ప్రక్రియ పూర్తయింది....తెలంగాణను ఎవరూ ఆపలేరు | No one can stop Telangana, says damodara rajanarsimha | Sakshi
Sakshi News home page

ప్రక్రియ పూర్తయింది....తెలంగాణను ఎవరూ ఆపలేరు

Published Sat, Feb 1 2014 10:49 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

ప్రక్రియ పూర్తయింది....తెలంగాణను ఎవరూ ఆపలేరు - Sakshi

ప్రక్రియ పూర్తయింది....తెలంగాణను ఎవరూ ఆపలేరు

విజయవాడ : రాష్ట్రం ఇంకా కలిసి ఉంటుందని సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత సత్యప్రసాద్ను ఆయన శనివారం పరామర్శించారు. అనంతరం దామోదర మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు.

అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు సరికావని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఒకే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటే సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయవచ్చని అన్నారు. కరీంనగర్ సభలో తెలంగాణను ఒప్పుకున్న సీఎం ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని దామోదర ప్రశ్నించారు. తెలంగాణ ప్రక్రియ పూర్తయిందని... ఇక ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement