- ప్రతిఒక్కరిదీ బెదిరింపు ధోరణే
- కొందరు చిన్నవిషయూన్ని మంత్రికి చెబుతారు
- నెల రోజులు సెలవుపై వెళతా : ఈవో
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి దేవస్థానంలో రాజకీయాలు పెరిగిపోయాయని...ప్రతిఒక్కరు బెదిరింపు ధోరణితో వ్యవహరి స్తున్నారని ఇన్‌చార్జి ఈవో శ్రీనివాసరావు అన్నారు.శనివారం ఆయన తన చాంబర్‌లో విలేకర్ల సమావేశంలో మా ట్లాడుతూ దేవాదాయశాఖ తిరుపతి రీజనల్ జాయింట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న తనకు రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు పొట్టిశ్రీరాములు,నెల్లూరు జిల్లా,ప్రకాశం,గుంటూరు జిల్లాలోని ఆలయాలకు ఇన్‌చార్జిగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.
అదనంగా శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో బాధ్యతలు అప్పగించడంతో పాటు రాజకీయాల టెన్షన్‌తో తనకు బీపీ,షుగర్ వ్యాధులు వచ్చాయని, దీంతో నెలరోజులు సెలవుపై వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆల యంలో పనిచేసే కొందరు అధికారులు ప్రతి చిన్న విషయాన్ని మంత్రికి చెప్పడం సరికాదన్నారు. కొందరు ఉద్యోగులు ఈవో వేధిస్తున్నారని...దాంతో చచ్చిపోతున్నామని ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెం దా రు. తనకు అలాంటి ఆలోచనలు లేవని... తాను వేధిస్తే వారంతా ఉద్యోగాలు చేయలేరని తెలిపారు.
ప్రశాం తంగా ఉద్యోగాలు చేసుకోమని మాత్ర మే చెబుతున్నానని వివరించారు. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి మాట్లాడుతూ పట్టణానికి సంబంధించి పది సమస్యలను ఈవో దృష్టికి తీసుకొచ్చానని... ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని తెలిపారు. ఒకప్పుడు శ్రీకాళహస్తి శివ య్య పేదవాడని.. .ప్రస్తుతం కుభేరుడివలే సంపన్నుడయ్యూడని... మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఆదుకోవాలని కోరారు. దీంతో ఈవో జోక్యంచేసుకుని డబ్బుల వ్యవహారం లో నిర్ణయాలు తీసుకోవడానికి తనకు అధికారంలేదని...దేవాదాయశాఖ నుంచి అనుమతులు ఇప్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి సహాయం చేయడానికి అభ్యంతరం లేదన్నారు.