చిత్తూరు : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని బలి కోరుతుందో చెప్పలేం. వైద్యం చేసే డాక్టర్‌ను అంబులెన్స్ ఢీ కొట్టడంతో మృత్యువాతపడ్డ ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలోని సంతపేటలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా క్లినిక్ నడుపుతున్న శశిధర్(35) మంగళవారం సాయంత్రం పనులు చూసుకుని తన స్వగ్రామం పైమాఘానికి బయలుదేరాడు.
ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇతన్ని ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన శశిధర్‌ను 108 లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
అంబులెన్స్ ఢీకొని వైద్యుడి మృతి
Published Tue, Sep 15 2015 8:29 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement