నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న కేసీఆర్ | KCR moves to speech at sakala jana bheri public meeting in Nizam college | Sakshi
Sakshi News home page

నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న కేసీఆర్

Published Sun, Sep 29 2013 4:58 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

KCR moves to speech at sakala jana bheri public meeting in Nizam college

హైదరాబాద్: సకల జనభేరీలో భాగంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నిజాం కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. ఆయన కాసేపట్లో తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడతారు. అంతకుముందు టీఎన్జీవోలు మాట్లాడుతూ.. తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోల చేస్తున్న ఉద్యమాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమంలో స్పష్టత లేదని మండిపడ్డారు.
 

సకల జన భేరి సభకు తెలంగాణ జిల్లాలోని వివిధ  గ్రామాల నుండి తెలంగాణ వాదులు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల జేఏసీ ఆధ్వర్యంలో బస్‌లు, సుమోలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ,విద్యుత్‌ రంగ కార్మికులు ,విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలను భారీగా తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement