వాయుగుండంగా మారిన అల్పపీడనం | low pressure turns cyclone,says visakhapatnam cyclone warning center | Sakshi
Sakshi News home page

వాయుగుండంగా మారిన అల్పపీడనం

Published Wed, Nov 13 2013 2:25 PM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

low pressure turns cyclone,says visakhapatnam cyclone warning center

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం బుధవారం వెల్లడించింది. అది నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైందని తెలిపింది. ఆ వాయుగుండం రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

 

ఈ నెల 15,16 తేదీల్లో నాగపట్నం, చెన్నైల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో దక్షిణకోస్తాలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement