సాక్షి, అమరావతి : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారని తెలిపారు. విష్ణు భగవానుడి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కాగా సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
శాంతి, శ్రేయస్సుతో ప్రజలు వర్ధిల్లాలి
సాక్షి, విజయవాడ : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ సందర్భంగా శాంతి, పురోగతి మరియు శ్రేయస్సుతో ప్రజలు వర్థిల్లాలని ఆకాంక్షించారు. శ్రీ కృష్ణుడు ఇచ్చిన శాశ్వతమైన సందేశాన్ని భగవద్గీత గుర్తుచేస్తుందని, ఆరోజును పురస్కరించుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకొంటారన్నారు. శ్రీకృష్ణజన్మాష్టమి సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి పునాదిని ధృవీకరిస్తుందని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలలో సోదరభావం, స్నేహం మరియు సామరస్యం మరింత బలోపేతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment