విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలంగా మారిన నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితలం అవర్తనం ఏర్పడిందని.... దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.