మంచిర్యాలలో తాడిపత్రి బాలుడు
అనంతపురం సెంట్రల్ : తాడిపత్రి పట్టణాని చెందిన నాలుగేళ్ల బాలుడు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో రైల్వే పోలీసుల సమక్షంలో ఉన్నాడు. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. తన పేరు చైతన్య అని, అమ్మ పేరు లత అని, తమది తాడిపత్రి అని చెబుతున్నాడని అక్కడి పోలీసులు తెలిపారు.