తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి! | miss gun fire kills constable in vizag? | Sakshi
Sakshi News home page

తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి!

Published Thu, Jul 9 2015 9:19 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి! - Sakshi

తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి!

విశాఖపట్నం: విశాఖపట్నం జీకేవీధి పోలీస్‌స్టేషన్ పరిధిలో  సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అజయ్‌కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి మరణించాడా ? లేక ఆత్మహత్య చేసుకుని మరణించాడా అనేది తెలియాల్సి ఉంది. 42వ బెటాలియన్‌కు చెందిన అజయ్‌కుమార్ ఉత్తర్‌ప్రదేశ్ నివాసి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement