సంక్షోభంలో ఇంజనీరింగ్ కళాశాలలు
Published Thu, Oct 17 2013 4:32 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
పటాన్‌చెరు, న్యూస్‌లైన్ : పటాన్‌చెరు పేరు వినగానే గుర్తుకొచ్చేది పరిశ్రమలే. అయితే తొమ్మిదేళ్ల టీడీపీ పాలన పుణ్యాన పారిశ్రామికవాడ కళ తప్పింది. అదే సమయంలో బీహెచ్‌ఈఎల్ చుట్టూ టీఆర్‌ఆర్, ఎల్లంకి, ఆర్‌ఆర్‌ఎస్, మహేశ్వర, టర్బో, ప్రియదర్శిని, సీజీఆర్, పీఆర్‌ఆర్, అరోరా వంటి విద్యా సంస్థలు నెలకొల్పారు. ఒక్కో విద్యా సంస్థ వారు రెండు నుంచి నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపించారు. ఇంజనీరింగ్ కళాశాలల తోపాటు డిప్లమో, ఫార్మసీ, ఎంబీఏ తదితర ప్రొఫెషనల్ కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. మొత్తం మీద పటాన్‌చెరు విద్యా సంస్థలకు నిలయంగా మా రింది. రాష్ట్ర స్థాయిలో పటాన్‌చెరు విద్యాసంస్థలకు మా రుపేరుగా నిలిచింది.
కానీ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన అడ్మిషన్ల సంఖ్య చూస్తే ఆయా కళాశాలలు సం క్షోభంలో కూరుకుపోయాయనే చెప్పాలి. ఈ ప్రాంతంలోని ఏ ఒక్క కళాశాలలోనూ ఆశించిన విధంగా విద్యార్థులు చేరలేదు. దీంతో విద్యా సంస్థలను మూసేయాల ని వివిధ కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సరిపడా సిబ్బందిని పెట్టుకుని మిగతా సిబ్బందిని తొలగిస్తున్నారు. టీఆర్‌ఆర్ క్యాంపస్‌లోని రెండు కళాశాలలను ఇది వరకే మూసివేయడంతో గత ఏడాది విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో కాకుం డా ఆదిలోనే కళాశాలను మూసివేస్తే సమస్య ఉండదనే ఉద్దేశంతో కౌన్సెలింగ్‌లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులను ఒప్పించి క్యాంపస్‌లోనే మరో కళాశాలకు బదిలీ చేయిస్తున్నారు. చాలా కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పదికి దాటలేదు.
ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోసం వల
కళాశాలలను బతికించుకునేందుకు యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల విద్యార్థులపై దృష్టి సారించారు. ఆ విద్యా ర్థుల కోసం బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నారు. త మ కళాశాలల్లో చదివితే ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఫస్టియర్ ఫీజును బ్రోకర్లకు ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది.
విద్యార్థులు లేక కళ తప్పాయి..
విద్యార్థులు లేక ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉండడంతో ఆ ఉద్యోగులకు వేరే దారి కనిపించడం లేదు. దీంతో కొత్త మార్గాల కోసం అన్వేషణ ప్రారంభించారు. అటెండర్లు, క్లరికల్ స్టాఫ్‌కు సైతం కొత్త ఉద్యోగాలు దొరకడంలేదు. ఇదే విషయమై ఎల్లంకి ఇంజనీరింగ్ విద్యా సంస్థల చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ కళాశాలలను నడపలేని స్థితి ఏర్పడిందన్నారు. అడ్మిషన్ల లేక సిబ్బంది తొలగింపు తప్పడం లేదన్నారు. టీఆర్‌ఆర్‌లో పని చేసి మానేసిన క్లర్క్ మహేందర్ మాట్లాడుతూ చిరు వ్యాపారం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. మరో లెక్చరర్ మాట్లాడుతూ టీచింగ్ ప్రొఫెషన్‌లోనే తక్కువ వేతనానికైనా పనిచేయక తప్పదన్నారు.
Advertisement
Advertisement