సాక్షి, అనంతపురం : నలుగురిని హత్యచేయడానికి కుట్రపన్నిన దుండగులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. తాడిపత్రి, బత్తలపల్లి, కల్యాణదుర్గం ప్రాంతాలలో ఓ నలుగురిని హత్య చేసేందుకు వీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముందుగానే పసిగట్టిన పోలీసులు హత్యలకు ప్రయత్నించిన 9మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి దగ్గర 6 వేట కొడవళ్లు, పేలుడు పదార్థాలైన 15 డిటోనేటర్లు, 15 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 400 గ్రాముల బాంబు తయారీ పౌడర్ సైతం వీరి దగ్గర ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి మరింత వివరాల కోసం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురి హత్యకు కుట్ర.. అరెస్టు
Published Fri, Aug 16 2019 6:45 PM | Last Updated on Fri, Aug 16 2019 6:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment