తాడిమర్రి(అనంతపురం): సాగు నీటి విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం నిరసనకు దిగారు. పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నీటితో ఏటా జిల్లాలోని 49 చెరువులను నింపుతుండగా... తాడిమర్రి చెరువుకు మాత్రం చుక్క నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది అయినా తాడిమర్రి చెరువును పీఏబీఆర్ నీటితో నింపాలని డిమాండ్ చేస్తూ తాడిమర్రి, శివంపల్లి, మద్దెలచెరువు, మోతుగులకుంట గ్రామాలకు చెందిన రైతులు సోమవారం తాడిమర్రి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చచెప్పారు.