నేటి నుంచి లోకేశ్ రాయలసీమ పర్యటన
సాక్షి,హైదరాబాద్: టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ మంగళవారం నుంచి రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఆ పార్టీ మీడియా కమిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల పాటు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించి వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొంది.