ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, కడప/పులివెందుల : అంగన్‌వాడీ అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
అంగన్‌వాడీల పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న పులివెందుల సీడీపీవోను వెంటనే సస్పెండ్ చేయాలని, అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. వైఎస్‌ఆర్ సీపీ తరఫున కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్పతోపాటు జిల్లా కార్యదర్శి రసూల్, ఆ పార్టీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటులో జీరో అవర్ లేదా క్వశ్చన్ అవర్‌లో ప్రస్తావించి న్యాయం జరిగేలా గట్టిగా పోరాడుతానన్నారు.
కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ నాయకుడు రామ్మోహన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఐఎన్ సుబ్బమ్మ, వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగ జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఆ విభాగ జిల్లా కార్యదర్శి సర్వోత్తమరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి వీరభద్రారెడ్డి, ఆ పార్టీ మైనార్టీ సెక్రటరీ బాబావల్లి, ఏడీకే గార్మెంట్స్ మాధవరెడ్డి, ఎస్సీ నాయకులు సూరి, శంకర్, కృష్ణమూర్తి, తిరుమలయ్య పాల్గొన్నారు.
అధికారుల తప్పిదంతో
నీటి విడుదల జాప్యం
బ్రహ్మంగారిమఠం: తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు కొంత కాలంగా నీటి విడుదలలో అధికారుల తప్పిదంతోనే జాప్యం జరుగుతోందని కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. టి.రామాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో అధికంగా వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయంలో పుష్కలంగా నీరు వున్నా బ్రహ్మంసాగర్‌కు నీటి విడుదలలో అధికారులు తప్పిదం చేశారన్నారు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, బద్వేలు మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి, బి.మఠం ఎంపీపీ చక్రవర్తి, జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తనయుడు నాగిరెడ్డి, బి.మఠం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి శెట్టిపల్లె నాగేశ్వరరెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు సి.వీరనారాయణరెడ్డి, చాపాడు మండల పరిషత్ ఎంపీపీ భర్త వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.
కల్వర్టు పనుల పరిశీలన
బ్రహ్మంగారిమఠం: మైదుకూరు-బద్వేలు జాతీయ రహదారిలో వున్న నందిపల్లె దగ్గర నుంచి ప్రస్తుతానికి 10 కిలోమీటర్ల సింగిల్ రోడ్డు నుంచి డబుల్ రోడ్డు నిర్మాణానికి 10 కోట్ల రూపాయలతో యస్.ఆర్.కె. కన్‌స్ట్రక్షన్స్ పనులు ప్రారంభించింది. ఇందులో దాదాపు 16 కల్వర్టులు వున్నాయి. ఈ కల్వర్టుల నిర్మాణానికి మండల టీడీపీ అధ్యక్షుడు యం.రత్నకుమార్‌యాదవ్ బినామీగా కాంట్రాక్ట్ పనులు పొందాడు. దాదాపు 70 లక్షల రూపాయలతో బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణానికి పనులు ప్రారంభించారు.
పనుల ప్రారంభంలో అధికారుల అలసత్వం వలన బినామీ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం ఏంటని కడప పార్లమెంటు సభ్యుడు వై.యస్.అవినాష్‌రెడ్డి, కల్వర్టు నిర్మాణానికి ఏర్పాటు చేసిన ఇసుకను చూసి ఆశ్చర్యపోయారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వం ఇలాంటి పనులు చేసి దుర్వినియోగ పరుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు.
అంగన్‌వాడీలకు అండగా ఉంటాం..
Published Fri, Feb 6 2015 1:30 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement