పిడుగురాళ్ల : జీవితంతో కళలు ముడిపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. వివిధ రూపాల్లోని ఆ కళలను మనుషుల నిజ జీవితంలో వాడుకున్న సందర్భాలు అనేకం. అందులోనూ సామాజిక స్పృహ ఉన్న సినిమాలు, పాటలు చాలా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులను చేర్పించేందుకు వినూత్న తరహాలో పబ్లిసిటీ చేస్తున్నారు.
‘ఆ గట్టునుంటావా విద్యార్థి.. ఈ గట్టుకొస్తవా.. ఆ గట్టునేమో రూ.20 వేల ఖర్చు ఉంది.. ఈ గట్టునేమో నాణ్యమైన చదువుంది’ అంటూ రంగస్థలం పాటను పేరడీ చేసి ప్రచారం చేస్తున్నారు. మంగళవారం పిడుగురాళ్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఫ్లెక్సీలతో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు వివరించారు. పాఠశాల హెచ్‌ఎం శివశంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment