సాక్షి, అమరావతి: తమకూ ఓ కుటుంబం ఉంది.. తమకోసం ఎదురుచూసే భార్యాపిల్లలు, అమ్మానాన్నా. అయినా సరే, మన కుటుంబం బాగుండాలనే ఆరాటం.. మన పిల్లలు చల్లంగుండాలన్న తపన. మొక్కవోని స్థైర్యంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ సేవలందిస్తున్న వైద్యసిబ్బంది, పోలీసులను జనం జేజేలు పలుకుతున్నారు.. కష్టకాలంలో అండగా నిలుస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు..
- కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
- సీఎం వైఎస్ జగన్ దగ్గర్నుంచి అట్టడుగు స్థాయి సిబ్బంది వరకు స్పందిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- ఇలా ప్రజల మన్ననలు అందుకుంటున్నవారిలో ముందు వరుసలో వైద్య సిబ్బంది, ఆ తర్వాతి స్థానంలో పోలీసులున్నారు.
- కరోనా వైరస్‌తో తమకూ ప్రమాదం ఉందని తెలిసినా ఇల్లు, కుటుంబాన్ని వదిలి ప్రజలకు సేవలందిస్తున్న వైద్యులకు, ట్రాఫిక్ విధులతో పాటు.. శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్న పోలీసులకు సెల్యూట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
- తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తూనే ‘కరోనాను పరిశుభ్రతతో తరిమేద్దాం.. కరోనా వ్యాప్తిని నిరోదిద్దాం’ అంటూ నినదిస్తూ.. వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్న వీడియోలను ప్రజలు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌చేస్తూ వారి అంకితభావాన్ని కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment