'ప్రమాణస్వీకారం ఎక్కడనేది త్వరలో వెల్లడి'
తిరుమల : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడనేది త్వరలోనే వెల్లడిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు రంగనాయకుల మండలంలో పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను పునాదులతో సహా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. తిరుమల అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా వచ్చే నెల 2వ తేదీ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీవర్గాల సమాచారం.