేబుల్స్ రెండు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎంకు ఆహ్వానం కొత్తపల్లి: మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని కొత్తపల్లి కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో నాయకులు చెన్నప్ప, చిన్నమల్లప్ప, బాలకిష్టయ్య, అల్లీ తిరుమలయ్య, బిచ్చాల వెంకటయ్య, జనార్ధన్ తదితరులు కలిశారు. గ్రామస్తులు, యాదవుల సహకారంతో నిర్మించిన అలయంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో విగ్రహా ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎంకు తెలిపారు. మన్యంకొండ జాతరకు ప్రత్యేక బస్సులు స్టేషన్ మహబూబ్‌నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 12, 13 తేదీల్లో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టి లో పెట్టుకొని మహబూబ్‌నగర్, నారాయణ పేట డిపోల నుంచి 20 ప్రత్యేక బస్సుల చొప్పు న దాదాపు 150 అదనపు ట్రిప్పులను మన్యంకొండ జాతరకు నడుపుతామని పేర్కొన్నారు. కొండ మీదకు ప్రత్యేకంగా 20 మినీ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగునీటి, నీడ కోసం ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.