తిరుమల తిరుపతి దేవస్థానం
సాక్షి, తిరుమల: రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమలేశుని ఆలయంతోపాటు తిరుమలలోనూ దాతల సహకారంతో సరికొత్త సాంకేతిక విద్యుత్ వ్యవస్థతోపాటు త్రీడీ విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, కల్యాణకట్ట, అన్నప్రసాద కేంద్రంతోపాటు అన్ని కాటేజీలు, అతిథిగృహాలు, వీధి లైట్లకు రోజూ సుమారు 1.25 నుండి 1.50 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది.
అంటే ఏడాదికి 4.5 కోట్ల యూనిట్ల విద్యుత్ అన్నమాట. ఇందుకు టీటీడీ సుమారుగా రూ.14 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని అదుపు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. దానికోసం రూ.5 కోట్ల ఖర్చుతో ఆలయంతోపాటు తిరుమలలోని దాదాపుగా అన్ని కాటేజీల్లో ఎల్‌ఈడీ బల్పులు అమర్చారు. వీధుల్లోనూ సోడియం వేపర్ బల్బుల స్థానంలో 120వాట్స్ ఎల్‌ఈడీ బల్పులు అమర్చుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment