మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం | sahasra Ghatabhishekam to mallana swamy | Sakshi
Sakshi News home page

మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం

Published Thu, Aug 13 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం

మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం

శ్రీశైలం: సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీశైలేశునికి బుధవారం సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు పాతాళగంగ నుంచి బిందెలతో పవిత్ర కృష్ణానదీ జలాలను  వేదమంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల మధ్య తీసుకొచ్చారు. ఏకాదశ రుద్ర కలశస్థాపన అనంతరం వెయ్యికి పైగా కలశాలలోని నీటిని అభిమంత్రించి స్వామివార్ల మూలవిరాట్‌కు సహస్రఘటాభిషేకం చేశారు.

ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ పూజావేళల్లో మార్పు చేశారు. స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం మినహా తక్కిన ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు. కార్యక్రమంలో ఈఓ సాగర్‌బాబు, ప్రముఖ ప్రవచకులు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు, శ్రీశైలం ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
 
బుధవారం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో శివలింగాకారంలో  ఏర్పాటు చేసిన సహస్ర కలశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement