అది నాయుడు రియల్‌ ఎస్టేట్‌ రాజధాని : బైరెడ్డి | Baireddy Rajasekhara Reddy Slams Chandrababu Naidu Over Amaravati | Sakshi
Sakshi News home page

అది నాయుడు రియల్‌ ఎస్టేట్‌ రాజధాని : బైరెడ్డి

Published Thu, Dec 26 2019 2:20 PM | Last Updated on Thu, Dec 26 2019 2:26 PM

Baireddy Rajasekhara Reddy Slams Chandrababu Naidu Over Amaravati - Sakshi

సాక్షి, కర్నూలు : బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో భయపడి పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి గుంటూరు - విజయవాడ మధ్య రాజధానికి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజధాని అంటే అన్ని ప్రాంతాల ప్రజలకు భావోద్వేగ అంశమని, అలాంటిది అమరావతిలో నాయుడు రియల్‌ ఎస్టేట్‌ రాజధానిని ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాఫిక్స్‌ పేరు చెప్పి ప్రజా ధనాన్ని దోచుకున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement