'ప్రభుత్వ తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు' | alla ramakrishna reddy fires on ap government | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వ తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు'

Published Wed, Feb 25 2015 3:37 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

alla ramakrishna reddy fires on ap government

గుంటూరు: ఏపీ ప్రభుత్వం భూ సేకరణ పేరుతో రైతులను బెదిరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన గుంటూరులో బుధవారం మా్ట్లాడుతూ... రైతుల అంగీకారంతో భూములు తీసుకుంటానన్న ప్రభుత్వం...ఇప్పుడు బెదిరించటమేంటని ఆయన ప్రశ్నించారు.

ల్యాండ్ పూలింగ్ తో అనుకున్నంత భూమి రాకపోవడంతో మంత్రులు ఊరూరా తిరిగి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసుల పేరుతో ఇబ్బందిపెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు సేకరణ పేరుతో రైతుల గొంతు మీద కత్తి పెట్టిందన్నారు. భూముల కోసం రైతుల మధ్య గొడవలు సృష్ట్రిస్తోందన్నారు. రైతుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణమాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement