ఖమ్మం ఎడ్లు భళా | Khammam bullock cart competitions at Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మం ఎడ్లు భళా

Published Tue, May 19 2015 6:29 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

ఖమ్మం ఎడ్లు భళా

ఖమ్మం ఎడ్లు భళా

మద్దిరాలపాడు: ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో జరిగిన మండవ సుబ్బారాయుడు, శేషమ్మ మెమోరియల్ అఖిల భారత స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ‘ఆర్‌ఎన్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్’ ఎడ్లు సత్తా చాటాయి. సోమవారం రాత్రి ముగిసిన సీనియర్స్ 2.5 టన్నుల విభాగంలో ఖమ్మ జిల్లా ఎడ్లు 3,622 అడుగుల దూరం బరువును లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి.

గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన నలమోతు వీరయ్య చౌదరి, వైఎస్సార్ జిల్లా అక్బర్ పెన్నానగర్‌కు చెందిన ఎడ్ల జత 3,015 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఇక, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీకావ్య, శ్రీమధుకు చెందిన ఎడ్ల జత 3,000 అడుగుల దూరం లాగి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement