జ్యోత్స్న ఫణిజ కవితలకు ప్రధాని ప్రశంస | PM Modi appreciation to Jyotsna phanija | Sakshi
Sakshi News home page

జ్యోత్స్న ఫణిజ కవితలకు ప్రధాని ప్రశంస

Published Fri, Mar 31 2017 2:07 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

జ్యోత్స్న ఫణిజ కవితలకు ప్రధాని ప్రశంస - Sakshi

జ్యోత్స్న ఫణిజ కవితలకు ప్రధాని ప్రశంస

కైకలూరు : కంటి చూపు లేదని ఆమె ఆధైర్యపడలేదు. విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు ఆమె రాసిన కవితకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు దక్కాయి. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన డాక్టర్‌ జ్యోత్స్న ఫణిజ ఈ ఏడాది జనవరిలో ‘సిరామిక్‌ ఈవినింగ్‌’ శీర్షినక ఆంగ్ల కవితా సంపుటిని హైదరాబాదులో విడుదల చేశారు.

ఆ పుస్తకాన్ని చదివిన ప్రధాని మోదీ మంగళవారం ఫణిజను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. అభినందన పత్రాన్ని ఆమె ఇంటికి గురువారం పంపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో జ్యోత్స్న ఫణిజ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రశంస పత్రం ఎంతో స్ఫూర్తి నింపిందన్నారు. ఈ ఉత్సహంతో మరిన్ని కవితా సంపుటాలను సమాజానికి అందిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement