తెలంగాణను అడ్డుకుంటే చరిత్రహీనులే | Creation of Telangana state expected to be completed in 3 months | Sakshi
Sakshi News home page

తెలంగాణను అడ్డుకుంటే చరిత్రహీనులే

Published Tue, Oct 8 2013 3:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Creation of Telangana state expected to be completed in 3 months

శామీర్‌పేట్/శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్:  తెలంగాణను అడ్డుకునేవారు చరిత్రహీనులుగా నిలిచిపోతారని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎ ల్లార్) అన్నారు. కాంగ్రెస్ శామీర్‌పేట్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అలియాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ‘తెలంగాణ విజయోత్సవ సభ’ నిర్వహించారు. అంతకుముందు మండలంలో బైక్ ర్యాలీని ఎమ్మెల్యే కేఎల్లార్ జెండా ఊపి ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష చివరి ఘట్టంలో ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేవలం సాంకేతిక అడ్డు మాత్రమే ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటాలు చేసినవారికి శుభాకాంక్షలు, అమరవీరులకు జోహారులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవాలని ప్రయత్నించినవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఓటింగ్ లేదు. కాగితాలతోనే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు అమలవుతుందన్నారు. కేంద్రం నుంచి కాగితం వస్తుంది. మూడు నెలల్లో విభజన జరుగుతుందన్నారు.
 
 కిరణ్‌కుమార్ రెడ్డి అన్ని ప్రాంతాలకూ ముఖ్యమంత్రిగా వ్యవహరించడంలేదని, కేవలం ఒక ప్రాంతానికే వత్తాసు పల కడం దారుణమన్నారు.  ప్రత్యేక రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రజలు శాంతియుతంగా.. గాంధేయవాదం తరహాలో ఉద్యమాలు చేస్తే.. సీమాంధ్రులు కరెంట్ బంద్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమంలో ఉండండి.. చావండి.. కానీ మా తెలంగాణ జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమని’’ ఆయన తేల్చి చెప్పారు.  త్వరలో దేశానికి రానున్న అటామిక్ పవర్ ప్లాంట్‌ను తెలంగాణ ఎత్తిపోతల పథకాలకు తీసుకువచ్చేలా ఈ ప్రాంత ఎమ్మెల్యేలందరం కృషి చేస్తామని కేఎల్లార్ స్పష్టంచేశారు. కాగా తెలంగాణ విజయోత్సవ బైక్ ర్యాలీ సోమవారం ఉదయం మండలంలోని దేవరయాంజాల్ వద్ద ప్రారంభమై అన్ని గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రం అలియాబాద్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంది.
 
 కాంగ్రెస్‌లో చేరిన తూంకుంట సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు
 తూంకుంటలో ఇటీవల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందిన ఎద్దు నాగేశ్‌తో పాటు ఉప సర్పంచి మాధవి రంగారావు, వార్డుసభ్యులు బి. మంజులా సహదేవ్, ఎం. మంగమ్మ నర్సంహ, రాము యాదవ్, నిర్మలా అశోక్‌లు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కేఎల్లార్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, వైఎస్ గౌడ్, శ్రీనివాస్‌రె డ్డి, దయాసాగర్, అశోక్, మహేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, సునీత, రూప, నాగశ్రీ, లక్ష్మీనారాయణ, కృష్ణ, భిక్షపతి, వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బస్వారెడ్డి, జగన్నాథం, సత్యనారాయణ, సర్పంచ్‌లు మల్లేష్, అశోక్‌లతో పాటు ఆయాగ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
 
 ధూంధాంలో కేఎల్లార్ నృత్యం..
 చీర్యాల్‌లోని తెలంగాణ జన చైతన్య యాత్ర  కళామండలి వారు అలియాబాద్‌లో నిర్వహించిన ధూంధాంలో ఎమ్మెల్యే కేఎల్లార్ స్థానిక నాయకులతో కలిసి నృత్యం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement