భయానకంగా గావు, కంపకల్లి కార్యక్రమాలు | palle jatharas in prakasam district | Sakshi
Sakshi News home page

భయానకంగా గావు, కంపకల్లి కార్యక్రమాలు

Published Mon, May 11 2015 7:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

palle jatharas in prakasam district

ప్రకాశం: ఐదు రోజులపాటు చెన్నకేశవ స్వామి ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. వీటిని పునస్కరించుకుని ప్రకాశం జిల్లాలో గావు, కంపకల్లి కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా.. చిన్నారులను ముళ్ల కంపలపై దొర్లిస్తారు. అలా చేస్తే పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని అక్కడి వారి నమ్మకం. పొట్టేళ్లను కొరికి చంపి వాటి రక్తం తాగుతారు. తర్వాత రక్తపు ముద్దలను గాల్లోకి ఎగరేస్తారు. వాటిని అందుకోవడానికి మహిళలు పోటీ పడుతారు. ఆ ముద్దలు అందిన వారికి సంతానప్రాప్తి లభిస్తుందని గాఢంగా నమ్ముతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement