ఎస్టీ మహిళల పెళ్లికి రూ. 50 వేల బహుమతి
షెడ్యూల్డు తెగలకు చెందిన మహిళలు పెళ్లి చేసుకుంటే వారికి ఆ సందర్భంలో 50 వేల రూపాయల బహుమతి అందిస్తామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల పిల్లలు సివిల్ సర్వీసులకు కోచింగ్ తీసుకుంటే.. అందుకు ప్రభుత్వం వారికి సాయం చేస్తుందని చెప్పారు. ఎస్టీ శిశువులకు పుట్టిన వెంటనే ప్రత్యేక కిట్ అందజేస్తామన్నారు.
ఎస్సీ ఎస్టీల సబ్ ప్లాన్ అమలుకు ఎనిమిదేళ్లలో ఏం చేయాలన్న అంశంపై తాము చర్చించినట్లు ఆయన తెలిపారు. నిధుల మంజూరు విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి తనను ఆదేశించారని ఆయన అన్నారు. ఎస్సీ నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం ఆరు కొత్త పథకాలకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారని కిశోర్ బాబు చెప్పారు.